హైదరాబాద్: ఫ్లైఓవర్ కూలిన దుర్ఘటనపై కోల్‌కతా మర్కెట్ రోడ్ పోలీసులు ఐవీఆర్‌సీఎల్ సంస్థకు నోటీసులిచ్చారు. ఐవీఆర్‌సీఎల్ సంస్థలో శుక్రవారం పోలీసుల తనిఖీలు చేశారు. ఛైర్మన్ సుధీర్ రెడ్డి సహా ఐదుగురికి సెక్షన్ 41(ఏ) కింద నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
ఈ సంఘటనపై విచారించేందుకు గురువారం రాత్రి కోల్‌కతానుంచి విచారణ బృందాలు హైదరాబాద్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. వారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులను దర్యాప్తులో సాయం చేయాలని కోరారు. దీంతో వారికి రెండు సీసీఎల్ బృందాలను అప్పగించారు. ఐవీఆర్సీఎల్ కోల్‌కతా ఫ్లైఓవర్ ప్రాజెక్టు నిర్మాణ టెండర్‌ను 2009లో దక్కించుకుంది.
ఫ్లైఓవర్ ఘటనలో ఐవీఆర్‌సీఎల్‌కు నోటీసులు
Published Fri, Apr 1 2016 8:40 PM | Last Updated on Tue, Oct 2 2018 8:13 PM
Advertisement
Advertisement