కోల్కతా: పశ్చిమ బెంగాల్ కోల్కతాలో ఫ్లైఓవర్ కూలిన కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఫ్లైఓవర్ నిర్మాణ సంస్థ ఐవీఆర్సీఎల్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ రంజిత్ భట్టాచార్జినీ కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్‌కతాలో గురువారం కుప్పకూలిన ఫ్లైఓవర్ నిర్మాణసంస్థ హైదరాబాద్‌కు చెందిన ఐవీఆర్‌సీఎల్ అన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 27మంది మృతి చెందగా, గాయపడ్డ అనేకమంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకూ ఎనిమిదిమంది ఐవీఆర్సీఎల్ అధికారులను అరెస్ట్ చేసి, విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకున్నారు. కాగా ఐవీఆర్సీఎల్ కోల్‌కతా ఫ్లైఓవర్ ప్రాజెక్టు నిర్మాణ టెండర్‌ను 2009లో దక్కించుకుంది. అయితే గడువు పూర్తయినా ఫ్లైఓవర్ పనులు మాత్రం పూర్తి కాలేదు. అయితే ఫ్లైఓవర్ పనుల విషయంలో ఎలాంటి లోపం లేదని ఆ సంస్థ చెబుతోంది.