ఫ్లైఓవర్ కూలిన ఘటనలో 24 కి పెరిగిన మృతులు
కోల్కతా: కోల్కతా మహానగరంలో ఫ్లైఓవర్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య శుక్రవారం 24కు చేరింది. రెండో రోజు కూడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే దాదాపు 300 మంది సైన్యంతోపాటు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలతోపాటు రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు, పోలీసు, ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని.. వెంటనే సహాయచర్యలు ప్రారంభించారు. అయితే సదరు ఫ్లైఓవర్ నిర్మిస్తున్న హైదరాబాద్కు చెందిన ఐవీఆర్సీఎల్ కంపెనీ కార్యాలయాన్ని కోల్కతాలో ఉన్నతాధికారులు సీజ్ చేశారు.
నగరంలోని ఠాగూర్ కూడలి వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ గురువారం కూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 21 మంది మరణించగా... 88 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను నగరంలోని వివిధ ఆసుపత్రులకు తరలించి... చికిత్స అందిస్తున్నారు. వారిలో మరో ముగ్గురు శుక్రవారం మరణించారు. ఈ ఘటనలో గాయపడిన మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యలు వెల్లడించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మరణించిన వారికి, గాయపడిన వారికి ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే.