న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్ క్వార్టర్‌లో రూ.30,142 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ప్రస్తుతం దివాలా ప్రక్రియ నడుస్తున్న ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.1,141 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఏజీఆర్(సవరించిన స్థూల రాబడి) విషయమై సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు కారణంగా రూ.28,314 కోట్ల కేటాయింపులు జరపడంతో ఈ కంపెనీకి ఈ క్యూ2లో ఈ స్థాయి నష్టాలు వచ్చాయి. కాగా గత క్యూ2లో రూ.977 కోట్లుగా ఉన్న కార్యకలాపాల ఆదాయం ఈ క్యూ2లో రూ.302 కోట్లకు తగ్గింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఆర్‌కామ్ షేర 3.2 శాతం నష్టపోయి రూ.0.59 వద్ద ముగిసింది.
ఐవీఆర్‌సీఎల్...
నిర్మాణ రంగ కంపెనీ ఐవీఆర్‌సీఎల్ సెప్టెంబరు త్రైమాసికం స్టాండలోన్ ఫలితాల్లో రూ.394 కోట్ల నష్టం ప్రకటించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీకి రూ.443 కోట్ల నష్టం వాటిల్లింది. టర్నోవరు రూ.245 కోట్ల నుంచి రూ.115 కోట్లకు వచ్చి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment