Reliance Communications company
-
ఆర్‌కామ్ నష్టాలు రూ.30,142 కోట్లు
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్ క్వార్టర్లో రూ.30,142 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ప్రస్తుతం దివాలా ప్రక్రియ నడుస్తున్న ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.1,141 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఏజీఆర్(సవరించిన స్థూల రాబడి) విషయమై సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు కారణంగా రూ.28,314 కోట్ల కేటాయింపులు జరపడంతో ఈ కంపెనీకి ఈ క్యూ2లో ఈ స్థాయి నష్టాలు వచ్చాయి. కాగా గత క్యూ2లో రూ.977 కోట్లుగా ఉన్న కార్యకలాపాల ఆదాయం ఈ క్యూ2లో రూ.302 కోట్లకు తగ్గింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఆర్‌కామ్ షేర 3.2 శాతం నష్టపోయి రూ.0.59 వద్ద ముగిసింది. ఐవీఆర్సీఎల్... నిర్మాణ రంగ కంపెనీ ఐవీఆర్సీఎల్ సెప్టెంబరు త్రైమాసికం స్టాండలోన్ ఫలితాల్లో రూ.394 కోట్ల నష్టం ప్రకటించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీకి రూ.443 కోట్ల నష్టం వాటిల్లింది. టర్నోవరు రూ.245 కోట్ల నుంచి రూ.115 కోట్లకు వచ్చి చేరింది. -
షేర్ల తాకట్టులో టాప్ అనిల్ అంబానీ
ముంబై: అనిల్ అంబానీ తన గ్రూపులోని రెండు కంపెనీల్లో తనకున్న వాటాల్లో 95 శాతానికి పైగా వాటాల్ని తాకట్టు పెట్టేశారు. సుభాష్‌చంద్ర ఆధ్వర్యంలోని ఎస్సెల్ గ్రూపు ప్రమోటర్లు సైతం జీ ఎంటర్టైన్మెంట్, డిష్‌టీవీ కంపెనీల్లో 66.2 శాతం నుంచి 94.6 శాతం మధ్య వాటాలను లెండింగ్ సంస్థల వద్ద కుదువ పెట్టారు. మార్చి త్రైమాసికం నాటికి లిస్టెడ్ కంపెనీలకు సంబంధించిన ప్రమోటర్ల వాటాల తనఖా వివరాలను కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ ఓ నివేదిక రూపంలో విడుదల చేసింది. బీఎస్ఈలోని టాప్ 500 కంపెనీల డేటాను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించింది. దీని ప్రకారం... ►డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే మార్చి క్వార్టర్లో తనఖా వాటాల విలువ తగ్గింది. డిసెంబర్ నాటికి ప్రమోటర్ల తనఖా మొత్తంమీద 2.98శాతంగా ఉండగా, మార్చి త్రైమాసికం నాటికి 2.83 శాతానికి తగ్గింది. ►కుదువ పెట్టిన వాటాల విలువ రూ.1.95 లక్షల కోట్లు. బీఎస్ఈ 500 సూచీ మార్కెట్ క్యాప్‌లో ఇది 1.38 శాతానికి సమానం. ►రిలయన్స్ ఇన్ఫ్రాలో 98.3 శాతం, రిలయన్స్ క్యాపిటల్‌లో 96.9 శాతం మేర ప్రమోటర్ల వాటాలు తాకట్టు కిందకు వెళ్లాయి. డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే మార్చి త్రైమాసికంలో ఈ రెండు కంపెనీల్లో తాకట్టు వాటాలు పతాక స్థాయికి చేరాయి. ►అనిల్ అంబానీకే చెందిన మరో కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్‌లో తాకట్టు వాటాల పరిమాణం తగ్గింది. ►95 శాతానికి పైగా ప్రమోటర్ల వాటాలు తనఖాలో ఉన్న కంపెనీల్లో సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్, స్టెరిలైట్ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి. ► మార్చి త్రైమాసికంలో ప్రమోటర్ల తనఖా వాటాలు అనూహ్యంగా పెరిగిన కంపెనీల్లో జేకే టైర్, డిష్‌టీవీ, వాటెక్ వాబాగ్ సైతం ఉన్నాయి. ► బీఎస్ఈ 500లో 116 కంపెనీల ప్రమోటర్లు తమ వాటాలను తాకట్టు పెట్టారు. -
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్‌కామ్ 3జీ సేవలు
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ మరో 5 టెలికం సర్కిళ్లలో 3జీ సర్వీసులను ప్రారంభిస్తోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, తూర్పు ఉత్తర ప్రదేశ్- ఈ ఐదు సర్కిళ్లలో 3జీ సర్వీసులను ఈ నెల 20 నుంచి అందుబాటులోకి తేనున్నామని ఆర్‌కామ్ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో తాము 3జీ సర్వీసులందజేస్తున్న మొత్తం టెలికం సర్కిళ్ల సంఖ్య 18కు పెరిగిందని ఆర్‌కామ్ సీఈఓ (కన్సూమర్ బిజినెస్) గుర్దీప్ సింగ్ పేర్కొన్నారు. ఈ విస్తరణ కారణంగా 3జీ మార్కెట్లో డేటా విషయమై తమ అగ్రస్థానం మరింత పటిష్టమవుతుందని వివరించారు. 2 లక్షల కి.మీ. ఫైబర్ నెట్‌వర్క్‌తో అత్యున్నతమైన. అత్యంత వేగవంతమైన 3జీ సేవలను చౌక ధరలకే కార్పొరేట్, చిన్న, మధ్యతరహా వాణిజ్య సంస్థలకు, వినియోగదారులకు అందిస్తున్నామని గుర్దీప్ సింగ్ వివరించారు. కాగా ఎయిర్‌సెల్‌తో 3జీ ఇంట్రా-సర్కిల్ రోమింగ్ ఒప్పందాన్ని ఆర్‌కామ్ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఆర్‌కామ్ మొబైల్ వినియోగదారుల సంఖ్య 3.74 కోట్లకు చేరింది. వీరిలో 3జీ వినియోగదారుల సంఖ్య 1.29 కోట్లు.