ముంబై: అనిల్ అంబానీ తన గ్రూపులోని రెండు కంపెనీల్లో తనకున్న వాటాల్లో 95 శాతానికి పైగా వాటాల్ని తాకట్టు పెట్టేశారు. సుభాష్‌చంద్ర ఆధ్వర్యంలోని ఎస్సెల్ గ్రూపు ప్రమోటర్లు సైతం జీ ఎంటర్‌టైన్‌మెంట్, డిష్‌టీవీ కంపెనీల్లో 66.2 శాతం నుంచి 94.6 శాతం మధ్య వాటాలను లెండింగ్ సంస్థల వద్ద కుదువ పెట్టారు. మార్చి త్రైమాసికం నాటికి లిస్టెడ్ కంపెనీలకు సంబంధించిన ప్రమోటర్ల వాటాల తనఖా వివరాలను కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ ఓ నివేదిక రూపంలో విడుదల చేసింది. బీఎస్‌ఈలోని టాప్ 500 కంపెనీల డేటాను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించింది. దీని ప్రకారం...
►డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే మార్చి క్వార్టర్‌లో తనఖా వాటాల విలువ తగ్గింది. డిసెంబర్ నాటికి ప్రమోటర్ల తనఖా మొత్తంమీద 2.98శాతంగా ఉండగా, మార్చి త్రైమాసికం నాటికి 2.83 శాతానికి తగ్గింది.
►కుదువ పెట్టిన వాటాల విలువ రూ.1.95 లక్షల కోట్లు. బీఎస్‌ఈ 500 సూచీ మార్కెట్ క్యాప్‌లో ఇది 1.38 శాతానికి సమానం.
►రిలయన్స్ ఇన్‌ఫ్రాలో 98.3 శాతం, రిలయన్స్ క్యాపిటల్‌లో 96.9 శాతం మేర ప్రమోటర్ల వాటాలు తాకట్టు కిందకు వెళ్లాయి. డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే మార్చి త్రైమాసికంలో ఈ రెండు కంపెనీల్లో తాకట్టు వాటాలు పతాక స్థాయికి చేరాయి.
►అనిల్ అంబానీకే చెందిన మరో కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్‌లో తాకట్టు వాటాల పరిమాణం తగ్గింది.
►95 శాతానికి పైగా ప్రమోటర్ల వాటాలు తనఖాలో ఉన్న కంపెనీల్లో సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్, స్టెరిలైట్ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి.
► మార్చి త్రైమాసికంలో ప్రమోటర్ల తనఖా వాటాలు అనూహ్యంగా పెరిగిన కంపెనీల్లో జేకే టైర్, డిష్‌టీవీ, వాటెక్ వాబాగ్ సైతం ఉన్నాయి.
► బీఎస్‌ఈ 500లో 116 కంపెనీల ప్రమోటర్లు తమ వాటాలను తాకట్టు పెట్టారు.
షేర్ల తాకట్టులో టాప్ అనిల్ అంబానీ
Published Wed, May 8 2019 1:34 AM | Last Updated on Wed, May 8 2019 1:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment