ఆంధ్రప్రదేశ్‌లో ఆర్‌కామ్ 3జీ సేవలు | RCOM launches 3G services in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్‌కామ్ 3జీ సేవలు

Published Thu, Jun 12 2014 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 8:38 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్‌కామ్ 3జీ సేవలు

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్‌కామ్ 3జీ సేవలు

న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ మరో 5 టెలికం సర్కిళ్లలో 3జీ సర్వీసులను ప్రారంభిస్తోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, తూర్పు ఉత్తర ప్రదేశ్- ఈ ఐదు సర్కిళ్లలో 3జీ సర్వీసులను ఈ నెల 20 నుంచి అందుబాటులోకి తేనున్నామని ఆర్‌కామ్ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో తాము 3జీ సర్వీసులందజేస్తున్న మొత్తం టెలికం సర్కిళ్ల సంఖ్య 18కు పెరిగిందని ఆర్‌కామ్ సీఈఓ (కన్సూమర్ బిజినెస్) గుర్దీప్ సింగ్ పేర్కొన్నారు.

 

ఈ విస్తరణ కారణంగా 3జీ మార్కెట్లో డేటా విషయమై తమ అగ్రస్థానం మరింత పటిష్టమవుతుందని వివరించారు. 2 లక్షల కి.మీ. ఫైబర్ నెట్‌వర్క్‌తో అత్యున్నతమైన. అత్యంత వేగవంతమైన 3జీ సేవలను చౌక ధరలకే కార్పొరేట్, చిన్న, మధ్యతరహా వాణిజ్య సంస్థలకు, వినియోగదారులకు అందిస్తున్నామని గుర్దీప్ సింగ్ వివరించారు. కాగా ఎయిర్‌సెల్‌తో 3జీ ఇంట్రా-సర్కిల్ రోమింగ్ ఒప్పందాన్ని ఆర్‌కామ్ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఆర్‌కామ్ మొబైల్ వినియోగదారుల సంఖ్య 3.74 కోట్లకు చేరింది. వీరిలో 3జీ వినియోగదారుల సంఖ్య 1.29 కోట్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement