
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో బడ్జెట్ ఎయిర్‌లైన్ స్పైస్‌జెట్ రూ. 26 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ3లో కంపెనీ రూ. 300 కోట్ల నష్టం నమోదు చేసింది. సమీక్షాకాలంలో ఆదాయం 35 శాతం పెరిగి రూ. 1,077 కోట్ల నుంచి రూ. 1,651 కోట్లకు పెరిగింది.
అయితే క్యూ2లో నమోదైన రూ. 2,149 కోట్లతో పోలిస్తే మా త్రం ఆదాయం తగ్గింది. ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్) 87%గా నమోదైనట్లు కంపెనీ తెలిపింది. వాస్తవానికి క్యూ3 ఆర్థిక ఫలితాలను మంగళవారమే ప్రకటించాల్సి ఉన్నా , బోర్డు సమావేశం అర్ధరాత్రి వరకు సాగడంతో బుధవారం తెల్లవారుఝామున ఒంటి గంటకు ఫైలింగ్ చేసినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు స్పైస్‌జెట్ తెలిపింది.