SpiceJet
-
విమానంలో అదిరే హోలీ స్టెప్పులు: ఇక జన్మలో స్పైస్‌జెట్ ఎక్కను!
హోలీ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. సామాన్యమానవుల దగ్గర్నించీ, సెలబ్రిటీల దాకా రంగుల పండుగ ఉత్సవాల్లోఉత్సాహంగా గడిపారు. ఈ వేడుకలకు సంబంధించి అనేక వీడియోలు సోషల్‌మీడియాలో ఆకట్టుకంటున్నాయి. అయితే వీటన్నింటికంటే భిన్నంగా ఒకవీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. హోలీ పండుగ సందర్భంగా స్పైస్ జెట్ (SpiceJet) సిబ్బంది తమ డ్యాన్స్‌తో ప్రయాణికులను అలరించారు. అయితే విధి నిర్వహణ మర్చి గెంతులేశారు అంటూ నెటిజన్లులు మండిపడ్డారు.హోలీ (Holi202) స్పైస్‌జెట్ క్యాబిన్ సిబ్బంది వార్తల్లో నిలిచాయి. విమానంలో స్టెప్పులేసి ప్రయాణీకులతో కలిసి హోలీని ఉత్సాహంగా జరుపుకున్నారు. బాలీవుడ్ మూవీ యే జవానీ హై దీవానీ చిత్రంలోని పాటకు నృత్యం చేశారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో టేకాఫ్‌కు సిద్ధంగా విమానంలో స్పైస్‌జెట్ క్యాబిన్ క్రూ అంతా సంప్రదాయ దుస్తులు ధరించి, హోలీ ‘బలం పిచ్కారి’ పాటకు నృత్యంచేశారు ఎయిర్ హోస్టెస్‌లు, ఫ్లైట్ స్టీవార్డ్‌లు ఉత్సాహంగా మ్యూజిక్కు తగ్గట్లు స్టెప్పులతో అదరగొట్టేశారు. వీరి సంతోషానికి ప్రయాణికులు చప్పట్లు కొట్టారు. పనిలో పనిగా వీడియోలను రికార్డు చేశారు. ఇదే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ వీడియోను గోవింద్ రాయ్ (@govindroyicai) అనే వినియోగదారు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. వీడియో 3 లక్షలకు పైగా వీక్షణలను సంపాదించినప్పటికీ, ఇది ఆన్లైన్లో చర్చకు దారితీసింది. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు దీన్ని తప్పుబట్టారు. సిబ్బంది మూలంగా విమానం 5 గంటలు ఆలస్యం అయింది అంటూ విమర్శించారు. విధి నిర్వహణ మానేసి ఇదేం పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.A signature festival, a signature song, and a celebration like no other! 💃 Our crew brought Holi to life with an energetic dance, proving that traditions take flight with us!#flyspicejet #spicejet #happyholi #addspicetoyourtravelVideo was filmed on ground with all safety… pic.twitter.com/63XKMJDZCI— SpiceJet (@flyspicejet) March 14, 2025 మరో వినియోగదారుడైతే ఏకంగా స్పైస్ జెట్ విమానం ఎక్కను అంటూ అన్నాడు. “చాలా ఏళ్ల తరువాత నేను స్పైస్‌జెట్‌లో ప్రయాణిస్తున్నా..ఇక ఇదే చివరిసారి. ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికీ ఈ ఎయిర్‌లైన్‌తో ప్రయాణించను”అంటూ కమెంట్ చేశాడు.కొంతమంది క్యాబిన్ క్రూ నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. “ ఒక క్యాబిన్ క్రూగా, నేను దీన్ని అభినందించను. ఇది అస్సలు ప్రొఫెషనల్ కాదు” అని వ్యాఖ్యానించారు. -
స్పైస్‌జెట్‌కు కొత్త చిక్కులు
చవక విమానయాన సేవలు అందిస్తున్న స్పైస్‌జెట్‌కు కొత్త సమస్యలు ఎదురయ్యాయి. విమానాల లీజు రంగంలో ఉన్న ఐర్లాండ్‌కు చెందిన మూడు సంస్థలు, ఒక మాజీ పైలట్ స్పైస్‌జెట్‌పై ఎన్సీఎల్టీలో దివాలా పిటిషన్లు దాఖలు చేయడం ఇందుకు కారణం. స్పైస్‌జెట్ సుమారు రూ.110 కోట్లు బకాయి పడిందని, ఐబీసీ సెక్షన్ 9 కింద దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ ఎన్‌జీఎఫ్ ఆల్ఫా, ఎన్‌జీఎఫ్ జెనెసిస్, ఎన్‌జీఎఫ్ చార్లీ పిటిషన్లు దాఖలు చేశాయి.ఈ వారం ప్రారంభంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ విచారణ సందర్భంగా పరిష్కార చర్చలు జరుగుతున్నందున ఈ విషయాన్ని పరిష్కరించడానికి స్పైస్‌జెట్ కొంత సమయం కోరింది. తదుపరి విచారణ కోసం 2025 ఏప్రిల్ 7న మూడు పిటిషన్లను లిస్ట్ చేయాలని ఎన్సీఎల్టీ ఆదేశించింది. లీజుదారులు గతంలో స్పైస్‌జెట్‌కు ఐదు బోయింగ్ 737 విమానాలను లీజుకు ఇచ్చాయి.ఇంజిన్లతో సహా విమానంలోని భాగాలను దొంగిలించి ఇతర విమానాలలో ఉపయోగించారని ఆరోపిస్తూ ఈ కంపెనీలు స్పైస్‌జెట్‌కు లీగల్ నోటీసును పంపించాయి. 19 సంవత్సరాలుగా విమానయాన రంగంలో ఉన్న స్పైస్‌జెట్.. ఎన్సీఎల్టీ, అప్పీలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీ వద్ద విల్లిస్ లీజ్, ఎయిర్కాజిల్ ఐర్లాండ్, విల్మింగ్టన్, సెలెస్టియల్ ఏవియేషన్ వంటి రుణదాతల నుండి దివాలా పిటిషన్లను ఎదుర్కొంటోంది. -
స్పైస్‌జెట్ లాభం 26 కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో బడ్జెట్ ఎయిర్‌లైన్ స్పైస్‌జెట్ రూ. 26 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ3లో కంపెనీ రూ. 300 కోట్ల నష్టం నమోదు చేసింది. సమీక్షాకాలంలో ఆదాయం 35 శాతం పెరిగి రూ. 1,077 కోట్ల నుంచి రూ. 1,651 కోట్లకు పెరిగింది. అయితే క్యూ2లో నమోదైన రూ. 2,149 కోట్లతో పోలిస్తే మా త్రం ఆదాయం తగ్గింది. ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) 87%గా నమోదైనట్లు కంపెనీ తెలిపింది. వాస్తవానికి క్యూ3 ఆర్థిక ఫలితాలను మంగళవారమే ప్రకటించాల్సి ఉన్నా , బోర్డు సమావేశం అర్ధరాత్రి వరకు సాగడంతో బుధవారం తెల్లవారుఝామున ఒంటి గంటకు ఫైలింగ్ చేసినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు స్పైస్‌జెట్ తెలిపింది. -
ఉద్యోగులకు రూ.160 కోట్లు చెల్లించిన స్పైస్‌జెట్
ప్రముఖ విమానయాన సంస్థ 'స్పైస్‌జెట్' రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ. 160.07 కోట్ల విలువైన ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (PF) బకాయిలన్నింటినీ క్లియర్ చేసినట్లు స్పష్టం చేసింది. అనేక సంఘాలను ఎదుర్కొన్న తరువాత కంపెనీ రూ.3000 కోట్ల నిధులను సమీకరించింది. ఈ నిధులను ఉపయోగించి అన్ని రకాల పెండింగ్ బిల్లులకు సంస్థ క్లియర్ చేస్తోంది.చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు అన్నీ కూడా కంపెనీ చెల్లించడంతో.. సంస్థ ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడటమే కాకుండా, కార్యకలాపాల నిర్వహణకు ఉన్న అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయి.పెండింగ్ బిల్లులు క్లియర్ చేసిన సందర్భంగా స్పైస్‌జెట్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ మాట్లాడుతూ.. ఉద్యోగుల పిఎఫ్ బకాయిల క్లియరెన్స్‌ను ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాము. స్పైస్‌జెట్ ప్రయాణంలో ఇది కొత్త అధ్యాయాన్ని సూచిస్తుందని అన్నారు.SpiceJet has settled pending employee provident fund dues of ₹160.07 crore accumulated over the past two years, along with other statutory liabilities such as TDS, GST, and employee salaries. This was made possible through internal cash flows and the ₹3,000 crore raised via a… pic.twitter.com/QFgbBXGmxZ— SpiceJet (@flyspicejet) December 13, 2024 -
ఏడాదిలో 1,895 మందికి లేఆఫ్స్!
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ 2024 ఆర్థిక సంవత్సరంలో భారీగా ఉద్యోగులను తగ్గించుకుంది. ఏడాదిలో శాశ్వత ఉద్యోగుల్లో 716 మంది పురుషులు, 618 మంది మహిళలను ఉద్యోగం నుంచి తొలగించింది. నాన్ పర్మినెంట్ సిబ్బంది విభాగంలో 531 మంది పురుషులు, 30 మంది మహిళలకు లేఆఫ్స్ ప్రకటించింది. నిర్వహణ అవసరాలకు అనుగుణంగా ఖర్చులను సర్దుబాటు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.వేతన మార్పులుపర్మినెంట్ ఉద్యోగుల్లో 74% మంది పురుషులు కనీస వేతనం కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లు కంపెనీ గుర్తించింది. ఇది గతంలో 61%గా ఉండేది. ఈ కేటగిరీలోని మహిళలు 37% నుంచి 56%కి పెరిగారు. నాన్ పర్మినెంట్ ఉద్యోగుల్లో కనీస వేతనం కంటే ఎక్కువ సంపాదించే పురుషులు 1 శాతం నుంచి 8 శాతానికి, మహిళలు 2 శాతం నుంచి 16 శాతానికి పెరిగారని సంస్థ పేర్కొంది.ఖర్చు తగ్గింపు: ఉద్యోగాల్లో కోతలు, వారికి అందించే ప్రయోజనాలు తగ్గించుకోవడం ద్వారా ఖర్చులు 9% తగ్గి రూ.770.44 కోట్లకు చేరుకున్నాయి.ఛైర్మన్ వేతనం: కంపెనీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ సగటు ఉద్యోగి వేతనం కంటే 211 రెట్లు అధికంగా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో వేతనం, ఇతర అలవెన్స్‌ల రూపంలో ఆయన రూ.5.4 కోట్లు అందుకున్నారు.ఆర్థిక పనితీరుకంపెనీ మొత్తం ఆదాయం గతంతో పోలిస్తే 14 శాతం క్షీణించి రూ.8496.96 కోట్లకు చేరుకుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణలో ఉన్న మొత్తం విమానాల సంఖ్య 76గా ఉండేది. ఇది 2024 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 65కు తగ్గింది. ప్రస్తుతం స్పైస్ జెట్ 60 విమానాలను నడుపుతుండగా, బకాయిలు చెల్లించని కారణంగా కొన్ని విమానాలు నిలిచిపోయాయి.ఇదీ చదవండి: నిలిచిన రైల్వే ఈ-టికెట్ సేవలు..!నిధుల సమీకరణక్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్(క్యూఐపీ) ద్వారా ఇటీవల కంపెనీ రూ.3,000 కోట్లు సమీకరించింది. వీటితో ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ, టీడీఎస్ బకాయిలను చెల్లించి కీలక సెటిల్మెంట్లను పూర్తి చేయడంపై దృష్టి సారిస్తుంది. స్పైస్ జెట్ 2026 నాటికి 100 విమానాలను నడపాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
స్పైస్‌జెట్‌పై మరో రెండు దివాలా పిటీషన్లు
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌పై మరో రెండు దివాలా పిటీషన్లు దాఖలయ్యాయి. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో (ఎన్సీఎల్టీ) సబర్మతి ఏవియేషన్, జెట్ఎయిర్17 సంస్థలు వీటిని దాఖలు చేశాయి. సబర్మతి పిటీషన్‌పై స్పైస్‌జెట్‌కు నోటీసులు జారీ చేసిన ఎన్సీఎల్టీ.. 27 మిలియన్ డాలర్ల క్లెయిమ్‌కు సంబంధించి అదనంగా మరిన్ని పత్రాలు సమర్పించాలని జెట్ఎయిర్17కి సూచించింది.ఐర్లాండ్‌కి చెందిన జెట్ఎయిర్17 .. విమాన ప్రయాణికుల రవాణాకు సంబంధించిన పరికరాలను లీజుకు అందిస్తుంది. తాము విల్మింగ్టన్ ట్రస్ట్ నుంచి విమానాలను లీజుకు తీసుకోగా, బాకీలు తీర్చాలని జెట్ఎయిర్17 కోరుతోందని స్పైస్‌జెట్ వాదించింది. విల్మింగ్టన్ ట్రస్ట్‌కి, జెట్ఎయిర్ 17కి మధ్య సంబంధంపై స్పష్టత లేదని పేర్కొంది.అయితే, స్పైస్‌జెట్ లీజును విల్మింగ్టన్ తమకు బదలాయించిందని, దానికి అనుగుణంగానే తాజాగా పిటీషన్ దాఖలు చేశామని జెట్ఎయిర్ 17 వివరించింది. స్పైస్‌జెట్‌పై ఇటీవల విల్లీస్ లీజ్, ఎయిర్‌క్యాజిల్ ఐర్లాండ్, విల్మింగ్టన్, సెలెస్టియల్ ఏవియేషన్ తదితర సంస్థలు దివాలా పిటీషన్లు వేసిన సంగతి తెలిసిందే. వీటిలో చాలా మటుకు పిటీషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. -
మూడు నెలల వేతన బకాయిలు చెల్లింపు
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ గురువారం ఉద్యోగుల వేతన బకాయిలు చెల్లించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. ఈ నెల 16 నుంచి 18 వరకు కంపెనీ క్యూఐపీ ద్వారా నిధులు సేకరించింది. దాంతో రూ.3,000 కోట్లు సమీకరించింది.సంస్థ ఉద్యోగులకు జూన్ నుంచి వేతనాలు చెల్లించడం లేదని గతంలో వార్తలు వచ్చాయి. దాంతోపాటు ఏప్రిల్ 2020-ఆగస్టు 2023 మధ్య ఉద్యోగుల జీతాలకు సంబంధించిన రూ.220 కోట్ల టీడీఎస్(మూలం వద్ద పన్ను మినహాయింపు)ను చెల్లించలేదనే వాదనలున్నాయి. ఈ వార్తలు వచ్చిన కొన్ని రోజులకే కంపెనీ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్(క్యూఐపీ) ద్వారా నిధులు సేకరించేందుకు పూనుకుంది. ఫలితంగా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్(క్యూఐబీ) నుంచి రూ.3,000 కోట్లను సమీకరించింది. ఈ సొమ్ములోని కొంత మొత్తాన్ని ఉద్యోగుల వేతనాలు, టీడీఎస్ చెల్లించేందుకు వినియోగించినట్లు కొందరు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: రూ.ఎనిమిది లక్షల కోట్ల అక్రమ దందా!కంపెనీ ప్రకటించిన క్యూఐపీలో దాదాపు 87 దేశీయ, అంతర్జాతీయ సంస్థలు పాల్గొని ఈ ఇష్యూను సబ్స్క్రయిబ్ చేసుకున్నాయి. ఇదిలా ఉండగా, డీజీసీఏ డేటా ప్రకారం స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్ మార్కెట్ వాటా తగ్గిపోతోంది. జనవరిలో ఈ వాటా 5.6 శాతంగా ఉంది. క్రమంగా ఇది తగ్గిపోతూ ఆగస్టులో 2.3 శాతానికి చేరింది. 2021లో ఎయిర్‌లైన్ మార్కెట్ వాటా 10.5 శాతంగా నమోదవ్వడం గమనార్హం. సంస్థ పరిధిలోని విమానాల సంఖ్య 2019లో 74గా ఉండేది. 2024లో వీటి సంఖ్య 28కి చేరింది. -
స్పైస్‌జెట్ ఫ్లోర్ ధర రూ. 64.79
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన కంపెనీ స్పైస్‌జెట్ అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) నుంచి నిధుల సమీకరణకు తెరతీసింది. ఇందుకు తాజాగా షేర్ల జారీ(ఫ్లోర్) ధరను ప్రకటించింది. ఒక్కో షేరుకి రూ. 64.79 చొప్పున సెక్యూరిటీలను విక్రయించనుంది. తద్వారా రూ. 3,000 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. క్విబ్ ద్వారా రూ. 3,000 కోట్లవరకూ సమీకరించేందుకు గత వారం వాటాదారుల నుంచి స్పైస్‌జెట్ అనుమతి పొందిన సంగతి తెలిసిందే. కాగా.. వాటాదారుల అనుమతిమేరకు ఫ్లోర్ ధరపై 5 శాతానికి మించకుండా డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తాజాగా వెల్లడించింది. కంపెనీ ఆర్థిక సవాళ్లు, న్యాయ వివాదాలు, విమాన సరీ్వసులు నిలిచిపోవడం తదితర సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో నిధుల సమీకరణకు ప్రాధాన్యత ఏర్పడింది. బీఎస్ఈలో స్పైస్‌జెట్ షేరు 5.25 శాతం పతనమై రూ. 73.72 వద్ద ముగిసింది. -
జీతాల్లేవ్.. మూణ్నెళ్లు ఇంటి దగ్గరే ఉండండి
ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తమ 150 మంది క్యాబిన్ సిబ్బందిని మూడు నెలల పాటు ఫర్లాఫ్ చేయాలని నిర్ణయించింది. అంటే మూడు నెలలపాటు పని లేదని, జీతాలు ఇవ్వలేమని, ఉద్యోగులు విధుల్లోకి రావద్దని ప్రకటించింది.ఆర్థిక ఇబ్బందులు, చట్టపరమైన సమస్యలతో సతమతమవుతున్న స్పైస్‌జెట్ తక్కువ సంఖ్యలో విమానాలతో పనిచేస్తోంది. ప్రస్తుతం కేవలం 22 విమానాలను మాత్రమే నడిపిస్తోంది. సంస్థలోని మొత్తం 150 మంది క్యాబిన్ సిబ్బందిని మూడు నెలల పాటు వేతనం లేకుండా సెలవుపై పంపనున్నట్లు ఎయిర్‌లైన్ ప్రతినిధి తాజాగా తెలిపారు. అంతకుముందు రోజు, ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ స్పైస్‌జెట్‌పై నిఘాను మరింత పెంచినట్లు తెలిపింది."స్పైస్‌జెట్ 150 మంది క్యాబిన్ సిబ్బందిని తాత్కాలికంగా మూడు నెలల పాటు ఫర్లాఫ్లో ఉంచడానికి కఠినమైన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత లీన్ ట్రావెల్ సీజన్, తగ్గిన విమానాల పరిమాణానికి ప్రతిస్పందనగా, సంస్థ దీర్ఘకాలిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది" అని స్పైస్‌జెట్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఫర్లాఫ్ కాలంలో, క్యాబిన్ క్రూ సభ్యులు స్పైస్‌జెట్ ఉద్యోగులుగానే కొనసాగుతారని, అన్ని ఆరోగ్య ప్రయోజనాలు, ఆర్జిత సెలవులు చెక్కుచెదరకుండా ఉంటాయని చెప్పారు. -
Video: సీఐఎస్ఎఫ్ జవాన్ చెంప చెళ్లుమనిపించిన స్పైస్ జెట్ ఉద్యోగి.
జైపూర్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారి చెంప ఛెళ్లుమనిపించిన స్పైస్‌జెట్ మహిళా ఉద్యోగినిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. అయితే, తమ ఉద్యోగికి ఎయిర్‌లైన్స్ సంస్థ అండగా నిలిచింది. పోలీస్ అధికారి మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు దిగాడంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.అతని నుంచి అసభ్య పదజాలం, లైంగిక వేధింపులు మహిళ ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆరోపించింది. ద్యోగి వద్ద సరైన ప్రవేశ పాస్ కలిగి ఉన్నప్పటికీ సీఐఎస్ఎఫ్ సిబ్బంది అనుచితంగా ప్రవర్తించాడని, అసభ్య పదజాలంతో దూషించాడని తెలిపింది. డ్యూటీ తరువాత తన ఇంటికి రావాలని తమ ఉద్యోగినిని సదరు అధికారి కోరినట్టు వెల్లడించింది. అంతేకాకుండా, ఆమెకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఇచ్చిన ఎంట్రీ పాస్ కూడా ఉందని పేర్కొంది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంటున్నట్టు పేర్కొంది. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఉద్యోగి తరపున ఎయిర్‌లైన్స్ పోలీసులను ఆశ్రయించింది. ఆమెకు పూర్తిగా అండగా ఉంటామని తెలిపింది.Why is @flyspicejet trying to save it's female employee who was trying to enter through wrong-gate and then slapped #CISF officer? Has #SpiceJet done even a bit of investigation before jumping to support its errant employee?🤨#SpiceJetSlapGate #Jaipurpic.twitter.com/v24theSBaB pic.twitter.com/6di1KG5seP— India Crooks (@IndiaCrooks) July 11, 2024 కాగా అనురాధ రాణి అనే మహిళ స్పైస్‌జెట్ సంస్థలో ఫుడ్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. ఇతర సిబ్బందితో కలిసి ఆమె ఇటీవల ఉదయం 4 గంటల సమయంలో ఎయిర్‌పోర్టులోకి వెళుతుండగా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గిరిరాజ్ ప్రసాద్ ఆమెను అడ్డుకున్నారు. ఆ గేటు మీదుగా ఎయిర్‌పోర్టులోకి వెళ్లేందుకు ఆమెకు తగిన అనుమతి లేదని అన్నారు. ఎయిర్‌లైన్స్ సిబ్బంది కోసం ఉద్దేశించిన స్క్రీనింగ్ పోస్టు వద్ద తనిఖీ చేయించుకుని వెళ్లాలని ఆదేశించారు. అయితే, ఆ సమయంలో అక్కడ మహిళా సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరు. ఈ క్రమంలో ఏఎస్ఐ మహిళా సిబ్బందిని పిలిపించే ప్రయత్నం చేయగా అప్పటికే ఆయనకు, అనురాధ రాణికి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో ఆమె ఒక్కసారిగా ఆయన చెంప ఛెళ్లుమనిపించింది. -
రూ.61 కోట్లు రికవరీ చేసిన ఈపీఎఫ్ఓ
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ చెల్లించాల్సిన రూ.73 కోట్ల బకాయిలకుగాను రూ.61 కోట్లను రికవరీ చేసినట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తెలిపింది. మార్చి 2020 నుంచి మే 2021 వరకు ఈపీఎఫ్ఓకు చెల్లించాల్సిన ఎంప్లాయర్(కంపెనీ) వాటాలో కొంత మొత్తం వసూలైనట్లు పేర్కొంది.స్పైస్‌జెట్ సంస్థ ఉద్యోగుల వేతనాల్లో కట్ అవుతున్న ఈపీఎఫ్ఓ వాటాలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. మేనేజ్మెంట్ వాటాను ఈపీఎఫ్ఓకు జమ చేయడం లేదని, బకాయిపడిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని సంస్థకు నోటీసులు అందించారు. దాంతో తాజాగా మార్చి 2020 నుంచి మే 2021 వరకు బకాయిపడిన మొత్తం రూ.73 కోట్లలో రూ.61 కోట్లు రికవరీ అయినట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది. ఆలస్య చెల్లింపునకు సంబంధించిన వడ్డీ, జనవరి 2022 తర్వాత చెల్లించాల్సిన బకాయిలను కూడా అంచనా వేసినట్లు పేర్కొంది.ఈ సందర్భంగా స్పైస్‌జెట్ అధికారి ఒకరు మాట్లాడుతూ..‘ఈపీఎఫ్ సెక్షన్ 14బీ, ఇతర నిబంధనల చట్టం 1952 ప్రకారం విచారణ జరుగుతుంది. చట్టంలోని సెక్షన్ 7A కింద మిగిలిన కాలానికి (ఇప్పటి వరకు) ఎంత చెల్లించాలో లెక్కించి దాన్ని రికవరీ చేసే ప్రక్రియ మొదలైంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: అంబానీ చెల్లి.. భర్త చనిపోయినా కోట్ల కంపెనీకి ఛైర్‌పర్సన్‌గా..ఈపీఎఫ్ఓ పరిధిలోని ప్రతి సంస్థ ఎంప్లాయర్ వాటాను ఉద్యోగభవిష్య నిధిలో జమ చేయాలి. ప్రతి నెలా 15వ తేదీలోపు ఈపీఎఫ్ఓలో తమ రిటర్న్‌లను ఫైల్ చేయాలి. లేదంటే బకాయిపడిన తేదీ నుంచి ఏటా 12% చొప్పున వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుంది. -
ఫ్లైట్ లో నరకం..
-
అయోధ్యకు విమానాలు బంద్
-
హైదరాబాద్ - అయోధ్య విమానాలు బంద్
హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా నిర్వహిస్తున్న విమాన సర్వీస్‌ను స్పైస్‌జెట్ ఈ నెల 1 నుంచి నిలిపివేసినట్లు వెల్లడించింది. ఈ మార్గంలో విమాన సేవలను కంపెనీ రెండు నెలల క్రితం ప్రారంభించింది. వారానికి 3 సర్వీసుల చొప్పున స్పైస్‌జెట్ విమానాలు నడిపింది. అయితే ప్రస్తుతం తగినంత గిరాకీ లేకపోవడంతో, ఈ సేవలను కంపెనీ నిలిపివేసినట్లు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి.స్పైస్‌జెట్ అయోధ్యకు తన మొదటి విమానం SG 611 ఏప్రిల్ 2న ప్రారంభించింది. ఇది ఆ రోజు ఉదయం 10.45 గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి 12:45 గంటలకు అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఆ తరువాత తిరుగు ప్రయాణంలో SG 616 అయోధ్య నుంచి 1 గంటకు బయలుదేరి 3:25 pmకి తిరిగి హైదరాబాద్‌లో ల్యాండ్ అయింది. ఈ విధంగా వారంలో మూడు సార్లు స్పైస్‌జెట్ ఈ సర్వీస్ కొనసాగించింది.మార్చి 31న, అప్పటి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న తెలంగాణ బీజేపీ చీఫ్ జి. కిషన్ రెడ్డి, హైదరాబాద్, అయోధ్యలను అనుసంధానించాలని అభ్యర్థిస్తూ పౌర విమానయాన శాఖ మంత్రికి రాసిన లేఖను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. హైదరాబాద్ - అయోధ్య మధ్య నేరుగా విమాన సర్వీసు లేకపోవడం భక్తులకు ఓ సవాలుగా మారిందని పేర్కొన్నారు.ఫిబ్రవరి నాటికి స్పైస్‌జెట్ ఎనిమిది భారతీయ నగరాలను అయోధ్యకు సర్వీస్ ప్రారంభించింది. ప్రస్తుతం స్పైస్‌జెట్ అహ్మదాబాద్, ఢిల్లీల నుంచి అయోధ్యకు నేరుగా విమానాలను నడుపుతోంది. అయోధ్య రామమందిరం ప్రారంభమైన తరువాత వేగంగా పుంజుకున్న పర్యాటకం క్రమంగా క్షిణించింది. దీంతో పర్యాటకుల సంఖ్య బాగా తగ్గింది. స్పైస్‌జెట్ తన సర్వీసులను కూడా తగ్గించింది. -
రూ.1,323 కోట్లు పరిహారం కోరనున్న కళానిధిమారన్
స్పైస్‌జెట్ సంస్థ నుంచి రూ.1,323 కోట్లు పరిహారం కోరనున్నట్లు ఆ సంస్థ మాజీ ప్రమోటర్ కళానిధి మారన్ తెలిపారు. ఇటీవల మారన్ నుంచి రూ.450 కోట్లు పరిహారం కోరతామని స్పైస్‌జెట్ వెల్లడించిన నేపథ్యంలో మారన్, ఆయన కంపెనీ కేఏఎల్ ఎయిర్వేస్ ఈ మేరకు ప్రకటన వెల్లడించారు.స్పైస్‌జెట్‌కు గతంలో ప్రమోటర్‌గా వ్యవహరించిన కళానిధి మారన్ సంస్థలో తన 58.46 శాతం వాటాను ప్రస్తుత ప్రమోటర్ అజయ్‌సింగ్‌కు బదిలీ చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా తనకు రావాల్సిన వారంట్స్, షేర్లు జారీ చేయలేదని మారన్ ఆరోపించారు. ఈ వ్యవహారం కోర్టుకెళ్లింది. దీనిపై మధ్యవర్తిత్వ కోర్టు, దిల్లీ సింగిల్ బెంచ్ తీర్పులను అనుసరించిన స్పైస్‌జెట్.. మారన్, ఆయనకు చెందిన కేఏఎల్ ఎయిర్వేస్కు రూ.580 కోట్లు అసలు, రూ.150 కోట్లు వడ్డీ చొప్పున రూ.730 కోట్లు చెల్లించింది.స్పైస్‌జెట్, కంపెనీ ప్రస్తుత ప్రమోటరు అజయ్‌సింగ్ మారన్‌కు రూ.580 కోట్లను వడ్డీతో పాటు చెల్లించాలని గతంలో జారీ చేసిన ఆదేశాలను సమర్థించిన ఏకసభ్య ధర్మాసనం ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ మే 17న దిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం పక్కనపెట్టింది. దాంతో కళానిధి మారన్, ఆయన సంస్థ కేఏఎల్ ఎయిర్వేస్కు చెల్లించిన రూ.730 కోట్ల మొత్తం నుంచి రూ.450 కోట్లు రీఫండ్ ఇవ్వాలని కోరనున్నట్లు స్పైస్‌జెట్ తెలిపింది.దాంతో మారన్ దిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాససం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేయనున్నట్లు తెలిపారు. ఎఫ్టీఐ కన్సల్టింగ్ ఎల్ఎల్పీ నిర్ణయించిన రూ.1323 కోట్ల నష్టాన్ని సైతం స్పైస్‌జెట్ నుంచి కోరనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా తమకు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. -
భారీ వర్షం.. నిలిచిన విమానాలు
ప్రపంచంలోనే రద్దీగా ఉండే ఎయిర్‌పోర్ట్‌ల్లో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తడంతో భారత్ నుంచి దుబాయ్ వెళ్లే విమానాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో ఎయిర్ ఇండియా, ఇండిగో తమ సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించాయి. దిల్లీ విమానాశ్రయంలో దుబాయ్‌కి వెళ్లే పది విమానాలు, దుబాయ్ నుంచి వచ్చే తొమ్మిది విమానాలను రద్దు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. భారత్‌లోని వివిధ నగరాల నుంచి ఎయిరిండియా దుబాయ్‌కి వారానికి 72 విమానాలను నడుపుతోంది. #6ETravelAdvisory: Flights to/fro #Dubai stand canceled until 12 PM on Apr 18, due to Airport restrictions and operational challenges caused by bad weather and road blockages. Do explore our alternate flight options or request for a full refund by visiting https://t.co/xe8o6KQdpT — IndiGo (@IndiGo6E) April 17, 2024 ‘రాబోయే కొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో విమానాలను నడిపేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం బాధిత ప్రయాణికులకు వసతి కల్పించడానికి కృషిచేస్తున్నాం. 16, 17 తేదీల్లో ప్రయాణాలకోసం టికెట్ బుక్చేసినవారు ఒకసారి తేదీ మార్చుకునేందుకు అవకాశం కల్పించనున్నాం. దాంతో వారు తమ గమ్యస్థానాలు చేరేలా ఏర్పాటు చేస్తున్నాం’అని ఒక ప్రతినిధి చెప్పారు. #TravelUpdate: SpiceJet flights to/from Dubai (DXB) are affected due to adverse weather conditions in Dubai. Please refer link https://t.co/rNJZcxc6Wo for an alternate flight, or a full refund. You may also get in touch with our 24/7 Customer Care Helpline Numbers at +91 (0)124… — SpiceJet (@flyspicejet) April 17, 2024 ఇదీ చదవండి: ఎన్పీసీఐ సమావేశం..గూగుల్‌పే, ఫోన్‌పేకు లేని ఆహ్వానం! ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా, ఇండిగో, స్పైస్‌జెట్‌తో సహా ఇతర విమానయాన సంస్థలు దుబాయ్‌కి వెళ్లే మార్గంలో అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దుబాయ్‌కి వెళ్లే అన్ని సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ప్రకటించింది. 2023 ఏడాదికిగాను ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే రెండో విమానాశ్రయంగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. -
కలల కెరియర్ కుప్పకూలుతోంది! 1400 మంది జీవితాలు..
SpiceJet layoff : ఎయిర్‌లైన్స్‌లో పనిచేయాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. ఎయిర్ క్రాఫ్ట్‌లలో పైలట్లుగా, ఇతర సిబ్బందిగా పనిచేయడం ఎంతో మందికి డ్రీమ్ కెరియర్. ఆకర్షణీయమైన వేతనాలతో పాటు దీన్నో ఉత్తమ ప్రొఫెషన్‌గా చూస్తారు. అలాంటి కలల కెరియర్ కుప్పకూలిపోతోంది.. 1400 మంది జీవితాలు రోడ్డు మీదకు వస్తున్నాయి. 15 శాతం మంది లేఆఫ్ చౌక ధరల్లో విమాన ప్రయాణాన్ని అందించే ఎయిర్‌లైన్‌గా పేరొందిన స్పైస్‌జెట్ తీవ్రమైన నగదు కొరతతో సతమతమవుతోంది. దీంతో ఖర్చులను తగ్గించుకోవడానికి తమ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 15 శాతం మంది అంటే సుమారు 1400 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. ఈ చర్య ద్వారా పెట్టుబడిదారుల ఆసక్తిని నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. ఉద్యోగుల తొలగింపు విషయాన్ని స్పైస్‌జెట్ ధ్రువీకరించినట్లు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. ఆపరేషనల్ అవసరాల కోసం కంపెనీలో అన్ని రకాల ఖర్చులను సర్దుబాటు చేసుకోవడంలో భాగంగా లేఆఫ్‌లు అమలు చేస్తున్నట్లు స్పైస్‌జెట్ ప్రతినిధిని ఉటంకిస్తూ పేర్కొంది. తొలగింపులు అనివార్యం స్పైస్‌జెట్‌లో ఉద్యోగుల జీతాల బిల్లు రూ. 60 కోట్లు ఉంది. ఈ కారణంగానే ఉద్యోగుల తొలగింపులు అనివార్యమైనట్లు కంపెనీ అంతర్గత పరిణామాలు తెలిసినవారు చెబుతున్నారు. తొలగింపుల గురించి ఉద్యోగులకు కంపెనీ ఇప్పటికే సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తోంది. కాగా స్పెస్‌జెట్ కొన్ని నెలలుగా జీతాల చెల్లింపులో జాప్యం చేస్తోంది. చాలా మందికి జనవరి నెల జీతం ఇప్పటికీ అందలేదు. ప్రస్తుతం స్పైస్‌జెట్‌లో 9,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ సంస్థ 30 విమానాలను నడుపుతోంది. 2019లో స్పైస్‌జెట్‌లో గరిష్ట స్థాయిలో 16,000 మంది ఉద్యోగులు ఉండేవారు. 118 విమానాలను ఈ సంస్థ నడిపేది. రూ. 2,200 కోట్ల నిధులు పొందే ప్రక్రియలో ఉన్నామని, అయితే కొంత మంది ఇన్వెస్టర్లలో విశ్వాసం కొరవడిందని స్పైస్‌జెట్ చెబుతోంది. “ఫండింగ్ జాప్యాలు ఏవీ లేవు. మా ఫండ్ ఇన్ఫ్యూషన్తో బాగా పురోగమిస్తున్నాం. తదనుగుణంగా ఇప్పటికే బహిరంగ ప్రకటనలు చేశాం. తదుపరి పురోగతిని త్వరలో తెలియజేస్తాం. చాలా మంది ఇన్వెస్టర్లు మాతో చేరుతున్నారు” అని స్పైస్‌జెట్ ప్రతినిధి పేర్కొన్నారు. -
Kolkata: విమానంలో మహిళతో అసభ్య ప్రవర్తన
కలకత్తా: పశ్చిమబెంగాల్ రాజధాని కలకత్తా నుంచి బాగ్డోరా వెళుతున్న స్పైస్‌జెట్ విమానంలో తోటి మహిళా ప్రయాణికురాలితో ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ మేరకు ఎయిర్‌లైన్స్ ఆదివారం(ఫిబ్రవరి 4) ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటన జనవరి 31నాడు జరిగినట్లు ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని మహిళా ప్రయాణికురాలు ఫిర్యాదు చేసిన వెంటనే అతని సీటు మార్చినట్లు ఎయిర్‌లైన్స్ సిబ్బంది తెలిపారు. అయితే తాను అసభ్యంగా ప్రవర్తించలేదని ఆ వ్యక్తి సిబ్బందికి స్పష్టం చేశాడు. ‘విమానం బాగ్డోరాలో ల్యాండ్ అయిన వెంటనే ఇద్దరు ప్రయాణికులను సీఐఎస్ఎఫ్ సిబ్బంది వద్దకు తీసుకెళ్లాం. తనకు క్షమాపణలు చెప్పాలని మహిళా ప్రయాణికురాలు ఆ వ్యక్తిని కోరింది. అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి క్షమాపణలు చెప్పాడు. దీంతో ఆ మహిళా ప్రయాణికురాలు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు చేయకుండానే వెళ్లిపోయింది’ అని ఎయిర్‌లైన్స్ సిబ్బంది తెలిపారు. గడిచిన కొన్ని నెలల్లో విమానాల్లో ఇలాంటి పలు సంఘటనలు నమోదయ్యాయి. న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఒక వ్యక్తి వయసులో పెద్దదైన మహిళపై మూత్ర విసర్జన చేశాడని కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేశారు. నెల జైలు తర్వాత అతడికి బెయిల్ వచ్చింది. ఇదీచదవండి.. రాష్ట్ర హోదా కోసం లడఖ్‌లో నిరసనలు -
స్పైస్‌జెట్ విమానం టాయిలెట్లో చిక్కుకున్న ప్రయాణికుడు
ముంబయి: స్పైస్‌జెట్ విమానం టాయిలెట్స్‌లో చిక్కుకుని ఓ ప్రయాణికుడు నరకయాతన అనుభవించాడు. ముంబయి నుంచి బెంగళూరు వరకు వెళ్లే స్పైస్‌జెట్ విమానంలో ఈ ఘటన జరిగింది. టేకాఫ్ అయిన దగ్గర నుంచి బెంగళూరులో ల్యాండ్ అయ్యేవరకు గంటకుపైగా టాయిలెట్లోనే ఉండిపోయాడు. విమానం ముంబయిలో టేకాఫ్ అయ్యాక ఓ వ్యక్తి టాయిలెట్స్‌కి వెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో టాయిలెట్స్ డోర్ లాక్ అయిపోయింది. ఎంత ప్రయత్నించినా రాలేదు. క్రూ సిబ్బంది అతనికి సహాయం చేసే ప్రయత్నం చేశారు. తీరా బెంగళూరులో ల్యాండ్ అయ్యాక.. ఇంజినీర్ వచ్చి డోర్ ఓపెన్ చేసేవరకు బాధిత వ్యక్తి టాయిలెట్స్‌లోనే ఉండిపోయాడు. The note from the crew to the passenger locked on #Spicejet flight. #Avgeek #Aviation pic.twitter.com/pPrvXq8mJm — Aman Gulati 🇮🇳 (@iam_amangulati) January 17, 2024 "జనవరి 16న ముంబయి నుంచి బెంగళూరుకు వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో దురదృష్టవశాత్తూ ఒక ప్రయాణికుడు సుమారు గంటసేపు టాయిలెట్స్‌లో చిక్కుకుపోయాడు. డోర్ లాక్ లోపం కారణంగా విమానం గాలిలో ప్రయాణించింది. ప్రయాణమంతా మా సిబ్బంది ఆ ప్రయాణికునికి మార్గనిర్దేశం చేశారు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం." అని స్పైస్‌జెట్ తెలిపింది. ఇదీ చదవండి: రిపబ్లిక్ డే వేళ ఢిల్లీలో గోడలపై ఖలిస్థానీ రాతల కలకలం -
దివాలా తీసిన ‘గో ఫస్ట్’పై 3 కంపెనీల కన్ను!
న్యూఢిల్లీ: దివాలా తీసిన గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్‌ను కొనుగోలు చేయడానికి మూడు సంస్థలు పోటీపడుతున్నాయి. దేశీ విమానయాన సంస్థ స్పైస్‌జెట్, షార్జాకి చెందిన ఏవియేషన్ కంపెనీ స్కై వన్, ఆఫ్రికా కేంద్రంగా పని చేసే సాఫ్రిక్ ఇన్వెస్ట్మెంట్స్ వీటిలో ఉన్నాయి. గో ఫస్ట్ కొనుగోలుపై ఆసక్తిగా ఉన్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు స్పైస్‌జెట్ తెలియజేసింది. మదింపు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత త్వరలోనే తమ ఆఫర్ ప్రకటించే యోచనలో ఉన్నట్లు వివరించింది. మదింపు ప్రక్రియను చేపట్టేందుకు గత పది రోజులుగా ఈ మూడు సంస్థల నుంచి దివాలా పరిష్కార నిపుణుడు (ఆర్పీ) శైలేంద్ర అజ్మీరాకు అభ్యర్ధనలు వచి్చనట్లు తెలుస్తోంది. వాస్తవానికి గో ఫస్ట్ కొనుగోలు కోసం బిడ్లు దాఖలు చేసేందుకు గడువు నవంబర్ 22తో ముగిసింది. అయితే, గడువు లోపల స్పందించని కంపెనీలు.. ఆ తర్వాత ఆసక్తి వ్యక్తం చేయడం గమనార్హం. తాజా పరిస్థితుల నేపథ్యంలో బిడ్డింగ్ డెడ్‌లైన్‌ను మరికొంత కాలం పొడిగించాలని బిడ్డర్లు కోరినట్లు సమాచారం. దీనిపై రుణదాతల కమిటీ (సీఓసీ) నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గో ఫస్ట్ మే 3 నుంచి కార్యకలాపాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఒడుదుడుకులు ఎదుర్కొంటున్న స్పైస్‌జెట్, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు 270 మిలియన్ డాలర్లను సమీకరించుకునే ప్రయత్నాల్లో ఉంది. -
కాస్త పైకి తేలిన ‘స్పైస్‌జెట్’.. నిధుల సమీకరణతో కొత్త ఊపిరి!
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన కంపెనీ స్పైస్‌జెట్ ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర నష్టం దాదాపు సగానికి తగ్గి రూ. 446 కోట్లకు పరిమితమైంది. వ్యయాలు తగ్గడం ఇందుకు సహకరించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 830 కోట్ల నికర నష్టం నమోదైంది. అయితే మొత్తం ఆదాయం రూ. 2,102 కోట్ల నుంచి రూ. 1,726 కోట్లకు క్షీణించింది. మొత్తం వ్యయాలు సైతం రూ. 2,935 కోట్ల నుంచి రూ. 2,175 కోట్లకు తగ్గాయి. విమానాలు అద్దెకిచ్చే క్యాజిల్ లేక్‌తో ఉన్న వివాదాలను సర్దుబాటు చేసుకోవడంతోపాటు.. సిటీ యూనియన్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ. 100 కోట్ల రుణాలను తిరిగి చెల్లించినట్లు కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా కార్లయిల్ ఏవియేషన్ పార్ట్నర్స్కు షేరుకి రూ. 48 ధరలో 4.81 కోట్ల షేర్లను జారీ చేసినట్లు పేర్కొంది. రుణాలను ఈక్విటీగా మార్పు చేయడం ద్వారా రూ. 230 కోట్ల రుణాలు తగ్గించుకున్నట్లు తెలియజేసింది. నిధుల సమీకరణకు రెడీ ఆర్థిక సంస్థలు, ఎఫ్ఐఐలకు ఈక్విటీ షేర్ల జారీ ద్వారా 27 కోట్ల డాలర్లు(రూ. 2,250 కోట్లు) సమీకరించనున్నట్లు స్పైస్‌జెట్ పేర్కొంది. తద్వారా ఆర్థిక సవాళ్లకు చెక్ పెట్టే యోచనలో ఉంది. ప్రయివేట్ ప్లేస్మెంట్లో భాగంగా ఈక్విటీ షేర్లు, వారంట్ల జారీకి బోర్డు అనుమతించినట్లు వెల్లడించింది. ఎలారా ఇండియా అపార్చునిటీస్ ఫండ్, ఏరీస్ అపార్చునిటీస్ ఫండ్, నెక్సస్ గ్లోబల్ ఫండ్, ప్రభుదాస్ లీలాధర్ తదితరాలకు సెక్యూరిటీలను జారీ చేయనున్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం బీఎస్ఈలో లిస్టయిన కంపెనీ ఎన్ఎస్ఈలోనూ లిస్టయ్యే ప్రణాళికల్లో ఉన్నట్లు వివరించింది. -
11న స్పైస్‌జెట్ బోర్డు సమావేశం
ముంబై: చౌక ధరల విమానయాన కంపెనీ స్పైస్‌జెట్ నిధుల సమీకరణ బాట పట్టింది. ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన ఇందుకు గల అవకాశాలపై చర్చించేందుకు ఈ నెల 11న బోర్డు సమావేశంకానున్నట్లు కంపెనీ తాజాగా పేర్కొంది. ఇటీవల 10 కోట్ల డాలర్లు(సుమారు రూ. 833 కోట్లు) సమకూర్చుకునేందుకు కంపెనీ ప్రమోటర్ అజయ్ సింగ్.. గ్లోబల్ ప్రయివేట్ క్రెడిట్ ఫండ్స్‌తో చర్చలు నిర్వహిస్తున్నట్లు వెలువడిన వార్తల నేపథ్యంలో బోర్డు సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ప్రిఫరెన్షియల్ పద్ధతిలో ఈక్విటీ షేర్లు లేదా మార్పిడికి వీలయ్యే సెక్యూరిటీల జారీ ద్వారా నిధుల సమీకరణకున్న అవకాశాలను పరిశీలించేందుకు బోర్డు సమావేశమవుతున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు స్పైస్‌జెట్ వెల్లడించింది. -
స్పైస్‌జెట్‌కు డెడ్‌లైన్: కడతారా? జైలుకెడతారా అజయ్ సింగ్‌కు సుప్రీం వార్నింగ్
SpiceJet Vs Credit Suisse క్రెడిట్ సూయిస్ కేసులో విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు భారీ షాక్ తగిలింది.క్రెడిట్ సూయిస్ బకాయిల చెల్లింపు విషయంలో స్పైస్‌జెట్ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్‌కు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.సుప్రీం ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం హెచ్చరించింది. ఒప్పందం ప్రకారం మిలియన్ డాలర్ల బకాయిలను చెల్లింపులో స్పైస్‌జెట్ కావాలనే తాత్సారం చేస్తోందని, ఈ నేపథ్యంలో సింగ్ ,స్పైస్‌జెట్‌లపై ధిక్కార చర్యలను ప్రారంభించాలని కోరుతూ ఈ ఏడాది మార్చిలో క్రెడిట్ సూయిస్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు తాజా ఆదేశాలిచ్చింది. సెప్టెంబర్ 15లోగా క్రెడిట్ సూయిస్‌కి వాయిదాల రూపంలో 5 లక్షల డాలర్లను చెల్లించాలని, అలాగే డిఫాల్ట్ చేసిన మొత్తానికి 1 మిలియన్ డాలర్లు చెల్లించాలని స్పైస్‌జెట్ సుప్రీంకోర్టు ఆదేశించింది.లేని పక్షంలో 'కఠిన చర్యలు' తీసుకుంటామని స్పైస్‌జెట్‌ను సుప్రీంకోర్టు హెచ్చరించింది. బకాయిలు చెల్లించకపోతే అజయ్ సింగ్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని సుప్రీం పేర్కొంది. (ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్: అదిరిపోయే సరికొత్త ఫీచర్లు) ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం క్రెడిట్ సూయిస్ బకాలయిలను క్రెడిట్ సూయిస్‌కి బకాయిలు చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చెల్లించని పక్షంలో సింగ్‌ను తీహార్ జైలుకు పంపుతామని కోర్టు పేర్కొంది. అంతేకాదు ప్రతి విచారణలోనూ కోర్టుకు హాజరు కావాలని సింగ్‌ను ఆదేశించింది. ఇక చాలు..మీరు సంస్థను మూసివేసినా ..బాధలేదు. కానీ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందే ఇక డిల్లీ-డాలీ బిజినెస్‌ను కట్టిపెట్టండి అంటూ కోర్టు ఆగ్రహ్యం వక్తం చేసింది. అనంతరం ఈ కేసును సెప్టెంబరు 22కి వాయిదా వేసింది. -
విమానంలో మహిళలపై వేధింపులు.. అభ్యంతకర ఫొటోలు తీసి..
ఢిల్లీ: ఢిల్లీ-ముంబయి విమానంలో ఓ ప్రయాణికుడు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. విమాన సిబ్బందితో పాటు తోటి మహిళా ప్యాసింజర్ల అభ్యంతకర ఫొటోలను తీశాడు. బాధితుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఢిల్లీ మహిళా కమిషన్ స్పందించింది. సదరు ప్రయాణికునిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. SG 157 విమానం ఆగష్టు 2న ఢిల్లీ నుంచి ముంబయి బయలు దేరింది. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు సిబ్బంది, తోటి మహిళా ప్రయాణికుల అభ్యంతకర ఫొటోలను తీశాడు. ఇది గమనించిన సిబ్బంది అతన్ని పట్టుకుని ఫోన్లో నుంచి ఫొటోలను డిలీట్ చేయించారు. క్షమాపణలు కోరుతూ లేఖను రాయించారు. అయినప్పటికీ ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఢిల్లీ మహిళా కమిషన్ స్పందించింది. విమానాల్లో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని అన్నారు. నిందితున్ని శిక్షించాలని పోలీసులను కోరారు. 'విమానాల్లో లైంగిక వేధింపులు సహించరానివి. నిందితునిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. పౌరవిమానయాన సంస్థ ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదు.' అని ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి మలివాల్ అన్నారు. ఇన్ని రోజుల నుంచి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని మహిళా కమిషన్.. ఢిల్లీ పోలీసులకు , విమానయాన సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఇదీ చదవండి: కోటా హాస్టల్స్‌లో ఆత్మహత్యల కట్టడికి కొత్త ఆలోచన -
లాభాల్లోకి స్పైస్‌జెట్.. నష్టాలను వీడిన తక్కువ ధరల ఎయిర్‌లైన్స్!
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన కంపెనీ స్పైస్‌జెట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 205 కోట్ల నికర లాభం ఆర్జించింది. దేశీయంగా విమాన ప్రయాణాలకు డిమాండ్ పెరగడం ఇందుకు సహకరించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 789 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం నిర్వహణ ఆదాయం మాత్రం రూ. 2,457 కోట్ల నుంచి రూ. 2,002 కోట్లకు నీరసించింది. నిర్వహణ వ్యయాలు సైతం రూ. 2,072 కోట్ల నుంచి రూ. 1,291 కోట్లకు భారీగా తగ్గాయి. పలు సవాళ్ల నేపథ్యంలోనూ లాభాలు ఆర్జించగలిగినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ అజయ్ సింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తాము చేపట్టిన రూ. 500 కోట్ల పెట్టుబడులు కంపెనీ వృద్ధికి తోడ్పాటునిచ్చినట్లు తెలియజేశారు. ఈ కాలంలో లాజిస్టిక్స్ సంస్థ స్పైస్‌ఎక్స్‌ప్రెస్ అండ్ లాజిస్టిక్స్ ప్రయివేట్ లిమిటెడ్‌ను విడదీయడంతో స్పైస్‌జెట్ నెట్‌వర్త్ మెరుగుపడినట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో స్పైస్‌జెట్ షేరు బీఎస్ఈలో 7% జంప్‌చేసి దాదాపు రూ. 34 వద్ద ముగిసింది. -
SpiceJet-Credit Suisse Case: సుప్రీంకోర్టులో స్పైస్‌జెట్ ఎండీకి భారీ షాక్!
Credit Suisse vs SpiceJet: విమానయాన సంస్థ స్పైస్‌జెట్ చీఫ్ అజయ్ సింగ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వ్యక్తిగతంగా కోర్టుముందు హాజరు కావాలంటూ సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. క్రెడిట్ సూయిస్ ధిక్కార కేసుపై నాలుగు వారాల్లోగా స్పందించాలని అజయ్ సింగ్‌ను అత్యున్నత న్యాయస్థానం కోరంది. అజయ్ సింగ్, స్పైస్‌జెట్‌లపై ధిక్కార చర్యలను ప్రారంభించాలని కోరుతూ క్రెడిట్ సూయిస్ ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. (గుడ్ న్యూస్: రూ.1515కే విమాన టికెట్, ఫ్రీ ఫ్లైట్ వోచర్ కూడా!) కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారన్న క్రెడిట్ సూయిస్ అరోపణల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇరుపక్షాల మధ్య జరిగిన సెటిల్మెంట్ ప్రకారం 3.9 మిలియన్ల డాలర్ల బకాయిలు చెల్లించడంలో విఫలమైనందుకు సింగ్, స్పైస్‌జెట్‌లపై ధిక్కార చర్యలను ప్రారంభించాలని కోరుతూ క్రెడిట్ సూయిస్ మార్చిలో సుప్రీంను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో తాజా సమన్లు జారీ అయ్యాయి. (బడ్జెట్ ధరలో అద్భుతమైన మోటో ఈ13 స్మార్ట్‌ఫోన్: స్పెషాల్టీ ఏంటంటే?) కాగా 2015 నుంచి క్రెడిట్ సూయిస్ స్పైస్‌జెట్ మధ్య వివాదం నడుస్తోంది. స్పైస్‌జెట్ యాజమాన్యం సుమారు 24 మిలియన్లు డాలర్లు బకాయలను ఎగ్గొట్టారని క్రెడిట్ సూయిస్ ఆరోపిస్తోంది. దీనిపై చివరికి 2021లో మద్రాస్ హైకోర్టు ఎయిర్‌లైన్‌ను మూసివేయాలని సూచించింది. అయితే హైకోర్టు ఉత్తర్వులపై అప్పీల్లో సుప్రీంకోర్టు మూసివేత ప్రక్రియను తాత్కాలికంగానిలిపివేసింది, ఇరుపక్షాలు ఒక పరిష్కారానికి చర్చలు జరిపేందుకు అనుమతి నిచ్చింది. ఆగస్ట్ 2022లో తమ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి తమ ఒప్పందం గురించి సుప్రీంకోర్టుకు తెలిపాయి. అయితే, ఒప్పందం ప్రకారం బకాయిలు చెల్లించలేదనే ఆరోపణలతో మార్చిలో క్రెడిట్ సూయిస్ అజయ్ సింగ్‌పై ధిక్కార కేసు నమోదు చేసింది. దీంతోరాబోయే విచారణ సమయంలో హాజరు కావాలని అజయ్ సింగ్‌ను సుప్రీం ఆదేశించింది. దీంతో ముగిసిపోనుందని భావించిన కేసు కాస్తా మళ్లీ మొదటి కొచ్చినట్టైంది. -
గుడ్ న్యూస్: రూ. 1515కే విమాన టికెట్, ఫ్రీ ఫ్లైట్ వోచర్ కూడా!
SpiceJet I-Day Sale: బడ్జెట్ ధరల విమానయాన సంస్థ స్పైస్జెట్ఇండిపెండెన్స్ డే సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పింది. "ప్రత్యేక ఇన్క్రెడిబుల్ ఇండిపెండెన్స్ డే సేల్" పేరుతో స్పెషల్ సేల్ ప్రకటించింది. దీని ప్రకారం ఆగస్ట్ 14నుంచి ఎంపిక చేసిన దేశీయ డైరెక్ట్ వన్-వే ఫ్లైట్లలో ఈ సేల్ రూ.1,515 నుండి ప్రారంభమవుతుంది. అలాగే రూ. 2,000 వరకు ఉచిత విమాన వోచర్లను పొందవచ్చు. అంతేకాదు రూ. 15కే నచ్చిన సీటు ఎంపిక్ చేసుకోవచ్చు. కంపెనీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కింద ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ఆగస్ట్ 14- ఆగస్ట్ 20 వరకు అందుబాటులో ఉండే ఇండిపెండెన్స్ డే సేల్ ఆఫర్లో భాగంగా కేవలం రూ. 1515కే (వన్ వే టికెట్) విమాన టికెట్నుకొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఫ్రీ ఫ్లైట్ వోచర్, రూ. 15కే సీటు సెలెక్షన్ వంటి సర్వీసులు అందిస్తోంది. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా ఆగస్ట్ 15 నుంచి 2024 మార్చి 30 వరకు ప్రయాణించవచ్చు. (ఎల్ఐసీ కొత్త ఎండీగా ఆర్ దొరైస్వామి) లాభాలు జంప్ మరోవైపు బలమైన విమాన ప్రయాణ డిమాండ్ కారణంగా స్పైస్‌జెట్ జూన్‌తో ముగిసినతొలి త్రైమాసికంలో రూ. 205 కోట్ల నికర లాభాన్ని నివేదించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ. 789 కోట్ల నష్టాలను నమోదు చేసింది. దేశీయంగా ఉన్న డిమాండ్ కారణంగా 90 శాతం నమోదు చేసింది. మొత్తం నిర్వహణ ఆదాయం క్షీణించింది. అంతకుముందు సంవత్సరంఇదే త్రైమాసికంలో రూ. 2,457 కోట్లతోపోలిస్తే ఆదాయం రూ. 2,002 కోట్లుగా ఉంది. ఎబిట్టా మార్జిన్ 525 కోట్లుగా ఉన్నాయి. (టమాట భగ్గు: 15 నెలల గరిష్ఠానికి రీటైల్ ద్రవ్యోల్బణం) -
ఆ ఉద్యోగులకు నిజంగా పండగే! రూ.7.5 లక్షల జీతం, రూ.లక్ష రివార్డు..
దేశీ ఎయిర్‌లైన్స్ కంపెనీ స్పైస్‌జెట్ వార్షికోత్సవం సందర్భంగా తమ ఉద్యోగులకు పలు వరాలు ప్రకటించింది. విమాన పైలట్లకు నెలకు రూ.7.5 లక్షల జీతం, రూ.లక్ష నెలవారీ లాయల్టీ రివార్డు వంటివి ఇందులో ఉన్నాయి. గురుగ్రామ్‌కు కేంద్రంగా పనిచేసే స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్ సంస్థ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తమ కెప్టెన్ల నెల జీతాన్ని రూ.7.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పైలట్లకు నెలలో 75 గంటల ఫ్లయింగ్ అవర్స్ ఉంటాయి. ఈ పెంపుదల 2023 మే 16 నుంచి వర్తిస్తుందని స్పైస్ జెట్ తెలిపింది. అలాగే ట్రైనర్లు (డీఈ, టీఆర్ఐ), ఫస్ట్ ఆఫీసర్ల జీతాలను కూడా పెంచింది ఈ ఎయిర్‌లైన్స్ కంపెనీ. అంతకుముందు నవంబర్లోనూ స్పైస్‌జెట్ తమ పైలట్ల వేతనాలను పెంచిది. అప్పట్లో కెప్టెన్ల జీతం 80 గంటల ఫ్లయింగ్ అవర్స్‌కు గానూ నెలకు రూ. 7 లక్షలు ఉండేది. రూ.లక్ష లాయల్టీ రివార్డ్ అదనంగా ఈ ఎయిర్‌లైన్ సంస్థ తమ కెప్టెన్లకు నెలకు రూ.లక్ష వరకు నెలవారీ లాయల్టీ రివార్డ్‌ను ప్రకటించింది. వారి ఉద్యోగ కాలానికి అనుగుణంగా ఇచ్చే ఈ రివార్డ్ వారి నెలవారీ జీతం కంటే ఎక్కువగా ఉంటుంది. అంతకుముందు స్పెస్‌జెట్ చైర్మన్ అజయ్ సింగ్ ఉద్యోగులతో మాట్లాడుతూ భవిష్యత్తు మరింత ఉత్తేజకరంగా ఉంటుందని, ప్రయాణికులకు అత్యున్నత ప్రమాణాలతో సేవలు అందించేందుకు కట్టుబడి ఉండాలని సూచించారు. స్పైస్‌జెట్ దేశ, విదేశాల్లో మొత్తం 48 గమ్యస్థానాలకు రోజూ దాదాపు 250 విమానాలను నడుపుతోంది. బోయింగ్ 737 మ్యాక్స్, బోయింగ్ 700, క్యూ400 వంటి అత్యాధునిక విమానాలు ఈ సంస్థకు ఉన్నాయి. ఇదీ చదవండి: Air India Salaries: జీతాలు పెంచిన ఎయిర్ ఇండియా.. పైలట్ జీతమెంతో తెలుసా? -
విమాన ప్రయాణికులకు బంపరాఫర్!
ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ప్రయాణికులకు బంపరాఫర్ ప్రకటించింది. సంస్థ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బెంగళూరు-గోవా, ముంబయి-గోవా నగరాల మధ్య ప్రయాణించే ప్యాసింజర్లకు రూ.1,818 ధరకే విమాన టికెట్లను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది. ఈ ఆఫర్ సేల్ 23 మే 2023 నుంచి 28 మే 2023 వరకు అందుబాటులో ఉండనుంది. టికెట్లు బుక్ చేసుకున్న వారు జులై 1, 2023 నుంచి మార్చ్ 30 ,2024 వరకు ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. దీంతో పాటు 2023లో 18 ఏళ్లు వయసున్న ప్రయాణికులకు రూ.3,000 విలువైన ఉచిత ఫ్లైట్ వోచర్‌ను అందిస్తోన్నట్లు తెలిపింది. ఈ కూపన్ కోసం జూన్ 10 తేదీలోపు స్పైస్‌జెట్‌కు తమ వివరాలను ఈమెయిల్ చేయాలి. తర్వాత 10 జులై వరకు కూపన్ పంపుతారు. దాన్ని ఉపయోగించి 31 ఆగస్టులోపు టికెట్ బుక్ చేసుకుని 30 సెప్టెంబరులోపు ప్రయాణించాలి. అయితే, ఇందుకోసం కొన్ని షరతులు విధించింది. టికెట్ బుకింగ్ విలువ రూ.7,500 దాటిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పైస్‌జెట్ తెలిపింది. స్పైస్‌మ్యాక్స్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు 50 శాతం డిస్కౌంట్‌తోపాటు విమానంలో తమకు నచ్చిన సీటును కేవలం రూ. 18 చెల్లించి బుక్ చేసుకోవచ్చని తెలిపింది. Your destination: Savings! Celebrate our 18th anniversary with sky-high discounts. Book your tickets now at https://t.co/PykmFjGBqZ#flyspicejet #spicejet #18thAnniversary #SpiceJetAnniversary #sale #Travel #travelgram #Aviation #travelwithus #addspicetoyourtravel pic.twitter.com/2rjYDRXQ54 — SpiceJet (@flyspicejet) May 23, 2023 -
స్పైస్‌జెట్‌కు ఎన్సీఎల్టీ నోటీసులు
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌పై దివాలా పరిష్కార ప్రక్రియ కింద చర్యలు తీసుకోవాలంటూ కంపెనీకి ఎయిర్‌క్రాఫ్టులను లీజుకి ఇచ్చిన ఎయిర్‌క్యాజిల్ (ఐర్లాండ్) పిటీషన్‌పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) విచారణ జరిపింది. స్పైస్‌జెట్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మే 17కు వాయిదా వేసింది. నోటీసుల జారీ ప్రక్రియ సాధారణమేనని, ఎన్సీఎల్టీ తమకు ప్రతికూలంగా ఉత్తర్వులేమీ ఇవ్వలేదని స్పైస్‌జెట్ అధికార ప్రతినిధి తెలిపారు. సెటిల్మెంట్ కోసం ఇరు పక్షాలు చర్చలు జరుపుతున్న విషయాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుందని పేర్కొన్నారు. ఇకపైనా చర్చలను కొనసాగించవచ్చని వివరించారు. స్పైస్‌జెట్‌పై ఎయిర్‌క్యాజిల్ ఏప్రిల్ 28న పిటిషన్ దాఖలు చేసింది. అయితే, తమ దగ్గర ఎయిర్‌క్యాజిల్ విమానాలేమీ లేవని, ఈ పిటిషన్‌తో తమ కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావమూ ఉండబోదని స్పైస్‌జెట్ గత వారం తెలిపింది. ఎన్సీఎల్టీ వెబ్సైట్ ప్రకారం స్పైస్‌జెట్‌పై ఇప్పటికే రెండు దివాలా పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. -
ఇక ఆ రెండు వేరువేరు: స్పైస్‌జెట్
ముంబై: విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తమ కార్గో, లాజిస్టిక్స్ వ్యాపార విభాగం స్పైస్‌ఎక్స్‌ప్రెస్‌ను ప్రత్యేక విభాగంగా విడదీసింది. ఏప్రిల్ 1 నుంచి దీన్ని స్పైస్‌ఎక్స్‌ప్రెస్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌గా వ్యవహరిస్తున్నట్లు సంస్థ తెలిపింది. లాజిస్టిక్స్ వ్యాపార విభాగం స్వతంత్రంగా నిధులను సమీకరించుకునేందుకు ఇది ఉపయోగపడగలదని సంస్థ చైర్మన్ అజయ్ సింగ్ తెలిపారు. 2022–23 ఏప్రిల్–డిసెంబర్ మధ్య వ్యవధిలో స్పైస్‌ఎక్స్‌ప్రెస్ రూ. 51 కోట్ల నికర లాభం నమోదు చేసింది. (రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డేస్: ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు) డీల్ ప్రకారం స్పైస్‌జెట్‌కు స్పైస్‌ఎక్స్‌ప్రెస్ రూ. 2,556 కోట్ల విలువ చేసే ఈక్విటీ షేర్లు, డిబెంచర్లు జారీ చేయనుంది. కార్లైల్ ఏవియేషన్ పార్ట్నర్ చెల్లించాల్సిన 100 మిలియన్ డాలర్ల రుణాన్ని గత నెల పునర్వ్యవస్థీకరించుకున్నామని అజయ్ సింగ్ పేర్కొన్నారు. తాజాగా లాజిస్టిక్స్ విభాగం విడదీతతో స్పైస్‌జెట్ బ్యాలెన్స్ షీటు మరింత పటిష్టంగా మారగలదని, కంపెనీ నెగటివ్ నికర విలువ భారం గణనీయంగా తగ్గగలదని ఆయన వివరించారు. (అంచనాలకు మించి పన్ను వసూళ్లు.. ఏకంగా రూ.16.61 లక్షల కోట్లు) -
విమానం టేకాఫ్ ఆలస్యం.. ప్రయాణికులు, సిబ్బంది మధ్య రచ్చ
ఇటీవల కాలంలో పలు విమానాల్లో అనుచిత ఘటనలు తరుచూ వెలుగులోకి వస్తున్నాయి. విమానాల్లో సాంకేతిక లోపాలు, ప్రయాణికుల అసభ్య ప్రవర్తన వంటివి ఆందోళన రేపుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో మరోటి చేరింది. విమానం టేకాఫ్ ఆలస్యం కావడంతో ప్రయాణికులకు సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఢిల్లీ ఎయిర్‌పోర్టులో శుక్రవారం జరిగింది. ఢిల్లీ నుంచి పాట్నా వెళ్లాల్సిన 8721 స్పైస్ జెట్ విమానం షెడ్యూల్ ప్రకారం ఉదంయ 7.20 గంటలకు టెర్మినల్ 3 నుంచి బయల్దేరాల్సి ఉంది. అయితే దాదాపు మూడు గంటలు ఆలస్యంగా అంటే 10.10 గంటలకు బయల్దేరింది. అయితే ముందుగా వాతావరణం అనుకూలించడంతో విమానం టేకాఫ్‌కు ఆలస్యం అవుతోందని ఎయిర్‌లైన్ సిబ్బంది ప్రయాణికులకు తెలియజేశారు. అనంతరం కొద్ది సమాయానికి సాంకేతిక లోపం కారణంగా విమానం ఆలస్యం అవుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో విమానంలోకి ఎక్కి రెండున్నర గంటలకు పైగా నిరీక్షించిన ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. విమానం బయలుదేరడంలో ఆలస్యం కావడంపై విమానాశ్రయంలోని ఎయిర్‌లైన్ సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. చివరకు ఉదయం 10.10 గంటలకు ఆ విమానం టేకాఫ్ అయ్యింది. చదవండి: వాహనదారులకు షాక్.. పెట్రోల్, డీజిల్‌పై రూ.2 సెస్..ఎక్కడంటే? -
SpiceJet: ఢిల్లీ-హైదరాబాద్ ఫ్లైట్‌లో వికృత చేష్టలు?!
ఢిల్లీ: ఎయిరిండియా మూత్రవిసర్జన ఘటన మరిచిపోక ముందే.. మరో ప్రయాణికుడి వికృత చేష్టల వ్యవహారం?! వెలుగు చూసింది. ఢిల్లీ-హైదరాబాద్‌కు చెందిన స్పైస్‌జెట్ విమానంలో ఇవాళే(సోమవారం) ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. స్పైస్‌జెట్ విమానం ఎస్జీ-8133.. ఢిల్లీ నుంచి బయలుదేరాల్సి ఉంది. ఆ సమయంలో ఓ ప్యాసింజర్ క్యాబిన్ సిబ్బందిలోని ఓ యువతితో అనుచితంగా ప్రవర్తించాడు.యువతిని అసభ్యంగా తాకినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె అతనితో వాగ్వాదానికి దిగింది. ఆ సమయంలో తోటి సిబ్బంది ఆ యువతికి మద్ధతుగా వచ్చారు. కాసేపటికి ఈ విషయాన్ని పైలట్ ఇన్ కమాండ్, సెక్యూరిటీ స్టాఫ్‌కు సిబ్బంది తెలియజేశారు. దీంతో.. ఆ ప్రయాణికుడిని, అతనితో ఉన్న మరో ప్యాసింజర్‌ను దించేశారు. వారిని భద్రతా సిబ్బందికి అప్పజెప్పినట్లు స్పైస్‌జెట్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రయాణికుడి నుంచి క్షమాపణ పత్రం తీసుకున్నప్పటికీ.. వ్యవహారం ముదరకుండా ఉండేందుకు వాళ్లను దించేసినట్లు తెలుస్తోంది. అయితే తోటి ప్రయాణికుల్లో కొందరు మాత్రం అది కావాలని జరిగిన ఘటన కాదని, ఇరుకుగా ఉండడంతో పొరపాటున తగిలాడనని చెప్తుండడం గమనార్హం. #WATCH | "Unruly & inappropriate" behaviour by a passenger on the Delhi-Hyderabad SpiceJet flight at Delhi airport today The passenger and & a co-passenger were deboarded and handed over to the security team at the airport pic.twitter.com/H090cPKjWV — ANI (@ANI) January 23, 2023 -
స్పైస్ జెట్ ఏజీఎం 26న ఆర్థిక ఫలితాల వెల్లడి
న్యూఢిల్లీ: స్పైస్‌జెట్ ఈ నెల 26న సాధారణ వార్షిక సమావేశాన్ని(ఏజీఎం) నిర్వహించనున్నట్లు తాజాగా వెల్లడించింది. 2021–22 ఆడిటెడ్ ఆర్థిక ఫలితాలతోపాటు.. డైరెక్టర్‌గా అజయ్ సింగ్‌ను తిరిగి ఎంపిక చేయడంపై వాటాదారుల అనుమతిని కోరనున్నట్లు తెలియజేసింది. అజయ్ సింగ్ ప్రస్తుతం స్పైస్‌జెట్ చైర్మన్, ఎండీగా వ్యవహరిస్తున్నారు. సింగ్ 2004 నవంబర్ 4న డైరెక్టర్‌గా నియమితులయ్యారు. తదుపరి 2010 ఆగస్ట్ 27న రాజీనామా చేశారు. తిరిగి 2015 మే 21న ఎండీగా ఎంపికైనట్లు బ్యాంక్ పేర్కొంది. ఈ వార్తల నేపథ్యంలో షేరు బీఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 39 వద్ద ముగిసింది. -
ఆదాయం పుంజుకున్నా.. స్పైస్‌జెట్ నష్టాలు పెరిగాయ్!
న్యూఢిల్లీ:ప్రయివేట్ రంగ విమానయాన కంపెనీ స్పైస్‌జెట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు వెల్లడించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో దాదాపు రూ. 838 కోట్ల నికర నష్టం ప్రకటించింది. ఫారెక్స్ నష్టాలను మినహాయిస్తే రూ. 578 కోట్ల నష్టం నమోదైంది. ఇంధన ధరల పెరుగుదల, రూపాయి పతనం ప్రభావం చూపాయి. గతేడాది (2021–22) ఇదే కాలంలో రూ. 562 కోట్ల నష్టాలు ప్రకటించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,539 కోట్ల నుంచి 2,105 కోట్లకు పుంజుకుంది. అయితే నిర్వహణ వ్యయాలు సైతం రూ. 2,100 కోట్ల నుంచి రూ. 2,943 కోట్లకు ఎగశాయి. ఇదే కాలంలో కార్గో అనుబంధ సంస్థ స్పైస్‌ఎక్స్‌ప్రెస్ రూ. 206 కోట్ల ఆదాయం, రూ. 21 కోట్ల నికర లాభం ఆర్జించడం గమనార్హం! ఫలితాల నేపథ్యంలో స్పైస్‌జెట్ షేరు ఎన్ఎస్ఈలో 0.5 శాతం నీరసించి రూ. 39 వద్ద ముగిసింది. చదవండి: కేంద్రం భారీ షాక్: పది లక్షల రేషన్ కార్డులు రద్దు, కారణం ఏంటంటే.. -
స్పైస్‌జెట్ దీపావళి కానుక: వారికి నెలకు రూ.7 లక్షల జీతం
సాక్షి, ముంబై: విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తన పైలట్లకు గుడ్ న్యూస్ చెప్పింది. నవంబరు 1 నుంచి వర్తించేలా జీతాలపెంపును ప్రకటించింది. తద్వారా స్పైస్‌జెట్ వారికిదీపావళి కానుక అందించింది. స్పైస్‌జెట్ కెప్టెన్లకు 80 గంటల విమాన ప్రయాణానికి నెలవారీ వేతనం 7 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపింది. ఈపెంపు నవంబర్ 1, 2022 నుండి వర్తిస్తుందని తెలిపింది. ట్రైనర్స్, సీనియర్ ఫస్ట్ ఆఫీసర్ల వేతనాలను కూడా తగిన విధంగా పెంచినట్లు స్పైస్‌జెట్ పేర్కొంది. నెలవారీ ప్రాతిపదికన పైలట్ వేతనాలను సవరించినట్టు తెలిపింది. అక్టోబర్‌లో కెప్టెన్లు , ఫస్ట్ ఆఫీసర్ల జీతం 22 శాతం పెంచింది. ఆగస్టుతో పోలిస్తే, సెప్టెంబర్ జీతంలో శిక్షకులకు 10 శాతం, కెప్టెన్లు, ఫస్ట్ ఆఫీసర్ల వేతనం 8 శాతం వరకు పెంచిన సంగతి తెలిసిందే. -
స్పైస్‌జెట్ నిర్వాకం: క్యాబిన్లో పొగలు, దేవుడికి మొక్కుకోండి! వణికిపోయిన ప్రయాణీకులు
సాక్షి,హైదరాబాద్: వరుస సాంకేతిక లోపాల సంఘటనలతో రెగ్యులేటరీ చర్యలను ఎదుర్కొంటున్న స్పైస్‌జెట్‌కు సంబంధించి మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానం గాల్లో ఉండగానే క్యాబిన్లో పొగలు కమ్ముకోవడంతో ప్రయాణీకులు వణికిపోయారు. చివరికి హైదరాబాద్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండ్ కావడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. (అమెజాన్ దివాలీ సేల్: శాంసంగ్ 5జీ ఫోన్‌పై 40 వేల తగ్గింపు) గోవా-హైదరాబాద్ SG 3735 విమానంలో అక్టోబర్ 12న బుధవారం ఈ ఉదంతం చోటు చేసుకుంది. అయితే ఇంత జరిగినా ఏమీ జరగలేదన్నట్టుగా వివరాలను గోప్యంగా ఉంచడం వివాదం రేపింది. “Q400 విమానం సురకక్షితంగా ల్యాండ్ అయింది.. ప్రయాణికులు సురక్షితంగా దిగిపోయారు” అని స్పైస్‌జెట్ సెలవిచ్చింది. అయితే ఈ ఘటనపై ప్రయాణీకుల అనుభవాలు మాత్రం భయంకరంగా ఉన్నాయి. దీంతో ఏవియేషన్ రెగ్యులేటరీ డీజీసీఏ విచారణకు అదేశించింది. ఈ ఘటనలో ఒక ప్రయాణికురాలికి గాయాలు కాగా, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని వైద్య కేంద్రానికి తరలించినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఊపిరి ఆడడం లేదని ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్‌లోని ఆమెను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసినట్టు వెల్లడించాయి. హైదరాబాద్బాద్కు ఐటీ ఉద్యోగి శ్రీకాంత్ తనకెదురైన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.తన ఫ్రెండ్స్‌తో కలిసి ఫస్ట్‌టైం విమానం ట్రిప్‌కు బయలుదేరారు శ్రీకాంత్. ఇంతలోఅకస్మాత్తుగా ముందు క్యాబిన్‌లోనూ,ఆ తరువాత విమానంలోనూ పొగలు వ్యాపించాయి. దేవుడికి మొక్కుకోమని చెప్పడం చాలా బాధకలిగించిందని చెప్పారు. తనతోపాటు ప్రయాణీకులంతా ఒక్కసారిగా దిగ్గ్ర్భాంతికి లోనయ్యామని, చాలామంది ప్రాణ భయంతో కేకలు పెట్టారని వెల్లడించారు. “వాష్‌రూమ్‌లో ఏదో జరిగింది. సిబ్బంది హడావిడిగా, చిన్నగా మాట్లాడుకుంటూ కనిపించారు. మరో 20 నిమిషాల్లో మా చుట్టూ పొగలు అలుముకున్నాయి. ఇంతలో లైట్లు వేశారు. మాట్లాడొద్దని చెప్పారంటూ” మరొక ప్రయాణీకుడు అనిల్ తన అనుభవాన్ని షేర్ చేశారు. ఎమర్జెన్సీ డోర్ తెరుచుకున్నాక "జంప్ అండ్ రన్" అంటూ అరిచారని మరొకరు పేర్కొన్నారు. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఫోటోలను తొలగించమని ఎయిర్‌లైన్ సిబ్బంది బలవంతం చేసారట. దీనికి నిరాకరించడంతో తన ఫోన్ కూడా లాక్కున్నారని శ్రీకాంత్ వాపోయారు. కాగా ఈ ఏడాది ఇప్పటికే ఎనిమిది వరుస సాంకేతిక లోపాలకు సంబంధించిన ఘటనలతో స్పైస్‌జెట్ విమానాలపై డీజీసీఏ ఆంక్షలు విధించింది. 50 శాతం విమానాలు మాత్రమే నడపాలన్న ఆదేశాలను ఇటీవల మరో నెలపాటు పొడిగించింది. @narendramodi @PMOIndia @flyspicejet @PilotSpicejet @SpiceJetRBLX @JM_Scindia Respected sir or to whomsoever it may concern. Night we were returning to hyd from goa within the ✈️ (Spicejet),suddenly there was smoke all around inside the plane starting from nagpur to hyderabad... pic.twitter.com/zZa9OUmJib — Srikanth Mulupala (@SrikanthMulupal) October 13, 2022 -
స్పైస్‌జెట్ సంచలనం: పైలట్లకు 20 శాతం జీతం పెంపు!
సాక్షి, ముంబై: కష్టాల్లో ఉన్న విమానయాన సంస్థ స్పైస్‌జెట్ పైలట్ల జీతాల విషయంలో దిగి వచ్చినట్టు కనిపిస్తోంది. బడ్జెట్ క్యారియర్ స్పైస్‌జెట్ అక్టోబర్ నుంచి పైలట్లకు 20శాతం జీతం పెంపును ప్రకటించిందని సీఎన్‌బీసీ గురువారం నివేదించింది. తమ వ్యాపారం మెరుగు పడుతున్న క్రమంలో కెప్టెన్లు , సీనియర్ ఫస్ట్ ఆఫీసర్లకు జీతం దాదాపు 20 శాతం పెరుగుతుందని కెప్టెన్ గుర్చరణ్ అరోరా తెలిపారు. ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా తాత్కాలిక చర్యగా జీతాలివ్వకుండానే సెప్టెంబరు 21 నుండి మూడు నెలల పాటు లీవ్ వితౌట్ పే కింద 80 మంది పైలట్లను సెలవుపై ఇంటికి పంపించిన సంగతి తెలిసిందే. స్పైస్‌జెట్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS) చెల్లింపులో మొదటి విడతగా సుమారు రూ. 125 కోట్లను గత వారం అందుకుంది. అయితే తాజా పెంపులో ఈ 80 మంది ఉన్నారా లేదా అనేది స్పష్టత లేదు. అయితే డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు మరోవైపు ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) స్పైస్‌జెట్‌కు బుధవారం మరో షాక్ ఇచ్చింది. గరిష్టంగా 50 శాతం విమానాలను మాత్రమే నడపాలన్న ఆంక్షలను మరో నెలపాటు పాడిగించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వేసవి షెడ్యూల్ ముగిసే వరకు (అక్టోబర్ 29, 2022) ఈ ఆంక్షలు కొనసాగుతాయని తన ఆర్డర్లో పేర్కొంది. విమానాలకు సంబంధించిన వరుస సంఘటనల కారణంగా ఈ ఏడాది జూలై 27న స్పైస్‌జెట్‌కు గరిష్టంగా 50 శాతం విమానాలను మాత్రమే నడపాలని ఆదేశించింది. ఈ గడువు సెప్టెంబరు 30తో ముగియనుంది. కాగా గురువారం నాటి మార్కెట్లోస్పైస్జెట్ షేరు 4 శాతం కుప్పకూలింది. ఈ ఏడాది ఏకంగా 40శాతం నష్టపోయింది. -
అటు భారీ నష్టాలు,ఇటు సీఎఫ్‌వో గుడ్‌బై, కుప్పకూలిన షేర్లు
బెంగళూరు: ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న స్పైస్‌జెట్‌కు మరోషాక్ తగిలింది. ఒకవైపు భారీ స్థాయిలో ఈ త్రైమాసికంలో నష్టాలు, మరోవైపు సంస్థ సీఎఫ్‌వో రాజీనామా చేయడంతో గురువారం నాటి మార్కెట్లో స్పైస్‌జెట్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఫలితంగా దాదాపు 15 శాతం కుప్పకూలాయి. ఇది ఇలా ఉండగా గురువారం ఉదయం ఆటోపైలట్ స్నాగ్ కారణంగా ఢిల్లీ-నాసిక్ స్పైస్‌జెట్ విమానాన్ని వెనక్కి మళ్లించిన ఘటన చోటు చేసుకుంది. ఇదీ చదవండి: చెక్ బౌన్స్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ఇంధన ధరల భారం, దేశీయ కరెన్సీ రూపాయిక్షీణత, స్పైస్‌జెట్ లిమిటెడ్ భారీ నష్టాన్ని నమోదు చేసింది. మరోవైపు సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సంజీవ్ తనేజా రాజీనామా చేసినట్లు ప్రకటించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు దెబ్బతింది. షేర్లు గురువారం ఆరంభంలో 14.7 శాతం నష్టపోయాయి. పెరుగుతున్న నష్టాలు, ఇటీవలి కాలంలో మిడ్-ఎయిర్ సంఘటనల మధ్య సంజీవ్ రాజీనామా చేసినట్లు తెలిపింది. (SpiceJet: స్పైస్‌జెట్ విమానంలో సమస్య: మధ్యలోనే వెనక్కి) కాగా జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర నష్టం రూ. 789 కోట్లకు పెరిగిందని, ప్రధానంగా అధిక ఇంధన ధరలు, రూపాయి క్షీణత కారణంగా నష్టాలొచ్చాయని బడ్జెట్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఏడాది క్రితం కాలంలో రూ. 235.3 కోట్ల నికర నష్టాన్ని నివేదించింది. మార్చి 2022తో ముగిసిన త్రైమాసికంలో రూ. 458 కోట్ల నికర నష్టం వచ్చినట్టు వెల్లడించిది. అయితే సైబర్ సెక్యూరిటీ దాడి కారణంగా ఆలస్యమైందని కంపెనీ పేర్కొంది. అంతేకాదు నగదు సంక్షోభంలో చిక్కుకున్న సంస్థ అద్దెదారులకు సకాలంలో చెల్లింపులు చేయలేక ఇబ్బందులు పడుతోంది, కొంతమంది తమ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు వరుసగా రెండో నెలలో కూడా జీతాలు చెల్లింపు ఆలస్యమైందని ఉద్యోగులు ఆరోపిస్తుండగా, చెల్లింపులు "గ్రేడెడ్ ఫార్మాట్"లో జరుగుతున్నాయని స్సైస్‌జెట్ వివరణ ఇచ్చింది. -
స్పైస్‌జెట్ విమానంలో సమస్య: మధ్యలోనే వెనక్కి
న్యూఢిల్లీ: బడ్జెట్ ఎయిర్‌లైన్ స్పైస్‌జెట్‌కు చెందిన విమానంలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. ఢిల్లీ-నాసిక్ విమానం 'ఆటోపైలట్' సమస్య కారణంగా మధ్యలోనే వెనక్కి మళ్లించాల్సి వచ్చింది. బోయింగ్ 737 స్పైస్‌జెట్ విమానంలో గురువారం ఉదయం సమస్య ఏర్పడింది. వెంటనే స్పందించిన సిబ్బంది విమానాన్ని తిరిగి సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ అంశాన్ని డీజీసీఏ పరిశీలిస్తోంది. ఢిల్లీ ఇందిరాగాంధీఅంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మహారాష్ట్రలోని నాసిక్‌కు బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం 'ఆటోపైలట్' సమస్య కారణంగా నగరానికి మధ్యలో తిరిగి వచ్చిందని డీజీసీఏ అధికారి తెలిపారు. కాగా అధిక ఇంధన ధరలు,రూపాయి క్షీణత మధ్య ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న స్పైస్‌జెట్ విమానాలు ఇబ్బందుల్లో పడిన ఘటనలు గతంలో కూడా వరుసగా చోటు చేసుకన్నాయి. దీంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విమానయాన సంస్థకు షో-కాజ్ నోటీసు జారీచేయడం, ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ ఎనిమిది వారాల పాటు గరిష్టంగా 50శాతం విమానాలను మాత్రమే రన్ చేయాలని జూలై 27న ఆదేశించిన సంగతి తెలిసిందే. -
స్పైస్‌జెట్ విమానంలో సిగరెట్ తాగిన పోకిరి.. సెల్ఫీ వీడియో వైరల్!
న్యూఢిల్లీ: విమానంలో ఏ చిన్న పొరపాటు జరిగినా వందల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అందువల్ల ప్రతి అంశాన్ని క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తారు. అయితే, ఓ వ్యక్తి స్పైస్‌జెట్ విమానంలో దర్జాగా సిగరెట్ తాగాడు. లైటర్‌తో సిగరేట్ వెలిగించుకుంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. దానిని సోషల్ మీడియాలో విడుదల చేయటంతో సంచలనంగా మారింది. అసలు విమానంలోకి లైటర్ ఎలా వెళ్లిందనే అంశం కీలకంగా మారింది. వందల మంది ప్రాణాలను ప్రమాదంలో పడేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు అధికారులు. సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. అందులో గుర్గావ్కు చెందిన బాబీ కటారియా అనే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ విమానం సీట్లో పడుకుని సిగరెట్ అంటించాడు. పొగతాగుతున్న సంఘటనను సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అతడికి ఇన్‌స్టాగ్రామ్‌లో 6.30 లక్షల మంది అనుచరులు ఉన్నారు. ఈ వీడియోను పలువురు ట్విట్టర్లో షేర్ చేస్తూ విమానయాన శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియాకు జత చేశారు. ‘దర్యాప్తు చేపట్టాం. అలా ప్రమాదకరంగా ప్రవర్తించే వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలేసేది లేదు.’ అని ట్వీట్ చేశారు సింధియా. ‘బల్విందర్ కటారియా అనే వ్యక్తి స్పైస్‌జెట్ విమానంలో దుబాయ్ నుంచి న్యూఢిల్లీకి వచ్చాడు. జనవరి 23న ఢిల్లీలో ల్యాండయ్యాడు. ప్రస్తుతం వీడియో అతడి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజీల్లో లేదు. గతంలోనే విమానయాన భద్రతా విభాగం చర్యలు తీసుకుంది. ’అని పేర్కొన్నారు పౌర విమానయాన భద్రతా విభాగం అధికారులు. మరోవైపు.. ఈ సంఘటనపై మీడియాలో వార్తలు రావటాన్ని తీవ్రంగా ఖండించాడు కటారియా. కేవలం టీఆర్పీ రేటింగ్‌ల కోసమే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. New rule for Bobby kataria ? @JM_Scindia @DGCAIndia @CISFHQrs pic.twitter.com/OQn5WturKb — Nitish Bhardwaj (@Nitish_nicks) August 11, 2022 ఇదీ చదవండి: Allu Arjun: నోట్లో సిగరెట్, చెవికి పోగు.. అల్లు అర్జున్ న్యూ లుక్ వైరల్ -
స్పైస్‌జెట్ నిర్లక్ష్యం.. విమానం వద్దే ప్రయాణికుల పడిగాపులు!
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానాశ్రయంలో దిగాక బస్సు ఏర్పాటు చేయకపోవటం వల్ల సుమారు 45 నిమిషాల పాటు అక్కడే నిరీక్షించారు. ఎంతకూ బస్సు రాకపోవటంతో చాలా మంది తమ లగేజీని పట్టుకుని కాలినడకన టర్మినల్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ సంఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 186 మంది ప్రయాణికులతో వెళ్లిన స్పైస్‌జెట్ విమానం శనివారం రాత్రి 11.24 గంటలకు హస్తినలో దిగింది. వెంటనే ఓ బస్సు వచ్చి కొంత మందిని టర్మినల్‌కు తీసుకెళ్లింది. మిగిలిన వారు సుమారు 45 నిమిషాలు అక్కడే వేచి ఉన్నారు. బస్సు రాకపోవటంతో అక్కడి నుంచి టర్మినల్ వైపు నడక ప్రారంభించారు. 11 నిమిషాలు నడిచాక 12.20కి బస్సు వచ్చి వారిని తీసుకెళ్లినట్లు కొందరు ప్రయాణికులు తెలిపారు. ఈ విషయంపై స్పైస్‌జెట్ వివరణ ఇచ్చింది. బస్సు రావటానికి కాస్త ఆలస్యం అయిందని, ఆ తర్వాత విమానం వద్ద ఉన్న ప్రయాణికులతో పాటు నడక ప్రారంభించిన వారందరినీ బస్సులో ఎక్కించుకుని టర్మినల్‌కు చేర్చినట్లు తెలిపింది. ‘మా సిబ్బంది ఎన్నిసార్లు సూచించినా కొందరు టర్మినల్ వైపు నడిచారు. బస్సులు వచ్చే సరికి కొంత దూరం వెళ్లారు. వారితో పాటు మిగిలిన వారందరిని బస్సుల్లో టర్మినల్ చేర్చాం.’ అని పేర్కొంది స్పైస్‌జెట్. How often do you see this happening at T3 of the Indira Gandhi International Airport in New Delhi? @flyspicejet kept up cooked up for 45 minutes after announcing “early arrival” of 6 mins at 11:24pm on the SG 8108 Hyd-Delhi. They parked the flight really far away with no buses. pic.twitter.com/sgkR9gXs3Y — Lasya Nadimpally (@nlasya) August 6, 2022 ఇదీ చదవండి: ‘ఎస్ఎస్ఎల్వీ-డీ1 ప్రయోగం విఫలం’.. ఇస్రో అధికారిక ప్రకటన -
స్పైస్‌జెట్‌కు షాక్.. ఆంక్షలు విధించిన డీజీసీఏ
సాక్షి,న్యూఢిల్లీ: స్పైస్‌జెట్ విమానాలపై డీజీసీఏ ఆంక్షలు విధించింది. అనుమతి పొందిన విమానాల్లో 50శాతమే నడపాలని తెలిపింది. 8 వారాల పాటు ఈ ఆదేశాలను పాటించాలని పేర్కొంది. స్పైస్‌జెట్ విమానాల్లో ఇటీవల తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు జులై 9 నుంచి 13 మధ్య స్పైస్‌జెట్‌కు చెందిన 48 విమానాల్లో 53 స్పాట్ చెక్‌లు నిర్వహించింది డీజీసీఏ. భద్రత ప్రమాణాలకు సంబంధించి ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని తెలిపింది. నోటీసులు పంపిన మూడు రోజుల్లోనే స్పాట్ చెక్‌లు చేసింది. అయితే ఇటీవలి కాలంలో స్పైస్‌జెట్ విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. 18 రోజుల్లోనే 8 సార్లు ఈ సంస్థకు చెందిన విమానాల్లో టెక్నికల్ సమస్యలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే డీజీసీఏ స్పైస్‌జెట్‌కు జులై 6న నోటీసులు పంపింది. అంతర్గత భద్రతా పర్యవేక్షణ తక్కువగా ఉండటం, నిర్వహణ చర్యలు లేకపోవడం వల్లే ఈ సమస్యలు తలెత్తినట్లు పేర్కొంది. చదవండి: దీనికి కూడా ఫైన్ వేస్తారా? రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లో పెట్రోల్ లేదని చలాన్ -
ప్రత్యేక కంపెనీగా స్పైస్‌ఎక్స్‌ప్రెస్
న్యూఢిల్లీ: కార్గో, లాజిస్టిక్స్ సంస్థ స్పైస్‌ఎక్స్‌ప్రెస్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీసేందుకు బ్యాంకులు, వాటాదారులు అనుమతించినట్లు స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్ తాజాగా వెల్లడించింది. వచ్చే నెల(ఆగస్ట్) తొలి వారంలో స్పైస్‌ఎక్స్‌ప్రెస్‌ను విడదీయనున్నట్లు స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ పేర్కొన్నారు. కార్గో, లాజిస్టిక్స్ సర్వీసులను స్లంప్ సేల్ ప్రాతిపదికన అనుబంధ సంస్థ స్పైస్‌ఎక్స్‌ప్రెస్‌కు బదిలీ చేస్తున్నట్లు గతేడాది ఆగస్ట్ 17న స్పైస్‌జెట్ తెలియజేసింది. తద్వారా సంస్థకు స్వతంత్రంగా నిధుల సమీకరణ చేపట్టేందుకు వీలు చిక్కనున్నట్లు వెల్లడించింది. కాగా.. జూన్ 19 మొదలు కంపెనీ విమానాలలో ఎనిమిదిసార్లు సాంకేతిక సమస్యలు నమోదుకావడంతో గత వారం డీజీసీఏ నుంచి స్పైస్‌జెట్‌కు షోకాజ్ నోటీసు జారీ అయిన సంగతి తెలిసిందే. భద్రత, సమర్థత, విశ్వసనీయ విమానయాన సర్వీసులు అందించడంలో స్పైస్‌జెట్ వైఫల్యం చెందిందంటూ డీజీసీఏ పేర్కొంది. -
సెన్సెక్స్ జంప్, స్పైస్‌జెట్‌కు భారీ షాక్
సాక్షి, ముంబై: స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. మెటల్, ఎనర్జీ రంగాలు తప్ప అన్ని రంగాల షేర్లు లాభ పడ్డాయి. ఆటో, ఫైనాన్స్ ఎఫ్ఎంసీజీ, ఫెర్టిలైజర్ల షేర్లు బాగా పుంజు కున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ 616 పాయింట్లు ఎగిసి 53750 వద్ద, నిఫ్టీ 179 పాయింట్ల లాభంతో 15989 వద్ద ముగిసాయి. బ్రిటానియా, బజాజ్ ఫిన్సర్వ్, ఐషర్ మోటార్స్, హెచ్‌యూఎల్ టాప్ గెయనర్స్‌గా, ఓఎన్జీసీ, హిందాల్కో, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ లైఫ్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు ఇటీవల వరుస సాంకేతిక లోపాల ఘటనల నేపథ్యంలో స్పైస్‌జెట్ షేర్లు బుధవారం కూడా పతనమైనాయి. 7 శాతం క్షీణించి ఒక సంవత్సరం కనిష్ట స్థాయికి చేరాయి. గత 18 రోజుల్లో స్పైస్‌జెట్ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం వరుసగా ఇది ఎనిమిదో ఘటన.దీంతో వీటిపై వివరణ ఇవ్వాల్సిందిగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంస్థకు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈక్విటీ మార్కెట్ల అండతో దేశీయ కరెన్సీ రూపాయి ఆల్ టైం కనిష్టం నుంచి కోలుకుంది. 13 పైసలు ఎగిసి 79.27 వద్ద ఉంది. -
స్పైస్‌జెట్‌కు షాక్.. DGCA నోటీసులు
న్యూఢిల్లీ: వరుస ఘటనలో ఎమర్జెన్సీల్యాండింగ్‌లు.. ప్రయాణికులను ఇబ్బందిపెడుతుండడంతో పాటు వార్తల్లో నిలుస్తున్న స్పైస్‌జెట్ సంస్థకు షాక్ తగిలింది. పౌర విమానయాన సంస్థల నియంత్రణ విభాగం డీజీసీఏ స్పైస్‌జెట్ సంస్థకు బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గత 18 రోజుల్లో ఎనిమిది విమానాల్లో సాంకేతిక లోపాల సమస్యలు తలెత్తాయి. ఈ లోపాల ఘటనలపై స్పైస్‌జెట్‌ను పూర్తిస్థాయి వివరణ కోరింది డీజీసీఏ. జూన్ 19న రెండు ఘటనలు, జూన్ 25న ఒకటి, జులై 2న మరోక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇవిగాక వరుసగా చోటు చేసుకున్నాయి. ఇక మంగళవారం ఢిల్లీ-దుబాయ్ విమానం సాంకేతికలోపంతో కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ అయిన సంగతి తెలిసిందే. గత మూడేళ్లుగా ప్రైవేట్ ఎయిర్‌లైన్ సంస్థ స్పైస్‌జెట్.. నష్టాల్లో కొనసాగుతోంది. 2018-19, 2019-20, 2020-21 సంవత్సరాల మధ్య రూ.316 కోట్లు, రూ.934 కోట్లు, రూ.998 కోట్లు.. వరుసగా నష్టాలు చవిచూసింది. చదవండి: ఈ స్పైస్‌జెట్‌కు ఏమైంది? -
స్పైస్‌జెట్‌కు ఏమైంది?.. రాడార్ సమస్యతో వెనక్కి వచ్చిన కార్గో విమానం
కోల్‌కతా: గతకొన్ని రోజులుగా విమానాలను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న ఘటనలతో.. స్పైస్‌జెట్‌కు ఏమైంది అనే ప్రశ్నలు ప్రతిఒక్కరిలోనూ లేవనెత్తుతున్నాయి. గడిచిన మూడు వారాల వ్యవధిలో 8 స్పైస్‌జెట్ విమానాల్లో సాంకేతిక సమస్యలు వెలుగు చూశాయి. ఒక్క మంగళవారం రోజే రెండు విమానల్లో భద్రత సమస్యలు ఏర్పడి అత్యవసర ల్యాండింగ్ చేయగా.. తాజాగా కల్‌కతా నుంచి చైనా బయలుదేరిన స్పైస్‌జెట్ కార్గో విమానంలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. స్పైస్‌జెట్ బోయింగ్ 737 కార్గో విమానం జూలై అయిదో తేదీన కోల్‌కతా నుంచి ఛాంగ్‌క్వింగ్ వెళ్లాల్సి ఉంది. కోల్‌కతా నుంచి టేకాఫ్ అయిన తరువాత విమనాంలో వాతావరణ రాడార్ పనిచేయడం ఆగిపోయింది. దీంతో పైలట్ విమానాన్ని తిరిగి కోల్‌కతాకు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. కోల్‌కతాలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని స్పైస్‌జెట్ ప్రతినిధి తెలిపారు. చదవండి: ముంబైలో మరో స్పైస్ జెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. గత 17 రోజుల్లో ఏడు ఘటనలు కాగా ఈ ఘటన కంటే ముందు ఢిల్లీ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని దారి మళ్లించి కరాచి ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. స్పైస్‌జెట్ విమానంలో ఇండికేటర్ లైట్ సరిగా పనిచేయకపోవడంతోనే కరాచికి మళ్లించారు. అంతేగాక గుజరాత్‌లోని కాండ్లా నుంచి బయలుదేరిన స్పైస్ జెట్ విమానం ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. విమానం గాల్లో ఉండగా విండ్‌షీల్డ్ ఔటర్ పేన్ పగలడంతో ముంబైలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అయితే ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నారని ఎయిర్‌లైన్స్ తెలిపింది. -
ముంబైలో మరో స్పైస్ జెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. గత 17 రోజుల్లో ఏడు ఘటనలు
ముంబై: ఇటీవల స్పైస్ జెట్ విమానాలను అత్యవసర ల్యాండింగ్ చేస్తున్న ఘటనలు తరుచుగా జరుగుతున్నాయి. గత 17 రోజుల్లో స్పైస్ జెట్‌లో భద్రత సమస్యల కారణంగా ఆరు ఘటనలు చోటుచేసుకోగా తాజాగా గుజరాత్‌లోని కాండ్లా నుంచి బయలుదేరిన స్పైస్ జెట్ విమానం మంగళవారం ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. విమానం గాల్లో ఉండగా విండ్‌షీల్డ్ ఔటర్ పేన్ పగలడంతో ముంబైలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అయితే ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నారని ఎయిర్‌లైన్స్ తెలిపింది. ‘గుజరాత్‌లోని కాండ్లా నుంచి SG 3324ను నడుపుతున్న స్పైస్ జెట్ Q400 విమానం గాల్లో విహారం చేస్తున్న సమయంలో P2 వైపు విండ్‌షీల్డ్ ఔటర్ పేన్ పగిలింది. విమానం సురక్షితంగా ముంబయిలో ల్యాండ్ అయింది' అని స్పైస్ జెట్ ప్రతినిధి తెలిపారు. కాగా ఒకే రోజు స్సైస్‌జెడ్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవ్వడం ఇది రెండో ఘటన. మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్లే మరో స్సైస్‌జెట్ విమానంలో సాంకేతిక సమస్యలు ఏర్పడింది. ఇంధన సూచిక సరిగా పనిచేయకపోవడంతో కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. చదవండి: స్పైస్ జెట్‌లో తలెత్తిన సాంకేతిక లోపం...కరాచీలో అత్యవసర ల్యాండింగ్ On 5th July, 2022, SpiceJet Q400 aircraft was operating SG 3324 (Kandla - Mumbai). During cruise at FL230, P2 side windshield outer pane cracked. Pressurization was observed to be normal. The aircraft landed safely in Mumbai: SpiceJet Spokesperson pic.twitter.com/DYypQXmTyk — ANI (@ANI) July 5, 2022 -
విమాన చార్జీలను 15% పెంచాలి
న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు గణనీయంగా పెరగడం, రూపాయి మారకం విలువ పడిపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో విమాన టికెట్ల చార్జీలను పెంచక తప్పని పరిస్థితి నెలకొందని స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ చెప్పారు. నిర్వహణ వ్యయాలను తట్టుకునేందుకు చార్జీలను కనీసం 10–15 శాతం పెంచాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన తెలిపారు. గతేడాది జూన్ నుంచి చూస్తే ఏటీఎఫ్ ధరలు ఏకంగా 120 శాతం పైగా ఎగిశాయని సింగ్ పేర్కొన్నారు. ‘ఇంత భారీ పెంపును తట్టుకునే పరిస్థితి లేదు. మన దగ్గర ఏటీఎఫ్‌పై పన్నులు ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు సత్వరం పన్నులు తగ్గించేలా చర్యలు తీసుకోవాలి‘ అని ఆయన తెలిపారు. ఇంధన ధరల భారాన్ని ప్రయాణికులకు బదలాయించకుండా గత కొద్ది నెలలుగా తామే భరిస్తూనే ఉన్నామని సింగ్ చెప్పారు. ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయాల్లో 50 శాతం వాటా ఏటీఎఫ్‌దే ఉంటుంది. ప్రస్తుతం ప్రయాణ వ్యవధిని బట్టి దేశీయంగా విమాన చార్జీలపై కేంద్రం కనిష్ట, గరిష్ట పరిమితులు అమలు చేస్తోంది. ఉదాహరణకు 40 నిమిషాల కన్నా తక్కువ సమయం పట్టే ప్రయాణాలపై కనిష్టంగా రూ. 2,900 (జీఎస్టీ కాకుండా) కన్నా తక్కువ, గరిష్టంగా రూ. 8,800 (జీఎస్టీ కాకుండా)కన్నా ఎక్కువ వసూలు చేయడానికి లేదు. కోవిడ్ ఆంక్షలతో దెబ్బతిన్న విమానయాన సంస్థలు నష్టపోకుండా కనిష్ట చార్జీలపై, ప్రయాణికులపై తీవ్ర భారం పడకుండా గరిష్ట చార్జీలపై కేంద్రం పరిమితులు విధించింది. ఏటీఎఫ్ రేటు 16 % పెంపు అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో దేశీయంగా విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు 16 శాతం పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు రిటైలింగ్ దిగ్గజాలు గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశాయి. దీని ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలో లీటరుకు రూ. 19,757 (16.26 శాతం) పెరిగి రూ. 1,41,232.87కి చేరింది. తాజా పెంపుతో లీటరు ఏటీఎఫ్ ధర రూ.141.2కి చేరినట్లయింది. ఈ ఏడాది వరుసగా పది సార్లు రేట్లు పెంచిన చమురు మార్కెటింగ్ కంపెనీలు జూన్ 1న స్వల్పంగా 1.3 శాతం (కిలో లీటరుకు రూ. 1,564 చొప్పున) తగ్గించాయి. కానీ అంతలోనే మళ్లీ పెంచడంతో ప్రస్తుతం ముంబైలో ఏటీఎఫ్ రేటు రూ. 1,40,093కి, కోల్‌కతాలో రూ. 1,46,322కి, చెన్నైలో రూ. 1,46,216కి చేరింది. స్థానిక పన్నుల కారణంగా వివిధ రాష్ట్రాల్లో ధరలు వేర్వేరుగా ఉంటాయి. పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రతి రోజూ, ఏటీఎఫ్ రేట్లను ప్రతి 15 రోజులకోసారి ఆయిల్ కంపెనీలు సవరిస్తుంటాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే ఏటీఎఫ్ రేట్లు 11 సార్లు పెరిగాయి. ఆరు నెలల వ్యవధిలో దాదాపు రెట్టింపయ్యాయి. జనవరి 1న ఏటీఎఫ్ రేటు రూ. 74,022.41గా ఉండగా 91 శాతం (రూ. 67,210.46) మేర పెరిగింది. -
ఎయిర్ లైన్స్ పై ఫిర్యాదులు... స్పందించిన సింధియా
న్యూఢిల్లీ: స్పెస్ జెట్ బోర్డింగ్ పాస్ కోసం అదనపు చార్జీలు వసూలు చేస్తున్నాయంటూ విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ట్విట్టర్లో ఫిర్యాదు చేశారు. దీంతో సింధియా ఫిర్యాదులను పరీశీలించేందుకు అంగికరీంచడమే కాకుండా త్వరితగతిన విచారణ చేస్తానని ట్వీట్ చేశారు. కొన్ని విమానయాన సంస్థలు వెబ్ చెక్-ఇన్ చేయాలని పట్టుబట్టడమే కాకుండా అలా చేయడంలో విఫలమైన ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ పలువురు సోషల్ మీడియా ఫిర్యాదులు చేశారు. అంతేగాదు ఎయిర్పోర్ట్ కౌంటర్లో బోర్డింగ్ పాస్ కోసం ప్రయత్నించే వారి నుంచి కొన్ని ఎయిర్‌లైన్స్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయని తెలిపారు. ఎయిర్పోర్ట్ చెక్-ఇన్ కౌంటర్లో చెక్ ఇన్ చేయడానికి ఒక్కో టికెట్‌కు రూ. 200 ఖర్చవుతుందని స్పైస్‌జెట్‌తో పాటు ఇండిగో కూడా అదే పని చేసిందని వెల్లడించారు. దీని వల్ల వినియోగ దారులకు చాలా అన్యాయం జరుగుతుందంటూ ఫిర్యాదులు చేశారు. Agreed, will examine this asap! https://t.co/KkY8b0xP93 — Jyotiraditya M. Scindia (@JM_Scindia) May 13, 2022 Ridiculous .Is @JM_Scindia listening? https://t.co/HBL8hUo4oT — Madhavan Narayanan (@madversity) May 13, 2022 new rule of SpiceJet. If you wish to get a boarding card at the check in counter,you need to pay extra. This is like telling a customer In a restaurant that if you want eat in a plate, you will be charged. Wonder what’s conssumer forum doing!@flyspicejet @BDUTT @madversity — Dr. Neeti Shikha (@neetishikha) May 13, 2022 (చదవండి: ల్యాప్‌టాప్ కీబోర్డులో పట్టుబడ్డ రూ. 1.3 కోట్ల బంగారం) -
Spicejet: భారీగా కుదిపేసిన విమానం.. ప్రయాణికులకు తీవ్రగాయాలు
కోల్‌కతా: స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రయాణికుల విమానం ఒకటి గాల్లో ఉండగా భారీ కుదుపునకు గురైంది. ఆదివారం జరిగిన ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. బోయింగ్ బీ-373 ఎయిర్‌క్రాఫ్ట్‌కు చెందిన ఆపరేటింగ్ ఫ్లైట్ ఎస్జీ-945 ముంబై నుంచి సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరింది. ఏడున్నర గంటలకు అది అండల్‌లోని కాజి నజ్రుల్ ఇస్లాం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే కాసేపట్లో గమ్యానికి చేరుతుందనగా.. గాల్లో ఉండగానే అది తీవ్రంగా కుదుపున లోనైంది. దీంతో లగేజీ మీద పడడంతో పలువురు ప్రయాణికులకు(40 మంది దాకా అని కొన్ని కథనాలు.. 17 మంది మరికొన్ని కథనాలు చెప్తున్నాయి ) తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఏం జరుగుతుందో అర్థం కానీ పరిస్థితిలో ఆందోళనకు గురయ్యారు ప్రయాణికులు. అయితే.. ప్రమాదం జరిగినప్పటికీ ఫ్లైట్ దుర్గాపూర్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే ప్యాసింజర్లకు చికిత్స అందించారు. వీళ్లలో కొందరిని డిశ్చార్జి చేయగా.. మరికొందరు ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నారు. అయితే ప్రయాణికుల ప్రాణాలకు ముప్పేమీ లేదని అధికారులు అంటున్నారు. ఈ ఘటనపై స్పైస్‌జెట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా.. బలమైన గాలుల వల్లే కుదుపునకు విమానం లోనైనట్లు తెలుస్తోంది. -
ఢిల్లీ ఎయిర్ పోర్టులో కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన విమానం
న్యూఢిల్లీ: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న స్పైస్ జెట్ విమానం(ఎస్జీ 160) సోమవారం ఉదయం టేకాఫ్ అయ్యే సమయంలో కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్యాసింజర్ టెర్మినల్ నుంచి టేకాఫ్ కోసం రన్‌వేపైకి విమానం వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం వెనక్కి తీస్తుండగా కరెంట్ పోల్‌ను విమానం కుడి వైపు ఉన్న వింగ్ బలంగా తాకింది. దీంతో విమానం కుడివైపు రెక్క(రైట్ వింగ్) దెబ్బతింది. అలాగే కరెంట్ స్తంభం కూడా డ్యామేజ్ అయ్యింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు అవ్వకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రమాదానికి గురైన విమానం ఢిల్లీ నుంచి జమ్మూకి వెళ్లాల్సి ఉంది. విమానం ప్రమాదానికి గురికావడంతో మరో విమానాన్ని ఏర్పాటు చేసి ప్రయాణికులను జమ్మూకు పంపించారు. మరోవైపు విమానం కరెంట్ పోల్‌ను ఢీకొట్టడంపై దర్యాప్తుకు ఆదేశించినట్టు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. -
స్పైస్‌జెట్ ప్రతిపాదనలను అంగీకరించం
న్యూఢిల్లీ: స్పైస్‌జెట్‌తో రూ.600 కోట్ల తమ వివిద పరిష్కారానికి సంబంధించి ఆ సంస్థ చేసిన రెండు ప్రతిపాదనలూ తమకు ఆమోదయోగం కాదని కేఏఎల్ ఎయిర్వేస్, మీడియా దిగ్గజం కళానిధి మారన్లు సుప్రీంకోర్టుకు తెలియజేశారు. స్పైస్‌జెట్ రెండు ప్రతిపాదనలను అంగీకరిస్తారా? అని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, న్యాయమూర్తులు ఎఎస్ బోపన్న, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం కాల్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్, మారన్ల అభిప్రాయాన్ని అడిగినప్పుడు, ఈ ప్రతిపాదనలు ఆమోదయోగం కాదని పేర్కొన్నాయి. కేసు తదుపరి విచారణ మార్చి 2వ తేదీకి వాయిదా పడింది. కళానిధి మారన్ స్పైస్‌జెట్ మాజీ ప్రమోటర్. ఆయనకు చెందిన కేఏఎల్ ఎయిర్వేస్ ఎయిర్‌లైన్ ట్రాన్స్పోర్ట్ సేవలను నిర్వహిస్తోంది. కేసు వివరాలు క్లుప్తంగా... కేఏఎల్, మారన్లు స్పైస్‌జెట్‌లో తమ షేర్‌హోల్డింగ్‌ను 2015 ఫిబ్రవరిలో కంట్రోలింగ్ షేర్‌హోల్డర్, సహ వ్యవస్థాపకుడు అజయ్ సింగ్‌కు బదలాయించారు. అయితే ఈ డీల్‌కు సంబంధించి ప్రిఫర్డ్ షేర్లు, వారెంట్లను మారన్‌కు అనుకూలంగా జారీ చేయకపోవడంపై వివాదం నెలకొంది. స్పైస్‌జెట్‌లోని తమ మొత్తం 350.4 మిలియన్ల ఈక్విటీ షేర్లను, ఎయిర్‌లైన్‌లో 58.46 శాతం వాటాను దాని సహ వ్యవస్థాపకుడు సింగ్‌కు ఫిబ్రవరి 2015లో కేవలం రూ. 2కి మారన్, కేఏఎల్ ఎయిర్వేస్కు చేశారు. స్పైస్‌జెట్‌తో వాటా బదిలీ వివాదంపై మారన్ కేఏఎల్ ఎయిర్వేస్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. ఈక్విటీ షేర్లుగా రీడీమబుల్ చేయదగిన 18 కోట్ల వారెంట్లను తమకు బదలాయించాలని డిమాండ్ చేశాయి. 2016 జూలై 29న హైకోర్టు రూలింగ్ ఇస్తూ, ఆర్బిట్రేషన్ కింద వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించింది. రూ.579 కోట్లను హైకోర్టు రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని కూడా స్పైస్‌జెట్, సింగ్‌ను హైకోర్టు ఆదేశించింది. అయితే కోర్టు తదుపరి ఆదేశాల మేరకు స్పైస్‌జెట్ హైకోర్టులో రూ.329 కోట్ల బ్యాంక్ గ్యారెంటీని, రూ.250 కోట్ల నగదును డిపాజిట్ చేసింది. అయితే దీనిపై స్పైస్‌జెట్ చేసిన అప్పీల్‌ను 2017 జూలైలో అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. మరోవైపు 2018 జూలై 20వ తేదీన ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ అవార్డు ఇస్తూ, వారెంట్లు ఇష్యూ చేయనందుకు రూ.1,323 కోట్ల నష్టపరిహారాన్ని ఇవ్వాలన్న మారన్ కేఏఎల్ క్లెయిమ్‌ను కొట్టేసింది. అయితే వడ్డీసహా రూ.579 కోట్ల రిఫండ్ చేయాలని ఆదేశించింది. ఆర్బిట్రేషన్ అవార్డుపై సన్ టీవీ నెట్వర్క్ యజమాని కూడా అయిన మారన్, కేఏఎల్ ఎయిర్‌వేస్‌లు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై ఢిల్లీ హైకోర్టు 2020 నవంబర్ 2వ తేదీన ఆదేశాలు ఇస్తూ, ఈ వివాదంలో వడ్డీకి సంబంధించి రూ.243 కోట్ల డిపాజిట్ చేయలని స్సైస్జెట్ను ఆదేశించింది. స్పైస్‌జెట్ నవంబర్ 7న సుప్రీంకోర్టును ఆశ్రయించి, ఈ ఉత్తర్వుపై స్టే పొందింది. రెండు ప్రతిపాదనలు ఇవీ.. అత్యున్నత న్యాయస్థానంలో వివాద శాశ్వత పరిష్కారానికి స్పైస్‌జెట్ రెండు ప్రతిపాదనలు చేసింది. అందులో ఒకటి– ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్గా రూ.300 కోట్ల చెల్లింపులు. ఢిల్లీ హైకోర్టులో డిపాజిట్ చేసిన రూ. 270 కోట్ల బ్యాంక్ గ్యారెంటీలో ప్రస్తుతానికి రూ.100 కోట్లు చెల్లించి, కేసు తదుపరి విచారణ ఢిల్లీ హైకోర్టులో వేగవంతం చేసేలా సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు పొందడం రెండవ ఆఫర్. తాజాగా ఈ రెండు ఆఫర్లను కేఏఎల్ ఎయిర్వేస్, మారన్లు తిరస్కరించారు. ఆర్బిట్రేషన్ అవార్డు కింద తమకు రూ.920 కోట్లు స్పైస్‌జెట్ నుంచి రావాల్సి ఉందని డిమాండ్ చేశాయి. -
స్పైస్‌జెట్‌కి ‘సుప్రీం’ ఫైనల్ వార్నింగ్ !
అప్పుల భారంతో కిందామీదా అవుతోన్న స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌కి సుప్రీం కోర్టులో చుక్కెదురు అయ్యింది. క్రెడిట్ సూసీ దాఖలు చేసిన కేసులో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన దివాళా తీర్పును సవాల్ చేస్తూ స్పైస్‌జెట్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇరు పక్షాలు విన్న న్యాయస్థానం డూ ఆర్ డై అంటూ స్పైస్ జెట్‌కి వార్నింగ్ ఇచ్చింది. స్పైస్‌జెట్ ఎయిర్వేస్కి స్విట్జర్లాండ్‌కి చెందిన క్రెడిస్ సూసీ సంస్థల మధ్య పలు దఫాలుగా 2011 నవంబరు నుంచి 2012 సెప్టెంబరు మధ్య ఒప్పందాలు కుదిరాయి. దీని ప్రకారం స్పైస్‌జెట్ ఆధీనంలో ఉన్న విమానాల మెయింటనెన్స్, రిపేరింగ్, ఓవర్‌హాలింగ్ తదితర పనులు పదేళ్ల కాలానికి క్రెడిస్ సూసీ సంస్థ చేపడుతుంది. ఒప్పందం ప్రకారం స్పైస్‌జెట్ సంస్థకి క్రెడిట్ సూసీ సర్వీసులు అందించింది. నిర్వాహాణ లోపాల కారణంగా నష్టాలు ఎదురవడంతో స్పైస్‌జెట్ సంస్థ మూతపడింది. అయితే మెయింటనెన్స్ ఇతర పనులకు సంబంధించి క్రెడిట్ సూసీ సంస్థకు ఇవ్వాల్సిన 26 మిలియన్ డాలర్ల మొత్తాన్ని చెల్లించలేదు. దీనిపై క్రెడిట్ సూసీ సంస్థ చట్ట ప్రకారం నోటీసులు పంపి చివరకు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ స్పైస్‌జెట్‌ను దివాళాగా ప్రకటిస్తూ తీర్పు వెలువడింది. మద్రాసు కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం తలుపు తట్టింది స్పైస్‌జెట్. శుక్రవారం సుప్రీం కోర్టులో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు స్పైస్‌జెట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు సంస్థను నిర్వహించాలని అనుకుంటున్నారా ? లేదా అంటూ సూటీగా ప్రశ్నించింది. బకాయిలు చెల్లించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారు? మీ ఆర్థిక పరిస్థితి ఏంటనే వివరాలు ఎందుకు స్పష్టం చేయడం లేదంటూ ప్రశ్నించింది. సంస్థను నిర్వహించే తీరు ఇదేనా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. మీరు సరైన సమాధానం ఇవ్వకుంటే ఇన్సాల్వెన్సీగా కంపెనీగా పరిగణించి ఆస్తులు వేలం వేయాల్సి ఉంటుందంటూ హెచ్చరించింది. చివరకు ఈ వివాదం పరిష్కరించుకునేందుకు మూడు వారాల గడువు ఇవ్వాలంటూ స్పైస్‌జెట్ న్యాయవాదులు కోరడంతో సుప్రీం అందుకు అంగీకరించింది. చదవండి:శంషాబాద్‌లో స్పైస్‌జెట్ అత్యవసర ల్యాండింగ్ -
Avani Singh: 24 ఏళ్ల వయసులో ఏకంగా కంపెనీని స్థాపించి.. ఆపై
Avani Singh: Spicehealth CEO Features In 2021 Bloomberg Ones To Watch: దేశంలోనే రెండో అతిపెద్ద ఏవియేషన్ సంస్థకు అధిపతి కూతురామె. ఉద్యోగం చేయవలసిన అవసరం కానీ, చేయాలన్న బలవంతం కానీ ఏమీ లేదు. కానీ అమెరికాలో ఎమ్ఎస్ పూర్తిచేసి, వచ్చీరాగానే ఓ ప్రైవేటు కంపెనీలో అనలిస్టుగా చేరింది అవనీ సింగ్. ఇంతలో ప్రపంచమంతటా కరోనా పంజా విసిరింది. ఫలితంగా దేశం మొత్తం లాక్డౌన్ లోకి వెళ్లిపోయింది. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లాక్‌డౌన్‌తో వర్క్ ఫ్రమ్ హోం చేస్తోన్న అవనికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఈ సమయంలో హెల్త్‌కేర్ రంగంలో అడుగుపెట్టి, కోవిడ్ టెస్టులు నిర్వహిస్తే ఎలా ఉంటుంది? అనిపించి ‘స్పైస్ హెల్త్’ పేరిట హెల్త్ కేర్‌ను ప్రారంభించి వినూత్న నిర్ణయాలతో దూసుకుపోతోంది. దీంతో తాజాగా.. వివిధ రంగాల్లో అత్యంత ప్రభావవంతంగా పనిచేసిన ‘బ్లూమ్‌బర్గ్ వన్స్ టు వాచ్’ గ్లోబల్ వార్షిక – 50 మంది జాబితాలో అవనీ సింగ్ చోటు దక్కించుకుంది. స్పైస్‌జెట్ అధినేత అజయ్ సింగ్ ముద్దుల కూతురే అవనీసింగ్. ఎకనామిక్స్, సైకాలజీలలో డిగ్రీ పూర్తయ్యాక, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో పబ్లిక్ పాలసీలో ఎమ్ఎస్ పూర్తిచేసి 2019లో ఇండియా వచ్చింది. రాగానే గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ కంపెనీ ‘మెకిన్సీ’లో అనలిస్ట్‌గా చేరింది. కరోనా మూలంగా వర్క్‌ఫ్రం హోం చేస్తోన్న అవని.. కరోనా కేసులు పెరగడం, టెస్టుల నిర్వహణ కష్టంగా ఉండడం వంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలించింది. దాంతో కోవిడ్–19 టెస్టింగ్ రంగంలోకి దిగితే బావుంటుందన్న ఆలోచన వచ్చింది. వెంటనే అనలిస్టు ఉద్యోగానికి రాజీనామా చేసి తన తండ్రి అజయ్‌సింగ్‌తో కలిసి 2020 నవంబర్‌లో ‘స్పైస్‌హెల్త్’ ఇండిపెండెంట్ కంపెనీని ప్రారంభించింది. ఆర్టీ–పీసీఆర్ ః రూ. 499 నాణ్యతలో ఎక్కడా తగ్గకుండా తక్కువ ఖర్చుతో సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో స్పైస్ హెల్త్‌ను ప్రారంభించిన అవని ఐసీఎమ్ఆర్, ఎన్ఏబీఎల్ అనుమతితో మొబైల్ ల్యాబొరేటరీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్పటిదాకా రూ.2400 నుంచి రూ.4500 గా ఉన్న ఆర్టీ–పీసీఆర్ టెస్ట్‌ను కేవలం రూ.499కు అందించి సంచలనం సృష్టించింది. ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తోన్న డయాగ్నస్టిక్ కంపెనీ జెనేస్టోర్ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా మొబైల్ లేబొరేటరీలను ప్రారంభించి ఆర్టీ–పీసీఆర్ టెస్టులను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలోనే అత్యధిక జనసాంద్రత కలిగిన ఢిల్లీ, అజాద్‌పూర్ మండిలో తొలిసారి మొబైల్ లేబొరేటరీ ద్వారా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. ఇతర ల్యాబొరేటరీలు టెస్టు ఫలితాలను ఇవ్వడానికి 24 నుంచి 48 గంటలు సమయం తీసుకుంటే..స్పైస్‌హెల్త్ మాత్రం ఆరుగంటలలోపే ఫలితాలను ఇచ్చేది. అంతేగాక మొబైల్ ల్యాబొరేటరీ ద్వారా రోజుకి 20 వేల నుంచి 50 వేల ఆర్టీ–పీసీఆర్ టెస్టులను నిర్వహించింది. మొబైల్ లేబొరేటరీలు విజయవంతం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం కూడా స్పైస్‌హెల్త్‌తో కలిసి కోవిడ్ పరీక్షలను నిర్వహించింది. తొలి కంపెనీగా.. కోవిడ్ మొబైల్ టెస్టింగ్ ల్యాబొరేటరీని అందుబాటులోకి తెచ్చిన తొలి కంపెనీగా స్పైస్ హెల్త్ నిలిచింది. అంతేగాక మారుమూల ప్రాంతాలు, కంటోన్మెంట్ జోన్లు, ఆసుపత్రులు, వైద్యసదుపాయాలు అందని మారుగ్రామాలకు ఈ మొబైల్ లేబొరేటరీ సేవలు అందించింది. కుంభమేళాలో కోవిడ్ టెస్టులు నిర్వహించేందుకు స్పైస్ హెల్త్ ఉత్తరాఖండ్ ప్రభుత్వ భాగస్వామ్యం తో మొబైల్ లేబొరేటరీస్‌ను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన లేబొరేటరీలను ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే 50 లక్షల ఆర్టీ–పీసీఆర్ టెస్టులను నిర్వహించింది. ఆర్టీ–పీసీఆర్, వ్యాక్సిన్స్ తర్వాత జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టులవైపు మొగ్గుచూపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పది ప్రముఖ నగరాల్లో 18 టెస్టింగ్ ల్యాబ్స్, కలెక్షన్ సెంటర్లను నడుపుతోంది. కోవిడ్ నిర్ధారణ పరీక్షలతోపాటు ఐదు రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లను కూడా నిర్వహిస్తోంది. ఇటీవల కొంతకాలం క్రితం న్యూ ఢిల్లీ లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫ్యాథాలజీ ల్యాబొరేటరీ ని ఏర్పాటు చేసి ప్యాథాలజీ సర్వీస్‌లను అందిస్తోంది. 24 ఏళ్ల వయసులో ఏకంగా ఒక కంపెనీని స్థాపించి తన వినూత్న నిర్ణయాలతో కంపెనీని విజయపథంలో నడిపిస్తోన్న అవనికి 2021వ సంవత్సరానికి గాను ఏషియా–పసిఫిక్ స్టీవ్ అవార్డు కార్యక్రమంలో ‘మోస్ట్ వాల్యుబుల్ మెడికల్ ఇన్నోవేషన్’ విభాగంలో ‘గోల్డ్ అవార్డు’ వరించింది. చదవండి: మహిళా వెడ్డింగ్ ప్లానర్స్ ఆకాశమే హద్దు... -
పొగమంచులో విమానం.. ప్రయాణికుల్లో టెన్షన్
రేణిగుంట: పొగమంచు దట్టంగా కమ్మేయడంతో రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండింగ్ అవ్వాల్సిన స్పైస్‌జెట్ విమానం 15 నిమిషాలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. హైదరాబాద్ నుంచి మంగళవారం ఉదయం 7.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి స్పైస్‌జెట్ విమానం చేరుకుంది. అయితే పొగమంచు దట్టంగా కమ్మేయడాన్ని గమనించిన పైలట్ ల్యాండింగ్ చేయకుండా గాల్లోనే కాసేపు తిప్పారు. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. 15 నిమిషాల తర్వాత పొగమంచు తొలగడంతో సురక్షితంగా రన్‌వేపై ల్యాండింగ్ చేశారు. చదవండి: తిరుమలలో విరిగిపడ్డ కొండచరియలు.. భారీగా ట్రాఫిక్‌జామ్ -
వాయిదా పద్దతుల్లో విమాన టికెట్లు
న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ కొత్తగా ప్రయాణికుల కోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. విమాన టికెట్ల చార్జీలను సులభ వాయిదాల్లో (ఈఎంఐ) కట్టే సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం మూడు, ఆరు లేదా 12 వాయిదాల్లో చెల్లించవచ్చు. ప్రారంభ ఆఫర్ కింద ఎటువంటి అదనపు భారం (వడ్డీ భారం) లేకుండా మూడు నెలల ఈఎంఐ ఆప్షన్ పొందవచ్చని సంస్థ తెలిపింది. ఈ స్కీమును ఉపయోగించుకోవడానికి ప్రయాణికులు తమ పాన్ నంబరు, ఆధార్ నంబరు వంటి ప్రాథమిక వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత వన్–టైమ్ పాస్‌వర్డ్‌తో ధృవీకరించాల్సి ఉంటుంది. ఏకీకృత చెల్లింపు విధానానికి సంబంధించిన యూపీఐ ఐడీ ద్వారా మొదటి వాయిదా చెల్లించాలి. అదే యూపీఐ ఐడీ నుంచి తదుపరి ఈఎంఐలు డిడక్ట్ అవుతాయి. ఈఎంఐ స్కీమును ఉపయోగించుకోవడానికి క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ వివరాలను సమర్పించనక్కర్లేదు. -
స్పైస్‌జెట్ బంపర్ ఆఫర్, డబ్బులు లేవా.. తర్వాతే ఇవ్వండి
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే బ్యాంకింగ్, రీటైల్, ఈ కామర్స్‌తో పాటు వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఈఎంఐ సదుపాయాన్ని స్పైస్ జెట్ ఇప్పుడు విమాన ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. విమాన ప్రయాణికులు ఈఎంఐ సౌకర్యంతో స్పైస్ జెట్ ఫ్లైట్ టికెట్లను కొనుగోలు చేయొచ్చు. 3,6,12 నెలల పాటు వాయిదా పద్దతుల్లో వడ్డీ లేకుండా, కొనుగోలు చేసిన టికెట్ల ధర మొత్తాన్ని ఈఎంఐలో చెల్లించుకోవచ్చు. ప్రయాణికులు చేయాల్సిందల్లా ఒక్కటే స్పైస్ జెట్ విమాన టికెట్లకు ఈఎంఐ సదుపాయం కావాలంటే ప్రయాణికులు పాన్ నెంబర్, ఆధార్ కార్డ్, వీఐడీ వివరాల్ని నమోదు చేయాలి. వన్‌టైమ్ పాస్వర్డ్ తో యాక్టీవ్ చేసుకోవాలి. వినియోగదారులు యూపీఐ ఐడీ ద్వారా ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ స్కీమ్‌ను పొందేందుకు ప్రయాణికులు ఎలాంటి క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ వివరాలను అందించాల్సిన అవసరం లేదని స్పైస్ జెట్ పేర్కొంది. చదవండి:ఇకపై ఎంచక్కా..ఫ్లైట్ జర్నీలోనే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు -
స్పైస్‌జెట్ ఎయిర్వేస్కు డీజీసీఏ షాక్
భారత్‌లో విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ).. ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ స్సైస్ జెట్‌కు ఝలక్ ఇచ్చింది. స్పైస్ జెట్ కార్గొ లైసెన్స్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రమాదకర వస్తువులను రవాణా చేసిందనే ఆరోపణలు నిజమని తేలడంతో ఈ చర్యలు తీసుకుంది. మొత్తం 30 రోజుల పాటు లైసెన్స్ ను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది డీజీసీఏ. లిథియం-అయాన్ బ్యాటరీలతో సహా ప్రమాదకరమైన వస్తువులను తీసుకెళ్లేందుకు స్పైస్ జెట్‌ను అనుమతించరు. దేశీయ, విదేశీ విమానాలను ఇందుకు అనుమతించబోమని డీజీసీఏ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఈ వార్షిక ఏడాదిలో రూ.30 కోట్ల లాభాన్ని కార్గొ రవాణా ద్వారా సాధించింది స్పైస్ జెట్ సంస్థ. మరోవైపు డీజీసీఏకు స్పైస్ జెట్ వివరణ ఇచ్చింది. ఓ రవాణాదారుడు ప్రమాదకరం కాని వస్తువులుగా ప్రకటించడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపింది. ఆ షిప్పర్ణు బ్లాక్ లిస్ట్‌లో చేర్చినట్లు స్పైస్ జెట్ తెలిపింది. డీజీసీఏ నిబంధనల ప్రకారం.. ఆరోగ్యం, భద్రత, పర్యావరణానికి హాని కలిగించే ప్రమాదకరమైన వస్తువులను తీసుకెళ్లడం నిషిద్ధం. చదవండి: క్రిప్టోపై ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ సంచలన వ్యాఖ్యలు -
ఎయిరిండియా రేసులో టాటా
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఎయిరిండియా కొనుగోలుకి దేశీ పారిశ్రామిక దిగ్గజం టాటా సన్స్ ఫైనాన్షియల్ బిడ్‌ను దాఖలు చేసింది. ఇదే విధంగా అందుబాటు ధరల ఎయిర్‌లైన్స్ స్పైస్‌జెట్.. చీఫ్ అజయ్‌సింగ్ సైతం బిడ్ చేయడం ద్వారా పోటీ పడుతున్నారు. చివరి రోజు బుధవారానికల్లా ఎయిరిండియా కొనుగోలుకి ఫైనాన్షియల్ బిడ్స్ దాఖలైనట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తాజాగా వెల్లడించారు. అయితే ఎన్ని సంస్థలు రేసులో నిలిచిందీ వెల్లడించలేదు. టాటా సన్స్ బిడ్‌ను దాఖలు చేసినట్లు గ్రూప్ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. మరోపక్క స్పైస్‌జెట్ ఎండీ, చైర్‌పర్శన్ అజయ్ సింగ్ వ్యక్తిగత హోదాలో పోటీ పడుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ బాటలో పలు కంపెనీలు బిడ్స్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఎయిరిండియా విక్రయ లావాదేవీల నిర్వాహక సంస్థకు పలు ఫైనాన్షియల్ బిడ్స్ దాఖలైనట్లు పాండే తెలియజేశారు. దీంతో డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియ ప్రస్తుతం చివరి దశ(కన్‌క్లూడింగ్ స్టేజ్)కు చేరినట్లు ట్వీట్ చేశారు. 100 శాతం వాటా: డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎయిరిండియాలోగల 100 శాతం వాటాతోపాటు.. ఏఐ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్‌లో ఎయిరిండియాకుగల 100 శాతం వాటాను సైతం విక్రయించనుంది. అంతేకాకుండా ఎయిరిండియా సాట్స్ ఎయిర్పోర్ట్ సరీ్వసెస్ ప్రయివేట్‌లోగల కంపెనీకిగల 50 శాతం వాటాను సైతం బదిలీ చేయనుంది. 2020 జనవరిలో ప్రారంభమైన విక్రయ సన్నాహాలు కోవిడ్–19 కారణంగా ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎయిరిండియా కొనుగోలుకి అవకాశమున్న సంస్థల నుంచి ఫైనాన్షియల్ బిడ్స్‌ను ప్రభుత్వం ఆహా్వనించింది. వీటికి గడువు ఈ బుధవారం(15)తో ముగియనుంది. బయటకు వెల్లడికాని రిజర్వ్ ధరకు ఎగువన దాఖలైన బిడ్స్‌ను సలహాదారు సంస్థ పరిగణించనుంది. అధిక ధరను కోట్ చేసిన బిడ్స్‌ను ఎంపిక చేయనుంది. తద్వారా వీటిని క్యాబినెట్ అనుమతి కోసం పంపనుంది. -
ఇకపై ఎంచక్కా..ఫ్లైట్ జర్నీలోనే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బడ్జెట్ క్యారియర్ స్పైస్‌జెట్ దేశీయ విమానయాన రంగంలో తొలిసారిగా కొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. ఇన్‌ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ వేదిక అయిన స్పైస్‌స్క్రీన్ సహాయంతో విమానంలో ఉన్నప్పుడే ప్రయాణికులు క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. తక్కువ చార్జీలతోపాటు 10 శాతం వరకు డిస్కౌంట్ కూడా ఉంటుంది. ప్రయాణికులు క్యాబ్ డిపార్చర్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. అరైవల్ గేట్ వద్దే క్యాబ్ సిద్ధంగా ఉంటుందని స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ విమానాశ్రయంలో దిగే ప్యాసింజర్లు ఈ సేవలను వినియోగించుకోవచ్చు. హైదరాబాద్‌సహా ఇతర ప్రధాన నగరాలకు ఈ సౌకర్యాన్ని దశలవారీగా పరిచయం చేస్తారు. క్యాబ్ రద్దు చేసుకుంటే ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. స్పైస్‌స్క్రీన్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకోగానే ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా ఓటీపీతోపాటు విమానం దిగిన వెంటనే కాల్ కూడా వస్తుంది. స్పైస్స్క్రీన్ను గతేడాది ఆగస్టులో కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. విమాన ప్రయాణంలో ఆన్‌బోర్డ్ వైర్లెస్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయి స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ పీసీ లేదా ల్యాప్‌టాప్ ద్వారా వినోదాన్ని ఆస్వాదించవచ్చు. చదవండి : వారెవ్వా..!సరికొత్త రికార్డ్లను బద్దలు కొట్టిన అగ్రికల్చర్ బిజినెస్ రిజిస్ట్రేషన్లు -
Drone Delivery: డ్రోన్లతో లాజిస్టిక్స్ డెలివరీకి రెడీ
న్యూఢిల్లీ: డ్రోన్ల ద్వారా వాణిజ్య సరుకు రవాణా సర్వీసులను ప్రారంభించేందుకు ప్రయోగాత్మక ప్రాజెక్టు సిద్ధమైంది. ఇందుకు వైమానిక సరుకు రవాణా(కార్లో) సంస్థ స్పైస్ ఎక్స్‌ప్రెస్ ఈ కామర్స్ లాజిస్టిక్స్ కంపెనీ 'డెలివరి' చేతులు కలీపాయి. మూడు నాలుగు నెలల్లో డ్రోన్ల డెలివరీ పైలట్ ప్రాజెక్టును సంయుక్తంగా చేపట్టనున్నాయి. ఇందుకు వీలుగా రెండు సంస్థలూ అవగాహనా ఒప్పందం(ఎంవోయూ)పై సంతకాలు చేశాయి. ఈ ప్రాజెక్టు కోసం దేశీ ఎయిర్‌లైన్స్ కంపెనీ స్పైస్ జెట్‌కు చెందిన స్పైస్ ఎక్స్ఫ్రైస్ కన్ఫార్షియంను పౌర విమానయాన అధీకృత సంస్థ (డీజీసీఏ) ఎంపిక చేసింది. బీవీఎల్వోఎస్ పరిధిలో డ్రోన్ల వినియోగానికి ప్రయోగాత్మక ప్రాజెక్టుకు గ్రీన్ సీగ్నల్ ఇచ్చింది. దీంతో ఎమర్జెన్సీ సర్వీసులు, సరుకు రవాణా, క్రిటికల్ మెడికల్ సర్వీసుల, పర్యావరణ పహారా తదితర కీలక వాణీజ్య సర్వీసులకు డ్రోన్ల టెక్నాలజీని వినియోగించేందుకు వీలుంటుందని నిపుణులు తెలియజేశారు. డెలివరీతో కుదిరిన ఎంవోయూ ద్వారా రెండు సంస్థలూ లబ్లి పొందనున్నట్లు స్పైస్ ఎక్స్‌ప్రెస్ సీఈవో సంజీవ్ గుప్తా పేర్కొన్నారు. తమకున్న సామర్జ్యాలతో ఈ ప్రాజెక్టును విజయవంతంగా చేపట్టనున్నట్లు చెప్పారు. ఇది సరుకు రవాణాలో కొత్త మార్పులకు శ్రీకారం చుడుతుందని 3-4 నెలల్లో ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. స్పైస్‌జెట్‌తో తమకున్న దీర్షకాల సాహచర్యానికి ఈ ఒప్పందం మరింత బలాన్నివ్వనున్నట్లు డెలివరీ సీఈవో అజిత్ పాయ్ పేర్కొన్నారు ఈ ప్రాజెక్టు ద్వారా లాజిస్టిక్స్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చే వీలున్నదని తెలియజేశారు. ఎంవోయూలో భాగంగా భూమిపై లాజిస్టిక్స్ సేవలకు డెలివరీ పూర్తస్తాయిలో మద్దతివ్వనుంది. కాగా.. ఈ మే నెలలో డ్రోన్ల ద్వారా ప్రయోగాత్మకంగా వ్యాక్సిన్ల డెలివరీని చేపట్టేందుకు పార విమానయాన శాఖ తెలంగాణ ప్రభుత్వానికి షరతులతో అనుమతించిన విషయం విదితమే. కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనే బాటలో వ్యాక్సిన్ల సరఫరాకు యూఏఎస్ నిబంధనల నుంచి మినహాయింపునిచ్చింది. చదవండి: సరికొత్త టెక్నాలజీ.. సౌండ్ ద్వారానే ఫోన్లు ఛార్జింగ్ -
కరోనాతో స్పైస్‌జెట్- క్విప్‌తో ఐడీబీఐ బోర్లా
ముంబై, సాక్షి: వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలదే పైచేయిగా కనిపిస్తోంది. దీంతో తొలుత 400 పాయింట్లవరకూ పతనమైన సెన్సెక్స్ ప్రస్తుతం 150 పాయింట్లు క్షీణించి 45,404 వద్ద కదులుతోంది. కాగా.. కొత్త రూపు సంతరించుకుని వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ కారణంగా యూకేకు అన్ని దేశాలూ విమాన సర్వీసులను రద్దు చేశాయి. దీంతో స్పైస్‌జెట్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇక మరోపక్క క్విప్‌లో భాగంగా జారీ చేసిన షేర్లు తాజాగా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కావడంతో ఐడీబీఐ బ్యాంక్ కౌంటర్లోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూకట్టారు. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ నష్టాలతో పతన బాట పట్టాయి. వివరాలు ఇలా.. (సీరమ్ నుంచి 5 కోట్ల డోసేజీలకు రెడీ) స్పైస్‌జెట్ వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో యూకేకు నడుపుతున్న అన్ని విమాన సర్వీసులనూ ఈ నెల 31వరకూ దేశీ ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటికే పలు ప్రపంచ దేశాలు ఈ బాటలో నడుస్తున్నాయి. వందే భారత్ మిషన్‌లో భాగంగా స్పైస్‌జెట్ సైతం యూరోపియన్ దేశాలకు 30 విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. లండన్, ఆమ్స్టర్డామ్, టొరంటో, రోమ్, మిలన్‌లకు విమానాలను నడుపుతోంది. అంతేకాకుండా యూరప్, ఆఫ్రికా, అమెరికా తదితర దేశాలతో కనెక్టవిటీకి వీలుగా ఇటీవలే ఎమిరేట్స్‌తో అవగాహనా ఒప్పందాన్ని సైతం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో స్పైస్‌జెట్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎన్ఎస్ఈలో తొలుత స్పైస్‌జెట్ షేరు దాదాపు 10 శాతం పతనమై రూ. 82.35ను తాకింది. ప్రస్తుతం 8.5 శాతం నష్టంతో రూ. 84 దిగువన ట్రేడవుతోంది. సోమవారం సైతం ఇదే స్థాయిలో నష్టపోవడం గమనార్హం! ఐడీబీఐ బ్యాంక్ క్విప్‌లో భాగంగా ఐడీబీఐ బ్యాంక్ సంస్థాగత కొనుగోలుదారులకు(క్విబ్) జారీ చేసిన 37.18 కోట్ల షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీలలో నేటి నుంచి లిస్టయ్యాయి. 44 సంస్థలకు షేరుకి రూ. 38.60 ధరలో బ్యాంక్ షేర్లను జారీ చేసింది. తద్వారా రూ. 1,435 కోట్లకుపైగా సమకూర్చుకుంది. ఫ్లోర్ ధర రూ. 40.63తో పోలిస్తే 5 శాతం డిస్కౌంట్లో షేర్లను కేటాయించింది. ఇక మరోపక్క బ్యాంకులో మెజారిటీ వాటా కలిగిన పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ నుంచి రూ. 1,500 కోట్ల ఈక్విటీ పెట్టుబడులను సమకూర్చుకోనున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 20 శాతం కుప్పకూలింది. రూ. 30.75ను తాకింది. ప్రస్తుతం 13.4 శాతం నష్టంతో రూ. 33 వద్ద ట్రేడవుతోంది. -
ఎయిర్‌లైన్ ఉద్యోగి చెంప చెళ్లుమనిపించిన ఎస్సై
గాంధీనగర్/ అహ్మదాబాద్: ఆలస్యంగా రావడంతో బోర్డింగ్ పాస్ ఇవ్వడానికి నిరాకరించారు. దాంతో ఆగ్రహించిన ఎస్సై ర్యాంక్ క్యాడర్ వ్యక్తి విమానాశ్రయ సిబ్బంది చెంప చెళ్లుమనిపించిన ఘటన అహ్మాదాబాద్ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. వివరాలు.. గుజరాత్‌కు చెందిన పోలీసు అధికారి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి మంగళవారం అహ్మదాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. వారంతా ఢిల్లీకి వెళ్లడం కోసం స్పైస్‌జెట్ ఎస్జీ-8194 విమానంలో టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. అయితే వారు ఆలస్యంగా రావడంతో సిబ్బంది బోర్డింగ్‌కు అనుమతివ్వలేదు. దాంతో పోలీసు అధికారి, స్పైస్‌జెట్ స్టాఫ్‌తో గొడవకు దిగాడు. తమకు బోర్డింగ్ పాస్ నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన సదరు అధికారి.. సిబ్బంది చెంప పగలకొట్టాడు. (చదవండి: పైలట్‌పై ముసుగు దొంగల దాడి) దాంతో ఎస్సైతో పాటు ఉన్న మిగతా ఇద్దరు ప్రయాణీకులకు, సిబ్బందికి మధ్య గొడవ తీవ్రం అయ్యింది. పరిస్థితిని నియంత్రించడానికి విమానాశ్రయ భద్రతా సిబ్బంది, సీఐఎస్ఎఫ్ స్టాఫ్ రంగంలోకి దిగారు. అనంతరం విమాన్రాశయ ఉద్యోగిని, సదరు పోలీసు అధికారితో పాటు ఉన్న మిగతా ఇద్దరిని స్థానిక పోలీసు స్టేషన్లో అప్పగించారు. ఆ తర్వాత వారి మధ్య రాజీ కుదరడంతో ఫిర్యాదు వెనక్కి తీసుకున్నట్లు తెలిసింది. కానీ సదరు పోలీసు అధికారిని మాత్రం విమానంలో ప్రయాణించేందుకు అనుమతించలేదు. -
విమానాన్ని ఢీకొన్న నిచ్చెన : ధ్వంసమైన రెక్కలు
ముంబై : బలమైన ఈదురు గాలులు ముంబై విమానాశ్రమయంలో బీభత్సం సృష్టించాయి. వేగంగా వీచిన ఈదురుగాలుల కారణంగా ముంబై విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానం నిచ్చెన.. అక్కడే ఆగిఉన్న ఇండిగో విమానాన్ని ఢీకొట్టింది. దీంతొ ఇండిగో విమానం రెక్కలు, ఇంజిన్‌ను కప్పిఉంచే భాగం ధ్వంసమైంది. శనివారం వీచిన ఈదురుగాలులు, అధిక వర్షపాతంతో ముంబై నగరం జలమయమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బలమైన గాలుల కారణంగా నిచ్చెన ఉన్న ప్రాంతం నుంచి వెనక్కి రావడంతో ఇండిగో విమానం రెక్కకి తగిలి విరిగిపోయినట్లు మీడియాల్లో వచ్చిన ఫొటోల ద్వారా తెలుస్తోంది. ఆ సమయంలో రెండు విమానాలు కూడా విమానాశ్రయంలోనే నిలిపివున్నాయని స్పైస్ జెట్ తెలిపింది.‘ఈ ప్రమాదం ముంబై విమానాశ్రయంలో శనివారం తెల్లవారుజామున జరిగింది. స్పైస్ జెట్‌కు చెందిన విమానం మెట్ల నిచ్చెన దాని ఆపి ఉంచిన స్థానం నుండి వేరుచేయబడి ఇండిగోకు చెందిన విమానాన్ని బలంగా తాకింది. ఈ ప్రమాదంలో ఇండిగో విమాన రెక్కలు ధ్వంసమైయ్యాయి. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు’ అని స్పైస్ జెట్ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. -
పైలట్‌పై ముసుగు దొంగల దాడి
సాక్షి, న్యూఢిల్లీ : విధులకు హాజరవుతున్న పైలట్‌ను తుపాకితో బెదిరించి దోచుకున్న వైనం దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీలోని ఐఐటీ క్యాంపస్‌కు సమీపంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. కరోనా వైరస్, లాక్డౌన్ సందర్భంగా అత్యవసర సేవల్లో వున్న సిబ్బందిపై ఇదే ప్రాంతంలో వరుస దోపిడీ ఘటనలు నమోదైనట్టు తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం, స్పైస్‌జెట్ విమాయాన సంస్థలో పనిచేసే పైలట్ యువరాజ్ సింగ్ తెవాతియా(30) ఫరీదాబాద్ నుంచి ఆఫీసు క్యాబ్‌లో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుండగా బైక్ పై వచ్చిన సుమారు పదిమంది దుండగులు అడ్డుకున్నారు. తుపాకీతో బెదిరించి యువరాజ్ పర్సులోని సొమ్మును, ఇతర వస్తువులను దోచుకున్నారు. మరింత కావాలని డిమాండ్ చేస్తూ రాడ్లతో దాడికి దిగారు. కారు అద్దాలను పగలగొట్టి, కత్తితో దాడి చేసి బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో పైలట్ స్వల్పంగా గాయపడగా, డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. పైలట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని డిప్యూటీ పోలీస్ కమిషనర్ దేవేందర్ ఆర్య తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు జరుగుతోందన్నారు. -
ముంచుకొస్తున్న తుపాను : పలు విమానాలు రద్దు
సాక్షి, ముంబై: నిసర్గ తుపాను పెనువేగంతో ముంబై తీరంవైపు దూసుకొస్తోందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో దేశీయ విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి. బుధవారం దేశ ఆర్థిక రాజధాని ముంబైకి రాకపోకలను సాగించే విమానాలను రద్దు చేశాయి. ఇండిగో, విస్తారా, స్పైస్‌జెట్ సంస్థలు పలు విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి. ఈ సమాచారాన్ని సంబంధిత ప్రయాణీకులకు అందించామనీ, దీన్ని దృష్టిలో ఉంచుకుని వారు అప్రమత్తంగా కావాలని సూచించాయి. (తీవ్ర తుఫానుగా ‘నిసర్గ’) ఇండిగో 17 విమానాలను రద్దు చేసింది. . ముంబై నుండి చండీగఢ్, రాంచీ పాట్నాకు కేవలం మూడు విమానాలను మాత్రమే నడుపుతున్నట్టు ఇండిగో పేర్కొంది. ప్రత్యామ్నాయ విమానంలో తిరిగి బుక్ చేసుకునే అవకాశం లేదా క్రెడిట్ సౌకర్యాన్ని అందివ్వనున్నామని ఇండిగో మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. తుపాను కారణంగా తమ సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని విస్తారా ప్రకటించింది. ప్రధానంగా ముంబై, గోవా మధ్య విమానాలను రద్దు చేసినట్టు తెలిపింది. మరిన్ని వివరాలకు విస్తారా అధికారిక వెబ్ సైట్ ను గానీ, 9289228888 నంబరుగానీ సంప్రదించాలని ట్వీట్ చేసింది. అలాగే ముంబై నుంచి , ఢిల్లీ కోల్‌కతాకు వెళ్లే విమానాలను కూడా బుధవారం రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎయిరిండియా ఉదయం విమానాలను రీషెడ్యూల్ చేస్తోంది. అలాగే విమాన షెడ్యూల్లో ఏదైనా రద్దు, మార్పులను ఇ-మెయిల్స్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తామని స్పైస్‌జెట్ తెలిపింది. కాగా కరోనా వైరస్ , లాక్ డౌన్ కారణంగా పూర్తిగా నిలిచిపోయిన దేశీయ విమాన ప్రయాణాలకు ఆంక్షల సడలింపుల నేపథ్యంలో ఇటీవల అనుమతి లభించించి. మళ్లీ ఇంతలోనే నిసర్గ తుపాను రూపంలో అంతరాయం ఏర్పడింది. #6ETravelAdvisory : To know your flight status, click here https://t.co/Z25uUH5PWw #StaySafe #NisargaAlert pic.twitter.com/tkvwHX0OoA — IndiGo (@IndiGo6E) June 2, 2020 #TravelAdvisory : To check your flight status, please visit https://t.co/VkU7yLB2ny. pic.twitter.com/JYIW9ftpW3 — SpiceJet (@flyspicejet) June 2, 2020 #TravelUpdate Due to the movement of cyclonic storm "NISARGA" flights to/from Mumbai and Goa are likely to be impacted. Please visit https://t.co/IZ9taT0TOv or SMS UK to 9289228888 to check updated flight status before booking and leaving for the airport. Thank you. — Vistara (@airvistara) June 2, 2020 -
మార్చి 29 నుంచి 20 కొత్త విమానాలు
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయంగా కొత్త విమానాలను త్వరలోనే ప్రవేశపెడుతున్నామని స్పైస్‌జెట్ బుధవారం ప్రకటించింది. మార్చి29, 2020నుండి 20కొత్త విమానాలను ప్రారంభించనున్నట్టు తెలిపింది. తద్వారా ప్రాంతీయ కనెక్టివిటీని పెంచే పథకంలో భాగంగా 12 నగరాలను కలిపేలా మొత్తం 52 విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయని స్పైస్ జెట్ వెల్లడించింది. కొత్త విమానాలలో వారణాసి-పాట్నా , అమృత్సర్-పాట్నా ఉడాన్ మార్గాల్లో నాన్-స్టాప్ సేవలు ఉంటాయి. గువహటి-పాట్నా, హైదరాబాద్-మంగళూరు, బెంగళూరు-జబల్పూర్, పాట్నా-వారణాసి, ముంబై- ఔరంగాబాద్ ఉన్నాయి. దీనికి అదనంగా ముంబై-బాగ్డోగ్రా, ముంబై-చెన్నై, హైదరాబాద్-మంగళూరు, గౌహతి-డిల్లీ మార్గాల్లో సేవలను క్రమేపీ పెంచనుంది. 20 కొత్త దేశీయ విమానాలను ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని స్పైస్‌జెట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ శిల్పా భాటియా తెలిపారు. తమ నెట్‌వర్క్‌ను కొత్త నగరాలుకు విస్తరించి, మరింత ఎక్కువ మందికి సరసమైన ధరల్లో విమాన ప్రయాణ సేవలను అందిస్తామన్నారు. అలాగే మెట్రోలు, నాన్-మెట్రోల మధ్య కనెక్టివిటీని పెంచడంతో పాటు దేశంలోని అనుసంధానించబడని భాగాలను కూడా అనుసంధానించడంపై కూడా దృష్టి పెట్టామని చెప్పారు. -
అర్నాబ్‌పై ఆగ్రహం, కునాల్‌కు షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఇండిగో’ ప్రైవేట్ ఎయిర్‌లైన్ విమానంలో వెళుతున్న రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్నాబ్ గోస్వామీని అదే విమానంలో వెళుతూ హేళన చేశారన్న ఆరోపణలపై ప్రముఖ కమేడియన్ కునాల్ కామ్రపై ఇండిగో మంగళవారం నిషేధం విధించింది. అంటే ఆ విమాన సర్వీసుల్లో ప్రయాణించేందుకు అనుమతించరు. అదే తరహాలో ‘ఎయిర్ ఇండియా’ విమాన సర్వీసుల్లో ఆయన్ని అనుమతించమని ఆ సంస్థ అధికార ప్రతినిధి ధనంజయ్ కుమార్ మంగళవారం రాత్రి ప్రకటించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ నిషేధం అమలులో ఉంటోందని ఆయన చెప్పారు. ఇదే దారిలో సాగుతూ స్పైస్‌జెట్ విమానయాన సంస్థ అతన్ని బహిష్కరించింది. మిగతా విమాన సర్వీసుల కూడా కునాల్ కామ్రపై నిషేధం విధించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పిలుపునిచ్చారు. ‘విమాన ప్రయాణంలో ఇతరులను రెచ్చగొట్టడం, ఇబ్బంది పెట్టడం అనుమతించలేం. అది ఇతరుల భద్రతకు ముప్పు కలిగిస్తుంది. తోటి ప్రయాణికుడి పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు కమేడియన్ కునాల్‌పై చర్య తీసుకోవాల్సిందిగా పిలుపునివ్వక తప్పడం లేదు’ అని హర్దీప్ సింగ్ వ్యాఖ్యానించారు. 2016, జనవరి 17వ తేదీన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో కుల వివక్ష వల్ల ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేముల తల్లి రాధికా వేములను ఉద్దేశించి ఆర్నాబ్ స్వామి తన షోలో ఆమె కులం ఏమిటంటూ అవమానించారు. ఈ విషయమై విమానంలో కనిపించిన ఆర్నాబ్‌ను కునాల్ నిలదీశారు. దానికి ఆయన స్పందించకుండా చెవుల్లో ఇయర్ ఫోన్లు పెట్టుకొని లాప్టాప్తో బిజీ ఉండేందుకు ప్రయత్నించగా ఆయన జాతీయవాదాన్ని నిలదీశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవడంతో కునాల్‌పై ఈ చర్యలు తీసుకున్నారు. కునాల్ తన కామిడీ షోలలో అధికార పక్షం కుహనా దేశభక్తిపై జోకులు వేస్తున్నందుకే ఆయనపై ఈ అనుచిత చర్య తీసుకున్నారని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. -
సీటు కోసం ప్రజ్ఞాఠాకూర్ పేచీ
న్యూఢిల్లీ: తనకు సీటు కేటాయించడంలో విమాన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ ఆరోపించారు. ఈ కారణంగా ఢిల్లీ–భోపాల్ విమానం 45 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఎంపీ ప్రజ్ఞా భోపాల్‌కు ప్రయాణించేందుకు స్పైస్‌జెట్ విమానంలో టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే ఆమె వీల్ చైర్లో రావడంతో విమానం ముందువరసలోని 1–ఏ సీటును కేటాయించేందుకు విమాన సిబ్బంది నిరాకరించారు. వెనుక సీటుకు మారాలని కోరగా ఆమె తిరస్కరించారు. వాదోపవాదాల అనంతరం ఆమె వెనుక సీటుకు వెళ్లేందుకు అంగీకరించారు. దీంతో విమానం 45 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. ఈ విషయంపై ఎంపీ ప్రజ్ఞా భోపాల్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. భద్రతా కారణాల కారణంగానే ఆమెకు వెనుక సీటు కేటాయించినట్లు స్పైస్ జెట్ ప్రతినిధి తెలిపారు. -
షిరిడీకి విమానాలు రద్దు
శంషాబాద్: షిరిడీలో ప్రతికూల వాతావరణం నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి అక్కడికి రాకపోకలు సాగించే పలు విమానాలు రద్దయ్యాయి. స్పైస్‌జెట్ 1096, 3578 విమానాలతోపాటు ఇండిగో, ఎయిర్ ఇండియాకు సంబంధించిన విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో మంగళవారం వెళ్లాల్సిన ఆయా విమానాలను బుధవారానికి రీ షెడ్యూల్ చేసినట్లు ఎయిర్‌లైన్స్ వర్గాలు వెల్లడించాయి. ప్రయాణాలు రద్దవడంతో ప్రయాణికులకు ఆయా సంస్థలు విమాన చార్జీలు తిరిగి చెల్లిస్తున్నాయి. -
స్పైస్‌జెట్ నష్టాలు రూ.463 కోట్లు
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ, స్పైస్‌జెట్‌కు ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) సెప్టెంబర్ త్రైమాసిక కాలంలో రూ.463 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల సర్వీసులు నిలిపివేయడం వల్ల వ్యయా లు పెరిగాయని, అంతే కాకుండా సాధారణంగా సెప్టెంబర్ క్వార్టర్ బలహీనంగా ఉంటుందని, అకౌంటింగ్ నిబంధనల్లో మార్పుల వల్ల రూ.180 కోట్ల నష్టాలొచ్చాయని.... ఈ మూడు అంశాల కారణంగా ఈ క్యూ2లో ఈ స్థాయిలో నష్టాలొచ్చాయని స్పైస్‌జెట్ వివరించింది. గత ఆర్థిక సంవత్సరం (2018–19) ఇదే క్వార్టర్లో రూ.389 కోట్ల నికర నష్టాలు వచ్చాయని తెలిపింది. 118 విమానాలతో సర్వీసులు... గత క్యూ2లో రూ.1,875 కోట్లుగా ఉన్న నిర్వహణ ఆదాయం ఈ క్యూ2లో రూ.2,845 కోట్లకు పెరిగింది. ఈ కంపెనీ మొత్తం 118 విమానాలతో రోజుకు సగటున 630 విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో స్పైస్‌జెట్ షేర్ 1 శాతం నష్టంతో రూ.114 వద్ద ముగిసింది. -
స్పైస్‌జెట్ రికార్డ్ లాభం
న్యూఢిల్లీ: స్పైస్‌జెట్ కంపెనీ మళ్లీ లాభాల్లోకి రావడమే కాకుండా, రికార్డ్ స్థాయి త్రైమాసిక లాభాన్ని ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో సాధించింది. బోయింగ్ 737 మ్యాక్స్ విమాన సర్వీసులను నిలిపేసినప్పటికీ, ఈ కంపెనీ ఈ క్యూ1లో రూ.262 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ1లో రూ.38 కోట్ల నికర నష్టాలు వచ్చాయని స్పైస్‌జెట్ తెలిపింది. గత క్యూ1లో రూ.2,253 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.3,145 కోట్లకు పెరిగిందని పేర్కొంది. బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల నిలిపివేత.. ఈ జూన్ క్వార్టర్లో బాగానే ప్రభావం చూపించిందని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కిరణ్ కోటేశ్వర్ తెలిపారు. ఈ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, నిర్వహణ ఆదాయం రూ.2,220 కోట్ల నుంచి రూ.3,002 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. సగటు విమాన చార్జీ 11 శాతం పెరిగిందని పేర్కొన్నారు. 107 విమానాలతో సర్వీసులు ఈ ఏడాది అక్టోబర్ కల్లా బోయింగ్ 737 ఎన్జీ విమానాలను 5–10 వరకూ కొత్తగా సర్వీసుల్లోకి తీసుకోనున్నామని కోటేశ్వర్ తెలిపారు. జూన్ చివరినాటికి మొత్తం 107 విమానాలతో సర్వీసులనందిస్తున్నామని ఆయన వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలోస్పైస్జెట్ షేర్ 1 శాతం లాభంతో రూ.138 వద్ద ముగిసింది. -
జెట్ ఎయిర్వేస్ ఎఫెక్ట్ : స్పైస్‌జెట్ రికార్డ్ లాభాలు
సాక్షి, ముంబై : భారతీయ బడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ లిమిటెడ్ అనూహ్య లాభాలను సాధించింది. ప్రధానంగా జెట్ ఎయిర్వేస్ ఆర్థిక సంక్షోభం, సేవలు నిలిపివేత లాంటివి స్పైస్ జెట్ కు బాగా కలిసి వచ్చాయి. ఆర్థిక మందగమనం, దేశీయంగా డిమాండ్ క్షీణిస్తున్నప్పటికీ లాభాల్లో విశ్లేషకుల అంచనాలను బీట్ చేసింది. ఉదాహరణకు, ఎడెల్విస్ సెక్యూరిటీస్ 154 కోట్ల రూపాయల లాభం ఆర్జిస్తుందని అంచనా వేసింది. జూన్ త్రైమాసికంలో(క్యూ 1) రూ. 262 కోట్ల నికర లాభాలను సాధించింది. ఏడాది క్రితం ఇదే క్వార్టర్లో 38.1 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఆదాయం ఏకంగా 35 శాతం ఎగిసింది. మొత్తం ఆదాయం జూన్ 2019తో ముగిసిన త్రైమాసికంలో 3,145.3 కోట్ల రూపాయలకు చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది రూ.2,253.3 కోట్లు. ఆపరేటింగ్ ఆదాయం 3002 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే క్వార్టర్లో 2204 కోట్లుగా ఉంది. గత ఏడాది రూ. 32.89తో పోలిస్తే క్యూ 1లో రూ. 143.2 కోట్ల ఇతర ఆదాయాన్ని నమోదు చేసింది. గత మూడు నెలల కాలంలో ప్రయాణీకుల ఛార్జీలు11 శాతం పెరిగాయని స్పైస్ జెట్ తెలిపింది. మార్చిలో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానం కుప్పకూలిన తరువాత బోయింగ్ 737 మాక్స్ విమానాలను రద్దు చేయడంతో ఈ త్రైమాసికంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నామని, లేదంటే ఫలితాలు ఇంకా బావుండేవని స్పైస్‌జెట్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. -
నిలిచిన విమానం.. ప్రయాణికుల ఆందోళన..!
సాక్షి, హైదరాబాద్: ఉదయం 7.45 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి విశాఖపట్నం బయలుదేరాల్సిన స్పైస్‌జెట్ విమానం ఇంకా కదలడం లేదు. దాంతో 80 మంది ప్రయాణికులు విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నారు. ఎంతకు విమానం కదలకపోవడంతో వారు విమాన సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. స్పైస్‌జెట్ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. తాము గంటల తరబడి నిరీక్షిస్తున్నా సరైన చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తిన కారణంగానే విమానం ఆగిపోయిందని స్పైస్‌జెట్ సిబ్బంది వెల్లడించారు. -
విమానం డోర్లో చిక్కుకుని వ్యక్తి మృతి
కోల్‌కతా : ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు చెందిన టెక్నిషియన్ ప్రమాదవశాత్తు ల్యాండింగ్ గేర్‌లో ఇరుక్కొని మృతి చెందారు. కోల్‌కతా ఏయిర్ పోర్ట్‌లో మంగళవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బంబార్డియర్ క్యూ400 విమానంలో రోహిత్ పాండే అనే టెక్నిషియన్ మెయింటెనెన్స్ పనులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా ల్యాండింగ్ గేర్ డోర్ మూసుకుపోయింది. దీంతో పాండే అందులో చిక్కుకొని ప్రాణాలు వదిలారని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై స్పైస్ జెట్ సైతం ఓ ప్రకటన విడుదల చేసింది. అగ్నిమాపక శాఖ సిబ్బంది సహాయంతో టెక్నిషియన్ మృతదేహాన్ని వెలికి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. అసజహ మరణం కింద కేసు నమోదు చేసుకున్న కోల్‌కతా ఏయిర్పోర్ట్ పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఫోరెన్సిక్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. శిక్షణా ప్రమాణాల్లో నాణ్యత లోపించినట్లు డీజీసీఏ గత వారమే ఈ సంస్థకు నాలుగు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమానార్హం. -
రూ. 888కే విమాన ప్రయాణం..
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్.. దేశీయ రూట్లలో రూ.888కే టికెట్ సేల్ ప్రకటించింది. వర్షాకాల ఆఫర్లో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్ 25 వరకు చేసే ప్రయాణాలపై ఈ ధర వర్తిస్తుంది. అయితే, ప్రయాణ టికెట్లను ఈనెల 6వ తేదీ లోపు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే ఆఫర్ అంతర్జాతీయ రూట్లలో అయితే.. ప్రారంభ టికెట్ ధర రూ.3,499 నుంచి ఉన్నట్లు కంపెనీ వివరించింది. ఇక గతవారంలోనే అంతర్జాతీయ మార్గాల్లో కొత్త విమానాలను ప్రారంభించినట్లు సంస్థ ప్రకటించింది. -
హైదరాబాద్‌లో విశాఖవాసుల ఇక్కట్లు
ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): శంషాబాద్ నుంచి విశాఖ బయలుదేరిన స్పైస్ జెట్ విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో రద్దు చేశారు. దీంతో విశాఖ రావాల్సిన ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఈ విమానంలో సుమారు 80 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ఇద్దరు ఐఏఎస్ అధికారులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు వైఎస్సార్ సీపీ విధ్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీలకర్ర నాగేంద్ర కూడా ఉన్నారు. శుక్రవారం కూడా తుపాను ప్రభావం నేపథ్యంలో శనివారం ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. -
విమానంలో సాంకేతిక లోపం; ఏసీ లేకుండానే ప్రయాణం
సాక్షి, తిరుపతి: తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. సాయంత్రం 6 గంటలకు బయలుదేరాల్సిన విమానంలో ఏసీ పనిచేయకపోవడంతో అధికారులు దానిని నిలిపివేశారు. ఈ కారణంగా ప్రయాణికులు మూడు గంటల పాటు విమానాశ్రయంలోనే వేచి ఉన్నారు. ఆ తర్వాత ఏసీ పనిచేస్తుందని విమానాన్ని ప్రయాణానికి సిద్ధం చేశారు. తీరా బయలుదేరిన సమయంలో ఏసీ మళ్లీ పనిచేయలేదు. దీంతో ఏసీ లేకుండానే ప్రయాణికులు హైదరాబాద్‌కు పయనమయ్యారు. స్పైస్‌జెట్ సేవలపై ప్రయాణికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
ఆ ఉద్యోగులను ఆదుకుంటాం..
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక సమస్యలతో మూసివేత అంచున నిలిచి ఉద్యోగాలు కోల్పోయిన జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులకు తమ సంస్థలో అవకాశం ఇస్తామని స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ పేర్కొన్నారు. తాము విస్తరణ ప్రణాళికలతో ముందుకెళుతున్న క్రమంలో జెట్ ఎయిర్వేస్ మూసివేత కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి తాము తొలుత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. తామిప్పటికే 100 మందికి పైగా పైలట్లు, 200 మంది క్యాబిన్ సిబ్బంది, 200 మందికి పైగా సాంకేతిక, విమాన సిబ్బందికి ఉద్యోగాలు ఇచ్చామని సింగ్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తాము తమ విమాన సేవలను మరింత విస్తరిస్తామని, మరింత మంది జెట్ ఉద్యోగులకు అవకాశం ఇస్తామని చెప్పారు. ప్రయాణీకులకు అసౌకర్యాన్ని నివారించేందుకు అన్ని చర్యలూ చేపడతామని తెలిపారు. మరోవైపు ఎయిర్ ఇండియా సైతం జెట్ ఎయిర్వేస్ రూట్లలో తమ సర్వీసులను నడిపేందుకు ప్రయత్నిస్తోంది. నగదు సమస్యలతో సతమతమవుతున్న జెట్ ఎయిర్వేస్కు ఎమర్జన్సీ ఫండ్స్‌ను సమకూర్చేందుకు బ్యాంకర్లుమ నిరాకరించడంతో సంస్థ తన విమాన సర్వీసులన్నింటినీ నిలిపివేసిన సంగతి తెలిసిందే. -
స్పైస్‌జెట్‌కు ఇంధన సెగ
ముంబై: చౌక ధరల విమానయాన సంస్థ, స్పైస్‌జెట్ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 77 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.240 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.55 కోట్లకు చేరిందని స్పైస్‌జెట్ తెలిపింది. విమానయాన ఇంధనం ధరలు 34 శాతం పెరగడం, రూపాయి 11 శాతం పతనం కావడం వంటి కారణాల వల్ల ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని స్పైస్‌జెట్ చైర్మన్ అజయ్ సింగ్ తెలిపారు. మొత్తం ఆదాయం రూ.2,096 కోట్ల నుంచి రూ.2,531 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. భవిష్యత్తు అంచనాలు ఆశావహమే.... ప్యాసింజర్ ఈల్డ్స్ 8 శాతం పెరగడం వల్ల నష్టాలు తగ్గాయని అజయ్ సింగ్ వివరించారు. ఇంధన వ్యయాలు భారీగా పెరిగినా, కరెన్సీ మారకం పతనమైనా, ఆదాయం పెరుగుదల, పటిష్టమైన వ్యయ నియంత్రణ పద్ధతుల కారణంగా ఈ క్యూ3లో మంచి ఫలితాలు సాధించామని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రంగంలోని సమస్యలు ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వస్తున్నాయని, భవిష్యత్తు అంచనాలు ఆశావహంగానే ఉన్నాయని పేర్కొన్నారు. -
కి.మీకు రూ.1.75 : స్పైస్‌జెట్ సేల్
సాక్షి, ముంబై: బడ్జెట్ ఎయిర్‌లైన్స్ స్పైస్ జెట్ తక్కువ ధరల్లో విమాన టికెట్లను ప్రకటించింది. జాతీయ. అంతర్జాతీయ మార్గాల్లో ఈ ఆఫర్లను ప్రకటించింది. దేశీయంగా కిలోమీటర్‌కు 1.75 చొప్పున, అంతర్జాతీయ కి.మీకు రూ. 2.5 చొప్పున విమాన టికెట్ చార్జీలను వసూలు చేస్తున్నామని స్పైస్‌జెట్ ఒక ప్రకటన జారీ చేసింది. దేశీయంగా ఒకవైపు ప్రయాణానికి రూ.899 (అన్నీ కలిపి), అంతర్జాతీయ రూట్లలో రూ.3699 లకు ప్రారంభ ధరగా టికెట్లను అందిస్తోంది. ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభమైన ఈ సేల్ ఫిబ్రవరి 9తో ముగియనుంది. ఇలా కొనుక్కున్న టికెట్ల ద్వారా సెప్టెంబరు 25, 2019 వరకు ప్రయాణించవచ్చు. -
స్పైస్‌జెట్ నష్టాలు రూ.389 కోట్లు
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ, స్పైస్‌జెట్‌కు ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో రూ.389 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ఇంధన ధరలు పెరగడం, రూపాయి పతనం కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని స్పైస్‌జెట్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.105 కోట్ల నికర లాభం వచ్చిందని స్పైస్‌జెట్ సీఎమ్‌డీ అజయ్ సింగ్ చెప్పారు. గత క్యూ2లో రూ.1,795 కోట్లుగా ఉన్న కార్యకలాపాల ఆదాయం ఈ క్యూ2లో రూ.1,848 కోట్లకు పెరిగింది. ఈ క్యూ2లో మొత్తం వ్యయాలు రూ.2,300 కోట్లుగా ఉండగా, గత క్యూ2లో రూ.1,737 కోట్లని అజయ్ సింగ్ పేర్కొన్నారు. విమానయాన ఇంధనం ధరలు 48 శాతం, విదేశీ మారక ద్రవ్య రేటు 10 శాతం పెరగడంతో వ్యయాలు ఈ స్థాయిలో పెరిగాయని తెలిపారు. గత క్యూ2లో రూ.140 కోట్ల నిర్వహణ లాభం రాగా, ఈ క్యూ2లో రూ.322 కోట్ల నిర్వహణ నష్టాలు వచ్చాయని వివరించారు. లోడ్ ఫ్యాక్టర్ ‘రికార్డ్’ ఈ క్యూ2లో రికార్డ్ స్థాయి లోడ్ ఫ్యాక్టర్, 93.5 శాతం సాధించామని అజయ్ సింగ్ తెలిపారు. మొత్తం విమానయాన రంగానికే ఈ క్యూ2 సమస్యాత్మక క్వార్టర్ అన్నారాయన. ‘‘దూకుడుగా నెట్‌వర్క్‌ను విస్తరించడం, కఠినమైన వ్యయ నియంత్రణ పద్ధతులు, ఉద్యోగుల అంకిత భావం, అధిక మైలేజీనిచ్చే విమానాలను వినియోగించడం వంటి కారణాల వల్ల ఈ క్యూ2 సమస్యలను తట్టుకోగలిగాం. విమాన చార్జీలు అధికంగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దిగివస్తుండటం, రూపాయి పుంజుకోవటం వంటి సానుకూలాంశాల కారణంగా నిర్వహణ మరింతగా మెరుగుపడే అవకాశముంది. ఈ క్యూ3లో మరో పది బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను డెలివరీ తీసుకోనున్నాం. ఇక నాలుగో క్వార్టర్లో ఎనిమిది వరకూ మ్యాక్స్ విమానాలను అదనంగా అందుబాటులోకి తెస్తాం’’ అని అజయ్ సింగ్ వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో స్పైస్‌జెట్ షేర 2.8 శాతం లాభంతో రూ.83.70 వద్ద ముగిసింది. -
ఏవియేషన్‌కు ఈ ఏడాది కష్టమే: క్రిసిల్
ముంబై: ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీ నష్టాలు మూటగట్టుకోనున్నాయని రేటింగ్స్ సంస్థ క్రిసిల్ అంచనా వేసింది. ఇంధన ధరలు గరిష్ట స్థాయికి చేరడం, రూపాయి విలువ జీవిత కాలంలోనే కనిష్ట స్థాయికి పడిపోవడం నష్టాలకు కారణాలుగా తెలిపింది. విమాన టికెట్ చార్జీలను 12 శాతం పెంచడం ద్వారా పెరిగిన వ్యయాలను అధిగమించొచ్చని సూచించింది. అంతేకాక విమానయాన సంస్థల రుణ భారం 10 శాతం మేర పెరుగుతుందని కూడా అంచనా వేసింది. ప్రస్తుతం ప్రయాణికుల్లో 71 శాతం వాటా జెట్ ఎయిర్వేస్, స్పైస్‌జెట్, ఇండిగో సంస్థల చేతుల్లోనే ఉంది. -
రూ.888 కే విమాన టికెట్
సాక్షి,ముంబై: ఒక వైపు భారీగా పెరిగిన ఇంధన ధరలు విమానయాన సంస్థలను ఇబ్బందిపెడుతున్నప్పటికీ పండుగ సీజన్‌ను క్యాష్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఇండిగో దివాలీ సేల్ ప్రకటించగా తాజాగా మరో లోకాస్ట్ ఎయిర్‌లైన్ స్పైస్ జెట్ కూడా డిస్కౌంట్ ధరల్లో విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. ప్రత్యేక దివాలీ సేల్‌ను ప్రారంభించింది. అన్నీ చార్జీలు కలిపి ఒకవైపు ప్రయాణానికి రూ.888 ప్రారంభ ధరగా టికెట్లను అందిస్తోంది. ఆ ఆఫర్లో టికెట్లను బుక్ చేసుకునే గడువు అక్టోబర్ 28తో ముగియనుంది. ఇలా బుక్ చేసుకున్న టికెట్లు నవంబర్ 8 నుంచి మార్చి 31, 2019వరకు చెల్లబాటు అవుతాయని స్పైస్ జెట్ ప్రకటించింది. కాగా దేశీయ అంతర్జాతీయమార్గాల్లో ఇండిగోదివాల్ సేల్‌ను బుధవారం లాంచ్ చేసింది. దేశీయంగా రూ.899 ప్రారంభ ధరలో టికెట్లను ఆఫర్ చేసింది. ఇది అక్టోబర్ 24తో ముగిసింది. Your festive season just got a lot spicier! SpiceJet presents the ‘Festive Season Sale’. Domestic air-fares starting at Rs 888/-* all inclusive. Let the celebrations begin! Booking Period: till 28th October, 2018 Travel Period: 8th November, 2018 to 31st March, 2019 T&Cs Apply pic.twitter.com/qVb4u0NKLK — SpiceJet (@flyspicejet) October 25, 2018 -
షిర్డీ–హైదరాబాద్ మధ్య స్పైస్‌జెట్ విమానం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ స్పైస్‌జెట్ నవంబర్ 3 నుంచి షిర్డీ–హైదరాబాద్ మధ్య ప్రతిరోజూ డైరెక్ట్ సర్వీసు నడుపనుంది. ఉదయం 9.35కు హైదరాబాద్‌లో బయల్దేరే విమానం షిర్డీలో 11 గంటలకు దిగుతుంది. తిరుగు ప్రయాణంలో 11.20కి ప్రారంభమై 12.40కి హైదరాబాద్ చేరుకుంటుంది. ఇందుకోసం బాంబార్డియర్ క్యూ400 రకం విమానాన్ని కేటాయించామని స్పైస్‌జెట్ చీఫ్ సేల్స్, రెవెన్యూ ఆఫీసర్ శిల్పా భాటియా తెలిపారు. టికెట్ ధర షిర్డీకి రూ.3,999, తిరుగు ప్రయాణానికి రూ.3,900లు ఉంది. ప్రస్తుతం ఢిల్లీ నుంచి షిర్డీకి డైరెక్ట్ ఫ్లయిట్‌ను సంస్థ నడుపుతోంది. -
ఇండియాలో జీవ ఇంధనంతో తొలి ఫ్లయిట్
-
నేడే గగనతలంలోకి తొలి జీవ ఇంధన విమానం..
సాక్షి, హైదరాబాద్ : నిజం.. మన దేశంలో జీవ ఇంధనంతోనడిచే తొలి విమానం నేడు గాల్లోకి ఎగరనుంది. ప్రైవేట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ విమానం (బాంబార్డియర్ క్యూ400 టర్బోప్రోప్) సోమవారం డెహ్రాడూన్ నగరంపైఓ 10 నిమిషాల పాటు చక్కర్లు కొట్టి.. అక్కడి విమానాశ్రయంలో దిగుతుంది. అంతా సవ్యంగా సాగితే.. ఢిల్లీ వరకు సర్వీసును కొనసాగిస్తుంది. ఇలా జీవ ఇంధనంతో నడిచే విమాన సర్వీసులను అమెరికా, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలే నిర్వహిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇలాంటివి తక్కువే. ఆ లెక్కన మన దేశం ఓ రికార్డు సృష్టిస్తున్నట్లే. జీవ ఇంధనం అంటే? పునర్వినియోగ వనరుల నుంచి ఉత్పత్తి చేసిన ఇంధనాన్ని డీజిల్ లేదా పెట్రోల్‌కు స్థానంలో ఉపయోగించడం లేదా వాటితో కలిపి మిశ్రమంగా వాడే దాన్ని జీవ ఇంధనం అంటారు. అంటే ఎథనాల్ వంటివి. దీన్ని చెరకు, మొక్కజొన్న వంటి వాటి నుంచి తయారుచేస్తారు. -
బయో ఇంధనంతో తొలి విమానం..
సాక్షి, న్యూఢిల్లీ : భారత్ నుంచి తొలిసారిగా బయో ఇంధనం ఉపయోగించి సోమవారం డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి విమానం చేరుకోనుంది. ఈ ఇంధనం ఉపయోగిస్తూ డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి టర్బోప్రాప్, క్యూ-400 ఆపరేట్ చేయాలని స్పైస్‌జెట్ సన్నాహాలు చేస్తోంది. అమెరికా, ఆస్ర్టేలియాలు ఇప్పటికే బయో ఇంధనంతో కమర్షియల్ విమానాలను విజయంవతంగా నడుపుతున్నాయి. ఈ తరహా బయోఇంధనంతో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విమానాలను నడిపే తొలిదేశంగా భారత్ గుర్తింపుపొందనుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం డెహ్రాడూన్‌లో బయో ఇంధనంతో బాంబార్డియర్ క్యూ-400 పదినిమిషాల పాటు నగరంలో చక్కర్లు కొట్టి తిరిగి టేకాఫ్ అయిన ప్రాంతానికి చేరుకుంటుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే విమానం మరోసారి టేకాఫ్ తీసుకుని ఈసారి ఢిల్లీకి బయలుదేరుతుంది. ఈ విమానం ఎగిరే తీరు, ప్రయాణ తీరుతెన్నులను పర్యవేక్షించేందుకు డీజీసీఏ సహా పలు రెగ్యులేటరీ ఏజెన్సీల అధికారులు విమానంలో ప్రయాణించనున్నారు. -
స్పైస్‌జెట్ నష్టాలు రూ.38 కోట్లు
ముంబై: విమానయాన సంస్థ, స్పైస్‌జెట్‌కు ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ క్వార్టర్లో రూ.38 కోట్ల నికర నష్టాలొచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.175 కోట్ల మేర నికర లాభం సాధించామని స్పైస్‌జెట్ తెలియజేసింది. ఇంధనం ధరలు అధికంగా ఉండటం, రూపాయి క్షీణించడం, రూ.64 కోట్ల మేర వన్ టైమ్ కేటాయింపుల కారణంగా ఈ క్యూ1లో నష్టాలొచ్చాయని స్పైస్‌జెట్ చైర్మన్ అజయ్ సింగ్ చెప్పారు. అయితే నికర ఆదాయం 20 శాతం పెరిగిందని తెలియజేశారు. గత క్యూ1లో రూ.1,886 కోట్లుగా ఉన్న నికర ఆదాయం ఈ క్యూ1లో రూ.2,278 కోట్లకు పెరిగిందన్నారు. ఇంధన బిల్లు రూ.534 కోట్ల నుంచి రూ.812 కోట్లకు ఎగసిందని, రూ.51 కోట్ల మేర ఫారెక్స్ నష్టాలు వచ్చాయని వివరించారు. ఎబిటా 64 శాతం పతనమై రూ.84 కోట్లకు తగ్గిందని, ఎబిటా మార్జిన్ 8.7 శాతం తగ్గి 3.7 శాతానికి క్షీణించిందని వెల్లడించారు. ‘‘ఈ క్యూ1లో రికార్డ్ స్థాయి దేశీయ లోడ్ ఫ్యాక్టర్, 94.53 శాతాన్ని సాధించాం’’ అన్నారాయన. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో స్పైస్‌జెట్ షేర్ 0.8 శాతం క్షీణించి రూ.89 వద్ద ముగిసింది. ఆర్థిక ఫలితాలు వెల్లడించిన రెండో విమానయాన కంపెనీ ఇది. ఇటీవలే ఇండిగో కంపెనీ ఫలితాలు వెల్లడించింది. ఈ కంపెనీ నికర లాభం 97 శాతం హరించుకుపోయింది. కాగా మూడో లిస్టెడ్ కంపెనీ, జెట్ ఎయిర్వేస్ ఆడిట్, లిక్విడిటీ తదితర సమస్యల కారణంగా తన క్యూ1 ఫలితాలను నిరవధికంగా వాయిదా వేసింది. -
భారీగా పడిపోయిన జెట్ ఎయిర్వేస్ షేర్
ముంబై : దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ షేరు భారీగా పడిపోయింది. ట్రేడింగ్ ప్రారంభంలో జెట్ ఎయిర్వేస్ షేరు 14.5 శాతం మేర కిందకి దిగ జారింది. ఇది మూడేళ్ల కనిష్ట స్థాయి. తొలి క్వార్టర్ ఫలితాలను కంపెనీ వాయిదా వేయడంతో, షేర్ ధర తీవ్ర ఒడిదుడుకులు పాలవుతోంది. 2018-19 ఆర్థిక సంవత్సరపు జూన్‌తో ముగిసిన తొలి క్వార్టర్ ఫలితాలను ప్రకటించడానికి ఆ కంపెనీ ఆడిటర్లు ఆమోదం తెలుపలేదు. కొన్ని విషయాల మూసివేత కారణంతో ఆడిట్ కమిటీ, కంపెనీ బోర్డుకు ఫలితాల ప్రకటన గురించి ఎలాంటి ఆమోదం పంపించలేదు. దీంతో కంపెనీ ఫలితాల ప్రకటన వాయిదా వేస్తున్నట్టు జెట్ ఎయిర్వేస్ ప్రకటించింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే గత ముగింపుకు 6.53 శాతం నష్టంలో జెట్ ఎయిర్వేస్ షేరు ఎంట్రీ ఇచ్చింది. ఆ అనంతరం మరింత కిందకి పడిపోతూ వస్తోంది. జెట్ ఎయిర్వేస్ షేరు ఇంతలా పడిపోతూ ఉంటే.. దీని ప్రత్యర్థి కంపెనీలు ఇంటర్గ్లోబల్ ఏవియేషన్ లిమిటెడ్, స్పైస్‌జెట్‌లు 1.7 శాతం, 2.2 శాతం పైకి ఎగుస్తున్నాయి. జెట్ ఎయిర్వేస్ ఫలితాలపై ఇప్పటికే విశ్లేషకులు ప్రతికూలంగా స్పందిస్తున్నారు. బ్రోకరేజ్ సంస్థ ఎలరా క్యాపిటల్ అంచనాల ప్రకారం జెట్ ఎయిర్వేస్ రూ.490 కోట్ల నికర నష్టాలను నమోదు చేస్తుందని తెలుస్తోంది. ఇంధన ఖర్చులు పెరిగిపోవడం, రూపాయి విలువ క్షీణించడం వంటి కారణాలతో ఈ సారి ఏవియేషన్ సెక్టార్ అవుట్‌లుక్ పరిస్థితి కాస్త గందరగోళంగానే ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల ఇండిగో తాను ప్రకటించిన ఫలితాల్లో నికర లాభాల్లో 97 శాతాన్ని కోల్పోయింది. ఇదే అత్యంత చెత్త ప్రదర్శన అని కంపెనీ పేర్కొంది. స్పైస్‌జెట్ తన ఫలితాలను వచ్చే వారంలో ప్రకటించబోతుంది. మరోవైపు ఇంధన ధరలు పెరిగిపోవడం, రూపాయి విలువ క్షీణించడం వంటి కారణాలతో జెట్ ఎయిర్వేస్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి మరలింది. తొలుత ఉద్యోగుల వేతనాల్లో 25 శాతం కోత పెట్టాలని చూసింది. ఆ ప్రతిపాదనకు పైలెట్లు ఒప్పుకోకపోవడంతో, 500 మంది ఉద్యోగులను తీసివేయాలని ప్లాన్ చేస్తున్నట్టు రిపోర్టులు వస్తున్నాయి. అంతేకాక తన క్యారియర్ వాటాను కొంతమేర విక్రయించేందుకు సాయపడాలని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లను సైతం జెట్ ఎయిర్వేస్ కోరింది. -
రూ.1,323 కోట్ల ఆర్బిట్రేషన్‌ను కోల్పోయిన మారన్
ముంబై: స్పైస్‌జెట్ మాజీ యజమాని, సన్ టీవీ గ్రూపు అధినేత కళానిధి మారన్‌కు రూ.1,323 కోట్ల నష్ట పరిహారాన్ని స్పైస్‌జెట్ చెల్లించక్కర్లేదని ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ తేల్చింది. కన్వర్టబుల్ వారంట్లు, ప్రిఫరెన్షియల్ షేర్లు జారీ చేయనందుకు ఈ మొత్తాన్ని కళానిధి మారన్, ఆయనకు చెందిన కాల్ ఎయిర్వేస్కు చెల్లించాలన్న అభ్యర్థనను ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ కొట్టివేసినట్టు స్పైస్‌జెట్ తెలిపింది. అయితే, అదే సమయంలో మారన్‌కు రూ.579 కోట్లను 12 శాతం వడ్డీ రేటుతో వెనక్కి చెల్లించేయాలని ఆదేశించినట్టు పేర్కొంది. ఈ కేసు 2015 జనవరి ముందు నాటిది. స్పైస్‌జెట్‌ను కళానిధి మారన్ నుంచి దాని మాజీ యజమాని అజయ్ సింగ్ కొనుగోలు చేయగా... నాడు చేసుకున్న ఒప్పందాన్ని సింగ్ అమలు చేయలేదని మారన్ ఆరోపణ. -
స్పైస్‌జెట్ ‘థ్రిల్లింగ్ థర్స్డే’ ఆఫర్
చవక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ స్పెషల్ ‘థ్రిల్లింగ్ థర్స్డే’ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద విమాన టిక్కెట్లపై వెయ్యి రూపాయల వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. డిస్కౌంట్ ఆఫర్‌తో పాటు, ప్రియారిటీ చెక్-ఇన్ను కూడా తన కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది. నేడు అంటే గురువారం ఈ ఆఫర్ వాలిడ్‌లో ఉంది. అంతేకాక వచ్చే గురువారం జూలై 26న కూడా ఈ ఆఫర్ వాలిడ్‌లో ఉంటుంది. ఈ ఆఫర్ టిక్కెట్లు స్పైస్‌జెట్ వెబ్సైట్, స్పైస్‌జెట్.కామ్, మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. స్పైస్‌జెట్ థ్రిల్లింగ్ థర్స్డే ఆఫర్ పొందడానికి కస్టమర్లు ప్రోమో కోడ్ ఎస్సీబీ1000ను వాడాల్సి ఉందని ఎయిర్‌లైన్ తన వెబ్సైట్లో తెలిపింది. స్పైస్‌జెట్ థ్రిల్లింగ్ థర్స్డే ఆఫర్ పొందడమెలా... స్పైస్‌జెట్ థ్రిల్లింగ్ థర్స్డే ఆఫర్ విమాన టిక్కెట్లను 2018 జూలై 26 వరకు వచ్చే గురువారాల్లో బుక్ చేసుకోవాలి. www.spicejet.com, స్పైస్‌జెట్ మొబైల్ యాప్‌లపై విమానాన్ని ఎంపిక చేసుకోవాలి. బుక్ చేసుకునేటప్పుడే ప్రియారిటీ చెక్-ఇన్ను పొందాలి. ప్రమోకోడ్ ఎస్సీబీ1000ను అప్లయి చేసుకోవాలి. పేమెంట్ పేజీపై ఉన్న ప్రమోషన్ కోడ్ సెక్షన్లో స్టాండర్డ్ ఛార్టడ్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు నెంబర్ నమోదు చేయాలి. రౌండ్ ట్రిప్ బుకింగ్‌కు వెంటనే రూ.1000 డిస్కౌంట్ పొందుతారు. వన్ వే బుకింగ్‌కు రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది. -
స్పైస్‌జెట్ మాన్సూన్ బొనాంజ
న్యూఢిల్లీ : విమానయాన సంస్థలు మాన్సూన్ ఆఫర్లతో హోర్రెత్తిస్తున్నాయి. తాజాగా స్పైస్‌జెట్ ‘మెగా మాన్సూన్ సేల్’ను ప్రకటించింది. దీని కింద దేశీయ విమాన టిక్కెట్లను రూ.999కే అందిస్తున్నట్టు పేర్కొంది. స్పైస్‌జెట్ తీసుకొచ్చిన ఈ కొత్త ప్రమోషనల్ సేల్ 2018 జూలై 8 వరకే వాలిడ్‌లో ఉంటుందని స్పైస్‌జెట్ తన వెబ్సైట్లో ప్రకటించింది. 2018 అక్టోబర్ 8వ తేదీకి ఈ ఆఫర్ ప్రయాణ కాలం ముగియనుంది. తక్కువ ధరకు టిక్కెట్లను అందించడమే కాకుండా.. ఎయిర్‌లైన్ అధికారిక వెబ్సైట్లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తున్నట్టు పేర్కొంది. సీట్లు, మీల్స్, స్పైస్‌మ్యాక్స్, ఇతర యాడ్-ఆన్స్‌పై 20 శాతం డిస్కౌంట్‌ను ఈ క్యారియర్ అందిస్తున్నట్టు తెలిపింది. అదనపు డిస్కౌంట్ ఆఫర్ ప్రోమో కోడ్ ఏడీడీ0ఎన్20గా స్పైస్‌జెట్ వెల్లడించింది. స్పైస్‌జెట్ ‘మెగా మాన్సూన్ సేల్’ నియమ, నిబంధనలు... వన్-వే ధరలకు మాత్రమే ఈ మెగా సేల్ వర్తిస్తోంది. ఈ ఆఫర్‌ను మిగతా ఏ ఆఫర్‌తో కలుపరు. గ్రూప్ బుకింగ్స్‌కు ఇది వర్తించదు. ఒకవేళ అవసరమైతే స్వల్ప రద్దు ఛార్జీలతో టిక్కెట్ ధర మొత్తాన్ని రీఫండ్ చేయనుంది. ఫస్ట్-కమ్, ఫస్ట్-సర్వ్డ్ బేసిస్‌లోనే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. విమానం బయలుదేరే సమయం, ఇతర షెడ్యూల్స్ రెగ్యులేటరీ ఆమోదం మేరకే ఉంటాయి. ఈ ఆఫర్‌కు బ్లాక్-అవుట్ డేట్స్ వర్తిస్తాయి. స్పైస్‌జెట్ అదనపు 20 డిస్కౌంట్ ఆఫర్... స్పైస్‌జెట్.కామ్ ద్వారా బుకింగ్స్ చేసుకునే యాడ్-ఆన్ ప్రొడక్ట్‌లకు మాత్రమే 20 శాతం అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. స్పైస్‌మ్యాక్స్, సీట్, హాట్ మీల్, ప్రియారిటీ చెక్ఇన్, ప్రిఫర్డ్ బ్యాగ్ అవుట్ వంటి వాటికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. అన్ని ఇతర ఛార్జీలు, ఫీజులు, పన్నులను ప్రయాణికులే చెల్లించాల్సి ఉంటుంది. దేశీయ, అంతర్జాతీయ విమానాల రౌండ్-ట్రిప్, వన్‌వే బుకింగ్స్ రెండింటికీ ఈ ఆఫర్ వాలిడ్‌లో ఉంటుంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ ఆఫర్‌ను సవరించుకోవడం, రద్దు చేసుకోవడం చేయొచ్చు. -
మాన్సూన్ స్పెషల్ : ఎయిర్‌లైన్స్ భారీ డిస్కౌంట్లు
మాన్సూన్ వచ్చేసింది.. విమానయాన సంస్థలు కొత్త కొత్త ఆఫర్లతో ప్రయాణికుల ముందుకు వచ్చేశాయి. గగనతలంలో ఒక్కసారైనా చక్కర్లు కొట్టాలనే ఆశపడే వారి కలల్ని నేరవేర్చేందుకు విమానయాన సంస్థలు బిగ్ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. కొన్ని సెక్టార్లలో విమాన టిక్కెట్లను అత్యంత తక్కువగా రూ.1,199కే ఆఫర్ చేస్తున్నాయి. ఎయిర్‌లైన్స్ ఆఫర్ చేసే టిక్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయో ఓసారి చూద్దాం.. స్పైస్‌జెట్: ఎంపిక చేసిన రూట్లలో దేశీయ విమానాల్లో ప్రయాణించడానికి రూ.1,149 నుంచి టికెట్లు విక్రయిస్తోంది స్పైస్‌జెట్ సంస్థ. ఈ టిక్కెట్లను ఈనెల 30 వరకు మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణకాలం జులై 1 నుంచి అక్టోబరు 8 మధ్యలో చేయవలసి ఉంటుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్‌లో వన్ వే ధరలకు మాత్రమే ఈ డిస్కౌంట్ అందబుఆటులో ఉంటుంది. ఇండిగో: ఎంపిక చేసిన మార్గాల్లో, ఎంపిక చేసిన విమానాలకు అన్ని ఎక్స్‌క్లూజివ్ ఫేర్స్‌ను కలుపుకుని టిక్కెట్ ధర రూ.1199 నుంచి ప్రారంభవుతుంది. ఇవి కూడా జూన్ 30 లోపు బుక్ చేసుకోవాలి. ప్రయాణం జులై 11 నుంచి సెప్టెంబరు 27 మధ్య చేసేవారికి అనుకూలం. మధ్యలో ఆగి మరో చోటుకి వెళ్లాలంటే కుదరదు. నాన్‌స్టాప్ గమ్యాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. గ్రూప్ బుకింగ్స్‌కు ఇది అందుబాటులో ఉండదు. ఈ ఆఫర్ బుకింగ్స్ ట్రావెల్ చేయడానికి 15 రోజుల ముందు వరకు మాత్రమే వాలిడ్‌లో ఉంటాయి. గో ఎయిర్: స్వదేశంలో ప్రయాణానికి ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్‌లో టిక్కెట్ ధర రూ.1199 నుంచి ప్రారంభమవుతుంది. జూన్ 30 వరకి ఈ బుకింగ్ పిరియడ్ ఉంటుంది. జూలై 10 నుంచి సెప్టెంబరు 30 వరకు ప్రయాణానికి ఈ టిక్కెట్లు వర్తిస్తాయి. బ్లాక్ తేదీలు అమల్లో ఉంటాయని, టిక్కెట్ బుక్ చేసుకునేటప్పుడే వీటిని ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుందని గోఎయిర్ తెలిపింది. తేదీ మార్పు లేదా రూట్ల మార్పు ఉండదు. ఇన్ఫాంట్ బుకింగ్‌కు ఇది అందుబాటులో ఉండదు. తేదీ మార్పు, రీబుకింగ్, రీఫండ్ ఛార్జ్‌లు ఫేర్ రూల్స్ ప్రకారం వర్తిస్తాయి. జెట్ ఎయిర్వేస్: స్వదేశీ, విదేశీ మార్గాల్లో ప్రయాణించే వారికి కనీసధరపై 30 శాతం రాయితీని ఇస్తున్నట్లు తెలిపింది. ఇది కూడా జూన్ 30 వరకే టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నవంబరు 5 వరకు ప్రయాణించే అవకాశం ఉంది. అయితే ఆమ్స్టర్ డ్యామ్, కొలంబో, పారిస్‌లకు మాత్రం ఈ ఆఫర్ వర్తించదు. ఇండియాలోనే ప్రయాణించాలనుకునే ఎంపిక చేసిన విమానాల ఎకానమీ టిక్కెట్ల బేస్ ఛార్జీకి 25 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ విమానాలకు 30 శాతం వరకు డిస్కౌంట్ వర్తిస్తుంది. ప్రయాణాలనుకునే తేదీకి 15 రోజుల ముందస్తుగా ఈ టిక్కెట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ కిందనే అంతర్జాతీయ మార్గాల్లో ఎకానమీ విమాన టిక్కెట్లపై వెయ్యి రూపాయలు, ప్రీమియర్ విమాన టిక్కెట్లపై 2500 రూపాయల తగ్గింపు కూడా లభిస్తోంది. ఎయిరేషియా: స్వదేశీ, విదేశీ మార్గాల్లో ప్రయాణానికి 20 శాతం రాయితీని ప్రకటించింది. ఈ సర్వీసులో జులై 1 వరకు టిక్కెట్లు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. జులై 2 నుంచి నవంబరు 30 మధ్య ప్రయాణించే సౌలభ్యం ఉంది. వన్‌వేకి మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయి. పేర్ల మార్పు ఉండదు. ట్రూజెట్: హైదరాబాద్-నాందేడ్ మధ్య ప్రయాణానికి టిక్కెట్ ధర రూ.899 నుంచి ప్రారంభమవుతుంది. తమ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకుంటే మరికొన్ని మార్గాల్లో ప్రయాణించాలంటే కూడా రాయితీ ఉంటుందని కంపెనీ తెలియజేసింది. -
అదనపు బ్యాగేజీపై ఇక ఛార్జీల బాదుడే
న్యూఢిల్లీ : దేశీయ విమానాల్లో 15 కేజీల కంటే అదనంగా చెక్-ఇన్ బ్యాగేజీ తీసుకెళ్తున్నారా? అయితే ఇక మీకు ఛార్జీల మోత మోగినట్టేనట. ప్రైవేట్ విమానయాన సంస్థలు ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్‌లు అదనపు బ్యాగేజీల ప్రీ-బుకింగ్ ఛార్జీలను, ఎయిర్‌పోర్ట్‌ల వద్ద చెల్లించే అదనపు చెక్-ఇన్ బ్యాగేజీల ఛార్జీలను పెంచేశాయి. ఎయిర్‌పోర్టుల వద్ద 15 కేజీలకు మించి అదనపు బ్యాగేజీని తీసుకెళ్లాల్సి వస్తుందని తెలిపితే, ఒక్కో కిలోకు ప్రస్తుతం 400 రూపాలను ఛార్జ్ చేస్తున్నాయి విమానయాన సంస్థలు. ఇండిగో అదనపు బ్యాగేజీ ఛార్జీలను మూడో వంతు లేదా 33 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రీ-బుకింగ్ చేసుకునేటప్పుడు దేశీయ ప్రయాణికులు ఉచితంగా అందించే 15 కేజీలను మించి మరో 5, 10, 15, 30 కేజీలను తీసుకెళ్తున్నట్టు నమోదు చేస్తే, ఇక నుంచి రూ.1900, రూ.3800, రూ.5700, రూ.11,400ను చెల్లించాల్సి ఉంటుంది. గత ఆగస్టులోనే ఇండిగో ఈ ఛార్జీలను పెంచింది. తాజాగా మరోసారి కూడా వీటిని పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. ఇక స్పైస్‌జెట్ సైతం 5, 10, 15, 20, 30 కేజీల అదనపు బ్యాగేజీకి విధించే ప్రీబుక్ ఛార్జీలను రూ.1600, రూ.3200, రూ.4800, రూ.6400, రూ.9600కు పెంచుతున్నట్టు తెలిపింది. ఎవరైతే ప్రీబుక్ చేసుకోరో వారు అదనపు చెక్-ఇన్ బ్యాగేజీకి ఒక్కో కిలోకు 400 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. గోఎయిర్ అదనపు బ్యాగేజీ ఛార్జీలు అచ్చం ఇండిగో మాదిరిగానే ఉన్నాయి. ప్రభుత్వం రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా మాత్రమే 25 కేజీల వరకు చెక్-ఇన్ బ్యాగేజీని ఉచితంగా అనుమతి ఇస్తోంది. గతేడాది ఆగస్టు వరకు ఎయిర్‌లైన్స్ అన్నీ 15 కేజీలకు మించి.. తొలి ఐదు కిలోల అదనపు బ్యాగేజీకి కేవలం 500 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేసేవి. డీజీసీఏ ఆదేశాల ప్రకారం ఎయిర్‌లైన్స్ నడుచుకునేవి. కానీ డీజీసీఏ ఆదేశాలను కోర్టులో సవాల్ చేసిన ఎయిర్‌లైన్స్, 15 కేజీలకు మించిన తర్వాత విధించే అదనపు బ్యాగేజీ ఛార్జీలను అవి మాత్రమే నిర్ణయించుకునేలా ఆదేశాలను తెచ్చుకున్నాయి. -
స్పైస్‌జెట్ కొత్తగా 14 విమానాలు, బుకింగ్స్ ఓపెన్
న్యూఢిల్లీ : బడ్జెట్ ప్యాసెంజర్ క్యారియర్ స్పైస్‌జెట్ కొత్తగా 14 దేశీయ విమానాలను ప్రకటించింది. జూలై 1 నుంచి ఈ కొత్త విమానాలు తిరగనున్నాయని పేర్కొంది. డైరెక్ట్ కనెక్టివిటీని పెంచడానికి, నాన్-మెట్రోలు, చిన్న నగరాల్లో విమాన సర్వీసులను అందజేయడానికి ఈ కొత్త విమానాలను స్పైస్‌జెట్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త విమానాలతో సౌత్, వెస్ట్ ఇండియాలో తన నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసుకోనున్నట్టు పేర్కొంది. పుణే-పాట్నా, చెన్నై-రాజమండ్రి, హైదరాబాద్-కాలికట్, బెంగళూరు-తూత్కుడి సెక్టార్లలో ఈ కొత విమానాలను ప్రవేశపెడుతోంది. అదనంగా ఢిల్లీ-పాట్నా(రెండో ఫ్రీక్వెన్సీ), బెంగళూరు-రాజమండ్రి(రెండో ఫ్రీక్వెన్సీ), ముంబై-బెంగళూరు(ఐదో ఫ్రీక్వెన్సీ) సెక్టార్లలో కూడా ఆపరేషన్లను కొనసాగించనుంది. తమ కొత్త బోయింగ్ 737 ఎయిర్‌క్రాఫ్ట్, క్యూ400 రీజనల్ టర్బోప్రూప్స్తో తమ సర్వీసులను వేగవంతంగా విస్తరించనున్నామని స్పైస్‌జెట్ చీఫ్ సేల్స్, రెవెన్యూ ఆఫీసర్ శిల్పా భటియా చెప్పారు. ఢిల్లీ-పాట్నా, ముంబై-బెంగళూరు, చెన్నై-రాజమండ్రి సెక్టార్లలో ప్రవేశపెట్టిన విమానాలు రోజువారీ నడవనున్నాయి. అదేవిధంగా హైదరాబాద్-కాలికట్, బెంగళూరు-తూత్కుడి, బెంగళూరు-రాజమండ్రి రూట్లలో నడిచే విమానాలు మంగళవారాలు తప్ప మిగిలిన అన్ని రోజుల్లో నడుస్తాయి. పాట్నా-పుణే మధ్యలో నడిచే విమానాలు శనివారం మినహాయించి, మిగిలిన అన్ని రోజుల్లో తన కార్యకలాపాలను సాగిస్తాయి. రాజమండ్రి, పాట్నా, తూత్కుడి, కాలికట్ వంటి చిన్న నగరాల ప్రజలు కూడా ఇక నుంచి చాలా తేలికగా ప్రయాణించనున్నారు. స్పైస్‌జెట్ అధికారిక వెబ్సైట్-స్పైస్‌జెట్.కామ్, యాప్‌లలో కూడా ఈ విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇటీవలే స్పైస్‌జెట్ తూత్కుడి నుంచి బెంగళూరుకు డైరెక్ట్ ఫ్లైట్ ప్రారంభించింది. -
బట్టలు విప్పించి తనిఖీ చేశారు
టీ.నగర్(చెన్నై): విమానయాన సంస్థ స్పైస్‌జెట్ వివాదంలో చిక్కుకుంది. విమానం దిగగానే తమను స్పైస్‌జెట్ భద్రతాసిబ్బంది దుస్తులు విప్పించి తనిఖీలు చేస్తున్నారని ఎయిర్‌హోస్టెస్‌లు ఆరోపించారు. ప్రయాణికులకు ఆహారపదార్థాల విక్రయాల ద్వారా వచ్చిన నగదును కాజేస్తున్నామన్న అనుమానంతో ఈ తనిఖీలు చేస్తున్నారన్నారు. భద్రతా సిబ్బంది తనిఖీల పేరిట తమను అభ్యంతరకరంగా తాకుతున్నారనీ, ఇది అత్యాచారం, వేధింపులకు ఏమాత్రం తక్కువకాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై చెన్నై ఎయిర్‌పోర్టులో శనివారం ఎయిర్‌హోస్టెస్‌లు ఆందోళనకు దిగిన వీడియో ఆన్లైన్లో వైరల్‌గా మారింది. నగదును కాజేసిన సిబ్బంది కొందరు ఈ తనిఖీల్లో దొరికిపోయారనీ, వారిపై చర్యలు తీసుకుంటామని స్పైస్‌జెట్ పేర్కొంది. -
వారికి క్యాన్సిలేషన్ ఛార్జీలు రద్దు
న్యూఢిల్లీ : మాల్దీవుల అంతర్గత సంక్షోభం నేపథ్యంలో బడ్జెట్ క్యారియర్ స్పైస్‌జెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మాల్దీవుల రాజధాని మాలే నుంచి, మాలేకు ప్రయాణించే వారికి క్యాన్సిలేషన్, ఇతర ఛార్జీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఫిబ్రవి 8 నుంచి 14 వరకు తమ ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొంది. ''ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు మాలే నుంచి లేదా మాలేకు ప్రయాణించే ప్రయాణికులు తమ టిక్కెట్ల క్యాన్సిలేషన్‌ను చేపట్టుకోవచ్చు. మొత్తం టిక్కెట్ ఛార్జీలను రీఫండ్ చేస్తాం. క్యాన్సిలేషన్ ఛార్జీలను రద్దు చేశాం'' అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం మాల్దీవుల్లో నెలకొన్న అంతర్గత సంక్షోభం నేపథ్యంలో ప్రయాణం చేయడం ఇష్టం లేని ప్రయాణికులకు, మొత్తం రీఫండ్ చేస్తామని చెప్పింది. గురువారం ఎయిర్ ఇండియా కూడా ఈ ఛార్జీలను రద్దు చేసింది. మాల్దీవుల్లో ప్రస్తుతం అత్యయిక పరిస్థితి నడుస్తోంది. దీనిపై ప్రపంచ అగ్రనేతలందరూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థి, మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్‌తోపాటు మరో ఎనిమిది మంది చట్టసభ సభ్యులను జైలు నుండి విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రస్తుత అధ్యక్షుడు పట్టించుకోకపోవడం, న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయాలని దేశీయంగా ప్రజలు ఉద్యమించడం, భారత్, అమెరికా సహా పలు దేశాలు యమీన్‌పై ఒత్తిడి తేవడంతో మాల్దీవులు రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. -
12వ క్వార్టర్లోనూ స్పైస్‌జెట్‌కు లాభాలు
ముంబై: చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 32 శాతం వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.181 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.240 కోట్లకు పెరిగినట్లు కంపెనీ తెలియజేసింది. తమ కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక క్వార్టర్లీ లాభమని స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ చెప్పారు. ముడి చమురు ధరలు 17 శాతం ఎగిసినా, ఇతర వ్యయాలు 3 శాతం పెరిగినా, ప్రయాణికుల ఆదాయం అధికంగా ఉండటంతో ఈ స్థాయిలో నికర లాభం సాధించామని చెప్పారు. వరుసగా 12వ క్వార్టర్లోనూ లాభాల్లో ఉన్నామంటూ... గత క్యూ3లో రూ1,642 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో రూ.2,082 కోట్లకు పెరిగిందని తెలియజేశారు. -
స్పైస్ జెట్ 20 విమానాలు: 10 ఆంధ్రాకు
సాక్షి, ముంబై: విమానయాన సంస్థ స్పైస్‌జెట్ దేశీయంగా కొత్తగా 20 విమానాలను ప్రవేశపెట్టింది. దేశీయ రూట్లలో 20 నాన్‌స్టాప్ విమానాలను త్వరలోనే ప్రారంభించ నున్నామని కంపెనీ ప్రకటించింది. చెన్నై-మంగళూరు, గౌహతికి చెన్నై మార్గాలు సహా ఫిబ్రవరి 11 ప్రారంభించి అనేక మార్గాల్లో ఫ్రీక్వెన్సీని జోడిస్తున్నట్టు తెలిపింది. అంతేకాదు కోల్‌కతా, జబల్పూర్, బెంగళూరు, పుదుచ్చేరి మధ్య డైరెక్ట్ ఫ్టైట్ నడుపనున్న తొలి సంస్థగా స్పైస్ జెట్ నిలిచింది. తన కార్యకలాపాల విస్తరణలోభాగంగా చెన్నై-విశాఖపట్నం( సెకండ్ ఫ్రీక్వెన్సీ) కోల్‌కతా- విశాఖపట్నం( సెకండ్ ఫ్రీక్వెన్సీ) , చెన్నై-విజయవాడ( థర్డ్ ఫ్రీక్వెన్సీ) బెంగళూరు-చెన్నై (ఐదవ ఫ్రీక్వెన్సీ) రూట్లలో నాన్ స్టాప్ విమానాలను నడుపుతుంది. చెన్నై, విశాఖపట్నం, కోలకతా- విశాఖపట్నం, చెన్నై- విజయవాడ మధ్య రోజువారీ విమానాలు పనిచేస్తాయనీ, అయితే బెంగళూరు- తిరుపతి ధ్య మంగళవారాలు తప్ప అన్ని రోజుల్లోనూ తమ సేవలు అందుబాటులోఉంటాయని పేర్కొంది. దక్షిణాన 18 విమానాలతో నాన్ మెట్రో, మెట్రో నగరాల మధ్య అనుసంధానం పెంచుతున్నట్టు తెలిపింది. వీటిల్లో 10 సర్వీసులను ప్రాంతీయ కనెక్టివిటీ థీమ్ ‘కనెక్టెడ్ ది అన్‌కనెక్టెడ్ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కలుపుతున్నట్టు వెల్లడించింది. -
రూ.769లకే విమాన టికెట్
సాక్షి, న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగా విమానయాన సంస్థలు తగ్గింపు ధరల్లో టికెట్లను ఆఫర్ చేయడంలో పోటీ పడుతున్నాయి. తాజాగా ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ రిపబ్లిక్‌డే ఆఫర్ ప్రకటించింది. ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ పేరుతో ప్రత్యేక రూట్లలో పరిమిత కాలానికి డిస్కౌంట్ రేట్లలో టికెట్లను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ ఈ టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్లో టికెట్ బుకింగ్స్ జనవరి 22 నుంచి జనవరి 25వ తేదీ వరకు చేసుకోవచ్చు. ఈ ఏడాది డిసెంబరు 12 వరకు ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని ఒక ప్రకటనలో ఎయిర్ లైన్స్ వెల్లడించింది. దేశీయంగా 769 రూపాయలు (వన్ వే, అన్నీ కలుపుకొని) అంతర్జాతీయ ప్రయాణాల్లో టికెట్ ప్రారంభ ధర రూ.2.469 ఉంది. జమ్ము-శ్రీనగర్, సిల్చార్-గువహటి, డెహ్రాడూన్-ఢిల్లీ , ఢిల్లీ-జైపూర్, అగర్తల-గువహటి, కోయంబత్తూర్-బెంగళూరు, కొచ్చి-బెంగళూరు, ఢిల్లీ-డెహ్రాడూన్ తదితర మార్గాల్లో టికెట్ ప్రారంభ ధర రూ.769 ఉందని స్పైస్‌జెట్ వెల్లడించింది. అలాగే అంతర్జాతీయ నెట్‌వర్క్‌లో చెన్నై- కొలంబో రూట్‌కు టికెట్ ప్రారంభ ధర రూ.2,249 ఉందని తెలిపింది. స్పైస్‌జెట్ .కాం, లేదా సంస్థ మొబైల్ యాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎస్బీఐ క్రెడిట్ ద్వారా 10శాతందాకా డిస్కౌంట్. దాదాపు 500రూపాయల దాకా తగ్గింపు తోపాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఫ్రీ ప్రయారిటీ చెక్ సౌకర్యం కూడా. -
వినూత్న ఆఫర్ : జీరోకే విమాన టిక్కెట్
ఉచితంగా విమాన ప్రయాణం చేయాలనుకుంటున్నారా. అయితే స్పైస్‌జెట్ విమానం ఎక్కేయండి. వివిధ రకాల ఆఫర్లతో ఊరిస్తున్న విమాన సంస్థలకు బిన్నంగా స్పైస్‌జెట్ జీరోకే విమాన టిక్కెట్లను ఆఫర్ చేస్తోంది. విమాన ప్రయాణానికి చెల్లించిన మొత్తాన్ని తిరిగి వోచర్ రూపంలో చెల్లిస్తోంది. ఈ కొత్త డీల్ కింద ఎయిర్ఫేర్కు చెల్లించిన మొత్తం నగదును రిడీమ్ చేసుకునే ఆప్షన్‌ను తీసుకొచ్చింది. డిసెంబర్ 1 నుంచి ఈ ఆఫర్‌ను ప్రారంభించిందని, ఈ నెలంతా అంటే 2017 డిసెంబర్ 31 వరకు ఇది అందుబాటులో ఉంటుందని స్పైస్‌జెట్ తెలిపింది. 2017 డిసెంబర్ 1 నుంచి 2018 మార్చి 31 మధ్య ప్రయాణానికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఆఫర్ పొందడం ఎలా..? కంపెనీ సొంత వెబ్సైట్ www.spicejet.comలో మీరు విమాన టిక్కెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని ఛార్జీలతో కలిపి టికెట్ మొత్తాన్ని ఆ పోర్టల్ ద్వారా చెల్లించాలి. ఒక్కసారి ఆ లావాదేవీ పూర్తయిన తర్వాత స్పైస్జెట్కే చెందిన www.spicestyle.com వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. అక్కడ మీరు చెల్లించిన మొత్తాన్ని రిడీమ్ చేసుకోవడానికి, అన్ని వివరాలను నమోదుచేయాల్సి ఉంటుంది. తర్వాత స్టైల్ క్యాష్లోని మై అకౌంట్ సెక్షన్లోకి వెళ్లి, ఎస్సెమ్మెస్ ద్వారా వచ్చిన కోడ్‌ను ఎంటర్ చేయడం ద్వారా టికెట్‌కు చెల్లించిన మొత్తం స్టైల్క్యాష్లో జమ అవుతుంది. స్టైల్ క్యాష్ SpiceStyle.comకు చెందిన ఈ-వాలెట్. స్టైల్క్యాష్లో జమ అయిన ఈ మొత్తాన్ని www.spicestyle.com వెబ్సైట్లో కొనుగోళ్లకు ఉపయోగించుకోవచ్చు. ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా 30 శాతం మొత్తాన్ని వినియోగించుకోవచ్చు. స్టైల్క్యాష్ మొత్తాన్ని 2018 మార్చి 31లోపు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఒక పీఎన్ఆర్ నంబర్‌కు ఒక వోచర్‌ను మాత్రమే ఇస్తారని స్పైస్‌జెట్ తన వెబ్సైట్లో పేర్కొంది. మరే ఇతర స్పెషల్ ఆఫర్ లేదా ప్రమోషన్లకు దీన్ని వాడుకోవడానికి లేదని స్పైస్‌జెట్ తెలిపింది. ఎయిర్ఏసియా, ఇండిగో కూడా న్యూఇయర్ సందర్భంగా విమాన టిక్కెట్లపై పలు డిస్కౌంట్ ఆఫర్లను తీసుకొచ్చాయి. ఎయిర్ఏసియా రూ.999కే టిక్కెట్‌ను విక్రయిస్తుండగా... ఇండిగో రూ.1005కు విమాన టిక్కెట్‌ను అందిస్తోంది. -
ఎన్డీటీవీని అమ్మేశారా?
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీటీవీని (న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్) స్పైస్‌జెట్ సహ వ్యవస్థాపకులు అజయ్ సింగ్ కొనుగోలు చేశారన్న వార్తలు ఒక్కసారిగా మీడియాలో గుప్పు మన్నాయి. టీవీలో మెజారిటీ వాటాను అజయ్ సింగ్ కొనుగోలు చేశారని వార్తలు వచ్చాయి. ఈ ఒప్పందం ప్రకారం అజయ సింగ్ 40శాతం వాటాను, ప్రణయ్‌రాయ్, రాధికా రాయ్ సుమారు 20శాతం వాటాను కలిగి వుంటారని అంచనాలు వెలువడ్డాయి. డీల్ లో భాగంగా ఎన్డీటీవీకి చెందిన రూ.400 కోట్లు అప్పును కూడా అజయ్ స్వీకరించారని, మొత్తం డీల్ విలువ రూ.600 కోట్ల అని మీడియాలో కథనాలు జోరుగా వ్యాపించాయి. దీంతో ఎన్డీటీవీ షేర్ భారీగా ఎగిసింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో షేర్ ధర అప్పర్ సర్క్యూట్‌ను తాకడం విశేషం. ప్రణయ్ రాయ్, రాధికా రాయ్, ప్రమోటింగ్ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లు సీబీఐ స్కానర్‌లో ఉండడంతో.. ఈ కంపెనీ చేతులు మారనుందనే వార్తలు హల్ చల్ చేశాయి. అయితే ఈ అంచనాలను ఎన్డీటీవీ కొట్టిపారేసింది. తాము ఎవరితోనూ, ఎలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకోలేదని మార్కెట్ రెగ్యురేటరీ ఫైలింగ్ లో తెలిపింది. దీంతో మార్కెట్వర్గాల్లో గందరగోళం నెలకొంది. కాగా 1988లో ప్రణయ్‌రాయ్, ఆయన భార్య రాధికా రాయ్ ఎన్డీటీవీని స్థాపించారు. -
జెట్ బ్లాస్ట్.. ఇండిగోకు ప్రమాదం
న్యూఢిల్లీ : ఢిల్లీ నుంచి ముంబై వెళ్లడానికి టేకాఫ్‌కు సన్నద్ధమవుతున్న ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. పార్కింగ్ బేలోకి వచ్చిన స్పైస్‌జెట్ విమానం జెట్ బ్లాస్ట్ అయింది. దీని ప్రభావంతో ఇండిగో విమానంలో విండో పగిలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుందని ఇండిగో అధికార ప్రతినిధి చెప్పారు. ఆ బ్లాస్ట్ ప్రభావంతో తమ ఎయిర్‌క్రాఫ్ట్ కుడివైపు ముందున్న విండో పగిలిపోయినట్టు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయని చెప్పారు. వెంటనే వారిని ఎయిర్‌పోర్టులోని క్లినిక్‌కు తరలించి, చికిత్స అందించనట్టు చెప్పారు. ఈ ప్రమాదంపై ఏవియేషన్ వాచ్డాగ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణ జరుపుతోంది. ''ఇండిగో కోచ్ నెంబర్ 34 ఈబే 17లో శుక్రవారం సాయంత్రం 4.50 గంటలకు ఢిల్లీ-ముంబై మార్గంలో వెళ్లే బోర్డింగ్ ప్రయాణికులతో సిద్ధంగా ఉంది. అదే సమయంలో స్పైస్‌జెట్ ఎస్జీ-253 ఎయిర్‌క్రాఫ్ట్ వచ్చింది. దానికి కేటాయించిన బేలో పార్కింగ్ చేసుకునేందుకు టర్న్ అవుతోంది. ఆ సమయంలో జెట్ బ్లాస్ట్ అయింది. దీంతో ఇండిగో ఎయిర్‌క్రాఫ్ట్ ముందున్న కుడివైపు విండో గ్లాస్ పగిలిపోయింది'' అని ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ప్రమాదంపై స్పైస్‌జెట్ స్పందించలేదు. -
ఎయిరిండియా కొనుగోలు యోచన లేదు
స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను కొనుగోలు చేసే యోచనేదీ ప్రస్తుతం లేదని చౌక చార్జీల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ పేర్కొన్నారు. గొప్ప అసెట్ అయినప్పటికీ ప్రస్తుతం దాన్ని కొనుగోలు చేసేంత పటిష్టంగా తమ కంపెనీ లేదని, ఇప్పటి పరిస్థితుల్లో అంత రిస్కు తీసుకోలేమని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఎయిరిండియా అనేదే ఒక పెద్ద బ్రాండ్. నిస్సందేహంగా గొప్ప అసెట్ కూడా. కానీ చాలా చిన్నదైన స్పైస్‌జెట్ దాన్ని కొనుగోలు చేసేందుకు పోటీపడే పరిస్థితిలో లేదు‘ అని సింగ్ పేర్కొన్నారు. రుణగ్రస్త ఎయిరిండియాలో వాటాల విక్రయం చేపట్టే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసిన దరిమిలా పలు సంస్థలు చేజిక్కించుకునేందుకు పోటీపడుతున్నాయి. లాభసాటి కాబట్టే బరిలోకి: ఇండిగో ప్రెసిడెంట్ ఎయిరిండియా కొనుగోలుతో లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతోనే బరిలోకి దిగినట్లు ఇండిగో ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్ తెలిపారు. సంస్థ ప్రయోజనాలు దెబ్బతినే పరిస్థితి ఉన్న పక్షంలో ముందుకెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎయిరిండియా కొనుగోలు యోచన వెనుక గల కారణాలను వివరిస్తూ ఉద్యోగులకు రాసిన లేఖలో ఆయన ఈ విషయాలు పేర్కొన్నారు. ‘ఒకవేళ ఆ ప్రతిపాదన లాభసాటి కాకపోతే.. ఉద్యోగులకు, కస్టమర్లకు, వాటాదారులకు ఏ విధంగానూ ప్రయోజనం చేకూర్చనటువంటిదైతే ఎయిరిండియా కొనుగోలు ప్రయత్నాలు చేయబోము‘ అని ఘోష్ వివరించారు. -
వాణిజ్య విమానాలు భారత్‌లోనే తయారవ్వాలి
స్పైస్‌జెట్ చీఫ్ అజయ్‌సింగ్ ఆకాంక్ష వాషింగ్టన్: విమానయాన రంగంలో భారత్ అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా అవతరిస్తున్న క్రమంలో దేశీయంగా వాణిజ్య విమానాల తయారీని ప్రోత్సహించే విధానాలతో కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని స్పైస్‌జెట్ సీఈవో అజయ్‌సింగ్ సూచించారు. 100 విమానాల కొనుగోలు కోసం అమెరికా సంస్థ బోయింగ్‌కు స్పైస్‌జెట్ ఇటీవల ఆర్డర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంలో అజయ్‌సింగ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి అభినందనలు కూడా అందుకున్నారు. ఈ ఆర్డర్ అమెరికాలో వేలాది ఉద్యోగాలకు తోడ్పాటునిస్తుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ వెంట ట్రంప్‌ను కలిసిన బృందంలో అజయ్‌సింగ్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో అజయ్‌సింగ్ వాషింగ్టన్లో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఫోన్ల తయారీపై యాపిల్ వంటి కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నప్పుడు... విమానాల తయారీదారులతో ఆ పని ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. ఈ దిశగా వెంటనే ప్రభుత్వం సంప్రదింపులు ప్రారంభించాలని, భారత్‌లో తయారీపై వారు ఏం ఆశిస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారత విమానయాన సంస్థలు 600కుపైగా విమానాల కొనుగోలుకు ఆర్డర్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2020 నాటికి భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద వాణిజ్య విమానయాన మార్కెట్‌గా అవతరించనుందన్నారు. 120 మిలటరీ విమానాల కోసం కేంద్ర ప్రభుత్వం దేశీయ తయారీని ప్రోత్సహిస్తున్నప్పుడు, వాణిజ్య విమానాలపైనా అదే విధంగా దృష్టి పెట్టాలని ఆశించారు. ‘‘దేశీయంగా విమానయాన మార్కెట్ 20–25 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. దేశ జనాభాలో 3 శాతం మందే విమానాల్లో ప్రయాణిస్తున్నారు. కనుక ఈ రంగలో అపార అవకాశాలు ఉన్నాయి’’ అని అజయ్ సింగ్ పేర్కొన్నారు. -
స్పైస్‌జెట్‌కు 50 ‘క్యూ400’ విమానాలు
♦ బంబార్డియర్తో ఒప్పందం ♦ డీల్ విలువ రూ.10,900 కోట్లపైనే న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ‘స్పైస్‌జెట్’ విమానాల కొనుగోళ్ల పరంపర కొనసాగుతూనే ఉంది. కార్యకలాపాల విస్తరణే ప్రధాన లక్ష్యంగా ఇది తాజాగా బంబార్డియర్ కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి 50 వరకు ‘క్యూ400’ టర్బోప్రాప్ విమానాలు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇవి 86 సీటర్ విమానాలు. ఈ డీల్ విలువ 1.7 బిలియన్ (దాదాపు రూ.10,900 కోట్లు) డాలర్లు. ఈ మేరకు కంపెనీ బంబార్డియర్తో ఒప్పందం కుదుర్చుకుంది. ‘క్యూ400’ విమానాలకు సంబంధించి ఇదే అతిపెద్ద సింగిల్ ఆర్డరని స్పైస్‌జెట్ పేర్కొంది. ఇందుకోసం ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై స్పైస్‌జెట్ సంతకాలు చేసింది. ‘క్యూ400 విమానాల కొనుగోలు డీల్ ప్రకటించడం ఆనందంగా ఉంది. ఈ డీల్ ద్వారా చిన్న పట్టణాలకు కనెక్టివిటీ సదుపాయాలను విస్తరిస్తాం’ అని స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ తెలిపారు. పారిస్ ఎయిర్ షో కార్యక్రమంలో ఈ డీల్ కుదిరిందని పేర్కొన్నారు. కాగా 40 ‘బోయింగ్ 737 మ్యాక్స్’ ప్లేన్స్ కొనుగోలు ఒప్పందం జరిగిన మరుసటి రోజే స్పైస్‌జెట్ ఈ డీల్‌ను ప్రకటించడం గమనార్హం. -
స్పైస్‌జెట్‌తో బోయింగ్ ఒప్పందం
♦ 40 విమానాల తయారీ కోసం ఎంవోయూ ♦ 4.7 బిలియన్ డాలర్ల విలువ ముంబై: చౌక చార్జీల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తాజాగా విమానాల తయారీ దిగ్గజం బోయింగ్‌తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఇందులో భాగంగా స్పైస్‌జెట్.. ’737 మ్యాక్స్ 10’ విమానాలు నలభై కొనుగోలు చేయనుంది. ప్రస్తుత ధరల ప్రకారం ఈ డీల్ విలువ సుమారు 4.7 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 30వేల కోట్లు) ఉండనుంది. సోమవారం ప్రారంభమైన ప్యారిస్ ఎయిర్‌షో సందర్భంగా కుదిరిన ఎంవోయూ ప్రకారం.. రెండు ఆర్డర్ల కింద ఈ విమానాలను సరఫరా చేయాల్సి ఉంటుంది. 737 శ్రేణిలో కొత్త వెర్షన్‌ను ఆర్డరు చేసిన తొలి భారతీయ సంస్థ తమదేనని స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ తెలిపారు. వ్యయాలు తగ్గించుకునేందుకు, ఆదాయాలు మెరుగుపర్చుకునేందుకు ఈ విమానాలు ఉపయోగపడగలవని వివరించారు. వచ్చే ఏడాది కొత్త 737 విమానాల రాకతో తమ నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరించగలమన్నారు. బోయింగ్ నుంచి సుమారు 22 బిలియన్ డాలర్ల విలువ చేసే కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌లు 205 దాకా (2014లో ఇచ్చిన 55 విమానాల ఆర్డరుతో సహా) కొనుగోలు చేయనున్నట్లు స్పైస్‌జెట్ ఇటీవలే తెలిపింది. ప్రస్తుతం స్పైస్‌జెట్‌కి 55 విమానాలు ఉన్నాయి. -
ఇ-కామర్స్‌లోకి స్పైస్‌జెట్: 25శాతం డిస్కౌంట్
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ స్పైస్ జెట్ తన వ్యాపార సరళినిమరింత విస్తరించుకుంటోంది. రిటైల్ సెగ్మెంట్లోకి అడుగుపెడుతున్న సంస్థ ఈ కామర్స్ వ్యాపారాన్ని ప్రారంభించనున్నట్టు మంగళవారం ప్రకటించింది. తద్వారా భారీ ఆదాయాలపై దృష్టిపెట్టింది. సుమారు రూ. 15 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు. స్పైస్ స్టయిల్.కాం పేరుతో తన రీటైల్ పోర్టల్‌ను లాంచ్ చేయనుంది. దేశీయ విమానయాన రంగంలో వేగంగా పెరుగుతున్న తీవ్రమైన పోటీ నేపథ్యంలో ఆదాయాలను పెంచుకోవడానికి రిటైల్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తోంది. స్పైస్ స్టయిల్ పేరుతో రిటైల్ విభాగంలోకి విస్తరించిన స్పైస్‌జెట్ ఇ-కామర్స్ పోర్టల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో సంవత్సరానికి రూ.150 కోట్ల విలువైన అదనపు ఆదాయాన్ని ఆర్జించనున్నామని తెలిపింది. దీని ద్వారా గత రెండు సంవత్సరాల్లో 17 శాతం పెరిగిన స్పైస్ జెట్ సహాయక ఆదాయంలో మరో 6 శాతం పెరగనుందని ఆ సంస్థ పేర్కొంది. మరోవైపు అమెజాన్‌తో భాగస్వామ్యాన్ని కుదర్చుకున్నట్టు తెలిపింది. 17వివిధ కేటగిరీలను పరిచయం చేస్తున్నామని, ముఖ్యంగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ ప్రొడక్ట్స్‌ను అందిస్తున్నామని చెప్పింది. తన కొత్త బ్రాండ్ల లాంచింగ్ కోసం అమెజాన్‌తో చేసుకున్న వ్యూహాత్మక భాగస్వామ్యంలో 25 శాతం డిస్కౌంట్లు అందించనున్నట్టు తెలిపింది. ఈ కొత్త ఉత్తేజకరమైన ప్రయాణంలో, తమ ప్రత్యేకమైన పరిధిని పంపిణీ చేయటానికి ప్రముఖ ఇ-కామర్స్ మార్కెట్లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని, అలాగే డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు. స్పైస్ స్టయిల్.కాం లో కూడా ఆర్డరు చేయవచ్చని స్పైస్ జెట్ సిఎండి అజయ్ సింగ్ చెప్పారు. కాగా స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్ 46 ప్రదేశాల్లో సగటున 364 రోజువారీ విమానాలను నిర్వహిస్తుంది. ఇందులో 7 అంతర్జాతీయ సంస్థలు కూడా ఉన్నాయి. -
వచ్చే నెల నుంచి ’ఉడాన్’ విమాన సేవలు: స్పైస్‌జెట్
ముంబై: ప్రాంతీయ కనెక్టివిటీ పథకం ఉడాన్ స్కీము కింద వచ్చే నెలలో విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు విమానయాన సంస్థ స్పైస్‌జెట్ వెల్ల డించింది. ముందుగా ముంబై నుంచి పోర్బందర్, కాండ్లాకు రోజు రెండు డైరెక్ట్ ఫ్లయిట్స్ నడపనున్నట్లు వివరించింది. జులై 10 నుంచి 78 సీటింగ్ సామర్థ్యం గల బొంబార్డియర్ క్యూ400 విమానాలను ఈ రెండు కొత్త రూట్లలో సర్వీసులకు ఉపయోగించనున్నట్లు స్పైస్‌జెట్ పేర్కొంది. ముంబై–పోర్బందర్ రూట్లో ఆర్సీఎస్ సీట్ల టికెట్ ధర రూ. 2,250 (అన్ని చార్జీలు కలిపి) గాను, ముంబై–కాండ్లా రూట్లో రూ. 2,500గాను ఉంటుంది. చిన్న పట్టణాలకూ విమాన సేవలు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఆర్సీఎస్ కింద టర్బో మేఘా తదితర అయిదు ఎయిర్‌లైన్స్‌కి కేంద్రం ఈ ఏడాది మార్చిలో 128 ప్రాంతీయ రూట్లను కేటాయించింది. -
ఆఫర్లతో దిగొస్తున్న విమానాలు
♦ జాబితాలో స్పైస్‌జెట్, ఇండిగో, జెట్, ఎయిర్ఏసియా ♦ బుక్ చేసుకోవటానికి మరో నాలుగు రోజుల సమయం ♦ వచ్చే ఏడాది మార్చి వరకూ ప్రయాణించే వీలు న్యూఢిల్లీ: దేశీ విమానయాన రంగంలో మరోసారి ధరల యుద్ధానికి తెరలేచింది. ఎయిర్‌లైన్స్ సంస్థలు పోటీపడి మరీ టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. వార్షికోత్సవ ఆఫర్ అంటూ తొలుత స్పైస్‌జెట్ ఈ పోటీకి తెరతీయగా... ఇండిగో, జెట్ ఎయిర్వేస్, ఎయిర్ఏసియా వంటి సంస్థలన్నీ వరస కట్టాయి. స్పైస్‌జెట్: రూ.12 బేసిక్ ఫేర్‌తో టికెట్ స్పైస్‌జెట్ తన 12వ వార్షికోత్సవమంటూ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.12ల బేసిక్ ఫేర్‌తో వన్‌వే టికెట్లను ఆఫర్ చేస్తోంది. దీనికి ట్యాక్స్‌లు, సర్‌చార్జ్‌లు అదనం. మే 28 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్న వారు 2017 జూన్ 26 నుంచి 2018 మార్చి 24 మధ్య ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. దేశీ, అంతర్జాతీయ ఫ్లైట్స్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇక టికెట్లను బుక్ చేసుకున్న వారు సంస్థ నిర్వహించే లక్కీడ్రాలో ఉచిత టికెట్లతోపాటు పలు ప్రయోజనాలు కూడా పొందొచ్చు. ఇండిగో టికెట @ రూ. 899 ఈ రేసులో చేరిన ‘ఇండిగో’ తాజాగా రూ.11 బేసిక్ ఫేర్‌తో టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌కు తెరలేపింది. ఈ ప్రమోషనల్ స్కీమ్‌లో భాగంగా కంపెనీ వన్‌వే టికెట్లను రూ.899 ప్రారంభ ధరతో ప్రయాణికులకు ఆఫర్ చేస్తోంది. ఈ నెల 28 వరకు అందుబాటులో ఉండే ఈ ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్నవారు 2017 జూన్ 26 నుంచి 2018 మార్చి 24 మధ్య కాలంలో ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చని కంపెనీ తెలిపింది. అయితే ఈ ఆఫర్ ఎంపిక చేసిన రూట్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇండిగో తాజా ఆఫర్ కింద విశాఖపట్నం–హైదరాబాద్ టికెట్‌ను రూ.1,104లకు, హైదరాబాద్–విశాఖపట్నం టికెట్‌ను రూ.1,441లకు, బెంగళూరు–హైదరాబాద్ టికెట్‌ను రూ.1,250లకు, శ్రీనగర్–జమ్మూ టికెట్‌ను రూ.899లకు అందిస్తోంది. పలు రూట్లలో ఇలాంటి ఆఫర్లున్నాయి. రేసులోకి జెట్ ఎయిర్వేస్ ఈ విమానయాన సంస్థ కూడా ఎంపిక చేసిన రూట్లలో ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఆఫర్లో భాగంగా కంపెనీ రూ.1,079 ప్రారంభ ధరతో టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఇది గ్రూప్ బుకింగ్స్‌కు వర్తించదు. ఈ నెల 26 వరకు అందుబాటులో ఉండే ఈ ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్న వారు ఈ ఏడాది జూన్ 15 నుంచి సెప్టెంబర్ 20 వరకు మధ్య ఉన్న కాలంలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. ఎయిర్ ఏసియా కూడా.. టాటా–ఎయిర్‌ఏíసియా జాయింట్ వెంచర్ అయిన ఎయిర్ఏసియా ఇండియా కూడా టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. వన్‌వే రూట్లకు మాత్రమే వర్తించే ఆఫర్ ఇది. ఎంపిక చేసిన రూట్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ నెల 28 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్న వారు ఈ ఏడాది నవంబర్ 23 వరకు ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. దీనికి టికెట్ ప్రారంభ ధర రూ.1,699. -
రూ.12కే విమాన టికెట్..అంతేనా? ఇంకా..
ముంబై: బడ్జెట్ క్యారియర్ ఎయిర్‌లైన్ స్పైస్ జెట్ విమాన ప్రయాణికులకోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. అన్ని మార్గాల్లో అతి తక్కువ, డిస్కౌంట్ ధరల్లో విమాన టికెట్లను అందిస్తోంది. రూ.12 ప్రారంభధరలో విమాన టికెట్లను అందింస్తోంది. 12వ వార్షికోత్సవం సందర్భంగా ఈ అద్భుతమైన ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదనపు ఛార్జీలు, ఇతర పన్నులను మినహాయించి ఈ ధరలను అందిస్తున్నట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. 12 వ వార్షికోత్సవ అమ్మకాలుగా చెబుతున్న ఈ ఆఫర్లో మే 23 నుంచి 28 వరకు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ బుకింగ్స్ ద్వారా జూన్ 26, 2017నుంచి మార్చి 24, 2018 వరకు ప్రయాణించవచ్చు. అయితే నాన్ స్టాప్ విమానాల్లో మాత్రమే ఈ ఆఫర్ లభ్యం కానుంది. అంతేకాదు మరో అద్భుతమైన ఆఫర్‌ను కూడా అందిస్తోంది. 12 సాల్, బడా ధమాల్ పేరుతో లక్కీ డ్రా నిర్వహిస్తోంది. ఈ ఆఫర్ లో బుక్ చేసుకున్న టికెట్లపై ఉచిత విమాన టికెట్లు,ఇతర బహుమతులను గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నామని సంస్థ అధికారిక వెబ్సైట్ లో పేర్కొంది. స్పైస్ మ్యాక్స్, భోజనం, సీట్ల ఎంపిక, ఇతర అనుబంధాలపై 20 శాతం తగ్గింపు లాంటి అదనపు ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి. అలాగే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో టికెట్లు బుక్ చేసుకుంటే ఫ్రీ మీల్స్, ఫ్రీ ప్రయారిటీ చెక్ ఇన్‌కు కూడా అర్హత పొందవచ్చని తెలిపింది. -
స్పైస్‌జెట్‌లో సాంకేతిక లోపం
విజయవాడ: సాంకేతికలోపం కారణంగా స్పైస్‌జెట్ విమానం దాదాపు 45 నిమిషాలపాటు గాల్లో చక్కర్లు కొట్టింది. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన అరగంట తర్వాత ఇంజన్లో సాంకేతిక లోపం ఏర్పడింది. వెంటనే సమస్యను గుర్తించిన పైలట్ విమానాన్ని తిరిగి ఎయిర్‌పోర్టులో సేఫ్‌గా ల్యాండ్ చేశాడు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో విమానంలో మొత్తం 75 మంది ప్రయాణికులు ఉన్నారు. -
స్పైస్ జెట్ దూకుడు
ముంబై: భారతీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ సోమవారం నాటి మార్కెట్లో దూసుకుపోయింది. ఇంట్రా డేలో ఈ కౌంటర్ లో కొనుగోళ్ల జోరు నెలకొంది. దీంతో స్పైస్ జెట్ షేరు ధర 9ఏళ్ల గరిష్టాన్ని తాకింది. బీఎస్ఈలో రూ. 101 వద్ద ట్రేడ్ అవుతూ , 2008 జనవరి 9 తొలిసారి ఈ స్తాయిని తాకింది. చమురు ధరల పతనానికి తోడు ఇటీవల కోల్‌కతా-ఢాకా, ఢిల్లీ-సూరత్‌ల మధ్య రోజువారీ డైరెక్ట్ సర్వీసులను ప్రారంభించడంతో స్పైస్‌జెట్ కౌంటర్ జోరందుకున్నట్లు ఎనలిస్టులు చెబుతున్నారు. గత రెండు నెలలకంటే తక్కువ కాలంలోనే ఈ కౌంటర్ 60 శాతం దూసుకెళ్లింది. ఫిబ్రవరి 15, 2017న స్పైస్ జెట్ షేరు ధర రూ. 60 గా ఉంది. 2005 సెప్టెంబర్ లో రూ. 115 ఆల్ టైం హైని తాకింది. దీంతో మిగిలిన ఎయిర్ లైన్స్ కూడా ఈ బాటలో పయనిస్తున్నాయి. ఇండిగో సర్వీసుల సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, జెట్ ఎయిర్వేస్ లాభాలనార్జిస్తున్నాయి. ఫిబ్రవరి మాసంలో పాసింజర్ ట్రాఫిక్ లో నెలకొన్న దృఢమైన వృద్ధి, చమురు ధరలు, బలహీనపడుతున్న డాలర్ విలువ నేపథ్యంలో ఏవియేషన్ స్టాక్స్ లో ర్యాలీకి దారి తీస్తోందని బిజినెస్ స్టాండర్స్ నివేదించింది. ఇంధన, నిర్వహణ, లీజు ఖర్చులు డాలర్ తోముడిపడివున్నాయనీ, దీంతో రూపాయితో పోలిస్తే డాలర్బలహీనపడడం ఎయిర్‌లైన్స్ లాభదాయకమని తెలిపింది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరల క్షీణత, డాలర్ బలహీనత కారణంగా విమానయాన సెక్టార్‌కు జోష్ నిస్తోంది. -
‘స్పైస్’బ్రాండ్‌తో రీటైల్ వ్యాపారంలోకి స్పైస్ జెట్
దేశీయ రిటైల్ రంగంలోకి భారీ ఎత్తున ప్రవేశించేందుకు స్పైస్‌జెట్ ప్రణాళికలు రచిస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బహుళ ప్రాచుర్యం పొందిన ‘అబ్కీ బార్- మోదీ సర్కార్’ అనే బీజేపీ నినాదాన్ని రూపకర్త అజయ్ సింగ్ ప్రమోట్ చేసిన ఈ సంస్థ ఇప్పటికే భారీ పోటీ నెలకొన్న రిటైల్ విభాగంలోకి ప్రవేశించనుంది. ఫ్యాషన్ ఉత్పత్తులు నుంచి వినియోగ వస్తువుల దాకా రీటైల్ వ్యాపారంలో అడుగుపెట్టనున్నట్టు సమాచారం. గాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు మరియు ఆహార ఉత్పత్తుల విక్రయంలో ఎంట్రీ ఇవ్వనుంది బడ్జెట్ క్యారియర్ స్పైస్ జెట్. వినియోగ వస్తువులు, ఫ్యాషన్ ప్రొడక్టులు, గ్యాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ ,ఇతర వస్తువుల విక్రయాలకు వీలుగా స్టోర్ల ప్రారంభానికి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా వందలకొద్దీ ఉన్న వెండర్స్ నుంచి "స్పైస్'బ్రాండుతో సొంత ఉత్పత్తులను రూపొందించుకోవడం ద్వారా అమ్మకాలు సాధించాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు విమానయాన సంస్థ నుంచి ప్రత్యేక అనుబంధ కంపెనీని ఏర్పాటు చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, రెండు యూనిట్ల యాజమాన్య సంస్థ ద్వారా నియంత్రించబడుతుంది. పాక్షికంగా విమానాశ్రయాల్లో ఈ రీటైల్ స్టోర్లను తెరిచే అవకాశం ఉంది. ఆన్లైన్ వాణిజ్యాన్ని కూడా నిర్వహించనుందట. అయితే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్ లాంటి ఈ టైలర్స్లా థర్డ్ పార్టీ విక్రయాలు కాకుండా తమ ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ ద్వారా డైరెక్టుగా వినియోగదారులకు ఉత్పత్తులను చేరవేయనుందిట. ఉదాహరణకు వివిధ బ్రాండ్ల టెలివిజన్లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా అందుబాటులో ఉంటే.. స్పైస్ జెంట్తన సొంత బ్రాండ్లను పరిచయంచేయనుందిట. ఈ రిటైల్ వెంచర్ పై ఒక నెలలోనే అధికారిక ప్రకటన రావచ్చని భావిస్తున్నారు. అయితే ఈ అంచనాలపై స్పందించేందుకు సంస్థ ప్రతినిధి తిరస్కరించారు. -
మహిళలకు స్పైస్‌జెట్ ప్రత్యేక సదుపాయాలు
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన కంపెనీ ‘స్పైస్‌జెట్’ తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని మహిళల కోసం పలు ప్రత్యేకమైన సదుపాయాలను కల్పించనుంది. వీటిల్లో భాగంగా మహిళా ప్రయాణికులు మార్చి 8న స్పైస్మ్యాక్స్కు ఉచితంగా అప్‌గ్రేడ్ అవ్వొచ్చు. స్పైస్మ్యాక్స్లో ప్రయాణికులు ఎక్స్ట్రా లెగ్‌రూమ్, ప్రియారిటీ చెకిన్, కాంప్లిమెంటరీ మీల్ అండ్ బేవరేజ్ వంటి పలు సౌకర్యాలు పొందొచ్చు. అలాగే కంపెనీ మార్చి 8న ఒంటరిగా ప్రయాణించే మహిళా ప్రయాణికుల కోసం ఫ్లైట్స్‌లో 4వ వరుసను ప్రత్యేకంగా వారి కోసమే రిజర్వు చేయనుంది. ఈ సౌకర్యాలు అన్ని స్పైస్‌జెట్ విమానాల్లో అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. -
ఉమెన్స్ డేకి స్పైస్ జెట్ స్పెషల్ ఆఫర్
న్యూఢిల్లీ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్పైస్ జెట్ విమానమెక్కే మహిళా ప్రయాణికులకు ఆ విమానయాన సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 2017 మార్చి 8న స్పైస్ జెట్ విమానంలో ప్రయాణించే మహిళలు స్పైస్ మ్యాక్స్ లోకి అప్ గ్రేడ్ అవుతారని పేర్కొంది. అంతేకాక బుధవారం రోజు ఒంటరిగా ప్రయాణించే మహిళల కోసం ఒక వరుసమొత్తాన్ని కేటాయించనున్నట్టు స్పైస్ జెట్ ప్రకటించింది.'' 2017 మార్చి 8న ఒంటరిగా ప్రయాణించే మహిళా ప్రయాణికులకు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్నాం. ఒకవేళ అందుబాటులో ఉంటే ఉచితంగా స్పైస్ మ్యాక్స్ సీట్లలోకి వారిని అప్ గ్రేడ్ చేస్తాం'' అని స్పైస్ జెట్ ఓ ప్రకటన విడుదల చేసింది. 2017 మార్చి 8 నుంచి నాలుగో వరుస మొత్తాన్ని స్పైస్ జెట్ మహిళలకే కేటాయించనుంది. మహిళలకు స్పెషల్ సీట్లను తొలుత ఎయిర్ ఇండియా అందుబాటులోకి తెచ్చింది. స్పెషల్ సీటింగ్ కేటాయింపుల వల్ల సోలోగా ప్రయాణించే మహిళకు సౌకర్యవంతంగా ఉంటుందని స్పైస్ జెట్ తెలిపింది. స్పైస్ మ్యాక్స్ ఆఫర్ కింద స్పైస్ జెట్ విమానయాన సంస్థ తమ వెబ్ సైట్లో బుకింగ్స్ పై ఫ్లాట్ పై 15 శాతం డిస్కౌంట్ ఇస్తుంది. సోమవారం రోజు ఈ ఆఫర్ కింద డిస్కౌంట్లు వర్తించవు. రెండు వైపుల ప్రయాణాలకు ఇది అందుబాటులో ఉంటుంది. 2017 మార్చి 31 వరకు స్పైస్ మ్యాక్స్ ఆఫర్ కింద ప్రయాణికులు బుకింగ్స్ చేసుకోవచ్చు. -
విమానాలకు తృటిలో తప్పిన ఘోర ప్రమాదం
అహ్మదాబాద్: అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో పెద్ద ప్రమాదం తప్పిందని విమానాశ్రయ అధికారులు చెప్పారు. విమానాశ్రయ రన్ వే పై ఇండిగో విమానం, స్పైస్ జెట్ విమానాల ల్యాండింగ్, టేక్ ఆఫ్ సందర్భంగా ఈ ఘోర ప్రమాదం తృటిలో తప్పిందని రన్ వే అధికారులు ప్రకటించారు. అకస్మాత్తుగా రన్ వే మీదికి ఓ కుందేలు దూసుకురావడం.. భయాందోళనకు దారి తీసిందని.. అయితే అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పిందని లేదంటే వందలమంది ప్రాణాలు ప్రమాదంలో చిక్కుకునేనవని ఎయిర్‌పోర్టు అధికారిక వర్గాలు ప్రకటించాయి. ఆఖరి నిమిషంలో జోక్యం చేసుకున్న ఏటీసీ అధికారులు అప్రమత్తమై పైలట్లను అలర్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే శుక్రవారం సాయంత్రం అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇండిగో విమానం జస్ట్ ల్యాండ్ అయ్యి ట్యాక్సీ వే వైపు పోతోంది. అదే సమయంలో స్పైస్ జెట్ విమానం టేక్ ఆఫ్(ఎగరడానికి) సిద్ధంగా ఉంది. అయితే ఇక్కడ చిన్న అనుకోని ఘటన ఎందురైంది. ఎక్కడినుంచి వచ్చిందో తెలియదుగానీ రన్‌వై మీద కుందేలు ఉండడాన్ని గమనించారు అధికారులు. ఆఖరి నిమిషంలో ఏటీసీ అధికారులు అప్రమత్తమై పైలట్లను అలర్ట్ చేశారు. దీంతోవారు సడన్ బ్రేక్ వేయాల్సి వచ్చింది. ఈ పరిణామంతో ఇండిగో విమానం ముక్కు నేలను తాకగా తోక మాత్రం గాల్లోనే ఉండిపోయింది. ఈ ఘటనతో సిబ్బంది ఒక్కక్షణం భయభ్రాంతులకు లోనయ్యారు. అటు రన్ వే పై కుందేలును గమనించినట్టు ఇండిగో పైలట్లు, రన్ వే క్లియర్ కాకుండా, ఇండిగోవిమానం అక్కడే ఉండడాన్ని చూసి అప్రమత్తమైనట్టు టేక్ ఆఫ్ తీసుకున్న స్సైస్ జెట్ పైలట్లు నివేదించారు. అయితే ఏటీసీ అధికారుల సూచనలతో విమానాల పైలెట్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అటు ఏవియేషన్ విభాగం ఈ ఘటనపై విచారణ చేపట్టింది. ఈ ఉదంతంపై రెండు విమానాలకు చెందిన పైలెట్లు అహ్మదాబాద్ ఏటీసీకి తమ నివేదికను అందించారు. -
విమానయాన కంపెనీల ఆఫర్ల జోరు
ప్రకటించిన ఎయిరిండియా, స్పైస్‌జెట్ న్యూఢిల్లీ: విమానయాన సంస్థలు ఉచిత టికెట్లు, చౌక ధరలతో ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. నానాటికీ తీవ్రమవుతున్న పోటీని తట్టుకోవడానికి, సీట్ల ఆక్యుపెన్సీని పెంచుకోవడానికి వివిధ రకాల ఆఫర్లను అందిస్తున్నాయి. తాజాగా బుధవారం ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్ కంపెనీలు ఇలాంటి ఆఫర్లనే అందుబాటులోకి తెచ్చాయి. ఎయిర్ ఇండియా బై వన్, ప్లై టూ ఆఫర్ కింద ఒక టికెట్‌ను బుక్ చేస్తే మరో టికెట్‌ను ఉచితంగా ఇస్తోంది. ఇక స్పైస్‌జెట్ సంస్థ లక్కీ సెవన్ సేల్ కింద రూ.777 ధరకే విమాన టికెట్లను (కొన్ని ఎంపిక చేసిన రూట్లలో)ఆఫర్ చేస్తోంది. ఎయిర్ ఇండియా బై వన్ ఫ్లై టు... గత రెండేళ్లుగా దేశీయ విమానయాన రంగం 20 శాతానికి పైగా వృద్ధి సాధిస్తోంది. పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు పలు విమానయాన సంస్థలు వివిధ ఆఫర్లను ముందుకు తెస్తున్నాయి. ఎయిర్ ఇండియా కంపెనీ ఒక టికెట్‌కు మరో టికెట్‌ను ఉచితంగా ఇచ్చే బై వన్ ఫ్లై టూ ఆఫర్‌ను అందిస్తోంది. మెట్రో నగరాలకు కాకుండా దేశీయ రూట్లలో ఫస్ట్‌క్లాస్, బిజినెస్ క్లాస్ టికెట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. బుకింగ్‌లు, ప్రయాణానికి కూడా గడువు మే 31 వ తేదీయే. సాధారణంగా ఈ రెండు కేటగిరిల్లో 50 శాతం సీట్లే నిండుతాయని, ఈ కేటగిరిల్లో సీట్ల ఆక్యుపెన్సీ పెంచుకోవడానికి ఈ ఆఫర్‌ను అందిస్తున్నామని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు చెప్పారు. స్పైస్‌జెట్ లక్కీ సెవెన్ సేల్.. ఇక స్పైస్‌జెట్ సంస్థ లక్కీ సెవెన్ సేల్ ఆఫర్ కింద అన్నీ కలుపుకుని రూ.777కే విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. దేశీయ నెట్‌వర్క్‌లో ఎంపిక చేసిన రూట్లలోనే ఒక వైపుకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ నెల 25 వరకూ టికెట్లు బుక్ చేసుకోవచ్చని, ఈ నెల మార్చి 9 నుంచి ఏప్రిల్ 13 వరకు ప్రయాణించవచ్చని వివరించింది. విమానయాన సంస్థ డీజీసీఏ ప్రకారం, గత నెలలో 95.79 లక్షల మంది ప్రయాణికులు విమానయానం చేశారు. 25 శాతం వృద్ధి నమోదైంది. -
స్పైస్‌జెట్ లక్కీ7 సేల్
ముంబై: దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ మరోసారి తగ్గింపు ధరలపై విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. లక్కీ 7 సేల్ ను బుధవారం ప్రకటించింది. స్పైస్ జెట్ దేశీయ రూట్ లో రూ.777 (అన్ని చార్జీలు కలిపి) లకు ఒక వైపు ధరలను ప్రకటించింది. ఫిబ్రవరి 25 వ తేదీతో ఈ ఆఫర్ లో బుకింగ్స్ ముగియనున్నాయి. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా మార్చి9-ఏప్రిల్ 13మధ్య ప్రయాణానికి అనుమతిస్తునట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా బడ్జెట్ కేరియర్ స్పైస్ జెట్ ఫిబ్రవరి 13 న, ఈ ఎయిర్‌లైన్స్ ఫిబ్రవరి 28 సెప్టెంబర్ 20 మధ్య ప్రయాణానికి చెల్లుబాటయ్యేలా రూ 798 ప్రయాణ ఛార్జీలను పరిచయంచేసిన సంగతి తెలిసిందే. -
నేటి నుంచి కాశీ–గన్నవరం విమాన సర్వీసు
విమానాశ్రయం (గన్నవరం): ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసి (కాశీ) నుంచి గన్నవరానికి స్పైస్‌జెట్ ఆదివారం కొత్త సర్వీస్ ప్రారంభించనుంది. ఈ విమానం మంగళవారం మినహా అన్ని రోజులూ రాకపోకలు చేయనుంది. 180 సీటింగ్ ఉన్న ఈ విమానం వారణాసి నుంచి రోజూ ఉదయం 10.00కి బయల్దేరి మధ్యాహ్నం 12.10 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. తిరిగి హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి 1.50కి గన్నవరం చేరుకుంటుంది. తిరిగి ఇక్కడి నుంచి మధ్యాహ్నం 2.40కి బయలుదేరి హైదరాబాద్ మీదుగా సాయంత్రం 6.55కు కాశీ చేరుకుంటుంది. -
విమానాల్లో ఒక్క నెలలో కోటిమంది..!
న్యూఢిల్లీ: మునుపెన్నడూ లేనంతగా దేశం లోపల విమానంలో ప్రయాణించేవారి సంఖ్య అమాంతం పెరిగింది. గత ఏడాదిలో మొత్తం 10 కోట్ల మంది దేశీయంగా స్వదేశీ విమానాల్లో ప్రయాణించారు. అయితే, ఒక్క డిసెంబర్లో ప్రయాణించిన వారి సంఖ్య దాదాపు కోటి ఉన్నట్లు విమాన సంస్థలకు చెందిన అధికారులు తెలిపారు. గత ఏడాది(2015)లో ఇదే డిసెంబర్లో 77.1లక్షలమంది మాత్రమే ప్రయాణించారు. డిసెంబర్ 2016లో స్వదేశీ విమానంలో ప్రయాణించినవారు దాదాపు 95.5కోట్లు ఉన్నారని ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది. కిందటేడాదితో పోలిస్తే ఇది 23.2శాతం అధికం అని తెలిపారు. స్పైస్ జెట్ విమానాల్లో ఎక్కువగా ప్రయాణాలు చేసినట్లు తెలిసింది. పెద్ద నోట్లు రద్దయిన తర్వాత కూడా రూ.500, రూ.1000 నోట్లు ఉపయోగించవచ్చని కేంద్రం చెప్పిన నేపథ్యంలో కూడా విమాన సంస్థల ఆదాయం అమాంతం పెరిగినట్లు సమాచారం. -
స్పైస్‌జెట్‌కు 205 బోయింగ్ విమానాలు
రూ. 1.5 లక్షల కోట్ల డీల్ న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తాజాగా విమానాల తయారీ దిగ్గజం బోయింగ్‌తో భారీ డీల్ కుదుర్చుకుంది. 205 విమానాల దాకా కొనుగోలు కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆర్డరు విలువ దాదాపు రూ. 1,50,000 కోట్లుగా ఉండనుంది. ఇప్పటికే ఆర్డరు చేసిన 55 విమానాలు, 100 కొత్త 737–8 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పాటు మరో 50 బీ737–8 మ్యాక్స్, వైడ్ బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోలు హక్కులు దక్కించుకోవడంతో .. మొత్తం 205 దాకా స్పైస్‌జెట్ కొనుగోలు చేస్తున్నట్లవుతుందని స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ తెలిపారు. దేశీ విమానయాన రంగంలో కుదిరిన అతి పెద్ద డీల్స్‌లో ఇది కూడా ఒకటి కాగా.. తమకు సంబంధించి ఇది అత్యంత భారీదని వివరించారు. ప్రస్తుతం స్పైస్‌జెట్ వద్ద బీ737 విమానాలు 32, బంబార్డియర్ క్యూ400 విమానాలు 17 ఉన్నాయి. తాజా డీల్‌కు సంబంధించి నిధుల సమీకరణపై దృష్టి పెట్టినట్లు అజయ్ సింగ్ వివరించారు. ఇంధనం దాదాపు 20 శాతం దాకా ఆదా చేసే కొత్త విమానాలతో వ్యయాలు తగ్గగలవని బోయింగ్ కంపెనీ వైస్ చైర్మన్ రే కానర్ తెలిపారు. లాభదాయకతపైనే దృష్టి .. మార్కెట్ వాటా గురించి తీవ్రంగా పోటీపడటం కన్నా బాధ్యతాయుతమైన రీతిలో లాభదాయకంగా ఉండటమే తమ ప్రధాన లక్ష్యమని అజయ్ సింగ్ చెప్పారు. గతంలో రోజుకు రూ. 3 కోట్లు నష్టపోయిన స్పైస్‌జెట్ ప్రస్తుతం రోజుకు రూ.1 కోటి మేర లాభాలు చూస్తోందని ఆయన పేర్కొన్నారు. నవంబర్ గణాంకాల ప్రకారం.. 12.8 శాతం మార్కెట్ వాటాతో స్పైస్‌జెట్ నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు, చౌక చార్జీలతో దూరప్రయాణాల విమానాలు నడిపే అంశం పరిశీలిస్తున్నట్లు సింగ్ చెప్పారు. కొత్త విమానాల డెలివరీ 2018 మూడో త్రైమాసికంలో ప్రారంభమై 2024 నాటికి ముగుస్తుంది. డీల్ మేరకు పైలట్ల శిక్షణ కోసం బోయింగ్ తోడ్పాటుతో స్పైస్‌జెట్ ప్రత్యేకంగా సిమ్యులేటర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇది 2018 నాటికి సిద్ధం కాగలదు. విమానయాన రంగ నియంత్రణ సంస్థ (డీజీసీఏ) నిబంధనల ప్రకారం 20 పైగా విమానాలున్న దేశీ ఎయిర్‌లైన్స్.. కనీసం ఒక్క సిమ్యులేటర్ కేంద్రాన్నైనా కలిగి ఉండాలి. -
స్పైస్ జెట్ మెగా ఆర్డర్
న్యూఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మధ్య కాలంలో భారీ విస్తరణకు శ్రీకారంచుట్టిన ఎయిర్ లైన్స్ 205 బోయింగ్ విమానాల కొనుగోలుకు సుమారు 23బిలియన్ల డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకునట్టు శుక్రవారం వెల్లడించింది. దేశీయ విమానయాన రంగాన్ని మరో మెట్టెక్కించేలా దాదాపు ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయలతో ఈ విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చినట్టు తెలిపింది. సంస్థ చైర్మన్, అండ్ ఎండీ, అజయ్ సింగ్ ఈ ఒప్పంద వివరాలను స్వయంగా ప్రకటించారు. ఈ డీల్ లో భాగంగా ముఖ్యంగా 155 బోయింగ్ 737-8 మ్యాక్స్, 50 డ్రీమ్ లైనర్, బీ-737ఎస్ విమానాలను దశలవారీగా అందుకోనున్నామని అజయ్ సింగ్ తెలిపారు. గడచిన ఏడు త్రైమాసికాలుగా స్పైస్ జెట్ లాభాల్లో నడుస్తోందని, 20 నెలలుగా 90 శాతం లోడ్ ఫ్యాక్టర్ తో సాగుతున్నామని వివరించారు. మరోవైపు ఈడీల్ ను దేశంలోనే ఎయిర్ లైన్స్ సంస్థలు ఇచ్చిన అతిపెద్ద ఆర్డర్ గా మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే గో ఎయిర్ , ఇండిగో లాంటి సంస్థలతో కొనుగోలు ఒప్పందాలుచేసుకున్న బోయింగ్ సంస్థకు భారత్ లో మంచి జోష్ నిస్తుందని భావిస్తున్నారు. కాగా, బోయింగ్ కు పోటీగా ఉన్న సంస్థ ఎయిర్ బస్ కు భారత అతిపెద్ద బడ్జెట్ ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగోతో పాటు, గో ఎయిర్ నుంచి ఇప్పటికే భారీ డీల్స్ వెళ్లిన నేపథ్యంలో ఈ డీల్ తాము ఇండియాలో మరింతగా విస్తరించేందుకు ఉపకరిస్తుందని బోయింగ్ భావిస్తోంది. ముడిచమురు ధరల పతనం కారణంగా, విమాన ఇంధన ధరలు, ఆపై ప్రయాణ టికెట్ ధరలు తగ్గడంతో సాలీనా ప్రయాణికుల వృద్ధి 20 శాతంగా ఉంది. భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్ గా నిలుస్తున్న సంగతి తెలిసిందే. -
సీఎం విమానం ల్యాండింగ్ వివాదం, పైలట్లపై వేటు
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్‌కు సంబంధించి ఇటీవల ఏర్పడిన గందరగోళం విషయంలో ఆరుగురు పైలట్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఇండిగో, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా విమాన సంస్థలకు చెందిన ఆరుగురు పైలట్లపై వేటు వేస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిర్ణయం తీసుకుంది. ఒక్కో విమాన సంస్థ నుంచి ఇద్దరు పైలట్లపై వేటు పడింది. మమత ప్రయాణిస్తున్న ఇండిగో విమానం ల్యాండింగ్‌కు కొల్కతా విమానాశ్రయంలో 15 నిమిషాలు ఆలస్యంగా అనుమతివ్వడంతో కలకలం రేగిన విషయం తెలిసిందే. బిహార్‌లో నవంబర్ 30న ఓ ర్యాలీలో పాల్గొన్న మమత సాయంత్రం 7.30కు పట్నా నుంచి ఇండిగో విమానంలో తిరుగుపయనమయ్యారు. కోల్‌కతాకు 200 కి.మీ. దూరంలో ఉన్నప్పుడే.. ల్యాండింగ్ వరుసలో మమత విమానం 8వ స్థానంలో ఉందని ఏటీసీ నుంచి పైలట్‌కు సందేశం వచ్చింది. అయితే ఈ విమానంలో ఇంధనం తక్కువగా ఉందని, అత్యవసరంగా ల్యాండింగ్‌కు అవకాశం ఇవ్వాలని పైలట్ తెలపటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అప్పటికే మరో మూడు విమానాలు ఇంధనం తక్కువుందని చెప్పటంతో 15 నిమిషాల తర్వాత మమత విమానానికి ఏటీసీ క్లియరెన్సు ఇచ్చింది. అయితే మమతను మట్టుబెట్టేందుకు ప్రయత్నం జరుగుతుందనే అనుమానాన్ని ఉభయసభల్లో తృణమూల్ సభ్యులు లేవనెత్తి గందరగోళం సృష్టించారు. దీనిపై సంబంధిత మంత్రి వివరణ ఇస్తూ.. 3 విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు కోరటంతోనే మమత విమానం రావటం ఆలస్యమైందని తెలిపారు. ఈ వివాదంపై విచారణకు ఆదేశించిన డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పైలట్లపై వేటు వేసింది. కాగా.. పైలట్ల సస్పెన్షన్‌పై విమాన సంస్థలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. -
స్పైస్‌జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి గురువారం లక్నో మీదుగా వారణాసికి బయలుదేరిన స్పైస్ జెట్ 708 విమానం లక్నో విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత వారణాసిలో విమానం దింపడానికి వాతావరణం అనుకూలంగా లేదనే సంకేతాలు రావడంతో శంషాబాద్‌లో అత్యవసరంగా ల్యాండైంది. -
స్పైస్ జెట్ లాభం 103 శాతం అప్...
వరుసగా ఏడో క్వార్టర్లోనూ లాభాలు ముంబై: చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.59 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్వార్టర్ లాభం రూ.29 కోట్లతో పోల్చితే 103 శాతం వృద్ధి సాధించామని కంపెనీ తెలిపింది. వరుసగా. ఏడో క్వార్టర్లోనూ లాభాలార్జించామని కంపెనీ సీఎండీ అజయ్ సింగ్ చెప్పారు. ఒక క్వార్టర్లో ఇదే అత్యధిక లాభం అని కూడా తెలిపారు. నిర్వహణ మార్జిన్లు 24 శాతం పెరగడం, వ్యయాలు 10 శాతం తగ్గడం వల్ల ఈ స్థారుు లాభాలు వచ్చాయని వివరించారు. సాధారణంగా ఏడాదిలో ఈ క్వార్టరే బలహీనమని, తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ, మంచి పనితీరు కనబరిచామన్నారు. ఆదాయం 35% వృద్ధితో రూ.1400 కోట్లకు పెరిగిందని తెలిపారు. 92.3 శాతం ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్‌ను సాధించామని, పరిశ్రమలో ఇదే అత్యధికమని పేర్కొన్నారు. -
దూసుకెళ్లిన స్పైస్‌జెట్
ముంబై : బడ్జెట్ ప్యాసెంజర్ క్యారియర్ స్పైస్‌జెట్ 2016-17 రెండో త్రైమాసికంలో దూసుకెళ్లింది. తన నికర లాభాల్లో రెట్టింపు లాభాలను నమోదుచేసి 103 శాతం ఎగిసింది. గతేడాది ఇదే క్వార్టర్లో రూ.29 కోట్లగా ఉన్న కంపెనీ నికర లాభాలు, ఈ త్రైమాసికంలో రూ.58.9 కోట్లకు పెంచుకోగలిగింది. మార్కెట్లో పోటీ వాతావరణం విపరీతంగా పెరుగుతున్నప్పటికీ, స్పైస్‌జెట్ అనూహ్యమైన పనితీరును నమోదుచేయగలిగిందని ఈ ప్యాసెంజర్ క్యారియర్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ చెప్పారు. తమకు నెలకొన్న న్యాయబద్ధమైన సమ్యసల నుంచి బయటపడగలిగామని, తమ నగదు నిల్వలను పెంచుకోవడానికి ప్రయత్నించినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ ఎయిర్‌లైన్‌కు ఈ క్వార్టర్ వరుసగా ఏడవ క్వార్టర్ లాభాలుగా నమోదైంది. 2014 డిసెంబర్లో చాలా సవాళ్లను ఎదుర్కొన్న ఈ ఎయిర్‌లైన్, మేనేజ్మెంట్, కంట్రోల్లో మార్పులతో లాభాల బాటలోకి పయనించి, మార్కెట్లో నిలదొక్కుకోగలిగిందని కంపెనీ పేర్కొంది. -
రూ.737కే స్పైస్‌జెట్ టికెట్
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ‘స్పైస్‌జెట్’ తాజాగా ‘స్పైసీ యాన్యువల్ సేల్’ ఆఫర్‌ను ప్రకటించింది. సంస్థ ఇందులో భాగంగా ప్రయాణికుల కోసం విమాన టికెట్లను రూ.737 నుంచే అందిస్తోంది. ఈ స్కీమ్ నాలుగు రోజులపాటు (ఈనెల 24 వరకు) అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్నవారు వచ్చే ఏడాది జనవరి 9 నుంచి అక్టోబర్ 28 మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. చెన్నై-కోయంబత్తూరు-చెన్నై, జమ్మూ-శ్రీనగర్-జమ్మూ, చంఢీగర్-శ్రీనగర్-చంఢీగర్, అగర్తల-గువాహతి వంటి 500 కిలోమీటర్ల దూరపు ప్రాంతాలకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుందని పేర్కొంది. ఈ ఆఫర్ కేవలం దేశీ రూట్లకే పరిమితమని, నాన్-స్టాప్ ఫ్లైట్స్‌కు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. -
స్పైస్ జెట్.. స్పైసీ సేల్
ముంబై: బడ్జెట్ జెట్ ఎయిర్ వేస్ స్పైస్ జెట్ స్పైసీ యాన్యూల్ సేల్ ను ప్రకటించింది. రూ.737ల నుంచి ప్రారంభమయ్యే నాలుగు రోజుల అమ్మకాలను సోమవారం ప్రారంభించింది. రూ.737 (అన్నిచార్జీలు కలిసి)తగ్గింపు ధరలను దేశీయ ప్రయాణాలపై అనుమతించనుంది. ఈ రోజు మొదలయ్యే ఆఫర్ నవంబర్ 24 అర్ధరాత్రి వరకూ అందుబాటులోఉంటుందని స్పైస్ జెట్ వెల్లడించింది. ఈ ఆఫర్ లో బుక్ చేసుకున్న టికెట్లతో జనవరి9 -అక్టోబర్ 28 , 2017 మధ్య ప్రయాణించవచ్చని తెలిపింది. 2017 స్పైస్‌జెట్ రూ మొదలు ఛార్జీల చెప్పారు. చెన్నై- కోయంబత్తూర్- చెన్నై, జమ్ము- శ్రీనగర్ - జమ్మూ, చండీగఢ్ - శ్రీనగర్ - చండీగఢ్, అగర్తలా - గౌహతి ల మధ్య దాదాపు 500 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయనుందని తెలిపింది. ఈ ఆఫర్ కింద కొనుగోలుచేసిన టిక్కెట్లు రద్దు చేస్తే మాత్రమే చట్టబద్ధమైన పన్నులు చెల్లించమని స్పష్టం చేసింది. అలాగే పాత రూ. 500, రూ. 1,000 కరెన్సీ కి నవంబర్ 24 అర్ధరాత్రి వరకూ తమ విమానాశ్రయం కౌంటర్లవద్ద అనుమతి ఉన్నట్టు తెలిపింది. ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయనేది స్పష్టం చేయలేదు. ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్ధతిలో టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. -
మరో 8 విమానాల కొనుగోలు: స్పైస్‌జెట్
• హైదరాబాద్ నుంచి మరిన్ని • చిన్న పట్టణాలకు సేవలపై దృష్టి • కంపెనీ సీఎండీ అజయ్ సింగ్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి కొత్తగా మరో ఎనిమిది దాకా విమానాలు సమకూర్చుకోనున్నట్లు చౌక చార్జీల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ తెలిపారు. వీటిలో మూడు బంబార్డియర్, నాలుగైదు బోయింగ్ విమానాలు ఉండగలవని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తమ వద్ద 43 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయని.. నిత్యం 320 పైచిలుకు ఫ్లయిట్స్ నడుపుతున్నామని అజయ్ సింగ్ వివరించారు. రోజువారీ ఫ్లయిట్స్ సంఖ్యను 10 శాతం మేర పెంచుకోనున్నట్లు తెలిపారు. శుక్రవారమిక్కడ యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (వైఎఫ్‌ఎల్‌ఓ) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విలేకరులకు ఆయన ఈ విషయాలు చెప్పారు. చిన్న పట్టణాలకు విమాన సేవలు అందించే విషయంలో తాము ముందుంటున్నామన్నారు. కొత్తగా హైదరాబాద్ నుంచి కాలికట్, భువనేశ్వర్, నాగ్‌పూర్ మొదలైన ప్రాంతాలకూ సర్వీసులు ప్రారంభించే అంశం పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఆరు దేశాలకు సర్వీసులు నడుపుతున్నామని, మరికొన్ని వారాల్లో కొత్తగా మరో రెండు, మూడు ప్రాంతాలకు కూడా సేవలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని వివరించారు. కొత్తగా మరిన్ని విమానాలు కొనుగోలు చేసే దిశగా ఎయిర్‌బస్, బోయింగ్‌లతో చర్చలు జరుగుతున్నాయని, దాదాపు నెల రోజుల వ్యవధిలో తుది నిర్ణయం తీసుకోగలమని అజయ్ సింగ్ చెప్పారు. ఈ ఆర్డరు సుమారు వందకి పైగా విమానాలకు ఉండవచ్చని ఆయన సూచనప్రాయంగా పేర్కొన్నారు. చౌక చార్జీలే ఊతం..: దేశ జనాభాలో ప్రస్తుతం 2.5 శాతం మంది మాత్రమే విమానసేవలు వినియోగించుకుంటున్న నేపథ్యంలో ఈ రంగంలో వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని అజయ్ సింగ్ చెప్పారు. ఈ ఏడాది విమాన టికెట్ల చార్జీలు సగటున 15-20% మేర తగ్గాయన్నారు. ప్రస్తుతం దేశీయంగా దాదాపు 400 విమానాశ్రయాలు ఉండగా.. వీటిలో 80 మాత్రమే పూర్తిస్థాయిలో వినియోగంలో ఉన్నాయని.. మిగతావీ అందుబాటులోకొస్తే ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు. -
స్పైస్‌జెట్ పండుగ ఆఫర్..
రూ. 888కే టికెట్.. న్యూఢిల్లీ: దేశీ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తాజాగా వచ్చే పండుగ సీజన్‌ను పురస్కరించుకొని టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. సంస్థ ఈ ఆఫర్లో భాగంగా దేశీ విమాన టికెట్లను (ఒక వైపునకు) రూ.888 నుంచి అందిస్తోంది. ఇక విదేశీ విమాన టికెట్ ధర రూ.3,699గా ఉంది. అక్టోబర్ 7 వరకు కొనసాగనున్న ఈ ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్న వారు ఈ నవంబర్ 8 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 13 వరకు మధ్య ఉన్న కాలంలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చని సంస్థ పేర్కొంది. ఇది పరిమితకాల ఆఫర్ అని, ముందుగా టికెట్లను బుకింగ్ చేసుకున్న వారికి అధిక ప్రాధాన్యముంటుందని తెలిపింది. -
స్పైస్‌జెట్ ఫెస్టివల్ ఆఫర్
న్యూఢిల్లీ: రాబోవు పండుగ సీజన్ నేపథ్యంలో విమానయాన సంస్థ తగ్గింపు ధరల వెల్లువ కురుస్తోంది. తాజాగా చౌకధరల విమానయాన సంస్థ స్పైస్ జెట్ సూపర్ ఫెస్టివల్ ఆఫర్ ప్రకటించింది. స్పెషల్ గ్రేట్ ఫెస్టివ్ సేల్ పేరుతో దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లలో తగ్గింపు ధరలను ప్రకటించింది. దేశీయ టికెట్లు, రూ. 888, అంతర్జాతీయ విమాన టికెట్లు రూ 3,699 ల ప్రారంభ (వన్ వే) ఛార్జీలలో అందిస్తోంది. బెంగళూరు-కొచ్చి, ఢిల్లీ-డెహ్రాడూన్, చెన్నై- బెంగళూరు లాంటి పాపులర్ రూట్లలో, అంతర్జాతీయంగా చెన్నై -కొలంబో రూట్లలో ఈ ధరలను అందిస్తోంది. అక్టోబర్4 నుంచి అక్టోబర్ 7 తేదీ అర్ధరాత్రి వరకు ఓపెన్ ఉంటుందనీ, ఇలా బుక్ చేసుకున్న ఈ టికెట్ల ద్వారా ఈ ఏడాది నవబంర్ 8 నుంచి వచ్చేఏడాది ఏప్రిల్13 మధ్య ఉపయోగించుకోవాల్సి ఉంటుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఆఫర్ కింద పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయని మొదట వచ్చినవారికి మొదట కేటాయింపు ఆధారంగా టికెట్లను కేటాయిస్తామని తెలిపింది. కాగా ఇదే తరహాలో మరో చవక ధరల విమానయానసంస్థ ఎయిర్ ఏషియా దేశీయ, అంతర్జాతీయ తగ్గింపు ధరలను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
రేణిగుంటలో విమాన సర్వీసులు పునరుద్ధరణ
రేణిగుంట: ఎట్టకేలకు రేణిగుంట నుంచి విమానాలు ఎగిరాయి. ఈనెల 17న స్పైస్‌జెట్ విమానమొకటి రన్‌వేలో ముందుకు దూసుకుపోయి చక్రాలు బురదలో కూరుకుపోయి నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తిరుపతికి విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా 27 గంటల పాటు ప్రయాణికులు అవస్థ పడ్డారు. ఆదివారం రాత్రి 11గంటలకు ఎయిర్ ఇండియా విమానం రన్‌వేపై లాండ్ అయింది. అదుపు తప్పి రన్‌వేను దాటి వెళ్లి బురదలో కూరుకుపోయిన విమానాన్ని అతికష్టం మీద∙ఎయిర్‌పోర్టు అధికారులు రన్‌వే మీదకు తీసుకొచ్చారు. సోమవారం మరమ్మతు పనులను ఇంజినీర్లు చేపట్టారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు చెన్నై డీజీసీఏ, డీసీఎస్ నుంచి విచారణ అధికారులు చేరుకున్నారు. ఆదివారం పూర్తిగా ఎయిర్‌పోర్టులో తిష్టవేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. విమానం నడిపిన ఇద్దరు పైలట్లను విచారించారు. వీరు తమ నివేదికను పౌరవిమానయాన శాఖ ఉన్నతాధికారులకు వెంటనే నివేదించనున్నారు. ఎయిర్‌పోర్టు డైరెక్టర్ పుల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. విమాన రాకపోకలు నిర్ణీత సమయంలో జరుగుతుండటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
దూసుకెళ్లిన స్పైస్ జెట్ లాభం
క్యూ1లో రూ.149 కోట్లకు... రెండింతల వృద్ధి న్యూఢిల్లీ: దేశీయ చౌక విమానయాన సంస్థ స్పైస్‌జెట్ జూన్ త్రైమాసికంలో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. సంస్థ లాభం రెండింతలకు పైగా వృద్ధి చెంది రూ.149.03 కోట్లకు దూసుకెళ్లింది. గతేడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.72.97 కోట్లుగానే ఉంది. సాధారణంగా విమానయాన సంస్థలకు వేసవి కాలం పీక్ సీజన్. ఈ కాలంలో ప్రయాణికుల్లో వృద్ధి, అధిక ఆదాయాలతో లాభం ఈ స్థాయిలో పెరగడానికి తోడ్పడింది. స్సైస్జెట్కు వరుసగా ఇది ఆరో త్రైమాసిక లాభం. ఇక సమీక్షా కాలంలో సంస్థ ఆదాయం సైతం రూ.1,113 కోట్ల నుంచి రూ.1521.53 కోట్లకు వృద్ధి చెందింది. ప్రయాణికుల భర్తీ 92.5 శాతంగా ఉన్నట్టు స్పైస్ జెట్ బీఎస్ఈకి తెలిపింది. సమయానుకూలంగా సేవల విషయంలో నిర్వహణ పనితీరును మెరుగుపరుచుకున్నట్టు, టికెట్ రద్దు చేసుకోవడాలు తగ్గినట్టు తెలిపింది. రూపాయి విలువ క్షీణత, ద్రవ్యోల్బణం, విమానాల లీజు భారం కావడం లాభాలపై ప్రభావం చూపాయని, సామర్థ్యం, ఆదాయ విస్తరణతో లాభంలో వృద్ధి సాధ్యమైనట్టు కంపెనీ వివరించింది. -
స్పైస్‌జెట్ కు సాంకేతిక సమస్య
యాప్రాన్పై ఐదు గంటల పాటు నిలిచిన వైనం సాయంత్రం 4కు హైదరాబాద్‌కు పయనం మధురపూడి : హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి శనివారం ఉదయం 11 గంటలకు చేరిన స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దీంతో ఈ సర్వీసు యాప్రాన్పై ఐదు గంటల పాటు నిలిచిపోయింది. సాంకేతిక కారణాలతో విమానం నిలిచినట్టు సంస్థ ప్రతినిధి తెలిపారు. సాంకేతిక సమస్యను చక్కదిద్దాక సాయంత్రం 4 గంటలకు ఈ సర్వీసు హైదరాబాద్‌కు తిరుగు పయనమైంది. యాప్రాన్పై విమానం ఎక్కువ సేపు నిలిచిపోవడంతో ప్రయాణికులు అసహనానికి లోనయ్యారు. సంస్థ ఉద్యోగులు ఈ సమాచారాన్ని సకాలంలో తెలియజేయకపోవడంతో ప్రయాణికులు సంస్థ ఉద్యోగులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రయాణికులకు, సంస్థ ఉద్యోగుల మధ్య వాగ్వాదం కూడా చోటుచేసుకుంది. ఎట్టకేలకు విమానం సిద్ధం కావడంతో ప్రయాణికులు శాంతించారు. ఉరుకులు.. పరుగులు విమానం ఐదు గంటల సేపు నిలిచిపోవడంతో సంస్థ ఉద్యోగులు, సిబ్బంది ఉరుకులు పరుగులు తీశారు. ఉదయం 11 గంటలకు చేరిన సర్వీసు, తిరిగి 11.30కు బయలుదేరుతుందనుకున్న సమయంలో మొరాయించింది. ఈ క్రమంలో సమాచారం ఇచ్చే వారు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బంది పడ్డారు. -
విమానయాన సంస్థల ఇండిపెండెన్స్ డే సేల్
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థలు ఇండిపెండెన్స్ డే సేల్ ధరలను ప్రకటించాయి. ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ఇండిగో తమ ప్రయాణికులకు స్వాతంత్య్ర దినోత్సవ కానుకను అందిస్తున్నాయి. ప్రముఖ బడ్జెట్ విమానయాన సంస్థలు స్పైస్‌జెట్, ఇండిగో సహా ఎయిర్ ఇండియా బేస్ ఫెయిర్(ప్రాథమిక ఛార్జీలు)తో ప్రత్యేక తగ్గింపు చార్జీలను ప్రకటించాయి. ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, అంతర్జాతీయ, దేశీయ విమాన సర్వీసుల్లో ఒక వైపు ప్రయాణానికి ఇండిగో దేశీయ సర్వీసుల్లో ఈ తగ్గింపు ధరలను వర్తింపచేస్తున్నాయి. అలాగే గ్రూప్ బుకింగ్ లకు ఈ ఆఫర్ వర్తించదు. స్టాట్యుటరీ పన్నులు మినహాయించి, ఈ ఛార్జీలు వాపసు ఇవ్వబడతాయని పేర్కొన్నాయి. అలాగే గ్రూప్ బుకింగ్ లకు ఈ ఆఫర్ వర్తించదు. స్టాట్యుటరీ పన్నులు మినహాయించి తరువాత ఈ ఛార్జీలు వాపసు ఇవ్వబడతాయని పేర్కొన్నాయి. ఆగస్టు 9 నుంచి ఆగస్టు 15లోపు టికెట్లను బుక్ చేసుకోవాలి. అలాగే 22 ఆగస్టునుంచి సెప్టెంబర్ ముప్పయి లోపు వినియోగించుకోవాలి. అయితే లిమిటెడ్ సీట్లకు మాత్రమే ఉన్నాయని, ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ కింద సీట్లు కేటాయిస్తామని సంస్థలు ప్రకటించాయి. ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా తగ్గింపు దేశీయ విమాన చార్జీలను 1199 నుంచి మొదలవుతుండగా, అంతర్జాతీయ ధరలు15,999 నుంచి ప్రారంభం. అంతర్జాతీయ టిక్కెట్లను బుక్ చేసుకున్న వారు 15 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ 15 మధ్య ప్రయాణించాల్సి ఉంటుంది. బుకింగ్ వ్యవధి: 09 ఆగస్టు 2016 ఆగస్టు 15, 2016 దేశీయ ప్రయాణ వ్యవధి: - 22 ఆగష్టు -30 సెప్టెంబర్ అంతర్జాతీయ ప్రయాణం 15 సెప్టెంబర్ 15 డిసెంబర్, 2016 స్పైస్ జెట్ స్పైస్ జెట్ తగ్గింపు దేశీయ ప్రారంభ ధరలు రూ. 399 లుగాను ,అంతర్జాతీయ ధరలను రూ. 2999లు గాను నిర్ణయించింది. బుకింగ్ వ్యవధి: 09 ఆగస్టు - ఆగస్టు 11 2016. ప్రయాణ వ్యవధి: 18 ఆగష్టు - 30 సెప్టెంబర్ 2016. అత్యల్ప ఒక వైపు ఛార్జీలు, లిమిటెడ్ సీట్లు. అలాగే విమానాల రాకపోకలు మరియు సమయాలు నియంత్రణ ఆమోదాలు తదితర మార్పుకు లోబడి ఉంటాయని స్పైస్ జెట్ ప్రకటించింది. ఇండిగో ఇండిగో రూ.806 (అన్ని కలుపుకొని) లనుంచి ప్రారంభమయ్యే దేశీయ విమాన ప్రయాణ ధరలు బుకింగ్ వ్యవధి: 09 ఆగస్టు-ఆగస్టు 15 2016. ప్రయాణ వ్యవధి: 18 ఆగష్టు- 30 సెప్టెంబర్ 2016 అన్నీ కలుపుకొని అత్యల్ప ఒక వైపు ఛార్జీలు, లిమిటెడ్ సీట్లు. క్లియర్ ట్రిప్ సైట్లో వివరాలు. -
స్పైస్ జెట్.. మొబైల్ చెకిన్ సేవలు!
ఇప్పటికే ప్రయాణీకులకు ఎప్పటికప్పుడు సరికొత్త సేవలు అందించడంలో ముందున్న విమానయాన సంస్థ స్పైస్ జెట్.. కొత్తగా స్మార్ట్ చెక్-ఇన్ సేవలను ప్రారంభించింది. గంటలదరబడి క్యూలైన్లలో బోర్డింగ్ పాస్ ల కోసం, చెకిన్ కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా స్మార్ట్ ఫోన్ యాప్.. స్మార్ట్ చెక్-ఇన్ ను రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో కొత్తగా ప్రవేశ పెట్టింది. ప్రయాణీకులు గంటలకొద్దీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండేందుకు స్పైస్ జెట్ మరో కొత్త సేవను అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్ చెక్- ఇన్ పేరున కొత్త యాప్ ను ప్రవేశపెట్టింది. ఈ నూతన యాప్ ను స్మార్ట్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకొని దీనిద్వారా ఎయిర్ పోర్టులో నిమిషాల్లో చెకిన్ అయ్యే అవకాశం కల్పించింది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మొదటిసారి స్మార్ట్ చెక్-ఇన్ సేవలను ప్రారంభించింది. ఈ సరికొత్త సేవతో ప్రయాణీకులు చెకింగ్ కోసం క్యూలో నిలబడాల్సిన పని ఉండదు. ఈ సేవలను కేంద్ర పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించడంలో స్పైస్ జెట్ ముందుంటుందని ఈ సందర్భంలో ఆయన తెలిపారు. త్వరలో ఈ సేవలను అన్ని విమానాశ్రయాల్లో ప్రవేశ పెట్టేందుకు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి వెల్లడించారు. యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న విమాన ప్రయాణీకులు.. విమానాశ్రయంలోని చెక్ ఇన్ ప్రాంతంలోకి చేరగానే ఫోన్లకు ఓ అలర్డ్ వస్తుంది. దాన్ని అంగీకరించిన వెంటనే ఫోన్ లోకి బోర్డింగ్ పాస్ వచ్చి చేరుతుంది. ఈ కొత్త స్మార్ట్ చెక్-ఇన్ సేవ ను వినియోగించుకుంటే ప్రయాణం హడావుడితోపాటు ప్రయాణీకులు చెకిన్ కోసం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. -
170 మంది లోపలే ఉన్నారు... బయట..
రెండున్నర గంటలపాటు నిలిచిపోయిన విమానం ప్రయాణికులు లోపలుండగానే మరమ్మతులు గోపాలపట్నం: విశాఖ విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానానికి సాంకేతిక సమస్య తలెత్తింది. సరిగ్గా విమానంలోకి ప్రయాణికులు ఎక్కాక సమస్య ఎదురవ్వడంతో అప్పటికపుడు ప్రయాణికులను దించడానికి వీల్లేక యుద్ధప్రాతిపదికపై సాంకేతిక నిపుణులు లోపాన్ని సరిచేసి విమానాన్ని కదిలించారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. హైదరాబాదు నుంచి విశాఖకు స్పైస్‌జెట్ విమానం సాయంత్రం 6.30కి చేరింది. ఇది ఏడు గంటలకు తిరిగి హైదరాబాదు బయలుదేరాల్సి ఉండగా, దాదాపు 170మంది ప్రయాణికులు విమానంలో కూర్చున్నారు. ఇంతలో విమానానికి సాంకేతిక సమస్య ఎదురవ్వడంతో పెలైట్ అప్రమత్తమయ్యారు. తలుపులు తెరవడానికి కూడా ఆస్కారం లేకపోవడంతో ప్రయాణికులను విమానంలోనే ఉంచి సాంకేతిక నిపుణులను రప్పించారు. ప్రయాణికులకు నూడిల్సు తదితర ఆహారం సరఫరా చేశారు. ఎట్టకేలకు రాత్రి 9.25కి సమస్య పరిష్కారమై విమానం కదిలింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వెళ్లారు. -
స్పైస్‌జెట్ విమానానికి సాంకేతిక సమస్య
గోపాలపట్నం :విశాఖ విమానాశ్రయంలో స్పైస్‌జెట్ విమానానికి సాంకేతిక సమస్య తలెత్తింది. సరిగ్గా విమానంలోకి ప్రయాణికులు ఎక్కాక సమస్య ఎదురవ్వడంతో అప్పటికపుడు ప్రయాణికులను దించడానికి వీల్లేక యుద్ధ ప్రాతిపదికపై సాంకేతిక నిపుణులు లోపాన్ని సరిచేసి విమానాన్ని కదిలించారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. హైదరాబాదు నుంచి విశాఖకు సై ్పస్‌జెట్ విమానం సాయంత్రం 6.30కి చేరింది. ఇది ఏడు గంటలకు తిరిగి హైదరాబాదు బయలుదేరాల్సి ఉండగా, దాదాపు 170మంది ప్రయాణికులు విమానంలో కూర్చున్నారు. ఇంతలో విమానం సాంకేతిక సమస్య ఎదురవ్వడంతో పైలెట్ అప్రమత్తమయ్యారు. తలుపులు తెరవడానికి కూడా ఆస్కారం లేకపోవడంతో ప్రయాణికులను విమానంలోనే ఉంచి సాంకేతిక నిపుణులను రప్పించారు. ప్రయాణికులకు నూడిల్సు తదితర ఆహారం సరఫరా చేసి సురక్షతంగా ఉంచారు. ఎట్టకేలకు రాత్రి 9.25కి సమస్య పరిష్కారమయి విమానం కదిలింది. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకుని క్షేమంగా వెళ్లారు. -
స్పైస్‌జెట్ విమానానికి సాంకేతిక సమస్య
గోపాలపట్నం :విశాఖ విమానాశ్రయంలో స్పైస్‌జెట్ విమానానికి సాంకేతిక సమస్య తలెత్తింది. సరిగ్గా విమానంలోకి ప్రయాణికులు ఎక్కాక సమస్య ఎదురవ్వడంతో అప్పటికపుడు ప్రయాణికులను దించడానికి వీల్లేక యుద్ధ ప్రాతిపదికపై సాంకేతిక నిపుణులు లోపాన్ని సరిచేసి విమానాన్ని కదిలించారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. హైదరాబాదు నుంచి విశాఖకు సై ్పస్‌జెట్ విమానం సాయంత్రం 6.30కి చేరింది. ఇది ఏడు గంటలకు తిరిగి హైదరాబాదు బయలుదేరాల్సి ఉండగా, దాదాపు 170మంది ప్రయాణికులు విమానంలో కూర్చున్నారు. ఇంతలో విమానం సాంకేతిక సమస్య ఎదురవ్వడంతో పైలెట్ అప్రమత్తమయ్యారు. తలుపులు తెరవడానికి కూడా ఆస్కారం లేకపోవడంతో ప్రయాణికులను విమానంలోనే ఉంచి సాంకేతిక నిపుణులను రప్పించారు. ప్రయాణికులకు నూడిల్సు తదితర ఆహారం సరఫరా చేసి సురక్షతంగా ఉంచారు. ఎట్టకేలకు రాత్రి 9.25కి సమస్య పరిష్కారమయి విమానం కదిలింది. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకుని క్షేమంగా వెళ్లారు. -
పాపులర్ బ్రాండ్స్‌గా ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్
-
పాపులర్ బ్రాండ్స్‌గా ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్
న్యూఢిల్లీ: దేశీయ విమానయాన రంగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన సంస్థల్లో ఎయిర్ ఇండియా ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రైవేటు రంగంలో చూస్తే స్పైస్‌జెట్ ముందున్నట్టు మీడియా విశ్లేషణ సంస్థ ‘బ్లూబైట్స్’ పేర్కొంది. స్పైస్‌జెట్ తర్వాత జెట్‌ఎయిర్‌వేస్, ఇండిగో ఎయిర్‌లైన్స్ తదుపరి స్థానాల్లో ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు ‘భారతదేశపు అత్యంత ప్రాచుర్యం పొందిన విమానయాన బ్రాండ్స్ 2016’ పేరిట ఓ నివేదికను విడుదల చేసింది. అంతర్జాతీయ ప్రైవేటు ఎయిర్‌లైన్స్ విభాగంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రథమ స్థానంలో నిలవగా... ఎతిహాద్, ఎమిరేట్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొంది. -
టాప్ లో ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మరోసారి తన పత్ర్యేకతను నిలబెట్టుకుంది. సమయపాలనలో విమర్శలు, సిబ్బంది ప్రవర్తన లాంటి అంశాల్లో విమర్శలుఎదుర్కొంటున్నపటికీ విమాన సేవలు అందిస్తున్న ప్రభుత్వ సంస్థల్లో రారాజుగా నిలిచింది. దేశంలో ప్రభుత్వ విమాన రంగంలో ఏకైక సంస్థ ఎయిర్ఇండియా జాతీయ రంగంలో టాప్ ప్లేస్ లో చోటు దక్కించుకుంది. అంతర్జాతీయ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ విభాగంలో సింగపూర్ ఎయిర్ లైన్స్ మొదటి స్థానంలో నిలిచింది. లుఫ్తాన్సా, బ్రిటిష్ ఎయిర్ లైన్స్, ఖతార్ ఎయిర్ లైన్స్, ఇండిగో, గో ఎయిర్ తరువాతి స్థానాలతో సరిపెట్టుకున్నాయి. అటు దేశీయ అత్యంత ప్రముఖ ఏవియేషన్ బ్రాండ్స్ లో స్పైస్ జెట్ టాప్ ప్లేస్ కొట్టేసింది. 'మెస్ట్ రెప్యూటెడ్ బ్రాండ్స్ ఇన్ 2016 ' పేరుతో విడుదల చేసిన డొమెస్టిక్ ప్రయివేటు ఎయిర్ లైన్స్ స్పైస్ జెట్ ఈ ఘనత సాధించింది. 34 శాతం లోయర్ బ్రాండ్ రిపుటేషన్ తో జెట్ ఎయిర్ వేస్, 9శాతంతో ఇండిగో తరువాతి స్థానాల్లో నిలిచాయి .ట్రస్ట్ రీసెర్చ్ ఎడ్వైజరీ (టీఆర్ఏ) విడుదల చేసిన నివేదికలో దేశీయ ప్రైవేట్ విమానయాన సంస్థల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. . మీడియా ఎనలటిక్స్ సంస్థ బ్లూ బైట్స్ భాగస్వామ్యంతో టీఆర్ఏ ఈ అధ్యయనం నిర్వహంచింది. -
‘నన్నెందుకు వీఐపీలా చూస్తున్నారు..’
న్యూఢిల్లీ: సాధారణంగా తనను ప్రత్యేకంగా చూడాలని, వీఐపీలా ట్రీట్ చేయాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తుంటారు. కానీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మాత్రం తనను వీఐపీలా చూసినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ’నేను కూడా అందిరిలాంటి మనిషినేగా ఎందుకు ప్రత్యేకంగా పరిగణిస్తూ మానసికంగా వేధిస్తారు’ అని ఆయనకు కలిగిన ఇబ్బందిని బయటపెట్టారు. మధ్యప్రదేశ్ నుంచి కొత్తగా రాజ్యసభకు వివేక్ తనఖా అనే వ్యక్తి ఎన్నికయ్యారు. ఆయన జబల్పూర్ నుంచి ఢిల్లీకి ఒక కార్యక్రమంపై వెళ్లారు. ఆ సమయంలో ఆయనతోపాటు ఓ లోక్ సభ సభ్యుడు కూడా ఉన్నాడు. స్పైస్ జెట్ విమానంలో వారిద్దరు వెళ్లారు. అయితే, ఢిల్లీ విమానాశ్రయం చేరుకోగానే ముందుగా తమకు మాత్రమే ఫ్లైట్ దిగిపోయే అవకాశం ఇచ్చి మిగితా ప్రయాణికులను కొద్ది సేపు ఆపేశారని, తాము పూర్తిగా వెళ్లిపోయాక వారిని వదిలారని, ఇది ఏమాత్రం గర్హించరాని విషయం అంటే స్పైస్ జెట్ కు ఫిర్యాదు చేశారు. తాము కూడా మిగితా ప్రయాణికుల్లాంటి వారిమేనని చెప్పారు.‘నేను చాలా తీవ్రంగా బాధపడ్డాను. నేను అందరిలాంటి ప్రయాణికుడినే. వారికి ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారో నాకు వాటినే వర్తింపజేయాలి. నన్ను కూడా ఒక పౌరుడిగా పరిగణించినప్పుడు ప్రత్యే్క సేవలు, మర్యాద అవసరం లేదనే చెప్తాను. మీకు వీలైతే వీఐపీలా ఎంపీలను, లేదా కొంతమందిని ట్రీట్ చేయడం మానేయండి. అదీ కుదరకుంటే.. కనీసం నన్నయినా వీఐపీలా ట్రీట్ చేయడం మానండి’ అంటూ ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. -
రూ. 444కే స్పైస్‌జెట్ టికెట్
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్లకు తెరలేపింది. సంస్థ తాజాగా ‘మాన్సూన్ బొనాంజా సేల్’ స్కీమ్ పేరుతో దేశీ మార్గంలో ప్రయాణించే వారి కోసం ఒకవైపునకు మాత్రమే సంబంధించి రూ.444ల ప్రారంభ ధరతో (పన్నులు మినహా) విమాన టికెట్‌ను ఆఫర్ చేస్తోంది. బుధవారం ప్రారంభమైన ఈ ఆఫర్ జూన్ 26 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుం దని సంస్థ తెలిపింది. తాజా ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్నవారు జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని పేర్కొంది. ఈ ఆఫర్ కేవలం దేశీ మార్గంలో ప్రయాణించే నాన్‌స్టాప్, వయా ఫ్లైట్స్‌కు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. జమ్మూ-శ్రీనగర్, అహ్మదాబాద్-ముంబై, ముంబై-గోవా, ఢిల్లీ-డెహ్రాడూన్, ఢిల్లీ-అమృత్సర్ రూట్లలో ప్రయాణించే వారికే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. టికెట్ ధర బుకింగ్ టైమింగ్, ప్రయాణ దూరం వంటి తదితర అంశాలపై ఆధారపడి మారుతూ ఉంటుందని తెలిపింది. -
స్పైస్‌జెట్ మాన్సూన్ బొనాంజా ..రూ.444 కే
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ మాన్సూన్ బొనాంజా సేల్ ఆఫర్ ను ప్రకటించింది. దేశీయ రూట్లలో పలు విమాన టిక్కెట్లపై ఐదు రోజుల తగ్గింపు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒకవైపు ప్రయాణం ప్రారంభ ధర రూ.444 అని తెలిపింది. ఈ ఆఫర్ స్పైస్‌జెట్ నాన్ స్టాప్, దేశీయ విమానాలు ద్వారా జమ్మూ-శ్రీనగర్, అహ్మదాబాద్-ముంబై, ముంబై-గోవా, ఢిల్లీ-డెహ్రాడూన్, ఢిల్లీ-అమృత్ సర్ మార్గాల్లో రూ 444 లు ఒక వైపు బేస్ ఛార్జీగా ఉంటుందని తెలిపింది. అయితే మిగిలిన రూట్లలో సెక్టార్లు, ప్రయాణ దూరాన్ని బట్టి ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయని చెప్పింది. ఐదు రోజుల పాటు అంటే జూన్ 26 వరకు ఈ ఆఫర్ కింద టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ మాన్ సూన్ ఆఫర్ కింద టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు జూలై1 నుంచి సెప్టెంబర్ 30లోపు ప్రయాణాలు చేయవచ్చని పేర్కొంది. స్పైస్‌జెట్ మొబైల్ యాప్ , స్పైస్‌జెట్.కామ్‌తోపాటు , ఇతర ట్రావెల్ పోర్టల్స్, ట్రావెల్ ఏజెంట్ల ద్వారా ఈ ఆఫర్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ తగ్గింపు ఆఫర్లు గ్రూప్ బుకింగ్స్ , శిశు బుకింగులకు వర్తించదని . ఫస్ట్ కమ్-ఫస్ట్ సర్వ్ పద్ధతిలో సీట్లు కేటాయింపు ఉంటుందని తెలిపింది. -
స్పైస్ జెట్ ట్యాక్సీ ఆఫర్..
ముంబై : విమాన ప్రయాణికులు ఎయిర్ పోర్టుకు చేరుకోగానే ట్యాక్సీ కోసం వెతుకులాడుతుంటారు. అలా వెతికే అవసరం లేకుండా విమాన టిక్కెట్ కొనుగోలు చేసినప్పుడే, ట్యాక్సీ ని కూడా బుక్ చేసుకునే సదుపాయం కల్పించనుంది స్పైస్ జెట్. ఈ వినూత్నమైన ఆఫర్ ను విమాన ప్రయాణికుల ముందుకు స్పైస్ జెట్ త్వరలోనే ప్రవేశపెట్టబోతోంది. దీనికోసం క్యాబ్ అగ్రిగేటర్ "మై టాక్సీఇండియా (ఎంటీఐ)" తో ఒప్పందం కుదుర్చుకుంది. స్పైస్ జెట్ మొత్తం దేశంలో 41 గమ్యస్థానాలకు,300 డైలీ విమానాలను నడుపుతోంది. దానిలో ఆరు ఇంటర్నరేషనల్ విమానాలు ఉన్నాయి. టైర్ 2, టైర్ 3 సిటీల నుంచి కస్టమర్లను అధికంగా ఆకట్టుకోవడానికి, రెవెన్యూలను పెంచుకోవడానికి స్పైస్ జెట్ ఈ ఆఫర్ ను ప్రయాణికుల ముందుకు తీసుకురాబోతుంది. ఈ ఆఫర్ తో ప్రయాణికులు గమ్యస్థానానికి చేరుకోగానే ట్యాక్సీ అందుబాటులో ఉంటుంది. అప్పుడు వెతుకునే అవసరం లేకుండానే ప్రయాణికులు ప్రశాంతంగా గమ్యస్థానాలకు చేరిపోయే వీలుంటుంది. ట్యాక్సీ అవసరమైన వారు టిక్కెట్ కొనుగోలు సమయంలోనే ట్యాక్సీని బుక్ చేసుకోవచ్చని స్పైస్ జెట్ ప్రెసిడెంట్ అమిత్ శ్రీవాత్సవ్ తెలిపారు. ఈ ఆఫర్ ను త్వరలోనే ప్రవేశపెడతామన్నారు. టైర్ 2, టైర్ 3 సిటీల్లో మధ్యతరగతి వినియోగదారులను ఎక్కువగా ఆకట్టుకోవడానికి ఈ సర్వీసు ఉపయోగపడుతుందని శ్రీవాత్సవ్ పేర్కొన్నారు. ఎంటీఐ ట్యాక్సీ అగ్రిగేటర్ గా 2013నుంచి తన సేవలు అందిస్తోంది. 119 సిటీల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. 454 పైగా క్యాబ్ ఆపనేటర్లను ఈ సంస్థ కలిగి ఉంది. -
స్పైస్‌జెట్ లాభం 3 రెట్లు
వరుసగా ఐదో క్వార్టర్లోనూ లాభాలే న్యూఢిల్లీ: స్పైస్‌జెట్ కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి మూడు రెట్లకు పైగా పెరిగింది. 2014-15 క్యూ4లో రూ.23 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.73 కోట్లకు పెరిగిందని స్పైస్‌జెట్ తెలిపింది. నిర్వహణ ఆదాయం అధికంగా ఉండటంతో వరుసగా ఐదో క్వార్టర్లోనూ లాభాలు సాధించామని కం పెనీ సీఎండీ అజయ్ సింగ్ చెప్పారు. మొత్తం ఆదాయం రూ.791 కోట్ల నుంచి రూ.1,475 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. మొత్తం వ్యయాలు రూ.889 కోట్ల నుంచి రూ.1,460 కోట్లకు ఎగిశాయని తెలిపారు. ఇక 2015-16 ఏడాదికి చూస్తే రూ.407 కోట్ల నికర లాభం వచ్చిందని అజయ్ సింగ్ చెప్పారు. 2014-15లో రూ.687 కోట్ల నష్టాలు వచ్చాయన్నారు.