
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్.. దేశీయ రూట్లలో రూ.888కే టికెట్ సేల్ ప్రకటించింది. వర్షాకాల ఆఫర్‌లో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్ 25 వరకు చేసే ప్రయాణాలపై ఈ ధర వర్తిస్తుంది. అయితే, ప్రయాణ టికెట్లను ఈనెల 6వ తేదీ లోపు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే ఆఫర్ అంతర్జాతీయ రూట్లలో అయితే.. ప్రారంభ టికెట్ ధర రూ.3,499 నుంచి ఉన్నట్లు కంపెనీ వివరించింది. ఇక గతవారంలోనే అంతర్జాతీయ మార్గాల్లో కొత్త విమానాలను ప్రారంభించినట్లు సంస్థ ప్రకటించింది.