రూ.826కే స్పైస్‌జెట్ టికెట్
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా విమాన టికెట్ ధరల్లో డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఒక వైపునకు సంబంధించి దేశీ విమాన టికెట్లను రూ.826ల నుంచి ప్రయాణికులకు అందిస్తోంది. అలాగే అంతర్జాతీయ విమాన టికెట్లను రూ.3,026ల (పన్నులు అదనం) నుంచి ఆఫర్ చే స్తోంది.
ఈ విమాన టికెట్ ధరలన్నీ కూడా ఎంపిక చేసిన దేశీ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు మాత్రమే వర్తిస్తాయని కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్ వినియోగదారులకు ఈ నెల 25-27 వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఆఫర్‌లో టిక్కెట్లును బుక్ చేసుకున్నవారు ఫిబ్రవరి 1-ఏప్రిల్ 12 మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని తెలిపింది.
ఎయిర్‌కోస్టా ‘555’ ఆఫర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిపబ్లిక్ డే నేపథ్యంలో ఎయిర్‌కోస్టా టికెట్లపై రూ. 555 ఆఫర్‌ను ప్రకటించింది. జనవరి 25 ఉదయం 10 నుంచి జనవరి 28 సాయంత్రం 6లోపు తీసుకున్న ప్రతీ టికెట్‌పై రూ. 555 తగ్గింపు లభిస్తుంది. ఈ సమయంలో బుక్ చేసుకున్న టికెట్లతో ఫిబ్రవరి 8-అక్టోబర్ 29 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయొచ్చని కంపెనీ పేర్కొంది.