సాక్షి, న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగా విమానయాన సంస్థలు తగ్గింపు ధరల్లో టికెట్లను ఆఫర్ చేయడంలో పోటీ పడుతున్నాయి. తాజాగా ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ రిపబ్లిక్‌డే ఆఫర్ ప్రకటించింది. ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ పేరుతో ప్రత్యేక రూట్లలో పరిమిత కాలానికి డిస్కౌంట్ రేట్లలో టికెట్లను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ ఈ టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్‌లో టికెట్ బుకింగ్స్ జనవరి 22 నుంచి జనవరి 25వ తేదీ వరకు చేసుకోవచ్చు. ఈ ఏడాది డిసెంబరు 12 వరకు ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని ఒక ప్రకటనలో ఎయిర్ లైన్స్ వెల్లడించింది.
దేశీయంగా 769 రూపాయలు (వన్ వే, అన్నీ కలుపుకొని) అంతర్జాతీయ ప్రయాణాల్లో టికెట్ ప్రారంభ ధర రూ.2.469 ఉంది. జమ్ము-శ్రీనగర్, సిల్చార్-గువహటి, డెహ్రాడూన్-ఢిల్లీ , ఢిల్లీ-జైపూర్, అగర్తల-గువహటి, కోయంబత్తూర్-బెంగళూరు, కొచ్చి-బెంగళూరు, ఢిల్లీ-డెహ్రాడూన్ తదితర మార్గాల్లో టికెట్ ప్రారంభ ధర రూ.769 ఉందని స్పైస్‌జెట్ వెల్లడించింది. అలాగే అంతర్జాతీయ నెట్‌వర్క్‌లో చెన్నై- కొలంబో రూట్‌కు టికెట్ ప్రారంభ ధర రూ.2,249 ఉందని తెలిపింది. స్పైస్‌జెట్ .కాం, లేదా సంస్థ మొబైల్ యాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎస్‌బీఐ క్రెడిట్ ద్వారా 10శాతందాకా డిస్కౌంట్. దాదాపు 500రూపాయల దాకా తగ్గింపు తోపాటు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఫ్రీ ప్రయారిటీ చెక్ సౌకర్యం కూడా.
Comments
Please login to add a commentAdd a comment