స్పైస్‌జెట్‌ ‘థ్రిల్లింగ్‌ థర్స్‌డే’ ఆఫర్‌ | SpiceJet Announce Thrilling Thursday Offer | Sakshi
Sakshi News home page

స్పైస్‌జెట్‌ ‘థ్రిల్లింగ్‌ థర్స్‌డే’ ఆఫర్‌

Published Thu, Jul 19 2018 12:52 PM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM

SpiceJet Announce Thrilling Thursday Offer - Sakshi

స్పైస్‌జెట్‌ ‘థ్రిల్లింగ్‌ థర్స్‌డే’ ఆఫర్‌

చవక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ స్పెషల్‌ ‘థ్రిల్లింగ్‌ థర్స్‌డే’ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌ కింద విమాన టిక్కెట్లపై వెయ్యి రూపాయల వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. డిస్కౌంట్‌ ఆఫర్‌తో పాటు, ప్రియారిటీ చెక్‌-ఇన్‌ను కూడా తన కస్టమర్లకు ఆఫర్‌ చేస్తోంది. నేడు అంటే గురువారం ఈ ఆఫర్‌ వాలిడ్‌లో ఉంది. అంతేకాక వచ్చే గురువారం జూలై 26న కూడా ఈ ఆఫర్‌ వాలిడ్‌లో ఉంటుంది. ఈ ఆఫర్‌ టిక్కెట్లు స్పైస్‌జెట్‌ వెబ్‌సైట్‌, స్పైస్‌జెట్‌.కామ్‌, మొబైల్‌ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. స్పైస్‌జెట్‌ థ్రిల్లింగ్‌ థర్స్‌డే ఆఫర్‌ పొందడానికి కస్టమర్లు ప్రోమో కోడ్‌ ఎస్‌సీబీ1000ను వాడాల్సి ఉందని ఎయిర్‌లైన్‌ తన వెబ్‌సైట్‌లో తెలిపింది. 
 

స్పైస్‌జెట్‌ థ్రిల్లింగ్‌ థర్స్‌డే ఆఫర్‌ పొందడమెలా...

  • స్పైస్‌జెట్‌ థ్రిల్లింగ్‌ థర్స్‌డే ఆఫర్ విమాన టిక్కెట్లను 2018 జూలై 26 వరకు వచ్చే గురువారాల్లో బుక్‌ చేసుకోవాలి.
  • www.spicejet.com, స్పైస్‌జెట్‌ మొబైల్‌ యాప్‌లపై విమానాన్ని ఎంపిక చేసుకోవాలి. బుక్‌ చేసుకునేటప్పుడే ప్రియారిటీ చెక్‌-ఇన్‌ను పొందాలి.
  • ప్రమోకోడ్‌ ఎస్‌సీబీ1000ను అప్లయి చేసుకోవాలి. పేమెంట్‌ పేజీపై ఉన్న ప్రమోషన్‌ కోడ్‌ సెక్షన్‌లో స్టాండర్డ్‌ ఛార్టడ్‌ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డు నెంబర్‌ నమోదు చేయాలి.
  • రౌండ్‌ ట్రిప్‌ బుకింగ్‌కు వెంటనే రూ.1000 డిస్కౌంట్‌ పొందుతారు. వన్‌ వే బుకింగ్‌కు రూ.500 డిస్కౌంట్‌ లభిస్తుంది. 
     

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement