వినూత్న ఆఫర్‌ : జీరోకే విమాన టిక్కెట్‌ | SpiceJet offers to fly you for free, prices tickets at just Rs 0 on these flights! | Sakshi
Sakshi News home page

వినూత్న ఆఫర్‌ : జీరోకే విమాన టిక్కెట్‌

Published Wed, Dec 6 2017 6:14 PM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM

SpiceJet offers to fly you for free, prices tickets at just Rs 0 on these flights! - Sakshi

ఉచితంగా విమాన ప్రయాణం చేయాలనుకుంటున్నారా. అయితే స్పైస్‌జెట్‌ విమానం ఎక్కేయండి. వివిధ రకాల ఆఫర్లతో ఊరిస్తున్న విమాన సంస్థలకు బిన్నంగా స్పైస్‌జెట్‌ జీరోకే విమాన టిక్కెట్లను ఆఫర్‌ చేస్తోంది. విమాన ప్రయాణానికి చెల్లించిన మొత్తాన్ని తిరిగి వోచర్‌ రూపంలో చెల్లిస్తోంది. ఈ కొత్త డీల్‌ కింద ఎయిర్‌ఫేర్‌కు చెల్లించిన మొత్తం నగదును రిడీమ్‌ చేసుకునే ఆప్షన్‌ను తీసుకొచ్చింది. డిసెంబర్‌ 1 నుంచి ఈ ఆఫర్‌ను ప్రారంభించిందని, ఈ నెలంతా అంటే 2017 డిసెంబర్‌ 31 వరకు ఇది అందుబాటులో ఉంటుందని స్పైస్‌జెట్‌ తెలిపింది. 2017 డిసెంబర్‌ 1 నుంచి 2018 మార్చి 31 మధ్య ప్రయాణానికి ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.

ఆఫర్‌ పొందడం ఎలా..?
కంపెనీ సొంత వెబ్‌సైట్‌  www.spicejet.comలో మీరు విమాన టిక్కెట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని ఛార్జీలతో కలిపి టికెట్‌ మొత్తాన్ని ఆ పోర్టల్‌ ద్వారా చెల్లించాలి. ఒక్కసారి ఆ లావాదేవీ పూర్తయిన తర్వాత స్పైస్‌జెట్‌కే చెందిన www.spicestyle.com వెబ్‌సైట్‌లో లాగిన్‌ అవ్వాలి. అక్కడ మీరు చెల్లించిన మొత్తాన్ని రిడీమ్‌ చేసుకోవడానికి, అన్ని వివరాలను నమోదుచేయాల్సి ఉంటుంది. తర్వాత స్టైల్‌ క్యాష్‌లోని మై అకౌంట్‌ సెక్షన్‌లోకి వెళ్లి, ఎస్సెమ్మెస్‌ ద్వారా వచ్చిన కోడ్‌ను ఎంటర్‌ చేయడం ద్వారా టికెట్‌కు చెల్లించిన మొత్తం స్టైల్‌క్యాష్‌లో జమ అవుతుంది.

స్టైల్ క్యాష్‌ SpiceStyle.comకు చెందిన ఈ-వాలెట్‌. స్టైల్‌​క్యాష్‌లో జమ అయిన ఈ మొత్తాన్ని www.spicestyle.com వెబ్‌సైట్‌లో కొనుగోళ్లకు ఉపయోగించుకోవచ్చు. ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా 30 శాతం మొత్తాన్ని వినియోగించుకోవచ్చు. స్టైల్‌క్యాష్‌ మొత్తాన్ని 2018 మార్చి 31లోపు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఒక పీఎన్‌ఆర్‌ నంబర్‌కు ఒక వోచర్‌ను మాత్రమే ఇస్తారని స్పైస్‌జెట్‌ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. మరే ఇతర స్పెషల్‌ ఆఫర్‌ లేదా ప్రమోషన్‌లకు దీన్ని వాడుకోవడానికి లేదని స్పైస్‌జెట్‌ తెలిపింది. ఎయిర్‌ఏసియా, ఇండిగో కూడా న్యూఇయర్‌ సందర్భంగా విమాన టిక్కెట్లపై పలు డిస్కౌంట్‌ ఆఫర్లను తీసుకొచ్చాయి. ఎయిర్‌ఏసియా రూ.999కే టిక్కెట్‌ను విక్రయిస్తుండగా... ఇండిగో రూ.1005కు విమాన టిక్కెట్‌ను అందిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement