
సాక్షి, ముంబై: విమానయాన సంస్థ స్పైస్‌జెట్ దేశీయంగా కొత్తగా 20 విమానాలను ప్రవేశపెట్టింది. దేశీయ రూట్లలో 20 నాన్‌స్టాప్ విమానాలను త్వరలోనే ప్రారంభించ నున్నామని కంపెనీ ప్రకటించింది. చెన్నై-మంగళూరు, గౌహతికి చెన్నై మార్గాలు సహా ఫిబ్రవరి 11 ప్రారంభించి అనేక మార్గాల్లో ఫ్రీక్వెన్సీని జోడిస్తున్నట్టు తెలిపింది. అంతేకాదు కోల్‌కతా, జబల్‌పూర్, బెంగళూరు, పుదుచ్చేరి మధ్య డైరెక్ట్ ఫ్టైట్ నడుపనున్న తొలి సంస్థగా స్పైస్ జెట్ నిలిచింది.
తన కార్యకలాపాల విస్తరణలోభాగంగా చెన్నై-విశాఖపట్నం( సెకండ్ ఫ్రీక్వెన్సీ) కోల్‌కతా- విశాఖపట్నం( సెకండ్ ఫ్రీక్వెన్సీ) , చెన్నై-విజయవాడ( థర్డ్ ఫ్రీక్వెన్సీ) బెంగళూరు-చెన్నై (ఐదవ ఫ్రీక్వెన్సీ) రూట్లలో నాన్ స్టాప్ విమానాలను నడుపుతుంది. చెన్నై, విశాఖపట్నం, కోలకతా- విశాఖపట్నం, చెన్నై- విజయవాడ మధ్య రోజువారీ విమానాలు పనిచేస్తాయనీ, అయితే బెంగళూరు- తిరుపతి ధ్య మంగళవారాలు తప్ప అన్ని రోజుల్లోనూ తమ సేవలు అందుబాటులోఉంటాయని పేర్కొంది. దక్షిణాన 18 విమానాలతో నాన్ మెట్రో, మెట్రో నగరాల మధ్య అనుసంధానం పెంచుతున్నట్టు తెలిపింది. వీటిల్లో 10 సర్వీసులను ప్రాంతీయ కనెక్టివిటీ థీమ్ ‘కనెక్టెడ్ ది అన్‌కనెక్టెడ్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కలుపుతున్నట్టు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment