స్పైస్‌జెట్‌ మాన్‌సూన్‌ బొనాంజ | SpiceJet Offers Flight Tickets From Rs 999. Additional Benefits Also Available | Sakshi
Sakshi News home page

స్పైస్‌జెట్‌ మాన్‌సూన్‌ బొనాంజ

Published Wed, Jul 4 2018 12:43 PM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM

SpiceJet Offers Flight Tickets From Rs 999. Additional Benefits Also Available - Sakshi

న్యూఢిల్లీ : విమానయాన సంస్థలు మాన్‌సూన్‌ ఆఫర్లతో హోర్రెత్తిస్తున్నాయి. తాజాగా స్పైస్‌జెట్‌ ‘మెగా మాన్‌సూన్‌ సేల్‌’ను ప్రకటించింది. దీని కింద దేశీయ విమాన టిక్కెట్లను రూ.999కే అందిస్తున్నట్టు పేర్కొంది. స్పైస్‌జెట్‌ తీసుకొచ్చిన ఈ కొత్త ప్రమోషనల్‌ సేల్‌ 2018 జూలై 8 వరకే వాలిడ్‌లో ఉంటుందని స్పైస్‌జెట్‌ తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది. 2018 అక్టోబర్‌ 8వ తేదీకి ఈ ఆఫర్‌ ప్రయాణ కాలం ముగియనుంది. తక్కువ ధరకు టిక్కెట్లను అందించడమే కాకుండా.. ఎయిర్‌లైన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో టిక్కెట్లు బుక్‌ చేసుకున్న వారికి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తున్నట్టు పేర్కొంది. సీట్లు, మీల్స్‌, స్పైస్‌మ్యాక్స్‌, ఇతర యాడ్‌-ఆన్స్‌పై 20 శాతం డిస్కౌంట్‌ను ఈ క్యారియర్‌ అందిస్తున్నట్టు తెలిపింది. అదనపు డిస్కౌంట్‌ ఆఫర్‌ ప్రోమో కోడ్‌ ఏడీడీ0ఎన్‌20గా స్పైస్‌జెట్‌ వెల్లడించింది.

స్పైస్‌జెట్‌ ‘మెగా మాన్‌సూన్‌ సేల్‌’ నియమ, నిబంధనలు...
వన్‌-వే ధరలకు మాత్రమే ఈ మెగా సేల్‌ వర్తిస్తోంది. ఈ ఆఫర్‌ను మిగతా ఏ ఆఫర్‌తో కలుపరు. గ్రూప్‌ బుకింగ్స్‌కు ఇది వర్తించదు. ఒకవేళ అవసరమైతే స్వల్ప రద్దు  ఛార్జీలతో టిక్కెట్‌ ధర మొత్తాన్ని రీఫండ్‌ చేయనుంది. ఫస్ట్‌-కమ్‌, ఫస్ట్‌-సర్వ్‌డ్‌ బేసిస్‌లోనే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. విమానం బయలుదేరే సమయం, ఇతర షెడ్యూల్స్‌ రెగ్యులేటరీ ఆమోదం మేరకే ఉంటాయి. ఈ ఆఫర్‌కు బ్లాక్‌-అవుట్‌ డేట్స్‌ వర్తిస్తాయి.

స్పైస్‌జెట్‌ అదనపు 20 డిస్కౌంట్‌ ఆఫర్‌...
స్పైస్‌జెట్‌.కామ్‌ ద్వారా బుకింగ్స్‌ చేసుకునే యాడ్‌-ఆన్‌ ప్రొడక్ట్‌లకు మాత్రమే 20 శాతం అదనపు డిస్కౌంట్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. స్పైస్‌మ్యాక్స్‌, సీట్‌, హాట్‌ మీల్‌, ప్రియారిటీ చెక్‌ఇన్‌, ప్రిఫర్డ్‌ బ్యాగ్‌ అవుట్‌ వంటి వాటికి ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. అన్ని ఇతర ఛార్జీలు, ఫీజులు, పన్నులను ప్రయాణికులే చెల్లించాల్సి ఉంటుంది. దేశీయ, అంతర్జాతీయ విమానాల రౌండ్‌-ట్రిప్‌, వన్‌వే బుకింగ్స్‌ రెండింటికీ ఈ ఆఫర్‌ వాలిడ్‌లో ఉంటుంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ ఆఫర్‌ను సవరించుకోవడం, రద్దు చేసుకోవడం చేయొచ్చు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement