Sale
-
నిర్మాణం ఆలస్యమైతే వడ్డీ ఇస్తారని తెలుసా..?
సాక్షి, హైదరాబాద్: సొంతింటి కల సాకారంలో కస్టమర్‌తో బిల్డర్ చేసుకునే సేల్ అగ్రిమెంట్ అత్యంత కీలకం. ఒప్పందపత్రంలోని నిబంధనలు, షరతులను బట్టి మన కల తీరుతుందో లేక మధ్యలోనే పటాపంచలవుతుందో ఇట్టే చెప్పేయొచ్చు. అందుకే మనిషికి హృదయ స్పందనలాగే డెవలపర్‌కు, కొనుగోలుదారులకు మధ్య జరిగే సేల్ అగ్రిమెంట్ అంతకంటే ముఖ్యమని తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ–రెరా) సభ్యులు కె.శ్రీనివాస రావు అంటున్నారు. ఆయనతో ‘సాక్షి రియల్టీ’ ఇంటర్వ్యూ విశేషాలివీ..బహుళ అంతస్తుల నిర్మాణ సంస్థలన్నీ తమకు అనుకూలమైన నిబంధనలను, షరతులను పొందుపరిచి కస్టమైజ్డ్ అగ్రిమెంట్లను రూపొందించి కస్టమర్లతో సేల్ అగ్రిమెంట్ చేసుకుంటున్నాయి. ఇలాంటి వాటిపట్ల గృహ కొనుగోలుదారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. పెట్టుబడులకు భద్రత, రక్షణ ఉండాలంటే రెరా రిజిస్ట్రేషన్ ఉన్న ప్రాజెక్ట్‌ల్లో కొనుగోలు చేయడం ఉత్తమం. తక్కువ ధరకు వస్తుందనో, ఆఫర్లు ఇస్తున్నారనో ప్రీలాంచ్, బై బ్యాక్ స్కీమ్స్ వలలో చిక్కితే రోడ్డున పడతారు. నిర్మాణం ఆలస్యమైతే వడ్డీ చెల్లించాల్సిందే.. నిర్మాణ దశలను బట్టి డెవలపర్లకు బ్యాంక్ నిధులను విడుదల చేస్తుంది. రెరా నిబంధనల ప్రకారం ఆయా నిధులను ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతాలో జమ చేసి, ఆ నిర్మాణ పనుల కోసం మాత్రమే వినియోగించాలి. అయితే డెవలపర్లు నిధులను ఇతర ప్రాజెక్ట్‌లు, అవసరాలకు మళ్లిస్తుండటంతో ప్రాజెక్ట్ తుదిదశకు చేరుకునే సరికి నిధులు సరిపడాలేక అది ఆగిపోతుంది. మరోవైపు నిధులు పూర్తిగా విడుదల కాగానే కస్టమర్‌కు బ్యాంక్ నుంచి నెలవారీ వాయిదా (ఈఎంఐ) చెల్లించడం ప్రారంభమవుతుంది. కానీ, కస్టమర్‌కు ఆ టైంకు ఫ్లాట్ చేతికి రాదు. గృహప్రవేశం చేయలేరు. దీంతో బయట అద్దె, ఫ్లాట్‌కు ఈఎంఐ చెల్లించడం కస్టమర్‌కు అదనపు భారంగా మారుతుంది. గడువులోగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేయని డెవలపర్లు ఆలస్యం అయిన కాలానికి 10.25 శాతం వడ్డీని కస్టమర్‌కు చెల్లించాల్సిందే. ఒకవేళ సమయానికి కస్టమర్లు బిల్డర్‌కు సొమ్ము చెల్లించకపోతే వారు కూడా 10.25 శాతం వడ్డీని డెవలపర్‌కు అందజేయాల్సిందే. కార్పస్ ఫండ్ అందజేయాలి.. సెమీ ఫర్నిష్ ఫ్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూ.2 లక్షలు, 3 లక్షల మేర రిజిస్ట్రేషన్ చార్జీలు తగ్గుతాయనే బిల్డర్ల ఉచిత సలహాకు చాలామంది కస్టమర్లు చిక్కుతున్నారు. అయితే సెమీ ఫర్నీష్ ఫ్లాట్‌ను పూర్తి ఫర్నీష్గా ఎప్పుడు చేస్తారనే విషయంపై బిల్డర్‌తో సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేసుకోవాలి. లేకపోతే రిజిస్ట్రేషన్ అయిపోయిందంటూ టైల్స్, పెయింటింగ్ వంటి తుది మెరుగులు దిద్దకుండా అసంపూర్తి ఫ్లాట్‌నే కస్టమర్‌కు అప్పగించి బిల్డర్లు చేతులు దులుపుకుంటారు. కస్టమర్ల నుంచి వసూలు చేసే కార్పస్ ఫండ్‌ను బిల్డర్ తీసుకోరాదు. అసోసియేషన్‌కు ప్రత్యేకంగా ఎస్క్రో బ్యాంక్ ఖాతాను తెరిచి, వడ్డీతోసహా కార్పస్ ఫండ్‌ను అందులో జమ చేయాలి. కస్టమర్ల అనుమతి తప్పనిసరి.. కస్టమర్‌తో ఒప్పందం చేసుకున్నాక ప్రాజెక్ట్ లేదా ఫ్లాట్ డిజైనింగ్, ఎలివేషన్ వంటి వాటిల్లో బిల్డర్ ఏమైనా మార్పులు చేయాలంటే 2/3 వంతు కస్టమర్ల అనుమతి తప్పనిసరి. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని బిల్డర్ బ్యాంక్ రుణంతోనే కడుతున్నప్పుడు కస్టమర్లు బిల్డర్‌కు పోస్ట్ డేటెడ్ చెక్స్ అందజేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా డెవలపర్లు కస్టమర్ల నుంచి 10 శాతానికి మించి టోకెన్ అమౌంట్‌ను వసూలు చేయకూడదు. భూ యజమానికి చిక్కులు.. నిర్మాణం పూర్తయ్యాక ఫ్లాట్ పొజిషన్‌కు కస్టమర్‌కు రెరా చట్టం ప్రకారం 2 నెలల సమయం ఉంటుంది. కానీ, 15 రోజుల్లోనే పొజిషన్ తీసుకోవాలని బిల్డర్లు కస్టమర్లను ఒత్తిడి చేస్తుంటారు. ఇంటీరియర్ పనులు, వ్యక్తిగత కారణాల వల్ల కొందరు కస్టమర్లు పొజిషన్ తీసుకోవడంలో ఆలస్యం చేస్తుంటారు. మరికొందరు పొజిషన్ తీసుకుంటే అపార్ట్మెంట్ నిర్వహణ వ్యయం చెల్లించాల్సి ఉంటుందని ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తుంటారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి స్థల యజమానితో బిల్డర్ ఒప్పందం చేసుకుంటే రెరా చట్టం ప్రకారం డెవలపర్ కూడా ప్రమోటరే అవుతారు. కాబట్టి ఇరువురి మధ్య జరిగే అగ్రిమెంట్లు పారదర్శకంగా ఉండాలి. లేకపోతే భూ యజమానికి కూడా చిక్కులు తప్పవు. -
రియల్టీ బూమ్.. రూ. 35,000 కోట్ల ప్రాపర్టీల విక్రయం
న్యూఢిల్లీ: వర్షాలు, నియంత్రణ సంస్థల నుంచి పూర్తిగా అనుమతులు రాకపోవడం తదితర అంశాల కారణంగా 2024–25 రెండో త్రైమాసికంలో కాస్త ప్రతికూల ప్రభావం పడినా లిస్టెడ్ రియల్టీ దిగ్గజాల విక్రయాలు గణనీయంగా నమోదయ్యాయి. 26 సంస్థలు ఏకంగా రూ. 35,000 కోట్ల విలువ చేసే ప్రాపర్టీలను విక్రయించాయి.గోద్రెజ్ ప్రాపర్టీస్ అత్యధికంగా రూ. 5,198 కోట్ల బుకింగ్స్ నమోదు చేసింది. నియంత్రణ సంస్థలకు సమర్పించిన వివరాల ప్రకారం 26 దిగ్గజ సంస్థలు రూ. 34,985 కోట్ల ప్రాపర్టీలు విక్రయించాయి. అత్యధికంగా రెసిడెన్షియల్ సెగ్మెంట్లో ప్రీ–సేల్స్ నమోదయ్యాయి. లోధా బ్రాండ్‌పై కార్యకలాపాలు సాగించే ముంబైకి చెందిన మ్యాక్రోటెక్ డెవలపర్స్ రూ. 4,290 కోట్ల బుకింగ్స్ సాధించింది. ఢిల్లీ–ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్) సంస్థ మ్యాక్స్ ఎస్టేట్స్ రూ. 4,100 కోట్లు, బెంగళూరు కంపెనీలు ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ రూ. 4,023 కోట్లు, సిగ్నేచర్ గ్లోబల్ రూ. 2,780 కోట్ల ప్రాజెక్టులు విక్రయించాయి.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ప్రాపర్టీ కొంటున్నారా? అయితే మీ కోసమే ఈ జాగ్రత్తలుఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో చాలా మటుకు రియల్టీ కంపెనీలు రూ. 500 – రూ. 1,000 కోట్ల అమ్మకాలు నమోదు చేశాయి. అయితే, తొలి త్రైమాసికంతో పోలిస్తే రెండో త్రైమాసికంలో కొన్ని సంస్థల విక్రయాలు నెమ్మదించాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్‌పరంగా అగ్రస్థానంలో ఉన్న డీఎల్ఎఫ్ తొలి త్రైమాసికంలో రూ. 6,404 కోట్ల ప్రీ–సేల్స్ సాధించగా కొత్త ప్రాజెక్టులేమీ ప్రకటించకపోవడంతో రెండో త్రైమాసికంలో రూ. 692 కోట్లు మాత్రమే నమోదు చేసింది. -
కళ్లు చెదిరే ఈ భవనం కొనగలరా?
అమెరికన్ వ్యాపారవేత్త డార్విన్ డీసన్కు చెందిన లా జోల్లా ఎస్టేట్ 'ది శాండ్కాజిల్' రికార్డ్ ధరకు అమ్మకానికి వచ్చింది. 108 మిలియన్ డాలర్లు (సుమారు రూ.907 కోట్లు)కు లిస్టయింది. ఇది శాన్ డియాగో కౌంటీ రియల్ ఎస్టేట్‌కు రికార్డ్-బ్రేకింగ్ ధర.లిస్టింగ్‌లో పెట్టిన ధరకు అమ్ముడుపోతే ఈ సంవత్సరం ప్రారంభంలో డెల్ మార్ ఓషన్ ఫ్రంట్ ప్రాపర్టీని కొనుగోలు చేసిన బిలియనీర్ ఎగాన్ డర్బన్ పేరిట ఉన్న 44 మిలియన్ డాలర్ల ప్రస్తుత రికార్డును ఇది అధిగమిస్తుంది. అఫ్లియేటెడ్ కంప్యూటర్ సర్వీసెస్ (తర్వాత జిరాక్స్ సంస్థకు విక్రయించారు) స్థాపకుడు డార్విన్ డీసన్ 2009లో ఈ ఎస్టేట్‌ను, దాని పక్కనున్న స్థలాన్ని 26 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. తర్వాత దాని నిర్మాణం కోసం 60 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు.దాదాపు 13,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఎస్టేట్ ప్రైవేట్ ఎలివేటెడ్ బీచ్‌ను కలిగి ఉంది. అలనాటి ఐరోపా శైలిలో బంగారు పరదాలు, పాలరాతి ఫ్లోర్లు, ఆకృతులతో ఇంటీరియర్‌ను తీర్చిదిద్దారు. హాలీవుడ్ ప్రముఖులు, రాజ కుటుంబాల ఇళ్లకు డిజైన్ చేసిన ప్రఖ్యాత డిజైనర్ తిమోతీ కొరిగాన్ ఈ భవనానికి ఇంటీరియర్లను రూపొందించారు.ఇందులోని ఫర్నిచర్ ఫ్రెంచ్ సొగసుతో ఆకట్టుకుంటుంది. 16 మంది కూర్చునేందుకు వీలుగా రాజసమైన డైనింగ్ రూం, నాటికల్ నేపథ్యంతో తీర్చిదిద్దిన బార్ ఇందులో ఉన్నాయి. ఇక భవనం లోగిలిలో ఒక పూల్, ఫిట్నెస్ సెంటర్, చైనా స్లేట్ రూఫ్ టైల్స్‌తో కూడిన బీచ్ ఫ్రంట్ బోట్‌హౌస్ ఉన్నాయి. అగస్టా నేషనల్ గోల్ఫ్ క్లబ్ సిగ్నేచర్ వైట్ షేడ్ లాంటి లుక్ కోసం 40 వేల డాలర్లతో దిగుమతి చేసుకున్న ఇసుక ఈ భవనానికి వినిగియోగించారు. ఇంత విలాసవంతంగా భవనం నిర్మించుకున్నప్పటికీ దీన్ని పెద్దగా ఉపయోగించలేదని డీసన్ చెబుతున్నారు. -
ఐఫోన్ 16 సిరీస్ సేల్స్ నేటి నుంచే..
న్యూఢిల్లీ: ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ఫోన్ల విక్రయాలు భారత్‌లో నేటి నుంచి (సెప్టెంబర్ 20) ప్రారంభం కానున్నట్లు యాపిల్ వర్గాలు తెలిపాయి. ప్రో సిరీస్‌ను భారత్‌లో తెలిసారిగా అసెంబ్లింగ్ చేసే యోచనలో కంపెనీ ఉందని సమాచారం.ఇటీవలి బడ్జెట్లో దిగుమతి సుంకం తగ్గిన నేపథ్యంలో తొలిసారిగా గత సిరీస్ కన్నా కొత్త ప్రో సిరీస్ ఫోన్లను యాపిల్ తక్కువ రేటుకు విక్రయించనుంది. దేశీయంగా ఐఫోన్ 16 ప్రో ధర రూ. 1,19,000 నుంచి, ప్రో మ్యాక్స్ రేటు రూ. 1,44,900 నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది.గతేడాది ఐఫోన్ 15 ప్రో ధర రూ. 1,34,900 నుంచి, ప్రో మ్యాక్స్ రేటు రూ. 1,59,900 నుంచి మొదలైంది. మరోవైపు, తాజా ఐఫోన్ 16 రేటు రూ. 79,900 నుంచి, 16 ప్లస్ ధర రూ. 89,900 నుంచి ప్రారంభమవుతుంది. యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు 128 జీబీ నుంచి 1 టీబీ వరకు స్టోరేజీతో లభిస్తాయి. -
Hyderabad: మ్యాక్స్ మాన్యా ప్రారంభం..
నగర ఫ్యాషన్ ఔత్సాహికులను అలరించేందుకు మ్యాక్స్ ఫ్యాషన్ ఆధ్వర్యంలో ‘మాన్యా సెల్’ ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. అధునాతన ఫ్యాషన్‌కు వేదికైన నగరంతో పాటు దేశవ్యాప్తంగా మ్యాక్స్ ఫ్యాషన్ ప్రియులకు నేటి నుంచి ఆఫర్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ష్యాషన్ రంగంలో ఇప్పటి వరకూ ఎక్కడా లేని విధంగా రూ.399 లోపే స్పెషల్ మాన్యా సెల్ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. -
రియల్ ఎస్టేట్ రికార్డ్.. రూ.1,754 కోట్ల ఇల్లు అమ్మకం
ఓక్లే అనే ఐవేర్ కంపెనీ వ్యవస్థాపకుడు జేమ్స్ జన్నార్డ్ ఇటీవల తన మాలిబు ప్రాపర్టీని 210 మిలియన్ డాలర్లకు (రూ.1,754 కోట్లు) విక్రయించి కాలిఫోర్నియాలో అత్యంత ఖరీదైన ఇంటి అమ్మకంలో కొత్త రికార్డు నెలకొల్పారు. రియల్ ఎస్టేట్‌కు ప్రత్యేకమైన మాలిబు ప్రాంతంలో.. డెలావేర్ ఆధారిత లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ ద్వారా ఈ విక్రయం జరిగింది. అయితే కొనుగోలుదారు ఎవరన్నది వెల్లడి కాలేదు.లాస్ ఏంజలెస్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. జానార్డ్ 2012లో బిలియనీర్ ఇన్వెస్టర్ హోవార్డ్ మార్క్స్ నుంచి 75 మిలియన్ డాలర్లకు ఈ ఓషన్ ఫ్రంట్ ఎస్టేట్ ను కొనుగోలు చేశారు. అంతకుముందు మార్క్స్ దీన్ని హెర్బాలైఫ్ సహ వ్యవస్థాపకుడు మార్క్ హ్యూస్ నుంచి 2002లో 31 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు.ఇంటి ప్రత్యేకతలు ఇవే..15,000 చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణం కలిగిన ఈ ప్రాపర్టీ ఎల్ పెస్కాడోర్ స్టేట్ బీచ్ కు ఆనుకుని ఉంది. దీనికి సొంత ప్రైవేట్ 300 అడుగుల స్ట్రెచ్ ఓషన్ ఫ్రంటేజ్ ఉంది. ప్రధాన నివాసంలో ఎనిమిది పడక గదులు, 14 బాత్ రూమ్ లు ఉన్నాయి. దీనికి అనుబంధంగా జిమ్, రెండు ప్రత్యేక గెస్ట్ హౌస్ లు ఉన్నాయి.ఈ అమ్మకంతో, మాలిబు ఇప్పుడు కాలిఫోర్నియా చరిత్రలో మూడు అత్యధిక గృహాల అమ్మకాలను కలిగి ఉంది. ప్రస్తుత అమ్మకపు ధర గత సంవత్సరం జే-జెడ్, బియోన్స్ వారి మాలిబు కాంపౌండ్ పై సాధించిన 200 మిలియన్ డాలర్ల మార్కును అధిగమించింది. 2021లో మాలిబు ప్యారడైజ్ కోవ్‌లో విస్తారమైన ఎస్టేట్‌ను 177 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన వెంచర్ క్యాపిటలిస్ట్ మార్క్ ఆండ్రీసెన్ కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించారు. -
తల్లిపాలతో వ్యాపారానికి అనుమతించబోము
తల్లిపాలతో వ్యాపారం వద్దే వద్దని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) తేల్చి చెప్పేసింది. మానవ తల్లిపాలు, దాని ఉత్పత్తులను విక్రయించరాదని గట్టి హెచ్చరికలు జారీ చేసింది.‘మానవ తల్లిపాలు, దాని ఉత్పత్తుల వాణిజ్యీకరణకు సంబంధించి వివిధ రిజిస్టర్డ్ సొసైటీల నుంచి ఈ కార్యాలయానికి విజ్ఞప్తులు అందుతున్నాయి. ఎఫ్ఎస్ఎస్ చట్టం, 2006 కింద మానవ తల్లిపాలను ప్రాసెసింగ్ చేయడానికి, విక్రయించడానికి ఎఫ్ఎస్ఎస్ఎఐ అనుమతించదు’ ప్రకటనలో ఎఫ్ఎస్ఎస్ఎఐ తెలిపింది.మానవ తల్లిపాలు, దాని ఉత్పత్తుల వాణిజ్యీకరణకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని పేర్కొంది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే ఎఫ్ఎస్ఎస్ చట్టం, 2006తోపాటు దాని అనుబంధ నియమనిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లను (ఎఫ్బీఓ) హెచ్చరించింది.తల్లి పాలను విక్రయించే ఇలాంటి యూనిట్లకు అనుమతి ఇవ్వవద్దని ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సింగ్ అధికారులను కోరింది. 'మదర్స్ మిల్క్/హ్యూమన్ మిల్క్' ప్రాసెసింగ్ లేదా అమ్మకంలో పాల్గొనే ఇలాంటి ఎఫ్‌బీఓలకు ఎలాంటి లైసెన్స్/ రిజిస్ట్రేషన్ ఇవ్వకుండా రాష్ట్ర, కేంద్ర లైసెన్సింగ్ అథారిటీలు చూసుకోవాలని సూచించింది.జాతీయ మార్గదర్శకాల ప్రకారం డోనర్ హ్యూమన్ మిల్క్ (డీహెచ్ఎం)ను వాణిజ్య అవసరాలకు ఉపయోగించకూడదు. కాంప్రహెన్సివ్ పాలిటీ మేనేజ్మెంట్ సెంటర్స్ (సీఎల్ ఎంసీ)ల్లోని ఆరోగ్య కేంద్రాల్లో చేరిన శిశువులకు దీన్ని అందించవచ్చు. తల్లిపాలను ఇచ్చే దాత ఇందుకోసం ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు లేకుండా స్వచ్ఛందంగా దానం చేయాలి. దానం చేసిన పాలను ఆసుపత్రిలోని నవజాత శిశువులు, ఇతర తల్లుల శిశువులకు ఆహారం అందించడానికి ఉచితంగా ఉపయోగించాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి. -
అంగట్లో అమ్మకానికి ఆడ శిశువు
మేడిపల్లి: ముక్కు పచ్చలారని మూడు నెలల పసికందును అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకునేందుకు యతి్నంచిన అమానవీయ ఘటన పీర్జాదిగూడలో బుధవారం కలకలం రేపింది. మూడు నెలల ఆడ శిశువును విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మేడిపల్లి పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామకృష్ణా నగర్ కాలనీలో ఐతె శోభారాణి ఆర్ఎంపీగా పని చేస్తూ ప్రథమ చికిత్స కేంద్రాన్ని నిర్వహిస్తోంది. కొంత కాలంగా ఉప్పల్ ఆదర్శనగర్ కాలనీకి చెందిన చింత స్వప్న, రామకృష్ణా నగర్ కాలనీకి చెందిన షేక్ సలీం పాషాతో కలిసి నగరంతో పాటు విజయవాడ తదితర ప్రాంతాల్లో నివసించే పేద కుటుంబాలకు చెందిన చిన్నారుల ఆచూకీ తెలుకుంటున్నారు. ఆయా కుటుంబాలకు డబ్బుల ఆశ చూపిస్తున్నారు. కొంత మొత్తం ముట్టజెప్పి వారి పిల్లలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన కొందరు మహిళలు తెలుసుకున్నారు. తమకు పిల్లలు లేరని పెంచుకోవడానికి ఆడపిల్ల కావాలని శోభారాణిని సంప్రదించారు. మూడునెలల పసికందును రూ.4.5 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ముందుగా రూ.10 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చి మిగతా డబ్బులు పాపను తీసుకున్న తర్వాత ఇస్తామని చెప్పారు. బుధవారం మధా్నహ్నం విజయవాడ నుంచి తీసుకు వచి్చన మూడు నెలల ఆడ శిశువును శోభారాణి, స్వప్న, సలీం పాషా స్వచ్ఛంద సంస్థ మహిళలకు చూపించారు. ఈ విషయాన్ని వెంటనే వారు మేడిపల్లి పోలీసులకు చేరవేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆర్ఎంపీ శోభారాణి, ఆమెకు సహకరించిన స్వప్న, సలీంలను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని శిశు విహార్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు. -
అమెజాన్ సేల్‌లో ఆఫర్ల జాతర.. 95 శాతం వరకు డిస్కౌంట్
కొనుగోలు దారులకు శుభవార్త. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ సమ్మర్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో స్మార్ట్‌వాచ్‌లపై 95 శాతం, బ్లూటూత్ ఇయర్‌బడ్స్‌పై 95శాతం, ఇయర్ఫోన్లపై 95శాతం, నెక్ బ్యాండ్ ఇయర్‌ఫోన్స్‌పై 95 శాతం డిస్కౌంట్ పొందవచ్చారు.అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2024తో ప్రారంభమైన ఈ సేల్‌లో అన్నీ రకాల ప్రొడక్ట్‌లపై డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటు రూ.15,000, రూ.25,000 సెగ్మెంట్ ధరల్లో ఉన్న ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లను కొనుగోలు దారులు సొంతం చేసుకోవచ్చంటూ అమెజాన్ ప్రతినిధులు తెలిపారు.మే 2 అర్ధరాత్రి నుంచి ప్రారంభమై మే 7 వరకు కొనసాగుతున్న ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ శాంసంగ్, షావోమీ, వన్‌ప్లస్‌తో పాటు ఇతర ఫోన్లపై తగ్గింపు ధరకే కొనుగోలు చేసే అవకాశాన్ని అమెజాన్ కొనుగోలు దారులకు కల్పిస్తుంది. ఈ ఫోన్లలో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, లార్జ్ డిస్ప్లే, పెద్ద బ్యాటరీ, పవర్ఫుల్ ప్రాసెసర్లుతో వస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది.మీరు ఐసీసీఐ, వన్ కార్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్‌ల ద్వారా కొనుగోలు చేస్తే.. ప్రతి కొనుగోలుపై 10 శాతం డిస్కౌంట్లు పొందవచ్చు.దీంతో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్లు, ఈఎంఐలు, కూపన్లు వినియోగించుకోవచ్చని అమెజాన్ వెల్లడించింది. -
Sanda Island లగ్జరీ దీవి అమ్మకానికి, ధర రూ. 26 కోట్లే
సాధారణంగా సొంతంగా ఒక ఇల్లు, ఓ చిన్న కారు ఇదీ ఓ మధ్య తరగతి జీవి కల. కానీ యూకేలోని స్కాట్లాండ్లో ఒక బంపర్ ఆఫర్ సామాన్యుడ్ని సైతం ఊరిస్తోంది. పశ్చిమ తీరంలో 453-ఎకరాల ప్రైవేట్ లగ్జరీ ఐలాండ్ ఒకటి అతి తక్కువ ధరకే అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఏడు బెడ్ రూంలు, బీచ్‌లు, పబ్,హెలిప్యాడ్ అబ్బో.. ఇలాంటి సౌకర్యాలు చాలానే ఉన్నాయి. ప్రముఖ నైట్ ఫ్రాంక్ ప్రాపర్టీస్ సంస్థ దీన్ని అమ్మకానికి పెట్టింది. అయితే ఈ దీవిని సొంతం చేసుకోవాలంటే మీ దగ్గర 26 కోట్లు ఉంటే చాలు. వివరాలు ఇలా ఉన్నాయి..స్కాట్లాండ్ , ఉత్తర ఐర్లాండ్ మధ్య 453 ఎకరాల మేర విస్తరించి ఉందీ సాండా ద్వీపం. పాల్ మాక్కార్ట్నీ , వింగ్స్చే 1977 పాట "ముల్ ఆఫ్ కింటైర్’’ ద్వారా ఇది పాపులర్ అయింది. గత కొన్నేళ్లుగా సన్యాసులు, సాధువులు, రాజులతో చారిత్రక సంబంధాలను కలిగి ఉంది. దీనిని స్కాటిష్ రాజు రాబర్ట్ ది బ్రూస్ , నార్వే రాజు హకోన్ సందర్శించారట. 1946లో ద్వీపం నుండి ధ్వంసమైన ఓడ సాండా పేరునే ఈ దీవికి పెట్టారు. ఈ ద్వీపం అనేక సంవత్సరాల్లో అనేక మంది యజమానుల చేతుల్లో ఉంది. వీరిలో స్కాటిష్ గాయకుడు, రాక్ బ్యాండ్ క్రీమ్‌కు చెందిన జాక్ బ్రూస్ ప్రముఖుడు. ప్రాపర్టీస్ ఏజెన్సీ నైట్ ఫ్రాంక్ సమాచారం ప్రకారం ఈ దీవిలో ఏడు ఇళ్లు, బీచ్, పబ్‌తోపాటు హెలికాప్టర్ దిగడానికి వీలుగా హెలిప్యాడ్ కూడా ఉంది. పక్కనే రెండు మరింత చిన్న దీవులు కూడా ఉన్నాయి. సాండా కొనుగోలు చేసినవారు ఈరెండు దీవులను కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ చిన్న దీవుల్లో ఒక దానిపై లైట్ హౌజ్ కూడా ఉందని సంస్థకు చెందిన స్టీవర్ట్-మూర్ ప్రకటించారు.ఇంకో విశేషంగా ఏమిటంటే ఇక్కడ ఒక చిన్న గొర్రెల ఫామ్ కూడా ఉంది. అందులో బ్లాక్ ఫేస్ 55 గొర్రెలు కూడా ఉన్నాయట. వన్యప్రాణులతో పాటు పశువులకు కూడా ఈ దీవి ఆవాసం. పఫిన్లు, కిట్టివాక్లు, కార్మోరెంట్లు, షాగ్లు, రేజర్బిల్స్, మరెన్నో పక్షులను ఇక్కడ వీక్షించవచ్చు.ఉత్తర ఐర్లాండ్ నుంచి బోటులో ఈ దీవికి చేరుకోవచ్చు. ఉత్తర ఐర్లాండ్ లోని క్యాంపెల్ టౌన్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని నైట్ ఫ్రాంక్ సంస్థ పేర్కొంది. దీని 31 మిలియన్ పౌండ్లు అంటే 26 కోట్ల రూపాయలు మాత్రమే.దీంతో కొనుగోలు ఇప్పటికే క్యూకట్టినట్టు నైట్ ఫ్రాంక్ తెలిపింది. -
లగ్జరీ బంగ్లాను విక్రయించిన ఇషా అంబానీ? ఎవరు కొన్నారు?
రిలయన్స్ అధినేత ముఖేష్, నీతా అంబానీ ముద్దుల తనయ, వ్యాపారవేత్త ఇషా అంబానీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రిలయన్స్ రీటైల్ వ్యాపారాన్ని విజయ వంతంగా నడిపిస్తూ తండ్రికి తగ్గ తనయగా వ్యాపారంలో రాణిస్తోంది. తాజాగా ఇషా, భర్త ఆనంద్ పిరమల్ ఇంటికి సంబంధించి ఒక ముఖ్య సమాచారం వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని ఇషా ఖరీదైన ఇంటిని ప్రముఖ హాలీవుడ్ జంట కొనుగోలు చేసిందట. ఈ వార్తలపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేనప్పటికీ, ఈ డీల్ మాత్రం హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇషా-ఆనంద్ పిరమల్ లాస్ ఎంజేల్స్లోని విలాసవంతమైన భవనాన్ని విక్రయించినట్టు తెలుస్తోంది. దీన్ని అమెరికన్ టాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ బెన్ అఫ్లెక్ జంట కొనుగోలు చేసిందట. 38వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఇంటిని 'క్వీన్ ఆఫ్ డ్యాన్స్' జెలో,బెన్ దంపతులు సొంతం చేసుకున్నట్టు తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇందులో 12 బెడ్రూమ్లు, 24 బాత్రూమ్లు ఉన్నాయి. ప్రత్యేక జిమ్‌లు, స్పాలు, సెలూన్లు, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ లాంటి స్పెషల్ వసతులు కూడా లగ్జరీ హౌస్‌లో కొలువు దీరాయి. దాదాపు 61 మిలియన్ డాలర్ల (రూ. 508కోట్లు) ఇంటిని కొనుగోలు చేశారని కూడా ఇన్‌స్టా ఫ్యాన్ పేజీ నివేదించింది. కాగా ఇషాకు ఈ ఇంటితో ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైందే అని చెప్పవచ్చు. ఇషా గర్భంతో ఉన్నపుడు తల్లి నీతాతో కలిసి ఆ ఇంట్లోనే గడిపింది. ఇద్దరు పిల్లలకు ఈ ఇంట్లోనే జన్మనిచ్చింది. అయితే ఈ ఇల్లు విక్రయించడానికి గల కారణాలు ఏంటి అనేదానిపై స్పష్టత లేదు. -
Ramzan: సుర్మాతో.. కంటి సంబంధిత వ్యాధులకు చెక్!
ముస్లింలు పవిత్ర మాసంగా భావించే రంజాన్ మాసంలో ‘సుర్మా’ ఆద్యంతం ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ ప్రత్యేకత చాటుతోంది. ఈ మాసంలో ముస్లింలు వయోభేదం లేకుండా త్రికరణ శుద్ధితో ఉపవాసం(రోజా)ఉంటారు. ఖురాన్ పఠిస్తూ ఐదు పూటలా నమాజ్ ఆచరిస్తారు. మహ్మద్ ప్రవక్త బాటను అనుసరిస్తూ నిష్టగా ఉంటారు. ఈ క్రమంలో ఈ మాసంలో ముస్లింల నేత్రాలకు అలంకరించే సుర్మాకు ఎంతో విశిష్టత ఉంది. విధిగా కళ్లకు సుర్మా అలంకరించడం పవిత్ర కార్యంగా భావిస్తారు. సువాసన వెదజల్లే అత్తర్లకు ప్రాధాన్యమిస్తారు. ఇదీ.. సుర్మా ప్రశస్తి.. నిత్యం అల్లాహ్ నామస్మరణలో గడిపే దైవప్రవక్త హజ్రత్ మూసా అలైహిసలా తుస్సలాంకు అల్లా ప్రసన్నం పొంది అతడిని అల్లా ఎక్కడున్నాడో చూపించమని అనునయులు కోరుతారు. దీంతో ఈజిప్టు, సిరియా ప్రాంతాలకు చెందిన పెద్దలను సమీపంలోని కోహితూర్ పర్వతం వద్దకు తీసుకెళ్తారు. అక్కడ ఒక్కసారి అల్లాహ్ నూర్ (ఓ వెలుగు)ప్రత్యక్షంకావడం చూసి ఆశ్చర్యానికి గురవుతారు.అప్పుడే కోహితూర్ పర్వతం భస్మమై బూడిదగా(చూర్ణంగా) మారుతుంది. దైవసంకల్పం కళ్లెదుట సాక్షాత్కరించడంతో తమలోని భక్తి ఉప్పొంగి ఆ చూర్ణాన్ని వారు కళ్లకు అద్దుకుంటారు. ఈ సమయంలో తమ కళ్లకు సుదూరంలోని చీమల కదలికలను సైతం పసిగట్టే విధంగా ప్రకాశవంతం కావడం గమనించి అల్లాహ్ కృపవల్లనే సాధ్యపడిందని భావిస్తారు. అప్పటి నుంచి కోహితూర్ పర్వతానికి చెందిన రాళ్ల చూర్ణమే క్రమంగా సుర్మాగా రూపాంతరం చెందిందనేది ముస్లింల ప్రగఢ నమ్మకం. కళ్లకెంతో మేలు..! భక్తితోపాటు వైద్యపరిభాషలోనూ ఈ సుర్మాకు ఆరోగ్యప్రదాయినిగా పేరుంది. కంటికి సంబంధించిన వ్యాధులకు నివారణగా, కళ్లకు చలువగా పనిచేస్తుంది. నమాజ్ చేయడానికి ముందు వజూ ఆచరించాక మహ్మద్‌ప్రవక్త కంటికి సుర్మా పెట్టుకునే వారని ప్రతీతి. రాత్రివేళ నిద్రపోయేముందు కళ్లకింద సుర్మ రాసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. సుర్మాతో కంటికి సంబంధించిన వ్యాధులు రావని నిరూపి తం కావడంతో ఇతరులు కూడా సుర్మాను రా సుకోవడానికి ఆకర్షితులవుతున్నారు. మహిళలు కళ్లకు కాటుక బదులు సుర్మా వాడడానికి ఇష్టపడుతున్నారు. అతిథులకు సుర్మ, అత్త ర్లు పూయడం ద్వారా గౌరవించే సంప్రదాయాన్ని ముస్లింలు కొనసాగిస్తున్నారు. సుర్మ, అత్తర్ల విక్రయాలు..! అనేక గ్రామాల్లో రంజాన్ సందర్భంగా అత్తర్లు, సుర్మా విక్రయాలకు గిరాకీ ఉంటుంది. దీనికోసం జిల్లాలో పలు అత్తర్లు, సుర్మా అమ్మకాల దుకాణాలు వెలిశాయి. సుర్మా కిలో పొడి ధర రూ.175 నుంచి రూ.550 వరకు ఉంటుంది. వీటిని చిన్న సీసాల్లో నింపి విక్రయిస్తుంటారు. ఇవి రూ10 నుంచి రూ . 100 విక్రయిస్తున్నారు. కంపెనీని బట్టి వీటి ధరలు నిర్ణయిస్తున్నారు. సుర్మాను భద్రపరచడానికి ఆకర్షణీయమైన ఆకారాల్లో సుర్మేన్లు (భరిణె) మార్కెట్లో ఉన్నాయి. వీటి ధర రూ.50 నుంచి రూ.300 వరకు అందుబాటులో ఉన్నాయి. ఇవి చదవండి: HOLI 2024: జీవితం వర్ణమయం -
మూలధన లాభం రూ. 2 కోట్ల లోపు ఉంటే..
మీరు స్థిరాస్తి అమ్మే విషయంలో లాభం .. అంటే దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ. 2 కోట్ల లోపల ఉంటే ఏం చేయాలి .. ఎలా చేయాలి అనేది ఈ వారం తెలుసుకుందాం. 1. ఇల్లు అమ్మినప్పుడు ఈ లాభం ఏర్పడాలి. 2. మినహాయింపు జీవితంలో ఒకసారే ఇస్తారు. 3. ఇల్లు ఇండియాలోనే కొనాలి. 4. ఒక ఇంటికి బదులుగా రెండు ఇళ్లు కొనుక్కోవచ్చు. 5. ఇల్లు కొనడం .. కట్టించడం, ఒక ఇల్లు కొని మరో ఇల్లు కట్టించడం.. రెండూ కొనడం లేదా రెండూ కట్టించుకోవడం చేయొచ్చు. 6. 2019 ఏప్రిల్ 1 తర్వాతనే ఈ నియమం వర్తిస్తుంది. మిగతా షరతులు గతంలో చెప్పినట్లే వర్తిస్తాయి. కొన్ని ఉదాహరణలు గమనించండి.. 1. ముత్యాలరావుగారికి ముచ్చటగా రూ. 3 కోట్లు లాభం వచి్చంది. విశాఖపట్నంలో రెండు ఇళ్లు కొన్నారు. లాభం రూ. 2 కోట్లు దాటింది కాబట్టి ఒక ఇంటి మీదే మినహాయింపు. 2. ఇదే ముత్యాలరావుగారికి లాభం ఒక కోటి తొంభై లక్షలు వచి్చందనుకోండి.. లాభం రూ. 2 కోట్లు దాటలేదు రెండింటి మీద మినహాయింపు ఇస్తారు. 3. నారాయణరావుగారికి లాభాలు రూ. ఒక కోటి తొంభై ఐదు లక్షలు వచి్చంది. ముగ్గురు పిల్లలకని మూడు ఫ్లాట్లు.. ఒక్కొక్కటి రూ. 65,00,000 చొప్పున కొన్నారు. కానీ, రెండు ఫ్లాట్లకు మాత్రమే మినహాయింపు లభిస్తుంది. 4. సుందరరావుగారికి అంతే లాభం వచ్చింది. ఒకోటి రూ. 80 లక్షలు చొప్పున రెండు ఫ్లాట్లు కొని, మిగతా మొత్తంతో బాండ్లు కొన్నారు. వీరికి రెండు ఫ్లాట్లు కొన్నందుకు మినహాయింపు, అలాగే బాండ్లలో ఇన్వెస్ట్ చేసినందుకు కూడా మినహాయింపు వస్తుంది. 5. సత్యమూర్తిగారికి వచి్చన లాభం రూ. 2.60 కోట్లు. రెండు ఇళ్లు కొన్నారు. ఒకటి రూ. 1.50 కోట్లు, మరొకటి రూ. 90 లక్షలు. మిగతా రూ. 20 లక్షలు పెట్టి బాండ్లు కొన్నారు. మొదటి ఇంటికి, బాండ్లకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. 6. సీతయ్యగారికి లాభం కోటి అరవై లక్షలు వచి్చంది. కానీ ఆయన కొన్న రెండు ఇళ్ల విలువ రెండు కోట్లు దాటింది. అతనికి మినహాయింపు ఉంటుంది. అదనంగా వెచి్చంచిన మొత్తానికి ‘సోర్స్’ ఉండాలి. 7. కాంతారావుగారికి కూడా కోటి అరవై లక్షల లాభం వచి్చంది. కానీ, తాను కొన్న రెండు ఇళ్ళ విలువ కోటి యాభై లక్షలు దాటలేదు. రూ. 10 లక్షలు పన్నుకి గురి అవుతుంది. సత్యమూర్తిగారిలాగా బాండ్లు కొనుక్కోవచ్చు లేదా పన్ను చెల్లించాలి. ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అయితే, జాగ్రత్తలు ఏమిటంటే .. 1. గత వారం చెప్పిన నియమాలు వర్తిస్తాయి. 2. అన్ని కాగితాలు జాగ్రత్త. 3. బ్లాక్ వ్యవహారాలు వద్దు. 4. మీ బ్యాంకు అకౌంట్లలోనే వ్యవహారాలు చేయండి. 5. మీ కుటుంబసభ్యులను ఇన్వాల్వ్ చేసి ఎటువంటి మినహాయింపు కోసం ప్రయత్నించకండి. ఉదాహరణకు రూ. 2 కోట్ల లాభం మీకు చూపించటానికి ప్రతిఫలం వేరే సభ్యుల అకౌంట్లలోనో జమ చేయించకండి. 6. టీడీఎస్ విషయం ఫాలో అవ్వండి. 7. రిటర్నులు సక్రమంగా వేయండి. 8. రెండు ఇళ్లు మీరు కొంటే.. మీరు ఉంటారా లేక అద్దెకిస్తారా ఆలోచించుకోండి. 9. అవసరం అయితే వృత్తి నిపుణులను సంప్రదించండి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు. -
రేపటి నుంచి బిగ్ అప్‌గ్రేడ్ సేల్ ప్రారంభం
ఫ్లిప్‌కార్ట్ బిగ్ అప్‌గ్రేడ్ సేల్ ఈనెల 9 నుంచి ప్రారంభంకానున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన టీజర్ ఇప్పటికే ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో ప్రత్యేక్షమైంది. వారం రోజుల పాటు సాగే ఈ సేల్ ఫిబ్రవరి 15 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా పలు ప్రముఖ ఫోన్లపై ఆకర్షణీయ డిస్కౌంట్లు, ఆఫర్లు అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ తెలిపింది. ఫ్లిఫ్‌కార్ట్ అధికారిక సైట్ బిగ్ అప్డేట్ సేల్ పేజ్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. ఐఫోన్ 15 ఈ సేల్‌లో తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ హాట్ డివైజ్ ప్రస్తుతం రూ.72,999కి లభించనుంది. ఇదీ చదవండి: బంగారం ధర ఆల్టైమ్హైకు చేరనుందా..? ఐఫోన్ 14, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ, రియల్‌మి 12 ప్రొ+, వివో టీ2 ప్రొ, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 5జీ, మోటో జీ34 5జీ, రెడ్మి 12, పోకో ఎం6 ప్రొ, రియల్‌మి సీ53, పోకో ఎం6, రెడ్మి 13సీ, పోకో సీ51, మోటో జీ54, రియల్‌మి 11ఎక్స్ వంటి ఫోన్లపైనా ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. -
అయోధ్యలో భూములు కొన్న అమితాబ్.. రేట్లు ఎలా ఉన్నాయి?
ఈనెల 22న అయోధ్యలో నూతన రామమందిరాన్ని ప్రారంభించనున్నారు. అదేరోజున రామాలయంలోని గర్భగుడిలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ నేపధ్యంలో అయోధ్య.. ప్రపంచంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా ఆవిర్భవించనుంది. రామాలయం ప్రారంభోత్సవం నేపధ్యంలో ఈ ప్రాంతంలో భారీగా ఆర్థిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇక్కడి భూముల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్.. అయోధ్యలో భూములను కొనుగోలు చేశారు. ముంబైకి చెందిన డెవలపర్ కంపెనీ ‘ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా’ ద్వారా అమితాబ్ బచ్చన్ అయోధ్యలో ఒక ప్లాట్‌ను కొనుగోలు చేశారు. ఈ ప్లాట్ సెవెన్ స్టార్ మల్టీ పర్పస్ ఎన్క్లేవ్ ‘ది సరయూ’లో ఉంది. అమితాబ్ కొనుగోలు చేసిన ప్లాట్ సైజు 10 వేల చదరపు అడుగులు. ఇందుకోసం ఆయన రూ.14.5 కోట్లు వెచ్చించారు. అయోధ్యలో ప్లాట్ కొనుగోలుకు సంబంధించి అమితాబ్ ఒక ప్రకటన కూడా చేశారు. ‘అయోధ్య నా హృదయంలో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించిన నగరం. అయోధ్యకున్న కాలాతీత ఆధ్యాత్మికత, సాంస్కృతిక సంపద నాలో భావోద్వేగ సంబంధాన్ని సృష్టించాయి. సంప్రదాయం, ఆధునికత కలగలిసిన అయోధ్య ఆత్మలోకి నా హృదయపూర్వక ప్రయాణానికి ఇది నాంది. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని అయోధ్యలో సొంత ఇంటిని నిర్మించుకునేందుకు ఎదురు చూస్తున్నానని’ అమితాబ్ పేర్కొన్నారు. ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా షేర్ చేసిన బ్రోచర్లోని వివరాల ప్రకారం అయోధ్య నగరంలో 1,250 చదరపు అడుగుల భూమి ధర రూ. 1.80 కోట్లు, 1,500 చదరపు అడుగుల స్థలం ధర రూ. 2.35 కోట్లు. 1,750 చదరపు అడుగుల స్థలం ధర రూ. 2.50 కోట్లుగా ఉంది. అమితాబ్ బచ్చన్ ప్లాట్‌ను కొనుగోలు చేసిన ప్రదేశానికి 10 నిమిషాల దూరంలో రామాలయం, 20 నిమిషాల దూరంలో అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నాయి. సరయూ నది రెండు నిముషాల ప్రయాణ దూరంలో ఉంది. ఇది కూడా చదవండి: నేటి నుంచి ‘ప్రాణప్రతిష్ఠ’ ముందస్తు ఆచారాలు ప్రారంభం! -
‘దీపావళి మద్యం’తో ఢిల్లీ సర్కారుకు భారీ ఆదాయం!
ఏటా దీపావళి సీజన్లో మద్యం విక్రయాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ ఏడాది కూడా దేశ రాజధాని ఢిల్లీలో మద్యం విక్రయాలు అత్యధికంగా జరిగాయి. సాధారణ రోజులతో పోలిస్తే దీపావళికి కొద్ది రోజుల ముందు నుంచే మద్యం విక్రయాలు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. దీపావళి సీజన్లో అత్యధిక మద్యం విక్రయాల కారణంగా ఢిల్లీ ప్రభుత్వానికి మొత్తం రూ.525.84 కోట్ల ఆదాయం సమకూరింది. దీపావళి సందర్భంగా గత శుక్రవారం నుంచి ఆదివారం వరకు రూ.121 కోట్ల విలువైన 64 లక్షల మద్యం బాటిళ్లను వినియోగదారులు కొనుగోలు చేశారని సమాచారం. అదే సమయంలో దీపావళి పండుగకు వారం రోజుల ముందు కోటికి పైగా మద్యం బాటిళ్లు విక్రయించగా, ప్రభుత్వానికి రూ.234.15 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే దీపావళికి ముందు 17 రోజుల్లో మొత్తం 3 కోట్లకు పైగా మద్యం బాటిళ్లు అమ్ముడుపోవడంతో ప్రభుత్వానికి రూ.525.84 కోట్ల ఆదాయం సమకూరింది. దీపావళి, హోలీ తదితర పండుగల సమయంలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని మద్యం దుకాణాల్లో గురువారం రూ. 17.33 లక్షలు, శుక్రవారం రూ. 18.89 లక్షలు, శనివారం 27.89 లక్షల రూపాయాల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఈ మూడు రోజుల్లోనే 64 లక్షలకు పైగా మద్యం బాటిళ్లు అమ్ముడుపోయి, ఢిల్లీ ప్రభుత్వానికి మొత్తం రూ.120.92 కోట్ల ఆదాయం అందింది. అయితే దీపావళి నాడు కొన్ని చోట్ల మద్యం దుకాణాలను మూసివేశారు. గత ఏడాది కంటే ఈ ఏడాది దీపావళి సందర్భంగా 42 శాతం అధికంగా మద్యం బాటిళ్ల విక్రయాలు జరిగాయి. గత ఏడాది దీపావళికి మూడు రోజుల ముందు వరుసగా 13.46 లక్షలు, 15 లక్షలు, 19.39 లక్షల మద్యం బాటిళ్లు విక్రయించినట్లు అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి! -
ఆన్లైన్లో ఏవి ఎక్కువ కొంటున్నారంటే..
పండుగ సీజన్లో ఈకామర్స్ ప్లాట్‌ఫామ్‌లు ఆఫర్లు ప్రకటించాయి. అయితే కొందరు వారి ఆర్థికస్థోమత తగినట్లు ఆయా వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. కొన్నిసార్లు కొనే వస్తువులకు సరిపడా డబ్బు లేకపోయినా అప్పుచేసి మరీ వాటిని తీసుకుంటాం. అయితే కొంచెం ఆలస్యం అయినా ఎక్కువ మంది భారతీయులు ప్రీమియం వస్తువులనే తీసుకుంటున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అయితే అందులో అధికంగా డిమాండ్ ఉన్న వాటి గురించి తెలుసుకుందాం. ఆఫర్ సీజన్లో మొబైల్ ఫోన్ల కొనుగోళ్లకు ప్రత్యేకస్థానం ఉంది. అయితే ఈసారీ దాని ప్రస్థానం కొనసాగుతుంది. ప్రస్తుతం ఫ్యాషన్ వస్తువులు కూడా బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. రెండు వర్గాలలోనూ ప్రీమియం ఉత్పత్తులకు అధిక డిమాండ్ ఉన్నట్లు తెలుస్తుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023లో భాగంగా ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రైమ్ ఎర్లీ యాక్సెస్ దశలో సేల్ ప్రారంభమైన మొదటి గంటలో సెకనుకు 75 కంటే ఎక్కువ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేశారు. మొదటి 48 గంటల్లో విక్రయించిన ప్రతి ఐదు స్మార్ట్ఫోన్లలో నాలుగు 5జీ మోడళ్లు అని సర్వే తెలిపింది. ప్రీమియం స్మార్ట్ఫోన్లు గత ఏడాదితో పోలిస్తే 3 రెట్లు వృద్ధిని సాధించాయి. ల్యాప్‌టాప్‌లు కూడా గత సంవత్సరంతో పోలిస్తే 40శాతం అధికంగా అమ్ముడయ్యాయి. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కూడా ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్ల విభాగంలో ప్రీమియం ఉత్పత్తులను కొనుగోలు చేశారు. గతేడాది బిగ్ బిలియన్ డేస్ సేల్‌తో పోలిస్తే ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ 1.7 రెట్లు పెరిగింది. పండగ సీజన్ అమ్మకాల్లో భాగంగా 15లక్షల ఐఫోన్లను విక్రయించారు. ధరల తగ్గింపు, ఆకర్షణీయమైన ఆఫర్ల కారణంగా అన్ని విభాగాల్లో అమ్మకాలు ఊపందుకున్నట్లు తెలిసింది. -
నాడు నోటుకు ఓటు..నేడు నోట్లకు సీట్లు
సాక్షి, సిద్దిపేట: ‘టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నాడు నోటుకు ఓటు విషయంలో ప్రసిద్ధి అయితే.. నేడు కాంగ్రెస్ నోట్లకు సీట్లను అమ్ముకుంటోందని గాందీభవన్‌లో మాట్లాడుతున్నారు’అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇలాంటి వాళ్లకు అధికారం అప్ప గిస్తే రాష్ట్రాన్ని కూడా అమ్ముతారని ఆరోపించారు. సిద్దిపేటలో మంగళవారం సీఎం సభ జరగనున్న సందర్భంగా సోమవారం ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లా డుతూ.. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన, బీఫారాల అందజేత, ప్రచారంలో ముందున్నాం రేపు సీట్లు గెలుపొందడంలో కూడా ముందే ఉంటామన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల ఫ్యూజులు ఎగిరిపోయాయని, ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో వారు ఉన్నారని తెలిపారు. తమ మేనిఫెస్టోను బీఆర్ఎస్ కాపీ కొట్టిందని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు.. కానీ కాంగ్రెస్ పార్టీయే తమ పథకాలను కాపీ కొట్టిందని హరీశ్ ఆరోపించారు. రైతు బంధు, పెన్షన్లను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని గుర్తు చేశారు. బీజేపీ నుంచి పోటీ చేసేందుకు నాయకులే లేరని మంత్రి ఎద్దేవా చేశారు. ఎవరో రాసిచి్చన స్క్రిప్ట్ చదువుతుండటంతో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నవ్వుల పాలవుతున్నారన్నారు. -
లగ్జరీ బీఎండబ్ల్యూ ఈవీ: గంటల్లోనే హాట్ సేల్, ధర ఎంతంటే?
జర్మనీ లగ్జరీ కార్ మేకర్ బీఎండబ్ల్యూ ఇండియా కొత్తరు కారును లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. BMW iX1 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఇండియాలో ఆవిష్కరించింది. ఫుల్లీ ఎలక్ట్రిక్ BMW iX1 బుకింగ్‌లు ప్రత్యేకంగా ఆన్లైన్లో తీసుకొచ్చింది. బుకింగ్స్ అలా మొదలు పెట్టిందో లేదో విపరీతమైన డిమాండ్‌ను నమోదు చేసింది. ఈ హాల్ సేల్‌లో ఇప్పటికే 2023కి సంబంధించిన మొత్తం యూనిట్లు అందుకుంది. రూ. 66.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)ధరతో తీసుకొచ్చిన ఈ ఎస్యూవీ డెలివరీలో అక్టోబర్‌లో ప్రారంభం. లాంచింగ్ రోజే iX1 SUVకి ‘అసాధారణ స్పందన రావడం థ్రిల్లింగ్‌గా ఉందంటూ BMW ప్రెసిడెంట్ విక్రమ్ పవా సంతోషం ప్రకటించారు. తమకు ఇండియాలో iX1కి గొప్ప అరంగేట్రం అని పేర్కొన్నారు. కానీ ఎన్ని యూనిట్లు సేల్ అయిందీ కచ్చితమైన వివరాలు అందించలేదు. డిజైన్ పరంగా, iX1 ఒక విభిన్నమైన 'I' ఎలక్ట్రిక్ గుర్తింపు,అడాప్టివ్ LED హెడ్లైట్లు LED హెడ్‌ల్యాంప్‌లు రన్నింగ్ బోర్డ్‌లతో పాటు ముందు మరియు వెనుక బంపర్‌లో బ్లూ యాక్సెంట్లతో దాదాపు చతురస్రాకారంలో గ్రిల్‌ను అమర్చింది. iX1 66.4kWh బ్యాటరీ ప్యాక్, 80 kms/hr గరిష్ట వేగంతో 5.6సెకన్లలో 100 కి.మీటర్ల వరకు తక్షణ వేగవంతం అందుకుంటుంది. ఇది 313 హెచ్‌పి పవర్‌ను గరిష్టంగా 494 ఎన్ఎమ్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 29 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు. దాదాపు 6.3 గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. ఆల్ఫ్‌లైన్ వైట్, స్పేస్ సిల్వర్, బ్లాక్ సఫైర్ , స్టార్మ్ బే అనే నాలుగు రంగుల్లో లభ్యం. 10.7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 10.25-అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది. ఇది బ్లూ రింగ్ ఫినిషర్ లోగోతో ఎమ్ స్పోర్ట్ లెదర్ స్టీరింగ్ వీల్, 12 స్పీకర్లతో హర్మాన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, మసాజ్ ఫంక్షన్లతో కూడిన యాక్టివ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైట్‌ని కలిగి ఉంది. అలాగే డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్ టెయిల్‌గేట్ మరియు స్టోరేజీతో కూడిన ఫ్లోటింగ్ ఆర్మ్‌రెస్ట్ ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. -
భారీ తగ్గింపు: రూ. 48,900లకే ఐఫోన్ 15 దక్కించుకునే చాన్స్
యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్. అమెరికా దిగ్గజం యాపిల్ లాంచ్ చేసిన లేటెస్ట్ ఐఫోన్ల 15 సిరీస్‌పై భారీ డిస్కౌంట్ లభించనుంది. Apple iPhone 15పై అమెజాన్ , Flipkartలో రూ.60,000 వరకు భారీ తగ్గింపును ప్రకటించింది. ఇప్పటికే ప్రీ బుకింగ్లనుమొదలైన సంగతి తెలిసిందే.ఐఫోన్ 15 సెప్టెంబర్ 22 నుండి తొలి సేల్. అలాగే షిప్పింగ్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం. యూజర్లు Apple India వెబ్సైట్లో అలాగే ఢిల్లీ, ముంబైలోని రిటైల్ అవుట్లెట్లలో ఈ ఆకర్షణీయమైన ఆఫర్లను యాక్సెస్ చేయవచ్చు. HDFC బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగించి వారి వెబ్సైట్లో కొనుగోలు చేస్తే రూ. 6,000 వరకు తక్షణ తగ్గింపు లభ్యం. యాపిల్ దేశంలో తన తాజా ఉత్పత్తులపై వరుస డిస్కౌంట్లను ప్రకటించింది. iPhone 15 ఇప్పుడు రూ. 74,900 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. అసలు ధర రూ. 79,900.అలాగే రూ. 89,900 నుంచి దిగి వచ్చిన iPhone 15 Plus రూ. 84,900 వద్ద అందుబాటులో ఉంది. ఇక ఐఫోన్ 15 ప్రో రూ. 128,900కి అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 1,34,900. iPhone 15 Pro Maxని రూ. 153,900కి కొనుగోలు చేయవచ్చు. దీని అసలు రూ. 159,900. (ఎన్ఆర్ఐలకు ఎస్బీఐ గుడ్ న్యూస్:యోనో యాప్‌తో ఈజీగా) తాజా నివేదికల ప్రకారం, అమెజాన్‌లో iPhone 15 ప్రీ-ఆర్డర్లో రూ. 89,900 నుంచి షురూ అవుతాయి. డిస్కౌంట్ తర్వాత, ఐఫోన్ 15 ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 79,900 నుండి ప్రారంభం అయితే, ఈ సమయంలో వెబ్సైట్లో అన్ని మోడల్‌లు స్టాక్‌లో లేవు. ఎంపిక చేసిన HDFC కార్డ్‌ల ద్వారా వినియోగదారులు రూ. 5,000 వరకు తగ్గింపును పొందవచ్చు. (ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్...భయంకర పోరాటం: చివరికి ఇలా..!) మీదగ్గర iPhone 12 ట్రేడ్-ఇన్ ఆఫర్లో భాగంగా రూ. 20,000 అదనపు తగ్గింపు. ఈ డిస్కౌంట్ రావాలంటే ఫోన్ మంచి స్థితిలో ఉండాలి. దీనికి అదనంగా రూ.6,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్ కూడా ఉంది. ఈ రెండు ఆఫర్లు వర్తించినతరువాత ఐఫోన్ 15 ధర రూ. 48,900కి పడిపోతుంది.ఈ తాజా ఆఫర్ సెప్టెంబర్ 22 నుండి అందుబాటులో ఉంటుంది. మీకు iPhone 12 లేకపోయినా డోంట్‌వర్రీ. మీ iPhone లేదా Android స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా Cashifyలో లేదా iStore అధికారిక వెబ్సైట్లో తగ్గింపు పొందవచ్చు. అయితే ఎక్స్ఛేంజ్ ఫోన్ వయస్సు ,పరిస్థితిని బట్టి వినియోగదారులు రూ.2వేల రూ.67,800 వరకు ధర దిగి వస్తుంది. (Disclaimer: తాజా iPhone 15 స్మార్ట్‌ఫోన్‌పై ఉత్తమమైన డీల్స్కోసం ఆయా ప్లాట్‌ఫారమ్‌లలో అన్ని డిస్కౌంట్లు అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్లను చెక్ చేసుకోవడం ఉత్తమం) -
ఇదే జరిగితే 'డిస్నీ ఇండియా' ముఖేష్ అంబానీ చేతికి!
Disney India: అమెరికన్ ఎంటర్టైన్మెంట్ సంస్థ 'డిస్నీ' (Disney) ఇండియన్ మార్కెట్లో తన వ్యాపారానికి సంబంధించిన ఒక సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదే జరిగితే భారతదేశంలో డిస్నీ ఒక ప్రముఖ కంపెనీ సొంతమయ్యే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ముందు వరుసలో రిలయన్స్.. నివేదికల ప్రకారం.. డిస్నీ ఇండియాను ముఖేష్ అంబానీ నేతృత్వంలో రిలయన్స్ కొనుగోలు చేయనున్నట్లు.. ఈ వరుసలో ఇదే ముందు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డిజిటల్ స్ట్రీమింగ్ రంగంలో అడుగుపెట్టిన రిలయన్స్ డిస్నీని సొంతం చేసుకుంటే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. భారతదేశంలో సరైన కొనుగోలుదారు లభిస్తే.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్, స్పోర్ట్స్ వంటి వాటిని ఒకేసారి విక్రయించే అవకాశం ఉంది. ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ IPLకి సంబంధించి స్ట్రీమింగ్ రైట్స్ కోల్పోయింది. ఈ హక్కులను రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 సొంతం చేసుకుంది. దీంతో భారతదేశంలో ఈ బిజినెస్ మరింత డెవలప్ చేయడానికి కంపెనీ అన్ని విధాలుగా సన్నద్ధమవుతోంది. ఇదీ చదవండి: వినాయక చవితి బిజినెస్ ఇన్ని కోట్లా? విగ్రహాల ఖర్చే.. డిస్నీ ఇండియా వ్యాపారానికి సమందించిన చర్చలు ఇప్పటికే జరుపుతున్నట్లు బ్లూమ్ బర్గ్ వెల్లడించింది. కాగా ఈ చర్చలు డీల్ వరకు వెళ్లే అవకాశం లేదని కొందరు భావిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించకపోవడం గమనార్హం. అంతే కాకుండా ప్రస్తుతం ఐపీఎల్ స్ట్రీమింగ్‌తో జియో టీవీకి సబ్స్క్రైబర్స్ సంఖ్య భారీగా పెరిగింది. ఈ సమయంలో డిస్నీ ఇండియాను రిలయన్స్ సొంతం చేసుకుంటే.. ఈ రంగంలో కూడా అగ్రగామిగా నిలిచే అవకాశం ఉంది. -
ఇలా అమ్ముకోండి.. అలా కొనుక్కోండి
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోళ్లు, విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ముగిసిన విద్యుత్ ఉత్పత్తి సంస్థ (జెన్కో)లు కరెంటును నేరుగా ఎవరికైనా అమ్ముకొనే అవకాశం కల్పించింది. ఏదైనా జెన్కో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించినప్పుడు డిస్కంలతో పీపీఏ కుదర్చుకుంటుంది. ఇది సాధారణంగా 12 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకూ ఉంటుంది. ఈ ఒప్పందం గడువు ముగిసిన తరువాత కూడా డిస్కంలు అదే రేటుకి అదే జెన్కో ద్వారా విద్యుత్‌ను తీసుకునే వెసులుబాటు ఇప్పటివరకూ ఉంది. ఇప్పుడు కేంద్రం ఈ వెసులుబాటు లేకుండా చేసింది. గడువు ముగిసిన తరువాత కూడా అదే రేటుకి కొంటే జెన్కోలకు నష్టం వాటిల్లుతుందన్నది కేంద్రం చెబుతున్న కారణం. దీంతో జెన్కోలు పీపీఏల గడువు ముగిసిన తరువాత ఇండియన్ ఎనర్జీ ఎక్సే్ఛంజ్ (ఐఈఎక్స్)లోగానీ, ఎక్కువ ధర ఇచ్చే డిస్కంలకు గానీ విద్యుత్‌ను విక్రయించుకోవచ్చు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కరెంటును పీపీఏలు ముగిసిన తరువాత విక్రయించేందుకు సెంట్రల్ పూల్ విధానాన్ని కేంద్రం కొత్తగా తీసుకువచ్చింది. కేంద్రానికి చెందిన పదహారు ప్లాంట్లలో విద్యుత్‌ను డిస్కంలు ముందస్తు దరఖాస్తు ద్వారా కొనుక్కొనే అవకాశం కలి్పంచింది. కొనుగోలు ఒప్పందాన్ని కూడా ఐదేళ్లకు పరిమితం చేసింది. పీపీఏలు చేసుకోగా మిగిలిన విద్యుత్‌ను ఐఈఎక్స్‌లో విక్రయిస్తారు. అంతా ఐఈఎక్స్‌లోనే విద్యుత్‌ను అమ్మాలన్నా, కొనాలన్నా ఇప్పుడు జెన్కోలు, డిస్కంలకు ఉన్న ప్రధాన మార్కెట్ ఇండియన్ ఎనర్జీ ఎక్సే్ఛంజ్. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ అనుమతితో 2008 జూన్ 27న ప్రారంభమైన ఐఈఎక్స్ 2017లో స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీగా మారింది. అప్పటినుంచి విద్యుత్ క్రయ విక్రయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. 29 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 55కు పైగా విద్యుత్ పంపిణీ సంస్థలు, 600కుపైగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, 1800కుపైగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, 4,600కు పైగా వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు ఐఈఎక్స్‌లో చేరాయి. గత నెలలో ఐఈఎక్స్‌లో 8,469 మిలియన్ యూనిట్ల లావాదేవీలు జరిగాయి. యూనిట్ సగటు ధర రూ.6.89గా ఉంది. బహిరంగ మార్కెట్లో విద్యుత్ లావాదేవీలకు జెన్కోలు, డిస్కంల నుంచి గరిష్టంగా యూనిట్‌కు 2 పైసలు రుసుమును (ఐఈఎక్స్) వసూలు చేస్తోంది. -
బైజూస్ సరికొత్త ప్లాన్స్: విదేశీ విభాగాల విక్రయంలో
న్యూఢిల్లీ: ఎడ్టెక్ సంస్థ బైజూస్ 1.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9,956 కోట్లు) రుణ మొత్తాన్ని పూర్తిగా చెల్లించేసే ప్రయత్నాల్లో ఉంది. ఆరు నెలల్లోపు తిరిగి చెల్లించేందుకు యోచిస్తోంది. తదుపరి మూడు నెలల్లో 300 మిలియన్ల డాలర్లను తిరిగి చెల్లించాలన్న ప్రతిపాదనను ప్రతిపాదనకు రుణదాతలు ఆమోదించడంతో సంస్థకు కొంత ఊరటనివ్వనుంది. (ఆడి క్యూ8 స్పెషల్ ఎడిషన్, ధర చూస్తే..!) ఇందులో భాగంగా విదేశీ విభాగాలైన ఎపిక్, గ్రేట్ లెర్నింగ్ సంస్థలను విక్రయించాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ రెండింటి విక్రయంతో దాదాపు 800 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల వరకు సమకూర్చుకోవచ్చని బైజూస్ భావిస్తున్నట్లు వివరించాయి. అలాగే వాటాల విక్రయం ద్వారా తాజాగా మరిన్ని పెట్టుబడులు కూడా సమీకరించడంపైనా కంపెనీ కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. 1.2 బిలియన్ డాలర్ల రుణాన్ని (టీఎల్‌బీ) మొత్తం మీద ఆరు నెలల వ్యవధిలో తీర్చేయొచ్చని బైజూస్ ఆశిస్తోంది. 2021 నవంబర్‌లో విదేశీ ఇన్వెస్టర్ల నుంచి బైజూస్ ఈ రుణాన్ని తీసుకుంది. (10 శాతం జీఎస్టీ?ఇక డీజిల్ కార్లకు చెక్? నితిన్ గడ్కరీ క్లారిటీ) -
తేలు విషం ఖరీదు ఎంతో తెలుసా?
కొన్ని రోజుల క్రితం పాముల పెంపకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విషాన్ని సేకరించడం కోసమే వాటిని పెంచుతారు. ఇప్పుడు తాజాగా తేళ్ల పెంపకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒక గదిలో తేళ్లను పెంచడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. నిజానికి తేలు కరిస్తే, అది మరణానికి కూడా దారి తీస్తుంది. తేలు విషం ప్రాణాంతకం. అందుకే ఎవరైనాసరే తేళ్లకు దూరంగా ఉండాలని కోరుకుంటారు. ఒకేచోట కొన్ని వేల తేళ్లు కనిపిస్తే ఎలా ఉంటుంది? అవును.. ఇటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తేళ్లను ప్రత్యేక అరలలో ఉంచి పెంచుతుండటం కనిపిస్తుంది. వాటికి ఆహారం వేయడాన్ని కూడా చూడవచ్చు. తేళ్ల పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది ప్రాణాలమీదకు వస్తుంది. ఇంతకీ తేళ్లను ఎందుకు పెంచుతారు? వీటి వలన ఉపయోగాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఔషధాల తయారీ తేళ్లను రెండు ప్రయోజనాల కోసం పెంచుతారు. మనిషిని చంపగల తేలు విషాన్ని అనేక రకాల ఔషధాల తయారీలో వినియోగిస్తారు. తేలు విషాన్ని క్యాన్సర్‌తో సహా అనేక ప్రాణాంతక వ్యాధులలో వినియోగిస్తారు. వాటి విషాన్ని ప్రత్యేకంగా నిల్వ చేస్తారు. పలు దేశాలలో తేళ్లను తింటారు. కాగా ఒక్కో తేలు ప్రతిరోజూ 2 మిల్లీగ్రాముల విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీనిని తేళ్ల పెంపకందారులు ఎంతో జాగ్రత్తగా సేకరిస్తారు. తేలు విషం లీటరు ధర 10 మిలియన్ డాలర్లు (రూ. 74 కోట్ల 15 లక్షలు) తేలు విషాన్ని సౌందర్య సాధనాల తయారీలోనూ ఉపయోగిస్తారు. సోషల్ మీడియాలో షేర్ అయిన ఈ వీడియోను ఇప్పటి వరకు కొన్ని మిలియన్ల మంది వీక్షించారు. ఇది కూడా చదవండి: ప్రపంచాన్ని ఏలుతున్న భారత సంతతి నేతలు Did you know? Scorpions farms do exist. Each scorpion produces about 2 milligrams of venom daily, which is milked using a pair of tweezers and tongs. A liter is worth $10 million, used for cosmetics and medicines [📹 King Scorpion / efre812]pic.twitter.com/PGdbpdpG8h — Massimo (@Rainmaker1973) September 2, 2023 -
ఇల్లు అమ్మేస్తోన్న జబర్దస్త్ కమెడియన్.. కన్నీటిని ఆపుకుంటూ!
జబర్దస్త్ శాంతి అలియాస్ శాంతిస్వరూప్ పరిచయం అక్కర్లేని పేరు. ప్రేక్షకులందరికీ జబర్దస్త్ శాంతిగానే పేరు ముద్రపడిపోయింది. కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న శాంతి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. తన కామెడీతో అందరినీ నవ్వించిన జబర్దస్త్ శాంతి.. అయితే ప్రస్తుతం కష్టాల్లో ఉన్నారు. అతని తల్లికి ప్రస్తుతం సర్జరీ చేయాల్సి వచ్చిందని తెలిపారు. అమ్మ ఆస్పత్రి ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడంతో ఏకంగా తన ఇంటిని అమ్మకానికి పెట్టినట్లు వెల్లడించారు. (ఇది చదవండి: ప్రేమ పేరుతో మోసం.. జబర్దస్త్ కమెడియన్ అరెస్ట్ ) ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. అమ్మకు తెలియకుండానే ఇంటిని అమ్మేస్తున్నట్లు ఎమోషనలయ్యారు. అమ్మకు హెల్త్ బాగాలేకపోవడంతో నేను ఇంటిని అమ్మేయస్తున్నానంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇది చూసిన నెటిజన్స్ శాంతికి మద్దతు ప్రకటిస్తున్నారు. అమ్మ కోసం మీరు చేస్తున్న పని చూస్తుంటే గర్వంగా ఉందని పోస్టులు పెడుతున్నారు. అమ్మ కోసం మీరు చేస్తున్న త్యాగం చాలా గొప్పది.. ఈ ప్రకృతిలో అమ్మకు మించిన ఆస్తి, సంపద, స్టేటస్ ఏది ఉండదని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇన్ని రోజులు నాకోసం ఉన్న ఇల్లు ఇప్పుడు నాకు లేకుండా పోతోంది.. కానీ ఈ ఇంట్లోకి ఎవరు వచ్చినా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపింది. (ఇది చదవండి: ఇద్దరు పిల్లల తండ్రిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న నటి?!) View this post on Instagram A post shared by Jabardasth Shanthi Swaroop (@jabardasthshanti)