
హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా సేల్‌ను రిలయన్స్ ప్రారంభించింది. ఆకర్షణీయ ఆఫర్లు, డిస్కౌంట్లతో రిలయన్స్ డిజిటల్ ఈ సేల్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దింది. ఇందులో 300లకు పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు, 500లకు పైగా టీవీలు, ల్యాప్‌ట్యాప్‌లు, రిఫ్రిజిరేటర్లు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు రిలయన్స్ డిజిటల్‌లో అందుబాటులో ఉంటాయి. దేశంలోని 80 నగరాల్లో ఉన్న 460 స్టోర్లలో ఈ సేల్ ప్రారంభం కానుంది. స్టోర్లతో పాటు మై జియోస్టోర్స్‌తో పాటు www.reliancedigital.in లో ఈ సేల్ ఆగస్టు 16 వరకు ఉంటుంది.
ఆఫర్లు
- ఆగస్టు 16 వరకు జరిగే కొనుగోళ్లలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ని అందిస్తోంది. ఇందులో గరిష్టంగా రూ.3,000 వరకు తగ్తింపు పొందవచ్చు
- కనీసం రూ.9999 కొనుగోళ్లపై పేటీఎం ద్వారా చెల్లింపులు జరిపితే ఆగస్టు 31 వరకు రూ.500 వ్యాలెట్ క్యాష్ బ్యాక్ అందిస్తోంది. రూ.10,000 ఆ పైన జరిపే కొనుగోళ్లపై జెస్ట్‌మనీ ద్వారా నో కాస్ట్ ఈఎంఐ, 10 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. క్యాష్‌బ్యాక గరిష్ట పరిమితి రూ.5,000లుగా ఉంది.
ఫైనాన్సింగ్
సులభమైన ఫైనాన్సింగ్, ఈఎంఐ ఆప్షన్స్‌తో డిజిటల్ ఇండియా సేల్స్ ఈ సంవత్సరం మరింత ఆకర్షణీయంగా మారింది. కొనుగోలు చేసిన భారీ వస్తువులను ఇన్‌స్టా డెలివరి కింద మూడు గంటల్లోనే డెలివరీ చేయనున్నారు. వినియోగదారులు తమ వీలుని బట్టి సమీపంలోని స్టోర్ నుంచి స్టోర్ పికప్ ఆప్షన్‌ను కూడా పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment