రిలయన్స్ జ్యువెల్స్ డ్రీమ్ డైమండ్ సేల్ | Reliance Jewels Dream Diamond Sale is Back | Sakshi
Sakshi News home page

రిలయన్స్ జ్యువెల్స్ డ్రీమ్ డైమండ్ సేల్

Published Wed, Jan 15 2025 3:10 PM | Last Updated on Wed, Jan 15 2025 3:58 PM

Reliance Jewels Dream Diamond Sale is Back

 ప్రముఖ ఆభరణాల బ్రాండ్‌లలో ఒకటైన రిలయన్స్ జ్యువెల్స్,  వార్షిక ‘డ్రీమ్ డైమండ్ సేల్‌’ను మళ్లీ  తీసుకొచ్చింది.  ఈ సేల్‌        ఫిబ్రవరి 16  వరకు అందుబాటులో ఉంటుందని   రిలయన్స్ జ్యువెల్స్ ఒక ప్రకటనలో తెలిపింది.  స్టైల్‌కి,  సందర్భానికి త గినట్టుగా  డైమండ్‌ ఆభరణాలను  తీసుకొచ్చినట్టు  వెల్లడించింది.

ఈ ప్రత్యేకమైన ఆఫర్ కస్టమర్‌లకు డైమండ్ విలువ మరియు మేకింగ్ ఛార్జీలపై 30శాతం వరకు తగ్గింపును అందిస్తోంది.  వివిధ వజ్రాభరణాలతో, ఈ సంవత్సరం డ్రీమ్ డైమండ్ సేల్  కొనుగోలుదారుల జీవితాల్లోని ప్రతీ సందర్బంలో  విలువైన క్షణాలను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇందులో స్టేట్‌మెంట్ బ్రైడల్ సెట్స్‌, ఉంగరాలు, చెవిపోగులు, బ్యాంగిల్స్ , గ్రాండ్ నెక్లెస్‌ల ఉంటాయని రిలయన్స్ జ్యువెల్స్ సీఈఓ సునీల్ నాయక్  తెలిపారు.     దేశవ్యాప్తంగా 180+ స్వతంత్ర షోరూమ్‌లలో  డైమండ్‌ కలెక్షన్‌ను దుకాణదారులు పొందవచ్చన్నారు.

 

ఎప్పటికి మన అందాన్నీ ఇనుమడింప  చేసే డైమండ్‌ నగలు మెరుపు పోకుండా షైనింగ్‌ ఉండాలంటే ఏం చేయాలి? ఇవిగో టిప్స్‌ మీకోసం!

  • స్నానం చేసేటప్పుడు డైమండ్‌ ఆర్నమెంట్స్‌ను తీయాలి. మైల్డ్‌ సోప్, మైల్డ్‌ షాంపూ అయితే ఫరవాలేదు. కానీ గాఢత ఉన్న సబ్బులు, షాంపూలతో స్నానం చేస్తే వాటిలోని రసాయనాల దుష్ప్రభావం ఆభరణాల మీద పడుతుంది.

  • రోజువారీ ధరించే చెవి దిద్దులు, ఉంగరాలు, లాకెట్, బ్రేస్‌లెట్‌లు ఎక్కువగా సొల్యూషన్‌ బారిన పడుతుంటాయి. వాతావరణంలో  సొల్యూషన్‌ కారణంగా ఆభరణాల్లో అమర్చిన డైమండ్‌ మీద మురికి పేరుకుంటుంది. జిడ్డుగా కూడా మారుతుంది. దాంతో డైమండ్‌ మెరుపు తగ్గుతుంది. 

  • వేడి నీటిలో లిక్విడ్‌ సోప్‌ నాలుగు చుక్కలు కలిపి అందులో ఆభరణాన్ని పది నిమిషాల సేపు నానపెట్టి ఆ తర్వాత మెత్తటి బ్రష్‌తో సున్నితంగా రుద్దాలి. సబ్బు అవశేషాలు ఆభరణం మీద మిగలకుండా శుభ్రమైన నీటిలో ముంచి కడగాలి. నీటిలో నుంచి తీసి మెత్తని నూలు వస్త్రం మీద పెట్టి మెల్లగా అద్దినట్లు తుడవాలి. 

  • బేకింగ్‌ సోడా మంచి క్లీనింగ్‌ ఎలిమెంట్‌. కానీ తక్కువ క్వాలిటీ డైమండ్‌ ఆభరణాలను శుభ్రం చేయడానికి బేకింగ్‌ సోడా వాడకూడదు. 

  • పైన చెప్పుకున్నవి కట్‌ డైమండ్స్‌ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అన్‌కట్‌ డైమండ్స్‌ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. 

  • ఆభరణం తయారీలో అన్‌కట్‌ డైమండ్‌ వెనుక సిల్వర్‌ ఫాయిల్‌ అమరుస్తారు. వెండి వస్తువులు గాలి తగిలితే నల్లబడినట్లే అన్‌కట్‌ డైమండ్‌ ఆర్నమెంట్స్‌ కూడా అంచులు నల్లబడతాయి. వాటిని గాలి దూరని బాక్సులో భద్రపరచాలి.

  • ఇటీవల వేడుకల్లో ఎయిర్‌కూలర్‌లో పెర్‌ఫ్యూమ్‌ కలుపుతున్నారు. వాటి ప్రభావంతో కూడా అన్‌కట్‌ డైమండ్‌ ఆర్నమెంట్స్‌ నల్లబడే ప్రమాదముంది. అన్‌కట్‌ డైమండ్‌ ఆర్నమెంట్‌ మెరుపు విషయంలో ఇంట్లో ఏ ప్రయత్నమూ చేయకూడదు. అవి చాలా డెలికేట్‌గా ఉంటాయి కాబట్టి ఆభరణాల తయారీ దారులతో పాలిష్‌ చేయించుకోవాలి.

  • ఆభరణాలు పెట్టే ప్లాస్టిక్‌ బాక్సులకు ముఖమల్‌ క్లాత్‌ని గమ్‌తో అతికిస్తారు. డైమండ్‌ ఆర్నమెంట్స్‌ను బీరువాలో భద్రపరిచేటప్పుడు ఈ గమ్‌ బాక్సుల్లో పెట్టకూడదు. ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ బాక్సు నుంచి తీసి మెత్తని తెల్లని క్లాత్‌ మీద అమర్చి భద్రపరుచుకోవాలి.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement