
దేశంలోని ప్రముఖ ఫ్యాషన్ రిటైల్ బ్రాండ్లలో ఒకటైన రిలయన్స్ ట్రెండ్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన కుమార్తె సితార ఘట్టమనేనిను బ్రాండ్ ప్రచారకర్తలుగా నియమించుకుంది. వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా తయారు చేసిన దుస్తులను వీరు ప్రమోట్ చేయనున్నారు. ‘న్యూ టైమ్స్, న్యూ ట్రెండ్స్’ పేరుతో బ్రాండ్ ప్రచారానికి వీరు ఎంతో తోడ్పడుతారని కంపెనీ తెలిపింది.
ప్రమోషన్‌లో స్టార్లు అవసరమేనా..?
సంస్థలు తమ ఉత్పత్తులను వినియోగదారుల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం సెలబ్రిటీల బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు కంపెనీలకు కీలకంగా మారాయి. అయితే బ్రాండ్ ప్రమోషన్ కోసం సంస్థలు సెలబ్రిటీలను ఎందుకు ఎంచుకుంటున్నాయో తెలుసుకుందాం.
నమ్మకం, విశ్వసనీయతను పెంపొందించడం: సెలబ్రిటీలను తరచుగా రోల్ మోడల్స్ లేదా ఇన్‌ఫ్లుయెన్సర్లుగా భావిస్తారు. కాబట్టి తాము ప్రచారం చేస్తున్న బ్రాండ్ పట్ల వినియోగదారులకు సానుకూలత రావడానికి, దాన్ని వినియోగించేందుకు అవకాశం ఉంటుంది. ఇది కంపెనీల సేల్స్ పెరిగేందుకు దోహదం చేస్తుంది.
బ్రాండ్ విజిబిలిటీని పెంచడం: సెలబ్రిటీ ప్రమోషన్ల ద్వారా స్టార్ల ఫాలోయింగ్‌ను కంపెనీలు ఆసరాగా చేసుకుంటాయి. దాంతో బ్రాండ్ ఉత్పత్తుల విజిబిలిటీని పెంచాలని లక్ష్యంగా చేసుకుంటాయి. ముఖ్యంగా ఫ్యాషన్, స్పోర్ట్స్, టెక్నాలజీ వంటి రంగాల్లో ఇది ప్రభావం చూపుతుంది.
ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడం: అభిమానులు తరచుగా తమ ఫెవరెట్ స్టార్‌లతో పరోక్షంగా భావోద్వేగ బంధాన్ని కలిగి ఉంటారు. సెలబ్రిటీలు ఒక బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నప్పుడు ఆయా ఉత్పత్తులపై వినియోగదారుల భావోద్వేగాలు తోడవుతాయి. దాంతో కంపెనీ సేల్స్ పెరిగే అవకాశం ఉంటుంది.
ఇదీ చదవండి: వస్తు ఎగుమతులను సేవలు అధిగమించాలి
సవాళ్లు లేవా..
సెలబ్రిటీల బ్రాండ్ ప్రమోషన్లలో కంపెనీలకు ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. స్టార్ల జీవన విధానం బ్రాండ్లపై ప్రభావం చూపుతుంది. కాంట్రాక్ట్ కుదుర్చుకున్న తర్వాత ఆ సెలబ్రిటీలు ఏదైనా వివాదాల్లో చిక్కుకుంటే కంపెనీ ఉత్పత్తులపై దాని ప్రభావంపడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది బ్రాండ్ ప్రతిష్ఠను దెబ్బతీయవచ్చు. అందువల్ల సెలబ్రిటీ ఎంపిక కీలకంగా మారుతుంది.
Comments
Please login to add a commentAdd a comment