Trends
-
Wedding trends: పెళ్లి వేళ.. చిత్రకళ..
నగరానికి చెందిన ఆలేటి సాయిరాం ప్రమోధిని రెడ్డి, పటేల్ నర్సింహారెడ్డి తమ పెళ్లి వేడుకను ప్రత్యక్షంగా చిత్రీకరించడానికి ఒక పెయింటర్‌ను నియమించుకున్నారు. ప్రత్యక్ష ప్రసారం అందించే లైవ్ టెలికాస్ట్ గురించి విన్నాం కానీ.. లైవ్ పెయింటింగ్ వినలేదు అనుకుంటే మీరింకా వెడ్డింగ్ ట్రెండ్స్‌లో అప్డేట్ కాలేదన్నమాటే.. వధూవరులు ఓవైపు రంగుల కలల్లో తేలిపోతుంటే.. మరోవైపు సప్తవర్ణాల చిత్ర ‘కళ’ ఆ ఇద్దరి అనుబంధం సాక్షిగా పెళ్ళి వేడుకను అల్లుకుపోతోంది. ఫొటోగ్రఫీ మామూలేగానీ.. లైవ్ పెయింటింగ్ పెడుతున్నారా లేదా..? అని వెడ్డింగ్ ప్లానర్స్ను అడిగే రోజులు వచ్చేశాయంటే.. ఇప్పుడు, వివాహ వేడుకల్లో చిత్రకళకు పెరుగుతున్న అర్థం చేసుకోవచ్చు. అడ్డుతెరతో ఆరంభం.. పెళ్లి వేడుకల సమయంలో వధూవరుల మధ్య ఉంచే అడ్డుతెరను కళాత్మకంగా రూపొందించడంతో ఓ రకంగా పెళ్లిళ్లలో చిత్రకళకు ప్రాధాన్యత మొదలైందని చెప్పొచ్చు. ఆ తర్వాత అతిథుల పోట్రైట్లు గీసి రిటర్న్ గిఫ్టŠస్‌గా ఇవ్వడం వంటివి ఒకటొకటిగా ఆరి్టస్టులను వెడ్డింగ్స్‌కు దగ్గర చేశాయి. టర్మరిక్ ఆర్ట్.. ఓ వైవిధ్యం.. ఇటీవలి కాలంలో పెళ్లిళ్లలో కొత్త ఆర్టిస్టిక్ ట్రెండ్‌గా సందడి చేస్తోంది టర్మరిక్ ఆర్ట్. దీనిలో భాగంగా చిత్రకారులు వధూవరుల రూపాలను కాన్వాస్‌పై ఇని్వజబుల్గా ప్రత్యేకమైన విధానంలో చిత్రిస్తారు. ఆ తర్వాత దాన్ని పెళ్లి వేడుకల్లో ప్రదర్శిస్తారు. వచి్చన అతిథులంతా దాని దగ్గరకు వెళ్లి అక్కడే ఉన్న రంగులను చేతులకు అద్దుకుని హస్తముద్రలు ఆ కాన్వాస్ పై వేస్తూ ఉండగా.. వధూవరుల రూపాలు దానిపై ప్రత్యక్షమవ్వడం ఓ ఆసక్తికరమైన వర్ణ వైవిధ్యం. ప్రత్యక్ష.. పెయింటింగ్.. పెళ్లి వేడుకలో ఓ వైపుగా కూర్చుని వధూవరులకు సంబంధించిన ముఖ్య ఘట్టాలను చిత్రించడం కూడా ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. పెళ్లికూతురును పెళ్లి బుట్టలో తీసుకువెళ్లడం, దంపతులు ఒకరి తలపై ఒకరు జీలకర్ర–బెల్లం ఉంచడం, మంగళసూత్రం కట్టడం, సంప్రదాయ ఆటలు ఆడడం వంటి అపురూప సందర్భాలను ఒడిసిపట్టుకోవడానికి వీడియో, ఫొటోగ్రాఫర్ల తరహాలో ఆరి్టస్టులు కూడా ఇప్పుడు తలమునకలవుతున్నారు. ఔత్సాహిక ఆరి్టస్టులకు డిమాండ్.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో యువ ఆరి్టస్ట్ కీర్తన షెడ్యూల్ ఫుల్ బిజీగా మారిపోయింది. ‘దంపతులు మా కళాకృతిని చూసిన ప్రతిసారీ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని మురిసిపోతారు’ అని కీర్తన చెప్పింది. ఆమె గత ఏడాది ఒక పెళ్లి సమయంలో వధూవరుల మధ్య ఉంచే అడ్డు తెరను అందంగా చిత్రించింది. ఆ తర్వాత నవంబర్‌లో తన మొదటి ప్రత్యక్ష (లైవ్) వెడ్డింగ్ పెయింటింగ్‌ను రూపొందించింది. అవి సోషల్ మీడియా ద్వారా ఆదరణకు నోచుకోవడంతో ఇప్పటి వరకూ నగరంతో పాటు బెంగళూరు, విజయవాడ, ఖమ్మం, కరీంనగర్లో మొత్తం 60 అడ్డుతెర చిత్రాలు, 13 వివాహ వేడుకల లైవ్ పెయింటింగ్ వర్క్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. ‘ఒక పెయింటింగ్ ఫొటోకు దొరకని వివరాలను క్యాప్చర్ చేస్తుంది. దీంతో పాటు మానవ స్పర్శ కూడా అందులో ఉంది’ అంటోంది సిటీకి చెందిన ఆర్టిస్ట్ రేష్మ. లైవ్ ఈవెంట్ పెయింటింగ్‌కు పేరొందిన ఈ యువతి.. ‘కొన్నిసార్లు మండపం దగ్గర లేదా స్క్రీన్ ముందు ఆరి్టస్టులు వారికి కేటాయించిన స్థలంలో కూర్చుంటారు. వేడుక జరుగుతున్నప్పుడు చూస్తూ స్కెచ్/పెయింట్ చేస్తారు. ఆ క్షణాలలో అక్కడి భావోద్వేగాలు, జ్ఞాపకాల కోసం ప్రధాన సన్నివేశాలను చిత్రించడానికి వాటర్ కలర్లను ఎక్కువగా వినియోగిస్తారు. అయితే ఈవెంట్, డెకర్ స్నాప్‌షాట్ కోసం యాక్రిలిక్లను కూడా వాడతారు. ప్రస్తుతం ఈ తరహా ఆర్ట్‌వర్క్‌ల ధర 20,000 నుంచి రూ.2 లక్షల వరకూ ఉంటుంది అదే విధంగా అవుట్‌స్టేషన్ నుంచి రప్పించే పేరొందిన ఆరి్టస్ట్ అయితే ప్రయాణ వసతి ఖర్చులను కూడా క్లయింటే భరించాలి.కష్టమే కానీ.. గొప్ప సంతృప్తి..సాధారణంగా ఆరి్టస్ట్కి ఏకాగ్రత చాలా ముఖ్యం. అయితే పెళ్లిలో మన వర్క్స్ చూస్తూ వ్యాఖ్యానిస్తూ లేదా ప్రశ్నలు అడుగుతూ వచ్చిన వారు అంతరాయం కలిగిస్తూ ఉంటారు. ధ్యాస చెదరకుండా ఉండాలి. అదే సమయంలో అతిథులతో మర్యాదగా ప్రవర్తించాలి. కష్టమే అయినా గొప్ప సంతృప్తి ఇందులో లభిస్తుంది. – సత్యవర్షి, ఆర్టిస్ట్యువ చిత్రకారులకు ప్రోత్సాహకరం.. ప్రస్తుతం నేను లైవ్ వెడ్డింగ్ పెయింటింగ్‌తో పాటు టర్మరిక్ ఆర్ట్ వర్క్ కూడా అందిస్తున్నాను. ఈ లైవ్ వెడ్డింగ్ ఆర్ట్ ట్రెండ్ మాలాంటి ఔత్సాహిక చిత్రకారులకు బాగా ప్రోత్సాహకరంగా ఉంటోంది. పెళ్లి వేడుకల్ని నేరుగా చూస్తూ చిత్రించడం అనేది సరదాగా ఉంటుంది. అదే సమయంలో అది ఒక సవాల్ కూడా. – గ్రీష్మ, ఆర్టిస్ట్ -
ఈ గాలి.. ఈ నేలా..
‘ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ..’ అంటూ బంగారు భవిష్యత్తును ఊహించుకుంటూ విదేశాలకు వెళ్లిన వృత్తి నిపుణులు రూట్ మార్చారు. ‘ఈ గాలి..ఈ నేలా అని పాడుకుంటూ తిరిగి నగరానికి వచ్చేస్తున్నారు. అలా వచ్చేస్తున్న మన దేశీయుల్లో సిటీకి చెందిన వారితో పాటు ఇతర నగరాలకు చెందిన వారు కూడా ఉండడం విశేషం. ఈ అనూహ్యమైన పోకడని వెల్లడించింది ఇంటర్నేషనల్ మొబిలిటీ ట్రెండ్స్.. నివేదిక. విదేశీ ఉద్యోగాల్లో ఇమడలేకపోతున్న యువ నిపుణులు పని వెతుక్కుంటూ నగరానికి తిరిగి వచ్చేస్తున్నారు. ఈ రివర్స్ మైగ్రేషన్ అమెరికా, యు.కె, కెనడా వంటి దేశాల నుంచి బాగా కనిపిస్తోంది. ఇంటర్నేషనల్ మొబిలిటీ ట్రెండ్స్‌పై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వెలువరించిన తాజా నివేదిక ఈ విశేషాలను వెల్లడించింది. విదేశాల్లో ఉంటూ అక్కడ పని చేయడానికి ఇష్టపడే భారతీయుల సంఖ్య 2020లో 78 శాతం కాగా అది మూడేళ్లు తిరిగేసరికి 2023 కల్లా.. 54 శాతానికి పడిపోయిందని పేర్కొంది. విదేశాల్లో చేస్తున్న పనిపట్ల అయిష్టతతో భారత్‌కు వలసలు పెరిగాయని, ఇలా తిరిగొస్తున్న వారిలో అత్యధికులు ఎంచుకుంటున్న టాప్ 3 నగరాలుగా వరుసగా హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఉన్నాయని తేలి్చంది. కారణాలెన్నో... ఇలా విదేశీ ఉద్యోగాలపై మోజు తగ్గిపోతుండడానికి ‘ఆర్థిక, వృత్తి పరమైన కారణాలతో పాటు అనేక అంశాలు‘ కీలకంగా ఉన్నాయని నివేదిక తెలిపింది. ‘ప్రధానంగా ఆరి్థక అంశాలతో పాటు వృత్తి పరమైన వృద్ధి అవకాశాల కోసం మాత్రమే ఇలా వలస వెళ్లాలని భావిస్తారు. ఆ విధంగా చూస్తే ఇలా తిరిగి వస్తున్నవారిలో ఉద్యోగ అవకాశాల నాణ్యత కోసం 52 శాతం మంది, ఆదాయం, జీవన వ్యయం కోసం, 37 శాతం ఆవిష్కరణ డిజిటలైజేషన్ కోసం 29 శాతం మంది విదేశాలను వదలాలని నిర్ణయించుకుంటున్నారు. కుటుంబ అనుకూల వాతావరణం, భద్రత, జీవన నాణ్యత కూడా ప్రధాన కారకాలు‘ అని నివేదిక వెల్లడించింది. మన నగరానికే ఎందుకంటే... ఇలా విదేశాల నుంచి మన దేశానికి తిరిగి వస్తున్నవారిలో అత్యధికులు నగరాన్ని ఎంచుకోవడానికి నగరంలో ఐటీ రంగం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడం, జీవన వ్యయం తక్కువగా ఉండడం, నగరం సురక్షితం అనే ఇమేజ్... వంటివి కారణాలుగా ఇటీవల నగరానికి మకాం మార్చిన వారు చెబుతున్నారు. ‘కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేశాను కాబట్టి అమెరికాలో మంచి ఉద్యోగం వస్తుందని ఆశించాను. కానీ నేను ఆశించింది జరగలేదు. పైగా నా మీద ఆధారపడి నా భార్య నాతో వచ్చేసింది, జీవితం గడపడానికి నేను ఒక కనీ్వనియన్స్ స్టోర్‌లో ఉద్యోగం చేయాల్సి వచి్చంది. ఇలా లాభం లేదని నిర్ణయించుకుని ఇంటికి తిరిగి వచ్చాను’ అని ఎస్.సుదర్శన్ రావు చెప్పారు. అతను వెళ్లే ముందు నగరంలో తనకి ఆరంకెల జీతంతో ఉద్యోగం ఇచి్చన అదే కంపెనీ..తిరిగి వచ్చిన తర్వాత కూడా అతనికి మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని అందించింది ‘ కేవలం ఐటీ రంగంలోనే కాదు, ఫైనాన్స్, ఫార్మా తదితర రంగాలలో కూడా నగరంలో మంచి అవకాశాలు ఉన్నాయి‘ అని మరో ఉద్యోగి చరణ్ అంటున్నారు. మహారాష్ట్రలోని అకోలాకు చెందిన ఖైతాన్ ఖురేషీ కూడా తన కెనడియన్ కలలను వదులుకుని నగరానికి వచ్చేశారు. ‘కెనడాలో నా నెలవారీ ఖర్చులు అక్కడ నేను సంపాదించగలిగిన దానికంటే చాలా ఎక్కువ. పైగా నేను ఎడ్యుకేషన్ లోన్ కూడా చెల్లించాల్సి ఉంది. వచ్చే నెల బడ్జెట్‌కు కేటాయింపుల కంటే ఇండియాకు టిక్కెట్ కొనడమే చౌక అని అనుకున్నా’ అంటూ ఆయన నవ్వుతూ చెప్పారు. మాట సాయం కీలకమే... విదేశాల్లో మనవారికి కొరవడుతున్న ఎమోషనల్ సపోర్ట్ కూడా కీలకమని వీరు అంటున్నారు. తమ రివర్స్ మైగ్రేషన్‌కు భావోద్వేగ మద్దతు లభించకపోవడం కూడా కొందరు కారణాలుగా పేర్కొన్నారు. ‘బిజినెస్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ తర్వాత అమెరికాలో గౌరవప్రదమైన ఉద్యోగం సంపాదించడం నా అదృష్టంగా భావించాను. అయితే మాట్లాడటానికి ఎవరూ లేకపోవడం, ఇంటి పనులతో పాటు తీవ్రమైన పని షెడ్యూల్..అది నిర్వర్తించడానికి కనీస అవసరమైన భావోద్వేగ మద్దతు లేకపోవడం నన్ను నిరాశకు గురిచేసింది’ అని నగరానికి తిరిగి వచ్చి ఇక్కడ తనవారితో కలిసి ఆనందంగా గడుపుతున్న అద్నాన్ అన్నారు. -
అక్కడో రీతి.. ఇక్కడో తీరు
సాక్షి, హైదరాబాద్: విద్యావిధానంలో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య భిన్నమైన ధోరణుల నేపథ్యంలో ఆ రెండు ప్రాంతాల మానవ వనరుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందుకు పాఠ్య ప్రణాళికలు అవసరమని ఉన్నత విద్యా మండలి, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ భావిస్తున్నాయి. ఈ మేరకు జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో భిన్న కోర్సులను రూపొందించేందుకు కసరత్తు చేపట్టాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని యూనివర్శిటీలతో కలిసి మానవ వనరుల అభివృద్ధికి కార్యాచరణను తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇక్కడ టెక్‌లు, సాఫ్ట్వేర్లు.. అక్కడ సివిల్స్ టార్గెట్ వయా డిగ్రీలు దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిల్లో విద్యార్థులు ఒకే విధమైన కోర్సుల్లో చేరుతున్నారు. ముఖ్యంగా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్), ఎంబీఏ, ఎంసీఏను ఎంచుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యార్థులు ఎక్కువగా సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. ఆ తర్వాత వాళ్ళు పోటీ పరీక్షల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగానే సివిల్స్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ కేంద్రాలు ఉత్తరాదిలోనే ఎక్కువగా ఉంటున్నాయని తేలింది. సగానికి పైగా ఇంజనీరింగ్ సీట్లు దక్షిణాదికే దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు బీటెక్ తర్వాత తక్షణ ఉపాధి అవకాశాలు కోరుకుంటున్నారు. సాఫ్ట్వేర్ లేదా ఇతర సాంకేతిక ఉపాధి అవకాశాలను ఎంచుకుంటున్నారు. ఈ కారణంగా దేశవ్యాప్తంగా ఉండే ఇంజనీరింగ్ సీట్లలో 54 శాతం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా 12,47,667 బీటెక్ సీట్లు అందుబాటులో ఉంటే, వీటిల్లో 6,74,697 సీట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఎంసీఏలో 70,065 సీట్లు ఉంటే, 30,812 (44 శాతం) దక్షిణాదిలో ఉన్నాయి. ఎంబీఏ, పీజీడీఎం వంటి మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించి దేశవ్యాప్తంగా 3,39,405 సీట్లు ఉంటే, దక్షిణాదిన 1,57,632 సీట్లున్నాయి. బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ సీట్లు దక్షిణాదిలోనే పెరగడానికి ఇదే కారణమని ఏఐసీటీఈ భావిస్తోంది. 2015–16లో దక్షిణాది రాష్ట్రాల్లో 48.77 బీటెక్ సీట్లు ఉంటే, ఆరేళ్లలో అవి 5.3 శాతం మాత్రమే పెరిగాయని మండలి గుర్తించింది. స్కిల్.. పాలన నైపుణ్యంపై దృష్టి అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న పాలనాపరమైన మార్పులు, ప్రైవేటు రంగంలో వస్తున్న సరికొత్త డిమాండ్‌కు అనుగుణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పాఠ్యాంశాలు రూపొందించాలని ఏఐసీటీఈ, యూజీసీ భావిస్తోంది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ విద్యలో నైపుణ్యం పెంచడంపై దృష్టి పెట్టాలని గుర్తించింది. పారిశ్రామిక భాగస్వామ్యంతో ఇంజనీరింగ్ విద్యను ముందుకు తీసుకెళ్ళే ఆలోచనలపై ఫోకస్ చేయాలని భావిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై త్వరలో విధివి«దానాలు వెల్లడించే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. -
2023లో డిమాండ్ ఎక్కువగా ఉండే ఉద్యోగాలు ఇవే..
గతేడాది లేఆఫ్స్, రిమోట్ వర్క్, మూన్‌లైటింగ్, క్వైట్ క్విట్టింగ్, కోవిడ్ వంటి అంశాలు జాబ్ మర్కెట్‌ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య ఈ కొత్త ఏడాదిలో ఏ జాబ్ చేస్తే బాగుంటుంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులేంటని తెలుసుకునేందుకు నెటిజన్లు ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో పలు సంస్థలు ట్రెండింగ్ జాబ్స్ గురించి ఆసక్తికరమైన నివేదికల్ని విడుదల చేశాయి. ఆ నివేదికల ప్రకారం.. ప్రతిచోటా ఏఐ 2023లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని సంస్థలు ఎక్కువగా ఉపయోగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా ఏఐ నిపుణులకు ఈ ఏడాది ఉద్యోగానికి ఢోకా ఉండదనే అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. ముఖ్యంగా కోడింగ్‌తో పనిలేకుండా డ్రాగ్-అండ్-డ్రాప్ ఇంటర్‌ఫేస్‌లు ఉపయోగించి ప్రొడక్ట్ సంబంధిత సేవల్ని అందించే వ్యాపార సంస్థల్లో వారికి జాబ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మెటావర్స్ మెటావర్స్ పరిచయం అక్కర్లేని టెక్నాలజీ. ఇంటర్నెట్ రాకతో ఇప్పటివరకు భౌతిక ప్రపంచంలోనే ఉండిపోయిన మనుషులను వర్చువల్ వరల్డ్‌ను పరిచయం చేస్తుందీ మెటావర్స్. ఈ టెక్నాలజీ సాయంతో ఎక్కడో ఉన్న స్నేహితుల్ని, కుటంబసభ్యుల్ని వర్చువల్‌గా కలుసుకోవచ్చు. ఆడుకోవడం, మాట్లాడుకోవడం, పని చేసుకోవడం.. ఇలా అన్ని పనులూ వర్చువల్‌గా, రియల్‌టైమ్‌లో ఒకరినొకరు చూస్తూ చేసుకోవచ్చు. 2030 నాటికి మెటావర్స్ $5 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నదన్నుగా నిలవనుంది. ఈ ఏడాదే మెటావర్స్ దిశను మార్చేసే సంవత్సరమని నిపుణులు అంటున్నారు. వెబ్3 మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు మంచి డిమాండ్ రాబోతోంది. వాణిజ్య, వ్యాపార అవసరాలకు వెబ్ 3.0 ఉపయోగపడుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 90 వేల సంస్థలకు వెబ్ 3 ఉద్యోగులు అవసరమని నిపుణులు చెబుతున్నారు. వెబ్ 3.0 అనేది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) పరికరాలు, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్.. ఇలా రెండింటినీ మేళవిస్తూ అభివృద్ధి చెందిన టెక్నాలజీ. దీనిద్వారా క్రిప్టోకరెన్సీ, టోకనైజేషన్‌తో కూడిన బ్లాక్‌చెయిన్ ఆధారిత ఇంటర్నెట్ ప్రోగ్రామ్‌లను వేగవంతం చేయొచ్చు. ఇప్పటి నుంచే విద్యార్థులు దీనిపై పట్టు సాధిస్తే అంతర్జాతీయ కంపెనీలు రెడ్‌కార్పెట్ పరుస్తాయి. వెబ్ 3లో రస్ట్, సాలిడిటీ, మూవ్, సబ్‌స్ట్రేట్ వంటి లాంగ్వేజ్ కోర్సులు వచ్చాయి. భవిష్యత్తుని శాసించేవి ఇవే. కేవలం ఇంజనీరింగ్ విద్యార్థులే కాకుండా గ్రాడ్యుయేట్స్ సైతం వెబ్ 3 డెవలపర్స్‌గా శిక్షణ తీసుకోవచ్చు. తద్వారా మంచి ఉద్యోగాలు సాధించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. -
'ట్రెండ్స్' ఫెస్టివల్ సేల్,దుస్తులపై భారీ డిస్కౌంట్!
ఇండియా లార్జెస్ట్ ఫ్యాషన్ రీటైలర్ 'ట్రెండ్' ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త చెప్పింది. మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఉమెన్స్ వేర్‌పై డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. ట్రెండ్ షాపింగ్ పెస్టివల్ పేరిట నిర్వహించనున్న ఈ సేల్‌లో 10వేల రకాలైన మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఉమెన్స్ వేర్లు ఉన్నాయని ట్రెండ్ ప్రతినిధులు చెప్పారు. అంతేకాదు ఈ సేల్‌లో దుస్తులపై 50శాతం డిస్కౌంట్ అందిస్తామని వెల్లడించారు. సేల్‌లో దుస్తుల ధరల్ని తగ్గించడమే కాదు గిఫ్ట్, రివార్డ్, పాయింట్స్ సైతం పొందవచ్చని..ప్రత్యేకంగా మెన్ అండ్ ఉమెన్ దుస్తులు, యాక్ససరీస్ కొనుగోలు దారులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ట్రెండ్ ఓ ప్రకటనలో తెలిపింది. -
వాటితో డిజైన్.. ఇంటిని ప్యాలస్‌లా మార్చండి!
ఆకాశంలో విరిసే హరివిల్లుతో పాటు అక్కడ ఉండే మబ్బులు, తారలు, చందమామ.. అన్నీ మన ఇంటి రూఫ్ మీద కనువిందు చేస్తుంటే ఎంత అందంగా కనిపిస్తుందో కదా! ‘ఆ హంగులన్నీ ఏ ప్యాలెస్‌లోనో కనిపిస్తాయి.. మన ఇళ్లకు అంత సీన్ లేదు’ అని అనుకోనక్కర్లేదు. ఇప్పుడు ఆ ప్యాలెస్ స్టైల్ ట్రెండ్‌లోకి వచ్చేసింది. సీలింగ్ స్టిక్కర్‌తో మనిళ్లనూ అలా అలంకరించుకోవచ్చు. గది గదికో తీరు లివింగ్ రూమ్ గ్రాండ్‌గా కనిపించే స్టిక్కర్ డిజైన్స్‌లో అడవి అందాలు, వన్యమృగాలు, పువ్వుల చందాలతో సీలింగ్ సిత్రాలు కనువిందు చేస్తున్నాయి. బెడ్రూమ్లో చుక్కల ఆకాశాన్ని, సముద్రపు సొగసును దించేస్తున్నాయి. ఎలాంటి ఆర్భాటాలూ వద్దూ అనుకునేవారికి సింపుల్ చిత్రాలూ ఉన్నాయి. మది మెచ్చిన జోరు కార్లు, విమానాలు.. ఏవి కోరుకుంటే అవి సీలింగ్‌కి అతికించేసి ముచ్చట తీర్చేసుకునే రోజు వచ్చేసింది. లైట్లు ఆర్పేస్తే తళుక్కున చుక్కలు మెరిసేలా రూఫ్ డిజైన్ చేయించుకునేవారు ఇదివరకు. ఇప్పుడు ఇది కాస్త అడ్వాన్స్ అయ్యి ఏకంగా ఆకాశాన్నే ఇంటి పైకప్పుకు కట్టేసుకుంటున్నారు ఈ రూఫ్ స్టిక్కర్స్‌తో. సీలింగ్ ఆర్ట్ యాంటిక్ థీమ్‌నూ రూఫ్ మీద పరచవచ్చు. దాని కోసం ఎంపిక చేసుకున్న డిజైన్‌ను వాల్ ఆర్ట్‌లాగే రూఫ్ మీదా ఆర్ట్‌గా వేయించుకోవచ్చు. కార్టూన్ హుషారు పిల్లల బెడ్రూమ్లలో పాలపుంతనే కాదు కామిక్ రూపాలనూ కనువిందుగా డిజైన్ చేయించవచ్చు. ఇందుకు సులువైన ఎంపిక సీలింగ్ స్టిక్కర్సే! పిల్లలకు ఇష్టమైన కామిక్ క్యారెక్టర్లు, బొమ్మల చిత్రాలు, కార్ల జోరు.. వగైరా రూఫ్ పేపర్స్ జాబితాలో ఉన్నాయి. రూ.200 నుంచి లభించే ఈ సీలింగ్ స్టిక్కర్స్‌తో ఇంటి రూపాన్నే మార్చేయచ్చు. కొంచెం బోర్ కొట్టిన ఇంటి రొటీన్ డిజైన్ నుంచి ‘వావ్’ అనిపించేలా క్రియేట్ చేయచ్చు. -
సెల్ఫీ విత్ రంగోలి.. సంక్రాంతి ముగ్గుల పోటీలు
సంక్రాంతి పండుగ సందర్భంగా వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు ఆసక్తికరమైన పోటీలు పెడుతోంది రిలయన్స్ ట్రెండ్స్ సంస్థ. ఆంధప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని మెట్రోలు, జిల్లా కేంద్రాలతో పాటు మున్సిపాటీల్లో సైతం ఈ పోటీలు నిర్వహించాలని నిర్ణయించింది. ట్రెండ్స్ సెల్ఫీ విత్ రంగోలి పేరుతో నిర్వహించే ఈ పోట్లో ప్రజల్లు తమ ఇంటి ప్రాంగణంలో వేసిన రంగురంగు ముగ్గులతో ఓ సెల్ఫీ లేదా ఫోటో తీసుకోవాలి. ఆ సెల్ఫీలను ప్రత్యేకంగా కేటాయించిన వాట్సాప్ నంబరుకు పంపాలి. వాట్సాప్ నంబరును పాంప్లెట్ల ద్వారా స్థానికంగా తెలియజేస్తారు. ఈ పోటీలో మొదటి బహుమతిగా రూ. 1500 అందివ్వనున్నారు. అంతేకాదు పాల్గొన్న ప్రతీ ఒక్కరికి ట్రెండ్స్ డిస్కౌంట్ కూపన్ లభిస్తుంది. వీటిని సమీపంలోని ట్రెండ్స్ దుకాణంలో వినియోగించవచ్చు. ఈ పోటీ 2022 జనవరి 20న ముగుస్తుంది. మరిన్ని వివరాలకు సమీపంలోని ట్రెండ్స్ స్టోర్స్‌లో సంప్రదించాలని రిలయన్స్ సూచించింది. -
ట్రెండ్ మారింది గురూ; ఏం కావాలో మీరో చెప్పండి!
సాక్షి, తూర్పుగోదావరి: గతంలో ఎన్నికలంటే మంచి నాయకుడిని ఎన్నుకోవడం. ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రస్తుత ఎన్నికల్లో డబ్బు, మద్యం ఎవరు సరఫరా చేసినా వారి సభ్యత్వం రద్దు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో వార్డుల్లో సమస్యలు పరిష్కారంపై అభ్యర్తల నుంచి కచ్చతమైన హామీలు రాతపూర్వకంగా తీసుకోవాలని మున్సిపల్ ఓటర్లు భావిస్తున్నారు. మీ వార్డుకు ఏం కావాలో మీరో చెప్పండి’ అని అభ్యర్థులు చెబుతుంటే..ఏదిచ్చినా ముందే అంటున్నారు ఓటర్లు. నెగ్గకపోతే తర్వాత సంగతేమిటని అభ్యర్థులు అడుగుతుంటే ఒప్పంద పత్రాలు రాసుకుందాం అని ఓటర్లు బదులిస్తున్నారు. అభ్యర్థుల్లో ఎవరిని బలపర్యాలనే చర్య జరిగాక, అతడి నుంచి ఏ హామీ తీసుకోవాలి, ఏ పనులు చేయించుకోవాలన్న వాటిపై ఓటర్లు వార్డుల్లో సుదీర్ఘ చర్చలు సాగిస్తున్నారు. తమ ప్రాంతంలో గుడి కట్టాలని కొందరు, కుల సంఘాల భవనాలకు నిధులివ్వాలని మరికొందరు ఇలా తమకు తోచినట్లు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు రాతపూర్వక ఒప్పందాలుచేసుకుంటున్నారు. -
టిక్ టాక్కే ఫ్యూచర్
సోషల్ మీడియా అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ , వాట్సాప్ గ్రూపులు.. కానీ 2020లో మరో మాధ్యమం వీటన్నింటినీ అధిగమిస్తుందని అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. అదే టిక్ టాక్.. ఈ ఏడాదే టిక్ టాక్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చినా ఆ యాప్ డౌన్లోడ్లు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. 2019లో ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది చాలా చురుగ్గా అందులో వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న వారి సంఖ్య 150 కోట్లు దాటింది. టిక్‌టాక్ వినియోగదారుల్లో 41 శాతం మంది 25 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉన్నవారే. ఒకట్రెండు నిమిషాల్లోనే బోల్డంత వినోదాన్ని పంచే టిక్‌టాక్ ప్రాచుర్యంలోకి వచ్చింది. -
మెరుపు కలలే..
మార్కెట్లో పెట్టుబడి సాధనాలు ఎన్నిఉన్నా దేశీ మగువలు, మదుపుదారుల మనసంతా పసిడివైపే పరుగులు పెడుతుంది. ఆర్థిక మాంద్యాన్ని అధిగమించేందుకు, పెట్టుబడిపై నమ్మకమైన రాబడిని ఆర్జించేది మేలిమి బంగారమేనన్నది అటు ఇంతులు ఇటు ఇన్వెస్టర్ల మాట. స్టాక్ మార్కెట్ల అనిశ్చితి, అంతర్జాతీయ ఆటుపోట్లు, అమెరికా - చైనా ట్రేడ్ వార్ ఇలా సమస్యలు..సంక్షోభాలు 2019లో పసిడిని పరుగులు పెట్టించాయి. భవిష్యత్‌లో పసిడి బాటలు పరుచుకునేందుకు అందరూ బంగారం వెంటపడటంతో యల్లో మెటల్ గడిచిన ఏడాది హాట్ మెటల్‌గా మెరిసిపోయింది. డాలర్‌తో రూపాయి మారకం క్షీణించడంతో కూడా కనకం కాంతులీనింది. 2019లో స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులతోనే సాగడం, రియల్ ఎస్టేట్‌లో స్ధబ్ధతతో బంగారం మాత్రం మదుపరుల పసిడి కలలను పండించిందనే చెప్పాలి. ఈ ఏడాది బంగారం ఏకంగా దాదాపు 15 శాతంపైగానే రిటన్స్‌ను అందించి సత్తా చాటింది. అతివలకు అలంకారంగానే కాదు ఆపద సమయంలో ఆసరాగానూ తన మెరుపులకు ఢోకా లేదని స్పష్టం చేసింది. ఏడాది ఆరంభంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం గరిష్టంగా పదిగ్రాములకు రూ 33,650 పలుకగా ఏడాది చివరిలో ఏకంగా రూ 38,600కు ఎగబాకింది. బంగారం మెరిసిందిలా... గడిచిన ఏడాది ఎదురేలేకుండా పసిడి ప్రస్ధానం తళుకులీనింది. ఏడాది ఆరంభంలో పదిగ్రాములు రూ 33,650 పలికిన మేలిమి బంగారం అటుపై ఫిబ్రవరిలో రూ 34,060కి చేరి తన పరుగు పైపైకేనని చాటింది. మార్చిలో పరిమితంగానే పెరిగిన పసిడి ఏప్రిల్‌లో ఏకంగా రూ 2000 దిగివచ్చి రూ 32,310కి పడిపోయింది. మేలో కొద్దిగా కోలుకున్న బంగారం జూన్‌లో అమాంతం రూ 34,660కి ఎగబాకింది. ఇక అక్కడి నుంచి చుక్కలు చూసిన బంగారం ద్వితీయార్ధంలో ఆకాశమే హద్దుగా చెలరేగింది. ట్రేడ్‌వార్, ఉత్తర కొరియా అణుపరీక్షలు, అంతర్జాతీయ అలజడులతో పసిడి పట్టపగ్గాల్లేకుండా పరుగులు పెట్టింది. జులైలో రూ 35,400కు చేరిన బంగారం ధరలు ఆగస్ట్‌లో ఏకంగా రూ 38,950 పలికాయి. ఆల్‌టైం హై బంగారం ధరల పయనంలో సెప్టెంబర్ కీలక మైలురాయిగా మారింది. ఈ నెలలో పదిగ్రాముల పసిడి రూ 40,145 పలికి ఆల్‌టైం హైని తాకింది. అక అక్టోబర్‌లో ధరలు కొద్దిగా తగ్గి రూ. 38,880 పలికాయి. నవంబర్‌లో స్వల్పంగా పెరిగిన పసిడి రూ. 38,990కి చేరువైంది. రూ 50వేలకు చేరువయ్యే ఛాన్స్ ఇక కొత్త ఏడాదిలోనూ స్వర్ణ సోయగాలు కొనసాగవచ్చని భావిస్తున్నారు. భారత్, చైనాల్లో పసిడి వినియోగం పెరుగుతుండటంతో పాటు రూపాయి బలహీనంగా ఉండటం బంగారం మెరుపులకు కలిసివస్తుందనే అంచనా నెలకొంది. ట్రేడ్‌వార్ ముగిసిన సంకేతాలు వెల్లడవుతున్నా ఒప్పందంలో జాప్యం, అంతర్జాతీయ పరిణామాల్లో అనిశ్చితితో బంగారం సరికొత్త శిఖరాలకు చేరుతుందని నిపుణులు భావిస్తున్నారు. -
బంగ్లా ఎన్నికల్లో మళ్లీ హసీనా దూకుడు
ఢాకా : బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభ ఫలితాల్లో ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని పాలక అవామీ లీగ్ దూసుకుపోతోంది. హసీనా సారథ్యంలో మళ్లీ అవామీ లీగ్ విజయ ఢంకా మోగించే దిశగా సాగుతోంది. పాలక పార్టీ 144 స్ధానాల్లో ముందంజలో ఉండగా విపక్ష బీఎన్పీ కేవలం మూడు స్ధానాల్లోనే ఆధిక్యం కనబరుస్తోంది. జతియో పార్టీ ఒక స్ధానంలో ఆధిక్యంలో ఉంది. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంటకు విస్పష్ట ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కాగా,అవామీ లీగ్ ఇప్పటికే 19 స్ధానాల్లో విజయం సాధించింది. అంతకుముందు బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఆదివారం హింసాత్మక ఘటనల నడుమ ముగిసింది. ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసలో 13 మంది మర ణించారు. రాజ్షాహి, చిత్తగావ్, కుమిల్లా, కాక్స్‌బజార్ జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మరణించారు. ఇక బ్రమ్మణబెరియా, రంగమతి, నార్సిది, బొగుర, గజీపూర్, సిల్హెట్లో చెలరేగిన అల్లర్లలో ఒక్కరి చొప్పున మరణించారు. మృతుల్లో పాలక అవామీ లీగ్ కార్యకర్తలే అధికంగా ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. -
ర్యాంప్ జిగేల్
-
రైడ్ ఫర్ గ్రీన్
-
బ్యూటీ హంట్
-
ట్రెండ్స్‌కు అంబాసిడర్‌గా రానా
సాక్షి, హైదరాబాద్ : రిలయన్స్ రిటైల్‌లో దుస్తులు, ఉపకరణాల ప్రత్యేక విభాగమైన ట్రెండ్స్, తన బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా దగ్గుబాటిని నియమించుకున్నట్లు బుధవారం వెల్లడించింది. ఇందులో భాగంగా.. బేగంపేట్‌లోని ట్రెండ్స్ ఫ్లాగ్షిప్ స్టోర్‌లో ఫస్ట్‌లుక్ ప్రచారం ‘గెట్ దెమ్ టాకింగ్’ను ప్రదర్శించింది. మార్చి 1, 2018 నుంచి రానా ట్రెండ్స్ కొత్త టీవీ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగనున్నారు. ఈ సందర్భంగా రానా దగ్గుబాటి మట్లాడుతూ.. ట్రెండ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేయటం సంతోషంగా ఉందన్నారు. సామాన్య ధరలకే అద్భుతమైన ఫ్యాషన్స్ అందుబాటులో ఉంటుందన్నారు. ఇందులో ఫ్యాషన్ ఉత్పత్తులన్నీ ప్రత్యేకంగా అంతర్జాతీయ ట్రెండ్స్‌కు అనుగుణంగా ఉన్నాయని తెలిపారు. ట్రెండ్స్ మార్కెటింగ్ హెడ్, కపిల్ ఖట్టర్ మాట్లాడుతూ.. రానా దగ్గుబాటికి మంచి ప్రేక్షకాదరణ ఉందని, నటుడిగా అద్భుతమైన నటనా కౌశలం, వైవిధ్యం, ఫ్యాషన్ ఆయన సొంతమని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ట్రెండ్స్ ఫ్యాషన్ కేంద్రంగా మారిందనన్నారు. ట్రెండ్స్‌కు ఏపీ తెలంగాణాల్లో 60కి పైగా స్టోర్స్ ఉన్నాయని తెలిపారు. యువత అనుగుణంగా ట్రెండ్స్‌లో ఫ్యాషన్ ఉత్పత్తులను పొందుపరుస్తామని పేర్కొన్నారు. -
టాప్ ట్రెండ్స్ 2015
ఈ ఏడాదికి వీడ్కోలు పలికే సమయం ఆసన్నమవుతోంది. ఈ సందర్భంగా ట్విట్టర్ ఇండియా 2015 సంవత్సరంలో ట్విట్టర్ టాప్ ట్రెండ్స్‌ను, ఎక్కువగా రీట్వీట్ చేసిన ట్వీట్స్,మోస్ట్ పాపులర్ ట్వీట్లను వెల్లడించింది. చెన్నై వర్షాలు..వరదలు..పునరావాస, సహాయ కార్యక్రమాల నిర్వహరణ దగ్గర నుంచి ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు, మోదీ పిలుపిచ్చిన 'మేకిన్ ఇండియా'.ఇలా అనేక విషయాలు ట్విట్టర్ ట్రెండ్స్‌లో చోటు సంపాదించాయి. ఆ విశేషాలు తెలుసుకుందాం. గోల్డెన్ ట్వీట్..షారూఖ్దే గోల్డెన్ ట్వీట్ ఘనత బాలీవుడ్ బాద్షా షారూక్‌ఖాన్‌కు దక్కింది. లండన్‌లో జరిగిన ఏషియన్ అవార్డుల కార్యక్రమంలో షారూఖ్‌ఖాన్ ప్రముఖ ఇంగ్లిష్ గాయకుడు జైన్ మాలిక్‌తో సెల్ఫీ దిగి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనికి అత్యధికంగా 1,41,000పైగా రీట్వీట్స్, 18.3 మిలియన్ వ్యూస్, 2 లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి. ఏప్రిల్ 17న చేసిన ఈ ట్వీట్ గోల్డెన్ ట్వీట్‌గా నిలిచింది. కీ మూవ్మెంట్స్ ఇన్ ఇండియా ప్రజలపై ఎక్కువగా ప్ర భావం చూపించిన అంశాలు..ఎక్కువగా ప్రజలు భాగస్వాములై ట్వీట్లు చేసిన సందర్భాలు.. ♦ క్రికెట్ ప్రపంచ కప్‌లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లు-1.7 మిలియన్ ట్వీట్లు ♦ ఢిల్లీ ఎన్నికలు-10.8 మిలియన్ ట్వీట్లు ♦ దీపావళి శుభాకాంక్షలు-1.8 మిలియన్ ట్వీట్లు ♦ చెన్నై వర్షాలు(డిసెంబర్ 1 నుంచి 4వరకు కురిసిన వర్షాలు)-1.4 మిలియన్ ట్వీట్లు ♦ భారత స్వాతంత్య్ర దినోత్సవం-లక్ష ట్వీట్లు మోస్ట్ ఫాలోడ్ యూజర్స్ 'ఇయర్ ఇన్ ట్విట్టర్ 2015'నివేదిక ప్రకారం బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ 18.1 మిలియన్ల ఫాలోవర్లతో తొలిస్థానంలో ఉన్నారు. షారూఖ్ ఖాన్ 16.5 మిలియన్ల ఫాలోవర్లతో రెండోస్థానంలో నిలిచారు. ప్రధాని నరేంద్ర మోదీ 16.4 మిలియన్ల ఫాలోవర్లతో మూడోస్థానంలో ఉన్నారు. అమీర్‌ఖాన్, సల్మాన్ ఖాన్ వరసగా 15.5 మిలియన్లు, 15 మిలియన్ల ఫాలోవర్లతో నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. భారత్‌లో మోస్ట్ ఫాలోవుడ్ టాప్ టెన్ పర్సన్స్‌లో 9 ట్విట్టర్ అకౌంట్లు బాలీవుడ్ స్టార్లకు చెందినవే కావటం విశేషం. మోస్ట్ పాపులర్ హాష్‌ట్యాగ్ ట్రెండ్స్ ట్విట్టర్లో మోస్ట్ పాపులర్ హాష్‌ట్యాగ్ ట్రెండ్స్ క్రీడలు, వినోదం, రాజకీయం, సామాజిక కార్యక్రమాల మిశ్రమంగా ఉన్నాయి. ♦ ఐపీల్-9 మిలియన్ ట్వీట్లు ♦ సెల్ఫీవిత్డాటర్-3,75,000 ట్వీట్లు ♦ బిహార్ ఎన్నికల ఫలితాలు-2,60,000 ట్వీట్లు ♦ నరేంద్ర మోదీ ఏడాది పాలన-1,79,000 ట్వీట్లు ♦ దిల్వాలే దుల్హనియా లేజాయింగే సినిమాకు 20 ఏళ్లయిన సందర్భం-1,40,000 ట్వీట్లు అమెరికా బ్రాండ్ కాకుండా సొంతంగా ట్విట్టర్ ఇమోజీ పొందిన తొలి హ్యాష్‌ట్యాగ్ 'మేకిన్ ఇండియా' ప్రపంచవ్యాప్తంగా టాప్ ట్రెండ్స్ ట్విట్టర్ ఈ ఏడాదిని 'సంఘీభావ సంవత్సరం' గా పేర్కొంది. టర్కీ సముద్రతీరంలో శవమై పడిఉన్న..సిరియాకు చెందిన మూడేళ్ల బాలుడి చిత్రం ప్రపంచాన్ని కదిలించింది. సిరియా, ఇతర మధ్యప్రా చ్య దేశాల నుంచి వచ్చే శరణార్థులను యూరప్ దేశాల్లోకి అనుమతించాలంటూ అనేక మంది ప్రజలు చేసిన ట్వీట్లు..ట్విట్టర్లో ఎక్కువ చర్చిం చుకున్న అంశాల్లో నాలుగోస్థానంలో నిలిచింది. పారిస్‌పై ఉగ్రదాడి సంఘటన.. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్లో ఎక్కువగా చర్చించుకున్న విషయంగా నిలిచింది. అమెరికాలో జరిగిన 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్ మూవ్మెంట్' ట్విట్టర్లో ఎక్కువగా చర్చించుకున్న విషయాల్లో రెండోస్థానంలో నిలిచింది. అమెరికాలోని ఫెర్గూసన్, చార్లెస్టన్,బ్లాతిమోర్లలో పోలీసులు నల్లజాతీయులను కాల్చి చంపటంతో ఈ ఉద్యమం ప్రారంభమైంది. అమెరికాకు చెందిన 14ఏళ్ల బాలుడు అహ్మద్ మొహమ్మద్ అనే బాలుడు రూపొందిన హోమ్మేడ్ క్లాక్‌ను బాంబుగా భావించి స్కూలు పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అహ్మద్‌ను అరెస్ట్ చేశారు. 'ఐ స్టాండ్ విత్ అహ్మద్'అనే హ్యాష్‌ట్యాగ్‌లతో ప్రపంచం మొత్తం అహ్మద్‌కు మద్దతు పలికింది. చివరికి అధ్యక్షుడు ఒబామా స్పందించి. అహ్మద్‌ను వైట్‌హౌస్‌కు ఆహ్వానించారు. ఈ సంఘటన ఐదోస్థానంలో నిలిచింది. అమెరికా, ఐర్లాండ్‌లు స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేశాయి. ఈ విషయం ఎక్కువ మంది చర్చించిన అంశంగా మూడోస్థానంలో నిలిచింది. స్వలింగ సంపర్కుల విహహానికి సంబంధించిన చట్టాన్ని యూఎస్ సుప్రీం కోర్టు జూన్ 26న ధ్రువపరిచింది. ఇంగ్లండ్, కెనడా, ఇండియాలో జాతీయస్థాయిలో జరిగిన ఎన్నికలు..ట్వీట్లు, హ్యాష్‌ట్యాగ్‌లతో ట్విట్టర్ టైమ్ లైన్లను హోరెత్తించాయి. ఈ అంశం ఆరోస్థానంలో నిలిచింది. -
హైలైఫ్
ట్రెండ్స్‌ను అప్డేట్ చేసే హైదరాబాదీల కోసం హై ఎండ్ ఫ్యాషన్ స్టాప్ మాదాపూర్ నోవాటెల్‌లో కొలువుదీరింది. దేశవిదేశాల నుంచి తెచ్చిన వస్త్రాభరణాలు, గృహాలంకరణ వస్తువులు, డిజైనర్ వెడ్డింగ్ ఐటెమ్స్, ఫర్నిచర్ వంటివెన్నో బుధవారం ప్రారంభమైన ఈ ‘హైలైఫ్’ ఎక్స్‌పోలో ఆకర్షిస్తున్నాయి. అందాల నటి సంజన ఆధునిక డిజైనింగ్ చీరలో సరికొత్త కాంతులీనింది. బెంగళూరులో 15 కోట్ల రూపాయలతో నిర్మించుకున్న తన విలాసవంతమైన ‘డ్రీమ్ హోమ్’ కోసం ఇక్కడి స్టాల్స్‌లోని అపురూపాలను కొనుగోలు చేసింది. దిల్లీ, జైపూర్, రాజస్థాన్, లక్నో, కోల్‌కతా, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నైలకు చెందిన కళాకారుల చేతిలో రూపుదిద్దుకున్న ఖరీదైన కళాత్మక వస్తువులు ఇక్కడ మతిపోగొడుతున్నాయి. బంగారు పూత అద్దిన బుద్ధుడు, క్యాండిల్ హోల్డర్స్, ఫ్లవర్, జ్యువెలరీ బాస్కెట్లు, వాల్ హ్యాంగింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. శుక్రవారం వరకు ఎక్స్పో కొనసాగుతుంది. - సాక్షి, సిటీ ప్లస్ -
ఫ్యాన్సీ సూత్రం
ఫ్యాషన్ వరల్డ్‌లో ఎప్పటికప్పుడు నయా ట్రెండ్స్ వస్తుంటాయి.. పోతుంటాయి. తరాలు మారినా.. కాలాలు మారినా.. ఈ ట్రెడిషనల్ జ్యువెలరీ మాత్రం ఎప్పుడూ ఫ్రెష్‌గానే ఉంటుంది. దీని ప్రస్తావన లేకుండా పెళ్లికి ముందు జరిగే మాటాముచ్చట్లకు పరిపూర్ణత రాదు. ఈ నల్లపూసల హారానికి.. మాంగల్యబలాన్ని మరింత పెంచుతుందన్న క్రెడిట్ కూడా ఉంది. అందుకే బోషాణంలో బోలెడన్ని నగలున్నా.. మగువలు మాత్రం నల్లపూసల తర్వాతే మిగతావంటారు. నయా ఫ్యాషన్ వాకిట నిలిచిన ముదితలు.. పుస్తెల తాడు ప్లేస్‌ను కూడా నల్లపూసలతోనే భర్తీ చేస్తున్నారు. పెళ్లయిన ప్రతి అమ్మాయికి లీగల్ లెసైన్స్ మంగళసూత్రమే. పుస్తెలతాడు కనిపిస్తే చాలు ఆ పడతికి పతి ఉన్నాడని తెలిసిపోతుంది. అయితే కొత్త ట్రెండ్స్‌ను ఫాలో అవుతున్న ఈ తరం భార్యామణులు మంగళసూత్రాలకు బదులు నల్లపూసలు వేసుకుంటున్నారు. గతంలో ఏ పేరంటానికి వెళ్లినా.. హెవీ పట్టుచీరలు.. వాటిపైన లాంగ్ చైన్, చంద్రహారం, కాసుల పేరు, రవ్వల నెక్లెస్.. ఇలా స్వర్ణ కాంతులతో మెరిసిపోయేవారు. ఆ రోజులకు చెక్‌పెడుతూ.. సింపుల్‌గా ఉండే సూపర్బ్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. సంప్రదాయానికి కాస్త కలరింగ్ ఇచ్చి బ్లాక్ బీడ్‌స చెయిన్‌తో లాగించేస్తున్నారు. వెరైటీ బీట్స్ కొత్తగా హల్చల్ చేస్తున్న బ్లాక్ బీడ్‌స ఫ్యాషన్‌కు వేలాది ఇన్నోవేటివ్ డిజైన్లతో మరింత ఊపునిస్తున్నారు జ్యువెలరీ డిజైనర్లు. పచ్చలు, కెంపులు, కలర్ బీడ్‌స, ముత్యాలు, రత్నాలు, పగడాలు, సీ జేడ్స్ ఇలా వెరైటీలు జత చేసిన బ్లాక్ బీడ్‌స చెయిన్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. ఫంక్షనల్ వేరింగ్ కోసమే కాదు.. ఉద్యోగాలకు వెళ్లే అతివలకు నప్పే విధంగా క్లోస్డ్ నెక్ బ్లాక్ బీడ్‌స, రో బీడ్‌స, గసగసాల నల్లపూసలు, స్నేక్ స్కిన్ బ్లాక్ బీడ్‌స ఇలా రకరకాలుగా అందుబాటులో ఉన్నాయి. చెయిన్ సైజ్‌ను బట్టి లాకెట్లు ప్రిఫర్ చేస్తున్నారు మహిళలు. టెంపుల్ లాకెట్, డ్రాప్ లాకెట్, నేచురల్ స్టోన్ లాకెట్ ఇలా రకరకాలుగా దొరుకుతున్నాయి. నయా ట్రెండ్‌కు సలామ్ కొడుతున్న వనితలు.. లాకర్ల నిండా బంగారు ఆభరణాలు ఉన్నా.. గోల్డ్, ప్లాటినం కలగలిపిన నల్ల పూసలు ఒక్కటే వేసుకుని వెళ్లిపోతున్నారు. ఏజ్‌తో సంబంధం లేకుండా నల్లపూసల వెరైటీస్‌తో ముస్తాబవుతున్నారు. సింప్లీ సూపర్బ్.. ఈ తరహా బ్లాక్ బీడ్‌స చెయిన్లు ఈ మధ్య ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ప్లాటినం, గోల్డ్‌లోనే కాదు సెమీప్రీషియస్ జ్యువెలరీలో కూడా అనేక డిజైన్లు దొరుకుతున్నాయి. సింపుల్ బీడ్‌స ఉన్న షార్ట్ నల్లపూసల చెయిన్ల ధర వెయ్యి రూపాయల లోపే ఉంటుంది. మైక్రో గోల్డ్ ప్లేటెడ్ బ్లాక్ బీడ్‌స చెయిన్ అయితే ఎక్కువ కాలం రంగు మారకుండా ఉంటాయి. అయితే బ్లాక్ బీడ్‌స కలర్ షేడ్ కాకుండా ఉండాలంటే.. పర్ఫ్యూమ్, డియోస్ వాటిపై పడకుండా చూసుకోవాలి. వాటిని ప్లాస్టిక్ కవర్లో గానీ, కాటన్ బాక్స్‌లో కానీ జాగ్రత్త చేస్తే ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. - శ్రీకాంత్ సంధి రెడ్డి, కుందన జ్యువెలరీ -
కొత్త ప్రపంచం 2nd Nov 2014
-
దళిత కూలీ రామయ్య పోరాటం
ట్రెండ్లు పట్టించుకోకుండా, ఫార్ములాలకు దూరంగా తను నమ్మిన సిద్ధాంతంతో గత మూడు దశాబ్దాలుగా సినిమాలు చేస్తున్న ఏకైక కథానాయకుడు ఆర్. నారాయణమూర్తి. ఆయన చేసిన ‘అర్ధరాత్రి స్వతంత్రం’, ‘ఎర్ర సైన్యం’ సినిమాలు ఏడాదికి పైగా ప్రదర్శితమయ్యాయి. ‘చీమలదండు’ రజతోత్సవం జరుపుకొంది. ‘దండోరా, అడవి దివిటీలు, దళం, ఊరు మనదిరా’ తదితర చిత్రాలు శత దినోత్సవాలు జరుపుకొన్నాయి. ఇంకా ఆయన కెరీర్లో ఇలాంటివి ఎన్నో విజయాలు ఉన్నాయి. ఇన్ని విజయాలున్నా ఎప్పటికప్పుడు నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోయే ఆయన తీసిన తాజా సినిమా ‘రాజ్యాధికారం’. ఆయన నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ -‘‘ఆనాటి నుంచి ఈనాటి వరకూ దళితులు వెనుకబడటానికి కారణమేమిటనే నేపథ్యంలో ఈ సినిమా తీశాను. అధికారం కోసం కొందరు స్వార్థపూరిత రాజకీయ నాయకులు చేసే అకృత్యాలను ఇందులో ఎండగడుతున్నా. ఇందులో నేను దళిత కూలీ రామయ్య పాత్ర పోషించా. అతను చేసే పోరాటమే ఈ సినిమా. తనికెళ్ల భరణి, స్వర్గీయ నటి తెలంగాణ శకుంతల నెగిటివ్ రోల్స్ చేశారు. ఇందులోని ఏడు పాటలూ జనాదరణ పొందాయి’’ అని తెలిపారు.