2023లో డిమాండ్ ఎక్కువగా ఉండే ఉద్యోగాలు ఇవే.. | Top Trends And Predictions In Tech Hiring In 2023 | Sakshi
Sakshi News home page

2023లో డిమాండ్ ఎక్కువగా ఉండే ఉద్యోగాలు ఇవే..

Published Sun, Jan 1 2023 11:55 AM | Last Updated on Sun, Jan 1 2023 1:11 PM

Top Trends And Predictions In Tech Hiring In 2023 - Sakshi

గతేడాది లేఆఫ్స్‌, రిమోట్ వర్క్, మూన్‌లైటింగ్, క్వైట్ క్విట్టింగ్, కోవిడ్‌ వంటి అంశాలు జాబ్‌ మర్కెట్‌ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య ఈ కొత్త ఏడాదిలో ఏ జాబ్‌ చేస్తే బాగుంటుంది. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న కోర్సులేంటని తెలుసుకునేందుకు నెటిజన్లు ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో పలు సంస్థలు ట్రెండింగ్‌ జాబ్స్‌ గురించి ఆసక్తికరమైన నివేదికల్ని విడుదల చేశాయి. ఆ నివేదికల ప్రకారం.. 

ప్రతిచోటా ఏఐ
2023లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని సంస్థలు ఎక్కువగా ఉపయోగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా ఏఐ నిపుణులకు ఈ ఏడాది ఉద్యోగానికి ఢోకా ఉండదనే అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. ముఖ్యంగా కోడింగ్‌తో పనిలేకుండా డ్రాగ్-అండ్-డ్రాప్ ఇంటర్‌ఫేస్‌లు ఉపయోగించి ప్రొడక్ట్‌ సంబంధిత సేవల్ని అందించే వ్యాపార సంస్థల్లో వారికి జాబ్‌ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మెటావర్స్ 
మెటావర్స్ పరిచయం అక్కర్లేని టెక్నాలజీ. ఇంటర్నెట్ రాకతో ఇప్పటివరకు భౌతిక ప్రపంచంలోనే ఉండిపోయిన మనుషులను వర్చువల్ వరల్డ్​ను పరిచయం చేస్తుందీ మెటావర్స్. ఈ టెక్నాలజీ సాయంతో ఎక్కడో ఉన్న స్నేహితుల్ని, కుటంబసభ్యుల్ని వర్చువల్‌గా కలుసుకోవచ్చు. ఆడుకోవడం, మాట్లాడుకోవడం, పని చేసుకోవడం.. ఇలా అన్ని పనులూ వర్చువల్​గా, రియల్​టైమ్​లో ఒకరినొకరు చూస్తూ చేసుకోవచ్చు.  2030 నాటికి మెటావర్స్ $5 ట్రిలియన్‌ డాలర్లతో  ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నదన్నుగా నిలవనుంది. ఈ ఏడాదే మెటావర్స్ దిశను మార్చేసే సంవత్సరమని నిపుణులు అంటున్నారు. 

వెబ్3 
మెషిన్‌ లెర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కు మంచి డిమాండ్‌ రాబోతోంది. వాణిజ్య, వ్యాపార అవసరాలకు వెబ్‌ 3.0 ఉపయోగపడుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 90 వేల సంస్థలకు వెబ్‌ 3 ఉద్యోగులు అవసరమని నిపుణులు చెబుతున్నారు. వెబ్‌ 3.0 అనేది ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ) పరిక­రాలు, మెషిన్‌ లెర్నింగ్‌ అల్గారిథమ్స్‌.. ఇలా రెండింటినీ మేళవిస్తూ అభివృద్ధి చెందిన టెక్నాలజీ. దీనిద్వారా క్రిప్టోకరెన్సీ, టోకనైజేషన్‌తో కూడిన బ్లాక్‌­చెయిన్‌ ఆధారిత ఇంటర్‌నెట్‌ ప్రోగ్రామ్‌లను వేగవంతం చేయొచ్చు. ఇప్పటి నుంచే విద్యార్థులు దీనిపై పట్టు సాధిస్తే అంతర్జాతీయ కంపెనీలు రెడ్‌కార్పెట్‌ పరు­స్తాయి. వెబ్‌ 3లో రస్ట్, సాలిడిటీ, మూవ్, సబ్‌స్ట్రేట్‌ వంటి లాంగ్వేజ్‌ కోర్సులు వచ్చాయి. భవిష్యత్తుని శాసించేవి ఇవే. కేవలం ఇంజనీరింగ్‌ విద్యార్థులే కాకుండా గ్రాడ్యుయేట్స్‌ సైతం వెబ్‌ 3 డెవలపర్స్‌గా శిక్షణ తీసుకోవచ్చు. తద్వారా మంచి ఉద్యోగాలు సాధించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement