Web
-
ఫ్రాంచైజ్ బిజినెస్‌పై నాట్స్ వెబినార్ ఔత్సాహికులకు దిశా నిర్దేశం
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ప్రాంచైజ్ బిజినెస్‌పై ఆన్లైన్ వేదికగా వెబినార్ నిర్వహించింది. అమెరికాలో ఉండే తెలుగువారి ఆర్థిక భద్రతకు, స్వశక్తితో ఎదిగేందుకు కావాల్సిన సహకారాన్ని అందించే విధంగా నాట్స్ ఈ వెబినార్‌కు శ్రీకారం చుట్టింది. 250 మందికి పైగా తెలుగువారు పాల్గొన్న ఈ కార్యక్రమంలో న్యూజెర్సీలో ప్రముఖ వ్యాపారవేత్త, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ టి.పి.రావు ఈ వెబినార్‌లో ప్రాంచైజీ బిజినెస్ పై అవగాహన కల్పించారు. తక్కువ పెట్టుబడితో స్థిరమైన వ్యాపారం ప్రాంచైజెస్‌ల వల్ల సాధ్యమవుతుందని తెలిపారు. మార్కెట్ పై అవగాహన పెంచుకోవడం, సరైన ప్రాంతాలను, ప్రాంచెజ్ పెట్టే ప్రదేశాలను ఎంపిక చేసుకోవడంలోనే సగం విజయం దాగుందని టి.పి.రావు వివరించారు. మిగిలిన వ్యాపారాలతో పోలిస్తే ప్రాంచైజ్‌స్‌లతో రిస్క్ తక్కువగా ఉంటుందని, కానీ ప్రాంచైజ్ ప్రారంభించిన తొలినాళ్లలో దాని నిర్వహణ, వ్యవస్థాగతంగా దాన్ని బలోపేతం చేయడంపై పూర్తిస్థాయిలో దృష్టి నిలిపితే చక్కటి లాభాలు ఉంటాయని తెలిపారు. ప్రాంచైజ్‌స్ పై అవగాహన కల్పించడంతో పాటు ప్రాంచైజస్ ఏర్పాటు తన వంతుగా చేతనైన సహకారం అందిస్తానని టి.పి. రావు వెబినార్‌లో పాల్గొన్న వారికి హామీ ఇచ్చారు. సమయం, ధనం వెచ్చించి పట్టుదలతో ముందుకు వచ్చే ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ప్రాంచైజస్ చక్కటి మార్గమని తెలిపారు. ఈ వెబినార్‌కు నాట్స్ నేషనల్ మార్కెటింగ్ కో ఆర్డినేటర్ కిరణ్ మందాడి అనుసంధానకర్తగా వ్యవహరించారు. చాలా మంది ఔత్సాహికులు ప్రాంచైజ్ నిర్వహణ, ప్రాంచైజస్ బిజినెస్‌లో వచ్చే ఇబ్బందుల గురించి తమ సందేహాలను టి.పి.రావుని అడిగి నివృత్తి చేసుకున్నారు. ప్రస్తుత యూఎస్ గవర్నమెంట్లోఉద్యోగుల డోలాయమాన పరిస్థితుల్లో ఇటువంటి వెబినార్స్ యువతకు ఎంతో సహాయకారకం గా ఉంటాయని నాట్స్ ఎక్సిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి, బోర్డ్ డైరెక్టర్ చెబుతూ టి.పి.రావు ను అభినందించారు. ఆన్లైన్ ద్వారా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందు టి.పి.రావు,కిరణ్ మందాడిలను నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేకంగా అభినందించారు.(చదవండి: డల్లాస్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు) -
ముగ్గురు మిత్రుల ముచ్చటైన విజయం
‘కాలంతో పాటు నడవాలి’ అంటారు పెద్దలు.‘కాలంతో పాటు నడుస్తూనే భవిష్యత్‌పై ఒక కన్ను వేయాలి’ అంటారు విజ్ఞులు. అభిషేక్ అనిత, అపూర్వ్ కుషాల్, సంభవ్ జైన్... అనే ముగ్గురు మిత్రులు రెండో కోవకు చెందిన దార్శనికులు. లెర్న్ అండ్ ఎర్న్ ప్లాట్‌ఫామ్ ‘ఇంట్రాక్ట్’తో వెబ్3 వరల్డ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు... ఐటీఐ–దిల్లీలో చదువుకున్న అభిషేక్ అనిత, అపూర్వ్ కుషాల్, సంభవ్ జైన్ సంభాషణాల్లో సరదా విషయాల కంటే సాంకేతిక విషయాలే ఎక్కువగా చోటు చేసుకునేవి. బ్లాక్ చెయిన్ టెక్నాలజీని మొదటిసారిగా ఎప్పుడు ఉపయోగించారు? వివిధ దేశాల్లో ఈ టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారు? ఏ రంగాలలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు? మన దేశంలో క్రిప్టో కరెన్సీపై పెట్టుబడులు, ఇంటర్నెట్ అభివృద్ధిలో మూడు ప్రధాన దశలు, వెబ్3 టెక్నాలజీతో అపారమైన ఉద్యోగావకాశాలు...ఇలా ఒకటా రెండా బ్లాక్‌చైన్, క్రిప్టో టెక్నాలజీ, వెబ్3 టెక్నాలజీ గురించి గంటల తరబడి మాట్లాడుకునేవారు. వారు మాట్లాడుకున్న విషయాలేవి వృథా పోలేదు.‘ఇంట్రాక్ట్’ ప్లాట్‌ఫామ్‌కు పునాదిగా ఉపయోగపడ్డాయి.ప్రజలకు బ్లాక్ చెయిన్, క్రిప్టో టెక్నాలజీని చేరువ చేయాలనే లక్ష్యంతో 2022లో ‘ఇంట్రాక్ట్’ అనే స్టార్టప్ స్టార్ట్ చేశారు ముగ్గురు మిత్రులు. ‘వెబ్3 టెక్నాలజీకి సంబంధించి కేవలం సమాచార వేదికగానే కాకుండా ప్రతిఫలదాయక వేదికగా ఇంట్రాక్ట్ని నిర్మించాం. లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ అనేది ఇంట్రాక్ట్ లక్ష్యం. క్వెస్ట్, ఇంటరాక్టివ్ టాస్కుల ద్వారా బ్లాక్ చెయిన్, క్రిప్టో, వెబ్3 టెక్నాలజీతో యూజర్లను ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం’ అంటున్నాడు కో–ఫౌండర్ అభిషేక్.సంక్లిష్టమైన రీతిలో కాకుండా ఫన్ అండ్ ఇంటరాక్టివ్ పద్ధతిలో కొత్త ప్రాడక్టులు, సర్వీసులను యూజర్లకు పరిచయం చేయడంలో ‘ఇంట్రాక్ట్’ విజయం సా«ధించింది. టాస్క్‌లను విజయవంతంగా పూర్తి చేసిన యూజర్లకు క్రిప్టో, ఎన్ఎఫ్టీ, లాయల్టీ పాయింట్స్ రూపంలో ప్రోత్సాహకాలు’ అందిస్తోంది. ఎన్నో కలలతో ముగ్గురు మిత్రులు ‘ఇంట్రాక్ట్’ను ప్రారంభించారు. ఆ కలలకు కష్టాన్ని జోడించారు. ఆ కష్టం వృథా పోలేదు. లక్షలాది యూజర్లతో ‘ఇంట్రాక్ట్’ వెబ్3 వరల్డ్‌లో కీలక పాత్ర పోషిస్తూప్రాఫిటబుల్ ప్లాట్‌ఫామ్‌గా ఎదిగింది. ‘ఇంట్రాక్ట్’ ఇన్వెస్టర్లలో ఆల్ఫా వేవ్ గ్లోబల్, గుమీ క్రిప్టోస్, ఆల్కెమీ, మూన్ పే, వెబ్ 3 స్టూడియోస్, కాయిన్ బేస్...మొదలైన కంపెనీలు ఉన్నాయి. సమీకరించిన నిధులలో కొంత మొత్తాన్ని తమ టీమ్ సభ్యుల సంఖ్యను రెట్టింపు చేయడానికి, సాంకేతిక అవసరాలకు ఉపయోగించారు. సాధించిన విజయంతో సంతృప్తి పడడం లేదు ముగ్గురు మిత్రులు. భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. వెబ్3 టెక్నాలజీపై మార్కెటింగ్ నిపుణులు, కంపెనీల ఫౌండర్లు దృష్టి పెట్టారు. మరో వైపు ఉద్యోగావశాలు లేదా ఆవిష్కరణల కోణంలో యువతరం ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో పోటీగా ఎన్నో కంపెనీలు మార్కెట్లోకి రావచ్చు. వాటిని తట్టుకొని ముందుకు వెళ్లాలంటే ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాల గురించి ఆలోచించాలనేది ముగ్గురు మిత్రులకు తెలియని విషయం కాదు.‘వెబ్3 క్రియేట్ చేసిన సరికొత్త ఆర్థిక అవకాశాలు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థల గురించి పరిచయం చేసి యూజర్లకు ఉపయోగపడాలనేది మా లక్ష్యం’ అంటున్నాడు సంస్థ కో–ఫౌండర్, సీయీవో సంభవ్ జైన్. -
వెబ్3తో భారత్‌లో భారీగా కొలువులు.. భారీ వేతనాలకు ఆస్కారం!
న్యూఢిల్లీ: బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారిత కొత్త తరం వెబ్3 రంగంతో భారత్‌లో ఉపాధి కల్పనకు ఊతం లభించగలదని మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సేవల సంస్థ ప్రైమస్ పార్ట్నర్స్ ఒక నివేదికలో తెలిపింది. దీని వల్ల భారీ వేతనాలు లభించేందుకు ఆస్కారమున్న 20 లక్షల పైచిలుకు కొలువులు రాగలవని పేర్కొంది. ప్రస్తుతం దేశీయంగా వెబ్3 రంగంలోని 900 పైగా సంస్థలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని వివరింంది. 2022లో మొత్తం వెబ్3 డెవలపర్ కమ్యూనిటీలో మన వాటా 11 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. సరఫరా వ్యవస్థ నిర్వహణ, ఆరోగ్య సేవల్లో గోప్యత, విద్య, వోటింగ్ సిస్టమ్స్, ఐడెంటిటీ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో ఇది ఉపయోగపడుతోందని వివరింంది. దీన్ని బాధ్యతాయుతంగా అనుసంధానం చేయగలిగితే పరిశ్రమల ముఖచిత్రం మారిపోగలదని ఈ నివేదికలో ప్రైమస్ పార్ట్నర్స్ పేర్కొంది. వెబ్ 3.0 అనేది ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఒక టెక్నాలజీ, వెబ్ 1.0 నుంచి వెబ్ 2.0కి పురోగతి చెందటానికి పది సంవత్సరాల సమయం పట్టినట్లు తెలిసింది. ఇప్పడు వెబ్ 3.0 పూర్తిగా డెవలప్ కావడానికి అంతకంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో భారీ కొలువులు లభిస్తాయని స్పష్టమవుతోంది. వెబ్ 3.0 వల్ల మెరుగైన అనుభవాలు, డేటా భద్రత, గొప్ప ఆర్థిక అవకాశాలు వంటి అనేక ప్రయోజనాలను తెస్తుందని అంచనా వేస్తున్నారు. వీటి వల్ల వినియోగదారుల డేటా చాలా పటిష్టంగా ఉంటుంది. అయితే ఈ టెక్నాలజీ ఉపయోగించడానికి కొన్ని సాంకేతికలు నేర్చుకోవాల్సి ఉంటుంది. -
వచ్చేస్తుంది వెబ్ 3.0.. 2023 చివరికల్లా తుదిరూపం..! ఏం జరగబోతోంది?
దొడ్డ శ్రీనివాస్‌రెడ్డి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ (వరల్డ్ వైడ్ వెబ్) ఇంటర్నెట్ ప్రపంచానికి గుర్తింపు కార్డు. వెబ్ మొదలైనప్పటికీ ఇప్పటికీ పోలికే లేనంతగా మారిపోయింది. చదవడానికి, రాయడానికి, సమాచారాన్ని పంచుకోవడానికి వేదిక అయిన ఈ వెబ్ త్వరలో మరో అవతారం ఎత్తబోతోంది. మరింత స్వేచ్ఛాయుతంగా, ఆంక్షలులేని, అనుమతులు అవసరంలేని సరికొత్త వెబ్ ఆవిష్కృతం కాబోతోంది. వెబ్ పరిణామ క్రమాన్ని మూడు అంచెలుగా చెప్తున్నారు. తొలినాటి వెబ్‌ను వెబ్ 1.0గా, ప్రస్తుతం నడుస్తున్నదాన్ని వెబ్ 2.0గా రాబోయేదానిని వెబ్ 3.0గా పిలుస్తున్నారు. దీనిని సినిమాలతో పోలిస్తే.. వెబ్ 1.0 అంటే బ్లాక్ అండ్ వైట్ సినిమా అయితే వెబ్ 2.0 రంగుల చిత్రం, అదే వెబ్ 3.0 ఏకంగా త్రీడీ సినిమా అనుకోవచ్చు. మరి వెబ్ పుట్టు పూర్వోత్తరాలు, దాని పరిణామం, రాబోయే రోజుల్లో ఏ విధంగా మారబోతున్నదో తెలుసుకుందాం. వెబ్ 3.0 సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి నిరంతరంగా సాగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే వెబ్ 3.0 తెరపైకి వస్తోంది. ఇది ఎప్పుడు మొదలవుతుందో కచ్చితంగా చెప్పలేకున్నా.. ప్రస్తుత పరిణామాల ఆధారంగా 2023 చివరికల్లా వెబ్ 3.0 ఒక రూపుదాల్చుతుందని సాంకేతిక పరిజ్ఞాన నిపుణుల అంచనా. ఎవరి నియంత్రణ అవసరం లేకుండా బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఆధారంగా రూపొందిన క్రిప్టోకరెన్సీలే వెబ్ 3.0కు తొలి అడుగుగా వారు చెప్తున్నారు. గత వెబ్ వెర్షన్లకు రాబోయే 3.0కు ఉన్న ప్రాథమిక వ్యత్యాసం ఏమిటంటే.. రాబోయేది నియంత్రణలు లేని స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేయడమే. వెబ్ 3.0 మౌలిక నిర్మాణంలో పెద్దగా మార్పు లేకపోయినా.. నూతన సాంకేతిక పరిజ్ఞానాల కారణంగా దీని స్వభావాలు సమూలంగా మారబోతున్నాయి. ప్రస్తుతం వెబ్ వివిధ కంపెనీల నియంత్రణలో నడుస్తుండగా.. వెబ్ 3.0 పూర్తి స్వేచ్ఛా వాతావరణంలో పనిచేయబోతోంది. దీనికోసం బ్లాక్ చైన్ టెక్నాలజీతోపాటు కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషీన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీలు వెబ్‌కు జత అవుతున్నాయి. ప్రస్తుతం ఒకటి లేదా రెండు సర్వర్ల ఆధారంగా ఇంటర్నెట్ సమాచార మార్పిడి జరుగుతోంది. వీటిపై కార్పొరేషన్లు, ప్రభుత్వాల నియంత్రణ ఉంటోంది. సమాచార మార్పిడి ఐపీ అడ్రస్‌ల ఆధారంగా జరుగుతోంది. వీటికి అనుమతించడం, నియంత్రించడం ఆయా సర్వర్లపై పెత్తనం ఉన్న కంపెనీలు, ప్రభుత్వాలకే ఉంది. రాబోయే వెబ్ 3.0 సరికొత్త ఈ నియంత్రణలకు లొంగకుండా పనిచేస్తుంది. కంపెనీలు, ప్రభుత్వాల ఆధారంగా కాకుండా వినియోగించే వారి నియంత్రణలో పనిచేసే విధంగా ఉంటుంది. యూజర్ కోరే సమాచారాన్ని కృత్రిమమేధ ద్వారా ప్రపంచంలో ఏ సర్వర్‌లో ఉన్నా తీసుకునే హక్కు రాబోతోంది. వెబ్ 1.0 యూరప్ పరిశోధన సంస్థ ‘సెర్న్’లో కంప్యూటర్ సైంటిస్టుగా పనిచేసిన బెర్నర్స్‌లీ 1990లో వెబ్‌ను రూపొందించారు. వెబ్‌కు అవసరమైన ప్రాథమిక సాంకేతిక పరిజ్ఞానమైన హెచ్‌టీఎంఎల్, యూఆర్ఎల్, హెచ్టీటీపీల రూపకర్త బెర్నర్స్‌లీ. తొలి వెబ్‌పేజీని కూడా ఆయనే ఆవిష్కరించారు. తొంబై దశకం మొత్తంగా సాగిన ఈ తొలినాటి వెబ్‌లో కేవలం ఒక కంప్యూటర్ నుంచి మరో కంప్యూటర్‌కు వెబ్ పేజీల ద్వారా సమాచారం పంపడానికి మాత్రమే వీలయ్యేది. నెట్‌స్కేప్ వంటి వెబ్బ్రౌజర్ల ద్వారా ఈ–మెయిల్స్ పంపుకొనేవారు. ఇంటర్నెట్లో చాలా పరిమితంగా సమాచారం అందుబాటులో ఉండేది. రీడ్ఓన్లీగా పిలిచే ఈ వెబ్ 1.0 దాదాపుగా 1990లో మొదలై 2004 వరకు సాగింది. వెబ్ 1.0 చివరి రోజుల్లో క్రమంగా రూపాంతరం చెందుతూ వెబ్ 2.0 ఆవిర్భావానికి బాటలు వేసింది. వెబ్ 2.0 ప్రస్తుతం మనకు సుపరిచయమైన వెబ్ వెర్షన్ ఇది. తొలినాటి వెబ్‌కు ఏమాత్రం పోలికలేని స్థాయిలో మార్పు చెంది వెబ్ 2.0గా రూపుదాల్చింది. స్థిరమైన వెబ్ నుంచి అత్యంత వేగవంతమైన క్రియాశీల అప్లికేషన్‌గా అవతరించింది. చదవడానికి పరిమితమైన వెబ్‌పేజీల నుంచి చదవడం, రాయడం, పరస్పరం సంభాషించుకోగలడం వంటివాటికి వేదికైంది. అపార జ్ఞాన సంపదకు భాండాగారంగా మారింది. సోషల్ మీడియా నుంచి డిజిటల్ కరెన్సీ వరకు అన్ని రంగాలను ప్రభావితం చేసింది. యూట్యూబ్, ఫేస్బుక్, ఫ్లిక్కర్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్ వంటి అనేకానేక సోషల్ మీడియా వెబ్సైట్లకు వెబ్ 2.0 పునాది అయింది. సమస్త సమాచారాన్ని ముంగిటకు తెచ్చి.. ప్రపంచ ప్రజల జీవనశైలినే మార్చేసింది. ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం వంటి అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. క్రిప్టోకరెన్సీ వంటి డిజిటల్ కరెన్సీ చలామణీలోకి రావడానికి కూడా వెబ్ 2.0 తోడ్పడింది. వినోద రంగంలో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ లాంటి వేల ఓటీటీ చానెల్స్, స్ట్రీమింగ్ సైట్ల పుట్టుకకు ఆస్కారం కల్పించింది. వెబ్ సాంకేతిక పరిజ్ఞానాలైన హెచ్‌టీఎంఎల్5, సీఎస్ఎస్3, జావా స్క్రిప్ట్ ఆధారంగా రోజురోజుకు కొత్త ఆవిష్కరణలతో గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ వంటి వందల కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యాల సృష్టిని సాకారం చేసింది. ఇప్పుడు బ్లాక్ చైన్ టెక్నాలజీతో 2.0 మరో అవతారం ఎత్తడానికి సమాయత్తం అవుతోంది. కచ్చితత్వం దిశగా.. ఈ సరికొత్త సాంకేతికత వల్ల వినియోగదారుడికి కచ్చితమైన సమాచారం అందే అవకాశాలు పెరగనున్నాయి. యూజర్ ఏదైనా సమాచారం కొరితే.. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రత్యక్ష, పరోక్ష అంశాలన్నీ అందుబాటులోకి వస్తున్నాయి. ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో నిర్ణయించుకునే ఆస్కారం లేకుండాపోతోంది. ఇక మీద ఏదైనా సమాచారం కోరినప్పుడు వెబ్ 3.0లోని కంప్యూటర్ సమాచారం కోరిన నేపథ్యాన్ని కూడా అర్థం చేసుకుని, వాస్తవికతను జోడించి అవసరమైన మేరకే కచ్చితమైన సమాచారాన్ని అందించగలుగుతుంది. ఇక ముందు కంపెనీలన్నీ ఈ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలను పొందుపర్చగల కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఉత్పత్తులను తీసుకురానున్నాయి. ఈ పరిజ్ఞానం ఆధారంగా పనిచేయబోయే యాప్‌లను కూడా డీయాప్స్ (డీసెంట్రలైజ్డ్ యాప్స్)గా పిలవబోతున్నారు. ఏం జరగబోతోంది? ►వెబ్ 3.0 యుగంలో మనకు నియంత్రిత సమాచారం నుంచి విముక్తి లభిస్తుంది. కోరుకున్న సమాచారం కచ్చితత్వంతో, ఎవరి ప్రమేయానికి లోనవకుండా అందుబాటులోకి వస్తుంది. మన వ్యక్తిగత వివరాలపై ఎవరి నియంత్రణ ఉండబోదు. విస్తృతమైన డేటా బేస్ ఉన్న ఫేస్బుక్, గూగుల్ వంటి కంపెనీలు ఇకముందు ఆ డాటాబేస్‌పై నియంత్రణ కోల్పోతాయి. ►కొత్త వెబ్‌లోని సమాచారంపై ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థలకు నియంత్రణ సాధ్యం కాదు. ప్రభుత్వ సెన్సార్షిప్లు పనిచేయవు. ఇప్పటికే సైబర్ క్రైంను అదుపు చేయడానికి అష్టకష్టాలు పడుతున్న పోలీసు వ్యవస్థకు దీనితో మరిన్ని కష్టాలు వచ్చే అవకాశముంది. ►డిజిటల్ సమాచారానికి సంబంధించిన ఆయా దేశాల చట్టాలను అమలు చేయడం కూడా సాధ్యం కాదు. ఇదివరకు కొన్ని సర్వర్ల ద్వారా సమాచార మార్పిడి జరిగేది. వాటి నియంత్రణ ద్వారా ప్రభుత్వాలు, పోలీసులు, కోర్టులు చట్టాలను అమలు చేయగలిగేవి. కొత్త వెబ్‌లో సమాచారం అనేక కేంద్రాల నుంచి లభించడం వల్ల.. దానిపై పెత్తనం అసాధ్యంగా మారబోతోంది. మారబోయే సరికొత్త సాంకేతిక వాతావరణంలో ప్రభుత్వాలు, చట్టాలను అమలు చేసే వ్యవస్థలు తమ పంథా మార్చుకోవలసిన పరిస్థితి రానుంది. -
2023లో డిమాండ్ ఎక్కువగా ఉండే ఉద్యోగాలు ఇవే..
గతేడాది లేఆఫ్స్, రిమోట్ వర్క్, మూన్‌లైటింగ్, క్వైట్ క్విట్టింగ్, కోవిడ్ వంటి అంశాలు జాబ్ మర్కెట్‌ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య ఈ కొత్త ఏడాదిలో ఏ జాబ్ చేస్తే బాగుంటుంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులేంటని తెలుసుకునేందుకు నెటిజన్లు ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో పలు సంస్థలు ట్రెండింగ్ జాబ్స్ గురించి ఆసక్తికరమైన నివేదికల్ని విడుదల చేశాయి. ఆ నివేదికల ప్రకారం.. ప్రతిచోటా ఏఐ 2023లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని సంస్థలు ఎక్కువగా ఉపయోగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా ఏఐ నిపుణులకు ఈ ఏడాది ఉద్యోగానికి ఢోకా ఉండదనే అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. ముఖ్యంగా కోడింగ్‌తో పనిలేకుండా డ్రాగ్-అండ్-డ్రాప్ ఇంటర్‌ఫేస్‌లు ఉపయోగించి ప్రొడక్ట్ సంబంధిత సేవల్ని అందించే వ్యాపార సంస్థల్లో వారికి జాబ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మెటావర్స్ మెటావర్స్ పరిచయం అక్కర్లేని టెక్నాలజీ. ఇంటర్నెట్ రాకతో ఇప్పటివరకు భౌతిక ప్రపంచంలోనే ఉండిపోయిన మనుషులను వర్చువల్ వరల్డ్‌ను పరిచయం చేస్తుందీ మెటావర్స్. ఈ టెక్నాలజీ సాయంతో ఎక్కడో ఉన్న స్నేహితుల్ని, కుటంబసభ్యుల్ని వర్చువల్‌గా కలుసుకోవచ్చు. ఆడుకోవడం, మాట్లాడుకోవడం, పని చేసుకోవడం.. ఇలా అన్ని పనులూ వర్చువల్‌గా, రియల్‌టైమ్‌లో ఒకరినొకరు చూస్తూ చేసుకోవచ్చు. 2030 నాటికి మెటావర్స్ $5 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నదన్నుగా నిలవనుంది. ఈ ఏడాదే మెటావర్స్ దిశను మార్చేసే సంవత్సరమని నిపుణులు అంటున్నారు. వెబ్3 మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు మంచి డిమాండ్ రాబోతోంది. వాణిజ్య, వ్యాపార అవసరాలకు వెబ్ 3.0 ఉపయోగపడుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 90 వేల సంస్థలకు వెబ్ 3 ఉద్యోగులు అవసరమని నిపుణులు చెబుతున్నారు. వెబ్ 3.0 అనేది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) పరికరాలు, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్.. ఇలా రెండింటినీ మేళవిస్తూ అభివృద్ధి చెందిన టెక్నాలజీ. దీనిద్వారా క్రిప్టోకరెన్సీ, టోకనైజేషన్‌తో కూడిన బ్లాక్‌చెయిన్ ఆధారిత ఇంటర్నెట్ ప్రోగ్రామ్‌లను వేగవంతం చేయొచ్చు. ఇప్పటి నుంచే విద్యార్థులు దీనిపై పట్టు సాధిస్తే అంతర్జాతీయ కంపెనీలు రెడ్‌కార్పెట్ పరుస్తాయి. వెబ్ 3లో రస్ట్, సాలిడిటీ, మూవ్, సబ్‌స్ట్రేట్ వంటి లాంగ్వేజ్ కోర్సులు వచ్చాయి. భవిష్యత్తుని శాసించేవి ఇవే. కేవలం ఇంజనీరింగ్ విద్యార్థులే కాకుండా గ్రాడ్యుయేట్స్ సైతం వెబ్ 3 డెవలపర్స్‌గా శిక్షణ తీసుకోవచ్చు. తద్వారా మంచి ఉద్యోగాలు సాధించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. -
ప్రపంచవ్యాప్తంగా ఈ విద్యార్థులకు డిమాండ్.. అత్యధిక వేతనాలు వారికే..
సాక్షి, విశాఖపట్నం: ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికప్పుడు సాంకేతిక రంగంలో అత్యాధునిక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఇంటర్నేషనల్ బ్లాక్‌చెయిన్ కాంగ్రెస్ (ఐబీసీ) ఫౌండర్ అభిషేక్ పిట్టి తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ మూడో తరంగా పిలుచుకునే వెబ్ 3.0లో అపార అవకాశాలున్నాయన్నారు. మెషిన్ లెర్నింగ్, కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)కు మంచి డిమాండ్ రాబోతోందన్నారు. వాణిజ్య, వ్యాపార అవసరాలకు వెబ్ 3.0 ఉపయుక్తమవుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 90 వేల సంస్థలకు వెబ్ 3 ఉద్యోగులు అవసరమని వెల్లడించారు. అంతర్జాతీయ సంస్థలైన పోల్కాడాట్, అవలాంచ్, ఆప్టాస్ మొదలైన సంస్థలు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయని వివరించారు. ఏడాదికి వెబ్ 3 ఇంజనీర్లు కనీసం 80 వేల డాలర్ల వరకు సంపాదించవచ్చన్నారు. ప్రస్తుతం ఐటీ సంస్థల్లో వీరికే అత్యధిక వేతనాలు ఇస్తున్నారని తెలిపారు. వెబ్ 3.0 ఇంజనీర్ల కొరత ఎక్కువగా ఉండటంతో విద్యార్థులకు ఇది మంచి అవకాశమన్నారు. విద్యార్థుల భవిష్యత్తుపై రాష్ట్ర ప్రభుత్వానికి మంచి విజన్ ఉందని చెప్పారు. అందుకే రాష్ట్రంలో 20 వేల మంది విద్యార్థులకు వెబ్ 3.0లో నైపుణ్య శిక్షణతోపాటు హ్యాకథాన్ ద్వారా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. విశాఖపట్నం గాయత్రి ఇంజనీరింగ్ కాలేజీలో ఐబీసీ హ్యాక్‌ఫెస్ట్ చాలెంజ్ సదస్సు ప్రారంభం సందర్భంగా ‘సాక్షి’తో అభిషేక్ పిట్టి పలు విషయాలను పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. భవిష్యత్తుని శాసించేవి ఇవే.. వెబ్, వెబ్ 1.0 నుంచి వెబ్ 2.0కి మారడానికి 10 ఏళ్లకు పైగా పట్టింది. ఇప్పుడు వెబ్ 3.0 అమలు చేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. వెబ్ 3.0 అనేది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) పరికరాలు, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్.. ఇలా రెండింటినీ మేళవిస్తూ అభివృద్ధి చెందిన సాంకేతికత. దీనిద్వారా క్రిప్టోకరెన్సీ, టోకనైజేషన్‌తో కూడిన బ్లాక్‌చెయిన్ ఆ«ధారిత ఇంటర్నెట్ ప్రోగ్రామ్‌లను వేగవంతం చేయొచ్చు. దీన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు మరికొంత సమయం పడుతుంది. అయినప్పటికీ వెబ్ 3.0కి ప్రపంచవ్యాప్తంగా మంచి అవకాశాలున్నాయి. ఇప్పటి నుంచే విద్యార్థులు దీనిపై పట్టు సాధిస్తే అంతర్జాతీయ కంపెనీలు రెడ్‌కార్పెట్ పరుస్తాయి. వెబ్ 3లో రస్ట్, సాలిడిటీ, మూవ్, సబ్‌స్ట్రేట్ వంటి లాంగ్వేజ్ కోర్సులు వచ్చాయి. భవిష్యత్తుని శాసించేవి ఇవే. కేవలం ఇంజనీరింగ్ విద్యార్థులే కాకుండా గ్రాడ్యుయేట్స్ సైతం వెబ్ 3 డెవలపర్స్‌గా శిక్షణ తీసుకోవచ్చు. తద్వారా మంచి ఉద్యోగాలు సాధించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. యువతకు అంతర్జాతీయ నైపుణ్యాలు క్రిప్టో కరెన్సీ, ఆన్లైన్ ఎడ్యుకేషన్, బ్యాంకింగ్ రంగాల్లో డిజిటల్ సమాచారాన్ని భద్రపరిచేందుకు వినియోగించే బ్లాక్‌చెయిన్ టెక్నాలజీకి మంచి డిమాండ్ ఉంది. దీనిపై యువత దృష్టి సారించేందుకు ఇంటర్నేషనల్ బ్లాక్‌చెయిన్ కాంగ్రెస్ (ఐబీసీ)హ్యాకథాన్లని నిర్వహిస్తోంది. సంప్రదాయ డెవలపర్స్‌తో పోలిస్తే ఈ టెక్నాలజీ ద్వారా యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు అలవడతాయి. కొన్ని పెద్ద టెక్ కంపెనీలు తమ డేటా భద్రత, ప్రైవసీని మెరుగుపరిచేందుకు వెబ్ 3ని ఎంపిక చేసుకుంటున్నాయి. నైపుణ్యాల పెంపునకు ప్రభుత్వం అడుగులు.. విద్యార్థుల్లో నైపుణ్యాల్ని పెంపొందించేందుకు ఏయే అవకాశాలున్నాయనే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం అధ్యయనం చేస్తోంది. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. మా సంస్థ నిర్వహిస్తున్న హ్యాకథాన్‌కు కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించింది. ఇక్కడ 8 రోజుల పాటు వెబ్ 3.0లో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ గురించి శిక్షణ ఇస్తాం. వారికి ఫౌండేషన్ కోర్సును కూడా ఉచితంగా అందిస్తున్నాం. తెలంగాణలో 20 వేల మందికి శిక్షణ ఇచ్చాం. ఏపీలోనూ 20 వేల మందికి శిక్షణ అందించాలని నిర్ణయించాం. కొత్త టెక్నాలజీలో అత్యధిక శాతం మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందాలన్నదే ఐబీసీ ప్రధాన లక్ష్యం. -
ట్విటర్ మాజీ సీఈవో నుంచి సరికొత్త వెబ్ ‘సిరీస్’
ట్విటర్ మాజీ సీఈవో, కో ఫౌండర్ జాక్‌డోర్సే నుంచి సంచలన ప్రకటన వెలువడింది. డేటాప్రైవసీ, ఐడింటిటీల విషయంలో మరింత కట్టుదిట్టంగా ఉండే సరికొత్త ఇంటర్నెట్ ప్లాట్‌ఫామ్‌ను రెడీ చేసినట్టు ఆయన వెల్లడించారు. వెబ్ 2, వెబ్ 3ల మేలి కలయికగా ఉండబోయే ఈ కొత్త ఇంటర్నెట్ ఫ్లాట్‌ఫామ్‌ను వెబ్ 5గా వ్యవహరిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇందులో లావాదేవీలు క్రిప్టోల్లోనే జరుగుతాయని ఆయన వెల్లడించారు. వెబ్ 5 ట్విటర్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత జాక్‌డోర్సే బ్లాక్ చైయిన్ టెక్నాలజీ ఆధారంగా పని చేసే బ్లాక్ సంస్థలో భాగమయ్యారు. ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ అనుబంధ సంస్థల్లో బ్లాక్ ఒకటి. బ్లాక్ ఎంతగానో శ్రమించి మరింత సమర్థంగా ఇంటర్నెట్ సేవలు అందించే వెబ్ 5కి రూకల్పన చేసింది. ఇంటర్నెట్కు తాము అందిస్తున్న గొప్ప కానుక వెబ్5 అని జాక్‌డోర్సే వెల్లడించారు. ఉపయోగాలు వెబ్ 5 ప్రకటన సందర్భంగా నెటిజన్లు జాక్డోర్సేను పలు అంశాలపై ప్రశ్నించారు. వీటికి సమాధానం ఇస్తూ...వెబ్ 2లో డేటా, ఐటింటిటీ సమాచారం చాలా వరకు చోరీ అయ్యిందని, కానీ వెబ్ 5లో ఆ సమస్య ఉండదని వెల్లడించారు. ఇక్కడ ఎవరి పెత్తనాలు పని చేయబోవన్నారు. వెబ్ 3 ఇంకా అందరికి కొరుకుపడటం లేదు కాబట్టే వెబ్ 5కి వచ్చామని కూడా జాక్ డోర్సే అన్నారు. వెబ్ ‘సిరీస్’లు సాధారణంగా ఇంటర్నెట్ వినియోగంలోకి వచ్చిన తర్వాత డాట్‌కామ్ బూమ్, ఈమెయిళ్లు తదితర వాటిని వెబ్1గా వ్యవహరిస్తున్నారు. ఇంటర్నెట్ ఆధారంగా పుట్టుకొచ్చిన యూట్యూబ్, ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టా వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ని వెబ్ 2గా పరిగణిస్తున్నారు. ఇక ఫ్యూచర్ టెక్నాలజీగా చెప్పుకుంటున్న వర్చువల్ రియాలిటీ, మెటావర్స్లను వెబ్ 3గా భావిస్తున్నారు. వీటికి బ్లాక్ చెయిన్ టెక్నాలజీని అనుసంధానం చేసి వెబ్ 5గా పేర్కొంటున్నారు జాక్‌డోర్సే. this will likely be our most important contribution to the internet. proud of the team. #web5 (RIP web3 VCs 🤫)https://t.co/vYlVqDyGE3 https://t.co/eP2cAoaRTH — jack (@jack) June 10, 2022 చదవండి: బస్సు డ్రైవర్లు జాగ్రత్త ! పరధ్యానంగా ఉంటే.. -
20న పండ్లు, కూరగాయలపై ఎఫ్.ఎ.ఓ. వెబినార్
అంతర్జాతీయ పండ్లు, కూరగాయల సంవత్సరం సందర్భంగా ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) ఈ నెల 20న వెబినార్‌ను నిర్వహించనుంది. చిన్న, సన్నకారు రైతుల చిన్న కమతాల్లో, పెరటి తోటల సాగులో సవాళ్లు, అవకాశాలపై చర్చిస్తారు. ఈ అంశంపై ఎఫ్.ఎ.ఓ. ప్రచురించిన సావనీర్‌ను విడుదల చేస్తారు. భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఆంగ్ల వెబినార్‌లో ఉచితంగా పాల్గొనదలచిన వారు పేర్లు నమోదు చేసుకోవచ్చు.. https://fao.zoom.us/webinar/register/WN_xZvk3yfwQLWgUtdjnemJHw 19న కొర్నెపాడులో మిరప సాగుపై శిక్షణ గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడులో సెప్టెంబర్ 19 (ఆదివారం)న ప్రకృతి/ సేంద్రియ వ్యవసాయ విధానంలో మిరప సాగుపై రైతునేస్తం శిక్షణా కేంద్రంలో శిక్షణ ఇస్తారు. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మహిళా రైతు లావణ్యారెడ్డి శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 97053 83666 -
గూగుల్ క్రోమ్ వెబ్‌లో డార్క్ మోడ్
తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త అనుభూతిని అందించేందుకు గూగుల్ వినూత్న మార్గాలను అన్వేషిస్తూ ఉంటుంది. ఇప్పటికే మొబైల్ ఓఎస్ లో ఎన్నో కొత్త ఫీచర్స్ తీసుకొచ్చిన టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా క్రోమ్ డెస్క్‌టాప్/వెబ్ వెర్షన్ యూజర్ల కోసం డార్క్ మోడ్‌ను తీసుకొనిరాబోతుంది. ఇప్పుడు యూజర్లు సిస్టమ్ థీమ్‌ను డార్క్ మోడ్‌లో పెట్టుకుంటే గూగుల్ క్రోమ్ డెస్క్‌టాప్/వెబ్ సెర్చ్ కూడా ఆటోమేటిగ్గా డార్క్ మోడ్‌కు మారుతుంది. ఇప్పుడు యూజర్లు సిస్టమ్ సెట్టింగ్స్‌ను బట్టి డార్క్ మోడ్ యాక్టివేట్ చేసుకోవచ్చు. దీనివల్ల బ్యాటరీ డివైజ్ లైఫ్ ని ఆదా చేయవచ్చు. ప్రస్తుతం ఇంకా ఈ ఫీచర్‌ను బీటా టెస్టింగ్ దశలో ఉంది. త్వరలో అందరికి అందుబాటులోకి రానుంది. ఒకవేల మీరు బీటా యూజర్ అయితే, గూగుల్ సెర్చ్ లేదా వెబ్ పేజీని ఓపెన్ చేయగానే డార్క్ మోడ్ వచ్చినట్లు ఒక నోటిఫికేషన్ వస్తుంది. దానిపై క్లిక్ చేసి ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకుంటే డార్క్ మోడ్ యాక్టివేట్ అవుతుంది. దింతో సెర్చ్ పేజీ మొత్తం డార్క్‌లోకి మారిపోతుంది. మీరు కనుక బీటా యూజర్ కాకపోతే క్రోమ్ సెట్టింగ్స్‌లో ‘ఫోర్స్ డార్క్ మోడ్’ ఆప్షన్ ద్వారా ప్రయత్నించవచ్చు. దీని కోసం గూగుల్ సెర్చ్ బార్లో Chrome://flags ఎంటర్ చేసి 'Dark Mode' అని టైప్ చేయాలి. అప్పుడు ఫోర్స్ డార్క్ మోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకుంటే మీ క్రోమ్ పేజీ రీ-లాంచ్ అయిన తర్వాత పేజీ డార్క్ మోడ్ లో కనిపిస్తుంది. చదవండి: 4జీ ఇంటర్నెట్ స్పీడ్ పెంచుకోండిలా! 10నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్ ఫుల్ ఛార్జ్ -
అందరికి అందుబాటులోకి వాట్సాప్ కొత్త ఫీచర్
న్యూఢిల్లీ: ఈ నెల మొదట్లో డిస్అపియరింగ్ మెసేజెస్ ఫీచర్ ని విడుదల చేసింది వాట్సాప్. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ సందేశాలు వాటంతటవే అదృశ్యమవుతాయి. ఈ ఫీచర్ ఆన్ చేసిన సమయం నుండి ఆ చాట్‌లో పంపిన ఏదైనా సందేశం ఏడు రోజుల తర్వాత ఆటోమేటిక్ గా కనిపించకుండా పోతాయని తెలిపింది. తాజాగా ఈ ఫీచర్‌ని ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్‌లోని వాట్సాప్ వినియోగదారులందరికీ అందుబాటులో తీసుకొచ్చింది. వ్యక్తులకు పంపినవైనా, గ్రూపులు లేదా కంపెనీలు పంపిన సందేశాలైనా సరే.. అన్నింటినీ వారం రోజుల తరువాత మాయమయ్యేలా చేయవచ్చునని కంపెనీ ప్రకటించింది. కాకపోతే ఈ గ్రూపుల్లో ఈ ఫీచర్‌ను అడ్మిన్ మాత్రమే ఆన్/ఆఫ్ చేయగలరు. ఈ ఫీచర్‌ని ఆన్ చేయడం ఎలా... మన వాట్సప్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి దాని తర్వాత వాట్సాప్‌లో ఏదైనా చాట్ తెరిచి వ్యూ కాంటాక్ట్ లేదా గ్రూప్ ఇన్ఫో క్లిక్ చేయాలి ఇప్పుడు మీరు క్రిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మీకు అక్కడ డిస్అపియరింగ్ మెసేజెస్ అనే ఫీచర్ కనిపిస్తుంది ఈ ఫీచర్ డిఫాల్ట్ గా ఆఫ్ చేసి ఉంటుంది, కాబట్టి మీరు దీన్ని ఆన్ చేయాలి ఇప్పుడు మీరు ఎంచుకున్న చాట్‌కు పంపిన క్రొత్త సందేశాలు వాటంతటవే ఏడు రోజుల తర్వాత కనిపించవు చాట్‌లో అదృశ్యమైన సందేశాలు ఎనేబుల్ అయినప్పుడు వాట్సాప్ తెలియజేస్తుంది. వాట్సాప్‌లో మెసేజ్ వచ్చినప్పుడు దాన్ని మీరు ఓపెన్ చేయకపొతే ఏడు రోజులు తర్వాత ఛాట్ స్ర్కీన్‌లో ఆ మెసేజ్ డిలీట్ అయిపోయిన కానీ మెసేజ్ ఓపెన్ చెయ్యలేదు కాబట్టి దాన్ని నోటిఫికేషన్స్ బార్లో చూడొచ్చు. -
ఒక్కరే చూడొద్దు
మనం ఏవిటేవిటో అనుకుంటాం.. మనం ఏకాకులం అని అనుకుంటాం! చాలాసార్లు ఏకాంతం కోరుకుంటాం.. ఎవరితోనూ ఏ కనెక్షన్ లేకుండా మన ప్లేస్‌లో మనం ఉంటే బాగుండూ అనుకుంటాం. అలా అనుకోకండి... ముందు టీవీ ఉండొచ్చు.. వెనకాల ఇంకెవరైనా ఉండొచ్చు!! అర్ధరాత్రి దాటింది.. తలుపు కొడ్తున్నారు! లోపల.. ఒళ్లో పిల్లాడిని పెట్టుకుని కునికిపాట్లు పడుతున్న తల్లి ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్లు తెరిచింది. ఇంకా తలుపు కొడ్తూనే ఉన్నారు. ఆ తల్లి వణికిపోతోంది. ‘‘మామయ్యా.. మామయ్యా...’’ పిలిచింది, వచ్చింది తన మామేమో అనుకొని. ప్రతిస్పందనగా తలుపు కొట్టిన చప్పుడే వినపడుతోంది. ఆమెలో భయం ఎక్కువైంది. ‘‘ఈ పూట పనిచేస్తే సర్పంచ్ డబ్బులిస్తానన్నాడు. రెండు రోజులకు సరిపడా సరుకులు తెస్తా..’’ అని చెప్పి వెళ్లాడు. ఇప్పటిదాకా తిరిగి రాలేదు. తలుపు కొడ్తున్న చప్పుడు ఆగలేదు. సొంత ఊళ్లో.. ఉన్న ఎకరం భూమిని ఆక్రమించి భర్తను చంపేశాడు భూస్వామి. ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని చంటిబిడ్డను చంకనేసుకొని ఈ ఊరొచ్చిపడ్డారు తనూ, మామ. ఇక్కడేమో అంతా వింతగా ఉంది. ఈసారి తలుపు చప్పుడు మరింత గట్టిగా వినపడటంతో వర్తమానంలోకి వచ్చింది ఆమె. మామయ్యా అని పిలిచినా బదులు పలకట్లేదంటే.. తలుపు కొడ్తోంది వాళ్లేనా? నెమ్మదిగా వెళ్లి చూద్దామని అనుకునేలోపే.. ఆ గుడిసెలో ఉన్న గుడ్డి దీపం కాస్తా ఆరిపోయింది. ఇంతలోకే మోకాళ్ల మీద పాకుతూ ఆ ‘ముగ్గురు పిల్లలు’ తనను చుట్టుముట్టారు. అనుకున్నంతా అయింది. రాత్రి గడపవతల అన్నం పెట్టలేదు. తలుపు తట్టి మరీ లోపలికి వచ్చేశారు. తన చేతుల్లో ఉన్న పిల్లాడిని దగ్గరగా పొదివి పట్టుకునుంది. అయినా వాళ్లు వదలట్లేదు. బలంగా లాగుతున్నారు. తను ప్రతిఘటిస్తోంది. చేతుల మీద రక్కుతున్నారు. గట్టిగా అరుస్తూ పిల్లాడిని ఎత్తుకొని వాళ్ల నుంచి తప్పించుకోవడానికి గుడిసె దాటింది. పరిగెడుతూ పరిగెడుతూ ఓ చిన్న గుడి దగ్గర ఆగింది. ఆమె దేవుడి ప్రాంగణంలోకి వెళ్లేసరికి ఆ ముగ్గురూ నిరాశతో వెనుదిరిగారు. ఊరవతల.. పాడుబడిన ఇంట్లో ఆ పూటకి ఎలాగో గండం తప్పించుకుంది ఆ తల్లి. కానీ ఆ ఊళ్లో కొనసాగాలంటే ప్రతిరోజూ ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సిందే. ఉదయమనగా వెళ్లిన మామ జాడలేడు. తెల్లవారే వరకు గడిపిన ఆమె వెలుతురు వెలువడ్డ మరుక్షణమే మామను వెదకడానికి బయలుదేరింది. ఊరవతల తాగి పడి ఉన్నాడు. లేపి.. గుడిసె దగ్గరకు తీసుకొచ్చి రాత్రి జరిగిన సంఘటనను మొరపెట్టుకుంది. అవి పిల్ల పిశాచాలు. వాటికి తిండి పెట్టకపోతే నా కొడుకుని పీక్కుతింటాయి అంటూ ఏడ్చింది. పిల్లా లేదు.. పిశాచమూ లేదు. అంతా భ్రమ. ఈ ఊళ్లోవాళ్లు మూర్ఖులు అని కొట్టిపారేశాడు ఇంకా మత్తు వదలని మామ. వచ్చిన డబ్బులతో తాగడమే కాక పిచ్చి వాగుడు వాగుతున్నావని తిట్టింది. కొడుకును అతనికి అప్పజెప్పి తను బయలుదేరింది. ఆ ఊళ్లోకి అడుగుపెట్టినప్పుడు నది దగ్గర ఆ ఊరు ఆవిడ చేసిన హెచ్చరిక గుర్తొచ్చింది. ‘‘ఈ ఊళ్లోకి కొత్తగా వచ్చినట్టున్నారు. మీకు తినడానికి ఉన్నా లేకపోయినా.. రాత్రి పడుకునే ముందు గడపవతల ప్లేట్లో అన్నం పెట్టడం మాత్రం మరిచిపోవద్దు. లేకపోతే మీ పిల్లాడి ప్రాణాలు పోతాయ్’’ అని. ‘‘ఎందుకలా?’’ అడిగింది. ‘‘తెలియదు. 70 ఏళ్లుగా సాగుతున్న ఆచారం. ఈ ఊరు చివరన ఉన్న పాడుబడ్డ ఇంట్లో మూడు పిల్ల పిశాచాలుంటాయి. రాత్రి అయిందంటే చాలు.. ఊరు మీదకొస్తాయి. ప్రతి గుమ్మం ముందున్న అన్నం తిని వెళ్లిపోతాయి లేకపోతే ఆ ఇంట్లో పిల్లల్ని మింగేస్తాయని చెప్తుంటారు’’ అని తనకు తెలిసింది చెప్పింది ఆవిడ. ఆ ప్రకారమే ఈ తల్లి ఊరవతల ఉన్న పాడుపడిన ఇంటికి వెళ్లింది. ఆ ఇంట్లో ఓ తల్లి చిన్న కుండలో చారెడు బియ్యంతోపాటు నూరిపెట్టిన గన్నేరు పప్పు ముద్దనూ వేసి గంజి కాసి.. ఆ పిల్లలకు పెడ్తూ కనిపించింది. చివరకు తను కూడా తిని ఈమె కళ్లముందే ఆ ముగ్గురు పిల్లలతోపాటు ఆ తల్లీ నురగలు కక్కి చనిపోతుంది. విషయం అర్థమవుతుంది వచ్చిన తల్లికి. ఆకలితో చనిపోయిన ఆ పిల్లలే పిశాచాలై ఊరు మీద పడ్డారని. భయంతో వెనుతిరుగుతుంది. రెండో కథ చెరువు గట్టున.. జనం మధ్యలో .. ఎనభై ఏళ్ల ఓ ముసలావిడను గొలుసులతో గుంజకు కట్టేసి ఉంది. ‘‘ఈ దయ్యాన్ని వదిలిపెట్టేది లేదు బాబా’’ అంటున్నాడు ఆ ఊరి పెద్ద. ‘‘చెప్పు.. ఎందుకొస్తున్నావ్?’’ అంటూ బాబా మంత్రదండంతో ఆ ముసలావిడను బెదిరిస్తున్నాడు. ‘‘నేను దయ్యాన్ని కాను.. నన్ను వదిలేయండి’’ ముసలావిడ ప్రాధేయపడుతోంది. అయినా వినట్లేదు. అప్పుడు రంగప్రవేశం చేశాడు పోలీస్ ఇన్స్పెక్టర్. దెయ్యం పేరుతో వృద్ధురాలిని గొలుసులతో బంధించడాన్ని చూడలేకపోయాడు. అసలు దయ్యాలు, భూతాలు ఏంటి? అంతా మూఢనమ్మకాలు. మానసిక రోగాలు. భ్రమలు, భ్రాంతులు అంటూ ఆమెను విడిపించబోయాడు. ఊరి పెద్ద, బాబాతోపాటు చుట్టూ ఉన్న జనం, కానిస్టేబుల్స్ కూడా ‘‘అయ్యా.. అపచారం.. అది దయ్యమే. బంధించే ఉంచండి’’ అంటూ ఇన్స్పెక్టర్ మాట సాగనివ్వలేదు. చేసేదిలేక వెనక్కితగ్గాడు ఇన్స్పెక్టర్. కానీ రాత్రి కాపలాదారులు నిద్రలోకి జారుకున్నాక వచ్చి.. ఆ వృద్ధురాలిని విడిపించి తన జీప్‌లో ఆమె ఇంటి దగ్గర దింపాడు ఇన్స్పెక్టర్. ‘‘నన్ను విడిపించినందుకు చాలా కృతజ్ఞతలు ఇన్స్పెక్టర్గారూ. నాకున్న కాసింత పొలాన్నీ కబ్జాచెయ్యడానికి ఊరివాళ్లముందు నన్ను దయ్యంలా నిరూపించాలని చూస్తున్నారు ఊరి పెద్ద. వాడికి బాబా వత్తాసు. సమయానికి వచ్చి రక్షించారు. మీ రుణం ఎలా తీర్చుకోనూ?’’ వినయంగా అడిగింది ఆ వృద్ధురాలు. ‘‘అయ్యో.. ఇది నా బాధ్యత. అవునూ.. ఊరవతల.. ఈ చిట్టడవిలో ఒంటరిగా ఉంటున్నావా?’’ గాబరాగా అడిగాడు ఇన్స్పెక్టర్ ఆమె ఇల్లును చూసి. ‘‘లేదు బాబూ.. మా అక్కతో కలిసి ఉంటున్నాను. ఈ ఊరువాళ్ల బారి నుంచి తప్పించుకోడానికే’’ అంది. జాగ్రత్తలు చెప్పి జీప్ ఎక్కాడు ఇన్స్పెక్టర్. తెల్లవారి.. తన తల్లికి ఒంట్లో బాలేదని, రెండు రోజులు ఆమెకు సాయంగా ఉండొస్తానని పుట్టింటికి బయలుదేరింది ఎస్ఐ భార్య. యథావిధిగా అతనూ డ్యూటీకి వెళ్లాడు. అయితే రాత్రి ఇంటికి చేరేసరికి భార్య దర్శనమిచ్చింది. అదేంటి రెండు రోజుల దాకా రానన్నావ్.. అప్పుడే వచ్చావేంటి?అని ఆశ్చర్యపోతాడు ఇన్స్పెక్టర్. ‘‘మరీ చేతకాకుండా ఏమీ లేదు అమ్మకి. బాగానే ఉంది. మీకు కష్టమవుతుందని వచ్చేశా’’అంటుంది. ఆ రాత్రి ఎందుకనో మళ్లీ ఆ ముసలమ్మ గుర్తొస్తుంది ఎస్ఐకి. కానిస్టేబుల్‌ను తీసుకొని ఆమె ఇంటికి వెళ్తాడు. అక్కడికి చేరుకోగానే భార్య నుంచి ఫోన్ వస్తుంది. ‘‘ఏంటీ.. ఇంకా ఇంటికి చేరారా లేదా? నేను లేను కదా అని డ్యూటీ పేరుతో స్టేషన్లోనే కాపురం ఉంటున్నారా?’’ అంటూ. షాక్ అవుతాడు ఎస్ఐ. మరి ఇంట్లో ఉన్నది ఎవరు? అనుమానంతోనే ఇంటికి వస్తాడు. ఇంట్లో భార్య కనపడుతుంది. అంతా కన్ఫ్యూజన్గా ఉంటుంది ఎస్ఐకి. ఆ అయోమయంలోనే రెండు రోజులు గడుస్తాయి. పనిమీద ఎస్ఐ బయటకు వెళ్లినప్పుడల్లా పుట్టింటి నుంచి భార్య ఫోన్ చేస్తూంటుంది క్షేమసమాచారాల కోసం. మళ్లీ ఇంటికి వెళ్లేసరికి ప్రత్యక్షమవుతుంది. అదే విషయం అడిగితే.. నన్నే అనుమానిస్తున్నావా అంటూ ఏడుస్తుంది. ఏమీ అర్థంకాదు ఎస్ఐకి. చేసేదిలేక బాబా దగ్గరకు వెళ్తాడు. భార్య రూపంలో ఉన్నది దయ్యమేనని స్పష్టం చేస్తాడు బాబా. మంత్రించిన ఆవాలు ఇస్తాడు చుట్టూ చల్లుకోమని. వాటిని తీసుకొని ఇంటికి వెళ్లిన ఎస్ఐ నిస్సత్తువగా కుర్చీలో కూలబడ్తాడు. అతనిని చూసిన భార్య‘‘ఏంటి అంత నీరసంగా ఉన్నావ్? ఆకలిగా ఉందా? ఉండు వేడి వేడి సూప్ చేసుకొస్తాను’’ అంటూ వంటింట్లోకి వెళుతుంది. ఆమె అటు వెళ్లగానే బాబా ఇచ్చిన ఆవాలను కుర్చీ చుట్టూ చల్లుకుంటాడు. ఇంతలోకి బయట గుమ్మం నుంచి సూట్‌కేస్ పట్టుకొని భార్య వస్తుంది. దిమ్మతిరుగుతుంది ఎస్ఐకి. ‘‘ఇందాకే కదా వంటింట్లోకి వెళ్లావ్?’’ అంటాడు. ‘‘నేనా? ఇప్పుడే పుట్టింటి నుంచి వస్తుంటే..’’ అంటుంది అమాయకంగా. ‘‘రైలు దిగి ఎంతసేపటి నుంచి ఫోన్ చేస్తున్నానో తెలుసా నన్ను పికప్ చేసుకోవడానికి వస్తావేమోనని. నీ ఫోన్ కలిస్తేనా?’’ అంటూ దగ్గరకు వస్తుంది. కింద ఆవాలను చూసి.. ‘‘అయ్యో ఆవాలు పడేసుకున్నారా? వంట రానప్పుడు ఎందుకీ తంటా? హాయిగా బయటనుంచి తెప్పించుకోక?’’ అంటూ చీపురు తెచ్చి కిందంతా శుభ్రం చేస్తుంది. ఈలోపు వంటింట్లోంచి సూప్‌తో వస్తుంది భార్యలాగే ఉన్నా ఇంకో ఆవిడ. ఈ ఇద్దరినీ చూసి ఎస్ఐ మతి పోతుంది నిజంగానే. ఆ ఇద్దరు ఆడవాళ్లూ విస్తుపోతారు ఒకరినొకరు చూసుకుని. వాళ్లలో నిజమైన భార్య ఎవరో? ఆ మిగిలిన వ్యక్తి ఎవరో? తెలుసుకోవడానికి రహస్యంగా బాబాకు ఫోన్ చేస్తాడు ఎస్ఐ. మాటల్లో పెట్టు వస్తానని చెప్తాడు బాబా. వాళ్లను మాటల్లో పెడ్తుండగానే బాబా వచ్చేస్తాడు. బాబాను చూసి సూప్ కాచిన భార్య పారిపోవడానికి ప్రయత్నిస్తుంటుంది. పట్టుకొని.. ‘‘ఈమే దయ్యం. ఆ ముసల్ది. నేను చెప్తే మీరు నమ్మలేదు. రక్షించినందుకు మీ భార్య రూపంలోనే వచ్చి మీతో కాపురం చేస్తోంది’’ అంటూ కాళ్లు, చేతులు కట్టేస్తాడు బాబా. అంతా చూసి అసలు భార్య కళ్లుతిరిగి పడిపోతుంది. భార్యే దయ్యమా? దయ్యమే భార్యా? ‘‘చెప్పు మళ్లీ ఎందుకొచ్చావో చెప్పు’’ అంటూ దెయ్యాన్ని కొడ్తుంటాడు బాబా. ‘‘ఈమె పెళ్లికాకుండా చనిపోయింది. అందుకే ఇప్పుడు నీతో కాపురం చేస్తోంది’’ అని ఎస్ఐతో చెప్తూ ఆ దయ్యాన్ని సీసాలో బంధించే ప్రయత్నం చేస్తుంటాడు బాబా. ఆ దయ్యం అలా సీసాలోకి దూరుతుందో లేదో ఇటు కళ్లుతిరిగిపడిపోయిన ఎస్ఐ అసలు భార్య లేస్తుంది. ‘‘ఎస్ఐ గారూ.. మీకేం భయంలేదిప్పుడు. ఆ ముసలి దయ్యాన్ని ఈ సీసాలో బంధించేశా’’ అని భరోసానిస్తూ వెళ్లిపోతాడు బాబా. ఆ సీసాను ఊరవతల చెరువు గట్టున పాతి పెడ్తాడు. మరుసటిరోజు అత్తగారిని చూడ్డానికి ఎస్ఐ తన భార్యతో ఊరికి ప్రయాణమవుతాడు. ముందు సీట్లో డ్రైవర్‌తోపాటు ఎస్ఐ, వెనక సీట్లో ఆయన భార్య కూర్చుని ఉంటారు. దయ్యం గురించి ఇంకా కలవర పడ్తున్నాడేమో అనుకొని వెనకనుంచి భర్త భుజమ్మీద చేయి వేస్తుంది ఆమె. ఏమీలేదులే అన్నట్టుగా వెనక్కితిరిగి చూడకుండానే ఆమె చేయిని నొక్కి రేర్ వ్యూ మిర్రర్లో చూస్తాడు భార్యను. వృద్ధ దయ్యం కనపడుతుంది నవ్వుతూ! ఒళ్లు గగుర్పొడిచే ఇలాంటి పదిహేను కథలతో ‘‘అంజాన్.. రూరల్ మిత్స్’’ పేరుతో పదిహేను ఎపిసోడ్ల న్యూ వెబ్‌సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో అప్లోడై ఉంది. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలకు చెందిన మూఢనమ్మకాల ఆధారంగా తీసిన సిరీస్ ఇది. అన్నిటికీ దయ్యమే నేపథ్యం. కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే భ్రూణహత్యకు పాల్పడే కుటుంబసభ్యుల పనిపట్టే, మహిళల మీద జరుగుతున్న హింసను ఆపే మంచి దయ్యాల కథలూ ఉన్నాయి వీటిలో. రూరల్ మిత్స్ అనే ట్యాగ్‌లైన్‌తో తీసిన ఈ సిరీస్‌లో ఏ ఎపిసోడ్‌లోనూ అది మిత్ అన్న భావనను కలగజేసే లాజిక్ ఎండ్ ఇవ్వలేదు. హారర్ షోగా ప్రజెంట్ చేయడమే దీని ప్రధాన ఉద్దేశం అయ్యుంటే రూరల్ మిత్స్ అనే క్యాప్షన్ పెట్టి ఉండాల్సింది కాదు. పెట్టినందుకు కనీసం లాజిక్ ఎండ్‌ను ఇస్తే బాగుండేది. రాత్రి లైట్ ఆర్పేసుకొని ఈ సిరీస్ చూస్తే హారర్ షో థ్రిల్ కలుగుతుంది. అలాంటి జానర్‌ని ఇష్టపడే ప్రేక్షకులు ‘అంజాన్.. రూరల్ మిత్స్’ను ఎంజాయ్ చేస్తారు. – సరస్వతి రమ -
వెబ్ చెకిన్ ఛార్జీలపై సమీక్ష
న్యూఢిల్లీ: విమాన ప్రయాణాలకు సంబంధించి వెబ్ చెకిన్ విధానంలో ఏ సీటు ఎంపిక చేసుకున్నా చార్జీలు వర్తిస్తాయంటూ ఇండిగో ఎయిర్‌లైన్స్ చేసిన ప్రకటన వివాదం రేపడంతో కేంద్ర పౌరవిమానయాన శాఖ (ఎంవోసీఏ) రంగంలోకి దిగింది. ఇలాంటి విధానాలు ప్రస్తుత నిబంధనలకు లోబడే ఉన్నాయా లేదా ఉల్లంఘిస్తున్నాయా అన్న అంశాన్ని సమీక్షించనున్నట్లు ట్విట్టర్లో పేర్కొంది. కొన్ని ఎయిర్‌లైన్స్ ప్రస్తుతం అన్ని సీట్లకు వెబ్ చెకిన్ చార్జీలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ చార్జీలు అన్‌బండిల్డ్ ధర విధానం పరిధిలోకి లోబడే ఉన్నాయా లేదా అన్నది సమీక్షించనున్నామని వివరించింది. అన్‌బండిల్డ్ ధర విధానం కింద.. సీట్ల కేటాయింపు సహా వివిధ సర్వీసులకు ఎయిర్‌లైన్స్ వేర్వేరుగా చార్జీలు వసూలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. వివాదమిదీ.. విమాన ప్రయాణానికి సంబంధించి ఆన్లైన్లోనే సీటును ఎంపిక చేసుకుని, ప్రయాణ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయడాన్ని వెబ్ చెకిన్గా వ్యవహరిస్తారు. సాధారణంగా సీటు ఎంపిక ప్రాధాన్యతలను బట్టి ఎయిర్‌లైన్స్ నిర్దిష్ట చార్జీలు వసూలు చేస్తుంటాయి. ఈ సీట్లలో కొన్ని ఉచితంగా కూడా ఉంటాయి. అయితే, ఇండిగో ఆదివారం నాడు ఇకపై అన్ని సీట్లకు చార్జీలు వర్తింపచేస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొనడం దుమారం రేపింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో సోమవారం ఇండిగో మరో ప్రకటన విడుదల చేసింది. తమ విధానాల్లో మార్పులేమీ చేయలేదని, వెబ్ చెకిన్‌కి చార్జీలేమీ విధించబోవడం లేదని పేర్కొంది. ముందస్తుగా సీట్లను ఎంపిక చేసుకునే వారికి మాత్రమే ఇవి వర్తిస్తాయని వివరించింది. మార్కెట్ డిమాండ్, ప్రయాణికుల అభీష్టాన్ని బట్టి చార్జీలు ఉంటాయని ఇండిగో తెలిపింది. ప్రిఫర్డ్ సీటింగ్ చార్జీ అత్యంత తక్కువగా రూ. 100 నుంచి ఉంటుందని పేర్కొంది. ఇవి కాకుండా ఎప్పట్లాగే కొన్ని ఉచిత సీట్లు కూడా ఉంటాయని, సీటింగ్ పట్టింపు లేని వారు వీటిని ఎంపిక చేసుకోవచ్చని లేదా ఎయిర్‌పోర్ట్‌లోనైనా ఉచితంగా చెకిన్ ప్రక్రియ పూర్తి చేయొచ్చని వివరించింది. మరోవైపు ఇదే అంశంపై ట్విటర్లో ప్రయాణికుల ప్రశ్నలకు స్పందిస్తూ.. వెబ్ చెకిన్ల ద్వారా సీట్లను ముందస్తుగా కేటాయించేందుకు చార్జీలు వర్తిస్తాయంటూ స్పైస్‌జెట్ వెల్లడించింది. -
ఇండిగో కొత్త బాదుడు : మంత్రిత్వ శాఖ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికులపై భారీ వడ్డింపునకు సిద్ధమైంది. విమానాశ్రయాల్లో భారీ క్యూలను తగ్గించేందుకు, సమయాన్ని ఆదా చేసేందుకుద్దేశించిన వెబ్ చెక్ ఇన్ అవకాశంపై భారీగా చార్జీలను వసూలు చేయనుంది. వెబ్ చెక్ఇన్ చేసుకునే అన్నిఅన్ని విమాన టికెట్లపై చార్జీ ఉంటుందని ఇండిగో ప్రయాణికుడికి సమాధానంగా ట్విటర్లో వెల్లడించింది. ప్రయాణికుడు ఎంచుకున్న సీటు ఆధారంగా ఈ ఫీజు 200-1000 రూపాయల దాకా ఉండనుంది. సవరించిన తమ కొత్త విధానం ప్రకారం ఈ చార్జి చెల్లించాల్సి ఉంటుందనీ, అయితే ఎయిర్పోర్ట్ ఈ సదుపాయం ఉచితమేనని స్పష్టం చేసింది. దీనిపై ప్రయాణికులు మండిపడుతున్నారు. మరోవైపు ఈ పరిణామంపై విమానయాన శాఖ స్పందించింది. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సీనియర్ అధికారి తెలిపారు. ఈ కొత్త మార్పు నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా అనేది సమీక్షించనున్నామని ఏవియేషన్ కార్యదర్శి ఆర్ ఎన్ చౌబే వెల్లడించారు. కాగా ఇండిగో, జెట్ ఎయిర్వేస్, కొన్ని సీట్లపై మాత్రమే వెబ్ చెక్ ఇన్ ఫీజును వస్తూలు చేస్తుండగా, స్పైస్‌జెట్ అన్నిటికీ చేస్తుంది. అలాగే విస్తారా ఎయిర్‌లైన్స్ లోవెబ్ చెక్ ఇన్ పూర్తిగా ఉచితం. వెబ్ చెక్ ఇన్: దేశీయంగా విమాన టికెట్‌ను బుక్ చేసుకున్న ప్రయాణికులు ఆన్లైన్లోనే వివరాల పరిశీలనతోపాటు, బోర్డింగ్ పాస్‌ను కూడా ఈ వెబ్ చెక్ఇన్ ద్వారా పొందవచ్చు. MoCA has noted that airlines are now charging for web check-in for all seats. We are reviewing these fees to see whether they fall within the unbundled pricing framework. — Ministry of Civil Aviation (@MoCA_GoI) November 26, 2018 -
గూగుల్ మెసేజస్ వెబ్‌పైకి వచ్చేసింది..
వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు పోటీగా.. గూగుల్ మెసేజస్ ప్లాట్‌ఫామ్‌ను మరింత అప్డేట్ చేసింది. తాజాగా గూగుల్ మెసేజస్‌ను స్మార్ట్‌ఫోన్‌లో మాత్రమే కాక, వెబ్ ద్వారా కూడా చేసుకునేలా అవకాశం కల్పించింది. ఆండ్రాయిడ్ మెసేజస్ ఫర్ వెబ్‌ను ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా ఆవిష్కరించినట్టు గూగుల్ వెల్లడించింది. గత వారం నుంచే దీన్ని గూగుల్ మార్కెట్లోకి ఆవిష్కరించడం ప్రారంభించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇది అందుబాటులోకి వచ్చేసిందని గూగుల్ ప్రకటించింది. దీంతో మీరు కంప్యూటర్ల మీద పనిచేస్తున్నప్పుడు యాప్‌తో పనిలేకుండా వెబ్‌బ్రౌజర్ నుంచే మీ ఫోన్ కాంటాక్ట్‌లకు మెసేజ్‌లు పంపించుకోవచ్చని తెలిపింది. అయితే దీని కోసం స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఆండ్రాయిడ్ మెసేజస్ యాప్ లేటెస్ట్ వెర్షన్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది. లేటెస్ట్ అప్డేట్తో ఆండ్రాయిడ్ మెసేజ్ యాప్ యూజర్లు, అన్ని మెసేజ్‌లు, సంభాషణలను తమ వ్యక్తిగత కంప్యూటర్లలో యాక్సస్ చేసుకోవచ్చు. ఈ ఆండ్రాయిడ్ మెసేజస్ ఫర్ వెబ్ అచ్చం వాట్సాప్ వెబ్ మాదిరిగానే ఉంది. కాగ, వాట్సాప్ వెబ్ 2015లో యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్ మెసేజస్ ఫర్ వెబ్ ఎలా ఉపయోగించాలి... తొలుత ఆండ్రాయిడ్ మేసేజస్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్టాల్ చేయాలి అలాగే కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో క్రోమ్, ఫైర్‌బాక్స్, ఒపెరా, యాపిల్ సఫారీ బ్రౌజర్లలో ఏదో ఒకటి ఇన్స్టాల్ చేసి ఉండాలి ఫోన్లో ఆండ్రాయిడ్ మెసేజ్ యాప్‌ను ఓపెన్ చేసుకోవాలి యాప్ హోం పేజీలో కుడివైపు పైన కనిపించే మూడు డాట్స్‌ను క్లిక్ చేయాలి మోర్ ఆప్షన్స్ మెనూను టాప్ చేసి, మెసేజస్ ఫర్ వెబ్‌ను ఎంపిక చేసుకోవాలి మెసేజస్ ఫర్ వెబ్‌ను ఎంపిక చేసుకున్నాక వచ్చిన పేజీలో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకోవాలి పేజీ లోడ్ అయ్యాక, మీరు మెసేజ్‌లు చూసుకోవచ్చు, సెండ్ చేసుకోవచ్చు. -
వెబ్‘డబ్బు’
తప్పుల తడకగా భూ రికార్డులు - ఆన్లైన్ నమోదులో రెవెన్యూ లీలలు - వీఆర్వోలు, కంప్యూటర్ ఆపరేటర్ల మిలాఖత్ - దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం - నెలలు గడుస్తున్నా పెండింగ్‌లోనే దరఖాస్తులు - దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు - ఘర్షణలు.. ఆత్మహత్యాయత్నాలు ఆన్లైన్ దరఖాస్తులు: 1,67,263 మంజూరుకు అనుమతి: 1,14,926 తిరస్కరణ: 46,953 పెండింగ్: 5,384 భూ సమస్యలకు పరిష్కారం చూపాల్సిన వెబ్‌ల్యాండ్ అక్రమార్కులకు ఆదాయవనరుగా మారుతోంది. అక్షర జ్ఞానం లేని రైతులకు రెవెన్యూ అధికారులు చుక్కలు చూపుతున్నారు. ఆన్లైన్ నమోదులో లెక్కకు మించిన తప్పులు చేస్తూ.. పల్లెల్లో ఘర్షణలకు కారణమవుతున్నారు. తాత ముత్తాతల కాలం నుంచీ సాగు చేసుకుంటున్న పొలాలు ఇతరుల పేరు మీద ఉండటం చూసి దిక్కుతోచని స్థితిలో పలువురు రైతులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. అనంతపురం అర్బన్: రెవెన్యూ శాఖ అవినీతికి చిరునామాగా మారుతోంది. పారదర్శకంగా వ్యవహరించాల్సిన అధికారులు కొందరు అందినంతా దోచుకుంటున్నారు. వెబ్‌ల్యాండ్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. పలువురు తహసీల్దార్లు.. వీఆర్వోలు.. కంప్యూటర్ ఆపరేటర్లు కుమ్మక్కై భూ విస్తీర్ణంతో పాటు యజమాని పేర్లనే మార్చేస్తున్నారు. ఒకరి భూమిని మరొకరి పేరిట 1-బీ, అడంగల్ సృష్టిస్తున్నారు. సమస్య పరిష్కరించాలని బాధితులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేయడమే తప్పిస్తే ఫలితం లేకపోతోంది. తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వీఆర్వో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ-పట్టాదారు పాసు పుస్తకం జారీకి రూ.10వేల నుంచి రూ.15వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. పాసు పుస్తకంలో తప్పుల సవరణకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు గుంజుతున్నట్లు తెలుస్తోంది. ఇతనిపై ఇటీవల కొందరు బాధితులు డీఆర్వోకు సైతం ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. తహసీల్దార్, ఆర్ఐలదీ అదే తంతు కొన్ని మండలాల్లో తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పెద్ద ఎత్తున్న అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఇష్టానుసారంగా పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చేస్తున్నారు. ప్రభుత్వ భూములకు కూడా పట్టాలు మంజూరు చేస్తున్నారు. వంకలు, వాగు స్థలాల్లో పట్టాలు ఇవ్వడంపై నిషేధం ఉన్నా ఖాతరు చేయని పరిస్థితి ఉంది. శింగనమల తహసీల్దార్(ఇటీవల బదిలీ అయ్యారు) అక్రమాలకు పాల్పడ్డారంటూ డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవికి ఆ మండల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు రెండు సార్లు, జాయింట్ కలెక్టర్ టి.కె.రమామణికి ఒకసారి ఆధారాలు సహా ఫిర్యాదు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. దరఖాస్తులు, అర్జీలు పెండింగ్‌లో.. భూముల వివరాలు తప్పుగా ఉన్నాయని, సరిచేయాలని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా, అర్జీలు ఇచ్చినా పరిష్కారం కావట్లేదు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఆన్లైన్లో 7,432 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 3,494 పరిష్కరించారు. 3,538 పెండిగ్లో ఉన్నాయి. పరిష్కారానికి చర్యలు భూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాం. అందులో భాగంగా రైతు సేవలో రెవెన్యూ కార్యక్రమం జిల్లాలో కొనసాగుతోంది. అందులో వచ్చిన సమస్యల పరిష్కారానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. గతంలో మాదిరి కంప్యుటర్ ఆపరేటర్ ద్వారా కాకుండా, వచ్చిన సమస్యల్లో ఏది ఎవరు చేయాలనేది మండలం వారీగా ఒక ఆర్డర్లో ఉంచి పరిష్కరిస్తాం. – టి.కె.రమామణి, జాయింట్ కలెక్టర్ -
గురువులకూ వెబ్ కౌన్సెలింగ్
ఏలూరు సిటీ : ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమవుతోది. ఈసారి వెబ్ కౌన్సెలింగ్ విధానంలో కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే షెడ్యూల్ విడుదల కానుంది. ఈలోగా ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తిచేస్తారు. ఈనెల 16నాటికి బదిలీల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 14వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా, సుమారు 4వేల మంది బదిలీ కౌన్సెలిం గ్‌కు హాజరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకేచోట రెండేళ్ల నుంచి ఎనిమిదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు స్థానచలనం పొందనున్నారు. బదిలీ కావాల్సిన ఉపాధ్యాయులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. cse.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేయాలి. ప్రక్రియ ప్రారంభించే నాటికి ఉన్న ఖాళీలు, ఎనిమిదేళ్ల సర్వీసు నిండిన వారి ఖాళీలు, క్రమబద్ధీకరణతో వచ్చిన ఖాళీల జాబితాను వెబ్సైట్లో పొందుపరుస్తారు. షెడ్యూల్ ప్రకటించిన నాటినుంచి దరఖాస్తు చేసేందుకు 3 రోజుల గడువు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు ఇలా.. ఉపాధ్యాయులు తొలుత వెబ్సైట్ నుంచి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని ఎంఈవో లేదా ప్రధానోపాధ్యాయునికి సమర్పించాలి. అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి. ఎంఈవో లేదా ప్రధానోపాధ్యాయుడు దరఖాస్తును, సర్టిఫికెట్లను పరిశీలించి వాటిని ధ్రువీకరిస్తూ డీఈవోకు అప్లోడ్ చేస్తారు. వీటిని డీఈవో పరిశీలించిన అనంతరం ఉపాధ్యాయునికి ఎన్టైటిల్మెంట్ పాయిం ట్లు కేటాయిస్తారు. దరఖాస్తు గడువు ముగిసిన అనంతరం ఒక రోజులో పాయింట్ల కేటాయింపు పూర్తిచేస్తారు. దీని ఆధారంగా ప్రాధాన్యత క్రమాన్ని సూచిస్తూ జాబితా తయారు చేసి వెబ్సైట్లో పొందుపరుస్తారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే ఆన్లైన్లో ఫిర్యాదు చేయాలి. అభ్యంతరాలకు రెండు, మూడు రోజులు సమయం ఇస్తారు. అభ్యంతరాల పరిశీలన తరువాత తుది జాబితాను పొందుపరుస్తారు. దరఖాస్తుదారులు తుది ప్రాధాన్యత జాబితాను పరిశీలించి తమ క్యాడర్లో ఎవరు దరఖాస్తు చేశారో, ఏఏ పాఠశాలలకు అవకా శం వస్తుందో పరిశీలించుకుని కన్ఫర్మ్ చేయాలి. ఒకసారి కన్ఫర్మ్ చేస్తే ఆ ఉపాధ్యాయుని స్థానం కూడా ఖాళీల జాబితాలోకి వెళుతుంది. అయితే, ఉన్న స్థానం పోతుందనే ఆందోళన అవసరం లేదు. కన్ఫర్మ్ చేయగానే మీ మొబైల్ ఫోన్‌కు పాస్వర్డ్ వస్తుంది. దాంతో వెబ్సైట్లోకి లాగిన్ అయితే మీ కేడర్‌కు సంబంధిం చిన ఖాళీలు ప్రత్యక్షమవుతాయి. ఖాళీ లను ప్రాధాన్యత క్రమంలో మౌస్ క్లిక్ ద్వారా ఎంపిక చేసుకోవాలి. తప్పనిసరిగా బదిలీ అయ్యే ఉపాధ్యాయులు తమ కేడర్‌లో ప్రదర్శించిన ఖాళీలకు ప్రాధాన్యత క్రమం ఇవ్వాల్సి ఉంది. ఉదాహరణకు ఒక కేడర్‌లో 500ఖాళీలు ఉంటే అన్నిటికీ ఆప్షన్లు ఇవ్వాలి. రెండు నుంచి ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తికాని ఉపాధ్యాయులు తమకు అవసరమైన పాఠశాలను మాత్రమే ఎంపిక చేసుకోవచ్చు. దీనికి గరిష్ట పరిమితి 199 ఆప్షన్లు మాత్ర మే. ఉపాధ్యాయుడు ఎన్ని ఆప్షన్లు ఇచ్చినా చివరి ఆప్షన్‌గా తాను పనిచేస్తు న్న పాఠశాలను విధిగా చేర్చాలి. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన 5రోజుల్లో బదిలీ ఉత్తర్వులు వెబ్సైట్ నుంచి తీసుకునే అవకాశం ఉంది. బదిలీ సమాచారం ఉపాధ్యాయుల మొబైల్‌కు మెసేజ్ వస్తుంది. -
వెబ్‌లో విద్యాలయం!
సమాజసేవ అంటే దానికి ప్రత్యేకమైన సమయం కేటాయించనక్కర్లేదు, రోడ్లపై తిరగాల్సిన అవసరం లేదు, ఒకవైపు మన పని మనం చేసుకొంటూనే ఏదో రకమైన సేవాకార్యక్రమాన్ని చేపట్టవచ్చు. చేసే ఆ సేవలో నవ్యత ఉండాలే కానీ... దానికి మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. మనసుంటే మార్గం ఉంటుంది. అలాంటి మనసున్న వారిలో డేనియల్ ఫ్రీడ్మన్ ఒకరు. చదువు సంధ్యలు లేకపోయినా చదువుకొనే ఉత్సాహం ఉన్న వాళ్లకు డేనియల్ అందిస్తున్న సహకారం అంతా ఇంతా కాదు. ‘థింక్‌ఫుల్’ అన్న తన ప్రయత్నంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని, గౌరవం పొందుతున్న 22 ఏళ్ల యువకుడితను. ‘థింక్‌ఫుల్’ పేరుతో ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించి తనలాంటి కొంతమంది ఉత్సాహవంతమైన యువతీయువకులను ఒక వేదిక మీదకు తీసుకొచ్చి ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు చదువు చెప్పే ఏర్పాట్లు చేశాడు డేనియల్. డేనియల్ టీమ్ ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు గెడైన్స్ ఇవ్వడమేగాక వివిధ స్థాయిల్లోని పిల్లలకు ఆన్లైన్క్లాసులు అందుబాటులో ఉంచింది. ఇది ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయుల్లో కొన్ని వేల మంది విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంది. ఇంటర్నెట్లో తరచి చూడాలి కానీ ట్యూటర్లుగా ఉపయోగపడే వెబ్సైట్లు అనేకం అందుబాటులో ఉన్నాయి. అయితే అలాంటి వాటిలో థింక్‌ఫుల్ ప్రత్యేకమైనది, నవ్యతాపూరితమైనది. ఎప్పుడూ ట్యూటర్లు అందుబాటులో ఉంటారు! థింక్‌ఫుల్ వెబ్సైట్లోకి లాగిన్ అయితే అనునిత్యం కొంతమంది ట్యూటర్లు అందుబాటులో ఉంటారు. వారిని సంప్రదించి సందేహాలను నివృతి చేసుకోవచ్చు, క్లాస్‌లను వినవచ్చు. నిపుణులైన ట్యూటర్స్ టీమ్ ఈ వెబ్సైట్లో ఉంటుంది. వేరే వృత్తుల్లో ఉన్న అనేక మంది యువతీయువకులు రోజుకు గంటా, రెండుగంటల సేపు ఈ సైట్‌కు అందుబాటులో ఉంటారు. ఇలాంటి వారు రకరకాల విభాగాల్లో నిపుణులు, పెద్ద చదువులు చదివిన వారు కాబట్టి ఈ సైట్లోకి లాగిన్ అయ్యే విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అతడికి చదువు లేదు... డేనియల్ సంగతికొస్తే అతను యేల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌లో చేరి మధ్యలో ఆపేశాడు. గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేయకుండా మధ్యలో చదువు ఆపేసిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అయితే అతడి మెదడులో చదువుకు సంబంధించి ఇంతమంచి ఆలోచన మెదలడం చాలా ఆసక్తికరం. ఇదొక విద్యాలయం... అమెరికా స్థాయిలో పీసీ, ఇంటర్నెట్లు చాలా సాధారణమైన అంశాలు కాబట్టి అనేక మంది విద్యార్థులకు ఈ వెబ్సైట్ ఒక వరంగా మారింది. కేవలం విద్యార్థులు అనే కాదు. వివిధ రంగాల్లో సమాచారం కోసం వివరణల కోసం ఈ వెబ్సైట్లో ప్రశ్నలు పోస్టు చేసే వాళ్లు అనేక మంది ఉన్నారు. ఆన్లైన్ ట్యుటోరియల్స్ విషయంలో యూట్యూబ్ వంటి సైట్ల కన్నా దీటైన స్థాయిలో ఉంది డేనియల్ వెబ్సైట్. ఏకవ్యక్తి సైన్యంగా ఈ స్థాయి విజయాన్ని సాధించిన డేనియల్ నిజంగానే చాలా గ్రేట్ కదూ! ఫోర్బ్స్ జాబితాలో... డేనియల్ సోషల్ఎంటర్ప్రెన్యూరర్గా పెద్ద పేరు సంపాదించాడు. ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక డేనియల్ను సామాజిక సేవ విషయంలో ప్రభావాత్మకమైన ‘30 అండర్ 30’ విభాగంలో ఎంపిక చేసింది. చేసింది చిన్న ప్రయత్నమే అయినా అది సూపర్ సక్సెస్ కావడంతోపాటు ఇలాంటి గౌరవం దక్కడం కూడా డేనియల్‌కు చక్కటి అనుభూతిగా మారింది.