న్యూఢిల్లీ: ఈ నెల మొదట్లో డిస్‌అపియరింగ్ మెసేజెస్ ఫీచర్ ని విడుదల చేసింది వాట్సాప్. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ సందేశాలు వాటంతటవే అదృశ్యమవుతాయి. ఈ ఫీచర్ ఆన్ చేసిన సమయం నుండి ఆ చాట్‌లో పంపిన ఏదైనా సందేశం ఏడు రోజుల తర్వాత ఆటోమేటిక్ గా కనిపించకుండా పోతాయని తెలిపింది. తాజాగా ఈ ఫీచర్‌ని ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్‌లోని వాట్సాప్ వినియోగదారులందరికీ అందుబాటులో తీసుకొచ్చింది. వ్యక్తులకు పంపినవైనా, గ్రూపులు లేదా కంపెనీలు పంపిన సందేశాలైనా సరే.. అన్నింటినీ వారం రోజుల తరువాత మాయమయ్యేలా చేయవచ్చునని కంపెనీ ప్రకటించింది. కాకపోతే ఈ గ్రూపుల్లో ఈ ఫీచర్‌ను అడ్మిన్ మాత్రమే ఆన్/ఆఫ్ చేయగలరు.
ఈ ఫీచర్‌ని ఆన్ చేయడం ఎలా...
- మన వాట్సప్ ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి
- దాని తర్వాత వాట్సాప్‌లో ఏదైనా చాట్ తెరిచి వ్యూ కాంటాక్ట్ లేదా గ్రూప్ ఇన్ఫో క్లిక్ చేయాలి
- ఇప్పుడు మీరు క్రిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మీకు అక్కడ డిస్‌అపియరింగ్ మెసేజెస్ అనే ఫీచర్ కనిపిస్తుంది
- ఈ ఫీచర్ డిఫాల్ట్ గా ఆఫ్ చేసి ఉంటుంది, కాబట్టి మీరు దీన్ని ఆన్ చేయాలి
- ఇప్పుడు మీరు ఎంచుకున్న చాట్‌కు పంపిన క్రొత్త సందేశాలు వాటంతటవే ఏడు రోజుల తర్వాత కనిపించవు
చాట్‌లో అదృశ్యమైన సందేశాలు ఎనేబుల్ అయినప్పుడు వాట్సాప్ తెలియజేస్తుంది. వాట్సాప్‌లో మెసేజ్ వచ్చినప్పుడు దాన్ని మీరు ఓపెన్ చేయకపొతే ఏడు రోజులు తర్వాత ఛాట్ స్ర్కీన్‌లో ఆ మెసేజ్ డిలీట్ అయిపోయిన కానీ మెసేజ్ ఓపెన్ చెయ్యలేదు కాబట్టి దాన్ని నోటిఫికేషన్స్ బార్‌లో చూడొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment