ప్రపంచ వ్యాప్తంగా అత్యదిక మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకువస్తూనే ఉంటుంది. గతంలో వాట్సాప్ డిసప్పియరింగ్ మెసేజ్ అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
ఈ ఫీచర్ తో మీరు పంపిన మెసేజ్‌లు వారం రోజుల తర్వాత ఆటోమేటిక్‌గా గతంలో డిలీట్ అయ్యేవి. అయితే ఇప్పుడు ఆ సమయాన్ని 24 గంటలకు తగ్గించేందుకు ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్/ డెస్క్‌టాప్‌లో వాట్సాప్ టెస్టింగ్ చేస్తున్నట్లు పేర్కొంది. వాట్సాప్ ఇప్పుడు టెలిగ్రామ్, సిగ్నల్ వంటి ప్రత్యర్థి యాప్ లతో పోటీపడుతున్న నేపథ్యంలో గతంలో వేగంగా కొత్త కొత్త ఫీచర్స్ తీసుకొస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment