వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్ | WhatsApp Users Can Now Set Different Wallpapers For Individual Chats | Sakshi
Sakshi News home page

వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్

Published Wed, Dec 9 2020 8:05 PM | Last Updated on Thu, Dec 10 2020 1:43 AM

WhatsApp Users Can Now Set Different Wallpapers For Individual Chats - Sakshi

వాట్సాప్ తన వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫీచర్స్ ని ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా మరో కొత్త ఫీచర్‌ని వినియోగదారులకు పరిచయం చేసింది. గత వారం క్రితం ఈ ఫీచర్ ని తీసుకొస్తున్నట్లు తన కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్‌ బీటా ఇన్ఫో ద్వారా తెలిపింది. ఇప్పుడు వచ్చిన కొత్త ఫీచర్ ద్వారా ఛాటింగ్‌ చేసేప్పుడు ప్రతి ఛాట్‌ పేజ్‌కి కొత్త వాల్‌పేపర్‌ను సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం కొత్తగా వాల్‌పేపర్‌ గ్యాలరీ అప్‌డేట్ చేశారు. ఈ రోజు నుండి వాట్సాప్ వినియోగదారులను వ్యక్తిగత చాట్‌ల కోసం వాల్‌పేపర్‌లను సెట్ చేసుకోవడనికి అనుమతి ఇచ్చింది.(చదవండి: షియోమి నుంచి మరో బెస్ట్ స్మార్ట్ ఫోన్

ప్రత్యేక వాల్‌పేపర్‌లను ఇలా సెట్ చేయండి:

  • ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి మీరు ఏదైనా ఖాతాను ఎంచుకోండి. 
  • ఇప్పుడు పైన ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేసి "వాల్‌పేపర్" ఎంచుకోండి.  
  • మీకు అక్కడ బ్రైట్, డార్క్, సాలిడ్ కలర్స్, మై ఫొటోస్ అనే ఆప్షన్ కనిపిస్తాయి.
  • పైన తెలిపిన వాటిలో మీకు నచ్చిన దాన్ని ఎంచుకున్న తర్వాత సెట్ వాల్‌పేపర్ క్లిక్ చేసి ఓకే నొక్కండి. 
  • ఇప్పుడు మీకు నచ్చిన వాల్‌పేపర్ అన్ని కాంటాక్ట్స్ లేదా మీకు ఇష్టమైన వాటికీ సెట్ చేసుకోవచ్చు.

వ్యక్తిగత చాట్‌ల కోసం వాల్‌పేపర్‌లతో పాటు, వాట్సాప్ వినియోగదారులకు కాంతి(లైట్) మరియు డార్క్ థీమ్‌ల కోసం వేర్వేరు వాల్‌పేపర్‌లను సెట్ చేయడానికి అనుమతి ఇచ్చింది. డార్క్ థీమ్‌ల కోసం వాల్‌పేపర్ డిమ్మింగ్ ఆప్షన్ కూడా తీసుకోని వచ్చింది. దీని ద్వారా థీమ్ బ్రైట్ నెస్ పెంచుకోవడంతో పాటు తగ్గించుకోవచ్చు కూడా. దీనికోసం వాట్సాప్ సెట్టింగ్ ఓపెన్ చేసి చాట్స్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇది డార్క్ థీమ్ కి మాత్రమే పని చేస్తుంది. మీరు డార్క్ థీమ్ ఎంచుకున్నాక  క్రింద ఉన్న "వాల్‌పేపర్" ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు వాల్‌పేపర్ డిమ్మింగ్ అనే కొత్త ఫీచర్ కనిపిస్తుంది. దీని ద్వారా మీరు మీ డార్క్ థీమ్ యొక్క బ్రైట్ నెస్ తగ్గించుకోవడం లేదా పెంచుకోవడం చేసుకోవచ్చు. ఐఓఎస్ యూజర్లు యాప్ స్టోర్, ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ కొత్త అప్‌డేట్ డౌన్‌లోడ్ చేసుకొని మీరు కూడా ట్రై చేయవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement