iOS
-
క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండిలా..
ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే ప్రస్తుతం చాలా ప్రకటనల్లో క్యూఆర్ కోడ్‌ను గమనిస్తుంటాం. ఆ కోడ్‌ను స్కాన్(Scan) చేస్తే నేరుగా సదురు ప్రకటన వివరాలు తెలుసుకోవచ్చు. పూర్తి సమాచారాన్ని ఫిజికల్‌గా ప్రకటనల్లో ఇవ్వడం కొన్నిసార్లు కుదరకపోవచ్చు. దాంతో చాలా కంపెనీలు క్యూఆర్(QR Code) కోడ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. కేవలం కంపెనీ ఉత్పత్తుల వివరాలే కాకుండా విద్య, వైద్యం, పరిశ్రమలు, బీమా రంగం.. ఇలా ఏ విభాగంలో చూసినా క్యూఆర్ కోడ్‌తో సమాచారాన్ని తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఏదైనా డివైజ్ల్ ఉన్న క్యూఆర్‌ను లేదా ఫేన్పే, జీపే వంటి లావాదేవీలకు సంబంధించిన క్యూఆర్‌ను స్కాన్ చేయడం సులువే. కానీ మీకు ఎవరైనా సాఫ్ట్‌కాపీ(Soft Copy) పంపించి అందులో క్యూఆర్ కోడ్ సమాచారం తెలుసుకోవాలంటే ఏం చేస్తారు.. మీకు వచ్చిన క్యూఆర్‌ను తిరిగి వేరే ఫోన్‌కు పంపించి అందులోనుంచి మీ డివైజ్‌లో స్కాన్ చేస్తారు కదా. ఇది అన్నివేళలా కుదరకపోవచ్చు. అలాంటి సమయంలో సులువుగా క్యూఆర్ స్కాన్ చేసే మార్గం ఉంది.గూగుల్ లెన్స్ఫోన్ స్క్రీన్ నుంచి నేరుగా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడానికి గూగుల్ లెన్స్‌ను వినియోగించడం సులువైన మార్గం. దీన్ని గూగుల్ సదుపాయం ఉన్న ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లలో ఉపయోగించవచ్చు.ఎలా ఉపయోగించాలంటే..ఫోన్లోని క్యూఆర్ కోడ్‌ను స్క్రీన్‌షాట్(Screen Shot) తీసుకోవాలి.గూగుల్ ఫోటోలు లేదా గూగుల్(Google) యాప్‌ను ఓపెన్ చేయాలి.సెర్చ్ బటన్ పక్కన లెన్స్ సింబల్ కనిపిస్తుంది. దాన్ని ప్రెస్ చేసిన వెంటనే గ్యాలరీకి యాక్సెస్ అడుగుతుంది.ఫోటోలకు యాక్సెస్ ఇచ్చి అప్పటికే స్క్రీన్‌షాట్ తీసుకున్న క్యూఆర్ కోడ్‌ను సెలక్ట్ చేసుకోవాలి.గూగుల్ లెన్స్(Google Lens)లోని కృత్రిమమేధ మీరు సెలక్ట్ చేసిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి నేరుగా అందులోని సమాచారాన్ని రీడైరెక్ట్ చేస్తుంది.వేరే ఫోన్ అవసరం లేకుండానే నేరుగా సాఫ్ట్‌కాపీ లేదా స్క్రీన్‌షాట్ తీసిన క్యూఆర్ వివరాలు తెలుసుకునేందుకు ఇలా ప్రయత్నించవచ్చు.ఇదీ చదవండి: భలే ఛాన్స్.. తగ్గిన బంగారం ధర! తులం ఎంతంటే..ప్రస్తుతం చాలా ఫోన్ తయారీ కంపెనీలు వాటి కెమెరాలు లేదా గ్యాలరీ యాప్‌ల్లోనే నేరుగా క్యూఆర్ కోడ్ స్కానింగ్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. అంటే గూగుల్ లెన్స్ అవసరం కూడా లేకుండానే నేరుగా కెమెరా ఆన్ చేసి క్యూఆర్‌ను స్కాన్ చేయవచ్చు. -
జనవరి 1 నుంచి వాట్సప్ పని చేయదు! కారణం..
ప్రముఖ ఆన్లైన్ మెసేజింగ్ యాప్ వాట్సప్ జనవరి 1, 2025వ తేదీ నుంచి కొన్ని ఫోన్లలో పని చేయదని మెటా ప్రకటించింది. ఇప్పటికీ చాలామంది వినియోగదారులు ఆండ్రాయిడ్ పాత వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తోనే వాట్సప్‌ను ఉపయోగిస్తున్నారని తెలిపింది. దాంతో వాట్సప్ అప్డేట్లు విడుదల చేసినప్పుడు ఆయా డివైజ్‌ల్లో పని చేయడం లేదని పేర్కొంది. వినియోగదారులకు మెరుగైన సర్వీసు, భద్రతను అందించేందుకు కంపెనీ అందిస్తున్న అప్డేట్లను పాత ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న వారు అందుకోలేకపోతున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. భవిష్యత్తులో భద్రత కారణాల వల్ల కొన్ని ఫోన్లలో వాట్సప్‌ను నిలిపేస్తున్నట్లు తెలిపింది. జనవరి 1, 2025 నుంచి వాట్సాప్ పని చేయని డివైజ్‌ల లిస్ట్‌కు ప్రకటించింది.సాంసంగ్: గెలాక్సీ ఎస్3, గెలాక్సీ నోట్ 2, గెలాక్సీ ఏస్ 3, గెలాక్సీ ఎస్4 మినీమోటరోలా: మోటో జి (1వ జనరేషన్), రేజర్ హెచ్డీ, మోటో ఈ 2014హెచ్‌టీసీ: వన్ ఎక్స్, వన్ ఎక్స్+, డిజైర్ 500, డిజైర్ 601ఎల్జీ: ఆప్టిమస్ జీ, నెక్సస్ 4, జీ 2 మినీ, ఎల్ 90సోనీ: ఎక్స్‌పీరియా జెడ్, ఎక్స్‌పీరియా ఎస్పీ, ఎక్స్‌పీరియా టీ, ఎక్స్‌పీరియా వీయాపిల్ ఓఎస్‌లోనూ..ఆండ్రాయిడ్‌తోపాటు యాపిల్ ఓఎస్ ఇన్స్టాల్ అయిన కొన్ని పరికరాల్లోనూ వాట్సప్ పని చేయదని మెటా తెలిపింది. అయితే అందుకు మే 5 వరకు గడువు ఉందని పేర్కొంది. జనవరి నుంచి ఐదు నెలల నోటీస్ పీరియడ్ ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఐఓఎస్ 15.1 వర్షన్ కంటే ముందున్న ఓఎస్‌లు వాడుతున్న డివైజ్‌ల్లో వాట్సప్ పనిచేయదని కంపెనీ తెలిపింది. కంపెనీ వివరాల ప్రకారం ప్రధానంగా ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్ వాడుతున్న వినియోగదారులపై ఈ ప్రభావం పడుతుంది.ఇదీ చదవండి: అప్పుడు పరీక్షలో ఫెయిల్.. గూగుల్‌లో జాబ్: జీతం తెలిస్తే..అప్డేట్లు ఎందుకు అవసరం అంటే..ఆన్లైన్ యాప్‌లు నిత్యం కొత్త అప్డేట్లు తీసుకొస్తుంటాయి. కొన్ని అప్డేట్లు వినియోగదారులకు మరింత మెరుగైన సర్వీసు అందించేలా ఉంటే, మరికొన్ని భద్రత పరమైనవి ఉంటాయి. పాత డివైజ్‌ల్లోని హార్డ్‌వేర్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను సపోర్ట్ చేయవు. దాంతో కొత్తగా వస్తున్న యాప్ అప్డేట్లు పాత ఓఎస్‌ల్లో పని చేయవు. ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఏదైనా అప్డేట్లు వస్తున్నప్పుడు అందుకు వీలుగా ఓఎస్‌లు, డివైజ్‌ల్లోని యాప్‌లను అప్డేట్ చేసుకోవడమే మేలని కొందరు సాంకేతిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఫ్లిప్‌కార్ట్‌పై మండిపడ్డ యూజర్: ఇంత అన్యాయమా అంటూ..
సాధారణంగా ఒక ప్రొడక్ట్ విలువ ఒక్కో యాప్‌లో.. ఒక్కో విధంగా ఉండొచ్చు. కానీ ఒకే యాప్‌లో ఒక ప్రొడక్ట్ ధర రెండు ఫోన్లలో వేరువేరు చూపిస్తే? ఇదెలా సాధ్యం, ఎక్కడైనా జరుగుతుందా.. అనుకోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే.సౌరభ్ శర్మ అనే ఐఓఎస్ యూజర్.. ఐఫోన్‌లోని ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో ఓ చిన్న క్యాబిన్ సూట్‌కేస్ కొనుగోలు చేయాలని చూసారు. అయితే దాని ధర రూ.4,799 అని చూపిస్తోంది. అదే ఉత్పత్తిని ఆండ్రాయిడ్ యాప్‌లో చూస్తే.. దాని ధర 4,119 రూపాయలుగా చూపిస్తోంది. ఈ రెండింటినీ సౌరభ్ స్క్రీన్ షాట్ తీసి, తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.ఆండ్రాయిడ్ vs ఐఓఎస్.. ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో వివిధ ధరలు అంటూ ఫోటోలను పోస్ట్ చేశారు. ధరలు ఎక్కువగా ఉండటమే కాకుండా నో కాస్ట్ ఈఎంఐలో కూడా వ్యత్యాసం కనిపిస్తోంది. ఆండ్రాయిడ్ యూజర్ నెలకు రూ. 1373 నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. ఐఓఎస్ యూజర్ నో కాస్ట్ ఈఎంఐ రూ. 1600 నుంచి ప్రారంభమవుతోందని ఇక్కడా చూడవచ్చు. ఇది చాలా అన్యాయమని సౌరభ్ శర్మ వెల్లడించారు.సౌరభ్ శర్మ.. ధరల వ్యత్యాసం గురించి ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ సపోర్ట్‌తో కూడా సంబంధించారు. ''విక్రయదారు వివిధ అంశాల ఆధారంగా ధరలు నిర్ణయిస్తారు. కాబట్టి ధరలలో మార్పు జరగవచ్చు. దయచేసి చింతించకండి. అమ్మకందారులు మీకు గొప్ప డీల్స్, డిస్కౌంట్లను అందించడానికి ఎల్లప్పుడూ తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. హ్యాపీ షాపింగ్'' అంటూ వెల్లడించారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా దీనిపైన స్పందిస్తూ ఇలాంటి అనుభవాలు తమకు కూడా ఎదురైనట్లు చెప్పుకొచ్చారు.Android vs iOS - different prices on @Flipkart App??same @my_mokobara cabin suitcase costs 4119₹ on FK Android App vs 4799₹ on iOS App.Apple charges 30% commission on subscriptions etc, so different pricing for iOS makes sense there.But for ecommerce? Very shady & unfair. pic.twitter.com/YmIq8nhuXO— Saurabh Sharma (@randomusements) October 30, 2024 -
కొత్త అప్డేట్..యాపిల్‌లో అదిరిపోయే ఫీచర్!
ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ ఎట్టకేలకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఓఎస్ 18.1ని విడుదల చేసింది. వినియోగదారులకు మరింత సేవలందిచేలా, యూజర్లను ఆకట్టుకునే కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. ప్రధానంగా గతంలో ఐఓఎస్ వర్షన్లో లేని కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను కొత్త ఓఎస్‌లో ప్రవేశపెట్టింది. దాంతోపాటు యాపిల్ ఇంటెలిజెన్స్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఐఫోన్ వినియోగదారులు గతంలో తమ కాల్స్‌ను రికార్ట్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని యాపిల్ కొత్తగా ప్రవేశపెట్టిన ఐఓఎస్ 18.1లో ఈ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఈ రికార్డ్ చేసిన కాల్ డేటాను రియల్‌టైమ్ ట్రాన్స్క్రిప్షన్ ద్వారా టెక్స్ట్ ఫార్మాట్లో అందించేందుకు వీలుగా యాపిల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. అంటే మీరు ఫోన్లో మాట్లాడే మాటలు రికార్డ్ అవ్వడంతోపాటు మీ కన్వర్జేషన్ మొత్తం టెక్స్ట్ ఫార్మాట్లోకి మారుతుంది. అయితే ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జాపనీస్, కొరియన్, ఫోర్చుగీస్, స్పానిష్..వంటి భాషల్లో అందుబాటులో ఉందని తెలిపింది.మీ ఐఫోన్ల్లో కాల్స్ రికార్డ్ చేయడానికి ముందుగా డివైజ్ సెట్టింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఐఓఎస్ 18.1 వర్షన్‌ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది.ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లుయాపిల్ ఇంటెలిజెన్స్ అనేది ఏఐ పవర్డ్ టూల్స్ సూట్‌గా పని చేస్తోంది.మెయిల్, మెసేజ్‌లు, నోట్స్ వంటి యాప్‌లలో సమగ్ర సమాచారాన్ని క్లుప్తంగా అందిస్తుంది.మెయిళ్లు, మెసేజ్‌లకు సంక్షిప్తంగా యూజర్ అనుమతితో రిప్లై ఇస్తుంది.ఏదైనా టెక్ట్స్, ఆర్టికల్ రాసేప్పుడు ప్రూఫ్ రీడింగ్ చేస్తుంది. రైటింగ్ అసిస్టెంట్‌గా పని చేస్తుంది.గ్యాలరీ స్టోరేజీలో ప్రత్యేకమైన రోజుల్లో మీ ఫోటోలు, వీడియోలు కలెక్ట్ చేసి మెమోరీస్‌ను క్రియేట్ చేస్తుంది.యాప్స్ వాడుతున్నప్పుడు ఇంటర్నల్‌గా ఎదురయ్యే ల్యాగ్‌ను తగ్గించేందుకు టూల్‌ను క్లిన్ చేస్తూంటుంది.చాట్‌జీపీటీను ఇంటిగ్రేట్ చేస్తూ కావాల్సిన సమాచారం అందిస్తుంది.ఇదీ చదవండి: మూడు ప్లాంట్ల మూసివేత.. 10 వేల మందికి ఉద్వాసన!ఐఓఎస్ 18.1 అన్ని ఐఫోన్ మోడళ్లలో సపోర్ట్ చేయదు. ఐఫోన్ 11, 12, 13, 14, 15, 16, ఎక్స్ఎస్, ఎక్స్ఆర్, ఎస్ఈ(2వ ఎడిషన్) డివైజ్‌ల్లో మాత్రమే వినియోగించవచ్చు. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను మాత్రం ఐఫోన్ 16 సిరీస్, 15 ప్రో సిరీస్, 14 ప్రో సిరీస్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. -
మొన్న శాంసంగ్.. తాజాగా యాపిల్ ప్రొడక్ట్‌లపై కేంద్రం హైరిస్క్ అలర్ట్..
కేంద్రప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్-ఇన్) ఇటీవల శాంసంగ్ కంపెనీ ఉత్పత్తుల్లో అనేక లోపాలు ఉన్నాయని గుర్తించిన సంగతి తెలిసిందే. ఫలితంగా సైబర్ నేరస్థులు శాంసంగ్ ఫోన్లు వాడుతున్న లక్షల మంది వినియోగదారుల నుంచి తమ వ్యక్తిగత డేటాను దొంగలించే ప్రమాదం ఉందని సెర్ట్ పేర్కొంది. తాజాగా యాపిల్ ఉత్పత్తులకు కూడా ఇదే తరహాలో ప్రమాదం ఉందని కేంద్రం తెలిపింది. ఈ కంపెనీకి చెందిన పలు ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపం ఉన్నట్లు గుర్తించామని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (సెర్ట్-ఇన్) వెల్లడించింది. దీని వల్ల యూజర్ల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. యూజర్లు వెంటనే తమ ఉత్పత్తులను లేటెస్ట్ సెక్యూరిటీ అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఐఫోన్, యాపిల్ వాచ్, మ్యాక్ బుక్, ఐపాడ్, యాపిల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌లతో పాటు సఫారీ బ్రౌజర్లో ఈ భద్రతా పరమైన లోపాలను గుర్తించినట్లు సెర్ట్-ఇన్ తన అడ్వైజరీలో వివరించింది. ‘యాపిల్ ఉత్పత్తుల్లో పలు సెక్యూరిటీ లోపాలు బయటపడ్డాయి. దీని వల్ల హ్యాకర్లు యాపిల్ ఉత్పత్తుల్లోని భద్రతా పరిమితులను అధిగమించి యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే ప్రమాదం ఉంది’ అని సెర్ట్ తెలిపింది. ఈ లోపాలను హ్యాకర్లు గుర్తిస్తే సెక్యూరిటీ పరిమితులను అధిగమించగలరని, ఏకపక్షంగా కోడ్‌ను ఎగ్జిక్యూట్ చేసి కీలక సమాచారాన్ని పొందే ప్రమాదం ఉందని తెలిపింది. ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ 17.2 కంటే ముందు వెర్షన్లు, ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ 16.7.3 కంటే ముందు వెర్షన్లు, మ్యాక్ ఓఎస్ సొనోమా 14.2, వెంట్యురా 13.6.3, మానిటరీ 12.7.2, యాపిల్ టీవీ ఓఎస్ 17.2, యాపిల్ వాచ్ ఓఎస్ 10.2, సఫారీ 17.2 కంటే ముందు వెర్షన్లలో ఈ లోపాలను గుర్తించినట్లు సెర్ట్-ఇన్ వెల్లడించింది. కాగా.. యాపిల్ ఉత్పత్తులకు కేంద్రం గతంలోనూ పలుమార్లు ఇలాంటి అలర్ట్‌లు జారీ చేసింది. ఇదీ సంగతి: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు కేంద్రం హై అలర్ట్! ఇటీవలే శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కూడా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ 11, 12, 13, 14 ఓఎస్‌తో పనిచేసే శాంసంగ్ ఫోన్లలో భద్రతాపరమైన లోపం ఉందని, దీనివల్ల వినియోగదారులకు తెలియకుండానే వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని పేర్కొంది. కాబట్టి యూజర్లు లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని సెర్ట్-ఇన్ వివరించింది. -
ఐఫోన్లకు కొత్త అప్డేట్.. నయా ఫీచర్స్ భలే ఉన్నాయి!
అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తన ఐఫోన్ యూజర్ల కోసం ఐవోఎస్ iOS 16.4 అప్డేట్ను విడుదల చేసింది. తాజా అప్డేట్లో కొత్త ఎమోటికాన్‌ల (ఎమోజీ) సెట్, ఆడియో సపరేషన్, వెబ్సైట్ పుష్ అలర్ట్‌లు వంటి విభిన్న ఫీచర్లు ఉన్నాయి. దీంతో పాటు ఈ అప్డేట్లో iPadOS 16.4, tvOS 16.4, macOS వెంచురా 13.3 కూడా ఉన్నాయి. (వరల్డ్ బ్యాంక్ అధ్యక్ష బరిలో ఆయనొక్కరే.. అజయ్ బంగా ఎన్నిక లాంఛనమే!) కొత్త iOS అప్డేట్లో హ్యాండ్ గెశ్చర్స్, పింక్ హార్ట్, జెల్లీ ఫిష్, Wi-Fi చిహ్నంతో సహా మొత్తం 21 కొత్త ఎమోజీ చిహ్నాలు ఉన్నాయి. ఫోటోలకు సంబంధించి మరో ఫీచర్ కూడా ఈ అప్డేట్లో ఉంది. దీని ద్వారా iCloud షేర్ ఫోటో లైబ్రరీలలో డూప్లికేట్ ఫోటోలు, వీడియోలను తీసివేయవచ్చు. సోనీ ప్లేస్టేషన్ 5 డ్యూయల్‌సెన్స్ ఎడ్జ్ కంట్రోలర్‌కు ఇన్‌బిల్ట్ సపోర్ట్‌తో పాటు ఐఫోన్ 14 సిరీస్‌లో ఉన్న క్రాష్ డిటెక్షన్‌కు కొత్త అప్డేట్లో మెరుగుదల చేశారు. (ఆ మందులు వాడే వారికి ఊరట.. దిగుమతి సుంకం మినహాయింపు) iOS 16.4లో ఇంకా ఏమేమి ఉన్నాయంటే.. యాక్సెసిబిలిటీ సెట్టింగ్‌ల ద్వారా ఫ్లాష్ లేదా లైట్‌ను గుర్తించినప్పుడు వీడియో ఆటోమేటిక్‌గా డిమ్ అవుతుంది. జంతువులు, హ్యాండ్ గెశ్చర్స్, ఆబ్జెక్ట్స్ వంటి 21 కొత్త ఎమోజీలు యాడ్ అయ్యాయి. వీటిని ఎమోజీ కీబోర్డ్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు iCloud షేర్డ్ ఫోటో లైబ్రరీలో డూప్లికేట్ ఫోటోలు, వీడియోలను గుర్తించవచ్చు. వాయిస్ ఐసోలేషన్‌తో మెరుగైన వాయిస్ కాల్ నాణ్యత, ఇది యూజర్ వాయిస్‌కు ప్రాధాన్యతనిచ్చి ఎక్స్టర్నల్ వాయిస్‌ను నిరోధిస్తుంది. వాతావరణ యాప్ ద్వారా మ్యాప్‌ల కోసం వాయిస్ ఓవర్ సపోర్ట్ ఉంటుంది. వెబ్ యాప్ నోటిఫికేషన్లను హోమ్ స్క్రీన్‌కి జోడించవచ్చు. -
ఉబెర్ కొత్త డిజైన్: రైడర్లకు కొత్త ఫీచర్లు...ఇకపై ఈజీగా!
ముంబై: రైడ్ షేరింగ్ కంపెనీ ఉబర్ మరింత మెరుగ్గా యాప్‌ను తీర్చిదిద్దింది. రైడ్ సమయంలో యాప్‌ను ప్రతీసారి తెరవకుండానే లాక్ స్క్రీన్‌పైనే లైవ్ యాక్టివిటీతో రైడ్, వాహన వివరాలు, ట్రిప్ స్టేటస్‌ను చూడవచ్చు. తన హోమ్స్క్రీన్, కొత్త ఫీచర్ల రీడిజైన్ చేసింది. కస్టమర్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని తొలిసారి ఇలాంటి మార్పులు ప్రకటించింది. యాప్‌ను మునుపెన్నడూ లేనంత సులభంగా, స్పష్టంగా , పర్సనలైజ్డ్గా తీసుకొస్తున్నామని ఉడెర్ హెడ్ జెన్ యు అన్నారు. తద్వారా క్యాబ్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్ రైడ్ ట్రాకింగ్ ఈజీగా ఉండేలా ఇంటర్ఫేస్ని రూపొందించింది. సో నెక్ట్స్ రైడ్ లేదా ఆర్డర్ ఫుడ్ బుక్ చేస్తే, యాప్ కొద్దిగా భిన్నంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఐవోఎస్ ఉపకరణాలకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలో ఆండ్రాయిడ్ డివైసెస్‌కు విస్తరించనున్నట్టు కంపెన ప్రకటించింది. సర్వీసెస్ ట్యాబ్ సైతం పొందు పరిచింది. శరవేగంగా లైఫ్ గడిచిపోతున్న ప్రస్తుత తరుణంలో కొన్ని, సెకన్లలో యాప్ ద్వారా నావిగేట్ చేయగలిగే అవసరాన్ని అర్థం చేసుకున్నామని ఉబర్ ఇండియా దక్షిణాసియా సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ నితీష్ భూషణ్ అన్నారు. తక్కువ ట్యాప్‌లతో ప్రయాణాలను మరింత సులభంగా బుక్ చేసుకునేందుకు రైడర్లకు సహాయ పడేందుకు హోమ్‌స్క్రీన్‌ను అనుభవాన్ని కూడా మెరుగ్గా అందించనుంది. ఇందుకోసం 'సర్వీసెస్' ట్యాబ్‌ను జోడించింది. దీని ద్వారా కొత్త యాప్‌లో సమీపంలోని మోటో నుండి ఆటో, ఇంటర్సిటీ, అద్దెలు, ఇతర వాటితో పాటు నగరంలోని రైడర్లకు అందుబాటులో ఉన్న అన్ని ఉత్పత్తులను కనుగొనడానికి ఒక-స్టాప్ షాప్‌గా కూడా ఉపయోగపడనుంది. అలాగే కొత్తగా యాడ్ చేసిన 'యాక్టివిటీ హబ్' గత రాబోయే రైడ్లను ఒకే చోట ట్రాక్ చేయడంలో సహాయపడుతుందని ఉబెర్ తెలిపింది. -
వార్నింగ్: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి
మొబైల్ వినియోగదారులకు అలర్ట్. స్మార్ట్ఫోన్లలో మాల్వేర్ మరోసారి కలకలం రేపుతోంది. ఈ సారి ఏకంగా రెండు వందలకు పైగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్ ప్రమాదకరంగా గుర్తించారు సైబర్ సెక్యూరిటీ నిపుణులు. ఈ యాప్స్ మీ పరికరాన్ని సులభంగా కంట్రోల్ చేస్తాయి. అంతేకాకుండా మీకు తెలియకుండానే మీ బ్యాంక్ ఖాతాలను యాక్సెస్ పొంది అందులో డబ్బులు కూడా మాయం చేస్తాయి. థాయిలాండ్ మినిస్ట్రీ ఆఫ్ డిజిటల్ ఎకానమీ అండ్ సొసైటీ (DES), నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (NCSA) సంస్థలు ఈ ప్రమాదకరమైన యాప్‌లను గుర్తించాయి. వీటిని తొలగించేందుకు ఈ రెండు సంస్థలు ఇప్పటికే గూగుల్ (Google) యాపిల్ (Apple)ని సంప్రదించాయి. యాపిల్ తన కఠినమైన భద్రతా చర్యలతో తన iOSలో ఈ ప్రమాదాన్ని అడ్డుకునే అవకాశం ఉంది. కానీ గూగుల్ ఈ ప్రమాదాన్ని ఎలా నివారిస్తుందన్నదే సమస్యగా మారింది. ఈ యాప్స్ అన్నింటినీ తొలగించాలని థాయిలాండ్ మినిస్ట్రీ ఆఫ్ డిజిటల్ ఎకానమీ అండ్ సొసైటీ కోరింది. ఈ యాప్స్ ద్వారా హ్యాకర్లు మీ మొబైల్‌ను పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకుంటారు. తద్వారా మీ మెసేజెస్ చదవడం, బ్యాంకింగ్ లావాదేవీలపై నిఘా పెట్టడం, వ్యక్తిగత వివరాలు సేకరించడం, ఏటీఎం పిన్, కార్డ్ వివరాలను తెలుసుకోవడం లాంటివి జరగొచ్చు. ఒకవేళ మీ డివైజ్‌లో ఈ యాప్‌లను ఇన్స్టాల్ చేసుంటే మీ బ్యాటరీ డ్రెయిన్ లేదా పరికరం పనితీరు మందగించడం లాంటివి మార్పులును గమనిస్తారు. కనుక మీ స్మార్ట్‌ఫోన్ పనితీరులో ఏవైనా మార్పులు కనిపిస్తే వెంటనే అవసరం లేని యాప్స్ డిలిట్ చేయండి ఉత్తమం. లేదంటే డేటా బ్యాకప్ చేసి మొబైల్‌ను పూర్తిగా రీసెట్ చేయండి. -
సొంత ఓఎస్‌పై ప్రభుత్వ భారీ కసరత్తు: ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఖేల్ ఖతం?
న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ యూజర్లకు భారత ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించనుందా? సొంతంగా ఒక దేశీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించి, వినియోగదారులకు మరింత సురక్షితమైన అనుభవాన్ని అందించే ప్రాజెక్ట్‌పై పని చేస్తోందని విశ్వసనీయంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారిక ప్రకటనపై ఆసక్తి నెలకొంది. ఇండ్ ఓఎస్ పేరుతో తీసుకురానుంది. ప్రభుత్వం, స్టార్టప్‌లు , విద్యాసంస్థల చొరవతో దీన్ని రూపొందిస్తోంది. ఎపుడు, ఎలా లాంచ్ చేస్తుందనే దానిపై స్పష్టతేదు. ఇది యూజర్లకు ఒక కొత్త భారతీయ OS సురక్షితమైన అనుభవాన్ని అందించడమే కాకుండా Google, Appleకి దీటుగా గట్టి పోటీ ఇస్తుందని అంచనా. కాగా ప్రస్తుతం, గూగుల్ ఆండ్రాయిడ్ 97 శాతం వాటాతో టాప్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంటుండగా, ఐఫోన్కోసం రూపొందించిన ఆపిల్ ఐఓఎస్ వాటా పరిమితంగానే ఉంది. మరోవైపు నోకియా, శాంసంగ్, బ్లాక్‌బెర్రీ నోకియా, మైక్రోసాప్ట్ ,ఫైర్ఫాక్స్ లాంటి దిగ్గజాల ఆపరేటింగ్ సిస్టమ్స్ పెద్దగా ఆదరణకు నోచుకోలేకపోయాయి. ఈ క్రమంలో ఇండ్‌ఓఎస్ ఆవిష్కారంపై భారీ అంచనాలే ఉన్నాయి. -
ఐఫోన్ యూజర్లకు కొత్త సమస్య! యాపిల్‌పై ఆగ్రహం..!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఇటీవల విడుదల చేసిన ఐఓఎస్ అప్డేట్పై ఐఫోన్ వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ ఫోన్లలో ఈ కొత్త ఐఓఎస్‌ను అప్ డేట్ చేస్తే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని, వెంటనే పరిష్కరించాలని యాపిల్‌కు వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. మార్చి 14న ఐఫోన్లలో యాపిల్ అట్టహాసంగా ఐఓఎస్ 15.4ను అప్డేట్ విడుదల చేసింది. లేటెస్ట్ ఐఓఎస్ వెర్షన్లో ఫీచర్లు బాగున్నా..పనితీరు బాగాలేదంటూ వినియోగదారులు యాపిల్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త ఐఓఎస్ దెబ్బకు ఐఫోన్ బ్యాటరీ డెడ్ అయ్యిందంటూ ట్వీట్లలో ప్రస్తావిస్తున్నారు. మ్యాగ్జిమ్ షిషాకో అనే ట్విట్టర్ యూజర్ ఐఓఎస్ 'ఐఓఎస్ 15.4 అప్డేట్ తర్వాత నా ఐఫోన్ బ్యాటరీ డెడ్ అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. Since iOS 15.4 released yesterday on March.15 2022, many iPhone users started to notice that their iPhone storage has been increased 2x while some notice that they lost some GB of storage after updating to iOS 15.4 and battery life is also worse #Apple #iOS #iOS154 #iPhone — SaadPlayz (@isaadplayz) March 15, 2022 ఇప్పుడే ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌లో ఐఓఎస్ అప్డేట్ చేశా. ఇంతకు ముందు ఛార్జింగ్ పెడితే ఒకటి , లేదా రెండు రోజులు వినియోగించే వాడిని. కానీ ఇప్పుడు ఒక్కరోజు కాదు కదా.. సగం రోజులోనే ఫోన్ ఛార్జింగ్ అయిపోతుందని మరో యూజర్ తెలిపాడు. ios 15.4 battery drain is absolutely ridiculous. @Apple @AppleSupport Need to fix the issue asap or you’re gonna lose your customers very badly Model: iphone 13 mini Battery health: 100% — Nasarudheen (@Nasaruattu) March 19, 2022 నా ఐఫోన్‌కు ఛార్జింగ్ పెట్టా. 95పర్సంటేజ్, 97పర్సంటేజ్ అని చూపించింది. ఛార్జింగ్ తీసేస్తే 100పర్సెంట్ చూపిస్తుంది. ఐదు నిమిషాల తర్వాత ఆటోమెటిగ్గా ఫోన్ రీస్టార్ట్ అవుతుంది.ఛార్జింగ్ ఎంత పర్సంటేజ్ ఉందో కూడా చూపించడం లేదని మండిపడ్డాడు. ఇలా మైక్రోబ్లాగింగ్‌లో ఐఫోన్ వినియోగదారులు యాపిల్ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్లు చేస్తుండగా.. ఐఫోన్ యూజర్లకు తలెత్తిన సాంకేతిక సమస్యలపై యాపిల్ సంస్థ ఇంత వరకూ స్పందించలేదు. చదవండి: ఆపిల్ అదిరిపోయే ఫీచర్.. మాస్క్ పెట్టుకున్న ఫేస్ అన్‌లాక్! -
IOS 15.2 వెర్షన్ డౌన్లోడ్ చేసుకోండి.. సాక్షి.కామ్ని వీక్షించండి
ప్రియమైన సాక్షి.కామ్ వీక్షకులకు స్వాగతం. ఐఓఎస్ యాప్ అప్డేట్ (IOS) వెర్షన్ 15.1 తో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ కారణంగా ఐఫోన్ యూజర్లకు కంటెంట్‌లో కొన్ని ఒత్తులు, అక్షరాలు తారుమారు అయ్యాయి. IOS లేటెస్ట్ వెర్షన్ 15.2 లో ఆ సమస్యలు పరిష్కరించబడ్డాయి. IOS లేటెస్ట్ వెర్షన్ 15.2 డౌన్లోడ్ చేసుకుని సాక్షి.కామ్‌ను వీక్షించండి. ధన్యవాదాలు. - సాక్షి డిజిటల్ ఇప్పుడు (IOS 15.2 వెర్షన్) ఇంతకు ముందు (IOS 15.1 వెర్షన్) -
ఐఫోన్లలో కొత్త సమస్యలా?.. ఇలా చేయండి
iphone iOS 15 Update Bugs: ఐఫోన్ యూజర్లకు కొత్త సమస్య వచ్చిపడింది. ఐవోఎస్ 15 అప్డేట్తో గుడ్‌న్యూస్ అందించిన యాపిల్.. ఆ తర్వాత ఎదురవుతున్న ‘స్టోరేజ్ ఫుల్’ బగ్ విషయంలో మాత్రం త్వరగతిన పరిష్కారం చూపించడం లేదు. యాపిల్ తన ఐఫోన్ యాజర్ల (ఐఫోన్ 6ఎస్ మోడల్ మొదలు తర్వాతి వెర్షన్లు) కోసం ఈ మధ్యే ఐవోఎస్ 15 అప్డేట్ తీసుకొచ్చింది. 2021 సెప్టెంబరు 20 నుంచి ఈ అప్డేట్ని యూజర్లకు అందిస్తోంది. అయితే ఈ అప్డేట్ చేసుకున్న వెంటనే యూజర్లకు ‘ఫోన్ మొమరీ ఫుల్’ అనే పాప్-అప్ చూపిస్తోందట. దీంతో వేల మంది ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక ఈ సమస్యపై కంగారుపడాల్సిన అవసరం లేదని యాపిల్ చెబుతోంది. iPhone storage almost full బగ్ పరిష్కారం కోసం సింపుల్‌గా ఫోన్‌ను రీస్టార్ట్ చేయమని సూచిస్తోంది. కానీ, అలా చేసినా కూడా చాలామందికి సమస్య తీరడం లేదంట. పైగా కొందరికి ఫోన్లో ఉన్న స్పేస్ కంటే.. ఎక్కువ స్టోరేజ్ చూపిస్తోందని చెప్తున్నారు. ఇక ఐఫోన్లతో పాటు ఐప్యాడ్‌లలోనూ ఇదే తరహా సమస్య ఎదురవుతోందట. సమస్య గురించి ప్రస్తావిస్తున్న వాళ్లందరికీ ఓపికగా రిప్లైలు ఇస్తున్న యాపిల్.. సమస్య ఏంటన్నది మాత్రం చెప్పడం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ.. ఐవోఎస్ 15 వెర్షన్ అప్డేట్ చేసుకున్న ఐఫోన్లలో ఇన్స్టాగ్రామ్ యాప్ సరిగా పని చేయడం లేదని తెలుస్తోంది. వీడియోలు, స్టోరీల విషయంలో సౌండ్ పని చేయడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు కొందరు. అయితే ఇన్స్టాగ్రామ్ 206.1 వెర్షన్ మాత్రం ఈ బగ్‌ను ఆటోమేటిక్‌గా ఫిక్స్ చేసుకోవడం విశేషం. యాపిల్ సపోర్ట్ కమ్యూనిటీ ఫోరమ్‌లోనూ స్టోరేజ్ బగ్ ఇష్యూ తలెత్తడం కొసమెరుపు. ఇక యాపిల్ యూజర్ల కోసం 14.8 నుంచి ఐవోఎస్ 15 అప్డేట్కి చేరింది. తద్వారా ఫోన్ పనితీరులో మరింత మెరుగు అవుతుందని యాపిల్ పేర్కొంది. ముఖ్యంగా కనెక్టివిటీ, ఫోకస్, ఎక్స్ప్లోర్ విభాగంలో అప్డేట్ బాగా పని చేస్తుందని చెబుతోంది. ప్రస్తుతం బగ్ ఫిక్స్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు యాపిల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కానీ, ఎంత టైం పడుతుందనేది చెప్పలేదు. చదవండి: యాపిల్ అదిరిపోయే ఆఫర్, ఐఫోన్ 13పై రూ.46వేల వరకు.. -
హెల్త్‌కేర్...యాప్ హుషార్
ఒకప్పుడు అరచేయి చూస్తే చాలు ఆరోగ్యం గురించి చెప్పేసేవారట. ఇప్పుడు అరచేయిలో ఇమిడిపోయే మొబైల్ ఫోన్ చూసి ఆరోగ్య చరిత్ర చెప్పేస్తున్నారు. వ్యక్తికి సంబంధించిన శారీరక, మానసిక ఆరోగ్య విశేషాలు, వ్యాధులు, చికిత్సల చరిత్ర, వ్యాక్సినేషన్, చేయించుకున్న శస్త్రచికిత్సలు,వాడిన/వాడుతున్న మందులు.. వంటివన్నీ ఒకే చోట అందించే యాప్స్‌కు ఇప్పుడు అమాంతం డిమాండ్ పెరిగిపోయింది. కరోనా తర్వాత వ్యక్తిగత ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధ హెల్త్‌కేర్ యాప్స్ వెల్లువకు కారణమైంది. చదవండి: పది కోట్ల ప్రైజ్‌మనీ రేసులో మన బిడ్డ ప్రతి వ్యక్తి తనకు తానే ఆరోగ్య వ్యవస్థను నిర్వహించుకునే అవకాశాన్ని ఈ యాప్స్ ఇస్తున్నాయి. ఉన్న చోట నుంచి కదలకుండా అందించే టెలి మెడిసిన్ ఆరోగ్య సంరక్షణ విషయంలో చికిత్స మాత్రమే కాకుండా వ్యాధులు రాకుండా నివారణకు కూడా వీలు కల్పిస్తాయి. సమగ్రమైన నిర్వహణ ఉపకరణంగా డాక్టర్లు / రోగుల నడుమ వారధిగా హెల్త్‌కేర్ యాప్ నిలుస్తుంది. ఈ యాప్ ఆండ్రాయిడ్, వెబ్ పోర్టల్, ఐఓఎస్‌ల ద్వారా లభ్యమవుతుంది. ‘‘ప్రస్తుతం, ఆరోగ్యరంగంలో వేగవంతమైన వృద్ధి నమోదవుతోంది. హెల్త్‌కేర్ పరిశ్రమలో సరికొత్త ఆవిష్కరణలు పుంజుకుంటున్నాయి. . మారిన వాతావరణంలో రోగులు, డాక్టర్ల నడుమ అంతరాలను పూరించే ఉపకరణాల అవసరం బాగా పెరిగింది. వ్యాధులకు చికిత్సలను అందుకోవడంలో రోగుల వెతలను తగ్గించాలనే లక్ష్యంతో విడుదలవుతున్న నూతన యాప్స్ మెరుగైన ఫలితాలను పొందడంలో రోగులకు సహాయపడతాయి. ఒకే యాప్‌తో మొత్తం కుటుం ఆరోగ్యాన్ని కూడా నిర్వహించవచ్చు’’అని ఇటీవలే ఈ తరహా యాప్‌ను విడుదల చేసిన డిజిటల్ హెల్త్‌కేర్ స్టార్టప్ హీల్ఫా సిఇఒ రాజ్ జనపరెడ్డి అభిప్రాయపడ్డారు. ‘‘ఈ యాప్ పై రోగికి సంబంధించిన ఆరోగ్య రికార్డులన్నీ ఒక్క క్లిక్‌లో డాక్టర్‌తో పాటుగా రోగికి సైతం లభ్యమవుతాయి. అంతేకాదు డిజిటల్ చెల్లింపులకు సైతం సహకరిస్తుంది. టెలి కన్సల్టేషన్తో రోగులు ఏ సమయంలో అయినా, ఎక్కడ నుంచైనా డాక్టర్లను సంప్రదించవచ్చు’’నని చెప్పారాయన. చదవండి: Xiaomi : మరో అద్బుతమైన టెక్నాలజీ ఆవిష్కరించనున్న షావోమీ..! -
వాట్సప్ యూజర్లకు షాక్.. ఇక ఆ ఫోన్లకు కొత్త ఫీచర్స్ నిలిపివేత!
ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను తీసుకోస్తూ వినియోగదారులను ఆశ్చర్య పరచడం వాట్సప్‌కు సహజం. ఇటు ఆండ్రాయిడ్, అటు ఐఓఎస్ వినియోగదారులకు కొత్త ఫీచర్లను అందించే వాట్సప్ యూజర్లకు షాకింగ్ న్యూస్ తెలిపింది. నవంబర్ 1, 2021 నుంచి పలు మోడళ్లలో వాట్సప్ కొత్త ఫీచర్స్ పని చేయవని పేర్కొంది. ఆండ్రాయిడ్ 4.0.3 లేదా అంతకంటే తక్కువ ఓఎస్ మీద రన్ అవుతున్న ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఓఎస్ 9 లేదా అంతకంటే తక్కువ రన్ అవుతున్న ఆపిల్ ఫోన్లలో వాట్సప్ కొత్త ఫీచర్స్ ఇక పని చేయవు. ఈ పలు మోడలళ్లలో కొత్త ఫీచర్ అప్డేట్ చేయడానికి వర్షన్ సపోర్టు చేయదని అందుకే వీటికి వాట్సప్ కొత్త ఫీచర్స్ నిలివేస్తున్నట్లు పేర్కొంది. ఇది క్రమ క్రమంగా ఈ పాత స్మార్ట్ ఫోన్లపై వాట్సప్ నిలిపివేసే అవకాశం ఉంది. యూజర్లకు మెరుగైన సదుపాయం అందించడం కోసం ఇలా చేస్తున్నట్లు సంస్థ పేర్కొంది. వాట్సప్ విడుదల చేసిన ఆండ్రాయిడ్ ఫోన్ల జాబితాలో శామ్ సంగ్, ఎల్ జీ, జడ్ టీఈ, హువావే, సోనీ, అల్కాటెల్ వంటి తదితర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. మరోవైపు ఐఫోన్ల జాబితాలో ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ఉన్నాయి.(చదవండి: భారత తొలి ఎలక్ట్రిక్ కారు ఇదేనండోయ్..!) -
ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్..!
ఆపిల్ యూజర్లకు వాట్సాప్ గుడ్‌న్యూస్‌ను అందించింది. ఆపిల్ యూజర్లకు మరో అద్భుతమైన ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. ఇకపై వాట్సాప్ ఐవోఎస్ నుంచి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు చాట్ బదిలీ చేసే ఫీచర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ నెల ప్రారంభంలో శాంసంగ్ అన్‌ప్యాక్ట్ 2021 ఈవెంట్లో తొలి సారిగా ఐఫోన్ టూ ఆండ్రాయిడ్ వాట్సాప్ చాట్ బదిలీ ఫీచర్‌ను ప్రకటించింది. డబ్ల్యూఏబెటాఇన్ఫో ప్రకారం ఎంపిక చేయబడిన ఆపిల్ ఐవోఎస్ ఫోన్లకు అందుబాటులో ఉందని వెల్లడించింది. ఐవోఎస్ వెర్షన్ 2.21.160.16 వాడుతున్న యూజర్లకు వాట్సాప్ చాట్ ఫీచర్ బదిలీ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో లేదు. ఐఫోన్లో వాట్సాప్ వెర్షన్ 2.21.160.16 వాడుతున్న వారికి వాట్సాప్ యాప్ సెట్టింగ్స్‌లో ‘ట్రాన్సఫర్ టూ ఆండ్రాయిడ్’ అనే ఫీచర్ కన్పిస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌తో శాంసంగ్ కంపెనీకి చెందిన మొబైల్ ఫోన్లకు మాత్రమే చాట్ బదిలీ ఫీచర్ అందుబాటులో ఉంది. (చదవండి: ఐమాక్స్ వీడియో రికార్డింగ్ ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం...!) త్వరలోనే ఇతర కంపెనీ స్మార్ట్ఫోన్లకు అందుబాటులో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ చాట్లను బదిలీ చేసుకోవడానికి dr.fone వంటి థర్డ్‌పార్టీ యాప్స్ అందుబాటులో ఉండేవి. అంతేకాకుండా ఈ సర్వీస్‌ను ఉపయోగించుకోవాలంటే కొంత అమౌంట్‌ను వెచ్చించాల్సి ఉంటుంది. ఈ యాప్ థర్డ్పార్టీది కావడంతో యూజర్లకు భద్రతకు భంగం వాటిల్లే అవకాశం ఉంది. (చదవండి: కెమెరా ఇన్నోవేషన్ ల్యాబ్‌కు వేదికానున్న హైదరాబాద్) -
Pegasus: కాస్ట్లీ గూఢచారి.. పెగాసస్!
పెగాసస్ స్పైవేర్ రహస్యాల పుట్ట పగులుతోంది.. ఒక్కటొక్కటిగా వివరాలు వెల్లడవుతూంటే.. ముక్కున వేలేసుకోవడం.. సామాన్యుల వంతు అవుతోంది! నేతలు, విలేకరులు, హక్కుల కార్యకర్తలు..బోలెడంత మందిపై నిఘానేత్రానికి అయిన ఖర్చెంత? వ్యాప్తి ఏ మేరకు? ఏం చేయగలదు? ఎలా చేస్తుంది? పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం సామాన్యుల వల్ల అయ్యే పని కానే కాదు. ఎన్ఎస్ఓ టెక్నాలజీస్ స్వయంగా చెప్పినట్లు, ప్రభుత్వాలు, ప్రభుత్వ నిఘా సంస్థలు మాత్రమే కొనుగోలు చేయగలవు. ఉపయోగించగలవు. ఖరీదు కోట్లలోనే. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం మొదలుకొని నిఘా వేయాల్సిన ఫోన్లు, డెస్క్‌టాప్‌ల సంఖ్య, ఏ రకమైన వివరాలు కావాలి? వంటి అనేక అంశాలకు వేర్వేరుగా ఛార్జీలు వసూలు చేస్తుంది ఎన్ఎస్ఓ టెక్నాలజీస్. 2016లో న్యూయార్క్ టైమ్స్ సేకరించిన వివరాల ప్రకారం చూస్తే.. పెగాసస్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చార్జీనే దాదాపు రూ.3.5 కోట్లు ఉంటుంది. ఐఫోన్/ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు పదింటిపై నిఘా పెట్టేందుకు అయ్యే ఖర్చు ఇంకో రూ.నాలుగు కోట్లు ఖరీదు చేస్తుంది. అప్పట్లో విస్తృత వాడకంలో ఉన్న బ్లాక్‌బెర్రీ ఫోన్లు ఐదింటిపై నిఘా పెట్టేందుకు రూ.3.5 కోట్లు, ఇన్నే సింబియాన్ ఫోన్లకు రూ.కోటి వరకూ అవుతుందని న్యూయార్క్ టైమ్స్ కథనం తెలిపింది. ఇది బేసిక్ ప్యాకేజీ.. నిఘా వేయాల్సిన స్మార్ట్ఫోన్ల సంఖ్య ఇంకో వంద పెరిగితే రూ.5.5 కోట్లు వదిలించుకోవాలి. ఇంకో యాభై మందిపై నిఘాకు రూ.3.5 కోట్లు, సంఖ్య 20 అయితే కోటి రూపాయలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కాకుండా.. మెయింటెన్స్ ఛార్జీలు మొత్తం ఛార్జీల్లో 17 శాతం వరకూ ఉండగా.. నిర్దిష్ట సమయం తరువాత రెన్యువల్ ఛార్జీలు వేరుగా చెల్లించాల్సి ఉంటుంది. భారత్‌లో పెగాసస్ సాఫ్ట్వేర్ బారిన పడ్డ వారి సంఖ్య దాదాపు 300 అన్నది నిజమైతే.. మొత్తం ఖర్చు సుమారు 40 లక్షల డాలర్లు లేదా రూ.28 కోట్లు అవుతుందన్నమాట. మెయింటెనెన్స్ చార్జీలు, ఇతర ఖర్చులు కూడా కలుపుకుంటే.. మొత్తం ఖర్చు రూ.యాభై కోట్ల వరకూ అయి ఉండవచ్చునని అంచనా. 2016 నాటి లెక్కలకు ద్రవ్యోల్బణం తదితర అంశాలను జోడించి చూస్తే.. ప్రస్తుతం పెగాసస్ సాఫ్ట్వేర్ కోసం కనీసం రూ.వెయ్యికోట్ల కంటే ఎక్కువే ఖర్చుఅయి ఉండాలి. అన్నింటిలోకీ చొరబడిందా? భారత్‌లో పెగాసస్ సాఫ్ట్వేర్ ద్వారా 300 మందిపై నిఘా వేసేందుకు ప్రయత్నాలు జరిగాయని వార్తలొచ్చాయి. అయితే వీరందరి స్మార్ట్ఫోన్లలోనూ ఆ స్పైవేర్ జొరబడిందా? అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాచారం లేదు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు చెందిన సెక్యూరిటీ ల్యాబ్ 67 స్మార్ట్ఫోన్లను పరిశీలించగా ఇరవై మూడింటిలో స్పైవేర్ ఉందని, ఇంకో 14 వాటిలో లోనికి జొరబడే ప్రయత్నం జరిగిన ఆనవాళ్లు ఉన్నాయని ‘ద వైర్’ ఒక కథనంలో తెలిపింది. మిగిలిన 30 మంది స్మార్ట్ఫోన్ల పరీక్షలు ఏ రకమైన ఫలితమూ ఇవ్వలేదని, ఫోన్లను వదిలించుకోవడం ఇందుకు కారణం కావచ్చునని తెలిపింది. రెండేళ్ల క్రితం పార్లమెంటరీ కమిటీ విచారణ ఈ అంశంపై 2019లో ఐటీపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ విచారణ జరిపింది. అప్పట్లో ఈ సాఫ్ట్వేర్ 121 మందిపై ప్రభావం చూపినట్లు సమాచారం. తమిళనాడులోని కుడంకుళం అణువిద్యుత్ కేంద్రంపై, అణుశక్తి విభాగాలపై సైబర్ దాడి జరిగిందని తెలిసింది. కుడంకుళం అణువిద్యుత్ కేంద్రం పరిపాలన విభాగంపై ఈ సాఫ్ట్వేర్ దాడి చేసినట్లుగా సమాచారం. అయితే కేంద్ర హోంశాఖ, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు ఈ అంశంపై ఎలాంటి వ్యాఖ్య చేయకపోవడం గమనార్హం. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన విచారణలో భాగంగా 17 మందిని విచారించినట్లు, ఇందులో మానవహక్కుల కార్యకర్తలతోపాటు జగదల్పూర్ లీగల్ ఎయిడ్ సభ్యులు ఉన్నారు. మొత్తం విచారణపై కమిటీ ఏ రకమైన నివేదిక ప్రభుత్వానికి సమర్పించకపోవడం కొసమెరుపు! చొరబడేది ఇలా... ► ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎన్ఎస్ఓ టెక్నాలజీస్ సిద్ధం చేసిన పెగాసస్ సాఫ్ట్వేర్ ఇంటర్నెట్ ఉన్న స్మార్ట్ఫోన్లలోకే చొరబడుతుంది. తాజా వెర్షన్లు ఫోన్‌కు వచ్చిన లింకులు, మెసేజ్‌ను క్లిక్ చేయకుండానే సాఫ్ట్‌వేర్‌ను జొప్పించగలదని చెప్తున్నారు. ► స్పైవేర్, స్టాకర్వేర్లు యాంటీ థెఫ్ట్ (ఫోన్ చోరీకి గురికాకుండా చూసేవి) అప్లికేషన్ల రూపంలో వస్తూంటుంది. యాంటీ వైరస్ సాఫ్ట్వేర్లు స్మార్ట్ఫోన్లలోకి జొరబడే వైరస్, మాల్వేర్లను గుర్తించగలదు. స్పైవేర్, స్టాకర్వేర్లు వీటి కంటపడకుండా మనకు ఏదో ఉపయోగాన్ని ఇచ్చేవన్న ముసుగులో మన స్మార్ట్ఫోన్లలోని సమాచారాన్ని సెంట్రల్ సర్వర్‌కు పంపుతూ ఉంటుంది. ► ఒక్కసారి లోనికి జొరబడితే పెగాసస్ లాంటి స్పైవేర్లు బ్యాక్‌గ్రౌండ్‌లోనే పనిచేస్తూంటాయి. వాట్సాప్, ఎస్ఎంఎస్ వంటి అప్లికేషన్ల సాఫ్ట్వేర్లలో ఉండే లొసుగులను ఆసరాగా చేసుకుని పనిచేస్తుంది ఇది. అంతేకాదు.. పెగాసస్ స్మార్ట్‌ఫోన్ ‘రూట్ ప్రివిలైజెస్’ను పొందేందుకు ప్రయత్నిస్తుంది. ఈ రూట్ ప్రివిలైజెస్తో పెగాసస్ తనకు అవసరమైన వివరాలు సేకరించేందుకు తగిన సాఫ్ట్‌వేర్‌ను ఫోన్లో ఇన్స్టాల్ చేయగలదు. ఈ క్రమంలో ఫోన్ అడ్మినిస్ట్రేటర్‌గానూ ఈ పెగాసస్ మారిపోతుంది. సోకిన తరువాత...? రిమోట్ సర్వర్ ద్వారా అందే సూచనతో మన ఫోన్ పనిచేస్తూంటుంది. అవసరమనుకుంటే.. మన కెమెరా ఆటోమెటిక్‌గా ఓపెన్ అయిపోతుంది. ఫొటోలు తీసేస్తుంది కూడా. అంతేకాకుండా.. మైక్రోఫోన్ ఆన్ చేసి మన మాటలు రికార్డ్ చేయడం, లేదా ఎస్ఎంఎస్, వాట్సప్ సందేశాల్లోని సమాచారాన్ని సర్వర్‌కు చేరవేడం చేయగలదు. కేలండర్‌లోకి జొరబడి మన అపాయింట్మెంట్లను గుర్తిస్తుంది. గుర్తించేంత వరకూ రిమోట్ సర్వర్‌కు సంకేతాలు పంపుతూనే ఉంటుంది. పెగాసస్ సాఫ్ట్వేర్ ప్రభుత్వాల వద్ద మాత్రమే ఉంటుంది. జాతీయ భద్రత, ఉగ్రవాదం మినహా మిగిలిన అంశాల కోసం భారత ప్రభుత్వం ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఉంటే అది కచ్చితంగా అక్రమమే. ఒకవేళ ప్రభుత్వం వాడకపోయి ఉంటే మరీ ప్రమాదం. జాతీయ భద్రతకు భంగం కలిగినట్లే. పెగాసస్ సాఫ్ట్‌వేర్‌పై న్యాయ విచారణ జరగాల్సిందే – శశి థరూర్, ఐటీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లకు గూగుల్ శుభవార్త..!
ఆపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్‌కు క్రేజ్ మామూలుగా ఉండదు. సెక్యూరిటీ విషయంలో ఇతర మొబైల్ ఫోన్లతో పోలిస్తే ఆపిల్ ఐఫోన్‌కు పోటి అసలు ఉండదు. ఐఫోన్‌ను చాలా మంది వినియోగించడానికి ప్రధాన కారణం భద్రత. ఆపిల్ తన వినియోగదారుల ప్రైవసీ,భద్రత విషయంలో అసలు రాజీ పడదు. అంతేకాకుండా ఆపిల్ ఐఫోన్ ఒక వేళ పోయినా, దొంగలించిన, తిరిగి ఫోన్‌ను పొందగలిగే టెక్నాలజీ ఆపిల్ సొంతం. ఐఫోన్లలోని టెక్నాలజీ రానున్న రోజుల్లో ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా రానుంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ‘ఫైండ్ మై డివైజ్’ పేరిట ఉన్నప్పటికీ ఈ సదుపాయాన్ని మరింత అదనంగా కొత్త ఫీచర్లను యాడ్ చేయాలని గూగుల్ భావిస్తోంది. ‘ఫైండ్ మై నెట్వర్క్’ పేరిట ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ తీసుకురానుంది. గూగుల్ ‘ఫైండ్ మై డివైజ్’తో మొబైల్ ఫోన్‌ను ట్రాక్ చేయవచ్చును. ఫైండ్ మై డివైజ్‌లో మెయిల్ ఐడీ, పాస్వర్ఢ్తో లాగిన్ అయితే మొబైల్ ఉన్న లోకేషన్ చూపిస్తోంది. ఇది కేవలం పోయిన మొబైల్‌కు నెట్వర్క్ కనెక్టివీటీ, ఇంటర్నెట్ ఆన్ , జీపీఎస్ కనెక్షన్ ఆన్‌లో ఉంటేనే మొబైల్‌ను ట్రాక్ చేయగలము. కాగా ఆపిల్ తన ఐవోస్ 13లో భాగంగా ఫైండ్ మై డివైజ్‌కు అదనపు ఫీచర్లను జోడించి ఆపిల్ కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఐఫోన్లు, ఐపాడ్, ఆపిల్ తెచ్చిన ఎయిర్టాగ్స్తో గుర్తించవచ్చును. కాగా ప్రస్తుతం గూగుల్ ఫైండ్ మై నెట్వర్క్ ఫీచర్‌ను ప్రస్తుతం బీటా వర్షన్లో టెస్టింగ్ దశలో ఉంది. ఈ ఫీచర్ ఏవిధంగా పనిచేస్తోందని గూగూల్ టెస్ట్‌లను నిర్వహిస్తుంది. ఈ ఫీచర్‌తో సుమారు 3 బిలియన్ల ఆండ్రాయిడ్ యూజర్లకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఆపిల్‌లో ఫైండ్ మై డివైజ్ ఎలా పనిచేస్తుంది..? సాధారణంగా ఆపిల్ ఐఫోన్లలో ఫైండ్ మై డివైజ్ ఉన్న ఫీచర్లో ముందుగానే లాస్ట్ మై డివైజ్ ఆన్‌లో ఉండేలా చూసుకోవాలి. లాస్ట్ మై డివైజ్‌లో స్నేహితుల, లేదా ఇతర ఫోన్ నంబర్‌ను కచ్చితంగా ఎంటర్ చేయాలి. లాస్ట్ డివైజ్ సహకారంతో పోయినా మొబైల్ వేరేవారికి దొరికినా, లేదా దొంగిలించినా ఆ మొబైల్ స్విచ్చ్ ఆన్ చేయగానే మొబైల్ ఫోన్ లోకేషన్, మీరు ఇచ్చిన మొబైల్ నంబర్‌కు ఫోన్ లోకేషన్ వస్తోంది. అంతేకాకుండా ఈ ఆప్షన్‌తో మొబైల్ ఫోన్ ఆన్ చేయగానే మన ఫోన్ నంబర్ కనిపించేలా ఓ మెసేజ్‌ను చూపిస్తోంది. దీన్ని ముందుగానే లాస్ట్ మై డివైజ్‌లో ఎంటర్ చేస్తేనే కనిపిస్తోంది. చదవండి: ఆండ్రాయిడ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆపిల్ సీఈవో..! -
ఆండ్రాయిడ్ టీవీలో ఆపిల్ సినిమాలు
వెబ్‌డెస్క్ : ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ వినియోగదారులకు శుభవార్త ! ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ మీదే ఇకపై ఆపిల్ సినిమాలు చూసే అవకాశం వచ్చింది. తాజాగా ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌పై నడిచే టీవీల్లోనూ ఆపిల్ టీవీ అప్లికేషన్‌ను అందించేందుకు ఆపిల్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇప్పటికే ఆండ్రాయిడ్ 8 ఆపై వెర్షన్లతో నడుస్తున్న స్మార్ట్ టీవీలో ఆపిల్ టీవీ అప్లికేషన్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ప్లే స్టోర్‌లో ఆపిల్ టీవీ యాప్ డౌన్లోడ్ ట్రెండ్ మొదలైంది. పరిధి పెంచుతోంది టెక్నాలజీలో దిగ్గజ సంస్థల్లో ఒకటి యాపిల్. కొత్తదనం, నాణ్యత, బ్రాండ్ వాల్యూ అనే పదాలకు పర్యాయ పదంగా ఆపిల్ నిలిచిపోయింది. అయితే ఆపిల్ సంస్థ అందించే అన్ని సేవలు, అప్లికేషన్లు కేవలం ఐఓఎస్ ప్లాట్‌ఫారమ్‌పై పని చేసే మాక్‌పాడ్, ఐపాడ్, ఐఫోన్ తదితర ఆపిల్ డివైజ్‌లలోనే లభించేవి. దశబ్ధకాలం పాటు తన అప్లికేషన్లను ఇతర టెక్ ప్లాట్‌ఫారమ్‌లకు అందివ్వలేదు యాపిల్. అయితే గత కొంతకాలంగా పట్టువిడుపులు ప్రదర్శిస్తోంది ఆపిల్. అందులో భాగంగానే ఐఓఎస్‌కి సంబంధించిన ఆప్స్టోర్కి ఆవల అమెజాన్ ఫైర్ స్టిక్, ఎల్జీ వెబ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు ఆపిల్ టీవీ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్‌లోనూ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ విభాగంలో ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ల మధ్యే ప్రధాన పోటీ. అయితే ఆ పోటీని పక్కన పెట్టి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోనూ ఆపిల్ టీవీ అప్లికేషన్‌ను అందించేందుకు ఆపిల్ అంగీకరించింది. ఈ మార్పు కేవలం ఆండ్రాయిడ్ స్మార్ట్‌టీవీలకే పరిమితం చేసింది. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లకు ఆపిల్ టీవీని అందివ్వడం లేదు. విస్తరించేందుకే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద నడిచే టీవీలనే ఎక్కువ సంస్థలు తయారు చేస్తున్నాయి. స్మార్ట్‌టీవీ మార్కెట్లో వీటిదే సింహభాగం. ధర తక్కువగా ఉండటంతో ఎక్కువ మంది వీటినే కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆపిల్ టీవీకి విస్త్రృతమైన మార్కెట్ కల్పించేందుకు ఆండ్రాయిడ్ ఓఎస్ బెటర్ ఛాయిస్‌గా ఆపిల్ భావించింది. ఇప్పటికే చాలా మంది ఆండ్రాయిడ్ యూజర్లు ఆపిల్ టీవీ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఆపిల్ టీవీలో ఉన్న కంటెంట్‌కి చందాదారులుగా మారుతున్నారు. -
ఈ కొత్త వాట్సాప్ ఫీచర్ గురించి తెలుసా?
ప్రపంచ వ్యాప్తంగా అత్యదిక మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకువస్తూనే ఉంటుంది. గతంలో వాట్సాప్ డిసప్పియరింగ్ మెసేజ్ అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్ తో మీరు పంపిన మెసేజ్‌లు వారం రోజుల తర్వాత ఆటోమేటిక్‌గా గతంలో డిలీట్ అయ్యేవి. అయితే ఇప్పుడు ఆ సమయాన్ని 24 గంటలకు తగ్గించేందుకు ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్/ డెస్క్‌టాప్‌లో వాట్సాప్ టెస్టింగ్ చేస్తున్నట్లు పేర్కొంది. వాట్సాప్ ఇప్పుడు టెలిగ్రామ్, సిగ్నల్ వంటి ప్రత్యర్థి యాప్ లతో పోటీపడుతున్న నేపథ్యంలో గతంలో వేగంగా కొత్త కొత్త ఫీచర్స్ తీసుకొస్తుంది. -
4.4 కోట్లు కోల్పోయిన ఐఫోన్ యూజర్
ఎక్కువ శాతం యాపిల్ సెక్యూరిటీ చాలా కఠినంగా ఉంటుంది. అందుకే, దీనిని కొనుగోలుచేయడానికి ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతారు. కానీ, కొన్ని సార్లు హ్యాకర్లు యాపిల్ యూజర్లను కూడా హ్యాక్ చేసి డబ్బు సంపాదిస్తారు. ఇప్పడు అలాంటి సంఘటన ఒకటి తాజాగా జరిగింది. ఆపిల్ సంస్థ తన ఐఓఎస్ యాప్ స్టోర్‌లో ఉన్న నకిలీ క్రిప్టోకరెన్సీ యాప్ ను తొలగించడంతో ఐఫోన్ వినియోగదారుడు 6,00,000 డాలర్లకు పైగా నష్టపోయాయడు. ఇది మన ఇండియా కరెన్సీలో దాదాపు రూ.4.4 కోట్లకు సమానం. ఫిలిప్ క్రిస్టోడౌలౌ అనే వ్యక్తి తన దగ్గర ఉన్న 17.1 బిట్కాయిన్ల విలువను చెక్ చేయాలని అనుకున్నాడు. దీని కోసం ఐఫోన్ లో వాలెట్‌ను ఆక్సెస్ చేయడం కోసం అతను ఐఓఎస్ యాప్ స్టోర్‌లో అచ్చం ఒరిజినల్ యాప్ లాగానే ఉన్న ట్రెజర్ యాప్ ను డౌన్లోడ్ చేశాడు. ఈ యాప్ మోసగాళ్లు అమాయక ప్రజలను మోసం చేసి డబ్బును కొల్లగొట్టేవారు. ఈ యాప్ యూజర్ల రహస్య వివరాలను నమోదు చేయడానికి మోస పూరితంగా కనిపించేలా రూపొందించారు. అయితే, ఫిలిప్ క్రిస్టోడౌలౌ వెల్లడించిన వివరాల సహాయంతో హ్యాకర్లు 17.1 బిట్కాయిన్లను దొంగలించారు. బిట్ కాయిన్ అనేది ఒక డిజిటల్ కరెన్సీ కావడంతో హ్యాకర్ల పని చాలా తేలిక అయ్యింది. ఆపిల్ సంస్థ ఐఓఎస్ యాప్ స్టోర్‌లో ఉన్న నకిలీ క్రిప్టోకరెన్సీ యాప్ ను తొలగించడంతో తన బిట్కాయిన్లు దొంగలించినట్లు క్రిస్టోడౌలౌ తర్వాత తెలుసుకున్నాడు. దీని విలువ మన దేశంలో సుమారు రూ.4.4కోట్లు. మహమ్మారి కారణంగా నష్టపోయిన తన డ్రై-క్లీనింగ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి బిట్కాయిన్లు సహాయపడతాయని ఆశించాడు. కానీ ఇంతలో ఇలా జరిగింది. గూగుల్ ప్లే స్టోర్‌తో పోలిస్తే ఆపిల్ ఐఓఎస్ యాప్ స్టోర్ అత్యంత సురక్షితమైనదిగా పేరు ఉంది. చదవండి: వాళ్లందరికీ పన్ను మినహాయింపు: నిర్మలా సీతారామన్ -
ఆ ఫోన్లలో వాట్సప్ పని చేయదు
కొన్ని పాత ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది సంస్థ. 2021లో కొన్ని మొబైల్స్ లలో వాట్సాప్ పని చేయదని తెలిపింది. ఆండ్రాయిడ్ తో పాటు ఐఓఎస్ మొబైల్స్ కూడా వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. 2021లో ఐఓఎస్ 9, ఆండ్రాయిడ్ 4.0.3 కన్నా పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లతో పనిచేసే మొబైల్స్ లో 2021 నుండి వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. వాట్సప్ కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్స్ ని ఉపయోగించుకునేందుకు వినియోగదారులు కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించాలని వాట్సాప్ పేర్కొంది. మీరు కనుక వాట్సాప్ సేవలు వాడుకోవాలంటే ఓఎస్ 9, ఆండ్రాయిడ్ 4.0.3 ఆపై లేటెస్ట్ వర్షన్స్ స్మార్ట్ఫోన్లు మాత్రమే వాడాలి. అంతకన్నా పాత వర్షన్స్ వాడితే మీ మొబైల్ లో వాట్సప్ యాప్ పనిచేయదు.(చదవండి: నాలుగు బ్యాంకులతో వాట్సాప్ ఒప్పందం) -
వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్
వాట్సాప్ తన వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫీచర్స్ ని ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా మరో కొత్త ఫీచర్‌ని వినియోగదారులకు పరిచయం చేసింది. గత వారం క్రితం ఈ ఫీచర్ ని తీసుకొస్తున్నట్లు తన కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో ద్వారా తెలిపింది. ఇప్పుడు వచ్చిన కొత్త ఫీచర్ ద్వారా ఛాటింగ్ చేసేప్పుడు ప్రతి ఛాట్ పేజ్‌కి కొత్త వాల్‌పేపర్‌ను సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం కొత్తగా వాల్‌పేపర్ గ్యాలరీ అప్డేట్ చేశారు. ఈ రోజు నుండి వాట్సాప్ వినియోగదారులను వ్యక్తిగత చాట్ల కోసం వాల్పేపర్లను సెట్ చేసుకోవడనికి అనుమతి ఇచ్చింది.(చదవండి: షియోమి నుంచి మరో బెస్ట్ స్మార్ట్ ఫోన్) ప్రత్యేక వాల్పేపర్లను ఇలా సెట్ చేయండి: ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి మీరు ఏదైనా ఖాతాను ఎంచుకోండి. ఇప్పుడు పైన ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేసి "వాల్‌పేపర్" ఎంచుకోండి. మీకు అక్కడ బ్రైట్, డార్క్, సాలిడ్ కలర్స్, మై ఫొటోస్ అనే ఆప్షన్ కనిపిస్తాయి. పైన తెలిపిన వాటిలో మీకు నచ్చిన దాన్ని ఎంచుకున్న తర్వాత సెట్ వాల్‌పేపర్ క్లిక్ చేసి ఓకే నొక్కండి. ఇప్పుడు మీకు నచ్చిన వాల్‌పేపర్ అన్ని కాంటాక్ట్స్ లేదా మీకు ఇష్టమైన వాటికీ సెట్ చేసుకోవచ్చు. వ్యక్తిగత చాట్ల కోసం వాల్పేపర్లతో పాటు, వాట్సాప్ వినియోగదారులకు కాంతి(లైట్) మరియు డార్క్ థీమ్‌ల కోసం వేర్వేరు వాల్పేపర్లను సెట్ చేయడానికి అనుమతి ఇచ్చింది. డార్క్ థీమ్‌ల కోసం వాల్‌పేపర్ డిమ్మింగ్ ఆప్షన్ కూడా తీసుకోని వచ్చింది. దీని ద్వారా థీమ్ బ్రైట్ నెస్ పెంచుకోవడంతో పాటు తగ్గించుకోవచ్చు కూడా. దీనికోసం వాట్సాప్ సెట్టింగ్ ఓపెన్ చేసి చాట్స్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇది డార్క్ థీమ్ కి మాత్రమే పని చేస్తుంది. మీరు డార్క్ థీమ్ ఎంచుకున్నాక క్రింద ఉన్న "వాల్‌పేపర్" ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు వాల్‌పేపర్ డిమ్మింగ్ అనే కొత్త ఫీచర్ కనిపిస్తుంది. దీని ద్వారా మీరు మీ డార్క్ థీమ్ యొక్క బ్రైట్ నెస్ తగ్గించుకోవడం లేదా పెంచుకోవడం చేసుకోవచ్చు. ఐఓఎస్ యూజర్లు యాప్ స్టోర్, ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ కొత్త అప్డేట్ డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ట్రై చేయవచ్చు. -
గూగుల్ క్రోమ్ కొత్త లోగో
గూగుల్ తన అప్లికేషన్ లొగోలలో గత రెండు నెలల నుండి మార్పులు చేస్తుంది. తాజాగా గూగుల్ క్రోమ్ యొక్క లోగో కూడా మార్చనున్నట్లు తెలుస్తుంది. రెండు రోజుల క్రితం నుండి ఆపిల్ యొక్క కొత్త M1- టోటింగ్ మాక్స్‌లో గూగుల్ క్రోమ్ యొక్క కొత్త లోగో అందుబాటులో ఉంది. తదుపరి తీసుకు రాబోయే గూగుల్ క్రోమ్ యొక్క కొత్త లోగో బాగుంది అని కొందరి అభిప్రాయం. కొత్త క్రోమ్ చిహ్నాన్ని రూపొందించడానికి గూగుల్ పాత క్రోమ్ చుట్టూ ఒక పెట్టెను బ్యాక్ గ్రౌండ్ లో తీసుకొచ్చింది. గూగుల్‌లో డిజైనర్ మరియు డెవలపర్ అయిన ఎల్విన్ హు దీన్ని షేర్ చేసారు.(చదవండి: 5,000లలో బెస్ట్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్) As many of you noticed, we introduced a new Chrome icon for macOS Big Sur today ✨ The team has also been exploring some further macOS-aligned options (some examples here), and we’re interested in hearing what you think about them 🙏 pic.twitter.com/dUS70OZdCr — Elvin 🏳️🌈 (@elvin_not_11) November 17, 2020 పైన చెప్పుకున్న విదంగా మొదటి డిజైన్(ఎ) లోగో ఉంటుంది. B మరియు C డిజైన్ లలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. గూగుల్ తన అప్లికేషన్ లొగోలలో గత రెండు నెలల నుండి మార్పులు చేస్తుంది. అయితే ఈ కొత్త లుక్‌పై యూజర్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొంత మంది కొత్త లుక్ బావుదంటే మరికొందరు పాత లొగోలు బావున్నాయని అంటున్నారు. ముఖ్యంగా జీమెయిల్ లొగో విషయంలో పెద్ద చర్చే జరిగింది. -
వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్
వాట్సాప్ తన వినియోగదారుల కోసం మరో ఫీచర్ ని తీసుకురాబోతుంది. వీడియోలను ఇతరులకు పంపే ముందు మ్యూట్ చేయడం కోసం ఈ ఫీచర్ ని తీసుకురాబోతుంది. ఈ ఫీచర్ అనేది ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల తీసుకొచ్చిన మాదిరిగానే ఉండనుంది. ఈ ఫీచర్ గురుంచి వాట్సాప్ తన బ్లాగ్ లో పేర్కొంది. తాజా ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇది ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. భవిష్యత్ లో దీనిని అందరికీ అందుబాటులోకి తీసుకు రానున్నట్లు పేర్కొంది. వాట్సాప్ ఈ ఫీచర్ ని ఐఓఎస్ వినియోగదారుల కోసం తీసుకు వస్తారా? లేదా? అనేది తెలపలేదు. వాట్సాప్ తన బ్లాగ్ లో కొత్తగా తీసుకు రాబోయే ఫీచర్ యొక్క స్క్రీన్ షాట్‌ను కూడా షేర్ చేసింది. సీకర్ టూల్ కింద ఈ స్పీకర్ బటన్‌ను చూపిస్తుంది. వినియోగదారులు వారి వీడియోలను పంపే ముందు వాటిని కత్తిరించడానికి అనుమతిస్తుంది. స్పీకర్ ఐకాన్ ద్వారా ఫార్వార్డ్ చేస్తున్న వీడియోలపై సౌండ్ ని ఆన్ లేదా ఆఫ్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఈ క్రొత్త ఫీచర్ అనేది ఫార్వార్డ్ చేయబడిన వీడియోలు, యూజర్ల స్మార్ట్‌ఫోన్‌లో రికార్డ్ చేయబడిన వీడియోలపై పనిచేస్తుంది. -
అందరికి అందుబాటులోకి వాట్సాప్ కొత్త ఫీచర్
న్యూఢిల్లీ: ఈ నెల మొదట్లో డిస్అపియరింగ్ మెసేజెస్ ఫీచర్ ని విడుదల చేసింది వాట్సాప్. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ సందేశాలు వాటంతటవే అదృశ్యమవుతాయి. ఈ ఫీచర్ ఆన్ చేసిన సమయం నుండి ఆ చాట్‌లో పంపిన ఏదైనా సందేశం ఏడు రోజుల తర్వాత ఆటోమేటిక్ గా కనిపించకుండా పోతాయని తెలిపింది. తాజాగా ఈ ఫీచర్‌ని ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్‌లోని వాట్సాప్ వినియోగదారులందరికీ అందుబాటులో తీసుకొచ్చింది. వ్యక్తులకు పంపినవైనా, గ్రూపులు లేదా కంపెనీలు పంపిన సందేశాలైనా సరే.. అన్నింటినీ వారం రోజుల తరువాత మాయమయ్యేలా చేయవచ్చునని కంపెనీ ప్రకటించింది. కాకపోతే ఈ గ్రూపుల్లో ఈ ఫీచర్‌ను అడ్మిన్ మాత్రమే ఆన్/ఆఫ్ చేయగలరు. ఈ ఫీచర్‌ని ఆన్ చేయడం ఎలా... మన వాట్సప్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి దాని తర్వాత వాట్సాప్‌లో ఏదైనా చాట్ తెరిచి వ్యూ కాంటాక్ట్ లేదా గ్రూప్ ఇన్ఫో క్లిక్ చేయాలి ఇప్పుడు మీరు క్రిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మీకు అక్కడ డిస్అపియరింగ్ మెసేజెస్ అనే ఫీచర్ కనిపిస్తుంది ఈ ఫీచర్ డిఫాల్ట్ గా ఆఫ్ చేసి ఉంటుంది, కాబట్టి మీరు దీన్ని ఆన్ చేయాలి ఇప్పుడు మీరు ఎంచుకున్న చాట్‌కు పంపిన క్రొత్త సందేశాలు వాటంతటవే ఏడు రోజుల తర్వాత కనిపించవు చాట్‌లో అదృశ్యమైన సందేశాలు ఎనేబుల్ అయినప్పుడు వాట్సాప్ తెలియజేస్తుంది. వాట్సాప్‌లో మెసేజ్ వచ్చినప్పుడు దాన్ని మీరు ఓపెన్ చేయకపొతే ఏడు రోజులు తర్వాత ఛాట్ స్ర్కీన్‌లో ఆ మెసేజ్ డిలీట్ అయిపోయిన కానీ మెసేజ్ ఓపెన్ చెయ్యలేదు కాబట్టి దాన్ని నోటిఫికేషన్స్ బార్లో చూడొచ్చు.