వాట్సాప్‌లో మరో అద్భుత ఫీచర్‌ | WhatsApp Group Video, Video Calling Feature Rolled Out for Android, iOS Users | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌ ఆ అద్భుత ఫీచర్‌.. లైవ్‌గా వచ్చేసింది

Published Tue, Jul 31 2018 11:38 AM | Last Updated on Sat, Aug 18 2018 4:50 PM

WhatsApp Group Video, Video Calling Feature Rolled Out for Android, iOS Users - Sakshi

వాట్సాప్‌ గ్రూప్‌ వీడియో కాలింగ్‌

ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌లో మరో అద్భుత ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్‌ గ్రూప్‌ కాలింగ్‌ ఫీచర్‌ వాయిస్‌, వీడియో రెండింటికీ సపోర్ట్‌ చేస్తూ ఎట్టకేలకు లైవ్‌గా యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇకపై యూజర్లు గ్రూప్ వీడియో, వాయిస్‌ కాలింగ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ గురించి వాట్సాప్ గతేడాది అక్టోబర్‌లోనే సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో ఫేస్‌బుక్‌ తను యాన్యువల్‌ ఎఫ్‌8 డెవలపర్‌ కాన్ఫరెన్స్‌లో వాట్సాప్‌ గ్రూప్‌ కాలింగ్‌ ఫీచర్‌ను ప్రకటించింది. 

ఈ కొత్త వాట్సాప్‌ ఫీచర్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులోకి వచ్చినట్టు ఆ కంపెనీ ప్రకటించింది. వాట్సాప్ ప్రవేశపెట్టిన ఈ గ్రూప్ వీడియో, వాయిస్‌ కాలింగ్ ఫీచర్ సహాయంతో ఒకేసారి నలుగురు గ్రూప్ వీడియో, వాయిస్‌ కాలింగ్ చేసుకోవచ్చు. అయితే ముందుగా ఇద్దరు యూజర్లు వన్ టు వన్ వీడియో చాటింగ్ మొదలు పెట్టాలి. అనంతరం ఇద్దరు యూజర్లను అందులోకి యాడ్ చేయాలి. దీంతో గ్రూప్ వీడియో, వాయిస్‌ కాలింగ్ సాధ్యపడుతుంది. రోజుకు 2 బిలియన్‌ పైగా నిమిషాలను కాల్స్‌కు వాట్సాప్‌ యూజర్లు వెచ్చిస్తున్నట్టు ఆ కంపెనీ తెలిపింది. వాట్సాప్‌ వీడియో కాల్స్‌ ఫీచర్‌ను 2016 నుంచి అందుబాటులోకి తెచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరు వ్యక్తులకు మాత్రమే ఇది సపోర్టు చేస్తూ వచ్చింది. తక్కువ నెట్‌వర్క్‌ ఉన్న పరిస్థితుల్లో కూడా ఈ కొత్త ఫీచర్‌ పనిచేయనుందని వాట్సాప్‌ తెలిపింది. అదనంగా మెసేజస్‌ మాదిరి ఈ కాల్స్‌ కూడా ఎండ్‌-టూ-ఎండ్‌ ఎన్‌క్రిప్ట్‌ అయి ఉంటాయని పేర్కొంది. 

వాట్సాప్ గ్రూప్ వీడియో, వాయిస్‌ కాలింగ్ ఫీచర్ కోసం.. ఈ యాప్‌కు చెందిన అప్‌డేటెడ్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే ఈ ఫీచర్‌ను యూజర్లు పొందవచ్చు. గ్రూప్‌ కాల్‌ చేయాలంటే, తొలుత ఒక యూజర్‌తో వీడియో, వాయిస్‌ కాల్‌ ప్రారంభించాలి. ఆ తర్వాత పైన కుడివైపు ఉన్న యాడ్‌ పార్టిసిపెంట్‌ బటన్‌ను ట్యాప్‌ చేయాలి. ఇతర యూజర్లను కూడా గ్రూప్‌ వీడియో/వాయిస్‌ కాల్‌కి ఆ‍హ్వానించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement