Group Calling
-
వాట్సాప్ యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్: ఒకేసారి 32 మందితో
కొత్త, కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న ప్రముఖ మెసెంజర్ వాట్సాప్ మరోకొత్త ఫీచర్‌ను ప్రకటించింది. తాజా అప్డేట్ ప్రకారం వాట్సాప్ వినియోగదారులు పీసీలో ఏకంగా గరిష్టంగా 32 మందితో ఒకేసారి వీడియో కాల్స్ చేసుకోవచ్చు. బీటాలో 32 మంది పార్టిసిపెంట్స్‌తో వీడియో కాల్స్‌ను చేసుకునే ఫీచర్‌ను లాంచ్ చేసింది. అంటే ఇకపై గూగుల్ మీట్, జూమ్ లాంటి అవసరం లేకుండానే ఒకేసారి 32మందితో వీడియో ద్వారా డెస్క్ టాప్ ద్వారా సంభాషించవచ్చు. (టాప్ డైరెక్టర్ రాజమౌళి కొత్త అవతార్: హీరోలకు షాకే!?) వాబేటా ఇన్ఫో ప్రకారం 32 మంది యూజర్లు వీడియోకాల్స్ చేసుకోవచ్చు. గ్రూపు కాల్స్‌లో జాయిన్ కమ్మని వచ్చే ఇన్విటేషన్ మెసేజ్ ద్వారా కావాలనుకున్నబీటా యూజర్లు ఈ వీడియో కాల్లో జాయిన్ కావచ్చు. విండోస్ అప్డేట్ కోసం సరికొత్త వాట్సాప్ బీటాను ఇన్స్టాల్ చేసే కొంతమంది బీటా టెస్టర్లకు ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని నివేదిక పేర్కొంది. విండోస్ వినియోగదారులు ఇప్పటివరకు 32 మంది వ్యక్తులతో మాత్రమే ఆడియో వాట్సాప్ కాల్స్ చేసుకోగలిగేవారు. అయితే ఇప్పుడు తాజా అప్డేట్తో బీటా యూజర్లు గరిష్టంగా 32 మందితో వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు. గత ఏడాది నవంబరులోనే మెటా ఫౌండర్, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఆండ్రాయిడ్ , ఐఓఎస్‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. ఈ నెల ప్రారంభంలో, మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ విండోస్‌లోని కొంతమంది బీటా టెస్టర్లకు వీడియో కాల్ల కోసం స్క్రీన్-షేరింగ్ ఫీచర్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
వాట్సాప్ కొత్త అప్ డేట్
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సొంతమైన వాట్సాప్ కొత్త అప్ డేట్ లను తీసుకురానుంది. ఎప్పటికపుడు కొత్త ఫీచర్లతో ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్లకు పైగా వినియోగదారులను సొంతం చేసుకున్న వాట్సాప్ కరోనా, లాక్డౌన్ సంక్షోభ సమయంలో మరో ఆసక్తికరమైన ఫీచర్ ను జోడించనుంది. వా బేటా ఇన్ఫో అందించి సమాచారం ప్రకారం వీడియో, ఆడియో కాలింగ్ లో పాల్గొనే యూజర్ల పరిమితిని పెంచడానికి వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది. గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ కు ఆదరణ భారీగా పెరిగిన నేపథ్యంలో ఎక్కువ మంది యూజర్లను ఆకర్షించేలా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. డార్క్ మోడ్, ఫింగర్ ప్రింట్ అన్‌లాక్‌లాంటి ఫీచర్లను అందించిన వాట్సాప్ తాజాగా గ్రూప్ వీడియో, ఆడియో కాలింగ్ పరిమితిని పెంచేందుకు యోచిస్తోంది. తద్వారా టెక్ దిగ్గజం గూగుల్ వీడియో కాలింగ్ యాప్ డియో, చైనాకు చెందిన జూమ్ లాంటి యాప్స్ దూకుడుకు కళ్లెం వేయాలని భావిస్తోంది. (జూమ్ యాప్ వాడొద్దు: హోం మంత్రిత్వ శాఖ) కరోనా వైరస్ వ్యాప్తిని ఆపడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భౌతిక దూరాన్ని పాటిస్తున్న సమయంలో వీడియో కాలింగ్ సదుపాయానికి డిమాండ్ బాగా పెరిగింది. గ్రూపు ఆడియో, వీడియో కాలింగ్ వైపు మళ్లిన తరుణంలో వాట్సాప్ ఈ కీలక మార్పును తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. లాక్ డౌన్ కాలంలో జూమ్, గూగుల్ డియో యాప్స్ లో ఒకేసారి డజన్ల కొద్దీ వ్యక్తులతో వీడియో కాలింగ్‌ను అనుమతి లభిస్తోంది. దీంతో వాట్సాప్ తాజా అప్ డేట్ తీసుకురానుంది. ప్రస్తుతానికి గ్రూప్ ఆడియో, వీడియో కాలింగ్ లో పాల్గొనడానికి నలుగురి మాత్రమే అనుమతి వుంది. ఇపుడు ఎంతమందికి అవకాశం కల్పిస్తుంది, ఎప్పటినుంచి యూజర్లకు ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది అనేదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. దీంతోపాటు ఆండ్రాయిడ్ వీ2.20.129 కోసం వాట్సాప్ బీటాలో ఇప్పటికే అందుబాటులో ఉన్ కొత్త కాల్ హెడర్‌ను జోడించడానికి కూడా వాట్సాప్ పనిచేస్తోంది. తద్వారా వాట్సాప్ కాల్స్ ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్టెడ్ అని చెప్పాలని లక్ష్యంగా పెట్టుకుంది. (జియో ఫైబర్: రూ.199కే 1000 జీబీ డేటా) కోవిడ్-19 మహమ్మారి కారణంగా లాక్డౌన్ అయిన ప్రజలు సోషల్ మీడియాకు అంకితమవుతున్నారు. కరోనా వైరస్ విస్తరణను అడ్డుకునే క్రమంలో, రవాణ వ్యవస్థ పూర్తిగా స్థంభించడతో అటు ఉద్యోగులు కూడా ఇంటినుంచే తమ సేవలను అందిస్తున్నారు. దీంతో వివిధ సంస్థలు తమ ఉద్యోగులతో కనెక్ట్ అయ్యేందుకు, ఆన్ లైన్ తరగతులకు గ్రూపు వీడియో, లేదా వీడియో కాన్ఫరెన్సుల వైపు, మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. (కరోనా సంక్షోభం : టీసీఎస్ కీలక నిర్ణయం) -
ఆండ్రాయిడ్ యూజర్లకు జియో కొత్త యాప్
సాక్షి, న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ యూజర్లకోసం రిలయన్స్ జియో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. గ్రూపు కాలింగ్ లేదా గ్రూపు టాక్ అవకాశాన్ని కల్పించనుంది. ఇందుకు కోసం గూగుల్ యాప్ స్టోర్‌లో ఒక కొత్త అప్లికేషన్‌ను అందిస్తోంది. దీని ప్రకారం జియో సిమ్ వాడుతున్న ఆండ్రాయిడ్ వినియోగదారులు ఒకేసారి పది మందితో కాన్ఫరెన్స్ కాల్ (ఆడియో మాత్రమే) ద్వారా మాట్లాడుకోవచ్చు. ఇందులో లెక్చర్ మోడ్, మ్యూట్ పార్టిసిపెంట్ లాంటి ఇతర ఫీచర్లను కూడా జోడించింది. ప్రస్తుతం పరీక్షల్లో ఉన్న ఈ యాప్‌ను అతి త్వరలోనే జియో కస్టమర్లకు అందించనుంది. -
గుడ్ న్యూస్: వాట్సాప్ గ్రూప్ కాలింగ్ అప్డేట్
సాక్షి, న్యూఢిల్లీ: రోజుకొక కొత్త ఫీచర్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప తాజాగా మరో ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఇప్పటికే లాంచ్ చేసిన గ్రూప్ కాలింగ్ ఫీచర్లో లోపాలను సవరించి సరికొత్తగా దీన్ని తిరిగి లాంచ్ చేసింది. ఒకేసారి ఇద్దరు లేదా ముగ్గురుతో సంభాషించేలా కొత్త గ్రూప్కాలింగ్ బటన్ అప్డేట్ చేసింది. గతంలో తీసుకొచ్చిన గ్రూప్ కాలింగ్ బటన్ ఒకరికంటే ఎక్కువమందికి ఒకేసారి కాల్స్ చేయడంలో (వాయిస్, వీడియో) వైఫల్యం చెందింది. ఈ లోపాన్ని సవరించిన వాట్సాప్ సరికొత్తగా ఈ ఫీచర్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తెస్తోంది. గతంలోలా కాకుండా నార్మల్ కాల్ తరువాత మిగిలిన వారిని గ్రూప్కాలింగ్లోకి ఆహ్వనించడం కాకుండా డైరెక్టుగా ముగ్గురుతో మాట్లాడవచ్చని కంపెనీ తెలిపింది. ఈ సదుపాయం 2.18.110.17 బీటా వెర్షన్లో అమల్లోకి ఉందని, వచ్చే నెలనుంచి అందరికీ అందుబాటులో వస్తుందని వెల్లడించింది. కాగా ఒక పార్టిసిపెంట్ను సెలక్ట్ చేసుకుని, అనంతరం టాప్‌రైట్ కార్నర్లో కనిపించే యాడ్ పార్టిసిపెంట్ బటన్ క్లిక్ చేసి రెండవ పార్టిసిపెంట్ను సెలక్ట్ చేసుకోవాలి. ఇలా మరింతమంది పార్టిసిపెంట్స్‌ను గ్రూప్వాయిస్ కాల్లోయాడ్ చేసుకునే అవకాశాన్ని గతంలో కల్పించింది. అయితే ఇది అంతగా ఆకట్టుకోలేకపోవడంతో తాజా అప్డేట్ను జోడించింది. -
వాట్సాప్ సరికొత్త ఫీచర్ : ఆండ్రాయిడ్స్లోకి...
న్యూఢిల్లీ : ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ తన యూజర్లకు ఎప్పడికప్పుడూ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూ అలరిస్తూ ఉంది. తాజాగా మరో ఆసక్తికర ఫీచర్‌ను ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఐఓఎస్ ఎక్స్‌క్లూజివ్ ఫీచర్‌గా ఉన్న ‘పిక్చర్-టూ-పిక్చర్ మోడ్’ ఫీచర్‌ను వాట్సాప్ ఎట్టకేలకు ఆండ్రాయిడ్ యూజర్లకు ప్రవేశపెడుతోంది. వాట్సాప్‌లోనే వీడియోను చూసుకునేలా ఈ ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నట్టు డబ్ల్యూఏబీటా ఇన్ఫో రిపోర్టు చేసింది. కంపెనీ మీ చాట్ అనుభవాన్ని ఎలాంటి అవాంతరం కలిగించకుండా.. వీడియో ప్లే చేసుకునేందుకు ఒక పాప్-అప్/ ఫ్లోటింగ్ విండోను జోడిస్తుంది. గూగుల్ ప్లే బీటా ప్రొగ్రామ్‌లో కంపెనీ ఇప్పటికే తన అప్డేట్ను సమర్పించింది. ఈ అప్డేట్లో ఆండ్రాయిడ్ పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్ ఫీచర్‌కు సపోర్టు చేస్తుంది. యాప్‌కు ఈ ఫీచర్‌ను యాడ్ చేస్తే, ఆండ్రాయిడ్ యూజర్లు వాట్సాప్‌లో వచ్చిన వీడియో కోసం ప్లే ఐకాన్‌ను క్లిక్ చేసుకుని చూడొచ్చు. అదేవిధంగా చాట్‌ను కూడా నేవిగేట్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీడియోలకు పనిచేయనుంది. ఇదే ఫీచర్ ఇప్పటికే ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉంది. మరోవైపు ఇప్పటికే యూట్యూబ్ వీడియోలను యాప్‌లోనే చూసుకునేలా వాట్సాప్ యూజర్లకు అనుమతి ఇస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇటీవలే గ్రూప్ వాయిస్, వీడియో కాలింగ్ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. గత రెండేళ్లుగా వాట్సాప్ యూజర్లు వాయిస్, వీడియో కాల్స్‌తో ఎంజాయ్ చేస్తున్నారు. రోజుకు 200 కోట్ల నిమిషాల కాల్స్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాయిస్, వీడియో కాల్స్‌కు మరింత డిమాండ్‌ను పెంచేందుకు గ్రూప్ కాలింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్టు వాట్సాప్ తెలిపింది. -
వాట్సాప్‌లో ఇక గ్రూప్ కాలింగ్
న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్ వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఒక వ్యక్తికి మాత్రమే వాయిస్ కాల్, వీడియో కాల్ చేసుకునే సౌలభ్యం ఉండేది. తాజాగా ఎక్కువ మందితో సంభాషణలు జరిపేందుకు ‘గ్రూప్ కాల్’సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఎక్కువ మందికి ఒకేసారి వీడియో, వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను మంగళవారం నుంచి అందుబాటులోకి తెస్తున్నట్లు సంస్థ ఓ బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించింది. ఇప్పటికే ఐఫోన్, ఆండ్రాయిడ్ వెర్షన్లలో ఇది అందుబాటులో ఉందంది. వాట్సాప్‌లో కుడి వైపు పైభాగంలో కనిపించే ‘యాడ్ పార్టిసిపెంట్’అనే ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా కాలింగ్‌లో సభ్యులను ఆహ్వానించవచ్చని పేర్కొంది. ఒక వ్యక్తి గరిష్టంగా నలుగురు వ్యక్తులతో సంభాషించవచ్చంది. వాట్సాప్‌ను 130 కోట్ల మంది ఉపయోగిస్తుండగా.. ఇందులో రోజుకు దాదాపు 200 కోట్ల నిమిషాలను కాల్స్ కోసం వెచ్చించారని వెల్లడించింది. -
వాట్సాప్‌లో మరో అద్భుత ఫీచర్
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో మరో అద్భుత ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ గ్రూప్ కాలింగ్ ఫీచర్ వాయిస్, వీడియో రెండింటికీ సపోర్ట్ చేస్తూ ఎట్టకేలకు లైవ్‌గా యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇకపై యూజర్లు గ్రూప్ వీడియో, వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ గురించి వాట్సాప్ గతేడాది అక్టోబర్‌లోనే సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో ఫేస్బుక్ తను యాన్యువల్ ఎఫ్8 డెవలపర్ కాన్ఫరెన్స్‌లో వాట్సాప్ గ్రూప్ కాలింగ్ ఫీచర్‌ను ప్రకటించింది. ఈ కొత్త వాట్సాప్ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చినట్టు ఆ కంపెనీ ప్రకటించింది. వాట్సాప్ ప్రవేశపెట్టిన ఈ గ్రూప్ వీడియో, వాయిస్ కాలింగ్ ఫీచర్ సహాయంతో ఒకేసారి నలుగురు గ్రూప్ వీడియో, వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. అయితే ముందుగా ఇద్దరు యూజర్లు వన్ టు వన్ వీడియో చాటింగ్ మొదలు పెట్టాలి. అనంతరం ఇద్దరు యూజర్లను అందులోకి యాడ్ చేయాలి. దీంతో గ్రూప్ వీడియో, వాయిస్ కాలింగ్ సాధ్యపడుతుంది. రోజుకు 2 బిలియన్ పైగా నిమిషాలను కాల్స్‌కు వాట్సాప్ యూజర్లు వెచ్చిస్తున్నట్టు ఆ కంపెనీ తెలిపింది. వాట్సాప్ వీడియో కాల్స్ ఫీచర్‌ను 2016 నుంచి అందుబాటులోకి తెచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరు వ్యక్తులకు మాత్రమే ఇది సపోర్టు చేస్తూ వచ్చింది. తక్కువ నెట్వర్క్ ఉన్న పరిస్థితుల్లో కూడా ఈ కొత్త ఫీచర్ పనిచేయనుందని వాట్సాప్ తెలిపింది. అదనంగా మెసేజస్ మాదిరి ఈ కాల్స్ కూడా ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అయి ఉంటాయని పేర్కొంది. వాట్సాప్ గ్రూప్ వీడియో, వాయిస్ కాలింగ్ ఫీచర్ కోసం.. ఈ యాప్‌కు చెందిన అప్డేటెడ్ వెర్షన్‌ను ఇన్స్టాల్ చేసుకుంటే ఈ ఫీచర్‌ను యూజర్లు పొందవచ్చు. గ్రూప్ కాల్ చేయాలంటే, తొలుత ఒక యూజర్‌తో వీడియో, వాయిస్ కాల్ ప్రారంభించాలి. ఆ తర్వాత పైన కుడివైపు ఉన్న యాడ్ పార్టిసిపెంట్ బటన్‌ను ట్యాప్ చేయాలి. ఇతర యూజర్లను కూడా గ్రూప్ వీడియో/వాయిస్ కాల్కి ఆహ్వానించవచ్చు. -
వాట్సాప్ ఆ ఫీచర్లు ఇక అందరికీ..
వాట్సాప్ గత కొన్ని రోజుల కింద లిమిటెడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చిన గ్రూప్ వాయిస్, వీడియో కాలింగ్ ఫీచర్లను, ప్రస్తుతం యూజర్లందరికీ అందించడం ప్రారంభించింది. పెద్ద మొత్తంలో తన యూజర్లకు ఈ ఫీచర్లను ఆవిష్కరిస్తున్నట్టు వాట్సాప్ తెలిపింది. గత నెలలో ఎఫ్8 కాన్ఫరెన్స్‌లో ఈ ఫీచర్లను ఫేస్బుక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇక నుంచి యూజర్లందరూ ఈ లేటెస్ట్ ఫీచర్లతో ఎంజాయ్ చేయవచ్చని పేర్కొంది. ఈ ఫీచర్లను యూజర్లు పొందాలంటే, గూగుల్ ప్లే స్టోర్ ద్వారా వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌ను అప్డేట్ చేసుకోవాలని తెలిపింది. కుడివైపు పైన ఒక కొత్త సభ్యుడిని చేర్చుకునే సింబల్ కనిపిస్తే, ఈ ఫీచర్లు మీకు లైవ్‌లో అందుబాటులోకి వచ్చినట్టే. ఈ ఫీచర్ ద్వారా ఒకే సమయంలో నలుగురు యూజర్లు మాట్లాడుకునే అవకాశముంటుంది. అంటే మీతో కలిపి మరో ముగ్గురితో మాత్రమే ఈ గ్రూప్ కాలింగ్ ఫీచర్లలో మాట్లాడే అవకాశముంటుంది. ఈ ఫీచర్‌ను చాలా సులభతరంగా, తేలికగా ఉపయోగించుకోవచ్చు. గ్రూప్ కాల్ చేయాలంటే, తొలుత ఒక యూజర్‌తో వీడియో కాల్ ప్రారంభించాలి. ఆ తర్వాత పైన కుడివైపు ఉన్న యాడ్ పార్టిసిపెంట్ బటన్‌ను ట్యాప్ చేయాలి. ఇతర యూజర్లను కూడా గ్రూప్ వీడియో/వాయిస్ కాల్కి ఆహ్వానించవచ్చు. -
వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్
న్యూయార్క్: వాట్సాప్ అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయాన్నీ బంధువులకు, స్నేహితులకు దాని ద్వారానే చెప్పడం మనందరికీ అలవాటైపోయింది. ఒకే క్లిక్‌తో గ్రూప్‌లో ఉన్నవారందరికీ ఒకేసారి మెసేజ్‌ను పంపే సదుపాయాం ఇప్పటికే అందుబాటులో ఉంది. కాగా.. గ్రూప్‌లోని సభ్యులందరితో ఒకేసారి మాట్లాడడం, వీడియో కాల్స్ చేయడం వంటి సదుపాయం మాత్రం ఇప్పటిదాకా అందుబాటులోకి రాలేదు. కానీ త్వరలోనే ఈ సౌకర్యాన్ని ప్రవేశపెడుతున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. ఇప్పటికే ఉన్న కాల్ స్విచ్చింగ్ ఆప్షన్‌ను ఇకపై తీసేస్తామని తెలిపింది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఒక గ్రూప్‌నకు చెందిన యూజర్లు మూకుమ్మడిగా వాయిస్ లేదా వీడియో కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఫేస్బుక్ స్టిక్కర్లు, గ్రూప్ కేటగిరిని బట్టి ప్రత్యేక స్టిక్కర్లు యూజర్లకు లభ్యం కానున్నాయి. ఇవేకాక కాంటాక్ట్స్‌లను వెతికేందుకు, రిప్లై ఇచ్చేందుకు కొత్త ఆప్షన్లను తీసుకొస్తున్నట్లు పేర్కొంది. దీంతో గ్రూప్‌తో సంబంధం లేకుండా ప్రైవేట్‌గా చాటింగ్ చేయవచ్చు. గ్రూప్ అడ్మిన్లకు మరిన్ని కంట్రోల్ ఆప్షన్లను ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నామని తెలిపింది. ఇవన్నీ అందుబాటులోకి వస్తే.. ఇక వాట్సాప్ లేకుండా ఉండడం కష్టమే! -
ఫేస్బుక్లో గ్రూప్ కాలింగ్
న్యూయార్క్: సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్ గ్రూప్ కాలింగ్‌ను ప్రారంభించనుంది. దీంతో వినియోగదారుడు ఒకేసారి ఇంటర్నెట్ ద్వారా 50 మందితో అనుసంధానమయ్యే వీలవుతుంది. 24 గంటల్లో కొత్త విధానం ఆండ్రాయిడ్, ఐఓఎస్ పరికరాల్లో ఉచితంగా అమల్లోకొస్తుంది. గ్రూప్ కాల్ ఆన్ చేయడానికి వినియోగదారుడు ...‘ఫోన్’ ఐకాన్‌ను ట్యాప్‌చేసి , మాట్లాడదలుచుకున్న బృందాన్ని ఎంచుకుని కాల్ చేయాలి. అందరూ ఒకేసారి కాల్ పొందుతారు. ఎవరైనా తొలి కాల్‌ను పొందకుండా ఉండి అది ఇంకా అందుబాటులో ఉంటే ఫోన్ ఐకాన్‌ను ట్యాప్ చేసి మిగతా వారితో చేరొచ్చు.