వాట్సాప్ గత కొన్ని రోజుల కింద లిమిటెడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చిన గ్రూప్ వాయిస్, వీడియో కాలింగ్ ఫీచర్లను, ప్రస్తుతం యూజర్లందరికీ అందించడం ప్రారంభించింది. పెద్ద మొత్తంలో తన యూజర్లకు ఈ ఫీచర్లను ఆవిష్కరిస్తున్నట్టు వాట్సాప్ తెలిపింది. గత నెలలో ఎఫ్8 కాన్ఫరెన్స్‌లో ఈ ఫీచర్లను ఫేస్‌బుక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇక నుంచి యూజర్లందరూ ఈ లేటెస్ట్ ఫీచర్లతో ఎంజాయ్ చేయవచ్చని పేర్కొంది. ఈ ఫీచర్లను యూజర్లు పొందాలంటే, గూగుల్ ప్లే స్టోర్ ద్వారా వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకోవాలని తెలిపింది. కుడివైపు పైన ఒక కొత్త సభ‍్యుడిని చేర్చుకునే సింబల్ కనిపిస్తే, ఈ ఫీచర్లు మీకు లైవ్‌లో అందుబాటులోకి వచ్చినట్టే.
ఈ ఫీచర్ ద్వారా ఒకే సమయంలో నలుగురు యూజర్లు మాట్లాడుకునే అవకాశముంటుంది. అంటే మీతో కలిపి మరో ముగ్గురితో మాత్రమే ఈ గ్రూప్ కాలింగ్ ఫీచర్లలో మాట్లాడే అవకాశముంటుంది. ఈ ఫీచర్‌ను చాలా సులభతరంగా, తేలికగా ఉపయోగించుకోవచ్చు. గ్రూప్ కాల్ చేయాలంటే, తొలుత ఒక యూజర్‌తో వీడియో కాల్ ప్రారంభించాలి. ఆ తర్వాత పైన కుడివైపు ఉన్న యాడ్ పార్టిసిపెంట్ బటన్‌ను ట్యాప్ చేయాలి. ఇతర యూజర్లను కూడా గ్రూప్ వీడియో/వాయిస్ కాల్‌కి ఆహ్వానించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment