స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చిన తరువాత దాదాపు అందరూ వాట్సప్ వినియోగిస్తున్నారు. కంపెనీ కూడా యూజర్ల సౌకర్యార్థం.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు తాజాగా 'వాయిస్ మెసేజ్ ట్రాన్స్‌క్రిప్ట్' అనే ఫీచర్ తీసుకువచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
వాట్సప్ పరిచయం చేసిన కొత్త వాయిస్ మెసేజ్ ట్రాన్స్‌క్రిప్ట్ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లను టెక్స్ట్ రూపంలోకి మారుస్తుంది. ఇది చాలా ఉపయోగకరమైన ఫీచర్ అని పలువురు చెబుతున్నారు.
నిజానికి వాయిస్ మెసేజ్ అనేది నలుగురిలో వినడానికి బహుశా చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు. అలాంటి వారు వాయిస్ మెసేజ్ ట్రాన్స్‌క్రిప్ట్.. ఉపయోగించి టెక్స్ట్ రూపంలోకి మార్చుకోవచ్చు. అయితే ఇది ట్రాన్స్‌లేటర్ కాదు, వాయిస్ మెసేజ్ ఏ రూపంలో ఉంటుందో.. ఆ భాషకు టెక్స్ట్ రూపం ఇస్తుంది.
మెసేజ్ అందుకున్న వ్యక్తి మాత్రమే.. దీనిని వాయిస్ నుంచి టెక్స్ట్ రూపంలో మార్చుకోగలడు. కానీ పంపిన వ్యక్తికి ఆ అవకాశం లేదు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఇంగ్లీష్, రష్యన్, స్పానిష్, పోర్చుగీస్ వంటి భాషలకు సపోర్ట్ చేస్తాయి. ఐఓఎస్ ఫోన్‌లు ఇంగ్లీష్, రష్యన్, స్పానిష్, పోర్చుగీస్ భాషలకు మాత్రమే కాకుండా.. అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్ వంటి వాటికి సపోర్ట్ చేస్తాయి. రాబోయే రోజుల్లో.. మరిన్ని భాషలకు కూడా ఇవి సపోర్ట్ చేస్తాయి.
ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే కంటే ఎక్కువ ఉద్యోగాలు!.. జెప్టో ఫౌండర్
వాట్సప్ వాయిస్ మెసేజ్ ట్రాన్స్‌క్రిప్ట్ ఫీచర్ యాక్టివేట్ చేసుకోవాలంటే.. సెట్టింగ్స్‌లో చాట్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ ఈ కొత్త ఫీచర్ కనిపిస్తుంది. దానిని ఆన్ లేదా ఆఫ్ చేసుకోవడం ద్వారా.. భాషను సెలక్ట్ చేసుకోవచ్చు. అయితే సపోర్ట్ చేయని భాషలను ఎంచుకుంటే.. ఎర్రర్ వస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉంది, రాబోయే రోజుల్లో ఇది యూజర్లందరికీ అందుబాటులోకి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment