క్విక్ కామర్స్ బిజినెస్.. దేశంలోని సుమారు 2 లక్షల కిరాణా షాపులు మూతపడటానికి కారణమవుతాయని 'రిటైల్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్' (AICPDF) వెల్లడించింది. అయితే క్విక్ కామర్స్ అనేది కిరానా స్టోర్‌లకు ఎలాంటి నష్టాన్ని కలిగించదని జెప్టో కో ఫౌండర్ 'ఆదిత్ పాలిచా' (Aadit Palicha) పేర్కొన్నారు.
జెప్టో, బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్ వంటి క్విక్ కామర్స్ కంపెనీల బిజినెస్ అభివృద్ధి చెందటం వల్ల కిరానా స్టోర్‌లు ప్రభావితమవుతుందనేది సరైంది కాదని పాలిచా అన్నారు. 2022-23 & 2023-24 ఆర్థిక సంవత్సరాల మధ్య కిరాణా, గృహావసరాల వినియోగం 46 బిలియన్ డాలర్లు అని 'కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్' (CAIT) డేటా వెల్లడించింది. ఇందులో క్విక్ కామర్స్ వాటా 5 బిలియన్ల కంటే తక్కువ, అంటే మిగిలిన 41 బిలియన్స్ కిరానా స్టోర్‌లకు వెళ్లాయని ఆయన అన్నారు.
వచ్చే ఐదేళ్లలో క్విక్ కామర్స్ బిజినెస్ 1500 శాతం పెరగనున్నట్లు పలు నివేదికలు అంచనా వేస్తున్నాయి. అధిక ధరలకు సంబంధించిన ఆరోపణల గురించి అడిగినప్పుడు.. తయారీదారు ధర కంటే తక్కువ ధరలకే మేము అందిస్తున్నామని ఆదిత్ పాలిచా పేర్కొన్నారు.
క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో పండ్లు, కూరగాయల ధరలు 20 నుంచి 30 శాతం అధికంగా ఉండటానికి కారణం ఏంటని అడిగినప్పుడు.. పాలిచా మాట్లాడుతూ.. నాణ్యత కారణంగా 100 శాతం కార్బైడ్ లేని.. రిఫ్రిజిరేటెడ్‌లో నిల్వ చేసిన జెప్టోలోని మామిడి పండును ఉదాహరణగా చెప్పారు. ఉద్యోగాల సృష్టి కూడా ఈ విభాగంలో భారీగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: జీతం లేని జాబ్.. స్పందించిన మాజీ ఉద్యోగి: ట్వీట్ వైరల్
రాబోయే 2 - 3 సంవత్సరాలలో ప్రభుత్వానికి 300 - 400 మిలియన్లు ప్రత్యక్ష పన్నుల రూపంలో చేరతాయని పాలిచా అన్నారు. ఇది దేశ ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. జెప్టో 3 నుంచి 4 లక్షల మంది డెలివరీ భాగస్వామ్యులను కలిగి ఉంది.
ఇంతకు ముందు ప్రతి వ్యక్తి జెప్టోలో నెలకు రూ. 10,000 నుంచి రూ. 15,000 సంపాదించేవారు. ప్రస్తుతం గ్రౌండ్ ఫోర్స్‌కు నెలకు రూ. 23వేలు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. క్విక్ కామర్స్ బిజినెస్ రాబోయే 2 - 3 సంవత్సరాల్లో భారతీయ రైల్వే కంటే కూడా ఎక్కువ ఉద్యోగాలను సృష్టిస్తుందని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment