Quick Commerce
-
వచ్చేస్తున్నాయి.. జెప్టో కేఫ్ సర్వీసులు
న్యూఢిల్లీ: ప్రధాన నగరాల్లో కేఫ్ సేవలను విస్తరిస్తున్నట్టు క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ జెప్టో తెలిపింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు స్టోర్లలో 120కిపైగా కేఫ్‌లతో సర్వీసులు అందిస్తున్నట్టు వివరించింది. త్వరలో హైదరాబాద్, చెన్నై, పుణే నగరాలకు ఈ సేవలను విస్తరించనున్నట్టు వెల్లడించింది.అధిక నాణ్యత గల ఆహార తయారీ ప్రక్రియతో 10 నిమిషాల డెలివరీని సాధ్యం చేశామని, అందుకే బలమైన కస్టమర్ స్పందనను చూస్తున్నామని కంపెనీ తెలిపింది. బ్రూయింగ్ నైపుణ్యాలను ఉపయోగించే కాఫీ మెషీన్లతో సహా కేఫ్‌ల కోసం అత్యాధునిక పరికరాలను నిశితంగా పరిశోధించి, తమ బృందం సేకరించిందని వివరించింది.ఇదీ చదవండి: జొమాటో డెలివరీ సిబ్బందికి ఇన్వెస్టింగ్ పాఠాలుచాయ్, కాఫీ, అల్పాహారం, పేస్ట్రీస్, స్నాక్స్ వంటి 148 రకాల ఉత్పత్తులను 10 నిముషాల్లో కస్టమర్లకు డెలివరీ చేస్తామని తెలిపింది. కొత్త నగరాలకు విస్తరించడం, ప్రతి నెలా 100కుపైగా కొత్త కేఫ్‌లను ప్రారంభిస్తున్నందున వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి రూ.1,000 కోట్ల యాన్యువల్ రన్ రేట్ సాధిస్తామని జెప్టో సీఈవో ఆదిత్ పలీచా తెలిపారు. -
కిరాణాలో... ‘క్విక్’ పాగా!
న్యూఢిల్లీ: సౌకర్యవంతంగా నిమిషాల వ్యవధిలోనే సరుకులను డెలివరీ చేసే సేవలకు ఆదరణ పెరుగుతుండటంతో సాంప్రదాయ కిరాణా దుకాణాల మార్కెట్ వాటాను క్విక్ కామర్స్ కంపెనీలు ఆక్రమిస్తున్నాయి. ఒక సర్వేలో పాల్గొన్న వినియోగదారుల్లో 46 శాతం మంది కిరాణా షాపుల నుంచి కొనుగోళ్లు గణనీయంగా తగ్గించుకున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో క్విక్ కామర్స్ మార్కెట్ పరిమాణం 2030 నాటికి 40 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నట్లు సర్వే నిర్వహించిన డాటమ్ ఇంటెలిజెన్స్ సంస్థ తమ నివేదికలో తెలిపింది.2024లో ఈ మార్కెట్ 6.1 బిలియన్ డాలర్లుగా నమోదవుతుందని అంచనా. నివేదిక ప్రకారం ఈ ఏడాది కిరాణా అమ్మకాల్లో క్విక్ కామర్స్ మార్కెట్ దాదాపు 1.28 బిలియన్ డాలర్ల వాటాను దక్కించుకోనుంది. 2024 అక్టోబర్‌లో దేశీయంగా 10 నగరాల్లో నిర్వహించిన ఈ సర్వేలో 3,000 మంది పాల్గొన్నారు. పరిశ్రమ వర్గాలు, నిపుణులు, కిరాణా దుకాణాల యజమానుల ఇంటర్వ్యూలు, బ్రోకరేజి సంస్థలు..మీడియా రిపోర్టుల ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. సగటు ఆర్డరు రూ. 400.. ముందుగా ప్రణాళిక వేసుకోకుండా అప్పటికప్పుడు కొనుగోలు చేసే వారికి క్విక్ కామర్స్ మాధ్యమం సౌకర్యవంతంగా ఉంటోంది. నివేదిక ప్రకారం క్విక్ కామర్స్‌ను ఉపయోగించుకునే వినియోగదారుల సగటు ఆర్డరు విలువ సుమారు రూ. 400గా ఉంటోంది. ఆన్లైన్లో నిత్యావసరాలను షాపింగ్ చేసేవారిలో 75 శాతం మంది గత ఆరు నెలల్లో గణనీయంగా ఇలాంటి కొనుగోళ్లు చేశారు. 82 శాతం మంది వినియోగదారులు కిరాణా స్టోర్స్‌లో నిత్యావసరాల కొనుగోళ్లను పావు భాగం తగ్గించుకుని, దాన్ని క్విక్ కామర్స్ వైపు మళ్లించారు.సాంప్రదాయ రిటైల్ విధానంలో వివిధ దశల్లో ఉండే మధ్యవర్తుల కమీషన్ల బాదరబందీ లేకపోవడంతో క్విక్ కామర్స్ సంస్థలు ఆకర్షణీయమైన ధరకే ఉత్పత్తులను అందిస్తుండటం సైతం కస్టమర్లు వాటివైపు మొగ్గు చూపేందుకు దోహదపడుతోంది. ఈ నేపథ్యంలో నిత్యావసరాల మార్కెట్లో ఆధిపత్యం ఉన్న కిరాణా స్టోర్స్ మనుగడ కోసం పోరాడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ‘క్విక్ కామర్స్ వినియోగం అసాధారణ వేగంతో పెరిగింది. 2024లో ఇది 74% వృద్ధి నమో దు చేయనుంది. 2023–28 మధ్యలో 48% వార్షిక వృద్ధితో అత్యంత వేగంగా ఎదిగిన మాధ్యమంగా నిలవనుంది‘ అని నివేదిక పేర్కొంది. క్విక్ కామర్స్ ‘కిక్’..10–30 నిమిషాల్లో సరుకులను ఇంటి దగ్గరకే అందించే సర్వీసులను క్విక్ కామర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ విభాగంలో బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ మొదలైనవి టాప్‌లో ఉన్నాయి. షాపింగ్ సౌలభ్యాన్ని కోరుకునే కస్టమర్లకు వేగవంతంగా, సౌకర్యవంతంగా సేవలు అందించడంపై క్విక్ కామర్స్ సంస్థలు ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. నిత్యావసరాల డెలివరీతో మొదలుపెట్టిన క్విక్ కామర్స్ సంస్థలు ప్రస్తుతం వివిధ ఉత్పత్తులకు విస్తరించాయి. ఎలక్ట్రానిక్స్, దుస్తులు, కాస్మెటిక్స్, గృహోపకరణాలు, ఔషధాలు, పెంపుడు జంతువులకు సంబంధించిన ఉత్పత్తులు, పుస్తకాలు మొదలైనవన్నీ కూడా అందిస్తున్నాయి. -
క్విక్ కామర్స్ ఈఎంఐ రూట్!
చెంగు చెంగున మార్కెట్లో దూసుకెళ్తున్న క్విక్ కామర్స్ కంపెనీలు... కస్టమర్లను తమ వైపు తిప్పుకునేందుకు వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తదితర ఈ–కామర్స్ సంస్థల రూట్లోనే కొంగొత్త పేమెంట్ పద్ధతులను ప్రవేశపెడుతున్నాయి. తద్వారా మార్కెట్‌ను మరింత ‘క్విక్’గా కొల్లగొట్టాలనేది స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో, జొమాటో బ్లింకిట్ తదితర దిగ్గజాల ప్లాన్!! పదే పది నిమిషాల్లో పక్కా డెలివరీ అంటూ దుమ్మురేపుతున్న క్విక్ కామ్ సంస్థలు.. ఈ–కామర్స్ దిగ్గజాలకు పక్కలో బల్లెంలా మారుతున్నాయి. ఇప్పుడు పేమెంట్ల విషయంలోనూ ‘నీవు నేర్పిన విద్యే..’ అన్న చందంగా తయారైంది వాటి వ్యూహం. రూ. 2,999 పైబడిన కొనుగోళ్లకు బ్లింకిట్ గత నెలలో నెలవారీ వాయిదా (ఈఎంఐ) ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. వాస్తవానికి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో తొలిసారి 2016లోనే ఫ్లిప్‌కార్ట్ ఈ ఆప్షన్‌ను ప్రవేశపెట్టగా... అమెజాన్ కూడా 2018లో దీన్ని అనుసరించింది. పలు డెబిట్ కార్డులతో పాటు, ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై కూడా ప్రస్తుతం ఈ ఫీచర్‌ను అమలు చేస్తున్నాయి. ‘ఈఎంఐ అవకాశం కలి్పంచడం వల్ల కస్టమర్ల కొనుగోలు శక్తి మరింత పెరుగుతుంది. ఆర్థికంగా కూడా వారికి వెసులుబాటు లభిస్తుంది’ అని బ్లింకిట్ సీఈఓ అల్బిందర్ ధిండ్సా పేర్కొన్నారు.ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి! మరోపక్క, దాదాపు దిగ్గజ క్విక్ కామర్స్ కంపెనీలన్నీ ఈఎంఐ ఆప్షన్‌తో పాటు తర్వాత చెల్లించే (బై నౌ, పే లేటర్) పేమెంట్ విధానాన్ని కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఇందుకోసం సింపుల్, పేయూకి చెందిన లేజీ పే వంటి కంపెనీలతో జట్టుకట్టాయి. ఫ్లిప్‌కార్ట్ 2017లో ఈ పే లేటర్ ఫీచర్ ద్వారా యూజర్లకు రూ. లక్ష వరకు ఇన్స్టంట్ రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. నయా పైసా చెల్లించకుండా ఉత్పత్తులను కొనుగోలు చేసి, తర్వాత నెలలో పూర్తిగా చెల్లించడం, లేదంటే ఈఎంఐగా మార్చుకునే అవకాశాన్ని ఇది కలి్పస్తోంది. ఇక 2020లో ప్రవేశపెట్టిన ‘అమెజాన్ పే లేటర్’ కూడా బాగానే ‘‘క్లిక్’ అయింది. కాగా, ఈ పేమెంట్ ఆప్షన్లతో క్యూ–కామ్ సంస్థల సగటు ఆర్డర్ విలువ పెరగడంతో పాటు ఎక్కువ రేటు గల ఉత్పత్తి విభాగాల్లోకి కూడా విస్తరించేందుకు దోహదం చేస్తుందని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కంపెనీలు గనుక కస్టమర్ల విశ్వాసాన్ని పొందగలిగితే, ఈకామర్స్ దిగ్గజాలకు సవాలుగా నిలవడం ఖాయమని కూడా వారు విశ్లేషిస్తున్నారు.40 బిలియన్ డాలర్లుభారత్ క్విక్ కామార్స్ మార్కెట్‌ను ప్రధానంగా మూడు కంపెనీలు (జొమాటో బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో) శాసిస్తున్నాయి. ప్రస్తుతం 6.1 బిలియన్ డాలర్లుగా ఉన్న మార్కెట్ పరిమాణం 2030 నాటికి 40 బిలియన్ డాలర్లకు ఎగబాకుతుందనేది డాటమ్ ఇంటెలిజెన్స్ నివేదిక అంచనా.75% స్మార్ట్ ఫోన్ కొనుగోళ్లు వాయిదాల్లోనే... ‘పే లేటర్, ఈఎంఐ ఫార్మాట్ల వల్ల క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు.. సంప్రదాయ ఈకామర్స్ దిగ్గజాలతో మరింతగా పోటీపడేందుకు వీలవుతుంది. ముఖ్యంగా పే లేటర్ సదుపాయం వల్ల యూజర్ల మెరుగైన షాపింగ్ అనుభూతికి తోడ్పడుతుంది. ఇక స్మార్ట్ ఫోన్లు, ఎల్రక్టానిక్ ఉత్పత్తులు, గృహోపకారణాల వంటి అధిక ధర కేటగిరీ కొనుగోళ్లలో ఈఎంఐ కీలక పాత్ర పోషిస్తుంది. ఈకామర్స్ మాదిరిగానే పోటాపోటీ ధరలతో పాటు అనువైన పేమెంట్ ఆప్షన్లను కూడా ఆఫర్ చేయడం ద్వారా క్యూకామ్ సంస్థలు కస్టమర్లను ఆకట్టుకోగలుగుతాయి’ అని డేటమ్ ఇంటెలిజెన్స్ విశ్లేషకుడు సతీష్ మీనా అభిప్రాయపడ్డారు. ఇప్పుడు దేశంలో 75 శాతం పైగా స్మార్ట్ ఫోన్లు ఈఎంఐ రూట్లోనే అమ్ముడవుతుండటం విశేషం! అయితే, ప్రస్తుతం క్విక్ కామ్ ప్లాట్‌ఫామ్స్‌లో జరుగుతున్న కొనుగోళ్లలో 85 శాతం మేర కిరాణా, నిత్యావసర ఉత్పత్తులేనని, ఈ పేమెంట్ ఆప్షన్లు తక్షణం వాటికి పెద్దగా ఉపయోగకరం కాదనేది మరో టాప్ కన్సల్టెన్సీ సంస్థ నిపుణుడి అభిప్రాయం. ‘రానురాను ప్రీమియం విభాగాల్లోకి విస్తరించే కొద్దీ పే లేటర్, ఈఎంఐ వంటి ఆప్షన్లు క్విక్ కామ్ డిమాండ్‌ను పెంచడానికి తోడ్పడతాయి. ఇది ఈకామర్స్ సంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ సవాలును ఎదుర్కోవాలంటే అవి మరిన్ని వినూత్న విధానాలను అనుసరించక తప్పదు’ అని వ్యాఖ్యానించారు.ఈఎంఐ అవకాశం కల్పించడం వల్ల కస్టమర్ల కొనుగోలు శక్తి మరింత పెరుగుతుంది. ఆర్థికంగా కూడా వారికి వెసులుబాటు లభిస్తుంది. – అల్బిందర్ ధిండ్సా, బ్లింకిట్ సీఈఓ -
క్విక్ కామర్స్‌తో రిటైలర్లకు సవాళ్లు
న్యూఢిల్లీ: క్విక్ కామర్స్ నమూనా స్థానిక రిటైలర్లకు సవాళ్లు విసురుతోందని, రాజకీయ అంశంగానూ మారొచ్చని వెటరన్ బ్యాంకర్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ అభిప్రాయపడ్డారు. భారత్‌ను ప్రపంచంలోనే వినూత్నమైన దేశంగా పేర్కొంటూ.. మరెక్కడా క్విక్ కామర్స్ నమూనా అంత సత్ఫలితాలు సాధించలేదని, ఇక్కడ మాత్రం విజయవంతంగా కొనసాగుతున్నట్టు చెప్పారు.‘‘ఇది సానుకూల సంకేతమే. క్షేత్రస్థాయిలో ఆవిష్కరణలకు ఫలితాలు కనిపిస్తున్నాయి’’ అని ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. అదే సమయంలో యాపిల్, మెటా, యూనిలీవర్ వంటి బ్రాండ్లను భారత్ సృష్టించాల్సి ఉందన్నారు. అభివృద్ధి చెందిన ఏ దేశాన్ని పరిశీలించినా ఈ విధమైన ఆవిష్కరణల బలం కనిపిస్తుందంటూ.. భారత వ్యాపార సంస్థలు ఉత్పతాదకత, సృజనాత్మకతపై దృష్టి సారించాలని సూచించారు. దేశీయ సంస్థలకు, దేశీయ మార్కెట్ నుంచే రక్షణ కల్పించడం అన్నది దీర్ఘకాల పోటీతత్వం కోణంలో ప్రమాదకరమన్నారు.దేశీయ వ్యాపారాలను కాపాడుకోవడం కంటే అవి స్వేచ్ఛగా పోటీపడేలా చూడాలన్నారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారత మార్కెట్లలో 900 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారని, ట్రంప్ పాలనలో వచ్చే మార్పులతో లేదా ఏదైనా అంతర్జాతీయ పరిణామంతో ఇందులో 5–10 శాతం మేర వెనక్కి మళ్లినా అందుకు సన్నద్ధమై ఉండాలని సూచించారు. -
ఫుడ్ డెలివరీకి కొత్త రూల్..
ఆహారోత్పత్తులు విక్రయించే ఈ–కామర్స్ కంపెనీలకు ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కొత్త నిబంధన విధించింది. ఏదైనా ఆహారోత్పత్తి గడువు ముగిసే తేదీకి కనీసం 30 శాతం లేదా 45 రోజులు ముందుగా కస్టమర్‌కు చేరాలని స్పష్టం చేసింది. అంటే షెల్ఫ్ లైఫ్ కనీసం 45 రోజులు ఉన్న ఉత్పత్తులను డెలివరీ చేయాల్సి ఉంటుంది.కాలం చెల్లిన, గడువు తేదీ సమీపిస్తున్న ఉత్పత్తుల డెలివరీలను కట్టడి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ & సర్టిఫికేషన్‌కి మద్దతుగా డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లకు రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు నిర్వహించాలని కూడా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లను ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ సూచించినట్లు తెలుస్తోంది. కల్తీని నివారించడానికి ఆహారం, ఆహారేతర వస్తువులను వేర్వేరుగా డెలివరీ చేయాలని స్పష్టం చేసింది.గడువు ముగిసే ఆహార ఉత్పత్తుల విక్రయాలకు సంబంధించిన సమస్యలు ఇటీవల అధికమయ్యాయి. ముఖ్యంగా డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా డెలివరీ అయ్యే వస్తువులపై గడువు తేదీలు ఉండటం లేదంటూ అనేక ఫిర్యాదు వచ్చాయి. డెలివరీ చేస్తున్న వస్తువులపై ఎంఆర్పీ, "బెస్ట్ బిఫోర్" తేదీలు లేకపోవడంపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) గత నెలలో క్విక్-కామర్స్, ఈ-కామర్స్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. -
స్విగ్గీ ‘లాభాల’ డెలివరీ
ముంబై: ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ సంస్థ స్విగ్గీ షేరు లిస్టింగ్ రోజే ఇన్వెస్టర్లకు 17% లాభాలు డెలివరీ చేసింది. ఎన్ఎస్ఈలో ఇష్యూ ధర (రూ.390)తో పోలిస్తే 8% ప్రీమియంతో రూ.420 వద్ద లిస్టయ్యింది. నష్టాల మార్కెట్లో ఈ షేరుకు డిమాండ్ లభించింది. ఇంట్రాడేలో 19.50% పెరిగి రూ.466 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 17% లాభంతో రూ.456 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1.03 లక్షల కోట్లుగా నమోదైంది. → ఐపీఓ లిస్టింగ్‌తో స్విగ్గీ కంపెనీలో 500 మంది ఉద్యోగులు కోటీశ్వరులయ్యారు. పబ్లిక్ ఇష్యూ కంటే ముందే స్విగ్గీ తన 5,000 మంది ఉద్యోగులకు ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ఈ–సాప్స్) కింద పెద్ద మొత్తంలో షేర్లు కేటాయించింది. ఐపీఓ గరిష్ట ధర శ్రేణి రూ.390 ప్రకారం వీటి విలువ రూ.9,000 కోట్లుగా ఉంది. దలాల్ స్ట్రీట్‌లో షేరు రూ.420 వద్ద లిస్ట్ కావడంతో ఉద్యోగులకు కేటాయించిన షేర్ల విలువ అమాంతం పెరిగింది. దీంతో సుమారు 500 మంది ఉద్యోగులు ఒక్కొక్కరి దగ్గర షేర్ల విలువ రూ. కోటికి పైగా చేరింది. → స్విగ్గీ షేర్లు మార్కెట్లోకి లిస్ట్ కావడంపై జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ శుభాకాంక్షలు తెలిపారు. స్విగ్గీ, జొమాటోకు సంబంధించిన ఒక ఫొటోను ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేస్తూ ‘నువ్వు, నేను ఈ అందమైన ప్రపంచంలో..’ అంటూ రాసుకొచ్చారు. 5 ఏళ్లలో పటిష్ట వృద్ధి: సీఈఓ శ్రీహర్ష వచ్చే 3–5 ఏళ్లలో పటిష్ట వృద్ధి పథంలో దూసుకెళ్తామని స్విగ్గీ సీఈఓ శ్రీహర్ష ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్‌స్టామార్ట్ నెట్‌వర్క్‌ను మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. పెద్ద డార్క్ స్టోర్లను ప్రారంభిస్తామని చెప్పారు. పెద్ద నగరాల్లో సగటు డెలివరీ సమయం 17 నిమిషాల నుంచి 12 నిమిషాలకు తగ్గిందన్నారు. -
ఆన్లైన్ కంటే తక్కువ ధరకే!.. పోస్ట్ వైరల్
బెంగళూరు నగరానికి చెందిన ఒక కొబ్బరి బొండాల వ్యాపారి.. జెప్టో, బ్లింకిట్, బిగ్ బాస్కెట్ వంటి వాటికి సవాలు విసిరారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ వ్యాపారి విసిరినా సవాల్ ఏమిటి? దీనిపై నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారు అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులో.. కొబ్బరి బోండాం రేటు జెప్టోలో రూ. 80, బ్లింకిట్‌లో రూ. 80, బిగ్‌బాస్కెట్‌లో రూ. 70 ఉంది. కానీ వ్యాపారి కేవలం రూ. 55కే కొబ్బరి బోండాం అంటూ వెల్లడించారు. ఈ పోస్ట్ చూసిన చాలామందిలో చర్చ మొదలైంది. యాప్‌లు వ్యసనంగా మారితే వస్తువులు ఖరీదైనవిగా మారతాయని నెటిజన్లు పేర్కొంటున్నారు.క్విక్ కామర్స్ సైట్లు ఎప్పుడూ ధరలను భారీగా పెంచుతాయి. ప్రజల సమయాన్ని, సౌకర్యాలను బట్టి బిల్లు వేస్తాయి. వీటిపైనే ఆధారపడితే భవిష్యత్తులో ఖర్చులు భారీగా పెరుగుతాయి. జొమాటో, స్విగ్గీ వంటి వాటిని తొలగించినప్పటి నుంచి నా ఖర్చులు చాలా తగ్గాయని ఒక నెటిజన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: రెండో ఆదాయంపై కన్నేసిన సినీతారలు: అందరి చూపు అటువైపే..క్విక్ కామర్స్ సైట్లలో మోసాలు కూడా విపరీతంగా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ధన త్రయోదశి సందర్భంగా ఒక నెటిజన్ బ్లింకిట్ ద్వారా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నుంచి 1 గ్రాముల బంగారు నాణెం, 10 గ్రాముల వెండి నాణెం ఆర్డర్ చేసినప్పటికీ 0.5 గ్రాముల బంగారు నాణెం వచ్చినందుకు మోసపోయానని ఆరోపించాడు. ఇలా నెటిజన్లు ఎవరికితోచిన విధంగా వారు కామెంట్స్ చేస్తున్నారు.Will Quick Commerce affect roadside coconut vendors? 📸: @nithishr46 found this in @peakbengaluru pic.twitter.com/LfQKpgO2uc— Peak Bengaluru (@peakbengaluru) November 7, 2024 -
క్విక్ కామర్స్‌లోకి మరిన్ని బ్రాండ్లు
న్యూఢిల్లీ: క్విక్కామర్స్కు పట్టణ వాసుల నుంచి ఆదరణ పెరుగుతుండడంతో.. ప్రముఖ బ్రాండ్లు అమ్మకాలు పెంచుకునేందుకు ఈ దిశగా ఆసక్తి చూపిస్తున్నాయి. ఫ్యాబ్ ఇండియా, డెకథ్లాన్, అడిడాస్, యూఎస్ పోలో, బోట్ తదితర ప్రముఖ బ్రాండ్లు బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో ప్లాట్‌ఫామ్‌లపై తమ ఉత్పత్తులను ఇటీవలి కాలంలో లిస్ట్ చేశాయి. పుమా, స్కెచర్స్ సైతం క్విక్‌కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై లిస్టింగ్‌కు ఉత్సాహం చూపిస్తున్నాయి. ‘‘ఇది కేవలం ఆరంభమే. వేగం, సౌకర్యం దేశంలో ప్రజల షాపింగ్ తీరును మార్చివేయనున్నాయి’’అని జెప్టో అప్పారెల్ లైఫ్‌స్టయిల్ హెడ్ ఆస్థా గుప్తా తెలిపారు. క్విక్ కామర్స్ సంస్థలు ఇంతకాలం మెట్రోలకే పరిమితం కాగా, టైర్–2, 3 పట్టణాల్లోకి విస్తరిస్తున్నాయి. కనుక ఈ విభాగాన్ని ప్రముఖ బ్రాండ్లు నిర్లక్ష్యం చేయడానికి అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్‌కు చెందిన ‘తస్వ’ మెన్స్‌వేర్ బ్రాండ్, డిజైనర్ తరుణ్ తహిల్యాని క్విక్‌కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై తమ ఉత్పత్తులను లిస్టింగ్ చేసే ప్రణాళికతో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రముఖ బ్రాండ్లు తమ స్టోర్ల కోసం సరైన లొకేషన్‌ను గుర్తించడం, అమ్మకాల పరంగా విజయం సాధించడం క్లిష్టమైన టాస్క్ అనడంలో సందేహం లేదు. అదే క్విక్ కామర్స్ అయితే మరింత మంది వినియోగదారులకు వేగంగా, సులభంగా చేరుకోగలగడం వాటిని ఆకర్షిస్తోంది. ఇటీవలి కాలంలో నాసిక్, వారణాసి, ఉదయ్‌పూర్, హరిద్వార్, బటిండ తదితర చిన్న పట్టణాలకూ క్విక్‌కామర్స్ సేవలు విస్తరించడం గమనార్హం. స్పందన చూద్దాం.. క్విక్‌కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో దీర్ఘకాల ఒప్పందాలకంటే, ముందు ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు ప్రముఖ బ్రాండ్లు ఆసక్తి చూపుతున్నట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ‘‘ప్రస్తుతం బ్రాండ్లకు ఇది ప్రయోగాత్మక దశ. ఆడిదాస్, ఫ్యాబ్ ఇండియా తదితర బ్రాండ్లకు భారీ అమ్మకాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే అవి కేవలం అప్పారెల్ కంపెనీలు. ఈ ఉత్పత్తుల్లో వెనక్కి తిరిగి పంపడం ఎక్కువగా ఉంటుంది. ఆన్లైన్ కొనుగోళ్లలో 25–30 శాతం వెనక్కి వస్తుంటాయి. కనుక వీటి విషయంలో విజయం ఎంతన్నది వేచి చూస్తే కానీ తెలియదు. అదే గ్రోసరీ, స్టాపుల్స్, సౌందర్య ఉత్పత్తులు, బహుమతులు, మొబైల్ ఉత్పత్తులు క్విక్ కామర్స్‌పై ఎక్కువ డిమాండ్ ఉన్న విభాగాలు’’అని ఎలారా క్యాపిటల్ వైస్ ప్రెసిడెంట్ కరణ్ తురాణి వివరించారు.సంప్రదాయ స్టోర్లపై ప్రభావం..క్విక్‌కామర్స్ శరవేగంగా విస్తరిస్తుండడం సంఘటిత స్టోర్ల అమ్మకాలపై ప్రభావం చూపిస్తోంది. సెపె్టంబర్ త్రైమాసికం డీమార్ట్ ఫలితాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. ఫలితాల తర్వాత స్టాక్ కూడా భారీగా పడిపోవడం గమనార్హం. పెద్ద మెట్రోల్లో క్విక్ కామర్స్ సంస్థల రూపంలో డీమార్ట్ వంటి స్టోర్లకు పోటీ తీవ్రంగా ఉన్నట్టు బ్రోకరేజీ సంస్థలు తమ విశ్లేషణలో పేర్కొన్నాయి. క్విక్ కామర్స్ కంపెనీలు తొలుత తక్షణ గ్రోసరీ డెలివరీ సేవలతో వ్యాపారం మొదలు పెట్టగా, కస్టమర్ల స్పందన ఆధారంగా తర్వాతి కాలంలో మరిన్ని విభాగాల్లోకి సేవలను విస్తరించాయి. గృహోపకరణాలు, చార్జింగ్ కేబుళ్లు, ఎయిర్‌కూలర్లు, ఐఫోన్లు, ఆట»ొమ్మలు ఇలా ఎన్నో ఉత్పత్తులను జోడించుకుంటూ వెళుతున్నాయి. ఇది సంప్రదాయ రిటైల్ పరిశ్రమను దెబ్బతీస్తుందని, ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తుందన్న ఆందోళనలు వర్తకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. -
కిరాణా కొట్లకు ‘క్విక్’ దెబ్బ
సాక్షి, అమరావతి: ఆన్లైన్ కొనుగోళ్ల సంస్కృతి పెరుగుతోంది. ఏ వస్తువు కావాలన్నా ప్రజలు ఆన్లైన్ వైపే చూస్తున్నారు. ఇటీవల మార్కెట్లోకి దూసుకొచ్చి¯]∙క్విక్ కామర్స్ సంస్థలు జెప్టో, బ్లింకిట్ వంటి కంపెనీలు వినియోగదారులు కోరుకున్న వస్తువులను 10 నిమిషాల్లోనే ఇంటికి డెలివరీ చేస్తున్నాయి. ఈ ప్రభావం కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. దీనివల్ల దేశవ్యాప్తంగా గత ఏడాది 2 లక్షల కిరాణా షాపులు మూతపడ్డాయి. ఈ విషయాన్ని ఆల్ ఇండియా కన్సూ్యమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ (ఏఐసీపీడీఎఫ్) నివేదిక వెల్లడించింది.క్విక్ కామర్స్ వల్లే..క్విక్ కామర్స్ (శీఘ్ర వాణిజ్యం) ప్లాట్‌ఫామ్‌ల రాకతోనే కిరాణా షాపులు మూతపడుతున్నట్టు ఏఐసీపీడీఎఫ్ అధ్యయనం వెల్లడించింది. దేశంలోని మెట్రో నగరాలతోపాటు చిన్నపాటి పట్టణాల్లోనూ క్విక్ కామర్స్ ఊపందుకోవడంతో పచారీ దుకాణాలు మూతపడుతున్నాయి. కాలు బయటకు పెట్టకుండా ఇంటికే వేగంగా సరుకులు రావాలని కోరుకుంటున్న వినియోగదారులు బ్లింకిట్, జెప్టో వంటి ఫాస్ట్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆర్డర్లు చేసేందుకు ఇష్టపడుతున్నారు.ఫలితంగా సంప్రదాయ కిరాణా షాపులు దెబ్బతింటున్నాయి. దేశం మొత్తం మీద సుమారు 1.30 కోట్ల కిరాణా షాపులు ఉంటే.. క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ వల్ల కేవలం ఏడాది కాలంలోనే కనీసం 2 లక్షల కిరాణా స్టోర్లు, చిన్నాచితక రిటైల్ ఔట్లెట్లు మూతపడ్డాయి. ముఖ్యంగా మెట్రో నగరాలతోపాటు ప్రధాన నగరాల్లోని కిరాణా దుకాణాలపై క్విక్ కామర్స్ ప్రభావం ఎక్కువగా ఉందని ఏఐసీపీడీఎఫ్ స్పష్టం చేసింది. నగరాల్లోనే 45 శాతంమూతపడిన దుకాణాల్లో 45 శాతం మెట్రో నగరాల్లోనే ఉన్నాయి. ప్రధాన నగరాల్లో 30 శాతం, పట్టణాల్లో 25 శాతం కిరాణా షాపులు కనుమరుగయ్యాయి. క్విక్ కామర్స్ కంపెనీలు విస్తరిస్తున్న వేగానికి దశాబ్దాలుగా భారత రిటైల్ రంగానికి వెన్నెముకగా ఉన్న కిరాణా దుకాణాలు ఖాతాదారులను, లాభదాయకతను కోల్పోతున్నాయని ఏఐసీపీడీఎఫ్ జాతీయ అధ్యక్షుడు ధైర్యశీల్ పాటిల్ స్పష్టం చేశారు. తగ్గింపు ధరల పేరుతో ప్రజలను ఆకర్షిస్తున్న ఆన్లైన్ వాణిజ్య సంస్థలు కిరాణా షాపుల వినియోగదారులను కొల్లగొడుతున్నాయని తెలిపారు.40 నుంచి 60 శాతం వరకు తగ్గింపులతో వస్తువులను విక్రయించడం ఏ కంపెనీకి వాస్తవికమైనది లేదా స్థిరమైనది కాదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో క్విక్ కామర్స్ సంస్థల చట్టవిరుద్ధ ధరలపై విచారణ జరిపించాలని పాటిల్ డిమాండ్ చేశారు. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు రాసిన లేఖలో ఈ–కామర్స్, క్విక్ కామర్స్ భారీ తగ్గింపులపై ఏఐసీపీడీఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ధరలపై దర్యాప్తు చేయాలని కోరింది. క్విక్ కామర్స్ సంస్థల విస్తరణను అడ్డుకోకపోతే కిరాణా షాపులను కాపాడుకోవడం కష్టమని స్పష్టం చేసింది.అద్దెలు చెల్లించడం కష్టంగా ఉందిమాల్స్, డీమార్ట్, స్మార్ట్ బజార్, బిగ్ బాస్కెట్ వంటి సూపర్ మార్కెట్లు రావడంతో చిన్నచిన్న కిరాణా షాపుల్లో విక్రయాలు తగ్గిపోయాయి. ఆన్లైన్ సంస్థలు గ్రామీణ ప్రాంతాలకు సైతం డోర్ డెలివరీలు చేçస్తుండటంతో కిరాణా షాపులకు కొనుగోలుదారులు రావడం లేదు. వ్యాపారం లేక షాపుల అద్దెలు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొంది. సరుకులు, షాపుల నిర్వహణ కోసం చేసిన అప్పులు చెల్లించలేక, సిబ్బందికి జీతాలు ఇవ్వలేక వంటి కారణాలతో కిరాణా షాపులు మూతపడుతున్నాయి. – బొలిశెట్టి సత్యనాగ బాలరాజు, అధ్యక్షుడు, పెడన వర్తక సంఘం, కృష్ణా జిల్లాకిరాణా వ్యాపారాలకు గడ్డుకాలమేకిరాణా వ్యాపారులకు గడ్డుకాలం వచ్చింది. ఒకవైపు ఆన్లైన్ మార్కెట్, మరోవైపు చిన్న పట్టణాల్లో మెగా మార్ట్ల రాకతో దశాబ్దాల కాలంగా స్థానికంగా చేస్తున్న కిరాణా వ్యాపారాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఆన్లైన్, మాల్స్ పోటీని తట్టుకుని నిలబడలేక నష్టాల బాట పట్టాం. అద్దె షాపుల్లో సిబ్బందితో నడిపే కిరాణా వ్యాపారాలు పరిస్థితి మరీ దయనీయంగా మారింది. వాస్తవానికి కిరాణా షాపుల్లో సరుకుల నాణ్యత చూసి కొనుక్కునే అవకాశంతోపాటు అరువు తీసుకునే వెసులుబాటు కూడా ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. – అద్దంకి వెంకట శివప్రసాదరావు, కార్యదర్శి, భీమవరం కిరాణా మర్చంట్స్ అసోసియేషన్, పశ్చిమగోదావరి -
క్విక్ కామర్స్‌లోకి టాటా గ్రూప్?
టాటా గ్రూప్ క్విక్ కామర్స్ రంగంలో వేగంగా విస్తరిస్తోంది. ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలకు ధీటుగా టాటా గ్రూప్ ‘న్యూఫ్లాష్’ పేరుతో ఈ సేవలు ప్రారంభించనుంది. ఈ సర్వీసును ముందుగా మెట్రో నగరాల్లో అందించనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. ఇప్పటికే టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని బిగ్‌బాస్కెట్ ద్వారా వినియోగదారులకు ఈ-కామర్స్ సేవలు అందిస్తోంది.క్విక్ కామర్స్ బిజినెస్‌కు వినియోగదారుల నుంచి ఆదరణ పెరుగుతోంది. దాంతో ప్రముఖ కంపెనీలు ఈ రంగంలో సేవలందించేందుకు పూనుకుంటున్నాయి. ఇప్పటికే జొమాటో యాజమాన్యంలోని బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో ఈ క్విక్ కామర్స్ సేవలందిస్తున్నాయి. మొత్తంగా ఈ కంపెనీలు 85% మార్కెట్ వాటా కలిగి ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ పేరుతో ఈ సేవలందిస్తోంది. రిలయన్స్ జియోమార్ట్ ఎక్స్‌ప్రెస్ పేరుతో ముంబయిలో ఈ సర్వీసు అందుబాటులో ఉంచింది. ఇటీవల జరిగిన ఓ సర్వే ప్రకారం రిలయన్స్ రిటైల్, డీమార్ట్, స్పెన్సర్స్ వంటి రిటైల్ బిజినెస్ కంటే క్విక్ కామర్స్ కంపెనీలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. దాంతో ఇప్పటికే కొన్ని రిటైల్ సర్వీసులు అందించే కంపెనీలు ఈ బిజినెస్‌లోకి ప్రవేశిస్తున్నాయి. టాటా గ్రూప్ కూడా వినియోగదారులను పెంచుకుని ఈ విభాగంలో సేవలందించాలని భావిస్తోంది.ఇదీ చదవండి: పన్ను ఎగవేతను పట్టించే చట్టాలివే..టాటా గ్రూప్ బిగ్‌బాస్కెట్ ద్వారా ఈ-కామర్స్, క్రోమా ద్వారా ఎలక్ట్రానిక్స్, టాటా క్లిక్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ సేవలు, టాటా 1ఎంజీ ద్వారా ఫార్మసీ సేవలు అందిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాపారాల్లో సంస్థకు వినియోగదారులు ఉండడంతో కొత్తగా రాబోయే టాటా న్యూ ఫ్లాష్ బిజినెస్‌కు కూడా వీరి సహకారం ఉంటుందని కంపెనీ భావిస్తోంది. -
కిక్కెక్కిస్తోన్న ‘క్విక్ కామర్స్’!
క్విక్ కామర్స్ ప్రముఖ ఎఫ్ఎంసీజీలకు కిక్కెక్కిస్తోంది. ఎఫ్ఎంసీజీ కంపెనీల మొత్తం ఆన్లైన్ అమ్మకాల్లో క్విక్‌కామర్స్ విక్రయాలు రెండు రెట్లు పెరిగినట్టు డెలాయిట్, ఫిక్కీ సంయుక్త నివేదిక వెల్లడించింది. పట్టణ వినియోగదారులకు క్విక్‌కామర్స్ ప్రాధాన్య ఛానల్‌గా మారుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. దీంతో ఎఫ్ఎంసీజీ ఆన్లైన్ విక్రయాల్లో క్విక్ కామర్స్ విభాగం వాటా 35 శాతానికి చేరుకున్నట్టు పేర్కొంది.నివేదికలోని వివరాల ప్రకారం..18 శాతానికి పైగా వినియోగదారులు ఆహారం, పానీయాలను క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారు. 2021 నుంచి 2023 నాటికి క్విక్ కామర్స్ మార్కెట్ 230% పెరిగింది. మరుసటి రోజు డెలివరీ చేసే సంప్రదాయ ఆన్లైన్ గ్రోసరీ సంస్థల మార్కెట్ వాటాను క్విక్ కామర్స్ సంస్థలు కొల్లగొడుతున్నాయి. రానున్న రోజుల్లో క్విక్ కామర్స్ మార్కెట్ మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది. ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల కొనుగోళ్లకు ఈ–కామర్స్‌ను ప్రధాన ఛానల్‌గా మారుస్తున్నారు. ఇంటర్నెట్ వినియోగం వేగంగా విస్తరిస్తోంది. ఎఫ్ఎంసీజీ మొత్తం అమ్మకాల్లో ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల వాటా 17 శాతానికి చేరింది. సంపన్న వినియోగదారులు ఈ దిశగా ఆసక్తి చూపిస్తున్నారు. గొప్ప సౌకర్యం, విస్తృత ఉత్పత్తుల శ్రేణి, పోటీతో కూడిన ధరలు ఆకర్షిస్తున్నాయిఇదీ చదవండి: రుణ మార్గదర్శకాలు కఠినతరంఫుడ్, బెవరేజెస్..ఫుడ్, బెవరేజెస్ కోసం సంప్రదాయ ఈ–కామర్స్ ఛానళ్ల కంటే క్విక్ కామర్స్ సంస్థల్లో ఆర్డర్ చేసేందుకే కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇవి తక్షణ అవసరాల కోసం ఉద్దేశించినవిగా డెలాయిట్, ఫిక్కీ నివేదిక పేర్కొంది. అదే సౌందర్య, గృహ ఉత్పత్తులు తక్షణ అవసరమైనవి కావకపోవడంతో, వీటిని ఈ–కామర్స్ వేదికలపై ఆర్డర్ చేసేందుకు వినియోగదారులు మొగ్గు చూపిస్తున్నట్టు వెల్లడించింది. చిన్న కుటుంబాలు, భార్యా భర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసే వారు కావడం క్విక్ కామర్స్‌కు డిమాండ్‌ను పెంచుతున్నట్టు వివరించింది.