న్యూఢిల్లీ: హైపర్–లోకల్ ఈ–కామర్స్ సంస్థ మ్యాజిక్‌పిన్ తాజాగా ఫుడ్ డెలివరీ సేవలకు సంబంధించి క్విక్ కామర్స్ విభాగంలోకి అడుగుపెట్టింది. మ్యాజిక్‌నౌ బ్రాండ్‌ను ఆవిష్కరించింది. చాయోస్, ఫాసోస్, మెక్‌డొనాల్డ్స్, బర్గర్ కింగ్ వంటి 2,000 పైచిలుకు ఫుడ్ బ్రాండ్లు, 1,000కి పైగా మర్చంట్లతో కలిసి పని చేయనున్నట్లు సంస్థ తెలిపింది.
1.5 కి.మీ. నుంచి 2 కి.మీ. పరిధిలో వేగంగా ఫుడ్ డెలివరీ సేవలు అందిస్తామని పేర్కొంది. ముందుగా హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ–ఎన్‌సీఆర్, పుణెల్లో ఈ సర్వీసులను ప్రారంభిస్తామని వివరించింది. ఫుడ్ డెలివరీకి ఇతరత్రా క్విక్ కామర్స్ సంస్థల తరహాలో డార్క్ స్టోర్స్ విధానాన్ని పాటించబోమని కంపెనీ పేర్కొంది.
నవంబర్ 14 – డిసెంబర్ 15 మధ్య ఢిల్లీ–ఎన్‌సీఆర్, బెంగళూరులో నాలుగు వారాలపాటు పైలట్ ప్రాజెక్టు నిర్వహించినట్లు, 75,000 పైగా ఫుడ్ డెలివరీలు నమోదు చేసినట్లు తెలిపింది. ఫుడ్ డెలివరీ సేవల కోసం తమ లాజిస్టిక్స్ అగ్రిగేటర్ విభాగం వెలాసిటీని ఉపయోగించుకుంటామని మ్యాజిక్‌పిన్ తెలిపింది. ప్రస్తుతం కేఎఫ్‌సీ, బర్గర్ కింగ్, ఐజీపీ గిఫ్టింగ్ వంటి బ్రాండ్లకు వెలాసిటీ సర్వీసులను అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment