E commerce
-
కష్టజీవులపై చలానాస్త్రం! ‘రూ.9.6 లక్షలు పిండేశాం’
నగరాలలో పొట్టకూటి కోసం చిరుద్యోగాలు చేసుకునే కష్టజీవులు చాలా మంది కనిపిస్తారు. వీరిలో ముఖ్యంగా ఈ-కామర్స్ సంస్థలకు డెలివరీ ఏజెంట్లుగా పనిచేస్తూ పొట్టపోసుకునేవారే ఎక్కువ. రోజంతా రోడ్లపై తిరుగుతూ కష్టపడితే పదో పాతికో సంపాదిస్తారు. వీళ్లనే టార్గెట్ చేశారు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు. చిన్న చిన్న ఉల్లంఘనల పేరుతో జరిమానాల రూపంలో లక్షల రూపాయలు పిండేశారు.నిబంధనలు ఉల్లంఘించే ఈ-కామర్స్ వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు శనివారం (మార్చి 1) స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మొత్తం 1,859 మంది నుంచి జరిమానాల రూపంలో రూ.9.6 లక్షలు వసూలు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చూడటం రహదారి భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా, ఈ-కామర్స్ డెలివరీ వాహనాల ద్వారా పెరుగుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనలను పరిష్కరించే విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ డ్రైవ్ చేపట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.స్పెషల్ డ్రైవ్ లో ఎక్కువగా ఈ-బైకులే నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు గుర్తించామని జాయింట్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) ఎంఎన్ అనుచేత్ తెలిపారు. ఈ వాహనాలు ఎక్కువగా మైక్రో మొబిలిటీ వాహనాలు, వాటి వినియోగదారులకు నిబంధనలు తెలియవు. మైక్రో మొబిలిటీ వాహనాలకు రిజిస్ట్రేషన్ నంబర్లు లేవని, వాటి వినియోగదారులు హెల్మెట్ ధరించాల్సిన అవసరం లేదని ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు వివరించారు.చిరు ఉల్లంఘనలుఫుట్ పాత్ లపై ప్రయాణించినందుకు 79 మంది, నో ఎంట్రీ నిబంధనను ఉల్లంఘించినందుకు 389 మంది, వన్ వేకు విరుద్ధంగా ప్రయాణించినందుకు 354 మంది, సిగ్నల్ జంప్ చేసినందుకు 209 మంది, హెల్మెట్ ధరించనందుకు 582 మంది, రాంగ్ పార్కింగ్ చేసినందుకు 98 మంది, ట్రాఫిక్ కు ఆటంకం కలిగించినందుకు 148 మందిని పోలీసులు పట్టుకున్నారు. అక్కడికక్కడే జరిమానా చెల్లించేందుకు తమ వద్ద డబ్బులు లేవని రైడర్లు చెప్పడంతో పోలీసులు 794 వాహనాలకు నోటీసులు జారీ చేశారు.అవగాహన లేమిచాలా మంది రైడర్లు తమకు నిబంధనలపై అవగాహన లేదని చెప్పడంతో, వారికి గంటకు పైగా ఆయా పరిధుల్లో రూల్ ట్రైనింగ్ ఇచ్చినట్లు అనుచేత్ తెలిపారు. ఈ-కామర్స్ కు అనుబంధంగా ఉన్న ఎల్లోబోర్డు వాహనాలను ట్రాఫిక్ పోలీసులు టార్గెట్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే దీన్ని పోలీసులు ఖండించారు. వాహనం నంబర్ ప్లేట్ రంగుతో సంబంధం లేకుండా ఈ-కామర్స్ డెలివరీ కోసం ఉపయోగించే అన్ని రకాల వాహనాలు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు కేసులు నమోదు చేసినట్లు అనుచేత్ తెలిపారు. -
దేశంలో తొలి ఈ–కామర్స్ ఎగుమతుల హబ్.. త్వరలో కార్యకలాపాలు
దేశీయంగా తొలి ఈ–కామర్స్ ఎగుమతుల హబ్ ( E-Commerce Export Hub) ఈ ఏడాది మార్చి నుంచి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) సంతోష్ కుమార్ సారంగి తెలిపారు. ప్రయోగాత్మకంగా వీటిని ఏర్పాటు చేసేందుకు అయిదు సంస్థలకు అనుమతులు ఇచ్చినట్లు వివరించారు.ఢిల్లీలో లాజిస్టిక్స్ అగ్రిగేటర్ షిప్‌రాకెట్, ఎయిర్ కార్గో హ్యాండ్లింగ్ సంస్థ కార్గో సర్వీస్ సెంటర్; బెంగళూరులో డీహెచ్ఎల్, లెక్స్షిప్; ముంబైలో గ్లోగ్లోకల్ ఈ జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ హబ్‌ల నిర్వహణ విధి విధానాలను రూపొందించడంపై వాణిజ్య, ఆదాయ విభాగాలు, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) కలిసి పని చేస్తున్నాయని సారంగి చెప్పారు.గేట్‌వే పోర్టుల్లో కస్టమ్స్ పరిశీలన నుంచి మినహాయింపులు, రిటర్నుల కోసం సులభతరమైన రీఇంపోర్ట్ పాలసీ మొదలైన ఫీచర్లు ఈ హబ్‌లలో ఉంటాయి. ఈ–కామర్స్ ఎగుమతులను పెంచుకోవడంపై భారత్ మరింతగా దృష్టి పెడుతున్న నేపథ్యంలో వీటి ఏర్పాటు ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం భారత్ ఈ–కామర్స్ ఎగుమతులు 5 బిలియన్ డాలర్లుగా ఉండగా 2030 నాటికి వీటిని 100 బిలియన్ డాలర్లకు పెంచుకునే సామర్థ్యాలు ఉన్నాయనే అంచనాలు నెలకొన్నాయి. ట్రేడ్ కనెక్ట్ ఈ-ప్లాట్‌ఫామ్ రెండవ దశను ప్రారంభించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కృషి చేస్తోందని సారంగి ప్రకటించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించిన మొదటి దశ ఎగుమతులు, దిగుమతులపై అవసరమైన సమాచారాన్ని అందించింది. రెండవ దశతో వాణిజ్య వివాదాలకు పరిష్కారం, వాణిజ్య విశ్లేషణలు, విదేశీ మిషన్ల నుండి ఇంటెలిజెన్స్ నివేదికలు, వాణిజ్య ఫైనాన్స్, బీమా ఎంపికలు వంటి అదనపు సేవలు అందుబాటులోకి రానున్నాయి.ఏప్రిల్ 1 నుంచి డైమండ్ ఇంప్రెస్ట్ ఆథరైజేషన్ మరోవైపు డైమండ్ ఇంప్రెస్ట్ ఆథరైజేషన్ (DIA) పథకం ప్రారంభానికి సంబంధించిన ప్రణాళికలను కూడా డీజీఎఫ్టీ వెల్లడించింది. ఇది ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తుంది. ఈ స్కీమ్ నిర్దిష్ట పరిమితి వరకు కట్, పాలిష్ చేసిన వజ్రాలను సుంకం-రహిత దిగుమతికి అనుమతిస్తుంది. వజ్రాల ప్రాసెసింగ్, విలువ జోడింపునకు భారత్‌ను కేంద్రంగా మార్చడమే దీని లక్ష్యం. డైమండ్ ఇంప్రెస్ట్ లైసెన్స్ అర్హతగల ఎగుమతిదారులు గత మూడు సంవత్సరాల నుండి వారి సగటు టర్నోవర్‌లో 5 శాతం వరకు 10 శాతం విలువ జోడింపు అవసరంతో వజ్రాలను దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తుంది. -
క్విక్ కామర్స్‌లోకి మ్యాజిక్‌పిన్
న్యూఢిల్లీ: హైపర్–లోకల్ ఈ–కామర్స్ సంస్థ మ్యాజిక్‌పిన్ తాజాగా ఫుడ్ డెలివరీ సేవలకు సంబంధించి క్విక్ కామర్స్ విభాగంలోకి అడుగుపెట్టింది. మ్యాజిక్నౌ బ్రాండ్‌ను ఆవిష్కరించింది. చాయోస్, ఫాసోస్, మెక్‌డొనాల్డ్స్, బర్గర్ కింగ్ వంటి 2,000 పైచిలుకు ఫుడ్ బ్రాండ్లు, 1,000కి పైగా మర్చంట్లతో కలిసి పని చేయనున్నట్లు సంస్థ తెలిపింది.1.5 కి.మీ. నుంచి 2 కి.మీ. పరిధిలో వేగంగా ఫుడ్ డెలివరీ సేవలు అందిస్తామని పేర్కొంది. ముందుగా హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ–ఎన్సీఆర్, పుణెల్లో ఈ సర్వీసులను ప్రారంభిస్తామని వివరించింది. ఫుడ్ డెలివరీకి ఇతరత్రా క్విక్ కామర్స్ సంస్థల తరహాలో డార్క్ స్టోర్స్ విధానాన్ని పాటించబోమని కంపెనీ పేర్కొంది.నవంబర్ 14 – డిసెంబర్ 15 మధ్య ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరులో నాలుగు వారాలపాటు పైలట్ ప్రాజెక్టు నిర్వహించినట్లు, 75,000 పైగా ఫుడ్ డెలివరీలు నమోదు చేసినట్లు తెలిపింది. ఫుడ్ డెలివరీ సేవల కోసం తమ లాజిస్టిక్స్ అగ్రిగేటర్ విభాగం వెలాసిటీని ఉపయోగించుకుంటామని మ్యాజిక్‌పిన్ తెలిపింది. ప్రస్తుతం కేఎఫ్‌సీ, బర్గర్ కింగ్, ఐజీపీ గిఫ్టింగ్ వంటి బ్రాండ్లకు వెలాసిటీ సర్వీసులను అందిస్తోంది. -
ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి: ఇది లాభామా? నష్టమా?
ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి (Buy Now Pay Later).. ఈ విధానం కేవలం ఈ కామర్స్ వెబ్సైట్లలో మాత్రమే కాకుండా, కొన్ని దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు కూడా అవలంబించాయి. ఈ విధానం ద్వారా ఏదైనా కొనుగోలు చేసే వ్యక్తి.. ముందుగా వస్తువును కొనుగోలు చేస్తాడు. ఆ తరువాత ఇన్స్టాల్మెంట్ రూపంలో చెలించాలి. ఇంతకీ దీనివల్ల వినియోగదారునికి ఏమైనా లాభం ఉందా? లేక్ నష్టం ఉందా? అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం..ఏదైనా అత్యవసరమైన వస్తువులను.. చేతిలో డబ్బు లేని సమయంలో కొనుగోలు చేయాలంటే 'ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి' అనేది ఉపయోగకరమైన విధానమే. అయితే వస్తువును కొనే ముందే ఎన్ని రోజుల్లో పే చేయాలి? సమయానికి చెల్లించకపోతే వచ్చే నష్టాలు ఏంటి? అనేవన్నీ కూడా తప్పకుండా తెలుసుకోవాలి.మీరు సకాలంలో డబ్బు చెల్లిస్తే.. ఎటువంటి నష్టాన్ని చూడాల్సిన అవసరం లేదు. కానీ డబ్బు చెల్లించడంలో ఆలస్యం అయితే మాత్రం.. లేట్ పేమెంట్ ఫీజు, సర్వీస్ ఛార్జెస్ వంటివి ఎన్నో విధిస్తారు. కాబట్టి వీటన్నింటిని ముందుగానే తెలుసుకోవాలి.కొన్ని ఈ కామర్స్ కంపెనీలు అద్భుతమైన ఆఫర్స్.. డిస్కౌంట్స్ పేరుతో కస్టమర్లను ఆకర్షిస్తుంటారు. చేతిలో డబ్బు లేకపోయినా ఇప్పుడు కోనేయండి.. మళ్ళీ చెల్లించండి అంటూ ఊరిస్తుంటాయి. ఈ మాయలో పడ్డారంటే.. సమయానికి డబ్బు చెల్లించకపోత.. మీ చెబుకు చిల్లు పడ్డట్టే.ఇదీ చదవండి: జియో, ఎయిర్టెల్ కథ కంచికేనా?.. వచ్చేస్తోంది స్టార్లింక్మీరు ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి విధానంలో వస్తువులను కొనుగోలు చేయాలంటే మీకు సిబిల్ స్కోర్ వంటివి ఉండాల్సిన అవసరం లేదు. అయితే మీరు సకాలంలో డబ్బు చెల్లించకపోతే.. ఈ విషయాన్ని క్రెడిట్ బ్యూరోకు తెలియజేస్తుంది. ఆ తరువాత మీకు భవిష్యత్తులో లోన్ వచ్చే అవకాశం లేదు.ఆర్ధిక పరమైన విషయాల్లో తప్పకుండా క్రమశిక్షణ ఉండాలి. సకాలంలో తప్పకుండా నేను చెల్లించగలను అనే నమ్మకం మీకున్నప్పుడు, కొనుగోలు చేసే వస్తువు అత్యవసరమైనప్పుడు ''ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి'' ఎంచుకోవచ్చు. అయితే అప్పటికే ప్రతి నెలా ఏదైనా లోన్స్ వంటివి చెల్లిస్తుంటే.. ఈ సర్వీస్ ఉపయోగించుకోకపోవడం చాలా ఉత్తమం. -
ఎఫ్ఎల్ఐఎన్ మూడో కోహోర్ట్ కోసం ఐదు స్టార్టప్‌లు
స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో టెక్నాలజీ సహకారాన్ని పెంపొందించేందుకు రూపొందించిన 'ఫ్లిప్‌కార్ట్ లీప్ ఇన్నోవేషన్ నెట్వర్క్' (FLIN) ఫ్లాగ్షిప్ స్టార్టప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ మూడవ కోహోర్ట్ కోసం ఐదు స్టార్టప్‌లను ఎంపిక చేసింది. మునుపటి రెండు కోహోర్ట్‌ల విజయాన్ని అనుసరించి.. మూడవ రౌండ్ జెన్ ఏఐ, ఓమ్నీ ఛానల్, అనలిటిక్, వీడియో కామర్స్‌లో స్టార్టప్‌ల డ్రైవింగ్ పురోగతిని పరిచయం చేసింది.ఫ్లిప్‌కార్ట్ లీప్ ఇన్నోవేషన్ నెట్వర్క్ అనేది ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్షిప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్, ఇది ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉంది. 2022 జనవరిలో ప్రారంభమైన ఎఫ్ఎల్ఐఎన్.. భారతదేశంలో స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ వృద్ధిని వేగవంతం చేయడం, డ్రైవింగ్ సహకారం, లేటెస్ట్ రిటైల్ ఆవిష్కరణలను ప్రోత్సహించడం కోసం అంకితమైంది.ఎఫ్ఎల్ఐఎన్ ప్రోగ్రామ్ ద్వారా ఫ్లిప్‌కార్ట్.. స్టార్టప్ వ్యవస్థలో ఆవిష్కరణలకు ఉత్ప్రేరకంగా మారుతోంది. ఇది స్టార్టప్‌ల మెరుగుదలకు ఉపయోగపడుతుందని ఫ్లిప్‌కార్ట్ ల్యాబ్స్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ 'నరేన్ రావు' పేర్కొన్నారు. అంతే కాకుండా భారతదేశంలో ఈ-కామర్స్ భవిష్యత్తును రూపొందించగల పరిష్కారాలు ఫ్లిప్‌కార్ట్ ద్వారా సాధ్యమవుతాయని ఆయన అన్నారు.ఈ కోహోర్ట్ కోసం ఫ్లిప్‌కార్ట్ ఎంచుకున్న ఐదు స్టార్టప్‌లు•ఇంటెలిజెన్స్ నోడ్•ఇన్వెంజో ల్యాబ్స్•స్టోరీ బ్రెయిన్•ఫిలో•డీ-ఐడీ -
చిటికెలో చాయ్.. బిస్కెట్!
క్విక్ కామర్స్ రంగంలో పోటీ హీటెక్కుతోంది. దీంతో కంపెనీలు అధిక మార్జిన్ల కోసం సగటు ఆర్డర్ విలువ (ఏఓవీ)ను పెంచుకోవడంపై దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా టీ, కాఫీ, సమోసా, బిస్కెట్లు, ఇతరత్రా బేకరీ ఉత్పత్తులను కూడా కార్ట్‌లోకి చేరుస్తున్నాయి. ప్రత్యేకంగా కేఫ్ విభాగాలను ఏర్పాటు చేస్తూ... కస్టమర్లకు రెడీ–టు–ఈట్ ఆహారోత్పత్తులను ఫటాఫట్ డెలివరీ చేస్తున్నాయి. గ్రోసరీతో పాటు వీటిని కూడా కలిపి ఇన్‌స్టంట్‌గా అందిస్తున్నాయి. ఉదాహరణకు, జెప్టో ఈ ఏడాది ఏప్రిల్‌లో ముంబైలో ప్రయోగాత్మకంగా జెప్టో కేఫ్‌ను ఏర్పాటు చేసింది. అక్కడ బాగా క్లిక్ కావడంతో బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో కూడా దీన్ని అందుబాటులోకి తెచి్చంది. ఇతర ప్రధాన నగరాలకు క్రమంగా విస్తరించే ప్రణాళికల్లో ఉంది. ఇక స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సైతం పైలట్ ప్రాతిపాదికన బెంగళూరులో ఇన్స్టాకేఫ్ను తెరిచింది. ఇక్కడ ప్రధానంగా టీ, కాఫీతో పాటు సూపర్ మార్కెట్లలో రూ.30–300 రేంజ్లో లభించే రెడీ–టు–ఈట్ ఉత్పత్తులు లభిస్తున్నాయి. ఫుడ్ డెలివరీ యాప్‌లకు భిన్నం... తక్షణం కోరుకునే ఆహారోత్పత్తులను కస్టమర్లకు అందించడం కోసమే క్విక్ కామర్స్ కంపెనీలు ఈ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. అమెరికాలో 7–ఎలెవన్ స్టోర్స్ మాదిరిగా కస్టమర్లు వెళ్తూ వెళ్తూ కాఫీ లేదా కొన్ని రెడీ–టు–ఈట్ స్నాక్స్‌ను తీసుకెళ్లడం లాంటిదే ఈ మోడల్ అని జెప్టో కో–¸ûండర్ ఆదిత్ పలీచా చెబుతున్నారు. అయితే, అక్కడ మనమే ఉత్పత్తులను తీసుకెళ్లాల్సి ఉంటే, ఇక్కడ ఇన్‌స్టంట్‌గా హోమ్ డెలివరీ చేయడం వెరైటీ అంటున్నారు. కస్టమర్ల నుంచి ఈ కొత్త ప్రయత్నానికి మంచి స్పందనే వస్తోందట! స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్‌ల మాదిరి కాకుండా, కిరాణా సరుకులతో పాటు స్నాక్స్, టీ, కాఫీ వంటి ఉత్పత్తులను కూడా ఒకేసారి ఆర్డర్ పెట్టుకునే ఆప్షన్ ఉండటం గమనార్హం. అదనపు ఆదాయం... ఇతర దేశాల్లో కూడా ఉదాహరణకు, అమెరికాలో గోపఫ్, యూకేలో డెలివరూ.. లాటిన్ అమెరికాలో రప్పీ వంటి యాప్‌లు ఆదాయాన్ని పెంచుకోవడం కోసం స్నాక్స్‌ను కూడా డెలివరీ చేస్తున్నాయి. మన దగ్గర కూడా క్విక్ కామర్స్ సంస్థలు దీన్ని ఫాలో అవుతున్నాయి. కస్టమర్లు కార్ట్‌లోకి మరిన్ని ఉత్పత్తులను జోడించేలా చేయడం ద్వారా ట్రాన్సాక్షన్ విలువను పెంచుకోవడమే వాటి లక్ష్యం. ‘పదేపదే, ఎక్కువ సంఖ్యలో వచ్చే ఇలాంటి ఆర్డర్ల వల్ల కస్టమర్లకు యాప్‌తో అనుబంధం కూడా పెరుగుతుంది. ఆఫ్‌లైన్ బేకరీలు, కాఫీ షాప్‌లను కూడా నెట్‌వర్క్‌లోకి తీసుకొచ్చే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ అగ్రిగేటర్ల నుంచి కొంత వాటాను దక్కించుకోవడానికి వీలవుతుంది’ అని జిప్పీ ఫౌండర్, సీఈఓ మాధవ్ కస్తూరియా పేర్కొన్నారు. డార్క్ స్టోర్ల ద్వారా ఈ స్టార్టప్ దేశవ్యాప్తంగా ఈ–కామర్స్ బ్రాండ్ల కోసం ఇన్స్టంట్ డెలివరీ సేవలు అందిస్తోంది.అధిక మార్జిన్లు... క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు తమ రోజువారీ గ్రోసరీ విభాగానికి స్నాక్స్‌ను జోడించడం వల్ల వాటి స్థూల ఆర్డర్ విలువ (జీఓవీ) పెంచుకోవడానికి దోహదం చేస్తుందని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు. గ్రోసరీ ఉత్పత్తులతో పోలిస్తే రెడీ–టు–ఈట్లో మార్జిన్లు కూడా మెరుగ్గా ఉండటం మరో ప్లస్. ‘ప్రస్తుతం క్విక్ కామర్స్‌లో 60 శాతం ఆర్డర్లు కిరాణా ఇతరత్రా గ్రోసరీ విభాగం నుంచే వస్తున్నాయి. స్నాక్స్ ద్వారా 25–30 శాతం నమోదయ్యే అవకాశం ఉంది. అధిక విలువ గల ప్రోడక్టుల వాటా 10 శాతంగా ఉంటుంది’ అని ఆర్థా వెంచర్ ఫండ్ మేనేజింగ్ అనిరుధ్ దమానీ అభిప్రాయపడ్డారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
క్విక్ కామర్స్..ఫ్యాషన్ షో!
కిరాణా సరుకులు.. కూరగాయలు.. మిల్క్ ప్రోడక్టులు.. ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను 15 నిమిషాల్లో గుమ్మంలోకి చేరుస్తూ... శరవేగంగా దూసుకుపోతున్న క్విక్ కామర్స్ మరిన్ని ఉత్పత్తులను కార్ట్‌లోకి చేరుస్తోంది. నగరాల్లో సూపర్ సక్సెస్ నేపథ్యంలో అపారెల్, ఫుట్‌వేర్ కంపెనీలు దీనిపై ఫోకస్ చేస్తున్నాయి. ఫాస్ట్ సెల్లింగ్ జాబితాలో ముందున్న దుస్తులు, షూస్ ఇతరత్రా ఫ్యాషన్ ప్రోడక్టులను సైతం క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా విక్రయించేందుకు సై అంటున్నాయి.జొమాటో బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో.. ఈ క్విక్ కామర్స్ స్టార్టప్‌లు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. తమ ప్లాట్‌ఫామ్‌లలో ఇటీవలే ఫ్యాషన్ ప్రోడక్టుల అమ్మకాలు మొదలు పెట్టడంతో కస్టమర్లకు మరిన్ని రకాలు ప్రోడక్టులు అందుబాటులోకి వస్తున్నాయి. జాకీ, అడిడాస్ బ్రాండ్స్‌కు చెందిన బేసిక్ కలర్ టీ–షర్టులు, ఇన్నర్‌వేర్ వంటి ఉత్పత్తులను ఇన్‌స్టామార్ట్ సేల్ చేస్తోంది. ఇక బ్లింకిట్ జాకీ, పెపే, అడిడాస్ టీ–షర్ట్స్, కొన్ని రకాల ఫుట్‌వేర్, ట్రాక్ ప్యాంట్లతో పాటు లోదుస్తులను ఆఫర్ చేస్తోంది. జెప్టో కూడా నేను సైతం అంటూ రంగంలోకి దూకింది. దీంతో మరిన్ని ఆపారెల్, ఫుట్‌వేర్ బ్రాండ్స్ క్విక్ కామర్స్ అండతో అమ్మకాలు పెంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయి. అరవింద్ ఫ్యాషన్స్, ఫ్యాబ్ ఇండియా, ఉడ్ల్యాండ్తో పాటు ప్యూమా తదితర దిగ్గజాలు క్విక్ కామర్స్ కంపెనీలతో జరుపుతున్న చర్చలు కొలిక్కి వచి్చనట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. దేశంలోని 15 టాప్ నగరాల్లో కస్టమర్లు తమ నిత్యావసరాల కోసం క్విక్ కామర్స్ బాట పడుతున్నారు. దీంతో మరింత మందిని బుట్టలో వేసుకోవాలని చూస్తున్న ఈ ప్లాట్‌ఫామ్‌లు గ్రాసరీలు, ఎఫ్ఎంసీజీకి మించి తమ పరిధిని విస్తరించడంపై ఫోకస్ చేస్తున్నాయి. ఆ రెండు విభాగాలపై గురి... ప్రస్తుతం భారత ఈ–కామర్స్‌లో మార్కెట్లో ఎల్రక్టానిక్స్–స్మార్ట్ ఫోన్స్ తర్వాత అత్యధికంగా అమ్ముడవుతున్నది ఫ్యాషన్ ఉత్పత్తులే. మొత్తం అమ్మకాల్లో వీటి వాటా 20–25 శాతంగా అంచనా. దీంతో ఫ్యాషన్ ప్రోడక్టుల అమ్మకం అటు బ్రాండ్లతో, ఇటు క్విక్ కామర్స్ సంస్థలకు ఉభయతారకంగా నిలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు. కాగా, ఎల్రక్టానిక్స్–స్మార్ట్ ఫోన్స్ విభాగంలోకి కూడా దూకేందుకు ఈ స్టార్టప్‌లు ఉవి్వళ్లూరుతున్నాయి. యారో, కాలి్వన్ క్లీన్, టామీ హిలి్ఫగర్, యూఎస్ పోలో వంటి టాప్ బ్రాండ్లను విక్రయించే అరవింద్ ఫ్యాషన్స్.. క్విక్ కామర్స్ ద్వారా ముందుగా టీ–షర్ట్లు, ఇన్నర్వేర్తో పాటు బెల్టులు, సాక్స్‌ల వంటి యాక్సెసరీలను క్విక్ కామర్స్‌లో విక్రయించనుంది. ఐపీఎల్ సీజన్లో టీమ్ జెర్సీలను ఈ ప్లాట్‌ఫామ్‌లలో జోరుగా విక్రయించిన ప్యూమా... ఇతర ప్రోడక్టులకు సైతం తమ భాగస్వామ్యాన్ని విస్తరించే సన్నాహాల్లో ఉంది. ‘ఇన్స్టంట్ డెలివరీని ఎంచుకుంటున్న వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఫ్యాషన్ రంగంలో కూడా క్విక్ కామర్స్ సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ–కామర్స్‌లో మా కంపెనీ సేల్స్ 30 శాతానికి చేరుకున్నాయి’ అని ఉడ్‌ల్యాండ్ ఇండియా సీఈఓ హర్కీరత్ సింగ్ చెప్పారు. రిటర్న్‌లు చాలా తక్కువగా ఉండే బేసిక్ ప్రోడక్టులను తాము ఈ ప్లాట్ఫామ్లో విక్రయించనున్నట్లు ఫుట్‌వేర్ సంస్థ లిబర్టీ వెల్లడించింది. బాటా కూడా క్విక్ కామర్స్ రూట్లో వెళ్తోంది. ’10–15 నిమిషాల్లో డెలివరీ చేసేలా క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో చర్చలు జరుపుతున్నాం. త్వరలోనే దీన్ని అమల్లోకి తీసుకొస్తాం’ అని బాటా ఇండియా సీఈఓ, ఎండీ గుంజన్ షా వెల్లడించారు. నో రిటర్న్ పాలసీ...ఈ–కామర్స్ మాదిరిగా క్విక్ కామర్స్‌లో ప్రోడక్టులు నచ్చకపోతే వెనక్కి తిరిగిచ్చేందుకు రిటర్న్ పాలసీ లేదు. తయారీపరమైన లోపాలకు మాత్రమే నగదును రీఫండ్ చేస్తున్నాయి. ఫ్యాషన్ రంగంలో సైజ్, రంగులు ఇతరత్రా కారణాలతో రిటర్న్ చేసే కస్టమర్లు ఎక్కువ. దీంతో ఉడ్‌ల్యాండ్ వంటి బ్రాండ్లు తమ స్టోర్స్ ద్వారా రిటర్న్ పాలసీని అమలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నాయి. కాగా, వివిధ ప్రదేశాల్లోని రిటైల్ స్టోర్లలో స్టాక్‌ను తమ ప్లాట్‌ఫామ్‌లకు లింక్ చేసి, ఎక్కువ ప్రోడక్టులను కస్టమర్లకు అందించాలనేది క్విక్ కామర్స్ సంస్థల వ్యూహం. ఎందుకంటే ఫ్యాషన్ ఉత్పత్తులను తమ డార్క్ స్టోర్లలో (వేగంగా డెలివరీ చేసేందుకు ఏర్పాటు చేసే భారీ గోదాములు) నిల్వ చేసేందుకు తగినంత స్థలం లేకపోవడం వాటికి పెద్ద సమస్య అవుతుందనేది పరిశ్రమ వర్గాల అభిప్రాయం. అయితే, ఫాస్ట్ సెల్లింగ్ ఉత్పత్తులైన ఇన్నర్‌వేర్, సాక్సులు, వైట్, సాలిడ్ కలర్ టీ–షర్ట్లు, బ్లాక్ ట్రౌజర్లు, బ్లూజీన్స్, కుర్తాలు, ఫార్మల్ బ్లాక్ షూస్, స్కూల్ షూస్, ఇంట్లో వాడే స్లిప్పర్స్, వాకింగ్ స్నీకర్స్ వంటివి తమ డార్క్ స్టోర్లలో నిల్వ చేయడం ద్వారా 15 నిమిషాల్లోనే డెలివరీ చేయొచ్చనేది క్విక్ కామర్స్ కంపెనీల యోచన.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఈ-కామర్స్ షాపింగ్‌లో 25 ఏళ్లలోపు వారే ఎక్కువ
న్యూఢిల్లీ: తమ యూజర్లలో మూడింట ఒకవంతు 25 ఏళ్లలోపు వారు ఉన్నారని ఈ–కామర్స్ కంపెనీ మీషో తెలిపింది. సెన్సార్ టవర్‌తో కలిసి రూపొందించిన నివేదిక ప్రకారం.. నాలుగు, ఆపై శ్రేణి పట్టణాలకు చెందిన కస్టమర్లు తరచూ, మళ్లీ మళ్లీ కొనుగోళ్లు జరుపుతున్నారు.వీరు ఫ్యాషన్, పాదరక్షలు, శిశు సంరక్షణ వంటి విభాగాల్లో ఉత్పత్తులను కొంటున్నారు. ఈ–కామర్స్ యూజర్ల వృద్ధిలో ఉత్తరప్రదేశ్, బిహార్ ముందంజలో ఉన్నాయి. ఆన్లైన్ షాపర్స్‌లో 80 శాతంపైగా ద్వితీయ, ఆపై శ్రేణి నగరాలు, పట్టణాల నుంచి ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం వంటి ఈశాన్య రాష్ట్రాల్లోని కస్టమర్లు ఇన్ఫ్లుయెన్సర్ కంటెంట్ ఆధారంగా ఈ–కామర్స్ కొనుగోళ్లను ఎక్కువగా చేస్తున్నారు.మొత్తం ఆర్డర్లలో ఈ రాష్ట్రాల వాటా 40 శాతం ఉంది. గృహ, వంటింటి ఉపకరణాలకు 10 శాతం ఖర్చు చేస్తున్నారు. ఈ విభాగం 50 శాతం వృద్ధి చెందింది. చీరలు, సంబంధిత యాక్సెసరీస్ కొనుగోళ్లు కొత్త ట్రెండ్. -
USA Presidential Elections 2024: ‘ట్రంప్ ధిక్కార’ టీ షర్టుల జోరు
బ్యాంకాక్: అటు తూటాల వర్షం. ఇటు చెవి నుంచి చెంప మీదుగా బొటబొటా కారుతున్న రక్తం. అంతలోకే రక్షణ వలయంగా కమ్ముకున్న సీక్రెట్ సర్వీస్ సిబ్బంది. అంతటి భీతావహ పరిస్థితిలోనూ పిడికిలి గట్టిగా బిగించి పైకెత్తి ‘పోరాటమే’నంటూ గొంతెత్తి నినాదాలు. ట్రంప్‌పై దాడి జరిగిన క్షణాలకు శాశ్వతత్వం కలి్పంచిన ఫొటో ఇది. హత్యాయత్నం నుంచి త్రుటిలో బయటపడ్డ క్షణాల్లో కూడా ట్రంప్ ఆత్మనిబ్బరానికి, ఆయన ప్రదర్శించిన సాహసానికి ప్రతీకగా నిలిచిన ఈ ఫొటో అప్పుడే టీ షర్టులపైకి కూడా ఎక్కింది. అది కూడా దాడి జరిగిన రెండు గంటల్లోపే! అంత తక్కువ సమయంలోనే టావోబావో, జేడీ.కామ్ వంటి చైనా ఈ కామర్స్ దిగ్గజాలు ఆన్లైన్ దుకాణాలు ఆ ఫొటోలతో కూడిన టీ షర్టులను తయారు చేయడం, ఇ–కామర్స్ ప్లాట్‌ఫాంల్లో అమ్మకానికి పెట్టడం చకచకా జరిగిపోయాయి! వాటికి చూస్తుండగానే చైనా, అమెరికాల నుంచి 2,000 పై చిలుకు ఆర్డర్లు వచ్చాయి! -
మా చేతిలో ఉన్న పనికి.. సాంకేతిక పరిజ్ఞానం తోడైంది..!
‘‘ఇంట్లో మగ్గం ఉంది, చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. నా గ్రామం నుంచి విదేశాలతో అనుసంధానం కావడానికి ఇవి చాలు. నేను నేసిన చీరను ఈ కామర్స్ వేదికల ద్వారా నేనే మార్కెట్ చేసుకోగలుగుతున్నాను. నా చేతుల్లో తయారైన చీరను ధరించే వారి చేతికి చేర్చే సాంకేతిక మార్గాలను నేర్చుకున్నాను. వందల మంది మహిళలం సంఘటితమయ్యాం. మాలోని నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటుతున్నాం. మేము గౌరవప్రదమైన ఉపాధిని పొందుతున్నాం’’ అంటోంది తమిళనాడుకు చెందిన ముత్తులక్ష్మి. ఆమె మాటలు అక్షరసత్యాలు.వైవిధ్యతే ఉపాధి..భాషలు, వస్త్రధారణ, ఆహారపు అలవాట్లలో మాత్రమే కాదు మనదేశంలో ఉన్న వైవిధ్యత... కళలు, కళాత్మకతల్లోనూ ఉంది. దాదాపుగా ప్రతి ఇంట్లోనూ ఆ కళాత్మకత ఉంటుంది. స్థానికంగా లభించే వస్తువులతో మహిళల చేతిలో రూపుదిద్దుకునే అనేక వస్తువులు ఇప్పుడు వారికి ఉపాధిమార్గాలవుతున్నాయి. దేశంలో దాదాపుగా ఏడు కోట్ల మంది చేతిలో కళ ఉంది. ఆ చేతుల్లో అందమైన హస్తకళాకృతులు తయారవుతున్నాయి. అందులో సగానికి పైగా మహిళలే.ఒకప్పుడు ఆ పని తమకు ఉపాధినిస్తుందని, గుర్తింపును తెస్తుందని తెలియదు వాళ్లకు. తెలిసినా సరే, మధ్య దళారుల దోపిడీకి గురవుతూ అరకొరగా లభించే రుసుముతోనే సంతృప్తి చెందేవాళ్లు. ఇప్పుడు మహిళలు చురుగ్గా ఉన్నారు. తమ ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశ పెట్టే మాధ్యమాల పట్ల అవగాహన పెంచుకుంటున్నారు. హస్తకళాకృతులు తయారు చేసే కుటుంబాల్లోని మగవారు మెరుగైన ఉపాధి కోసం ఆ వృత్తులను వదిలేస్తున్న తరుణంలో ఆ ఇళ్లలోని మహిళలు తమ వారసత్వ కళను కొనసాగిస్తూ తమకంటూ ప్రత్యేకమైన గౌరవాన్ని, అదే స్థాయిలో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.ముత్తులక్ష్మి ఇంట్లో పవర్లూమ్ ఉంది. ఆ మరమగ్గం మీద ఆమె నెలకు పది చీరలను నేయగలుగుతోంది. తమిళనాడులోని అరుపోకోటాయ్ బ్లాక్ చేనేత చీరలకు ప్రసిద్ధి. అక్కడ నేసే చీరలను కూడా అదే పేరుతో అరుప్పుకోటాయ్ చీరలుగానే పిలుస్తారు. ఆమె నేసిన చీరలను ఫొటో తీసి తానే స్వsయంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తుంది. ఉత్పత్తిదారులకు– వినియోగదారులకు మధ్య మరో వ్యక్తి అవసరం లేదని, సాంకేతికతను ఒంటపట్టించుకోవడానికి పెద్ద చదువులు అక్కరలేదని నిరూపిస్తోంది. సాధికారత సాధించాం!‘‘ఒక్కో ప్రాంతంలోని మహిళల్లో ఒక్కో కళ ఉంటుంది. మా దగ్గర మహిళలు చేనేతతోపాటు తాటి, కొబ్బరి ఆకులతో బుట్టలు అల్లుతారు. కర్ణాటక, రాయచూర్ వాళ్లు అందమైన దండలు, ఊలు, క్రోషియో వైర్‌తో ఇంటి అలంకరణ వస్తువులు అల్లుతారు. గుజరాత్, దహోద్ వాళ్లు ముత్యాల ఆభరణాలతోపాటు వెదురుతో రకరకాల వస్తువులు తయారు చేయడంలో నిష్ణాతులు.వాళ్లందరికీ డిజిటల్ లిటరసీ, ఫైనాన్షియల్ లిటరసీ, ఎంటర్‌ప్రెన్యూరల్ స్కిల్స్‌తోపాటు ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పిస్తే అద్భుతాలు చేయగలరని నమ్మాను. అది నిజమైంది కూడా. ఇప్పుడు మొత్తం తొమ్మిది వందల మందిమి నాస్కామ్ నిర్వహించిన పదిరోజుల నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో పాల్గొని సొంతంగా అన్ని పనులూ చక్కబెట్టుకోగలుగుతున్నాం. మహిళా సాధికారత సాధనకు మా చేతిలో ఉన్న పని, సాంకేతిక పరిజ్ఞానం తోడైంది’’ అన్నది ముత్తులక్ష్మి. -
ఈ భూగర్భ వాణిజ్య కేంద్రం గురించి మీరెప్పుడైనా విన్నారా!?
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ వాణిజ్యకేంద్రం. అమెరికాలోని కాన్సస్ నగరంలో మిస్సోరీ నదీ తీరానికి ఉత్తర ప్రాంతంలో ఉంది. నేలకు 150 అడుగుల లోతున 5.1 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భూగర్భ వాణిజ్య సముదాయంలో నిరంతరం వెయ్యిమందికి పైగా కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు.ఈ ప్రాంతంలో 27 కోట్ల ఏళ్ల నాటి సున్నపురాతి నిల్వలు బయటపడటంతో, ఇక్కడి సున్నపురాతినంతా తవ్వి తీసి, సొరంగ మార్గాలను ఏర్పాటు చేసి ఈ భూగర్భ వాణిజ్య సముదాయాన్ని నిర్మించారు.హంట్ మిడ్వెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ నిర్మించిన ఈ వాణిజ్య సముదాయంలో ఎన్నో సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. పలు ఈ–కామర్స్ సంస్థలు, ఆహార ఉత్పత్తుల సంస్థలతో పాటు కార్ల తయారీ సంస్థ ‘ఫోర్డ్’ కూడా ఇక్కడి నుంచి కొన్ని కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ప్రైవేటు సంస్థలతో పాటు అమెరికన్ ప్రభుత్వం కూడా ఇక్కడ కొన్ని కార్యాలయాలను నిర్వహిస్తోంది.ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యాలయాల్లో ఒక పోస్టాఫీసు, ఆర్కైవ్స్ కార్యాలయం, రికార్డు స్టోరేజీ కార్యాలయం ఉన్నాయి. పేరుకు ఇది వాణిజ్య సముదాయమే అయినా, విస్తీర్ణం దృష్ట్యా, వసతుల దృష్ట్యా ఇది నగరాన్ని తలపిస్తుంది. ఇందులో సరుకుల రవాణాకు వీలుగా 3.4 కిలోమీటర్ల రైలుమార్గం, సరుకులతో పాటు మనుషుల రవాణాకు వీలుగా 17 కిలోమీటర్ల రోడ్డు మార్గం ఉండటం విశేషం. బయటి వాతావరణం ఎలా ఉన్నా, ఇందులోని వాతావరణం మాత్రం ఏడాది పొడవునా 19–21 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండేలా ఏసీలు నిరంతరాయంగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు, కార్మికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.ఇవి చదవండి: అవును! అతను.. విమానాల్లో లోకం చుట్టిన వీరుడు..! -
ఇదేం ‘సేల్’ బాబోయ్.. అంతా మోసం! ఐఫోన్15 ఆర్డర్ చేస్తే..
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లను బెంబేలెత్తిస్తోంది. ప్రత్యేక సేల్ పేరుతో భారీ తగ్గింపులు ఇస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. దీంతో అత్యధికంగా ఉత్పత్తులు అమ్ముడుపోతున్నాయి. అయితే తమకు లోపాలతోకూడిన ఉత్పత్తులు డెలివరీ అవుతున్నాయని కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఓ వ్యక్తి ఐఫోన్ 15 ఆర్డర్ చేయగా అది నకిలీ బ్యాటరీతో వచ్చింది. ఈ మేరకు తనకు వచ్చిన లోపభూయిష్టమైన ఐఫోన్ 15కు సంబంధించిన ఫోటోలు, వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో షేర్ చేశాడు. నలికీ బ్యాటరీతో వచ్చిన ఈ ఐఫోన్ 15ను రీప్లేస్ చేయడానికి ఫ్లిప్‌కార్ట్ నిరాకరించిందని వాపోయాడు. “నేను జనవరి 13న ఫ్లిప్‌కార్ట్ నుంచి iPhone 15ని ఆర్డర్ చేశాను. జనవరి 15న డెలివరీ వచ్చింది. కానీ Flipkart మోసం చేసింది. లోపభూయిష్టమైన ఐఫోన్ 15ని పంపించింది. బాక్స్ ప్యాకేజింగ్ కూడా నకిలీదే. ఇప్పుడు దీన్ని రీప్లేస్ చేయడం లేదు” అని అజయ్ రాజావత్ అనే యూజర్ ‘ఎక్స్’లో రాసుకొచ్చారు. దీనిపై యూజర్లు మిశ్రమంగా స్పందించారు. I ordered iPhone 15 from Flipkart on 13th Jan and I got it on 15th Jan but Flipkart has done fraud they have delivered defective iPhone15 and box packaging was also fake. Now they are not replacing OrderID-OD330202240897143100@flipkartsupport @jagograhakjago @stufflistings pic.twitter.com/dfLEh3FSnk — Ajay Rajawat (@1234ajaysmart) January 18, 2024 -
బధిర వినియోగదారులకు కోసం అమెజాన్ పే కొత్త సర్వీస్ - వివరాలు
అందరినీ కలుపుకుని వెళ్లే ప్రయత్నంలో భాగంగా డిజిటల్ చెల్లింపుల రంగంలో అగ్రగామిగా ఉన్న అమెజాన్ పే, ఇటీవల వినికిడి, మాట లోపం ఉన్న భారతీయ వినియోగదారుల కోసం ఒక వీడియో సంకేత భాషలో కేవైసీ (KYC) సర్వీస్ ప్రారంభించింది. ఇందులో సైన్ లాంగ్వేజ్ల ద్వారా కమ్యూనికేషన్ ఉంటుంది. అమెజాన్ పే ఉద్యోగులు, వినియోగదారుల మధ్య సంకేత భాషలో టూ-వే వీడియో కమ్యూనికేషన్‌ను ప్రారంభించే ప్రయత్నాన్ని కంపెనీ రూపొందించింది. సంకేత భాషపై ఆధారపడే వారి కోసం కేవైసీ ప్రక్రియను సునాయాసంగా చేయడం, డిజిటల్ చెల్లింపులను మరింత సులువగా చేసే లక్ష్యంతో కంపెనీ దీన్ని రూపొందించింది. డిజిటల్ భారత్‌కు అనుకూలంగా అమెజాన్ ఈ వినూత్న ప్రయత్నాన్ని చేపట్టింది. డిజిటల్‌గా సాధికారత కలిగిన భారతదేశం కోసం విస్తృత దృష్టికి అనుగుణంగా, తన సేవలు అందరినీ కలుపుకొని, అందుబాటులో ఉండేలా నిర్ధారిస్తుంది. ఈ సర్వీస్ గురించి ఇన్ పేమెంట్స్, పేమెంట్స్ అండ్ ఫైనాన్సియల్ సర్వీసెస్.. డైరెక్టర్ 'వికాస్ బన్సాల్' మాట్లాడుతూ, సైన్ లాంగ్వేజ్ వీడియో కేవైసీ సర్వీస్ అబ్సెషన్, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌పై అమెజాన్ పే దృష్టికి ఇది సహజమైన పొడిగింపు. మేము మా అవరోధ రహిత సేవ పరిధిలో అమలు చేసిన ఈ సేవతో, వీడియో కేవైసీ ద్వారా సులభంగా, సురక్షితంగా ప్రయోజనం పొందేందుకు వైకల్యాలున్న మా వినియోగదారులకు సేవలు అందుందుకునే చేస్తున్నాము. ఈ సేవ వారి రోజువారీ చెల్లింపు అవసరాల కోసం డిజిటల్ వాలెట్ మెరుగైన ప్రయోజనాలను అందిస్తుంది. మా ఉత్పత్తులు అందరికీ అందుబాటులో ఉన్నాయని, మా సేవలు, అనుభవాలు, కార్యాచరణ ప్రతి ఒక్కరికీ వారి సామర్థ్యంతో సంబంధం లేకుండా అందుబాటులో ఉండేలా చూడాలని మేము కోరుకుంటున్నామని వివరించారు. భారతదేశంలోని వినియోగదారులకు వీడియో ఆధారిత కైవైసీ సేవలను అందించడానికి 120 మంది ఉద్యోగులకు అమెజాన్ పే భారతీయ సంకేత భాషపై శిక్షణ ఇచ్చింది. ఇంటరాక్టివ్ ట్రైనింగ్ మాడ్యూల్, వినికిడి, మాట్లాడలేని సమస్య ఉన్న వినియోగదారులతో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయగల సామర్థ్యం ఈ ఉద్యోగులకు ఉంది. దివ్యాంగులైన వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలకు అనుగుణంగా, దివ్యాంగులైన వినియోగదారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు, తమ ప్రత్యేక అవసరాల గురించి తెలుసుకునేందుకు అమెజాన్ భారతదేశంలోని వినియోగదారులకు ‘లిజన్-ఇన్స్ ఫర్ యాక్ససబిలిటీ’ పేరిట ప్రయోజనాన్ని చేకూర్చే పలు కార్యక్రమాలను ప్రారంభించగా, ఇందులో కస్టమర్ సర్వీస్ టీమ్‌లు అపరిచితులు చేసిన కాల్ రికార్డింగ్‌లను వింటాయి. అంతే కాకుండా అమెజాన్ డిజిటల్, డివైస్ అండ్ అలెక్సా సపోర్ట్ (D2AS) సంస్థ యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, కెనడా, ఇండియా, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, మరియు జర్మనీలతో సహా ఎనిమిది మార్కెట్ ప్లేస్‌లలో వినియోగదారునికి మద్దతును అందించే యాక్ససబిలిటీ సపోర్ట్ బృందాలను అందుబాటులో ఉంచింది. ఈ యాక్సెసిబిలిటీ అసోసియేట్లలో అధిక మొత్తంలో భారతదేశం వెలుపల ఉన్నారు. అమెజాన్ తమ పూర్తి సామర్థ్యాన్ని అన్‌లాక్ చేసేందుకు ఉద్యోగులందరికీ సమాన అవకాశాలను అందించే సమగ్ర సంస్కృతిని పెంపొందించడానికి కట్టుబడి ఉంది. మహిళలు, LGBTQIA+ కమ్యూనిటీ, సైనిక అనుభవజ్ఞులు, విభిన్న సామర్థ్యం ఉన్న వారితో సహా వివిధ వర్గాలకు చెందిన వారందరికీ అవకాశాలను కల్పించేందుకు లింగ వైవిధ్యానికి మించి దృష్టి విస్తరించింది. అమెజాన్ విభిన్నమైన వర్క్‌ఫోర్స్ ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. విభిన్న కస్టమర్ బేస్‌ను అర్థం చేసుకోవడంలో ఇది సహాయపడుతూ, విభిన్న దృక్కోణాల ద్వారా నిర్ణయం తీసుకోవడాన్ని మెరుగుపరుస్తుంది. డీఈ & ఐ పట్ల కంపెనీ దాని నిబద్ధత దాని విధానాలు, ప్రోగ్రామ్‌లు మరియు కార్యాలయంలో వైవిధ్యం, ఈక్విటీ, చేరికను ప్రోత్సహించే లక్ష్యంతో చేసిన కార్యక్రమాలలో ఇది ప్రతిబింబిస్తుంది. -
ఈ–కామర్స్‌లో డార్క్ ప్యాటర్న్స్‌పై నిషేధం
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా కస్టమర్లను మోసపుచ్చేందుకు లేదా వారిని తప్పుదోవ పట్టించేందుకు ఈ–కామర్స్ సంస్థలు ఉపయోగించే ’డార్క్ ప్యాటర్న్స్’పై నిషేధం విధిస్తూ సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిని ఉపయోగించడమనేది అనుచిత వ్యాపార విధానాలు, తప్పుదోవ పట్టించే ప్రకటనలను ఇవ్వడం, వినియోగదారుల హక్కులను ఉల్లంఘించడం కిందికే వస్తుందని పేర్కొంది. ఇందుకు సంబంధిం వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద జరిమానాలు ఉంటాయని తెలిపింది. యూజరు ఇంటర్ఫేస్ను లేదా మోసపూరిత డిజైన్ విధానాలను ఉపయోగించి వినియోగదారులను తప్పుదోవ పట్టించడం, కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేయడాన్ని డార్క్ ప్యాటర్న్స్‌గా వ్యవహరిస్తారు. బాస్కెట్ స్నీకింగ్, ఫోర్స్డ్ యాక్షన్లాంటివి ఈ కోవలోకి వస్తాయి. చెకవుట్ చేసేటప్పుడు యూజరు ఎంచుకున్న వాటితో పాటు వారికి తెలియకుండా ఇతరత్రా ఉత్పత్తులు, సర్వీసులు, విరాళాల్లాంటివి అదనంగా చేర్చడం ద్వారా కట్టాల్సిన బిల్లును పెంచేయడాన్ని బాస్కెట్ స్నీకింగ్ అంటారు. అలాగే ఒకటి కొనుక్కోవాలంటే దానికి సంబంధం లేని మరొకదాన్ని కూడా కొనాల్సిందేనంటూ బలవంతంగా అంటగట్టే వ్యవహారాన్ని ’ఫోర్డ్స్ యాక్షన్’గా వ్యవహరిస్తారు. సీసీపీఏ తన నోటిఫికేషన్లో ఇలాంటి 13 డార్క్ ప్యాటర్న్స్‌ను ప్రస్తావింంది. నోటిఫై చేసిన మార్గదర్శకాలతో అనుత వ్యాపార విధానాలపై అన్ని వర్గాలకు స్పష్టత వచ్చినట్లయిందని వినియోగదారుల వ్యవహారాల విభాగం కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. -
భవిష్యత్‌నే మార్చేసిన స్టార్టప్ బిజినెస్.. విదేశాల్లోనూ పాపులర్
‘భవిష్యత్ అనేది రకరకాల వస్తువులతో కూడిన బాక్స్లాంటిది. మనం తీసినప్పుడు ఏ వస్తువు చేతికందుతుందో తెలియదు. కొన్నిసార్లు నిరాశపరిచే వస్తువు, కొన్నిసార్లు అత్యంత విలువైన వస్తువు చేతికి అందవచ్చు’... ఈ సినిమా డైలాగ్‌ను ప్రమోద్ గాడ్గే, షాహీద్ మెమన్లు విన్నారో లేదో తెలియదుగానీ ‘అన్‌బాక్స్’ రూపంలో వారికి బాక్స్ నుంచి విలువైన కానుక లభించింది. తమ భవిష్యత్‌నే మార్చేసిన స్టార్టప్ కానుక అది. లాజిస్టిక్ ఆటోమేషన్ స్టార్టప్ ‘అన్‌బాక్స్ రోబోటిక్స్’తో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు ప్రమోద్, షాహీద్‌లు... ‘మన దేశంలో ఇ–కామర్స్ వేగం పెరిగింది’ అనే వార్త చదివి ‘ఓహో అలాగా!’ అనుకోవచ్చు. అద్భుతమైన ‘ఐడియా’ కూడా రావచ్చు. ఆ ఐడియా జీవితాన్నే మార్చేయవచ్చు. ప్రమోద్ గాడ్గే, షాహీద్ మెమన్‌ల విషయంలో జరిగింది ఇదే. మన దేశంలో ఇ–కామర్స్ స్పీడ్‌ను గమనించిన వీరు సప్లై చైన్ రోబోటిక్స్ స్టార్టప్ ‘అన్‌బాక్స్ రొబోటిక్స్’తో విజయపథంలో దూసుకుపోతున్నారు. ఇండియా దాటి యూఎస్, యూరప్ మార్కెట్లోకి కూడా అడుగు పెట్టనున్నారు.పుణే కేంద్రంగా మొదలైన ‘అన్‌బాక్స్ రోబోటిక్స్’ సప్లై చైన్ ఆటోమేషన్ సోల్యూషన్స్లో మార్పు తీసుకువచ్చింది. వినూత్న ఏఐ–ఆధారిత కంట్రోల్ సిస్టమ్ ద్వారా రోబోట్ల ఉత్పాదకతను పెంచింది. పనితీరును మార్చింది. ‘మావన శక్తి నుంచి రోబోట్స్ వరకు ప్యాకేజీలను క్రమబద్ధీకరించడం, రవాణా చేయడం... మొదలైన విధానాలు మన దేశంలో ఇ–కామర్స్ వేగాన్ని అందుకోలేకపోతున్నాయేమో అనిపించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మొబైల్ రోబోటిక్స్ సిస్టమ్‌ను నిర్మించాలనుకున్నాం. లాజిస్టిక్స్, రిటైల్ ప్లేయర్ల కోసం ప్యాకేజీ సార్టింగ్, ఆర్డర్ కన్సాలిడేషన్ ప్రక్రియలను ఆటోమేట్ చేయడానికి శక్తిమంతమైన రోబోటిక్స్ వ్యవస్థను నిర్మించాలనుకున్నాం’ గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు ‘అన్‌బాక్స్ రోబోటిక్స్’ సీయివో ప్రమోద్ గాడ్గే. ‘అన్‌బాక్స్ రోబోటిక్స్’కు ముందు ఫ్లిప్‌కార్ట్‌లో సార్టింగ్కు సంబంధించి ఆటోమేషన్ విభాగంలో, మన దేశంలోని తొలి రోబోట్–బేస్డ్ సార్టింగ్ ప్రాజెక్ట్‌లో పనిచేశాడు ప్రమోద్. ‘అన్‌బాక్స్ రోబోటిక్స్’ కో–ఫౌండర్, సీటీవో షాహీద్ రోబోటిక్స్. ఇంటెలిజెన్స్ సిస్టమ్స్, స్వోర్మ్ ఇంటెలిజెన్స్‌లో మంచి అనుభవం ఉంది. రోబోటిక్స్, ఆటోమేషన్ ఫీల్డ్స్‌లో సీటీవోగా పనిచేశాడు. ‘అన్‌బాక్స్’కు ముందు ‘వనోర రోబోట్స్’ అనే స్టార్టప్ ప్రారంభించాడు. చిత్తశుద్ధి, కష్టపడే తత్వం, అంకితభావం లేకపోతే పేపర్ మీద రాసుకున్న కాన్సెప్ట్ అక్కడే నిలిచిపోతుంది. అయితే ఈ ఇద్దరు మిత్రులు వారి బృందం బాగా కష్టపడి ‘అన్‌బాక్స్’ను సూపర్ హిట్ చేశారు. స్టార్టప్ కాన్సెప్ట్‌లో సత్తా ఉంటే ఇన్వెస్టర్లు వెనకడుగు వేయరు. ‘అన్‌బాక్స్’ విషయంలోనూ అదే జరిగింది. టీమ్‌ను విస్తరించడానికి, అంతర్జాతీయ స్థాయిలో కస్టమర్ల డిమాండ్‌ను నెరవేర్చడానికి, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై సమీకరించిన నిధులను వాడారు. 2021లో థర్డ్–పార్టీ లాజిస్టిక్స్, ఇ–కామర్స్ ప్లేయర్స్‌తో కంపెనీ బీటా పైలట్స్ లాంచ్ చేసినప్పుడే లీడింగ్ ఇ- కామర్స్ లాజిస్టిక్స్ కంపెనీల నుంచి ఆర్డర్లు రావడం మొదలైంది. ఇది భవిష్యత్ విజయానికి సూచికలా పనిచేసింది. ఇన్వెస్టర్ట్లలో మరింత నమ్మకాన్ని నింపింది. ‘అన్‌బాక్స్’ స్టార్టప్ ఇ–కామర్స్, లాజిస్టిక్స్, రిటైల్‌లాంటి సెక్టార్లలో ఏడు పెద్ద సంస్థలతో కలిసి పనిచేస్తోంది. క్లయింట్ సబ్స్క్రిప్షన్ మోడల్ ‘రోబోట్ యాజ్ ఏ సర్వీస్’ను కూడా కంపెనీ ప్రారంభించింది. ఇ–కామర్స్, లాజిస్టిక్స్, రిటైల్ రంగాలకు సంబంధించి రోబోటిక్–బేస్డ్ పుల్‌ఫిల్‌మెంట్, డిస్ట్రిబ్యూషన్ టెక్నాలజీలో ప్రత్యేకత సాధించిన ‘అన్‌బాక్స్ రోబోటిక్స్’ అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటుతుంది. స్టార్టప్ కాన్సెప్ట్‌లో సత్తా ఉంటే ఇన్వెస్టర్లు వెనకడుగు వేయరు. ‘అన్‌బాక్స్’ విషయంలోనూ అదే జరిగింది. -
ఫ్లిప్‌కార్ట్ ఫౌండర్ కొత్త బిజినెస్.. సీఈవో కోసం అన్వేషణ!
Flipkart Co-Founder Binny Bansal Plans New Start-Up: ఈ-కామర్స్ వ్యాపారంలో అగ్రగామిగా దూసుకెళ్తోంది ఫ్లిప్‌కార్ట్. దాన్ని స్థాపించి విజయవంతంగా తీర్చిదిద్దిన బిన్నీ బన్సాల్ తాజాగా మరో ఈ-కామర్స్ బిజినెస్‌ను ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ ఇటీవలే ఫ్లిప్‌కార్ట్‌లో తన మిగిలిన వాటాను కూడా విక్రయించిన సంగతి తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ పూర్తిగా వాల్‌మార్ట్ యాజమాన్యంలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో బిన్నీ బన్సాల్ ఈ-కామర్స్ మార్కెట్లో మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. భారతీయ, అంతర్జాతీయ ఈ-కామర్స్ సంస్థలకు డిజైన్, మర్చండైజ్, లేబర్ వంటి సహాయపడే వ్యాపారాన్ని స్థాపించాలని బన్సాల్ చూస్తున్నారు. ఇది స్టార్టప్ నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (KPO) కంపెనీగా పని చేస్తుంది. వాణిజ్య సంస్థలకు బ్యాకెండ్ కార్యకలాపాలతో సహాయం చేస్తుంది. సీఈవో కోసం అన్వేషణ సమాచార వర్గాల ప్రకారం, బిన్నీ బన్సాల్ తన కొత్త వ్యాపారంలో కేవలం తన సొంత డబ్బును మాత్రమే పెట్టుబడి పెడుతున్నారు. అయితే కంపెనీ రోజువారీ కార్యకలాపాలలో ఆయన నేరుగా పాల్గొనరు. వ్యాపారాన్ని పర్యవేక్షించడానికి సీఈవో కోసం అన్వేషిస్తున్నారు. వాల్‌మార్ట్ 2018లో 16 బిలియన్ డాలర్లకు ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసింది. దీంతో ఫ్టిప్కార్ట్కు బిన్నీ బన్సాల్ దూరమయ్యారు. విక్రయ ఒప్పందంలో భాగమైన ఐదేళ్ల నాన్-కాంపిటేట్ నిబంధన గడువు ఈ సంవత్సరం ముగిసింది. ఫ్లిప్‌కార్ట్‌ను వీడిన తర్వాత బిన్నీ బన్సాల్ ఏంజెల్ ఇన్వెస్టర్‌గా చురుగ్గా ఉంటూ బహుళ వ్యాపారాలకు మద్దతు ఇస్తున్నారు. బన్సాల్ కొత్త వ్యాపారం స్వీయ-నిధులతో ఉంటుందని, బయటి నుంచి నిధులను స్వీకరించదని భావిస్తున్నారు. అంతర్జాతీయంగా ఉన్న ఈ-కామర్స్ సంస్థలకు కీలకమైన సహాయాన్ని అందించే గ్లోబల్ కంపెనీగా తన కొత్త సంస్థను బిన్నీ బన్సాల్ తీర్చిదిద్దనున్నారు. -
Narayanamma Niraganti: డాక్టరేట్ కలను ‘సెల్ఫ్ హెల్ప్’ నెరవేర్చింది
కుగ్రామం నుంచి ఈ కామర్స్ దాకా నారాయణమ్మ విజయగాధ నారాయణమ్మ నీరగంటి... ఆంధ్రప్రదేశ్, సత్యసాయి జిల్లాలోని ముష్టి కోవెల అనే చిన్న గ్రామంలో అత్యంత సామాన్యమైన కుటుంబంలో పుట్టిన మహిళ. చదువంతా ప్రభుత్వ విద్యావ్యవస్థలోనే. ఆమె ఈ రోజు ఒక ‘ఈ కామర్స్’ సంస్థను స్థాపించి తోటి మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి కావాలనే తన కలను నిజం చేసుకోవడానికి పీహెచ్‌డీలో చేరారు. త్వరలో పట్టానందుకోనున్న నారాయణమ్మ తన ఆకాంక్షల సుమహారాన్ని సాక్షితో పంచుకున్నారు. డ్వాక్రా దారి చూపింది ‘‘మా నాన్న రైతు. పిల్లల్ని బాగా చదివించాలనే కోరిక మాత్రం బలంగా ఉండేది. ఐదవ తరగతి వరకు మా ఊరి బడిలో చదివాను. ఆరు, ఏడు తరగతులకు ఉదయం ఐదు కిలోమీటర్లు, సాయంత్రం ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వచ్చింది. దాంతో అనంతపురంలో ఒక చిన్న గది అద్దెకు తీసుకుని నన్ను, మా అన్నను చదివించారాయన. అలా ఎనిమిదవ తరగతి నుంచి నేను ఇంటిపని, వంట పని చేసుకుంటూ చదువుకున్నాను. అనంతపూర్‌లో డిగ్రీ పూర్తయిన తర్వాత ఎంబీఏకి ఆళ్లగడ్డ వెళ్లాను. ఆ తర్వాత పెళ్లితో హైదరాబాద్ రావడం నా ఉస్మానియా కల నెరవేరడానికి మార్గం సుగమం చేసింది. అధ్యయనానికి విద్యాసంవత్సరంలో ‘సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండ్ చాలెంజెస్’ అంశాన్ని తీసుకున్నాను. 2010–11 నుంచి రంగారెడ్డి, సత్యసాయి జిల్లాల్లో డ్వాక్రా సంఘాలను అధ్యయనం చేశాను. మొత్తం ఐదు వందల గ్రూపుల కార్యకలాపాలను తెలుసుకున్న తర్వాత గ్రామీణ మహిళల్లో ఉన్న నైపుణ్యాలు, అవకాశాల మీద ఒక అవగాహన వచ్చింది. ఆర్థిక స్వావలంబనను, స్వయంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించడాన్ని ఆస్వాదిస్తున్నారు. దాంతో వారిలో ఆత్మవిశ్వాసం కూడా మెరుగైంది. అవకాశాలు అందివస్తే ఇంకా ఏదో సాధించాలనే తపన కూడా కొందరిలో ఉంది. అలాంటి అభిరుచి ఉన్న వాళ్లకు వనరులు, ప్రభుత్వ అధికారుల సహకారం ఉంటే అద్భుతాలు చేయగలుగుతారు కూడా. ఇలాంటి సమన్వయం కొన్ని చోట్ల లేకపోవడం కూడా గమనించాను. మొత్తానికి మార్కెటింగ్ గురించిన ఆందోళన లేకపోతే ఉత్పత్తి విషయంలో శ్రమించడానికి వాళ్లు వెనుకాడరు. నా అధ్యయనం ఇలా సాగుతున్న సమయంలోనే కరోనా వచ్చింది. కరోనా కొల్లగొట్టింది కరోనా సమయంలో హోటళ్లతో సహా అన్నీ మూత పడడంతో ఉద్యోగాలు లేక ఏదో ఒక పని దొరికితే చాలన్నట్లు చాలా మంది కనిపించారు. శ్రమించే చేతులున్నాయి, ఆ ఉత్పత్తి అవసరమైన వ్యక్తులున్నారు. వాళ్ల మధ్య కరోనా కరాళ నృత్యం చేస్తోంది. అప్పుడు ఈ కామర్స్ రంగంలో ఓ ప్రయత్నం చేశాను. కర్పూరం తయారీ దారుల నుంచి కర్పూరాన్ని డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఇంటింటికీ చేర్చడంలో విజయవంతమయ్యాను. మీషోలో సరదాగా మొదలు పెట్టిన రీ సేల్ అనుభవమూ తోడైంది. నా మార్కెట్‌ను విస్తరించడానికి శాన్విస్ స్టోర్, భవిత శ్రీ ట్రేడింగ్, ఫ్యాషన్, లేజీ షాపింగ్ వాణిజ్య వేదికలతో సెల్లర్‌గా అమెజాన్‌తో అనుసంధానమయ్యాను. ఆ అనుభవంతో గత ఏడాది నవంబర్‌లో మీథాట్ ఈ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సొంత కంపెనీ ప్రారంభించాను. ఏడాది కోటి రూపాయల టర్నోవర్‌కు చేరుతుందని అంచనా. ఏడాదికి నికర లాభం ఏడెనిమిది లక్షలుండవచ్చు. గ్రామాలకు విస్తరించాలి ఇప్పటి వరకు నా నెట్వర్క్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అనంతపూర్, చిత్తూరు, గుంటూరు వంటి కొన్ని చోట్లలోనే ఉంది. ఇక గ్రామాల్లో ఉండే డ్వాక్రా మహిళలను అనుసంధానం చేయాలి. ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రాజెక్ట్ గ్రామాల్లో పెట్టాలనేది నా ఆలోచన. ఒక కుటుంబానికి అవసరమైన ప్రతి వస్తువూ నా ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ మీద లభించేటట్లు పటిష్ఠం చేయాలి. అలాగే విదేశాలకు సీమంతం కిట్, ఒడిబియ్యం కిట్, గర్భిణి తినాల్సిన పిండివంటలను ఎగుమతి చేయాలి. ఈ సర్వీస్ ఈ కామర్స్‌లో లేదు. ఈ కామర్స్ వేదిక లైసెన్స్, ట్రేడ్‌మార్క్, కాపీ రైట్స్, పేటెంట్లు, ఫుడ్ లైసెన్స్, వెబ్సైట్ నిర్మాణం, ప్రమోషన్ కోసం మూడు లక్షల వరకు ఖర్చు చేశాను. ఇవన్నీ ఇందులోకి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. నా ఈ ప్రయత్నంలో గృహిణులు, ఒంటరి మహిళలు, అరవై నిండిన పెద్దవాళ్లు కూడా ఉపాధి పొందుతున్నారు. ఉపాధినిస్తోంది మూడేళ్లు ఉద్యోగం చేసిన తర్వాత పీహెచ్డీ కోసం ఉద్యోగం మానుకున్నాను. ఉద్యోగాలిచ్చే స్థాయికి చేరతానని అప్పుడనుకోలేదు. లెక్చరర్‌గా భర్త సంపాదనకు తోడు నేనూ ఉద్యోగం చేసుకుంటూ , ఇద్దరమ్మాయిలను పెంచుకుంటూ ప్రశాంతంగా ఉండవచ్చు. కానీ నేను చేసిన ఎంబీయే ఫైనాన్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల మీద పీహెచ్డీ నన్ను చిన్న పరిధిలో ఉంచడానికి ఇష్టపడలేదు. ఈ సాహసానికి ఒడిగట్టేలా ప్రోత్సహించాయి. మా గైడ్ శ్రీరాములు గారి పర్యవేక్షణలో నా పరిశోధన పూర్తయింది. డాక్టర్ నారాయణమ్మ అనే పేరు నా చిన్నప్పటి కల’’ అన్నారు నారాయణమ్మ. కల నెరవేరు తున్న ఆనందం ఆమె కళ్లలో కనిపించింది, ఆ మాట చెప్తున్నప్పుడు ఆ స్వరంలో ఆనందం తొణికిసలాడింది. ఎక్కడి ఆర్డర్‌కి అక్కడే పరిష్కారం ఆహారం మీద ప్రత్యేక దృష్టి పెట్టాను. నగరాల్లో మహిళలందరూ ఏదో ఒక ఉద్యోగం, వ్యాపారాల్లో నిమగ్నమై ఉంటున్నారు. పిల్లలకు మన రుచులను ఇంట్లో చేసి పెట్టడం వాళ్లకు కష్టమే. అందుకే సౌత్ ఇండియన్ స్నాక్స్ హోమ్మేడ్వి అందిస్తున్నాను. నా నెట్‌వర్క్‌లో 30కి పైగా మహిళలున్నారు. ఒక ప్రదేశం నుంచి ఆర్డర్ రాగానే అదే ప్రదేశంలో ఉన్న మహిళకు ఫార్వర్డ్ చేస్తాను. మెటీరియల్ కొనుగోలు, ఆమె శ్రమకు వేతనం ఇస్తాను. ఆమె పిండివంటలు తయారు చేసి ప్యాక్ చేసి ఉంచుతుంది. మా కొరియర్ నెట్వర్క్ వాళ్లు ఆమె ఇంటికి వెళ్లి పార్సిల్‌ను కలెక్ట్ చేసుకుని కొరియర్ ఆర్డర్ ఇచ్చిన వినియోగదారులకు చేరుస్తారు. దాంతో పిండివంటలు తయారు చేసిన రోజే అందుతుండడంతో బాగా క్లిక్ అయింది. – వాకా మంజులారెడ్డి -
అమెజాన్: భారత్‌లో ఊడిన ఉద్యోగాల సంఖ్య ఇది
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా సిబ్బందిని తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీకి భారత్‌లో 1 లక్ష మంది ఉద్యోగులు ఉండగా సుమారు 1 శాతం సిబ్బందిపై ఉద్వాసనల ప్రభావం పడవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా 18,000 మందిని తొలగించాలని నిర్ణయం తీసుకోవడంతో భారత్‌లో 1,000 మంది సిబ్బందిపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నాయి. మరోవైపు అంతర్జాతీయంగా తమ అమెజాన్ స్టోర్స్, పీఎక్స్‌టీ (పీపుల్, ఎక్స్పీరియన్స్, టెక్నాలజీ) విభాగాల్లో ఎక్కువగా కోతలు ఉండనున్నాయని కంపెనీ ప్రతినిధి తెలిపారు. 2021 డిసెంబర్ 31 నాటికి అమెజాన్‌లో 16,08,000 మంది ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ ఉద్యోగులు ఉన్నారు. -
కస్టమర్ కంప్లైంట్.. ఫ్లిప్‌కార్ట్‌కు షాకిచ్చిన వినియోగదారుల ఫోరం!
ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌కు వినియోగదారుల ఫోరం షాక్ ఇచ్చింది. ఓ యూజర్ డబ్బులు చెల్లించినా మొబైల్ డెలివరీ చేయనందుకు రూ. 42,000 జరిమానా చెల్లించాలని బెంగళూరు అర్బన్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఫ్లిప్‌కార్ట్‌కు జరిమానా విధించింది. అందులో కస్టమర్ పేమెంట్ చేసిన రూ. 12,499 లకు 12 శాతం వార్షిక వడ్డీ, రూ. 20,000 జరిమానా, చట్టపరమైన ఖర్చుల కోసం రూ. 10,000 చెల్లించాలని అధికార యంత్రాంగం తెలిపింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని రాజాజీనగర్ ప్రాంతానికి చెందిన ఓ యూజర్ ఫ్లిప్‌కార్ట్‌పై ఫిర్యాదు చేశారు. ‘తాను జనవరి 15, 2022న మొబైల్‌ని బుక్ చేసుకున్నాను. వెబ్సైట్లో పేర్కొన్న విధంగా పూర్తి నగదుని చెల్లించి రోజులు గడుస్తున్నా కంపెనీ తనకు మొబైల్ డెలివరీ చేయలేదు. సర్వీసు విషయంలో ఫ్లిప్‌కార్ట్ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అనైతిక విధానాలను అనుసరిస్తోందని ఫిర్యాదులో ’పేర్కొంది. కస్టమర్ కేర్ సెంటర్‌కు ఎన్ని సార్లు కాల్ చేసినా ఫలితం లేకపోయేసరికి చివరికి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని తెలిపింది. చదవండి: కస్టమర్లకు గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న పీఎన్బీ! -
న్యూ ఇయర్ ఆఫర్: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.14,000 తగ్గింపు.. కేవలం 2 రోజులే!
కొత్త కొత్త టెక్నాలజీ, ఫీచర్లతో అప్డేట్ అవుతూ స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వస్తుంటాయి. ఈ క్రమంలో ఫోన్ లవర్స్ తమకు నచ్చిన వాటిని కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తుంటారు. అయితే కొందరు మంచి ఆఫర్ల కోసం వేచి చూస్తుంటారు. మీరు కనుక ఆ జాబితాలో ఉంటే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫాంలో ఇయర్ ఎండ్ సేల్ నడుస్తోంది. దీనిలో పలు ప్రాడెక్ట్స్పై భారీగా తగ్గింపులను అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఈ సేల్ డిసెంబర్ 31 వరకు కొనసాగుతుంది. అంతేకాకుండా ఇందులో వినియోగదారులకు బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తున్నాయి. ప్రస్తుతం అందులో స్మార్ట్ఫోన్ల విషయానికొస్తే Google Pixel 6a పై భారీ ఆఫర్‌ను అందిస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం! ఆఫర్ ఎంతంటే Google ఈ ఫోన్ ఒకే కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 29,999 ధరకు అందుబాటులో ఉంది. కంపెనీ దీనిని రూ.43,999కి గ్రాండ్‌గా మార్కెట్లో ప్రారంభ ధరగా లాంచ్ చేసింది. దీని బట్టి చూస్తే ప్రస్తుతం రూ.14,000 డిస్కౌంట్‌తో గూగుల్ పిక్సెల్ 6ఏ లిస్ట్ అయింది. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 3000 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే, మీరు రూ. 17,500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ ఫోన్ చాక్, చార్కోల్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. అన్ని డిస్కౌంట్ల తర్వాత, మీరు ఈ ఫోన్‌ను సగం కంటే తక్కువ ధరకు కొనుగోలు చేసే బంపర్ ఆఫర్‌ని ఫ్లిప్‌కార్ట్ న్యూ ఇయర్ సందర్భంగా మీకు అందిస్తోంది. ఫీచర్లు ఇవే గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.14 ఇంచెస్‌తో పూర్తి HD + డిస్ప్లేను కలిగి ఉంది. స్క్రీన్ 60Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. ఇందులో 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాలతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. హ్యాండ్సెట్ గూగుల్ టెన్సర్ చిప్‌సెట్‌లో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6GB RAM, 128GB స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది. దీనికి 5G వరకు సపోర్ట్ కూడా ఉంది. పరికరం 4410mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు వంటి లక్షణాలను కలిగి ఉంది. -
ఆన్లైన్ షాపింగ్ అంటే ఆ ఒక్కరోజే, ఎగబడి కొనేస్తున్నారు!
ఆదివారాలంటే విశ్రాంతి తీసుకోవడానికే అని భావించవచ్చు కానీ, అది ఒకప్పుడు భారతీయులు మాత్రం ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి ఆదివారమే అత్యంత అనువైన రోజుగా భావిస్తున్నారు. ఆ రోజున బిజీ బిజీగా కొనుగోళ్లు సాగిస్తున్నారు. ఈ–కామర్స్ సంస్థ మీషో... తన డేటా ఆధారంగా జరిపిన ఇ షాపింగ్ 2002 అధ్యయనం ఇలాంటి పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. వీటిలో... ► ఈ ఏడాది ఈ కామర్స్ షాపర్స్.. ఆదివారం ఎక్కువగా కొనుగోళ్లు జరిపారు. అంతకు ముందు సంవత్సరం అత్యధిక కొనుగోళ్లు జరిపింది బుధవారం, అలాగే ప్రతి రోజూ రాత్రి 8 గంటలకు షాపింగ్ ప్రైమ్‌టైమ్‌గా కొనసాగింది. గత 2021లో మధ్యాహ్నం 2–3 గంటలలో అధికంగా ఈ– ట్రాఫిక్ కనిపించేది. ►2022లో ఎక్కువ మంది వెదికిన రెండవ ఉత్పత్తిగా స్మార్ట్ వాచ్ నిలిచింది. ఇది శారీరక ఆరోగ్యంపై, వ్యాయామాల పట్ల పెరిగిన ఆసక్తికి అద్దం పడుతోంది. ► గ్రూమింగ్ ఉత్పత్తులపై పురుషులు అమితాసక్తి చూపుతున్నారు. తృతీయశ్రేణి, నాల్గవ శ్రేణి నగరాల మార్కెట్ల నుంచి 60% కు పైగా ఆర్డర్లు లభించాయి. ► ద్వితీయశ్రేణి నగరాల నుంచీ శానిటరీ న్యాప్కిన్స్కు ఆర్డర్లు 9 రెట్లు పెరిగాయి. ఇది మహిళలకు ఈ–కామర్స్ ఏ విధంగా చేరువవుతుందో తెలియజేస్తుంది. ► దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి నిమిషానికి 148 చీరలు కొనుగోలు చేశారు. అలాగే రోజుకు 93వేల టీషర్టులు, 51, 275 బ్లూ టూత్ ఇయర్ఫోన్లు, 21,662 లిప్స్టిక్స్ విక్రయం జరిగింది. ► వినియోగదారులు స్థానిక ల్యాండ్‌మార్క్‌లు అయిన పిపాల్ క పేడ్, బర్గాద్ కా పేడ్, అట్టా చక్కీ కీ పీచే నియర్ వాటర్ ట్యాంక్ వంటివి వినియోగించడం ద్వారా డెలివరీ పర్సనల్‌కు సహాయపడ్డారు. దేశీ నేవిగేషన్ టూల్ కచ్చితత్త్వం ముందు డిజిటల్ మ్యాప్స్ పోటీపడలేవని ఇది వెల్లడిస్తుంది. ► ఈ సంవత్సరం అమ్మకాల పరంగా ఆంధ్రప్రదేశ్ వినియోగదారులు కొనుగోలు చేయడానికి అమిత ఆసక్తిని కనబరిచిన ఉత్పత్తులలో స్మార్ట్ వాచ్‌లు, వైర్లెస్ హెడ్‌ఫోన్స్, ఇయర్ ఫోన్స్, బాడీ లోషన్స్ కుర్తీలు ఉన్నాయి. ఈ షాపింగ్.. పదనిసలు... ► గతంలో ఎన్నడూ లేనంతగా పురుషులు గ్రూమింగ్ మీద ఖర్చు చేశారు. ► జిమ్ ఎక్విప్ మెంట్‌కి సంబంధించిన ఆర్డర్స్ దాదాపుగా 3 రెట్లకు పైనే పెరిగిపోయాయి. ► అత్యధిక సంఖ్యలో యోగామ్యాట్స్ కొన్న నగరాల్లో బెంగుళూర్, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌లు ఉన్నాయి. ► ప్రతీ 10 పుస్తకాల్లో 8 పుస్తకాలకు ఆర్డర్స్ ద్వితీయశ్రేణి నగరాలు, మార్కెట్ల నుంచే వచ్చాయి. చదవండి: MNCs Quitting India: భారత్‌ను వదిలి వెళ్లిపోతున్న దిగ్గజ కంపెనీలు.. కారణం అదే! -
ఆన్లైన్లో హీరో సైకిల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సైకిల్స్ తయారీలో ఉన్న హీరో సైకిల్స్ ఈ–కామర్స్ పోర్టల్‌ను ప్రారంభించింది. కస్టమర్లు నేరుగా ఈ వెబ్సైట్ ద్వారా తమకు నచ్చిన సైకిల్ కోసం ఆర్డర్ చేయవచ్చు. తద్వారా ఉచితంగా ఇంటి వద్దనే ఉత్పత్తులను అందుకోవచ్చు. దేశవ్యాప్తంగా 3,000 పైచిలుకు డీలర్ల వ్యాపారం పెరుగుదలకు ఈ వేదిక దోహదం చేయనుందని కంపెనీ చెబుతోంది. ‘సైకిళ్లు, ఈ–సైకిళ్ల వినియోగాన్ని పెంచాలని భావిస్తున్నాం. ఈ దిశగా వెబ్సైట్ సేవలు అందిస్తుంది’ అని హీరో సైకిల్స్ డైరెక్టర్ ఆదిత్య ముంజాల్ తెలిపారు. చదవండి: బీభత్సమైన ఆఫర్: జస్ట్ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్‌ఫోన్! -
నైకా సీఎఫ్‌వో అరవింద్ రాజీనామా
న్యూఢిల్లీ: నైకా బ్రాండ్ కింద కార్యకలాపాలు సాగిస్తున్న ఎఫ్ఎస్ఎన్ ఈ–కామర్స్ వెంచర్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) అరవింద్ అగర్వాల్ రాజీనామా చేశారు. డిజిటల్ ఎకానమీ, స్టార్టప్ విభాగంలో అవకాశాలపై దృష్టి పెట్టేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. కొత్త సీఎఫ్‌వో నియామకం ప్రక్రియపై కసరత్తు చేస్తున్నట్లు పేర్కొంది. 2020 జూలైలో అగర్వాల్ అమెజాన్ నుండి నైకాలో చేరారు. కంపెనీ ఐపీవోను పర్యవేక్షించిన కీలక సిబ్బందిలో (కేఎంపీ) ఆయన కూడా ఒకరు. -
భారత్‌లో గ్యాలెరీ లాఫయేట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిపార్ట్మెంట్ స్టోర్స్ కంపెనీ, ఫ్రాన్స్‌కు చెందిన గ్యాలెరీ లాఫయేట్ భారత్‌లో అడుగుపెడుతోంది. లగ్జరీ డిపార్ట్మెంట్ స్టోర్లతోపాటు ఈ–కామర్స్ వేదిక ద్వారా దేశీయంగా ఉత్పత్తులను విక్రయించనుంది. ఆదిత్య బిర్లా ఫ్యాషన్, రిటైల్ ఈ మేరకు గ్యాలెరీ లఫయట్తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. తొలి ఔట్లెట్ 90,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ముంబైలో 2024లో, రెండవ స్టోర్ 65,000 చదరపు అడుగుల్లో ఢిల్లీలో 2025లో ప్రారంభం కానుంది. 200లకుపైగా బ్రాండ్స్‌కు చెందిన ఖరీదైన ఫ్యాషన్, యాక్సెసరీస్, ఫుడ్, అలంకరణ, కళాఖండాలను ఇక్కడ విక్రయిస్తారు. భవిష్యత్‌లో లగ్జరీ బ్రాండ్ల వృద్ధి కేంద్రంగా, ప్రపంచ విలాసవంతమైన మార్కెట్‌గా భారత్‌కు ఉన్న ప్రాముఖ్యతకు ఈ భాగస్వామ్యం నిదర్శనమని ఆదిత్య బిర్లా ఫ్యాషన్, రిటైల్ ఎండీ ఆశిష్ దీక్షిత్ తెలిపారు. ‘భారత్ వంటి ప్రతిష్టాత్మక, పరిణతి చెందిన మార్కెట్లో విస్తరించడం గర్వకారణం. ఇక్కడ మా బ్రాండ్ ప్రయోజ నం పొందగలదని బలంగా విశ్వసిస్తున్నాము. 2025 నాటికి విదేశాల్లో 20 స్టోర్లను చేరుకోవాలనే మా ఆశయానికి ఇది నాంది’ అని గ్యాలెరీ లాఫ యేట్ సీఈవో నికోలస్ హౌజ్ వివరించారు. 125 ఏళ్ల చరిత్ర కలిగిన గ్యాలెరీ లాఫయేట్ ఫ్రాన్స్‌తోపాటు పలు దేశాల్లో 65 కేంద్రాలను నిర్వహిస్తోంది. చదవండి: అమలులోకి కొత్త రూల్.. ఆ సమయంలో ఎస్ఎంఎస్ సేవలు బంద్! -
పండుగ ఆఫర్లు.. ఆన్లైన్లో ఆర్డర్లు పెడుతున్నారా?
పండుగ బోనస్‌లు, సరిగ్గా జీతాలు పడే టైంలో.. ఫెస్టివల్ ఆఫర్లు-ధమాకా సేల్స్‌తో ముందుకొచ్చాయి ఈ-కామర్స్ సంస్థలు. ఇప్పటికే చాలామంది ఆన్లైన్ కొనుగోళ్లతో బిజీగా గడిపేస్తున్నారు. అదే సమయంలో ఆన్లైన్ షాపింగ్‌కు సంబంధించి కొన్ని చేదు అనుభవాలు ఇంటర్నెట్ ద్వారా యూజర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి కూడా. ఆన్లైన్ షాపింగ్ చేసే సమయంలో తొందరపాటు అస్సలు పనికి రాదు. కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. లేకుంటే.. మోసపోవడంతో పాటు కాలం వృధాకావడం, అనవసరమైన నష్టపోవడం వాటిల్లుతుంది కూడా. ఆన్లైన్ షాపింగ్‌లో లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా జరుగుతుంటాయి. ఒక్కోసారి అవి యూజర్లకు తెలియకుండానే జరిగిపోతుంటాయ్ కూడా. నమ్మదగిన సైట్ల నుంచే.. రోజుకో కొత్త ఆన్లైన్ షాపింగ్ సైట్ పుట్టుకొస్తోంది. డెడ్ చీపుగా ప్రొడక్టులు అందిస్తామని ప్రచారాలు చేసుకుంటున్నాయవి. అయితే.. అలాంటి వాటి గురించి క్షుణ్ణంగా ఆరా తీశాకే ప్రొడక్టులు కొనుగోలు చేయాలి. రివ్యూలతో సైతం బోల్తా కొట్టిస్తున్న ఈరోజుల్లో.. ప్రొడక్టు నాణ్యత గురించి అవగాహనకు రావడం కొంచెం కష్టమే. అయినా కూడా నష్టపోకూడదంటే నమ్మకం ఉన్న.. ఉత్తమ సర్వీసులు అందిస్తున్న సైట్ల నుంచే వస్తువులను కొనుగోలు చేసుకోవడం ఉత్తమం. ► యాప్‌లలో కాకుండా వెబ్ సైట్ల నుంచి గనుక ఆన్లైన్ షాపింగ్ చేస్తే.. పైన బ్రౌజర్ యూఆర్ఎల్లో సైట్లకు ముందు https లేదంటే http ఉందో లేదో గమనించాలి. అలా ఉంటే.. ఆ సైట్ ఎన్క్రిప్టెడ్ అన్నమాట. అంటే షాపింగ్ చేసుకునేందుకు అనుగుణంగా ఉంటుందని, తద్వారా మీ డివైజ్‌లోని డేటా సురక్షితంగా ఉంటుందని అర్థం. ► పెద్ద పెద్ద ఈ-కామర్స్ యాప్‌లు, వెబ్సైట్లలోనూ ఆర్థిక సంబంధిత విషయాల్లో బోల్తా పడుతుంటారు చాలామంది. అధిక ఛార్జీలు వసూలు చేయడం.. కొన్ని సందర్భాల్లో మాత్రమే క్యాష్ బ్యాక్ కూపన్లు ఉపయోగించే వెసులుబాటు కల్పిస్తుండడంతో.. కూపన్లను వాడుకోవడానికి చాలాకాలం ఎదురు చూడాల్సి వస్తుంది. లేదంటే ఒక్కోసారి అవి ఎక్స్పెయిర్ అయిపోతుంటాయి కూడా. కాబట్టి, క్యాష్ బ్యాక్‌లు ఎంత వరకు లబ్ధి చేకూరుతాయనేది బేరీజు వేసుకున్నాకే ముందుకు వెళ్లాలి. ఒకటి కంటే ఎక్కువ యాప్‌లు/వెబ్సైట్లు పరిశీలించాకే ఉత్పత్తులను కొనుగోలు చేసుకోడం ఇంకా మంచిది. తద్వారా సరైన ఆఫర్లను గుర్తించడంతోపాటు ఎక్స్ట్రా ఛార్జీలు, డెలివరీ ఛార్జీల తలనొప్పి నుంచి తప్పించుకోవచ్చు. ► డెబిట్‌కార్డులు ఉపయోగించకపోవడం మంచిది. ఎందుకంటే.. బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయ్యి ఉండడం వల్ల ఫైనాన్షియల్ వివరాలను, వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకింగ్ గురయ్యే అవకాశాలు ఉండొచ్చు. అందుకే క్రెడిట్ కార్డులను వీలైనంత వరకు షాపింగ్ కోసం ఉపయోగించాలి. లేదంటే.. మాస్టర్‌కార్డ్ సెక్యూరిటీ కోడ్ లేదంటే వెరిఫైడ్ బై వీసాలను ఉపయోగించడం వల్ల సురక్షితంగా షాపింగ్ చేసుకోవచ్చు. ► షాపింగ్ సీజన్లో రకరకాల యాప్‌లను, వెబ్సైట్లను మోసగాళ్లు టార్గెట్ చేస్తుంటారు. ఈ క్రమంలో భారీగా డిస్కౌంట్లంటూ లింకులను పంపడం ద్వారా యూజర్లను ఆకర్షించి.. డేటా చోరీకి పాల్పడుతుంటారు. అలాంటి సమయంలో తొందరపాటులో వాటిని క్లిక్ చేయకూడదు. సంబంధిత సైట్, యాప్‌లో ఆ ఆఫర్లు నిజంగా ఉన్నాయో లేదో వెరిఫై చేసుకోవాలి. ► తాజాగా.. ఓ ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ నుంచి ల్యాప్‌ట్యాప్ ఆర్డర్ పెట్టిన ఓ వ్యక్తికి బట్టల సబ్బుల పార్శిల్ షాకిచ్చింది. తీరా కంపెనీని బాధిత వ్యక్తి సంప్రదించగా.. తమ పరిధిలో అంశం కాదంటూ సమాధానం ఇచ్చింది. డ్రోన్ కెమెరా ఆర్డర్ పెట్టిన వ్యక్తికి బంగాళ దుంపలు పార్శిల్ వచ్చింది మరో వెబ్సైట్లో. ఇలాంటి సందర్భాల్లో.. ఓపెన్ బాక్స్ డెలివరీ కాన్సెప్ట్ ఉంటుందనే విషయం తెలుసుకోవాలి. దేశంలో చాలామందికి తెలియని కాన్సెప్ట్ ఇది. కొన్ని ప్రొడక్టుల విషయంలో(ధర అధికంగా ఉన్నవాటి విషయంలో ప్రత్యేకించి జరుగుతుంటుంది) డెలివరీ బాయ్‌కు ఓటీపీ చెప్పాల్సి వస్తుంది. అలాంటప్పుడు ముందుగా బాక్స్‌ను డెలివరీ బాయ్‌ల సమక్షంలో తెరిచి.. అంతా పరిశీలించుకున్నాకే.. ఓటీపీ చెప్పడం కరెక్ట్. ఒకవేళ తొందరపాటులోనో, అవగాహన లేకనో, ఇతర కారణాల వల్లనో ప్రొడక్టును చూసుకోకుండా ఓటీపీ చెప్పేస్తే గనుక.. ఆ తర్వాత పరిణామాలకు సదరు కంపెనీలకు ఎలాంటి సంబంధం ఉండదు. కావాలంటే వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించి.. న్యాయం కోసం పోరాడవచ్చు. ► ఇంతేకాదు.. ఆన్లైన్లో ఎలాంటి ప్రొడక్టును అయినా డెలివరీ బాయ్ నుంచి తీసుకున్నాక.. వీలైతే వాళ్ల సమక్షంలోనే వాటిని తెరిచి చూడడం మంచిది. ఒకవేళ డ్యామేజ్ ఉన్నా, ఇతర సమస్యలున్నా అప్పటికప్పుడే వెనక్కి పంపించాలి. కుదరదని గనుక సమాధానం వస్తే.. పరిహారం దిశగా ప్రయత్నాలు చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో.. ఫొటోలు, వీడియోలు తీయడం ద్వారా ఆధారాలను సేకరించి పెట్టుకోవడం అత్యుత్తమమైన పని. అన్నింటికి మించి.. అవసరం లేకున్నా ఆఫర్లలలో వస్తున్నాయి కదా అని ప్రొడక్టులు కొనడం తగ్గించుకుంటే.. డబ్బును, సమయాన్ని ఆదా చేసుకున్న వాళ్లు అవుతారు. -
బ్లాక్ బస్టర్ హిట్: రికార్డు సేల్స్, నిమిషానికి వేలల్లో, ఒకే రోజున 87 లక్షలు!
బెంగళూరు: పండుగ సీజన్ కావడంతో ఈ కామర్స్ సంస్థలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అంతేకాకుండా సంస్థలు పోటీ పడి మరీ వినియోగదారులకు ఊహించని డిస్కౌంట్లను అందిస్తున్నాయి. తాజాగా ఇంటర్నెట్ కామర్స్ కంపెనీ మీషో తమ మెగా బ్లాక్‌బస్టర్ సేల్ తొలి రోజున ఏకంగా 87.6 లక్షల ఆర్డర్లు నమోదు చేసినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. మీషో స్పందిస్తూ.. ఒకే రోజున ఇంత భారీ స్థాయిలో ఆర్డర్లు రికార్డు చేయడం ఇదే తొలిసారని, గతేడాదితో పోలిస్తే 80 శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది. మెగా బ్లాస్టర్ సేల్ మూడు రోజులు పూర్తవగా ఇప్పటికీ కస్టమర్లు నిమిషానికి వేలల్లో ఆర్డర్లు చేస్తున్నట్లు తెలిపింది. ఈ పండుగ సీజన్ ఆర్డర్లతో ఫుల్ బిజీగా ఉన్నట్లు ట్వీట్ చేసింది మీషో. కాగా ఈ సంస్థ ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్లు ప్రకటించడంతో పాటు భారీ స్థాయిలో మెగా బ్లాక్‌బస్టర్ సేల్ గురించి ప్రచారం చేసింది. దీంతో అదే స్థాయిలో కస్టమర్ల నుంచి ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. 85 శాతం పైగా ఆర్డర్లు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచే వచ్చినట్లు సంస్థ సీఎక్స్‌వో ఉత్కృష్ట కుమార్ తెలిపారు. ఫ్యాషన్, బ్యూటీ సాధనాలు, చీరలు మొదలుకుని వాచీలు, జ్యుయలరీ సెట్ల వరకూ 6.5 కోట్ల పైగా లిస్టింగ్స్‌ను అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. Customers are placing several thousand orders per minute during the #MeeshoMegaBlockbuster sale. ⏱️🚀 So our sellers have their hands full. 🙌#ecommerce For more seller stories: https://t.co/qyroCn4uxG pic.twitter.com/t9jbqYIX3b — Meesho (@Meesho_Official) September 26, 2022 చదవండి: వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్! -
ఈ–కామర్స్ రంగంలో డిమాండ్.. వేర్‌హౌసింగ్‌లోకి విదేశీ దిగ్గజాలు
దేశీయంగా ఈ–కామర్స్ గణనీయంగా పెరుగుతుండటంతో డిమాండ్‌కి అనుగుణంగా ఎఫ్ఎంసీజీ, దుస్తులు, ఫార్మా, ఆహారోత్పత్తులు మొదలైన వాటిని నిల్వ చేసేందుకు గిడ్డంగుల అవసరాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వేర్‌హౌసింగ్ విభాగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పలు విదేశీ కంపెనీలు రంగంలోకి దిగుతున్నాయి. గత అయిదారు నెలల్లో ఇలాంటి మూడు సంస్థలు భారత్‌లో భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించాయి. ఫ్రాన్స్‌కి చెందిన థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ (3పీఎల్) సంస్థ ఎఫ్ఎం లాజిస్టిక్, జర్మనీ సంస్థ రీనస్ గ్రూప్, అమెరికాకు చెందిన పానటోనీ ఈ జాబితాలో ఉన్నాయి. 1.4 బిలియన్ యూరోల ఎఫ్ఎం లాజిస్టిక్ భారత్‌లో తమ తొలి మలీ్ట–క్లయింట్ ఫెసిలిటీ (ఎంసీఎఫ్)ను హరియాణాలోని ఫరూఖ్‌నగర్‌లో ప్రారంభించింది. 31 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ కేంద్రంలో దేశవిదేశాల్లోని కస్టమర్లకు అవసరమయ్యే వేర్‌హౌసింగ్, హ్యాండ్లింగ్, పంపిణీ, ఈ–కామర్స్ తదితర సరీ్వసులు అందిస్తోంది. ప్రస్తుతం 70 లక్షల చ.అ. స్థలం ఉండగా, 3పీఎల్ తరహా సేవలకు డిమాండ్ పెరుగుతున్నందున.. దీన్ని 2026 నాటికి 1.2 కోట్ల చ.అ.కు పెంచుకోనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. తాము సరైన సమయంలో భారత మార్కెట్లో ప్రవేశించామని భావిస్తున్నట్లు వివరించాయి. మరోవైపు, రీనస్ గ్రూప్ పారిశ్రామిక రంగ సంస్థల అవసరాలకు ఉపయోగపడేలా గురుగ్రామ్, ముంబైలో రెండు కెమికల్ వేర్‌హౌస్‌లను ప్రారంభించింది. దేశీయంగా పారిశ్రామిక రంగం వృద్ధి చెందే కొద్దీ వచ్చే మూడేళ్లలో 24 లక్షల చ.అ. స్థలాన్ని 50 లక్షల చ.అ.లకు పెంచుకోనున్నట్లు రీనస్ లాజిస్టిక్స్ ఇండియా ఎండీ వివేక్ ఆర్యా తెలిపారు. కొత్తగా అమెరికాకు చెందిన పానటోనీ కూడా భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. 200 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ప్రధాన నగరాల్లో నాలుగు పారిశ్రామిక, లాజిస్టిక్స్ పార్క్‌లను అభివృద్ధి చేయనుంది. కోవిడ్‌తో ఊతం.. కోవిడ్ పరిణామాలతో వినియోగదారులు కాంటాక్ట్‌రహిత లావాదేవీలు, క్విక్ డోర్ స్టెప్ డెలివరీల వైపు మొగ్గు చూపుతుండటం దేశీయంగా ఈ–కామర్స్‌కి దన్నుగా ఉంటోందని పానటోనీ ఎండీ (ఇండియా) సందీప్ చందా తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్‌లో వేర్‌హౌసింగ్ విభాగం గణనీయంగా వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. బహుళ జాతి కంపెనీలు చైనా+1 వ్యూహాన్ని పాటిస్తుండటంతో ప్రత్యామ్నాయ తయారీ హబ్‌గా ఎదిగేందుకు భారత్ చేస్తున్న కృషి కారణంగా దేశీయంగా వేర్‌హౌసింగ్ విభాగం మరింతగా వృద్ధి చెందనుంది. దీంతో చాలామటుకు రిటైలర్లు, ఈ–కామర్స్ సంస్థలు వేర్‌హౌసింగ్ స్పేస్‌ను పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇక, సానుకూల మార్కెట్ పరిస్థితులు, మేకిన్ ఇండియా నినాదంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టడం, జీఎస్టీ అమలు మొదలైన అంశాలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేలా ఇన్వెస్టర్లలో ఆసక్తి కలిగిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. రీసెర్చ్ అండ్ మార్కెట్స్ అనే కన్సల్టెన్సీ అంచనాల ప్రకారం దేశీ వేర్‌హౌసింగ్ మార్కెట్ 2020 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,05,000 కోట్లుగా ఉంది. 26.5 కోట్ల చ.అ. స్పేస్ అందుబాటులో ఉంది. 2026 నాటికి ఈ విభాగం ఆదాయం దాదాపు 11% వార్షిక వృద్ధితో రూ. 2,24,379 కోట్లకు చేరనుంది. స్పేస్ అవసరాలు సుమారు 13% వార్షిక వృద్ధితో 48.3 కోట్ల చ.అ. స్థాయికి చేరనుంది. -
కొత్త సేవలను ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్.. ఆఫర్లు, డిస్కౌంట్ల విషయంలో తగ్గేదేలే!
ఎప్పటికప్పుడు వస్తువలపై ఆఫర్లు, డిస్కౌంట్లతో ప్రజలను ఆకట్టుకుంటూ ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతోంది ప్రముఖ సంస్థ ఫ్లిప్‌కార్ట్. తాజాగా తన కస్లమర్ల కోసం మరో సేవలను కూడా అందుబాటులోకి తెచ్చింది. గతేడాది తాను కొనుగోలు చేసిన ట్రావెల్ వెబ్సైట్ క్లియర్‌ట్రిప్(Cleartrip) భాగస్వామ్యంతో ఫ్లిప్‌కార్ట్ హోటల్స్ (Flipkart Hotels) పేరిట హోటల్ బుకింగ్ సేవను కొత్తగా ప్రారంభించింది. తద్వారా ట్రావెల్ విభాగంలోనూ అడుగుపెట్టింది. ఫ్లిప్‌కార్ట్‌లో సుమారు 3 లక్షల దేశీయ, అంతర్జాతీయ హోటళ్లలో సమాచారం ఉందని, వీటి ద్వారా తమ కస్టమర్లకు మరిన్ని సేవలు అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. తన కస్టమర్ల కోసం ట్రావెల్, బుకింగ్స్‌కు సంబంధించి కొత్త ఆఫర్లతో పాటు, ఈఎంఐ (EMI) ఆప్షన్లు, ఫ్రెండ్లీ బడ్జెట్ వంటి బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. కొవిడ్ ఆంక్షలు ముగిసినప్పటి నుంచి దేశంలో పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతోంది. గత రెండేళ్లలో పోలిస్తే ఈ ఏడాది త్రైమాసికంలో ఈ రంగం మెరుగైన వృద్ధినే సాధించింది. రానున్న రోజుల్లో ఈ పరిశ్రమ మరింత మెరుగ్గా ఉంటుందని నిపుణులు అంచనా. ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకునేందుకు ఫ్లిప్‌కార్ట్ ప్రయత్నిస్తోంది. చదవండి: మీ భవిష్యత్తుకు భరోసా.. ఎల్ఐసీ నుంచి కొత్త పెన్షన్ పాలసీ, బెనిఫిట్స్ కూడా బాగున్నాయ్ -
Cyber Crime: ఏడాదిలో రూ.60,414 కోట్ల సైబర్ మోసాలు
ఉదయం నుంచి రాత్రి వరకూ ఆన్లైన్ ద్వారా చెల్లింపులు ఇప్పుడు మామూలయ్యాయి. టికెట్లు, వస్తువుల కొనుగోళ్లు, బిల్లుల చెల్లింపులకు ఆన్లైన్ మార్గమే శరణ్యమనేంతగా ఆధారపడుతున్నారు. ఇదే సమయంలో మధ్యలో సైబర్ నేరగాళ్లు మాటువేసి అమాయకులను లూటీ చేయడం పెరిగింది. ఏదో ఒక రకంగా మభ్యపెట్టి నగదు దోచేస్తారు. విద్యావంతులు కూడా వీరి వలలో పడడం కొత్త కాదు. అలా పోయిన డబ్బు పోలీసులకు, బ్యాంకులకు ఫిర్యాదు చేస్తే 100 శాతం తిరిగి వస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు. అందుకే సైబర్ నేరాలకు గురికాకుండా జాగ్రత్త పడడమే ఉత్తమం. బనశంకరి: డబ్బు వ్యవహారాలు ఆన్లైన్ అయ్యేకొద్దీ ఆర్థిక నేరాలు తీవ్రమవుతున్నాయి. ఆర్బీఐ నివేదిక ప్రకారం 2021– 22 లో రూ.60,414 కోట్ల మేర సైబర్ మోసాలు చోటుచేసుకున్నాయి. సైబర్ మోసగాళ్ల వల్ల డబ్బు కోల్పోయిన 75 శాతం మంది బాధితులకు ఆ సొమ్ము తిరిగి రావడం లేదు. లోకల్ సర్కిల్స్ అనే సంస్థ సైబర్ నేరాల బాధితులను మూడేళ్ల పాటు సర్వే చేయగా, వారిలో 74 శాతం మందికి ఇప్పటికీ డబ్బు వాపస్ కాలేదని తెలిసింది. సర్వేలో మొదటి ప్రశ్నగా గత మూడేళ్లలో మీరు, లేదా మీ బంధువులు, పరిచయస్తులు నగదు వంచనకు గురయ్యారా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు 11,065 మంది స్పందించగా, అందులో 38 శాతం మంది తమ కుటుంబంలో కనీసం ఒకరు మోసపోయారని తెలిపారు. 54 శాతం జాగ్రత్త పడ్డామని పేర్కొన్నారు. కొంత మందికే తిరిగి దక్కింది ఎవరికైనా డబ్బు తిరిగి వచ్చిందా అని అడగ్గా, 10,995 మంది స్పందించారు, వీరిలో 10 శాతం మంది అవును, ఫిర్యాదు చేసి డబ్బు వెనక్కి తీసుకున్నాం అని తెలిపారు. 19 శాతం మంది ఏ ఫలితమూ లేదని బాధ వెళ్లగక్కారు. ఇంకా 19 శాతం మంది ఫిర్యాదు చేశామని చెప్పగా, మిగిలిన 9 శాతం మంది పోయిన డబ్బు గురించి ఆలోచించడం లేదని చెప్పారు. మొత్తం 74 శాతం మంది బాధితులకు వారి డబ్బు తిరిగి రాలేదు. కంప్యూటర్, మొబైల్లో పాస్వర్డ్స్ 33 శాతం మంది తమ బ్యాంక్ అకౌంట్, డెబిట్ లేదా క్రెడిట్‌కార్డు పాస్వర్డ్స్, ఆధార్, పాన్‌కార్డు నంబర్లను కంప్యూటర్లో దాచుకున్నారు. 11 శాతం మంది ఈ వివరాలు అన్నింటిని మొబైల్లో భద్రపరచుకున్నట్లు చెప్పారు. దీంతో సులభంగా వంచకులు, హ్యాకర్లు చేతికి అందడంతో వంచనకు గురిఅవుతున్నారు. ఇ కామర్స్ ద్వారా అధిక మోసాలు ఇక ఎలా వంచన జరిగింది అన్న ప్రశ్నకు 9,936 మంది స్పందించగా 29 శాతం మంది బ్యాంక్ అకౌంట్ ద్వారా మోసానికి గురైనట్లు తెలిపారు. ఆన్లైన్ షాపింగ్ యాప్స్, వెబ్సైట్లలో కొనుగోళ్లు (ఇ–కామర్స్) వల్ల 24 శాతం మంది వంచనకు గురయ్యారు. ఇదే అత్యధికం. 18 శాతం మంది క్రెడిట్ కార్డులతో మోసపోయారు. 12 శాతం మందిని మోసపూరిత మొబైల్ అప్లికేషన్లు లూటీ చేశాయి. 8 శాతం మంది డెబిట్ కార్డులు, 6 శాతం మంది బీమా పేర్లతో నష్టపోయారు. సైబర్ వంచనకు గురైనవారు తక్షణం పోలీస్ సహాయవాణి 112 నంబరుకు ఫోన్ చేస్తే పోయిన డబ్బు వెనక్కి తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. -
అమెజాన్‌లో పొదుపు సంఘాల ఉత్పత్తులు
సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులు త్వరలో అమెజాన్ ద్వారా డిజిటల్ మార్కెట్లోకి రాబోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పొదుపు సంఘాల మహిళలు దాదాపు 6,000 రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఇప్పటివరకు వాటిని డ్వాక్రా బజారుల ద్వారానే విక్రయిస్తున్నారు. ఇప్పుడు అమెజాన్‌తో ఒప్పందం చేసుకోవడం ద్వారా ఆ ఉత్పత్తులకు విస్తృత ప్రాచుర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే వాటిని తయారు చేసే మహిళలకు అధిక ఆదాయం కూడా వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. వారం కిందట విజయవాడ వచ్చిన అమెజాన్ ప్రతినిధులతో సెర్ప్ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. పొదుపు సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండింగ్ ద్వారా అమెజాన్‌లో చోటు కల్పించేందుకు ఆ సంస్థ ప్రతినిధులు అంగీకారం తెలిపారు. అమెజాన్‌లో అందుబాటులో ఉంచిన ఉత్పత్తులను వినియోగదారుడు కొనుగోలు చేస్తే.. వారికి నిర్ణీత గడువులోగా అందించాల్సి ఉంటుందని అధికారులకు వారు చెప్పారు. అలాగే ఉత్పత్తులను సరఫరా చేసేందుకు స్టాక్ పాయింట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అధికారులకు అమెజాన్ ప్రతినిధులు సూచించారు. దీంతో 6,000 రకాల ఉత్పత్తులను ఒకేసారి కాకుండా.. ఎక్కువ డిమాండ్‌కు అవకాశమున్న వాటితో స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసే అంశంపై సెర్ప్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను అమెజాన్ ప్రతినిధులు ఈ నెల 18న సెర్ప్ అధికారులకు అందజేయనున్నారు. అందుకు తగ్గట్టుగా చర్యలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. -
అలర్ట్: మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు, 75శాతం డిస్కౌంట్..
కస్టమర్లకు బంపరాఫర్లను ప్రకటించాయి ఈకామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ రెండు సంస్థలు పోటీ పడి మరి కస్టమర్లకు భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. అమెజాన్ ఆగస్ట్ 6న నుంచి గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్‌ను నిర్వహిస్తుండగా.. ఫ్లిప్‌కార్ట్ ఆగస్ట్ 6 నుంచి ఆగస్ట్ 10 వరకు బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇంతవరకు డిస్కౌంట్ల కోసం వెయిట్ చేస్తున్న షాపింగ్ ప్రియులు, గ్యాడ్జెట్ లవర్స్ త్వరపడాల్సి సమయం ఇది, ఎందుకంటే ఈ ఆఫర్లు బుధవారమే ఆఖరి రోజు ( ఆగస్టు 10) ముగియనుంది. మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు.... ఫ్లిప్‌కార్ట్ సేల్ ఈవెంట్లో కోటక్, ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్‌లపై 10 శాతం వరకు తగ్గింపు ఉంటుంది. టీవీలు, గృహోపకరణాలపై 75 శాతం వరకు తగ్గింపు ఉండనుంది. ఈ ఆఫర్‌ను శాంసంగ్ (Samsung), రియల్మీ (Realme), షావోమీ (Xiaomi) తో పాటు ఇతర బ్రాండ్ల టీవీలలో కూడా చూడవచ్చు. అంతేనా ఎయిర్ కండీషనర్లపై 55 శాతం వరకు తగ్గింపు, మైక్రోవేవ్లపై 45 శాతం వరకు తగ్గింపు కూడా ఉంటుంది. మీరు స్మార్ట్‌వాచ్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా! అయితే ఇదే మంచి సమయమని ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది. వాటిపై 10 నుంచి 70 శాతం వరకు తగ్గింపును అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్లు కాకుండా, అదే సమయంలో యాపిల్, వివో,ఒప్పో, మోటరోలాతో పాటు ఇతర బ్రాండ్లకు చెందిన స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు పొందవచ్చని తెలపింది. ఎప్పటిలాగే, ఉదయం 12 గంటలకు, ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు "క్రేజీ డీల్స్" కూడా ఉండనుంది. చదవండి: ఆ లోన్ తీసుకున్నవారికి భారీ షాక్.. .. ప్చ్, ఈఎంఐ మళ్లీ పెరిగింది! -
దివంగత నటుడికి ఘోర అవమానం.. ఫ్లిప్‌కార్ట్ ‘ఛీ’ ప్ ట్రిక్స్!
Boycott Flipkart: ఇటీవల కంపెనీలు ప్రతీది వ్యాపార కోణంలోనే చూస్తున్నాయి. తమ వస్తువుల మార్కెటింగ్ విషయంలో కంటెంట్‌ని కాకుండా కాంట్రవర్శీతో లాభాలను పొందాలని భావిస్తున్నాయి. సోషల్ మీడియా వాడకం పెరిగినప్పటి నుంచి ఇలాంటి వాటినే పబ్లిసిటీ స్టంట్‌గా చేసుకుని దాన్ని వ్యాపారంగా మార్చుకోవాలని చూస్తున్నాయి. ప్రస్తుతం ఇదే తరహాలో దేశంలోని అతిపెద్ద ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ పాటించింది. వీళ్ల మార్కెటింగ్ పైత్యం చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగింది.. ఈ కామర్స్ సైట్లో ఓ టీ-షర్ట్ పై సుశాంత్ ఫోటోతో పాటు "డిప్రెషన్ ఈజ్ డ్రోయింగ్" అనే ట్యాగ్‌లైన్‌తో వాటిని అమ్ముతున్నారు. ఇదే కాంట్రవర్సీకి తెర తీసింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోటోని చూసిన సుశాంత్ సింగ్ అభిమాని, ట్విటర్లో పోస్ట్ చేస్తూ బాయ్‌కాట్ ఫ్లిప్‌కార్ట్ హ్యాష్‌ట్యాగ్ పెట్టాడు. అప్పటి నుంచి ఈ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయిపోయింది. వెంటనే అన్ని ఇ-కామర్స్ సైట్ నుంచి ఆ టీ షర్ట్‌లని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ .. తమ వస్తువుల సేల్ కోసం ఇంతకి దిగజారుతారా అని కామెంట్ చేయగా, మరొకరు ఫ్లిప్‌కార్ట్‌కి ఎందుకీ పైత్యం.. ఇలాంటి చీప్‌ట్రిక్స్ ఆపాలంటూ కామెంట్ చేశారు. మరొక యూజర్ "చనిపోయిన వ్యక్తి ఫోటోను టీ షర్ట్‌పై పెట్టడమే కాకుండా, అలాంటి కోట్‌ను యాడ్ చేస్తారా" అంటూ ఓ నెటిజన్ తీవ్రంగా మండిపడ్డాడు. How dare you @Flipkart & @amazon call Sushant depressed? There is absolutely no evidence proving he was depressed. Stop maligning Sushant's image Remove it right now#BoycottFlipkart #boycottAmazon Smear Campaign Against SSR pic.twitter.com/uH0M5wknYI — Justice seeker-Kritika🔱 (@Kritika4Sushant) July 27, 2022 చదవండి: New Delhi: దేశంలో ఆఫీస్ స్పేస్.. ఆ నగరం చాలా కాస్ట్లీ గురూ! -
కొత్త విభాగంలోకి ఫ్లిప్‌కార్ట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా ఆడియో బుక్స్ విభాగంలోకి ప్రవేశించింది. ఇందుకోసం ఆడియో స్ట్రీమింగ్ వేదిక పాకెట్ ఎఫ్ఎంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తన కస్టమర్లకు ఎక్స్‌క్లూజివ్, లైసెన్స్డ్ ఆడియో బుక్స్‌ను పాకెట్ ఎఫ్ఎం ద్వారా అందుబాటులోకి తీసుకురానుంది. ఫ్లిప్‌కార్ట్ ఎఫ్ఎంసీజీ బిజినెస్ హెడ్ కంచన్ మిశ్రా మాట్లాడుతూ.. కోవిడ్ మహమ్మారి సమయంలో ఆడియో బుక్స్ బాగా ప్రాచుర్యం పొందాయని, పాకెట్ ఎఫ్ఎంతో కలిసి రచయితలకు సహకారం అందించడం ద్వారా ఆడియోబుక్స్ తేనున్నామని తెలిపారు.దేశంలో ఇప్పటికే సుమారు 2.5 కోట్ల మంది ఆడియో బుక్స్‌ను వింటున్నట్టు అంచనా. పాకెట్ ఎఫ్ఎం ప్రతి నెల 1,20,000కిపైగా ఆడియో బుక్స్‌ను విక్రయిస్తోంది. చదవండి: ITR Filing Deadline: మేమేమైనా మెషిన్లమా? మొత్తుకుంటున్న నెటిజన్లు -
వైర్లెస్ జామర్లు, నెట్వర్క్ బూస్టర్లు విక్రయించొద్దు
న్యూఢిల్లీ: ప్రభుత్వ అనుమతులు అవసరమయ్యే వైర్లెస్ జామర్లు, నెట్వర్క్ బూస్టర్లు వంటి టెలికం పరికరాలను విక్రయించరాదని ఈ–కామర్స్ సంస్థలను టెలికం శాఖ (డాట్) హెచ్చరించింది. ‘కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతులిస్తే తప్ప సెల్యులార్ సిగ్నల్ జామర్లు, జీపీఎస్ బ్లాకర్లు లేదా ఇతరత్రా సిగ్నల్స్‌ను జామ్ చేసే పరికరాలను వినియోగించడం నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుంది. దేశీయంగా ప్రైవేట్ రంగ సంస్థలు లేదా ప్రైవేట్ వ్యక్తులు వీటిని కొనుగోలు చేయడం లేదా వినియోగించుకోవడం వంటివి చేయరాదు‘ అని ఒక ప్రక టనలో తెలిపింది. మార్గదర్శకాల్లో పేర్కొన్న దానికి భిన్నంగా సిగ్నల్ జామింగ్ పరికరాల ప్రకటనలు ఇవ్వడం, విక్రయించడం, పంపిణీ చేయడం, దిగుమతి చేసుకోవడం లేదా ఇతరత్రా మార్కెటింగ్ చేయడం వంటివన్నీ కూడా చట్టవిరుద్ధమని పేర్కొంది. గడిచిన 4–5 ఏళ్లుగా డాట్ ఈ అంశాన్ని అనేక సార్లు లేవనెత్తింది. ఈ పరికరాల అక్రమ విక్రయాలను అడ్డుకునేందుకు పలు మార్లు దాడులు కూడా నిర్వహించింది. వైర్లెస్ జామర్లను విక్రయించడం లేదా వాటి అమ్మకానికి వెసులుబాటు కల్పించడం వంటివి చేయరాదంటూ ఈ–కామర్స్ కంపెనీలన్నింటికీ జనవరి 21న డాట్ నోటీసు కూడా జారీ చేసింది. మరోవైపు, మొబైల్ సిగ్నల్ బూస్టర్ల వంటి అక్రమ పరికరాల అనధికారిక వినియోగం వల్ల టెలికం సర్వీసులపై ప్రతికూల ప్రభావం పడుతోందని టెల్కోల సమాఖ్య సీవోఏఐ పేర్కొంది. వీటి వినియోగం చట్టరీత్యా నేరమన్న సంగతి చాలా మంది ప్రజలకు తెలియదని, తాజా ఆదేశాలతో ఈ అంశంపై అవగాహన పెరగగలదని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచ్చర్ తెలిపారు. -
ఇలా చేయడం వల్లే ఆ కంపెనీకి ఎన్నడూ లేనన్ని లాభాలు!
ఈ కామర్స్ రంగంలో లేటుగా వచ్చినా సంచనాలు సృష్టించడంలో ముందుంది మీషో. ఇటీవల ఆ కంపెనీ ఫౌండర్ కమ్ సీటీవో సంజీవ్ బర్న్వాల్ మీషో సెల్లర్లతో కలిసి ఫేస్ టూ ఫేస్ సమావేశాన్ని ఆగ్రాలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువరు సెల్లర్లు తమ వ్యాపార అభివృద్ధికి దోహదం చేసిన అంశాలను సంజీవ్ దృష్టికి తెచ్చారు. అలాంటి ట్రేడ్ సీక్సెట్స్ను ఆయన లింక్డ్ఇన్లో బహిర్గం చేశారు. అందులో ఫుట్‌వేర్ వ్యాపారులు చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి... అమన్ (27), యుదీశ్ భగ్వానీ (23) అనే ఇద్దరు యువ వ్యాపారవేత్తలు తమ తండ్రి నుంచి వారసత్వంగా వస్తున్న ఫుట్‌వేర్ వ్యాపారాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. సంప్రదాయబద్ధంగా వస్తున్న ఫుట్‌వేర్ షాప్‌లకు కాకుండా నేరుగా ఈ కామర్స్‌లో తమ వస్తువులు అమ్మాలని వీరిద్దరు నిర్ణయం తీసుకున్నప్పుడు స్థానికంగా, కుటుంబం నుంచి వ్యతిరేకత వచ్చింది. మంచిగా నడుస్తున్న వ్యాపారాన్ని ముంచేస్తారనే భయాందోళనలు వారి కుటుంబ సభ్యుల్లో నెలకొన్నాయి. మీషోతో సెల్లర్స్‌గా ఒప్పందం చేసుకున్న తర్వాత అమన్, యుదీశ్‌లు వ్యాపారంలో కొత్త పంథాకు తెర లేపారు. గతంలో తరహాలో తమ ప్రొడక్టులకు ఒకే తరహా ధరను ఫిక్స్ చేయకుండా పరిస్థితులకు తగ్గట్టుగా హెచ్చుతగ్గులు ఉండేలా చూసుకున్నారు. అదే విధంగా ముఖ పరిచయం లేని కస్టమర్లు ఇచ్చే సూచనలు/ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తమ ప్రొడక్టులకు ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ పోయారు. పాతతరం ఆలోచనలకు కట్టుబడకుండా కొత్తగా ఆలోచిస్తూ అమన్, యుదీశ్‌లు తీసుకున్న నిర్ణయంతో వారి ఫుట్‌వేర్ వ్యాపారం రూపు రేఖలు మారిపోయాయి. రోజుకు వెయ్యికి తక్కువ కాకుండా ఆర్డర్లు వస్తున్నాయి. మునుపెన్నడూ చూడని లాభాలు వారి వశం అయ్యాయి. ఇప్పుడు వారి పెద్దలు సైతం హర్షం వ్యక్తం చేస్తుండగా బెస్ట్‌సెల్లర్స్‌గా గుర్తిస్తూ మీషో సీటీవో సైతం వారిని నేరుగా కలిసి మాట్లాడారు. అమన్, యుదీశ్ల సక్సెస్‌పై మీషో ఫౌండర్ సంజీవ్ స్పందిస్తూ.. ధరలు నిర్ణయించడంలో చూపిన చొరవ, కస్టమర్ల ఫీడ్‌బ్యాక్‌ను గౌరవిస్తూ అందుకు అనుగుణంగా వారు చేపట్టిన మార్పులు సక్సెస్‌కి కారణం అయ్యాయంటూ వివరించారు. చదవండి: 40-50 ఏళ్ల వయస్సులో బిజినెస్‌లో రాణించాలనుకునే వారి కోసం -
ఏంటీ మీ తొక్కలో సర్వీస్.. ఇలాగైతే కుదరదు మరి..
ఆన్లైన్ ఫుడ్ సర్వీస్ అందిస్తున్న జొమాటో, స్విగ్గీ ఇతర ఈ కామర్స్ సంస్థలపై కేంద్రం కన్నెర్ర చేసింది. మీ సర్వీసులు బాగాలేవంటూ మాకు ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయ్. అసలు కస్టమర్ల సమస్యలు పరిష్కరించేందుకు మీరు అవలంభిస్తున్న విధానాలు ఏంటీ ? మరింత మెరుగ్గా సేవలు ఎలా అందివ్వగలరో మాకు తెలపండి అంటూ వాటికి ఆదేశాలు జారీ చేసింది. నివేదిక అందించేందుకు 15 రోజుల గడువు విధించింది. ఈ కామర్స్ సర్వీసుల్లో లోపాలపై గత ఏడాది కాలంలో నేషనల్ కన్సుమర్ హెల్ప్‌లైన్‌కి ఏకంగా 3,631 ఫిర్యాదులు అందాయి. ఇందులో జోమాటో, స్విగీపై 2,828 ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో ఈ అంశంపై కేంద్రం దృష్టి సారించింది. ఈ మేరకు ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లతో సమావేశం ఏర్పాటు చేసింది కన్సుమర్ ఎఫైర్స్ శాఖ. ఇందులో ముఖ్యంగా సర్వీసుల్లో లోపాలపై స్విగ్గీ, జోమాటోలను నిలదీసింది. ఫుడ్ సర్వీసులపై ఎందుకు ఈ స్థాయిలో ఫిర్యాదులు వస్తున్నాయంటూ ప్రశ్నించింది. చివరకు ఫిర్యాదుల పరిష్కారం, సేవల్లో లోపాలు సవరించే అంశంపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ కన్సుమర్ ఎఫైర్స్ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. చదవండి: ఆఫీస్‌లో కొత్త రూల్.. ఒక నిమిషం లేట్‌గా వస్తే పది నిమిషాల అదనపు పని! -
అమెజాన్‌కి గుడ్‌బై చెప్పిన డేవ్‌క్లార్క్.. వీడిన 23 ఏళ్ల బంధం..
ఈ కామర్స్ దిగ్గజ కంపెనీ అమెజాన్‌లో కీలక మార్పు చోటు చేసుకుంది. వరల్డ్ వైడ్ కన్సుమర్ బిజినెస్ సీఈవో డేవ్‌క్లార్క్ అమెజాన్‌కి గుడ్‌బై చెప్పారు. ఆ కంపెనీలో 23 ఏళ్లుగా వివిధ హోదాల్లో ఆయన పని చేశారు. 2022 జులై 1తో అమెజాన్‌తో పూర్తిగా ఆయన బంధం తెంచుకోనున్నారు. కాలేజీలో ఎంబీఏ పట్టా పుచ్చుకోవడం ఆలస్యం 1999లో డేవ్‌క్లార్క్ అమెజాన్‌లో చేరారు. అప్పటికీ ఈ కామర్స్ రంగం ఇంకా శైశవ దశలోనే ఉంది. అప్పటి నుంచి జెఫ్ బేజోస్‌తో కలిసి పని చేస్తూ అంచెలంచెలుగా అమెజాన్‌ను ప్రపంచంలోనే అతి పెద్ద ఈ కామర్స్ కంపెనీగా తీర్చి దిద్దారు. డేవ్‌క్లార్క్ తమ సంస్థను వీడి వెళ్తున్న విషయంపై అమెజాన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఇదే విషయాన్ని అధికారికంగా అమెరికా స్టాక్ మార్కెట్ అధికారులకు సైతం తెలిపింది. కంపెనీతో అభిప్రాయ బేధాలు ఏమీ లేవని , ఇతర చోట పని చేయాలనే ఉద్దేశంతోనే క్లార్క్ తమ సంస్థను వీడినట్టు అమెజాన్ వివరణ ఇచ్చింది. చదవండి: Future-Reliance Deal: మోసం చేసేందుకు సహాయపడ్డారు -
తెలంగాణకు వస్తోన్న మరో ఈ కామర్స్ కంపెనీ
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు నుంచి తెలంగాణకు మరో తీపి కబురు అందింది. ఈ కామర్స్ రంగంలో శరవేగంగా వృద్ధి కనబరుస్తోన్న మీషో సంస్థ తెలంగాణలో పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసింది. హైదరాబాద్ నగరంలో ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా ఈ విషయం వెల్లడించారు. మీషో ఫౌండర్ ఆత్రేయతో మంత్రి కేటీఆర్ జరిపిన చర్చలు ఫలవంతం కావడంతో తెలంగాణలో పెట్టుబడులకు మీషో ఒకే చెప్పింది. హైదరాబాద్‌లో ఫెసిలిటీ సెంటర్‌తో పాటు టైర్ టూ సిటీస్‌లో ఆన్‌బోర్డ్ రిటైల్ సెల్లర్స్‌గా వ్యవహరించనుంది. టైర్ 2 సిటీస్‌లో ఉన్న ఐటీ హబ్స్, టీశాట్ సెంటర్లను ఈ మేరకు మీషో ఉపయోగించుకుంటుంది. Second major announcement from Davos! @Meesho_Official, the fast growing eCommerce company agreed to set up their facility in Hyderabad. Meesho will be working with the Govt. of Telangana in onboarding the retail sellers in Tier-II towns. pic.twitter.com/E1ciuXlbX9 — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 23, 2022 చదవండి: దావోస్‌లో యంగ్ అచీవర్స్‌తో మంత్రి కేటీఆర్ మాటామంతి -
వాటిని దాటేయనున్న డిజిటల్ వాలెట్లు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా చెల్లింపుల కోసం నగదు, క్రెడిట్ కార్డుల నుంచి డిజిటల్ వాలెట్లు, బై నౌ, పే లేటర్ (బీఎన్‌పీఎల్) విధానాలకు మళ్లే ధోరణులు పెరుగుతున్నాయని ఫిన్‌టెక్ సంస్థ వరల్డ్‌పే ఫ్రం ఎఫ్ఐఎస్ ఒక నివేదికలో తెలిపింది. ఈ నేపథ్యంలో 2023 నాటికి డిజిటల్ వాలెట్ల ద్వారా చెల్లింపులు .. నగదు లావాదేవీల పరిమాణాన్ని అధిగమించనున్నట్లు గ్లోబల్ పేమెంట్స్ రిపోర్టులో (జీపీఆర్) పేర్కొంది. 2021–2025 మధ్య కాలంలో దేశీయంగా ఈ–కామర్స్ మార్కెట్ 96 శాతం వృద్ధి చెంది 120 బిలియన్ డాలర్లకు చేరనున్నట్లు తెలిపింది. టెక్నాలజీ, డిజిటలీకరణ పెరగడంతో భారత్‌లో నగదురహిత చెల్లింపుల విధానాలు గణనీయంగా ఊపందుకున్నట్లు పేర్కొంది. 2021లో ఈ–కామర్స్ చెల్లింపుల కోసం అత్యధికంగా డిజిటల్ వాలెట్లు (45.4 శాతం), డెబిట్ కార్డులు (14.6 శాతం), క్రెడిట్ కార్డులను (13.3 శాతం) వినియోగించినట్లు జీపీఆర్ తెలిపింది. ప్రీపెయిడ్ కార్డులు, బ్యాంక్ ట్రాన్స్ఫర్లు, క్యాష్ ఆన్ డెలివరీ వంటి విధానాల మార్కెట్ వాటా తగ్గుతోందని, 2025 నాటికి ఈ–కామర్స్ లావాదేవీల విలువలో వీటి పరిమాణం కేవలం 8.8 శాతానికి పరిమితం కావచ్చని వివరించింది. డిజిటల్ వాలెట్ల ద్వారా చేసే చెల్లింపుల వాటా 52.9 శాతానికి పెరుగుతుందని తెలిపింది. చదవండి: సిప్.. సిప్.. హుర్రే! -
ఇ–వాణిజ్యంపై జాతీయ విధానం
సాక్షి, హైదరాబాద్: ఇ–కామర్స్‌పై జాతీయ విధానానికి రూపకల్పన చేయడంతో పాటు ఆన్లైన్ మోసాలు, సైబర్ సెక్యూరిటీ, మొబైల్ చెల్లింపులు, ఉత్తమ ఇంటర్నెట్కు సంబంధించి కేంద్రం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పారిశ్రామిక ప్రోత్సాహకాలు, తీసుకునే విధానపరమైన నిర్ణయాలతోనే మేకిన్ ఇండియా నినాదం ఆచరణ సాధ్యమవుతుందని అన్నారు. వాణిజ్యం (కామర్స్)పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం తెలంగాణ శాసనసభ కమిటీ హాల్లో సోమవారం కమిటీ చైర్మన్, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. సైబర్ నేరాల కట్టడికి చట్టం సాఫ్ట్‌వేర్‌తో పాటు ఇతర సాంకేతిక రంగాల్లో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులను భారత్ అందిపుచ్చుకునేందుకు విధాన నిర్ణయాలు, మౌలిక వసతుల కల్పనపై వేగంగా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. ఇ–కామర్స్, సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పుల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పనకు అవకాశముందని చెప్పారు. ప్రాంతీయ భాషల్లో డిజిటల్ అక్షరాస్యత పెంచడంపై దృష్టి సారించాలని, భారత్ నెట్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికీ ఇంటర్నెట్కు చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు నల్సార్ యూనివర్సిటీ సహకారంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకురానున్న ప్రత్యేక చట్టం తరహాలో జాతీయ స్థాయిలోనూ చట్టం అవసరమని పేర్కొన్నారు. తెలంగాణపై వివక్ష కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు రాజకీయాలకు అతీతంగా ఉన్నప్పుడే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని, ౖతెలంగాణ అభివృద్ధి అంటే భారత్ అభివృద్ధి అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని కేటీఆర్ అన్నారు. తెలంగాణ సంపద దేశంలోని ఇతర వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి వినియోగం అవుతుండటం తెలంగాణకు గర్వకారణమని అన్నారు. అయితే అభివృద్ధి చెందుతున్న తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని, విభజన హామీల అమలు, వివిధ పథకాల కింద అందాల్సిన సాయంపై కేంద్రం శీతకన్ను వేసిందన్నారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, నేషనల్ డిజైన్ సెంటర్, ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాలు, ఇండస్ట్రియల్, డిఫెన్స్ కారిడార్లు, హైదరాబాద్ ఫార్మాసిటీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులకు అవసరమైన ఆర్థిక సాయం ఇవ్వడంలో కేంద్రం సానుకూలంగా స్పందించడం లేదన్నారు. ఆర్థిక ప్రోత్సాహకాలు అందజేయాలి దేశంలోని సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఆర్థిక ప్రోత్సాహకాలు అందజేయాలని, ఆదిలాబాద్‌లోని సీసీఐ యూనిట్‌ను పునరుద్ధరించాలని కేటీఆర్ కోరారు. సమావేశంలో కమిటీ సభ్యులుగా ఉన్న ఎంపీలు సంతోష్‌కుమార్ గంగ్వార్, రూపా గంగూలీ, మంజులత మండల్, ప్రసూన్ బెనర్జీ, గౌతమ్ సింగమని పొన్, నామా నాగేశ్వర్రావుతో పాటు తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులు, వాణిజ్య సంఘాలు ఫిక్కి, డిక్కి ఫార్మా, ఎస్బీఐ ప్రతినిధులు పాల్గొన్నారు. -
డెలివరీ సర్వీస్ టార్గెట్‌గా ఈ కామ్ ఎక్స్‌ప్రెస్
ఈ కామ్ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ సంస్థ హైదరాబాద్‌లో తమ టూవీలర్లను పరిచయం చేసింది. ఈ కామర్స్ రంగానికి ఊతం ఇవ్వడంతో పాటు వాయు కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ కామ్ ఎక్స్‌ప్రెస్ ఎలక్ట్రిక్ టూవీలర్ల మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ కామర్స్ రంగానికి సంబంధించి గిగా ఎకానమి వృద్ధి రేటును దృష్టిలో ఉంచుకుని డెలివరీ సర్వీస్ ఫస్ట్ టార్గెట్‌గా ఈ కామ్ టూ వీలర్లు తీసుకువచ్చింది. 2025 నాటికి ఈ కామర్స్ డెలివరీ వాహనాల్లో సగం వాటా సాధించాలని ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఛార్జింగ్ ఫెసిలిటీతో సహా ఈవి రోల్-అవుట్ సర్వీస్‌లను ఈకామ్ ఎక్స్‌ప్రెస్ అందిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో గణనీయమైన మార్కెట్‌ను సొంతం చేసుకున్న ఈకామ్ ఎక్స్‌ప్రెస్.. ప్రస్తుతం అక్కడ 3 వీలర్ మార్కెట్‌పై ఫోకస్ చేసింది. కంపెనీతదుపరి విస్తరణలో భాగంగా హైదరాబాద్, జైపూర్‌లో సేవలు ప్రారంభించింది. -
TATA NEU: నక్కల వేటకి కాదు కుంభస్థలం కొట్టేయాలని
ఈ కామర్స్ రంగం ఊహించని వేగంతో వృద్ధి చెందుతోంది. ఇప్పటికే ఇక్కడ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పాతుకుపోగా స్నాప్‌డీల్ క్రమంగా తెరమరుగైపోతుంది. మరోవైపు అజియో, మీషో వంటి సంస్థలు ఆకట్టుకునే ఆఫర్లతో బిగ్ ప్లేయర్లతో పోటీ పడుతున్నాయి. ఈ తరుణంలో ఈ కామర్స్ రంగంలోకి అడుగుపెట్టింది టాటా. న్యూ పేరుతో సరికొత్త యాప్‌ని లాంచ్ చేసింది. టాటా పోర్ట్‌ఫోలియోలో ఒక ఈ కామర్స్ యాప్ ఉండాలి అన్నట్టుగా కాకుండా భారీ ప్రణాళికతోనే టాటా గ్రూపు ప్రవేశించింది. తాజాగా ఆ కంపెనీ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీకి దాఖలు చేసిన పత్రాలు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. టాటా డిజిటల్ విస్తరణకు ఏకంగా రూ.5882 కోట్లు కేటాయించినట్టు టాటా పేర్కొంది. ఇంతకుముందే టాటా డిజిటల్ కింద 1 ఎంజీ, టాటాక్లిక్ , టాటా క్రోమా వంటి అనేక సంస్థలు ఉన్నా ఈ కామర్స్‌లో పెద్దగా ప్రభావం చూపలేదు. కొన్ని కంపెనీలయితే బ్రాండ్ వాల్యూ మీదే నడుస్తూ వచ్చాయి తప్పితే కొత్త కష్టమర్లను పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ లోటు తీర్చేందుకే న్యూ పేరుతో టాటా సరికొత్త ఈ కామర్స్ యాప్‌ని తెచ్చింది. గతంలో తరహాలో కాకుండా ఈ సారి భారీ పెట్టుబడితో టాటా రావడం ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనంగా మారింది. ఎన్నడూ లేనంతగా టాటా డిజిటల్ ద్వారా ‘న్యూ’ కోసం భారీ స్థాయిలో రూ.5,882 కేటాయించింది. దీంతో ఈ కామర్స్ సెక్టార్లో కుంభస్థలం కొట్టే ప్రణాళికలో టాటా ఉన్నట్టు తెలుస్తోంది. చదవండి: వచ్చేసింది..గూగుల్ పే, ఫోన్ పే యాప్స్‌కు పోటీగా టాటా పే...! -
భారత్‌కు గుడ్‌బై చెప్పిన విదేశీ ఈ-కామర్స్ కంపెనీ... గట్టి కౌంటర్ ఇచ్చిన మీషో..!
సింగపూర్‌కు చెందిన ఇంటర్నెట్ దిగ్గజం సీ లిమిటెడ్(SEA) తమ ఈ-కామర్స్ వ్యాపారాన్ని(షాపీ) భారత్‌లో పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షాపీపై స్వదేశీ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం మీషో ట్విటర్లో గట్టి కౌంటర్‌ను ఇచ్చింది. మేం రెడీ..! షాపీ తన సేవలను పూర్తిగా మూసివేస్తున్నట్లు సోమవారం రోజున ప్రకటించింది. దీంతో ఈ సంస్థ విక్రేతలు, ఉద్యోగుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. షాపీ ఎగ్జిట్‌పై భారత ఈ-కామర్స్ సంస్థ మీషో ట్విటర్లో స్పందించింది. మీషో తన ట్విట్లో..."మీషోతో షాపీ-ఇంగ్ చాలా సులభమైనది, సులువైనది, వేగవంతమైనది." అంటూ షాపీకు గట్టి కౌంటర్‌ను ఇచ్చింది. అంతేకాకుండా తమ సంస్థ ఉద్యోగుల నియామకం కోసం గేట్లను తెరిచి ఉంచామని మీషో పేర్కొంది. కంపెనీ వెబ్సైట్ ప్రకారం...మీషోలో ప్రోడక్స్ట్, ఇంజనీరింగ్, డిజైన్, యూఆర్, డేటా సైన్స్‌తో సహా అన్ని టీమ్‌లలో 136 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నటు తెలుస్తోంది. ఉద్యోగులకు శాశ్వత వర్క్ ఫ్రం హోంను కూడా అందిస్తోంది. గేమ్‌ను నిలిపివేసినందుకు గాను.. గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి దృష్ట్యా భారత్‌లో తమ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు షాపీ ప్రకటించింది. దీని ఫలితంగా న్యూయార్క్-లిస్టెడ్ ఆగ్నేయాసియా సంస్థ షాపీ మార్కెట్ విలువ ఒక్క రోజులో 16 బిలియన్ డాలర్లకు పడిపోయింది. కాగా సీ లిమిటెడ్ రూపొందించిన మొబైల్ గేమ్ ఫ్రీ ఫైర్‌ను నిషేధించినందకు కంపెనీ తమ కార్యకలపాలను వెనక్కి తీసుకున్నట్లు ఊహగానాలు వచ్చాయి. వీటిని షాపీ పూర్తిగా కొట్టివేసింది. Shopee-ing is the simplest, easiest, and fastest with Meesho. 😉 But, also, we're hiring! 😍 Check out 👇https://t.co/UoJbiwvfZs — Meesho Tech (@meeshotech) March 28, 2022 చదవండి: భారత్‌కు గుడ్‌బై చెప్పిన మరో విదేశీ కంపెనీ..! -
భారత్‌కు గుడ్‌బై చెప్పిన మరో విదేశీ కంపెనీ..!
సింగపూర్‌కు చెందిన దిగ్గజ సంస్థ సీ లిమిటెడ్(SEA) తమ ఈ-కామర్స్ వ్యాపారాన్ని భారత్‌లో మూసివేస్తున్నట్లు సోమవారం రోజున ప్రకటించింది. షాపీ(Shopee) పేరుతో ఈ కామర్స్ వ్యాపారాన్ని భారత్‌లో నిర్వహిస్తోంది సీ లిమిటెడ్ సంస్థ. ఫ్రాన్స్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన కొన్ని వారాల్లోనే భారత్‌లో కూడా తమ వ్యాపారాలను మూసివేస్తున్నట్లు షాపీ ఒక ప్రకటనలో వెల్లడించడం గమనార్హం. మార్కెట్ అనిశ్చితి..! భారత్‌లో షాపీను మూసివేసేందుకు సీ లిమిటెడ్ (SEA) సంస్థ ముందుగానే ప్రణాళికలను రచించినట్లుగా తెలుస్తోంది. కొత్త విక్రేతలను రిక్రూట్ చేయడాన్ని షాపీ కొన్ని రోజుల ముందే నిలిపివేసినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో షాపీ మార్కెట్ క్యాప్ భారీగా పడి పోయింది. సుమారు 15 బిలియన్ డాలర్లకు పైగా నష్టాలను చవిచూసింది. కాగా సీ లిమిటెడ్‌కు చెందిన ఈ-కామర్స్ విభాగం షాపీను గ్లోబల్ మార్కెట్ అనిశ్చితుల దృష్ట్యా భారత్‌లో తమ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. గేమ్‌పై బ్యాన్ అందుకే నిర్ణయం..! గత నెలలో జాతీయ భద్రత దృష్ట్యా భారత ప్రభుత్వం సుమారు 53 పైగా యాప్స్‌ను బ్యాన్ చేసింది. వీటిలో సీ లిమిటెడ్ సంస్థ రూపొందించిన గరెనా ఫ్రీ ఫైర్ యాప్ కూడా ఉంది. ఈ యాప్ భారత్‌లో గణనీయమైన ఆదరణను పొందింది. అయితే ఫ్రీ ఫైర్ యాప్‌పై ప్రభుత్వం నిషేధం విధించడంతో సీ లిమిటెడ్ నేతృత్వంలోని షాపీ ఈ కామర్స్ సంస్థను మూసివేసినట్లుగా పలువురు భావించారు. ఐతే ఈ వ్యవహారంపై షాపీ ప్రతినిధులు వివరణను ఇచ్చారు. ఇండియాలో తమ సేవల షట్డైన్ నిర్ణయానికి ఫ్రీ ఫైర్ బ్యాన్‌తో ఎలాంటి సంబంధం లేదని షాపీ ప్రతినిధులు ఒక ప్రకటనలో నొక్కి చెప్పారు. చదవండి: ఆ నిర్ణయంతోనే నా దశ తిరిగింది.. లేదంటే.. ఆ కథే వేరుగా ఉండేది -
ఆన్‌లైన్‌లోనూ ‘ఆప్కో’ ట్రెండ్
సాక్షి, అమరావతి: చేనేత వస్త్రాలకు చేయూతనిస్తున్న ఆప్కో మార్కెట్ పోటీలోనూ తగ్గేదే లేదంటోది. 7 ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆన్లైన్ మార్కెట్లోనూ బ్రాండ్ బాజా మోగిస్తోంది. చేనేత వస్త్రాల విక్రయాలను మరింత విస్తృతం చేసేందుకు ఆప్కో హ్యాండ్లూమ్స్.కామ్ (apcohandlooms. com) వెబ్‌సైట్‌ను గత ఏడాది అక్టోబర్ 20న సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. అప్పటి నుంచి ఆప్కో ఆన్లైన్ విక్రయాలను చేపట్టింది. అమెజాన్, మింత్ర, ఫ్లిప్‌కార్ట్, గోకూప్, లూమ్‌ఫ్లోక్స్, మిర్రావ్, పేటీఎం ద్వారా ఆన్లైన్ అమ్మకాలు జరుపుతోంది. 2020 అక్టోబర్ నుంచి 2021 మార్చి వరకు రూ.19,13,554 విలువైన చేనేత వస్త్రాలను ఆన్లైన్ ద్వారా విక్రయించగా.. 2021 ఏప్రిల్ నుంచి 2022 జనవరి 15 వరకు రూ.40,74,129 విలువైన వస్త్రాలను విక్రయించింది. ట్రెండ్‌కు అనుగుణంగా చేనేత వస్త్రాలు ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు మాట్లాడుతూ.. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా చేనేత వస్త్రాలను రూపొందిస్తూ ఆప్కోకు ఆదరణ పెంచుతున్నామన్నారు. ఈ ఏడాది రూ.300 కోట్ల మేర టర్నోవర్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ఉన్న షోరూమ్‌లతోపాటు ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాల్లో మెగా షోరూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. -
కరోనా తెచ్చిన మార్పు.. 24 గంటల్లో ఎనిమిది వేలకు పైగా ఆర్డర్లు
చేతిలో ఫోన్ ఉంటే చాలు.. ఏం కావాలన్నా ఏంచక్కా కావాల్సినది ఏదైనా ఇట్టే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేయవచ్చు. గతంలోలా ఏం కావాలన్నా మార్కెట్‌కు పరుగులు తీసే రోజులు పోయాయి. అకౌంట్లో డబ్బులుండాలేగాని రూపాయి నుంచి రూ.లక్షల వరకు విలువ చేసే ఏ వస్తువైనా ఫోన్లో బుక్ చేస్తే చాలు.. ఇట్టే ఇంటి ముంగిట వచ్చి చేరుతుంది. సాక్షి, విజయనగరం: చిన్నారులకు ఆట వస్తువులు.. దుస్తులు.. పాదరక్షలు.. చేతి గడియారాలు.. అలంకరణ వస్తువులు.. టీవీలు.. ఫ్రిజ్‌లు.. సోపాలు.. వంట సామగ్రి.. చరవాణి.. ఇలా ఏదీ కొనాలన్నా ఆరేడు దుకాణాలకు వెళ్లి వస్తువు నాణ్యత, ధర వ్యత్యాసం ఆరా తీసి కొనేవాళ్లం. ఇదంతా గతం. కాలం మారింది. వేలితో మీటితే మనకు కావాల్సింది మన ఇంటి ముంగిటకొచ్చే అవకాశం వచ్చింది. ఇంట్లో ఉంటూ నచ్చిన వస్తువులు కొనుగోలు చేసే వెసులుబాటును ఈ – కామర్స్ సంస్థలు అందుబాటులోకి తీసుకురావడంతో జిల్లా వాసులు అటువైపు మొగ్గుచూపుతున్నారు. కరోనా నేపథ్యంలో ఆన్లైన్ కొనుగోళ్లు రెండింతలయ్యాయి. అన్ని రకాల బ్రాండ్లు, వస్తు సామగ్రి ఆన్లైన్లో అందుబాటులో ఉండటం, ప్రత్యేక రోజుల్లో రాయితీలు ప్రకటిస్తుండడంతో ఆర్డర్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. చదవండి: ‘సార్, కర్ఫ్యూలో క్రికెట్ ఆడొచ్చా’? వైరలవుతోన్న పోలీసుల సమాధానం! కరోనా తెచ్చిన మార్పు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌తో మానవ జీవితంలో మార్పులు చోటు చేసుకున్నాయి. మొద టి, రెండవ దశల్లో ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ సమయంలో వస్తువుల కొనుగోలుకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉండేది. మరోవైపు వైరస్ ఎక్కడ సోకుతుందోనని భయం వెంటాడేది. ఈ నేపథ్యంలో ఈ – కామర్స్ సంస్థలు అందించే సేవలు కొండంత అండగా నిలిచాయి. అప్పటి వరకు స్మార్ట్ ఫోన్న్ వినియోగించని వారు సైతం కొనుగోలు చేసి ఆన్లైన్లో ఆర్డర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కొందరు మార్కెట్‌కు వెళ్లకుండా ఇంటి నుంచే కొనుగోలు చేస్తున్నారు. ఇంట్లోకి కావాల్సిన కిరాణా సరకులు, కూరగాయలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, శానిటరీ, స్టేషనరీ, గృహోపకరణ సామగ్రి, చెప్పులు, అలంకరణ సామగ్రి, వంటిల్లు సామగ్రి, పిండి వంటలు, ఫర్నిచర్, మందులు, వైద్యపరికరాలు, దుస్తులు ఇలా ప్రతిదీ ఆన్లైన్లో దొరుకుతుండటంతో యువతతో పాటు గృహిణులు, అన్నివర్గా ల ప్రజలు ఈ –కామర్స్ వినియోగదారులుగా మారుతున్నారు. వినియోగదారుల ఆదరణను గమనించిన ఈ– కామర్స్ సంస్థలు పండగలు, ప్రత్యేకదినాల్లో రాయితీలు ప్రకటిస్తున్నాయి. మరోవైపు నెలవారీగా వాయిదాల రూపంలో సొమ్ము చెల్లించి వస్తువులు కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఆహారప్రియులు విభిన్న రుచులు కోరుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ముడిసరకులు కూడా ఆన్లైన్లో దొరకడంతో ఎక్కడెక్కడి నుంచో తెప్పించి హోటళ్ల వారు వినియోగిస్తున్నారు. చదవండి: పెద్దయ్యాక ఏమవుతావ్.. రిపోర్టర్ ప్రశ్నకు పిల్లవాడి దిమ్మతిరిగే సమాధానం ఉపాధి అవకాశాలు రోజులో కొంత సమయం పని చేసుకొని మిగిలిన సమయంలో చదువుకునే వారికి, రోజులో వెసులుబాటు దొరికినప్పుడు పని చేసుకునే వెసులుబాటు ఉండటంతో ఈ – కామర్స్ రంగంలో వందల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఒక్క విజయనగరం జిల్లా కేంద్రంలోనే వివిధ ఈ – కామర్స్ సంస్థల పరిధిలో 500 మంది యువత పని చేస్తున్నారు. ఆన్లైన్ వ్యాపారం ఊపందుకోవడంతో జాతీయ రహదారి పక్కనే భారీ గోదాముల్లో సరకు నిల్వ చేసుకుని అక్కడి నుంచి ఇళ్లకు సరఫరా చేస్తున్నాయి. ఈ క్రమంలో వ్యాన్లు, ఆటోల వారికి రోజూ అద్దెలు ఉంటున్నాయి. ద్విచక్ర వాహనాలపై డెలివరీ చేసే వారికి ఉపాధి లభిస్తోంది. ఈ వ్యాపారం విస్తరించే కొద్దీ మరిన్ని అవకాశాలు పెరగనున్నాయి. సమయం, సొమ్ము ఆదా కరోనా నేపథ్యంలో బయటకు వెళ్లకుండా ఇంటి నుంచి అవసరమైన అన్ని వస్తువులను ఆన్లైన్ ద్వారా తెప్పించుకుంటున్నాం. ఇంట్లో నుంచి ఆర్డర్ చేస్తే ఇంటికే వచ్చి అందజేస్తున్నారు. దీనివల్ల సమయం, శ్రమ, సొమ్ము ఆదా అవుతోంది. ఏ సంస్థలు తక్కువ ధరకు ఇస్తున్నాయో.. నాణ్య త తదితర అంశాలు పరిశీలించే అవకాశం ఎలా గు ఉంది. మాకు నచ్చిన వస్తువలను ఆన్లైన్ ద్వారానే ఆర్డర్ చేసి పొందగలుగుతున్నాం. – కె.సురేష్, విజయనగరం జిల్లాలో ఈ కామర్స్ సేవలు ఇలా... ►పండగలు, ఆఫర్లు ప్రకటించే సమయంలో సగటున రోజు వారీ ఆర్డర్లు- 8000 నుంచి 9000 వరకు ►సాధారణ రోజుల్లో డెలవరీలు – 5000 పైగానే ►అత్యధికంగా డెలవరీ జరిగే రోజులు – సోమవారం -
రూ. 8.56 లక్షల కోట్లు.. 2,220 లావాదేవీలు..
ముంబై: గత కేలండర్ ఏడాది(2021) డీల్స్‌పరంగా అత్యుత్తమమని కన్సల్టింగ్, అడ్వయిజరీ సంస్థ గ్రాంట్ థార్న్టన్ రూపొందించిన నివేదిక పేర్కొంది. మొత్తం 2,224 లావాదేవీలు నమోదుకాగా.. 2020లో జరిగిన లావాదేవీలతో పోలిస్తే 867 అధికమని తెలియజేసింది. ఇక వీటి విలువ సైతం 37 బిలియన్ డాలర్లు అధికంగా 115 బిలియన్ డాలర్లకు చేరినట్లు తెలియజేసింది. వెరసి అటు డీల్స్, ఇటు విలువపరంగా రికార్డ్ నమోదైనట్లు నివేదిక తెలియజేసింది. వీటిలో 42.9 బిలియన్ డాలర్ల విలువైన 499 లావాదేవీలు విలీనాలు, కొనుగోళ్లు జరిగినట్లు వెల్లడించింది. ఈకామర్స్ స్పీడ్ గతేడాది 48.2 బిలియన్ డాలర్ల విలువైన 1,624 ప్రయివేట్ ఈక్విటీ డీల్స్ జరిగాయి. 101 ఐపీవోలు, క్విప్‌ల ద్వారా 23.9 బిలియన్ డాలర్ల లావాదేవీలు నమోదుకాగా.. వీటిలో 65 పబ్లిక్ ఇష్యూల వాటా 17.7 బిలియన్ డాలర్లు. ఇది కూడా రికార్డే! ఐపీవోలలో స్టార్టప్‌లు, ఈకామర్స్, ఐటీ కంపెనీల హవా కనిపించింది. ఏకంగా 33 యూనికార్న్‌లు ఊపిరిపోసుకున్నాయి. ఇక భారీ డీల్స్‌లోనూ 2021 రికార్డులు సాధించింది. బిలియన్ డాలర్ల విలువలో 14 డీల్స్ జరిగాయి. 99.9–50 కోట్ల డాలర్ల మధ్య మరో 15 లావాదేవీలు నమోదయ్యాయి. ఈ బాటలో 49.9–10 కోట్ల డాలర్ల పరిధిలోనూ 135 డీల్స్‌కు గతేడాది తెరతీసింది. డీల్స్ సంఖ్యలో ఇవి 8 శాతమే అయినప్పటికీ విలువలో 80 శాతంకావడం గమనార్హం! భారీ డీల్స్ గతేడాది జరిగిన లావాదేవీలలో 76 శాతం దేశీయంగా నమోదయ్యాయి. మిగిలినవి విదేశీ డీల్స్. ఇదేవిధంగా 1,624 డీల్స్ ద్వారా 48.2 బిలియన్ డాలర్లతో పీఈ పెట్టుబడులు కొత్త రికార్డులు నెలకొల్పాయి. వీటిలో 10 కోట్ల డాలర్లకు మించినవి 112 కాగా.. 66 శాతం నిధులు స్టార్టప్‌లలోకి ప్రవేశించడం ప్రస్తావించదగ్గ అంశం! వీటిలోనూ మళ్లీ 32 శాతం ఈకామర్స్ సంస్థలలోకి మళ్లాయి. రిటైల్, కన్జూమర్, ఎడ్యుకేషన్, ఫార్మా రంగ సంస్థలు పెట్టుబడులను బాగా ఆకట్టుకున్నాయి. పీఈ లావాదేవీల్లో 10 శాతాన్ని ఆక్రమించాయి. మరోపక్క 36 కంపెనీలు 2021లో క్విప్‌ల ద్వారా 6.2 బిలియన్ డాలర్లు సమీకరించాయి. వెరసి 2011 తదుపరి క్విప్ మార్గంలో అత్యధిక నిధుల సమీకరణ నమోదైంది. దివాలా చర్యలకు లోనైన దివాన్ హౌసింగ్(డీహెచ్ఎఫ్ఎల్)ను 5.1 బిలియన్ డాలర్లకు పిరమల్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. చదవండి:స్టాక్ మార్కెట్ ర్యాలీ.. 4 రోజుల్లో రూ.9.30 లక్షల కోట్ల సంపద -
ఈ కామర్స్ ఆర్టీసీ టికెట్లపై జీఎస్టీ
సాక్షి, అమరావతి: లాభాపేక్షతో నిర్వహిస్తున్న ప్రైవేటు ఈ కామర్స్ పోర్టల్స్, యాప్స్ ద్వారా బుక్ చేసుకునే ఆర్టీసీ నాన్ ఏసీ టికెట్లపై ఏపీఎస్ఆర్టీసీ 5 శాతం జీఎస్టీ విధించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు గురువారం ఆర్టీసీ అధికారులు ఈ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ప్రస్తుతం ఆర్టీసీ టికెట్ బుకింగ్ సేవలు అందిస్తున్న అభిబస్, రెడ్‌బస్, పేటీఎం పోర్టల్స్‌లో టికెట్లు కొనుగోలు చేసేవారు జనవరి 1వ తేదీ నుంచి జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి సేవా దృక్పథంతో నిర్వహించే ఆర్టీసీ పోర్టల్, ఆర్టీసీ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకునే టికెట్లకు, నేరుగా బస్సుల్లో తీసుకునే టికెట్లకు జీఎస్టీ ఉండదని ఆర్టీసీ అధికారులు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ రేట్లు పెరిగాయ్
Amazon Prime membership costlier: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ప్యాకేజీలను సవరించింది. పెంచిన ధరలను నేటి నుంచి (డిసెంబర్ 14) భారత్‌లో అమలు చేయనుంది. దీంతో యూజర్లకు భారం తప్పదు. సవరించిన ప్రైమ్ మెంబర్షిప్ ధరలు భారత్‌లో ఇవాళ్లి(డిసెంబర్ 14, 2021 మంగళవారం) నుంచే అమలులోకి వచ్చాయి. అర్ధరాత్రి నుంచే సవరించిన ప్యాకేజీని చూపిస్తోంది అమెజాన్. గతంలో నెలవారీ సబ్స్క్రిప్షన్ రూ.129 ఉండగా అది కాస్తా రూ.179కి(38శాతం) పెంచింది. మూడు నెలల సబ్ స్క్రిప్షన్ ధర రూ.329 ఉండగా రూ.459కి(39శాతం) పెరిగింది. వార్షిక సబ్ స్క్రిప్షన్ ధర రూ. 999 ఉండగా అది కాస్త రూ.1,499కి(50 శాతం) పెరిగింది. ఛార్జీల మోత నుంచి ఉపశమనం కోసం డిసెంబర్ 13 కంటే ముందుగానే ప్రైమ్ మెంబర్షిప్ ప్లాన్(కొత్త యూజర్ల కోసం), రెన్యువల్ చేసుకోవాలంటూ సూచించిన విషయం తెలిసిందే. ‘లాస్ట్ ఛాన్స్ టూ జాయిన్ ప్రైమ్’ పేరుతో ప్రచారం చేసింది. ఇక ఇప్పుడు ఆఫర్లతో ఎంపిక చేసిన యూజర్లకు తక్కువ ధరలకే ప్యాకేజీ అందించే అవకాశం లేకపోలేదు. అమెజాన్ ప్రైమ్ ప్యాకేజీలతో విస్తృతమైన సేవలు(షాపింగ్, ఫాస్టెస్ట్ డెలివరీ, ఓటీటీ, మ్యూజిక్,..ఇలా) అందిస్తున్నందున.. పెరుగుతున్న భారం నేపథ్యంలోనే ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని ఒక ప్రకటనలో పేర్కొంది అమెజాన్. అమెజాన్ ఐదేళ్ల కిందట భారత్‌లో అడుగుపెట్టగా.. మధ్యలో మంత్లీ ప్యాక్‌ను తేవడం, ధరలను సవరించడం ఓసారి చేసింది కూడా. ఇక ట్రేడ్ విషయంలో ఫ్లిప్‌కార్ట్‌తో, ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్‌తో ఈమధ్యకాలంలో గట్టిపోటీ ఎదురవుతోంది. చదవండి: Amazon AWS Outage: కొద్దిగంటలు నిలిచిపోయిన అమెజాన్ సర్వీసులు -
సామాన్యులకు కేంద్రం మరో భారీ షాక్, ఆటో ఎక్కితే జీఎస్టీ కట్టాల్సిందే..!
సామాన్యులకు కేంద్రం మరో భారీ షాకిచ్చింది. ఇప్పటికే నిత్యవసర వస్తుల ధరలపై జీఎస్టీని పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆటోలో ప్రయాణించే వారిపై జీఎస్టీ విధించనున్నాయి. అంటే..ఆటో ఎక్కినా ఇకపై చార్జీకి అదనంగా జీఎస్టీ చెల్లించాల్సిందే. ఆటో రిక్షా బుకింగ్ పై 5 శాతం జీఎస్టీ వసూలుకు నిర్ణయించింది. అయితే ఈ జీఎస్టీ సాధారణంగా నడిచే షేర్, ఇతర ఆటోలు కాదని కేవలం రైడ్ షేరింగ్ కంపెనీలైన ఓలా, ఊబర్ సంస్థల సేవలందించే ఆటోల్లో ప్రయాణించే వారికి జీఎస్టీ వర్తిస్తుందని తెలిపింది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం ఈ నెల 18నే ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. ఈ కొత్త జీఎస్టీ నిబంధనలు వచ్చే ఏడాది అంటే 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటి వరకు ఈ కామర్స్ ఆటో రిక్షా బుకింగ్ పై జీఎస్టీ మినహాయింపు ఉండేది. దాన్ని ఇప్పుడు కేంద్రం ఉప సంహరించుకుంది. చదవండి: హ్హ..హ్హ..హ్హ!..హీరో అక్షయ్ కుమార్ నవ్వుతుంటే, బిగ్బుల్ హాయిగా నిద్రపోతున్నాడే -
డిజిటల్‌ట్యాక్స్‌కు భారత్–అమెరికా అంగీకారం
న్యూఢిల్లీ: ఈ కామర్స్ సరఫరాలపై తటస్థీకరణ పన్ను లేదా డిజిటల్ ట్యాక్స్ అమలు విషయమై భారత్–అమెరికా తాత్కాలిక విధానానికి అంగీకారం తెలిపాయి. అంతర్జాతీయ పన్ను సంస్కరణలకు 136 దేశాలు ఈ ఏడాది అక్టోబర్ 8న అంగీకారం తెలియజేసిన విషయం గమనార్హం. దీంతో బహుళజాతి కంపెనీలు తాము కార్యకలాపాలు నిర్వహించే దేశాల్లో 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని అమలు చేయాలంటే.. ఆయా దేశాలు డిజిటల్ ట్యాక్స్ తరహా పన్నులను రద్దు చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులోనూ ఈ తరహా పన్నులను తీసుకురాకూడదు. ఇందుకు పిల్లర్–1, పిల్లర్–2 పేరుతో రెండంచెల విధానాన్ని రూపొందించారు. ఈ కామర్స్ సరఫరాలపై భారత్ 2020 ఏప్రిల్ 1 నుంచి 2 శాతం పన్ను విధించనుంది. అమెరికా కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తుంది. పిల్లర్–1ను అమలు చేసే వరకు లేదా.. 2024 మార్చి 31 వరకు ఏది ముందు అయితే అది అమల్లో ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: అమెరికాకు మామిడి ఎగుమతులు -
ఏపీలో సీవోఈ ఏర్పాటుకు అమెజాన్ ఆసక్తి
సాక్షి, అమరావతి: ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఏపీలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ (సీవోఈ), డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ఆసక్తిని వ్యక్తం చేసింది. గురువారం వర్చువల్‌గా అమెజాన్ ప్రతినిధులతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమావేశమయ్యారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రజా పథకాల్లో వినియోగిస్తోన్న టెక్నాలజీలో భాగస్వామ్యం కావాల్సిందిగా అమెజాన్‌ను ఆహ్వానించారు. రాష్ట్రంలో అమెజాన్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి కోరారు. టెక్నాలజీ ఆధారిత సేవలకు సంబంధించి అమెజాన్ ప్రతిపాదనలు తీసుకువస్తే ప్రభుత్వ పరంగా పరిశీలిస్తామని హామీనిచ్చారు. అమెజాన్ ప్రతినిధులు కంట్రీ హెడ్ అజయ్ కౌల్, బిజినెస్ హెడ్ విజయ శకునాలకు రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు ఐటీ కార్యక్రమాలను వివరించారు. -
టీవీ నటుడికి షాకిచ్చిన ఫ్లిప్‌కార్ట్.. ఇయర్‌ఫోన్స్ ఆర్డర్ చేస్తే!
ఈ కామర్స్ విధానానికి అలవాటు పడిన జనాలు అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు.. ఈ క్రమంలో కొన్నిసార్లు మనం ఆర్డర్ చేసిన వస్తువుకు బదులు వేరే వస్తువు డెలివరీ అవ్వడం సాధారణంగా జరగుతూ ఉంటుంది. అయితే ఏదో ఒక వస్తువు మాత్రం తప్పకుండా వస్తుంది. కానీ ఈసారి డెలివరీ చేసిన దాంట్లో ఏం లేకండా ఏకంగా ఖాళీ డబ్బానే వచ్చింది. ఇలాంటి సంఘటనలు సాధారణ ప్రజలకు మాత్రమే జరుగుతాయనుకుంటే పొరపాటే.. సెలబ్రిటీలు సైతం ఇందుకేం అతీతులు కాదు. చదవండి: సింఘు సరిహద్దులో వ్యక్తి హత్య: ‘అతను అలాంటివాడు కాదు.. ఆశ చూపి’‘ వివరాల్లోకి వెళితే.. టీవీ నటుడు, అనుపమ ఫేమ్ పరాస్ కల్వనాత్.. ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్( ఏమీ లేదు అని అర్థం) అనే బ్రాండ్‌కు చెందిన ఇయర్-1 ఇయర్ ఫోన్‌ను ఆర్డర్ చేశాడు. డెలీవరీ వచ్చాక దాన్ని ఓపెన్ చేసి చూసిన నటుడు షాక్ కు గురయ్యాడు. ఆయనకు వచ్చిన ఆర్డర్లో నిజంగానే ఏం లేదు. ఈ కామర్స్ డెలీవరీ తప్పిదాన్ని పరాస్ ట్విటర్లో పోస్టు చేస్లూ.. ఫ్లిప్‌కార్ట్ నుంచి తాను అందుకున్న ఫోటోలను షేర్ చేశాడు. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ త్వరలో ప్రజల నమ్మకాన్ని కోల్పోతుందనీ, సేవల్లో నాణ్యత తగ్గుతుందనీ కాప్షన్ చేశాడు. చదవండి: అతను కూడా నాలాగే ఆమెను ప్రేమిస్తున్నాడు ఇక నటుడి ట్వీట్‌పై ఫ్లిప్‌కార్ట్ స్పందించింది. తమ అధికారిక ట్విటర్ పేజ్ ద్వారా రిప్లై ఇచ్చింది. ‘జరిగిన దానికి చింతిస్తున్నాం. ఆర్డర్‌కి సంబంధించి మీకు ఎదురైన అసౌకర్యాన్ని మేము అర్థం చేసుకున్నాం. మేము మీకు సాయం చేసేందుకే ఉన్నాం. దయచేసి ఆర్డర్ ఐడీని మాకు షేర్ చెయ్యండి. దీని ద్వారా మేము పరిశీలించి సాయం అందిస్తాం.. మీ రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నాం.’అని పేర్కొంది. So Here I Have Received Nothing In @nothing box From @Flipkart ! Flipkart is actually getting worse with time and soon people are going to stop purchasing products from @Flipkart ! pic.twitter.com/wGnzU0MlNq — Paras Kalnawat (@paras_kalnawat) October 13, 2021 -
అమెజాన్‌పై సంచలన కథనం
పోటీ ప్రపంచంలో లాభాలే ధ్యేయంగా పని చేసే క్రమంలో ఈ-కామర్స్ కింగ్ ‘అమెజాన్’ దిగజారి ప్రవర్తిస్తోందని తాజాగా రాయిటర్స్ ఓ సంచలన కథనం ప్రచురించింది. స్టింగ్ ఆపరేషన్ ద్వారా India Private Brands Programme పేరుతో సేకరించిన పత్రాల వివరాల్ని తాజాగా వెల్లడించింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మార్కెటింగ్‌లో దిగజారి ప్రవర్తిస్తుందనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈ వ్యవహారాన్ని ఇప్పుడు భారత్‌లో పెద్ద ఎత్తున్న నిర్వహిస్తోందన్నది రాయిటర్స్ కథనంలో ఆరోపణ. ఈ మేరకు వివిధ దేశాలకు సంబంధించి అమెజాన్ అనుసరిస్తున్న మార్కెటింగ్ స్ట్రాటజీని వెల్లడిస్తూ.. అందులో భారత్ ప్రస్తావన సైతం తీసుకొచ్చింది. ఇతర బ్రాండ్ ప్రొడక్టులను కాపీ చేసి.. ప్రొడక్టులను తయారు చేయడం, వాటిని ప్రమోట్ చేయడంలోనూ అమెజాన్ టాప్ ప్రయారిటీ ఇస్తోందనేది రాయిటర్స్ ప్రధాన ఆరోపణ. భారత్ అమెజాన్ మార్కెట్లో లోకల్ బ్రాండ్లను సైతం వదలకుండా కాపీ కొడుతోందని, ఇక అంతర్గత సమాచార సేకరణతో ఈ అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతోందని సదరు కథనం పేర్కొంది. అంతేకాదు ఈ వ్యవహారం ఇప్పుడు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టికి సైతం వెళ్లినట్లు రూటర్స్ కథనం తెలిపింది. కిషోర్ బియానీ ఆధ్వర్యంలోని జాన్ మిల్లర్.. అమెజాన్ ట్రిక్ మార్కెటింగ్‌కు ఎక్కువగా బలైందని వెల్లడించింది. అమెజాన్‌కు సంబంధించిన బ్రాండ్లతో పాటు అమెజాన్ టాప్ ప్రయారిటీ ఉన్న బ్రాండ్లనే(రివ్యూలతో సంబంధం లేకుండా) వినియోగదారులకు టాప్ సెర్చ్‌లో చూపిస్తోందనేది(డిస్ప్లే చేయడం) చేస్తోందట. గతంలో ఇలాంటి వ్యవహారంతో ఇబ్బందులు, నష్టాల్ని చవిచూసిన అమెజాన్.. ఇప్పుడు పెద్ద ఎత్తున్న ఇలాంటి వ్యవహారానికి తెరలేపిందనేది రాయిటర్స్ కథన సారాంశం. మరి అమెజాన్ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. చదవండి: amazon.. ఈ ఆఫర్‌ను అస్సలు మిస్ చేసుకోవద్దు -
నాలుగు రోజుల్లో సుమారు రూ.20 వేల కోట్లు..!
E Commerce Platforms Register 2 7 Bn Dollar Sales In First Four Days Of Festive Sale: దసరా, దీపావళి పండుగ సీజన్లు రావడంతో పలు ఈ-కామర్స్ సంస్థలు, ఇతర ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, ఉత్పత్తుల సంస్థలు ఫెస్టివల్ సీజన్లను ప్రకటించాయి. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌సేల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల్లో సుమారు 20 వేల కోట్లు..! ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు పండుగ సీజన్లను భారీగా క్యాష్ చేసుకుంటున్నాయి. ఆయా ఈ కామర్స్ సంస్థలు ఫెస్టివల్ సేల్‌ను ప్రారంభించడంతో కొనుగోలుదారులు ఎగబడి కొంటున్నారు. కేవలం నాలుగు రోజుల్లో సుమారు 2.7 బిలియన్ డాలర్ల(రూ. 20250 కోట్లు) అమ్మకాలను ఈ-కామర్స్ సంస్థలు జరిపినట్లు తెలుస్తోంది. రెడ్‌సీర్ కన్సల్టింగ్ నివేదిక ప్రకారం..పలు ఈకామర్స్ సంస్థలు అక్టోబర్ మొదటి వారంలో సుమారు 2.7 బిలియన్ డాలర్ల అమ్మకాలను జరిపాయని పేర్కొంది. చదవండి: కంపెనీల మధ్య పోటాపోటీ..! నిన్న అమితాబ్ బచ్చన్..నేడు రణ్‌వీర్‌సింగ్..! మొదటి నాలుగు రోజుల అమ్మకాలలో 50శాతం మేర స్మార్ట్ఫోన్ల విక్రయాలు జరిగాయని రెడ్‌సీర్ వెల్లడించింది. అంతేకాకుండా రాబోయే ఐదు రోజుల్లో మరో 2.1 బిలియన్ డాలర్ల అమ్మకాలు జరిగే అవకాశం ఉందని రెడ్‌సీర్ ప్రకటించింది. కొనుగోలుదారులు స్మార్ట్‌ఫోన్స్, గృహోపకరణాలు, బ్యూటీ, ఫ్యాషన్ ఉత్పత్తులను భారీగా కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ-కామర్స్ సంస్థల ఫెస్టివల్ సేల్‌లో కేవలం ఐదు రోజుల్లో సుమారు 20 లక్షలకు పైగా స్మార్ట్ఫోన్లను, మూడురోజుల్లో సుమారు లక్షకుపైగా స్మార్ట్‌టీవీలను ప్రముఖ చైనీస్ దిగ్గజం షావోమీ విక్రయించింది. చదవండి: పబ్లిసిటీ కోసం రోజు రూ. 2.6 లక్షల ఖర్చు..! -
ఇందులో షాపింగ్ చేస్తే రూ.20 కోట్ల బహుమతులు మీ సొంతం!
సోషల్ కామర్స్ యునికార్న్ మీషో పండుగ సీజన్ నేపథ్యంలో అక్టోబర్ 6 నుంచి 9 వరకు 'మహా ఇండియన్ షాపింగ్ లీగ్' పేరుతో ప్రత్యేక సేల్ నిర్వహిస్తుంది. ఇప్పటికే లక్షకు పైగా కొత్త విక్రేతలను ఆన్ బోర్డ్ చేసినట్లు తెలిపింది, టైర్-2 నగరాల్లోని వినియోగదారుల నుంచి గతంతో పోలిస్తే 3 రేట్లు ఎక్కువ రోజువారీ ఆర్డర్లను ఆశిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. మీషో ఫ్లాగ్ షిప్ సేల్ సందర్భంగా ఇందులో పాల్గొనే వినియోగదారులకు రూ.20 కోట్ల విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. ప్రతి గంటకు వినియోగదారులు ఒక ప్రీమియం కారు, రూ.1కోటి నగదు రివార్డులు, రూ.15 కోట్ల విలువైన మీషో క్రెడిట్లు, బంగారు నాణేలు, రూ.2 కోట్లకు పైగా విలువైన ఇతర బహుమతులను గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. దేశంలోని టైర్-2 నగరాల నుంచి భారీగా ఆన్ లైన్ షాపింగ్ కు డిమాండ్ రావడంతో ఆ ప్రాంతాల్లోని వినియోగదారులకు చేరువ కావడం కోసం అనేక ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టినట్లు మీషో పేర్కొంది. 'మీషో' కామర్స్ సప్లయర్స్, రీసెల్లర్స్, కస్టమర్స్ అనే విభాగాలుగా నడుస్తోంది. ఇందులో నమోదైన రీసెలర్లు సరఫరా దారుల నుంచి అన్ బ్రాండెడ్ ఫ్యాషన్, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. వాటికి బ్రాండింగ్ ఇచ్చి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా విక్రయిస్తారు.(చదవండి: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రీ బుకింగ్స్ మళ్లీ ఓపెన్!) సోషల్ మీడియా ద్వారానే కాకుండా నేరుగానూ మీషో భారీగా విక్రయాలు చేపట్టి ఫేస్బుక్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ సంస్థలకు పోటీగా మారింది. క్రీడలు, క్రీడా సామగ్రి, ఫిట్నెస్, పెట్ సప్లైయిస్, ఆటోమోటివ్ పరికారాలనూ మీషో విక్రయిస్తుండటం గమనార్హం. ఇందులో చాలా తక్కువ ధరకు ఉత్పత్తుల దొరకడంతో చాలా మందికి చేరువ అయ్యింది. ఈ-కామర్స్ సంస్థలకు పోటీగా ఈ సోషల్ కామర్స్ ఎదుగుతోంది. దాంతో 2022 డిసెంబర్ నాటికి నెలకు వంద మిలియన్ల లావాదేవీలు చేసే వినియోగదారులను సంపాదించుకోవాలని భావిస్తోంది. టెక్నాలజీ, ప్రొడక్ట్ టాలెంట్ తదితర విభాగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. 2021, సెప్టెంబర్ 27 నాటికే మీషో భారత్‌లో అతిపెద్ద సోషల్ కామర్స్ వేదికగా ఆవిర్భవించింది. 1.3 కోట్ల రీసెల్లర్స్, 4.5 కోట్ల వినియోగదారులు, లక్షకు పైగా సరఫరా దారులు ఉన్నారు. -
భారత్‌లో అమెజాన్ ‘ధన’బలం!
న్యూఢిల్లీ: భారత్‌లో అమెరికా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ కార్యకలాపాలు పటిష్టంకావడానికి ఆ సంస్థ న్యాయ ప్రతినిధులు దేశంలో కేవలం రెండేళ్లలో రూ.8,646 కోట్ల (1.2 బిలియన్ డాలర్లు) న్యాయపరమైన వ్యయాలు (లీగల్ ఫీజులు) చేసినట్లు వచ్చిన వార్తా కథనాలు సంచలనం రేపుతున్నాయి. దేశంలో అమెజాన్ పబ్లిక్ అకౌంట్ ఫైలింగ్స్ గురించి సమాచారం తెలిసిన వర్గాలను ఉటంకిస్తూ వెలువడిన వార్తల ప్రకారం, అమెజాన్ రిటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అమెజాన్ సెల్లర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, అమెజాన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, అమెజాన్ హోల్‌సేల్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, అమెజాన్ ఇంటర్నెట్సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌సహా భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించే ఈ–కామర్స్ దిగ్గజ విభాగాలు 2018–19లో 3,420 కోట్ల లీగల్ ఫీజులు చెల్లించగా, 2019–20లో ఈ విలువ రూ. 5,126 కోట్లుగా ఉంది. ఈ రెండేళ్లలో అమెజాన్ మొత్తం ఆదాయంలో ఇది దాదాపు 20 శాతమని కూడా సంబంధిత వర్గాలు అంచనా. అవినీతి మయం: సీఏఐటీ కాగా ఈ వార్తాకథనాలపై అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) తీవ్రంగా స్పందించింది. ఈ స్థాయి వ్యయాలు ప్రశ్నించదగినవిగా పేర్కొంది. ‘‘భారత్‌లో తన కార్యకలాపాల కొనసాగింపు, పటిష్టత లక్ష్యంగా భారత్ ప్రభుత్వ అధికారులను అమెజాన్, దాని అనుబంధ సంస్థలు ఎలా మభ్యపెడుతున్నాయి, లంచాలు ఇవ్వడానికి తమ ఫైనాన్షియల్ బలాన్ని ఎలా వినియోగించుకుంటున్నాయి అన్న అంశాన్ని ఆ సంస్థ న్యాయ ప్రతినిధులు చెల్లించిన న్యాయపరమైన భారీ ఫీజులు తెలియజేస్తున్నాయి’’ అని వాణిజ్య మంత్రిత్వశాఖ మంత్రి పియూష్ గోయెల్‌కు రాసిన ఒక లేఖలో సీఏఐటీ నేషనల్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు. అయితే తన ఆరోపణలకు ఆయన ఎటువంటి సాక్ష్యాలను చూపించని ఆయన, ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు విభాగం (సీబీఐ) దర్యాప్తునకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. రెండేళ్లలో వచ్చిన దాదాపు రూ.45,000 కోట్ల టర్నోవర్‌పై రూ.8,500 కోట్లు న్యాయపరమైన వ్యయాలు చేసిందంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోందని ఆయన పేర్కొన్నారు. కథనాలపై స్వయంగా విచారణ ప్రారంభించిన అమెజాన్ కాగా, ఈ వ్యవహారంపై అమెజాన్ స్వయంగా విచారణ ప్రారంభించింది. ఈ అంశంలో సీనియర్ కార్పొరేట్ న్యాయవాదిని ఒకరిని సెలవుపై పంపినట్లు కూడా తెలుస్తోంది. ఆరోపణలను ధృవీకరించడంకానీ లేదా ఖండించడంకానీ చేయని అమెజాన్, ఆరోపణలపై పూర్తి స్థాయిలో తగిన విచారణ జరుపుతున్నట్లు పేర్కొంది. అవినీతి ఏదైనా జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, ఇందుకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయ వివాదాలు ఇవీ.. ఫ్యూచర్ గ్రూప్‌ను రిలయన్స్ కొనుగోలు (రూ.24,713 కోట్ల ఒప్పందానికి సంబంధించి) వ్యవహారాన్ని సవాలుచేస్తూ, దేశంలో అమెజాన్ అతిపెద్ద న్యాయపరమైన వివాదానికి తెరతీసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ న్యాయ వివాదం సుప్రీంకోర్టు, సింగపూర్ ఆర్ర్‌బిట్రేషన్ ట్రిబ్యునల్‌లో నలుగుతోంది. దేశంలో దాదాపు రూ.లక్ష కోట్ల రిటైల్ వ్యాపారాన్ని చేజిక్కించుడానికి జరుగుతున్న వాణిజ్య యుద్ధంగా దీనిని పలువురు అభివర్ణిస్తున్నారు. ఇక ప్రత్యర్థుల వ్యాపారాలను నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నారని తమపై వచ్చిన ఆరోపణలను విచారించరాదని కోరుతున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు సుప్రీంకోర్టులో ఇటీవలే ఎదురుదెబ్బ తగిలింది. ఈ విషయంలో కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణను నిలువరించాలన్న అమెరికా ఈ–కామర్స్ దిగ్గజ కంపెనీల అప్పీలేట్ పిటిషన్లను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ అంశం విషయంలో కర్ణాటక హైకోర్టులో ఓడిపోయిన రెండు ఈ–కామర్స్ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అమెరికా సంస్థలు తమ ఈ–కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఎంపిక చేసిన విక్రేతలను ప్రోత్సహిస్తున్నాయని, తద్వారా పోటీని అణిచివేసే వ్యాపార పద్ధతులకు పాల్పడుతున్నాయన్నది ప్రధాన ఆరోపణ. ‘‘క్రిమినల్ చట్టం కింద ఏదైనా ఫిర్యాదు దాఖలైతే ఎఫ్ఐఆర్ నమోదుచేస్తారు. ఆ నమోదుకు ముందే నోటీసు ఇవ్వండి అన్నట్లు ఉంది మీ వాదన’’ అని కూడా త్రిసభ్య ధర్మాసనం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లను ఉద్దేశించి వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ– కామర్స్ కంపెనీలు ఈ తరహా ఆరోపణలపై విచారణను అడ్డుకుంటూ కోర్టుల్లో సవాలు చేయడం తగదని వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయెల్ కూడా తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. -
రెండు రోజుల్లో రూ. 1100 కోట్లు
సాక్షి, ముంబై: క్యాబ్ సేవల సంస్థ ఓలాకు చెందిన ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో దుమ్మురేపుతోంది. అమ్మకాలు ప్రారంభించిన రెండు రోజుల్లో రికార్డు అమ్మకాలను నమోదు చేసింది. రెండు రోజుల్లో రూ 1100 కోట్ల విలువైన అమ్మకాలను నమోదు చేసింది. ఈ విషయాన్ని కంపెనీ ఓలా గ్రూప్ సీఈఓ భవీష్ అగర్వాల్ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించారు. తొలి రోజు సేల్స్‌ను మించి రెండో రోజు అమ్మకాలతో తమ రికార్డును తామే అధిగమించామంటూ ట్వీట్ చేశారు ఆటోమోటివ్ పరిశ్రమలో మాత్రమే కాదు, భారతీయ ఇ-కామర్స్ చరిత్రలో ఇది ఘనమైన రికార్డు అని ఒకే ఉత్పత్తికి ఒక రోజు (విలువ ప్రకారం) అత్యధిక అమ్మకాలలో ఇదొకటి అన్నారు. ఇదే కదా డిజిటల్ ఇండియా అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఆన్లైన్ అమ్మకానికి మొదటి రోజు, కంపెనీ రూ 600 కోట్లకు పైగా విలువైన ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించిన సంగతి తెలిసిందే. 48 గంటల సేల్ నిన్నటితో (సెప్టెంబరు 16) ముగిసింది. అయితే కస్టమర్లు స్కూటర్‌ను ఆన్లైన్లో రూ. 20వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. తదుపరి సేల్ దీపావళి సందర్బంగా నవంబర్ 1 నిర్వహించనుంది. కేవలం రూ. 499 వద్ద ఆన్లైన్లో ప్లాట్ రిజర్వ్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం కొనుగోలు విండోను క్లోజ్ చేసినా, రిజర్వేషన్లు olaelectric.com ఓపెన్‌లో ఉంటుందని ఓలీ సీఈఓ తెలిపారు. ఓలా ఎస్ 1, ఎస్ 1 ప్రోలను కొనుగోలు చేయాలనుకుంటే ఇపుడే రిజర్వ్ చేసుకోవాలనికోరారు అలాగే ఇప్పటికే రిజర్వ్ చేసుకుని, కొనుగోలు చేయని వారు కూడా నవంబర్ 1న తమ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సొంతం చేసుకోవచ్చని చెప్పారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు ఓలా ఎస్ 1 ధర 1 లక్ష రూపాయలు, ఎస్ 1 ప్రో ధర రూ. 1.30 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్). అంతేకాదు దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలపై రాష్ట్ర సబ్సిడీలను బట్టి డెలివరీ సమయంలో ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఎస్ 1 గరిష్ట వేగం గంటలకు 90 కి.మీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 121 కిమీ వరకు ఉంటుంది. ఎస్ 1 ప్రో గరిష్ట వేగం 181- 115 కి.మీ.ల మధ్య ఉంటుంది. Day 2 of EV era was even better than Day 1! Crossed ₹1100Cr in sales in 2 days! Purchase window will reopen on Nov 1 so reserve now if you haven't already. Thank you India for the love & trust. You are the revolution! https://t.co/oeYPc4fv4M pic.twitter.com/fTTmcFgKfR — Bhavish Aggarwal (@bhash) September 17, 2021 -
వేర్‌హౌస్ స్పేస్‌కు డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ–కామర్స్, థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ (3 పీఎల్) శరవేగంగా విస్తరిస్తుండటంతో గిడ్డంగులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ ఏడాది జనవరి–జూన్ (హెచ్1) నాటికి హైదరాబాద్‌లో 2.1 కోట్ల చ.అ. వేర్‌హౌస్ స్టాక్ ఉందని సీబీఆర్ఈ సౌత్ ఆసియా తెలిపింది. ఇందులో 43 శాతం వేర్‌హౌస్ స్థలాన్ని రిటైల్ సంస్థలు, 19 శాతం 3 పీఎల్, 15 శాతం ఈ–కామర్స్ కంపెనీల వాటాలున్నాయని పేర్కొంది. వచ్చే మూడేళ్లలో అదనంగా 50 లక్షల చ.అ. వేర్‌హౌస్ స్పేస్ చేరుతుందని అంచనా వేసింది. కొన్ని కంపెనీలు ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది హెచ్1లో నగరంలో గిడ్డంగుల అద్దెలు 5–14 శాతం వరకు పెరుగుతాయని పేర్కొంది. 2018–2021 హెచ్1 నాటికి నగరంలో 1.1 కోట్ల చ.అ.లుగా ఉంది. టీఎస్ఐపాస్, పారిశ్రామిక ప్రాంతాలలో మౌలిక వసతుల అభివృద్ధి వంటివి రాష్ట్రంలో గిడ్డంగుల వృద్ధికి ప్రధాన కారణాలని తెలిపింది. చదవండి: ఆగస్ట్‌లో రూ.2,150 కోట్ల రుణాలు -
Boycott Myntra.. ఎందుకో తెలుసా?
Boycott Myntra trending on Twitter: మనోభావాలు.. దెబ్బతినడానికి ప్రత్యేకించి కారణాలు అక్కర్లేని రోజులివి. అలాంటిది చిన్న కారణం దొరికినా.. వివాదాన్ని రేపి, రచ్చ చేసి గోల చేస్తున్నారు చాలామంది. ఈ తరుణంలో దుస్తుల ఈ-కామర్స్ సంస్థ మింత్రా విమర్శలు ఎదుర్కొంటోంది. బాయ్‌కాట్ మింత్రా పేరుతో సోషల్ మీడియాలో కుప్పలుగా పోస్ట్‌లు కనిపిస్తున్నాయి. దానికి కారణం.. ఓ పాత ఫేక్ పోస్ట్. లోగో మార్పుతో వివాదంలో నిలిచిన మింత్రా.. ఇప్పుడు మరో విమర్శను ఎదుర్కొంటోంది. మహాభారత దుశ్వాసన పర్వంలో కృష్ణుడు, ద్రౌపదికి వలువలు అందించే ఘట్టాన్ని తమ ప్రమోషన్‌కు వాడుకుందనేది మింత్రాపై వినిపిస్తున్న ఆరోపణ. ఈ కారణంతోనే హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మింత్రా వ్యవహరించిందని.. కాబట్టి తక్షణమే దానిని అన్-ఇన్స్టాల్ చేయాలని విమర్శలు వినిపిస్తున్నాయి. Shame On Myntra . Retweet And #BoycottMyntrahttps://t.co/kPROnzxLwh — Sadhvi Prachi (@Sadhvi_prachi) August 23, 2021 This is not an ad, it is a direct insult to Hinduism & Hindu’s everywhere. It’s time to send a message loud & clear: Anti-Hindu propaganda will no longer be met with passivity. It will be met with action. #BoycottMyntra pic.twitter.com/EThpeT0xrL — Kavita (@Sassy_Hindu) August 22, 2021 Guy's this has not been done by @myntra it is a post shared on 2016 which has popped now . I'm not supporting myntra but what wrong is wrong . An I'm not an anti-Hindu . I love my religion but we should not blindly tweet without knowing thefact do fact check once #BoycottMyntra pic.twitter.com/MIH2NDt5v4 — B Sanki (@sanjubhujlthapa) August 23, 2021 Abe yaar bc pagal hain kya log? #BoycottMyntra but why? 5 saal pehle ka incident hai ye and myntra has said they didn’t create this artwork neither did they endorse it. Bhai ek baar double check to kar liya karo!🤦🏻♂️ pic.twitter.com/Hl5osQcNT0 — Sanjay Beniwal (@noSanjayBeniwal) August 23, 2021 ఈ మేరకు ఉదయం నుంచి విపరీతమైన పోస్టులు ట్విటర్లో కనిపిస్తుండడంతో.. ట్రెండింగ్‌లోని వచ్చింది. అయితే ఈ పోస్ట్ కొత్తది కాదు. మింత్రా డిజైన్ చేసింది అంతకన్నా కాదు. 2016లోనే ఈ ఫేక్ పోస్ట్ వైరల్ అయ్యింది. ఆ టైంలోనే స్పందించిన మింత్రా.. అలాంటి ఆర్ట్ వర్క్‌ను తాము సృష్టించలేదని, ఎండోర్స్ కూడా చేయలేదని స్పష్టం చేసింది. ఇప్పుడు మళ్లీ హిందుత్వఅవుట్లౌడ్( @hindutvaoutloud) అనే ఇన్స్టాగ్రామ్ పేజీ నుంచి ఈ పోస్ట్ అప్లోడ్ అయ్యింది. కొందరు మింత్రాకు మద్దతుగా ఈ ఫేక్ ఓల్డ్ పోస్ట్‌పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Outloud (@hindutvaoutloud) -
ఈ రంగంలోనే ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెడుతున్నారంట
ముంబై: దేశీయంగా ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) పెట్టుబడులు గత నెలలో భారీగా ఎగశాయి. జూలైలో రెట్టింపునకు పైగా జంప్‌చేసి 9.5 బిలియన్ డాలర్లను(సుమారు రూ. 70,530 కోట్లు) తాకాయి. వెరసి గరిష్ట పెట్టుబడులుగా సరికొత్త రికార్డును నెలకొల్పాయి. 2020 జూలైలో ఇవి 4.1 బిలియన్ డాలర్లు మాత్రమే. ప్రధానంగా ఈకామర్స్ రంగం పెట్టుబడులను అత్యధికంగా ఆకర్షించుకుంటున్నట్లు ఐవీసీఏ, ఈవై రూపొందించిన నివేదిక పేర్కొంది. ఈ సంస్థలు పీఈ, వీసీ పెట్టుబడులపై నెలవారీ నివేదికను విడుదల చేసే సంగతి తెలిసిందే. కాగా.. ఈ(2021) జూన్‌లో నమోదైన 5.4 బిలియన్ డాలర్లతో పోల్చినా.. తాజా పెట్టుబడులు 77 శాతం వృద్ధి చెందాయి. జూలైలో 10 కోట్ల డాలర్లకుపైబడిన 19 భారీ డీల్స్ ద్వారా 8.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు లభించాయి. 2020 జులైలో 10 భారీ డీల్స్ ద్వారా 3.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు నమోదుకాగా.. జూన్‌లో 12 డీల్స్‌తో 3.6 బిలియన్ డాలర్లు వచ్చాయి. జులైలో కొత్త రికార్డుకు తెర తీస్తూ మొత్తం 131 లావాదేవీలు జరిగాయి. 2020 జులైలో ఇవి 77 మాత్రమే కాగా.. ఈ జూన్‌లో 110 లావాదేవీలు నమోదయ్యాయి. రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలను మినహాయించి పీఈ, వీసీ పెట్టుబడుల్లో 96 శాతం(9.1 బిలియన్ డాలర్లు) ప్యూర్ప్లేగా నివేదిక వెల్లడించింది. 2020 జులైలో ఇవి 3.8 బిలియన్ డాలర్లుకాగా.. ఈ జూన్‌లో 4.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ జూలై పెట్టుబడుల్లో ఈకామర్స్ రంగం 5.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకోవడం గమనార్హం! దీంతో 2021 జూన్‌కల్లా ఈకామర్స్‌లో పీఈ, వీసీ పెట్టుబడులు 10.5 బిలియన్ డాలర్లను తాకాయి. 22 డీల్స్ జూలైలో వాటా విక్రయం ద్వారా పీఈ, వీసీ సంస్థలు వైదొలగిన(ఎగ్జిట్) డీల్స్ 22కు చేరాయి. వీటి విలువ 96.5 కోట్ల డాలర్లుగా నమోదైంది. 2020 జులైలో ఇవి 13.4 కోట్ల డాలర్లు మాత్రమే. అయితే ఈ జూన్‌లోనూ ఎగ్జిట్ డీల్స్ విలువ భారీగా 3.2 బిలయన్ డాలర్లను తాకింది. చదవండి : ఆ సంస్థలోని వాటాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: బీపీసీఎల్ -
అమ్మకాల్లో దుమ్మురేపిన ఈ-కామర్స్ సంస్థలు..!
కోవిడ్-19 రాకతో పలు వ్యాపార సంస్థలు పూర్తిగా కుదేలయ్యాయి. కోవిడ్-19 రాకతో ఫాస్ట్ మూవింగ్ కస్యూమర్ గూడ్స్(ఎఫ్ఎమ్సీజీ) కంపెనీలు, ఈ-కామర్స్ సంస్థలు గణనీయంగా వృద్ధి చెందాయి. కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్లను విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరుస లాక్డౌన్లు పలు ఆన్లైన్ కిరాణా సంస్థలకు భారీ ప్రయోజనాన్నిచేకూర్చాయి. కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు ఎక్కువగా ఈ-కామర్స్ సంస్థలపై మొగ్గుచూపాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ-కామర్స్ సంస్థలు ద్వారా కిరాణా అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయని మార్కెట్ పరిశోధన సంస్థ నిల్సన్ఐక్యూ పేర్కొంది.కోవిడ్ రాక ముందు 2020 సంవత్సరంలో ఈ-కామర్స్ అమ్మకాలు 96 శాతంగా ఉండగా కోవిడ్ రాకతో 134 శాతానికి గణనీయంగా అమ్మకాలు వృద్ధి చెందాయి. దీంతో మే నెలలో ఈ-కామర్స్ సంస్థలు అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. దేశవ్యాప్తంగా ఉన్న టాప్ 52 మెట్రో నగరాల్లో ఎఫ్ఎంసిజి అమ్మకాలు ఈ-కామర్స్ సహకారంతో 2021 మే నెలలో రెండంకెల మార్కును వృద్ధిని నమోదు చేశాయి. ఎఫ్ఎమ్సీజీ కంపెనీల వృద్ధి కొనసాగుతూనే ఉందని నీల్సన్ఐక్యూ కస్టమర్ సక్సెస్ లీడ్ సమీర్ శుక్లా వెల్లడించారు. వినియోగదారుల ఆకాంక్షలను పూర్తి చేయడంలో ఎఫ్ఎమ్సీజీ కంపెనీలకు ఈ-కామర్స్ కంపెనీలు ఎంతగానో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. ఈ-కామర్స్ సంస్థల సహయంతో ప్రముఖ ఎఫ్ఎమ్సీజీ కంపెనీల సేల్స్‌లో మారికో లిమిటెడ్ 9 శాతం, హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్ 6 శాతంగా వృద్ధి చెందాయి. కాగా మరోవైపు గ్రాసరీ స్టోర్ల పరిస్థితి దయానీయంగా మారింది. ప్రజలు ఎక్కువగా గ్రాసరీ స్టోర్లవైపు కాకుండా ఈ-కామర్స్ సంస్థల వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని నిల్సన్ఐక్యూ పేర్కొంది. -
పాత ఫోన్లు, లాప్‌ట్యాప్‌లు అమ్మేస్తారా? ఇది మీకోసమే..
సాక్షి, వెబ్‌డెస్క్: వేల రూపాయలు పెట్టి కొన్న గాడ్జెట్లు నెలలు తిరగకుండానే ఓల్డ్ మోడల్ అవుతున్నాయి. ఇయర్ ఫోన్స్ మొదలు స్మార్ట్ఫోన్ల వరకు , కీబోర్డు మొదలు టచ్ ల్యాప్‌టాప్‌ల వరకు వెంట వెంటనే అప్డేట్ వెర్షన్లు వచ్చేస్తున్నాయి. కొత్త వెర్షన్ వస్తువు కొందామంటే.. పాతది ఏం చేయాలని? ఎలా రీజనబుల్ ధరకు అమ్మేయాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఈ సమస్యను తీరుస్తూ.. పాత ఎలక్ట్రానిక్ వస్తువుల కొనడమే పనిగా ఈ-కామర్స్‌లోకి అడుగుపెట్టింది క్యాషిఫై. పాతవి అమ్మాలంటే మార్కెట్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ విషయంలో వెనువెంటనే మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల విషయంలో ఇది మరీ ఎక్కువ. వారం తిరక్కుండానే కొత్త ఫీచర్లతో తక్కువ ధరలో మంచి ఫోన్లు వస్తున్నాయి. దీంతో కొత్త ఫోన్లు చాలా త్వరగా ఓల్డ్ వెర్షన్ అయిపోతున్నాయి. వీటిని అమ్మి కొత్తది తీసుకుందామంటే మనకు తెలిసిన మార్కెట్లో సరైన ధర రావడం కష్టంగా మారింది. ఇలాంటి వారికి చక్కని వేదికగా మారింది క్యాషిఫై. ఈ-కామర్స్‌కు కొత్త భాష్యం చెబుతూ రీ-కామర్స్‌గా పాత ఎలక్ట్రానిక్ వస్తువులని ప్రజల నుంచి కొనుగోలు చేస్తుందీ వెబ్ పోర్టల్. రీ-కామర్స్ ఇది ఈ-కామర్స్ కాదు.. రీ-కామర్స్. అంటే పాత వస్తువుల్ని కొనడమే వీళ్ల పని. ఎలక్ట్రానిక్స్ కేటగిరీలో ఫీచర్ ఫోన్లు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్, స్మార్ట్‌వాచ్, స్మార్ట్ స్పీకర్, డీఎస్ఎల్ఆర్ కెమెరా, ఇయర్‌బడ్స్ తదితర వస్తువులన్నీ ఈ సైట్లో అమ్మే అవకాశం ఉంది. క్యాషిఫై వెబ్‌సైట్‌కి వెళ్లి అక్కడున్న ఆప్షన్లను అనుసరిస్తే మీ దగ్గరున్న ప్రొడక్టుకి ఎంత ధర వస్తుందో తెలియజేస్తుంది. ఆ తర్వాత మరికొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాక.. ఫైనల్ ధర ఎంతో నిర్ధారిస్తుంది. అందుకు ప్రొడక్టు ఓనర్ అంగీకరిస్తేనే డీల్ ముందుకు వెళ్తుంది. ఎక్సేంజీ కంటే మేలు ప్రముఖ ఈ కామర్స్ సైట్లలో సైతం ఎక్సేంజ్ ఆఫర్లు రెగ్యులర్‌గా ఉంటాయి. అయితే ఎక్సేంజ్ ఆఫర్లలో కంపెనీలు పాత ఫోన్లకు చాలా తక్కువ ధరను ఆఫర్ చేస్తుంటాయి. పైగా అన్ని రకాల పాత మోడళ్లపై ఎక్సేంజీ ఆఫర్ వర్తించవు. అంతేకాదు మనకు నచ్చిన వస్తువలపై ఎక్సేంజీ ఆఫర్ ఉండకపోవచ్చు. ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా క్యాషిఫైలో పాత గాడ్జెట్స్ అమ్మేయోచ్చు. ఆఫ్‌లైన్‌లో కూడా ఇప్పటి వరకు ఆన్లైన్లోనే వ్యాపారం చేస్తూ వచ్చిన క్యాషిఫై తాజాగా ఆఫ్‌లైన్‌లోకి వచ్చింది. రిటైల్ చైయిన్ యూనిషాప్తో ఒప్పందం చేసుకుంది. దీంతో ఢిల్లీ, బెంగళూరు, ముంబై ఏరియాల్లో 60కి పైగా రిటైల్ షాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా టైర్ టూ సిటీలకు కూడా విస్తరించేలా క్యాషిఫై ప్రణాళిక సిద్దం చేస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ ఆఫ్‌లైన్ సౌకర్యం హైదరాబాద్‌ని పలకరించే అవకాశమూ ఉంది. -
ఈ–కామర్స్ అనుచిత విధానాలకు కళ్లెం
రాజ్యసభలో.. సాక్షి, న్యూఢిల్లీ: ఈ–కామర్స్ అనుచిత వ్యాపారం విధానంపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని సంబంధిత ప్రభుత్వ విభాగాలను కోరినట్లు కేంద్రం తెలిపింది. ఈ–కామర్స్ కంపెనీల అనుచిత వ్యాపార విధానాలకు కళ్లెం వేయడానికి వినియోగదారుల సంరక్షణ నిబంధనలను మరింత కఠినతరం చేయబోతున్నట్లు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి సోమ్‌ప్రకాశ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. వినియోగదారుల పరిరక్షణ (ఈ–కామర్స్) నిబంధనల సవరణకు ముందుగా వ్యాపారవర్గాల సలహాలు, సూచనలు కోరినట్లు చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద గత ఏడాది మే, జూన్ నెలల్లో వలస కార్మికులు, వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుక్కున్న వలస కార్మికులు, రేషన్‌కార్డులు లేనివారికి ఉచితంగా పంపిణీ చేసేందుకు 8 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను వివిధ రాష్ట్రాలకు కేటాయించినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీశాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి జవాబిచ్చారు. 2015–16 నుంచి కేంద్ర ప్రభుత్వం సేంద్రియ సాగును ప్రోత్సహిస్తోందని, పంట దిగుబడి నుంచి సర్టిఫికేషన్, మార్కెటింగ్ వరకు రైతులకు సహకరిస్తోందని ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో 6 వేల సముద్రపు పాచితెప్పలు, 1,200 ట్యూబ్‌నెట్‌లు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు రూ.1.86 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లబ్ధిదారులను గుర్తించిందని వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వేజోన్, రాయగఢ డివిజన్ పనులకు రూ.170 కోట్లు అవుతుందని అంచనా వేయగా, 2021–22 బడ్జెట్లో రూ.40 లక్షలు కేటాయించినట్లు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు జవాబుగా రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ చెప్పారు. లోక్‌సభలో.. సెప్టెంబర్ కల్లా మంగళగిరి ఎయిమ్స్ పూర్తి మంగళగిరి ఎయిమ్స్ సెప్టెంబర్‌కల్లా పూర్తవుతుందని కేంద్రం తెలిపింది. ఈ ఎయిమ్స్‌కు రూ.1,618 కోట్లు మంజూరుకాగా రూ.922.01 కోట్లు విడుదల చేశామని, రూ.880.15 కోట్లు ఖర్చయిందని వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతి పవార్ చెప్పారు. దేశంలో 26 మిలియన్ హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని పునరుద్ధరిస్తున్నట్లు వైఎస్సార్సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లుగా మలేరియా మరణాల్లేవని వైఎస్సార్సీపీ ఎంపీ ఎన్.రెడ్డెప్ప అడిగిన ప్రశ్నకు జవాబుగా కేంద్ర ఆరోగ్యమంత్రి మాన్సుఖ్ మాండవీయా చెప్పారు. ఆయుష్–64 సాంకేతికతను దేశవ్యాప్తంగా 37 సంస్థలకు బదిలీ చేసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బెల్లాన చంద్రశేఖర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. కోవిడ్–19 నివారణ చర్యల్లో భాగంగా గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.459.78 కోట్లు విడుదల చేసినట్లు ఎంపీలు వంగా గీత, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. -
ఈకామర్స్‌కు షాక్: రంగంలోకి నందన్ నీలేకని
సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్ సృష్టికర్త, ఇన్ఫోసిస్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్, నందన్ నీలేకనికి మోదీ సర్కార్ కీలక బాధ్యతలను అప్పగించింది. డిజిటల్ మోనోపలీకి చెక్‌పెట్టే మార్గాలపై సలహా ఇచ్చే ప్రభుత్వ ప్యానెల్లో నీలేకనిని సభ్యుడిగా చేర్చింది. తద్వారా ఈకామర్స్ రంగంలో అక్రమాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. సప్లయ్ చెయిన్‌ను డిజిటలైజ్ చేయడం, కార్యకలాపాలను ప్రామాణీకరించడం, మరిన్ని సరఫరాదారులను చేర్చడాన్ని ప్రోత్సహించడం, లాజిస్టిక్స్ సామర్థ్యాలు, వినియోగదారులకు విలువను పెంచుతుందని భావిస్తున్నారు. డిజిటల్ గుత్తాధిపత్యాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం తొమ్మిది మంది సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ తొమ్మిది మంది సభ్యుల సలహా మండలిలో నందన్ నీలేకనిని కూడా చేర్చడం విశేషం. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) పేరుతో ఏర్పటవుతున్న ఈ కమిటీ నిబంధనల అమలును వేగంగా ట్రాక్ చేయడానికి సూచనలు ఇస్తుందని అధికారిక వర్గాలు సోమవారం తెలిపాయి. వాణిజ్య శాఖకు చెందిన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక మండలి (డీపీఐఐటీ)జాయింట్ సెక్రటరీ అధ్యక్షతన ఈ కమిటీ పనిచేస్తుంది. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసిఐ), ప్రాథమికంగా డిజిటల్ గుత్తాధిపత్యాలను అరికట్టడమే లక్ష్యంగా ఇది పనిచేస్తుంది. ఐటీ దిగ్గజం నందన్ నీలేకనీతో పాటు, నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓ ఆర్ఎస్ శర్మ, క్యూసిఐ చీఫ్ ఆదిల్ జైనుల్ భాయ్, అవానా క్యాపిటల్ వ్యవస్థాపకుడు అంజలి బన్సాల్, డిజిటల్ ఇండియా ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు అరవింద్ గుప్తా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హెడ్ దిలీప్ అస్బే ఉన్నారు. ఇంకా నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ హెడ్ సురేష్ సేథి, ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్ చీఫ్ ప్రవీణ్ ఖండేల్వాల్, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీఈఓ కుమార్ రాజగోపాలన్ ఈ కౌన్సిల్లో సభ్యులుగా ఉంటారు. కాగా నందన్ నీలేకని యుఐడీఏఐ చైర్మన్ గానూ, టాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్, న్యూ పెన్షన్ స్కీమ్, జీఎస్టీ సహా ఐదు కీలక ఆర్థిక రంగ ప్రాజెక్టులకు భారత ప్రభుత్వ సాంకేతిక సలహా బృందానికి నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. -
Amazon Echo Show : ఎక్కడి నుంచైనా స్పష్టంగా చూడొచ్చు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఆధునీకరించిన ఎకో షో–10, ఎకో షో–5 ఉపకరణాలను భారత్‌లో ప్రవేశపెట్టింది. 10.1 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, 13 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో ఎకో షో–10 రూపుదిద్దుకుంది. ఇంటెలిజెంట్ మోషన్ ఫీచర్ దీనికి పొందుపరిచారు. దీంతో గదిలో ఎటువైపున ఉన్నా వీడియోలు వీక్షించేందుకు వీలుగా డిస్ప్లే కదులుతుంది. అలెక్సాతో... అమెజాన్ ఎకో షో–10 ధర రూ.24,999. స్మార్ట్ స్పీకర్ ఎకో షో–5 డివైజ్‌కు 5.5 అంగుళాల స్క్రీన్, వీడియో కాల్స్ కోసం అప్‌గ్రేడ్ చేసిన హెచ్డీ కెమెరా ఏర్పాటు చేశారు. ఎకో షో–5 ధర రూ.6,999 ఉంది. అలెక్సా యాప్ ద్వారా డివైజ్‌లోని బిల్ట్ ఇన్ కెమెరా సాయంతో ఇంటిని ఎక్కడి నుంచైనా పర్యవేక్షించవచ్చు. చదవండి : కాఫీడే....చేదు ఫలితాలు -
భారీ మోసం: రూపాయికే సరుకులు! ఎగబడిన కస్టమర్లు
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ షాపింగ్ పేరిట కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. బంపర్ ఆఫర్ అని ప్రకటించి సరుకులు ఆర్డర్ పెట్టి డబ్బులు చెల్లించిన అనంతరం డెలివరీ చేయకపోవడంతో వినియోగదారులు భారీగా నష్టపోయారు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని హైదరాబాద్ ప్రజలు మోసపోయారు. సైబర్ నేరగాళ్లు ఈ కొత్త పంథాను ఎంచుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. తక్కువ ధరలకు నిత్యావసరాల సరుకులు అందిస్తామంటూ ‘జాప్ నౌ’ అనే వెబ్సైట్ ప్రకటన ఇచ్చింది. కొన్ని వస్తువులు కేవలం ఒక్క రూపాయికే అందిస్తామని వల వేశారు. క్యాష్ అండ్ డెలివరీ కాకుండా ఆన్లైన్ చెల్లింపు మాత్రమే చేయాలని నిబంధన విధించారు. ఆఫర్ బాగా ఉందని భావించిన వినియోగదారులు పెద్ద ఎత్తున ఈ వెబ్సైట్లో ఆర్డర్లు ఇచ్చారు. తీరా డబ్బు చెల్లించి కొన్ని రోజులైనా వస్తువులు డెలివరీ కాలేదు. తాము మోసపోయామని గుర్తించిన బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి కేసులు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 5 ఫిర్యాదులు నమోదయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నారు. -
నిధుల సమీకరణలో ఫ్లిప్‌కార్ట్
వెబ్‌డెస్క్: ఆన్లైన్ మార్కెట్లో మరోసారి పట్టు సాధించేందుకు ఫ్లిప్‌కార్ట్ సన్నహకాలు మొదలుపెట్టింది. నిధుల సమీకరణపై సాఫ్ట్‌బ్యాంకు గ్రూపుతో చర్చలు జరుపుతోంది. ఈ చర్చలు ఫలిస్తే ఫ్లిప్‌కార్ట్‌లోకి రూ. 3,652 వేల కోట్ల పెట్టుబడులు సాఫ్ట్‌బ్యాంకు గ్రూపు నుంచి వచ్చే అవకాశం ఉంది. గతంలో ఫ్లిప్‌కార్ట్ గ్రూపులో సాఫ్ట్‌బ్యాంకు పెట్టుబడులు పెట్టింది. అయితే 2017లో తన వాటలను అమ్మేసింది సాఫ్ట్‌బ్యాంకు గ్రూపు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ గ్రూపులో మెజారిటీ వాటాలు వాల్‌మార్ట్ సంస్థ పేరిట ఉన్నాయి. దేశీయంగా ఆన్లైన్ మార్కెట్‌కు ఊపు తెచ్చిన ఈ కామర్స్ సంస్థల్లో ఫ్లిప్‌కార్ట్ ఒకటి. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగించింది ఫ్లిప్‌కార్ట్. ప్రస్తుతం ఇండియాలో ఫ్లిప్‌కార్ట్‌కి పోటీగా ఉన్న అమెజాన్ ఉంది. నిధుల సమీకరణతో మారోసారి మార్కెట్లో తన సత్తా చూపించేందుకు ఫ్లిప్‌కార్ట్ సిద్ధమవుతోంది. -
మీ దగ్గర ఈ 25 పైసల నాణెం ఉంటే లక్షాధికారులే
న్యూఢిల్లీ: మీ దగ్గర పాత 25 పైసల నాణెం ఉందా.. ఒకవేళ ఉంటే మీరు లక్షాధికారులు కావచ్చు అంటుంది ఇండయామార్ట్ వెబ్సైట్. పావలా ఉంటే లక్షాధికారులు ఎలా అవుతారా అని ఆలోచిస్తున్నారా అయితే ఇది చదవండి. ఇండియామార్ట్ ఓ బంపరాఫర్ ప్రకటించింది. మీ దగ్గర గనుక 1992 కాలం నాటి ఖడ్గ మృగం ఉన్న 25 పైసల కాయిన్ ఉంటే.. మీరు లక్షాధికారులే అని తెలిపింది. ఇందుకు గాను మీరు ఆ కాయిన్‌ను రెండు వైపులా ఫోటో తీసి.. ఇండియామార్ట్. కామ్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అక్కడ దీన్ని వేలం వేస్తారు. ఎంత ఎక్కువ ధర పలుకుతుందనేది బిడ్డర్ల మీద ఆధారపడి ఉంటుంది. అయితే గరిష్టంగా 1.50 లక్షల రూపాయల వరకు పలకవచ్చని భావిస్తున్నారు. ఈ 25 పైసల నాణెం తప్పకుండా వెండి రంగులో ఉండాలి అని తెలిపింది. ఇక మీ దగ్గర పాత 5,10 పైసల నాణేలు ఉంటే వాటిని ఇండియామార్ట్ వెబ్సైట్లో అమ్మి డబ్బు చేసుకోవచ్చు. అలానే ఎవరికైనా పాత నాణేల మీద ఆసక్తి ఉంటే ఇక్కడ కొనవచ్చు. ఇక ఇండియామార్ట్ భారతదేశంలోకెల్లా అతిపెద్ద ఇ-కామర్స్ వెబ్సైట్లలో ఒకటి. "ఇండియామార్ట్ 10 కోట్లకు పైగా కొనుగోలుదారులు, 60 లక్షలకు పైగా సరఫరాదారులకు సేవలు అందిస్తోంది. మీరు రిటైలర్, తయారీదారు అయినా, ఆన్లైన్లో వ్యాపారం పెరగడానికి ఇండియామార్ట్ మంచి గమ్య స్థానం అని దాని వెబ్సైట్లో పేర్కొంది. ఇక ఇది ఎంత వాస్తవమనేది చూడాలి. చదవండి: రూ.5 కాయిన్‌కు రూ.5 లక్షలట! -
విదేశీ ఈ-కామర్స్ కంపెనీలపై కఠిన నిబంధనలు!
న్యూఢిల్లీ: విదేశీ ఈ-కామర్స్ కంపెనీలకు కఠిన నిబంధనలు అమలు చేయాలని రిటైలర్లతో కూడిన వాణిజ్య సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. దుర్వినియోగానికి పాల్పడే కంపెనీలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరాయి. ఈ-కామర్స్ కంపెనీలు పెద్ద ఎత్తున విక్రేతలను చూపిస్తూ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని తెలిపాయి. మొత్తం అమ్మకాల్లో అయిదారుగురు విక్రేతల వాటాయే 95 శాతముంటుందని వెల్లడించాయి. అమ్మకాలు జరుగుతున్న తీరుకు సంబంధించిన సమాచారాన్ని తమకు నచ్చిన విక్రేతలకు చేరవేయడంతోపాటు ప్రైవేట్ లేబుల్స్‌ను ప్రవేశపెట్టి లబ్ది పొందుతున్నాయని వివరించాయి. ఆల్ ఇండియా ఆన్లైన్ వెండార్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్, ఎఫ్ఎంసీజీ డిస్ట్రీబ్యూటర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ వంటి సంస్థలు అసంభవ్ పేరుతో సమావేశం జరిపాయి. అయితే ఏప్రిల్ 15-18 తేదీల్లో అమెజాన్ సంభవ్ పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తుండడం గమనార్హం. చదవండి: ఛార్జింగ్ అవసరంలేని ఎలక్ట్రిక్ కారు! -
మన ఇంటి పక్కన కిరాణా దుకాణాదారుడే కింగ్
కొనుగోలుదారులకు మరింతగా చేరువయ్యే ప్రయత్నాల్లో భాగంగా కిరాణా దుకాణాదారులను ఆకర్షించేందుకు ఈ–కామర్స్ కంపెనీలు పోటీపడుతున్నాయి. ఒకదాన్ని మించిన మరో ఆఫర్‌తో ఊదరగొడుతున్నాయి. వారిని తమ డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫాంలో భాగస్వాములుగా చేసుకోవడంతో పాటు, రుణ సదుపాయం కూడా కల్పిస్తామంటున్నాయి. సాధారణంగా కిరాణా దుకాణాదారులు సుమారు అయిదు నుంచి 15 దాకా పెద్ద స్టోర్స్ లేదా హోల్సేలర్ల నుంచి కొనుగోళ్లు జరుపుతుంటారు. జియో మార్ట్, ఉడాన్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ వంటి బడా సంస్థలు ఈ సెగ్మెంట్లో వ్యాపార అవకాశాలను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. భారీ మార్కెట్.. భారత్‌లో సుమారు 2.5 కోట్ల మంది చిన్న రిటైలర్లు ఉన్నారని, 90 శాతం రిటైల్ మార్కెట్లో వీరి ఆధిపత్యమే ఉంటోందని బీ2బీ (బిజినెస్ టు బిజినెస్) సంస్థ ఉడాన్ సహ–వ్యవస్థాపకుడు సుజీత్ కుమార్ తెలిపారు. సుమారు 780 మిలియన్ డాలర్ల పైగా విలువ చేసే బీ2బీ మార్కెట్లో.. ఈ-కామర్స్ విస్తృతి కనీసం ఒక్క శాతం కూడా లేదని వివరించారు. ఈ నేపథ్యంలో చిన్న రిటైలర్ల మార్కెట్‌కు సంబంధించి భారీ స్థాయిలోనే అవకాశాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. వినూత్న వ్యూహాలు .. రిటైలర్ను ఆకర్షించేందుకు హోల్‌సేల్ సంస్థలు వివిధ రకాల వ్యూహాలు అమలు చేస్తున్నాయి. కిరాణా దుకాణాదారులు మరింత ఆదాయం పొందేలా తమ స్టోర్స్‌ను ఆధునీకరించుకునేందుకు, డిజిటల్ బాట పట్టేందుకు అవసరమైన తోడ్పాటు అందిస్తోంది మెట్రో క్యాష్ అండ్ క్యారీ సంస్థ. దుకాణాదారులు కొనుగోళ్ల కోసం ప్రత్యేకంగా మెట్రో స్టోర్స్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ-బుకింగ్ ద్వారా నేరుగా వారి దుకాణాలకే ఉత్పత్తులను డెలివరీ చేస్తోంది. ఇక, పైన్ ల్యాబ్స్ వంటి స్టార్టప్ సంస్థలు పాయింట్ ఆఫ్ సేల్స్ సొల్యూషన్స్ అందిస్తుండగా.. ఖాతాబుక్ లాంటివి స్వల్పకాలిక రుణ సదుపాయాలను కల్పిస్తున్నాయి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా తయారీసంస్థల నుంచి ఆహార, ఆహారేతర ఉత్పత్తులను ఆకర్షణీయ రేట్లకు షాపు వద్దకే అందిస్తామని ఉడాన్ వంటి సంస్థలు చెబుతున్నాయి. ఉభయతారకం.. సాధారణంగా పంపిణీ వ్యవస్థలో ఆఖరున ఉండే కొనుగోలుదారుకు ఉత్పత్తి చేరవేయాలంటే అయ్యే వ్యయాలు.. మొత్తం డెలివరీ ఖర్చుల్లో దాదాపు 16 శాతం దాకా ఉంటాయి. అదే కిరాణా దుకాణాదారు నుంచి గానీ అందించగలిగితే ఇది మూడో వంతుకి తగ్గుతుంది. అందుకే కొనుగోలుదారుల ఆర్డర్లను ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని కిరాణా స్టోర్స్‌కి గానీ అనుసంధానిస్తే.. ఒకవేళ దుకాణాదారు దగ్గరే సదరు ఉత్పత్తి ఉంటే అక్కణ్నుంచే నేరుగా డెలివరీ చేయొచ్చు. అంతేకాకుండా రిటైలరుకు కమీషను రూపంలోనూ కాస్త గిట్టుబాటు అవుతుంది. టెక్నాలజీ.. సర్వీసులు ఇటు టెక్నాలజీ అటు సేవలపరమైన ప్రయోజనాలు కల్పించడం ద్వారా కిరాణా దుకాణాదారులకు చేరువ కావాలని మెట్రో ప్రయత్నాలు చేస్తోంది. దీనితో దుకాణాదారు ఆదాయాలు, లాభాలను పెంచుకోవడంతో పాటు నిల్వ చేసుకోవాల్సిన అవసరాన్ని తగ్గించుకోవచ్చని తద్వారా చేతిలో కొంత అధిక మొత్తం నగదు ఆడుతుందని సంస్థ వర్గాలు తెలిపాయి. మెట్రోలో సుమారు పది లక్షల పైచిలుకు కిరాణా దుకాణదారులు కొనుగోళ్లు చేస్తుంటారు. స్మార్ట్ కిరాణా ప్రోగ్రాంలో భాగంగా 2,000 రిటైలర్లతో మెట్రో జత కట్టింది. 48 గంటల వ్యవధిలో వారి స్టోర్స్‌ను అప్‌గ్రేడ్ చేయడం, ఉత్పత్తులను ఎలా ఎక్కడ డిస్ప్లే చేయాలి వంటి అంశాల్లో టిప్స్ అందిస్తోంది. అలాగే వారు డిజిటల్ బాట పట్టేందుకు అవసరమయ్యే పీవోఎస్ మెషీన్లను కూడా స్వల్ప చార్జీలకు అందిస్తోంది. ఇలా ఆధునీకరించిన కిరాణా దుకాణాల అమ్మకాలు 30–40 శాతం పెరిగాయని మెట్రో ఎండీ అరవింద్ మేదిరాట్ట తెలిపారు. దాదాపు 1 లక్ష పైచిలుకు రిటైలర్ల స్టోర్స్‌ని మెట్రో ఉత్పత్తులను నేరుగా డెలివరీ చేస్తోంది. ఆన్లైన్లో రోజుకు నాలుగైదు సార్లయినా ఆర్డర్ చేసే వెసులుబాటు ఇస్తుండటంతో దుకాణాదారులు పెద్ద మొత్తంలో ఉత్పత్తులను ముందుగానే కొని నిల్వ చేసుకోవాల్సిన సమస్య ఉండదని సంస్థ వర్గాలు తెలిపాయి. జియో ప్రత్యేక బాట ఇప్పటికే 200 నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న జియో మార్ట్ సంస్థ .. కిరాణా దుకాణాదారులను డెలివరీ వ్యవస్థ ఆఖరు దశలోనూ (లాస్ట్ మైల్ డెలివరీ - ఎల్ఎండీ) భాగస్వాములుగా చేసుకోవడంపై దృష్టి పెడుతోంది. ఇందుకోసం ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ వ్యాపార విభాగాన్ని (ప్రస్తుతం కొనుగోలు ప్రయత్నాల్లో ఉంది) ఉపయోగించుకోవచ్చని భావిస్తోంది. తద్వారా దేశీయంగా సంఘటిత రిటైల్ రంగంలో 17 శాతం వాటాను దక్కించుకుంటే .. తయారీ సంస్థలతో మరింతగా బేరమాడి ఇంకా తక్కువ రేటుకే ఉత్పత్తులను కొనుగోలు చేయొచ్చని యోచిస్తోంది. జియో మార్ట్ .. పీవోఎస్ మెషీన్లతో పాటు నిల్వలు, వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ, రుణ సదుపాయాలు మొదలైనవి కూడా కల్పిస్తోంది. వాట్సాప్‌తో జట్టు కట్టడంతో ఈ లావాదేవీలన్నీ మరింత సులభతరంగా నిర్వహించేందుకు వీలు పడనుంది. అటు అమెజాన్ కూడా ఈ తరహా వ్యూహాన్ని మరో రకంగా అమలు చేస్తోంది. ఎల్ఎండీ కోసం ’ఐ హ్యావ్ స్పేస్’ అనే ప్రోగ్రాం నిర్వహిస్తోంది. సుమారు 28,000 చిన్న రిటైలర్లు ఇందులో భాగంగా ఉన్నారు. తమ స్టోర్స్‌కి 2-4 కి.మీ. పరిధిలో ఉత్పత్తులను అందిస్తున్నారు. దీనితో సదరు స్టోర్స్‌కి నెలకు రూ.12,000 నుంచి రూ.15,000 దాకా అదనపు ఆదాయం కూడా లభిస్తోందని అమెజాన్ వర్గాలు తెలిపాయి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా... ఇక మెట్రో తరహాలోనే ఉడాన్ కూడా దాదాపు ముప్భై లక్షల మంది పైచిలుకు చిన్న రిటైలర్లకు ఉత్పత్తులు విక్రయిస్తోంది. తయారీ సంస్థల నుంచి ఉత్పత్తులను నేరుగా స్టోర్స్‌కే అందిస్తోంది. పంపిణీలో వివిధ దశలు తగ్గిపోవడం, మధ్యవర్తుల ప్రమేయం ఎక్కువగా లేకపోవడం వల్ల మూడు నుంచి నాలుగు శాతం కమీషన్ ఆదా అవుతుందని .. దాన్ని రిటైలర్లకు బదలాయించవచ్చని ఉడాన్ వర్గాలు తెలిపాయి. అంతే గాకుండా తమ సొంత నాన్–బ్యాంక్ ఫైనాన్స్ కంపెనీతో పాటు ఇతరత్రా ఆర్థిక సంస్థల ద్వారా దుకాణదారులకు అవసరాన్ని బట్టి రుణాలు కూడా ఇప్పిస్తోంది. ఇప్పటిదాకా సుమారు రూ.7,300 కోట్ల దాకా ఇలా స్వల్పకాలిక రుణాలిచ్చినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. సకాలంలో స్టోర్స్‌కి డెలివరీ చేసేందుకు ఉడాన్ దేశవ్యాప్తంగా సుమారు 1 కోటి చ.అ. విస్తీర్ణంలో 200 గిడ్డంగులు ఏర్పాటు చేసుకుంది. ఈ పరిమాణాన్ని అయిదింతలు పెంచుకోవాలని భావిస్తోంది. -
ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. భారీ పార్శిల్
బ్యాంకాక్: వ్యాపారాల్లోకి ఈ-కామర్స్ రంగ ప్రవేశంతో వస్తువుల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. వినియోగదారులు ఈ కామర్స్‌పైనే ఆధారపడి ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అమ్మకాలు ఎంత గణనీయంగా పెరిగాయో అంతే సంఖ్యలో ఆన్లైన్ మోసాలు కూడా పెరిగాయి. ఒక వస్తువు తక్కువ ధర వస్తూంటే ముందు వెనుకా ఆలోచించకుండా వెంటనే ఆర్డర్ చేసి మోసపోయే సంఘటనలు కూడా పెరిగాయి. వినియోగదారులు అత్యాశ, నిర్లక్ష్యం ఈ ఇలాంటి మోసాలకు పెట్టుబడి. తాజాగా ఇలాంటి ఉదంతమే ఒకటి థాయిలాండ్‌లో వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా విలాసానికి మారు పేరైన ఐఫోన్అంటే మరీ మోజు ఎక్కువ. ఈ ఉత్సాహంతోనే మార్కెట్ కంటే చాలా తక్కువ ధరకు ఐఫోన్న వస్తోందని ఒక పిల్లాడు పప్పులో కాలువేశాడు. థాయ్‌లాండ్‌కు చెందిన టీనేజర్ తక్కువ ధరకే ఐఫోన్‌ను సొంతం చేసుకోవాలని ఆశపడ్డాడు. వెంటనే ఆర్డర్ చేశాడు. ఐఫోన్ ఎప్పుడొస్తుందా! అని కళ్లల్లో వత్తులు వేసుకొని, ఎదురుచూస్తూ ఉన్నాడు. చేసిన ఆర్డర్ రానే వచ్చింది. సాధారణంగా అయితే స్మార్ట్‌ఫోన్ పార్శిల్ చిన్నగా ఉంటుంది. కానీ తనకొచ్చిన భారీ పార్శిల్ చూసి నిర్ఘాంతపోయాడు. పార్శిల్ ఓపెన్ చేసిన అతగాడికి దిమ్మదిరిగా మైండ్ బ్లాక్ అయింది. విషయం ఏమిటంటే..ఐఫోన్ కు బదులు ఐఫోన్ ఆకారంలో ఒక కాఫీ టేబుల్ వచ్చింది. తీరిగ్గా విషయాన్ని పరిశీలించాక జరిగిన మోసం అర్థం అయింది ఇ-కామర్స్ సంస్థ ప్రకటనలోని వివరాలన్నీ సరిగ్గా చూసుకోకుండా ఆర్డర్ చేసి మోస పోయానని గుర్తించాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అదీ సంగతి..ఫ్రీ, డిస్కౌంట్లు లాంటి ఆఫర్లను ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలి. లేదంటే ఇలాంటి షాక్‌లు తప్పవు. తస్మాత్ జాగ్రత్త! చదవండి: పోలీస్ అధికారి సాహసం..స్పైడర్‌మ్యాన్ అంటూ ప్రశంసలు -
కరోనా వైరస్ కలిసొచ్చింది...
సాక్షి, న్యూఢిల్లీ: ఈ–కామర్స్ అమ్మకాలకు కరోనా వైరస్ కలిసొచ్చింది. గతేడాది పండుగ సీజన్‌తో పోలిస్తే ఈ ఏడాది ఫెస్టివల్ సీజన్లో జోరుగా సాగాయి. 2019తో పోలిస్తే 2020 పండుగ అమ్మకాల్లో 77 శాతం వృద్ధి నమోదైందని క్రెడిట్, పేమెంట్ స్టార్టప్ స్లైస్ తెలిపింది. 74 శాతం లావాదేవీలు డిజిటల్ రూపంలో, 26 శాతం ఆఫ్‌లైన్‌లో జరిగాయని పేర్కొంది. ఈ ఏడాది ఫెస్టివల్ సీజన్లో 71 శాతం మంది నెలవారి వాయిదా (ఈఎంఐ) వినియోగించారు. గతేడాది ఈఎంఐ వాటా 58 శాతంగా ఉంది. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌కు యువతరం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని, సగటున నాలుగు నెలల ఈఎంఐ వ్యవధి కాలాన్ని ఎంచుకున్నారని సర్వే తెలిపింది. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న 2 లక్షల మంది యంగ్ ఇండియన్స్ వ్యయ సరళిని విశ్లేషించింది. సెప్టెంబర్ నెలలో యంగ్‌స్టర్స్ ఖర్చు ఎక్కువగా చేశారని, ఇది కోవిడ్ ముందు కంటే ఎక్కువగా జరిగాయని స్లైస్ ఫౌండర్ అండ్ సీఈఓ రాజన్ బజాజ్ తెలిపారు. ప్రతి కస్టమర్ లావాదేవీలో 150 శాతం పెరుగుదల కనిపించిందన్నారు. స్లైస్ మొత్తం లావాదేవీల్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కలిపి 21 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఎన్నాడు లేనంతగా ఈ ఏడాది పండుగ సీజన్లో స్లైస్‌లో అత్యధిక లావాదేవీ పరిమాణాన్ని చూశామని ఆయన చెప్పారు. అమెజాన్‌లో 60 శాతం మంది వినియోగదారులు, 40 శాతం మంది ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేశారని తెలిపారు. మింత్ర, జబాంగ్ వంటి ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌తో కలిపి చూస్తే మాత్రం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మధ్య వరుసగా 45, 55 శాతం వినియోగదారులు షాపింగ్ చేశారు. -
వాట్సాప్‌లో ‘షాపింగ్ బటన్’.. ఎలా?
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సొంతమైన వాట్సాప్ మరో కీలక ఫీచర్‌ను లాంచ్ చేసింది.ఇటీవల పేమెంట్ సేవలను విజయవంతంగా ప్రారంభించిన వాట్సాప్ తాజాగా ఈ-కామర్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తూ యూజర్లకు శుభవార్త చెప్పింది. తమ ప్లాట్‌ఫాంపై షాపింగ్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు ప్రత్యేకంగా షాపింగ్ బటన్ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త ఫీచర్ ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభించింది. బిజినెస్ అకౌంట్స్ ఉన్న వాట్సాప్ యూజర్లు కేటలాగ్‌లో ఉన్న ప్రొడక్ట్స్‌ని ఓపెన్ చేసి నచ్చితే వెంటనే వాట్సప్‌లోనే కొనుగోలుచేయవచ్చని వాట్సాప్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది ఉత్పత్తులను కనుగొనడం సులభతరం చేస్తుందనీ, అలాగే అమ్మకాలను పెంచడానికి సహాయపడుతుందని పేర్కొంది. ఇప్పటివరకు బిజినెస్ ప్రొపైల్ ఓపెన్ చేసి తమకు నచ్చిన వస్తువు కేటలాగ్ లిస్ట్‌లో చెక్ చేసుకోవాల్సి వచ్చేంది. తాజాగా షాపింగ్ బటన్‌ను విడుదల చేసింది. ఈ షాపింగ్ బటన్ వాయిస్ కాల్ బటన్ స్థానంలో ఉంటుంది. అయితే వినియోగదారులు వాయిస్ లేదా వీడియో కాల్‌ను ఎంచుకోవడానికి కాల్ బటన్‌ను నొక్కాలి. తద్వారా వ్యాపారులు తమ సేల్స్ పెంచుకోవడానికి ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడుతుంది. వాట్సాప్ సమాచారం ప్రకారం ప్రస్తుతం రోజూ వాట్సప్ బిజినెస్ అకౌంట్లో 17.5 కోట్ల మంది మెసేజెస్ పంపిస్తున్నారు. దేశంలో 30 లక్షల మందితో సహా, ప్రతీ నెలలో 4 కోట్ల మంది బిజినెస్ క్యాటలాగ్ చూస్తున్నారు. -
‘ఆలీబాబా’కు అద్భుత లాభాలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచంలో పలు దేశాల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అవడంతోపాటు ఆ దేశాల ప్రజల ఆర్థిక పరిస్థితులు కూడా చిధ్రం అవడం మనకు తెల్సిందే. ఇందుకు భిన్నంగా అనతి కాలంలోనే చైనా తన దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోగా, అక్కడి కొందరు కుభేరులు అనూహ్యంగా అద్భుతమైన లాభాలు సాధించగా, మరో 257 మంది చైనా వాణిజ్యవేత్తలు బిలియనీర్ల జాబితాలో చేరిపోయారు. చైనాలోనే అత్యంత సంపన్నుడిగా ఖ్యాతి గడించిన జాక్ మాకు చెందిన ‘అలీబాబా’ ఈ కామర్స్ సంస్థ ప్రపంచంలో ఎవరూ ఊహించలేనంత ఏడాదిలో సంపాదించి కొత్త చరిత్రను సృష్టించింది. ఏడాదిలో 1.5 ట్రిలియన్ డాలర్ల (కోటాను కోట్ల రూపాయలు, అక్షరాల్లో చెప్పాలంటే 12 పక్కన 13 సున్నాలు) లాభాలను గడించి అలీబాబా కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఆయన మొత్తం ఆస్తిలో 45 శాతాన్ని ఏడాది లాభాల ద్వారానే సమకూరినట్లు ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. అలీబాబా ఈ కామర్స్ వ్యాపారం పెరగడానికి లాక్డౌన్లు, ఆంక్షలు బాగా పనికొచ్చాయి. కరోనా వైరస్ సంక్షోభ కాలంలో ఆరోగ్య సంరక్షణ రంగానికి చెందిన వారు కూడా కోట్లకు పడగలెత్తారు. వ్యాక్సిన్లను తయారు చేసే ఝిఫీ కంపెనీ వ్యవస్థాపకులు జియాంగ్ రెన్‌షెంగ్ ఆస్తులు కూడా ఏడాదిలో 19.9 బిలియన్ డాలర్లకు, అంటే మూడింతలు పెరిగాయి. కరోనా మహమ్మారి కారణంగా చైనా జీడీపీ రేటు మైనస్‌లోకి పడిపోతుందనుకోగా, ఈ ఏడాది జీడీపీ 4.9 శాతం ఉన్నట్లు సోమవారం విడుదలైన ఆర్థిక లెక్కలు తెలియజేస్తున్నాయి. ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్, జర్మనీ, బ్రిటన్ లాంటి దేశాల జీడీపీ రేట్లు మైనస్‌లో పడిపోగా, చైనా ఒక్కటే ప్లస్ వైపు దూసుకుపోవడం అద్భుతమే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు చైనానే కరోనా వైరస్‌ను ల్యాబ్‌లో సృష్టించిందన్న ఆరోపలు ప్రపంచవ్యాప్తంగా వినిపించాయి. అయితే అందుకు సాక్ష్యాధారాలు ఏ దేశమూ చూపలేక పోయింది. -
ఈడీ కస్టడీకి ‘కలర్ ప్రిడెక్షన్’ గ్యాంగ్
సాక్షి, రంగారెడ్డి: ఈ–కామర్స్ పేరుతో సంస్థల ముసుగులో భారీ బెట్టింగ్ గేమింగ్‌కు పాల్పడిన కలర్ ప్రివెక్షన్ కేసులో నిందితులుగా ఉన్న చైనా జాతీయుడు యాన్ హూ సహా ముగ్గురిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మంగళవారం కస్టడీలోకి తీసుకున్నారు. మల్టీ లెవల్ మార్కెటింగ్‌తోనూ ముడిపడి ఉన్న ఈ వ్యవహారం గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గత నెల 13న రట్టు చేశారు. దీనిపై ఈడీకి ఓ సమగ్రమైన లేఖ రాశారు. ఈ దందాలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగి ఉంటుందని అనుమానిస్తూ పూర్తి వివరాలను సమర్పించారు. వీటి ఆధారంగా ఈడీ ఈ నెల 15న యాన్ హూతో పాటు ఢిల్లీ వాసులు ధీరజ్ సర్కార్, అంకిత్ కపూర్‌లపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. (లాక్‌డౌన్‌లోనూ ‘పవర్’ ఫుల్ గేమ్! ) ఆధారాల సేకరణ కోసం ఢిల్లీ, గుర్గావ్, ముంబైల్లోని మొత్తం 15 ప్రాంతాల్లో ఈడీ దాడులు చేసి 17 హార్డ్ డిస్క్‌లు, 5 ల్యాప్‌టాప్‌లు, ఫోన్లతో పాటు అనేక పత్రాలను స్వాధీనం చేసుకుంది. చంచల్‌గూడ జైల్లో ఉన్న ఈ నిందితుల్ని తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారించిన కోర్టు ఎనిమిది రోజుల పాటు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వివిధ వెబ్సైట్ల ఆధారంగా దందా చేసిన దీని నిర్వాహకులు ఈ ఏడాది ఏడున్నర నెల్లోనే రూ.1100 కోట్లు టర్నోవర్ చేయడంతో పాటు రూ.110 కోట్లను విదేశాలకు తరలించేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఈడీ నిర్ణయించింది. చైనాకు చెందిన బీజింగ్ టి పవర్ సంస్థ సౌత్ఈస్ట్ ఏషియా ఆపరేషన్స్ హెడ్‌గా యాన్ హూ పని చేస్తున్నాడు. గుర్గావ్ కేంద్రంగా వ్యవహారాలు నడుపుతున్న ఇతగాడు ఢిల్లీ వాసులు ధీరజ్ సర్కార్, అంకిత్ కపూర్ తదితరులను డైరెక్టర్లుగా ఏర్పాటు చేసుకున్నాడు. వీరంతా కలిసి ఈ–కామర్స్ సంస్థల ముసుగులో గ్రోవింగ్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, సిలీ కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, పాన్ యన్ టెక్నాలజీస్ సర్వీస్, లింక్‌యన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, డాకీపే ప్రైవేట్ లిమిటెడ్, స్పాట్‌పే ప్రైవేట్ లిమిటెడ్, డైసీలింగ్ ఫైనాన్షియల్ ప్రైవేట్ లిమిటెడ్, హువాహు ఫైనాన్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆర్‌ఓసీలో రిజిస్టర్ చేశారు. ఇవన్నీ కూడా ఆన్లైన్లో వివిధ ఈ–కామర్స్ వెబ్సైట్లు నడుపుతున్నాయి. వీటి ముసుగులో కలర్ ప్రిడెక్షన్ గేమ్‌ను వ్యవస్థీకృతంగా సాగించారు. ఈ గేమ్‌కు సంబంధించిన పేమెంట్ గేట్ వే అయిన పేటీఎం, గూగుల్ పేల ద్వారా లావాదేవీలు జరిగాయి. బెట్టింగ్‌కు సంబంధించిన డబ్బు డాకీ పే, లింక్ యన్ సంస్థలకు వెళ్ళింది. అక్కడ నుంచి హెచ్ఎస్బీసీ బ్యాంకు ఖాతాలోకి వెళ్ళినట్లు ఈడీ అధికారులు చెప్తున్నారు. ఇది అంతర్జాతీయ బ్యాంకు కావడంతో ఆ ఖాతాల్లోని నగదు హంకాంగ్, సింగపూర్‌ల్లోని కొన్ని ఖాతాల్లోకి మళ్ళినట్లు తేల్చారు. ఇలా రూ.1100 కోట్ల టర్నోవర్‌లో రూ.110 కోట్లు వెళ్ళినట్లు ఆధారాలు లభించాయి. మిగిలిన మొత్తం కూడా విదేశాలకే తరలించేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే హెచ్ఎస్బీసీ బ్యాంకులోని నాలుగు ఖాతాల్లో ఉన్న రూ.46.96 కోట్లను ఈడీ ్రïఫీజ్ చేసింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్‌ను నిగ్గు తేల్చడానికి ఈడీ రంగంలోకి దిగింది. నిందితుల విచారణలో దీనికి సంబంధించి వివరాలు లభిస్తాయని అధికారులు చెప్తున్నారు. -
అమెజాన్ ఇక తెలుగులో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్.ఇన్ తాజాగా తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, తమిళంలోనూ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఈ పోర్టల్ ఇంగ్లిష్, హిందీలో సేవలు అందిస్తోంది. ఆన్లైన్ షాపింగ్‌లో కస్టమర్లకు భాషాపరమైన అడ్డంకులను తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ మంగళవారం ప్రకటించింది. రానున్న పండుగల సీజన్లో మరో 20–30 కోట్ల మంది వినియోగదార్లను చేరుకోవడానికి ఇది దోహదం చేస్తుందని వివరించింది. కస్టమర్లు తమకు అనువైన భాషలో డీల్స్, డిస్కౌంట్లను తెలుసుకోవడం, ఉత్పత్తుల సమాచారం చదువుకోవడం, ఖాతాల నిర్వహణ, ఆర్డర్లు, చెల్లింపులు జరిపేందుకు మార్గం సుగమం అయిందని అమెజాన్ కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్, మార్కెటింగ్ డైరెక్టర్ కిశోర్ తోట ఈ సందర్భంగా తెలిపారు. నాలుగు భాషల చేరిక గొప్ప మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ యాప్స్, మొబైల్, డెస్క్‌టాప్ సైట్స్‌లో వినియోగదార్లు తమకు నచ్చిన భాషను ఎంచుకోవచ్చు. కస్టమర్ సర్వీసు సిబ్బందితో తెలుగుతోపాటు ఇంగ్లిష్, హిందీ, కన్నడ, తమిళంలో మాట్లాడవచ్చు. -
ఈసారి ఈ–కామర్స్‌కు పండుగే..!
న్యూఢిల్లీ: ఈ ఏడాది పండుగ సీజన్ ఈ కామర్స్ కంపెనీల సంబరాలను రెట్టింపు చేసే అవకాశం ఉంది. ఈసారి ఆన్లైన్ అమ్మకాలు రెండింతలు ఉండొచ్చని రెడ్‌సీర్ రీసెర్చ్ నివేదిక చెబుతోంది. గతేడాది ఈ–కామర్స్ కంపెనీలు సాధించిన గ్రాస్ మర్చండైజ్ వాల్యూ(జీఎంవీ) 3.8 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఈ ఏడాది జీఎంవీ 7 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చని నివేదిక సర్వే అంచనా వేసింది. ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ ద్వారా జరిగే లావాదేవీల స్థూల విలువను జీఎంవీగా పిలుస్తారు. ఆన్లైన్ కొనుగోళ్లకు డిమాండ్ ఇందుకే.. కోవిడ్–19 తర్వాత కస్టమర్లు గతంలో కంటే సురక్షితమైన, శుభ్రమైన, సౌకర్యవంతమైన రీతిలో షాపింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ కామర్స్ సంస్థలు అలాంటి సదుపాయాల కల్పనను సిద్ధం చేసుకున్నాయి. ఇందులో భాగంగా వీడియో, వాట్సాప్ ఆధారిత షాపింగ్ విధానంతో ఈ కామర్స్ కంపెనీలు కొత్త షాపింగ్ విధానానికి తెరతీశాయి. మా సర్వేలో అధిక శాతం కస్టమర్లు ఆన్లైన్ కొనుగోళ్లకే మొగ్గుచూపుతున్నారు’’ అని రీసెర్చ్ సంస్థ తెలిపింది. కస్టమర్లను ఆకర్షిస్తున్న ఆఫర్లు.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్, షాప్‌క్లూస్ వంటి ఈ కామర్స్ సంస్థలు ఉత్పత్తులను భారీ ఆఫర్లను ప్రకటించి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఫలితంగా ఈ ఏడాది పండుగ సీజన్ తొలి రోజుల్లోనే గతేడాది మొత్తం ఆన్లైన్ కస్టమర్ల సంఖ్యను అధిగమించవచ్చని సర్వే అంచనా వేస్తుంది. కోవిడ్–19తో పెరిగిన డిజిటల్ లావాదేవీలు: మాల్స్, రిటైల్ అవుట్‌లుక్ లాంటి అధిక సంచారం కలిగిన ప్రాంతాలకు వెళ్లి షాపింగ్ చేసేందుకు ఇప్పటికీ ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. ఫలితంగా ఆఫ్‌లైన్ అమ్మకాల రికవరీ ఇంకా బలహీనంగా నే ఉన్నట్లు సర్వే తెలిపింది. కిందటేడాది ఆన్లైన్ ద్వారా 40–50 మిలియన్ మంది షాపింగ్ చేశారు. కోవిడ్–19 డిజిటల్ లావాదేవీలను మరింత పుంజుకునేలా చేసింది. సంప్రదాయ ఆఫ్‌లైన్ వినియోగదారుల్ని, ఆన్‌లైన్‌కు మళ్లించింది. ఫలితంగా ఈ పండుగ సీజన్లో ఆన్లైన్ వినియోగదారులు ఏకంగా 70శాతం పెరిగే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. సర్వేలో మరికొన్ని అంశాలు.. బలమైన జాతీయవాద మనోభావంతో కేంద్రం ఇచ్చిన ఆత్మనిర్భర్ నినాదంతో ఎలక్ట్రానిక్స్, మొబైల్ వంటి విభాగాల్లో కస్టమర్లు ‘‘బ్రాండ్’’ను పెద్దగా పట్టించుకోవడంలేదని సర్వే తెలిపింది. లాక్‌డౌన్‌తో ఉత్పత్తి ఆగిపోవడంతో మొబైల్, అప్లికేషన్లు గతేడాదితో పోలిస్తే డిమాండ్ కాస్త తక్కువగా ఉంటుందని సర్వే అంచనా వేసింది. గృహోపకరణాలకు డిమాండ్ ఉంటుదని సర్వే చెబుతోంది. -
నాలుగు ఆకుల కోసం రూ. 4 లక్షలు
వెలింగ్టన్: ఉదాహరణకు మన దగ్గర ఓ నాలుగు లక్షల రూపాయలు ఉన్నాయనుకోండి.. ఏం చేస్తాం. కారు తీసుకుంటాం.. లేదా తక్కువకు దొరికితే ల్యాండ్ తీసుకుంటాం.. అది కాదంటే విహారయాత్రకు వెళ్తాం. జాగ్రత్తపరులైతే.. బ్యాంకులో ఫిక్స్డ్ చేస్తారు. అంతేకానీ ఆ మొత్తం డబ్బుతో మొక్కలను మాత్రం కొనం. అది కూడా కేవలం నాలుగంటే నాలుగే ఆకులున్న మొక్కను అస్సలే కొనం. కానీ న్యూజిలాండ్‌కు చెందిన ఓ అజ్ఞాత వ్యక్తి మాత్రం నాలుగు ఆకులున్న ఓ అరుదైన జాతి మొక్కను అక్షరాల నాలుగు లక్షలు చెల్లించి కొన్నాడు. వినడానికి కాస్తా విడ్డూరంగా ఉన్నా ఇది మాత్రం వాస్తవం. మరి అంత ఖరీదైన ఆ మొక్క కథేంటో చూడండి. ప్రత్యేకమైన రంగు ఉండే అరుదైన జాతి ఫిలోడెండ్రాన్ మినిమా మొక్కను ఒక దాన్ని న్యూజిలాండ్‌కు చెందిన ఈ కామర్స్ వెబ్సైట్ ‘ట్రేడ్ మి’ వేలానికి ఉంచింది. ఈ నేపథ్యంలో ఈ మొక్క కోసం ఏకంగా చిన్నపాటి యుద్ధమే జరగింది. చివరకు ఓ అజ్ఞాత వ్యక్తి దానికి నాలుగు లక్షల రూపాయలు చెల్లించి సొంతం చేసుకున్నాడు. అనంతరం ఆ మొక్క ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ మొక్కలోని నాలుగు ఆకులు అద్భుతమైన పసుపు రంగులో ఆకర్షణీయంగా ఉన్నాయంటూ సంతోషాన్ని పంచుకున్నాడు. రంగులేని మొక్కల కంటే రంగురంగుల మొక్కలు చాలా అరుదుగా, నెమ్మదిగా పెరుగుతాయని న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ఇవి చాలా అరుదుగా సహజంగా సంభవిస్తాయి కనుక వీటిని ఎక్కువగా ఉద్యాన శాస్త్రవేత్తలు, కలెక్టర్లు కోరుకుంటారని తెలిపారు. (చదవండి: ముక్కులో ఇరుక్కున్న చెయ్యి: రెండేళ్ల తర్వాత..) ‘ఈ మొక్కలోని ఆకుపచ్చ రంగు సాధారణంగా ఇతర చెట్లల్లో కిరణజన్య సంయోగక్రియను అనుమతిస్తుంది. అంతేకాక దీని కాండం మీద కొత్త ఆకులు వస్తాయనే హామీ ఇవ్వలేము’ అన్నారు శాస్త్రవేత్తలు. ‘ఈ మొక్క కోసం ఇంత డబ్బు ఖర్చు చేసిన వ్యక్తి దాని విలువ పూర్తిగా తెలిసే ఉంటుంది. భవిష్యత్తులో వీటిని ప్రచారం చేయడానికి, అమ్మి లాభాలు పొందడానికి ఇప్పుడు ఇంత భారీగా వెచ్చించాడని మా అభిప్రాయం అన్నారు’ శాస్త్రవేత్తలు. ఇక ఆ అజ్ఞాత కొనుగోలుదారుడు రేడియో న్యూజిలాండ్‌తో మాట్లాడుతూ ‘ఉష్ణమండల స్వర్గం’ కోసం ఈ మొక్కను సొంతం చేసుకున్నట్లు తెలిపాడు. -
నమ్మినందుకు ‘డైరెక్టర్’ని చేశాడు, ఇంకేముంది
సాక్షి, హైదరాబాద్: ఈ–కామర్స్ వెబ్‌సైట్స్ ముసుగులో కలర్ ప్రిడిక్షన్ గేమ్ పేరుతో భారీ బెట్టింగ్ దందాకు పాల్పడిన చైనాకు చెందిన బీజింగ్ టీ పవర్ సంస్థ.. డైరెక్టర్ల ఎంపికలోనూ పథకం ప్రకారం వ్యవహరించింది. తమకు అనుబంధంగా ఏర్పడిన కంపెనీల్లో డమ్మీ డైరెక్టర్లను ఏర్పాటు చేసుకుంది. నగర సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న నీరజ్ తులీ విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీజింగ్ టీ పవర్ సంస్థ సౌత్ ఈస్ట్ ఏషియా ఆపరేషన్స్ హెడ్‌గా వ్యవహరించిన యాన్ హో ఢిల్లీకి చెందిన హేమంత్‌ను ఆడిటర్‌గా నియమించుకున్నాడు. అయితే ఎక్కడా అధికారికంగా రికార్డుల్లో దీన్ని పొందుపరచలేదు. ఇతడి సహకారంతోనే ఢిల్లీలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో పలు సంస్థల్ని రిజిస్టర్ చేయించాడు. వీటిలో 90 శాతం మంది చైనీయులు డైరెక్టర్లుగా ఉండగా.. పది శాతం మంది మాత్రం ఢిల్లీ, గుర్గావ్ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. (చదవండి: కలర్ ప్రిడెక్షన్.. మనీ లాండరింగ్!) కిరాణ దుకాణం నిర్వాహకుడూ డైరెక్టరే.. ఢిల్లీలోని కరోల్‌బాగ్ ప్రాంతానికి చెందిన చిన్న కిరాణ దుకాణం నిర్వాహకుడు నీరజ్ తులీ ఓ నాలుగు కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్నాడు. ఈ విషయం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెళ్లి పట్టుకునే వరకు అతడికే తెలీదు. కలర్ ప్రిడిక్షన్ గేమింగ్ యాప్ గుట్టురట్టు చేసిన అధికారులు యాన్ హో, ధీరజ్ సర్కార్, అంకిత్ కపూర్లతో పాటు ఇతడినీ అదుపులోకి తీసుకోవడంతో షాక్‌కు గురయ్యాడు. కలర్ ప్రిడిక్షన్ ఏమిటో, ఆ చైనా సంస్థ ఏమిటో, బీజింగ్ టి పవర్ కంపెనీ ఏమిటో... తనకు తెలియదంటూ లబోదిబోమన్నాడు. తన ఇంటికి సమీపంలో ఉండే హేమంత్ అనే చార్టెడ్ అకౌంటెంట్ తనకు ఆడిటింగ్ చేస్తుండేవాడని చెప్పాడు. గతంలో ఆడిటింగ్‌కు అవసరం అంటూ కొన్ని పత్రాలపై సంతకాలు తీసుకున్నాడని, నో యువర్ కస్టమర్ (కేవైసీ) దాఖలు చేయాలంటూ గుర్తింపు పత్రాలు తీసుకువెళ్లాడని వెల్లడించాడు. వీటి ఆధారంగా నాలుగు కంపెనీల్లో తులీని డైరెక్టర్‌గా చేసిన హేమంత్ తన ఫోన్ నంబర్, ఈ–మెయిల్ అడ్రస్‌లు అందులో పొందుపరిచాడు. తులీ పేరుతో ఇతడే ఆయా కంపెనీల కార్యకలాపాలు సాగించేవాడని తేలింది. ఇలానే మరికొందరు డమ్మీ డైరెక్టర్లను ఏర్పాటు చేసుకుని, చైనీయులకు అనుకూలంగా బోర్డు తీర్మానాలు చేసినట్లు అధికారులు అనుమానిస్తూ ఆ కోణంలో ఆరా తీస్తున్నారు. తులీతోపాటు మరో ముగ్గురినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు తులీకి సీఆర్పీసీ 41 ఏ కింద నోటీసులు జారీ చేశారు. పరారీలో ప్రధాన నిందితుడు హేమంత్... యాన్ హో తదితరులు అరెస్టుతో అప్రమత్తమైన హేమంత్ కరోల్‌బాగ్‌లోని అతడి ఇంటికి తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ కేసు వివరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్మెంట్లతోపాటు సీబీఐ, కేంద్ర హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖలకు నగర పోలీసులు అందించారు. ఆయా కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్న చైనీయులపై అన్ని విమానాశ్రయాలకు లుక్ఔట్ సర్క్యులర్లు జారీ చేయాలని నిర్ణయించారు. తదుపరి విచారణ కోసం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితుల్ని తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. (ఈ గేమ్ ఆడితే ‘రంగు’ పడుద్ది!) -
కలర్ ప్రిడెక్షన్.. మనీ లాండరింగ్!
సాక్షి, సిటీబ్యూరో: ఈ– కామర్స్ సంస్థల ముసుగులో భారీ బెట్టింగ్ గేమింగ్‌కు పాల్పడిన కలర్ ప్రిడెక్షన్ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు (ఈడీ) లేఖ రాయాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఈ దందాలో పెద్దయెత్తున మనీ లాండరింగ్ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. వివిధ వెబ్సైట్ల ఆధారంగా దందా చేసిన దీని నిర్వాహకులు ఈ ఏడాది ఏడున్నర నెల్లోనే రూ.1100 కోట్లు టర్నోవర్ చేయడంతో పాటు రూ.110 కోట్లను విదేశాలకు తరలించేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా నగర పోలీసులు ఈడీని కోరనున్నారు. చైనాకు చెందిన బీజింగ్ టీ పవర్ సంస్థ సౌత్ఈస్ట్ ఏషియా ఆపరేషన్స్ హెడ్‌గా తమ జాతీయుడు యా హౌను నియమించింది. గుర్గావ్ కేంద్రంగా వ్యవహారాలు నడుపుతున్న ఇతగాడు ఢిల్లీ వాసులు ధీరజ్ సర్కార్, అంకిత్ కపూర్, నీరజ్ తులేలను డైరెక్టర్లుగా ఏర్పాటు చేసుకున్నాడు. వీరంతా కలిసి ఈ– కామర్స్ సంస్థల ముసుగులో గ్రోవింగ్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, సిలీ కన్సల్టింగ్ సర్వీసెస్, పాన్ యన్ టెక్నాలజీస్ సర్వీస్, లింక్‌యన్ టెక్నాలజీ, డాకీపే, స్పాట్‌పే, డైసీలింగ్ ఫైనాన్షియల్, హువాహు ఫైనాన్షియల్ ప్రైవేట్ లిమిటెడ్‌ల పేర్లతో ఆర్‌ఓసీలో రిజిస్టర్ చేశారు. ఇవన్నీ కూడా ఆన్లైన్లో వివిధ ఈ– కామర్స్ వెబ్సైట్లు నడుపుతున్నాయి. వీటి ముసుగులో కలర్ ప్రిడెక్షన్ గేమ్‌ను వ్యవస్థీకృతంగా సాగిస్తున్నారు. ఈ గేమ్‌కు సంబంధించిన పేమెంట్ గేట్ వే అయిన పేటీఎం, గూగుల్ పే ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో నెట్‌బ్యాంకింగ్ ద్వారానూ చేపట్టారు. బెట్టింగ్‌కు సంబంధించిన తొలుత డాకీ పే సంస్థకు వెళుతోంది. అక్కడి నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాలోకి వెళ్లినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఇది అంతర్జాతీయ బ్యాంకు కావడంతో ఆ ఖాతాల్లోని నగదు హాంకాంగ్, సింగపూర్‌ల్లోని కొన్ని ఖాతాల్లోకి మళ్లినట్లు తేల్చారు. ఇలా రూ.1100 కోట్ల టర్నోవర్‌లో రూ.110 కోట్లు వెళ్లినట్లు ఆధారాలు లభించాయి. మిగిలిన మొత్తం కూడా విదేశాలకే తరలించేసి ఉంటారని సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. వివిధ మార్గాల్లో ఈ నగదు బీజింగ్ టీ పవర్ సంస్థ చేరినట్లు భావిస్తున్నారు. ఈ వ్యవహారాల నిగ్గు తేల్చడానికి ఈడీ రంగంలోకి దిగాల్సి ఉంది. ఈ మేరకు ఎఫ్ఐఆర్తో పాటు ఇతర పత్రాలను అందిస్తూ ఈడీకి లేఖ రాస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేసిన నలుగురు నిందితుల్నీ కస్టడీలోకి తీసుకుని విచారణ చేయనున్నారు. ఆ తర్వాతే సమగ్ర వివరాలతో ఈడీకి అధికారికంగా సమాచారం ఇవ్వనున్నారు. -
90 నిమిషాల్లో డెలివరీ!
సాక్షి, బెంగళూరు : ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ 90 నిమిషాల్లో డెలివరీ సేవలను మరోసారి అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ఫ్లిప్‌కార్ట్ క్విక్’ పేరుతో బెంగళూరులో 90 నిమిషాల డెలివరీని తాజాగా ప్రారంభించింది. త్వరలోనే మరో 6 నగరాలకు ఈ సేవలను విస్తరించాలని యోచిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ క్విక్లో కిరాణా, ఫ్రెష్, డెయిరీ, మీట్, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ యాక్సెసరీస్, స్టేషనరీ ఐటమ్స్, హోమ్ యాక్సెసరీస్ వంటి విభాగాలలో దాదాపు 2 వేలకు పైగా ఉత్పత్తులు మొదటి దశలో అందుబాటులో ఉంటాయి. ఈ కామర్స్ రంగంలోభారీగా పోటీ నెలకొన్న నేపథ్యంలో వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. వినియోగదారులు 90 నిమిషాల్లో ఆర్డర్ చేయడానికి లేదా 2 గంటల స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు. రోజులో ఎప్పుడైనా ఆర్డర్లు ఇవ్వవచ్చు. ఉదయం 6 నుండి అర్ధరాత్రి మధ్య డెలివరీ ఉంటుంది. కనీస డెలివరీ ఫీజు 29 రూపాయలతో ప్రారంభమవుతుంది. ఇది భారతదేశానికి ఒక గొప్ప మోడల్, స్థానిక కిరాణా దుకాణాలకు ప్రోత్సాహంతోపాటు, కొత్త వ్యాపార వ్యూహాలు, ఒప్పందాలకు అవకాశం కల్పిస్తుందని ఫ్లిప్‌కార్ట్ ఉపాధ్యక్షుడు సందీప్ కార్వా అన్నారు. ఫ్లిప్‌కార్ట్ నియర్ బై పేరుతో 90 నిమిషాల కిరాణా డెలివరీ సేవను 2015 లో పరీక్షించింది. అయితే పెద్దగా ఆదరణ లభించకపోవడంతో ప్రారంభించిన నాలుగు నెలల్లోనే 2016ల రద్దు చేసింది. కాగా కరోనా వైరస్, లాక్డౌన్ సంక్షోభ కాలంలో ఆన్లైన్ సేవలకు విపరీతమైన డిమాండ్ కారణంగా వినియోగదారులకు ఆకర్షించేందుకు ఫ్లిప్‌కార్ట్ సరికొత్త ఆవిష్కరణలను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. -
ఈ-కామర్స్ జోష్
న్యూఢిల్లీ: దేశీయంగా ఈ–కామర్స్ వ్యాపారం వేగంగా వృద్ధి చెందుతోంది. 2024 నాటికి 27 శాతం వార్షిక వృద్ధి రేటుతో 99 బిలియన్ డాలర్లకు చేరనుంది. ఫేస్‌బుక్‌తో భాగస్వామ్యం కారణంగా ఆన్లైన్లో నిత్యావసరాల విక్రయాల్లో దాదాపు సగం వాటా రిలయన్స్ ఇండస్ట్రీస్‌దే ఉండనుంది. గోల్డ్‌మన్ శాక్స్ రూపొందించిన ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కరోనా వైరస్ పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా ఈ–కామర్స్ వ్యాపార కార్యకలాపాలు మరింత జోరు అందుకున్నాయని నివేదిక పేర్కొంది. ‘2019–24 మధ్య భారత్‌లో ఈ–కామర్స్ వ్యాపారం 27 శాతం వార్షిక వృద్ధితో 2024 నాటికి 99 బిలియన్ డాలర్లకు చేరుతుంది. నిత్యావసరాలు, ఫ్యాషన్/దుస్తులు మొదలైనవి ఈ వృద్ధికి తోడ్పడతాయి‘ అని వివరించింది. ‘రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ–కామర్స్‌లోకి అడుగుపెట్టడం, ఆన్లైన్లో నిత్యావసరాల విక్రయానికి వాట్సాప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం సమీప భవిష్యత్‌లో గణనీయంగా ప్రబావం చూపే అంశం‘ అని గోల్డ్‌మన్ శాక్స్ తెలిపింది. 2019లో ఆన్లైన్ గ్రాసరీ విభాగంలో బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్ వాటా 80 శాతం పైగా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్బుక్ 9.99 శాతం వాటాలు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆన్లైన్ గ్రాసరీ 81 శాతం వృద్ధి .. గడిచిన కొన్నాళ్లుగా ఆన్లైన్ గ్రాసరీ విభాగం 50 శాతం వార్షిక వృద్ధి నమోదు చేస్తుండగా.. కరోనా వైరస్ పరిణామాలు, రిలయన్స్ ఎంట్రీ కారణంగా 2019–24 మధ్య కాలంలో ఏకంగా 81 శాతం వార్షిక వృద్ధి నమోదు చేయొచ్చని గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. ‘ఫేస్‌బుక్‌తో భాగస్వామ్యం కారణంగా ఆన్లైన్ గ్రాసరీ విభాగంలో 2024 నాటికి 50 శాతం పైగా వాటాతో రిలయన్స్ మార్కెట్ లీడరుగా ఎదిగే అవకాశం ఉంది. రెండు.. అంతకు మించిన సంఖ్యలో సంస్థలు ఈ విభాగంలో కార్యకలాపాలను సాగించేందుకు పుష్కలమైన వ్యాపార అవకాశాలు ఉన్నాయి‘ అని వివరించింది. నిత్యావసరయేతర ఈ–కామర్స్ వినియోగం వచ్చే రెండేళ్లలో 500 బేసిస్ పాయింట్ల మేర పెరగొచ్చని, 2021 నాటికి 16.1 శాతానికి చేరవచ్చని పేర్కొంది. దేశీయంగా నిత్యావసరాల మార్కెట్ 2019లో 380 బిలియన్ డాలర్లుగా ఉంది. మొత్తం రిటైల్ మార్కెట్లో దీని వాటా దాదాపు 60 శాతం ఉంటుంది. అయితే, ఆన్లైన్ అమ్మకాలు మాత్రం కేవలం 2 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటున్నాయి. ప్రస్తుతం ఈ–కామర్స్ ఊపందుకుంటున్న నేపథ్యంలో ఆన్లైన్ గ్రాసరీ మార్కెట్ వచ్చే అయిదేళ్లలో 29 బిలియన్ డాలర్లకు పెరగవచ్చని గోల్డ్‌మన్ శాక్స్ తెలిపింది. 2019లో ఆన్లైన్ గ్రాసరీ ఆర్డర్లు రోజుకు 3,00,000 స్థాయిలో ఉండగా.. 2024 నాటికి 50 లక్షలకు చేరవచ్చని పేర్కొంది. -
తయారీ ఎక్కడో చెప్పాల్సిందే
న్యూఢిల్లీ: ఏ దేశంలో ఉత్పత్తి తయారైందన్న సమాచారాన్ని తప్పనిసరిగా తెలియజేసే విధంగా (ఈ–కామర్స్ సంస్థలు/ఆన్లైన్ వేదికగా విక్రయించేవి) నూతన నిబంధనలు ఈ వారం చివరి నుంచి అమల్లోకి రానున్నట్టు కేంద్ర మంత్రి పాశ్వాన్ తెలిపారు. నిబంధనలు అమలు చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేశంలో నమోదైన అన్ని ఎల్రక్టానిక్ సంస్థలతోపాటు, విదేశాల నుంచి భారతీయ వినియోగదారులకు ఉత్పత్తులను ఆఫర్ చేసే సంస్థలకు కూడా ‘వినియోగదారు పరిరక్షణ నిబంధనలు, 2020’ వర్తిస్తాయని పాశ్వాన్ పేర్కొన్నారు. వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 కింద రూపొందించిన చాలా వరకు నిబంధనలు సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయని, ఈ– కామర్స్ నిబంధనలను వారం చివర్లో నోటిఫై చేయనున్నామని ఆయన తెలిపారు. ప్రత్యక్షంగా విక్రయించే దుకాణాలకు నిబంధనల అమలుకు సమయం పడుతుందన్నారు. కొత్త నిబంధనల కింద ఉత్పత్తి మొత్తం ధర, సేవలు, అన్ని రకాల చార్జీలు, రిటర్న్, రిఫండ్, ఎక్సేంజ్, వారంటీ, గ్యారంటీ, చెల్లింపుల విధానాలు, ఫిర్యాదుల పరిష్కారం వివరాలను విడిగా ప్రదర్శించాల్సి ఉంటుంది. ఉత్పత్తి ఏ దేశంలో తయారైంది, గడువు తీరే తేదీ వివరాలను కూడా ఇవ్వడం వల్ల వినియోగదారులు సరైన నిర్ణయం తీసుకునేందుకు వీలుంటుందని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశంగా ఉంది. ఒకవేళ ఆర్డర్ చేసిన తర్వాత వినియోగదారుడు మనసు మార్చుకుని దాన్ని రద్దు చేసుకుంటే ఎటువంటి చార్జీలను విధించకూడదు. ఇలా రద్దు చేయడం వల్ల ఈ కామర్స్ సంస్థపై చార్జీల భారం పడనప్పుడే ఈ నిబంధన వర్తిస్తుంది. -
గూగుల్, అమెజాన్‌లకు చెక్
సాక్షి, న్యూఢిల్లీ : స్ధానిక స్టార్టప్‌లకు ఊతమివ్వడం, ఈ కామర్స్ నియంత్రణ సంస్థ ఏర్పాటు వంటి అంశాలతో ఈ కామర్స్ విధానానికి కేంద్ర ప్రభుత్వం తుదిమెరుగులు దిద్దుతోంది. అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాల ప్రాబల్యానికి ముకుతాడు వేసేలా ఈకామర్స్ ముసాయిదాకు ప్రభుత్వం తుదిరూపు ఇస్తోంది. నూతన నిబంధనల ప్రకారం ఈ కామర్స్ కంపెనీలు 72 గంటల్లోగా ప్రభుత్వం కోరిన డేటాను అందుబాటులోకి తీసుకురావాలి. జాతీయ భద్రత, పన్నులు, శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై సత్వరమే ఆయా సంస్థలు సమాచారం అందించాల్సి ఉంటుంది. సమాచార వనరులు అందరికీ అందుబాటులోకి తీసుకువస్తూ పరిశ్రమలో పోటీయుత వాతావరణం నెలకొనేలా ఈ కామర్స్ రెగ్యులేటర్‌ను నియమించనున్నట్టు 15 పేజీలతో కూడిన ఈ ముసాయిదాలో ప్రభుత్వం పేర్కొందని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. విధాన ముసాయిదాను వాణిజ్య మంత్రిత్వ శాఖ రూపొందించింది. ముసాయిదాలో పొందుపరిచిన ప్రతిపాదిత నియమాలు ఆన్లైన్ కంపెనీల సోర్స్ కోడ్లు మరియు అల్గారిథమ్‌లను ప్రభుత్వం పర్యవేక్షించే వెసులుబాటును కల్పిస్తుంది. ఈ-కామర్స్ వ్యాపారాలకు వివరించదగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నదో..లేదో తెలుసుకునే అవకాశాన్నీ ముసాయిదా ప్రస్తావించనుంది. 50 కోట్ల యూజర్లతో దేశ డిజిటల్ ఎకానమీ ఎదుగుతున్న క్రమంలో ఆన్లైన్ రిటైల్ నుంచి కంటెంట్ స్ట్రీమింగ్, డిజిటల్ చెల్లింపుల వరకూ ప్రతి రంగంలో గ్లోబల్ దిగ్గజాల ప్రాబల్యం పెరిగిపోగా స్ధానిక స్టార్టప్‌లు ప్రభుత్వ సాయం కోసం అభ్యర్థిస్తున్నాయి.ప్రభుత్వం ఇటీవల చైనా యాప్‌లను నిషేధించిన క్రమంలో దేశీ కంపెనీలు ఈ రంగంలో ఎదిగేందుకు ప్రభుత్వ ప్రోత్సాహాన్ని కోరుతున్నాయి. విదేశీ సాంకేతిక దిగ్గజాలను నియంత్రించేలా రూపొందిన ఈ కామర్స్ విధాన ముసాయిదాను త్వరలో ప్రజాభిప్రాయం కోసం ప్రభుత్వ వెబ్సైట్లో పొందుపరచనున్నారు. డిజిటల్ గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ భారత వినియోగదారునికి, స్ధానిక ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చేలా ముసాయిదా విధానం రూపొందింది. చదవండి : అమెజాన్‌లో వారికి భారీ ఊరట -
సైబర్ యుగంలో స్వాహాల పర్వం
సాక్షి, సిటీబ్యూరో : నగరంలో రోజు రోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. లక్షల రూపాయలు పోగొట్టుకున్న బాధితులు పోలీసులు ఆశ్రయిస్తున్నారు. సోమవారం ఐదుగురు బాధితులు వేర్వేరుగా ఆశ్రయించారు. వీరిలో నలుగురు వ్యక్తులు, ఓ సంస్థ ఉంది. వీటి ఆధారంగా కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. ►ఖైరతాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాము రాజ్ ఫౌండేషన్ నుంచి మాట్లాడుతున్నామంటూ అవతలి వ్యక్తులు చెప్పారు. తాము నిర్వహించిన లక్కీ డ్రాలో రూ.7 లక్షలు మీకు వచ్చాయని ఎర వేశారు. దీనికి నగర యువకుడు ఆసక్తి చూపడంతో ఆ డబ్బు పొందడానికి ముందుగా తమ ఫౌండేషన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆపై ఇన్‌కమ్‌ట్యాక్స్, జీఎస్టీ, ఇతర పన్నుల పేరుతో రూ.7 లక్షలు కాజేశారు. చివరకు తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ►ఓఎల్ఎక్స్లో ఉద్యోగ ప్రకటన చూసిన మోహన్ అనే యువకుడు అందులో ఉన్న నెంబర్‌కు సంప్రదించాడు. కోరిన ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఎర వేసిన అవతలి వ్యక్తులు ముందుగా తమ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. దీనికి మోహన్ అంగీకరించడంతో సెక్యూరిటీ డిపాజిట్ సహా వివిధ పేర్లతో రూ.1.04 లక్షలు కాజేశారు. ►నగరంలోని ఓ ప్రాంతంలో రాఘవేంద్ర టిఫిన్స్ నిర్వహించే కృష్ణమూర్తికి ఇటీవల ఫోన్ వచ్చింది. శంషాబాద్‌లో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో (ఐఓసీ) పని చేసే వారికి అల్పాహారం సరఫరా చేసే కాంట్రాక్ట్ ఇప్పిస్తామంటూ చెప్పారు. దీనికి సంబంధించిన టెండర్‌కు ఈఎండీ చెల్లించాలంటూ రూ.78 వేలు స్వాహా చేశారు. ఆ తర్వాత నేరగాళ్ళు తమ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ►ఫేస్‌బుక్‌లోని మార్కెట్ ప్లేస్‌లో సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనం విక్రయ ప్రకటన చూసిన లంగర్‌హౌస్‌కు చెందిన వ్యక్తి స్పందించాడు. అందులో ఉన్న నెంబర్‌కు ఫోన్ చేసి మాట్లాడాడు. వారి మాటల వల్లో పడి ఆన్లైన్లో రూ.58 వేలు చెల్లించి మోసపోయి సైబర్ కాప్స్‌కు ఫిర్యాదు చేశాడు. ►కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ–కామర్స్ సైట్ ట్రేడ్ ఇండియా.కామ్‌లో నాట్కో ఫార్మసీ ఉత్పత్తులు విక్రయిస్తున్నట్లు ప్రకటన పొందుపరిచారు. అందులో ఈ సంస్థ ఉప్పత్తి చేయని అబెమాక్సిల్బీ మందునూ జోడించారు. అయితే వాస్తవానికి ఈ ఔషధాన్ని ఎలీలిల్లీ కంపెనీ తయారు చేస్తుంది. దీనిపై అన్ని హక్కులు కేవలం ఈ సంస్థకు మాత్రమే ఉన్నాయి. ట్రేడ్ ఇండియా.కామ్‌లో ఈ ప్రకటన చూసిన అమెరికన్ సంస్థ నాట్కోపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ న్యాయస్థానం నుంచి నాట్కో సంస్థకు నోటీసులు రావడంతో కంగుతిని వివరాలు ఆరా తీసింది. దీంతో విషయం తెలిసి ఆ వెబ్సైట్లో ఉన్న ప్రకటనకు, తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆ ప్రకటనను ఎవరు పోస్ట్ చేశారో గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులపై కేసులు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతికంగా దర్యాప్తు చేపట్టారు. -
జియో మార్ట్ ఈ-కామర్స్ సేవలు షురూ
సాక్షి, హైదరాబాద్ : నిత్యవసర వస్తువుల కొనుగోలు కోసం ఆన్లైన్ సన్‌కు జియో మార్ట్ శ్రీకారం చుట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పెద్ద నగరాలు, చిన్న పట్టణాల్లో ప్రజలకు నిత్యావసర కిరాణా వస్తువులను ఆన్లైన్లో కొనుగోలు చేసేందుకు రిలయన్స్ రిటైల్ తన ఆన్లైన్ ఇ-కామర్స్ వేదిక ‘జియో మార్ట్’ ను శనివారం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఈ రెండు రాష్ట్రాల్లో తొలుత ఎంపిక చేసిన 30 పట్టణాల్లో జియో మార్ట్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు సంస్థ తెలియజేసింది. తెలంగాణలోని హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, బోధన్, ఖమ్మం, పాల్వంచ, మిర్యాలగూడ, సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి లలో జియో మార్ట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, చిత్తూరు, కాకినాడ, గుంటూరు, తిరుపతి, తాడేపల్లిగూడెం, తణుకు, కర్నూలు, వినుకొండ, ఉయ్యురు, అనంతపురం, నర్సరావుపేట, భీమవరం, విజయనగరంలో నివసించే వారు కిరాణా వంటి నిత్యావసర వస్తువులను జియో మార్ట్ నుంచి పొందవచ్చు. www.jiomart.com వెబ్సైట్ ద్వారా వినియోగదారులు తమ ప్రాంతంలో సర్వీసుల గురించి తెలుసుకోవచ్చు. ప్రజలకు తమకు అవసరమైన ఆహార, ఆహారేతర వస్తువులు, పండ్లు, కూరగాయలు, నూనెలు, పప్పులు లాంటి బ్రాండెడ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్, పానీయాలు, అంట్లు శుభ్రం చేసుకునేవి లాంటి వస్తువులను అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. వస్తువుల గరిష్ట అమ్మకం ధరకన్నా 5 శాతం తక్కువ ధరకు వస్తువులను అందిస్తామని సంస్థ పేర్కొంది. ఇక వస్తువుల డెలివరీ కూడా చెప్పిన గడువు కన్నా ముందుగానే తక్కువ సమయంలోనే డెలివరీ చేస్తామని తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ గడిచిన ఏజీఎంలో ఈ –కామర్స్ ఫ్లాట్‌ఫామ్ జియో మార్ట్ గురించి ముకేశ్ అంబానీ ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే దేశ వ్యాప్తంగా 200 నగరాలు, పట్టణాల్లో జియోమార్ట్ సేవలు ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అందుబాటులో తెచ్చింది. తర్వాత క్రమంలో మరిన్ని పట్టణాలు, నగరాలకు విస్తరిస్తామని జియోమార్ట్ ప్రకటించింది. చదవండి: జియో మార్ట్ వాట్సాప్ నంబరు ఇదే! -
అమెజాన్ కార్ట్‌లో ఎయిర్టెల్!!
న్యూఢిల్లీ: దేశీ టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌లో వాటాలు కొనుగోలు చేసే దిశగా అమెరికా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ కసరత్తు చేస్తోంది. సుమారు 5 శాతం వాటాలు కొనుగోలు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ప్రాథమిక స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్ విలువ సుమారు 2 బిలియన్ డాలర్లు ఉండొచ్చని వివరించాయి. రిలయన్స్ జియోకు దీటైన పోటీ ఇవ్వడానికి ఎయిర్‌టెల్‌కు ఈ పెట్టుబడులు ఉపయోగపడనున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. మొబైల్ ఆపరేటర్ కార్యకలాపాల నుంచి డిజిటల్ టెక్నాలజీ దిగ్గజంగా జియో రూపాంతరం చెందిందని, ఎయిర్టెల్ కూడా అదే విధంగా వృద్ధి చెందవచ్చని తెలిపాయి. 8–10% దాకా వాటాలపై దృష్టి.. ఎయిర్‌టెల్‌లో పెట్టుబడులకు సంబంధించి అమెజాన్ పలు అవకాశాలు పరిశీలిస్తోంది. సుమారు 8–10 దాకా కూడా వాటాలు కొనే అంశం కూడా ఇందులో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికైతే రెండు కంపెనీల మధ్య ప్రాథమిక స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, డీల్ నిబంధనలు మారొచ్చని, ఒప్పందం కుదరవచ్చని లేదా కుదరకపోనూ వచ్చని వివరించాయి. ఒకవేళ వాటాల కొనుగోలు ప్రతిపాదన విఫలమైనా ఇరు కంపెనీలు కలిసి పనిచేసేందుకు ఇతరత్రా మార్గాలు కూడా పరిశీలించవచ్చని పేర్కొన్నాయి. అమెజాన్ ఉత్పత్తులను భారతి కస్టమర్లకు చౌకగా అందించే విధమైన డీల్ సైతం వీటిలో ఉండవచ్చని వివరించాయి. దేశీ టెల్కోలపై టెక్ దిగ్గజాల దృష్టి.. గడిచిన కొన్నాళ్లుగా దేశీ టెలికం కంపెనీలపై అంతర్జాతీయ టెక్ దిగ్గజాల ఆసక్తి గణనీయంగా పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ వ్యాపార విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌తో ఫేస్బుక్ తదితర దిగ్గజ సంస్థలు గత ఆరు వారాల్లో సుమారు 10 బిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేశాయి. టెలికం సేవల సంస్థ జియో ఇందులో భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక మరో టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియాలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని టెక్నాలజీ దిగ్గజం గూగుల్ పరిశీలిస్తోందంటూ కూడా వార్తలు వచ్చాయి. దేశీ టెలికం రంగంలో జియో అగ్రస్థానంలో ఉండగా, వొడాఫోన్ ఐడియా రెండో స్థానంలో ఉంది. ఇక మూడో స్థానంలో ఉన్న ఎయిర్‌టెల్‌లో తాజాగా అమెజాన్ ఇన్వెస్ట్ చేయనుండటం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. వ్యాపార విస్తరణకు ఊతం.. భారత మార్కెట్‌ను అమెజాన్ కీలకమైనదిగా భావిస్తోంది. ఈ–కామర్స్ వ్యాపార కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు 6.5 బిలియన్ డాలర్లు పైగా ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో ఉంది. ఇప్పటికే వాయిస్–యాక్టివేటెడ్ స్పీకర్లు, వీడియో స్ట్రీమింగ్, క్లౌడ్ స్టోరేజీ మొదలైన సొంత ఉత్పత్తులు, సేవలు అందిస్తోంది. భారతి ఎయిర్‌టెల్‌తో డీల్ కుదిరిన పక్షంలో ఆ సంస్థ నెట్వర్క్ ద్వారా కూడా అమెజాన్ తన వ్యాపార కార్యకలాపాలు విస్తరించుకోవడానికి వీలు పడుతుంది. భారతికి ఉన్న విస్తృతమైన టెలికం ఫైబర్ నెట్వర్క్ ఊతం లభిస్తే తక్కువ ఖర్చుల్లోనే క్లౌడ్ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. రిలయన్స్ జియో ఇదే తరహాలో అజూర్ క్లౌడ్ ప్లాట్‌ఫాంను ఉపయోగించుకునేందుకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం. ఆఫ్‌లైన్ రిటైల్‌లో పాగా... ‘మా కస్టమర్లకు మరిన్ని కొత్త ఉత్పత్తులు, కంటెంట్, సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు వివిధ డిజిటల్, ఓటీటీ సంస్థలతో సాధారణంగానే సంప్రతింపులు జరుపుతుంటాం. అంతకుమించి ఇతరత్రా చర్చలేమీ జరపడం లేదు‘ అంటూ ఎయిర్టెల్ ప్రతినిధి స్పందించారు. అటు భవిష్యత్ ప్రణాళికల గురించి ఊహాగానాలపై తాము స్పందించబోమని అమెజాన్ ఇండియా ప్రతినిధి తెలిపారు. 2017లో అమెజాన్ నుంచి షాపర్స్ స్టాప్ రూ. 179 కోట్లు సమీకరించింది. ఇక 2018 సెప్టెంబర్‌లో ఆదిత్య బిర్లా రిటైల్‌కి చెందిన మోర్ స్టోర్స్‌లో విట్‌జిగ్ అడ్వైజరీ సర్వీసెస్ ద్వారా అమెజాన్ ఇన్వెస్ట్ చేసింది. గతేడాది ఫ్యూచర్ రిటైల్‌లో కూడా వాటాలు కొనుగోలు చేసింది. -
అమెజాన్‌లో 50,000 ఉద్యోగాలు
బెంగళూరు: దేశీ ఈ–కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఇండియా దేశవ్యాప్తంగా 50,000 మంది తాత్కాలిక ఉద్యోగులను నియమించుకోనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అనేక ఉత్పత్తులకు ఆన్లైన్ డిమాండ్ ఒక్కసారిగా ఊపందుకున్న నేపథ్యంలో గిడ్డంగి, డెలివరీ నెట్వర్క్ విభాగాల్లో సీజనల్ ఉద్యోగుల అవసరం ఉందని వెల్లడించింది. -
స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ఆన్లైన్ విక్రయాలకు అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ : మే 17 వరకూ లాక్డౌన్ పొడిగించినా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఆన్లైన్ ద్వారా నిత్యావసర సరుకులే కాకుండా ఆన్లైన్లో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వంటి ఇతర వస్తువుల విక్రయాలకు కూడా ప్రభుత్వం అనుమతించింది. ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్లైన్ ఫ్లాట్‌ఫాంల ద్వారా గతంలో నిత్యావసర సరుకుల డెలివరీకే గతంలో అనుమతించిన ప్రభుత్వం ఈసారి గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పూర్తిస్ధాయిలో ఈకామర్స్ సేవలకు అనుమతించింది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో నియంత్రణలను ప్రభుతత్వం సడలించడంతో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కొత్త ఫోన్లను లాంఛ్ చేసేందుకు సన్నద్ధమయ్యాయి. ఒన్‌ప్లస్ 8 సిరీస్ ఫోన్లను భారత్ మార్కెట్ల్ ఒన్‌ప్లస్ ఇప్పటికే లాంఛ్ చేయగా ఈ ఫోన్లు ఇప్పుడు అందుబాటులోకి రానున్నాయి. యాపిల్ సైతం భారత మార్కెట్లో తన ఐఫోన్ ఎస్ఈ ధరను రూ 42,990గా ప్రకటించింది. ఇక షియోమి తన ఎంఐ 10 సిరీస్, రెడ్మి కే 30 ప్రొ సిరీస్‌లు కూడా తమ ఉత్పత్తులను భారత మార్కెట్లో లాంఛ్ చేస్తాయని భావిస్తున్నారు. చదవండి : మే 17 వరకు లాక్డౌన్ పొడగింపు -
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు జియో మార్ట్ షాక్..
సాక్షి, న్యూఢిల్లీ: రిలయన్స్ జియోతో టెలికాం మార్కెట్లో సంచలనం రేపిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ఇక రిటైల్ ఇ-కామర్స్ సంస్థలకు షాక్ ఇవ్వనుంది. ముఖ్యంగా దేశంలో రీటైల్ వ్యాపార దిగ్గజాలు అమెజాన్ , వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ లాంటి సంస్థల వ్యాపారాన్ని దెబ్బకొట్టనుంది. ఈ ఏడాది జనవరిలో పైలట్ ప్రాజెక్టుగా మహారాష్ట్రలోని నవీ ముంబై, థానే కళ్యాణ్ ప్రాంతాల్లో ప్రవేశపెట్టిన ఆన్లైన్ గ్రాసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్ జియోమార్ట్ (దేశ్ కీ నయీ దుకాన్) ఇక దేశవ్యాప్తంగా తన సేవలను ప్రారంభించనుంది. జియో ప్లాట్‌ఫాం, రిలయన్స్ రిటైల్, వాట్సాప్ మధ్య కొత్త భాగస్వామ్యం ఫలితంగా, వినియోగదారులు తమ వాట్సాప్ ఉపయోగించి జియోమార్ట్‌తో సమీప కిరాణా దుకాణాల ద్వారా ఆన్ లైన్ చెల్లింపులతో ఇళ్లకు ఉత్పత్తులు, సేవలను పొందవచ్చని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. ఆఐఎల్ ఫేస్బుక్ మధ్య తాజాగా కుదిరిన రూ.43,574 కోట్ల అతి పెద్ద ఎఫ్‌డీఐ ఒప్పందంతో 2021 నాటికి రిలయన్స్ ను రుణ రహిత సంస్థగా రూపొందించాలన్న లక్ష్యంలో కీలక అడుగు పడిందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. (కొత్త ఉపాధి అవకాశాలు, కొత్త వ్యాపారాలు: అంబానీ) ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ రిలయన్స్‌కు చెందిన జియోమార్ట్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకోనుంది. స్థానిక,చిన్నకిరాణా దుకాణాలు ఆన్‌లైన్‌లోకి రానున్నాయి. వాట్సాప్ సేవలకు ప్రభుత్వ అనుమతి అనంతరం వాట్సాప్‌లో జియోమార్ట్ ద్వారా సరుకులను ఆర్డర్ చేసిన వినియోగదారులకు సమీపంలో ఉన్న వర్తకులే ఇళ్ల వద్దకు డెలివరీ చేస్తారు. చెల్లింపులు ఆన్లైన్లో పూర్తి చేయడంతో పాటు, పంపిణీ కూడా వేగవంతమవుంది. ఇందుకు గాను వాట్సాప్ ఇప్పటికే బీటా దశలో ఉన్న వాట్సాప్ పేమెంట్స్ సేవలను త్వరలో భారత్‌లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనుంది.(వాట్సాప్ యూజర్లకు శుభవార్త) దేశంలో ఇంకా విస్తృతంగా కార్యకలాపాలు ప్రారంభించకపోయినప్పటికీ ఇప్పటికే అనేక చిన్న వ్యాపారులు, కిరాణా షాపులను జియోమార్ట్ తన ప్లాట్‌ఫాంలో చేర్చుకుంది. అలాగే జియోఫోన్లలో ఇప్పటికే వాట్సాప్ ఇన్స్టెంట్ మెసేజ్ ఫీచర్ లాంచ్ చేసింది. 480 మిలియన్లకు పైగా వినియోగదారులతో చైనా తరువాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద డిజిటల్ మార్కెట్ ను సొంతం చేసుకున్న వాట్సాప్ ప్రధానంగా గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే వంటి కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వనుందని స్వయంగా ముకేశ్ అంబానీ బుధవారం నాటి సందేశంలో పేర్కొనడం గమనార్హం. కాగా ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరణ, లాక్డౌన్ నేపథ్యంలో ఆన్లైన్ నిత్యావసర సేవల పంపిణీ సేవలకు బాగా డిమాండ్ పెరిగింది. దీంతో నిత్యావసరాల ఆన్లైన్ డెలివరీలో రిలయన్స్ జియోమార్ట్ ప్రవేశం ఈ కామర్స్ వ్యాపారంలో పెద్ద సంచలనమే కానుంది. (ఫేస్బుక్ - జియో డీల్ : జుకర్ బర్గ్ సందేశం) -
ఆన్లైన్ డెలి'వర్రీ'!
లాక్ డౌన్ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ నుంచి ఈ–కామర్స్ షాపింగ్‌లకు అనుమతి లభించింది.ఈ సందర్భంగా నగర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్న ఆన్లైన్ షాపర్స్ వినియోగదారుల కోసం పలు ఈ–కామర్స్ సంస్థలు సేవలు ప్రారంభించనున్నాయి. అయితే తొలిదశ లాక్ డౌన్సమయంలో తమకు ఎదురైన అనుభవాలు పునరావృతం కాకుండా ఉండేలా అధికారులు చూడాలని ఆయా సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో: ఈ–కామర్స్ సేవలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపినప్పటికీ నగరంలో పలు చోట్ల వేర్ హౌజ్‌లు ఇప్పటికీ మూతబడే ఉన్నాయి. దీనిపై ఇ–కామర్స్ ప్రతినిధులను సంప్రదించగా గత కొన్ని రోజులుగా ఆన్లైన్ డెలివరీ సంస్థలు నిత్యావసర సరుకుల సరఫరాలో అనేక సమస్యలు ఎదుర్కొన్నాయని, అనుమతులకు సరైన మార్గదర్శకాలు లేకపోవడంతో సరఫరాకు పలు అడ్డంకులు ఏర్పడ్డాయని ప్రముఖ ఆన్లైన్ వ్యాపార సంస్థ ప్రతినిధి చెప్పారు. తాము ఇప్పటిదాకా లాక్డౌన్ విజయానికి తమ వంతు మద్దతు ఇస్తూ నిత్యావసరాలు, మందులను ఇళ్లకు సరఫరా చేసే çప్రయత్నంలో ఉన్నప్పటికీ ప్రభుత్వ అనుమతుల జారీలోని లోటుపాట్లు తమ సేవలకు ఎక్కడికక్కడ అడ్డంగా మారుతున్నాయన్నారు. సమన్వయలోపమే శాపం..! అనుమతుల జారీకి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం తాము అనుమతులను పొందడంలో జాప్యానికి కా రణమవుతోంది. ఈ అడ్డంకు లు తొలిగి 20 తర్వా త పూర్తి స్థాయి సేవలు పుంజుకోవాలంటే కేంద్ర, రాష్ట్రాల మధ్య అనుమతుల విషయంలో పూర్తి సమన్వయం ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అనుమతుల జారీ విషయంలో రాష్ట్రంలో ఏ నగరానికి ఆ నగరం వేర్వేరు విధానాలను అనుసరిస్తోందని, అలాగే కొన్ని చోట్ల సేవలు ప్రారంభించడానికి అనుమతులు ఇస్తూ డెలి వరీ బాయ్స్‌కి ఇవ్వాల్సిన పాసుల జారీలో విపరీతమైన జాప్యం చేస్తున్నారన్నారు. ఇప్పటికే లాక్డౌన్ కార ణంగా వలసదారులు తమ తమ స్వస్థలాలకు వెళ్లేందుకు క్యూ కట్టడంతో తమకు అవసరమైన సంఖ్యలో స్థాయి సిబ్బంది లభించడం లేదంటున్నారు. నగరాలు, రాష్ట్రాల వ్యాప్త ంగా ఒక నిర్ధిష్టమైన విధానం లేకపోవడం కూడా పెద్ద సమస్యగా మారి ఆలస్యానికి, అనిశ్చితికి దారి తీస్తోందని మరో సంస్థకు చెందిన ఎగ్జిక్యూటీవ్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ నుంచి తాము నగరంలో పూర్తిస్థాయి సేవలు ప్రారంభించాలంటే దానికి ప్రభుత్వ శా ఖలు సమన్వయంతో వ్యవహరించాలని వారు కోరుతున్నారు. -
కరోనా ఎఫెక్ట్ : 16 రెట్లు పెంచేశారు..
న్యూఢిల్లీ : కరోనా వైరస్(కోవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో పలువురు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్క్‌లు ధరించడంతో పాటు నిపుణల సూచనల మేరకు హ్యాండ్ శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో మాస్క్‌లతోపాటు హ్యాండ్ శానిటైజర్లకు భారీగా డిమాండ్ పెరిగింది. దీని ఆసరాగా చేసుకుని మార్కెట్లో మాస్క్‌ల ధరలను భారీగా పెంచేసి విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆన్లైన్లో హ్యాండ్ శానిటైజర్ ధరలు భారీగా పెరిగాయి. వాటిని కొనుగోలు చేద్దామని చూసిన వినియోగదారులు ఆ ధరలు చూసి షాకవుతున్నారు. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో 30 ఎమ్ఎల్ హ్యాండ్ శానిటైజర్ బాటిల్ ధరను ఏకంగా 16 రెట్లకు విక్రయిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్‌రిటైల్ అనే విక్రేత హిమాలయ ప్యూర్ హ్యాండ్స్ 30 ఎమ్ఎల్ ధరను రూ. 999 గా పేర్కొన్నారు. ఆన్లైన్ ఈ ధరలను చూసిన వినియోగదారులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. వినియోగదారులు ఫిర్యాదులపై ఫ్లిప్‌కార్ట్ హెల్స్ సెంటర్ స్పందించింది. అదే వస్తువును ఇతర విక్రేతలు వివిధ రెట్లలో అందిస్తున్నాయని తెలిపింది. దీనిపై హిమాలయ డ్రగ్ కంపెనీ స్పందిస్తూ.. తమ సంస్థ హ్యాండ్ శానిటైజర్ ధరలను పెంచలేదని స్పష్టం చేసింది. ధర్ట్ పార్టీ సెల్లర్లు అక్రమంగా ఈ చర్యలకు పాల్పడుతున్నారు.. అలాంటి వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. మరికొన్ని ఈ కామర్స్ సైట్లలో హ్యాండ్ శానిటైజర్లను ఔట్ ఆఫ్ స్టాక్‌గా పేర్కొంటున్నాయి. మరోవైపు భారత్‌లో కరోనా సోకినవారి రోజు రోజుకీ పెరుగుతోంది. తాజాగా కేరళలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా సోకడంతో.. భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 39కి చేరింది. (చదవండి : ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా) -
‘కోవిడ్’ దెబ్బ.. ఇ–కామర్స్ విలవిల!
సాక్షి, అమరావతి : చైనాను వణికిస్తున్న కోవిడ్ (కరోనా వైరస్) ధాటికి ఇ–కామర్స్, ఎలక్ట్రానిక్స్ వ్యాపారం కుదేలైంది. చైనా నుంచి దిగుమతులు నిలిచిపోవడం దేశీయ వ్యాపార రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. 31.50 బిలియన్ డాలర్ల విలువైన దేశీయ ఇ–కామర్స్ వ్యాపారం చైనాలో నెలకొన్న పరిణామాలతో మందగించింది. మన రాష్ట్రంలో ఏటా 50 మిలియన్ల ఫోన్లు తయారవుతుండగా దేశవ్యాప్తంగా 225 మిలియన్ల మొబైల్ ఫోన్లు ఉత్పత్తి అవుతున్నాయి. వీరందరిలో ఇప్పుడు ఆందోళన నెలకొంది. గడ్డు కాలమే చైనా నుంచి దిగుమతుల్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, విడి పరికరాలే సింహభాగం ఉండటం గమనార్హం. మన దేశంలో తయారయ్యే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు అవసరమైన విడి భాగాలు చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. ఇప్పుడు ఇవి నిలిచిపోవడంతో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ, వ్యాపారరంగం విలవిలలాడుతోంది. ఫిబ్రవరి నెలాఖరు కల్లా దిగుమతులు పునఃప్రారంభం కాకుంటే గడ్డు పరిస్థితి తప్పదని పరిశ్రమ వర్గాలు చెబుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. సందిగ్ధంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇ–కామర్స్ వ్యాపారంలో మన దేశం ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. దేశంలో ఏటా 14.80 బిలియన్ డాలర్ల విలువైన ఇ–కామర్స్ వ్యాపారం స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై ఆధారపడి జరుగుతోంది. ఇందులో స్మార్ట్ ఫోన్ల వ్యాపారం 10.71 బిలియన్ డాలర్లు ఉంది. వివిధ దేశాలకు చెందిన ప్రముఖ కంపెనీలన్నీ చైనాలోనే ఫ్యాక్టరీలు, అసెంబ్లింగ్ యూనిట్లు నెలకొల్పాయి. అక్కడి నుంచే ప్రపంచవ్యాప్తంగా తమ ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాయి. ప్రస్తుతం చైనా నుంచి దిగుమతులు నిలిచిపోవడంతో దేశంలో ఇ–కామర్స్ వ్యాపారం బాగా దెబ్బతింది. దేశంలోని రెండు పెద్ద ఇ–కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు వారం రోజులుగా బుకింగ్‌లపై సందిగ్ధంలో పడ్డాయి. ఆర్డర్ల డెలివరీని వాయిదా వేస్తున్నాయి. దేశంలో 85 శాతం ఇ–కామర్స్ వ్యాపారం ఈ రెండు సంస్థల ఆధీనంలోనే ఉండటం గమనార్హం. కొత్త మోడళ్లు వాయిదా... యాపిల్ ఫోన్‌తోపాటు ఇతర ప్రముఖ బ్రాండ్లలో అత్యధిక శాతం చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. తాజాగా యాపిల్ ఫోన్ల సరఫరా నిలిచిపోయింది. షియామీ కంపెనీ తమ ఉత్పత్తుల దిగుమతి కోసం ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఉన్న స్మార్ట్ ఫోన్ల నిల్వలు మరో పదిరోజుల వరకే సరిపోతాయని భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త ఫోన్ల లాంచింగ్‌ను కంపెనీలు వాయిదా వేసే యోచనలో ఉన్నాయి. చివరి త్రైమాసికంలో శరాఘాతం కోవిడ్ వైరస్ తీవ్రతకు ఈ త్రైమాసికంలో ఎలక్ట్రానిక్ ఉపకరణాల మార్కెట్ కోలుకోవడం కష్టమేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలాఖరు కల్లా దిగుమతులు పునఃప్రారంభం కాకుంటే మార్చిలో విక్రయాలు బాగా దెబ్బతింటాయి. గత ఏడాదితో పోలిస్తే స్మార్ట్ ఫోన్ల విక్రయాలు 15 శాతం వరకూ తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నెలాఖరు తరువాత కష్టాలే! ‘ప్రస్తుతం మొబైల్ ఫోన్ల ఉత్పత్తి కొనసాగిస్తున్నాం. ఈ నెలాఖరు వరకు ఫర్వాలేదు. అప్పటికి కూడా చైనా నుంచి దిగుమతులు పునఃప్రారంభం కాకుంటే ఉత్పత్తి నిలిపివేసి కొందరు కార్మికులకు తాత్కాలిక సెలవు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో’ అని ఓ మొబైల్ తయారీ కంపెనీ ప్రతినిధి ‘సాక్షి’తో పేర్కొన్నారు. 88 శాతం విడిభాగాలు చైనా నుంచే దేశంలో ఏటా 225 మిలియన్ల మొబైల్ ఫోన్లు తయారవుతుండగా రాష్ట్రంలోని శ్రీసిటీ సెజ్‌లో దాదాపు 50 మిలియన్ల ఫోన్లు ఉత్పత్తవుతున్నాయి. వీటి తయారీకి అవసరమైన విడి భాగాల్లో 12 శాతం మాత్రమే దేశీయంగా లభిస్తుండగా 88 శాతం చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. తాజాగా దిగుమతులు నిలిచిపోవడంతో మొబైల్ ఫోన్ల ఉత్పత్తిపై సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం ఉన్న విడి భాగాలతో గరిష్టంగా ఈ నెలాఖరు వరకు మాత్రమే ఉత్పత్తి కొనసాగించవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. -
పండుగ ఆఫర్లపై భగ్గుమన్న ట్రేడర్లు..
ముంబై : ఈ కామర్స్ దిగ్గజాలు పోటీపడి వెల్లడిస్తున్న పండుగ ఆఫర్లతో వ్యాపారులు కలత చెందుతున్నారు. ఈ సంస్థలు పోటాపోటీగా ఆఫర్లతో అతితక్కువ ధరలకే వస్తువులను అమ్మడంతో తమ వ్యాపారం దెబ్బతింటోందని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు మొరపెట్టుకుంది. ఆన్లైన్ రిటైల్ పోర్టల్స్‌ను ఇలాంటి ఎత్తుగడలకు దూరంగా ఉంచాలని వీరు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌లకు విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్ కంపెనీలు న్యాయసమ్మతం కాని ధరలకు వస్తువులు విక్రయించడాన్ని ప్రభుత్వం అనుమతించదని మంత్రి గోయల్ ఇటీవల చేసిన ప్రకటనను సీఏటీఐ ప్రస్తావించింది. పలు ఈ కామర్స్ పోర్టల్స్ అతితక్కువ ధరలకు వస్తువుల అమ్మకాలను చేపట్టడంలో హేతుబద్ధతను సీఏఐటీ అధ్యక్షులు బీసీ బర్తియ, ప్రధాన కార్యదర్శి ఖండేల్వాల్ ప్రశ్నించారు. ఆయా వస్తువుల స్టాక్ కలిగిన వారు మాత్రమే ఈ ధరలకు విక్రయించగలరని, ఈ కామర్స్ వెబ్సైట్లు కేవలం మార్కెట్ సదుపాయం మాత్రమే కల్పిస్తారని, వారు ఆన్లైన్లో విక్రయించే వస్తువులకు యజమానులు కాదని సీఏఐటీ పేర్కొంది. 2016 ఎఫ్‌డీఐ విధానానికి అనుగుణంగా ఈకామర్స్ పోర్టల్స్ అమ్మకాలు లేదా ధరలను ప్రభావితం చేయరాదని స్పష్టంగా ఉన్నప్పటికీ, వీరు తమ పోర్టల్స్‌లో సేల్స్‌ను ప్రకటించడం ద్వారా ఎఫ్‌డీఐ విధానానికి తూట్లు పొడుస్తున్నారని ఆక్షేపించింది. ఈ కామర్స్ పోర్టల్స్ వస్తువులను తమ గోడౌన్లలో నిల్వ చేస్తున్నాయని ఇది భారత ప్రభుత్వ రిటైల్ విధానానికి విరుద్ధమని అభ్యంతరం వ్యక్తం చేసింది. వివిధ పోర్టల్స్ ప్రకటించిన క్యాష్‌బ్యాక్ ఆఫర్లను తక్షణమే నిలిపివేయాలని ఇది ధరలపై ప్రభావం చూపుతోందని పేర్కొంది. -
‘స్పేస్’ సిటీ!
సాక్షి, హైదరాబాద్ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దాని అనుబంధ సంస్థలకు తోడు, బ్యాంకింగ్, ఫైనాన్స్, నిర్మాణ ఉత్పాదక, ఇతర సేవలను అందించే సంస్థలు హైదరాబాద్‌లో తమ సంస్థలను నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతుండటంతో నగరంలో కమర్షియల్ స్పేస్‌కు డిమాండ్ బాగా పెరుగుతోంది. గతేడాది జనవరిలో నగరంలో కమర్షియల్ స్పేస్ 1.5 మిలియన్ చదరపు అడుగులు ఉండగా ఆ ఏడాది చివరినాటికి 5.8 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. ఇక ఈ ఏడాది జూన్ నాటికి అది ఎనిమిది మిలియన్ చదరపు అడుగులకు చేరింది. అంటే ఒక్క ఏడాదిలోనే 21% పెరుగుదల కన్పించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఒరాకిల్, ఎల్ అండ్ టీ, డెల్, ఇంటెల్, టీసీఎస్ వంటి పెద్ద ఐటీ కంపెనీలు నగరంలో అందుబాటులో ఉన్న 50 వేల నుంచి 4 లక్షల చదరపు అడుగుల స్థలాలను ఎంచుకుని లీజుకో, అద్దెకో తీసుకున్నాయి. దీన్నిబట్టి నగరంలో కమర్షియల్ స్పేస్‌కు ఎంత డిమాండ్ ఉందో అర్థ్ధం అవుతోంది. ఇదే ఊపు ఇలాగే కొనసాగితే దేశంలోనే కమర్షియల్ స్పేస్‌కు ఎక్కువగా డిమాండ్ ఉన్న బెంగళూరును 2021 నాటికి హైదరాబాద్ మించిపోతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు. జోన్స్ లాంగ్ లాసెల్లీస్ (జేఎల్ఎల్) పల్స్ మంథ్లీ రియల్ ఎస్టేట్ మానిటర్ సంస్థ కూడా ఇదే అం శాన్ని ఇటీవల చేసిన పరిశోధనలో తేల్చింది. అందరిచూపు..హైదరాబాద్ వైపే బెంగళూరు నగరం ఐటీ, దాని అనుబంధ సంస్థ లకు కేరాఫ్‌గా నిలుస్తుండటంతో 2018 తొలి అర్ధ సంవత్సరం నాటికి 30 మిలియన్ చదరపు అడు గుల కమర్షియల్ స్పేస్‌కు చేరుకోగా 2019లో మొదటి 6 నెలల్లో హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్, అడ్వర్టయిజింగ్, ఎడ్యుకేషన్, మాన్యుఫ్యాక్చరింగ్, ఈ కామర్స్ వంటి సంస్థలు కొత్తగా విస్తరించాయి. ఇక హైదరాబాద్‌లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగి 2019 మొదటి 6 నెలల్లో కమర్షియల్ స్పేస్ వాటా 27 శాతానికి చేరింది. ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, మాన్యుఫ్యాక్చరింగ్‌తో పాటు పలు మల్టీ నేషనల్ కంపెనీలు హైదరాబాద్‌లో తమ వ్యాపారాన్ని నెలకొల్పాలని చూస్తున్నాయి. నిర్మాణం పూర్తి చేసుకుని బుకింగ్ కానీ ప్రాజెక్టులు కూడా ఇటీవల మొత్తం పూర్తయ్యాయి. నిర్మాణంలో ఉన్నటువంటి వాటికి కూడా ముందే ఒప్పందాలు చేసుకుంటున్నారు. 21% పెరుగుదల 2018 జనవరిలో 1.5 చదరపు అడుగులు ఉండగా ఏడాది చివరి నాటికి 5.8 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. 2019 జనవరి నుంచి జూన్ నెల వరకు 8 మిలియన్ల చదరపు అడుగులకు కమర్షియల్ స్పేస్ చేరింది. 2019 సంవత్సరం చివరి నాటికి అది 18 మిలియన్ చదరపు అడుగులకు చేరుతుందని అంచనా. ఈ గణాంకాలను గమనిస్తే ఒక్క ఏడాదిలోనే నగరంలో 19% కమర్షియల్ స్పేస్ వినియోగంలోకి వచ్చింది. కొత్త ప్రాజెక్టులు గనుక పూర్తియితే 13 మిలియన్ చదరపు అడుగులకు చేరుకునే అవకాశం ఉండగా 2018తో పోలిస్తే 21% పెరుగనుంది. డిమాండ్ అధికంగా ఉండటంతో మల్టీనేషనల్ కంపెనీలు 1.5 లక్షల చదరపు అడుగుల నుంచి 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కంపెనీలను విస్తరిస్తున్నాయి. దీంతో నగరంలో కార్యాలయాల విస్తరణకు డిమాండ్ బాగా పెరగడంతో ఖాళీగా ఉన్నటువంటి కమర్షియల్ స్పేస్ 3.6% కనిష్టానికి పడిపోయింది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో కమర్షియల్ స్థలం ఎక్కువగా అందుబాటులో లేకపోవడంతో గడిచిన ఆరు నెలల కాలంలో అద్దె ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం హైటెక్ సీటీ, రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో చదరపు అడుగు కమర్షియల్ స్పేస్ అద్దె ధర రూ.70 వరకు ఉండగా, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ జిల్లా పరిసరాల్లో రూ.60 వరకు చెల్లించడానికి సంస్థలు వెనుకాడటం లేదని తెలుస్తోంది. దేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరు, ముంబాయిల్లో అధికంగా ధరలు చెల్లించడానికి సంస్థలు ముందుకు రాకపోవడం చూస్తుంటే 2021 నాటికి హైదరాబాద్ కమర్షియల్ స్పేస్ వాటాలో బెంగళూరును అధిగమించనుందని ఓ అంచనా. ఒప్పందాలకు అనుగుణంగా నిర్మిస్తున్న నిర్మాణాలు అధికంగా ఉండటంతో రానున్న కాలంలో నగరంలో కమర్షియల్ స్పేస్‌కు డిమాండ్ భారీగా ఉండనుంది. నగరం ఉత్తరం వైపు విస్తరిస్తుండటం అక్కడ మౌలిక వసతుల కల్పన కూడా అదే స్థాయిలో ఉండటంతో ఐటీ, ఐటీ ఆధారిత సంస్థలు కార్యాలయాలను నెలకొల్పడానికి ముందుకు వస్తున్నాయి. కోకాపేట, తెల్లాపూర్, బుద్వేల్, ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ఐటీ కంపెనీలే కాకుండా ఇతర కంపెనీలు సంస్థలను నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నాయి. -
భలే మంచి 'చెత్త 'బేరము
ప్రస్తుతం అంతా ఆన్లైన్ షాపింగ్ హవా నడుస్తోంది. అంతవరకూ బాగానే ఉంది కానీ, దీనివల్ల ఇళ్లల్లో పెద్దపెద్ద కార్ట్టన్లు, పేపర్ బ్యాగ్‌ల రూపంలో కొత్తరకం చెత్త తయారవుతోంది. దీనికి తోడు ఇంట్లో రోజువారి వ్యర్థాలు అదనంగా ఉండనే ఉంటాయి. అయితే ‘కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల... కాదేదీ కవితకనర్హం’ అన్నట్లు ఇంట్లోని చెత్తను కూడా సొమ్ము చేసుకునే మార్గాలు ఉన్నాయి! అంతేకాదు.. ఇంట్లోని పొడిచెత్తను కూడా ఆన్లైన్ ద్వారా వదిలించుకోవచ్చని అంటున్నాయి కొన్ని స్టార్టప్ కంపెనీలు. రీసైక్లింగ్ చేయదగిన చెత్తనంతటినీ కస్టమర్ల ఇంటికి వచ్చి మంచి ధరకు కొనుగోలు చేస్తామని చెబుతున్న కొన్ని ఆన్లైన్ గార్బేజ్ సంస్థల వివరాలు మీకోసం. ద కబాడీవాలా కబాడీవాలా ఒక స్థానిక చెత్తను సేకరించే ఆన్లైన్ డీలర్. దీనిని అనురాగ్ అస్తీ, కవీంద్ర రఘువంశీ అనే ఇద్దరు కలిసి ప్రారంభించారు. వీరు తమ యాప్ ద్వారా స్థానికంగా ఉన్న ఇళ్లనుంచి చెత్తను సేకరించి రీసైక్లింగ్ యూనిట్లకు పంపుతారు. ముఖ్యంగా కబాడీవాలా.. న్యూస్ పేపర్లు, ప్లాస్టిక్ వస్తువులు, లోహ వస్తువులు, పుస్తకాలు, ఇనుము వంటి వాటిని ఇంటి యజమానులకు కొంత మొత్తంలో డబ్బులచెల్లించి సేకరిస్తుంది. అయితే వీరు తీసుకున్న చెత్తను ఎక్కడకి తీసుకెళ్తున్నారు? దానిని ఏంచేస్తున్నారో ప్రతీది కస్టమర్లకు తెలుసుకునే విధంగా లైవ్ ట్రాక్ సిస్టం సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. కబాడీవాలా సేకరిస్తున్న చెత్త కార్యక్రమం వల్ల.. 10వేల చెట్లను రక్షించబడడమేగాక, 2.5 లక్షల లీటర్ల ఆయిల్, 13.8 మిలియన్ల లీటర్ల నీరు ఆదా అవుతుందని సంస్థ తెలిపింది. ప్రస్తుతం కబాడీవాలా భోపాల్, ఇండోర్, ఔరంగాబాద్, రాయ్‌పూర్‌లలో సేవలందిస్తోంది. వెబ్సైట్: www.thekabadiwala.com జంక్ కార్ట్ జంక్ కార్ట్‌ను ఢిల్లీకిచెందిన నీరజ్ గుప్తా, శైలేంద్ర సింగ్, ప్రశాంత్ కుమార్, శుభం షా అనే ముగ్గురు కలిసి 2015లో ప్రారంభించారు. వీరు కూడా అన్ని రీసైక్లింగ్ వస్తువులను సేకరిస్తారు. ప్లాస్టిక్, అల్యూమినియం, ఐరన్, పేపర్, పుస్తకాలు, గ్లాస్ వంటి వాటిని సేకరిస్తారు. చెత్త ఇచ్చిన వారికి పేటిఎం వాలెట్ ద్వారా డబ్బులు చెల్లిస్తారు. అయితే ఎవరైనా కస్టమర్లు తమ చెత్త అమ్మగా వచ్చిన డబ్బులను స్వచ్ఛంద సంస్థలు, జంక్ ఆర్ట్‌లకు దానం చేయాలనుకుంటే...జంక్ కార్ట్‌లోని ఒక ఆప్షన్ ద్వారా దానం చేసే సదుపాయాన్ని కూడా కల్పిస్తుంది. మనం ఆన్లైన్లో ఒక వస్తువును కొనడానికి ఎలా ఆర్డరు ఇస్తామో అలానే జంక్ కార్ట్ వెబ్సైట్లోకి వెళ్లి ఆర్డరు ఇస్తే వారే వచ్చి చెత్తను తీసుకెళ్తారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చాలా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని నిర్వహకులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఢిల్లీ, ముంబై, బెంగళూరులో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. వారి వెబ్సైట్లో ఏ చెత్తను ఎంతరేటుకు తీసుకుంటారో వివరాలు పొందుపర్చారు, వీటి ద్వారావారు చెత్తను కొంటారు. వెబ్సైట్: www.junkart.in కర్మ రీసైక్లింగ్ మనకు ఏదైనా చెడుగాని, కష్టాలుగాని ఎదురైనప్పుడు మన కర్మ ఇంతేలే అనుకుంటాం. ఈ కర్మనే ఆధారం చేసుకుని చెత్తను పారేసి మీరు మెరుగుపడండి అంటూ ఓ స్టార్టప్ చెబుతోంది. అదే కర్మ రీసైక్లింగ్. మనింట్లో పేరుకు పోయిన చెత్తను పారవేసి మన కర్మను మరింత మెరుగు పరుచుకోవచ్చనే థీమ్‌తో అమీర్ జైరీవాల, అక్షత్ అనే ఇద్దరు ఈ పేరు మీదుగా చెత్తను సేకరిస్తున్నారు. అయితే వీరు మామూలు చెత్తను కాదు... ఎలక్ట్రానిక్ చెత్తను మాత్రమే సేకరిస్తారు. అదీ కూడా పాత మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, వాటికి సంబంధించిన పరికరాలు సేకరిస్తారు. వాటిలో ఏవైనా చిన్నపాటి లోపాలు ఉంటే వాటిని సరిచేసి మళ్లీ వాటిని చాలా తక్కువ రేట్లకు అమ్ముతుంటారు. అయితే వీరు మన దగ్గర ఉన్న ఫోన్లు కానీ ల్యాప్ట్యాప్గాని కొనాలంటే అది ఏ బ్రాండ్‌కు చెందినది, ఇంకా ఆయా వస్తువు గురించి కొన్ని రకాల చిన్నపాటి ప్రశ్నలకు జవాబులు ఇస్తేనే వారు మనం అమ్మదల్చుకున్న ఫోనుకు ఎంత మేర ధర చెల్లిస్తారో చెబుతారు. కస్టమర్‌కు కర్మ వారు ఇచ్చిన ధర ఓకే అయితే వారు దానిని తీసుకుని సర్సీస్ సెంటరుకు పంపిస్తారు. ఇలా దాదాపు 3 వేల స్మార్ట్‌ఫోన్ మోడళ్లను వీరు రీసైక్లింగ్‌కు తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 25 నగరాల్లో కర్మసేవలు అందుబాటులో ఉన్నాయి. వెబ్సైట్: www.karmarecycling.in ఎక్స్ట్రా కార్బన్ ఈ–వేస్ట్‌ను సేకరించే సంస్థే ఎక్స్ట్రా కార్బన్. గురుగ్రాంకు చెందిన ఒక స్టార్టప్ సంస్థ. ఈ సంస్థను 2013లో ప్రారంభమైంది. సంవత్సరానికి 6 వేల టన్నుల ఈ–వేస్ట్‌ను ఎక్స్ట్రా కార్బన్ సేకరిస్తుంది. ఉత్తర భారతదేశంలోని 9 నగరాల్లో 41 వేలమంది ఎక్స్ట్రా కార్బన్ కస్టమర్లు ఉన్నారు. ఎక్స్ట్రా కార్బన్ సంస్థను ప్రారంభించిన మొదటేడాదిలోనే రూ.70లక్షలను సంపాదించడం విశేషం. వెబ్సైట్: http://extracarbon.com స్క్రాప్ ట్యాప్ ఇది హైదరాబాద్‌కు చెందిన సంస్థ. ‘‘జీరో వేస్ట్ హీరో’’ అనే నినాదంతో స్క్రాప్ ట్యాప్ ప్రారంభమైంది. దీనిలో ముఖ్యంగా ఐదుదశల్లో చెత్తను సేకరించి రీసైక్లింగ్ చేస్తారు. చెత్త అమ్మేవారు, కొనే వారికి మధ్య ఒక మంచి వారధిగా స్క్రాప్ట్యాప్ వ్యవహరిస్తుంది. చెత్తను సేకరించి దానిని డిజిటల్ వేయింగ్ మిషన్ ద్వారా కొలిచి, ధరను నిర్ణయిస్తారు. ఆ తరువాత ఆ ధర కస్టమర్‌కు నచ్చితే దానిని రీసైక్లింగ్ యూనిట్‌కు పంపిస్తారు. వీరు వెబ్సైట్ ద్వారానే గాక వాట్సప్ నంబరు ద్వారా కూడా సేవలు అందిస్తున్నారు. స్క్రాప్ట్యాప్ ఇళ్లనుంచే గాక చిన్న చిన్న పరిశ్రమల నుంచి కూడా చెత్తను సేకరిస్తుంది.– పోకల విజయ దిలీప్, సాక్షి, స్టూడెంట్ ఎడిషన్ వెబ్సైట్: http://scraptap.in -
ఇక ‘ఫేస్బుక్’ ద్వారా వ్యాపారం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలతోపాటు భారత్‌లో కూడా ‘ఈ కామర్స్ (ఆన్లైన్ షాపింగ్)’ దుమ్మురేపుతున్న విషయం తెల్సిందే. ఈ రంగంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్ డీల్, పేటీఎం మాల్ సంస్థలు రాణిస్తున్నాయి. అయినప్పటికీ ఈ కంపెనీల ద్వారా ఐదు కోట్ల మంది భారతీయ వినియోగదారులు మాత్రమే తరచుగా కొనుగోళ్లు చేస్తున్నారట. అందుకని ఇప్పుడు ‘సోషల్ కామర్స్ (సామాజిక వాణిజ్యం)’ అంటే ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా సంస్థల ద్వారా వ్యాపార లావాదేవీలు నిర్వహించడం. ఫేస్‌బుక్‌కు దాదాపు 25 కోట్ల మంది యూజర్లు ఉండడంతో వారిని వినియోగదారులుగా చేసుకొని సరికొత్త ఆన్లైన్ వ్యాపారాన్ని నిర్వహించేందుకు ‘మీషో’ పుట్టుకొచ్చింది. ‘మేరీ షాప్’ అనే హిందీ అర్థానికి స్వల్పరూపమే మీషో. ఇందులో కోట్ల డాలర్ల పెట్టుబడులు ‘ఫేస్బుక్’ పెట్టినట్లు తెల్సింది. అయితే వాటి వివరాలను వెల్లడించేందుకు ఆ సంస్థ నిరాకరిస్తోంది. గతేడాది నాటికే మీషో 25 కోట్ల డాలర్ల పెట్టుబడులను సమీకరించింది. ఇందులో ఫేస్‌బుక్‌తోపాటు మరి కొన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. యూజర్ల డేటాను అమ్ముకున్నట్లు భారత ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లను ఎదుర్కొన్న ఫేస్బుక్, భారత్ స్టార్టప్ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం ఆ సంస్థకు లాభించే అంశం. మీషో వ్యవస్థాపకులు ఢిల్లీలోని ఐఐటీలో 2008–2012 బ్యాచ్‌మేట్లయిన 27 ఏళ్ల విదిత్ ఆత్రే, 28 ఏళ్ల సంజీవ్ బార్వల్ బెంగళూరు కేంద్రంగా మీషోను స్థాపించారు. పెద్ద పెద్ద మాల్స్ ద్వారా ఆన్లైన్ వ్యాపారాన్ని నిర్వహించిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు ఇప్పుడు చిల్లర వ్యాపారులను కూడా తనలో చేర్చుకుంది. చిల్లర వ్యాపారులు తమ వస్తువులను ఈ సంస్థల ద్వారా అమ్ముకోవచ్చు. వారికంటూ ప్రత్యేకమైన నెట్‌వర్క్‌గానీ, ‘యాప్’ గానీ ఏదీ లేదు. వారినందరిని ఓ నెట్వర్క్ పరిధిలోకి తెస్తే, సోషల్ మీడియాకు వారిని లింక్ చేస్తే ఎలా ఉంటుందన్న విదిత్, సంజీవ్‌ల ఆలోచనలకు రూపమే ‘మీషో’. ఈ చిల్లర వ్యాపారులు తమ కొత్త ఉత్పత్తులకు సంబంధించిన వాణిజ్య ప్రకటనలను ఫేస్బుక్లో షేర్‌చేసుకునే అవకాశం కూడా ఉందని వారన్నారు. ఇక భవిషత్తంగా ‘సోషల్ కామర్స్’దేనని వారు ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు. -
కిరాణా సేవల విస్తరణలో అమెజాన్
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ డాట్ ఇన్ భారత్‌లో తన సేవలను విస్తరించే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా నిత్యావసరాల సరఫరా సేవల విభాగమైన ‘అమెజాన్ ప్యాంట్రీ’ ఏర్పాట్లను శరవేగంగా పెంచే పనిలోపడింది. వచ్చే ఆరు–ఏడు నెలల్లో ఈ సర్వీసులను 110 పట్టణాలకు విస్తరించేందుకు ప్రణాళిక రచించింది. గతేడాది నవంబర్ నాటికి 40 నగరాల్లో ప్యాంట్రీ సేవలుండగా.. మరో 70 నగరాల్లో సేవలను విస్తరించే దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు సంస్థ గ్రోసరీ విభాగ డైరెక్టర్ సౌరభ్ శ్రీవాత్సవ వెల్లడించారు. ప్యాంట్రీ సేవల్లో 500 బ్రాండ్లకు చెందిన.. స్టేపుల్స్, గృహ సరఫరా, వ్యక్తిగత సంరక్షణ వంటి దాదాపు 5,000 ఉత్పత్తులను అందిస్తున్నట్లు చెప్పారు. -
గొడవలు పెట్టుకునేందుకు ఆన్లైన్లో ఆర్డర్..
కూలీకొస్తారా.. అనగా విన్నాం.. పని ఉంది చేయడానికి వస్తారా అని అడగ్గా విన్నాం.. ఈ మధ్య బజార్ కొస్తారా.. అని కూడా చూశాం.. కానీ కొత్తగా లొల్లికొస్తారా ఏంటి అని అనుకుంటున్నారా..? ఇదే కదా మీ డౌట్. అవును చైనాలో అలాగే అడుగుతారు మరి. మిమ్మల్ని ఎవరైనా ఏడిపించారనుకోండి.. టీజ్ చేశారనుకోండి.. లేదంటే ఎక్కడైనా గొడవకు దిగారనుకోండి. అప్పుడు మీరు సరిగ్గా మాట్లాడలేకపోతే.. అందులో పైచేయి సాధించలేకపోతే.. మీ వద్ద అప్పుడు రెండే ఆప్షన్లు ఉంటాయి. ఒకటి.. నోరు మూసుకుని చక్కగా వెనక్కి వచ్చేయడం లేదంటే.. గొడవ పడిన వారితో మీరు అనవసరంగా తిట్లు పడాల్సి రావడం. కానీ చైనాలో ఓ ఆన్లైన్ కంపెనీ దీనికి కూడా పరిష్కారం వెతికి పెట్టిందండోయ్. టావోబావో అనే కంపెనీ మీ తరఫున గొడవ పడేందుకు వేరే వారిని నియమించుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. అది కూడా చాలా ప్రొఫెషనల్‌గా గొడవ పడేవారిని మీకు ఆన్లైన్లో చూపిస్తుంది. టావోబావో ప్రపంచంలోనే అతిపెద్ద ఈ–కామర్స్ సంస్థ. తాజాగా గొడవలు పెట్టుకునేవారిని కూడా ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. మీరు ఏ విషయంలో గొడవపడుతున్నారు..? ఎవరితో గొడవపడుతున్నారు..? మీరు నియమించుకునే వారు ఎలా గొడవ పడాలి.. ఎదుటి వారిని ఏ మాటలు అనాలి..? ఎంత సేపు గొడవ పడాలి.. ఇలా అన్ని వివరాలు ఆన్లైన్లో పొందుపరిస్తే అందుకు తగ్గట్లు సాయం చేస్తారన్న మాట. ఇందుకోసం కొంత డబ్బు వసూలు చేస్తుంది. అయితే గొడవ పడే వారిని నేరుగా మనదగ్గరికి పంపించరు. కేవలం ఫోన్ లేదా మెస్సేజీల ద్వారా మనతో గొడవ పడినవారిని తిరిగి తిట్టేలా ఏర్పాటు చేస్తోంది. గంటకు కేవలం రూ.220 వసూలు చేస్తోంది. -
ఇవేం నిబంధనలు!!
న్యూఢిల్లీ: భారత్ ప్రతిపాదిత డేటా లోకలైజేషన్ నిబంధనలు, ఈ–కామర్స్ విధాన ముసాయిదాలోని ప్రతిపాదనలను అమెరికా ఆక్షేపించింది. ఇవి అత్యంత వివక్షాపూరితంగాను, వాణిజ్యాన్ని దెబ్బతీసేవిగాను ఉన్నాయని వ్యాఖ్యానించింది. 2019లో విదేశీ వాణిజ్యానికి ప్రతిబంధకాలు అంశంపై అమెరికా వాణిజ్య విభాగం (యూఎస్టీఆర్) రూపొందించిన నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించింది. ‘భారత్ ఇటీవలే డేటాను స్థానికంగా భద్రపర్చాలని (లోకలైజేషన్) నిబంధనలను ప్రతిపాదించింది. ఇలాంటి వాటివల్ల డేటా ఆధారిత సేవలు అందించే సంస్థలు అనవసరంగా, వృథాగా డేటా సెంటర్లను ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అంతర్జాతీయంగా మెరుగైన సేవల ప్రయోజనాలను స్థానిక సంస్థలు పొందనీయకుండా చేస్తుంది. సీమాంతర డేటా వినియోగంపై ఆంక్షలు విధించడం వివక్ష చూపడమే అవుతుంది. ఇవి అమెరికా, భారత్ మధ్య డిజిటల్ వాణిజ్యానికి తీవ్ర ప్రతిబంధకాలుగా మారే అవకాశం ఉంది. ఈ–కామర్స్ విధానం ముసాయిదాలో ఇలాంటి విచక్షణాపూరిత, వాణిజ్యాన్ని దెబ్బతీసే నిబంధనలను భారత్ పునఃసమీక్షించాలని అమెరికా భావిస్తోంది‘ అని నివేదిక పేర్కొంది. చెల్లింపుల సమాచారం అంతా భారత్‌లోనే స్థానికంగా భద్రపర్చాలన్న నిబంధన వల్ల పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ వ్యయాలు పెరిగిపోతాయని, అంతర్జాతీయంగా సేకరించిన డేటాను ఒకే దగ్గర భద్రపర్చుకుని, వినియోగించుకునే విదేశీ సంస్థలపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని నివేదిక తెలిపింది. దేశీయంగా డేటా, ఇన్ఫ్రా అభివృద్ధి, ఈ–కామర్స్ మార్కెట్‌ప్లేస్, నియంత్రణపరమైన సవాళ్ల పరిష్కారం, దేశీ డిజిటల్ ఎకానమీకి ఊతమివ్వడం తదితర అంశాల ప్రాతిపదికగా ప్రభుత్వం ప్రత్యేక ఈ–కామర్స్ విధానం ముసాయిదా రూపొందించిన సంగతి తెలిసిందే. దీనిపైనే అమెరికా తాజాగా స్పందించింది. భారత్‌లో భారీ టారిఫ్‌లు.. ఇక భారత వాణిజ్య విధానాలపై కూడా నివేదికలో అమెరికా విమర్శలు గుప్పించింది. పలు అమెరికా ఉత్పత్తులపై భారత్ అత్యంత భారీగా సుంకాలు విధిస్తోందని పేర్కొంది. పూలపై 60 శాతం, రబ్బర్‌పై 70 శాతం, ఆటోమొబైల్స్‌పై 60 శాతం, మోటార్‌సైకిల్స్‌పై 50 శాతం, కాఫీ మొదలైనవాటిపై 100 శాతం, ఆల్కహాలిక్ బెవరేజెస్‌పై 150 శాతం దిగుమతి సుంకాలు విధిస్తోందని పేర్కొంది. అంతేగాకుండా వాణిజ్యానికి అవరోధాలు కల్పించేలా కొన్ని వైద్యపరికరాల ధరలను నియంత్రించడం, ఇథనాల్ దిగుమతులపై ఆంక్షలు విధించడం వంటివి కూడా చేస్తోందని ఆరోపించింది. ఈ–కామర్స్ ముసాయిదాతో డిజిటల్ లక్ష్యాలకు విఘాతం ఐఏఎంఏఐ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్లలో 2022 నాటికల్లా 1 లక్ష కోట్ల డాలర్ల డిజిటల్ ఎకానమీగా భారత్‌ను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి విఘాతం కలిగించేదిగా ఈ–కామర్స్ విధాన ముసాయిదా ఉందని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) వ్యాఖ్యానించింది. దీనివల్ల ఈ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. డేటా, ఇన్ఫ్రా అభివృద్ధి, ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్, నియంత్రణ నిబంధనలపరమైన సవాళ్లు, దేశీ డిజిటల్ ఎకానమీ వృద్ధికి తీసుకోదగిన చర్యలు మొదలైన వాటికి సంబంధించి రూపొందించిన జాతీయ ఈ–కామర్స్ విధాన ముసాయిదాపై పరిశ్రమవర్గాల స్పందన కోరిన మీదట ఐఏఎంఏఐ తాజా అభిప్రాయాలు వ్యక్తం చేసింది. ‘డేటా లోకలైజేషన్ తప్పనిసరి చేయడం, ఈ–కామర్స్ పరిధిలోకి డిజిటల్ అడ్వర్టైజింగ్.. ఆన్లైన్ స్ట్రీమింగ్ మొదలైనవన్నీ చేర్చడం, డిజిటల్ సేవల్లోకి విదేశీ పెట్టుబడులపై ఆంక్షలు విధించే అవకాశాలు మొదలైనవాటి వల్ల ఈ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గణనీయంగా పడిపోయే అవకాశం ఉంది. 1 లక్ష కోట్ల డాలర్ల డిజిటల్ ఎకానమీని నిర్మించాలంటే ఇవే చాలా కీలకం‘ అని పేర్కొంది. -
అవాంఛిత కాల్స్ నియంత్రణకు వ్యవస్థ
న్యూఢిల్లీ: వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే దిశగా వ్యాపారపరమైన అవాంఛిత కాల్స్, ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ మొదలైన వాటిని నియంత్రించేందుకు చట్టబద్ధమైన ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ–కామర్స్ విధానంపై రూపొందించిన 41 పేజీల ముసాయిదాలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. బాధిత ఆన్లైన్ వినియోగదారుల ఫిర్యాదులను ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే పరిష్కరించి, పరిహారం చెల్లించే అంశం కూడా ఇందులో ఉంది. ఇందుకోసం ఈ–కన్జూమర్ కోర్టులను ఏర్పాటు చేసే ప్రతిపాదన సైతం ఈ ముసాయిదాలో పొందుపర్చారు. ఇక ఈ–కామర్స్ మార్కెట్‌ప్లేస్‌లో కార్యకలాపాలు నిర్వహించే వెబ్సైట్లు, యాప్స్ అన్నీ తప్పనిసరిగా దేశీయంగా వ్యాపార సంస్థగా రిజిస్టర్ అయి ఉండాలి. కొరియర్స్ ద్వారా భారత్‌కు వస్తువులను పంపే క్రమంలో కస్టమ్స్ నిబంధనలను ఉల్లంఘించే చైనా వెబ్సైట్లకు కళ్లెం వేసే క్రమంలో తాత్కాలికంగా అటువంటి పార్సిల్స్‌పై నిషేధం విధించాలని ముసాయిదా ప్రతిపాదించింది. అయితే, ప్రాణావసర ఔషధాలకు మాత్రం మినహాయింపునివ్వచ్చని పేర్కొంది. -
ఈ–కామర్స్‌లోకి ‘గిరిజన’ బ్రాండ్స్
సాక్షి, హైదరాబాద్: జీసీసీ (గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్) ఉత్పత్తులన్నీ వినియోగదారుల ముంగిట్లోకి తెచ్చేందుకు గిరిజన సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయాల వరకే పరిమితమైన అమ్మకాలను, తాజాగా ఆన్‌లైన్‌కు విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు ఈ–కామర్స్‌తో గిరిజన సంక్షేమ శాఖ ఒప్పందం కుదుర్చుకోనుంది. దీనికోసం గత కొంతకాలంగా చర్చలు జరిపిన అధికారులు అవగాహన కుదుర్చుకోనున్నారు. సంప్రదాయ ఉత్పత్తుల పేరుతో.. జీసీసీ ద్వారా తేనె, సబ్బులు, షాంపూలు, కారం, పసుపు, మసాలా పొడులు విక్రయిస్తున్నారు. వీటికి సంబంధించి ఐటీడీఏ పరిధిలో పలుచోట్ల ప్రాసెసింగ్ కేంద్రాలు సైతం ఏర్పాటు చేయడంతో ఉత్పత్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. మరోవైపు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని టీఆర్ఐ (ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) ద్వారా గిరిజనుల సంస్కృతులకు సంబంధించి చిత్రకళను సైతం అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఔత్సాహిక కళాకారులను గుర్తించి వారితో పెయింటింగ్స్ వేయించి విక్రయించే వెసులుబాటు కల్పించారు. తాజాగా జీసీసీ ఉత్పత్తులతోపాటు గిరిజన సాంస్కృతిక చిత్రాలను కూడా అమెజాన్ వెబ్సైట్ ద్వారా విక్రయించనున్నారు. వీటిని ట్రైబల్ ట్రెడిషన్ ప్రొడక్ట్స్ పేరిట ప్రత్యేకంగా వెబ్సైట్లో పొందుపర్చనున్నారు. అమెజాన్‌తో అవగాహన నేపథ్యంలో కంపెనీ అధికారులు పలుమార్లు జీసీసీని సందర్శించారు. అదేవిధంగా పెయింటింగ్స్‌ను సైతం పరిశీలించారు. అవగాహన కుదిరితే ఉత్పత్తుల్లో శాంపిల్‌ను గోడౌన్లో అందుబాటులో పెట్టాల్సి ఉంటుంది. మిగతా వాటిని డిమాండ్‌కు తగినట్లు సరఫరా చేయాలి. అమెజాన్ వెబ్సైట్లో గిరిజన సంక్షేమ శాఖ సెల్లర్ కేటగిరీలో కనిపిస్తుంది. ప్రస్తుతం జీసీసీ నుంచి వచ్చే తేనెకు విపరీతమైన డిమాండ్ ఉంది. అదేవిధంగా కారం, పసుపు, సహజసిద్ధమైన సబ్బులకు సైతం డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వార్షిక టర్నోవర్ రూ.200 కోట్లకు చేరింది. ఆన్లైన్ విక్రయాలు మొదలుపెడితే టర్నోవర్ రెట్టింపు అయ్యే అవకాశాలున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ అంచనా వేస్తోంది. అవగాహన ప్రక్రియ పూర్తయితే వచ్చేనెల మొ దటివారం నుంచి గిరిజన ఉత్పత్తులు ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. -
మరి అమెజాన్ పరిస్థితేంటి?
న్యూయార్క్: అమెరికా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ విడాకుల వ్యవహారం కంపెనీ భవితవ్యంపై సందేహాలను రేకెత్తిస్తోంది. దాదాపు 136 బిలియన్ డాలర్ల బెజోస్ సంపదను భార్యాభర్తలిద్దరూ ఎలా పంచుకుంటారు? కంపెనీలో బెజోస్ భార్య మెకెంజీకి కూడా ఆయనతో సమానంగా వాటా లభిస్తుందా? ఒకవేళ లభిస్తే... అమెజాన్ నిర్వహణపై ఆ ప్రభావాలు ఎలా ఉండొచ్చు? అన్న అంశాలు ప్రస్తుతం చర్చనీయమయ్యాయి. అమెజాన్ వ్యవస్థాపకుడు బెజోస్‌కి ఇప్పుడు కంపెనీలో 16 శాతం వాటాలున్నాయి. దీని ప్రకారం ఆయన సంపద విలువ 136 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా. విడాకుల సెటిల్మెంట్ కింద భార్యకు సగం సంపద ఇచ్చిన పక్షంలో బెజోస్‌కి అమెజాన్‌లో ఎనిమిది శాతం వాటా మాత్రమే మిగులుతుంది. సామరస్యంగానే ఉంటే.. విడాకుల విషయంలో ఇద్దరూ సామరస్యంగానే ఉన్న నేపథ్యంలో.. జెఫ్, మెకెంజీలు తమ షేర్లను ఉమ్మడిగా ఏదైనా ట్రస్ట్‌లో ఉంచడం ద్వారా కంపెనీపై నియంత్రణాధికారాలు కోల్పోకుండా జాగ్రత్తపడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మరో రకంగా .. మెకెంజీ తన ఓటింగ్ హక్కులను జెఫ్‌కి బదలాయించవచ్చని.. అయితే, ప్రస్తుతం ఆయన మైనారిటీ షేర్‌హోల్డరే కనక దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని వారు చెబుతున్నారు. వాటాలపరమైన ఓటింగ్ హక్కులతో కాకుండా కంపెనీ వ్యవస్థాపకుడి హోదా కారణంగానే జెఫ్.. అమెజాన్‌ను నడిపించగలుగుతున్నారనేది విశ్లేషకుల అభిప్రాయం. ఒకవేళ కంపెనీని కాపాడుకోవాలంటే.. సంస్థ నిర్వహణపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుం డా.. మరేదైనా రూపంలో మెకెంజీకి వాటాలు ఇచ్చే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. విభేదాలు తలెత్తితే.. ఒకవేళ బెజోస్ విడాకుల వ్యవహారం వివాదాస్పదమైన పక్షంలో ఇటు స్టాక్ మార్కెట్ పరంగానూ అటు పబ్లిక్ రిలేషన్స్ పరంగానూ అమెజాన్ కంపెనీ భవితపై కచ్చితంగా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందనే మరో వాదన కూడా వినవస్తోంది. దీనితో లాయర్లు అత్యధికంగా ప్రయోజనం పొందవచ్చని కెస్లర్ అండ్ సోలోమియాని లీగల్ సంస్థ పార్ట్నర్ రాండల్ కెస్లర్ పేర్కొన్నారు. అత్యంత సంపన్నురాలిగా మెకెంజీ దాదాపు పాతికేళ్ల దాంపత్య బంధానికి ఫుల్స్టాప్ పెడుతూ జెఫ్ బెజోస్ (54), మెకెంజీ (49) విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. లారెన్ సాంచెజ్ అనే మాజీ న్యూస్ యాంకర్‌కి, బెజోస్‌కి మధ్య అఫైర్ నడుస్తుండటం ఇందుకు కారణం. విడాకులతో మెకెంజీకి.. జెఫ్ బెజోస్ ఆస్తిలో సగం వాటాలు దక్కే అవకాశం ఉంది. దీని విలువ భారత కరెన్సీలో రూ. 4.5 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. దీంతో ఈ విడాకుల డీల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైనదిగా ఉండనుంది. విడాకులతో మెకెంజీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలిగా మారతారు. అదే సమయంలో ప్రస్తుతం నంబర్ వన్ స్థానంలో ఉన్న జెఫ్ బెజోస్ సంపద సగానికి తగ్గిపోవడంతో మైక్రోసాఫ్ట్ బిల్‌గేట్స్ తర్వాత రెండో స్థానానికి పరిమితం కావొచ్చు. -
జియో 100% క్యాష్ బ్యాక్
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో నూతన సంవత్సర ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. రూ. 399తో రీచార్జ్ చేసుకుంటే 100% క్యాష్ బ్యాక్ పొందవచ్చని పేర్కొంది. ఈ–కామర్స్ పోర్టల్ ఏజియో కూపన్స్ రూపంలో ఇది లభిస్తుంది. మైజియో యాప్‌లోని ’మైకూపన్స్’ సెక్షన్లో ఈ కూపన్ క్రెడిట్ అవుతుందని.. ఏజియో(అఒఐౖ) యాప్ లేదా వెబ్సైట్లో షాపింగ్ చేసినప్పుడు దీన్ని రిడీమ్ చేసుకోవచ్చునని కంపెనీ తెలిపింది. కాకపోతే కనీసం రూ. 1,000 మేర కొనుగోళ్లు జరపాల్సి ఉంటుంది. ఏజియో వెబ్సైట్లో లభించే డిస్కౌంటుకు ఇది అదనం. డిసెంబర్ 28 – 2019 జనవరి 31 మధ్యలో పాత, కొత్త యూజర్లు చేయించుకునే రీచార్జ్‌లకు ఇది వర్తిస్తుంది. కూపన్స్‌ను మార్చి 15 లోగా రిడీమ్ చేసుకోవచ్చు. -
హీరోయిన్‌కి షాక్ ఇచ్చిన అమెజాన్
ఆన్లైన్ బిజినెస్‌లు పెరుగుతున్న కొద్ది మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఆన్లైన్లో ఏదైన వస్తువు బుక్ చేసిన వారికి ఆ వస్తువులకు బదులు రాళ్లు, సబ్బులు లాంటవి రావటం మనం తరుచూ వార్తల్లో చూస్తుంటాం. తాజాగా ఇలాంటి అనుభవమే ఓ బాలీవుడ్ హీరోయిన్‌కు ఎదురైంది. సోనాక్షి సిన్హా అమెజాన్‌లో బోస్ కంపెనీ ఇయర్ ఫోన్స్ బుక్ చేశారు. అయితే ఆ ప్యాక్ ఇయర్ ఫోన్స్‌కు బదులు ఓ ఇనుప ముక్క ఉండటంతో సోనాక్షి షాక్‌కు గురయ్యారు. ఈ విషయంపై అమెజాన్ కస్టమర్ కేర్‌ను సంప్రదించే ప్రయత్నం చేసిన వారు సరిగ్గా స్పందించకపోవటంతో ఆమె సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేశారు. ‘అమెజాన్.. నేను బోస్ ఇయర్‌ఫోన్స్ ఆర్డర్ చేస్తే ఏమో వచ్చాయో చూడండి. బయటకు బాక్స్ మంచి ప్యాక్ చేసిన నీట్‌గా సీల్‌వేసి ఉంది. మీ కస్టమర్ సర్వీస్ కూడా సాయం చేసేందుకు సిద్ధంగా లేదు’ అంటూ ట్వీట్ చేశారు. ఈవిషయంపై స్పందించిన అమెజాన్, సోనాక్షిని క్షమాపణలు కోరుతూ ట్వీట్ చేయటంతో పాటు వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. Hey @amazonIN! Look what i got instead of the @bose headphones i ordered! Properly packed and unopened box, looked legit... but only on the outside. Oh and your customer service doesnt even want to help, thats what makes it even worse. pic.twitter.com/sA1TwRNwGl — Sonakshi Sinha (@sonakshisinha) 11 December 2018 Anybody want to buy a brand new shiny piece of junk for 18,000 bucks? (Yup, its a steal) Dont worry, im selling, not @amazonIN, so ull get exactly what you’re ordering. pic.twitter.com/3W891TA7yd — Sonakshi Sinha (@sonakshisinha) 11 December 2018 Uh-oh! This is unacceptable! Apologies for the recent ordering experience and the subsequent correspondence with our support team. Please share your details here: https://t.co/vIE01Lj9nJ, we'll get in touch with you directly. ^JC — Amazon Help (@AmazonHelp) 11 December 2018 -
జియో ల్యాపీ రూ.599కే.. ఈ లింక్ చూశారా?
డిజిటల్ మార్కెటింగ్, ఈ– కామర్స్ మార్కెట్ల పుణ్యమా అని షాపులకు వెళ్లకుండానే మనకు కావాల్సిన వస్తువులను నేరుగా ఇంటి వద్దకే తెప్పించుకునే వెసులుబాటుతో ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. నాణేనికి ఇది ఒకవైపు మాత్రమే. నిజానికి ఆన్లైన్లో మనం చూసే వెబ్సైట్లలో చాలా వరకు నకిలీవి పుట్టుకొస్తున్నాయి. ఇంటర్నెట్ బ్రౌసింగ్ ప్రారంభించగానే మీకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్ అందిస్తాం. చౌకగా ల్యాబ్‌టాప్ పంపిస్తామనే ప్రకటనలు కనిపిస్తుంటాయి. ఈ ప్రాసెస్‌లో మీరు చేయాల్సింది ఒక్కటే మీ డిటైల్స్‌తో కూడిన ఫామ్‌ను పూరించి తమకు అందించడమే తరువాయి. వారం రోజుల్లో సెలక్ట్ చేసుకున్న ప్రొడక్ట్ మీ ఇంటికి పంపిస్తామనే ప్రకటనలతో అమాయకుల డబ్బులు కాజేసి బురిడీ కొట్టిస్తున్నాయి కొన్ని వెబ్సైట్లు. సాక్షి, హైదరాబాద్: తెలియని వ్యక్తికి ఏ కంపెనీ ఉచితంగా గిఫ్టూ ఇవ్వదు. కానీ కొందరు ఇదేం పట్టించుకోక సదరు కంపెనీకి తమ వ్యక్తిగత డాటాను చేరవేస్తారు. ఇలా సంబంధిత వ్యక్తి వివరాలను తీసుకుని రెండు రోజుల్లో ప్రాసెస్ జరుగుతుందని నమ్మించి.. ఆ తర్వాత మీ ప్రొడక్ట్ రెడీగా ఉంది కానీ కస్టమ్స్ చార్జీలు పంపించండని చెబుతారు. ప్రొడక్ట్ విలువను బట్టి కస్టమ్స్ చార్జీలను నిర్ణయిస్తామంటారు. వినియోగదారుడు పూర్తిగా నమ్మితే గాని ఖాతా వివరాలను షేర్ చేయరు. ఖాతా వివరాలను పంపిన తర్వాత మీ ప్రొడక్ట్ వ్యాల్యూ లక్ష రూపాయలు అని, మీరు కేవలం పదిశాతం పన్ను చెల్లిస్తే సరిపోతుందని చెబుతారు. సదరు వ్యక్తి డిపాజిట్ చేసిన తర్వాత నుంచి వినియోగదారునికి ఎటువంటి రిప్లై ఇన్ఫర్మేషన్ లభించదు. సదరు వినియోగదారుడు తాను మోసపోయానని తెలిసేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇలా ట్రాన్స్ఫర్ అవుతున్న మొత్తం ఒక్కోసారి లక్షల్లో కూడా ఉండటం గమనార్హం. ‘ఆయుష్మాన్ భారత్’ పేరుతో ఆన్లైన్ ఫ్రాడ్.. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆయుష్మాన్ భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య బీమాను ప్రవేశపెట్టిన విషయం విదితమే. దీనిపై ఇప్పటికే అనేక నకిలీ వెబ్సైట్లు పుట్టుకొచ్చాయి. ఆయుష్మాన్ భారత్ అధికారిక వెబ్సైట్ httpr://www.abnhpm.gov.in/ని పోలి ఉండేలా నకిలీ వెబ్సైట్లు డిజైనింగ్‌తో సహా రూపొందించారు. ఆయా నకిలీ వెబ్సైట్లలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫొటోలు పెట్టడంతో పాటు.. రూ.1000 నుంచి రూ. 2000 ప్రీమియం చెల్లించడం ద్వారా ఈ ప్రయోజనాలు పొందవచ్చు అంటూ జనాలను మోసం చేసే మెసేజ్ పొందుపరిచారు. అంతేకాదు, ‘పేదలకు చేరేలా ఈ మెసేజ్ అందరికీ షేర్ చేయమని’ వినియోగదారులను నకిలీ వెబ్సైట్లు ట్రాప్ చేస్తున్నాయి. తెలిసీ తెలియక చాలామంది అమాయకులు వారు కోరిన మొత్తాన్ని చెల్లించి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. గిజ్చ్టిట్చ ppలో కూడా ఆయుష్మాన్ భారత్ పేరిట నకిలీ వెబ్సైట్లు విస్తృతంగా సర్కులేట్ అవుతున్నాయి. ఒకవేళ ఏదైనా మీ దృష్టికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దు. ఇతరులకు షేర్ చేయవద్దు. డబ్బులు వసూలు చేస్తే అది నకిలీదే.. ‘ఆయుష్మాన్ భారత్’ పేరిట ఉచితంగా హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన పనిలేదు. ఒకవేళ ఏదైనా వెబ్సైట్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం డబ్బులు వసూలు చేస్తున్నట్లయితే దాన్ని కచ్చితంగా నకిలీ వెబ్‌సైట్‌గా ప్రజలు పరిగణించాలి. కొన్ని సైట్లు డబ్బులు ఏమీ అడగకుండానే ప్రజల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయని ఆయుష్మాన్ భారత్ సీఈఓ ఇందు భూషణ్ వెల్లడించారు. ఈ స్కీమ్‌కు సంబంధించి కేవలం 1455 నంబర్ మాత్రమే ఉందని, ఇతర నంబర్లను నమ్మవద్దని ఆయన హెచ్చరించారు. జియో ల్యాపీ రూ.599కే.. ఈ లింక్ చూశారా..? ఇలాంటిదే మరో ఫేక్ వెబ్సైట్ ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. అదే జియో వెబ్సైట్ ఆన్లైన్. చిత్రంలో కనిపిస్తున్న వెబ్‌సైట్‌ను చూశారు కదా. ఈ వెబ్సైట్లోకి వెళితే జియోకి సంబంధించిన వస్తువులన్నీ తక్కువ ధరకే అందుబాటులోకి ఉన్నాయని చెబుతోంది. ఇంత తక్కువ ధరకు సాధ్యమేనా..? రూ.24,999 విలువైన జియో ల్యాప్‌టాప్‌ను కేవలం రూ.599కే అందించడం సాధ్యమా. విచిత్రమేమిటంటే అసలు జియోలో ల్యాప్‌టాప్ ఇప్పటి వరకు మార్కెట్లోకే రాలేదు. ఇది నకిలీదని.. మరి అత్యంత తక్కువ ధరకి వాళ్లు ఎలా విక్రయిస్తారన్న సందేహం మనకు తప్పకుండా రావాలి. ఇవే కాకుండా ఈ తరహా దోపిడీ చేసే నకిలీ వెబ్సైట్లకు చెందిన పలు యాడ్స్ ఇప్పుడు ఫేస్బుక్లో కోకొల్లలుగా దర్శనమిస్తున్నాయి. అందుకే ఏమరుపాటుగా ఉండటం మన బాధ్యత. తస్మాత్ జాగ్రత్త. -
ఒప్పందంపై బహుపరాక్!
ఆన్లైన్ వ్యాపారంలో వరస విజయాలు సాధిస్తూ దూసుకెళ్తున్న దేశీ ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ భారీ మొత్తంతో కొనుగోలు చేయడం ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనమైంది. చాన్నాళ్లుగా ఇరు సంస్థల వ్యవస్థాపకుల మధ్యా సాగుతున్న చర్చల పర్యవసానంగా ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను రూ. 1,05,000 కోట్లతో వాల్‌మార్ట్ కొనుగోలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా వాల్‌మార్ట్ చేపట్టిన కంపెనీ కొనుగోళ్లలో మాత్రమే కాదు... మొత్తం ఈ–కామర్స్ రంగంలోనే ఇది అతి పెద్దదని చెబుతున్నారంటేనే ఫ్లిప్‌కార్ట్ ఏ స్థాయికి ఎదిగిందో అర్ధమవుతుంది. ఆన్లైన్ వ్యాపారానికి అంతగా ఆదరణలేని తరుణంలో ఆ రంగంలో అడుగుపెట్టిన ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులను అటువైపు ఆకర్షించడానికి చాలానే కృషి చేసింది. 2000 సంవత్సరంలో డాట్కామ్లు తామరతంపరగా పుట్టుకొచ్చినప్పుడు ఇక భవిష్యత్తంతా ఆన్లైన్ వ్యాపారానిదేనన్న అభిప్రాయం అందరిలోనూ కలిగింది. కానీ చాలా తక్కువకాలంలోనే అదంతా నీటిబుడగ చందంగా మాయమైంది. ఆన్లైన్లో ఆర్డరిచ్చి తెప్పిం చుకునే వస్తువులు నాసిరకంగా ఉంటాయన్న అనుమానాలు, ఫిర్యాదు చేస్తే పట్టించుకోరన్న భయాలు ఆ వ్యాపారానికి అవరోధంగా మారాయి. ఇలా అంతంతమాత్రం ఆదరణ ఉన్న సమయంలో ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు అలాంటి భయాలను, అనుమానాలను పోగొట్టడానికి కృషి చేశాయి. దీనికితోడు టెక్నాలజీ రంగంలో వచ్చిన పెను మార్పులు, ఈ–కామర్స్ సంస్థ లిచ్చే భారీ డిస్కౌంట్లు కూడా ఆన్లైన్ వ్యాపార విస్తరణకు దోహదపడ్డాయి. వినియోగదారులు ముందుగా చెల్లించడం కాక, కోరుకున్నది తమకు చేరాకే డబ్బు చెల్లించే ‘క్యాష్ ఆన్ డెలివరీ’ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఈ–కామర్స్ తీరునే ఫ్లిప్‌కార్ట్ మార్చేసింది. పుస్తకా లతో మొదలుపెట్టి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫోన్లు, టీవీలు, దుస్తులు... ఇలా ఆన్లైన్లో ఇప్పుడు దొరకనిదేదీ లేదు. వచ్చే అయిదేళ్లలో ఈ–కామర్స్ మార్కెట్ నాలుగు రెట్లు పెరుగు తుందంటున్నారు. అయితే ఇప్పటికీ మన దేశంలో సంప్రదాయ రిటైల్ వ్యాపారం వాటాయే అధికం. ఆన్లైన్ వ్యాపారం ఎంతగా విస్తరిస్తున్నా సంప్రదాయ వ్యాపారం దరిదాపులకు అదింకా చేరలేదు. ఒక సంస్థ అధ్యయనం ప్రకారం మన దేశంలో మొత్తం రిటైల్ రంగం విలువ 65000 కోట్ల డాలర్లు (సుమారు రూ. 43,62,800కోట్లు)కాగా, అందులో ఇప్పటికీ 90 శాతం వాటా సంప్రదాయ రిటైల్ వ్యాపారానిదే. కానీ మున్ముందు ఇది ఇలాగే కొనసాగుతుందనుకోవడానికి లేదు. ఈ– కామర్స్ సంస్థలు ఎడాపెడా ఇస్తున్న ఆఫర్లు, డిస్కౌంట్లు క్రమేపీ వినియోగదారులను అటు మళ్లిస్తాయి. సాధారణ రిటైల్ వ్యాపారులకు వినియోగదారుల్లో వారిపై ఉండే విశ్వాసమే ప్రధాన పెట్టుబడి. ఒక దుకాణంతో ఏళ్లు గడిచేకొద్దీ ఏర్పడే అనుబంధం వినియోగ దారుల్ని ఎటూ పోకుండా నిలబెడుతుంది. ఆ వ్యాపారులు దుకాణానికి అద్దె చెల్లించాలి. సరుకు నిర్వ హణ చూసుకోవాలి. తగినంతమంది సిబ్బందిని నియమించుకోవాలి. వారి జీతాలు, ఇతర నిర్వహణ ఖర్చులు చూసుకోవాలి. కనుక వారు వినియోగదారులకిచ్చే డిస్కౌంట్లకు పరిమితి ఉంటుంది. కానీ ఆన్లైన్ వ్యాపార సంస్థలకు ఇలాంటి బాదరబందీ లేదు. ఆన్లైన్లో వారు అమ్మే సరుకేదీ వారి దగ్గర ఉండదు. గిడ్డంగులున్నవారితో, సరుకులు సరఫరా చేసేవారితో, కొరియర్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని వారందరినీ సమన్వ యపరుచుకుంటూ విని యోగదారులు కోరుకున్నవి అందేలా చూస్తారు. అహేతుకమైన డిస్కౌంట్లు, ఆఫర్లవల్ల వీరికి నిజానికి నష్టాలే వస్తాయి. వీటిని కొన్నేళ్లు భరిస్తే క్రమేణా సంప్రదాయ రిటైల్ వ్యాపారం దెబ్బతిని కనుమరుగవుతుందని, అప్పుడు మార్కెట్‌ను శాసించి లాభాల బాట పట్టొచ్చునన్నది వీరి వ్యాపార సూత్రం. అభివృద్ధి చెందిన దేశాల్లో జరిగిందదే. మన దేశంలో సంప్రదాయ రిటైల్ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 కోట్ల మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆ వ్యాపారం దెబ్బతింటే వీరందరూ వీధిన పడతారు. అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌ను చేజిక్కించుకున్న వాల్‌మార్ట్‌తో మరో ప్రమాదం ఉంది. ఇది చవగ్గా దొరికే చైనా సరుకుతో మార్కెట్లను ముంచెత్తుతోంది. అది అమ్మే సరుకులో దాదాపు 80 శాతం చైనా మార్కెట్‌కు సంబంధించినవే. ఇందువల్ల రిటైల్ దుకాణదారులకు, వినియో గదారులకొచ్చే కష్టనష్టాల సంగతలా ఉంచి మన తయారీ రంగం తీవ్రంగా దెబ్బతింటుంది. రిటైల్ రంగంలోని కోట్లాదిమంది ఉపాధి దెబ్బతింటుంది. చైనా తయారీరంగం మాత్రం పుంజుకుంటుంది. ఆ దేశంతో ఇప్పటికే మనకున్న వాణిజ్య లోటు మరింత పెరుగుతుంది. చైనా కార్మికులకు ఉపాధి, అక్కడి పరిశ్రమలకు, అమెరికా ఈ–కామర్స్ సంస్థకు లాభాలు తెచ్చిపెట్టే ఈ పరిణామం మల్టీబ్రాండ్ రిటైల్ ఎఫ్డీఐపై ఉన్న పరిమితులను ఈ–కామర్స్ దారిలో ఉల్లంఘిస్తోంది. వీటన్నిటిపైనా ఇప్పటికే అఖిల భారత వర్తక సంఘాల సమాఖ్య, ఆరెస్సెస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్వంటివి నిరసన వ్యక్తం చేశాయి. తాజా ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి మన ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. చట్టాల్లోని లొసుగులను తొలగించాలి. -
ఈ–కామర్స్‌పై టాస్క్‌ఫోర్స్: కేంద్రం
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ రంగానికి సంబంధించి ప్రత్యేక విధానం రూపకల్పనపై కేంద్రం దృష్టి సారించింది. ఇందుకోసం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ–కామర్స్‌పై జాతీయ విధానం రూపకల్పనపై ఏర్పాటైన కమిటీ మంగళవారం తొలిసారి సమావేశమైన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది. ట్యాక్సేషన్, ఇన్ఫ్రా, పెట్టుబడులు, టెక్నాలజీ బదలాయింపు, డేటా భద్రత, నిబంధనలు, పోటీ మొదలైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రీటా తియోతియా తెలిపారు. టాస్క్‌ఫోర్స్ తమ సిఫార్సులను అయిదు నెలల్లోగా కమిటీకి సమర్పించాల్సి ఉంటుందని, కమిటీ ఆరు నెలల్లో నివేదికనివ్వాల్సి ఉంటుందని ఆమె తెలియజేశారు. డైరెక్ట్ సెల్లర్లకు ఆన్లైన్ సెగ!: ఐడీఎస్ఏ డైరెక్ట్ సెల్లర్ల వ్యాపారంపై ఆన్లైన్ డిస్కౌంట్లు ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్, షాప్‌క్లూస్ వంటి ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో డైరెక్ట్ సెల్లర్ల అనుమతి లేకుండానే వారికి సంబంధించిన ఉత్పత్తులు అధిక డిస్కౌంట్ ధరలకు లభిస్తున్నాయి. దీంతో వారి వ్యాపారంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ విషయాలు ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ (ఐడీఎస్ఏ) 2016–17 వార్షిక నివేదికలో వెల్లడయ్యాయి. -
ఏపీలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం గాలికి
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్ర ప్రదేశ్‌లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నామమాత్రమేనని కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ వెల్లడించారు. రాజ్య సభలో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఉద్దేశించిన పథకాలు చాలా మందికి దక్కడం లేదని చెప్పారు. ఈ కారణంగానే కార్మికుల రిజిస్ట్రేషన్ కూడా చెప్పుకొదగ్గంతగా లేదు. ఫలితంగా వారి సంక్షేమం కోసం శిస్తు రూపంలో వసూలు చేసిన వందలాది కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేయకుండా మిగిలిపోతున్నట్లుగా మంత్రి చెప్పారు. భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ శిస్తు చట్టం కింద ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1543 కోట్ల రూపాయలు వసూలు కాగా 2017 డిసెంబర్ 3 నాటికి కేవలం 412 కోట్ల రూపాయలను మాత్రమే కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేసిందని గంగ్వార్ వెల్లడించారు. భవన నిర్మాణ రంగంతోపాటు ఇతర నిర్మాణ రంగాల్లో పని చేస్తున్న కార్మికుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, వారందరినీ సంక్షేమ పథకాల పరిధిలోకి తీసుకురావలంటూ కార్మిక మంత్రిత్వ శాఖ పదే పదే ఆంధ్రప్రదేశ్‌తో సహా ఇతర రాష్ట్రాలకు ఆదేశాలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆయా రాష్ట్రాలలోని బిల్డింగ్ ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డులు కార్మికుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను తమ మంత్రిత్వ శాఖ జారీ చేసే ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్నవో లేదో పర్యవేక్షించడానికి కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఒక మోనిటరింగ్ కమిటీని కూడా కేంద్ర ప్రభుత్వం నియమించినట్లు మంత్రి తెలిపారు. ఈ-కామర్స్‌తో స్టోర్స్‌కు ముప్పు లేదు ఆన్లైన్ మార్కెటింగ్ సైట్లతో బ్రిక్ అండ్ మోర్టార్ స్టోర్లకు వచ్చిన ముప్పేమీ లేదని వాణిజ్య శాఖ సహాయ మంత్రి సీఆర్ చౌధరి చెప్పారు. ఈ-కామర్స్ డిస్కౌంట్ రేట్లకు జరుపుతున్న విక్రయాలు స్టోర్స్ అమ్మకాలను ప్రభావితం చేస్తున్న అంశం నీతి ఆయోగ్, ఆర్థిక మంత్రిత్వ శాఖ, వాణిజ్య మంత్రిత్వ శాఖల మధ్య భిన్నాభిప్రాయలకు దారితీస్తోందా అంటూ బుధవారం రాజ్య సభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ, ఆర్థిక రంగం పురోగమించాలన్న ఏకైక లక్ష్యంతోనే ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పని చేస్తుంటాయని అన్నారు. అమలులో ఉన్న నియమ నిబంధనలు, నియంత్రణలకు లోబడే ఆన్లైన్ మార్కెటింగ్ సైట్లు, బ్రిక్ అండ్ మోర్టార్ స్టోర్లు తమ బిజినెస్ మోడల్స్‌ను రూపొందించుకుంటాయని ఆయన చెప్పారు. అయితే ఈ-కామర్స్ సైట్లు తమ సైట్ ద్వారా విక్రయించే వస్తువులు లేదా సేవలకు సంబంధించిన ధరలను ప్రత్యక్షంగాను లేదా పరోక్షంగాను ప్రభావితం చేయకూడదని మంత్రి చెప్పారు. దీని వలన ఆన్లైన్ సైట్లకు స్టోర్ బిజినెస్ మధ్య లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏర్పడుతుందని అన్నారు -
ఆన్లైన్ మోసాలకు కళ్లెం
♦ నగరానికి చెందిన రాజేష్‌కు ఆన్లైన్లో షాపింగ్ చేసే అలవాటు ఉంది. ఖరీదైన మొబైల్‌ను కొనుగోలు చేశాడు. ఇంటికి వచ్చినకవర్‌ను తెరిచి చూసి షాక్ అయ్యాడు. తాను బుక్ చేసినది కాకుండా మరొకటి రావడంతో ఖంగుతిన్నాడు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక ఆందోళన చెందాడు. ఆన్లైన్లో చూస్తే ఎలాంటి వివరాలు లేవు. ♦ పీలేరుకు చెందిన రాణి ఆన్లైన్లో ఓ ఖరీదైన చీరను కొనుగోలు చేసింది. పార్సిల్లో నాసిరకం చీర వచ్చింది. దీన్ని చూసిన ఆమె ఎవరికి చెప్పుకోలేక మథనపడుతోంది. తిరుపతి క్రైం :జిల్లాలో నిత్యం ఏదో ఒక ప్రాం తంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం నగదు రహి త లావాదేవీలు పెరగడంతో ప్రతి ఒక్క రూ ఆన్లైన్ వ్యాపారంపై మొగ్గు చూపుతున్నారు. దాదాపు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఇలాంటి మోసాలకు కళ్లెం వేసేందుకు తూనికలు, కొలతలు శాఖ అధికారులు సన్నద్ధమయ్యారు. ఈ– కామర్స్ వైపు దృష్టి పెట్టేలా ప్రభుత్వం జీవో నెం.629ను విడుదల చేసింది. దాంతో ఆన్లైన్లో జరిగే మోసాలపై బాధితులు ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వం ఈ బాధ్యతల ను తూనికలు, కొలతలశాఖకు అప్పగించింది. జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనలను అమలుకు ఆ శాఖ అధికారులు ఉపక్రమిస్తున్నారు. ఈ మార్కెట్‌పై నిఘా వినియోగదారుల నుంచి ఫిర్యాదులు భారీగా వస్తున్న నేపథ్యంలో ఈ– మార్కెట్‌ను గాడిలో పెట్టేందుకు కేంద్రం కొన్ని చర్యలకు ఉపక్రమించింది. తాజాగా ఈ పర్యవేక్షణ బాధ్యతలను తూనికల కొలతల శాఖకు అప్పగించింది. జీఎస్ఆర్ 629 ఉత్తర్వు ల మేరకు ఈ తరహా మోసాలకు అడ్డుకట్టు వేసేందుకు చర్యలు చేపట్టింది. ఆన్లైన్లో వస్తువులను విక్రయించే సంస్థలు ఇప్పటి వరకు గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ) మాత్రమే ముద్రిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి తయారీ తేదీ, వినియోగదారుడికి అందజేసే గడువు, బరువు, పరిమాణం తదితర వివరాలతోపాటు ఏదైనా సమస్య ఉత్పన్నమైతే వినియోగదారులు సంద్రించాల్సిన చిరునామా, కస్టమర్ కేర్ ఫోన్ నెంబర్‌ను స్పష్టంగా ముద్రించాలని, సంబంధిత ఉత్పత్తుల పూర్తి సమాచారం, కొనుగోలుదారులు సులభంగా చదువుకునేలా పెద్ద అక్షరాలతో ముద్రించాలని వినియోగదారుల వ్యవహారాలశాఖ పేర్కొనడంతో ఈ దశగా మార్పులు ప్రారంభమయ్యాయి. ఇది పరిస్థితి జిల్లాలో 70 నుంచి 80 శాతం మంది సెల్ఫోన్లను వినియోగిస్తున్నా రు. వీరిలో 40 శాతం మందికి పైగా 4జీ నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్నారు. తద్వారా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. ఫ్యాషన్‌కు అనుగుణంగా చొక్కాలు మొదలుకుని సెల్ఫోన్లు, కొత్తకొత్త మోడళ్ల కోసం నిత్యం సర్చ్ చేస్తున్నారు. దీంతో పుట్టగొడుగుల్లా కొత్త వ్యాపార సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ఎలాంటి సెక్యూరిటీ లేని వాట్సాప్, ఫేస్బుక్, గూగుల్ వంటి మాధ్యమాల్లో ప్రచారాలు చేస్తున్నాయి. వాటి జోలికి వస్తే నట్టేట ముంచేస్తున్నారు. ఫిర్యాదు ఇలా ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే వెంటనే తూనికలు, కొలతల శాఖకు ఫిర్యాదు చేయవచ్చు. డివిజన్ల వారీగా ఇన్స్పెక్టర్లకు లేదా సంబంధిత అధికారులను కలిసి తాము మోసపోయిన విధానాన్ని వివరించవచ్చు. ఫిర్యాదులతో పాటు ఆన్లైన్లో కొనుగోలు చేసిన రసీదు, సెల్‌ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌లు చూపించాల్సి ఉంటుంది. కొనుగోలు సమయంలో ఆన్లైన్లో చూపించిన వస్తువు, ఇంటికొచ్చిన పార్సల్లోని వస్తువును చూపించాలి. అలా వివరించిన అనంతరం మోసానికి పాల్పడిన సంస్థకు తూనికల శాఖ నోటీసు జారీ చేస్తుంది. అనంతరం వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తారు. మోసానికి పాల్పడితే చర్యలే.. ఈ–కామర్స్ సంస్థలో వినియోగదారులు మోసపోకుండా భద్రత కల్పించేలా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. వీటిలో జరిగే లావాదేవీలపై తూనికలశాఖ ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఆన్లైన్ కంపెనీలు ఎటువంటి మోసాలకు పాల్పడినా వెంటనే ఫిర్యాదు చేయండి. వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఆన్లైన్లో వస్తువులు మారినా, నాణ్యత తగ్గినా వస్తువు వివరాలు లేకపోయినా చర్యలు తప్పవు.– రవీంద్రారెడ్డి, తూనికలు,కొలతలశాఖాధికారి, తిరుపతి -
2020కి భారత్ ఆన్లైన్ కొనుగోళ్లు @ 10,000 కోట్ల డాలర్లు
వినియోగదారులు ఆన్లైన్లో జరిపే కొనుగోళ్ల విలువ 2020 నాటికి 2.5 రెట్లు పెరిగి దాదాపు 10,000 కోట్ల డాలర్లకు చేరొచ్చని అంచనా. ఈ–కామర్స్, ట్రావెల్ అండ్ హోటల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, డిజిటల్ మీడియా రంగాల్లోని వృద్ధి దీనికి దోహదపడుతుంది. ఈ విషయాలు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, గూగుల్ సంయుక్త నివేదికలో వెల్లడయ్యాయి. నివేదికలోని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ♦ భారతీయులు ప్రస్తుతం ఆన్లైన్లో జరిపే కొనుగోళ్ల విలువ దాదాపు 4,000 కోట్ల డాలర్లుగా ఉంది. ♦ ఈ–కామర్స్ విభాగంలో అప్పరెల్ అండ్ యాక్ససిరీస్, కన్సూమర్ ఎలక్ట్రానిక్స్, డ్యూరబుల్స్, ఫుడ్ అండ్ గ్రాసరీ వంటి ఉత్పత్తులపై కస్టమర్ల వ్యయాలు 2020 నాటికి ప్రస్తుతమున్న 18 బిలియన్ డాలర్ల నుంచి 40–45 బిలియన్ డాలర్లకు చేరొచ్చు. అలాగే ట్రావెల్ అండ్ హోటల్ వ్యయాలు 11 బిలియన్ డాలర్ల నుంచి 20 బిలియన్ డాలర్లకు, ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యయాలు 12 బిలియన్ డాలర్ల నుంచి 30 బిలియన్ డాలర్లకు, డిజిటల్ మీడియా వ్యయాలు 200 మిలియన్ డాలర్ల నుంచి 570 మిలియన్ డాలర్లకు పెరగొచ్చు. ♦ అందుబాటు ధరల్లోని స్మార్ట్‌ఫోన్స్, చౌక డేటా ప్లాన్స్, స్థానిక భాషలో ఎక్కువ కంటెంట్ అందుబాటులోకి రావడం వంటి పలు అంశాల కారణంగా ఆన్లైన్ యూజర్ల సంఖ్య గత నాలుగేళ్లలో దాదాపు 2 రెట్లు పెరిగి ప్రస్తుతం 43 కోట్లకు చేరింది. ♦ నాన్–టైర్ 1 పట్టణాల్లోని కొత్త యూజర్లు, మహిళలు సహా 35 ఏళ్లకుపైన వయసున్న షాపర్లు ఆన్లైన్ కొనుగోళ్ల వృద్ధికి బాగా దోహదపడనున్నారు. ♦ 2020 నాటికి మహిళా షాపర్ల సంఖ్య 2.5 రెట్లు పెరగనుంది. ♦ మౌలిక సదుపాయాల మెరుగుదల వల్ల మెట్రో నగరాలే కాకుండా పట్టణాల నుంచి కూడా ఆన్లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరగనుంది. ♦ ఏదేమైనప్పటికీ అమెరికా, చైనాలతో పోలిస్తే భారత్‌లో డిజిటల్ లావాదేవీల సంఖ్య తక్కువగానే ఉంది. ♦ భారత్‌లో ఐదుగురు ఇంటర్నెట్ యూజర్లలో ఒకరు ఆన్లైన్లో షాపింగ్ చేసి ప్రొడక్టులను కొనుగోలు చేస్తున్నారు. ఆరుగురిలో ఒకరు ఆన్లైన్లో ట్రావెల్ బుకింగ్స్ చేసుకుంటున్నారు. దాదాపు 75–80 శాతం మంది ఇంటర్నెట్ యూజర్లు ఇప్పటికీ ఆన్లైన్లో కొనుగోళ్లు చేయడం లేదు. ఆఫర్లు, డిస్కౌంట్లు వంటి వాటితో యూజర్లను కొనుగోలు మార్గంలోకి ఆకర్షించొచ్చు. -
ఫ్యూచర్ చేతికి ‘వల్కన్ ఎక్స్‌ప్రెస్’!
న్యూఢిల్లీ: కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ సప్లై చెయిన్ సొల్యూషన్స్ కంపెనీ ప్రముఖ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్‌డీల్‌కు చెందిన లాజిస్టిక్స్ విభాగం వల్కన్ ఎక్స్‌ప్రెస్‌ను కొనుగోలు చేసింది. పూర్తిగా నగదు చెల్లించి వల్కన్ ఎక్స్‌ప్రెస్‌ను కొనుగోలు చేశామని, ఈ డీల్ విలువ రూ.35 కోట్లని ఫ్యూచర్ గ్రూప్ చైర్మన్ కిశోర్ బియానీ తెలిపారు. వల్కన్ చేరికతో ఈ కామర్స్, రిటైల్ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలందించగలమని చెప్పారాయన. కాగా పూర్తిగా ఈ–కామర్స్ వ్యాపారంపైననే దృష్టి సారించే వ్యూహంలో భాగంగా స్నాప్‌డీల్ కంపెనీ వల్కన్ ఎక్స్‌ప్రెస్‌ను విక్రయించిందని స్నాప్‌డీల్ చీఫ్ స్ట్రాటజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ జేసన్ కొఠారి పేర్కొన్నారు. ఫ్యూచర్ సప్లై చెయిన్‌కు దేశవ్యాప్తంగా 44 గిడ్డంగులు, 14 లాజిస్టిక్స్ కేంద్రాలు, 106 బ్రాంచ్‌లు ఉన్నాయి. ఫ్యూచర్ జోరు..: ఇటీవల కాలంలో ఫ్యూచర్ కంపెనీ జోరుగా కంపెనీలను కొనుగోలు చేస్తోంది. గత ఏడాది అక్టోబర్‌లో ఈ కంపెనీ షాపర్స్ స్టాప్‌కు చెందిన హైపర్ సిటీ రిటైల్‌ను రూ.655 కోట్లకు కొనుగోలు చేసింది. గత వారమే ట్రావెల్ న్యూస్ సర్వీసెస్ ఇండియాను (టీఎన్ఎస్ఐ) రూ.100 కోట్లకు కొనుగోలు చేసింది. -
నోట్ల రద్దుతో 4 లక్షల ఉద్యోగాలు హాంఫట్!
-
నోట్ల రద్దుతో 4 లక్షల ఉద్యోగాలు హాంఫట్!
పెద్దనోట్ల రద్దు కారణంగా భారత ఆర్థిక వృద్ధి 1 శాతం తగ్గిపోతుందని, దాంతో వచ్చే సంవత్సరం దాదాపు 4 లక్షల ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా ఈ-కామర్స్ రంగంలో ఎక్కువ ఉద్యోగాలు పోవచ్చని, రాబోయే సంవత్సర కాలంలో సుమారు 2 లక్షల ఉద్యోగాలు పోవచ్చని అంటున్నారు. ఈ కామర్స్ రంగంలో దాదాపు 70 శాతం వరకు క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలోనే జరుగుతాయని, కానీ ఇప్పుడు ప్రజల వద్ద నగదు ఎక్కువగా అందుబాటులో లేకపోవడంతో చాలావరకు లావాదేవీలు మానుకుంటారని, అసలు వ్యాపారమే జరగనప్పుడు ఈ కామర్స్ రంగంలో అంతమంది ఉద్యోగులు అక్కర్లేదు కాబట్టి ప్రధానంగా డెలివరీ రంగంలోని వాళ్లకు చాలావరకు ఉద్యోగాలు పోతాయని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ కసహ వ్యవస్థాపకురాలు రితుపర్ణ చక్రవర్తి తెలిపారు. ప్రస్తుతం భారతదేశంలో ఈ కామర్స్ రంగంలో మొత్తం 10 లోల మంది ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, లగ్జరీ వస్తువులను తయారుచేసి, అమ్మే కంపెనీలపై కూడా తక్షణ ప్రభావం కనిపిస్తుందని, ఇప్పటికప్పుడు అవసరం లేని లగ్జరీల మీద పెట్టే ఖర్చును ప్రజలు వెంటనే మానుకుంటారని రితుపర్ణ విశ్లేషించారు. ఇక రియల్ ఎస్టేట్, నిర్మాణం, మౌలిక సదుపాయాల రంగాలపై కూడా పెద్దనోట్ల ప్రభావం గట్టిగానే పడేలా ఉంది. ఈ రంగాల్లో రాబోయే ఏడాది కాలంలో దాదాపు లక్ష ఉద్యోగాలు పోతాయని కన్సల్టింగ్, నియామక సంస్థలు అంచనా వేస్తున్నాయి. రాబోయే ఆరు నుంచి ఎనిమిది నెలల్లో ఉద్యోగాలు పోవడం, నియామకాలు తగ్గడం లాంటివి చూస్తామంటున్నారు. చేనేత వస్త్ర రంగాలలో చాలామంది దినసరి వేతనాల మీద పనిచేస్తారని, వాటి మీద కూడా నోట్ల రద్దు ప్రభావం గట్టిగానే పడుతుందని అంటున్నారు. ఈ పరిశ్రమలో మొత్తం 3.2 కోట్ల మంది పనిచేస్తుండగా, వాళ్లలో ఐదోవంతు దినసరి వేతన కార్మికులేనని, వస్త్రాల అమ్మకాలు తగ్గడంతో ఉత్పత్తులు తిరిగి రావడం, దానివల్ల దినసరి వేతన కార్మికులకు ఉద్యోగాలు పోవడం లాంటివి సంభవించే అవకాశం ఉందని చెబుతున్నారు. తోలు పరిశ్రమలోని మొత్తం 2.5 లక్షల మంది ఉద్యోగులలో 20 శాతం మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది. -
ఈ-కామర్స్ వ్యాపారంలోకి గతి ప్రమోటర్లు
గతి చీఫ్ బ్రాండ్ కస్టోడియన్ మీరా మధుసూధన్ సింగ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లాజిస్టిక్, సప్లై చైన్ సంస్థ ‘గతి’ ప్రమోటర్లు ఆన్లైన్ ఈ-కామర్స్ వ్యాపారంలోకి అడుగు పెట్టనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆన్లైన్ ఈ- కామర్స్ మార్కెట్‌ప్లేస్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు గతి చీఫ్ బ్రాండ్ కస్టోడియన్ మీరా మధుసూధన్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఇది ఇంకా ప్రాధమిక దశలోనే ఉందని, 2016లోగా కార్యరూపం దాల్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఈకామర్స్ సంస్థలకు అందిస్తున్న సేవలకు ఇబ్బంది తలెత్తకుండా వేరే ఇన్వెస్టర్లతో కలిసి ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే భౌగోళిక గుర్తింపు కలిగిన హైదరాబాద్ హలీమ్, కరాచీ బిస్కెట్స్, హిమాచల్ యాపిల్స్, ఆల్ఫోన్సా మామిడిపండ్లు, మహారాష్ట్ర వేరుశెనగ చిక్కి వంటివి గతి కనెక్ట్ ద్వారా సప్లై చేస్తున్న సంగతి తెలిసిందే. చేతిలో లాజిస్టిక్, సప్లై మేనేజ్మెంట్ ఉండటంతో వేగంగా విస్తరిస్తున్న ఆన్లైన్ వ్యాపారంలోకి అడుగు పెట్టడానికి చర్చలు జరుపుతున్నామని, ప్రస్తుత ఆన్లైన్ క్లయింట్లకు పోటీ లేకుండా ఈ వెంచర్‌ను తీసుకురానున్నట్లు మీరా తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఒక లాజిస్టిక్ కంపెనీ అభివృద్ధి చేసిన మొబైల్ యాప్‌ను మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఈకామర్స్ సంస్థలకు అందిస్తున్న సేవల ద్వారా గతేడాది రూ. 128 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు తెలిపారు. ఈ ఏడాది విభాగం 100 శాతం వృద్ధిని నమోదు చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 2014-15లో గతి గ్రూపు మొత్తం రూ. 1,663 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. పెరుగుతున్న ఈ-కామర్స్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబైల్లో నాలుగు ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటి ద్వారా రోజుకు 30,000 వస్తువులను డెలివరీ చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం గతి గ్రూపు రోజుకు 2.40 లక్షల వస్తువులను డెలివరీ చేస్తోంది. -
అలీ బాబా ఒక రోజు అమ్మకాలు రూ.91 వేల కోట్లు
బీజింగ్: చైనా ఈ కామర్స్ జెయింట్ అలీబాబా గ్రూప్ తన రికార్డును తానే బద్ధలుకొట్టేసుకుంది. గత ఏడాది ఒక రోజు జరిపిన అమ్మకాలకన్న ఈ ఏడాది ఒకే రోజు రికార్డు శాతంలో అమ్మకాలు జరిపి దాదాపు 50శాతం అధిక ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది ఈ సంస్థ ఒకరోజు ఆన్ లైన్ ద్వారా దాదాపు 9.3 బిలియన్ డాలర్ల అమ్మకాలు జరిపి రికార్డు సృష్టించగా ఈసారి దానిని అధిగమించి 13.8 బిలియన్ డాలర్లు(దాదాపు.రూ.91,00,00,00,000) అమ్మకాలు జరిపి చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్ని చైనాకు చెందిన బీడీఏ అనే సంస్థ చైర్మన్ డంకన్ క్లార్క్ స్పష్టం చేశారు. 'చైనా ఈ కామర్స్ మార్కెట్ లో అలిబాబా నంబర్ వన్ స్థానంలో నిల్చుంది. దీనిని అలాగే కొనసాగించేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాం' అని అలీ బాబా ప్రతినిథులు తెలిపారు. 'మరో ఐదేళ్లలోగా చైనా ప్రపంచంలోనే అతి పెద్ద ఈ కామర్స్ సంస్థగా మారనుంది. ఏరకమైనా వస్తువునైనా ఎగుమతి చేసే సామర్థ్యంతో ఉంటుంది' అని మైఖెల్ ఈవాన్స్ అనే అలీ బాబా ప్రతినిధి వివరించారు. మిగితా సంస్థలు కూడా తమతో పోటీ పడి ఆన్ లైన్ విక్రయాలు జరుపుతున్నా అవి స్పష్టతను కొనసాగించడంలో విఫలమవుతున్నాయని పేర్కొన్నారు. -
గుండ్ల పోచంపల్లిలో ఫ్లిప్‌కార్ట్ అతిపెద్ద స్టోర్
హైదరాబాద్: ఈ కామర్స్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తెలంగాణలో భారీ స్టోర్‌ను ప్రారంభించింది. మేడ్చల్ మండలంలోని గుండ్ల పోచంపల్లి గ్రామంలో ఫ్లిప్ కార్ట్ కార్యాలయం శుక్రవారం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈ బ్రాంచ్ ను ప్రారంభించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఫ్లిప్ కార్ట్ స్టోర్ ల సంఖ్య 17కు చేరాయి. మొత్తం 2.2లక్షల చదరపు అడుగుల వెడల్పులో 5.89లక్షల క్యూబిక్ అడుగుల సామర్థ్యంతో భారీ స్థాయిలో దీనిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫ్లిప్ కార్డ్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ మాట్లాడుతూ తెలంగాణ ఈ కామర్స్ ను విస్తరింపజేయడానికి అనువైన ప్రాంతమని, అందుకే తాము కొత్త బ్రాంచ్‌ను హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించామని చెప్పారు. దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా మొత్తం 17 వేలమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. ఇక ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ దేశంలో ఈ కామర్స్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో తెలంగాణలో ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థ తన బ్రాంచీని స్థాపించడం సంతోషంగా ఉందని, ఈ సంస్థను చూసి మరిన్ని సంస్థలు తెలంగాణలో వ్యాపార సంస్థలు స్ధాపించేందుకు అనుకూలంగా ఉందని వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.