న్యూఢిల్లీ: తమ యూజర్లలో మూడింట ఒకవంతు 25 ఏళ్లలోపు వారు ఉన్నారని ఈ–కామర్స్ కంపెనీ మీషో తెలిపింది. సెన్సార్ టవర్‌తో కలిసి రూపొందించిన నివేదిక ప్రకారం.. నాలుగు, ఆపై శ్రేణి పట్టణాలకు చెందిన కస్టమర్లు తరచూ, మళ్లీ మళ్లీ కొనుగోళ్లు జరుపుతున్నారు.
వీరు ఫ్యాషన్, పాదరక్షలు, శిశు సంరక్షణ వంటి విభాగాల్లో ఉత్పత్తులను కొంటున్నారు. ఈ–కామర్స్ యూజర్ల వృద్ధిలో ఉత్తరప్రదేశ్, బిహార్ ముందంజలో ఉన్నాయి. ఆన్‌లైన్ షాపర్స్‌లో 80 శాతంపైగా ద్వితీయ, ఆపై శ్రేణి నగరాలు, పట్టణాల నుంచి ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం వంటి ఈశాన్య రాష్ట్రాల్లోని కస్టమర్లు ఇన్‌ఫ్లుయెన్సర్ కంటెంట్ ఆధారంగా ఈ–కామర్స్ కొనుగోళ్లను ఎక్కువగా చేస్తున్నారు.
మొత్తం ఆర్డర్లలో ఈ రాష్ట్రాల వాటా 40 శాతం ఉంది. గృహ, వంటింటి ఉపకరణాలకు 10 శాతం ఖర్చు చేస్తున్నారు. ఈ విభాగం 50 శాతం వృద్ధి చెందింది. చీరలు, సంబంధిత యాక్సెసరీస్ కొనుగోళ్లు కొత్త ట్రెండ్.
Comments
Please login to add a commentAdd a comment