breaking news
GenZ
-
నేపాల్ అగ్నిగుండాన్ని చల్లార్చిన యాప్!
కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం(గత) 26 సోషల్ మీడియా యాప్‌లపై విధించిన నిషేధం.. ఆ దేశంలో అలజడిని సృష్టించింది. జెడ్ జనరేషన్ యువత వీధుల్లోకి చేరి నిరసనలు చేపట్టడం.. వాటిని అదుపు చేసే క్రమంలో హింస చెలరేగి 51 మంది మరణించడం.. యాప్ బ్యాన్ ఎత్తివేత.. అయినా శాంతించని యువత.. ప్రధాని రాజీనామా.. ఆపై ఆందోళనకారుల ఛాయిస్ ప్రకారం తాత్కాలిక ప్రధాని ఎంపిక.. ఇదంతా పదిరోజుల వ్యవధిలోనే చకచకా జరిగిపోయింది. అయితే సో.మీ. బ్యాన్ నేపథ్యంలో ఆందోళనకారులు డిస్కార్డ్ Discord అనే చాట్ ప్లాట్‌ఫారమ్‌ను భలేగా ఉపయోగించారు. ఒకవేళ ఈ యాప్ గనుక లేకుండా ఉంటే.. నేపాల్ ఇంకా అగ్నిగుండంగా రగిలిపోతూ ఉండేదేమో అనే చర్చా నడుస్తోందక్కడ.పాలన పేరిట ఇన్నేళ్లుగా కొనసాగిన అవినీతికి నేపాల్ యువత ఎలాగైనా చెక్ పెట్టాలనుకుంది. ఆందోళనలను ఉధృతంగా జరిపి ప్రభుత్వం మెడలు వచ్చింది. అయితే ఈ ఆందోళనలను సమన్వయపర్చుకోవడానికి డిస్కార్డ్ యాప్‌నే Gen Z నిరసనకారులు ఉపయోగించుకున్నారు. అంతేకాదు.. కేపీ శర్మ ఓలీ రాజీనామా తర్వాత.. తమ ఆకాంక్షలకు అనుగుణంగా నాయకుడ్ని ఎన్నుకునే క్రమంలోనూ ఈ వేదికనే ఉపయోగించుకున్నారు. Discord అనే యాప్ గురించి మిలెనియల్స్కు పెద్దగా పరిచయం లేకపోయినా.. Gen Z యువత మాత్రం సౌకర్యవంతమైన, విశ్వసనీయమైన వేదికగా భావిస్తోంది. డిస్కార్డ్(Discord) అనేది 2015లో ప్రారంభమైన డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్. ఇది గేమర్ల కోసం ఆటల మధ్యలోనే స్నేహితులతో చాట్ చేయడానికి రూపొందించబడిన ఒక యాప్. అయితే.. 2020లో మహమ్మారి సమయంలో Gen Z యువతలో ఇది విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. Discord ద్వారా వినియోగదారులు సర్వర్లు అనే కమ్యూనిటీలు ఏర్పాటు చేసి.. టెక్స్ట్, ఆడియో, వీడియో చానెల్స్ ద్వారా చర్చలు జరపడం ప్రారంభించారు. స్క్రీన్ షేరింగ్, స్ట్రీమింగ్, మోడరేషన్ టూల్స్ వంటి ఫీచర్లు కూడా వీటిలో అందుబాటులో ఉన్నాయి. ఒక్కో సర్వర్‌లో గరిష్టంగా 5 లక్షల మంది చేరవచ్చు, కానీ ఒకేసారి 2.5 లక్షల మంది మాత్రమే యాక్టివ్‌గా ఉండగలరు. అందుకే నేపాల్ యువత ఉద్యమానికి దీన్నొక వేదికగా మల్చుకుంది. వీపీఎన్ సాయంతో.. సాధారణంగా వీపీఎన్‌లను ఎందుకు ఉపయోగిస్తారు?.. మిగతా వాళ్ల సంగతి ఏమోగానీ.. నేపాల్ యువత మాత్రం ఈమధ్య దీనిని తాజాగా నిరసనలకే ఉపయోగించింది(నేపాల్‌లో VPNల వినియోగం 3 రోజుల్లోనే 6,000% పెరిగింది.. అలాగే 5వ రోజుకొచ్చేసరికి 8,000% పెరిగింది.). నేపాల్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధం కొనసాగుతున్న వేళ.. విస్తృత యాప్‌గా పేరున్న డిస్కార్డ్(Discord) వీపీఎన్ సాయంతో అందుబాటులోకి తెచ్చుకుంది. ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో ఉన్నట్లు ఎండ్లెస్ ఫీడ్లు లేకుండా.. వాట్సాప్ కంటే ఎక్కువ ఫీచర్లతో Discord ఉండడం వల్లే దీనిని రైట్ఛాయిస్గా అక్కడి యువత భావించింది. అలా.. "Youth Against Corruption" అనే Discord సర్వర్‌లో 145,000 మందికి పైగా సభ్యులుగా చేరారు. ఈ సర్వర్‌లో చర్చలు, అనౌన్స్మెంట్స్, ఫ్యాక్ట్ చెక్, హెల్ప్లైన్లు వంటివి కొనసాగించింది. వారు ఏర్పాటు చేసిన Discord సర్వర్లలో ఇన్ఫర్మేషన్ సులభంగా పాసయ్యింది. పెద్ద సంఖ్యలో సభ్యులు చర్చలు జరిపేందుకు ఇదొ కీలక వేదికగా నిలిచింది. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు.ఓటింగ్ కూడా.. నేపాల్ తాత్కాలిక నాయకత్వం విషయంలో ఏర్పడిన గందరగోళాన్ని డిస్కార్డే తొలగించింది!. మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కీ, నేపాల్ పవర్ హౌజ్‌గా పేరున్న కుల్మన్ ఘీసింగ్, రాపర్ బాలేంద్ర షా(బాలెన్), ఇలా పలువురి పేర్లతో ఓ డైలామా ఏర్పడగా.. డిస్కార్డ్ జరిగింది ఓటింగ్ ద్వారా స్పష్టత తెచ్చుకుంది. అంతేకాదు.. ఈ యాప్ ద్వారానే ప్రతిపక్షాన్ని కూడా సమన్వయపర్చుకుని.. రాజకీయ అనిశ్చితిని తొలగించింది. ఈ ఓటింగ్‌ను పర్యవేక్షించిన శశ్వత్ లామిచ్ఛానే కూడా ఈ విషయాల్ని ధృవీకరించారు. ఇక డిస్కార్డ్లో ఓటింగ్ బుదవారం పూర్తైంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. 50 శాతం ఓట్లు సుశీల్ కార్కీకే పడ్డాయి. ఆ మరుసటి రోజు ఆమె నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, ఆర్మీచీఫ్ అశోక్ రాజ్ సిగ్దెల్ను కలిశారు. అలా నేపాల్ తాత్కాలిక ప్రధాని ఎపిసోడ్లో ఉత్కంఠ వీడింది. అయితే.. ఇండియా టుడే ఓఎస్ఐఎన్టీ(Open-Source Intelligence) సర్వే ప్రకారం ఈ ఓటింగ్‌లో పాల్గొన్నవాళ్లంతా నేపాల్ పౌరులేనా? అనే అనుమానాలు వ్యక్తం చేసింది. భారత్‌లోనూ డిస్కార్డ్Discord ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. అమెరికాలో దాదాపు 25 కోట్లు, బ్రెజిల్లో ఐదున్నర కోట్ల యూజర్లు ఉన్నారు. ఆ తర్వాత భారత్‌లోనూ ఐదు కోట్ల మంది ఈ యాప్‌ను ఉపయోగిస్తునన్నారు. ఈ లిస్ట్‌లో కెనడా, ఫిలిప్పీన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫారమ్ విండోస్, మాక్ఓఎస్, ఆండ్రాయిడ్, ఐవోఎస్, లైనక్స్ వెబ్ బ్రౌజర్లలో కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి 30కి పైగా భాషల్లో అందుబాటులో ఉంది, అందులో తెలుగు మాత్రం లేదు. డిస్కార్డులో గేమింగ్ మాత్రమే కాదు.. పౌర ఉద్యమాలు, రాజకీయ చర్చలు నడుస్తున్నాయి. సొంత సర్వర్‌తో క్రియేటివ్ కమ్యూనిటీలు నిర్మించుకునేందుకు వీలుగా ఉండడంతోనే ఇది సాధ్యమవుతోంది. అంత నిషేధంలోనూ Gen Z యువతకు డిస్కార్డ్ యాప్ ఒక గళం ఇచ్చింది. ఒకవేళ ఈ యాప్‌ను జెన్ జెడ్ యువత గనుక సమర్థవంతంగా ఉపయోగించుకుని గనుక ఉండి ఉంటే.. నేపాల్ ఉద్యమం అసంఘటితంగా, అస్పష్టంగా, మరింత హింసాత్మకంగా మారిపోయే అవకాశం ఉండేదేమో!. -
ఈ నెపో కిడ్స్ విలాసాలు.. చూస్తే మతిపోవాల్సిందే!
నేపాల్‌లో యువత ఆందోళనలు, రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ.. గత వారంరోజులుగా సోషల్ మీడియాలో సమాంతరంగా ఇంకో ట్రెండ్ నడుస్తోంది. అదే పొలిటికల్ నెపో కిడ్స్‌కు వ్యతిరేకంగా సాగుతున్న క్యాంపెయిన్. అందుకే పరిశీలకులు.. నేపాల్ ఆందోళలను కేవలం అవినీతి వ్యతిరేక పోరాటంగానే కాకుండా యువత పట్ల గద్దెదిగిన ప్రభుత్వపు నిర్లక్ష్యం, సామాజిక అసమానతలపైనా తిరుగుబాటుగానూ విశ్లేషిస్తున్నారు. నెపో కిడ్స్.. నేపాల్ జనరేషన్ జెడ్ ఉద్యమానికి కేంద్ర బిందువైందన్న విషయం ఆశ్చర్యం కలిగించేదే. ఒకవైపు దేశంలో యువత నిరుద్యోగం, ఆయా కుటుంబాలు పేదరికంలో మగ్గిపోతుంటే.. మరోవైపు రాజకీయ నేతల పిల్లలు మాత్రం విలాసాలకు పోయారు. సోషల్ మీడియా అకౌంట్లలో.. లక్షల రూపాయల విలువైన దుస్తులు, బ్యాగులు ధరించి ఫోజులు, విదేశీ విహారాలు, విలాసవంతమైన జీవనశైలిని రీల్స్.. ఫొటోల రూపంలో ప్రదర్శించుకున్నారు. ఈ హెచ్చుతగ్గులపై నేతలను నిలదీసేందుకు యువత అదను కోసం ఎదురు చూసింది. అప్పటిదాకా అవినీతిపైనే పోరాటం చేయాలనుకున్న వాళ్లకు.. సరిగ్గా ఆ సమయంలో సోషల్ మీడియా బ్యాన్ రూపంలో ఓ ఆయుధం దొరికినట్లయ్యింది.నేపాల్ ఆందోళనలతో అక్కడి యువతకు నెపో కిడ్స్ వ్యవహారాన్ని ప్రశ్నించేందుకు సరైన సమయం దక్కింది. తొలుత అందుబాటులో ఉన్న టిక్‌టాక్ లాంటి కొద్ది ప్లాట్‌ఫారమ్‌లలో వాళ్ల లైఫ్‌స్టైల్‌ను ఏకిపారేశారు. బ్యాన్ ఎత్తేశాక.. ఇన్స్టాగ్రామ్, రెడ్డిట్, ఎక్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఈ ఉద్యమాన్ని కొనసాగించారు. అలా.. #NepoBabiesNepal అనే హ్యాష్‌ట్యాగ్ మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ జాబితాలో.. మాజీ మిస్ నేపాల్, మాజీ ఆరోగ్య మంత్రి కుమార్తె శ్రింఖల ఖటీవాడ, సింగర్.. మాజీ ప్రధాని షేర్ బహాదూర్ డెఉబా కోడలు శివానా శ్రేష్ఠ, మాజీ ప్రధాని పుష్ప కమల్ దహాల్ "ప్రచండ" మనవరాలు స్మితా దహాల్, గండకి ప్రావిన్స్‌కు మాజీ మంత్రి బిందు కుమార్ థాపా కొడుకు సౌగత్ థాపాలు.. ఇలా మరికొందరిని తెరపైకి తెచ్చారు. అక్కడి కరెన్సీ ప్రకారం.. వీళ్లు వాడే వస్తువులు అత్యంత ఖరీదైనవే కావడంతో యువతకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది.వాళ్ల ఒంటి మీద దుస్తుల దగ్గరి నుంచి, వాళ్లు వాడే కార్లు, బ్యాగులు, పర్‌ఫ్యూములు, చివరకు ఆహార విషయంలోనూ ప్రదర్శించే విలాసాలను ప్రశ్నించడం మొదలుపెట్టారు. వాళ్ల వాళ్ల నివాసాలపై దాడులు చేసినప్పుడు ఆ లగ్జరీ వస్తువుల్ని కొందరు ఎత్తుకెళ్లిపోయారు. మరికొందరు ఆకతాయిలు ఆ లగ్జరీ గూడ్స్‌ను చూపిస్తూ.. ‘‘చూడడానికి రెండు కళ్లు చాలడం లేదంటూ’’ సెటైర్లు వేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ పరిణామాలతో కొందరు తమ అకౌంట్లను, పేజీలను క్లోజ్ చేసేశారు. మరికొందరు పోస్టులు చేయకుండా ఉండిపోయారు. దాడులు చేస్తారనే భయంతో.. ఈ తరహా సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోయారు. ఈ క్రమంలో నేతల పిల్లల ఆస్తులపైనా దర్యాప్తు జరిపించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అలా మొదలై..అవినీతికి వ్యతిరేకంగా నేపాల్ యువత.. ముఖ్యంగా Gen Z చేపట్టిన ఆందోళనలతో నేపాల్ అట్టుడికిపోయింది. పోలీసుల వల్ల కాకపోవడంతో అక్కడి ప్రభుత్వం నిరసనలను అణచివేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దించింది. ఇది హింసాత్మకంగా మారడంతో.. 31 మంది ఆందోళనకారులు మరణించారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈ పరిణామం.. జెన్‌జెడ్‌కు మరింత ఆగ్రహం తెప్పించింది. ప్రభుత్వం గద్దె దిగిపోవాలన్న నినాదంతో.. కేబినెట్ మంత్రులు, మాజీ నేతల ఇళ్లపై దాడులకు దిగి తగలబెట్టారు. దొరికిన వాళ్లను దొరికినట్లు చితకబాదారు. దీంతో.. కేపీ శర్మ ఓలీ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. రాజకీయ సంక్షోభం తలెత్తినవేళ.. పరిస్థితి అదుపు తప్పకూడదనే ఉద్దేశంతో సైన్యం రంగంలోకి దిగింది. రాజధాని ఖాట్మండు సహా ప్రధాన నగరాల్లో కర్ఫ్యూలు విధించి పహారా కాస్తోంది. అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, ఉద్యమకారుల నేతలకు మధ్య ఉండి ప్రభుత్వ ఏర్పాటు చర్చలను సైన్యమే ముందుకు తీసుకెళ్తోంది. రాజ్యాంగాన్ని తిరగరాసి సుపరిపాలన దిశగా అడుగు పడాలని, గత మూడు దశాబ్దాలుగా పాలకులు పాల్పడిన అవినీతిపై విచారణకు జరిపించాలని, అలాగే పోరాటంలో మరణించిన వాళ్లను అమరవీరులుగా గుర్తించి వాళ్ల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని జెన్‌జెడ్ యువత డిమాండ్లు చేస్తుండడం తెలిసిందే.పేదల బతుకులు చీకట్లతో తడిసిన వేళ..వెలుగుల్లో నేతల వారసులు విలాసాలు ఆరబోశారు! ఆవేదన అగ్గిలా మారి.. సమానత్వం కోసం గళం విప్పిందిఇక చాలు!" అని యువత నినదించగా.. పాలకుల పీఠాలు ఖాళీ అయ్యాయి.ఇది నేపాల్ ఉద్యమం కాదు.. అక్కడి ఒక తరం గుండె చప్పుడు -
బాలెన్షా కాదు.. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కార్కీ?!
కాఠ్మండ్: జెనరేషన్ జెడ్ ఆందోళనలతో అల్లకల్లోలంగా మారిన నేపాల్ పరిస్థితులు కుదుట పడుతున్నాయి. రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కార్కీని నియమించాలని ఆందోళనకారులు ప్రతిపాదనలు పంపినట్లు ఆదేశ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సెక్రటరీ తెలిపారు. దీంతో సుశీలా కార్కీ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం అనివార్యం కానుంది. ఆమె నియామకంపై అధికారిక ప్రకటన వెలవడాల్సి ఉంది. సుశీలా కార్కీ ఎవరు?సుశీలా కార్కీ 2016 జూలై నుండి 2017 జూన్ వరకు నేపాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. నేపాల్ చరిత్రలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టిన తొలి మహిళ. 1970లలో న్యాయవాదిగా తన కెరీర్ ప్రారంభించిన ఆమె.. 2009లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010లో శాశ్వత న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. తాజాగా,నేపాల్‌లో నెలకొన్న అంతర్యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సుశీలా కార్కీ తన పదవీకాలంలో అవినీతిపై పోరాడారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆమె ఇచ్చిన ముఖ్యమైన తీర్పుల్లో.. మహిళలు తమ పిల్లలకు పౌరసత్వ హక్కులు ఇవ్వగలగడం. ఇది నేపాల్‌లో లింగ సమానత్వం దిశగా కీలక అడుగులు పడేలా చేసింది. ఈ తీర్పుతో సుశీలా కార్కీపై పార్లమెంటులో అభిశంసన తీర్మానం కూడా వచ్చినప్పటికీ..ప్రజా వ్యతిరేకతతో అది వెనక్కి తీసుకున్నారు.ఆమె సమర్ధురాలునేపాల్లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్న సమయంలో ఆ దేశ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కీ తాత్కాలిక ప్రధానిగా నియమిస్తే బాగుంటుందని జెన్‌జీ భావిస్తోంది. నేపాల్ రాజకీయ సంక్షోభ సమయంలో పాలనను గాడినపెట్టడం,పాలనపై విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఆమె నాయకత్వం సరైందని భావిస్తున్నారు. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామాతో..దేశాన్ని నిష్పాక్షికంగా ముందుకు నడిపించగల నాయకురాలు ఆమెనేంటూ నేపాల్ పౌరులు ఆమెకు మద్దతు పలుకుతున్నారు.బాలెన్ షా కాదు.. సుశీలా కార్కీతాత్కాలిక ప్రధానిగా జస్టిస్ సుశీలా కార్కీ పేరు ప్రతిపాదనకు ముందు.. కాఠ్మండూ మేయర్ బాలెన్ షా తన పదవికి రాజీనామా చేసి, నాయకత్వం వహించాలని సోషల్ మీడియాలో నేపాల్ ప్రజలు కోరారు. బాలెన్ మేయర్‌గా ఉన్న కాలంలో చేసిన పని ఏమీ లేదు. కానీ, బాలెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం కలిసివచ్చింది. దీనికి తోడు 2022 కాఠ్మండూ మేయర్ ఎన్నికల్లో మహామహుల్ని మట్టికరిపించారు. స్వతంత్ర్య అభ్యర్ధిగా బరిలోకి దిగినా మేయర్‌గా గెలుపొందారు. ఇలా తాజా నేపాల్ అనిశ్చితితో బాలెన్షా పేరు తెరపైకి వచ్చింది. అయినప్పటికీ అనుభవం రిత్యా జస్టిస్ సుశీలా కార్కీని తాత్కాలిక ప్రధానిగా నియమించాలని జెన్‌జీ తరం కోరుకుంటోంది. ఆ దిశగా చర్చలవైపు అడుగులేస్తోంది. -
నేపాల్ సంక్షోభం నుంచి నేర్వవలసిన పాఠం!
‘కొంత మంది యువకులు పుట్టుకతో వృద్ధులు’ అని కొన్ని దశాబ్దాలకిందట ఆక్రోశించాడు ఓ సినీకవి. ఈ జెనరేషన్ కుర్రాళ్లంతా ఇంతే.. ఏదీ పట్టదు,, పక్కవాళ్ల గురించి పట్టించుకోరు.. సమాజం గురించి ఆలోచించారు.. తమ సొంత ప్రపంచంలోనే ముడుక్కుని ఉండిపోతుంటారు.. అని విలపించేవాళ్లు, మనకు ప్రతిరోజూ పుంఖానుపుంఖాలుగా కనిపిస్తుంటారు. కానీ.. యువతరం గురించి ఇలాంటి అభిప్రాయాలన్నీ అపోహలే! వారిలో చైతన్యం అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ సజీవంగానే ఉంది. ఉంటుంది. కాకపోతే.. దానిని జ్వాలగా రాజేసే సరైన నిప్పుకణిక ఉన్నప్పుడు.. జ్వాలలు రేగుతాయి. ప్రభుత్వాలలోనూ వేడిపుట్టిస్తాయి.‘సోషల్ మీడియా’ అనే పదం వినగానే చాలామంది ఏదో బూతు పదాన్ని విన్నట్లుగా మొహం గంటు పెట్టుకుంటారు. ఇక యువతరం విషయంలో అయితే- సోషల్ మీడియా అనేది వారిని సమూలంగా సర్వనాశనం చేస్తున్న విషపురుగు అని ప్రచారం చేస్తూ ఉంటారు. ఇలాంటి మాటల్ని ఏకపక్షంగా సమర్ధించలేం. కొట్టి పారేయడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే సోషల్ మీడియా వేస్తున్న వెర్రి తలలు ప్రతిరోజు వార్తల్లో మనం గమనిస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా విశృంఖల రూపాలు వాడుక లోకి రావడం ప్రమాదకరమైన సంకేతం.అదే సమయంలో యువతరానికి సోషల్ మీడియా చేస్తున్న మేలు గురించి కూడా గమనించాలి. నేపాల్ వంటి దేశాల నుంచి చాలా పెద్ద సంఖ్యలో యువతరం ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకు వెళ్లి స్థిరపడడం జరుగుతూ వస్తోంది. బతుకుతెరువు కోసం విదేశాలకు వెళ్లిన వారు కూడా అనేకులు. అలాంటి వారందరికీ స్వదేశంలోని తమ సొంత వాళ్లతో కనీసం అప్పుడప్పుడు అయినా మాట్లాడుకోవడానికి, అనుబంధాలను నెమరు వేసుకోవడానికి ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి వారికి దొరికే ఏకైక మార్గం సోషల్ మీడియా మాత్రమే. నేపాల్ లో మరీ దారుణంగా వాట్స్అప్ యూట్యూబ్ వంటి వాటిని కూడా నిషేధిస్తూ వచ్చిన ఉత్తర్వులు పెద్ద అగ్నిజ్వాలలనే పుట్టించాయి. యువతలో పెల్లుబికిన ఆగ్రహాన్ని అణచివేయడానికి ప్రభుత్వం మిలిటరీని ప్రయోగించడం పదుల సంఖ్యలో ప్రాణాల్ని బలితీసుకుంది. ప్రధాని ఓలి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. ఆగ్రహజ్వాలలు సర్కారీ పెద్దల భవనాలకు అంటుకుని.. ప్రాణాలనూ బలితీసుకున్నాయి. ఇంకా చాలా చాలా జరిగాయి.స్థూలంగా గమనించినప్పుడు.. తొలుత అనుకున్న సంగతిని మనం సమీక్షించుకోవాల్సి వస్తుంది. ఇవాళ్టి యువతరం నిజంగానే నిస్తేజంగా ఉంటున్నదా? పోరాట పటిమ, ఉద్యమ స్ఫూర్తి వారిలో కొరవడిందా? అలాంటి సందేహాలకు అసలు ఆస్కారమే లేదు. ఎందుకంటే.. అవన్నీ యువతరంలో సజీవంగానే ఉన్నాయని.. సరైన సమయంలో వాటిని ప్రదర్శించడానికి యువతరం ఏమాత్రమే వెనుకాడే పరిస్థితి లేదని ఈ నేపాల్ దృష్టాంతం నిరూపిస్తోంది. పదిహేనేళ్ల కిందటి మధ్యప్రాచ్య దేశాలను కుదిపేసిన ఉద్యమం అరబ్ స్ప్రింగ్ ను ఇది గుర్తుకు తెస్తోంది. 2011లో టునీషియాలో సోషల్ మీడియా అణచివేతకు వ్యతిరేకంగా రాజుకున్న పోరాటం ఈజిప్టు నుంచి లిబియా వరకు అన్ని దేశాలను కుదిపేసింది. నేపాల్ ఇవాళ అదే పునరావృతం అయింది. జెన్ జీ యువతరం సోషల్ మీడియా నిషేధంపై ప్రభుత్వాన్ని తల్లకిందులు చేసింది.యువతరంలో పోరాట స్ఫూర్తి లేదని అనుకోవడం సరికాదు. సోషల్ మీడియాకు యువత వ్యసన పరులు అయ్యారని, అందువల్లనే వారంతా ఇలాంటి తిరుగుబాటుకు ఒడిగట్టారని ఏకపక్షమైన వాదన సరికాదు. రోడ్డు మీదికి వచ్చి పోరాడిన వాళ్లు, ప్రాణాలు అర్పించిన వాళ్లు కేవలం రీల్స్ చేసుకోవడం మీదనో, చూడడం మీదనో మోజు ఉన్నవాళ్లు మాత్రమే కాదు. ఇలాంటి నిషేధాజ్ఞలతో వ్యక్తి స్వేచ్ఛను హరించేయాలని అనుకుంటున్న నియంతృత్వపు పోకడలను ఈసడించుకున్న వాళ్లు మాత్రమే అనేది గుర్తించాలి. స్వేచ్ఛ పట్ల ఇవాళ్టి యువతరంలో ఉండే మమకారాన్ని తెలుసుకోవాలి. నిజానికి నేపాల్ లో చెలరేగిన తిరుగుబాటు, విధ్వంసకాండ.. భారతదేశంలోనూ అనేక రాష్ట్రాల పాలకులకు కనువిప్పు కలిగించాలి. నిషేధాల వంటి జోలికి ఇక్కడి పాలకులు ఇంకా దృష్టి సారించడం లేదు. సోషల్ మీడియాను తాము కూడా వాడుకుంటున్నారు. కాకపోతే.. రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష సాధింపునకు ఈ చట్టాలను, సోషల్ మీడియా బూచిగా వాడుకుంటున్నారు. పాలకుల, ఇలాంటి దుర్మార్గపు పోకడలు కామన్ మ్యాన్ కు కూడా ఏదో ఒక రోజున ఆగ్రహం తెప్పిస్తాయి. అలాంటప్పడు.. ఆ ప్రభుత్వాలు భస్మీపటలం కాక తప్పదు. నేపాల్ తరహా తిరుగుబాటు ఇక్కడ వస్తుందని కాదు.. కానీ.. ప్రజాస్వామికంగానే ఆ పతనం నిర్దేశం అవుతుంది.:::ఎం. రాజేశ్వరి -
‘రాజ్యాంగాన్ని తిరగ రాస్తేనే శాంతిస్తాం’.. నేపాల్ యువత డిమాండ్లు ఇవిగో!
నేపాల్‌లో యువత(Gen Z) చేపట్టిన ఆందోళనలు దేశ రాజకీయాలను శాసించాయి. నిరసనలు హింసాత్మక మలుపు తిరగడం, ఆర్మీ రంగంలోకి దిగినా పరిస్థితి అదుపు రాకపోవడం, పైపెచ్చు నేతలు.. వాళ్ల ఆస్తులపై దాడులతో పరిస్థితి మరింత విషమించింది. ఈ దెబ్బకు.. కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే.. రాజకీయ సంక్షోభం దరిమిలా నేపాల్ సైన్యం రంగంలోకి దిగింది. విధ్వంసాలను ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్ జాతిని ఉద్దేశిస్తూ గత అర్ధరాత్రి ప్రసంగించారు. ప్రస్తుత సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు చర్చలే మార్గమని అన్నారాయన. అదే సమయంలో విధ్వంసం, దాడులు, దోపిడీ వంటి చర్యలు కొనసాగితే.. ఆర్మీ కఠినంగా స్పందిస్తుంది అని ప్రకటించారు. ఆర్మీ ఇప్పటికే కీలక ప్రాంతాలను నియంత్రణలోకి తీసుకుంది. ట్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం, సింగదుర్బార్, పార్లమెంట్ భవనం వంటి ప్రదేశాల్లో సైనికులు మోహరించారు. గత రాత్రి 10 గంటల నుంచి దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. అయితే.. ఇది కేవలం సోషల్ మీడియా నిషేధంపై స్పందన కాదని యువత అంటోంది. గత మూడు దశాబ్దాలుగా రాజకీయ నాయకులు దోచుకున్న ఆస్తులపై విచారణ జరిపించాలని అంటోంది. అలాగే.. రాజ్యాంగాన్ని తిరగరాసి పాలనలో విస్తృత సంస్కరణలు చేపట్టాలని అంటోంది. ఈ క్రమంలో.. ఉద్యమ నిర్వాహకులు తమ కీలక డిమాండ్లు ప్రకటించారు. అందులో.. • నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని అధికారికంగా అమరులుగా గుర్తించడం• వారి కుటుంబాలకు రాష్ట్ర గౌరవం, గుర్తింపు & ఆర్థిక సహాయం అందించడం• నిరుద్యోగం, వలస, సామాజిక అన్యాయంపై ప్రత్యేక కార్యక్రమాలు• కొత్త రాజకీయ వ్యవస్థ స్థాపనకు పిలుపుఈ ఉద్యమం ఏ పార్టీకి లేదంటో వ్యక్తికి చెందింది కాదు. ఇది ఒక తరం కోసం.. దేశ భవిష్యత్తు కోసమే అని పేర్కొంది. శాంతి అవసరమే అని, కానీ, అది కొత్త రాజకీయ వ్యవస్థ పునాది మీదే సాధ్యమవుతుంది అని పేర్కొంది. Gen Z ఉద్యమం.. టైమ్‌లైన్4 సెప్టెంబర్ 2025నేపాల్ ప్రభుత్వం 26 సోషల్ మీడియా యాప్‌లపై నిషేధం విధించింది (Facebook, YouTube, Instagram, X, Reddit, Snapchat).కారణం: కంపెనీలు స్థానికంగా నమోదు చేయకపోవడం, గ్రీవెన్స్ హ్యాండ్లర్ నియామకం చేయకపోవడం.8 సెప్టెంబర్ 2025Gen Z యువత పెద్ద ఎత్తున మైతీఘర్ మండల, న్యూ బనేశ్వర్ ప్రాంతాల్లో నిరసనలకు దిగారు.పార్లమెంట్ ఆక్రమణ ప్రయత్నం, తీగాస్, వాటర్ కేనన్, రబ్బరు బుల్లెట్లుతో పోలీసుల స్పందన.19 మంది మరణం, 300 మందికి పైగా గాయాలు.సాయంత్రం: ప్రభుత్వం సోషల్ మీడియా నిషేధాన్ని వెనక్కి తీసుకుంది.హోం మంత్రి రమేష్ లేఖక్ రాజీనామా.కర్ఫ్యూ: కాఠ్మాండూ, పోఖరా, బిర్గంజ్, బుట్వాల్, భైరహవా, ఇటహరి, దమక్.9 సెప్టెంబర్ 2025ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించింది, నిషేధం ఎత్తివేసినప్పటికీ నిరసనలు కొనసాగాయి.ప్రధానమంత్రి కెపీ శర్మ ఓలి రాజీనామా చేసి శివపురి ఆర్మీ క్యాంప్‌లో ఆశ్రయం పొందారు.పార్లమెంట్, సింగదుర్బార్, సుప్రీం కోర్ట్, సీతల్ నివాస్, బాలువటార్ వంటి ప్రభుత్వ భవనాలు దాడికి గురయ్యాయి.ఉమ్మెద్ పార్టీ, నెపాలి కాంగ్రెస్ ప్రధాన కార్యాలయాలు ధ్వంసం.నెపాల్ ఆర్మీ: త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంను నియంత్రణలోకి తీసుకుంది, విమాన సేవలు నిలిపివేత.10 సెప్టెంబర్ 2025అలర్లు కొనసాగుతున్నాయి, ప్రజల భద్రత కోసం ఆర్మీ చర్యలు.అధికారికంగా 23 మంది మరణించారు, ఇందులో 3 పోలీసు అధికారులు, ఝలానాథ్ ఖనాల్ భార్య కూడా ఉన్నారు.347 మంది గాయపడినట్లు అధికారిక సమాచారం, 422+ అనధికారిక గణాంకం.నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ (Ram Chandra Poudel), ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్‌తో జనరేషన్ జెడ్ ఉద్యమ నిర్వాహకులు చర్చలు జరపాల్సి ఉంది. నేపాల్‌కు స్వాతంత్ర దినోత్సవమంటూ ప్రత్యేకంగా లేదు. ఎందుకంటే.. అది ఏ దేశపు పాలన కింద లేదు. కానీ 1923 డిసెంబర్ 21న నేపాల్-బ్రిటన్ మధ్య Singha Durbar Treaty కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా నేపాల్ స్వతంత్ర దేశంగా బ్రిటన్ అధికారికంగా గుర్తించింది. అయితే.. రాణా పాలన ముగిసిన ఫిబ్రవరి 18వ తేదీని ప్రజాస్వామ్య దినోత్సవం (Democracy Day)గా, రాచరికం ముగిసి ప్రజాస్వామ్యం ఏర్పడిన తేదీ మే 28వ తేదీని గణతంత్ర దినోత్సవం (Republic Day)గా నిర్వహిస్తోంది. దఫదఫాలుగా రాజ్యాంగం..1948లో గవర్నమెంట్ ఆఫ్ నేపాల్ యాక్ట్ ద్వారా తొలి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అయితే అప్పటి రాణా, రాజకీయ సంస్కరణలకు నిరాకరించడంతో అది నామమాత్రంగానే ఉండిపోయింది. ఆ తర్వాత.. రాజు త్రిభువన్ బిర్ బిక్రమ్ షా 1951లో ఇంటీరియమ్ గవర్నమెంట్ ఆఫ్ నేపాల్ యాక్ట్ ప్రవేశపెట్టారు. ఇది ప్రజాస్వామ్యానికి మార్గం వేసింది. 1990లో ప్రజా ఉద్యమం తర్వాత.. కానిస్టిట్యూషనల్ మోనార్చీ అనేది బహుళ రాజకీయ పార్టీ వ్యవస్థకు మార్గం వేసింది. 2007లో ఇంటీరియమ్ కానిస్టిట్యూషన్ ఆఫ్ నేపాల్ అనేది రాచరికాన్ని పూర్తిగా తొలగించి.. ప్రజాస్వామ్య పునాది వేసింది. ఇది 2008లో రాజ్యాంగ సభ మొదలైన తర్వాత పూర్తిగా అమలులోకి వచ్చింది. అటుపై 2015 సెప్టెంబర్ 20న పూర్తిస్థాయి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇది నేపాల్‌ను ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్‌గా ప్రకటించింది. నేపాల్ రాజ్యాంగం అనేది ఒక తరం పోరాటం ఫలితం. ఇది ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా, దేశ భవిష్యత్తుకు పునాది రాయిగా ఉండాలని అంతా భావించారు. సోషల్ మీడియా బ్యాన్ నేపథ్యంలోనే నేపాల్ యువత ఆందోళనలు మొదలైనట్లు కనిపించినప్పటికీ.. రాజకీయ వారసత్వం, అవినీతిపైనే వాళ్ల పోరాటం సాగింది. ఈ నేపథ్యంలో నేపాల్ రాజ్యాంగం రాజకీయ నేతలకు అనుగుణంగా ఉందనేది ఇప్పుడున్న యువత అభిప్రాయం. అందుకే రేపటి తరం ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగంలో సమూల మార్పు కోరుకుంటోంది. -
ఇంజనీర్, ర్యాపర్, మేయర్, ఇప్పుడు ప్రధాని?
కాఠ్మండు: నేపాల్‌లో ఒకవైపు రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతుండగా మరోవైపు, అక్కడి యువత తదుపరి ప్రధానిని మీరే చేపట్టాలంటూ కాఠ్మండు మేయర్ బాలేంద్ర షా అలియాస్ బాలేన్కు పెద్ద ఎత్తున మద్దతుగా ఆన్లైన్లో పోస్టులు పెడుతున్నారు. దీంతో, ఇప్పుడు బాలేన్ పేరు మారుమోగిపోతోంది. రాజధానిలో పరిణామాల నేపథ్యంలో బాలేన్ ఫేస్బుక్లో మంగళవారం ..‘ర్యాలీ నిర్వాహకులు 28 ఏళ్లలోపు వాళ్లే పాల్గొనాలనే వయో పరిమితి విధించిన కారణంగానే సోమవారం జరిగిన ర్యాలీలో పాల్గొనలేకపోయా.వారి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నది నా అభిప్రాయం’అని పేర్కొన్నారు. ‘ఇది జెన్ జెడ్ చేపట్టిన ఆకస్మిక ఉద్యమమన్నది సుస్పష్టం. నేను కూడా వారికి పెద్దవాడిలా అనిపించవచ్చు. వారి ఆకాంక్షలు, లక్ష్యాలు, ఆలోచనలను అర్థం చేసుకోవాలనుకుంటున్నా. రాజకీయ పార్టీలు, నాయకులు ఈ ర్యాలీని తమ సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోరాదు.యువతకు పూర్తి మద్దతు తెలుపుతున్నా’అని ఆయన పేర్కొన్నారు. ఈ పోస్టుతో ఆయన పేరు అన్ని రకాల సామాజిక మాధ్యమ వేదికల్లోనూ మారుమోగిపోయింది. ‘బాలేన్, సారథ్యం మీరే చేపట్టండి’అని ఎక్స్‌లో ఒకరు కోరారు. 1990లో కాఠ్మండులో పుట్టిన బాలేన్ అక్కడే సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నారు. భారత్‌లోని కర్నాటకలో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో పీజీ చేశారు. -
ఆగ్రహ జ్వాలలు
కాఠ్మండు/న్యూఢిల్లీ: సోషల్ మీడియా యాప్‌లపై నిషేధంతోపాటు విద్యార్థులు, యువత సోమవారం మొదలెట్టిన ఆందోళనలు మెరుపువేగంతో నేపాల్‌ను చుట్టేసి దేశాన్ని సంక్షోభ కుంపట్లోకి నెట్టేశాయి. సామాజిక మాధ్యమాల సేవలను పునరుద్ధరిస్తున్నామని కేపీ శర్మ ఓలీ సారథ్యంలోని ప్రభుత్వం కొద్ది గంటల్లోనే స్పష్టంచేసినా అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. రాజధాని కాఠ్మండు మొదలు దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు, యువత తమ నిరసనజ్వాలలను మరింతగా ఎగదోస్తూ ఏకంగా పార్లమెంట్ భవనానికి నిప్పు పెట్టారు. మంగళవారం ఆందోళనలను అణచివేసేందుకు పోలీసులు, సైన్యం రంగంలోకి దిగాయి. కాళీమతిలో పోలీస్సర్కిల్కు నిప్పుపెట్టి అధికారులపై దాడి చేయడంతో పోలీసులు కాల్పులు జరిపారు.దీంతో ఇద్దరు చనిపోయారు. దీంతో కాల్పులు, పరస్పర ఘర్షణ ఘటనల్లో మరణాల సంఖ్య మంగళవారానికి 22కు పెరిగింది. 300 మందికిపైగా గాయపడ్డారు. కట్టలు తెంచుకున్న యువాగ్రహాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ మంగళవారం తన పదవికి రాజీనామాచేశారు. భద్రంగా ఇంటి నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు నేపాల్ ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దెల్ను బతిమాలుకున్నట్లు వార్తలొచ్చాయి.ఆందోళనకారుల నిరసన కార్యక్రమం అదుపుతప్పి మాజీ ప్రధానమంత్రి, తాజా మంత్రులపై భౌతికదాడులదాకా వెళ్లింది. ప్రధాని ఓలీకి చెందిన భక్తపూర్‌లోని బాల్కోట్ నివాసాన్ని ఆందోళనకారులు తగులబెట్టారు. మాజీ ప్రధానమంత్రి ఝలనాథ్ ఖనాల్ ఇంటికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ మంటల్లో చిక్కుకుని ఆయన భార్య రాజ్యలక్ష్మీ చిత్రకార్ తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఆమెను సమీప కీర్తిపూర్ బర్న్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఎటు చూసినా ఆస్తుల విధ్వంసం, వినాశనంతో నేపాల్ నిలువెల్లా రక్తమోడింది. దుకాణాల లూటీలు, పౌరుల భయాందోళనల నడుమ ప్రధాని రాజీనామాతో ఎట్టకేలకు సైన్యం పూర్తస్థాయిలో రంగంలోకి దిగి శాంతభద్రతల పరిరక్షణ బాధ్యతలను తన చేతుల్లోకి తీసుకుంది. పరిస్థితులను తమకు అనుకూలంగా మల్చుకుని ప్రజల ఆస్తులను ధ్వంసంచేస్తూ లూటీలకు తెగించిన వాళ్ల అంతుచూస్తామని ఆర్మీ చీఫ్ హెచ్చరించారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి, రాజకీయ వారసత్వం, సంపన్న, ఉన్నతస్థాయి వర్గాల ఆధిప్యంపై ఇప్పటికే విసిగిపోయిన యువత తాజాగా సామాజికమాధ్యమాలపై హఠాత్తుక నిషేధం విధించడంతో వాళ్లలో ఆగ్రహం పెల్లుబికి మహోద్యమంగా మారడంతో దేశ భవిష్యత్తు ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. పెల్లుబికిన ఆగ్రహం పరిస్థితిని మరింతగా కట్టుతప్పొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం కర్ఫ్యూను విధించింది. అయినాసరే వేలాదిమంది విద్యార్థులు, యువత ‘జెన్ జెడ్’కూటమిగా ఏర్పడి రాజధాని కాఠ్మండు మొదలు పట్టణాలదాకా విధ్వంసానికి తెగించారు. మాజీ ప్రధానమంత్రులు మొదలు తాజా కేబినెట్ మంత్రులు, కీలక నేతల దాకా ముఖ్యమైన వ్యక్తుల ఇళ్లకు నిప్పంటించారు. ప్రధాన రాజకీయ పార్టీల ప్రధాన కార్యాలయాలనూ ధ్వంసంచేశారు. కనిపించిన ప్రతి ఒక్క రాజకీయ నేతను చితకబాదారు. దేశాధ్యక్షుడు రాంచంద్ర పౌదెల్, మాజీ ప్రధాని పుష్పకమల్ దహాల్(ప్రచండ), ప్రస్తుత కమ్యూనికేషన్స్ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్, మాజీ హోం మంత్రి రమేశ్ లఖ్హార్, మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బాల ఇళ్లను నాశనంచేశారు. ఆందోళనలు కాఠ్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్నీ తాకాయి. దీంతో ముందుజాగ్రత్తగా అంతర్జాతీయ విమానసర్వీసులను రద్దుచేసి ఎయిర్‌పోర్ట్‌ను అధికారులు తాత్కాలికంగా మూసేశారు. ఎటుచూసినా విధ్వంసమే ఆందోళనలను ఏ దశలోనూ అడ్డుకోలేక పోలీసులు చేతులెత్తేయడంతో విద్యార్థులు, నిరసనకారుల విధ్వంసకాండ ఆకాశమే హద్దుగా సాగింది. పార్లమెంట్, దేశాధ్యక్షుని కార్యాలయం, ప్రధాని నివాసం, సుప్రీంకోర్టు భవనం, ప్రధాన రాజకీయ పార్టీల హెడ్‌ఆఫీస్‌లు, సీనియర్ నేతల ఇళ్లు, మీడియా కార్యాలయాలు ఇలా ప్రతి దేశంలోని కీలక భవంతులన్నీ ఆందోళనకారుల ఆగ్రహజ్వాలల బారినపడ్డాయి. డల్లూ ఏరియాలోని మాజీ ప్రదాని ఝలానాథ్ నివాసానికి నిప్పుపెట్టారు. కపన్ ప్రాంతంలోని నేపాలీ కాంగ్రెస్ నేత ఇంటిని తగులబెట్టారు.సింఘదర్బార్లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం భవనానికీ నిప్పుపెట్టారు. మహరాజ్‌గంజ్‌లోని అధ్యక్షకార్యాలయం, బలూవతార్‌లో ప్రధాని అధికారి నివాసం సైతం నిప్పురవ్వల వర్షంలో కాలిపోయాయి. టిన్కునేలో కాంతిపూర్ టెలివిజన్ ఆఫీస్‌ను ధ్వంసంచేశారు. బుద్ధనీలకంఠ ప్రాంతంలోని మాజీ ప్రధాని షేర్‌బహదూర్ దేవ్బా ఇంట్లో చొరబడి దేవ్బా, భార్య అర్జూ రాణాలను రక్తంకారేలా కొట్టారు. దీంతో ప్రాణభయంతో ఆయన పచ్చికబయళ్లకు పరుగులుపెట్టారు. విషయం తెల్సుకుని సైన్యం రంగంలోకి దిగి ఆయనను నిరసనకారుల బారినుంచి కాపాడింది.దేవ్బా కుమారుడు జైబీర్‌కు చెందిన కాఠ్మండులో హిల్టన్ ఐదునక్షత్రాల హోటల్‌కు, అర్జూకు చెందిన ఖుమల్తార్లోని ఉలెన్స్ పాఠశాలకు, తోఖాలో మాజీ ప్రధాని బాబూరామ్ భట్టారాయ్ ఇంటికి నిప్పుపెట్టారు. ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌదెల్ను వీధిలో పరుగెత్తించిమరీ చితక్కొట్టారు. వెనక నుంచి ఆయన్ను ఒకతను వీపుమీద ఎగిరి తన్నుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గోశాల, లూభూ, కాళీమతి పోలీస్పోస్ట్లకూ నిరసనకారులు నిప్పుపెట్టారు. కలాంకీ, కాళీమతి, తహచల్, బనేశ్వర్, నైకాప్, ఛియాసల్, ఛపగావ్, థేచో ఇలా ప్రతి ప్రాంతంలో పెను విధ్వంసం సృష్టించారు.టైర్లు తగలబెట్టి రోడ్లపై రాకపోకలను నిలిపేశారు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యాలయ భవనం ఎక్కి పార్టీ జెండాను చింపేశారు. పోఖ్రా పట్టణంలో ఆందోళనకారులు కారాగారం గోడలు బద్దలుకొట్టారు. దీంతో జైలులోని 900 మంది ఖైదీలు బయటకు పరుగులుతీశారు. కాఠ్మండూలోని నఖూ జైలుకూ ఇదే గతి పట్టింది. దీంతో ఇక్కడి ఖైదీలు విడుదలయ్యారు. వీరిలో మాజీ హోం మంత్రి రవి లమీచ్ఛానే సైతం ఉన్నారు. ఇదే అదనుగా కొన్ని అల్లరిమూకలు దుకాణాలను లూటీ చేశాయి. దిగిపోవాలని డిమాండ్ చేసి దింపేశారుమంగళవారం ఉదయం ప్రధాని కేపీ శర్మ ఓలీ కార్యాలయాన్ని చుట్టుముట్టిన వందలాది మంది ఆందోళనకారులు తర్వాత లోపలికి చొరబడి శర్మను వెంటనే గద్దె దిగాలని మొండిపట్టుపట్టారు. ‘‘కేపీ దొంగ, దేశాన్ని వీడిపో’’అంటూ పెద్దగా నినాదాలు చేశారు. తప్పని పరిస్థితుల్లో వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు దేశాధ్యక్షుడు రాంచంద్రకు లేఖ రాశారు. ‘‘నేపాల్ అసాధారణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. పరిస్థితి కుదుటపడేందుకు రాజ్యాంగబద్ధంగా, రాజకీయంగా తగు పరిష్కారం కనుగొనేందుకు వీలుగా ప్రధాని పదవి నుంచి వైదొలుగుతున్నా’’అని 73 ఏళ్ల సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్(యునిఫైడ్ మార్కిస్ట్–లెనినిస్ట్) నేత శర్మ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.వెంటనే రాజీనామాను అధ్యక్షుడు ఆమోదించారు. అయితే నూతన మంత్రివర్గం ఏర్పడేదాకా ఆయనే ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారని దేశాధ్యక్షుడు చెప్పారు. నేపాల్ కాంగ్రెస్ పార్టీ అండతో గత ఏడాది జూలైలో శర్మ నాలుగోసారి ప్రధాని పదవిని చేపట్టడం తెల్సిందే. శర్మ దిగిపోవాలని నేపాల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్వి గగన్ థాపా సైతం అంతకుముందే డిమాండ్‌చేశారు. చైనాతో సత్సంబంధాలు కొనసాగించే శర్మీ తరచూ భారతవ్యతిరేక విధానాలను అవలంభించే నేతగా అప్రతిష్ట మూటగట్టుకున్నారు. గత షెడ్యూల్ ప్రకారం ఈనెలలోనే భారత్‌లో పర్యటించాల్సి ఉండగా ఆలోపే పదవీసన్యాసం చేశారు. అయితే శర్మ దేశాన్ని వీడి దుబాయ్‌కు వెళ్లనున్నారని, ఆయన కోసం రన్‌వే మీద హిమాలయ ఎయిర్‌లైన్స్ విమానాన్ని సిద్ధంగా ఉంచారని వార్తలొచ్చాయి. అగ్నికి ఆహుతవుతున్న ప్రధాని ఇల్లు బాణసంచా కాల్చి.. పారిపోకుండా ఆపి.. నేపాల్ నుంచి పారిపోయేందుకు నేతలకు హెలికాప్టర్ సేవలను అందిస్తోందన్న పుకార్లతో సిమ్రిక్ ఎయిర్‌లైన్స్ భవంతిని ఆందోళనకారులు తగలబెట్టారు. భైసేపతి మంత్రుల క్వార్టర్స్ నుంచి మంత్రులు విదేశాలకు హెలికాప్టర్లలో పారిపోతున్నారన్న వార్తలతో విద్యార్థులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఎయిర్పోర్ట్ రన్‌వేల సమీపంలో బాణసంచా, రాకెట్లు కాల్చారు. దీంతో ఆకాశంలో పొగచూరింది. డ్రోన్లు ఎగరేసి, పౌర లేజర్‌లైట్లు రన్‌వే వైపు ప్రసరింపజేసి విమాన రాకపోకలను అడ్డుకోవాలని ప్రజలకు ఆందోళనకారులు సోషల్‌మీడియా వేదికగా పిలుపునిచ్చారు. అయితే అప్పటికే కొన్ని హెలికాప్టర్లు అక్కడి నుంచి వెళ్లిపోయాయని వార్తలొచ్చాయి. కొందరు మంత్రులు, వీవీఐపీలు ఆర్మీ బ్యారెక్‌లలో తలదాచుకున్నారు. పార్లమెంట్‌ను రద్దుచేయండి: బాలెన్ షా యువతలో విపరీతమైన ఆదరణ ఉన్న కాఠ్మండు నగర మేయర్, 35 ఏళ్ల బాలేంద్ర షా మాత్రం వెంటనే పార్లమెంట్‌ను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ‘‘నిరసనకారులు శాంతించాలి. విద్యార్థి బృందాలు తక్షణం ఆర్మీ చీఫ్‌తో చర్చలకు సంసిద్ధమవ్వాలి. అంతకుముందే పార్లమెంట్‌ను రద్దుచేయాలి’’అని అన్నారు. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, తాము ఎంపీలుగా రాజీనామా చేస్తామని రా్రïÙ్టయ స్వతంత్ర పార్టీకి చెందిన 21 మంది ఎంపీలు ప్రకటించారు. ఉద్యమానికి తమ పూర్తి మద్దతు తెలిపారు. తాను సైతం రాజీనామా చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ప్రదీప్ యాదవ్ చెప్పారు. చర్చించుకుందాం.. రండి ఆందోళనను విడనాటి చర్చలకు రావాలని జెన్ జెడ్ విద్యార్థి, యువలోకానికి దేశాధ్యక్షుడు రాంచంద్ర పౌదెల్ పిలుపునిచ్చారు. శాంతి, సుస్థిరతకు అందరం పాటుపడుతున్నామంటూ నేపాల్ ఆర్మీ చీఫ్ అశోక్‌రాజ్ సిగ్దెల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏక్ నారాయణ్ ఆర్యల్, హోం సెక్రటరీ గోకర్ణ దవాదీ, సాయుధ పోలీసు బలగాల చీఫ్ రాజు ఆర్యల్, ఐజీ చంద్ర కుబేర్, జాతీయ దర్యాప్తు విభాగ సారథి హుత్రాజ్ థాపా సంతకాలు చేసి ఒక సంయుక్త ప్రకటన విడుదలచేశారు.అయితే 26 సోషల్‌మీడియా సైట్ల పునరుద్దరణతోపాటు వాక్ స్వాతంత్య్రం, ప్రభుత్వ ఉద్యోగుల్లాగా రాజకీయనేతలకూ రిటైర్మెంట్ వయసును ప్రకటించాలని పలు డిమాండ్లను యువత ప్రభుత్వం ముందుంచింది. మంత్రులు, ఉన్నతవర్గాల కుటుంబాలే సకల సౌకర్యాలను పొందుతున్నాయని ఉద్యమకారులు సోషల్‌మీడియాలో ప్రచారాన్ని మొదలెట్టారు. పరిస్థితిని చక్కదిద్ది ప్రభుత్వం, ఆర్మీ దేశంలో మళ్లీ శాంతిని నెలకొల్పాలని నేపాల్‌లోని ఆ్రస్టేలియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జపాన్, ద.కొరియా, బ్రిటన్, అమెరికా రాయబార కార్యాలయాలు సంయుక్త ప్రకటనలో అభ్యర్థించాయి. ఉద్యమాలు శాంతియుతంగా సాగాలని హింసాత్మక పథం పనికిరాదని ఐక్యరాజ్య సమితి సైతం హితవు పలికింది. -
దేశ ఆర్ధిక మంత్రిని.. ఫుట్‌బాల్ తన్నినట్లు తన్నారు.. వీడియో వైరల్
కాఠ్మాండూ: నేపాల్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి. ఆర్థిక మంత్రి బర్షమాన్ పున్పై జరిగిన దాడి దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇటీవల ఒక కార్యక్రమానికి హాజరైన మంత్రి పున్ను జెన్‌జీ ఆందోళనకారులు వెంటపడిమరీ దాడి చేశారు. ఆందోళ కారుల్లో ఓ వ్యక్తి పున్ను ఫుట్‌బాల్ తన్నినట్లు తన్నారు. ఆ ఊహించిన పరిణామంతో పున్ ఎగిరి అవుతలపడ్డారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న బర్షమాన్ పున్ ఇటీవల ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. దేశంలో పెరుగుతున్న ధరలు, ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఈ క్రమంలో ఆయనపై ప్రజలు తమ కోపాన్ని వ్యక్తం చేశారు.వీడియోలో మంత్రి పున్ ఒక వీధిలో నడుస్తుండగా, కొంతమంది వ్యక్తులు ఆయనను వెంబడిస్తూ తిడుతూ,దేహశుద్ధి చేశారు. భద్రతా సిబ్బంది ఆయనను రక్షించేందుకు ప్రయత్నించినా, ఆగ్రహంతో రగిలిపోతున్న ఆందోళన కారుల నుంచి రక్షించేందుకు విశ్వప్రయాత్నాలు చేశారు. చివరకు వారి చేతుల్లో బర్షమాన్ పున్ ప్రాణాలు కోల్పోకుండా కాపాడగలిగారు. ఈ ఘటనపై నేపాల్ రాజకీయ వర్గాలు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రజల ఆగ్రహాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా అభిప్రాయాలు వ్యక్తం చేయాలని పిలుపు కూడా వినిపిస్తోంది. Finance minister of NEPAL got an unexpected kick from common people of Nepal.pic.twitter.com/mMZRsU9tFj— Karthik Reddy (@mbkartikreddy) September 9, 2025 -
శృతిమించిన ‘జెన్‌జీ’ నిరసనలు.. మాజీ ప్రధాని భార్యను చంపేశారు
కాఠ్మాండు: నేపాల్ రాజధాని కాఠ్మాండులో జరిగిన ఘోర ఘటన కలకలం రేపుతోంది. ఆందోళన కారులు నేపాల్ రాజధాని కాఠ్మాండూలో మాజీ ప్రధాని జాలనాథ్ ఖనాల్ సతీమణి రాజ్యలక్ష్మి చిత్రకార్ ఆందోళనకారుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. సోషల్ మీడియా,అవినీతికి వ్యతిరేకంగా జనరేషన్ జెడ్ చేపట్టిన ఉద్యమంతో ప్రధాని కేపీ ఓలీ రాజీనామా చేశారు. మాజీ ప్రధాని కేపీఓలీతో పాటు పలువురు మంత్రులు దేశం విడిచి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరింత రెచ్చిపోయిన ఆందోళన కారులు కాఠ్మాండూలోని డల్లూ ప్రాంతంలో మాజీ ప్రధాని జాలనాథ్ ఖనాల్ ఇంటిని ముట్టడించారు. ఖనాల్ సతీమణి రాజ్యలక్ష్మి చిత్రకార్‌ను ఇంట్లో బంధించి, ఇంటికి నిప్పుపెట్టారు. మంటల్లో చిక్కుకున్న రాజ్యలక్ష్మిని కిర్తిపూర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయారు.మాజీ ప్రధాని ఖనాల్ సతీమణి రాజ్యలక్ష్మి మరణంపై రాజకీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.జెనరేషన్ జెడ్ ఆందోళనలతో నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించింది. దీంతో పలువురు జెనరేషన్ జెడ్ ఆందోళనల్ని సోషల్ మీడియా వేదికగా వ్యతిరేకిస్తున్నారు. మాజీ ప్రధాని ఖనాల్ సతీమణి రాజ్యలక్ష్మి మరణంపై ‘మానవత్వానికి మాయన మచ్చ’అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
జనరేషన్ జెడ్ హీరో.. నేపాల్‌కి కొత్త ప్రధాని.. ఎవరీ బాలెన్ షా?
కాఠ్మాండు: నేపాల్‌లో జనరేషన్ జెడ్ నిరసనలు ఆ దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్‌మీడియాపై ప్రభుత్వ ఆంక్షల్ని విధించడాన్ని వ్యతిరేకిస్తూ నేపాల్ రాజధాని కాఠ్మాండులో జనరేషన్ జెడ్ యువత రోడ్డెక్కింది. ఆందోళన చేపట్టింది. వీరి ఆందోళనలతో ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేశారు. దీంతో ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా తర్వాత తదుపరి ప్రధాని ఎవరు? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఆ దేశంలో సైనిక పాలన అమల్లోకి వచ్చే అవకాశం ఉందంటూ పలు అంతర్జాతీయ కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో నేపాల్ తదుపరి నూతన ప్రధాని బాలేంద్ర షా (బాలెన్) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సోషల్‌మీడియాపై బ్యాన్, అవినీతిపై ఆందోళన చేస్తున్న యువతే బాలేంద్ర షాకు మద్దతు పలుకుతున్నాయి. అతనే నేపాల్ నూతన ప్రధాని అంటూ సోషల్ మీడియా వేదికగా క్యాంపెయిన్ నిర్వయిస్తున్నాయి. రాపర్ నుంచి మేయర్ వరకు: బాలెన్ షా ప్రయాణంబాలెన్ షా ఒకప్పుడు అండర్‌గ్రౌండ్ హిప్-హాప్ రాపర్. తన పాటల ద్వారా రాజకీయ అవినీతి, సామాజిక అసమానతలపై విమర్శలు చేశారు. బలిదాన్ అనే పాటకు యూట్యూబ్‌లో ఏడు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందిన బాలెన్, 2022లో స్వతంత్ర అభ్యర్థిగా కాఠ్మాండు మేయర్‌గా ఎన్నికయ్యారు.జెన్‌జీ ఆవేశాల్ని అర్ధం చేసుకోగలను నేపాల్‌లో దేశవ్యాప్తంగా సోషల్ మీడియా నిషేధం విధించడంపై ఆందోళన చేపట్టిన జనరేషన్ జెడ్‌కు మద్దతుగా బాలెన్ షా సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ఈ ఉద్యమం పూర్తిగా జనరేషన్ జెడ్ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. వయస్సు పరిమితి కారణంగా వారి ఆందోళనలో నేను పాల్గొనలేను.కానీ వారి ఆవేశాలను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను’అని పేర్కొన్నారు.నేపాల్‌లో దేశవ్యాప్తంగా సోషల్ మీడియా నిషేధం విధించిన తర్వాత ప్రారంభమైన నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. జనరేషన్ జెడ్ యువత ఆధ్వర్యంలో సాగిన ఈ ఉద్యమంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సైన్యం ఆదేశాలతో ప్రధాని కేపీ శర్మ ఓలి మంగళవారం రాజీనామా చేశారు. ఓలీ తన రాజీనామా లేఖలో.. సమస్యకు రాజకీయ పరిష్కారం అవసరం. అందుకు నేను రాజీనామా చేస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఓలీ రాజీనామా అనంతరం ఎయిర్‌పోర్టులను మూసివేశారు. మంత్రులను హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించారు.‘బాలెన్ దాయ్.. టేక్ ద లీడ్’ఈ క్రమంలో జనరేషన్ జెడ్ కేపీ ఓలీ తర్వాత తదుపరి ప్రధానిగా బాలెన్ షాయేనంటూ సోషల్ మీడియా క్యాంపెయిన్ చేపట్టింది. పార్టీల కోసం పని చేసే నాయకులు కాదు. ప్రజల కోసం పనిచేసే నాయకుడు కావాలి’ అనే నినాదంతో బాలెన్ పేరుతో సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేస్తున్నారు.‘బాలెన్ దాయ్.. టేక్ ద లీడ్’ అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రాష్ట్రపతి వద్దకు బాలెన్ షాప్రధాని ఓలి రాజీనామాతో రాష్ట్రపతి రామ్ చంద్ర పౌడెల్ కొత్త నూతన ప్రధాని అభ్యర్ధి పేర్లను పరిశీలిస్తున్నారు. జనరేషన్ జెడ్ సైతం రాష్ట్రపతి రామ్ చంద్ర పౌడెల్ వద్దకు బాలెన్ షా పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. -
ప్రధాని రాజీనామా.. నేపాల్‌లో సైనిక పాలన?
నేపాల్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. యువత(Gen Z) హింసాత్మక ఆందోళనలకు దిగొచ్చిన కేపీ శర్మ ఓలీ తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. సైన్యం సూచన మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తనను సురక్షితంగా దేశం దాటించాలనే షరతు మీద ఆయన సైన్యం చెప్పింది చేసినట్లు అక్కడి మీడియా కథనాలు ఇస్తోంది. నేపాల్‌లో సోషల్ మీడియా బ్యాన్ యువతకు కోపం తెప్పించింది. ఇది అవినీతిని ప్రశ్నించే గొంతుకలను అణచివేయడమేనంటూ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు దిగింది. అదే సమయంలో నేపాల్ నేతల వారసుల విలాసాలపైనా అందుబాటులో ఉన్న టిక్‌టాక్ లాంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా నిలదీసింది. ఈ క్రమంలో సోమవారం ఆ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సైన్యాన్ని రంగంలోకి దించినా.. పరిస్థితి ఏమాత్రం చల్లారలేదు. ఖాట్మండు సహా పలు ప్రాంతాల్లో జరిగిన ఆందోళనల్లో 19 మంది మరణించారు. దీంతో.. రాత్రికి రాత్రే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయితే.. సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తేసినప్పటికీ.. వరుసగా రెండోరోజు మంగళవారం కూడా ఆందోళనకారులు తమ నిరసనలు కొనసాగించారు. ఈ క్రమంలో.. ఖాట్మండులోని అధ్యక్ష భవనం శీతల్ నివాస్‌తో పాటు ప్రధాని ఓలీ నివాసం, కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. విధ్వంసం సృష్టించడంతో పాటు వాటికి నిప్పు పెట్టారు. ఈ క్రమంలో దాడి దృశ్యాలు.. నెట్టింటకు చేరాయి. అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ ప్రైవేట్ నివాసంతో పాటు నేపాల్ కాంగ్రెస్ భవనం, పలువురు నేతల ఇళ్లనూ నిరసనకారులు వదల్లేదు. అదే సమయంలో.. STORY | Nepal PM Oli resignsNepalese Prime Minister KP Sharma Oli resigned on Tuesday in the face of massive anti-government protests rocking the country, officials said.READ: https://t.co/LE58GQHabT https://t.co/dTpjUA8U6U— Press Trust of India (@PTI_News) September 9, 2025అంతేకాదు ఆయన కార్యాలయంలోకి ఆందోళనకారులు చొరబడిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వరుసగా మంత్రులు రాజీనామా చేయడం.. హింసాత్మక ఆందోళనలు మరింత ఉధృతరం కావడం, అదే సమయంలో సైన్యం ఒత్తిడితో ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం. నేపాల్‌లో సైనిక పాలనా?.. లేకుంటే కొత్త ప్రధానిని ఎన్నుకుంటారా? అనే దానిపై సాయంత్రం లోగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.Nepal PM Oli resigned after hundreds of protesters entered his office: Officials.— Press Trust of India (@PTI_News) September 9, 2025 Nepal PM Oli's house attacked amid the protests!#Nepalprotest #NepalProtests #Nepal pic.twitter.com/AhS5mtupiO— The-Pulse (@ThePulseIndia) September 9, 2025తాజా పరిస్థితుల దృష్ట్యా ఖాట్మండులో నిరవధిక కర్ఫ్యూ విధించారు. అయినప్పటికీ ఆ దేశాలను ధిక్కరిస్తూ నిరసనకారులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మరోవైపు.. ఇవాళ సాయంత్రం ఆల్‌పార్టీ మీటింగ్‌కు పిలుపు ఇచ్చిన ప్రధాని ఓలీ..ఈలోపే అనూహ్య నిర్ణయం తీసుకోవడం విశేషం. ప్రధాని ఓలీకి వరుస దెబ్బలుఆందోళనలు కొనసాగుతున్న సమయంలో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీకి రాజకీయంగా వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నిరసనలు హింసాత్మకంగా మారడంతో నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి రమేశ్ లేఖక్ సోమవారం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆపై పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రి రామ్‌నాథ్ అధికారి ప్రకటించారు. తాజా యువత ఆందోళనలకు మద్దతుగా నీటి సరఫరా శాఖ మంత్రి ప్రదీప్ యాదవ్ రాజీనామా చేశారు. అయితే ఈ వరుస రాజీనామాలను యువత పట్టించుకోలేదు. కర్ఫ్యూ, ఆంక్షలను చేధించుకుని మరీ వెళ్లి రాజీనామా చేసినవాళ్లతో పాటు ఇతర నేతల ఇళ్లకు నిప్పంటిస్తూ వస్తున్నారు. పలువురు నేతల నివాసాలతో పాటు వాళ్ల ప్రైవేట్ ఆస్తులకూ నిరసనకారులు నిప్పుపెట్టినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. భారతీయులకు అడ్వైజరీనేపాల్ ఆందోళనల దృష్ట్యా భారతీయులకు భారత విదేశాంగశాఖ ఓ అడ్వైజరీ జారీ చేసింది. ‘‘నేపాల్‌లో జరుగుతున్న పరిణామాలను మేము నిశితంగా పరిశీలిస్తున్నాం. ఖాట్మాండు సహా నేపాల్‌లోని ఇతర నగరాల్లో అధికారులు కర్ఫ్యూ విధించినట్లు గమనించాం. అనేకమంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము. అక్కడి అధికారుల సూచనలు అనుసరిస్తూ.. నేపాల్‌లోని భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలి’’ అని విదేశాంగశాఖ పేర్కొంది. నేపాల్ ప్రభుత్వం శాంతియుత మార్గాలు, చర్చల ద్వారా సమస్యను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. -
నేపాల్ ప్రధాని కేపీ ఓలి కుటుంబ సభ్యులపై రాళ్లదాడి.. హోం మంత్రి రాజీనామా
కాఠ్మాండూ: నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాపై విధించిన బ్యాన్‌ను ఎత్తివేయాలంటూ అక్కడి యువత చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆందోళన కారుల్ని నిలువరించేందుకు పోలీసులు, ఆర్మీ బలగాలు చేసిన ప్రయత్నాల కారణంగా సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గాయపడ్డారు.అయినప్పటికీ నేపాల్ రాజధాని కాఠ్మాండూలో జెడ్ జనరేషన్ మొదలు పెట్టిన ఉద్యమం తారాస్థాయికి చేరింది. ఆందోళన కారులు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి పూర్వీకుల ఇంటిపై రాళ్లు విసిరారు. రాజధాని కాఠ్‌మాండూతో పాటు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రధాని ఓలి స్వస్థలమైన దమక్ వరకు ఈ ఉద్యమం విస్తరించింది. కోశీ ప్రావిన్స్‌లోని ఇతర ప్రాంతాల్లో కూడా యువత పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.నేపాల్‌లో రోజురోజుకీ పెరిగిపోతున్న అవినీతిని అంతమొందించేందుకు యువత సోషల్ మీడియాను విపరీతంగా వినియోగిస్తోంది. ఎక్కడ అవినీతి జరిగినా క్షణాల్లో సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో యువతకు భయపడిన నేపాల్ ప్రభుత్వం గత గురువారం(సెప్టెంబరు 4) మెటా,యూట్యూబ్,ఎక్స్.కామ్ ఇలా మొత్తం 26 సోషల్ మీడియా ఛానెల్స్‌ను బ్యాన్ చేసింది. దీంతో నేపాల్ యువత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పెదవి విరిచింది. ఆ దేశ సుప్రీంకోర్టు సైతం సోషల్ మీడియాపై ఆంక్షలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశించింది. ఆ ఆదేశాల్ని నేపాల్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.ఈ నేపథ్యంలో గత గురువారం నుంచి, యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నారు. జెనరేషన్జెడ్ యువత రాజధాని కాఠ్మాండూ నగర వీధుల్లో ఉద్యమాన్ని సోమవారం ముమ్మరం చేసింది. దేశంలో పెరిగిపోతున్న అవినీతి పారద్రోలడం,సోషల్ మీడియా బ్యాన్ ఎత్తివేయడంతో పాటు ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నేపాల్ హోం మంత్రి రాజీనామానేపాల్ హోం మంత్రి రమేశ్ లేఖక్ రాజీనామా చేశారు. అల్లర్లకు బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకొన్నారు. తన రాజీనామా లేఖను ప్రధాని కేపీ ఓలికి అందజేశారు. -
కల్లోలంగా నేపాల్.. అసలేం జరుగుతోంది? వాళ్ల డిమాండ్లేంటి??
నేపాల్‌లో అక్కడి జెడ్ జనరేషన్ మొదలుపెట్టిన ఉద్యమం(Gen-Z Protest) అదుపు తప్పింది. సోషల్ మీడియా నిషేధం, అవినీతి వ్యతిరేకంగా ఖాట్మాండులో కొనసాగుతున్న ఆందోళనలు సోమవారం హింసాత్మకంగా మారాయి. ఇప్పటిదాకా 20 మంది మరణించగా.. వంద మందికి పైగా గాయాలయ్యాయి. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.నేపాల్ రాజధాని ఖాట్మాండులో జెడ్ జనరేషన్ యువత పెద్ద ఎత్తున అవినీతి, సోషల్ మీడియా నిషేధంపై నిరసనకు దిగారు. అయితే ఇది కేవలం ఖాట్మాండుకే పరిమితం కాలేదు. పోఖరా, బుట్వాల్, ధరణ్, ఘోరాహీ వంటి ప్రధాన నగరాల్లో ర్యాలీలు నిర్వహించారు. ఈ ఆందోళనల్లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తోంది. మృతుల్లో 12 ఏళ్ల బాలుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం ఆందోళనకారులు పార్లమెంట్ వద్ద బారికేడ్లు తోసుకుని లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. పార్లమెంట్లో పలు చోట్ల నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నంలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్ భారీగా ప్రయోగించడంతో.. పలువురు మృతి చెందారు. నిరసనకారులు మరింత రెచ్చిపోవడంతో ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. ప్రధాని కె.పి. శర్మ ఓలి స్వస్థలం ధమాక్కూ ఈ నిరసనలు విస్తరించాయి.ఆందోళన వెనుక కారణాలుకిందటి ఏడాది ఆగస్టు/సెప్టెంబర్ సమయంలో నేపాల్ సుప్రీం కోర్టు.. అన్ని సోషల్ మీడియా సంస్థలు నేపాల్‌లో నమోదు కావాలి అని ఆదేశించింది. స్థానిక ప్రతినిధిని నియమించాలని, గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ ఆఫీసర్.. కంప్లయన్స్ ఆఫీసర్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. అయితే సుప్రీం కోర్టు తీర్పు అమలు విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విమర్శలొచ్చాయి. ఈ ఏడాది మార్చిలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు 30 రోజుల గడువు ఇచ్చింది. ఆపై ఆగస్టు 27న చివరికి.. 7 రోజుల గడువుతో అధికారిక నోటీసు ఇచ్చింది. చివరకు సెప్టెంబర్ 4న 26 అప్లికేషన్లను(యాప్‌లను) బ్లాక్ చేసి పడేసింది.అభ్యంతరాలు అందుకే..ప్రభుత్వ చర్యలను Gen-Z యువత సెన్సార్‌షిప్‌గా, అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నంగా అభివర్ణిస్తోంది. ఈ క్రమంలో నేపాల్‌లో కోర్టు తీర్పు ప్రకారం రిజిస్టర్ అయిన టిక్‌టాక్ లాంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో.. రాజకీయ నాయకుల పిల్లలు విలాసవంతమైన జీవితం గడుపుతున్న వీడియోలు వైరల్ చేస్తున్నారు. పొలిటికల్ నెపోటిజానికి తాను వ్యతిరేకమని చాటి చెబుతున్నారు. నేతల పిల్లలకేమో బంగారు భవిష్యత్తు అని.. మరి తమ పరిస్థితి ఏంటని? నిలదీస్తున్నారు. ఈ క్రమంలో.. రోడ్డెక్కి ఆందోళనలకు దిగారు. కొసమెరుపు ఏంటంటే.. టిక్‌టాక్‌ను కిందటి ఏడాది నేపాల్ బ్యాన్ చేసింది. అయితే ప్రభుత్వ మార్గదర్శకాలను అనుగుణంగా వ్యవహరించడంతో ఆ బ్యాన్‌ను ఎత్తేసింది. ఇప్పుడు అదే ప్లాట్‌ఫారమ్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను ఉవ్వెత్తున సాగేలా చేస్తోంది.ప్రభుత్వం స్పందననియమిత నమోదు లేకుండా పనిచేస్తున్న సంస్థలను నిషేధించడమే ఉద్దేశం అని ప్రభుత్వం చెబుతోంది.స్వేచ్ఛను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నాం అని అంటోంది. నిరసనల్లో.. ఆందోళనకారులపై పోలీసులు వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్, రబ్బర్ తూటాలు ప్రయోగించారు. పలు చోట్ల కవరేజ్‌కు వెళ్లిన జర్నలిస్టులు గాయపడ్డారు. ఖాట్మాండు బనేశ్వర్ ప్రాంతం నుంచి ప్రారంభమైన కర్ఫ్యూ, అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాని నివాస ప్రాంతాల వరకు విస్తరించబడింది. ఖాట్మండు పోస్ట్ కథనం ప్రకారం.. నేపాల్‌లో కోటి 35 లక్షల మంది ఫేస్బుక్ యూజర్లు ఉన్నారు. 36 లక్షల మంది ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఉన్నారు. వ్యాపారాలపై కోసం చాలామంది ఆధారపడి ఉన్నారు. అలా.. బ్యాన్ నేపథ్యంలో అన్నివిధాల నిరసనలు ఊపందుకున్నాయి. Gen-Z (Generation Z) అనేది 1997 నుండి 2012 మధ్య కాలంలో జన్మించిన వ్యక్తుల తరం. జెన్ జెడ్ ఏం చెబుతోంది అంటే.. ఇది కేవలం సోషల్ మీడియా నిషేధం కాదు, అవినీతికి వ్యతిరేకంగా మా తరం పోరాటం. ముగించాల్సింది కూడా మేమే అని ప్రకటించుకుంటోంది. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో సోషల్ మీడియా నిషేధాన్ని ఎత్తేసే ఆలోచనలో నేపాల్ ప్రభుత్వం ఉన్నట్లు అక్కడి మీడియా చానెల్స్ కథనాలు ఇస్తున్నాయి. -
బ్లూకాలర్ ఉద్యోగాల్లో మిలీనియల్స్, జెన్ జెడ్ హవా
బ్లూకాలర్ ఉద్యోగాల్లో (శ్రమ ఆధారిత కార్మిక, నైపుణ్య పనులు) మిలీనియల్స్ (30–45 ఏళ్ల వయసు వారు), జెనరేషన్ జెడ్ (30 ఏళ్లలోపు) ఎక్కువగా పోటీపడుతున్నారు. 2024, 2025 సంవత్సరాల్లో ఈ విభాగంలో ఉద్యోగాలకు వచ్చిన దరఖాస్తుల్లో 65 శాతం మేర మిలీనియల్స్, జెన్–జెడ్ నుంచే ఉండడం గమనార్హం. ఇందులోనూ 20–23 వయసు వారి నుంచే అధికంగా ఉన్నాయి. ఈ వయసు విభాగంలో ఉద్యోగ దరఖాస్తులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 51 శాతం పెరిగాయి. ఈ వివరాలను బ్లూ, గ్రే కాలర్ జాబ్ ప్లాట్‌ఫామ్ అయిన వర్క్‌ఇండియా వెల్లడించింది.యువత నుంచి (తాజా గ్రాడ్యుయేట్లు) బ్లూకాలర్ ఉద్యోగాలకు దరఖాస్తులు 85.5% పెరిగాయని, చిన్న వయసులోనే ఉద్యోగాల్లో చేరాలన్న ఆసక్తికి ఇది నిదర్శనమని పేర్కొంది. 10వ తరగతి కంటే తక్కువ విద్యార్హత ఉన్నవారి నుంచి కూడా ఉద్యోగ దరఖాస్తుల్లో 37 శాతం వృద్ధి కనిపించింది. 2024 జనవరి నుంచి 2025 జూలై వరకు వర్క్ ఇండియా ప్లాట్‌ఫామ్‌పై 111.71 మిలియన్ ఉద్యోగార్థుల డేటాను విశ్లేషించి ఈ నివేదికను సంస్థ విడుదల చేసింది. చదువుతో సంబంధం లేకుండా వివిధ వర్గాల వారి నుంచి ఉద్యోగాల నిర్వహణ పట్ల ఆకాంక్షలు, సన్నద్ధత పెరుగుతున్నట్టు పేర్కొంది.మధ్య వయసులో మహిళలు డ్రాప్!కెరీర్ ఆరంభంలో ఉన్న యువతీ, యువకులు ఉద్యోగాలకు ఉత్సాహంగా దరఖాస్తు చేసుకుంటున్నట్టు వర్క్‌ఇండియా నివేదిక వెల్లడించింది. 27–29 ఏళ్ల వయసు మహిళల నుంచి ఉద్యోగ దరఖాస్తులు స్తబ్దుగా ఉన్నట్టు తెలిపింది. కానీ, ఇదే వయసు పురుషుల నుంచి మాత్రం దరఖాస్తులు పెరుగుతున్నట్టు పేర్కొంది. దీన్ని బట్టి ఈ వయసు మహిళలు కెరీర్ నుంచి మధ్యలోనే వైదొలగడం లేదంటే అవరోధాలను ఎదుర్కొంటున్నారా? అన్న దానిపై దృష్టి సారించాలని సూచించింది. ఉద్యోగాల కోసం అవసరమైతే వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు సైతం యువత సుముఖత చూపిస్తున్నట్టు తెలిపింది. ఇక బ్లూకాలర్కు అదనంగా టైపిస్ట్, డేటా ఎంట్రీ, సేల్స్, హెచ్ఆర్, తయారీ ఉద్యోగ విభాగాలు సైతం అధిక వృద్ధిని చూస్తున్నట్టు వివరించింది. టైర్4 పట్టణాల నుంచి ఉద్యోగ దరఖాస్తులు 55 శాతం వరకు పెరిగినట్టు తెలిపింది.ఇదీ చదవండి: రూపాయి 79 ఏళ్ల ప్రస్థానం -
ఫ్యాషన్ ఫ్రమ్ నేచర్.. డిజైనింగ్‌తో స్టోరీ టెల్లింగ్..
15 ఏళ్ల వయసులోనే ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన.. రెండేళ్లలోనే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. వెరసి దేశంలోనే అతిపిన్న వయస్కుడైన ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తున్నాడు అమోగ్ రెడ్డి. భారతీయ సంప్రదాయ, వివాహ కోచర్‌లో తన నైపుణ్యాలతో ప్రసిద్ధి చెందిన అమోగ్.. వారసత్వ హంగులను ఆధునిక ఫ్యాషన్‌తో సమ్మిళితం చేస్తూ అంతర్జాతీయ స్థాయి ఫ్యాషన్ ఔత్సాహికులను ఆకర్షిస్తున్నారు. అంతేకాకుండా ‘యంగెస్ట్ డిజైనర్ ఆఫ్ ది ఇయర్’ బిరుదును సైతం పొందారు. ఈ ప్రయాణంలో భాగంగానే నగరంలోని హెచ్ఐసీసీ నోవోటెల్ వేదికగా వినూత్నంగా ఫారెస్ట్ థీమ్‌తో ఆదివారం నిర్వహించిన ఇండియా కిడ్స్ ఫ్యాషన్ వీక్‌లో వనమ్ కలెక్షన్స్ ఆవిష్కరించారు. డిజైనింగ్‌తో స్టోరీ టెల్లింగ్.. మన ఊహకందని నూతన ఫ్యాషన్ ఫార్ములాతో సమ్మిళితమై రూపొందించారు. ఆ సౌందర్యం ఒక్కొక్క లేయర్‌లా నిరంతరం ఆకర్షణీయంగా అభివృద్ధి చెందుతూ ఉంటుందని అమోగ్ రెడ్డి తన ఆలోచనలను పంచుకున్నారు. నోవోటెల్ వేదికగా చిన్నారులతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 12వ సీజన్ ఇండియా కిడ్స్ ఫ్యాషన్ వీక్‌లో అమోగ్ రూపొందించిన డిజైనింగ్ వేర్ ప్రకృతిని ప్రతిబింబించాయి. ప్రకృతిలోని వర్ణాలు, అరణ్యంలోని అందాల నుంచి ప్రేరణ పొందాయి. ఆకారాల కవిత్వమే ఈ వనమ్ కలెక్షన్ అని అమోగ్ పేర్కొన్నారు. ప్రకృతి అందాలే ఈ డిజైన్లను రూపొందించడానికి ప్రేరేపించాయన్నారు. క్రియేటివిటీని హైదరాబాద్‌లో ప్రారంభించి దేశంతో పాటు ప్రపంచ నలుమూలలా విస్తరింపజేయాలనే లక్ష్యంతో ఉన్నానన్నారు. ఈ కలెక్షన్లోని ప్రతి డిజైన్ ఒక కథను చెబుతుంది. వినూత్న పద్ధతుల్లో ఆధునిక ఫ్యాషన్ హంగులతో సంప్రదాయ హస్తకళలను సమన్వయం చేయడంతో ఫ్యాషన్ ప్రియులను అలరించాయి.(చదవండి: శ్రావణ శోభను తెచ్చేలా..పట్టుతో స్టైలిష్‌గా మెరుద్దాం ఇలా..!) -
జనరేషన్ జెడ్.. టెక్నాలజీలో అప్డేటెడ్
సాక్షి, స్పెషల్ డెస్క్: సాంకేతికతను వినియోగించడంలో, ఎప్పటికప్పుడు అప్డేట్ కావడంలోనూ జెనరేషన్–జడ్ తరం ముందుంటోంది. 1997–2012 మధ్య జన్మించిన వాళ్లున్న ఈ తరం ప్రపంచ జనాభాలో దాదాపు 30% ఉన్నారు. భారత జనాభాలో వీరి వాటా దాదాపు 27%. మార్కెట్లోకి అడుగుపెట్టిన నూతన సాంకేతికతను 40% జెన్–జడ్ వాళ్లు వేగంగా అందిపుచ్చుకుంటున్నారు. కృత్రిమ మేధ (ఏఐ), జనరేటివ్ ఏఐని వినియోగించేందుకూ ఆసక్తి చూపుతున్నారని సైబర్ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) నివేదిక వెల్లడించింది. దేశంలోని ప్రధాన ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఈ సంస్థ సర్వే నిర్వహించింది.ప్రయోగాల్లో ముందు..మార్కెట్లోకి కొత్త టెక్నాలజీ రావడమే ఆలస్యం.. జెన్–జడ్లోని ప్రతి 10 మందిలో నలుగురు దాన్ని వెంటనే అందిపుచ్చుకుంటున్నారు. వైరల్ ట్రెండ్స్ విషయంలో ప్రయోగాలు చేయడంలో జెన్–జడ్ తరం ముందుంటోంది. జిబ్లీ ఫిల్టర్‌ను కోట్లాది మంది వినియోగించడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని సీఎంఆర్ నివేదిక తెలిపింది. ‘సాంకేతికతను, ట్రెండ్‌ను వేగంగా అందిపుచ్చుకునే విధానం.. వినియోగ వ్యవస్థ రూపురేఖలను మారుస్తోంది. జెన్ జడ్లో సగం మంది వినియోగదారులకు ఏఐ గురించి తెలుసు. ముగ్గురిలో ఒకరు దైనందిన జీవితంలో జనరేటివ్–ఏఐని భాగంగా చేసుకున్నారు.చరిత్రలో ఒక గొప్ప మలుపు వద్ద జెన్–జడ్ తరం ఉంది. సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రపంచవ్యాప్తంగా అనుసంధానం అయిన మొదటి తరం ఇదే’ అని ఆ నివేదిక వివరించింది. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, గౌహతి, జైపూర్, ఇండోర్, గ్వాలియర్‌కు చెందిన జెన్–జడ్, మిలీనియల్స్ (28–44 ఏళ్ల మధ్య వయసు), జెన్ ఆల్ఫా (13 ఏళ్ల లోపు వారు) తరం ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. పనితనం ఉండాల్సిందే..జెన్–జడ్ తరానికి స్మార్ట్‌ఫోన్స్ కేవలం పరికరాలు మాత్రమే కాదు.. అవి గుర్తింపు వ్యక్తీకరణలు, అన్వేషణకు సాధనాలని నివేదిక వెల్లడించింది. పనితనం, బ్రాండ్ పట్ల నమ్మకం.. స్మార్ట్ఫోన్ల కొనుగోలును నిర్ణయిస్తున్నాయి. గేమింగ్, కంటెంట్ క్రియేషన్.. ఇన్ఫోటైన్‌మెంట్‌గా వారు భావించే ఈ వేదికలన్నీ కచ్చితమైన, అధిక పనితీరు కనబరచాల్సిందేనని ఈ తరం కోరుకుంటోంది. శక్తిమంతమైన చిప్సెట్స్ ఉండే స్మార్ట్ఫోన్లను జెన్ జెడ్ వాళ్లు ఎంపిక చేసుకుంటున్నారు. అంతేకాదు, మంచి బ్రాండ్లవీ, అద్భుతంగా పనిచేసేవీ వాళ్ల ప్రధాన ప్రాధామ్యాలుగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా, ఆటంకాలు లేని అనుభూతిని చిప్సెట్స్ అందిస్తున్నాయి. చిప్సెట్స్ పరంగా వినియోగదారుల సంతృప్తిలో మీడియాటెక్, ప్రీమియం బ్రాండ్ ఇమేజ్‌లో క్వాల్కామ్ ముందంజలో ఉన్నాయి. ఆరు గంటలు గేమింగ్‌కు..భారత్‌లో 74% మంది జెన్–జడ్ తరం స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్ కోసం వారంలో 6 గంటల సమయం వెచ్చిస్తున్నారు. తమ స్నేహితుల ద్వారా కొత్త గేమ్స్ గురించి తెలుసుకుంటున్న వారు ఎక్కువగా ఉన్నారు. గేమ్స్ ఆడటం అంటే ఏదో మామూలు గేమ్స్ కాదు... ప్రీమియం గేమ్స్ ఆడాలని అనుకుంటున్న వారు 30% మంది ఉండటం విశేషం. ఖర్చు కంటే నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తాము ఒక్కరమే ఆడటం కాకుండా.. పోటీ ఉండాలని కోరుకుని, ఆన్లైన్ పోటీల్లో (ఈ–స్పోర్ట్స్)లో కూడా పాల్గొంటున్నారు.కొత్త గేమ్స్ గురించి ఎలా తెలుసుకుంటున్నారంటే... (శాతం)⇒ స్నేహితుల ద్వారా 66%⇒ సోషల్ మీడియా ద్వారా 55%⇒ యాప్ స్టోర్స్ ద్వారా 51%⇒ఏ గేమ్స్.. ఎందుకు ఆడుతున్నారు?⇒ వినోదం కోసమే స్మార్ట్ఫోన్లలో గేమ్స్ 72%⇒ మానసిక చురుకుదనం కోసం 52%⇒ ఈృస్పోర్ట్స్ ఆడేవారు 57%⇒ ప్రీమియం గేమ్స్ 30%స్మార్ట్ కార్లుడ్రైవింగ్ అనుభవాన్ని మరింత గొప్పగా చేయాలంటే కార్లను సాంకేతికతతో అనుసంధానించాల్సిందేనని 72 శాతం అభిప్రాయపడ్డారు. స్మార్ట్ కార్లు, రియల్ టైమ్ నేవిగేషన్, విద్యుత్ లేదా పర్యావరణ ప్రియ వాహనాలు.. ఇలాంటివి కావాలని వారు కోరుకుంటున్నారు. కింది అంశాలు ఉండే స్మార్ట్ కార్స్ కావాలంటున్నారు..అంశం శాతంఆధునిక భద్రతా ఫీచర్లు 59%మెరుగైన ఇంధన వినియోగం 56%అధిక బ్యాటరీ లైఫ్ 52% (ఫాస్ట్ ఛార్జింగ్ కోసం) -
షారుఖ్ ఖాన్ న్యూ జెన్ జెడ్ లుక్ అదిరిపోయిందిగా..
ఫ్యాషన్‌కి స్టైల్‌కి పెట్టింది పేరు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan). డైలాగ్ చెప్పినా, స్టెప్ వేసినా, బట్ట కట్టినా తనకంటూ ఒక స్టైల్ ఉంటుంది. తాజాగా షారుఖ్ ఖాన్ కూల్ న్యూ జెన్ జెడ్(Gen-z) లుక్‌లో అదిరిపోయాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.సూపర్ స్టార్ ఇటీవల ముంబైలో అడుగుపెట్టినపుడు తన క్యాజువల్ వేర్లో వావ్ అనిపించాడు. ఎయిర్పోర్ట్ స్టైల్లో తెల్లటి టీ-షర్ట్, నీలిరంగు హూడీ జాకెట్, కార్గో ప్యాంటుకి జతగా కూల్ యాక్సెసరీస్ ధరించాడు. ఎప్పటిలాగానే మోచేతులపైకి స్లీవ్లను మడిచి, జెన్-జెడ్ స్టేపుల్స్ ధరించి అదరహో అనిపించాడు. ఫ్యాషన్‌కు వయస్సు లేదని ఒకసారి నిరూపించాడు. ప్రస్తుతం Gen-Z ఫాలో అవుతున్న బ్లూ కార్గో ప్యాంట్ ధరించి తగ్గేదే లే అన్నట్టు కనిపించాడు. యాక్సెసరీల విషయానికి వస్తే, బ్లాక్ సన్ గ్లాసెస్, క్రాస్బాడీ బ్యాగ్, వాచ్ , క్రిస్పీ వైట్ స్నీకర్లతో లుక్‌ను ఎలివేట్ చేశాడు. మెడలో సిల్వర్ చెయిన్‌తో మరింత కూల్‌గా ప్రతి అంగుళం సూపర్‌స్టార్‌గా కనిపించాడు. దీంతో ఫ్యాన్స్ కింగ్ ఖాన్ ఫ్యాషన్‌కి, స్టైల్‌కి ఫిదా అయిపోతున్నారు. ఇన్‌స్టాలో షేర్ అయిన షారూఖ్ వీడియో నెటిజనులను ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani)కాగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ యాక్షన్-థ్రిల్లర్ ‘కింగ్’ షూటింగ్ ఈ ఏడాది జూన్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. కింగ్ తో పాటు, అమర్ కౌశిక్‌తో కలిసి నటించిన అడ్వెంచర్ చిత్రం టైగర్ vs పఠాన్ ,రాజ్ & డికె లాంటి ప్రాజెక్టులు షారూఖ్ చేతిలో ఉన్నాయి. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీలతో బాలీవుడ్లో తిరుగులేని హీరోగాఎదిగాడు షారుఖ్ ఖాన్. ముఖ్యంగా అతని కరియర్లో బాజిగర్ ఒక మైలురాయి. ఈ సినిమాకు సండంధించి ఒక ఆసక్తికర విషయం ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అసలు ఈ మూవీకి ఫస్ట్ చాయిస్ షారుఖ్కాదట. సల్మాన్ ఖాన్ , అక్షయ్ కుమార్ ఇద్దరూ ఆ పాత్రను తిరస్కరించిన తర్వాత మాత్రమే ఈ అవకాశం ఎస్ఆర్కేకి దక్కిందట. ఈ విషయాన్ని స్క్రీన్ రైటర్ రాబిన్ భట్ ఇటీవల వెల్లడించాడు.ఇదీ చదవండి: Pahalgam గడువు లోపు వెళ్లకపోతే...తప్పదు భారీ మూల్యం! -
జెన్–జడ్ రెబల్స్..ఈ తరం ఉద్యోగులు సరిచేసుకోవాల్సినవి ఇవే..!
జెన్–జడ్ అనగానే ‘డైనమిక్ నేచర్’ అంటారు. అంతమాత్రాన అంతా సవ్యంగా ఉన్నట్లు కాదు. జెన్–జడ్ ఉద్యోగులు సరిచేసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. జెన్–జడ్లో ప్రొఫెషనలిజం లేకపోవడం ఆందోళన కలిగిస్తుందని, ప్రొఫెషనల్ స్కిల్స్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు నిపుణులు...క్వాయిట్ క్విట్టింగ్యువ ఉద్యోగులకు సంబంధించి నిశ్శబ్ద నిష్క్రమణ (క్వాయిట్ క్విట్టింగ్) భారతీయ పరిశ్రమలలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇది పరిశ్రమ నిర్వాహకులలో ఆందోళనను పెంచుతుంది. ‘ఉద్యోగం అంటే కాలేజికి ఎక్స్టెన్షన్ కాదు. ప్రొఫెషనలిజం అవసరమని చాలామందికి అర్థం కావడం లేదు. వివిధ రంగాల డైనమిక్స్‌పై కూడా అవగాహన కొరవడింది. ప్రతి రంగానికి ఒకే రకమైన పని అవసరాలు ఉంటాయని వారు భావిస్తున్నారు. జెన్–జడ్ ఉద్యోగుల ప్రవర్తనను కూడా నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది’ అంటున్నారు టీమ్‌లీజ్ డిజిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నీతి శర్మ.జెన్ జడ్ అలా కాదు...పాత తరం ఉద్యోగులు, జెన్–జడ్ ఉద్యోగులకు మధ్య ఉన్న తేడా ఏమిటి? ఒకప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా ‘మౌనమే మంచిది’ అన్నట్లుగా ఉండేవాళ్లు. జెన్–జడ్ అలా కాదు...తమ అసమ్మతిని బహిరంగంగా చెప్పడానికి వెనకాడడం లేదు. పని ప్రమాణాలు, అవసరాల విషయంలో యువతరానికి, పాతతరానికి ఎంతో తేడా ఉంది. ‘పని మాత్రమే జీవితం అని యువతరం అనుకోవడం లేదు. పనికి మించిన జీవితం ఉందనే విషయం వారికి తెలుసు. అయితే దీన్ని పాతతరం అంగీకరించం కష్టం’ అంటుంది దిల్లీకి చెందిన సైకోథెరపిస్ట్ దివిజా బాసిన్. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్ అయిన దివిజకు 2.6 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ‘హార్డ్ వర్క్’ను పునర్నిర్వచించాల్సిన అవసరం ఉంది అంటారు ఆమె. అయితే ఇది చిత్రానికి ఒక వైపు మాత్రమే. మరోవైపు యువతలోని ప్రతికూలతలు కనిపిస్తున్నాయి.స్కిల్ గ్యాప్ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రేడ్ బాడీ నాస్కామ్ నివేదిక ప్రకారం టెక్ రంగంలో ఆరు లక్షల మంది నిపుణుల కొరత ఉంది. ప్రస్తుతం ఉన్న ‘స్కిల్ గ్యాప్’ సమస్యకు సులువైన పరిష్కార మార్గాలు లేకపోయినప్పటికీ యువత కార్పొరేట్ వాతావరణానికి అలవాటు పడటానికి సహాయపడే సాఫ్ట్ స్కిల్క్స్పై పరిశ్రమలు మరింత దృష్టి పెట్టే అవసరం ఉంది. రిక్రూట్మెంట్కు వచ్చే కంపెనీలు విద్యార్థుల్లో సాఫ్ట్ స్కిల్స్‌కు సంబంధించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నాయని దిల్లీకి చెందిన ఒక టెక్నికల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ హెడ్ చెప్పారు.కష్టమే సుమీ!అమెరికాకు చెందిన రెజ్యూమ్‌బిల్డర్.కామ్ నిర్వహించిన సర్వేలో 74 శాతం మంది మేనేజర్లు, బిజినెస్ లీడర్లు జెన్ జడ్‌తో పనిచేయడం కష్టమని చెప్పారు. స్కిల్ అసెస్మెంట్ సంస్థ వీబాక్స్ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ ప్రకారం భారతీయ గ్రాడ్యుయేట్లలో 51 శాతం మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారు. నేషనల్ ఎంప్లాయిబిలిటీ రిపోర్ట్ ఫర్ ఇంజనీరింగ్ ప్రకారం 80 శాతం మంది భారతీయ ఇంజనీర్లకు అవసరమైన నైపుణ్యాలు లేవు. అందుబాటులో ఉన్న ప్రతిభావంతులను నియమించుకోవడం తప్ప కంపెనీలకు మరో మార్గం కనిపించడం లేదు. (చదవండి: -
చిన్న బ్రాండ్స్‌కు యువత జై
ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కొనుగోళ్లలో సాధారణంగా పెద్ద బ్రాండ్స్‌నే ఎక్కువగా ఎంచుకునే వినియోగదారుల ధోరణి క్రమంగా మారుతోంది. కొత్త తరం కన్జూమర్లు, ముఖ్యంగా మిలీనియల్స్, జెన్ జెడ్ వర్గాలు.. పేరొందిన పెద్ద కంపెనీల కన్నా కొన్నాళ్ల క్రితమే మార్కెట్లోకి వచ్చిన చిన్న బ్రాండ్స్ వైపు మొగ్గు చూపుతున్నాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థ నీల్సన్ఐక్యూ తాజా అధ్యయనం ప్రకారం 2019–2024 మధ్య కాలంలో పరిశ్రమ వార్షిక వృద్ధి రేటు కేవలం 8 శాతంగానే ఉండగా, వర్ధమాన ఎల్రక్టానిక్స్ గృహోపకరణాల బ్రాండ్లు మాత్రం ఏకంగా 13% వృద్ధి రేటు నమోదు చేశాయి.5 శాతం కన్నా తక్కువ మార్కెట్ వాటా గల సంస్థలను వర్ధమాన బ్రాండ్లుగా పరిగణనలోకి తీసుకున్నారు. 1981–96 మధ్య పుట్టిన వారిని మిలీనియల్స్‌గా, 1997–2012 మధ్య జన్మించిన వారిని జెనరేషన్ జెడ్‌గా వ్యవహరిస్తారు. చిన్న గృహోపకరణాల విభాగంలో వర్ధమాన బ్రాండ్ల మార్కెట్ వాటా గత అయిదేళ్లలో 55% నుంచి 59%కి పెరిగింది. టీవీల్లో 23% నుంచి 26%కి చేరింది. ఇక ఈ–కామర్స్‌లో కొత్త బ్రాండ్లు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందుతున్నాయి. అటు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డేటా ప్రకారం గత అయిదేళ్లలో ఆరు టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ వార్షిక వృద్ధి 1.2 శాతానికి నెమ్మదించగా, చిన్న బ్రాండ్లు మాత్రం 2.65% వృద్ధి చెందాయి. తీవ్రమైన పోటీ.. బ్రాండ్లు చిన్నవే అయినప్పటికే అవి అనుసరిస్తున్న వ్యూహాలే వ్యాపార వృద్ధికి ఊతమిస్తున్నాయి. ప్రధానంగా వినూత్నత, తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్లను అందిస్తుండటంలాంటి అంశాలు వాటికి ప్లస్ పాయింటుగా ఉంటోంది. ఇక ఈ–కామర్స్ విషయానికొస్తే.. కొనుగోళ్లు సులభతరంగా ఉండటం కూడా కలిసి వస్తోంది. ప్రీమియం ఫీచర్లను మరింత అందుబాటులోకి తేవడం ద్వారా వివిధ కేటగిరీల్లో వర్ధమాన బ్రాండ్లు తీవ్రమైన పోటీకి తెరతీశాయని నీల్సన్ఐక్యూ ఇండియా పేర్కొంది. టీవీలు, ఎయిర్ కండీషనర్లు, వేరబుల్స్ విభాగాల్లో దాదాపు 45–50 బ్రాండ్స్ పోటీపడుతున్నాయి.సాధారణంగా ఎల్రక్టానిక్స్ కేటగిరీలో 3–4 పెద్ద బ్రాండ్స్ మాత్రమే మార్కెట్‌పై ఆధిపత్యం చలాయిస్తుంటాయి. ఉదాహరణకు రిఫ్రిజిరేటర్లు.. వాషింగ్ మెషీన్లు వంటి కేటగిరీల్లో ఎల్జీ, శాంసంగ్, వర్ల్‌పూల్, గోద్రెజ్ మొదలైనవి అగ్రస్థానంలో ఉండగా .. ఏసీల్లో వోల్టాస్, డైకిన్, ఎల్జీ లాంటి సంస్థలు టాప్ బ్రాండ్లుగా ఉంటున్నాయి. ప్రస్తుతం ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) విభాగంలోని ధోరణులే ఎల్రక్టానిక్స్‌లోనూ కనిపిస్తున్నాయని నీల్సన్ఐక్యూ వివరించింది.డిసెంబర్ క్వార్టర్లో దిగ్గజ సంస్థల కన్నా దాదాపు రెట్టింపు స్థాయిలో చిన్న, మధ్య తరహా సంస్థల అమ్మకాలు 13–14% స్థాయిలో పెరిగినట్లు పేర్కొంది. ఎల్రక్టానిక్స్ సెగ్మెంట్లో ప్రీమియం ఉత్పత్తుల విభాగం వేగవంతంగా వృద్ధి చెందుతోందని నీల్సన్ఐక్యూ డేటా సూచిస్తోంది. ఇక 2024 సెప్టెంబర్–డిసెంబర్ మధ్య కాలంలో ఈ–కామర్స్ మాధ్యమాన్ని తీసుకుంటే మొత్తం మార్కెట్ 6 శాతమే పెరగ్గా ఈ–కామర్స్ అమ్మకాలు ఏకంగా 19–20 శాతం వృద్ధి చెందాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్స్మార్ట్ ఫోన్స్‌లో జోరు..ఇక, స్మార్ట్‌ఫోన్స్ విభాగంలో వర్ధమాన బ్రాండ్లు మరింత జోరుగా దూసుకెళ్తున్నాయని ఐడీసీ ఇండియా వెల్లడించింది. ఈ సంస్థ డేటా ప్రకారం 2022లో టాప్ అయిదు బ్రాండ్ల మార్కెట్ వాటా 76 శాతంగా ఉండగా 2024లో 65 శాతానికి తగ్గింది. అలాగే, 2023తో పోలిస్తే స్మార్ట్‌వాచ్, వేరబుల్స్ విభాగాల్లోనూ చిన్న బ్రాండ్లు గణనీయంగా వృద్ధి చెందాయి.తక్కువ రేటులో ఎక్కువ ఫీచర్ల కోసం వినియోగదారుల నుంచి డిమాండ్ నెలకొనడం ఈ బ్రాండ్లకు ఉపయోగపడుతోంది. మోటరోలా వంటి వర్ధమాన బ్రాండ్ల అమ్మకాలు 136% ఎగి యగా, ఐక్యూ 51%, పోకో సేల్స్ 19%పెరిగాయి. శాంసంగ్ స్మార్ట్ఫోన్ల అమ్మకాలు 2023తో పోలిస్తే 2024లో 19.4% క్షీణించాయి. రియల్‌మి 8.5%పడిపోగా, షావోమీ అమ్మకాలు 0.2 శాతమే పెరిగాయి. 34% వృద్ధితో బడా బ్రాండ్లలో యాపిల్ మాత్రమే ఇందుకు మినహాయింపు. -
జెన్ఏఐకు దూరంగా ‘జెన్‌జెడ్’
వేగంగా అభివృద్ధి చెందుతున్న జనరేటివ్ ఏఐ (జెన్ఏఐ) ఐటీ పరిశ్రమకు కీలక శక్తిగా అవతరించిందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నివేదిక తెలిపింది. గ్లోబల్ ఔట్ సోర్సింగ్‌లో 58 శాతం వాటా కలిగిన ఇండియన్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ (ఐటీఈఎస్ )కు జెన్ఏఐ కీలకంగా మారింది. అయితే 80 శాతం మంది భారతీయ డెవలపర్లు జెన్ఏఐ ఉత్పాదకత ప్రయోజనాలను గుర్తిస్తుండగా, కేవలం 39 శాతం మంది మాత్రమే దీన్ని సమర్థవంతంగా ఉపయోగిస్తున్నారని పేర్కొంది. జెన్ జెడ్(2000 తర్వాత జన్మించినవారు) డెవలపర్లలో ఈ అంతరం మరింత విస్తృతంగా ఉందని చెప్పింది. కేవలం 31 శాతం జెన్ జెడ్ డెవలపర్లు ఈ జెన్ఏఐను వినియోగిస్తున్నట్లు బీసీజీ రూపొందించిన ‘ది జెన్ఏఐ అడాప్షన్ కొనండ్రమ్’ నివేదిక తెలిపింది.బీసీజీ నివేదికలోని అంశాలు..క్లౌడ్ కంప్యూటింగ్ ప్రభావంతో భారత్‌లో ఐటీ సేవలను మార్చే సామర్థ్యం జెన్‌ఏఐకి ఉంది.జెన్ఏఐను సమర్థవంతంగా వినియోగిస్తే ఐటీ పరిశ్రమ ఎన్నో రెట్లు అభివృద్ధి చెందుతుంది.భారత ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల ఉత్పాదకతను మెరుగుపరచడానికి జెన్ఏఐ సాధనాలను స్వీకరించే ప్రయత్నాలను వేగవంతం చేయాలి.జెన్ఏఐ రంగంలో గ్లోబల్‌గా పెట్టుబడులు పెరుగుతున్నాయి. అమెరికా, చైనా, ఈయూ, మిడిల్ ఈస్ట్ దేశాలు జెన్ఏఐని తమ వర్క్‌ఫ్లోలో ఏకీకృతం చేసేందుకు దృష్టి సారించాయి.భారత్ కూడా ఐటీ సేవల రంగంలో ఈ మేరకు ప్రయత్నాలు చేయకపోతే ఈ విభాగంలో నాయకత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.భారత్ కొన్నేళ్లుగా ప్రపంచ ఐటీ సేవలకు సారథ్యం వహిస్తోంది. సంక్లిష్ట కోడింగ్, సాఫ్ట్ వేర్ అభివృద్ధి, డిజిటల్ అప్లికేషన్లను పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. అయితే సాఫ్ట్వేర్ ఎలా నిర్మిస్తారో, ఎలా టెస్ట్ చేస్తారో, దాన్ని ఎలా ఉపయోగిస్తారో వంటి చాలా అంశాలను జెఎన్ఏఐ నిర్వహిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో ఐటీ పరిశ్రమ సంప్రదాయ పద్ధతులపై మాత్రమే ఆధారపడటం సరికాదు.పునరావృతమయ్యే పనులను ఆటోమేట్ చేసేందుకు జెన్ఏఐను వాడుతున్నారు. డెవలపర్లు సాధారణంగా వాడే కోడింగ్ పనులపై తక్కువ సమయం గడిపేందుకు, సమస్యలను సృజనాత్మకంగా పరిష్కారించేందుకు ఎక్కువ సమయం కేటాయించేందుకు ఇంది ఎంతో ఉపయోగపడుతుంది.ఏఐ మంచిదే.. కానీ..భారతీయ డెవలపర్లలో 39 శాతం మంది మాత్రమే జెఎన్ఏఐ సాధనాలను నమ్మకంగా వాడుతున్నారు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి.శిక్షణ, సరైన వనరులు: సమగ్ర శిక్షణా కార్యక్రమాలు, సరైన వనరులు పరిమితంగా అందుబాటులో ఉన్నాయి. దాంతో చాలా మంది డెవలపర్లకు జెఎన్ఏఐ సామర్థ్యం గురించి తెలిసినప్పటికీ, దాని పూర్తి సామర్థ్యాలను ఉపయోగించుకోవడానికి అవసరమైన నిర్మాణాత్మక మార్గదర్శకత్వాలు లేకుండా పోతున్నాయి.ఇంటిగ్రేషన్ సమస్యలు: ప్రస్తుత పని విధానంలో కొన్నిసార్లు జెన్ఏఐను చేర్చడం సులభం కాదు. డెవలపర్లకు సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్ అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. కోడింగ్ పద్ధతుల్లో సర్దుబాట్ల చేయాల్సి ఉంటుంది.మార్పునకు దూరంగా: సంప్రదాయ కోడింగ్ పద్ధతులకు అలవాటు పడిన డెవలపర్లు నైపుణ్యాలు అభివృద్ధి చేసుకుని జెన్ఏఐను వాడడం కొంత సవాలుతో కూడుకుంది. చాలా సందర్భాల్లో కొత్త సాంకేతికతలను స్వీకరించడానికి సంకోచించవచ్చు.జెన్ జెడ్: గ్రాడ్యుయేషన్ పూర్తయి కొత్తగా ఉద్యోగంలో చేరిన జెన్ జెడ్ కేటగిరీ యువతలో జెన్ఏఐ నైపుణ్య అంతరాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాము అధికంగా డిజిటల్ ప్లాట్ఫామ్ల్లో సమయం గడుపుతున్నప్పటికీ కేవలం 31 శాతం మంది మాత్రమే జెఎన్ఏఐ నైపుణ్యాలను కలిగి ఉంటున్నారు. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి.అనుభవం లేకపోవడం: జెన్ జెడ్ డెవలపర్లు సాధారణంగా కెరియర్ ప్రారంభ దశలో ఉంటారు. అధునాతన జెన్ఏఐ సాధనాల్లో వారికి తగినంత శిక్షణ ఉండకపోవచ్చు.విద్యా అంతరాలు: ప్రస్తుత విద్యా విధానంలో కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్‌లో తాజా పురోగతిని తగినంతగా కవర్ చేయకపోవచ్చు. ఇది యువ డెవలపర్లకు సవాలుగా మారుతుంది.సరైన వనరులు లేకపోవడం: నేర్చుకోవాలని ఉన్నా ఆర్థిక కారణాలు, అత్యాధునిక సాధనాలు, సరైన వనరులు అందుబాటులో లేకపోవడం కూడా జెన్ జెడ్ డెవలపర్లలో ఈ నైపుణ్యాలు కొరవడేందుకు కారణాలుగా ఉన్నాయి.ఆర్థిక అనిశ్చితి: వెండర్ కన్సాలిడేషన్(సర్వీసులు పొందేవారి సంఖ్యలో మార్పులు), అనిశ్చితుల వల్ల కుంచించుకుపోతున్న మార్కెట్లు సవాలుగా మారుతున్నాయి.పెరుగుతున్న కస్టమర్ ఆకాంక్షలు: వేగంగా మారుతున్న ఈ విభాగంలో కస్టమర్లు ఆకాంక్షలు పెరుగుతున్నాయి.రెగ్యులేటరీ నిబంధనలు: కఠినమైన డేటా గోప్యతా చట్టాలను అనుసరించడం, వాటికి తగ్గట్టుగా పరిమితులను సిద్ధం చేసుకోవడం క్లిష్టంగా మారుతుంది.ఈ అంతరాన్ని పూడ్చడం ఎలాజెన్ఏఐ ఉత్పాదకత ప్రయోజనాలను పూర్తిగా వినియోగించుకునేందుకు, నైపుణ్య అంతరాన్ని పూడ్చడానికి సమష్టి ప్రయత్నాలు అవసరం.సమగ్ర శిక్షణా కార్యక్రమాలు: సంస్థాగత, విద్యా స్థాయుల్లో మెరుగైన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. విభిన్న డెవలపర్లతో ప్రత్యేక సెషన్లను నిర్వహించాలి. పరిశ్రమకు అవసరమయ్యే నిర్దిష్ట అవసరాలను తీర్చే ప్రోగ్రామ్‌లు నైపుణ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి.మెంటార్ షిప్: మార్గదర్శకత్వాన్ని ప్రోత్సహించాలి. పీర్ లెర్నింగ్ సంస్కృతిని పెంపొందించాలి. జెన్ఏఐ వాడకాన్ని వేగవంతం చేయాలి. అనుభవజ్ఞులైన డెవలపర్లు తమకంటే తక్కువ నైపుణ్యం కలిగిన తోటివారికి మార్గనిర్దేశం చేయవచ్చు.జెన్ ఏఐ వినియోగం పెంచాలి..బీసీజీ మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ పార్టనర్ రాజీవ్ గుప్తా మాట్లాడుతూ..‘జెఎన్ఏఐ వేగాన్ని అందుకోవాలంటే భారతీయ ఐటీ రంగం నిబద్ధతతో దానికి నాయకత్వం వహించాలి. అత్యవసరంగా జెన్ఏఐని వినియోగాన్ని పెంచాలి. కృత్రిమ మేధ ఆధారిత సేవల భవిష్యత్తును రూపొందించే హక్కును సంపాదించాలి. ఈ విభాగంలో వస్తున్న మార్పులను స్వీకరించి ప్రపంచానికి నాయకత్వం వహించేలా చర్యలు చేపట్టాలి. లేదంటే ఐటీ విభాగంలో భారత్ ప్రస్తుతం స్థానం కోల్పోతుంది’ అన్నారు.ఆదరణ పెరుగుతున్నా వాడకానికి సంకోచంబీసీజీ ఎండీపీ సంభవ్ జైన్ మాట్లాడుతూ..‘జెఎన్ఎఐకు ఆదరణ పెరుగుతున్నా 40 శాతం కంటే తక్కువ మంది దాని వాడడానికి సంకోచిస్తున్నారు. అవకాశం ఉన్నా దాన్ని వినియోగించుకోవడం లేదు. ఇది ఫార్ములా 1 రేసింగ్ కారును వాకింగ్ స్పీడ్ కోసం ఉపయోగించినట్లుంది. జెన్‌జెడ్ జెన్ఏఐ తరం అని నమ్ముతున్నారు. కానీ అందుకు విరుద్ధంగా 31 శాతం జెన్‌జెడ్ యువతే దీన్ని వినియోగిస్తున్నారు’ అని తెలిపారు.ఎలా ఉపయోగించాలో తెలియదు..బీసీజీ పార్టనర్ షావీ గాంధీ మాట్లాడుతూ..‘జెఎన్ఏఐ వాడకానికి సంబంధించి డెవలపర్లు సుపరిచిత సాధనాలు, వర్క్ ఫ్లోలకు అలవాటుపడ్డారు. అందులో నుంచి బయటకు రావడానికి వారికి కష్టంగా మారుతుంది. జెన్ఏఐ దీర్ఘకాలిక విలువ గురించి వీరు నమ్మకంగా లేరు. దాంతో తరచు ఉద్యోగాలు మారేందుకు భయపడుతున్నారు. దాదాపు సగం మంది డెవలపర్లకు తమ వర్క్ ఫ్లోలో టూల్ సామర్థ్యాలను ఎలా పూర్తిగా ఉపయోగించుకోవాలో తెలియడం లేదు. 90వ దశకంలో కొత్త ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో దాన్ని ఉపయోగించడానికి నిరాకరించినట్లే ప్రస్తుతం జెన్ఏఐ వాడేందుకు భయపడుతున్నామా’ అని సందేహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ఐటీలో వేతన పెంపు ఎంతంటే..అవేర్నెస్ ముఖ్యం..డెవలపర్లు ఐదు లేదా అంతకంటే ఎక్కువ ట్రెయినింగ్ సెషన్లను పొందినప్పుడు జెఎన్ఏఐ అడాప్షన్ 16% నుంచి 48%కు పెరుగుతుంది. 92% ఎంటర్ప్రైజ్ క్లయింట్లు ఏఐ ఆధారిత సేవల కోసం ప్రీమియం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వారికి స్పష్టమైన ప్రణాళికలు, రుజువులు అవసరం అవుతాయి. సంస్థలు ఏఐ ఉత్పాదకతను శాస్త్రీయంగా ట్రాక్ చేయాలి. సామర్థ్యం, నాణ్యత, అవుట్ పుట్ అంతటా ఏఐ ప్రభావాన్ని పరిగణలోకి తీసుకోవాలి. -
ఆధ్యాత్మిక మేళాలో యువ తరంగాలు
నవతరం యువత ఆధ్యాత్మిక బాట పడుతోంది. మహా కుంభమేళాలో ఎక్కడ చూసినా యువోత్సాహం వెల్లివిరుస్తోంది. పీఠాధిపతులు, సన్యాసులు, నాగా సాధువులు, పెద్దవాళ్లకు దీటుగా జెన్ జెడ్ (కొత్త తరం) యువతీ యువకులు కూడా మేళాకు పోటెత్తుతున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్, చంకన లాప్టాప్తోనే తమదైన శైలిలో ఆధ్యాత్మికాన్వేషణలో మునిగి తేలుతున్నారు. తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక వేడుకలు మధ్యవయసు్కలు, వృద్ధులకు మాత్రమే పరిమితం కాదని నిరూపిస్తున్నారు.ఎందుకొస్తున్నారు? గత కుంభమేళాతో పోలిస్తే ఈసారి యువత రాక బాగా పెరగడం విశేషం. తమను పలకరించిన మీడియాతో వారు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంటున్నారు. ‘‘చిన్నప్పటి నుంచి అమ్మమ్మలు, తాతయ్యల నోట పంచతంత్ర కథలతోపాటు ఆధ్యాత్మిక విషయాలు, మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్ల గురించి ఎంతో విన్నాం. వాటినే స్వయంగా వచ్చి పాటిస్తున్నామంతే’’ అని త్రివేణి సంగమం వద్ద కొందరు యువతీ యువకులు చెప్పారు. ‘‘మా తాత, అమ్మమ్మ, నాన్నమ్మ కుంభమేళా గొప్పతనం గురించి ఎంతగానో చెప్పారు. ప్రత్యక్షంగా తెలుసుకుందామని వచ్చాం’’ అని సంస్కృతి మిశ్రా అనే యువతి చెప్పింది. ‘‘గంటగంటకు లక్షలాది మంది వచ్చిపోయే సంగమ స్థలిలో పేరుకుపోయే చెత్తను ఎప్పటికప్పుడు తరలిస్తూ పరిశుభ్రతను కాపాడుతున్న తీరు అద్భుతం. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పాఠాలను ప్రత్యక్షంగా నేర్చుకునేందుకు వచ్చా’’ అని అమీషా అనే అమ్మాయి చెప్పింది. అక్షరాలా అద్భుతమే ‘‘కుంభమేళా గురించి ఎవరో చెబితే వినడం వేరు. ఆ భక్తి పారవశ్యాన్ని కళ్లారా చూడడం వేరు. నాకు ఇన్‌స్టాలో 18,000 మంది ఫాలోవర్లున్నారు. ఇన్ఫ్లూయెన్సర్గా ఇతరులను ప్రభావితం చేయడానికి ముందు నేనే స్వయంగా చూడాలని వచ్చా. అప్పుడే మహా కుంభమేళా మహిమ ప్రత్యక్షంగా తెలిసి వచ్చింది. ఈ ఆధ్యాత్మికతను, కోట్లమందితో కలిసి పుణ్యస్నానం చేస్తే వచ్చే అనుభూతి, ప్రశాంతతను మాటల్లో వర్ణించలేం. కుంభమేళా విషయంలో ప్రయాగ్‌రాజ్ నిజంగా సాంస్కృతిక రాజ్యమే’’ అని 23 ఏళ్ల జ్యోతి పాండే చెప్పారు. ‘‘ఇంతమందిని ఒక్కచోట చూస్తే ఎంతో సుందరంగా ఉంది. ప్రజల విశ్వాసాలు, నమ్మకాలు గొప్పవి. నాకైతే ఇక్కడికొస్తున్న వాళ్లలో సగం మంది యువతే కనిపిస్తున్నారు. మేళాకు వచ్చి సనాతన భారతీయ సంస్కృతిలో భాగమైనందుకు సంతోషంగా ఉంది’’ అని అక్షయ్ అనే 20 ఏళ్ల హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి అన్నాడు. అతను ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ క్యాంప్‌లో భాగస్వామిగా పనిచేస్తున్నాడు. ‘‘తల్లిదండ్రులతో కలిసి మూడ్రోజులు ఇక్కడే మేళా మైదానంలో ఉండేందుకు వచ్చా. తెల్లవారుజామునే చలిలో పుణ్యస్నానాలు చేసేందుకు అంతా ఆసక్తి చూపిస్తున్నారు. భక్తుల అచంచల విశ్వాసం కుంభమేళాలో అణువణువుగా కనిపిస్తుంది’’ అని 23 ఏళ్ల ఢిల్లీ వర్సిటీ సైకాలజీ విద్యార్థిని సంస్కృతి చెప్పారు. ‘‘భక్తుల గేయాలు, నినాదాలతో సంగమ క్షేత్రమంతా హోరెత్తిపోతుంది. ఢిల్లీలాంటి కాంక్రీట్ వనం నుంచి ఇలాంటి పుణ్యతీర్థాలకు వచ్చినప్పుడే మన మూలాలేమిటో స్మరణకు వస్తాయి’’ అన్నారు. ‘‘కోట్లాది మంది ఒకే విశ్వాసంతో ఒక్కచోట చేరడాన్ని 144 ఏళ్లకొకసారి వచ్చే ఇలాంటి కుంభమేళాలోనే చూడగలం. ఇది నిజంగా అరుదైన విషయమే. నేను చిత్రలేఖనం చేస్తా. పసుపు, కుంకుమ, విభూతి, రంగులతో అలరారే మేళా పరిసరాలను చిరకాలం నిలిచిపోయేలా సప్తవర్ణ శోభితంగా నా కుంచెతో చిత్రిస్తా’’ అని దరాబ్ చెప్పాడు. అనుభవైకవేద్యమే ‘‘ఎవరో చేసే వీడియోలో, రీల్స్‌లో కుంభమేళాను చూడడం కాదు. మీరే స్వయంగా వచ్చి పుణ్యస్నానం ఆచరించి దాన్ని వీడియోలు, రీల్స్ చేసి చూడండి. ఈ స్థలం విశిష్టతేమిటో అప్పుడు తెలుస్తుంది! యువతకు ఆధ్యాత్మిక కనువిందే కాదు, కడుపునిండా భోజనమూ ఉచితంగా అందిస్తారు. ఇక్కడ రెండు నెలలపాటు ఉచిత భండార్లు అందుబాటులో ఉంటాయి. ఆధ్యాత్మికత, ఆనందాల మేళవింపు ఈ మేళా’’ అని ‘ది లలన్‌టాప్’ వార్తా సంస్థ ఉద్యోగి అభినవ్ పాండే చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బెంచింగ్ డేటింగ్ గురించి తెలుసా, ఇలా అయితే డేంజరే!
డేటింగ్ అనేది సక్రమ మార్గంలో వాడుకుంటే మంచిదే. ఒకర్నొకరు అర్థం చేసుకోవడానికి, ఒకరి అభిరుచులు మరొకరికి తెలియడానికి, ఇద్దరి మధ్యా మంచి సాంగత్యానికి ఉపయోపడుతుంది. కానీ ప్రస్తుత సాంకేతిక యుగం, సోషల్ మీడియా విశృంఖలత్వంతోపాటు, డేటింగ్ యాప్‌లు ఈ అర్థాన్ని మార్చి పారేశాయి.హానికరమైన, విషపూరితమైన సంబంధాలకు నాంది పలుకుతూ కొత్త డేటింగ్ ట్రెండ్లు ఉద్భవించాయి. అలాంటి వాటిల్లో ఒకటి బెంచింగ్ డేటింగ్. అసలేంటి బెంచింగ్ డేటింగ్? దీనివలన లాభమా? నష్టమా? తెలుసుకుందాం ఈ కథనంలో.ఆధునిక డేటింగ్ పదం బెంచింగ్ డేటింగ్. అంటే పేరుకు తగ్గట్టే భాగస్వాముల్లో ఒకర్ని హోల్డ్‌లో ఉంచి, మరొకరిపై ఆసక్తిగా ఉండటం. ప్రేమ భాగస్వామిని 'బెంచ్ మీద' ఉంచడం అంటే మరో బెస్ట్ ఆప్షన్ కోసం అన్వేషించడమే. అచ్చం ఒక ఆటగాడిని బెంచి మీద ఉంచడం లాంటిదన్నమాట. అంటే మెయిన్ టీంలో లేకుండా, ఆటలో పాల్గొనకుండా,సందర్భం కోసం వాడుకునేందుకు బెంచ్ మీద ఉండే ప్లేయర్ లాంటి వారు. ఈ డేటింగ్లో బెంచింగ్ చేస్తున్న వారు, తోటి భాగస్వామితో స్నేహం చేస్తారు కానీ మనస్సు పూర్తిగా పూర్తిగా సంబంధానికి కట్టుబడి ఉండరు. అలాగే ఈ డేటింగ్లో బెంచ్‌మార్కింగ్" అంటే ఎవరైనా తమ ప్రస్తుత భాగస్వామితో, గతంలోని వారితో పోల్చపుడు, నెగెటివ్‌గా కమెంట్ చేయడం లాంటివి కూడా ఉంటాయి. అంతిమంగా ఇది రెండో వ్యక్తిలో (బెంచ్‌మీద ఉన్న) గందరగోళానికి మానసిక వేదనకు గురి చేస్తుంది. నిజాయితీ, నిబద్ధత లోపించడంతో అవతలి వారిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ఒకరిమీద ఒకరికి విశ్వాసం, నమ్మకం లేనపుడు ఇక ప్రేమకు తావు ఎక్కడ ఉంటుంది. మోసపోయామన్న నిరాశ, నిస్పృహతోపాటు కొన్ని అనారోగ్యకరమైన, పెడధోరణులకు దారి తీయవచ్చు.బెంచ్‌మార్కింగ్ సంకేతాలుప్రస్తుత భాగస్వామిని మాజీలు లేదా గత సంబంధాలతో క్రమం తప్పకుండా పోల్చడం.అవాస్తవిక అంచనాలతో ఉండటం, వాళ్లు చెప్పినట్టే వినాలని అన్యాయంగా పట్టుబట్టటంఎపుడూ అసంతృప్తిగా ఉండటం, మరొకరితో పోల్చి, ఉద్దేశపూర్వకంగా అవమానించడం.నమ్మకం లేకపోవడం, ఎపుడూ విమర్శిస్తూ ఉండటం తమ రిలేషన్‌ను మరింత ఆరోగ్యకరంగా ముందుకు తీసుకెళ్లేందుకు సుతరామూ అంగీకరించకపోవడంఇదీ చదవండి : భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్ ఫుడ్ ఈ లడ్డూ...అంతేనా! జాగ్రత్తలుపైన పేర్కొన్న అనుమానాస్పద లక్షణాలు కనిపించినపుడు అప్రమత్తం కావడం మంచిది. వీటిని గమనించి నపుడు అపార్థాలకు, అపోహలకు తావులేకుండా భాగస్వామితో మనసు విప్పి మాట్లాడుకొని, బంధం ముందుకు సాగే ప్రయత్నం చేయాలి. లేదా గతాన్ని వదిలేసి, బలమైన, ఆరోగ్యకరమైన సంబంధాలపై దృష్టి పెట్టడం ఉత్తమం. సిమ్మర్ డేటింగ్ఒకపుడు ద్దలు కుదుర్చుకునే పెళ్లిళ్లకే ప్రాధాన్యత ఉండేది. కాల క్రమంలో ప్రేమ వివాహాలపై యువతకు ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సిమ్మర్ డేటింగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రధానంగా జనరేషన్ జెడ్ దీనిని ఎక్కువగా ఫాలో అవుతున్నారు. అసలు ఈ సిమ్మర్ డేటింగ్ అంటే ఏమిటి? సుదీర్ఘ సంబంధాలపై దృష్టి పెట్టడమే దీని ప్రత్యేకత. చాలా కాలంపాటు బంధంలో కొనసాగడం వల్ల ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుందట. ఒకరిపై ఒకరికి అవగాహన, నమ్మకం పెరిగిన తరువాత లైంగిక బంధంలోకి అడుగుపెట్టడం మంచిదని, తద్వారా బంధం బలపడుతుందని నేటియువత భావిస్తోంది. -
'ఆఫీసు నుంచి లేటుగా వెళ్తున్నా.. రేపు ఆలస్యంగా వస్తా': ఉద్యోగి మెసేజ్ వైరల్
ఒకప్పుడు ఉద్యోగులు సమయంతో పనిలేకుండానే ఆఫీసుకు ముందుగా వచ్చేసి.. పని పూర్తి చేసుకుని లేటుగా కూడా ఇంటికి వెళ్లేవారు. అయితే.. ఇప్పుడున్న ఉద్యోగులలో కొంతమంది దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఆఫీసులో లేట్ అయితే.. రేపు డ్యూటీకి లేటుగా వస్తామంటూ బాస్‌కు మెసేజ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఒక ఉద్యోగి.. హాయ్ సార్ & మేడమ్ నేను రేపు ఉదయం 11.30 గంటలకు ఆఫీసుకు వస్తాను. ఎందుకంటే నేను రాత్రి 8.30 గంటలకు ఆఫీసు నుంచి బయలుదేరాను, అంటూ మెసేజ్ చేశారు.ఉద్యోగి పంపిన మెసేజ్‌ను 'ఆయుషి దోషి' తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. నా జూనియర్ నాకు ఇలా మెసేజ్ చేశారు. ఇది నమ్మలేకపోతున్నాను, ఈ కాలం పిల్లలు వేరేలా ఉన్నారు. ఆఫీసు నుంచి లేటుగా వెళ్లాను, కాబట్టి లేటుగా ఆఫీసుకు వస్తాను. ఇది చూసి నాకు మాటలు రావడం లేదు అంటూ.. పేర్కొంది.సాధారణంగా ఒక రోజులో పూర్తయ్యే పనిని ఉద్యోగికి అప్పగించడం జరుగుతుంది. ఇచ్చిన పనిని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటలలోపు పూర్తి చేయాలి. కానీ.. పని చేయాల్సిన సమయంలో ఉద్యోగి ఫోన్‌పై ద్రుష్టి పెడుతూ పనిని ఆలస్యం చేస్తే.. ఇచ్చిన పనిని పూర్తి చేయడానికి అదనపు సమయం అవసరమవుతుందని.. ఆయుషి దోషి మరో ట్వీట్లో వెల్లడించారు.ఇదీ చదవండి: అడిగితే 'జియో హాట్‌స్టార్' ఇచ్చేస్తాం: రిలయన్స్‌కు చిన్నారుల ఆఫర్సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్వీట్ మీద నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంత మంది ఉద్యోగులను కంపెనీలు దోచుకుంటున్నాయని చెబుతుంటే.. మరికొందరు ఉద్యోగులకు సమయపాలన చాలా అవసరం అని పేర్కొంటున్నారు. ఇంకొందరు ఆ ఉద్యోగి కాన్ఫిడెంట్ నచ్చిందని చెబుతున్నారు.I can’t believe my junior sent me this. Today’s kids are something else. He stayed late, so now he’s going to show up late to the office to "make up" for it. What a move!🫡🫡 i am speechless mahn. pic.twitter.com/iNf629DLwq— Adv. Ayushi Doshi (@AyushiiDoshiii) November 12, 2024 -
‘నవంబర్ 8న సెలవులో ఉంటాను.. బై’!
కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న జెన్ జీ(1995-2010 మధ్య జన్మించిన వారు) పంపిన లీవ్ లెటర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గతంలో లీవ్ లెటర్ అంటే ‘శ్రీయుత గౌరవనీయులైన..’ అని మొదలుపెట్టేవారు. కానీ పెరుగుతున్న టెక్నాలజీకి తగ్గట్టు ఆలోచనలు మారుతున్నాయి. అతిశయోక్తులకు తావు లేకుండా చెప్పాలనుకునే విషయాన్ని సూటిగా చెప్పే మనస్తత్వాన్ని జెన్‌జీ అలవరుచుకుంటోంది. ఏ విషయాన్ని వెల్లడించాలన్నా ఈ విధానాన్ని వీరు పాటిస్తున్నారు.ఇటీవల ఓ కార్పొరేట్ కంపెనీలో పని చేస్తున్న జెన్‌జీ లీవ్ కోసం తన పైఅధికారికి లీవ్ లెటర్ సబ్మిట్ చేశాడు. ఆ మెయిల్ చూసిన అధికారి దాన్ని స్కీన్ షాట్ తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. దాంతో ఇది వైరల్‌గా మారింది. తనకు లీవ్ కావాలంటూ ‘Respected Sir..’ అంటూ సంప్రదాయ పద్ధతితో లెటర్ రాయడం మొదలు పెట్టకుండా నేరుగా ‘హాయ్ సిద్దార్థ్. నేను 8 నవంబర్ 2024న సెలవులో ఉంటాను. బై’ అని మెయిల్ చేశాడు. ఇదీ చదవండి: ట్యాక్సీ మాఫియానే ప్రధాన ఓటు బ్యాంకు!ఈ మెయిల్‌కు సంబంధించి సోషల్ మీడియాలో చర్చసాగుతోంది. చాలా మంది నెటిజన్లు ఆ జెన్‌జీ ధైర్యం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ మెయిల్ చూసి ఇంకొందరు రానున్న రోజుల్లో కార్యాలయ పనితీరు మారుబోతుందని అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో జెన్‌జీ కమ్యునికేషన్ శైలి ఎలా ఉండబోతుందో ఈ మెయిల్ ద్వారా తెలుస్తుందని ఇంకొందరు కామెంట్ చేశారు. ‘నేను ఈ లీవ్ లెటర్‌ను నా మేనేజర్‌కు పంపితే వెంటనే అతను నా ప్రవర్తనపై చర్చించడానికి హెచ్ఆర్తో సమావేశాన్ని ఏర్పాటు చేసేవాడు’ అని ఒక వ్యక్తి కామెంట్ చేశారు. -
‘జెన్-జీ’తో రూ.1,500 లక్షల కోట్ల వ్యాపార అవకాశం!
భారత్‌లో జెన్-జీ((1997 నుంచి 2012 మధ్య పుట్టినవారు) తరం 2035 నాటికి సుమారు 1.8 ట్రిలియన్ డాలర్ల(రూ.1,500 లక్షల కోట్లు) కొనుగోలు శక్తిని కలిగి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో దాదాపు 37.7 కోట్ల వరకు జెన్-జీ యువత ఉంది. భవిష్యత్తులో భారత ఎకానమీకి వీరు ఎంతో సహకారం అందిస్తారు. ఈ తరం ఆసక్తులు, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు, విక్రయ సరళి..వంటి అంశాలను విశ్లేషిస్తూ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ), స్నాప్ ఇంక్ సంస్థలు సంయుక్తంగా నివేదిక విడుదల చేశాయి.నివేదికలో వివరాల ప్రకారం..జెన్-జీ తరం మార్కెట్‌ను ప్రభావితం చేయడమే కాదు, కొత్త ట్రెండ్‌ను నిర్మిస్తుంది. ప్రస్తుతం దేశంలోని మొత్తం వినియోగంలో దాదాపు 43 శాతం జెన్-జీదే కావడం విశేషం. ఇది దాదాపు 860 బిలియన్ డాలర్ల(రూ.72 లక్షల కోట్లు)కు చేరుకుంది.విభిన్న రంగాల్లో జెన్‌జీ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. పాదరక్షల పరిశ్రమలో 50 శాతం, డైనింగ్-48 శాతం, ఎంటర్టైన్మెంట్ 48 శాతం, ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్‌పై 47 శాతం కొనుగోళ్లను ఈ తరం ప్రభావితం చేస్తోంది.2035 నాటికి వీరి వినిమయశక్తి సుమారు రెండు ట్రిలియన్ డాలర్ల(రూ.1,500 లక్షల కోట్లు)కు చేరుతుందని అంచనా.ఇప్పటికే ఈ తరం దాదాపు 860 బిలియన్ డాలర్ల(రూ.72 లక్షల కోట్లు)ను ఖర్చు చేస్తోంది. అందులో తాము నేరుగా ఎంచుకున్న వస్తువుల కోసం 200 బిలియన్ డాలర్లు(రూ.17 లక్షల కోట్లు) ఖర్చు చేస్తున్నారు. వివిధ మాధ్యమాలు, ఇతర వ్యక్తుల ప్రభావం వల్ల మరో 600 బిలియన్ డాలర్ల(రూ.50 లక్షల కోట్లు) వెచ్చిస్తున్నారు.దాదాపు 70 శాతం జెన్-జీ యువత తమ సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు..వంటి వారితో ఆర్థిక పరమైన వివరాలు పంచుకుంటూ తమ సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఉదాహరణకు ఏం కొనాలి, ఎక్కడ తీసుకోవాలి, ఏ కంటెంట్‌ని చూడాలి, ఎలాంటి వస్తువులు ఎంపిక చేసుకోవాలి వంటి వివరాల కోసం ఇతరుల సలహా కోరుతున్నారు.దాదాపు 80 శాతం మంది తమ భావాలు ఇతరులతో పంచుకోవడానికి ఎక్కువగా సామాజిక మధ్యమాల్లో చిత్రాలు, జిఫ్‌లను, ఇమోజీలు వినియోగిస్తున్నారు.77 శాతం మంది తమ ముందు తరం కంటే మరింత సమర్థంగా షాపింగ్ చేసేందుకు వీలుగా ‘షాప్షియలైజింగ్(సామాజిక మధ్యమాల ప్రభావంతో షాపింగ్ చేయడం)’ ట్రెండ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందుకోసం ఆగ్మెంటెడ్ రియాలిటీ(వస్తువులు కొనడానికి ముందే వర్చువల్‌గా దాని గురించి తెలుసుకోవడం), వీడియో ఇంటరాక్షన్స్‌ను ఉపయోగిస్తున్నారు.బ్రాండ్ల విషయానికి వస్తే ఈ యువ తరం ట్రెండ్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. షాపింగ్ చేసేటప్పుడు వారు ట్రెండింగ్ స్టైల్‌లను ఎంచుకునే అవకాశం 1.7 రెట్లు ఎక్కువగా ఉంది. 72 శాతం మంది షాపింగ్ ప్రమోషన్లు చేస్తున్న క్రియేటర్ల సోషల్ ఛానెల్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు.ఇప్పటికే 45 శాతం విభిన్న రంగాల్లోని వ్యాపార సంస్థలు జెన్-జీ అవసరాలు గుర్తించాయి. కానీ అందులో 15 శాతం మాత్రమే వారికి సేవలందిస్తున్నాయి. రానున్న రోజుల్లో కచ్చితంగా ఈ అంతరం భారీగా తగ్గనుంది.ఇదీ చదవండి: రూ.20 వేలతో రూ.17 లక్షలు సంపాదన!ఈ నివేదిక విడుదల సందర్భంగా స్నాప్ ఇంక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పుల్కిత్ త్రివేది మాట్లాడుతూ..2035 నాటికి 1.8 ట్రిలియన్ల విలువైన ప్రత్యక్ష వ్యయంతో భారతదేశ ఎకానమీకి జెన్‌జీ పెద్ద ఆర్థిక వనరుగా మారుతుందన్నారు. బీసీజీ ఇండియా ఎండీ నిమిషా జైన్ మాట్లాడుతూ..ఈ తరం ఫ్యాషన్, డైనింగ్, ఆటోమొబైల్స్, ఎంటర్టైన్మెంట్, కన్జూమర్ డ్యూరబుల్స్ వంటి విభిన్న విభాగాల్లో ఖర్చు చేసేందుకు ఆసక్తిగా ఉందన్నారు. -
ఈ-కామర్స్ షాపింగ్‌లో 25 ఏళ్లలోపు వారే ఎక్కువ
న్యూఢిల్లీ: తమ యూజర్లలో మూడింట ఒకవంతు 25 ఏళ్లలోపు వారు ఉన్నారని ఈ–కామర్స్ కంపెనీ మీషో తెలిపింది. సెన్సార్ టవర్‌తో కలిసి రూపొందించిన నివేదిక ప్రకారం.. నాలుగు, ఆపై శ్రేణి పట్టణాలకు చెందిన కస్టమర్లు తరచూ, మళ్లీ మళ్లీ కొనుగోళ్లు జరుపుతున్నారు.వీరు ఫ్యాషన్, పాదరక్షలు, శిశు సంరక్షణ వంటి విభాగాల్లో ఉత్పత్తులను కొంటున్నారు. ఈ–కామర్స్ యూజర్ల వృద్ధిలో ఉత్తరప్రదేశ్, బిహార్ ముందంజలో ఉన్నాయి. ఆన్లైన్ షాపర్స్‌లో 80 శాతంపైగా ద్వితీయ, ఆపై శ్రేణి నగరాలు, పట్టణాల నుంచి ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం వంటి ఈశాన్య రాష్ట్రాల్లోని కస్టమర్లు ఇన్ఫ్లుయెన్సర్ కంటెంట్ ఆధారంగా ఈ–కామర్స్ కొనుగోళ్లను ఎక్కువగా చేస్తున్నారు.మొత్తం ఆర్డర్లలో ఈ రాష్ట్రాల వాటా 40 శాతం ఉంది. గృహ, వంటింటి ఉపకరణాలకు 10 శాతం ఖర్చు చేస్తున్నారు. ఈ విభాగం 50 శాతం వృద్ధి చెందింది. చీరలు, సంబంధిత యాక్సెసరీస్ కొనుగోళ్లు కొత్త ట్రెండ్. -
భారత్‌లో జెన్‌జెడ్‌లు..థాయ్‌లాండ్‌ను చుట్టేస్తున్నారు
భారత్ యువత అవకాశం దొరికినప్పుడల్లా థాయ్‌లాండ్‌కు క్యూకడుతున్నారంటూ పాపులర్ రెంటల్ కంపెనీ ఎయిర్‌బీఎన్‌బీ పలు ఆసక్తికర విషయాల్ని వెలుగులోకి తెచ్చింది. ఎయిర్‌బీఎన్‌బీ డేటా ప్రకారం.. 2022- 2023లో భారతీయులు 60 శాతం కంటే ఎక్కువ మంది టూరిస్ట్‌లు థాయ్‌లాండ్‌లో తమ సంస్థ రూముల్ని బుక్ చేసుకున్నారని తెలిపింది.హోలీ,ఈస్టర్ సమయంలో భారతీయులు థాయ్‌లాండ్‌ను సందర్శించారు. వారం రోజుల పొడువున జరిగిన ఈ ఫెస్టివల్లో థాయ్‌లాండ్‌కు వచ్చే భారతీయులు 200 శాతం కంటే ఎక్కువ పెరిగారని ఎయిర్‌బీఎన్‌బీ డేటా హైలెట్ చేసింది.భారతీయులు థాయ్‌లాండ్ ఆకర్షితులయ్యేందుకు పెరిగిపోతున్న జనాభ, ప్రయాణలపై మక్కువతో పాటు ఇతర కారణాలున్నాయని ఎయిర్‌బీఎన్‌బీ పేర్కొంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో జెన్‌జెడ్ యువత ఎక్కువగా ఉందని, కాబట్టే వారికి థాయ్‌లాండ్‌తో పాటు ఇతర ప్రపంచంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించాలనే ధోరణి పెరిగినట్లు వెల్లడించింది.దీనికి తోడు రెండు దేశాల పౌరులకు థాయ్ ప్రభుత్వం వీసా మినహాయింపును పొడిగింపు టూరిజంకు ఊతం ఇచ్చినట్లైందని ఎయిర్‌బీఎన్‌బీ జనరల్ మేనేజర్ అమన్‌ప్రీత్ బజాజ్ అన్నారు.a ఇక థాయ్‌లాండ్‌లో భారతీయలు బ్యాంకాక్,ఫుకెట్,చియాంగ్ మై,క్రాబి,స్యామ్యూయి ప్రాంతాలున్నాయి.ఎయిర్బీఎన్బీఅమెరికాలోని శాన్‌ఫ్రాన్సిక్సో వేదికగా ఎయిర్‌బీఎన్‌బీ అనే సంస్థ పర్యాటకుల కోసం పనిచేస్తోంది. వారికి హోటల్, బస, పర్యాటక ప్రాంతాలకు సంబంధించి బుకింగ్, ఇతర సేవలందిస్తోంది.జెన్‌జెడ్ అంటే 1997 నుంచి 2012 మధ్య జన్మించినవారిని జనరేషన్ జెడ్ (జెన్ జెడ్)గా పరిగణిస్తారు. -
ఉద్యోగం దొరికితే చాలు అనే యువతరం కాదు..అంతకుమించి..!
కొత్త రంగాలు ఉనికిలోకి రావడం వల్ల ‘ఉద్యోగమే సర్వస్వం’ ‘ఉద్యోగం దొరికితే చాలు’ అనుకోవడం లేదు యువతరంలో చాలామంది. దీనికి కారణం...ప్రత్యామ్నాయ అవకాశాలు. ‘ఉద్యోగం ఎందుకు చేయాలి?’ నుంచి ‘చేస్తే ఎలాంటి ఉద్యోగం చేయాలి’ వరకు కెరీర్ బాట పట్టడానికి ముందు రకరకాల కోణాలలో ఆలోచిస్తున్నారు. మంచి వేతనం కంటే మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. 44 దేశాల్లో మిలీనియల్స్, జెన్ జెడ్‌పై సర్వే చేసింది డెలాయిట్. దీని ప్రకారం ప్రైమరీ జాబ్ తోపాటు మరో జాబ్ చేస్తున్న యువ ఉద్యోగుల సంఖ్య తక్కువేమీ కాదు. బెంగళూరులో ఒక ప్రైవేట్ కాలేజీలో పని చేస్తున్న పరిమళ ఆన్లైన్లో వ్యాపారం కూడా చేస్తుంటుంది.‘డబ్బు కోసం కాదు. అదొక ఫ్యాషన్’ అంటుంది తన ఆన్లైన్ వ్యాపారం గురించి. లింక్డ్ ఇన్ సర్వే ప్రకారం 2023లో మన దేశంలో 88 శాతం మంది జెన్ జెడ్ ఉద్యోగులు ‘ఉద్యోగ మార్పు’నకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. జెన్ జెడ్ ఉద్యోగులపై ఆర్పీజీ గ్రూప్ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం పదిమందిలో ఆరుగురు మంచి వేతనం కంటే మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చారు.‘పని ఒత్తిడి చచ్చినట్లు భరించాల్సిందే’ అని రాజీపడడం కంటే ‘జీతం తక్కువ అయినా సరే నాకు నచ్చిన ఉద్యోగం చేస్తాను’ అని ఆలోచిస్తున్న వారి సంఖ్య యువతరంలో ఎక్కువగానే ఉంది. ముంబైలోని ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేసిన అనన్యకు పనిభారంతో ఊపిరాడేది కాదు. ఒక ఫైన్ మార్నింగ్ ‘ఇది కాదు జీవితం’ అనిపించింది. తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తోంది. ‘నేను పని చేస్తున్న కంపెనీతో పోల్చితే ఇది చాలా చిన్న ఉద్యోగం కావచ్చు. కాని ఎంతో సంతోషంగా ఉంది’ అంటుంది అనన్య. ఒక మార్కెటింగ్ సంస్థలో ఉద్యోగం చేసిన ఇరవై సంవత్సరాల సారా బోహ్ర ఆ ఉద్యోగం మానేసి సొంతంగా మార్కెటింగ్ ఫర్మ్ మొదలుపెట్టింది. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రాధాన్యత ఇస్తోంది. ‘ఇప్పుడు చాలా సౌకర్యంగా ఫీలవుతున్నాను. పని ప్రకారం కాదు గంటల ఆధారంగా ప్రొడక్టివిటీని కంపెనీలు అంచనా వేస్తున్నాయి’ అంటుంది సారాతీయని పాఠాలు..రాజస్థాన్‌లోని వనస్థలి యూనివవర్శిటీలో బీబీఏ డిగ్రీ పూర్తి చేసిన అనువ కక్కర్ ఉద్యోగం కంటే సొంత స్టార్టప్‌కే ్ర΄ాధాన్యత ఇచ్చింది. అయితే కస్టమైజ్డ్ పోస్టర్ కార్డ్‌లకు సంబంధించి ఆన్లైన్ బిజినెస్‌లో ఫెయిల్ అయింది. అయితే ఈ ఫెయిల్యూర్ నుంచి పాఠాలు నేర్చుకున్న అనువ ‘టిగెల్’ చాకోలెట్ బ్రాండ్‌తో సక్సెస్ అయింది. హాట్ చాక్లెట్+వింటర్= హ్యాపీనెస్ నినాదంతో చిన్న బడ్జెట్లో కంపెనీ మొదలు పెట్టింది. కస్టమర్ చాయిస్‌లను అర్థం చేసుకోవడంలో పట్టు సాధించింది. ‘టిగెల్’ స్టార్ట్ చేసినప్పుడు అనువ వయసు 21 సంవత్సరాలు. ‘చిన్న వయసులో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రస్థానం మొదలు పెట్టడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది’ అంటుంది అనువ కక్కర్. బెస్ట్ ప్లాన్ బెడిసి కొడితే?‘ఈ రంగంలో మాత్రమే పనిచేస్తాను అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఏ రంగంలో పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. యాంత్రిక జీవితం కంటే ఉల్లాసకరమైన మార్పు చాలామంచిది’ అంటుంది చెన్నైకి చెందిన శ్రీతేజ. కోల్‌కత్తాకు చెందిన 23 సంవత్సరాల మనీష తన ఉద్యోగానికి సంబంధించి ఇప్పటికీ మూడు రంగాలు మారింది. అలా అని ఆమెలో పశ్చాత్తాపం ఏమీ లేదు. ‘ఏ రంగంలో అయినా పనిచేయగలను అనే నమ్మకం వచ్చింది’ అంటుంది మనీష. వర్క్ నుంచి గ్యాప్ తీసుకోవాలనుకునే యువతరం కోసం ఈమధ్య కాలంలో ఎన్నో ‘గ్యాప్ ఇయర్ కమ్యూనిటీస్’ వచ్చాయి. ‘గ్యాప్ఎక్స్’ పేరుతో హరియాణాలోని అశోకా యూనివర్శిటీలో 40 మంది స్టూడెంట్స్‌తో కూడిన గ్రూప్ ఉంది.‘యువతలో చాలామంది కెరీర్ మార్గాన్ని నిర్ణయించుకునే ముందు వివిధ అవకాశాల గురించి అన్వేషిస్తున్నారు. ఆలోచిస్తున్నారు’ అంటున్నాడు దిల్లీ యూనివర్శిటీ మాజీ వైస్ చాన్సలర్ దినేష్ సింగ్. చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి నచ్చిన ఉద్యోగం చేయడం, సొంతంగా కంపెనీ మొదలుపెట్టడం, ఉద్యోగ విరామం తీసుకొని ఆన్లైన్ కోర్సులలో చేరడం వరకు తమదైన దారిలో ప్రయాణం చేస్తోంది నవతరం.(చదవండి: సడెన్‌గా మిస్ యూఎస్ఏ స్థానం నుంచి తప్పుకుంటున్న మోడల్!కారణం ఇదే..) -
కార్పొరేట్ కంపెనీలకు కొత్త తలనొప్పి.. తీరు మార్చుకోవాల్సిందే, లేదంటే!
మూన్‌లైటింగ్, క్వైట్ క్విట్టింగ్, కాఫీ బ్యాడ్జింగ్. ఆఫీసుల్లోని ఈ కొత్త పోకడలు సంస్థలకు తలనొప్పిగా మారుతున్నాయి. దీంతో ఉద్యోగులు వరస రాజీనామాలు.. వారిని నిలుపుకోవడంలో యాజమాన్యాలు విఫలమవుతున్నాయి. ఈ తరుణంలో జెన్‌జెడ్ విషయంలో కంపెనీల తమ పనితీరును మార్చుకోవాల్సిందేనని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లేదంటే వర్క్‌ఫోర్స్‌ని నిలుపుకోవడం కష్టమేనని సలహా ఇస్తున్నారు. వాటిల్లో పలు అంశాలు చర్చకు దారి తీస్తున్నాయి. మూన్‌లైటింగ్ కారణం ఇదే జెన్‌జెడ్‌లు 9 టూ 5 ఉద్యోగాల్ని అస్సలు ఇష్టపడరు. వాళ్లకి వర్క్ అనుకూలంగా ఉండాలి. ఎంత జీతం అనే పట్టింపు ఉండదు. కానీ పని విషయాల్లో మార్పులు తెచ్చేందుకు, కొత్త అవకాశాల్ని సృష్టించుకునేందుకు ఏమాత్రం వెనుకాడరు. వృత్తిపరంగా ఎదిగేందుకు, ఆర్ధికంగా స్థిరపడేందుకు మూన్‌లైటింగ్ ధోరణులను అవలంభిస్తారనే విషయాన్ని కంపెనీలు గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు. కాబట్టే వారి అభిరుచులకు అనుగుణంగా లేని కంపెనీలు ఉద్యోగుల్ని ఆకర్షించడంలో విఫలమవుతున్నాయని, అందువల్ల మారుతున్న ఉద్యోగుల అంచనాలకు అనుగుణంగా సంస్థలు తమ పని వాతావరణంలో మార్పులు చేయడంతో పాటు వారిని నిలుపుకునేందుకు వ్యూహాలను అమలు చేయాలని సలహా ఇస్తున్నారు. చేసే పనికి గుర్తింపు ఉంటే సంస్థలు జెన్ జెడ్ ఉద్యోగులు చేస్తున్న పనిని ప్రశంసలు కురిపించడం, వాళ్లు చెప్పే మాటల్ని వినడం, వాళ్లు చేసే పనికి గుర్తింపు ఇవ్వడం చేయాలి. ఇలాంటి సంస్థల్ని అసలు వదిలి పెట్టరు. ఈ విషయంలో సంస్థలు తమ వైఖరి మార్చుకోవాలి. లేదంటే క్వైట్ క్విట్టింగ్, కాఫీ బ్యాడ్జింగ్ వంటి ధోరణి ఎక్కువతుంది’ అని గెట్ వర్క్ డైరెక్టర్ అండ్ సిఓఓ పల్లవి హిర్వానీ అన్నారు. జనరేషన్ జెడ్‌లు కొత్త పుంతలు తొక్కతున్న టెక్నాలజీని వేగంగా అందిపుచ్చుకుంటున్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థలు భావిస్తాయి. అయితే టెక్నాలజీ వినియోగంలో కంపెనలు తమ పనికి తగ్గట్లు సన్నద్ధం కావాలని ఆశిస్తున్నారు. ఉద్యోగుల కెరియర్‌కి సహాయం చేస్తున్నారా? జెన్ జెడ్ ఉద్యోగులు వేతనం, అదనంగా ఇతర ప్రయోజనాలు, ప్రోత్సహాకాల్ని కోరుకుంటున్నారు. దీంతో పాటు హెల్త్ కేర్ కవరేజీ, మెంటల్ హెల్త్ సపోర్ట్, పెయిడ్ టైమ్ ఆఫ్ వంటి ప్రయోజనాలు అందిస్తున్న కంపెనీల్లో చేరేందుకు ఇష్టపడుతున్నారు. అదనంగా, అవకాశాల అపారంగా ఉండి వాటిని నిరూపించుకునేలా మెంటార్షిప్ వంటి ప్రోగ్రామ్‌లు ఏర్పాటు చేస్తే మరీ మంచిది. మార్పు మంచికే కాబట్టే సిబ్బంది కొరతతో బాధపడుతున్న కంపెనీలు వర్క్‌ఫోర్స్‌కి అనుగుణంగా మార్పులు చేయాల్సిన సమయం ఆసన్నమైంది అని పల్లవి హిర్వానీ పేర్కొన్నారు. అలా చేయడం వల్ల ఉద్యోగుల నైపుణ్యాల్ని ఆయా సంస్థలు సమర్ధవంతంగా ఉపయోగించుకునే అవకాశం ఏర్పడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. జెన్‌జెడ్ అంటే ఎవరు? వయసును బట్టి వ్యక్తుల్ని ఐదు తరాలుగా విభజించచ్చు. వీరిలో తొలితరం సైలెంట్ జనరేషన్. అంటే 1928–1945 మధ్య పుట్టి ఇపుడు 73–90 ఏళ్ల మధ్య వయసున్న వారు. ఇక రెండో ప్రపంచ యుద్ధం తరువాతి రోజుల్లో..అంటే 1946–1964 మధ్య పుట్టి ప్రస్తుతం 54–72 ఏళ్ల వయసున్నవారిని ‘బేబీ బూమర్’ జనరేషన్గా పిలుస్తున్నారు. ఆ తరవాత 1965–80 మధ్య పుట్టినవారు జనరేషన్ ఎక్స్. 1981 నుంచి 1996 మధ్య పుట్టి ప్రస్తుతం 22–37 సంవత్సరాల మధ్యనున్న వారంతా జనరేషన్ వై. అంటే మిలీనియల్స్. ఆ తరవాత పుట్టిన వారిని ‘జనరేషన్ జెడ్’గా పిలుస్తున్నారు. -
ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో, ఆందోళనలో సగం మంది భారతీయులు!
ప్రపంచ వ్యాప్తంగా ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వారి జాబ్ విషయంలో అభద్రతా భావానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. వారిలో భారతీయులు 47 శాతం మంది ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఏడీపీ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ ‘పీపుల్ ఎట్ వర్క్ 2023: ఏ గ్లోబల్ వర్క్‌ఫోర్స్ వ్యూ’ పేరిట సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో 47 శాతం మంది సిబ్బంది తమ కొలువుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడీపీ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ 32,000 మందిపై సర్వే నిర్వహించింది.ఈ సర్వేలో సగానికి పైగా జెన్ జెడ్ (18- 24ఏళ్ల వయస్సు) వారు చేస్తున్న ఉద్యోగం పట్ల నమ్మకంతో లేదనే తెలుస్తోంది. 55ఏళ్ల వయస్సు వారిలో సైతం ఈ తరహా ఆందోళనలు రెట్టింపు స్థాయిలో ఉన్నట్లు నివేదిక హైలెట్ చేసింది. ముఖ్యంగా, ఈ తరహా ఆందోళనలు రియల్ ఎస్టేట్,కన్స్ట్రక్షన్ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఎక్కువ మంది ఉన్నారు. అంతర్జాతీయ జాబ్ మార్కెట్లో మీడియా, ఇన్ఫర్మేషన్ ఇండస్ట్రీ ఉద్యోగాలపై అపనమ్మకంతో ఉన్నారు. ఆయా రంగాలతో పాటు ఆతిధ్యం, ఎంటర్టైన్మెంట్ వంటి రంగాల్లో పనిచేస్తున్న తమ జాబ్ ఉంటుందో..ఊడుతుందోనన్న అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. కారణాలు అనేకం మొత్తం వర్క్ ఫోర్స్‌లో యువతే అభద్రతకు లోనవుతున్నారు. అందుకు అనేక కారణాలు ఉన్నాయని ఏడీపీ ఎండీ రాహుల్ తెలిపారు. ఇటీవల కాలంలో ఆర్ధిక అనిశ్చితి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గూగుల్, ట్విటర్, మెటాలాంటి సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టూల్స్ మనుషులు చేస్తున్న ఉద్యోగాలకు మరింత ప్రమాదంలోకి నెట్టే ప్రమాదం ఉందని వెలుగులోకి వస్తున్న నివేదికలే యువతలో ఆందోళనకు కారణమని తెలిపారు. జాబ్ మార్కెట్లో నైఫుణ్యం ఉన్న వారిని గుర్తించడంలో, వారిని ఉద్యోగంలో కొనసాగించడం మరింత కష్టంగా మారినట్లు రాహుల్ గోయల్ గుర్తించామని అన్నారు. సంస్థలు తమ ఉద్యోగులకు భరోసా ఇవ్వకపోతే అనుభవాల్ని, ఉత్సాహాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. తద్వారా క్లయింట్లకు ఆశించిన స్థాయిలో సేవల్ని అందించడంలో కష్టతరం మారుతుందని చెప్పారు. దిగ్రేట్ రిజిగ్నేషన్ వంటి ప్రపంచవ్యాప్తంగా, గత ఏడాది కాలంలో ఐదుగురు జెన్‌జెడ్‌లలో ఒకరు.. చేస్తున్న రంగం నుంచి మరో రంగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేశారు. పావు వంతు మంది సొంతంగా బిజినెస్ ప్రారంభించాలని ఆలోచించినట్లు తేటతెల్లమైంది. 55 ఏళ్లు పైబడిన వారిలో 17 శాతం మంది ముందస్తుగా పదవీ విరమణ చేయాలని ఆలోచించారు. ఇదే ది గ్రేట్ రిజిగ్నేషన్ వంటి అంశాలకు కారణమందన్నారు. ఉద్యోగంలో అభద్రత పోవాలంటే యజమానులు ఉద్యోగులు మార్కెట్‌కు అనుగుణంగా జీతాలు ఇవ్వగలిగితే ఈ ఆందోళన నుంచి బయట పడొచ్చు. తద్వారా ఉద్యోగులు తాము పనిచేసే సంస్థ పట్ల మరింత సానుకూలంగా భావించే అవకాశం ఉంది. చదవండి👉 ‘పాపం సాఫ్ట్వేర్ ఉద్యోగులు.. జాబులు పోయి బైక్ ట్యాక్సీలు నడుపుకుంటున్నారు’