'ఆఫీసు నుంచి లేటుగా వెళ్తున్నా.. రేపు ఆలస్యంగా వస్తా': ఉద్యోగి మెసేజ్ వైరల్ | Employee Message Boss Left Speechless | Sakshi
Sakshi News home page

'ఆఫీసు నుంచి లేటుగా వెళ్తున్నా.. రేపు ఆలస్యంగా వస్తా': ఉద్యోగి మెసేజ్ వైరల్

Published Thu, Nov 14 2024 2:36 PM | Last Updated on Thu, Nov 14 2024 3:12 PM

Employee Message Boss Left Speechless

ఒకప్పుడు ఉద్యోగులు సమయంతో పనిలేకుండానే ఆఫీసుకు ముందుగా వచ్చేసి.. పని పూర్తి చేసుకుని లేటుగా కూడా ఇంటికి వెళ్లేవారు. అయితే.. ఇప్పుడున్న ఉద్యోగులలో కొంతమంది దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఆఫీసులో లేట్ అయితే.. రేపు డ్యూటీకి లేటుగా వస్తామంటూ బాస్‌కు మెసేజ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఒక ఉద్యోగి.. హాయ్ సార్ & మేడమ్ నేను రేపు ఉదయం 11.30 గంటలకు ఆఫీసుకు వస్తాను. ఎందుకంటే నేను రాత్రి 8.30 గంటలకు ఆఫీసు నుంచి బయలుదేరాను, అంటూ మెసేజ్ చేశారు.

ఉద్యోగి పంపిన మెసేజ్‌ను 'ఆయుషి దోషి' తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. నా జూనియర్ నాకు ఇలా మెసేజ్ చేశారు. ఇది నమ్మలేకపోతున్నాను, ఈ కాలం పిల్లలు వేరేలా ఉన్నారు. ఆఫీసు నుంచి లేటుగా వెళ్లాను, కాబట్టి లేటుగా ఆఫీసుకు వస్తాను. ఇది చూసి నాకు మాటలు రావడం లేదు అంటూ.. పేర్కొంది.

సాధారణంగా ఒక రోజులో పూర్తయ్యే పనిని ఉద్యోగికి అప్పగించడం జరుగుతుంది. ఇచ్చిన పనిని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటలలోపు పూర్తి చేయాలి. కానీ.. పని చేయాల్సిన సమయంలో ఉద్యోగి ఫోన్‌పై ద్రుష్టి పెడుతూ పనిని ఆలస్యం చేస్తే.. ఇచ్చిన పనిని పూర్తి చేయడానికి అదనపు సమయం అవసరమవుతుందని.. ఆయుషి దోషి మరో ట్వీట్‌లో వెల్లడించారు.

ఇదీ చదవండి: అడిగితే 'జియో హాట్‌స్టార్' ఇచ్చేస్తాం: రిలయన్స్‌కు చిన్నారుల ఆఫర్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్వీట్ మీద నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంత మంది ఉద్యోగులను కంపెనీలు దోచుకుంటున్నాయని చెబుతుంటే.. మరికొందరు ఉద్యోగులకు సమయపాలన చాలా అవసరం అని పేర్కొంటున్నారు. ఇంకొందరు ఆ ఉద్యోగి కాన్ఫిడెంట్ నచ్చిందని చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement