భర్త ఆమోదం కావాలంది.. ఉద్యోగం పోగొట్టుకుంది | CEO Rejects Female Candidate Who Asked Him To Meet Her Husband | Sakshi

భర్త ఆమోదం కావాలంది.. ఉద్యోగం పోగొట్టుకుంది

Published Thu, Mar 20 2025 11:43 AM | Last Updated on Thu, Mar 20 2025 12:01 PM

CEO Rejects Female Candidate Who Asked Him To Meet Her Husband

సాధారణంగా ఉద్యోగం వచ్చిన వెంటనే చాలామంది జాయిన్ అయిపోతారు. కొందరు అమ్మానాన్నలను అడగాలని, పెళ్ళైన మహిళలైతే తమ భర్తలకు చెప్పాలని అనుకుంటారు. ఇటీవల ఓ మహిళ ఉద్యోగానికి ఎంపికైన తరువాత.. తన భర్త ఆమోదం కావాలని అడిగిన వెంటనే జాబ్ పోగొట్టుకుంది.

ముంబైకి చెందిన ఒక సీఈఓ తన కంపెనీలో సీనియర్ పదవికి ఎంపికైన ఒక మహిళను ఉద్యోగంలో చేరడానికి ముంచే తొలగించారు. ఎందుకంటే ఆ మహిళ జాబ్ ఆఫర్‌ను అంగీకరించే ముందు తన భర్త ఆమోదం పొందాలని అడిగింది. దీంతో తక్షణమే ఆమెను ఆ ఉద్యోగానికి రిజెక్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.

కంపెనీలో సీనియర్ స్థాయి ఉద్యోగానికి ఎంపికైన మహిళ.. ఉద్యోగంలో చేరడానికే సొంత నిర్ణయం తీసుకోవడం లేదు. దీనికే తన భర్త ఆమోదం కావాలని చెబుతోంది. రేపు కంపెనీ కోసం పెద్ద నిర్ణయాలు ఎలా తీసుకోగలుగుతుంది. ఆమె పూర్తిగా తన భర్త మీదనే ఆధారపడి ఉందని.. కంపెనీ సీఈఓ భావించి రిజెక్ట్ చేశారు.

ఇదీ చదవండి: 'పెట్రోల్ కార్ల ధరలకే ఎలక్ట్రిక్ కార్లు'.. నితిన్ గడ్కరీ

ప్రస్తుతం కంపెనీ సీఈఓ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనిపైన పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో కొందరు సీఈఓ చేసిన పనిని సమర్దిస్తుంటే.. మరికొందరు తప్పుబడుతున్నారు. ఇంకొందరు మహిళలు తరచుగా ఎదుర్కొనే సామాజిక అడ్డంకులను ఎత్తి చూపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement