
సమయం ఉదయం. ఇంటి నుంచి ఆఫీస్‌కు వస్తున్న ఉద్యోగినికి యాక్సిడెంట్ అయ్యింది. అనంతరం తీవ్ర గాయాల పాలైన ఉద్యోగిని.. రోడ్డు ప్రమాదంలో తాను డ్రైవ్ చేస్తున్న కారు ప్రమాదానికి గురైందని తెలుపుతూ కారు ఫొటో తీసి తన మేనేజర్‌కి మెసేజ్ చేసింది. తాను ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు ఆ మెసేజ్‌లోని సారాశం. ఇలాంటి సందర్భాలతో సాధారణంగా మేనేజర్లు ఎలాంటి సమాధానం ఇస్తారు. కానీ అందుకు భిన్నంగా ఈ సంస్థ మేనేజర్ ఇచ్చిన రిప్లయిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటన ఎక్కడ జరిగింది. ఉద్యోగి,మేనేజర్ సంబంధిత వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.
కిరా అనే యూజర్ ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌లో ఉద్యోగిని కారు ప్రమాదానికి గురైందని తన మేనేజర్‌కు మెసేజ్ చేసింది. తాను డ్రైవ్ చేస్తున్న కారు ప్రమాదం ఫొటోల్ని జత చేసింది.
what would y’all respond with if your manager says this? pic.twitter.com/bZznlPZrLT
— kira 👾 (@kirawontmiss) October 22, 2024
అయితే అనూహ్యంగా కంపెనీ మేనేజర్ సదరు ఉద్యోగిని యోగక్షేమాలు అడగడానికి బదులు.. మీరు ఆఫీస్‌కు ఎప్పుడు వస్తారో సమాచారం ఇవ్వండి అంటూ బదులిచ్చారు. ఆ మేస్‌జ్‌కి ఉద్యోగిని రిప్లయి ఇవ్వలేదు. దీంతో కోపోద్రికుడైన మేనేజర్ మరుసటి రోజు మరోసారి మెసేజ్ పంపాడు. అందులో మీరు నా మెసేజ్‌కు రిప్లయి ఎందుకు ఇవ్వలేదో నేను అర్ధం చేసుకోగలను. కానీ జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణం మినహా ఇతర ఘటనలు జరిగి ఉంటే సంస్థ మీపై తప్పని సరిగా కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు సదరు మేనేజర్.
ప్రస్తుతం ఈ ఘటనపై నెటిజన్లు మేనేజర్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాగే మా మేనేజర్ వ్యవహరిస్తే..నేను వెంటనే కొత్త ఉద్యోగం వెతుక్కుంటాను అంటూ ఓ నెటిజన్ స్పందిస్తే.. ఈ తరహా ఉన్న మేనేజర్లు మనల్ని బయపెడుతున్నారు. జీవితం ఇంత దుర్భరంగా ఉంటుందా? అని మరో నెటిజన్ రిప్లయి ఇచ్చాడు.