Boss
-
ఉద్యోగులకు కార్లు, బైకులు గిఫ్ట్.. ఎక్కడో తెలుసా?
కొన్ని కంపెనీలు దసరాకు బోనస్‌లు ఇవ్వడం, దీపావళికి గిఫ్ట్స్ ఇవ్వడం వంటివి చేస్తుంటాయి. మరికొన్ని సంస్థలు బోనస్‌లు, బహుమతుల ఊసేలేకుండా మిన్నకుండిపోతాయి. అయితే ఇటీవల చెన్నైకి చెందిన సుర్‌మౌంట్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమ ఉద్యోగులకు బైకులు, కార్లను గిఫ్ట్ ఇచ్చింది. ప్రస్తుతం నెట్టింట్లో ఇదే హాట్ టాపిక్‌గా మారిపోయింది.సుర్‌మౌంట్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తమ ఉద్యోగులను ప్రోత్సహించడంలో భాగంగా 20 మందికి టాటా కార్లు, యాక్టివా స్కూటర్లు, రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను అందించింది.చెన్నైలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న సుర్‌మౌంట్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాజిస్టిక్స్ రంగంలో సరుకుల రవాణా, పారదర్శకత, సరఫరాలలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరిస్తుంది. అన్ని వ్యాపారాల్లో లాజిస్టిక్స్‌ను మరింత సరళీకృతం చేయడమే కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు దాని వ్యవస్థాపకుడు, ఎండీ డెంజిల్ రాయన్ పేర్కొన్నారు. -
బాస్‌ను తిట్టడానికి.. ఓ కొత్త సర్వీస్
ఉద్యోగం చేసే చాలామంది కొన్ని సమస్యలను లేదా ఫిర్యాదులను ఆఫీసులో బాస్‌కు చెప్పుకోవాలంటే భయపడతారు. మరికొందరికి బాస్ మీద తిట్టేయాలన్నంత కోపంతో ఉంటారు. అలాంటి వారికోసం యునైటెడ్ స్టేట్స్‌లోని ఓసీడీఏ అనే సంస్థ స్కోల్డ్ అనే ప్రత్యేకమైన సర్వీస్ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిని స్టాండ్ అప్ కమెడియన్ అండ్ యాక్టర్ 'కాలిమార్ వైట్' ఈ ఏడాది ప్రారంభంలో ప్రారభించారు.ఫిర్యాదులను సరిదిద్ది.. మెరుగైన పని వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా కంపెనీ ఈ సర్వీస్ ప్రారంభించినట్లు వైట్ పేర్కొన్నారు. ఈ సర్వీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కంపెనీ దీనిని పూర్తిగా ఏజంట్ల ద్వారా నిర్వహిస్తుంది.కంపెనీ ఏజెంట్ ఉద్యోగి ఫిర్యాదు స్వీకరించిన తరువాత.. వారు నేరుగా ఆఫీసుకు వెళ్తారు. బాస్ నుంచి ఎలాంటి సమస్య వచ్చినా దానికి మొత్తం ఏజెంట్ బాధ్యత వహిస్తాడు. మొత్తానికి ఒక ఉద్యోగి ఆందోళనలను బాస్‌కు చేరవేస్తారు. కొన్నిసార్లు ఏజెంట్ వ్యక్తిగతంగా కనిపించకుండానే.. ఫోన్లో సంభాషణ చేస్తాడు.ఇటీవల సోషల్ మీడియాలో వెల్లడైన వీడియోలో.. ఒక ఏజెంట్ ఉద్యోగి ఫిర్యాదు మీద ఆఫీసుకు వెళ్లి, వెంటనే బాస్ మీద విరుచుకుపడ్డాడు. నేను 17 సంవత్సరాలు పనిచేస్తున్నా.. అయినప్పటికీ నాకు పీటీఓ ఇవ్వలేదు. మీరు కొత్త ఉద్యోగులకు ఎక్కువ చెల్లిస్తున్నారు. మొత్తం ఇన్వెంటరీ అస్తవ్యస్తంగా ఉంది. మోల్డింగ్ విభాగంలో ఫ్యాన్ లేదు అని అరుస్తూనే ఉన్నారు.ఇదీ చదవండి: ఆ రంగంలో హైదరాబాద్ టాప్: ఆ తరువాతే అన్నీ..ఏజెంట్‌ను శాంతిచమని ఎంతమంది చెప్పినా.. అతని స్క్రిప్ట్ కొనసాగించాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో ఎంతోమంది వీక్షకులను ఆకర్శించింది. ఆ తరువాత దీనికి మరింత డిమాండ్ పెరిగిపోయింది. వీడియోపై పలువురు నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. -
బాస్ లీవ్ ఇవ్వలేదని.. వీడియో కాల్లో పెళ్లి
పని, పని పని.. కార్పొరేట్ కల్చర్‌లో ఇది ఎక్కువైంది. కార్యాలయాల్లో పని ఒత్తిడి.. ఉద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. ముఖ్యమైన అవసరాలకు సైతం సరిగా లీవ్‌లు కూడా ఇవ్వని పరిస్థితి తలెత్తుతోంది. కానీ ఎంత పెద్ద ఉద్యోగమైన, ఎంత పెద్ద పదవిలో ఉన్న జీవితంలో జరిగే పెళ్లికి ప్రతి ఒక్కరూ తప్పక సెలవులు పెడతారు. అయితే టర్కీలో ఓ ఉద్యోగికి తన పెళ్లికి బాస్ లీవ్ ఇవ్వలేదు. దీంతో అతను వర్చువల్‌గా వివాహం చేసుకోవాలసి వచ్చింది.హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ జంట ఆన్లైన్ వీడియో కాల్ సాక్షిగా ఒక్కటైయ్యారు. పెళ్లి కూతురు మండిలో.. పెళ్లి కొడుకు టర్కీలో ఉండి వీడియో కాల్‌లోనే పెళ్లి తంతు పూర్తి చేశారు. బిలాస్పూర్ చెందిన అద్నాన్ ముహమ్మద్ టర్కీలో పని చేస్తున్నాడు. స్వదేశానికి వచ్చి వివాహ చేసుకునేందుకు అతడు లీవ్ కోరగా.. కంపెనీ సెలవు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో అతను వర్చువల్‌గా ముస్లిం మత సంప్రదాయ ప్రకారం వీడియోకాల్‌లో పెళ్లి చేసుకున్నాడు. అయితే అంత హడావిడీగా పెళ్లి చేసుకోవడానికి కారణం.. వధువు తాత అనారోగ్యంతో ఉండటంతో ఆమెను త్వరగా వివాహం చేసుకోవాలని పట్టుబట్టినట్లు వరుడి కుటుంబ సభ్యులు తెలిపారు.ఆమె పెళ్లి చూడాలని పట్టుపట్టడంతో ఇరు కుటుంబీకులు ఆన్ లైన్ నికాకు అంగీకరించారు. బిలాస్పూర్ నుంచి నవంబర్ 3న ఆదివారం మండికి చేరుకున్నారు. మండీలో నవంబర్ 4న (సోమవారం) వీడియో కాలంలో వారి వివాహం జరిగింది. ఖాజీ వారితో కలిసి ఖుబూల్ హై అని మూడుసార్లు అనిపించారు. ఇదిలా ఉండగా గతేడాది జూలైలో సిమ్లాలో మరో వ్యక్తి కూడా ఇలానే ఆన్ లైన్ పెళ్లి చేసుకున్నాడు. కోట్‌ఘర్‌కు చెందిన ఆశిష్ సింఘా, కులులోని భుంతర్‌కు చెందిన శివాని ఠాకూర్లు కొండచరియలు విరిగిపడటంతో టైంకు వారి పెళ్లింటికి చేరుకోలేక పోయారు. దీంతో వీడియో-కాన్ఫరెన్స్‌లో పెళ్లి చేశారు. -
ఉద్యోగినికి మెసేజ్.. మేనేజర్‌పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
సమయం ఉదయం. ఇంటి నుంచి ఆఫీస్‌కు వస్తున్న ఉద్యోగినికి యాక్సిడెంట్ అయ్యింది. అనంతరం తీవ్ర గాయాల పాలైన ఉద్యోగిని.. రోడ్డు ప్రమాదంలో తాను డ్రైవ్ చేస్తున్న కారు ప్రమాదానికి గురైందని తెలుపుతూ కారు ఫొటో తీసి తన మేనేజర్‌కి మెసేజ్ చేసింది. తాను ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు ఆ మెసేజ్లోని సారాశం. ఇలాంటి సందర్భాలతో సాధారణంగా మేనేజర్లు ఎలాంటి సమాధానం ఇస్తారు. కానీ అందుకు భిన్నంగా ఈ సంస్థ మేనేజర్ ఇచ్చిన రిప్లయిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటన ఎక్కడ జరిగింది. ఉద్యోగి,మేనేజర్ సంబంధిత వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.కిరా అనే యూజర్ ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో ఉద్యోగిని కారు ప్రమాదానికి గురైందని తన మేనేజర్‌కు మెసేజ్ చేసింది. తాను డ్రైవ్ చేస్తున్న కారు ప్రమాదం ఫొటోల్ని జత చేసింది.what would y’all respond with if your manager says this? pic.twitter.com/bZznlPZrLT— kira 👾 (@kirawontmiss) October 22, 2024 అయితే అనూహ్యంగా కంపెనీ మేనేజర్ సదరు ఉద్యోగిని యోగక్షేమాలు అడగడానికి బదులు.. మీరు ఆఫీస్‌కు ఎప్పుడు వస్తారో సమాచారం ఇవ్వండి అంటూ బదులిచ్చారు. ఆ మేస్జ్కి ఉద్యోగిని రిప్లయి ఇవ్వలేదు. దీంతో కోపోద్రికుడైన మేనేజర్ మరుసటి రోజు మరోసారి మెసేజ్ పంపాడు. అందులో మీరు నా మెసేజ్‌కు రిప్లయి ఎందుకు ఇవ్వలేదో నేను అర్ధం చేసుకోగలను. కానీ జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణం మినహా ఇతర ఘటనలు జరిగి ఉంటే సంస్థ మీపై తప్పని సరిగా కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు సదరు మేనేజర్.ప్రస్తుతం ఈ ఘటనపై నెటిజన్లు మేనేజర్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాగే మా మేనేజర్ వ్యవహరిస్తే..నేను వెంటనే కొత్త ఉద్యోగం వెతుక్కుంటాను అంటూ ఓ నెటిజన్ స్పందిస్తే.. ఈ తరహా ఉన్న మేనేజర్లు మనల్ని బయపెడుతున్నారు. జీవితం ఇంత దుర్భరంగా ఉంటుందా? అని మరో నెటిజన్ రిప్లయి ఇచ్చాడు. -
ఐఫోన్ లాంఛ్ ఈవెంట్లో కాబోయే టాలీవుడ్ కపుల్.. ఫోటోలు
-
క్విట్ వెకేషనింగ్ ట్రెండ్ ఏమిటి? యువత ఎందుకు ఫాలో చేస్తోంది?
సాధారణంగా ఉద్యోగులు తమ ఉద్యోగానికి, వ్యక్తిగత జీవితానికి మధ్య సమన్వయాన్ని కొనసాగించేందుకు పని నుండి కాస్త విరామం తీసుకుని, ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటారు. ఇందుకోసం తమ ఆఫీసులోని బాస్‌కు చెప్పి సెలవు తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఈ విషయంలో కొత్త ట్రెండ్ మొదలయ్యింది. ప్రపంచంలోని అనేక దేశాలలో వివిధ ప్రైవేట్ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు ఈ నూతన ట్రెండ్‌ను ఫాలో చేస్తున్నారు. దానిపేరే ‘క్విట్ వెకేషనింగ్’. ఇంతకీ ఈ కొత్త ధోరణి ఏమిటి?అమెరికన్ మార్కెటింగ్ అండ్ రీసెర్చ్ కంపెనీ ‘హారిస్ పోల్’ నిర్వహించిన సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం యూఎస్‌లోని దాదాపు 78 శాతం మంది ఉద్యోగులు, ప్రధానంగా యువత తమకు పని నుంచి విరామం కావాలని బాస్‌ను అడగడం లేదు. ఇలా అడగకుండా లీవ్ పెట్టడాన్ని వారు తప్పుగా భావించడంలేదని సదరు సర్వే చెబుతోంది. పని ఒత్తిడికి తగ్గించుకునేందుకే వారు ఇలా చేస్తున్నారని సర్వే వెల్లడించింది.పని నుంచి విరామం కోరుకునేందుకు ఉద్యోగులు తమకు తోచిన పరిష్కారాలను కనిపెడుతున్నారు. దీనిలో భాగంగానే క్విట్ వెకేషనింగ్ అనేది ఉద్భవించిందని సర్వే చెబుతోంది. ఈ సర్వేలోని వివరాల ప్రకారం క్విట్ వెకేషనింగ్ సమయంలో ఉద్యోగులు తాము పనిచేస్తున్నట్లు సంస్థకు భ్రమ కల్పిస్తారు. పని వేళల్లో తాము పంపాల్సిన ఈమెయిల్స్‌ను ముందుగానే షెడ్యూల్ చేస్తారు. పనివేళల తర్వాత కూడా ఓవర్ టైం చేస్తున్నట్లు కనిపించేందుకు కూడా ప్రయత్నిస్తుంటారు.మరి కొందరు ఉద్యోగులు అప్పుడప్పుడు తమ కంప్యూటర్ మౌస్‌ను కంపెనీ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌పై ఉంచి, పని చేస్తున్నట్లు కనిపించడానికి ప్రయత్నిస్తారు. ఇదంతా తెరవెనుక కొన్నాళ్లుగా జరుగుతున్నదని ఈ సర్వే చేపట్టిన సంస్థ తెలిపింది. అయితే అటు ఉద్యోగాన్ని, ఇటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసేందుకు మంచి పరిష్కార మార్గం కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని సర్వే నిర్వాహకులు తెలిపారు. -
పెళ్లి సెలవును ఎగతాళి చేసిన బాస్.. ఉద్యోగి షాకింగ్ నిర్ణయం!
ఉద్యోగ జీవితం ఎంత ముఖ్యమో వ్యక్తిగత జీవితం కూడా అంతే ముఖ్యం. దీనికి విఘాతం కలిగినప్పుడు కొంత మంది ఉద్యోగులు ధైర్యంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి ఓ ఉద్యోగి తన సోదరుడి పెళ్లి కోసం సెలవు అడిగితే ఇవ్వకపోగా ఎగతాళి చేసిన బాస్‌కు గట్టి షాక్ ఇచ్చాడు. ఇంతకీ అతను తీసుకున్న షాకింగ్ నిర్ణయం ఏంటన్నది ఇప్పుడు చూద్దాం.. ఆస్ట్రేలియాలో నోయెల్ అనే ఉద్యోగి బాలీలో సోదరుడి పెళ్లి కోసం సెలవుకు దరఖాస్తు పెట్టకున్నాడు. అయితే అతని బాస్ సెలవును రద్దు చేయడంతోపాటు ఎగతాళి చేస్తూ పంపిన సందేశం చూసిన తర్వాత నోయెల్ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. సోదరుడి పెళ్లికి వెళ్లకపోవడం కంటే ఉద్యోగం వదిలేయడమే మేలని నిశ్చయానికి వచ్చాడు. ఆ బాస్ అంతలా ఏమి ఎగతాళి చేశాడు.. ఉద్యోగికి బాస్‌కి మధ్య జరిగిన సంభాషణపై మైఖేల్ సాంజ్ బిజినెస్‌మన్, ఔట్సోర్సింగ్ ఎక్స్పర్ట్ టిక్‌టాక్‌లో ఓ వీడియోను షేర్ చేయడంతో ఈ సంఘటన సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. "ఈ వ్యక్తి పనిముట్టులా ఉన్నాడు. ఎటువంటి సంభాషణ లేకుండా ఆటోమేటిక్‌గా సెలవును రద్దు చేస్తున్నాడు" అంటూ జోడించారు. నిక్ అనే బాస్, అతని ఉద్యోగి నోయెల్ మధ్య సంభాషణ ఇలా ఉంది.. మరొక ఉద్యోగి రాజీనామా చేస్తున్నందున నోయెల్ సెలవు రద్దు చేస్తున్నట్లు బాస్ తెలియజేశాడు. ఇప్పటికే బాలీకి విమానాలకు టికెట్ల బుకింగ్ అయిపోయిందని, తన పిల్లలు వివాహ పార్టీలో ఉన్నారని తన సెలవులను రద్దు చేయొద్దని నోయెల్ బాస్‌ని వేడుకున్నాడు.ఏడు నెలల క్రితమే టికెట్లు బుక్ చేశానని కాబట్టి రద్దు చేయడం వీలు కాదని అభ్యర్థించాడు. అయినప్పటికీ, బాలిని గమ్యస్థానంగా ఎగతాళి చేస్తూ సెలవును మూడు వారాల నుంచి మూడు రోజులకు తగ్గించుకోవాలని నోయెల్‌కు సూచించాడు. దీంతో కలత చెందిన నోయెల్.. ఇతర దేశాలను ఎగతాళి చేసే ఇలాంటి కంపెనీలోనా తాను పనిచేస్తున్నది అంటూ తాను ఈ రోజు నుంచే సెలవు తీసుకుంటున్నాని అంటే జాబ్ మానేస్తున్నానని బదులిచ్చాడు. బాస్ ప్రవర్తనపై నెటిజన్లు తీవ్రంగా ప్రతిస్పందించారు. నోయెల్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. -
చీకటి నీడ!..ఒక బాస్ జంటల మధ్య సాగే థ్రిల్లింగ్ కథ!
వర్షం ధారగా కురుస్తూ రాత్రిని చల్లగా తడుపుతోంది. కన్నీటి వాన నా మనసును బాధతో తడుముతోంది. కొద్దిసేపటికో లేదా మరునాటికో వర్షం ఆగిపోయి వాతావరణం సాధారణ స్థితికి వస్తుంది. నా కన్నీరు కూడా అలాగే ఆగిపోతుందేమో. కానీ నా మనసులోని బాధ ఎప్పటికి తగ్గుతుంది? నేను మళ్లీ సాధారణ స్థితికి రాగలనా..! ఎదురుగా కనిపిస్తున్న పిస్తా రంగు వెడ్డింగ్ కార్డుపై గోల్డ్ కలర్లోని ‘మానస వెడ్స్ తరుణ్’ అనే అక్షరాలను చూస్తుంటే నా బాధ రెట్టింపు అవుతోంది. ఇన్ని సంవత్సరాల నా రిలేషన్‌షిప్‌ని ఎలా వదులుకోగలుగుతోంది మానస. ఆ తరుణ్ అనే వాడితో అంత సులువుగా పెళ్లికి ఎలా ఒప్పుకుంది? ఎంత ఆలోచించినా కారణం అంతుబట్టడం లేదు. కార్డు ఇస్తున్నప్పుడు అదే విషయం అడిగాను. ‘చిల్ యార్. తరుణ్‌తో పెళ్ళి అమ్మా..నాన్న, సొసైటీ కోసమే! నా మనసులో నీ స్థానం ఎప్పటిలాగానే పదిలంగా ఉంటుంది. నా పెళ్లి తరువాత కూడా మనం మునుపటిలాగానే కలుసుకుందాం..’ అని ఎంత ఈజీగా చెప్పేసింది. నా మనసులో మానసకు తప్ప మరో మనిషికి చోటు లేదు. కానీ తనెందుకు ఇలా చేసింది! బాల్కనీలోకి వచ్చి సిగరెట్ వెలిగించాను. ఆమె పరిచయం, సాన్నిహిత్యం తరువాత నేనొక అనాథనని మరచిపోయాను. ఇప్పుడు నేను మళ్ళీ ఒంటరినని తలుచుకుంటే దుఃఖం ముంచుకొస్తోంది. బెడ్ పై వాలి కళ్ళు మూసుకుంటే నిద్ర దరి చేరటం లేదు. నాలుగేళ్ల క్రితం నాటి మా మొదటి పరిచయం గుర్తుకు వచ్చింది. ∙∙ చురుకుగా ఉండటం, సమయస్ఫూర్తి, కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీతో పాటు చూడగానే ఆకర్షించే నా రూపం.. చిన్న వయసులోనే.. పేరున్న కంపెనీలో టీమ్ లీడర్‌గా ఎదగటానికి దోహదపడింది. అది నా రెండో ప్రాజెక్ట్ అనుకుంటా. కొత్తగా ఒక జావా డెవలపర్ అవసరం పడింది. షార్ట్ లిస్ట్ చేసిన ముగ్గురిలో ఒకరిని ఫైనల్ చేసి రిక్రూట్ చేసుకొనే బాధ్యతను నాకు అప్పగించారు. ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. ప్రొఫైల్స్ చూస్తే ముగ్గురూ టాలెంటెడ్ అనిపించింది. ఇంటర్వ్యూ కోసం ఒక్కొక్కరినీ నా క్యాబిన్లోకి పంపించమన్నాను. మొదట వచ్చిన అమ్మాయిది.. బంగారు వర్ణం. ఒకసారి చూస్తే ఏ మగాడికైనా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సోయగం. కొన్ని కోడ్స్, ప్రాబ్లెమ్ ఎనాలిసింగ్ టెక్నిక్స్ డిస్కస్ చేశాక ఎందుకో సంతృప్తి కలగలేదు నాకు. తరువాత వచ్చిన అబ్బాయి ఎన్.ఐ.టి గ్రాడ్యుయేట్. కానీ అతనిలోని కొంచెం నిర్లక్ష్యపు దోరణి నచ్చక రిజెక్ట్ చేశాను. చివరగా వచ్చింది మానస. చామనఛాయ రంగు దేహం.. ఆ కళ్ళలోని మెరుపు సమ్మోహనంగా ఉంది. ‘గుడ్ మార్నింగ్’ అంటూ సన్నని నవ్వు. అదేంటి ఆశ్చర్యంగా ఆ నవ్వు నాలో చక్కిలిగింతలు పెడుతోంది. ఇదేమి వింత! ఇది కరెక్ట్ కాదు కదా అని అనిపించింది. కానీ ఆ పొడవాటి మొహంలోని కాంతి, మెడ దగ్గరి నునుపు నన్ను కళ్ళు తిప్పుకోనివ్వ లేదు. తమాయించుకొని ప్రోగ్రామింగ్ మాడ్యూల్స్ డిస్కస్ చేశా. అన్ని ప్రశ్నలకూ సరైన సమాధానాలే. ఆటిట్యూడ్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తే ముచ్చటేసింది. ‘యూ ఆర్ సెలెక్టెడ్’ అని చెప్పాను. ‘థాంక్ యూ సో మచ్ ఫర్ సెలెక్టింగ్ మీ. ఈ జాబ్ నాకు రావటానికి మీరే కారణం. మీ గైడెన్స్‌లో పనిచెయ్యటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఆ మెత్తని స్పర్శకు నా నరనరాల్లో వేల వోల్ట్ల విద్యుత్ ప్రవహించిన అనుభూతి. సర్దుకొని ‘బై ద వే.. నీ డేట్ అఫ్ బర్త్ చూశాను. నువ్వే నా కన్నా ఆరు నెలలు పెద్ద. సో నేను నీ బాస్ అయినప్పటికీ మీరు అనొద్దు. నువ్వు అని సింగిలర్ యూస్ చెయ్యి. నో ప్రాబ్లెమ్’ అన్నాను. కళ్ళతోనే నవ్వింది. ఆ చూపు గుచ్చుకొని నా హృదయంలో తియ్యని అలజడి మొదలయ్యింది. అలా తొలి పరిచయంలోనే తను నాకు బాగా కావాల్సిన వ్యక్తిలా కనిపించింది. తరువాత నుండి ప్రతిరోజు తనను చూడాలనే తహ తహ మొదలయ్యింది. అయితే ఒకటే టీమ్ అయినా ఆఫీస్‌లో ఇద్దరం కలిసి మాట్లాడుకునే టైమ్ అస్సలు ఉండేది కాదు. మీటింగ్స్ కుడా జూమ్‌లోనే అయ్యేవి. కానీ నాకు మాత్రం రోజుకి ఒక్కసారైనా మానసని చూడాలని, చలాకీగా తను మాట్లాడుతుంటే వినాలని అనిపించేది. మానస ఇదేమీ గమనించేది కాదు. నాలో తన పట్ల కలుగుతున్న ప్రేమ పూరిత భావనలు తను కనిపెట్టే అవకాశం అస్సలు లేదు. ‘నువ్వు సిగరెట్లు తగ్గించు. పెదాలు కొంచెం నలుపు రంగులోకి మారేలా కనిపిస్తున్నాయి’ అంది ఒక రోజు. ‘ఇంత అందంగా ఉంటావు. ఆఫీస్‌లో ఇప్పటివరకు ఎవ్వరూ ప్రపోజ్ చెయ్యలేదా నీకు?’ చొరవగా అడిగింది ఇంకో రోజు. ‘నువ్వు మామూలు డ్రెస్‌లో కంటే జీన్స్.. టీ షర్ట్‌లో సూపర్ ఉంటావు’ మరో రోజు కాంప్లిమెంట్. ఎప్పుడూ క్యాంటీన్లోనే తినే నాకోసం అప్పుడప్పుడు తన లంచ్ బాక్స్ షేర్ చేసేది. కొద్ది రోజుల్లోనే ఒక స్నేహితురాలిగా దగ్గరయ్యింది. ఆఫీస్ విషయాలు, ఇంట్లో సంగతులే కాకుండా పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకునేది. ఎప్పుడైనా తను లీవ్ పెడితే ఆ రోజంతా నా మనసు విలవిల్లాడేది. తను పరాయి మనిషి కాదు అని నా కోసమే పుట్టిందేమో అనే తీవ్రమైన భావన నాలో! నేను తనకి ఇంకా దగ్గర అవ్వకముందే మంచి ఆపర్చునిటీ వచ్చిందని ఇంకో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగానికి మారిపోయింది. మా ఆఫీస్‌లో తన లాస్ట్ వర్కింగ్ డేనాడు వీడ్కోలు పలుకుతున్నప్పుడు నా కళ్ళలోని తడిని చూసి ‘హే.. ఇప్పుడు ఏమైంది? నేను వేరే కంట్రీకి ఏమీ పొవట్లేదు. ఈ సిటీలోనే ఉంటున్నా. ఇంకా చెప్పాలంటే మనిద్దరి ఆఫీస్‌ల మధ్య దూరం పది నిమిషాలే. రెగ్యులర్‌గా టచ్‌లో ఉందాం. ఓకే నా’ అంటూ హగ్ చేసుకొంది. ఆ కౌగిలి తను కాజువల్‌గా ఇచ్చినా అప్పుడు మా రెండు దేహాల స్పర్శలో నేను పొందిన ఆనందం అనిర్వచనీయం. అలారం క్లాక్, మొబైల్ రెండూ ఒకేసారి మోగుతుండగా నిద్ర లేచాను. టైమ్ చూస్తే పది. మానస గురించి ఆలోచిస్తూ లేట్‌గా పడుకున్నానేమో మెలకువ రాలేదు. మొబైల్ చూస్తే తన నుండే కాల్. ‘హలో.. గుడ్ మార్నింగ్ ’ అన్నాను. నా గొంతులో విషాదం నాకే తెలుస్తోంది. ‘హే గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచావా? కమాన్ క్విక్‌గా రెడీ అయ్యి బేగంపేట షాపర్స్ స్టాప్‌కి వచ్చేయ్. చిన్న షాపింగ్. తరుణ్ కూడా వస్తున్నాడు. నువ్వుంటే నాకు బాగుంటుంది’ అని చెప్పేసి ఫోన్ కట్ చేసింది. ఏమనుకుంటుంది ఈ మనిషి అసలు! మా ఇద్దరి మధ్య ఏమీ లేనట్లు ఇంత క్యాజువల్‌గా ఎలా మాట్లాడుతుంది? తరుణ్‌తో షాపింగ్ చెయ్యటానికి నన్నెందుకు రమ్మంటోంది? వాళ్ళిద్దరినీ పక్క పక్కన చూస్తే నేను తట్టుకోగలనా! అలా ఆలోచిస్తూనే రెడీ అయ్యి కిందకి వచ్చి కార్ స్టార్ట్ చేశాను. రాత్రి తగ్గిన వర్షం మళ్ళీ సన్నని తుంపరతో మొదలయ్యింది. కొన్ని జ్ఞాపకాలకు మరణమే ఉండదు. కొన్ని జ్ఞాపకాలు అస్సలు పురుడు పోసుకోవు. డ్రైవ్ చేస్తూ మళ్ళీ పాత జ్ఞాపకాలను వెతుక్కొన్నాను. మొదటిసారి తను నా కార్ ఎక్కటానికి కూడా ఇలాంటి వర్షమే కారణం. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుండి బయటకు వచ్చేసరికి చిన్న ముసురు. నా కార్ దగ్గరికి వెళ్తూ, నీటి బిందువులతో ఆనందంగా పరవశిస్తున్న చెట్ల ఆకుల సోయగాన్ని చూస్తే ఎందుకో మానస గుర్తుకు వచ్చింది. స్కూటీ పై ఆఫీస్‌కి వచ్చే తను ఈ వర్షంలో ఇంటికి ఎలా వెళ్తుందో అనిపించి మొబైల్ తీసి కాల్ చేశా. నేనేం మాట్లాడక ముందే ‘హే.. హౌ అర్ యూ? ఒక్క మెసేజ్ లేదు, కాల్ లేదు. మర్చిపోయావనుకున్నా బేబీ’ అన్నది గారాలు పోతూ. ఆ గొంతులో ఆ చనువుకి నా వొళ్ళు సంతోషంతో పులకరించింది. ‘ఐ యామ్ గుడ్. వర్షం వస్తుంది కదా ఎలా వెళ్తావు? ఫైవ్ మినిట్స్‌లో వస్తా. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా’ అన్నాను. ‘థాంక్ గాడ్. క్యాబ్ కోసం ట్రై చేస్తుంటే రెస్పాన్స్ రావట్లేదు. కమాన్ తొందరగా వచ్చేయ్. నీతో కబుర్లు చెప్పుకొని చాలా రోజులు అవుతోంది. వెయిటింగ్ ఫర్ యూ..’ అన్న తన మాటలకి కొత్త ఉత్సాహం ఆవరించింది నన్ను. రెడ్ కలర్ చుడీదార్ పై కొన్ని వర్షపు చినుకులు అద్దుకొని మంచి పరిమళాన్ని మోసుకుంటూ వచ్చి కార్లో కూర్చుంది. ఆ కళ్ళు చూస్తేనే మైకం కమ్ముకుంటుంది నాలో. ఎప్పటిలాగానే గలగలా మాట్లాడుతుంటే ముందున్న అద్దంలో మెరిసే తన పెదాలనే చూస్తున్నా. ‘హే.. ఈ వర్షాన్ని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నాకైతే చల్లటి ఐస్‌క్రీమ్ చప్పరించాలని ఉంది’ అంది. ‘నిజం చెప్పనా! నాకైతే నిన్ను చూస్తూ చిల్డ్ బీర్ కొట్టాలని ఉంది’ అన్నాను. ‘అబ్బా.. నీకెప్పుడూ బోల్డ్ థాట్స్ వస్తాయి.. లెట్స్ డూ ఇట్..’ అంటూ కన్ను గీటింది. తను అలా చేస్తే ఏదో తెలియని థ్రిల్ ఫీలింగ్ కలిగింది నాకు. ‘అయితే చలో నా ఫ్లాట్‌కే పోదాం. ఫ్రిజ్‌లో ఐస్‌క్రీమ్, బీర్ రెండూ ఉన్నాయి’ అంటూ నేను కూడా కన్ను గీటాను కావాలని. ‘డన్..’ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాల్కనీలో కూర్చొని, వర్షాన్ని ఆస్వాదిస్తూ తను బటర్ స్కాచ్‌ని, నేను బడ్వైజర్ని రుచి చూస్తున్నాం. ఎలా మొదలు పెట్టాలో అర్థంకావటం లేదు నాకు. డైరెక్ట్‌గా ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటుందా? ఒప్పుకోకుంటే భరించలేను. నా గురించి అందరికీ చెపితే ఆ అవమానాన్ని తట్టుకోలేను. బాల్కనీ కుండీల్లో రకరకాల మొక్కలు ఉంటే, వాటివైపు చూస్తూ ఏదో ఆలోచిస్తోంది మానస. బీర్‌తో పాటు నైట్ క్వీన్ గుబాళింపు ఒక వైపు, మరువం పరిమళం ఇంకో వైపు నాకు మత్తుని కలిగిస్తున్నాయి. ధైర్యం చేసుకొని తన దగ్గరగా వెళ్లి కళ్ళలో కళ్ళు పెట్టి చూశాను. అదే మెరుపు. నవ్వుతూ నన్ను ఆహ్వానిస్తున్నట్లుగా..చప్పున తన భుజాలు పట్టుకొని ముద్దు పెట్టి ‘లవ్ యూ మానసా..’ అన్నాను. ఊహించని ఈ పరిణామానికి బిత్తరపోయి నిలుచుంది తను. నా వొంట్లో భయం కలిసిన ఉద్విగ్నత. ‘నీకు ఎందుకు ఇలా అనిపించింది. ఇది కరెక్టేనా?’అని అడిగింది. ముద్దు పెడితే ఏమీ అనకుండా ఆ ప్రశ్న అడగటంతో నాకు ధైర్యం వచ్చింది. ‘కరెక్టో కాదో అన్నది ప్రశ్న కాదు. నీకు నేనంటే ఇష్టమా కాదా చెప్పు. నాకు నువ్వు కావాలి. జీవితాంతం నీ తోడు కావాలి’ అన్నాను. అంతే లతలా నన్ను పెనవేసుకొని ‘లవ్ యూ టూ డియర్’ అని నా నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టింది. ఆ క్షణం ఈ ప్రపంచాన్ని జయించిన అనుభూతి కలిగింది నాకు. ఆ రోజు నుండి మా ఇద్దరి ప్రపంచం కొత్తగా మొదలయ్యింది. ఎన్నో కబుర్లు, సినిమాలు, పార్టీలు, అలకలు, ఆనందాలతో జీవితం రంగుల హరివిల్లులా సాగుతూ.. ఒక్క క్షణం కూడా ఒకరిని విడిచి ఇంకొకరం ఉండలేని ప్రేమలోకంలో విహరించసాగాం. అలా అంతా సాఫీగా సాగుతున్న తరుణంలో ఇలా సడన్‌గా తరుణ్‌తో నా పెళ్లి అంటూ వెడ్డింగ్ కార్డు ఇచ్చింది. నా ఆలోచనలకు బ్రేక్ వేస్తూ బేగంపేట్ వచ్చింది. ∙∙ నేను వెళ్లేసరికి వెడ్డింగ్ డ్రెస్ సెలక్షన్లో బిజీగా ఉన్నారు ఇద్దరూ. ‘తరుణ్.. మీట్ మై బాస్ ఇన్ మై ఫస్ట్ జాబ్. అఫ్కోర్స్ ఇప్పుడు మాత్రం తనే నాకున్న ఒకే ఒక్క క్లోజ్ ఫ్రెండ్ అనుకో’ అని నన్ను పరిచయం చేసింది. ఆ మాటకు నా హృదయం భగ్గుమంది. ‘ఎంతకు తెగించావే రాక్షసి. నేను క్లోజ్ ఫ్రెండ్ అంతేనా? ఇంకేమీ కానా? అయినా ఎలా చెపుతావు లే!’అని మనసులో అనుకున్నాను. మొహం మీద బలవంతంగా నవ్వు పులుముకొని ‘హాయ్’ అన్నాను. ఇంకేం మాట్లాడబుద్ధి కాలేదు. వాళ్లిద్దరినీ అలా చూస్తుంటే బాధ, కోపం, కసి, చిరాకు.. మనసంతా చేదుగా అయిపోయింది. మానస లేకుండా నేను అసలు జీవించగలనా! ఎక్కడి నుండి ఊడిపడ్డాడు ఈ ఇడియట్ తరుణ్ గాడు? మమ్మల్ని వేరు చెయ్యటానికే పుట్టినట్లున్నాడు. నాకు వాడంటే అసూయ, అసహ్యం రెండూ కలిగాయి. షాపింగ్ అయిపోయింది. వస్తుంటే ‘మా పెళ్ళికి మీరు తప్పకుండా రావాలి. ఇది నా నుండి ఇన్విటేషన్’ అన్నాడు తరుణ్. ‘ష్యూర్.. సీ యూ’అని చెప్పి బయట పడ్డాను. మానస ఎప్పటికైనా నాకే సొంతం కావాలి. తను లేకుంటే నాకు చావే దిక్కు అనిపించింది. దేవుడా ఎలాగైనా ఈ పెళ్లి ఆపు అని జీవితంలో మొదటిసారి దేవుడికి మొక్కుకున్నాను. కానీ దేవుడు నా మొర ఆలకించలేదు. వైభవంగా వాళ్ళిద్దరి పెళ్లి జరిగిపోయింది. ఆ రోజు ఏడ్చి ఏడ్చి నా కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. నా కళ్ల ముందు అంతా శూన్యం. ఇంత చేసినా ఆశ్చర్యంగా నాకు మానస మీద కోపం మాత్రం రావట్లేదు. ప్రతిరోజు తన గొంతు వినాలని, తనని చూడాలని అనిపించి పిచ్చెక్కేది. కాల్ చేస్తే జస్ట్ హాయ్, బాయ్ అని రెండు మూడు మాటలు మాట్లాడి ఫోన్ కట్ చేసేది అంతే. ఇప్పుడు నా భవిష్యత్తు గురించి నేనో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందనిపించింది. అది ఎంత కఠినమయినా కచ్చితంగా ఆచరణలో పెట్టాలని డిసైడ్ అయ్యాను. వాళ్ళ పెళ్ళైన వారం రోజుల తరువాత ఒక రోజు ఉదయాన్నే ఫోన్ చేసింది మానస. ‘హేయ్.. ఏం చేస్తున్నావ్? మరిచిపోయావా మమ్మల్ని? ఈ రోజు నేను ఆఫీస్‌కి వెళ్లట్లేదు. ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను. వచ్చేయ్ ఇంటికి’ అంది. అడ్రస్ అడిగి జుట్టు కూడా సరిగ్గా దువ్వుకోకుండా బయటపడ్డాను. ఎందుకు రమ్మంది? క్యాజువల్గానా లేక ఇంకేదైనా చెప్పటానికా? నాలో అంతులేని ప్రశ్నలు. నేను వెళ్లేసరికి తరుణ్ ఇంకా పోలేదు. రెడీ అయ్యి షూ వేసుకుంటున్నాడు. నన్ను చూసి ఆశ్చర్యంగా ‘అరే చెప్పకుండా వచ్చారు? ముందే చెపితే నేను కూడా లీవ్ పెట్టే వాడిని కదా! ఎనీవే ఆఫ్టర్ నూన్ వచ్చేస్తాను. లంచ్ ముగ్గురం కలిసే చేద్దాం. బాయ్’ అంటూ వెళ్ళిపోయాడు. వీడికి మా ఇద్దరి మీద డౌట్ వచ్చే అవకాశం అస్సలు లేదులే అనుకున్నాను. నన్ను చూస్తూనే గట్టిగా కౌగిలించుకొని ‘మిస్ యూ బేబీ..’ అంటూ ముద్దు పెట్టింది మానస. నాకు ఏడుపు ఆగలేదు. ‘ఎందుకిలా చేశావ్? నన్ను ఒంటరిగా ఎందుకు వదిలేశావ్? నువ్వు నిజంగా నన్ను ప్రేమించావా?’ నిలదీశాను. నా నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటూ ‘ఇప్పుడేమైంది? నిన్ను దూరం పెట్టను అని చెప్పాగా. నువ్వంటే నాకు ఎప్పటికీ ప్రేమే’ అంది. ‘మరి అలాంటప్పుడు ఆ తరుణ్గాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నన్నెందుకు పెళ్లి చేసుకోలేదు?’ కొంచెం కోపంగా అడిగాను. ‘ఎందుకంటే ఇద్దరు ఆడవాళ్లు పెళ్లి చేసుకుంటే లోకం ఒప్పుకోదు కాబట్టి. చూడు అమృతా.. నాకు నీ ప్రేమ కావాలి. సోషల్ లైఫ్ కావాలి. అలాగే పిల్లలు కూడా కావాలి. అందుకోసం తరుణ్‌ని పెళ్లి చేసుకున్నాను. కానీ నా మనసులో మాత్రం నువ్వే ఉంటావు..’ అని చెప్పుకుంటూ పోతోంది. తన నుండి దూరంగా జరిగి ‘ప్రేమంటే రెండు దేహాల కలయిక మాత్రమే కాదు. రెండు మనసుల అపూర్వ సంగమం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నా మనసులో నువ్వు మాత్రమే ఉంటావు. ఇంకో వ్యక్తికి చోటు ఉండదు. కానీ నువ్వు అలా కాదు. నీది నిజమైన ప్రేమ కాదు’ అన్నాను. ‘అమృతా.. ప్లీజ్ అలా అనకు. నన్నర్థం చేసుకో’ నా చేతులు పట్టుకుంటూ అడిగింది. ‘ఒకే జెండర్ అయినా, జెండర్స్ వేరైనా.. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఉన్నప్పుడు మూడో వ్యక్తితో రిలేషన్ అంటే అది మొదటి ప్రేమికుడు లేదా ప్రేమికురాలికి ద్రోహం చేసినట్లే అవుతుంది. ఇంకా చెప్పాలి అంటే అది మానసిక వ్యభిచారం లాంటిదే’ స్థిరంగా చెప్పాను. ‘అమృతా.. చెప్పానుగా.. సమాజం కోసం.. ఇంకా చెప్పాలంటే మా పేరెంట్స్ కోసమే నేను తరుణ్‌ని పెళ్లి చేసుకుంది. నాకు నువ్వే ప్రాణం’ అంది. ‘నేను నీ ప్రాణమే అయితే నన్నిలా వదిలేసే దానివి కాదు. జీవితాంతం నాకు తోడుగా ఉండేదానివి. నీ కోసం ఎవ్వరినైనా ఎదిరించి బతకటానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నువ్వు? నీది స్వార్థం. నిజమైన ప్రేమకు కావాల్సింది నమ్మకం. అది నీ మీద నాకు ఇప్పుడు లేదు. మళ్ళీ నా జీవితంలో ప్రవేశించాలని చూడకు. గుడ్ బై’ అని చెప్పి బయటకు నడిచాను. --మొగలి అనిల్ కుమార్ రెడ్డి (చదవండి: -
మద్యం మత్తులో మేనేజర్‌కు మెసేజ్.. ‘ఏందిరా ఇది’ అంటున్న నెటిజన్లు!
మత్తులో మునిగినోడు నిజమే మాట్లాడతాడని, అన్నీ నిజాలే చెబుతాడని చాలా మంది అంటుంటారు. అలా మద్యం మత్తులో అన్నీ నిజాలే మాట్లాడేసి, ఆనక చిక్కుల్లో పడినవారు చాలామందే ఉంటారు. ఇదే బాపతుకు చెందిన ఒక మందుబాబు తన మేనేజర్‌తో చాట్ చేశాడు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఆ మేనేజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మద్యం మత్తులో మునిగిన ఆ జూనియర్ తన బాస్‌కు అర్థరాత్రి 2:30కి మెసేజ్ చేసి, దానిలో.. ‘బాస్ నేను మద్యం మత్తులో ఉన్నాను. నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. నా మీద నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు. నన్ను ముందుకు నడిపిస్తున్నందకు ధన్యవాదాలు. మంచి కంపెనీలో ఉద్యోగం దొరకడం కన్నా మంచి మేనేజర్ దొరకడం ఎంతో కష్టం. నేను చాలా లక్కీ. మిమ్మల్ని మీరు ప్రశంసించుకోండి. మీకు మీరు అభినందనలు చెప్పుకోండి’ అని రాశాడు. ఈ పోస్టుకు క్యాప్షన్ రాసిన బాస్.. ఎక్స్ నుంచి మద్యం మత్తులో మెసేజ్‌లు రావడం సహజం. కానీ ఇటువంటి మెసేజ్‌లు మీకు ఎప్పుడైనా వచ్చాయా? అని ప్రశ్నించారు. ఈ పోస్ట్ వైరల్ అయిన నేపధ్యంలో పలువురు నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఏందిరా ఇది’ అంటూ ఆశ్యర్యపోతున్నారు. ఒక యూజర్..‘మీరు చాలా అదృష్టవంతులు. మీ జూనియర్ మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు’ అని రాయగా మరొకరు మీరు చాలా మంచి మేనేజరై ఉంటారు. లేకుంటే ఇలాంటి మెసేజ్‌లు మీకు రావు’ అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ఇది యానిమేటెడ్ 3డీ షో కాదు.. ప్రకృతి ఆవిష్కరించిన మెరుపు! Drunk text from ex is okay but have you ever received drunk texts like these? pic.twitter.com/rvkaGMYqLl — Siddhant (@siddhantmin) August 4, 2023 -
ఏం చేసినా పడుండాలా?, బాస్‌కి దిమ్మతిరిగేలా రిప్లై..డేరింగ్ లేడీ అంటున్న నెటిజన్లు!
కొత్త జాబ్, ఆఫీస్. నచ్చిన వాతావరణంలో పని. మన ఆలోచనలకు అనుగుణంగా ఉండే కొలీగ్స్. ఇదిగో ఆఫీసుల్లో ఇలా ఉండాలని కోరుకుంటాం. కానీ అందుకు విరుద్దంగా ఉంటే అంతే సంగతలు. అందుకే తాను కోరుకున్నట్లు ఆఫీస్ వాతావరణం, బాస్ లేడని ఓ యువతి ఉద్యోగంలో చేరిన మూడు రోజుల్లో తన జాబ్‌కు రిజైన్ చేసిన విషయాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ప్రస్తుతం, ఈ అంశం చర్చాంశనీయంగా మారింది. ఇటీవల, ఓ యువతి తాను కొత్తగా చేరిన జాబ్, ఆఫీస్ వాతావరణం ఎలా ఉందో ఏకరువు పెట్టింది. ఆమె ఇలా ఎందుకు చేసిందో ఉదహరిస్తూ.. ఉద్యోగం మానేయడం సమంజసమా? లేదంటా అతిగా స్పందించానా’ అంటూ రెడ్డిట్ యూజర్లను సలహా అడిగారు. ‘బాస్ తనకు ఎలాంటి పనులు అప్పగించలేదు. పైగా నేను చెప్పిన పని ఎందుకు చేయలేదని తిట్టాడు. ఆయన అప్పగించిన పనిని వెంటనే పూర్తి చేస్తే.. ఎందుకంత నిధానంగా పనిచేస్తున్నావని ఆరోపించారు. టాయిలెట్లో 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడిపినందుకు ప్రశ్నించారు. గతంలో తాను ఎదుర్కొన్న మానసిక సమస్యల గురించి చెప్పనందుకు మరింత మందలించాడు. ఒత్తిడిని సమస్యను ఎదుర్కొనేలా డాక్టర్లు మెడిసిన్ వేసుకోవాలని చెప్పారు. డాక్టర్ల సూచన మేరకు కొంత కాలం ఆ మెడిసిన్ వేసుకొని మానేశా . ఈ విషయాలన్నీ ఇంటర్వ్యూలో చెప్పాలిగా అని బాస్ ఆగ్రహం వ్యక్తం చేశాడని వాపోయింది. చివరిగా, నేను అక్కడ పని చేయగలనా అని నిర్ణయించుకోవడానికి రేపటి వరకు (ఈ రోజు) సమయం ఇచ్చారు. బాస్ తీరు నచ్చక. రేపటి వరకు అవసరం లేదని నేనే చెప్పాను. వెంటనే రాజీనామా కూడా చేశా’ అంటూ తన అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు.. అలాంటి వాళ్ల దగ్గర పని చేయకపోవడమే బెటర్.. మంచి నిర్ణయం తీసుకున్నావ్, నువ్వు డేరింగ్ లేడీ అంటూ అభినందిస్తున్నారు. I quit after 3 days by u/QueenMangosteen in antiwork చదవండి👉 ఆ వార్తల్లో వాస్తవం లేదు.. క్లారిటీ ఇచ్చిన రిలయన్స్ -
అదే పనిగా భర్తకు నైట్ షిఫ్ట్.. కోపంతో భార్య.. రాత్రి మాస్క్ వేసుకుని ఇంట్లోకి దూరి
సాధారణంగా కార్పొరేట్ కంపెనీల్లో నైట్ షిఫ్టులు అనేది సర్వసాధారణం. ముఖ్యంగా అమెరికా, యూకే ఆధారిత కంపెనీల్లో పని చేస్తుంటే నైట్ షిఫ్ట్‌లు చేయక తప్పదు. ఉద్యోగం కోసం కొందరు తప్పక నైట్ షిఫ్ట్‌లకు అంగీకరించినా.. వారి జీవన విధానం పూర్తి భిన్నంగా ఉంటుంది. రాత్రిళ్లు మేల్కొని పనిచేయాల్సి ఉంటుంది. మెలకువగా ఉండేందుకు నానా తంటాలు పడుతుంటారు. అయినా ఎలాగోఒకలా డ్యూటీ చేసినా.. ఆ తర్వాత ఆరోగ్య సమస్యల రావడం కామన్. అదే పనిగా నైట్ షిఫ్ట్... అందుకే రాత్రిపూట పని చేయడానికి చాలా వరకు ఇష్టపడరు. కానీ... కొన్ని చోట్ల కార్పొరేట్ కంపెనీల్లో బాస్‌లు ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ బలవంతంగా నైట్ షిఫ్ట్‌లు చేయిస్తుంటారు. తాజాగా ఉత్తరాఖండ్‌లోని ఉదంసింగ్ నగర్ జిల్లాలో ఈ తరహా కేసు వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..టేకి రవ్లీన్, రవ్లీన్ కౌర్ ఇద్దరూ దంపతులు. వీరు ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలోని ట్రాన్సిట్ క్యాంపు ప్రాంతంలోని హౌసింగ్ డెవలప్మెంట్లో రౌలీన్ నివసిస్తున్నారు. టెకీ రవ్లీన్ పంత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. పగ పెంచుకుంది అదే కంపెనీలో పనిచేస్తున్న రవ్లీన్ హెడ్ దీపక్ భాటియా చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. వారి మధ్య ఏం జరిగిందో ఏమో గానీ ఇటీవల రవ్లీన్కు అదే పనిగా నైట్ షిఫ్ట్ వేయిస్తున్నాడు. అంతే కాకుండా జీతం కూడా పెంచలేదు. రోజూ భర్త రాత్రికి వెళ్లి నైట్ షిఫ్ట్ చేసి తెల్లవారుజామున తిరిగి వచ్చేవాడు, దీంతో క్రమంగా అతని ఆరోగ్యం కూడా క్షీణించింది. ఈ క్రమంలో తన భర్త యజమానిపై రవ్లీన్ కౌర్ పగ పెంచుకుంది. అతనికి తగిన బుద్ధి చెప్పాలనుకుని అందుకోసం ఓ ప్లాన్ వేసింది.. ఓ రోజు రాత్రి మాస్క్ ధరించి భర్త బాస్ ఇంట్లోకి ప్రవేశించి అక్కడ ఉన్న యజమాని తల్లిపై దాడి చేసి.. ఆమె తలపై సుత్తితో బాదింది. ఆమె గట్టిగా అరిచింది. ఈ క్రమంలో.. అరుపులు విని ఆమె మనవడు గదిలోకి వచ్చాడు. దీంతో ఆ మహిళ భయపడి అక్కడి నుంచి పారిపోయింది. గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. ఆపై.. సీసీటీవీల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఇదేం రివెంజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి Aunty Network: హోరు వానలో.. కూర్చుని ముచ్చట్లు పెట్టిన ఆంటీలు.. -
ఫాస్ట్‌గా ఎందుకు.. నెమ్మదిగా పనిచేసుకోండి - బాస్ స్వీట్ వార్నింగ్!
ఉద్యోగి జీవితం పైకి కనిపించేంత అద్భుతంగా ఉండదు, ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. అటు ఉద్యోగాన్ని.. ఇటు ఫ్యామిలీని మెయింటేన్ చేయాలంటే తల ప్రాణం తోకకి వస్తుంది. ఆఫీసుకు లేటుగా వెళ్తే చీవాట్లు, సరైన సమయానికి పని పూర్తి చేయకపోతే తిట్లు.. ఇలా ఎన్నో సమస్యలతో ముందుకు సాగుతుంటుంది. ఎంత పని చేసినా బాస్ నుంచి ఏదో ఒకటి అనిపించుకోక తప్పదు. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన సంఘటన దానికి భిన్నంగా ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఒక సంస్థ అంటే అందులో అందరూ ఒకేలా పనిచేయరు. ఒకరు వేగంగా పనిచేస్తారు, మరి కొందరు నెమ్మదిగా పనిచేస్తారు. అయితే ఒక కంపెనీలో బాస్ మాత్రం వేగం వద్దు నెమ్మదిగా పనిచేయండంటూ చెప్పినట్లు సమాచారం. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని రెడ్దిట్ యూజర్ @cryptoman9420 అనే వ్యక్తి వెల్లడించినట్లు తెలిసింది. (ఇదీ చదవండి: ఏసీ రైలు.. ఇండియన్స్‌ను ఎక్కనించేవారే కాదు.. తొలి ఏసీ కోచ్ ఎప్పుడు? ఎక్కడ? ఎలా మొదలైందంటే..) నాకు పని చేయడం చాలా ఇష్టం.. చాలా వేగంగా పనిచేయాలనుకుంటాను, ఏదైనా పని చెబితే గంటల్లో పూర్తి చేస్తాను అని చెప్పుకొచ్చాడు. కానీ అతని మాటలకు బాస్ పొగుడుతాడనుకుంటే.. వార్ణింగ్ ఇచ్చాడట. కొంచెం నెమ్మదిగా పనిచెయ్యి, కొన్ని మెయిల్స్‌కి మాత్రమే రిప్లై ఇస్తే చాలు. నీ వేగవంతమైన ప్రదర్శన పని వాతావరణం మీద ప్రభావం చూపిస్తుంది. అంతే కాకుండా ఆఫీసులో నైతికత కూడా దెబ్బ తింటుందని స్వీట్ వార్ణింగ్ ఇచ్చినట్లు సమాచారం. దీనిపైన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ కూడా చేస్తున్నారు. -
మీ బాస్‌కి బుద్ధి లేదు,వాడో శాడిస్ట్.. టార్గెట్ రీచ్ కాలేదని బలవంతంగా..ఛీ!
సాధారణంగా కంపెనీలు.. ఉద్యోగుల నుంచి సాధ్యమైనంత పనిని చేయించు కోవాలనుకుంటాయి. ఇక కొన్ని సంస్థలైతే తమ ఉద్యోగులకు టార్గెట్ల పేరుతో వేధిస్తుంటాయి. తాజాగా ఓ బాస్ తన ఉద్యోగులకు విచిత్రమైన శిక్ష వేశాడు. తమ సంస్థలో పని చేసే ఉద్యోగుల పనితో సంతృప్తి లేదని వెరైటీ పనిష్మెంట్ ఇచ్చాడు. ఇదంతా అందులో ఒక ఉద్యోగి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ బాస్ బండారం బయటపడింది. ఈ వింత ఘటన చైనాలోని జియాంగ్సూ ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. అదో ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కంపెనీ. పేరు సుఝౌ దనావ్ ఫాంగ్చెంగ్షీ ఇన్ఫర్మేషన్ కన్సల్టింగ్. ఈ కంపెనీకి సంబంధించిన చాలా మంది ఉద్యోగులు బలవంతంగా చేదు కాకరకాయల్ని బలవంతంగా తిన్నారు. చైనీస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో, చాలా మంది ఉద్యోగులు పచ్చి పొట్లకాయ తింటున్నారు. కంపనీలో చేరే ముందు వారి పని తీరు సంతృప్తిగా లేకపోతే ఇలాంటి పనిష్మెంట్కి ఉద్యోగులు అంగీకరిస్తూ అగ్రిమెంట్ కూడా చేయించుకున్నట్లు కంపెనీ తెలిపింది. అది రివార్డ్, పనిష్మెంట్ స్కీమ్ అని పేర్కొంది. ఇలా ఎందుకు చేశారని చైనా మీడియా ఆ సంస్థ ప్రతినిధిని అడగగా.. వారు మొండిగా సమాధానం ఇచ్చారు. ఉద్యోగులకు ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో వారు కఠినంగా, హార్డ్ వర్క్ చేస్తారని అన్నారు. తద్వారా మాత్రమే టార్గెట్ రీచ్ అవ్వగలరని అన్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ కంపెనీ బాస్‌పై మండిపడుతున్నారు. ఇదేం స్కూల్ కాదు ఇలాంటి శిక్షలు వేయడానికి.. ఆ బాస్ బుద్ధిలేదు, వాడో శాడిస్ట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: రష్యాకి తగిలిన వాగ్నర్ సైన్యం షాక్‌కి..ప్రపంచ నాయకుల రియాక్షన్ ఎలా ఉందంటే.. -
Jayanti Chauhan: వేల కోట్ల కంపెనీకి లేడీ బాస్.. జయంతి చౌహాన్
గత కొన్ని రోజులుగా ప్యాకేజ్డ్ వాటర్ బిజినెస్ కంపెనీ బిస్లెరీ ఇంటర్నేషనల్‌ను విక్రయించాలని సన్నాహాలు జరిగాయి. అయితే వాటన్నంటికీ ఇప్పుడు తెరవేసారు. కంపెనీని ప్రస్తుతం ఎట్టిపరిస్థితుల్లో విక్రయించబోమని రమేష్ చౌహాన్ స్పష్టం చేశారు. నిజానికి బిస్లెరీ విక్రయానికి సంబంధించి చర్చలు టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌తో గడిచిన నాలుగు నెలలుగా జరుగుతున్నాయి. అయితే ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. బిస్లరీ బ్రాండ్‌ను టాటా గ్రూప్‌కు రూ.7,000 కోట్లకు విక్రయించాలని గతంలో అనుకున్నప్పటికీ, చివరికి రద్దయింది. జయంతి చౌహాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జార్జ్ నేతృత్వంలోని ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ బృందంతో కలిసి పని చేసింది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే బిస్లరీ ఇంటర్నేషనల్ ఛైర్మన్ 'రమేష్ చౌహాన్' కూతురే 'జయంతి చౌహాన్'. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (TCPL)తో చర్చలు ముగిసిన తరువాత ఈమె సంస్థకు సారథ్యం వహించే బాధ్యతలు స్వీకరించింది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని రమేష్ చౌహాన్ స్వయంగా మీడియాకు తెలిపారు. (ఇదీ చదవండి: EPFO: పీఎఫ్ విత్ డ్రా చేస్తున్నారా? ఈ సందర్భంలో 75 శాతం తీసుకోవచ్చు..) జయంతి చౌహాన్ లాస్ ఏంజిల్స్‌లోని 'ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ మర్చండైజింగ్' (FIDM) లో ప్రాడక్ట్ డేవలప్మెంట్, లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ నుండి ఫ్యాషన్ స్టైలింగ్ అండ్ ఫోటోగ్రఫీ చదివింది. అంతే కాకుండా స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుంచి అరబిక్ కూడా నేర్చుకున్నారు. (ఇదీ చదవండి: 2023 ఇన్నోవా క్రిస్టా లాంచ్ చేసిన టయోట - పూర్తి వివరాలు) జయంతి ప్రారంభంలో బిస్లరీ ప్లాంట్ ప్రాసెస్ ఆటోమేషన్‌పై ద్రుష్టి సారించి హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్తో పాటు సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్‌లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చింది. ఆ తరువాత 2011లో ఢిల్లీ నుంచి ముంబైకి షిఫ్ట్ అయిన తరువాత హిమాలయాస్ నేచురల్ మినరల్ వాటర్, బిస్లరీ హ్యాండ్ ప్యూరిఫైర్స్ వంటి కొత్త బ్రాండ్లను నడపడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. -
ఇక బిస్లెరీకి బాస్ ఆమే...
ప్యాకేజ్డ్ వాటర్ వ్యాపార దిగ్గజం బిస్లెరీని ఇక ఆ కంపెనీ వైస్ చైర్ పర్సన్ జయంతి చౌహాన్ నడిపించనున్నారు. బిజినెస్ కొనుగోలుకి బిస్లెరీ ఇంటర్నేషనల్‌తో చేపట్టిన చర్చలకు చెక్ పడినట్లు ఎఫ్ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్(టీసీపీఎల్) వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో బిస్లెరీ కంపెనీకి ఇక జయంతి చౌహాన్ అధిపతిగా ఉంటారని ఆమె తండ్రి సంస్థ చైర్మన్ రమేష్ చౌహాన్ తాజాగా తెలిపారు. ఇదీ చదవండి: Rs 2000 notes: రూ.2వేల నోట్లపై కేంద్రం కీలక ప్రకటన! ది ఎకనామిక్ టైమ్స్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రమేష్ చౌహాన్ మాట్లాడుతూ.. తమ వ్యాపార సంస్థను తాము అమ్మడం లేదని, తమ కూతురు జయంతి చౌహాన్ ఇక మీదట సంస్థను నడిపిస్తారని చెప్పారు. 42 ఏళ్ల జయంతి చౌహాన్ ప్రస్తుతం ఆమె తండ్రి స్థాపించి తీర్చిదిద్దిన బిస్లెరీ కంపెనీలో వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. కంపెనీ వర్గాల సమాచారం మేరకు.. ఆమె కంపెనీ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ బృందంతో కలిసి పని చేస్తారు. జయంతి చౌహాన్ కంపెనీ వ్యాపార వ్యవహారాల్లో అప్పుడప్పుడు పాలుపంచుకుంటున్నారు. అయితే బిస్లరీ పోర్ట్‌ఫోలియోలో భాగమైన వేదిక బ్రాండ్‌పైనే ప్రధానంగా ఆమె దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. టాటా సంస్కృతి, విలువలు నచ్చడంతో తాను తన వ్యాపార సంస్థ బిస్లెరీని వారికి అమ్మదలిచానని, ఇతర సంస్థలు బిస్లెరీ కొనుగోలుకు ఎంత ప్రయత్నించినా తాను పట్టించుకోలేదని రమేష్ చౌహాన్ అప్పట్లో చెప్పారు. ఇదీ చదవండి: Apple Watch: ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్!.. ఎలాగంటే... టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్, బిస్లెరీ ఇంటర్నేషనల్ సంస్థల మధ్య రెండేళ్లుగా జరుగుతున్న చర్చలు బిస్లరీ కంపెనీ వాల్యుయేషన్‌పై భిన్నాభిప్రాయాల కారణంగా అటకెక్కాయి. అయితే చర్చలు విఫలం కావడానికి వాల్యుయేషన్ కాకుండా వేరే కారణాలు ఉన్నట్లు ఎకనమిక్స్ టైమ్స్ పేర్కొంటోంది. కంపెనీ ప్రమోటర్లు భవిష్యత్తులో తమ ఆలోచనలను మార్చుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. -
తెలంగాణ కొత్త పోలీస్ బాస్
-
'హే డ్యూడ్'..అమ్మా..తల్లి నేను నీ బాస్‌ను..నన్ను అలా పిలవద్దు ప్లీజ్!
ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో ఇన్ని రోజులు హైబ్రిడ్ వర్క్‌తో తలమునకలైన ఉద్యోగులు.. ఇప్పుడు తాత్కాలికంగా వర్క్ ఫ్రమ్ హోం చేసేందుకు ఇష్టపడుతున్నారు. అందుకు సంస్థలు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి. అయితే ఈ తరుణంలో వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఉద్యోగులకు, వారి బాస్‌ల మధ్య జరుగుతున్న సంభాషణలు నెటిజన్లను నవ్వులు పూయిస్తున్నాయి. ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చి పనిచేయడం వల్ల వర్క్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఉద్యోగుల నుంచి మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చనేది సంస్థల అభిప్రాయం. అయితే ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా రిమోట్ వర్క్‌తో టీం లీడర్లు, బాస్‌లు ఉద్యోగులతో వర్క్ చేయించుకోవడం తలనొప్పిగా మారింది. ముఖ్యంగా కొంత మంది ఉద్యోగులు ట్రెండ్‌కు తగ్గట్లు స్నేహితులతో ఎలా మెలుగతారో.. బాస్‌లతో సైతం అదే తరహాలో సంభాషిస్తున్నారు. ఆ సంభాషణలే బాసిజం చూపించే బాస్‌లకు అస్సలు నచ్చడం లేదు. హర్టవుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఉద్యోగి శ్రేయాస్.. బాస్ సందీప్ మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణను మీరూ చూసేయండి తాజాగా వర్క్ ఫ్రం హోం చేస్తున్న శ్రేయాస్ అనే యువతికి ఆమె బాస్ సందీప్ ఓ వర్క్ అలాట్ చేశాడు. ఆ వర్క్ పూర్తయ్యిందా అంటూ వాట్సాప్‌లో మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్‌కు శ్రేయాస్ ఇలా రిప్లయి ఇచ్చింది. "హే.. నో,నాట్ ఎట్" అని మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ బాస్‌కు కోపం తెప్పించింది. దీంతో సందీప్ స్పందించాడు. హాయ్ శ్రేయాస్ నేను మీ బాస్‌ను నన్ను 'హే' అని పిలవొద్దు. ఉద్యోగులు బాస్‌తో మాట్లాడేందుకు కొన్ని పద్దతులుంటాయి. నీకు నా పేరు గుర్తు లేకపోతే హాయ్ అని మెసేజ్ చేయ్. దీంతో పాటు "డ్యూడ్", "మ్యాన్", "చాప్", "చిక్" అని కూడా పిలవొద్దు. అంటూ ఉద్యోగికి వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డ్ చేశాడు. అంతే ఆ రిప్లయికి ఉద్యోగి శ్రేయాస్ స్పందిస్తూ.."మంచిది. నేను మీతో వాట్సాప్ చాట్ చేస్తున్నాను. తప్పితే లింక్డిన్, మెయిల్ చేయలేదు. మిమ్మల్ని కించ పరచలానే ఉద్దేశ్యం నాకు లేదు. నేను ప్రొఫెషనల్‌గా మీతో మాట్లాడాను అని బాస్‌కు చెప్పింది".ఆ వాట్సాప్ సంభాషణను ఉద్యోగి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ రెడ్డిట్‌లో పోస్ట్ చేయడం,అది కాస్త వైరల్ అవ్వడం క్షణాల్లో జరిగిపోయాయి. -
ఆఫీసులో ఫోన్ ఛార్జింగ్ పెడితే జీతం కట్!
స్మార్ట్ ఫోన్.. మనకి రోజూవారీ పనుల్లో ఓ భాగం అయ్యింది. బయటకు వెళ్లేప్పుడు మాస్క్ మరిచిపోతున్నా.. ఫోన్ మాత్రం వెంటే ఉంటుంది. మరి వాడకానికి తగ్గట్లు పాపం ఛార్జింగ్ కూడా అవసరం కదా! అందుకే చాలామంది పని చేసే చోట్ల కూడా ఫోన్లకు ఛార్జింగ్ పెట్టేస్తుంటారు. అయితే ఇక్కడో బాస్ అందుకు అభ్యంతరం చెప్తున్నాడు. వర్క్‌ప్లేస్‌లో ఫోన్ ఛార్జింగ్ పెట్టడం కుదరదని అంటున్నాడు ఆ బాస్. ఆ బాస్, ఆఫీస్ ఎక్కడిదనేది క్లారిటీ లేదు. కానీ, ఇందుకు సంబంధించిన ఓ పేపర్ నోట్ ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఈ అలవాటు కరెంట్ దొంగతనం కిందకే వస్తుందని, పనిచోట నైతిక విలువలకు సంబంధించిన విషయమని పేర్కొన్నాడు ఆ బాస్. ఈ నోట్ రెడ్డిట్ వెబ్సైట్లో చర్చకు దారితీసింది. గంటల తరబడి ఆఫీసుల్లో ఉన్నప్పుడు ఫోన్ ఛార్జింగ్ తగ్గిపోతుందని, అలాంటప్పుడు ఆఫీస్ కరెంట్ ఉపయోగించుకోవడంలో తప్పేంటని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కొందరు. మరికొందరేమో ఆ బాస్ చేసింది కరెక్టేనని, దీనివల్ల ఫోన్-ఇంటర్నెట్ వాడకం తగ్గుతుందని, అంతేకాదు మైండ్ డైవర్షన్ లేకుండా పనిలో నైపుణ్యం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే వర్క్ ప్లేస్‌లో ఫోన్, డివైస్ల ఛార్జింగ్‌ను చాలా కంపెనీలు వ్యతిరేకిస్తాయని, వాల్‌మార్ట్ లాంటి ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ సైతం ఇలాంటి నిబంధనను అమలు చేస్తోందని గుర్తు చేస్తున్నారు ఇంకొందరు. ఇక ఈ నోట్ మూడేళ్ల క్రితమే రెడ్డిట్‌లో ఇలా చర్చకు దారితీయడం మరో విశేషం. చదవండి: Work From Home.. మారిన రూల్స్! ఏంటంటే.. -
వివాహేతర సంబంధం వద్దన్నందుకు అంతు చూస్తానన్న భార్య.. తట్టుకోలేక
లక్నో: భార్య మరొకరితో సంబంధం పెట్టుకోవడంతో పద్ధతిని మార్చుకోవాలని హెచ్చరించినా పట్టించుకోలేదు. దీంతో తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోమతి నగర్లో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోమతి నగర్‌కు చెందిన నిఖిల్‌కు 2012లో వివాహం కాగా, ఒక కుమార్తె ఉంది. నిఖిల్ కిరాణా దుకాణం ద్వారా జీవనం సాగిస్తుండగా, ఇటీవల కొంత కాలంగా తన భార్య ఓ ఎన్జీవో సంస్థలో పని చేయడం ప్రారంభించింది. అయితే గత కొంతకాలంగా ఆమె తన యజమానితో సన్నిహితంగా ఉంటోంది. అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. దీంతో ఆమె తన కుటుంబాన్ని పట్టించుకోవడం మానేసింది. ఈ విషయం నికిల్కి తెలియడంతో తన భార్య పద్ధతిని మార్చుకోవాలని ఆమెను హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. మంగళవారం రాత్రి ఈ విషయమై వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకి తన అక్రమ సంబంధానికి అడ్డు రావొద్దని ఆమె తన భర్తకి తెగేసి చెప్పడంతో పాటు భర్త అంతు చూస్తానని బెదిరించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నిఖిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో నికిల్ తండ్రి పోలీసుల వద్ద.. తన కొడుకు జీవితం అతని భార్య వివాహేతర సంబంధం కారణంగా నాశనం అయ్యిందని తెలిపాడు. నికిల్ అత్మహత్యకు తన కోడలు ఆమె యజమానే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: 3 నిమిషాల్లో 3 కిలోమీటర్లు.. జెట్ స్పీడులో దూసుకొచ్చి ప్రాణం కాపాడిన పోలీసులు -
వార్నీ... వీక్లీ ఆఫ్ రోజు తాగొద్దన్నందుకు జాబ్ మానేశాడు
సాధారణంగా చేసే ఉద్యోగం మనకు నచ్చకపోతేనో.. బాస్ తీరు సరిగా లేకపోతేనో.. చుట్టూ ఉన్న వాళ్లు రాజకీయాలు చేసి.. మనల్ని అవమానిస్తేనో.. ఉద్యోగం మానేస్తాం. కానీ కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి పైన చెప్పిన పరిస్థితులు ఎదురైనా సరే.. అన్నింటిని మౌనంగా భరిస్తూ.. ఉద్యోగం చేసుకుంటున్నారు చాలా మంది. ఎందుకంటే బయట పరిస్థితులు బాగాలేవు కనుక.. అన్నింటిని సహిస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు చూడబోయే వ్యక్తి మాత్రం కాస్త భిన్నం. వీక్ ఆఫ్ రోజు పని చేయడానికి రావాలి.. తక్కువ తాగు అని బాస్ సూచించినందుకు ఆగ్రహించి ఉద్యోగం మానేశాడో వ్యక్తి. ఇక బాస్‌కి, సదరు ఉద్యోగికి మధ్య జరిగిన చాటింగ్ ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ఆ వివరాలు.. (చదవండి: జీతం ఎంతో చెప్పాలంటూ కాబోయే అల్లున్ని గదిలో బంధించి...) రెడిట్‌లో పోస్ట్ చేసిన స్క్రీన్ షాట్స్‌లో బాస్ తన బార్ అటెండర్‌కి ఉదయం 2.59 గంటలకు మెసేజ్ చేస్తాడు. ఏమని అంటే.. ‘‘రేపు ఓ ఈవెంట్ ఉంది.. డ్యూటీలో ఒక్కడే బార్ అటెండర్ ఉన్నాడు. కనుక నీవు రేపు ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు అతడు డ్యూటీ చేయాల్సి ఉందని’’ తెలుపుతాడు. అందుకు సదరు ఉద్యోగి నిరాకరిస్తాడు. రేపు నాకు ఆఫ్ అని తెలుపుతాడు. కానీ తప్పనిసరిగా రావాల్సిందిగా కోరతాడు బాస్. అందుకు ఆ ఉద్యోగి ‘‘రేపు ఉదయం డ్యూటీకి రావాలని.. మీరు తెల్లవారుజామున 3 గంటలకు నాకు మెసేజ్ చేశారు. ముందు చెప్పలేదు. రేపు వీక్లీ ఆఫ్ కదా అని నేను ఈ రోజు ఎక్కువ డ్రింక్ చేశాను. రేపంతా నాకు హ్యాంగోవర్ ఉంటుంది.. నేను 11 గంటల పాటు డ్యూటీ చేయలేను’’ అని రిప్లై ఇస్తాడు. (చదవండి: కొడుక్కి ఎంతైనా ఇస్తా.. కూతురికి ఇవ్వను!) అందుకు బాస్ ‘‘నీవు డ్యూటీ చేయడానికి సిద్ధంగా ఉండాల్సిందే. పైగా ఎక్కువ తాగడం మంచిది కాదు. కొన్ని అనుకోని పరిస్థితులకు మనం అప్పటికప్పుడే సిద్ధపడి.. వాటిని పూర్తి చేయాలి. ఒకరికొకరం మద్దతుగా ఉండాలి’’ అని మెసేజ్ చేస్తాడు. అప్పటికే సదరు ఉద్యోగికి చిర్రెత్తుకొస్తుంది. ఇక ఏమాత్రం మోహమాటపడకుండా బాస్‌ని దులిపిపారేస్తాడు. ‘‘వీక్లీ ఆఫ్ రోజు నేను ఎంత తాగాలో నీవు నాకు చెప్తావా.. వీక్లీ ఆఫ్ రోజు తినొద్దని చెఫ్‌కి చెప్పగలవా.. నువ్వు కరెక్ట్ టైమ్‌లో నాకు ఈ మెసేజ్ చేస్తే అప్పుడు నేను ఆలోచించేవాడిని. ఇంత లేట్‌గా చెప్పడమే కాక నేను ఎంత తాగాలో నువ్వు డిసైడ్ చేస్తున్నావ్’’ అంటూ ఉద్యోగి ఘాటుగా రిప్లై ఇస్తాడు. (చదవండి: షాకింగ్: భార్య ప్రేమను అమ్మకానికి పెట్టి మరీ..) అందుకు బాస్ ‘‘నువ్వు ఆటిట్యూడ్ చూపిస్తున్నావ్. దీని గురించి మనం తర్వాత చర్చిద్దాం’’ అంటాడు. అందుకా ఉద్యోగి.. ‘‘మనం చర్చించాల్సిన అవసరం లేదు. బార్ అటెండర్లకి చాలా అవకాశాలు ఉన్నాయి. నేను ఉద్యోగం మానేస్తున్నారు. నీతో నేను విసిగిపోయాను. గుడ్‌బై’’ అంటాడు. అప్పుడు బాస్.. ‘‘నీ నిర్ణయం సరైంది కాదు. ఉదయం లేచాకా నీవు దీని గురించి బాధపడతావ్’’ అని హెచ్చరిస్తాడు. కానీ సదరు ఉద్యోగి మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోడు. ఇక వీరిద్దరి సంభాషణ చాలా ఫన్నీగా ఉండటంతో నెటిజనులను తెగ ఆకట్టుకొంటుంది. మా బాస్ కూడా ఇలానే సతాయిస్తాడు.. కానీ ఏం చేయలేకపోతున్నాం.. నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: వెరైటీ ఆహ్వానం: గిఫ్ట్ విలువను బట్టే పెళ్లి భోజనం -
బంధం తగ్గుతోంది..
ముంబై: కరోనా మహమ్మారి కారణంగా గతేడాది మార్చి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఇంటి నుంచి పని చేస్తున్న సమయంలో సంస్థలోని ఉద్యోగులకు, పై అధికారులకు మధ్య సమన్వయం తగ్గుతోందని ‘2022 అంతర్జాతీయ సాంస్కృతిక నివేదిక’ అనే పరిశోధనలో తేలింది. ఓ సీ ట్యానర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరిగింది. దీని ప్రకారం ప్రతి ముగ్గురు ఉద్యోగుల్లో ఒకరు తమ బాస్‌తో సంబంధాలు తెగిపోయాయని భావిస్తున్నట్లు తేలింది. ఉద్యోగుల మధ్య సంబంధాలు లేకపోవడం, ఉద్యోగులు– ఉన్నతాధికారుల మధ్య సమన్వయం కొరవడటం దీనికి కారణాలని పేర్కొంది. ఈ సమస్యలు కరోనా మహమ్మారి కారణంగా ఉత్పన్నమైనట్లు నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా పరిశోధన.. ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల్లో 38 వేల మంది ఉద్యోగులు, ఉన్నతాధికారులు, హెచ్ఆర్ విభాగానికి చెందినవారు, ఎగ్జిక్యూటివ్ అధికారుల నుంచి సేకరించిన సమాచారంతో ఈ పరిశోధన వెలువడింది. ఇందులో భారత్ నుంచి 5,500 మంది పాల్గొన్నారు. వీటన్నింటిని ఓసీ ట్యానర్ ఇన్స్టిట్యూట్ క్రోడీకరించి 2022 అంతర్జాతీయ సాంస్కృతిక నివేదికను వెలువరించింది. ఉద్యోగుల మధ్య సంబంధాలు ఎంత ముఖ్యమనే విషయాన్ని ఈ పరిశోధన మరోమారు స్పష్టం చేసిందని ఇన్స్టిట్యూట్ ఉపాధ్యక్షుడు గ్యారీ బెక్స్ట్రాండ్ చెప్పారు. ప్రోత్సాహం లేదు.. 57 శాతం మంది ఉద్యోగులు తమ బాస్‌ల నుంచి ప్రోత్సాహాన్ని పొందడం లేదని పరిశోధనలో వెల్లడించారు. 62 శాతం మంది పై అధికారులు విజయం సాధించడం ఎలాగో చెబుతుండగా, 52 శాతం మంది మాత్రమే తమ ఉద్యోగుల విజయాల గురించి ఇతరులకు వివరిస్తున్నారు. ఉద్యోగుల మధ్య సమన్వయాన్ని పెంచడంలో ఉన్నతాధికారులు విఫలమైతే పరిస్థితులు మరింత దిగజారతాయని పరిశోధన పేర్కొంది. ఉద్యోగులను పట్టించుకోకపోతే, ఉద్యోగులు కూడా తమ సంస్థ గురించి పట్టించుకోవడం మానేస్తారని తెలిపింది. సంస్థలోని ముఖ్యమైన సందర్భాలను కలసి జరుపుకోవడం ద్వారా ఉద్యోగులకు ప్రోత్సాహం లభిస్తుందని, తద్వారా వారు బాగా పని చేస్తారని నివేదిక స్పష్టం చేసింది. కీలకాంశాలు.. పరిశోధనలో పాల్గొన్న 61 శాతం మంది ఉద్యోగులు తమకు నూతన పరిచయాలు కార్యాలయాల్లోనే అవుతాయని చెప్పారు. సామాజికంగా ఇతరులతో కలసి పని చేస్తే తమలోని ఉత్తమ నైపుణ్యాన్ని బయటకు తీసుకురాగలమని అభిప్రాయపడ్డారు. మరో 45 శాతం మంది ఉద్యోగులు.. గతేడాది నుంచి ఆఫీస్ వర్క్‌కు సంబంధించిన దైనందిన సమన్వయ కార్యక్రమాలు బాగా పడిపోయాయని చెప్పారు. 57 శాతం మంది సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా వరకు తగ్గిపోయిందని అభిప్రాయపడ్డారు. పని ప్రదేశంతో కనెక్షన్ తెగిపోయాక తమ పనితీరు 90శాతం వరకూ పడిపోయిందని కొందరు ఉద్యోగులు వెల్లడించారు. దీంతో పాటు పని వల్ల నీరసపడిపోవడం (బర్న్ఔట్) బాగా పెరిగిందని వెల్లడించారు. చదవండి: కోవిడ్ పోరులో కొత్త ఆశలు -
అసభ్య సందేశాలు.. బాస్‌ను చితకబాదిన మహిళ
బీజింగ్: ఆడవాళ్లు ఇంటి పట్టునే ఉండాలి.. కుటుంబ సభ్యులను బాగా చూసుకోవాలి.. వారికి కావాల్సినవన్ని అమర్చి.. ఆమె జీవితాన్ని కుంటుంబానికే అంకితం చేయాలి. ఉద్యోగాలు చేయడం అంటే పెద్ద నేరం చేసినట్లే. స్త్రీ అంటే నేటికి సమాజంలో చాలా మందికి ఇదే భావం. ఇక ఈ బంధనాలు తెంచుకుని ఉద్యోగాలు చేసే మహిళలు ఎదుర్కొనే సమస్యలు కోకొల్లలు. పనిలో ఏ మాత్రం జాప్యం జరిగినా.. ఆఫీసుకు కాస్త లేటుగా వెళ్లినా.. కొందరు పురుష ఉద్యోగులు ఇంటి పట్టున ఉండక.. వీరికి ఇవన్ని ఎందుకు అంటూ ఎద్దేవా చేస్తారు. ఇక బాస్ "మగానుభావుడైతే" ఆ కష్టాలు ఇంకో రకం. ఆ పెత్తనంతో ఆడవారిని వేధింపులకు గురి చేస్తారు. తమ మాట వినకపోతే.. టార్చర్ పెడతారు. బాస్ అనే కారణం చెప్పి ఫోన్ చేసి.. అసభ్య సందేశాలు చేస్తూ మహిళా ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తారు. చాలా మంది ఆడవారు వీటన్నింటిని మౌనంగా భరిస్తారు. కానీ కొందరు మాత్రం ఎదురుతిరుగారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే బాగా అర్థం అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఓ యువతిని ఆమె బాస్ వేధింపులకు గురి చేస్తాడు. ఉన్నాతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. సహనం కోల్పోయిన సదరు ఉద్యోగిణి మాబ్ కర్ర తీసుకువచ్చి.. బాస్‌ను చితకబాదింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. చైనాలోని హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్‌లోని సుయిహువా, బీలిన్ జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగ సంస్థలో ఈ సంఘటన జరిగిందని చైనా టైమ్స్ న్యూస్ మీడియా తెలిపింది. ఈ వీడియోలో ఓ మహిళ తన బాస్ తనను ఎలా హింసించాడో వివరిస్తూ అతడిపై మాబ్ కర్రతో దాడి చేస్తుంది. తనకు అసభ్య సందేశాలు పంపాడని.. వార్నింగ్ ఇచ్చినా ఆగలేదని.. దాంతో ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశానని అనడం వీడియోలో వినిపిస్తుంది. ఎన్ని చేసినా బాస్ ప్రవర్తనలో మార్పు రాలేదు. ఓపిక నశించిన సదరు యువతి మాబ్ కర్రతో బాస్‌పై దాడి చేస్తుంది. చితకబాదుతుంది. ఇక సదరు బాస్ తన మొహం కనిపించకుండా చేతులు అడ్డుపెట్టుకుని తనను వదిలి వేయాల్సిందిగా బతిమిలాడతాడు. తాను జోక్ చేద్దామని భావించి మెసేజ్ చేశానని తెలుపుతాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజనులు సదరు ఉద్యోగిణిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి మహిళ ఇంతే ధైర్యంగాఉండాలని కామెంట్ చేస్తున్నారు. చదవండి: హనీమూన్ కోసం రూ.18 లక్షలకు కొడుకును అమ్మిన తండ్రి -
వైరల్ వీడియో: బాస్‌ను చితకబాదిన మహిళ
-
బాస్ మీద కోపం.. డ్రింక్‌లో కరోనా రోగి లాలాజలం
ఇస్తాంబుల్: బాస్ మీద కోపంతో ఓ ఉద్యోగి కోవిడ్ రోగి లాలాజలంతో తన బాస్‌ని చంపేందుకు ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళితే.. ఆగ్నేయ టర్కీలోని అదానాకు చెందిన ఇబ్రహీం ఉన్వర్డి కారు డీలర్షిప్ యజమానిగా పని చేస్తున్నాడు. రంజాన్ సిమెన్ అనే వ్యక్తి మూడేళ్లుగా అతడి దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. చెప్పిన పని చేస్తూ.. నమ్మకంగా ఉండటంతో ఇబ్రహీం అప్పుడప్పుడు రంజాన్ చేతికి డబ్బులు కూడా ఇచ్చే వాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఇబ్రహీం కారు అమ్మగా వచ్చిన 2,15,000టర్కిష్ లిరాలను(2,22,2160 రూపాయలు) రంజాన్ సిమెన్కి ఇచ్చాడు. ఆ మొత్తాన్ని తీసుకెళ్లి ఆఫీసులో జమ చేయాల్సిందిగా కోరాడు. అయితే ఇంత పెద్ద మొత్తం చేతికి రావడంతో రంజాన్ మనసులో చెడు ఆలోచనలు ప్రవేశించాయి. పైగా అప్పటికే అతడు లోన్ బకాయి ఉన్నాడు. ఈ క్రమంలో ఇబ్రహీం ఇచ్చిన డబ్బు తీసుకుని ఉడాయించాడు రంజాన్. దాంతో ఇబ్రహీం అతడి మీద పోలీసులకు ఫిర్యాడు చేయడమే కాక.. ఉద్యోగంలో నుంచి తొలగించాడు. అప్పటి నుంచి రంజాన్ బాస్ మీద పగ పెంచుకున్నాడు. ఎలాగైనా అతడిని చంపాలని భావించాడు. ఈ క్రమంలో ఓ దారుణమైన ఆలోచన చేశాడు. బాస్, అతడి కుటుంబ సభ్యులు తాగే డ్రింక్స్‌లో కరోనా వైరస్ సోకిన వ్యక్తి లాలాజలాన్ని కలిపి అందరిని ఒకేసారి చంపాలని భావించాడు. ఇందుకు గాను ఓ కరోనా రోగికి 50 టర్కిష్ లిరాలు (రూ. 516)చెల్లించి అతడి లాలాజలాన్ని కొన్నాడు. అయితే ఇబ్రహీం అదృష్టం కొద్ది రంజాన్ చేస్తోన్న దారుణం గురించి అతడికి ముందే తెలిసింది. రంజాన్ సహోద్యోగి ఒకరు దీని గురించి బాస్‌కు తెలపడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాక్ష్యాధారాలు సమర్పించాడు. దాంతో పోలీసులు రంజాన్ మీద హత్యానేరం కేసు నమోదు చేశారు. అయితే ఇంత జరిగినా రంజాన్ మాత్రం మారలేదు. ‘‘నేను నిన్ను వైరస్‌తో చంపడం కాదు.. ఈ సారి నీ పుర్రెని పుచ్చకాయాల పేల్చేస్తాను’’ అంటూ బాస్‌కి బెదిరింపు సందేశాలు పంపుతున్నాడట. ఇబ్రహీం దీని గురించి మాట్లాడుతూ.. ‘‘రంజాన్‌ను చూస్తే.. భయం వేస్తుంది. ప్రస్తుతం నేను, నా భార్య, పిల్లలు అందరం ఇంట్లోనే ఉంటున్నాం. మా సొంత ఇంట్లోనే మేం బందీలుగా బతుకుతున్నాం. ఇలా ఇంకేన్నాళ్లో’’ అంటూ వాపోయాడు. చదవండి: ‘ఓవెన్ వెలిగించమన్నారు.. చుట్టూ మాంసం ముక్కలు’ -
బాస్ మీద కోపం.. డేటింగ్ సైట్లలో ఫోన్ నంబర్
బెంగళూరు: బాస్ మీద కోపంతో ఓ వ్యక్తి అతడి ఫోన్ నంబర్ని డేటింగ్ సైట్లలో అప్లోడ్ చేశాడు. అంతేకాక యాజమాని పేరు మీద సెక్స్ టాయ్స్ బుక్ చేసి.. అతడి ఇంటికి పంపించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడంతో.. ఉద్యోగి చర్యలు వెలుగులోకి వచ్చాయి. వివరాలు.. బెంగళూరుకు చెందిన హరిప్రసాద్ జోషి అనే వ్యక్తి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ అవసరాల నిమిత్తం పీఎఫ్ మనీ డ్రా చేసుకోవాలనుకున్నాడు. దీని గురించి బాస్ అవినాష్ ప్రభుకు తెలిపాడు జోషి. అయితే వైరస్ కారణంగా వ్యాపారం నిలిచిపోయిందని చెప్పాడు యజమాని. అంతేకాక మునుపటి బిజినెస్ హెడ్ కూడా అవసరమైన పత్రాలను సమర్పించలేదని, అందువల్ల చెల్లింపు విడుదలలో ఆలస్యం జరిగిందని ఆయన పేర్కొన్నారు. మహమ్మారి ముగిసిన తర్వాత పీఎఫ్ డబ్బులు చేల్లిస్తానని ప్రభు, జోషికి హామీ ఇచ్చాడు. (4 నెలల్లో రూ. 30 వేల కోట్లు విత్‌డ్రా) కానీ డబ్బులు అత్యవసరం ఉండటంతో జోషి ఎదురుచూడటానికి ఇష్టపడలేదు. దాంతో దీని గురించి బాస్‌కు రోజు కాల్ చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. దాంతో ప్రభు అస్సలు డబ్బు చెల్లించనని.. ఏం చేసుకుంటావో చేసుకోమని జోషిని బెదిరించాడు. బాస్ ప్రవర్తనతో విసిగిపోయిన జోషి.. అతడి భార్య, పిల్లలకు అసభ్యకరమైన మెయిల్స్ పంపాడు. ప్రభు ఫోన్ నంబర్ని డేటింగ్ సైట్లలో అప్లోడ్ చేశాడు. అంతేకాక వారి పేరు మీద సెక్స్ టాయ్స్ బుక్ చేశాడు. ఈ చర్యలతో విసిగిపోయిన ప్రభు దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొబైల్ నంబర్ ఆధారంగా ట్రాక్ చేసి జోషిని అరెస్ట్ చేశారు. అతడి మీద ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.