ప్రతీకాత్మక చిత్రం
సాధారణంగా చేసే ఉద్యోగం మనకు నచ్చకపోతేనో.. బాస్ తీరు సరిగా లేకపోతేనో.. చుట్టూ ఉన్న వాళ్లు రాజకీయాలు చేసి.. మనల్ని అవమానిస్తేనో.. ఉద్యోగం మానేస్తాం. కానీ కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి పైన చెప్పిన పరిస్థితులు ఎదురైనా సరే.. అన్నింటిని మౌనంగా భరిస్తూ.. ఉద్యోగం చేసుకుంటున్నారు చాలా మంది. ఎందుకంటే బయట పరిస్థితులు బాగాలేవు కనుక.. అన్నింటిని సహిస్తున్నారు.
కానీ ఇప్పుడు మీరు చూడబోయే వ్యక్తి మాత్రం కాస్త భిన్నం. వీక్ ఆఫ్ రోజు పని చేయడానికి రావాలి.. తక్కువ తాగు అని బాస్ సూచించినందుకు ఆగ్రహించి ఉద్యోగం మానేశాడో వ్యక్తి. ఇక బాస్‌కి, సదరు ఉద్యోగికి మధ్య జరిగిన చాటింగ్ ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ఆ వివరాలు..
(చదవండి: జీతం ఎంతో చెప్పాలంటూ కాబోయే అల్లున్ని గదిలో బంధించి...)
రెడిట్‌లో పోస్ట్ చేసిన స్క్రీన్ షాట్స్‌లో బాస్ తన బార్ అటెండర్‌కి ఉదయం 2.59 గంటలకు మెసేజ్ చేస్తాడు. ఏమని అంటే.. ‘‘రేపు ఓ ఈవెంట్ ఉంది.. డ్యూటీలో ఒక్కడే బార్ అటెండర్ ఉన్నాడు. కనుక నీవు రేపు ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు అతడు డ్యూటీ చేయాల్సి ఉందని’’ తెలుపుతాడు. అందుకు సదరు ఉద్యోగి నిరాకరిస్తాడు. రేపు నాకు ఆఫ్ అని తెలుపుతాడు. కానీ తప్పనిసరిగా రావాల్సిందిగా కోరతాడు బాస్.
అందుకు ఆ ఉద్యోగి ‘‘రేపు ఉదయం డ్యూటీకి రావాలని.. మీరు తెల్లవారుజామున 3 గంటలకు నాకు మెసేజ్ చేశారు. ముందు చెప్పలేదు. రేపు వీక్లీ ఆఫ్ కదా అని నేను ఈ రోజు ఎక్కువ డ్రింక్ చేశాను. రేపంతా నాకు హ్యాంగోవర్ ఉంటుంది.. నేను 11 గంటల పాటు డ్యూటీ చేయలేను’’ అని రిప్లై ఇస్తాడు.
(చదవండి: కొడుక్కి ఎంతైనా ఇస్తా.. కూతురికి ఇవ్వను!)
అందుకు బాస్ ‘‘నీవు డ్యూటీ చేయడానికి సిద్ధంగా ఉండాల్సిందే. పైగా ఎక్కువ తాగడం మంచిది కాదు. కొన్ని అనుకోని పరిస్థితులకు మనం అప్పటికప్పుడే సిద్ధపడి.. వాటిని పూర్తి చేయాలి. ఒకరికొకరం మద్దతుగా ఉండాలి’’ అని మెసేజ్ చేస్తాడు. అప్పటికే సదరు ఉద్యోగికి చిర్రెత్తుకొస్తుంది. ఇక ఏమాత్రం మోహమాటపడకుండా బాస్‌ని దులిపిపారేస్తాడు.
‘‘వీక్లీ ఆఫ్ రోజు నేను ఎంత తాగాలో నీవు నాకు చెప్తావా.. వీక్లీ ఆఫ్ రోజు తినొద్దని చెఫ్‌కి చెప్పగలవా.. నువ్వు కరెక్ట్ టైమ్‌లో నాకు ఈ మెసేజ్ చేస్తే అప్పుడు నేను ఆలోచించేవాడిని. ఇంత లేట్‌గా చెప్పడమే కాక నేను ఎంత తాగాలో నువ్వు డిసైడ్ చేస్తున్నావ్’’ అంటూ ఉద్యోగి ఘాటుగా రిప్లై ఇస్తాడు.
(చదవండి: షాకింగ్: భార్య ప్రేమను అమ్మకానికి పెట్టి మరీ..)
అందుకు బాస్ ‘‘నువ్వు ఆటిట్యూడ్ చూపిస్తున్నావ్. దీని గురించి మనం తర్వాత చర్చిద్దాం’’ అంటాడు. అందుకా ఉద్యోగి.. ‘‘మనం చర్చించాల్సిన అవసరం లేదు. బార్ అటెండర్‌లకి చాలా అవకాశాలు ఉన్నాయి. నేను ఉద్యోగం మానేస్తున్నారు. నీతో నేను విసిగిపోయాను. గుడ్‌బై’’ అంటాడు. అప్పుడు బాస్.. ‘‘నీ నిర్ణయం సరైంది కాదు. ఉదయం లేచాకా నీవు దీని గురించి బాధపడతావ్’’ అని హెచ్చరిస్తాడు.
కానీ సదరు ఉద్యోగి మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోడు. ఇక వీరిద్దరి సంభాషణ చాలా ఫన్నీగా ఉండటంతో నెటిజనులను తెగ ఆకట్టుకొంటుంది. మా బాస్ కూడా ఇలానే సతాయిస్తాడు.. కానీ ఏం చేయలేకపోతున్నాం.. నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు.
Comments
Please login to add a commentAdd a comment