drink
-
టెకీలా తయారీ కంపెనీ స్థాపించిన యువరాజ్ సింగ్
భారత మాజీ క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ అల్ట్రా ప్రీమియం బ్రాండ్ ఫినో టెకీలాను ప్రారంభించారు. దాంతో లగ్జరీ స్పిరిట్స్ మార్కెట్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం అమెరికాలో ఈ బ్రాండ్‌ను ఆవిష్కరించారు. 2025 ఏప్రిల్ మధ్య నాటికి భారత మార్కెట్లోకి ప్రవేశించే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.ఫినో టెకీలాఫినో టెకీలా బ్రాండ్ ఉత్పత్తులను మెక్సికోలోని జాలిస్కోలో తయారు చేస్తున్నట్లు చెప్పారు. చికాగోలో బ్రాండ్ ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫినో టెకీలా ప్రపంచంలోని అత్యుత్తమ టెకీలాలను ఉత్పత్తి చేస్తుందని నిర్వాహకులు ధీమా వ్యక్తం చేశారు. యువరాజ్ సింగ్ కెరీర్ వ్యక్తిగత జీవితాన్ని ఆధారంగా చేసుకొని ‘ఫెయిల్యూర్ ఈజ్ నాట్ యాన్ ఆప్షన్’ అనే క్యాప్షన్‌తో బ్రాండ్ ఏర్పడినట్లు పేర్కొన్నారు. ఖనిజాలు అధికంగా ఉండే మట్టిలోని 100% ‘బ్లూ అగావ్(టెకీలా ముడి పదార్థం)’ నుంచి ఫినో టెకీలా తయారవుతుందని చెప్పారు. ఫినోలోని నాయకత్వ బృందంలో చీఫ్ ప్రొడక్ట్ ఎక్సలెన్స్ ఆఫీసర్‌గా జానా అయ్యర్, చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్‌గా సోనాలి పటేల్ ఉన్నారు. హెల్త్‌కేర్, వ్యాపార రంగంలో తమ నైపుణ్యాలతో బ్రాండ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తారని కంపెనీ అధికారులు చెప్పారు.ఇదీ చదవండి: భానుడి ప్రతాపం.. జనవరి 2025లో రికార్డు ఉష్ణోగ్రతలుయూఎస్లో బ్రాండ్ ఉత్పత్తులను విజయవంతంగా లాంచ్ చేయడంతోపాటు ఫినో టెకీలా ప్రత్యేక అవుట్ లెట్ల ద్వారా భారత మార్కెట్లోకి ప్రవేశించాలని యోచిస్తోంది. ప్రీమియం స్పిరిట్లను కోరుకునే వినియోగదారులకు కంపెనీ ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలని నిర్ణయించుకున్నారు. అయితే భారత్‌లో ఏప్రిల్ 2025 నాటికి కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించాలని అనుకుంటున్నారు. కానీ దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. -
'డ్రింకర్ సాయి' ట్రైలర్.. బూతులే కాదు, ఎమోషన్స్ కూడా..
యూత్‌ను ప్రధానంగా టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్న చిత్రం 'డ్రింకర్ సాయి' ఇప్పటికే విడుదలైన టీజర్లో ఎక్కువగా బోల్డ్ డైలాగ్స్ ఉండటంతో నెట్టింట తెగ వైరల్ అయింది. అయితే, తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. లవ్ స్టోరీతో పాటు యూత్ ఆలోచించతగిన కొన్ని వాస్తవ సంఘటనలకు దగ్గరగా ఈ చిత్రం ఉండనుంది.ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న 'డ్రింకర్ సాయి' సినిమాకు బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ట్యాగ్ లైన్‌గా ఉంచారు. ఈ మూవీని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్‌పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. డిసెంబర్ 27న ఈ చిత్రం విడుదల కానుంది.డ్రింకర్ సాయి టీజర్‌ను ఇప్పటికే చూసిన ప్రేక్షకుల నుంచి ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే, అందులో కాస్త బూతు డైలాగ్స్ ఉండటంతో కొంతమంది నుంచి వ్యతిరేకత కూడా రావడం జరిగింది. కానీ, ప్రస్తుతం విడుదలైన ట్రైలర్లో కథలోని గ్రిప్పింగ్ను తెలియచేస్తూ ఉంది. ధర్మ, ఐశ్వర్య మధ్య వచ్చే సీన్స్ ఎమోషన్స్‌తో పాటు అందరినీ ఆలోచింపచేసేలా ఉన్నాయి. -
పెరుగు, వేయించిన జీలకర్ర పొడి : 7 ఆరోగ్య ప్రయోజనాలు
ఉదయం నిద్రలేవగానే గోరువెచ్చని నీరు, మధ్యాహ్నం పెరుగు, రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు ఈ మూడూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతారు. పెరుగు అనేది అన్ని వయసులవారికి మంచి చేస్తుంది. ఇందులో ఉండే ప్రొటీన్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ లభిస్తుంది. అయితే మీరు పెరుగుతో వేయించిన జీలకర్రపొడి కలుపుకొని తిన్నారా? తద్వారా అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతుందని మీకు తెలుసా. రండి తెలుసుకుందాం.జీర్ణక్రియకు మంచిదిపెరుగులో ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థనుమంచిది. ఇందులో ఉండే యాంటీబయాటిక్స్ డయేరియా, మలబద్ధకం సమస్యలను దూరం చేస్తాయి. అయితే జీలకర్ర కడుపు నొప్పి, వికారం, అజీర్ణం, అతిసారం, అపానవాయువు మొదలైన వాటిని దూరం చేస్తుంది. సో...పెరుగు ,జీలకర్రను కలిపి రైతా లేదా మజ్జిగ రూపంలో తీసుకుంటే జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా కడుపు ఆరోగ్యంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి కోసంపెరుగులో ప్రోబయోటిక్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా ప్రేగులకు సంబంధించిన అనేక సమస్యలను తొలగిస్తుంది. జీలకర్రలో విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒత్తిడి, రక్తపోటు, గుండెపోటు, వాపు మొదలైన వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. జీలకర్రను పెరుగుతో కలిపి తీసుకుంటే, విటమిన్ సీ పుష్కలంగా అంది, రోగనిరోధక శక్తి బలపడుతుంది.చర్మానికి మెరుపుపెరుగులో జింక్, ఫాస్పరస్, విటమిన్ ఎ మొదలైనవి పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మానికి మెరుపునిచ్చి జిడ్డు చర్మాన్ని కూడా తొలగిస్తాయి. అదే సమయంలో, విటమిన్ ఇ ,యాంటీఆక్సిడెంట్ లక్షణాలు జీలకర్రలో ఉన్నాయి. ఇవి వృద్ధాప్యాన్ని నివారించడంతో పాటు, కేన్సర్, వాపు, ఇన్ఫెక్షన్ మొదలైన వాటి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. విటమిన్ ఏ, ఇ కూడా అంది, అనేక చర్మ సమస్యలనుంచి రక్షిస్తుంది.ఊబకాయానికి పరిష్కారంజీలకర్ర తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. అధిక కొవ్వు మరియు కొలెస్ట్రాల్ ఉన్నవారు వేయించిన జీలకర్రను తీసుకుంటే, సమస్య తొలగిపోతుంది. అలాగే స్థూలకాయాన్ని తొలగించడానికి పెరుగు కూడా మంచి ఎంపిక. శరీరం నుండి అదనపు కొవ్వును తొలగిస్తుంది. రక్తపోటు సమస్యతోనూ పోరాడుతుంది. పెరుగులో ఒక చెంచా వేయించిన జీలకర్ర కలిపి ప్రతిరోజూ తింటే బరువు సులభంగా తగ్గుతారు.ఆకలిని పెంచుతుందిపెరుగు ,జీలకర్ర వాడకం ఆకలిని పెంచుతుంది. యోగా, జిమ్, శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసే వారికి ఇది చాలామంది. బాడీబిల్డింగ్ చేసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. సన్నగా ఉన్నవారు పెరుగు, జీలకర్ర వాడితే ఆకలి పెరుగుతుంది. కాస్త ఒళ్లు చేస్తారు.కంటి ఆరోగ్యానికిపెరుగులో,జీలకర్రలో నూ విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. పెరుగు, జీలకర్రను కలిపి తీసుకుంటే, విటమిన్ ఎ లోపాన్ని తీరుస్తుంది. విటమిన్ ఏ కంటికి చాలా ముంచిది.డయాబెటిక్ రోగులకుడయాబెటిక్ రోగులకు డయాబెటిస్ సమస్యతో బాధ పడేవారు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అలాగే గుండె మంటను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. -
నాజూగ్గా ఉండాలనుకుంటే..మొరింగ నీటిని ట్రై చేయండి..!
బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు. అద్భుతమైన డిటాక్స్ డ్రింక్ అయిన ఈ మొరింగ వాటర్‌ని తప్పక ట్రై చేయండి. ఇది సన్నగా, నాజుగ్గా ఉండేలా చేయడంలో కీలకపాత్ర పోషిస్తుందని చెబుతున్నారు నిపుణులు. బరువు తగ్గేలా చేయడంలో అద్భుతంగా పనిచేస్తుందని చెబుతున్నారు. అందెలాగంటే..నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH) ప్రకారం..మొరింగ పౌడర్ 12% ఫైబర్‌ని అందిస్తుంది. ఇది మిమ్మల్ని నిండుగా ఉన్న ఫీల్‌ని కలిగిస్తుంది. ఆకలి కోరికను నియంత్రిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ కారణంగా మొరింగ మంచి జీవక్రియను ప్రోత్సహిస్తుంది. మలబద్దకం, ఉబ్బరం, వంటి సమస్యలను దూరం చేస్తుంది. త్వరితగతిన జీర్ణం అయ్యేలా చేస్తుంది. ఇది ముఖ్యంగా ఆకలిని ఆరికట్టడంలో సహాయపడుతుంది. డైట్ ప్లాన్‌కు కట్టుబడి ఉండేలా చేస్తుంది.ఇది మంచి మెటబాలిజం బూస్టర్. జీవక్రియను పెంచి వేగవంతంగా బరువు తగ్గేలా చేస్తుంది. కేలరీను వేగవంతంగా కరిగించడంలో సహాయపడుతుంది. అంతేగాదు ఎన్ఐహెచ్ ఎలుకలపై చేసిన అధ్యయనంలో మొరింగ పౌడర్ జీవక్రియను మెరుగుపరుస్తుందని వెల్లడయ్యింది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ ఫ్రీ రాడికల్స్ శరీరం ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఎలా తయరు చేస్తారంటే..మొరింగ అంటే మునగాకులు. వీటి పౌడర్‌నే మొరింగ పౌడర్ అని పిలుస్తారు. రెండు గ్లాసుల నీటిలో ఒక స్పూన్ మొరింగ పౌడర్, కొద్దిగా ఉప్పు వేయాలి. అంతే మొరింగ వాటర్ రెడీ. మంచి ప్రయోజనాలు పొందాలనుకుంటే పరగడుపున ఒక గ్లాస్ తీసుకోవడం మంచిది. మెరుగైన జీర్ణక్రియ కోసం భోజనానికి ముందు లేదా తర్వాత సిప్ చేయండి. మంచి ఫలితాలు పొందాలనుకుంటే గోరు వెచ్చని నీటిలోనే మొరింగ పౌడర్ని వేసుకుని తాగితేనే ఉంటుంది. ఈ మొరింగ నీటిని ఆహారంలో భాగం చేసుకుంటే సహజమైన పద్ధతిలో వేగంగా బరువు తగ్గగలుగుతారని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: దేవుడా..!ఇదేం పిచ్చి..చర్మ సంరక్షణ కోసం..ఏకంగా పక్షి లాలాజలంతో..!) -
సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
ఎండలు చుర్రుమంటున్నాయి. ఒక్కటే దాహం, దాహం అన్నంతగా భగభగమంటోంది వాతావరణం. దీంతో శరీరం హైడ్రేట్‌గా ఉంచేందుకు చల్లటి పానీయాలు, పళ్ల రసాలు వెంట పరిగెడతారు అందరూ. ఐతే చాలామంది కొబ్బరినీళ్లు మంచివని. వాటికే ప్రాధాన్యత ఇస్తారు. అందులోనూ కొబ్బరి నీళ్లు రుచిగా ఉండటమేగాక తక్షణ శక్తిని అందిస్తాయి. అందువల్ల కొబ్బరి బోండాలను తాగేందుకు ఇష్టపడుతుంటారు. అయితే వేసవిలో కొబ్బరి బోండాలను కొనగానే నేరుగా తాగేస్తాం. అలా అస్సలు చేయకూడాదట. నేరుగా కొబ్బరి బొండం నుంచి నీళ్లు తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణలు. అదేంటీ..?నిజానికి ఎండ వేడిలో వస్తూ రోడ్డుపై కొబ్బరి బోండాలు కనిపించగానే హమ్మయ్యా అనుకుని వెంటనే కొబ్బరి బోండాలు కొని నేరుగా తాగేస్తాం. అలా అస్సలు చేయకూడదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. బయటి వాతావరణం వేడిగా ఉంది. ఇక ఈ బోండాలు కూడా ఎంతసేపు ఈ వేడిలోనే ఉన్నాయన్నది తెలియదు. అందువల్ల అలా అస్సలు చెయ్యొద్దని చెబుతున్నారు. ఎందుకంటే వాటిని కుప్పలుగా వేసి విక్రయిస్తుంటారు. అలా చాలా రోజుల నుంచి లేదా చాల సేపటి నుంచి ఎండలో ఉండిపోవడంతో దానిలో ఒక రకమైన ఆకుపచ్చని ఫంగస్ వస్తుందట. అందువల్ల కొబ్బరి బోండాన్ని కొన్న వెంటనే నేరుగా స్ట్రా వేసుకుని తాగేయ్యకుండా..ఓ పారదర్శకమైన గాజు గ్లాస్లో వేయించుకుని తాగాలని అంటున్నారు. అందులో నీరు స్పష్టంగా, ఎలాంటి చెడు వాసన లేదని నిర్థారించుకుని తాగడం అనేది ముఖ్యం అంది. ఎందుకంటే ఈ ఎండల ధాటికి ఎలాంటివైనా తొందరగా పాడైపోతాయి. నిల్వ చేయడం కష్టంగా ఉంటుంది. అందువల్ల దాహం అంటూ ఆత్రతగా కొబ్బరి నీళ్లు తాగేయొద్దని సూచిస్తున్నారు. ఈ ఫంగస్ ఎలా వ్యాపిస్తుందంటే..ఆకు పచ్చని ఫంగస్ ఆహార పదార్థాల ఉపరితలాలపై వస్తుంది. అది ఆహార పదార్థాన్ని కుళ్లిపోయేలా చేయడం ద్వారా పోషకాలు పొందుతుంది. ఇది ఎగురుతూ ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తుంది. చాలా కఠినమైన వాతావరణంలో చాలా వేగంగా వృద్ధి చెందుతుంది. తగినంత నీరు, సేంద్రియ పదార్థాలలో ఉన్న పదార్థాలపై ఇది పెరగడం ప్రారంభించి, నెమ్మదిగా మొత్తం వ్యాప్తి చెందుతుంది. ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు..తీవ్రమైన అలెర్జీ, తుమ్ములు, ఎరుపు లేదా నీటి కళ్లు, చర్మంపై దద్దుర్లు, ముక్కులో దురద, కళ్ల నుంచి నీళ్లు రావడం. దగ్గు, శ్వాస ఆడకపోవడం, తదితర లక్షణాలు ఉంటాయి. ఈ ఫంగస్‌లో హానికరమైన మైకోటాక్సిన్‌లతో నిండి ఉంటాయి. ఇది తీవ్రమైన విషాన్ని కలిగిస్తుంది. కడుపు, మూత్రపిండం, కాలేయం వంటి వాటిల్లో అనేక సమస్యలకు దారితీస్తుంది. ఒక్కోసారి హార్మోన్ల అసమతుల్యతకు దారితీసి క్యాన్సర్ ప్రమాదానికి దారితీస్తుంది. నివారణ..ఆహార పదార్థాలను సరైన విధంగా నిల్వ చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అరికట్టవచ్చు. తాజా పండ్లు, కూరగాయాలను మాత్రమే తీసుకుంటే ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చుచెడిపోయే వస్తువులను ఫ్రిజ్‌లో అస్సలు ఉంచకండిగాలి చొరబడని కంటైనర్లలో ఆహార పదార్థాల్ని నిల్వ చేయాలి.కొన్ని రకాల ఆహార పదార్థాలు ఎంత కాలం సురక్షితంగా ఉంటాయో తెలుసుకుని నిల్వ ఉంచడానికి యత్నించాలి.(చదవండి: నటుడు శ్రేయాస్ తల్పాడేకి గుండెపోటు..ఆ వ్యాక్సినే కారణమా..?) -
ఆజానబాహుడిలా ఉండే బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఫిట్నెస్ రహస్యం ఇదే!
బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూడాటానికి ఆజానుబాహుడిలా యువ హీరోలకి తీసిపోని బాడీ ఫిజిక్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తాడు. చూడటానికి అమ్మాయిల కలల రాకుమారుడిలా ఉంటాడు. ఇప్పటికీ సినిమాల్లో షర్ట్ తీసేసి మంచి దేహదారుఢ్యంతో కనిపిస్తాడు. ఐదుపదుల వయసొచ్చిన అదే ఫిజిక్‌ని మెయింటెయిన్ చేస్తాడు. చాలామంది హీరోలు యంగ్ హీరోలా లుక్ మెయింటెయిన్ చేసినా.. యువకుడి మాదిరి కండలు తిరిగిన దేహం మెయింటెయిన్ చేయడం కుదరదు. అందుకే చాలామంది పెద్ద హీరోలు ఓ ఏజ్ తర్వాత షర్ట్ తీసి కెమెరా ముందుకు రారు. కానీ జాన్ అబ్రహం అలా కాదు. దర్శకులు సైతం అతని బాడీ ఫీగర్ సినిమాలో కచ్చితంగా కనిపించేలా చూసుకుంటారు. అంతలా జాన్ అబ్రహం తన ఫిజిక్‌ని మెయింటెయిన్ చేస్తాడు. బ్రిటిష్-పాకిస్తానీ నటుడు అలీఖాన్ జాన్ అబ్రహంతో కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ.. అతడి ఫిట్నెస్ సీక్రెట్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. జాన్ తన శరీరాకృతి కారణంగానే హీరోగా నిలదొక్కుకున్నాడా అని ఓ ఇంటర్యూలో యాంకర్ ప్రశ్నించగా..అందుకు అలీ ప్రతిభ లేకుండా ఇంతకాలం సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం జాన్ అబ్రహం వయసు 51 అయినా..ఈ వయసులో కూడా చొక్కా లేకుండానే సినిమాల్లో కనిపిస్తుంటాడని అలీ సతీమణి చాందిని నవ్వుతూ చెప్పారు. అందుకు అతడు అనుసరించే కఠిన జీవనశైలేనని అన్నారు. జాన్ 25 ఏళ్లుగా అస్సలు చక్కెర రుచే చూడలేదని చెప్పారు. చక్కెరకు ప్రత్యామ్నయాలను మాత్రమే తీసుకుంటాడని చెప్పారు. అలాగే మద్యం, సిగరెట్ వంటి వాటిని సరదాకి కూడా ట్రై చేయలేదని, అదే అతడి బాడీ ఫిట్నెస్ సీక్రెట్ అని ఆమె చెప్పుకొచ్చారు. బాలీవుడ్ హీరోలలో మంచి శరీరాకృతికి పేరుగాంచినవాడు జాన్. ఇక జాన్ శిల్పాశెట్టితో కలిసి ఒక షోలో సందడి చేశారు. ఆ షోలో తన లైఫ్ స్టయిల్‌కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు జాన్. తాను రైతు మాదిరిగా జీవించేందుకు ఇష్టపడతానని అన్నారు. ముఖ్యంగా తాను తీసుకునే ఆహారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ఫిటెనెస్ మెయిటెయిన్ చేయడం అనేది ప్రధానంగా మూడింటి మీద ఆధారపడి ఉంటుందని, అందులో ఒకటి ఆహారం, వ్యాయామం, చివరిగా నిద్ర అని చెప్పుకొచ్చారు జాన్. వాటిలో ఏది సరిగా లేకపోయినా.. మంచి ఫిట్నెస్ మెయింటెయిన్ చేయడం అనేది సాధ్యం కాదని అన్నారు. అలాగే తాను ప్రతిరోజు ఉదయం 4.30 గంటల కల్లా నిద్ర లేస్తానని, పైగా తనకెంతో ఇష్టమైన కాజు కల్తీ డెజర్ట్‌ని మూడు దశాబ్దలకు పైగా రుచి చూడకుండా నోటిని అదుపులో ఉంచినట్లు తెలిపారు. తన వద్ద ఎలాంటి ఎరేటెడ్ డ్రింక్స్ కూడా ఉండవని, తన దృష్టిలో చక్కెర అనేది అతిపెద్ద విషం అని ప్రగాఢంగా నమ్ముతానని చెప్పుకొచ్చాడు జాన్. అంతేగాదు సిగరెట్ కంటే పాయిజన్ చక్కెరే అని జాన్ చెబుతున్నాడు. ఎంతటి సెలబ్రిటీలైన ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కఠినమైన ఆహార నియమాలు పాటించాల్సిందే. అది కూడా వాళ్లు ఆరోగ్యకరమైన రీతిలో ఫాలో అయ్యి అందరికీ ఆదర్శంగా నిలవడం విశేషం. మనం కనీసం వారిలా కాకపోయినా ఆరోగ్యంగా ఉండేందుకైనా మంచి జీవనశైలిని పాటించేందుకు యత్నించడం బెటర్ కదూ..!(చదవండి: ఐస్‌క్రీమ్‌తో బరువు తగ్గొచ్చా?: దీపికా పదుకొనే ఫిట్నెస్ ట్రైనర్) -
వేసవిలో కొబ్బరి నీళ్లు మంచివని తాగేస్తున్నారా?ఐతే వాళ్లు మాత్రం..
వేసవిలో కొబ్బరి నీళ్లుకు మించిన డ్రింక్ లేదని చాలామంది దీనికే ప్రాధాన్యత ఇస్తారు. అందులోనూ ఈ కాలంలోని ఎండల తాపం నుంచి బయటడేందుకు కొబ్బరిబోండాలే తోడ్పడతాయి. ఇది దాహార్తిని తీర్చడమే గాక వడదెబ్బ నుంచి రక్షిస్తుంది. పైగా ఆరోగ్యానికి మంచిది. చర్మానికి మంచి నిగారింపును కూడా ఇస్తుంది. ఈ కొబ్బరి నీటితో ముఖం కడుక్కుంటే కాంతివంతంగా కనిపిస్తుంది. అన్ని ప్రయోజనాలు ఉన్న ఈ కొబ్బరినీళ్లు వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అలాంటి వాళ్లు అస్సలు తాగొద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కొబ్బరి నీళ్ల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా బరువుని అదుపులో ఉంచుతుంది. కడుపులో మంటను తగ్గిస్తుంది. శరీరానికి చలువ చేస్తుంది కూడా. అలాంటి కొబ్బరి నీళ్లను అతిగా తీసుకుంటే మాత్రం చాలా నష్టాలను ఫేస్ చేయాల్సిందే. ఈ కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అలా అని అతిగా తాగారో అంతే దుష్ప్రభావాలు ఉంటాయిని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటంటే.. పక్షవాతం.. కొబ్బరి నీళ్లలో సోడియం, పొటాషియం మరియు మాంగనీస్ వంటి ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. అందుకే కొబ్బరినీళ్లను పరిమితంగా తీసుకంటే బాడీకి చాలా మంచిది. కానీ దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో పొటాషియం పరిమాణం పెరిగి.. పక్షవాతానికి గురయ్యే అవకాశం ఉంది. అతిసారం.. కొబ్బరి నీళ్లలో మోనోశాకరైడ్లు, పులియబెట్టే ఒలిగోశాకరైడ్లు మరియు పాలియోల్స్ ఉంటాయి. ఇవి షార్ట్ చైన్ కార్బోహైడ్రేట్లు. శరీరంలో ఈ మూలకాల పరిమాణం పెరిగితే... అవి బాడీ నుండి నీటిని పీల్చుకోవడం ప్రారంభిస్తాయి, దీని కారణంగా విరేచనాలు, వాంతులు, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి కొబ్బరి నీళ్లను రోజూ తాగడం మానేసి అప్పుడప్పుడు మాత్రమే తీసుకోండి. లో బీపీ రావచ్చు కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని ఎక్కువగా తాగడం వల్ల బీపీ పడిపోయే అవకాశం ఉంది. దీని వల్ల బాధితుడి ప్రాణం ప్రమాదంలో పడుతుంది. అలాంటి వాళ్లు.. మధుమేహం ఉన్నవారు కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగకూడదు. ఇది చక్కెర మరియు అధిక కేలరీలను కలిగి ఉంటుంది, దీని కారణంగా శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అమితు వీటిలో ఆర్టిఫిషియల్ స్వీట్ కాంపౌండ్స్ లేకపోయినా, కొబ్బరి నీళ్లలో చాలా కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నవారికి ఇది సమస్యగా మారుతుంది. కాబట్టి, రక్తంలో చక్కెర ఎక్కువగా ఉంటే, కొబ్బరి నీళ్లు చాలా మితంగా తాగాలి. బ్లడ్ షుగర్ మందులు తీసుకునేవారికి డేంజర్. అలాగే రక్తపోటుకు సంబంధించి మందులు తీసుకుంటుంటే, కొబ్బరి నీళ్లకు వీలైనంత దూరంగా ఉండాలి. ఈ వ్యాధు ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగాలనుకుంటే వైద్యుడిని సంప్రదించి తీసుకోవడం మంచిది. గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. అనుసరించాలనుకుంటే మాత్రం వైద్యులను మీ వ్యక్తిగత ఆరోగ్య నిపుణుల సలహాలు, సూచనలు మేరకు అనుసరించడం ఉత్తమం. (చదవండి: కట్టెల పొయ్యి, బొగ్గుల మీద చేసిన వంటకాలు తినకూడదా?) -
భోపాల్‌లో హైదరాబాద్ షర్బత్.. క్యూ కడుతున్న జనం!
వేసవిలో ఎండవేడిమి నుంచి ఉపశమనానికి చల్లని ఐస్ క్రీం లేదా ఏదైనా పానీయాన్ని తాగాలని ఎవరైనా అనుకుంటారు. హైదరాబాద్‌లో ఆదరణ పొందిన తహురా పానీయం ఇటీవలే మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోకి ప్రవేశించింది. ముగ్గురు స్నేహితులు ఈ శీతల పానీయ విక్రయాలను భోపాల్‌లో ప్రారంభించారు. హైదరాబాద్‌లో రంజాన్ సందర్భంగా ఈ పానీయానికి మంచి డిమాండ్ ఉంటుంది. అయితే వేసవి ఉపశమనానికి ఈ షర్బత్ మ్యాజిక్‌లా పనిచేస్తుందని పలువురు అంటుంటారు. డ్రై ఫ్రూట్స్, పాలతో తయారు చేసే ఈ షర్బత్‌ను భోపాల్ ప్రజలు ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఈ శీతలపానీయాల దుకాణం ప్రారంభించిన నాలుగైదు రోజుల్లోనే ఈ షర్బత్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. భోపాల్‌లోని మోతీ మసీదు కూడలిలో తహురా పేరుతో ఒక దుకాణాన్ని ఈ ప్రాంతానికి చెందిన ఫరూక్ షేక్, జునైద్ అలీ షేక్, జైన్ ఖాన్ ప్రారంభించారు. మహారాష్ట్రంలోని పూణేలో వీరు ఈ షర్బత్‌ను రుచి చూశాక భోపాల్‌లో ఈ పానీయాన్ని విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఈ షర్బత్‌ను ఫరూఖ్, అతని స్నేహితులు స్వయంగా తయారు చేస్తారు. వీరి దుకాణం సాయంత్రం 5 నుండి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది. బాదం, పిస్తా, పాలతో తయారు చేసే ఈ పానీయంలో చక్కెరను అస్సలు ఉపయోగించరు. ఇది వేసవిలో శరీరానికి చల్లదనాన్ని అందిస్తుందని చాలామంది చెబుతుంటారు. ఈ పానీయాన్ని తాగేందుకు జనం ‘తహురా’ దుకాణం ముందు క్యూ కడుతుంటారు. -
సమ్మర్లో చల్లటి బాదం పాలు ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
అప్పుడే వేసవికాలం వచ్చేసిందా అన్నంతగా మార్చి నుంచి ఎండ దంచి కొడుతోంది. బయట సూర్యుడి భగ భగలు ఎక్కువైపోతున్నాయి. ఈ ఎండకు చెమటలు పట్టేసి అలిసి సొమ్మసిల్లిపోతుంటా. ఈ కాలంలో ఎక్కువగా చల్లగా ఉండే పానీయాలే తాగేందుకు ఇష్టపడతాం. అలా అని కూల్‌డ్రింక్‌లు తాగితే అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదు. పైగా వాటిలో అధికంగా చక్కెర పరిమాణం ఉంటుంది. అందువల్లో ఇంట్లోనే హెల్తీగా ఉండే బాదం పాలు చలచల్లగా చేసుకోండి. ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ సమ్మర్లో మంచి దాహార్తిని తీర్చే బలవర్థకమైన పానీయం కూడా.రీ బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలంటే.. కావలసిన పదార్థాలు: బాదం పప్పులు- ఒక కప్పు (ఎక్కువ పరిమాణంలో కావాలి అంటే.. ఎక్కువ తీసుకోవచ్చు) జీడిపప్పు- ఒక కప్పు చక్కర – 100 గ్రాములు.. ఎక్కువ తీపి కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. యాలకుల పొడి -ఒక స్పూన్.. రుచి మరింతగా కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. పాలు – అర లీటర్..(ఒకవేళ ఎక్కువ పాలు కావాలనుకుంటే మరిన్ని ఎక్కువ తీసుకోవచ్చు) తయారీ విధానం.. బాదంపప్పులను, జీడిపప్పులను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. మరో గిన్నెలో వెన్న తీయని పాలను వేడి చేసుకోవాలి. అలా వేడిగా ఉన్న పాలలో యాలకుల పొడి, చక్కర వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత పోటీ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు పొడిని అందులో కలపాలి. అనంతరం చిన్న మంట మీద పది నుంచి 15 నిమిషాలు ఆ పాలను మరగనివ్వాలి. ఆ తర్వాత పాలను దింపి చల్లారపెట్టాలి. అనంతరం ఆ పాలను గ్లాసుల్లో పోసుకొని.. పైన సన్నగా కట్ చేసుకున్న బాదాం, జీడిపప్పు, కిస్మిస్ మొక్కలు వేసి కొద్దిసేపు అలా ఫ్రిజ్‌లో పెట్టాలి. ఒక అర్థగంట లేద గంట తర్వాత బయటకు తీస్తే చల్ల చల్లని బాదంపాలు సిద్ధంగా ఉంటాయి. అల వాటిని ఆస్వాదించుకుంటూ తాగొచ్చు. ఇలా పాలను రోజు పిల్లలకు తాగిస్తే ఎండాకాలం ఆరోగ్యంగా ఉంటారు. బయట తాగే బాదం పాలకంటే.. ఇంట్లో తయారు చేసుకునే బాదంపాలే ఆరోగ్యానికి మంచిది కూడా. బాదం పాలలో మంచి ఫైబర్ ఉంటుంది. జీడిపప్పులో కావాల్సినన్ని మంచి కొవ్వులు ఉంటాయి. ఇవి చెడు కొవ్వులు తగ్గిస్తాయి. బరువులు తగ్గించడంలో సహకరిస్తాయి. బాదంపప్పులను రోజు ఉదయం లేవగానే తింటే మెదడు పనితీరు బాగుంటుంది. బాదంలోని క్యాల్షియం ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుంది. పిల్లలు ఏకాగ్రతను పెంచుతుంది. ఈ బాదంపాలు తాగేందుకు టేస్టీగా ఉండటంతో పిల్లలు కూడా భలే ఇష్టంగా తాగుతుంటారు. (చదవండి: నటి ఒలివియాకి బ్రెస్ట్ కేన్సర్! ఏకంగా నాలుగు సర్జరీలు..!) -
హోటల్‌కు వచ్చిన మహిళకు చేదు అనుభవం
అమెరికాకు చెందిన ఒక గమ్మత్తయిన వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాలిఫోర్నియాలోని రిట్జ్-కార్ల్టన్ హోటల్లో పనిచేసే ఓ ఉద్యోగి అదే హోటల్లో బస చేసేందుకు వచ్చిన ఒక మహిళకు వీర్యం కలిపిన నీటిని ఇచ్చాడు. ఆమె ఆ నీటిని తాగినప్పుడు, ఆ రుచి కొత్తగా అనిపించింది. దీంతో ఆమెకు అనుమానం వచ్చింది. ఈ నేపధ్యంలో ఆమె ఆ హోటల్ ఉద్యోగి తనను లైంగికంగా వేధించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మహిళ ఫిర్యాదు మేరకు ఆ నీటికి ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించగా, అందులో వీర్యం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ మహిళ, ఆమె భర్త సదరు హోటల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హోటల్ ఉద్యోగి తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. నిందితునిపై తక్షణంచర్యలు చేపట్టి, హోటల్ యాజమాన్యం నుంచి తనకు నష్టపరిహారం ఇప్పించాలని ఆమె కోరుతోంది. జేన్, జాన్ డో దంపతులు తమ కుమార్తె పుట్టినరోజును జరుపుకోవడానికి ఒక హోటల్‌కి వెళ్లారు. రిట్జ్-కార్ల్టన్ హోటల్లో తనకు ఫైవ్ స్టార్ హోటల్ తరహా స్వాగతం లభించిందని జేన్ తెలిపింది. అనంతరం హోటల్ ఫ్రంట్ డెస్క్ నుంచి ఆమె వాటర్ బాటిల్ ఆర్డర్ చేసింది. దీంతో ఒక మగ ఉద్యోగి ఐదు వాటర్ బాటిళ్లను వారి గదిలోకి తెచ్చి, వారికి ఇచ్చి వెళ్లిపోయాడు. తరువాత వారంతా నిద్రపోయారు. అర్ధరాత్రి దాహం వేయడంతో ఆమె ఆ బాటిల్లోని నీటిని తాగింది. అయితే ఈ నీటి రుచి కొత్తగా అనిపించడంతో ఆమె భర్తను నిద్ర నుంచి లేపి, విషయం చెప్పింది. దీంతో వారు ఈ విషయమై ముందుగా హోటల్ యాజమాన్యానికి, తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ హోటల్ ఉద్యోగి ఇచ్చిన నీటిని పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపారు. ఈ నీటిలో వీర్యం కలిసిందని నిర్థారణ అయ్యింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఆ మహిళ తరపు న్యాయవాది మాట్లాడుతూ ఈ అకృత్యానికి పాల్పడిన హోటల్ ఉద్యోగిపై ఇంకా చర్యలు తీసుకోలేదని, అతనికి త్వరగా శిక్ష పడకపోతే ఇలాంటి పనులను కొనసాగిస్తాడని అన్నారు. ఇది కూడా చదవండి: కాలు జారిన మోడల్.. షూ కంపెనీదే తప్పంటోంది! -
వరుసగా 7 రోజులు ‘తాగితే’ మద్యం అలవాటుగా మారిపోతుందా?
మద్యం, జూదం అనేవి వ్యసనాలని, ఇవి ఎవరికైనా ఒకసారి అలవడితే వారు వాటిని జీవితంలో విడిచిపెట్టలేరని చాలామంది అంటుంటారు. ఇవి వ్యవసంగా మారితే వారి జీవితాలను ఎవరూ బాగుచేయలేని కూడా చెబుతుంటారు. మనిషికి మద్యం ఎలా అలవడుతుంది? ఏ మేరకు మద్యం తాగితే అది అలవాటుగా మారిపోతుంది. కొందరు చెబుతున్నట్లు వరుసగా 7 రోజులు మద్యం తాగితే అది అలవాటుగా మారిపోతుందా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం మద్యం అలవాటు అనేది ఒక క్రానిక్ డిసీజ్. మద్యం అలవాటు అనేది మూడు దశలుగా ఏర్పడుతుంది. మొదటి దశలో మద్యం తాగేవారు అది వారికి తెలియకుండానే అలవాటుగా మారిపోతుందని గ్రహించలేరు. ఈ దశలో మద్యం తాగే వ్యక్తి దానిని అధికమోతాదులో తీసుకుంటాడు. మద్యం తాగడంపై నియంత్రణ కోల్పోతాడు. ఇక్కడి నుంచే అతను తప్పు చేయడం మొదలుపెడతాడు. ఇక వరుసగా 7 రోజులు మద్యం తాగితే అది అలవాటుగా మారిపోతుందా అనే విషయానికి వస్తే దీనికి స్పష్టమైన రుజువులు లభ్యం కాలేదని నిపుణులు చెబుతున్నారు. అయితే వరుసగా ఏడు రోజుల పాటు మద్యం తాగితే, అలాగే అది అధిక మోతాదులో ఉంటే తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక మద్యం తాగడంలోని రెండవ దశ విషయానికొస్తే ఆ సమయంలో శరీరంలో అంతర్గతంగా మార్పులు వస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ దశలో సమాజంలోని తోటివారు మద్యం తాగేవారిని అవహేళన చేయడం కనిపిస్తుంది. ఇక చివరిదశ విషయానికొస్తే మద్యం తాగేవారు పూర్తిగా తమపై నియంత్రణ కోల్పోతారు. అదే సమయంలో శరీరాన్ని పలు వ్యాధులు చుట్టుముడతాయి. ఏ పనీ సరిగా చేయలేని స్థితికి చేరుకుంటాడు. శరీరం బలహీనమవుతుంది. ఇది కూడా చదవండి: నిండు గర్భిణిని నేరస్తురాలిని చేసిన ఏఐ.. మున్ముందు ఎన్ని ఘోరాలు చూడాలో? -
దారుణం: 'మీ పైసలు తియ్యలే..!' మూత్రం తాగించి.. మిరపకాయలతో..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ నగర్లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేశారనే అనుమానంతో ఇద్దరు బాలరను బలవంతంగా యూరిన్ తాగిస్తూ, వారి ప్రైవేటు భాగాల్లో పచ్చి మిరపకాయలను రుద్దారు దుండగులు. జిల్లాలోని పత్రా బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంకటి చౌరాహా ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు యువకులను తాడుతో కట్టేశారు. వారి వయస్సు 10 నుంచి 15 ఏళ్ల మధ్య ఉంటుంది. బాటిళ్లలో నింపిన యూరిన్‌ను బలవంతంగా పిల్లలచే తాగించారు. బూతులు తిడుతూ పచ్చి మిరపకాయలను వారి ప్రైవేట్ శరీర భాగాల్లో రుద్దారు. పసుపు రంగులో ఉండే ఏదో ద్రావణాన్ని కూడా బాధితుల శరీరంలోకి ఎక్కించినట్లు వీడియోలో చూపబడిందని పోలీసులు తెలిపారు. బాధితులు అరుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ పాశవిక ఘటనపై స్పందించిన పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తును చేపట్టారు. నిందితులను గుర్తించినట్లు వెల్లడించారు. ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ సిద్దార్థ తెలిపారు. ఇదీ చదవండి: అవయవ మార్పిడికి దేశంలో 56 వేల మంది వెయిటింగ్ -
కొంబుచా హెల్త్ డ్రింక్! దీని ప్రయోజనాలకు ఫిదా అవ్వాల్సిందే!
కొంబుచా అనేది టీ, ఈస్ట్, బ్యాక్టీరియా, చక్కెరతో కలిసి తయారు చేసే పానీయం. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే కొత్తరకం డ్రింక్. మధుమేహం వ్యక్తులకు ఇది చక్కటి దివ్యౌషధం. ఇది అందించే ఆరోగ్య ప్రయోజనాలను చూసి పరిశోధకులు సైతం ఫిదా అయ్యారు. ఇంతకీ కొంబుచా అంటే ఏమిటి? దీన్ని ఎవరూ తయారు చేశారు?..అంటే.. ఈ డ్రింక్ రెండు వేల ఏళ్లక్రితం నాటిది. తొలిసారిగా చైనాలో తయారు చేశారు. ఆ తర్వాత దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి జపాన్, రష్యా దేశాలకు పాకింది. 20వ శతాబ్దంలో యూరోపియన్ దేశాలతో సహా అమెరికాలో కూడా దీనికి విశేష ప్రజాధరణ లభించింది. ఇందులో ప్రాథమిక పదార్థాలు ఈస్ట్, చక్కెర, బ్లాక్ టీ. వీటన్నింట్ల మిశ్రమాన్ని ఒక వారం పాటు నిల్వ ఉంచగా పులియబెట్టిన ఒక ఆమ్లం తయారవుతుంది. ఈ ప్రక్రియను కిణ్వణ ప్రక్రియ అంటారు. డ్రింక్ ఎలా తయారు చేస్తారంటే.. కొంబుచా టీని వివిధ మార్గాల్లో తయారు చేస్తారు, అయితే కొంబుచా తయారీలో ఉపయోగించే కొన్ని ప్రాథమిక పదార్థాలు ఈస్ట్, చక్కెర, బ్లాక్ టీ. వీటన్నింటి మిశ్రమాన్ని కొన్ని వారాల పాటు పులియబెట్టేందుకు అలా వదిలేస్తారు. దీన్ని కిణ్వన ప్రక్రియ అంటారు. దీనిలో ఉండే ఈస్ట్, బ్యాక్టీరియా కొన్ని రకాలు ఆమ్లాలు విడుదల అయ్యి పైన ఒక పొరలాంటిది ఏర్పడుతుంది. ఈ పొరను పక్కకు ఉంచి అందులో ఉన్న పానీయాన్ని సేవిస్తారు. ఈ పొరనే కొంబుచా అంటారు దీన్ని పక్కకు ఉంచుకుని దీని సాయంతో డ్రింక్ తయారు చేసుకుంటారు. ఇది తియ్యటి ఆల్కహాల్ మాదిరి ఉంటుంది. ఇందులో ఆల్కహాల్ కంటెంట్ చాలా తక్కువుగా ఉంటుంది. డైలీ డ్రింక్ తయారీ విధానం: పెద్ద గాజు సీసా తీసుకోండి. ఒకటిన్నర కప్పుల చక్కెరను రెండు కప్పుల నీటిలో వేసి స్టవ్ మీద పెట్టాలి. చక్కెర బాగా కరిగాక రెండు టేబుల స్పూన్ల బ్లాక్ టీ వేసి పది నిమిషాలు మరగనివ్వాలి. ఆ తర్వాత అందులో ఆఫ్ కప్ వెనిగర్ వేయాలి. ఈ నీటిని మనం పైన చెప్పనట్లుగా తయారు చేసకుని పక్కకు పెట్టుకున్న కొంబుచా పొరలో వేసేసి అలా సుమారు 15 నుంచి 20 రోజు చల్లని పొడి ప్రదేశంలో ఉంచండి. దీన్ని ఎంత ఎక్కువ సేపు నిల్వ ఉంచితే అంత తియ్యగా రుచిగా ఉండే కొంబుచా డ్రింక్ తయారవుతుంది. ఆరోగ్య ప్రయోజనాలు.. ఈ కొంబుచాలో ఉండే బ్యాక్టీరియా రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. టైప్2 డయాబెటీస్ పేషంట్లకు చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. ఈ కొంబుచా డ్రింక్ జీర్ణక్రియ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంచుతుంది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. పులియబెట్టిన డ్రింక్ కావడం చేత క్యాన్సని క్యూర్ అయ్యేలా చేస్తుంది అలాగే ఎయిడ్స్ పేషంట్లకు వ్యాధి నియంత్రణలో ఉండి మరింతకాలం బతికే అవకాశం ఉంటుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు కణాల పునరుత్పత్తికి సహాయపడటమేగాక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పేగు సంబంధిత అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది. అలాగే జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయం జరిపిన క్లినకల్ ట్రయల్స్‌లో ఈ కొంబుచా డ్రింక్‌ని సేవించిని నాలుగు వారాల తర్వాత ఆయ వ్యక్తుల రక్తంలో సగటున ఉండే గ్లూకోజ్ స్థాయిలు డెసిలీటర్కు 164 నుంచి 116 మిల్లీగ్రాములకు తగ్గినట్లు వెల్లడైంది. ఎలుకలపై జరిపిన అధ్యయనాల్లో కూడా ఇది నిరూపితమైందని అందువల్ల ఇది శరీరానికి తక్షణ రోగ నిరోధక శక్తి అందించడమే గాక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఔషధంగా పేర్కొన్నారు. ఐతే కొందరూ మాత్రం ఇది పూర్తి స్థాయిలో ఆరోగ్యప్రయోజనాలను అందించగలదని నిరూపితమవ్వలేదంటూ వాదించడం గమనార్హం. (చదవండి: ఆ అలవాటే కరోనా అటాక్‌కి ప్రదాన కారణమా! వెలుగులోకి విస్తూపోయే నిజాలు!) -
అభిమానిపై ప్రముఖ ర్యాపర్ ఫైర్.. మైక్ విసిరి.. బూతులు తిడుతూ..
ప్రముఖ ర్యాపర్ కార్జీ బీకి చేదు అనుభవం ఎదురైంది. ఓ మ్యూజిక్ షోలో పాట పాడుతుండగా.. ఓ వ్యక్తి ఆమెపై డ్రింక్ బాటిల్‌ను విసిరాడు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. అతనిపై బూతులు తిడుతూ మైక్‌ను విసిరింది. 'ఐ లైక్ ఇట్' పాటకు మూమెంట్స్ ఇస్తూ వేదికపై కార్డీ బీ ఉత్సాహంగా పాట పాడుతున్నారు. ఈ క్రమంలో స్టేజ్ కింద నుంచి ఓ వ్యక్తి డ్రింక్ బాటిల్‌ను ఆమెపై విసిరాడు. కోపంతో ఊగిపోయిన కార్డీ బీ.. అతనిపై మైక్ విసిరింది. ఈ వీడియోను ర్యాపర్ సోషల్ మీడియాలో పంచుకుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. Jealous Ass Bitch! https://t.co/bPikhCYBYx pic.twitter.com/AUoG7pvtCv — Cardi B | Updates (@updatesofcardi) July 30, 2023 కార్జీ బీ చేసిన పనికి ఆమెను మెచ్చుకున్నారు కొంతమంది నెటిజన్లు. ఫ్యాన్సు అతి చేయకూడదని సూచనలు చేశారు. పర్ఫార్మర్లపై అలా చేస్తే ప్రోగ్రామ్ దెబ్బతింటుందని కామెంట్లు పెట్టారు. ఇందులో కార్జీ బీ చేసిన పనిని నిందించకూడదని అన్నారు. మ్యూజిక్ ప్రోగ్రామ్‌లలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. డ్రేక్, బెబే రెక్ష, కెల్సియా బాలేరిని, అవా మాక్స్‌లకు కూడా ఫ్యాన్స్ నుంచి ఇలాంటి ఇబ్బందులు తలెత్తాయి. ఇదీ చదవండి: కోతి పిల్లను అక్కున చేర్చుకున్న పిల్లి.. ఏదేమైనా మథర్ ఈజ్ గ్రేట్..! వీడియో వైరల్.. -
పాలుతాగావా.. బసవన్నా!
తాండూరు రూరల్: మండల పరిధిలోని కరన్‌కోట్ గ్రామంలోని బసవన్న దేవాలయంలో నందీశ్వరుడు పాలు తాగినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరలయ్యాయి. దీంతో భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కరన్‌కోట్ గ్రామంలోని మెయిన్ బజార్లో పురాతన బసవన్న దేవాలయం ఉంది. గ్రామానికి చెందిన పూజ, స్రవంతి శుక్రవారం ఆలయంలో నైవేద్యం సమరి్పచేందుకు వెళ్లారు. అక్కడే ఉన్న నందీశ్వరుడి విగ్రహానికి పాలుతాపే ప్రయత్నం చేయగా... నిజంగా పాలు మొత్తం తాగినట్లు ఆ మహిళలు గ్రామస్తులకు తెలిపారు. దీంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున నందీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే పురాతన ఆలయం కావడంతో శనివారం ఉదయం ఆలయం ముందు భాగం కూలిపోయింది. ఇదంతా దేవుడి మహిమ అని త్వరలో ఆలయానికి మరమ్మతులు చేపడతామని ఉప సర్పంచ్ హేమంత్‌కుమార్ తెలిపారు. నందీశ్వరుడు పాలు తాగిన విషయం నిజమేనని ఉపసర్పంచ్ కూడా చెప్పారు. బీసీలకు రెండు -
Viral Video: ట్యాప్ తిప్పి దాహం తీర్చుకున్న పక్షి
-
ఆకుపట్టి.. కల్లు తాగిన మంత్రి.. టేస్ట్ సూపరుంది!
సాక్షి, పాలకుర్తి(జనగాం జిల్లా): రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కల్లు తాగారు. కుండతో కల్లు వంచుతుంటే.. మంత్రి ఆకుపట్టి కల్లు సేవించి సురాపానకం టేస్ట్ సూపరుందని గౌడ్‌ను అభినందించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి, అయ్యంగార్‌పల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. సమస్యలు అడిగి తెలుసుకుని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. దారిలో తాటివనం వద్ద గౌడ్ కులస్తులను చూసి కారు ఆపి చెట్ల కిందకు చేరారు మంత్రి. ఈత చెట్టు కింద కూర్చొని నీరాకల్లు సేవించారు. ప్రకృతి సిద్ధమైన ఔషధం నీరా కల్లు అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం గౌడ సంక్షేమానికి నీరాకల్లును ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే నీరా కల్లు ఇచ్చే ఈత చెట్లను అన్ని గ్రామాల్లో పెట్టిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో కొందరు చీడపురుగులు ఉంటారని, చేసింది చెప్పకుండా చేయంది ఏగేసి చెప్పడంతో ప్రజలు అదే నిజమని నమ్ముతారని తెలిపారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత ప్రతి ఒక్కరి బతుకులు బాగుపడ్డాయని, రైతుల కోసం 20 వేల కోట్లు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్‌ను ఎవరైనా విమర్శిస్తే రైతులే సరైన సమాధానం చెప్పాలని కోరారు. చదవండి: మునుగోడు ఫలితాలు.. లెక్క తప్పిందెక్కడ? -
తాగుబోతు స్టాంప్: పురుషులకు 20 ఏళ్లు.. స్త్రీలకు రెండేళ్లే!
మద్యపానం విషయంలో ఓ రాజకీయ నేత చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారి తీశాయి. స్తీలు అధికంగా మద్యపానం చేస్తే పిల్లలు పుట్టరంటూ పోలాండ్ పాలక పక్ష నాయకుడు షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. స్త్రీలు డ్రింక్ చేయడం వల్లే జననాల రేటు తక్కువగా ఉంటుందంటూ వ్యాఖ్యానించాడాయన. పోలాండ్ జనాభా తక్కువగా ఉండటానికి కారణం స్త్రీలు అధికంగా మద్యపానం సేవించడమే ప్రధాన కారణమని అన్నారు. 25 ఏళ్లు వయసు ఉన్న స్త్రీలు.. అదే వయసు ఉన్న పురుషుల కంటే ఎక్కువగా డ్రింక్ చేస్తున్నట్లు తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో అసలు పిల్లలు ఉండరన్నారు. పురుషులు తాగుబోతులు అని ముద్ర వేయించుకోవడానికి 20 ఏళ్లు పడితే స్త్రీలకు కేవలం రెండేళ్లు చాలంటూ కామెంట్లు చేశాడు. అంతేగాదు మద్యానికి బానిసైన మగవాళ్లకు చికిత్స అందించి సులభంగా నయం చేయవచ్చు కానీ స్త్రీలను నయంచ చేయలేమని ఇది ఒక వైద్యుడు అనుభవం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆయనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడమే కాకుండా ఇది పితృస్వామ్య రాజ్యమని ప్రూవ్ చేశారంటూ ప్రజలు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. వాస్తవానికి పోలాండ్లోని మహిళలు ఆర్థిక స్థిరత్వం, అబార్షన్ రిస్ట్రిక్షన్స్ దృష్ట్యా పిలలు కనడం పట్ల అంత ఆసక్తి కనబర్చడం లేదనేది ప్రధాన కారణమని నిపుణుల చెబుతున్నారు. (చదవండి: ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కి వెళ్తే ఇలా ఉంటుందా!) -
పంజాబ్ సీఎంపై సంచలన ఆరోపణలు... ఆయన ఫుల్‌గా తాగింది నిజమేనా?
చండీగఢ్: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ జర్మనీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఐతే ఆయన ఢిల్లీలోని ఆప్ జాతీయ సమావేశానికి హాజరుకావాల్సి ఉండగా...సమయానికి పర్యటన ముగించుకుని రాలేకపోయారు. అంతేకాదు ఆయన అనారోగ్యంతో ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీకి తిరిగి రావడం ఆలస్యం అయ్యిందని సీఎం కార్యాలయం కూడా వెల్లడించింది. ఐతే సీఎం భగవంత్ మాన్ మద్యం మత్తులో ఉన్నందునే ఆలస్యమైందని, ఆయన్ను ఫ్లైట్ నుంచి దించేశారంటూ పలు వార్తలు గుప్పుమన్నాయి. అందువల్లే ఆయన ఢిల్లీకి రావడం ఆలస్యమైందంటూ వార్తలు ఊపందుకున్నాయి. ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ప్రతిపక్షాలు ఆప్‌ని డిమాండ్ చేశాయి. ఈ మేరకు భగవంత్ మాన్ సహా ప్రయాణికుడు ఆయన ఫుల్ తాగి ఉండటం వల్ల లుఫ్తానా ఎయిర్ పోర్టులో భగవంత్ మాన్‌ను విమానం నుంచి దించేశారని, పైగా ఆయన నడవలేకపోవడంతో భార్య, భద్రతా సిబ్బంది సాయం కూడా తీసుకున్నారని ట్విట్టర్లో పేర్కోన్నాడు. ఈ పోస్ట్‌ని కాంగ్రెస్ పార్టీ షేర్ చేస్తూ ఆప్‌ని ఈ విషయం పై క్లారిటీ ఇవ్వాల్సిందేనని పట్టుపట్టింది. ఈ క్రమంలో అకాలీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ భగవంత్ మాన్‌పై విమర్శలతో విరుచుకుపడ్డాడు. భగవంత్ మాన్ తీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పంజాబీలను సిగ్గుపడేలా చేసిందన్నారు. భారత ప్రభుత్వం ఈ విషయంపై జోక్యం చేసుకుని పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. అంతేగాదు జర్మనీ దేశాన్ని ఈ విషయమై విచారించాలంటూ పెద్ద ఎత్తున్న విమర్శలు ఎక్కుపెట్టారు. ఐతే ఆప్ అధికార ప్రతినిధి మల్విందర్‌సింగ్ కాంగ్ మాట్లాడుతూ....సీఎం సెప్టెంబర్ 19న షెడ్యూల్ ప్రకారం తిరిగి వచ్చారు. మాన్ తన విదేశీ పర్యటనలతో విదేశీ పెట్టుబడులు తీసుకువస్తున్నారన్న అక్కసుతో ప్రతిపక్షాలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. అంతగా కావలనుకుంటే లుఫ్తాన్స్ ఎయిర్‌లైన్స్‌లో తనిఖీ చేసుకోండి అని సవాలు విసిరారు. A Big Shame!! Punjab Chief Minister Bhagwant Mann deplaned because he was heavily Drunk pic.twitter.com/7PaPSiVDtb — Delhi Congress (@INCDelhi) September 19, 2022 (చదవండి: చండీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ ఘటన.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. మహిళా అధికారులతో సిట్) -
కూల్‌డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగిన విద్యార్థి
సాక్షి,వరంగల్: కూల్‌డ్రింక్ అనుకుని పురుగులమందు తాగి ఓ విద్యార్థి మృతిచెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని మరికాల పంచాయతీ తోగుబోరు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పూనెం సురేష్(11) అనే విద్యార్థి గురువారం ఉదయం ఇంట్లో కూల్‌డ్రింక్ సీసాలో పురుగుల మందు ఉందని తెలియక కూల్‌డ్రింక్ తాగాడు. అనంతరం వాంతులు చేసుకుంటుండగా గమనించిన కుటుంబ సభ్యులు సురేష్‌ను వె ంకటాపురం వైద్యశాలకు తరలించి చి కిత్స నిర్వహించే లోపే మృతి చె ందా డని తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. లాంగ్ డ్రైవ్‌కు వెళ్దామని చెప్పి.. -
పాపం ఎంత దాహం వేసిందో!.....ఆ కోబ్రా గ్లాస్‌తో తాగేస్తోంది.
Black Cobra Drinks Water From Glass Video Goes Viral: చాలామంది పాముని చూస్తేనే హడలిపోయి పారిపోతారు. అంతెందుకు కొన్ని విషపూరిత పాములను చూస్తేనే వొళ్లు జలదరిస్తుంది. అలాంటిది ఒక విషపూరితమైన పాముకి గ్లాస్‌తో నీళ్లు తాగించాడు ఇక్కడొక వ్యక్తి. (చదవండి: ఒక్క యాక్సిడెంట్!...ఆరు కార్లు ధ్వంసం !: షాకింగ్ వైరల్ వీడియో) అసలు విషయంలోకెళ్లితే....ఆఫ్రికాలో, ఉప-సహారా ప్రాంతంలో కనిపించే బ్లాక్ కోబ్రా వస్తున్నప్పడే ఒక రకమైన శబ్దంతో వస్తాయి. పైగా అవి తమకు ఏదైన అపాయం వాటిల్లుతుందని తెలిస్తే ఒకేసారి పెద్ద ఎత్తున విషాన్ని వెదజిమ్ముతాయి. అలాంటి బ్లాక్ కోబ్రాకి ఇక్కడొక వ్యక్తి గ్లాస్‌తో నీళ్లు పట్టిస్తాడు. పైగా ఆ కోబ్రాకి కూడా చాలా దాహం వేసినట్టుంది. తెగ ఆత్రుతగా తాగేస్తుంది. కానీ నీళ్లు తాగిస్తున్న వ్యక్తికి ఏ మాత్రం హానీ చేయదు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైగా లక్షల్లో వ్యూస్ లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: కొడుక్కి అరుదైన వ్యాధి.. తండ్రి హైస్కూల్ డ్రాపవుట్.. సొంతంగా మందు తయారీ) View this post on Instagram A post shared by Royal Pythons (@royal_pythons_) -
వార్నీ... వీక్లీ ఆఫ్ రోజు తాగొద్దన్నందుకు జాబ్ మానేశాడు
సాధారణంగా చేసే ఉద్యోగం మనకు నచ్చకపోతేనో.. బాస్ తీరు సరిగా లేకపోతేనో.. చుట్టూ ఉన్న వాళ్లు రాజకీయాలు చేసి.. మనల్ని అవమానిస్తేనో.. ఉద్యోగం మానేస్తాం. కానీ కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి పైన చెప్పిన పరిస్థితులు ఎదురైనా సరే.. అన్నింటిని మౌనంగా భరిస్తూ.. ఉద్యోగం చేసుకుంటున్నారు చాలా మంది. ఎందుకంటే బయట పరిస్థితులు బాగాలేవు కనుక.. అన్నింటిని సహిస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు చూడబోయే వ్యక్తి మాత్రం కాస్త భిన్నం. వీక్ ఆఫ్ రోజు పని చేయడానికి రావాలి.. తక్కువ తాగు అని బాస్ సూచించినందుకు ఆగ్రహించి ఉద్యోగం మానేశాడో వ్యక్తి. ఇక బాస్‌కి, సదరు ఉద్యోగికి మధ్య జరిగిన చాటింగ్ ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ఆ వివరాలు.. (చదవండి: జీతం ఎంతో చెప్పాలంటూ కాబోయే అల్లున్ని గదిలో బంధించి...) రెడిట్‌లో పోస్ట్ చేసిన స్క్రీన్ షాట్స్‌లో బాస్ తన బార్ అటెండర్‌కి ఉదయం 2.59 గంటలకు మెసేజ్ చేస్తాడు. ఏమని అంటే.. ‘‘రేపు ఓ ఈవెంట్ ఉంది.. డ్యూటీలో ఒక్కడే బార్ అటెండర్ ఉన్నాడు. కనుక నీవు రేపు ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు అతడు డ్యూటీ చేయాల్సి ఉందని’’ తెలుపుతాడు. అందుకు సదరు ఉద్యోగి నిరాకరిస్తాడు. రేపు నాకు ఆఫ్ అని తెలుపుతాడు. కానీ తప్పనిసరిగా రావాల్సిందిగా కోరతాడు బాస్. అందుకు ఆ ఉద్యోగి ‘‘రేపు ఉదయం డ్యూటీకి రావాలని.. మీరు తెల్లవారుజామున 3 గంటలకు నాకు మెసేజ్ చేశారు. ముందు చెప్పలేదు. రేపు వీక్లీ ఆఫ్ కదా అని నేను ఈ రోజు ఎక్కువ డ్రింక్ చేశాను. రేపంతా నాకు హ్యాంగోవర్ ఉంటుంది.. నేను 11 గంటల పాటు డ్యూటీ చేయలేను’’ అని రిప్లై ఇస్తాడు. (చదవండి: కొడుక్కి ఎంతైనా ఇస్తా.. కూతురికి ఇవ్వను!) అందుకు బాస్ ‘‘నీవు డ్యూటీ చేయడానికి సిద్ధంగా ఉండాల్సిందే. పైగా ఎక్కువ తాగడం మంచిది కాదు. కొన్ని అనుకోని పరిస్థితులకు మనం అప్పటికప్పుడే సిద్ధపడి.. వాటిని పూర్తి చేయాలి. ఒకరికొకరం మద్దతుగా ఉండాలి’’ అని మెసేజ్ చేస్తాడు. అప్పటికే సదరు ఉద్యోగికి చిర్రెత్తుకొస్తుంది. ఇక ఏమాత్రం మోహమాటపడకుండా బాస్‌ని దులిపిపారేస్తాడు. ‘‘వీక్లీ ఆఫ్ రోజు నేను ఎంత తాగాలో నీవు నాకు చెప్తావా.. వీక్లీ ఆఫ్ రోజు తినొద్దని చెఫ్‌కి చెప్పగలవా.. నువ్వు కరెక్ట్ టైమ్‌లో నాకు ఈ మెసేజ్ చేస్తే అప్పుడు నేను ఆలోచించేవాడిని. ఇంత లేట్‌గా చెప్పడమే కాక నేను ఎంత తాగాలో నువ్వు డిసైడ్ చేస్తున్నావ్’’ అంటూ ఉద్యోగి ఘాటుగా రిప్లై ఇస్తాడు. (చదవండి: షాకింగ్: భార్య ప్రేమను అమ్మకానికి పెట్టి మరీ..) అందుకు బాస్ ‘‘నువ్వు ఆటిట్యూడ్ చూపిస్తున్నావ్. దీని గురించి మనం తర్వాత చర్చిద్దాం’’ అంటాడు. అందుకా ఉద్యోగి.. ‘‘మనం చర్చించాల్సిన అవసరం లేదు. బార్ అటెండర్లకి చాలా అవకాశాలు ఉన్నాయి. నేను ఉద్యోగం మానేస్తున్నారు. నీతో నేను విసిగిపోయాను. గుడ్‌బై’’ అంటాడు. అప్పుడు బాస్.. ‘‘నీ నిర్ణయం సరైంది కాదు. ఉదయం లేచాకా నీవు దీని గురించి బాధపడతావ్’’ అని హెచ్చరిస్తాడు. కానీ సదరు ఉద్యోగి మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోడు. ఇక వీరిద్దరి సంభాషణ చాలా ఫన్నీగా ఉండటంతో నెటిజనులను తెగ ఆకట్టుకొంటుంది. మా బాస్ కూడా ఇలానే సతాయిస్తాడు.. కానీ ఏం చేయలేకపోతున్నాం.. నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: వెరైటీ ఆహ్వానం: గిఫ్ట్ విలువను బట్టే పెళ్లి భోజనం -
మ్యాచ్ మధ్యలో ఆసక్తికర సన్నివేశం.. తప్పక చూడాల్సిందే
కశ్మీర్: ప్రపంచంలో తండ్రీ.. కూతురి అనుబంధం ఎప్పుడు ప్రత్యేకమే. అమ్మకు కొడుకు మీద ప్రేమ ఉంటే.. నాన్నకు కూతురు మీద ప్రేమ ఉంటుంది. ఇప్పుడు ఈ ఎందుకు అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది. అక్కడికే వస్తున్నాం. క్రికెట్‌కు జెంటిల్మెన్ గేమ్ అని పేరు ఉంది. ఆటలో ఎన్నోసార్లు ఆసక్తికర సన్నివేశాలు చూసుంటాం. ఉదాహరణకు ఆటగాళ్ల మధ్య గొడవలు.. ఫీల్డింగ్ విన్యాసాలు.. క్యాచ్‌లు.. రనౌట్లు.. భారీ సిక్స్‌లు ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటనే మ్యాచ్ మధ్యలో చోటుచేసుకుంది. దక్షిణ కశ్మీర్లో జరుగుతున్న క్లబ్ క్రికెట్లో మ్యాచ్‌లో ఫీల్డర్‌కు దాహం వేసింది. సాధారణంగా డ్రింక్స్ అందించడానికి బాయ్స్ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం తన తండ్రికి దాహం వేయడంతో అతని కూతురు స్వయంగా గ్రౌండ్లోకి వచ్చి వాటర్ అందించింది. దీనిలో ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేకపోయినప్పటికి ఫోటో మాత్రం వైరల్ అయింది. వీలైతే మీరు ఒక లుక్కేయండి. కాగా సదరు తండ్రి మట్టన్ స్పోర్ట్స్‌క్లబ్‌కు ఆడుతున్నట్లు అతను వేసుకున్న జెర్సీ ఆధారంగా తెలిసింది. ఇటీవలే కశ్మీర్ ప్రీమియర్ లీగ్‌పై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హర్షలే గిబ్స్కు బీసీసీఐ నుంచి బెదిరింపులు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే బీసీసీఐ మాత్రం దీనిని ఖండించింది. అయితే పాక్ మాజీ క్రికెటర్లు మాత్రం బీసీసీఐ అనవసర రాద్దాంతం చేస్తుందని విషం కక్కారు. This picture is ❤️. Daughter carrying drinks for her father during drinks break at #Tikbagh KP Road Mattan In ongoing #MPL2 league. Daughter are gifted ❤️@imVkohli @ICC @BCCI @ImParveezRasool @evarayees @dr_piyushsingla @hussain_imtiyaz @ABdeVilliers17 @bhatray @Kashmir_Monitor pic.twitter.com/MYrjqxCQHB — Aabid Bhat (@ubiiibhat87) August 8, 2021 -
కట్టుకున్న భార్యను స్నేహితులతో గడపాలని వేధించి..
సాక్షి, శివాజీనగర(కర్ణాటక): మద్యం తాగాలని, తన స్నేహితులతో గడపాలని భార్యను వేధిస్తున్న ఓ ఘరానా భర్త ఉదంతమిది. బెంగళూరు శివాజీనగరకు చెందిన వసీం షరీఫ్‌పై ఈ మేరకు భార్య ఫిర్యాదు చేసింది. మూడేళ్ల కిందట ఇతనికి దూరపు బంధువైన యువతితో పెళ్లయింది. కొంతకాలానికి గోవాటూర్‌కు తీసుకొని వెళ్లి తనతో మద్యం తాగాలని ఒత్తిడి చేయగా ఆమె ఒప్పుకోలేదని తీవ్రంగా కొట్టాడు. తరువాత హోటల్‌కు భోజనానికి వెళ్లి అక్కడ తన స్నేహితులతో కలసి గడపాలని భార్యను పీడించాడు. ఆమె ససేమిరా అనడంతో మళ్లీ హింసించాడు. ఫలితంగా ఆమెకు అబార్షన్ అయ్యింది. గర్భందాల్చి ఇటీవల ఆడ బిడ్డ పుట్టగా వేధింపులు మరింతగా పెరిగాయని బాధితురాలు శివాజీనగర మహిళా పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో వాపోయింది. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. చదవండి: క్యాప్యూల్స్ రూపంలో బంగారం.. ముగ్గురు మహిళలు అరెస్ట్ -
ఈ వీడియో చూశాక.. బయట తినాలంటేనే భయమేస్తుంది..
-
మహిళ పాడు పని.. యాక్ థూ అంటున్న జనాలు
పార్టీలు అనగానే చాలు ఎగేసుకుని వెళ్లే జనాలు సమాజంలో కోకొల్లలు. ఫ్రీగా వస్తుందంటే.. ఫినాయిల్ కూడా వదలరనే సామెత వీరిని చూశాకే వచ్చి ఉంటుందేమో అనిపిస్తుంది. అయితే ఇలాంటి ఫ్రీ పార్టీలకు ఆశపడితే.. ఒక్కోసారి ఎలాంటి దరిద్రమైన అనుభవాలు చవి చూడాల్సి వస్తుందో ఇది చదివితే తెలుస్తుంది. అన్నా షో అనే ఫేస్బుక్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇది చూసిన జనాలు వీడియోలోని మహిళని ఛీ నువ్వసలు మనిషివేనా.. అంటూ తిట్టని తిట్లు తిడుతున్నారు. ఇంతకు సదరు మహిళ చేసిన ఘనకార్యం ఏంటో తెలియాలంటే ఇది చదవాల్సిందే.. ఈ వీడియోలో ఓ మహిళ పార్టీ ఇస్తానంటూ స్నేహితులను ఇంటికి ఆహ్వానించింది. పార్టీకి వచ్చిన అతిథుల కోసం ఓ డ్రింక్ తయారు చేసింది. అయితే ఇందుకోసం సదరు మహిళ టాయిలెట్ బౌల్‌ని వినియోగించింది. తొలుత మహిళ టాయిలెట్ బౌల్లో ఓ వస్త్రం పెట్టి దాన్ని కవర్ చేస్తుంది. ఆ తర్వాత దాని మీదుగా ఐస్ క్యూబ్స్, క్యాండీస్, ఐస్‌క్రీమ్ వేస్తుంది. ఆ తర్వాత ఫ్లష్ ట్యాంక్ ఒపెన్ చేసి దానిలో సోడా డ్రింక్, స్ప్రైట్, ఫాంటా, మిరిండా, ఇతర స్వీట్నర్స్ వేస్తుంది. ఆ తర్వాత ఫ్లష్ బటన్ ప్రెస్ చేస్తుంది. దాంతో ట్యాంక్‌లో కలిపిన డ్రింక్ ఇక్కడకు వస్తుంది. ఆ తర్వతా సదరు మహిళ గరిటెతో ఆ డ్రింక్‌ను తీసి.. గ్లాస్‌ల్లో పోసి పార్టీకి వచ్చిన ఫ్రెండ్స్‌కి సర్వ్ చేస్తుంది. మహిళ ఈ డ్రింక్ తయారు చేసే బాత్రూమ్ పక్కనే పార్టీకి వచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే వీరిలో ఒకరు సదరు మహిళ డ్రింక్‌ని టాయిలెట్ బౌల్లో తయారు చేసిందని గుర్తించి.. ఆ విషయాన్ని మిగతా వారికి చెప్తాడు. అప్పుడు చూడాలి వారి రియాక్షన్.. కక్కలేక.. మింగలేక నానా అవస్థలు పడ్డారు. వెంటనే యాక్ అంటూ ఆ డ్రింక్‌ని తీసుకెళ్లి టాయిలెట్లో పోశారు. ఇక వీడియో చూసిన జనాలు.. ‘‘ఛీ ఇలాంటి చండాలమైన ఐడియాలు ఎలా వస్తాయి’’.. ‘‘ఈ వీడియో చూశాక.. బయట తినాలంటేనే భయమేస్తుంది.. జీవితం మీద విరక్తి తెప్పించావ్’’.. ‘‘అందుకే నేను వేరే వాళ్లింటికి వెళ్లినప్పుడు ఏం తినను.. తాగను’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: కొంపముంచిన ఫేస్బుక్ యాడ్ -
ఇది గోదారోళ్ల డ్రింకండీ.. దీని టేస్ట్ సూపరండీ బాబూ..
ఆర్టోస్.. ఇది పక్కా లోకల్.. ఈ సాఫ్ట్ డ్రింకు ఒక్కసారి తాగితే చాలు.. జిహ్వ ‘వహ్వా’ అనక మానదు. ఆ రుచి మళ్లీ మళ్లీ కావాలని కోరకా మానదు. ‘రామచంద్రపురం రాజుగారి డ్రింకు’గా పేరొందిన ఈ శీతల పానీయం గురించి తెలియనివారే ఈ ప్రాంతంలో ఉండరంటే అతిశయోక్తి కానేకాదు. కార్పొరేట్ కూల్‌డ్రింక్ కంపెనీలు ఎన్ని వచ్చినా.. ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం ‘ఆర్టోస్’ వందేళ్లకు పైగా తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. ఈ ఉగాది సందర్భంగా విస్తరణ బాట పట్టిన ఈ సంస్థ.. మరిన్ని రుచులతో సరికొత్త డ్రింకులు తయారు చేసేందుకు శ్రీకారం చుట్టింది. రామచంద్రపురం: ‘ఏంటీ గోలీ సోడానా? అయ్యబాబోయ్! ఎవ్వరూ తాగకండి. అందులో భూతం ఉంది’ అంటూ ఒకప్పుడు అందులో నుంచి వచ్చే గాలికి జనం హడలిపోయే స్థాయి నుంచి.. ‘ఆర్టోసా! ఏదీ మరోటి ఇవ్వండి తాగుతాం’ అనే స్థాయిలో ఆర్టోస్ సాఫ్ట్ డ్రింక్ ప్రాచుర్యం పొందింది. దేశంలో ఎక్కడ ఏ డ్రింకులు తాగినా.. గోదావరి సీమకు వచ్చేసరికి మాత్రం ఆర్టోస్ తాగి వెళ్లాల్సిందే. అచ్చం ద్రాక్ష పండ్ల మాదిరిగానే ఉండే దాని రుచి చూడాల్సిందే. మూడు తరాల కృషి ఆర్టోస్ పరిశ్రమ ఈ స్థాయికి రావడం వెనుక మూడు తరాల కృషి ఉంది. రామచంద్రపురం పట్టణానికి చెందిన అడ్డూరి రామచంద్రరాజు కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో వృథాగా పడి ఉన్న గోలిషోడా మెషీన్‌ను 1912లో కొనుగోలు చేశారు. దానిని ఇక్కడికి తెచ్చి, విశాఖపట్నం పోర్టు ద్వారా ఇంగ్లండ్ నుంచి స్పేర్ పార్టులు తెప్పించి, మరమ్మతులు చేయించారు. ఆ మెషీన్‌తో పట్టణంలో గోలీసోడా తయారీకి శ్రీకారం చుట్టారు. అప్పట్లో గోలీసోడా ద్వారా వస్తున్న గ్యాస్‌ను చూసి ప్రజలు దానిలో భూతం ఉందని, ఎవ్వరూ తాగకూడదని చెప్పుకొనేవారు. దీంతో అప్పట్లో అంతంత మాత్రంగానే సోడాలు అమ్ముడు పోయేవి. అప్పట్లో రాజుగారు ఒక్కరే వెల్ల ప్రాంతం నుంచి తాగునీరు తెచ్చుకుంటూ సోడాలు తయారు చేసేవారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో పట్టణంలో సేద తీరేందుకు వచ్చిన బ్రిటిష్ మిలిటరీ సైనికులకు ఈ గోలీసోడాను అందించేవారు. దీంతో ఇది మరింత ప్రాచుర్యం పొందింది. 1919లో రామచంద్రరాజు తమ్ముడు జగన్నాథరాజు తన చదువు ముగించుకున్న అనంతరం అప్పట్లో మద్రాసులో ప్రాచుర్యం పొందిన స్పెన్సెన్స్ డ్రింక్ తాగి, అటువంటి సాఫ్ట్ డ్రింక్ తయారు చేయాలని భావించారు. ఈ నేపథ్యంలో దానిని తయారు చేసే విధానాన్ని, ముడి సరకును లండన్, జర్మనీ ప్రాంతాల నుంచి రప్పించారు. అదే ఏడాది ఏఆర్ రాజు డ్రింక్స్ పేరుతో సాఫ్ట్ డ్రింక్ తయారీ ప్రారంభమైంది. ఒక్క నీరు తప్ప మిగిలిన ముడి సరకులన్నీ విదేశాల నుంచే దిగుమతి చేసుకునే వారు. ఈ డ్రింకులను అప్పట్లో తోపుడు బండ్లు, ఎడ్ల బండ్ల ద్వారా రాజమహేంద్రవరం వరకూ అర్ధణా నుంచి మూడు పైసలకు అమ్మేవారు. 1930లో సెమీ ఆటోమెటిక్ మెషీన్ అమర్చి మరింతగా డ్రింకులను మార్కెట్లోకి తీసుకువచ్చారు. 1955లో ఇంగ్లండ్ నుంచి పూర్తి స్థాయి ఆటోమెటిక్ మెషీన్ రప్పించారు. డ్రింక్స్‌కు ‘ఆర్టోస్’గా పేరు మార్చారు. అనేక ఒడుదొడుకులను ఎదుర్కొంటూనే అదే ఏడాది పేటెంట్ హక్కులు కూడా పొందారు. తరువాత ఆయన కుమారులు పద్మనాభరాజు, సత్యనారాయణరాజులు ఆర్టోస్ డ్రింక్‌ను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువచ్చారు. 1912 నుంచి ఇప్పటి వరకూ సుమారు ఆరుసార్లు డ్రింక్ రూపాంతరం చెందుతూ వచ్చింది. 1955లో 30 మంది సిబ్బంది ఉండగా ప్రస్తుతం వారి సంఖ్య సుమారు 150కి పెరిగింది. అప్పటి నుంచీ మన జిల్లాతో పాటు విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాకు కూడా ఆర్టోస్ డ్రింక్‌ను పంపిణీ చేస్తున్నారు. ఈ కంపెనీకి మూడు జిల్లాల్లోనూ 100 మందికి పైగా డీలర్లు ఉన్నారు. ఇప్పటికే రామచంద్రపురం పరిసర గ్రామాలకు ఆర్టోస్ వాటర్ బాటిళ్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. వందేళ్ల తరువాత రెండో యూనిట్ ఆర్టోస్ ఫ్యాక్టరీ వందేళ్లు పూర్తి చేసుకున్న తరువాత మూడో తరం వారైన ఆర్టోస్ బ్రదర్స్ అడ్డూరి జగన్నాథవర్మ, వీరభద్రరాజు, రవీంద్రలు పరిశ్రమలో అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో రెండో యూనిట్‌ను మంగళవారం ప్రారంభించారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్ చెలికాని స్టాలిన్, మంత్రి వేణు తనయుడు నరేన్, మున్సిపల్ చైర్పర్సన్ గాధంశెట్టి శ్రీదేవి చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. ఇక నుంచి 1.25, 250, 200 మిల్లీలీటర్ల ప్లాస్టిక్ బాటిళ్లతో ఇప్పటి వరకూ అందిస్తున్న ద్రాక్షతో పాటు మ్యాంగో, లెమన్, ఆరెంజ్ ఫ్లేవర్లలో కూడా డ్రింకులు తయారు చేయనున్నారు. అలాగే సోడాలు కూడా తయారు చేస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో.. వందేళ్లుగా గోదావరి ప్రజలు ఆదరిస్తున్న ఆర్టోస్‌ను మరిన్ని రుచులతో అందించేందుకు అత్యాధునిక టెక్నాలజీతో రెండో యూనిట్ ప్రారంభించాం. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని యంత్రాలను అమర్చి బాటిల్ యూనిట్ ఏర్పాటు చేశాం. గతంలో కంటే మరింత వేగంగా ఆర్టోస్ డ్రింక్‌ను వినియోగదారులకు అందించే ప్రయత్నంలో భాగంగానే రెండో యూనిట్ ప్రారంభించాం. – అడ్డూరి జగన్నాథవర్మ, ఆర్టోస్ అధినేత చదవండి: చంద్రబాబు నుంచి ప్రాణ హాని.. చంద్రబాబు పిలుపు: మందు తాగండి.. ఓటు వేయండి -
యాపీ ఫిజ్ బంపర్ ఆఫర్..
పార్లే ఆగ్రో కంపెనీ తమ పాపులర్ ప్రొడక్ట్ యాపీ ఫిజ్ తన వినియోగదారులకు స్మార్ట్ఫోన్లను బహుమతిగా ఇస్తోంది. ప్రమోషన్లో బాగంగా నాలుగు శాంసంగ్ గెలాక్సీ 10 ప్లస్ స్మార్ట్ఫోన్లను గ్రాండ్ప్రైజ్గా అందివ్వనుంది. నవంబరు 7 నుంచి 22 వరకు ఈ పోటీ అందుబాటులో ఉంటుంది. పోటీలో పాల్గొనాలంటే.. దేశ వ్యాప్తంగా ఆ పోటీ అందుబాటులో ఉంది. ఫీల్ ద ఫిజ్ అధికారిక ఇన్స్టగ్రామ్ను పేజీని ఫాలో కావాలి. యాపీ ఫిజ్‌తో కలిపి మీకు నచ్చిన ఏ ఆహారాన్ని జతగా తీసుకుంటే బాగుంటుంది? అనే విషయాన్ని ఫోటోలు, వీడియోలతో సహా జతచేయాలి. పోటీలో పాల్గొనాల్సిందిగా మీ స్నేహితులను ఆహ్వానించాలి. తద్వారా మీరు, మీ స్నేహితులు బహుమతులు గెలుచుకోవచ్చు. ప్రతి వారం లక్కీ విజేతలు ఆర్టోఫ్ ఫిజ్ మర్చండైజ్ గెలుచుకోవడానికి అర్హులు. అలాగే 4 మంది అదృష్ట విజేతలను ప్రకటిస్తుంది. వీరు శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ ఫోన్‌ను గెలుచుకోవచ్చు. కాగా దక్షిణ భారతంలో యాపీ ఫిజ్ ప్రచారకర్తగా ప్రముఖ తెలుగు సినీ నటుడు నందమూరి తారక రామారావు (జూనియర్ ఎన్టీఆర్) వ్యహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ట్విటర్ ఖాతాలో ఈ కాంటెస్ట్ గురించి పోస్ట్ చేశారు. తన ప్రశ్నకు సమాధానాలు ఇచ్చి, బహుమతులు గెలుచుకోవచ్చని సూచించారు. దీంతో అటు యాపీ ఫిజ్ ఫ్యాన్స్, ఇటు యంగ్‌టైగర్ ఫ్యాన్స్ ట్విటర్లో ఇమేజ్‌లు, వీడియోలతో సందడి చేస్తున్నారు. పోటీకి సంబంధించి మరిన్ని వివరాలకు '@iamappyfizz', '#ArtofFizz' హ్యాష్ ట్యాగ్ లను పరిశీలించాలి. What is your favourite food that you'd like to pair with @iamappyfizz ? Let your friends on Twitter know and win cool stuff. Follow @iamappyfizz for more details #ArtofFizz pic.twitter.com/5zMxzS1Uae — Jr NTR (@tarak9999) November 12, 2019 My Caption : #FEELTHEFIZZ #ARTOFFIZZ To have good health we need to take proper meal @iamappyfizz To have good health and Energetic we need to take Proper meal and Fizz drinks.Satisfied meal cannot be satisfied without Appy Fizz.Keep cool and always chill with Appy fizz drink pic.twitter.com/X5vaeL1s4H — Anusuresh (@Anusure40893798) November 11, 2019 -
నీళ్లు తాగకుండా మందులా..?
టొరంటో: తగినంత నీరు తాగకపోవటమూ కిడ్నీ సమస్యలకు కారణమవుతుంది!! మరి అలాంటి వారు ఇతరత్రా మందులు తీసుకుంటే అది కిడ్నీని మరింత దెబ్బ తీస్తుందా? ఇదిగో... ఇలాంటి విషయాల్ని లోతుగా శోధించే కొత్త ‘కంప్యూటర్ కిడ్నీ’ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ‘అధిక రక్తపోటు ఉన్న వారికి నీటితో కూడిన మాత్రలిస్తారు. దాంతో వారు ఎక్కువగా మూత్రవి సర్జన చేస్తారు. అలా వారి రక్త పోటు అదుపులోకి వస్తుంది’ అని కెనడాలోని వాటర్లూ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనితా లేటన్ చెప్పారు. ఈ పేషెంట్లకు హార్మోన్ల వ్యవస్థపై ప్రభావం చూపే మరో మందును కూడా తరచు ఇస్తారు. దాంతోపాటు ఆస్ప్రిన్ కూడా ఇస్తుంటారు. ఇవనీన కిడ్నీపై ప్రభావం చూపిస్తుంటాయి. ‘శరీరంల్లో నీరు తక్కువయినప్పుడు అతితక్కువ నీటితో మూత్ర విసర్జన జరిగేలా చేసేది కిడ్నీయే. కాకపోతే వృద్ధులు, కిడ్నీ సమస్యలతో మందులు తీసుకునేవారు ఇబ్బంది ఎదుర్కోవచ్చు. మూత్రాన్ని కిడ్నీ నుంచి బ్లాడర్‌కు తీసుకెళ్లే కండరాలు సరిగా సంకోచించకపోవటమే దీనికి కారణం’ అని చెప్పిన లేటన్... ఈ సంకోచాల స్టిమ్యులేషన్‌ను లెక్కించే తొలి మోడల్‌ను రూపొందించారు. కిడ్నీకి కాంబినేషన్ మందులు తీసుకునే వారు తగినంత నీటిని తప్పకుండా తీసుకోవాలని, లేనట్లయితే ఆస్ప్రిన్‌తో కిడ్నీ దెబ్బతింటుందని తమ కంప్యూటర్ మోడల్ గుర్తించిందన్నారు. -
ఇక జీవితంలో మద్యం తాగను : ఎంపీ
చంఢీగడ్ : ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, సంగ్రూర్ ఎంపీ భగవంత్ మాన్ మద్యం మానేస్తున్నట్లు ప్రకటించారు. పంజాబ్‌లో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో మాన్ ఈ ప్రకటన చేశారు. పంజాబ్‌కు చెందిన మాన్ కమెడియన్‌గా పనిచేసేవారు. ఈ క్రమంలో ఆప్‌లో చేరి సంగ్రూర్ ఎంపీగా గెలుపొందారు. అయితే మాన్కు విపరీతంగా మద్యం సేవించే అలవాటు ఉంది. దీని వల్ల అతను చాలాసార్లు విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఈ విషయం గురించి మాన్ మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడో సందర్భాన్ని బట్టి తాగేవాడిని. కానీ ప్రతిపక్షాలు దీన్ని ఆధారంగా చేసుకుని నన్ను విమర్శించేవారు. మాన్ రాత్రి, పగలు అనే తేడా లేకుండా నిత్యం మత్తులోనే ఉంటాడు. ఎప్పుడు తాగుతూనే ఉంటాడని ఆరోపించేవారు. అంతేకాక ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నా పేరు చెడగొట్టాలని ప్రయత్నించేవారు. ఈ వీడియోలను చూస్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించేది’ అని వాపోయారు. అంతేకాక ‘మా అమ్మ కూడా నాతో ఇదే విషయం చెప్పింది. నువ్వు ఎప్పుడో ఒకసారి తాగుతావు.. కానీ టీవీల్లో మాత్రం నిత్యం మద్యం సేవిస్తూనే ఉంటావని చూపిస్తున్నారు. ఈ అలవాటును మానుకోకపోతే.. నువ్వు చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. కాబట్టి తాగడం మానేయమని కోరారు. దాంతో ఈ జనవరి 1 నేనొక తీర్మానం చేసుకున్నాను. ఇక జీవితంలో మద్యం తాగకూడదని నిర్ణయించుకున్నాను. ఇకనైనా ప్రతిపక్షాలు నా గురించి తప్పుడు ప్రచారం మానేయాలనే ఉద్దేశంతో కేజ్రీవాల్ సమక్షంలో ఈ విషయాన్ని వెల్లడిస్తున్నానని తెలిపారు. మాన్ నిర్ణయం పట్ల కేజ్రీవాల్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో మాన్ మార్పుకు పునాది వేశారని కేజ్రీవాల్ కొనియాడారు. -
కుదిరితే ఓ కప్పు కాఫీ వద్దు...
ఖాళీ కడుపు మీద తీసుకునే పానీయం ప్రాణం పోసేది అయి ఉండాలి. ఆరోగ్యం ఇచ్చేదిగా ఉండాలి.ఉత్సాహాన్ని పెంచేది కావాలి. శక్తిని ఇచ్చేదిగా ఉండాలి.ఎన్నో ఏళ్ల నుంచి అలవాటైన కాఫీలు, టీల కంటె...ఈ పానీయాలు ఇంట్లో వారందరికీ మార్నింగ్ సంజీవని కావాలి.ఇంకెందుకు ఆలస్యం...ఈ రోజు నుంచి నిద్ర లేస్తూనే ఈ ఆరోగ్య పానీయాలను సేవించడం ప్రారంభించండి... టర్మరిక్ అండ్పెప్పర్ వాటర్ కావలసినవి: పచ్చి పసుపు కొమ్ము ముక్క – చిన్నది; మిరియాలు – అర టీ స్పూను; నిమ్మ చెక్క – 1 (చిన్నది); నీళ్లు – కప్పుడు తయారీ: ∙ముందుగా కప్పుడు నీళ్లను గోరు వెచ్చన చేయాలి ∙ చిన్న నిమ్మ చెక్క, పసుపు కొమ్ము, మిరియాల పొడి వేసి బాగా కలియబెట్టి, వడబోయాలి ∙గోరువెచ్చగానే తాగాలి. ఉపయోగాలు: ►జీర్ణశక్తి మెరుగవుతుంది ∙క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది ►రోగనిరోధక శక్తి పెరుగుతుంది తేనె – గ్రీన్ టీ కావలసినవి: నీళ్లు – ఒక కప్పు; తేనె – ఒక టీ స్పూను; గ్రీన్ టీ బ్యాగ్ – 1 తయారీ: ∙నీళ్లను బాగా మరిగించాలి ∙గ్రీన్ టీ బ్యాగ్ వేసి రెండు నిమిషాలు వదిలేయాలి ∙తే¯ð జత చేసి బాగా కలపాలి ∙వేడివేడిగా గ్రీన్ టీ సర్వ్ చేయాలి. ఉపయోగాలు: ∙గుండె ఆరోగ్యానికి మంచిది ∙కొలెస్ట్రాల్‌ను నివారిస్తుంది ►దుర్వాసన రాకుండా నివారిస్తుంది ∙ఎముకల పటుత్వానికి మంచిది ►చర్మసంబంధిత వ్యాధులు రాకుండా నివారిస్తుంది ∙మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ►జుట్టు పెరుగుతుంది ∙సాధారణ జలుబులు దరిచేరవు. అలోవెరాఆమ్లా జ్యూస్ కావలసినవి: అలోవెరా జ్యూస్ – 5 టీస్పూన్లు (మార్కెట్లో రెడీగా దొరుకుతుంది); ఉసిరి రసం – ఒక టీ స్పూను (మార్కెట్లో రెడీగా దొరుకుతుంది); నీళ్లు – ఒక గ్లాసుడు తయారీ: ఒక గ్లాసులో నీళ్లు పోసి, అలోవెరా జ్యూస్ వేసి కలపాలి ∙ఆ తరవాత ఉసిరి రసం జత చేసి బాగా కలియబెట్టి, చల్లగా తాగాలి. ఉపయోగాలు: ∙అలొవెరా, ఉసిరి రసాలు రెండూ చర్మానికి, జుట్టుకి ఉపయోగపడతాయి ∙మెటబాలిజం పెరుగుదలకు ఉపకరిస్తాయి ∙జీర్ణకోశాన్ని శుద్ధి చేస్తాయి ∙శరీరంలో టాక్సిన్సు పేరుకుపోకుండా, కొవ్వు నిల్వ ఉండిపోకుండా చేస్తూ కొవ్వుని కరిగిస్తాయి. దాల్చిన చెక్క–తేనె నీళ్లు కావలసినవి: తేనె – ఒక టేబుల్ స్పూను; దాల్చిన చెక్క పొడి – ఒక టీ స్పూను; నీళ్లు – ఒక కప్పు, నిమ్మ రసం – అర టీ స్పూను తయారీ:నీళ్లను మరిగించి, బాగా పొంగుతుండగా మంట ఆపేయాలి ∙దాల్చినచెక్క పొడి వేసి సుమారు పావు గంటసేపు అలాగే ఉంచేయాలి ∙చల్లారిన ఈ నీళ్లకు నిమ్మరసం, తేనె జత చేయాలి ఈ పానీయాన్ని రోజుకి రెండు సార్లు తాగాలి ∙ఉదయమే పరగడుపున ఒకసారి, రాత్రి నిద్రపోవడానికి ముందు ఒకసారి ఈ పానీయం తీసుకోవడం మంచిది. ఉపయోగాలు ►గుండె సంబంధిత వ్యాధులు దూరమవుతాయి ►వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది ►చర్మసంబంధిత వ్యాధులు దరిచేరవు ►మధుమేహులకు మంచిది ►బ్లాడర్ వ్యాధులు రాకుండా కాపాడుతుంది ►అజీర్ణవ్యాధులు దరిచేరవు ►నోటి నుండి దుర్వాసన రాదు ►శరీరానికి శక్తినిస్తుంది ►అలర్జీలు రాకుండా కాపాడుతుంది ►గొంతు సంబంధ వ్యాధులను నివారిస్తుంది ►దగ్గు, జలుబు రాకుండా కాపాడుతుంది ఆపిల్ సైడర్వెనిగర్ ఇన్ వాటర్ కావలసినవి: ఆపిల్ సైడర్ వెనిగర్ – ఒక టేబుల్ స్పూను; నిమ్మ రసం – 2 టీ స్పూన్లు; దాల్చిన చెక్క పొడి – అర టీ స్పూను; మిరియాల పొడి – చిటికెడు; తేనె – ఒక టేబుల్ స్పూను. తయారీ: ముందుగా ఒక గ్లాసులోకి నీళ్లు తీసుకోవాలి ∙ఆపిల్ సైడర్ వెనిగర్, నిమ్మరసం, దాల్చినచెక్క పొడి, మిరియాల పొడి వేసి బాగా కలియబెట్టి, వడగట్టాలి ∙తేనె జత చేసి తీసుకోవాలి. ఉపయోగాలు: ∙బ్లడ్ సుగర్ లెవెల్స్‌ను తగ్గిస్తుంది ►బరువు తగ్గడానికి ఉపకరిస్తుంది ►వ్యాధికారకాలను నశింపచేస్తుంది -
అమీ అన్‌కామన్
మగాళ్లు మాత్రమే కనిపించే ఉద్యోగాలలోఇప్పుడు అమ్మాయిలూకనిపించడం కామన్అయిపోయింది. అయితే‘ఫ్లేర్ బార్టెండర్’గాఅమీ చేస్తున్న ఉద్యోగంమాత్రం ఇప్పటికీ అన్ కామన్. దేశంలో ఇంకే మహిళా ఈ ఉద్యోగంలో లేరు! అమీ బెహ్రామ్ ష్రాఫ్! స్వస్థలం ముంబై. వృత్తి ఫ్లేర్ బార్టెండర్. క్రెడిట్ కూడా అదే. దేశంలోనే తొలి మహిళా ఫ్లేర్ బార్టెండర్. సరైన మోతాదులో డ్రింక్‌ని మిక్స్ చేయడం మిక్సాలజీ. బార్‌లోని ఎక్విప్మెంట్స్ (బాటిల్స్, గ్లాసెస్ ఎట్సెట్రా)తో ఆకట్టుకునేలా విన్యాసాలు చేస్తూ డ్రింక్‌ను మిక్స్ చేసి సర్వ్ చేయడమే ఫ్లేర్ బార్టెండర్ పని. ఇది పూర్తిగా పురుషుల వృత్తి. అలాంటి ఈ రంగంలో మగవాళ్లకు దీటుగా ఫ్లేర్ బార్టెండర్గా తనకంటూ ఓ స్టయిల్‌ను క్రియేట్ చేసుకుంది అమీ. ఇప్పటివరకు దేశవిదేశాల్లోని ప్రసిద్ధి చెందిన పబ్‌లు, బార్లలో వెయ్యి షోస్ (విన్యాసాలు) వరకు చేసింది. పదిహేడేళ్లకే ఈ ఫీల్డ్‌లోకి వచ్చింది. మొదటి నుంచి భిన్నంగా ఉండడం, విభిన్నంగా ఆలోచించడం అమీ నైజం. లెవెంత్ క్లాస్‌లో ఉన్నప్పుడు అమీ, ఆమె స్నేహితురాలు డెల్నాజ్ ఇద్దరూ కలిసి ‘కాక్టేల్స్’ అనే సినిమా చూశారు. అందులో ఫ్లేర్ బార్ టెండర్ విన్యాసాలు చూసి ముగ్ధులైపోయారు. ఆ ఇంట్రెస్ట్‌తో, ఫాసినేషన్తో నిజంగానే ఓ ఫ్లేర్ బార్టెండర్ను కలిశారిద్దరూ. అతని ఆర్ట్‌ను సునిశితంగా గమనించారు. నేర్చుకోవడానికి సిద్ధమయ్యారు. అలా ఈ ఫీల్డ్‌లోకి ఎంటర్ అయ్యారు. ఫస్ట్ చాన్స్ తీసుకుంది మాత్రం అమీనే. పేరెంట్స్‌కి చెప్పినప్పుడు ముందు ఆశ్చర్యపోయారట. అమీ పట్టుదల తెలుసు అందుకని నో అని అనలేదు కానీ బార్లో ఉద్యోగం కాబట్టి జాగ్రత్తలు మాత్రం చెప్పారు. కొత్తదనాన్ని ప్రేరణగా తీసుకుంటుంది అమీ. ప్రకృతి నుంచి కూడా స్ఫూర్తి పొందుతుంది. అలా భారతదేశంలోనే ప్రముఖ మిక్సాలజిస్ట్గా పేరు సంపాదించింది. ‘‘ఆ పాపులారిటీ వల్ల అప్పుడప్పుడు నా ఈగో శాటిస్ఫై అవుతుంది తప్ప.. దాన్నో గొప్ప అచీవ్‌మెంట్‌గా అనుకోను. ఇది నా ప్రొఫెషన్. న్యాయం చేయాలి. చేస్తున్నాను’’ అంటుంది నవ్వుతూ అమీ. మగాళ్లతో ఏమైనా ఇబ్బంది? ‘‘ఈ ఫీల్డ్‌లో ఉన్న మగవాళ్లు.. ఫీల్డ్‌లో లేని ఆడవాళ్లు నన్ను చూసి జాలి పడ్తుంటారు. మంచి ఉద్యోగం కోసం ట్రై చేయొచ్చు కదా, ఇంకా బెటర్ కెరీర్‌ని ప్లాన్చేసుకోవచ్చు కదా అంటూ సలహాలిస్తుంటారు. అంతకు మించి ఈ వృత్తిలో నాకేం ఇబ్బందులు లేవు. అయితే ఆ ఉచిత సలహాలకు కొత్తలో కోపంగా ఉండేది. ఇప్పుడు నార్మల్ అయిపోయింది. నవ్వి ఊరుకుంటాను. మేల్ బార్టెండర్స్ ఇంకో ఉద్యోగం చూసుకో అంటున్నారంటే.. జెలస్ ఫీలవుతున్నారని అర్థం కదా.. సో.. ఆ మాట విన్నప్పుడల్లా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సెల్ఫ్ డిసిప్లిన్ కూడా పెద్ద సవాల్ ఈ ప్రొఫెషన్లో’’ అంటుంది అమీ. మరిచిపోలేని షో కాయింట్రో మిక్సాలజీ కాంపిటీషన్! అందులో ప్రైజ్ రావడం అమీ మర్చిపోలేని షో. ఇంకా జిందగీ లైవ్ ఐబీఎన్7 విమెన్స్ అచీవ్మెంట్ అవార్డ్ (2013), ఎమ్‌టీవీ కెప్టెన్ షాక్ కాంపిటీషన్ విన్నర్.. ఇలాంటివి. బెస్ట్ మిక్సాలజిస్ట్గా ఉన్న పేరు కంటే కూడా తన ఫ్లేర్ ఆర్ట్‌ను చూసి పిల్లలు నవ్వినప్పుడు.. అంతకుమించిన కాంప్లిమెంట్ లేదని సంతోషపడ్తుందట. మంచి మ్యుజీషియన్ కావాలనే లక్ష్యం కూడా ఆమెలో ఇంకా ఉంది. అందుకే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ నేర్చుకుంటోంది. మరి ఫ్యూచర్ ప్లాన్స్? ‘‘ఈ మాట విన్నా.. అనుకున్నా వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే నేనేదీ ప్లాన్ చేసుకోను. టైమ్ వెంట జర్నీ చేస్తూంటా. వర్తమానంలో ఉండడానికే ఇష్టపడ్తా. ఈ క్షణాన్నే ఎంజాయ్ చేస్తా’’ అంటోంది అమీ ష్రాఫ్. – శరాది -
‘నేను స్మోక్ చేస్తాను.. డ్రింక్ చేస్తాను అంతమాత్రానా’
‘నేను సిగరెట్ తాగుతాను.. డ్రింక్ చేస్తాను. అంత మాత్రానా నేను చెడ్డ తల్లిని ఎలా అవుతాను?’ అంటూ నెటిజన్లను ప్రశ్నిస్తున్నారు బాలీవుడ్ నటి శ్వేతా సాల్వే. విషయమేంటంటే కొన్ని రోజుల క్రితం శ్వేతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో సిగరెట్ తాగుతూ ఉన్న పోస్ట్ చేశారు. ఈ ఫోటో కాస్తా నెటిజన్లకు కోపం తెప్పించింది. దాంతో వారు ‘ఇలా చేయడానికి మీకు సిగ్గుగా లేదా? మీరు మంచి తల్లి కాదు. మీ పిల్లలకు కూడా ఈ అలవాట్లు వస్తాయి’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ కామెంట్లపై శ్వేత స్పందించారు. ‘అవును. నేను తాగుతాను, ధూమపానం కూడా చేస్తాను. కానీ నేను నిజాయతీగా ఉంటాను. కేవలం డ్రింక్ చేయడం, సిగరెట్ తాగడం వంటి వాటి వల్ల నేను మంచి తల్లిని కాకుండా పోతానా? అయిన నా జీవితాన్ని వృథా చేసుకోవడం మీరు చూశారా? పని పాటా లేకుండా ఖాళీగా గడపడం చూశారా? ఎప్పుడైనా నా పిల్లల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూశారా? నిత్యం నేను ఎన్నో పనులతో బిజీగా ఉంటాను. నేను నటిని, డ్యాన్సర్‌ను, పారిశ్రామికవేత్తని. ఇతరుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి నేను ఎలాంటి ప్రశ్నలు వేయను. కాబట్టి నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి మీరూ ఇలాంటి ప్రశ్నలు వేయకండి’ అంటూ నెటిజన్లపై మండిపడ్డారు. అంతేకాక ‘నా తల్లిదండ్రులు నన్ను పద్ధతిగానే పెంచారు. సమాజంలోని మంచి, చెడు తెలియజేశారు. నా ఫాలోవర్ల గురించి.. నా పోస్ట్‌లకు చేసే లైక్‌ల గురించి నేను పట్టించుకోను. మీరే నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నారు. నా పద్ధతి నచ్చకపోతే అన్‌ఫాలో అవ్వచ్చు’ అంటూ డ్రింక్ చేస్తున్న ఫొటోను షేర్ చేశారు. View this post on Instagram A Day off Looks something like this .. . Yes I Drink and Smoke ... I am real , honest and basic like that. It has to be of no reason that anyone ever judge me for the person I am or the Mommy I am .. I don’t propagate it and neither do I question anyone else who does , so I would respect the same back . Today I got a few random DM’s by totally random people about my actions , and I usually let such things go pass me but for some reason today I felt like addressing it . How does this make me a bad person or a bad mom ?? Do you see me wasting my Life ? Do you see me sitting unemployed n jobless ? Do you see me neglecting my child ? I work , I work multiple jobs , I’m an actor , dancer , an entrepreneur . I successfully live in two major cities of our glorious country . I have beautiful friends whom I love and I know who love me back for the person I am . Risking the fact that I might sound aggressive , don’t ever question my abilities of being a bad example to my child !! So tell me does an honest sex worker who sells her body to feed her family , to maybe get an education or to provide a life for her children is a Bad Person ? A Bad Mother ? A stigma to society ? Who are you and I to Judge ?? My parents taught me well and exposed me to the good and evil of everything . They smoked and drank too but they did a mighty fine job of raising my brother and I . As children we knew that this was not something we could practice until a certain age . And that too if we ever wanted to.. a choice that we were allowed to take as adults ... Today I share a drink with them , and celebrate the fact that they gave me a fabulous childhood n Life and I aspire to do the same with my Baby . . . I don’t pay for likes and followers , you choose to follow me for who I am . And hence what you see is me being me and you always have the option to unfollow me :) . Live and Let Live ✌🏼.. this rant has gotten me all irked so I’m gonna go pour myself a red and light up .. #micdrop 👊🏼 . #bekindtooneanother #peaceout A post shared by ⓢⓗⓥⓔⓣⓐ ⓢⓐⓛⓥⓔ (@shveshve) on Oct 28, 2018 at 5:51am PDT -
బాటిళ్లలో ‘మహువా’ అమ్మకాలు
న్యూఢిల్లీ: సంప్రదాయ గిరిజన పానీయం ‘మహువా’ను బాటిళ్లలో నింపి మార్కెటింగ్ చేయాలని కేంద్రం యోచిస్తోంది. వన్‌ధన్ కార్యక్రమం కింద గిరిజన ఉత్పత్తులకు ప్రచారం కల్పించడంలో భాగంగా ఈ దిశగా ఆలోచిస్తోంది. ఈ మేరకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ, గిరిజన సహకార మార్కెటింగ్ సమాఖ్య ట్రైఫెడ్తో అవగాహనా ఒప్పందం కుదర్చుకుందని అధికారులు తెలిపారు. అయితే మహువాలో ఆల్కహాల్ పాళ్లు ఉన్నందున దాని అమ్మకానికి ఇంకా పలు అనుమతులు రావాల్సి ఉంది. బాటిళ్లలో నింపే సమయంలోనే ఈ పానీయానికి అల్లం, వాము కలిపితే మరింత రుచికరంగా మారుతుందని ట్రైఫెడ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గిరిజనుల ఏ వేడుకలోనైనా సేవించే ఈ పానీయాన్ని మహువా పువ్వుల నుంచే తయారుచేస్తారు. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని గరిజన ప్రాంతాల నుంచి ఈ ఉత్పత్తిని సేకరిస్తారు. గిరిజనుల ఇతర ఉత్పత్తులైన చింతపండు, ఉసిరిని కూడా జామ్ రూపంలో మార్కెటింగ్ చేయాలని కూడా కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. -
వాడిపడేసే కప్పులతో తాగకండి
ప్లాస్టిక్ కప్పులతో మాత్రమే కాదు, చాలా షాపుల్లో, టీ, కాఫీలు సర్వ్ చేయడానికి వాడే డిస్పోజబుల్ కప్పులు కూడా కేన్సర్ ముప్పును కలిగిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరిస్తోంది. ఒకసారి వాడి పడేసేందుకు ఉపయోగపడే డిస్పోజబుల్ కప్పుల తయారీలో కూడా ప్లాస్టిక్, కృత్రిమ రబ్బర్ వస్తువుల తయారీలో వాడే ‘స్టైరిన్’ అనే రసాయనం కేన్సర్‌ను కలిగించగలదని వెల్లడించింది. నిజానికి ఈ రసాయనాన్ని ‘ బహుశ కేన్సర్‌కు దారితీసే అవకాశాలు గల రసాయనం’గా డబ్ల్యూహెచ్ఓ నలభై ఏళ్ల కిందటే గుర్తించింది. ఈ రసాయనం వల్ల కేన్సర్ ముప్పు అవకాశాలు మరింతగా ఉంటాయని తాజా పరిశోధనల్లో తేలడంతో ఇప్పుడు దీనిని మరింత ప్రమాదకర పదార్థాల జాబితాలో చేర్చింది. డేనిష్ ప్లాస్టిక్ పరిశ్రమలో పనిచేసే 70 వేల మంది ఉద్యోగులపై ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్ (ఐఏఆర్సీ) నిపుణులు మూడున్నర దశాబ్దాల సుదీర్ఘ పరిశోధనలు కొనసాగించిన తర్వాత, డిస్పోజబుల్ కప్పుల తయారీకి ఉపయోగించే ‘స్టైరిన్’ రసాయనం కేన్సర్ ముప్పును కలిగించగలదని నిగ్గు తేల్చారు. -
సమ్మర్ అమృతం
వేసవిలో ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. ఎంత చెరకు రసం తాగినా, ఎన్ని కొబ్బరి బొండాలు తాగినా కూడా దాహం తీరదు. మళ్లీ మళ్లీ తాగుతూనే ఉండవలసి వస్తుంది. వీటì తో పాటు కొన్ని సార్లు జల్ జీరా కూడా తాగడం మంచిది. ఈ పానీయాన్ని బయట కొని తాగడం కంటె, స్వయంగా ఇంట్లోనే తయారుచేసుకుని తాగడం ఆరోగ్యకరం. కావలసినవి: గింజలు లేని చింత పండు – టేబుల్ స్పూను, పుదీనా ఆకులు – ముప్పావు కప్పు, జీల కర్ర – ఒకటిన్నర టీ స్పూన్లు, సోంపు – ఒక టీ స్పూను, మిరియాలు – అర టీ స్పూను, ఆమ్ చూర్ పొడి – అర టీ స్పూను, ఏలకుల పొడి – పావు టీ స్పూను, ఇంగువ – చిటికెడు, బూందీ – ఒక టేబుల్ స్పూను, చాట్ మసాలా – అర టీ స్పూను, రాళ్ల ఉప్పు – తగినంత తయారీ: ♦ పుదీనా ఆకులను శుభ్రంగా నీళ్లలో కడగాలి. ♦ చింతపండును కూడా శుభ్రంగా కడగాలి. ♦ పైన చెప్పిన పదార్థాలన్నిటినీ (బూందీ, చాట్ మసాలా తప్పించి) మిక్సీలో వేసి, ముప్పావు కప్పు నీళ్లు జత చేసి మెత్తగా చేసి వడపోయాలి. ♦ నాలుగు కప్పుల చల్లటి నీళ్లు జత చేసి ఫ్రిజ్‌లో ఉంచాలి. ♦ గ్లాసులలో సర్వ్ చేసేటప్పుడు కొద్దిగా బూందీ, కొద్దిగా చాట్ మసాలా వేసి చల్లగా అందించాలి. -
తాగి నడిపితే జైలుకే..
కరీంనగర్‌క్రైం: మందు తాగి వాహనం నడిపితే జైలుకే.. మద్యం మత్తులో జరుగుతున్న ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసులు డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నారు. తాగి వాహనం నడిపి దొరికితే జరిమానాలే కాదు.. జైలుకు కూడా పంపుతున్నారు. జిల్లాలో జరుగుతున్న ప్రమాదాల్లో 90 శాతం మద్యం మత్తులోనివేనని పోలీసులు పేర్కొంటున్నారు. వీటి నివారణకే పలు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రత్యేక డ్రైవ్‌లు.. మందుబాబులపై ప్రత్యేక డ్రైవ్‌లు మన రాష్ట్రంలో 2011 నవంబర్ 4న హైదరాబాద్‌లో అప్పటి సెంట్రల్‌జోన్ డీసీపీగా పనిచేసిన, ప్రస్తుతం కరీంనగర్ కమిషనర్‌గా పనిచేస్తున్న కమలాసన్‌రెడ్డి ప్రారంభించారు. తాగి ప్రమాదాల బారిన పడుతున్న వారిలో 21–30ఏళ్ల లోపు యువకులే ఎక్కువగా ఉంటున్నారు. వీరిపై వివిధ రకాల జరిమానాలు, శిక్షలు అమలు చేశారు. ఈ చర్యలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో పనిచేసే రోడ్ సేప్టీ ఇన్ టెన్ కంట్రీస్(ఆర్ఎస్–10) ప్రాజెక్టు అధికారులు కితాబునిచ్చారు. హైదరాబాద్‌లో విజయవంతం కావడంతో జిల్లాలో 2013 ఆగస్టు నుంచి ప్రత్యేక డ్రైవ్ చెపడుతున్నారు. అందుబాటులో అత్యాధునిక మిషన్లు అందుబాటులో అత్యాధునిక మిషన్లుప్రస్తుతం మన పోలీసుల వద్ద ఆధునిక బ్రీత్ అనలైజర్లు అందుబాబులో ఉన్నాయి. తక్కువ సమయంలో సమర్థవంతంగా పని చేసే అడ్వాన్స్ యంత్రాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనిలో రెండు మోడ్‌లుంటాయి. మొదట పాసీవ్మోడ్లో పరీక్షించి మద్యం తాగి ఉన్నాడా? లేదా నిర్ధారించి.. డ్రంకెన్ స్టేజీలో ఉంటే అప్పుడు యాక్టివ్ మోడ్‌లో పరీక్షించి నిర్ధారించి ప్రింట్ తీస్తారు. ఇది కోర్టులో సాక్ష్యంగా చెల్లుబాటవుతోంది. ఆ మూడు సెక్షన్లు.. కేంద్ర మోటారు వాహనాల చట్టంలోని కొన్ని సెక్షన్ల ప్రకారం కూడా జరిమానాలు వేస్తున్నారు. సెక్షన్ 185 ప్రకారం మద్యం తాగి వాహనం నడిపేవారిని పట్టుకునేందుకు డ్రైవ్ చేపట్టడం.సెక్షన్ 203 ప్రకారం ఐఎస్ఐ ధ్రువీకరించిన బ్రీత్ ఎనలైజర్‌ను వినియోగించి తనిఖీ చేయడం.సెక్షన్ 130 ప్రకారం వాహనం స్వాధీనం చేసుకొని చార్జ్‌షీట్ తయారు చేసి కోర్టులకు పంపే అవకాశముంది. రెండో సారి చిక్కితే జైలు.. లైసెన్స్ రద్దు.. పోలీసులు గతంలో మందుబాబులపై ర్యాష్ డ్రైవింగ్(సెక్షన్ 184)కింద కేసు నమోదు చేసి ఫైన్ వేసేవారు. గతేడాది నవంబర్ నుంచి సెక్షన్ 185 కింద బుక్ చేసి కోర్టుకు పంపుతున్నారు. మద్యం సేవించిన వాహనం నడిపితే రూ. 500 నుంచి రూ. 2 వేల వరకూ జరిమానా విధించే అవకాశముంది. రెండోసారి చిక్కితే రూ.3 వేల జరిమానా లేదా రెండేళ్ల వరకూ జైలు శిక్ష విధించే అవకాశం చట్ట ప్రకారం ఉం ది. అంతేకాకుండా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు సిఫారసు చేస్తున్నారు. ఇప్పటికే 150 మంది లైసెన్స్‌లు రద్దుకు ఆర్టీఏ అధికారులకు లేఖలు రాశారు. ఒకసారి రద్దయితే రెండేళ్ల వరకూ రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. డౌన్‌లోడ్‌తో పరీక్షించుకోండి.. నిత్యం అనేక మంది డ్రంకెన్ డ్రైవ్ సమయంలో పోలీసుల వద్ద పలు సందేహలు లేవనేత్తుతున్నారు. ఎవరికి వారు మద్యం ఎంత తాగాలి? తాగింది ఎలా లెక్కించుకోవాలని అడుగుతున్నారు. దీనికో పరిష్కారముందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంటర్నెట్ నుంచి ఆధునిక అండ్రాయిడ్ ఫోన్లలో ‘‘డ్రంక్ కం పేనియర్’’ అనే సాప్ట్వేర్ డౌన్లోడు చేసుకుం టే అందులో మద్యం సేవించిన వివరాలు నమోదు చేస్తే..బీఏసీ కౌంట్ చెప్తుంది. అది 30 కంటే తక్కువ చూపితే వాహనాలు నడపండి.. ఎక్కువ చూపితే నడపొద్దు. ఐదేళ్లలో 7207 కేసులు..రూ..78.10 లక్షలు జరిమానా ఒక్క కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 2014లో 105 కేసులు.. రూ. 2. 10 లక్షల జరిమానా, 2015లో 235 కేసులు రూ.4.70 లక్షల జరిమాన విధించారు. కరీంనగర్ కమిషనరేట్‌గా మారిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ వేగం పెరి గింది. దీంతో భారీగా కేసులు నమోదయ్యాయి. 2016లో 2519 కేసులు నమో దు కాగా.. 2039 మందికి శిక్షలు పడగా.. 369 మందికి జైలు శిక్ష విధించారు. 89 మందికి శ్రమదానం శిక్షతోపాటు.. రూ.11.29 లక్షల జరిమానా విధించా రు. 2017లో 3897 కేసులు నమోదు కాగా వీటిలో 2505 మందికి శిక్షలు పడగా 572 మందికి జైలు శిక్ష విధించారు. 247 మందికి శ్రమదానం శిక్షతోపా టు రూ.59.77 లక్షలు జరిమానా విధించారు. 2018లో ఇప్పటి వరకూ 451 కేసులు నమోదు కాగా 394 మందికి శిక్షలు పడగా.. 229 మందికి జైలు శిక్ష విధించారు. 11 మందికి శ్రమదానం శిక్షతోపాటు రూ.11.59 లక్షల జరిమానా విధించారు. బీఏసీ లెక్కింపు ఇలా... బ్రీత్ ఎనలైజర్లు వాహనచోదకుడి శరీరంలో ఉన్న అల్కహాల్ను బ్లడ్ ఆల్కహాల్ కౌంట్(బీఏసీ) ద్వారా లెక్కిస్తాయి. ప్రతి 100 మీ.లీ. రక్తంలో 30 మి.గ్రా. కంటే ఎక్కువగా ఉంటే అది ఉల్లంఘన కింద లెక్క. అతిగా మద్యం సేవిస్తే బీఏసీ సుమారు 300 దాకా ఉంటుంది.150 బీఏసీ కంటే ఎక్కువగా ఉంటే జైలు శిక్ష విధించే అవకాశముంది. తగ్గుతున్న ప్రమాదాలు.. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు రోజు ప్రత్యేక డ్రైవ్‌లు చేపడుతున్నాం. మూడేళ్లగా చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. ఈ తనిఖీల ప్రభావంతో తమవారు త్వరగా ఇంటికి వస్తున్నారని పలువురు మహిళలు అనందం వ్యక్తం చేస్తున్నారు. మందుబాబులకు ప్రస్తుతం జరిమానా, జైలు శిక్షలు విధిస్తున్నాం. డ్రైవింగ్ లైసెన్స్‌ల రద్దుకు సిఫారసు చేశాం. మద్యం తాగితే రోడ్డెక్క వద్దు.. ప్రమాదాలు కొని తెచ్చుకొవద్దు. – కమలాసన్‌రెడ్డి, కరీంనగర్ పోలీస్ కమిషనర్ -
బలవంతంగా మూత్రం తాగించారు.. ఆ అవమానంతో...
లక్నో : ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఆరోపణలతో ఓ యువకుడిపై దాష్టీకానికి పాల్పడ్డారు. పంచాయితీ పెద్దల తీర్పుతో బలవంతంగా అతనితో మూత్రం తాగించగా.. ఆ అవమాన భారంతో అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే... సహారాన్పూర్లోని ఇందిరా కాలనీకి చెందిన యువకుడికి ఓ యువతితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ స్థానికులు దాడి చేశారు. ఈ క్రమంలో పంచాయితీ పెట్టగా.. పెద్దలు దారుణమైన తీర్పు ఇచ్చారు. మహిళలు అతనితో బలవంతంగా మూత్రాన్ని తాగించారు. ఘటన తర్వాత ఇంటికెళ్లిన ఆ యువకుడు ఆత్మహత్యాయత్నం చేయగా.. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించి కాపాడారు. అసలు ఆ యువతి ఎవరో తనకు తెలీదని.. ఎంత చెబుతున్నా వినకుండా గ్రామస్థులు తనపై దాడి చేశారని అతను చెబుతున్నాడు. తనకు ప్రాణహాని ఉందని చెప్పిన అతను పోలీస్ రక్షణ కోరుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు -
వెంటాడే విషాదం
-
అంబులెన్స్‌లోకి ఎక్కించాక కూడా సిగరెట్..
-
అంబులెన్స్‌లోకి ఎక్కించాక కూడా సిగరెట్..
రబత్: తప్పు చేయాలంటేనే ప్రతి ఒక్కరూ భయపడుతుంటారు. ఒక వేళ చేస్తున్నా అది బయటకు తెలియకుండా జాగ్రత్త పడతారు. అయితే అది ఎప్పటికో బయటపడుతుందిగానీ ఆ సమయానికి తీవ్రత తక్కువగా ఉంటుంది. కానీ, తాను తప్పు చేస్తున్నాను చూడండహో అంటూ ఓ 20 ఏళ్ల యువకుడు ఏకంగా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. ఫుల్లుగా మధ్యం సేవిస్తూ ఫెరారీ కారును డ్రైవింగ్ చేస్తూ ఆ వీడియోలను నేరుగా ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా సైట్లలో పోస్ట్ చేశాడు. అలా అతడు డ్రైవింగ్ చేస్తున్న క్రమంలోనే మరో కారు ఢీకొట్టి అప్పుడు కూడా ఏ మాత్రం భయపడకుండా పోలీసులు వచ్చిన లక్ష్యపెట్టకుండా వారి పనుల్లో వారు నిమగ్నమై ఉండగా అతడు మాత్రం అదే తీరుతో వ్యవహరించాడు. తానొక తప్పు చేశానని, మరో కారును ఢీకొట్టాననే విషయం కూడా ఆదమరిచి పోలీసుల ముందే ఫుల్లుగా తాగుతూ వీడియోలు తీసుకుంటూ కనిపించాడు. ఖండించాల్సిన మరో విషయం ఏమిటంటే అతడిని అంబులెన్స్‌లోకి ఎక్కించాక కూడా సిగరెట్ తాగుతూ దానిని కూడా వీడియో తీసి పెట్టాడు. మొరాకోలోని రాబత్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. గత నెలలో పోలీసులు అరెస్టు చేయగా అతడికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. అయితే, ఆ యువకుడు స్థానికంగా ఉండే ఓ బడా వ్యాపారి మేనళ్లుడంట. అతడికి రూ.1.4లక్షల ఫైన్ కూడా విధించారు. అయితే, ప్రస్తుతం అతడికి జైలులో కూడా సకల సౌకర్యాలు ఇస్తూ ప్రత్యేకంగా పరిగణిస్తున్నారంట. అదేదో సినిమాలో అన్నట్లు పేదోడు తాగితే తాగుబోతని, ధనవంతులు తాగితే పార్టీ చేసుకున్నారని అన్నట్లు సమాజానికి హానీ చేసే ఈ ధనవంతుల కుటుంబానికి చెందిన యువకుడికి ఏ పేరు పెట్టి పిలవాలో మరి. -
బ్రాహ్మణపల్లెలో వ్యక్తి దారుణ హత్య
ఓర్వకల్లు: తాగిన మైకంలో ఇద్దరి స్నేహితుల మధ్య ఏర్పడిన ఘర్షణ ఒకరిని బలి తీసుకుంది. ఈ విషాద ఘటన బ్రహ్మణపల్లెలో గురువారం చోటు చేసుకుంది. ఉగాది సంబరాల సందర్భంగా గ్రామంలో కొందరు రైతులు కాడెద్దులతో ఊరేగింపు నిర్వహించారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన బోయ పుల్లయ్య(58), పిన్నాపురం ఎల్లప్ప మద్యం తాగి చిందులు వేస్తుండగా ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఆ సమయంలో స్థానికులు ఇద్దరిని మందలించి అక్కడి నుంచి పంపివేశారు. అయితే తీవ్ర మనస్తాపానికి గురైన ఎల్లప్ప కర్రతో పుల్లయ్య తలమీద బాదాడు దీంతో తీవ్ర రక్తస్రావమైన పుల్లయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆటోలో కర్నూలు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ చంద్రబాబు నాయుడు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి భార్య లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు ఎల్లప్పపై హత్య కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. సీఐ నాగరాజు యాదవ్ ఆదేశాల మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలుకు తరలించారు. హతునికి భార్యతో పాటు శ్రీనివాసులు, వెంకటరమణ అను ఇద్దరు కుమారులు సంతానం. -
వైఎస్సార్ జిల్లాలో రెవెన్యూ అధికారుల జల్సాలు
-
మద్యం తాగి వాహనాలు నడపొద్దు
చౌటుప్పల్ : మద్యం తాగి వాహనాలు నడుపవద్దని ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ దివ్యచరణ్రావు అన్నారు. చౌటుప్పల్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరగుతున్నాయన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రమాదాల నివారణకు, శాంతిభద్రతల పరిరక్షణపై కమిషనర్ మహేష్ భగవతి ప్రత్యేక దృష్టిసారించారన్నారు. ఆయన ఆదేశాల మేరకే భువనగిరి, చౌటుప్పల్‌లలో ట్రాఫిక్ పోలీస్స్టేషన్లు ప్రారంభించినట్టు పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించా లన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్యాంసుందర్‌రెడ్డి, సీఐ నవీన్‌కుమార్, ట్రాఫిక్ సీఐ రవికిరణ్, ఎస్ఐ మధుసూదన్ పాల్గొన్నారు. -
శ్రీకాకుళం జిల్లా పాలకొండ గుడిలో అపచారం
-
పెగ్గులమీద పెగ్గులేసి నితీశ్ పరువు తీశాడు
పాట్నా: ఆయనొక బిహార్ రూలింగ్ పార్టీ నాయకుడు. సొంతపార్టీ అధికారంలో ఉంది కదా.. ఆ మత్తుకు మద్యం మత్తు చేర్చాడు. ఓ పక్క రాష్ట్రమంతా మద్యాన్ని నిషేధించి ఎవరు ఆ మత్తు బారిన పడకుండా ఉండాలని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చర్యలు తీసుకుంటుండగా.. ఈ నాయకుడు మాత్రం అందుకు భిన్నంగా పనిమొదలుపెట్టాడు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన లలన్ రామ్ అనే ఈ పెద్ద మనిషి ఏం చక్కా బనియన్, షార్ట్ వేసుకొని ఓ రబ్బురు కుర్చీలో కూర్చుని ఎదురుగా బీరు బాటిళ్లు ఇతర ఓడ్కా పెట్టుకొని పెగ్గులమీద పెగ్గులు లాగించాడు. అలా పెగ్గులేస్తూ తానొక బాహుబలినని, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన పక్కన ఉన్నంత సేపు ఏం కాదని డంబాలు పలికాడు. అతడి దురదృష్టం కొద్ది ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో అడుగుపెట్టి ప్రతి ఒక్కరిని పలకరించింది. దీంతో మద్యం నిషేధం ఆదేశాలను ఉల్లంఘించిన ఆరోపణల కిందట పోలీసులు అరెస్టు చేశారు. పైగా ముఖ్యమంత్రి పరువు తీయడమే కాకుండా.. పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరించినందుకు అతడిని పార్టీ నుంచి బహిష్కరించాలని నిర్ణయించారు. -
కోకాకోలా
పేరులోనేముంది? అంతర్జాతీయ అభిమాన శీతల పానీయం కోకాకోలాకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా? కోకాకోలా ఫార్ములాకు రూపకల్పన చేసిన అమెరికన్ ఫార్మసిస్ట్ జాన్ ఎస్ పెంబర్టన్ దీని తయారీలో ప్రధానంగా కోకా ఆకులను, కోలా గింజలను ఉపయోగించాడు. అందువల్ల ఈ పానీయానికి ‘కోకాకోలా’ అని నామకరణం చేశాడు. ‘కోలా’ స్పెల్లింగ్ ‘కె’తో మొదలైనా, బ్రాండ్ లోగో రాసేటప్పుడు ‘సి’ అక్షరం ఉంటేనే బాగుంటుందని భావించాడు. అలా రూపొందిన ‘కోకాకోలా’ లోగోనే కాదు, పానీయం కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. -
చైన్ స్నాచర్ అనుకుని దేహశుద్ధి..
పంజగుట్ట: మద్యం మత్తులో ఓ యువకుడు మహిళపై చెయ్యి వేయడంతో అక్కడి స్థానికులు చైన్‌స్నాచర్ అని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పంజగుట్ట పోలీసులు తెలిపిన వివరాలివీ.. వరంగల్ జిల్లా జనగామకు చెందిన వినోద్ అనే యువకుడు అతిగా మద్యం సేవించి శనివారం రాత్రి సుమారు 8:15 ప్రాంతంలో అమీర్‌పేట బిగ్ సీ వద్ద వాహనం ఆపుకుని నిలబడ్డాడు. రోడ్డుపై అటుగా వెళుతున్న ఓ యువతిని చేయిపట్టుకునేందుకు యత్నించగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. అక్కడే ఉన్న కొందరు స్థానికులు చైన్‌స్నాచింగ్ చేసేందుకు యత్నించాడనుకుని, అతడిని చితకబాదారు. అనంతరం పంజగుట్ట పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వినోద్‌ను అదుపులోకి తీసుకుని మద్యం లెవల్ తెలుసుకునేందుకు ఆసుపత్రికి తరలించారు. ఇదిలాఉండగా, వినోద్‌పై బాధిత యువతి ఎలాంటి ఫిర్యాదు ఇవ్వకుండానే వెళ్లిపోయింది. -
మద్యం తాగి ఎస్సైని దూషించిన కానిస్టేబుల్
-
యాసిడ్ తాగి ఆత్మహత్య
అడ్డగుట్ట: చేసుకున్న సంఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...అడ్డగుట్ట బీ సెక్షన్‌కు చెందిన రుద్రమోహన్(34) వృత్తిరిత్యా ఆటోడ్రైవర్. భార్య పిల్లలతో నివాసముంటున్నాడు. అయితే గురువారం మధ్యాహ్నం తుకారాంగేట్ పహాడీ హనుమాన్ దేవాలయం సమీపంలోకి యాసిడ్ బాటిల్ తీసుకొని వెళ్లాడు. ఉన్నట్టుండి తన వద్దనున్న యాసిడ్ బాటిల్ తెరచి యాసిడ్ సేవించాడు. అనంతరం, తన అన్నకు ఫోన్ చేసి తాను యాసిడ్ తాగానని చెప్పి ఫోన్ కట్ చేశాడు. దీంతో వెంటనే మోహన్ అన్న సంఘటనా స్థలానికి చేరుకొని అతన్ని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ అతిగా సేవించడం వల్ల కడుపులోని అవయవాలు పూర్తిగా కాలీపోవడంతో చికిత్స మధ్యలోనే మోహ న్ మృతి చెందాడు. కుటుంభసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మతుడి జేబులో ఓ సూసైడ్ నోట్ లభ్యమైందని అందులో ‘‘ నా చావుకు ఎవరు బాధ్యులు కారు. జీవితంపై విరక్తి చెంది నన్ను నేను చంపుకుంటున్నాను. నన్ను క్షమించండి. అమ్మ ముందు’’ అని రాసి ఉందని పోలీసులు తెలిపారు. -
తాగుబోతుల బెడద తీవ్రరూపం..
-
ఇక కళ్లతో, ముక్కుతో మందుకొట్టొచ్చు!
బ్రిటన్: మందుప్రియులకు మరింత సౌకర్యం కలగనుంది. నోటిద్వారా కాకుండా హ్యాపీగా ఓ చోట కూర్చుని ముక్కుతోనూ, దిక్కులన్నీ కళ్లార్పకుండా చూస్తూ కళ్లతోనూ మద్యం తాగే అవకాశం రానుంది. ఈ సౌకర్యం బ్రిటన్‌లోని ఓ ఆల్కాలిక్ ఆర్కిటెక్చర్ బార్లో త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రపంచంలోనే తొలిసారి మద్యం వాతావరణం ఏర్పాటుచేసి అందులో వచ్చే గాలి ద్వారా దానిని శ్వాస ద్వారా, కళ్లద్వారా ఆస్వాధించే ఏర్పాట్లు చేస్తున్నారు. లండన్‌లోని బారోగ్ మార్కెట్లో మరో నెల రోజుల్లో ఏర్పాటుచేస్తున్నారు. ఇందులో ఉపయోగించే స్పిరిట్స్, బీర్స్ అన్నీ కూడా ప్రత్యేక సన్యాసులు తయారు చేయనుండటం విశేషం. ఇందులో వచ్చే మద్యం తేమ వలన దుస్తులు, జుట్టు పాడవకుండా తలనుంచి భుజాల మీదుగా కిందివరకు కప్పి ఉంచే ఓ రకమైన టోపీని అందిస్తారు. ఇక గుప్పుమంటూ వచ్చే మందు ఆవిరిని ఊపిరితో బిగబట్టి లాగేసి మత్తులో తేలుతున్న అనుభూతిని పొందవచ్చు. అయితే, నేరుగా మద్యం తాగే స్థాయికన్నా 40శాతం తక్కువ మద్యాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే నేరుగా లివర్‌పై అధిక ప్రభావాన్ని చూపించే ప్రమాదం పొంచి ఉంది. ఈ బార్లో మద్యంలో కలిపి పదార్థాల హెచ్చుతగ్గులను పరిశీలించేందుకు ప్రత్యేక శాస్త్రవేత్తలను, కెమిస్ట్‌లను కూడా ఈ బార్లో ఉంచనుండటం మరొక ప్రత్యేకత. ఒక్కసారి ఈ బార్లోకి అడుగుపెట్టాలంటే 15వందల రూపాయాలు చెల్లించాల్సి ఉంటుంది. లోపలికి వెళ్లాక ఖర్చులు మాత్రం అదనం. -
మద్యం మత్తులో భార్యను హతమార్చిన భర్త
కొడవలూరు (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా): కొడవలూరు మండలం నాయుడుపాళెంలో ఒక వ్యక్తి మద్యం మత్తులో తన భార్యను హతమార్చాడు. ఈ సంఘటన గురువారం వేకువజామున జరిగింది. నాయుడుపాళెం గ్రామానికి చెందిన జంపాల మల్లికార్జున బుధవారం రాత్రి పొద్దుపోయేంత వరకూ మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. వేకువ జామున ఇంటికి వచ్చిన భర్తను ప్రశ్నించిన భార్య ఈశ్వరమ్మ (35)ను రోకలిబండతో తలపై బాదాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం తెలిసిన వెంటనే కొడవలూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఈశ్వరమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నాడు. నిందితుడు మల్లికార్జున పరారీలో ఉన్నాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి చేయలేదని యువకుడి ఆత్మహత్య
వానవోలు(గోరంట్ల): పెళ్లి చేయలేదని మద్యం తాగొచ్చి, తల్లితో గొడవ పడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అనంతపురంజిల్లా గోరంట్ల మండలంలోని వానవోలు గ్రామంలో చోటుచేసుకొంది. వానవోలు గ్రామానికి చెందిన చాకలి రవి (25) తనకు పెళ్లి చేయమని సోమవారం రాత్రి తన తల్లితో గొడవపడ్డాడు. అయితే ‘‘తండ్రి లేడు, తాగుడుకు బానిసగా మారి జూలాయిగా తిరుగుతున్న నీకెవ్వరు బిడ్డను నిస్తారు.’’ అని తల్లి చెప్పింది. దీంతో తన తల్లి నిద్రపోయాక ఇంట్లో ఉన్న దూలానికి ఉరి వేసుకుని రవి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెల్లారి లేచి చూసేసరికి కొడుకు శవం వేలాడుతుండడంతో గమనించిన తల్లి ఆంజినమ్మ స్థానికులకు తెలిపింది. స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. శవపంచనామా నిమిత్తం శవాన్ని పెనుకొండ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
రోజూ రెండుకంటే ఎక్కువేస్తే..!
లండన్: ప్రతి రోజు రెండు లేదా అంతకంటే ఎక్కువ రకాల పానీయాలు తీసుకునే పెద్దవారికి గుండెపోటు సమస్యలు వస్తాయని హెచ్చరిస్తోంది తాజా అధ్యయనం. వారానికి 14 రకాల మత్తుపానీయాలు తీసుకునే పురుషుల్లో మాత్రం గుండెలోని ప్రధాన కవాటాలను, ధమనులను ప్రభావితం చేస్తాయని, రక్తాన్ని శరీరానికి పంపించడంలో తేడా వస్తుందని హెచ్చరిస్తోంది. ఇక మహిళల్లో మాత్రం ఈ సమస్య తీవ్రంగా ఉంటుందని ఆ అధ్యయనం చెబుతోంది. హార్వార్డ్ మెడికల్ స్కూల్ కు చెందిన కొంతమంది బృందం ఈ అంశంపై ప్రత్యేక పరిశోధనలు నిర్వహించగా ఈ విషయం వెల్లడైంది. హృదయనాళాలు పెరిగిపోవడంగానీ, తగ్గిపోవడం లేదా, హృదయ కండరాలు పటుత్వం కోల్పోవడంవంటి సమస్యలు కూడా వస్తాయని తెలిపారు. -
కల్లుతాగినమత్తులో ప్రియుడిని చంపిన ప్రియరాలు
-
ఈ కిక్ సమాజానికి అవసరమా?
-
కిక్ అంటే తంతాం!
-
ఇదేనా హీరోయిజం అంటే!
-
మందేసి..చిందేసి...