యూత్‌ను ప్రధానంగా టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్న చిత్రం 'డ్రింకర్ సాయి' ఇప్పటికే విడుదలైన టీజర్‌లో ఎక్కువగా బోల్డ్ డైలాగ్స్ ఉండటంతో నెట్టింట తెగ వైరల్ అయింది. అయితే, తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. లవ్ స్టోరీతో పాటు యూత్ ఆలోచించతగిన కొన్ని వాస్తవ సంఘటనలకు దగ్గరగా ఈ చిత్రం ఉండనుంది.
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న 'డ్రింకర్ సాయి' సినిమాకు బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ట్యాగ్ లైన్‌గా ఉంచారు. ఈ మూవీని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్‌పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. డిసెంబర్ 27న ఈ చిత్రం విడుదల కానుంది.
డ్రింకర్ సాయి టీజర్‌ను ఇప్పటికే చూసిన ప్రేక్షకుల నుంచి ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే, అందులో కాస్త బూతు డైలాగ్స్ ఉండటంతో కొంతమంది నుంచి వ్యతిరేకత కూడా రావడం జరిగింది. కానీ, ప్రస్తుతం విడుదలైన ట్రైలర్‌లో కథలోని గ్రిప్పింగ్‌ను తెలియచేస్తూ ఉంది. ధర్మ, ఐశ్వర్య మధ్య వచ్చే సీన్స్ ఎమోషన్స్‌తో పాటు అందరినీ ఆలోచింపచేసేలా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment