
పార్లే ఆగ్రో కంపెనీ తమ పాపులర్ ప్రొడక్ట్ యాపీ ఫిజ్ తన వినియోగదారులకు స్మార్ట్‌ఫోన్లను బహుమతిగా ఇస్తోంది. ప్రమోషన్‌లో బాగంగా నాలుగు శాంసంగ్ గెలాక్సీ 10 ప్లస్ స్మార్ట్‌ఫోన్లను గ్రాండ్‌ప్రైజ్‌గా అందివ్వనుంది. నవంబరు 7 నుంచి 22 వరకు ఈ పోటీ అందుబాటులో ఉంటుంది.
పోటీలో పాల్గొనాలంటే..
- దేశ వ్యాప్తంగా ఆ పోటీ అందుబాటులో ఉంది. ఫీల్ ద ఫిజ్ అధికారిక ఇన్‌స్టగ్రామ్‌ను పేజీని ఫాలో కావాలి.
- యాపీ ఫిజ్‌తో కలిపి మీకు నచ్చిన ఏ ఆహారాన్ని జతగా తీసుకుంటే బాగుంటుంది? అనే విషయాన్ని ఫోటోలు, వీడియోలతో సహా జతచేయాలి.
- పోటీలో పాల్గొనాల్సిందిగా మీ స్నేహితులను ఆహ్వానించాలి. తద్వారా మీరు, మీ స్నేహితులు బహుమతులు గెలుచుకోవచ్చు.
- ప్రతి వారం లక్కీ విజేతలు ఆర్టోఫ్ ఫిజ్ మర్చండైజ్ గెలుచుకోవడానికి అర్హులు.
- అలాగే 4 మంది అదృష్ట విజేతలను ప్రకటిస్తుంది. వీరు శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ ఫోన్‌ను గెలుచుకోవచ్చు.
కాగా దక్షిణ భారతంలో యాపీ ఫిజ్ ప్రచారకర్తగా ప్రముఖ తెలుగు సినీ నటుడు నందమూరి తారక రామారావు (జూనియర్ ఎన్‌టీఆర్) వ్యహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్‌టీఆర్ ట్విటర్ ఖాతాలో ఈ కాంటెస్ట్ గురించి పోస్ట్ చేశారు. తన ప్రశ్నకు సమాధానాలు ఇచ్చి, బహుమతులు గెలుచుకోవచ్చని సూచించారు. దీంతో అటు యాపీ ఫిజ్ ఫ్యాన్స్, ఇటు యంగ్‌టైగర్ ఫ్యాన్స్ ట్విటర్‌లో ఇమేజ్‌లు, వీడియోలతో సందడి చేస్తున్నారు. పోటీకి సంబంధించి మరిన్ని వివరాలకు '@iamappyfizz', '#ArtofFizz' హ్యాష్ ట్యాగ్ లను పరిశీలించాలి.
What is your favourite food that you'd like to pair with @iamappyfizz ? Let your friends on Twitter know and win cool stuff. Follow @iamappyfizz for more details #ArtofFizz pic.twitter.com/5zMxzS1Uae
— Jr NTR (@tarak9999) November 12, 2019
My Caption : #FEELTHEFIZZ #ARTOFFIZZ To have good health we need to take proper meal @iamappyfizz
To have good health and Energetic we need to take Proper meal and Fizz drinks.Satisfied meal cannot be satisfied without Appy Fizz.Keep cool and always chill with Appy fizz drink pic.twitter.com/X5vaeL1s4H
— Anusuresh (@Anusure40893798) November 11, 2019
Comments
Please login to add a commentAdd a comment