Samsung Galaxy
-
రూ.31వేల ఈ లేటెస్ట్ 5జీ ఫోన్ ఇప్పుడు రూ.23వేలే..!
ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోన్లతో కస్టమర్లలో మంచి ఆదరణ పొందిన శాంసంగ్ కంపెనీకి చెందిన ప్రముఖ 5జీ మోడల్ ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ (Samsung Galaxy A34 5G) ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో రూ.22,999 లకే అందుబాటులో ఉంది. ఈ మీడియం రేంజ్ స్మార్ట్ ఫోన్ రూ.30,999 ప్రారంభ ధరతో గతేడాది లాంచ్ అయింది. రూ. 3,000 తగ్గింపు తాజగా శాంసంగ్ గెలాక్సీ ఏ34 ఫోన్‌పై రూ. 3,000 తగ్గింపు లభించింది. దీంతో 6GB+128GB మోడల్ వేరియంట్ రూ.22,999లకే అందుబాటులోకి వచ్చింది. 8GB +128GB వేరియంట్ దాని అసలు ధర రూ. 27,499లకు బదులుగా రూ. 24,499లకే లభిస్తోంది. మరోవైపు 8GB+256GB వేరియంట్ ఇప్పుడు రూ. 26,499లకే అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుంచి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఏ34 5G ఫీచర్లు FHD+ రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లే MediaTek డైమెన్సిటీ 1080 SoC 8GB వరకూ ర్యామ్, 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 mAh బ్యాటరీ OISతో 48MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ లెన్స్ 5MP మాక్రో కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ 13MP సెల్ఫీ కెమెరా స్టీరియో స్పీకర్లు 5G, Wi-Fi 802.11, బ్లూటూత్ 5.3, GPS కనెక్టివిటీ కోసం USB టైప్-సి పోర్ట్ -
త్వరలో విడుదల కానున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్24.. ధర ఎంతంటే?
ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ త్వరలో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్‌ను విడుదల చేయనుంది. గెలాక్సీ ఎస్ 23 ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా, శాంసంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను ఇప్పటికే మార్కెట్‌కి పరిచయం చేసిన ఫోన్లను విడుదల చేసిన తర్వాతనే ఈ లేటెస్ట్ సిరీస్ ఫోన్లను విడుదల చేయాలని శాంసంగ్ భావిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. నివేదికల ప్రకారం.. ఈ కొత్త సిరీస్‌లో బేస్ గెలాక్సీ ఎస్24,గెలాక్సీ ఎస్ 234 ప్లస్, గెలాక్సీ ఎస్ 24 ఆల్ట్రాలు ఉండనున్నాయి. గెలాక్సీ ఎస్ 24 సిరీస్‌ను కొత్త ఏడాది జనవరి 17న అమెరికా శాన్ఫ్రాన్సిస్కోలో జరిగే కార్యక్రమంలో విడుదల చేసే అవకాశం ఉందని ఎస్బీఎస్ బిజ్ రిపోర్ట్ తెలిపింది. శాంసంగ్ కంపెనీ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ మోడల్‌ను సౌత్ కొరియాలో సుమారు రూ.70 వేల లోపు ధరతో విక్రయించనుంది. ఇంచు మించు శాంగ్ గెలాక్సీ ఎస్ 24 సిరీస్ ఫోన్ ధరలు సైతం అదే స్థాయిలో ఉండనున్నాయి. వీటి ఖచ్చిత ధర ఎంతనేది తెలియాలంటే ఈ ఫోన్ సీరీస్ విడుదలయ్యే వరకు ఎదురు చూడాల్సి ఉంది. యాపిల్ ఐఫోన్లకు గట్టి పోటీ ఇస్తూ ఆర్థిక మాంద్యం కారణంగా గెలాక్సీ ఎస్ 23 సిరీస్, ఎస్ 24 సిరీస్ ఫోన్ల అమ్మకాల తగ్గకుండా ఉండేలా వ్యూహాత్మకంగా మార్కెటింగ్ స్ట్రాటజీని అమలు చేయనుంది శాంసంగ్ . తద్వారా వాటి సేల్స్ పెంచుకోవాలని భావిస్తుంది. -
హైదరాబాద్ : కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌లో మెరిసిన నటి శ్రీలేఖ - ఫోటోలు
-
శాంసంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్: అదిరిపోయే ఫోల్డబుల్ స్మార్ట్‌పోన్స్, వాచ్ 6, ప్యాడ్ 9 సిరీస్ (ఫోటోలు)
-
స్మార్ట్‌ఫోన్స్ కొనేవారికి గుడ్‌న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ డీల్స్
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ (Flipkart Big Saving Days) పేరుతో తాజా సేల్ ఈవెంట్‌ను ప్రకటించింది. ఈ సేల్ జూన్ 10న ప్రారంభమై జూన్ 14 వరకు కొనసాగనుంది. ఈ పరిమిత కాల సేల్‌లో ఐఫోన్ 13, శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్23, పోకో ఎక్స్5తో సహా ప్రముఖ స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ బెస్ట్ డీల్స్, ఆకర్షణీయ తగ్గింపులను అందిస్తోంది. వీటితోపాటు ఎక్స్చేంజ్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. టాప్ బ్రాండ్స్.. ఫ్లాట్ డిస్కౌంట్స్ ⮞ ఐఫోన్13 (iPhone 13) 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను ఫ్లిప్‌కార్ట్ రూ.58,749 నుంచి ఆఫర్ చేస్తోంది. ఇది యాపిల్ ఆన్లైన్ స్టోర్‌లో రూ.69,900 ఉంది. అంటే రూ. 11,151 ఫ్లాట్ తగ్గింపు . అదనంగా, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉన్న కస్టమర్లు అదనంగా 10 శాతం తగ్గింపు పొందవచ్చు. మొత్తంగా రూ.57,999లకే ఐఫోన్13ను కొనుగోలు చేయవచ్చు . ⮞ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 (Samsung Galaxy F23) 5Gని రూ.13,499లకే అందిస్తోంది. మార్చిలో లాంచ్ అయినప్పుడు దాని అసలు ధర రూ.17,499. రూ.6,500 తగ్గింపు అంటే ఎవరు వదులుకుంటారు? ఇంకా తక్కువ ధరకు ఫోన్ కావాలనుకునే వారికి శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 (Samsung Galaxy F13) రూ. 10,999 లకే అందుబాటులో ఉంది. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎం14 (Samsung Galaxy M14)ని అయితే ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 14,327 కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ⮞ ఇక రూ.15,499 ఉన్న మోటో జీ62 (Moto G62) రూ. 14,499లకు, 15,499 ఉన్న పోకో ఎక్స్5 (Poco X5 5G)ని రూ.14,999లకు కొనుగోలు చేయవచ్చు. దీనిపై రూ.4,000 తగ్గింపు అందుబాటులో ఉంది. ఇదీ చదవండి: గాల్లో డబుల్ డెక్కర్: భలే డిజైన్ చేశారు.. ఫొటో వైరల్ -
ఆధునిక ఫీచర్లతో విడుదలవుతున్న కొత్త స్మార్ట్ ఫోన్ ఇదే
-
బంపరాఫర్ : రూ.23వేల ఫోన్ రూ.10వేలకే సొంతం చేసుకోండిలా!
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మరో సరికొత్త సేల్‌తో ముందుకు వచ్చింది. ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 17 వరకు జరిగే ఈ సేల్‌లో వైడ్ రేజ్ స్మార్ట్ ఫోన్ల నుంచి ప్రీమియం ఫోన్లపై 40 శాతం భారీ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ సేల్‌లో ఇటీవలే విడుదలైన శాంసంగ్ గెలాక్సీ ఏ23పై బంపరాఫర్ ప్రకటించింది. రూ.10వేల కంటే ధరకే కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. (క్రెడిట్‌కార్డు వాడుతున్నారా? ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా..గుదిబండే!) తగ్గిన 5జీ శాంసంగ్ గెలాక్సీ ఏ23 ధరలు ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ 6జీబీ ర్యామ్ అండ్ 128జీబీ స్టోరేజ్ ఫోన్ అసలు ధర రూ.23,990కే ఉండగా సేల్‌లో 27 శాతం డిస్కౌంట్‌తో రూ.17499కే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌పై రూ.5వేల వరకు ట్రాన్సాక్షన్ చేస్తే రూ.1000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ హెచ్డీఎఫ్సీ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్‌పై 5శాతం డిస్కౌంట్ తో పాటు ఇతర ఆఫర్లు కలుపుకుంటే రూ.16499కే సొంతం చేసుకోవచ్చు. చదవండి👉 అమెజాన్‌లో ఆఫర్లు.. ఈ వస్తువులపై ఏకంగా 70 శాతం వరకు డిస్కౌంట్! శాంసంగ్ గెలాక్సీ ఏ23 ఎక్ఛేంజ్ ఆఫర్ పైన పేర్కొన్న ఆఫర్లతో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. ఎక్ఛేంజ్ ప్రోగ్రామ్ కింద రూ.16300 డిస్కౌంట్ లభిస్తుంది. ప్రస్తుతం మీరు వినియోగిస్తున్న ఫోన్ పనితీరు బాగుంటే శాంసంగ్ గెలాక్సీ ఏ23ని ఎక్ఛేంజ్ ఆఫర్, ఇతర బ్యాంక్ ఆఫర్లతో రూ.10వేలకే కొనుగోలు చేసే వెసలు బాటు కల్పించింది అమెజాన్ శాంసంగ్ గెలాక్సీ ఏ23 ఫీచర్లు శాంసంగ్ గెలాక్సీ ఏ23లో 120హెచ్ జెడ్ రిఫ్రెష్ రేటుతో 6.6 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ ఇన్ఫినిటీ ప్లస్- వీ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్, 16జీబీ ర్యామ్, ఫోటోగ్రఫీ కోసం అల్ట్రా వైడ్, డెప్త్, మ్యాక్రోలెన్సెస్లతో 50 ఎంపీ క్వాడ్ రేర్ కెమెరా సెటప్ ఉంది. ఇదీ చదవండి: పనిమనుషులకు హెలికాప్టర్లో ఐలాండ్ ట్రిప్, వైరల్వీడియో -
అదంతా ఫేకేనా.. శాంసంగ్ చీటింగ్ చేస్తోందా?
అత్యంత కెమెరా జూమింగ్ సామర్థ్యంతో శాంసంగ్ అల్ట్రా సిరీస్ స్మార్ట్ఫోన్లను గత నెలలో విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ఫోన్ స్పేస్ జూమ్ ఫీచర్‌తో వచ్చింది. అయితే ఈ ఫోన్ తీసే స్పేస్ జూమ్ ఫోటోలు నకిలీవని తాను చేసిన పరిశోధనలో తేలిందని ఓ రెడిట్ యూజర్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: Oscar Award: థియేటర్ నుంచి ఆస్కార్‌కు.. ఈ పాప్‌కార్న్ గయ్ మామూలోడు కాదు.. ఇటీవల శాంసంగ్ గెలాక్సీ ఎస్23 జూమ్ లెన్స్‌లతో తీసిన చంద్రుని ఫోటోలను అందరూ ఆసక్తిగా చూశారు కానీ వాటి ప్రామాణికతపై తనకు మొదటి నుంచే సందేహాలు ఉన్నాయని, అవి పూర్తిగా అసలైనవి కావని అని రెడిట్‌లో ibreakphotos అనే పేరుతో ఉన్న ఓ యూజర్ పోస్ట్ చేశారు. దానికి సంబంధంచి పూర్తి వివరణ కూడా అందులో ఇచ్చారు. ఇదీ చదవండి: Oscar Awards: ఆస్కార్ నామినీలకు ఆస్ట్రేలియాలో భూమి! కానీ.. తాను ఇంటర్నెట్ నుంచి చంద్రుని హై రెజల్యూషన్ ఫొటోను డౌన్లోడ్ చేసి దాని సైజ్ తగ్గించి గాస్సియన్ బ్లర్‌ను అప్లయి చేశానని, దీంతో అస్పష్టంగా మారిందని రెడిట్ యూజర్ పేర్కొన్నారు. ఆ తర్వాత దాన్ని శాంసంగ్ స్పేస్ జూమ్ కెమెరాతో ఫొటో తీస్తే ఆ ఫొటో చాలా స్పష్టంగా వచ్చిందని తెలిపారు. కానీ అది అసలైన ఫొటో కాదని, ఇలా అస్పష్టంగా ఉన్న ఫొటో స్పష్టంగా చేసేందుకు శాంసంగ్ ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) మోడల్‌ను ఉపయోగిస్తోందని ఆరోపించారు. ఇదీ చదవండి: ట్విటర్ తరహాలో మెటా.. జుకర్‌బర్గ్‌పై ఎలాన్ మస్క్ తీవ్ర వ్యాఖ్యలు! -
ఐఫోన్ యూజర్లు జాగ్రత్త... ప్రభుత్వ హెచ్చరిక!
యాపిల్ ఐఫోన్లు ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన స్మార్ట్ఫోన్లు. చాలా మందికి ఇవంటే మోజు. డిజైన్, ఇతరత్రా ఫీచర్ల కోసం వీటిని ఇష్టపడతారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వినియోగిస్తున్న తమ ఫోన్ల భద్రత విషయంలో ఆపిల్ సంస్థ ఎప్పటికప్పడు నూతన ఐఓఎస్ వర్షన్లను విడుదల చేస్తూనే ఉంటుంది. వాటిని వెంటనే అప్డేట్ చేసుకోవాలని యూజర్లకు సూచిస్తూ ఉంటుంది. అయితే కొంతమంది కొత్త వర్షన్లను అప్డేట్ చేయకుండా పాత వర్షన్లనే వినియోగిస్తుంటారు. అలాంటి వారిని భారత ప్రభుత్వం హెచ్చరించింది. పాత వర్షన్లు సురక్షితం కాదని, హ్యాకర్లు సులువుగా వాటిని హ్యాక్ చేస్తున్నారని గుర్తించిన మీదట ప్రభుత్వం ఈ హెచ్చరిక జారీ చేసింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు అందించిన నివేదిక ప్రకారం.. ఐఓఎస్‌లో హ్యాకింగ్‌కు అనేక ఆస్కారాలు ఉన్నాయి. యూజర్ల సున్నితమైన సమాచారం చోరీకి గురయ్యే ప్రమాదం ఉంది. 16.3.1, అంతకు ముందుటి వర్షన్లతో ఉన్న ఐఫోన్8 లేదా ఆ తర్వాత వచ్చినవి, ఐపాడ్ ప్రో అన్ని మోడళ్లు, ఐపాడ్ ఎయిర్ థర్డ్ జనరేషన్, ఆ తర్వాతవి, ఐపాడ్ ఎయిర్ ఫిఫ్త్ జనరేషన్, ఆ తర్వాతివి, ఐపాడ్ మినీ ఫిఫ్త్ జనరేషన్, ఆతర్వాతి వాటిపై హ్యాకర్ల ప్రభావం ఉంటుందోని పేర్కొంది. శాంసంగ్ గెలాక్సీ యూజర్లు కూడా.. అలాగే శాంసంగ్ గెలాక్సీ వినియోగదారులకు కూడా భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. శాంసంగ్ కూడా తమ యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త వర్షన్లను సూచిస్తూనే ఉంటుంది. అయితే పాత వర్షన్లకు అలవాటు పడిన వినియోగదారులు వాటిని అలాగే కొనసాగిస్తుంటారు. అలాంటి జాగ్రత్త పడాలి. ఈ స్మార్ట్ఫోన్లలో వచ్చే శాంసంగ్ గెలాక్సీ స్టోర్ యాప్‌లో హ్యాకింగ్ ప్రమాద ఆస్కారాన్ని గుర్తించినట్లు CERT-In పేర్కొంది. 4.5.49.8కి ముందుటి శాంసంగ్ గెలాక్సీ స్టోర్ యాప్ వెర్షన్‌తో ఫోన్లను ఇది ప్రభావితం చేస్తుంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ అదేవిధంగా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లలోనూ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ హ్యాకింగ్ ప్రమాదాన్ని గుర్తించింది. 109.0.1518.78కి ముందున్న ఎడ్జ్ బ్రౌజర్ వెర్షన్ వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది. ఇది టార్గెటెడ్ సిస్టమ్‌లో డినైల్ ఆఫ్ సర్వీస్ (DoS) ఆప్షన్లను సైతం మార్చగలిగే అవకాశాన్ని హ్యాకర్‌రకు ఇస్తుంది. -
శాంసంగ్ బీఎండబ్ల్యూ స్పెషల్ ఎడిషన్.. 1000 ఫోన్లే..
శాంసంగ్ ఇటీవలే తమ ప్రతిష్టాత్మక గెలాక్సీ ఎస్23 అల్ట్రా మోడల్ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. తాజాగా ఇందులో మరో స్పెషల్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. దక్షిణ కొరియాకు చెందిన ఈ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ తమ ఖరీదైన గెలాక్సీ ఎస్23 అల్ట్రా సిరీస్‌లో బీఎండబ్ల్యూ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. ఈ స్పెషల్ ఎడిషన్‌కు బీఎండబ్ల్యూ ఎం ఈ30 కారుకు గుర్తుగా శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా బీఎండబ్ల్యూ ఎం పేరు పెట్టారు. 1986లో ఈ కారు లాంచ్ అయింది. ఇది లిమిటెడ్ ఎడిషన్ అని, కేవలం 1000 ఫోన్లు మాత్రమే విక్రయిస్తామని కంపెనీ పేర్కొంది. అది కూడా దక్షిణ కొరియాలో మాత్రమే ఎస్కే టెలికాం సంస్థ ద్వారా ఈ స్పెషల్ ఎడిషన్ ఫోన్లు లభిస్తాయి. కొత్తగా విడుదల చేసిన శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా బీఎండబ్ల్యూ ఎం ఫోన్‌కు వర్టికల్ కిడ్నీ గ్రిల్, బీఎండబ్ల్యూ ఎం కారు బోనెట్ వంటి దృఢమైన కేస్ ఉంటుంది. ఆకర్షణీయమైన బీఎండబ్ల్యూ ఎం కారు రంగులతో ఇందులో యానిమేషన్ ఫీచర్ ఇచ్చారు. రిమూవబుల్ కీరింగ్, ఇంటర్‌చేంజబుల్ బీఎండబ్ల్యూ లోగోలు అదనపు ఆకర్షణ. దీంతో పాటు చిన్నపాటి ఎయిర్ కంప్రెషర్, మెటల్ లోగో ఇచ్చారు. ఈ ఫోన్ ధర 17.27 లక్షల సౌత్ కొరియన్ వాన్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ.1,12,790. (ఇదీ చదవండి: రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఫోన్లు) -
సరికొత్త రికార్డ్స్.. 24 గంటల్లో 1.4 లక్షల ఫోన్ల బుకింగ్స్!
దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శాంసంగ్ సత్తా చాటుతోంది. ఆ సంస్థకు చెందిన గెలాక్సీ ఎస్ 23 ఫోన్లు ప్రీ బుకింగ్‌లో దుమ్మురేపుతున్నాయి. ఒక్కరోజులోనే రూ.1400 కోట్ల విలువైన 1.4 లక్షల యూనిట్ల ప్రీమియం ఫోన్లను కొనుగోలు దారులు బుక్ చేసుకున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. శాంసంగ్ ఫిబ్రవరి 1న గెలాక్సీ ఎస్ 23 సిరీస్‌లోని ‘గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎస్23 ప్లస్, గెలాక్సీ ఎస్23 అల్ట్రా’ అనే మూడు వేరియంట్లు మోడళ్లను అధికారికంగా విడుదల చేసింది. ఫిబ్రవరి 23 వరకు కొనసాగనున్న ప్రీ బుకింగ్ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. రెండు రెట్లు పెరిగి ఈ సందర్భంగా శాంసంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజు పుల్లాన్ మాట్లాడుతూ.. గతంలో తాము విడుదల చేసిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 కంటే రెండు రెట్లు పెరిగి సగటున ఫోన్ ధర సుమారు లక్ష రూపాయలు ఉన్న ఈ ఫోన్లు 24 గంటల్లో 1.4 లక్షల యూనిట్లు ప్రీ బుకింగ్స్ జరిగినట్లు చెప్పారు. ఫిబ్రవరి 23 ప్రీబుకింగ్ కొనసాగింపు ఇక ఈ ఫోన్ల ప్రీ బుకింగ్స్ ఫిబ్రవరి 23వరకు కొనసాగుతాయని చెప్పిన పుల్లాన్ .. శాంసంగ్ ఎస్ 23 సిరీస్ ధరలు రూ.75 వేల నుంచి రూ.1.55లక్షల వరకు ఉన్నాయని అన్నారు. భారత్‌లో తయారీ.. ఎక్కడంటే దేశీయ మార్కెట్లో విడుదలైన శాంసంగ్ ఎస్ 23 ప్రీమియం ఫోన్లు నోయిడా ప్లాంట్‌లో తయారు చేసినట్లు పేర్కొన్నారు. ఇక గెలాక్సీ ఎస్ సిరీస్ ఫోన్లను మాత్రం వియాత్నం మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లో తయారు చేసి.. దిగుమతి అనంతరం భారత్‌లో అమ్మకాలు జరిపినట్లు వెల్లడించారు. -
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 వస్తోంది.. ఆ స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింది!
కొత్త మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి శుభావార్త. ఎప్పటికప్పుడు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్న శాంసంగ్ కంపెనీ తాజాగా గెలాక్సీ ఎస్23 వేరియంట్లను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎస్23 ప్లస్, గెలాక్సీ ఎస్23 అల్ట్రా మోడళ్లను ఆవిష్కరించింది. అయితే శాంసంగ్ గెలాక్సీ ఎస్23 రాకతో గెలాక్సీ ఎస్22 ధర భారీగా తగ్గింది. ఒక ఫోన్ లాంచ్.. మరొక ఫోన్ భారీగా తగ్గింపు ఈ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్‌లో స్టాండర్డ్ మోడల్. గతేడాది గెలాక్సీ ఎస్22 ప్లస్, గెలాక్సీ ఎస్22 అల్ట్రా మోడళ్లతోపాటు ఇది లాంచ్ అయింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 లాంచ్ చేసినప్పుడు దీని ధర రూ.72,999. ఇప్పుడు 'గెలాక్సీ ఎస్23 సిరీస్‌ను విడుదల చేసిన నేపథ్యంలో గెలాక్సీ ఎస్22 స్టాండర్డ్ మోడల్ ఫోన్ ధరను కంపెనీ భారీగా తగ్గించింది. ఈ ఫోన్ ధర ఇప్పుడు రూ.57,999. అలాగే ఇందులో 256జీబీ వేరియంట్ ధర రూ.61,999. శాంసంగ్ ఎస్22 ఫోన్ స్క్రీన్ సైజ్ 6.1 ఇంచులు. 120హెడ్జ్ వరకు రిఫ్రెష్ రేటుతో ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ డిస్ల్పేని కలిగి ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 చిప్‌సెట్‌ను కలిగిన ఈ ఫోన్లో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపీ మెయిన్ సెన్సర్, 12ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 10ఎంపీ టెలీఫోటో లెన్స్ ఉంటాయి. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 10ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 3,700 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ దీని సొంతం. కొత్తగా లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎస్23 కూడా దాదాపు ఇవే ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. అయితే గెలాక్సీ ఎస్23లో కొత్త కలర్ ఆప్షన్లు, అధిక బ్యాటరీ సామర్థ్యం, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 చిప్సెట్ ఉన్నాయి. చదవండి: Union Budget 2023-24 బీమా కంపెనీలకు షాక్, రూ. 5 లక్షలు దాటితే! -
శాంసంగ్ నుంచి కొత్త 5జీ ఫోన్లు.. ఫీచర్లు అదిరిపోయాయ్, లాంచ్ డేట్ అప్పుడే!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ శాంసంగ్ నూతన సంవత్సరంలో కొత్త మొబైల్‌ని లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే భారతీయ మార్కెట్లో ఓ బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఈ కంపెనీ.. తాజాగా శాంసంగ్ ఏ సిరీస్ 5జీ (Samsung Galaxy A Series) ఫోన్లను జనవరి 18న లాంచ్ చేయనున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అయితే ఏ మోడల్ అన్నదానిపై ఇంకా స్పష్టం చేయలేదు. అయితే ఇటీవల యూఎస్, యూరప్‌లో శాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీ (Samsung Galaxy A14), విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో ఈ మోడల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతుందనే తెలుస్తోంది. శాంసంగ్ మాత్రం దీనిపై పూర్తి సమాచారం తెలపకుండానే ఏ సిరీస్‌లో 5జీ ఫోన్లను విడుదల చేస్తామని, ఆ ఫోన్‌కు సంబంధించిన ప్రత్యేకతలను టీజ్ చేసింది. ప్రత్యేకతలు ఈ స్మార్ట్‌ఫోన్.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల పూర్తి-HD డిస్ప్లేను కలిగి ఉంటుంది. ముఖ్యంగా, ముందు భాగంలో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌తో వస్తోంది. బ్యాటరీ 2 రోజుల వరకు బ్యాకప్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. వీటిని చూస్తే ఇటీవల ప్రారంభించిన Galaxy A14 5G రూపకల్పనను పోలి ఉంటుంది. మీడియాటెక్ డైమన్సిటీ 700 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తోంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్‌యూఐ 5.0 అందుబాటులోకి వచ్చింది. ఈనెల 18న సామ్సంగ్ ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీతో పాటు గెలాక్సీ ఏ23 5జీ మొబైళ్లను లాంచ్ చేస్తుందని తెలుస్తోంది. వీటితో పాటు గెలాక్సీ ఏ34 5జీ, గెలాక్సీ ఏ54 5జీ మోడళ్లకు కూడా విడుదలై అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: మంచు కొండల్లో మహీంద్రా కారు రచ్చ.. రోడ్లపైకి రాకముందే అరుదైన రికార్డ్! -
మీ ఫోన్ రిపేర్ అయ్యిందా? శాంసంగ్ యూజర్లకు శుభవార్త!
ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరుగుతోంది. అందులోని ఫీచర్లు అంతలా ఆకట్టుకుంటోంది. అయితే ఎంత టెక్నాలజీ ఉన్నప్పటికీ యూజర్ల పర్సనల్ డేటా (ఫోటోలు, చాట్, వీడియో) ఏదో ఓ రూపంలో అప్పుడప్పుడు బయటపడుతున్నాయి. వీటిలో ప్రధానంగా మన ఫోన్ రిపేర్ అయిన సందర్భాల్లో డేటా తస్కరించడం లాంటి జరుగుతుంటాయి. ఎలా అంటారా ఆ సమయంలో కొన్ని రోజుల పాటు రిపేర్ షాపులో మన ఫోన్‌ని ఉంచకతప్పదు. అప్పటి నుంచి ఫోన్లోని డేటాకు సంబంధించి ఆందోళనపడడమో, లేదా డేటాను ముందుగానే డిలీట్ చేసి బ్యాకప్ చేసుకోవడం లాంటి పనులు మనకు షరా మామూలే. ఇకపై అలాంటివి ఇబ్బందులు ఎదురుకాకుండా శాంసంగ్ కంపెనీ తమ కస్టమర్ల కోసం కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ఈ ఫీచర్ ద్వారా మన డేటా సేఫ్‌గా ఉంటుంది. దక్షిణ కొరియా శాంసంగ్ తెలిపిన వివరాల ప్రకారం తమ కంపెనీ ఫోన్లలో రిపేర్ మోడ్ పేరుతో అదిరిపోయే ఫీచర్‌ను ప్రవేశపెడుతోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్21 (Samsung Galaxy S21) సిరీస్‌కు ఈ ఫీచర్‌తో విడుదల చేయాలని యోచిస్తోంది. అయితే ఇతర మోడళ్లకు కూడా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఎలా పని చేస్తోంది ఈ ఫీచర్ మొబైల్లోని సెట్టింగ్ యాప్‌లో “బ్యాటరీ అండ్ డివైస్ కేర్” ఆఫ్షన్‌కి వెళ్లి రిపేర్ మోడ్‌ని ఆన్ చేయాలి. దీంతో మీ స్మార్ట్‌ఫోన్ రీబూట్ అవుతుంది. ఆ తర్వాత, ఫోటోలు, మెసేజ్‌లు, ఖాతాలు మొదలైన వాటితో సహా మీ వ్యక్తిగత డేటాను ఎవరూ యాక్సెస్ చేయలేరు. వెంటనే ఫోన్లో రిపేర్ మోడ్ యాక్టివేట్ అవుతుంది. దీని ద్వారా మీ ఫోన్ రిపేర్ చేసే వ్యక్తికి మన డేటా కనిపించకుండా చేస్తుంది. ఆ సమయంలో కేవలం ఫోన్లో డిఫాల్ట్ ఇన్స్టాల్ చేసిన యాప్‌లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఫోన్ రిపేర్ పూర్తి కాగానే మనం మళ్లీ మొబైల్‌ని రీబూట్ చేసి వేలిముద్ర లేదా లాక్ ఆన్ చేయడం ద్వారా రీపేర్ మోడ్ డీయాక్టివేట్ చేయవచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పూర్తి వివరాలను శాంసంగ్ తెలపాల్సి ఉంది. చదవండి: సూపర్ వ్యాన్.. దీని స్పెషాలిటీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! -
శాంసంగ్‌కు భారీ షాక్.. 30రోజుల గడువిచ్చిన కోర్టు.. మాట వినకపోతే..
ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ శామ్సంగ్కు ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టు ఝలకిచ్చింది. స్మార్ట్ ఫోన్లుకు సంబంధించి తప్పుదోవ ప్రకటనలు ఇచ్చినందుకు కోర్టు శామ్సంగ్కు 14 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం రూ.78 కోట్లు) ఫైన్ విధించింది. ఈ మొత్తాన్ని కూడా 30 రోజుల్లోగా చెల్లించాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జస్టిస్ బ్రెండన్ ముర్ఫీ తీర్పునిచ్చారు. అంతేకాకుండా ఈ వ్యవహారంపై విచారణ జరిపినందుకుగాను ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్జ్యూమర్ కమిషన్‌కి కూడా అదనంగా మరో 2 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు ( భారత కరెన్సీ ప్రకారం రూ.1.10 కోట్లు) చెల్లించాలని ఆదేశించారు. 2016 నుంచి 2018 మధ్య S7, S7 ఎడ్జ్.A5 (2017), A7 (2017), S8, S8 ప్లస్, నోట్ 8 గెలెక్సీ ఫోన్లను శామ్సంగ్ ఆస్ట్రేలియాలో విక్రయించింది. ప్రత్యేకంగా వీటిని తయారు చేశామని నీళ్లలో తడిచినా పాడవవంటూ భారీగా ప్రకటనలు కూడా ఇచ్చింది. నీళ్లలో ఈ ఫోన్లు ఉంచినప్పుడు ఛార్జింగ్ పోర్టులు పాడయ్యాయి. దీంతో తమ ఫోన్లు పనిచేయడం లేదంటూ వందలాదిగా వినియోగదారులు ఆస్ట్రేలియన్ కాంపీటీషన్ అండ్ కన్జూమర్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి 2019లో నమోదైన కేసులపై కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంపై శాంసంగ్ స్పందిస్తూ.. 2016 నుంచి 2017 మధ్యలో అమ్మకాలు జరిపిన ఏడు మోడళ్లపై మాత్రమే ఈ సమస్య తలెత్తినట్లు తెలిపింది. ప్రస్తుత శాంసంగ్ ఫోన్లలో ఈ తరహా సమస్యలు లేవని తెలిపింది. చదవండి: Gmail Storage: మీ ఇ-మెయిల్ బాక్స్ నిండిపోయిందా, సింగిల్ క్లిక్‌తో ఇలా చేయండి! -
శాంసంగ్ షాకింగ్ నిర్ణయం..ఆ సిరీస్ ఫోన్ తయారీ నిలిపివేత! ఎందుకంటే!
శాంసంగ్ సంస్థకు చెందిన గెలాక్సీ ఎఫ్ఈ స్మార్ట్ ఫోన్లు కనుమరుగు కాన్నాయి. ఇప్పటికే గెలాక్సీ ఎస్ ఎఫ్ఈ (ఫ్యాన్ ఎడిషన్) పేరుతో పలు ఫోన్లను విడుదల చేసింది. కానీ ఈ ఏడాది మాత్రం ఈ తరహా సిరీస్ ఫోన్లను శాంసంగ్ తయారు చేయబోదని, వాటిని ప్రొడక్షన్‌ను నిలిపివేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే గెలాక్సీ ఎస్22 ఎఫ్ఈ మోడల్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం..శాంసంగ్ సంస్థ గెలాక్సీ ఎస్ఎఫ్ పేరుతో 12 రకాలైన ఫోన్లను మార్కెట్‌కి పరిచయం చేసింది. ఈ నేపథ్యంలో గెలాక్సీ ఎఫ్ఈ స్మార్ట్ ఫోన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. టోన్ డౌన్ ఫ్లాగ్ షిప్ మోడల్ ఫోన్లపై రూ.60వేల కంటే ఎక్కువ ఖర్చు చేయకూడదని భావిస్తోంది. వాటి స్థానంలో మంచి ఫీచర్లతో బడ్జెట్ ఫోన్లను కొనుగోలు దారులకు అందించాలని చూస్తుంది. చిప్ దెబ్బ శాంసంగ్ ఎఫ్ఈ మోడళ్లు నిలిపివేడయానికి ప్రధాన కారణం చిప్ కొరత, పెరిగిపోతున్న ప్రొడక్షన్ ఖర్చేనని తెలుస్తోంది. అందుకే తయారీ తగ్గించి వినియోగదారులకు నచ్చే బడ్జెట్ స్మార్ట్ఫోన్ల తయారీపై శాంసంగ్ దృష్టిపెట్టనుంది. బాబోయ్ ఖర్చుల భారం పెరిగిపోతున్న ప్రొడక్షన్ ఖర్చుతో పాటు ఇతర కారణాలు శాంసంగ్ స్మార్ట్ ఫోన్‌పై మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అందుకే శాంసంగ్ భారత్‌లో ఫీచర్ ఫోన్లు అమ్మకాల్ని నిలిపివేసింది. ఇప్పుడు గెలాక్సీ ఎఫ్ఇ సిరీస్‌ను నిలిపి వేయనుందని వార్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చక్కెర్లు కొడుతుండగా.. ఫోన్ నిలిపివేతపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆగస్ట్‌లో మరోవైపు శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ , జెడ్ ఫ్లిప్ 4 స్మార్ట్ ఫోన్లను త్వరలో నిర్వహించే ఈవెంట్లో పరిచయం చేయనుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్ట్‌లో జరగనున్న శాంసంగ్ ఈవెంట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చదవండి👉 భారత్‌కు శాంసంగ్ భారీ షాక్! ఇకపై ఆ ప్రొడక్ట్‌లు ఉండవట! -
శాంసంగ్‌కు గట్టిషాకిచ్చిన హ్యాకర్లు..! ప్రమాదంలో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ యూజర్లు.!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్‌కు హ్యాకర్లు గట్టిషాక్‌ను ఇచ్చారు. శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్స్‌కు చెందిన సోర్స్ కోడ్‌ను, కంపెనీ అంతర్గత విషయాలను హ్యకర్లు దొంగిలించినట్లుగా తెలుస్తోంది. సోర్స్ కోడ్‌ను హ్యకర్లు దొంగిలించినట్లుగా శాంసంగ్ సోమవారం(మార్చి 8)న ధృవీకరించింది. అత్యంత సున్నితమైన సమాచారం..! ప్రముఖ టెక్ బ్లాగ్ బ్లీపింగ్ కంప్యూటర్(Bleeping Computer) ప్రకారం..గెలాక్సీ స్మార్ట్‌ఫోన్స్‌కు సంబంధించిన సోర్స్ కోడ్‌ను 'Lapsus$' అనే హ్యకర్ల బృందం దొంగిలించినట్లు తెలుస్తోంది. సుమారు 190GB సీక్రెట్ డేటాను హ్యకర్లు సేకరించారు. సోర్స్ కోడ్‌తో పాటుగా, కంపెనీకి సంబంధించిన అంతర్గత డేటాను హ్యకర్లు బహిర్గతం చేశారు. ఇక ఈ సోర్స్ కోడ్‌లో సున్నితమైన కార్యకలాపాల కోసం ఉపయోగించే విశ్వసనీయ ఆప్లెట్ (TA) సోర్స్ కోడ్ , బూట్‌లోడర్ సోర్స్ కోడ్, శాంసంగ్ అకౌంట్‌కు చెందిన ప్రామాణీకరణ కోడ్ వంటివి ఉన్నాయి. కాగా ఈ హ్యకర్ల బృందం గత నెల ఫిబ్రవరిలో NVIDIA నుంచి కూడా డేటాను దొంగిలించింది. ఎలాంటి భయం లేదు..! ఈ సైబర్ దాడిపై శాంసంగ్ వివరణను ఇచ్చింది. ఈ సోర్స్ కోడ్‌లో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్స్ ఆపరేషన్‌కు సంబంధించిన కొంత సోర్స్ కోడ్‌ను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. ఆయా శాంసంగ్ యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కంపెనీ తెలిపింది. దీనిలో గెలాక్సీ యూజర్లకు, కంపెనీ ఉద్యోగుల వ్యక్తిగత సమాచారం లేదని శాంసంగ్ వెల్లడించింది. ఇది కంపెనీ వ్యాపారం లేదా కస్టమర్లపై ఎలాంటి ప్రభావం చూపదని కంపెనీ అభిప్రాయపడింది. ఇటువంటి సంఘటనలను నిరోధించడానికి మరిన్ని పటిష్టమైన చర్యలను అమలు చేస్తామని శాంసంగ్ తెలిపింది. కాగా హ్యాక్ చేసిన డేటాను అత్యంత సున్నితమైనది పరిగణించబడుతుందని శాంసంగ్ పేర్కొంది. చదవండి: క్రేజీ ఆఫర్..! పలు మహీంద్రా కార్లపై రూ. 3 లక్షల వరకు భారీ తగ్గింపు..! -
అదిరిపోయే ఫీచర్లతో, దేశీయ మార్కెట్లో బడ్జెట్ స్మార్ట్ ఫోన్!!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ రూ.15వేల లోపు బడ్జెట్ ధరతో అదిరిపోయే ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఏ03 ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. గతేడాది శాంసంగ్ మనదేశంలో శాంసంగ్ గెలాక్సీ ఏ03, గెలాక్సీ ఏ03ఎస్ సిరీస్‌లో 3వ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీని ఏ 03ని తాజాగా దేశీయ మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. శాంసంగ్ గెలాక్సీ ఏ03 ఫోన్ ధర శాంసంగ్ గెలాక్సీ ఏ03 ఫోన్ ని రెండు స్టోరేజ్ ఆప్షన్లతో లాంచ్ చేసింది. 3జీబీ ప్లస్ 32జీబీ స్టోరేష్ ఆప్షన్ ధర రూ.10499 ఉండగా 4జీబీ ప్లస్ 4జీబీ ప్లస్ 64జీబీ వేరియంట్ ధర రూ.11,999 గా ఉంది. ఇక ఈ ఫోన్ నలుపు, నీలం, ఎరుపు వేరింయంట్ కలర్స్‌లో లభ్యం అవుతుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ03 ఫోన్ స్పెసిఫికేషన్లు • శాంసంగ్ గెలాక్సీ ఏ03 ఫోన్ 6.5 అంగుళాల హెచ్డీ ప్లస్ టీఎఫ్టీ డిస్ప్లే • 60హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ • యూఎన్ఐ ఎస్ఓసీ టీ606 ఎస్‌ఓఎస్‌తో వస్తుంది. • గరిష్టంగా 4జీబీ ర్యామ్,64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ • 1టెరాబైట్ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు • మైక్రో ఎస్డీ కార్డ్‌ని ఉపయోగించవచ్చు. • వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. • 48ఎంపీ మెయిన్ కెమెరా సెన్సార్‌తో వస్తుంది. • ఇందులో 2MP డెప్త్ సెన్సార్ తో పాటు సెల్ఫీల కోసం, ఫోన్లో 5ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. • ఆండ్రాయిడ్ 11కి సపోర్ట్ చేస్తుంది. -
ప్రీ బుకింగ్స్ బీభత్సం!! 12గంటల్లో 70వేల ఫోన్ల బుకింగ్స్!
సౌత్ కొరియా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ సరికొత్త రికార్డ్‌లు క్రియేట్ చేస్తుంది. ఇటీవల శాంసంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ 2022 ఈవెంట్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్22, గెలాక్సీ ఎస్22 ప్లస్, గెలాక్సీ ఎస్22 అల్ట్రా మూడు స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సిరీస్ ఫోన్ ప్రీ బుకింగ్స్ శాంసంగ్ ఇండియా ప్రతినిధుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫిబ్రవరి 23నుంచి శాంసంగ్ ప్రీ బుకింగ్స్ ను ప్రారంభించింది. కేవలం 12గంటల్లో 70వేల ఫోన్లు ప్రీ బుకింగ్ అయ్యాయి. ధర ఎంతంటే..? దేశంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్22 8జీబీ ర్యామ్ ప్లస్ 128 స్టోరేజ్ ఫోన్ ప్రారంభ ధర రూ.72,999, 8జీబీ ప్లస్ 256 జీబీ మోడల్ ధర రూ.76,999గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ప్లస్ 8జీబీ ప్లస్ 128జీబీ ధర రూ. 84,999 నుండి ప్రారంభం కానుంది. 8జీబీ ప్లస్ 256జీబీ వేరియంట్ ధర రూ.88,999గా ఉంది. మరోవైపు, శాంసంగ్ గెలాక్సీ ఆల్ట్రా ఎస్22 12జీబీ ప్లస్ 256జీబీ ధర రూ.1,09,999 ఉండగా 12జీబీ ప్లస్ 512జీబీ మోడల్ ధర రూ.1,18,999గా ఉంది. ఫోన్ బుక్ చేసుకుంటే ఆఫర్ ఎంతంటే? కంపెనీ ప్రకారం..శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 ఆల్ట్రా ఫోన్‌ని బుక్ చేసిన కస్టమర్లు రూ.26,999 విలువైన గెలాక్సీ వాచ్4ని రూ.2999కే సొంతం చేసుకోనున్నారు. అలాగే గెలాక్సీ ఎస్ 22ప్లస్, గెలాక్సీ ఎస్ 22ని ప్రీ బుకింగ్ చేసే కస్టమర్లు రూ.11,999 విలువైన గెలాక్సీ బడ్స్2 ని రూ.999కే పొందనున్నారు. అదనంగా, గెలాక్సీ ఎస్, గెలాక్సీ నోట్ సిరీస్ కస్టమర్లు రూ.8000 అప్‌గ్రేడ్ బోనస్, డివైజ్ హోల్డర్లు రూ. 5000 అప్‌గ్రేడ్ బోనస్, ప్రత్యామ్నాయంగా శాంసంగ్ ఫైనాన్స్ ప్లస్ ద్వారా ఫోన్‌ను బుక్ చేసుకున్న కస్టమర్లు అదనంగా రూ.5000 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. . ఈ సందర్భంగా శాంసంగ్ ఇండియా మార్కెటింగ్ హెడ్ ఆధిత్య బబ్బర్ మాట్లాడుతూ.. దేశంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 ఫోన్ ప్రీ బుక్కింగ్స్ పై సంతోషం వ్యక్తం చేస్తున్నారం. వీలైనంత త్వరగా ఆ ఫోన్లను కస్టమర్లకు అందిస్తున్నట్లు చెప్పారు. -
'జియో ఫోన్ నెక్ట్స్' కంటే ధర తక్కువగా ఉన్న ఫోన్ ఇదే..!
బడ్జెట్ ఫోన్ 'జియో ఫోన్ నెక్ట్స్'పై మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇప్పటికే దివాళీ సందర్భంగా విడుదల కానున్న జియో ఫోన్ ధర, ఫీచర్ల గురించి జియో సంస్థ స్పష్టత ఇచ్చింది. అయితే ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారింది. అందుకు కారణం..దేశంలోనే అతితక్కువ ధరకే ఫోన్ అందిస్తామన్న జియో.. ఆ ఫోన్ ధరను రూ.6,499గా నిర్ణయించింది. ఈ ఫోన్ కంటే గతంలో విడుదలైన బడ్జెట్ ఫోన్లలో ఫీచర్లు ఎక్కువగా ఉండటమే కాదు ధర సైతం రూ.1500 తక్కువగా ఉందని చర్చించుకుంటున్నారు. చిప్సెట్ ఎఫెక్ట్ పెరుగుతున్న తయారీ, కాంపోనెంట్ ఖర్చుల కారణంగా జియో ఫోన్ ధర కాస్త ఎక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జియోఫోన్ నెక్ట్స్ ధర రూ.6,4999 ఉండగా.. ఈ ఫోన్ కంటే ధర తక్కువగా మనదేశంలో మరో ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎం 01 ఉందని గుర్తు చేస్తున్నారు. జియో ఫోన్ నెక్ట్స్ కంటే తక్కువ ధర ఉన్న ఫోన్ ఇదే రిలయన్స్ డిజిటల్, ఫ్లిప్‌కార్ట్ లలో జియో ఫోన్ నెక్ట్స్ కంటే శాంసంగ్ గెలాక్సీ ఎం 01 కంటే తక్కువకే అమ్ముతున్నాయి. శాంసంగ్ గెలాక్సీ, జియో ఫోన్ నెక్ట్స్ లో ఒకే విధమైన ఫీచర్లు ఉన్నాయి. అయితే శాంసంగ్ ఫోన్ ధర తక్కువ ప్రారంభ ధర రూ.4,999కే విక్రయిస్తుంది. జియో ఫోన్ కంటే రూ.1,500 తక్కువకే వస్తుంది. జియో ఫోన్ నెక్ట్స్ వర్సెస్ శాంసంగ్ గెలాక్సీ గెలాక్సీ ఎం 01 రెండు వేరియంట్లలో లభిస్తుంది. గెలాక్సీ ఎం 01 బేసిక్ వెర్షన్ 1జీబీ ర్యామ్ ప్లస్ 16జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ఇక దీని ధర ఫ్లిప్ కార్ట్‌లో రూ. 4,999, రిలయన్స్ డిజిటల్లో రూ.5,199కి అందుబాటులో ఉంది. 2జీబీ ర్యామ్ ప్లస్ 32 జీబీ స్టోరేజ్ వెర్షన్ ఫోన్ ధర రిలయన్స్ డిజిటల్లో రూ. 6,199 గా ఉంది. ఈ రెండు వేరియంట్లు జియో ఫోన్ కంటే తక్కువగా ఉండటం గమనార్హం. చదవండి: ఆనందంలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఉక్కిరి బిక్కిరి..ఎందుకంటే -
మరో 5జీ ఫోన్ సూపర్ ఫీచర్లు లీక్, ధర ఎంతంటే?
ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో విడుదల కానున్న మరో అఫార్డ్బుల్ 5జీ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు లీకయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్ తక్కువ ధరకే లభిస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ప్రస్తుతం లీకైన ఈ ఫోన్ ఫీచర్స్, ధరలు ఇలా ఉన్నాయి. లీకైన ఫీచర్లు ప్రస్తుతం లీకైన శాంసంగ్ గెలాక్సీ ఏ13 5జీ స్మార్ట్ ఫోన్ స్మార్ట్‌ఫోన్ 6.48 అంగుళాల ఫుల్ హెచ్డీ ఐపీఎస్ ఎల్సీడీతో విడుదల కానుంది. ట్రిపుల్ కెమెరా సెటప్, 50ఎంపీ ప్రైమరీ కెమెరా సెన్సార్, 5ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సార్, వాటర్-డ్రాప్ నాచ్ ను కలిగి ఉంది. ఆన్‌లీక్స్ ప్రకారం.. లీకైన ఫోన్ 83.4 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో ఉన్నట్లు తెలుస్తోంది. ధర ఎంతంటే? వీటితో పాటు ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఎస్ఓసీ, 6జీబీ ర్యామ్ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. గెలాక్సీ ఏ13 5జీ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఫోన్ బాక్స్ లోపల 15W ఛార్జింగ్ ఫ్యాక్‌తో రానుంది. 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సి పోర్ట్, ఫోన్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఇక ఈ ఫోన్ ధర యూఎస్, కెనడాలలో 18,800ఉండగా ఇండియాలో రూ .16,000కే అందుబాటులోకి రానుండగా..బ్లాక్, రెడ్, వైట్,బ్లూ కలర్ ఆప్షన్ వేరియంట్లలో విడుదల కానుంది. -
Samsung M 52 Review: బడ్జెట్ 5 జీ ఫోన్ రిలీజ్.. అదిరిపోయే ఫీచర్లు ఇవే
చైనా కంపెనీలకు దీటుగా మార్కెట్లోకి బడ్జెట్ ధరలో శామ్సంగ్ కొత్త ఫోన్లను తీసుకువస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఫోన్ శామ్సంగ్ గెలాక్సీ ఎం 52, 5జీ ఫోన్. అమెజాన్‌లో ప్రస్తుతం ఈ ఫోన్ బుకింగ్స్ మొదలయ్యాయి. అక్టోబరు 10 నుంచి ఈ ఫోన్ డెలివరీ కానుంది. ఈ ఫోన్‌కి సంబంధించిన ఫస్ట్ రివ్యూ. బిగ్ బ్యాటరీ శామ్సంగ్లో ఎం సిరీస్ ఫోన్ల బ్యాటరీ సామర్థ్యం ఎక్కువ. అందుకు తగ్గట్టుగానే ఈ ఫోన్లో కూడా 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఎం సిరీస్‌లో ఇప్పటి వరకు వచ్చిన ఫోన్లలనీ మీడియం రేంజ్ బడ్జెట్ ఫోన్లే. కానీ ఎం 52 పాత ఫోన్లకి భిన్నంగా హై ఎండ్ ఫీచర్లను కలిగింది ఉంది. హై ఎండ్ ఫీచర్లు గెలాక్సీ ఎం 52 ఫోన్ 5జీ నెట్వర్క్ని సపోర్ట్ చేస్తుంది. ఇందు కోసం ఇందులో స్నాప్‌డ్రాగన్ 778 జీ ప్రాసెసర్‌ని ఉపయోగించారు. ఈ చిప్సెట్ 5 జీ నెట్వర్క్గి బాగా సపోర్ట్ చేస్తుంది. దీంతో పాటు ప్రస్తుతం హై ఎండ్ ఫోన్లకే పరిమితమైన 120 హెర్జ్ స్క్రీన్ రీఫ్రెస్ రేట్ ఇందులో లభిస్తుంది. స్క్రీన్ ప్రొటెక్షన్గా గొరిల్లా గ్లాస్ 5ని అమర్చారు. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండగా ప్రధాన కెమెరా 64 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతో పాటు కెమెరా అపాచర్ 1.8 ఎఫ్‌గా ఉంది. దీని వల్ల తక్కువ వెలుతురులో కూడా ఫోటోలు బాగా తీసుకునే సౌలభ్యం ఉంది. వర్చువల్ రామ్ ఇటీవల మార్కెట్లో బాగా పాపులర్ అయిన వర్చువల్ ర్యామ్ ఫీచర్‌ని శామ్సంగ్ అందించింది. శామ్సంగ్ సంస్థ ర్యామ్ ప్లస్ పేరుతో వరవ్చుల్ ర్యామ్‌ని అందిస్తుంది. ర్యామ్మెమెరీ నిండిపోయినప్పుడు వర్చువల్ రామ్ అప్పటికప్పుడు అదనంగా ర్యామ్‌ని అందిస్తుంది. ఎం 52 మోడల్‌కి సంబంధించి 8 జీబీ ర్యామ్ ఫోన్లో వర్చువల్ ర్యామ్‌గా 4 జీబీ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది. ఫలితంగా ఫోన్ వేగంగా పని చేయడంతో పాటు పాత యాప్స్‌ని, ఫోటోలు, వీడియో, మెసేజ్ ఇతర కంటెంట్‌ని డిలీట్ చేయాల్సిన ఇబ్బంది తప్పుతుంది. బ్లోట్‌వేర్ మార్కెట్లో గూగుల్ పిక్సెల్, మోటరోలా ఫోన్లు మాత్రమే స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తున్నాయి, మిగిలిన ఫోన్లలో మనకు అక్కర్లేనివి, ఎక్కువగా ఉపయోగించిన యాప్‌లను ప్రీ ఇన్‌స్టాల్‌గా వస్తున్నాయి. చాలా ఫోన్లలో ఇలాంటి ప్రీ ఇన్స్టాల్డ్ బ్లోట్‌వేర్ యాప్స్‌ని తొలగించే అవకాశం ఉండదు. కానీ శామ్సంగ్ ఎం 52లో బ్లోట్‌వేర్ యాప్‌ని అన్ఇన్స్టాల్ చేసుకునే వీలుంది. సింప్లీ స్లిమ్ పవర్ ఫుల్ బ్యాటరీతో వచ్చే ఎం సిరీస్ ఫోన్లు సాధారణంగా ఎక్కువ బరువు ఉంటాయి. కానీ గెలాక్సీ ఎం 52 ఇందుకు విరుద్ధం. హై ఎండ్ ఫోన్ల తరహాలో ఇది తక్కువ బరువు ఉండటంతో పాటు స్లిమ్‌గా కూడా కనిపిస్తుంది. ఇక ఇందులో స్నాప్‌డ్రాగన్ 778 జీ ప్రాసెసర్ ఉపయోగించడం వల్ల బ్యాటరీ ఆప్టిమైజేషన్ బాగుంటుంది. అమోల్డ్ స్క్రీన్, 120 హెర్జ్ సెట్టింగ్స్‌తో ఫోన్ ఉపయోగించినా త్వరగా బ్యాటరీ డ్రెయిన్ కాదు. సైడ్‌కి స్క్రీన్‌పై లేదా ఫోన్ వెనుక భాగంలో కాకుండా సైడ్‌కి ఫింగర్ ప్రింట్ స్కానర్‌ని అందించారు. పవర్ బటనే ఫింగర్ ప్రింట్ స్కానర్ కలిసే ఉన్నాయి. ఈ ఫీచర్‌పై మిశ్రమ స్పందన వస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్లో ఈ ఫోన్ తగ్గింపు ధరలో లభిస్తోంది. స్పెసిఫికేషన్లు - స్నాప్‌డ్రాగన్ 778 జీ ప్రాసెసర్, 5జీ 11 బ్యాండ్ సపోర్ట్ - 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ - బ్లూటూత్, వైఫై, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ - ఫుల్ హెచ్డీ, సూపర్ అమోల్డ్ ప్లస్ డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్ - ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ - 64 ఎంపీ, 12 ఎంపీ, 5 ఎపీ ట్రిపుల్ కెమెరా సెటప్, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా - హైపర్‌లాప్స్, బూమరాంగ్ వీడియో ఫీచర్లు, - మానస్టర్ నాక్స్ సెక్యూరిటీ ప్లస్ ఆల్ట్ - బ్లేజింగ్ బ్లాక్, ఐసీ బ్లూ కలర్లు - టైప్ సీ ఆడియో జాక్ - 6 జీబీ ర్యామ్, 128 జీబీ మెమోరి ధర రూ. 25,999 - 8 జీబీ ర్యామ్, 128 జీబీ మెమోరి రూ. 27,999 చదవండి :రూ.60వేల భారీ డిస్కౌంట్‌తో బ్రాండెడ్ ల్యాప్ ట్యాప్ -
ఫీచర్లు లీక్ : ఐఫోన్13 కంటే చిన్నది, అరచేతిలో ఇమిడిపోతుంది
స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం శాంసంగ్ విడుదల చేయనున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్22 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు లీక్ అయ్యాయి. అయితే ఈ ఫీచర్లు అచ్చం ఐఫోన్ 13తరహాలో ఉండడంతో యూజర్లు ఈ ఫోన్ గురించి తెలుసుకునేందుకు మరింత ఆసక్తి చూపిస్తున్నారు. యూజర్లను ఆకట్టుకున్న శాంసంగ్ కు చెందిన 'టిప్‌స్టర్, ఐసీఆ యూనివర్స్' ఫోన్ తరహాలో శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ఆకట్టుకోనుందని ప్రముఖ టెక్ రివ్యూవర్ (టిప్‌స్టార్) యోగేష్ బ్రార్ తెలిపారు. ఈ ఫోన్ ఫీచర్లు..ఐఫోన్ 13 ఫీచర్ల మాదిరిగా లెగ్త్, విడ్త్,థిక్ నెస్‌లు ఉన్నాయని చెప్పారు. వీటితో పాటు 3,700ఎంఏహెచ్ బ్యాటరీ, టిన్నీ స్టాండర్డ్‌లో ఆండ్రాయిడ్ ఫ్లాగ్ షిప్, పవర్ కన్జ్యూమింగ్ కు ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్, శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 22 సైజ్ ఐఫోన్ 13 కంటే చాలా చిన్నగా ఉంటుందని.. అరచేతిలో ఇమిడిపోతుందని తెలిపారు. ఐఫోన్ 13 కంటే గెలాక్సీ ఎస్ 22 పొడవు, వెడల్పు చిన్నగా ఉంటుందని చెప్పిన యోగేష్.. ఫోన్ సైజ్ 146.7 x 71.5 x 7.7 మిల్లీ మీటర్లుగా ఉందని కాబట్టే ఈ శాంసంగ్ గెలాక్సీ ఎస్22.. ఐఫోన్ 13కంటే చిన్నగా ఉందన్నారు. 6.06-అంగుళాల డిస్ప్లేతో గెలాక్సీ ఎస్ 22 ఆండ్రాయిడ్ మార్కెట్లో అత్యంత కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్‌లలో ఒకటిగా నిలవగా.. చివరిసారిగా శాంసంగ్ 5.8-అంగుళాల స్క్రీన్ సైజు గెలాక్సీ ఎస్10 ఈ'ని విడుదల చేసింది. కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది, ఇది 5.8-అంగుళాల స్క్రీన్ సైజు కలిగిన గెలాక్సీ ఎస్ 10 ఇ. అయితే గెలాక్సీ ఎస్ 22 6.06-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. గెలాక్సీ ఎస్ 22+,గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా అందించే ఛార్జింగ్ స్పీడ్లతో పోలిస్తే 25వాల్డ్ల ఫాస్ట్ ఛార్జింగ్ తో గెలాక్సీ ఎస్ 22 నెమ్మదిగా ఉంది. ఫోన్ వీడియో క్వాలిటీకోసం శామ్సంగ్ జీఎన్1,జీఎన్2 కెమెరా సెన్సార్లపై స్కిప్పింగ్ ను తో పాటు ఐఎస్ఓసెల్ జీఎన్5 కెమెరా సెన్సార్‌ని వినియోగించుకోవచ్చని టెక్ రివ్యూవర్ యోగేష్ బ్రార్ తెలిపారు చదవండి : ఆకట్టుకునే ఫీచర్లు, మార్కెట్లో విడుదలైన మరో స్మార్ట్ ఫోన్ -
ఆకట్టుకునే ఫీచర్లు, మార్కెట్లో విడుదలైన మరో స్మార్ట్ ఫోన్
సౌత్ కొరియా స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం శాంసంగ్ 'గెలాక్సీ వైడ్5' ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ సౌత్ కొరియాలో అందుబాటులో ఉండగా త్వరలో మిగిలిన దేశాల్లో విడుదల కానున్నట్లు శాంసంగ్ ప్రతినిధులు వెల్లడించారు. ఫోన్ స్పెసిఫికేషన్స్.. 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఇన్ఫినిటీ-వీ డిస్ ప్లే,ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్,ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. బ్యాటరీ సామర్ధ్యం 5000 ఎంఏహెచ్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. వీటితో పాటు వాటర్ డ్రాప్ తరహా డిస్ ప్లే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలువ నుంది. శాంసంగ్ గెలాక్సీ వైడ్ 5 ధర ప్రస్తుతానికి శాంసంగ్ గెలాక్సీ వైడ్ 5 ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ తో విడుదలైన ఈ ఫోన్ ధర ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.28,200గా ఉంది. బ్లాక్, బ్లూ, వైట్ రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. చదవండి: ఐఫోన్ యూజర్లకు ఆపిల్ హెచ్చరికలు ! అందులో నిజమెంత? -
అద్భుతమైన ఫీచర్లతో మరో స్మార్ట్ ఫోన్, ఫీచర్లు లీకయ్యాయి
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ శుభవార్త చెప్పింది. అద్భుతమైన ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఏ21 సింపుల్ స్మార్ట్ఫోన్లను వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 9 నుంచి ఓపెన్ మార్కెట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఫోన్ జపాన్ మార్కెట్లో అందుబాటులో ఉండగా..దాని ఫీచర్లు లీక్ అయ్యాయి. శాంసంగ్ గెలాక్సీ ఏ21 సింపుల్ ఫీచర్లు ఇక నెట్టింట్లో సందడి చేస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు చూస్తుంటే.. 720* 1,560పిక్సెల్స్, 5.8 అంగుళాల డిస్ ప్లే, రెడ్, గ్రీన్, బ్లూలలో టీఎఫ్టీ డిస్ప్లే(Thin Film Transistor), ఆక్టా కోసం ఎక్సినోస్ 7884 బి, ఎస్ఓసీ 3జీబీ ర్యామ్, 1 టెరాబైట్ మెమరీతో మైక్రో ఎస్డీ కార్డ్ 64 ఇంటర్నల్ స్టోరేజ్, 3,600ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తుంది. ఇక ఈ ఫోన్ వెనక భాగంలో 13ఎంపీ సెన్సార్,5ఎంపీ సెల్ఫీ షూటర్,ఇంటర్ నెట్ కనెక్టివిటీ కోసం 4జీ లైట్, వైఫ్, బ్లూటూత్ వీ5, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ- పోర్ట్, యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్ ఫీచర్లను కలిగి ఉంది. ఇక ఈ ఫోన్ ధర ఇండియా కరెన్సీ ప్రకారం రూ.14,700 ఉండనుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి : పాపులర్ స్మార్ట్ ఫోన్, ధర ఐదోసారి పెరిగింది