![Samsung Galaxy A21 Check Price And Features Details - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/29/pjimage%20%2828%29.jpg.webp?itok=6PqdUqvB)
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ శుభవార్త చెప్పింది. అద్భుతమైన ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఏ21 సింపుల్ స్మార్ట్‌ఫోన్లను వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 9 నుంచి ఓపెన్ మార్కెట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఫోన్ జపాన్ మార్కెట్‌లో అందుబాటులో ఉండగా..దాని ఫీచర్లు లీక్ అయ్యాయి.
శాంసంగ్ గెలాక్సీ ఏ21 సింపుల్ ఫీచర్లు
ఇక నెట్టింట్లో సందడి చేస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు చూస్తుంటే.. 720* 1,560పిక్సెల్స్, 5.8 అంగుళాల డిస్ ప్లే, రెడ్, గ్రీన్, బ్లూలలో టీఎఫ్‌టీ డిస్‌ప్లే(Thin Film Transistor), ఆక్టా కోసం ఎక్సినోస్ 7884 బి, ఎస్‌ఓసీ 3జీబీ ర్యామ్, 1 టెరాబైట్ మెమరీతో మైక్రో ఎస్‌డీ కార్డ్ 64 ఇంటర్నల్ స్టోరేజ్, 3,600ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తుంది.
ఇక ఈ ఫోన్ వెనక భాగంలో 13ఎంపీ సెన్సార్,5ఎంపీ సెల్ఫీ షూటర్,ఇంటర్ నెట్ కనెక్టివిటీ కోసం 4జీ లైట్, వైఫ్, బ్లూటూత్ వీ5, జీపీఎస్, యూఎస్‌బీ టైప్ సీ- పోర్ట్, యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్ ఫీచర్లను కలిగి ఉంది. ఇక ఈ ఫోన్ ధర ఇండియా కరెన్సీ ప్రకారం రూ.14,700 ఉండనుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
చదవండి : పాపులర్ స్మార్ట్ ఫోన్, ధర ఐదోసారి పెరిగింది
Comments
Please login to add a commentAdd a comment