ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ శామ్‌సంగ్‌కు ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టు ఝలకిచ్చింది. స్మార్ట్ ఫోన్లుకు సంబంధించి తప్పుదోవ ప్రకటనలు ఇచ్చినందుకు కోర్టు శామ్‌సంగ్‌కు 14 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం రూ.78 కోట్లు) ఫైన్ విధించింది. ఈ మొత్తాన్ని కూడా 30 రోజుల్లోగా చెల్లించాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జస్టిస్ బ్రెండన్ ముర్ఫీ తీర్పునిచ్చారు.
అంతేకాకుండా ఈ వ్యవహారంపై విచారణ జరిపినందుకుగాను ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్జ్యూమర్ కమిషన్‌కి కూడా అదనంగా మరో 2 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు ( భారత కరెన్సీ ప్రకారం రూ.1.10 కోట్లు) చెల్లించాలని ఆదేశించారు. 2016 నుంచి 2018 మధ్య S7, S7 ఎడ్జ్.A5 (2017), A7 (2017), S8, S8 ప్లస్, నోట్ 8 గెలెక్సీ ఫోన్లను శామ్‌సంగ్ ఆస్ట్రేలియాలో విక్రయించింది. ప్రత్యేకంగా వీటిని తయారు చేశామని నీళ్లలో తడిచినా పాడవవంటూ భారీగా ప్రకటనలు కూడా ఇచ్చింది.
నీళ్లలో ఈ ఫోన్లు ఉంచినప్పుడు ఛార్జింగ్ పోర్టులు పాడయ్యాయి. దీంతో తమ ఫోన్లు పనిచేయడం లేదంటూ వందలాదిగా వినియోగదారులు ఆస్ట్రేలియన్ కాంపీటీషన్ అండ్ కన్జూమర్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి 2019లో నమోదైన కేసులపై కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంపై శాంసంగ్ స్పందిస్తూ.. 2016 నుంచి 2017 మధ్యలో అమ్మకాలు జరిపిన ఏడు మోడళ్లపై మాత్రమే ఈ సమస్య తలెత్తినట్లు తెలిపింది. ప్రస్తుత శాంసంగ్ ఫోన్‌లలో ఈ తరహా సమస్యలు లేవని తెలిపింది.
చదవండి: Gmail Storage: మీ ఇ-మెయిల్ బాక్స్ నిండిపోయిందా, సింగిల్ క్లిక్‌తో ఇలా చేయండి!
Comments
Please login to add a commentAdd a comment