న్యూయార్క్: నీలిచిత్రాల తార స్టార్మీ డేనియల్‌తో సంబంధం విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు ఆమెకు తన లాయర్ ద్వారా అనైతిక మార్గంలో నగదు పంపించిన(హష్ మనీ) కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ కోర్టు ఆగ్రహానికి గురయ్యారు.
జడ్జీలు, సాక్షులపై వ్యాఖ్యానాలు చేయొద్దని, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టొద్దన్న గ్యాగ్ ఉత్తర్వులను మళ్లీ ఉల్లంఘించినందుకు 1,000 డాలర్ల జరిమానాను న్యాయస్థానం విధించింది. మరోసారి ఉల్లంఘిస్తే జైల్లో పడేస్తామని సోమవారం జడ్జి జువాన్ ఎం.మెర్చాన్ హెచ్చరించారు. ఇప్పటికే తొమ్మిదిసార్లు ఉల్లంఘించినందుకు గత వారమే ట్రంప్‌నకు 9,000 డాలర్ల జరిమానా విధించడం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment