Blue Star
-
రూ.3,793 కోట్లు లాభం.. ఏసీలకు గిరాకీ
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ (పీజీసీఐఎల్) సెప్టెంబర్ త్రైమాసికానికి రూ.3,793 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.3,781 కోట్లతో పోలిస్తే కేవలం రూ.12 కోట్లు పెరిగింది. ఆదాయం రూ.11,530 కోట్ల నుంచి రూ.11,846 కోట్లకు వృద్ధి చెందింది. స్థిరాస్తుల స్థూల విలువ రూ.2,78,983 కోట్లకు చేరింది. సెప్టెంబర్ క్వార్టర్లో రూ.38,575 కోట్ల విలువ చేసే ఎనిమిది ప్రాజెక్టులకు పవర్‌గ్రిడ్ విజయవంతమైన బిడ్డర్‌గా అర్హత సాధించింది.రూ.4.5 డివిడెండ్..వాటాదారుల వద్దనున్న ప్రతి షేరుకు రూ.4.50 చొప్పున మధ్యంతర డివిడెండ్ ఇచ్చేందుకు కంపెనీ బోర్డు నిర్ణయించింది. అలాగే పవర్‌గ్రిడ్ కాలా అంబ్ ట్రాన్స్మిషన్, పవర్‌గ్రిడ్ పర్లి ట్రాన్స్మిషన్, పవర్‌గ్రిడ్ వరోరా ట్రాన్స్మిషన్, పవర్‌గ్రిడ్ జబల్పూర్ ట్రాన్స్‌మిషన్‌ను పవర్‌గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (పీజీఇని్వట్)కు విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేరు ధర పెద్దగా మార్పుచెందకుండా రూ.318 వద్ద క్లోజ్ అయింది. బ్లూస్టార్ ఆకర్షణీయ ఫలితాలుకూలింగ్ ఉత్పత్తుల సంస్థ బ్లూస్టార్ లిమిటెడ్ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మెరుగైన పనితీరు ప్రదర్శించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.71 కోట్ల నుంచి రూ.96 కోట్లకు దూసుకుపోయింది. 35 శాతం వృద్ధి నమోదైంది. ఆదాయం 22 శాతం వృద్ధితో రూ.2,276 కోట్లుగా నమోదైంది. బలమైన ఆర్డర్ల పైప్‌లైన్‌తో అన్ని విభాగాల్లోనూ మెరుగైన పనితీరు చూపించినట్టు.. కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్ కొనసాగినట్టు బ్లూస్టార్ తెలిపింది. ఎలక్ట్రో మెకానికల్ ప్రాజెక్టులు, వాణిజ్య ఏసీ సిస్టమ్స్ ఆదాయం 33 శాతం పెరిగి రూ.1,428 కోట్లకు చేరింది. ఈ విభాగం మార్జిన్లు 2.2 శాతం బలపడ్డాయి. ఎలక్ట్రో మెకానికల్ ప్రాజెక్టుల విభాగంలో తయారీ రంగం, డేటా సెంటర్ల నుంచి వృద్ధి కనిపించింది. యూనిటీ ప్రొడక్టుల (రూమ్ ఏసీలు కూడా) ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.767 కోట్లుగా నమోదైంది. ప్రొఫెషనల్ ఎల్రక్టానిక్స్, ఇండ్రస్టియల్ సిస్టమ్స్ ఆదాయం స్వల్పంగా క్షీణించి రూ.80 కోట్లుగా ఉంది.ఇదీ చదవండి: ట్యాక్సీ మాఫియానే ప్రధాన ఓటు బ్యాంకు!ఏసీల వ్యాపారం సానుకూలంఅన్ని విభాగాల్లోనూ అవకాశాలు ఆశావహంగా ఉన్నట్టు, రూమ్ ఏసీలు, వాణిజ్య ఏసీల వ్యాపారం మంచి పనితీరు చూపిస్తున్నట్టు సంస్థ చైర్మన్, ఎండీ ఎస్ అద్వానీ తెలిపారు. 2024–25 సంవత్సరం పట్ల సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. డైరెక్టర్ పీవీ రావును ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా (ప్రాజెక్టులు, సొల్యూషన్లు) నియమించినట్టు సంస్థ ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్లూస్టార్ షేరు ఒక శాతానికి పైగా పెరిగి రూ.1,878 వద్ద క్లోజ్ అయింది. -
ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్‌కు కోర్టు హెచ్చరిక
న్యూయార్క్: నీలిచిత్రాల తార స్టార్మీ డేనియల్‌తో సంబంధం విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు ఆమెకు తన లాయర్ ద్వారా అనైతిక మార్గంలో నగదు పంపించిన(హష్ మనీ) కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ కోర్టు ఆగ్రహానికి గురయ్యారు. జడ్జీలు, సాక్షులపై వ్యాఖ్యానాలు చేయొద్దని, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టొద్దన్న గ్యాగ్ ఉత్తర్వులను మళ్లీ ఉల్లంఘించినందుకు 1,000 డాలర్ల జరిమానాను న్యాయస్థానం విధించింది. మరోసారి ఉల్లంఘిస్తే జైల్లో పడేస్తామని సోమవారం జడ్జి జువాన్ ఎం.మెర్చాన్ హెచ్చరించారు. ఇప్పటికే తొమ్మిదిసార్లు ఉల్లంఘించినందుకు గత వారమే ట్రంప్‌నకు 9,000 డాలర్ల జరిమానా విధించడం విదితమే. -
This Week In OTT: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?
ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. కాకపోతే ప్రస్తుతం పరీక్షల కాలం నడుస్తోంది. దీంతో అటు థియేటర్లలో గానీ ఇటు ఓటీటీలో గానీ అద్భుతమైన చిత్రాలేం రావట్లేదు. ఈ వారమైతే థియేటర్లలో 'ఆపరేషన్ వాలంటైన్', 'వ్యూహం', 'చారీ 111', 'భూతద్దం భాస్కర్' తదితర చిత్రాలొస్తున్నాయి. వీటిపై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలైతే లేవు. మరి థియేటర్లలో ఏది క్లిక్ అవుతుందనేది చూడాలి. (ఇదీ చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఆ యాక్షన్ సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) మరోవైపు ఈ వారం ఓటీటీల్లో మాత్రం దాదాపు 30కి సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అయితే వీటిలో 'బ్లూ స్టార్', 'ద ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ' చిత్రాలు మాత్రమే ఉన్నంతలో కాస్త ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. మిగతా వాటిలో పలు ఇంగ్లీష్, హిందీ చిత్రాలున్నాయి. రిలీజ్ తర్వాత గానీ వీటిలో ఏది బాగుందనేది తెలియదు. ఇంతకీ ఏయే ఓటీటీల్లో ఏ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయో తెలుసా? ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఫిబ్రవరి 26 - మార్చి 3) నెట్‌ఫ్లిక్స్ ఇండిగో (ఇండోనేసియన్ సినిమా) - ఫిబ్రవరి 27 అమెరికన్ కాన్స్పరసీ: ద అక్టోపస్ మర్డర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 28 కోడ్ 8 పార్ట్ 2 (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 28 ద మైర్ సీజన్ 3 (పోలిష్ సిరీస్) - ఫిబ్రవరి 28 ఏ రౌండ్ ఆఫ్ అప్లాజ్ (టర్కిష్ సిరీస్) - ఫిబ్రవరి 29 మన్ సూఆంగ్ (థాయ్ సినిమా) - ఫిబ్రవరి 29 ద ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్ (హిందీ సినిమా) - ఫిబ్రవరి 29 ఫ్యూరిస్ (ఫ్రెంచ్ సిరీస్) - ఫిబ్రవరి 29 మామ్లా లీగల్ హై (హిందీ సిరీస్) - మార్చి 01 మై నేమ్ ఈజ్ లోహ్ కివాన్ (కొరియన్ మూవీ) - మార్చి 01 షేక్, ర్యాటెల్ & రోల్: ఎక్స్ట్రీమ్ (తగలాగ్ సినిమా) - మార్చి 01 సమ్‌బడీ ఫీడ్ ఫిల్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 01 స్పేస్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 01 ద పిగ్ ద స్నేక్ అండ్ ద పిజియన్ (మాండరిన్ సినిమా) - మార్చి 01 ద నెట్‌ఫ్లిక్స్ స్లామ్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 03 అమెజాన్ ప్రైమ్ వెడ్డింగ్ ఇంపాజిబుల్ (కొరియన్ సిరీస్) - ఫిబ్రవరి 26 ఎనీవన్ బట్ యూ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 26 పూర్ థింగ్స్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 27 బ్లూ స్టార్ (తమిళ సినిమా) - ఫిబ్రవరి 29 పా పాట్రోల్: ద మైఠీ మూవీ (ఇంగ్లీష్ చిత్రం) - ఫిబ్రవరి 29 రెడ్ క్వీన్ (స్పానిష్ సిరీస్) - ఫిబ్రవరి 29 నైట్ స్విమ్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 01 హాట్‌స్టార్ ఇవాజు (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 28 షోగున్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 28 ద ఇంపాజిబుల్ హెయర్ (కొరియన్ సిరీస్) - ఫిబ్రవరి 28 వండర్ఫుల్ వరల్డ్ (కొరియన్ సిరీస్) - మార్చి 01 జీ5 సన్‌ఫ్లవర్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మార్చి 01 జియో సినిమా ఫైవ్ నైట్స్ ఎట్ ఫ్రెడ్డీస్ (ఇంగ్లీష్ చిత్రం) - ఫిబ్రవరి 27 బుక్ మై షో ఫియర్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 27 ఆపిల్ ప్లస్ టీవీ నెపోలియన్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 01 ద కంప్లీట్లీ మేడ్-అప్ అడ్వెంచర్స్ ఆఫ్ డిక్ టర్పిన్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 01 ముబీ ప్రిసిల్లా (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 01 (ఇదీ చదవండి: పెళ్లి చేసుకుందామనుకున్నాం.. కానీ అలా జరగడంతో బ్రేకప్: బిగ్ బాస్ దివి) -
మూడు ఓటీటీల్లో ఒకేసారి హిట్ సినిమా రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఈ మధ్య సినిమాలన్నీ ఓటీటీల్లోకి అనుకున్న దానికంటే చాలా తర్వగానే వచ్చేస్తున్నాయి. హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. ఇప్పుడు అలానే ఓ హిట్ సినిమా కూడా దాదాపు నెలలోనే రిలీజ్ కానుంది. అయితే ఒకేసారి మూడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుందనే విషయం ఆసక్తికరంగా మారిపోయింది. ఇంతకీ ఏంటా సినిమా? స్ట్రీమింగ్ ఎప్పుడు? (ఇదీ చదవండి: వీడియో: యంగ్ హీరో ఆశిష్ రిసెప్షన్లో విజయ్-రష్మిక) జనవరి 25న తమిళంలో రిలీజైన సినిమా 'బ్లూ స్టార్'. క్రికెట్ నేపథ్యం ప్లస్ కులాల మధ్య అంతరాలు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తీశారు. అశోక్ సెల్వన్, శంతను, కీర్తి పాండియన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. తక్కువ బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ.. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడంలో సక్సెస్ అయింది. కలెక్షన్స్ కూడా గట్టిగానే వచ్చాయి. ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 29 నుంచి ఓటీటీలో 'బ్లూ స్టార్' స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. అయితే ఈ చిత్రం.. టెంట్ కోట్టా, సింప్లీ సౌత్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లో ఒకేసారి అందుబాటులోకి రానుంది. ఇలా ఓ సినిమా ఏకంగా మూడు ఓటీటీల్లో రిలీజ్ కావడం కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ కూడా ఉండొచ్చని టాక్. ఈ సినిమాలో నటించిన అశోక్ సెల్వన్, కీర్తి పాండియన్.. గతేడాది సెప్టెంబరులో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు జంటగా తొలి మూవీతోనే హిట్ కొట్టేశారు. (ఇదీ చదవండి: ప్రభాస్ డూప్‌కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?) #Bluestar, the much-anticipated political cricket movie, streaming from Feb 29 on Tentkotta.💙⭐#BluestaronTentkotta@officialneelam @beemji @lemonleafcreat1@chejai007 @AshokSelvan @imKBRshanthnu@prithviactor @iKeerthiPandian @Lovekeegam@that_Cameraman… pic.twitter.com/0SI76GsOPN — Tentkotta (@Tentkotta) February 23, 2024 -
సెన్సార్ బోర్డుపై దర్శకుడు ఫైర్.. నా సినిమా అంటే చాలు..
దర్శకుడు పా.రంజిత్ చిత్రాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. అదే సమయంలో సెన్సార్ బోర్డు నుంచి సమస్యలూ ఎదురవుతుంటాయి. తాజాగా ఆయన సొంత బ్యానర్ 'నీలం ప్రొడక్షన్స్' సమర్పణలో తెరకెక్కిన బ్లూస్టార్ మూవీకి ఈ చిక్కులు తప్పలేవు. అశోక్ సెల్వన్, శాంతను, పృథ్వీ పాండియరాజన్, కీర్తిపాండియన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జై కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గత నెల 25న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. బ్లూస్టార్‌కు ఎలాంటి సమస్యలు ఉండవనుకున్నా.. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం మధ్యాహ్నం చైన్నెలో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా పా.రంజిత్ మాట్లాడుతూ.. నీలం ప్రొడక్షన్స్ సంస్థ నుంచి చిత్రం వస్తుందంటేనే ఏదేదో ఉంటుందని సెన్సార్ బోర్డు సభ్యులు అలర్ట్ అవుతున్నారని ఫైర్ అయ్యారు. బ్లూస్టార్ చిత్రానికి ఎలాంటి సమస్యలు రావని భావించానని, అయితే ఈ చిత్రం విడుదల కాకూడదని అక్కడే కొందరు అనుకోవడం మొదలెట్టారని చెప్పారు. అది విని తనకు చాలా ఆశ్చర్యం కలిగిందన్నారు. ఆయనను రౌడీ అన్నారు ఈ చిత్రాన్ని ఎందుకు విడుదల చేయకూడదని ప్రశ్నించగా ఇది ఓ వర్గానికి అనుకూలంగా ఉందని చెప్పారు. నాయకుడు పూవై జగన్ మూర్తియార్ కథలా అనిపిస్తోందన్నారు. ఆయనను ఒక రౌడీగా అభివర్ణించినట్లు తెలిపారు. పూవై మూర్తియార్ తమను చదివించారని, ఆయన పెద్ద నాయకుడు అని, ఆయన్ని ఎలా రౌడీ అంటారని ప్రశ్నించానన్నారు. తాను ఎంత వాదించినా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించినట్లు చెప్పారు. దీంతో రివైజింగ్ కమిటీకి వెళ్లి అక్కడ చెప్పిన కొన్ని మార్పులు చేసి బ్లూస్టార్ రిలీజ్ చేయగా అదిప్పుడు ప్రేక్షకుల ఆదరణ పొందుతోందన్నారు. సమైక్యతను చాటి చెప్పే చిత్రానికి సెన్సార్ సమస్యలు సృష్టిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. చదవండి: విజయ్ దేవరకొండపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రష్మిక -
పెళ్లి తర్వాత జంటగా తొలి సినిమా.. రెండు రోజుల్లో రిలీజ్
ఈ హీరోహీరోయిన్ గతేడాది సెప్టెంబరులో పెళ్లి చేసుకున్నారు. ఆ వెంటనే ఓ సినిమాలో కలిసి నటించారు. ఇప్పుడా ఆ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు రెడీ అయిపోయారు. ఈ గురువారం బిగ్ స్క్రీన్‌పై రిలీజ్ కాబోతున్న ఈ మూవీ సంగతులేంటి? అసలు ఈ హీరోహీరోయిన్ ఎవరనేది చూద్దాం. (ఇదీ చదవండి: జ్యోతిక విడాకుల రూమర్స్.. ముంబైకి షిఫ్ట్.. అసలు కారణం ఇదేనా?) క్రికెట్ నేపథ్య కథతో చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఆ లిస్టులోకి చేరబోతున్న తమిళ సినిమా 'బ్లూ స్టార్'. అశోక్ సెల్వన్, పృథ్వీ పాండియరాజన్, దివ్య దురైస్వామి, కీర్తి పాండియన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గోవింద వసంత సంగీతమందించారు. ఎస్. రాజ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. జనవరి 25న తమిళంలో విడుదల కానుంది. అయితే సినిమాలో జంటగా నటించిన అశోక్ సెల్వన్-కీర్తి పాండియన్.. నిజ జీవితంలో నాలుగు నెలల క్రితమే భార్యభర్తలయ్యారు. కాబట్టి ఈ సినిమా వీళ్లకు స్పెషల్ అని చెప్పొచ్చు. 1990లో తమిళనాడులోని కుంభకోణం ఊరిలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా 'బ్లూ స్టార్' తీసినట్లు దర్శకనిర్మాతలు చెప్పారు. ఇందులో సమకాలిన రాజకీయాలతో పాటు ప్రేమ, వినోదం లాంటి కమర్షియల్ అంశాలకు కూడా చోటు ఉంటుందని చెప్పారు. చిన్న సినిమా కాబట్టి ఓటీటీలోకి వచ్చినప్పుడే తెలుగు వెర్షన్ రిలీజ్ కావొచ్చు. (ఇదీ చదవండి: చెల్లి ఎంగేజ్మెంట్.. డ్యాన్స్‌తో దుమ్మురేపిన సాయిపల్లవి!) -
ఖలిస్తాన్ అంటే ఏమిటి? పంజాబ్‌ను ఎందుకు విడదీయాలంటున్నారు?
గత కొద్ది రోజులుగా ఖలిస్తాన్ పేరు చర్చలలోకి వస్తోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత ఏజెన్సీల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ఈ నేపధ్యంలో భారత్, కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ సమయంలో ఖలిస్తాన్ ఉదంతం ఏమిటో తెలుసుకోవాలనే అసక్తి అందరిలో పెరిగింది. ఈ ఉద్యమం ఏమిటో? అది ఎలా మొదలైందో తెలియని వారు గూగుల్ సాయంతో సమాచారాన్ని సేకరిస్తున్నారు. అందుకే ఖలిస్తాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఖలిస్తాన్ అంటే ఏమిటి? భారతదేశంలో ఖలిస్తాన్ ఉద్యమ మూలాలు ఎప్పుడో అంతరించిపోయాయి. అయితే ఆ తర్వాత కొందరు విదేశాల్లో ఉంటూ ఖలిస్తాన్ పేరిట అనేక ఉద్యమాలు సృష్టిస్తున్నారు. భారత్‌పై విద్వేషాన్ని వ్యాప్తి చేసేందుకు వారు నిరంతరం కృషిచేస్తున్నారు. వారు భారతదేశం నుండి పంజాబ్‌ను వేరు చేయాలనే ఉద్యమానికి ఖలిస్తాన్ ఉద్యమం అని పేరు పెట్టారు. ఖలిస్తాన్ అనే పేరు ఎలా వచ్చింది? ఖలిస్తాన్ అనేది ఖలీస్ అనే అరబిక్ పదం నుండి ఉద్భవించింది. ఖలిస్తాన్ అంటే ఖల్సాకు చెందిన భూమి. అంటే సిక్కులు మాత్రమే నివసించే ప్రదేశం. 1940లో లాహోర్ డిక్లరేషన్‌కు ప్రతిస్పందనగా డాక్టర్ వీర్ సింగ్ భట్టి ఒక కరపత్రాన్ని ప్రచురించినప్పుడు ఈ పదాన్ని తొలిసారి ఉపయోగించారు. సిక్కుల కోసం ప్రత్యేక దేశం అనే డిమాండ్ 1929 నుండి మొదలయ్యింది. కాంగ్రెస్ సమావేశంలో మాస్టర్ తారా సింగ్ ఈ డిమాండ్‌ను తొలిసారి లేవనెత్తారు. ఖలిస్తానీ ఉద్యమ నాంది.. 70వ దశకంలో చరణ్ సింగ్ పంక్షి, డాక్టర్ జగదీత్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో ఖలిస్తాన్ కోసం డిమాండ్ మరింత తీవ్రమైంది. దీని తరువాత 1980లో ఖలిస్తాన్ నేషనల్ కౌన్సిల్ కూడా ఏర్పాటయ్యింది. అనంతరకాలంలో పంజాబ్‌లోని కొంతమంది యువకులు దాల్ ఖల్సా అనే సంస్థను స్థాపించారు. ఇదిలావుండగా ఉగ్రవాదులను అంతం చేసేందుకు 1984లో అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్లో ఆపరేషన్ బ్లూ స్టార్‌ను నిర్వహించారు. దీని తరువాత ఖలిస్తానీ ఉద్యమ మూలాలు భారతదేశం నుండి దూరమయ్యాయి. ఇప్పుడు అమెరికా, కెనడా, బ్రిటన్‌తో సహా అనేక దేశాలలో ఖలిస్తాన్ మద్దతుదారులు భారతదేశానికి వ్యతిరేకంగా తరచూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. విదేశాలలో ఉంటూ, భారత గడ్డపై అశాంతిని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా చదవండి: టెండర్ ఓటింగ్ అంటే ఏమిటి? ఎన్వలప్లో ఓటు ఎందుకు ప్యాక్ చేస్తారు? -
బ్లూస్టార్ ఉత్పత్తులకు హబ్‌గా శ్రీసిటీ: బిలియన్ డాలర్ల ఆదాయ లక్ష్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాబోయే రోజుల్లో తమ ఉత్పత్తులకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ హబ్‌గా మారగలదని ఎయిర్ కండీషనింగ్, రిఫ్రిజిరేషన్ ఉత్పత్తుల సంస్థ బ్లూస్టార్ ఎండీ బి. త్యాగరాజన్ చెప్పారు. ఇప్పటికే అక్కడ ఇన్వెస్ట్ చేసినవి, కొత్తగా చేయబోయేవి కలిపి రాబోయే మూడేళ్లలో మొత్తం రూ. 1,000 కోట్ల పైచిలుకు పెట్టుబడి పెట్టినట్లవుతుందని త్యాగరాజన్ వివరించారు. వ్యూహాత్మక స్థానంలో ఉన్నందున సరుకు రవాణా, నిల్వ చేసుకోవడం వంటి విషయాలకు సంబంధించి తమకు ఇది ప్రయోజనకరంగా ఉంటోందని పేర్కొన్నారు. (March18th పసిడి ప్రియులకు షాక్: ఆల్‌టైం రికార్డు, ఇక కొన్నట్టే..?!) శుక్రవారమిక్కడ కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించిన సందర్భంగా త్యాగరాజన్ ఈ విషయాలు చెప్పారు. శ్రీసిటీలో రూమ్ ఏసీల తయారీకి సంబంధించి మొత్తం నాలుగు దశల్లో ప్రస్తుతం తొలి దశ పూర్తయి ఇటీవలే ఉత్పత్తి మొదలైందని చెప్పారు. మిగతావి కూడా పూర్తయితే 12 లక్షల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. అటు కమర్షియల్ ఏసీల తయారీకి సంబంధించి రెండో ప్లాంటు నిర్మాణం కోసం 40 ఎకరాలు సమీకరించినట్లు, 2024లో పనులు, 2025లో ఉత్పత్తి ప్రారంభం కాగలదని అంచనా వేస్తున్నట్లు త్యాగరాజన్ చెప్పారు. గత కొద్ది త్రైమాసికాలుగా సానుకూల ఫలితాలు నమోదు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బిలియన్ డాలర్ల ఆదాయం (దాదాపు రూ. 8,200 కోట్లు) అంచనా వేస్తున్నట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ. 6,046 కోట్ల ఆదాయం నమోదు చేసింది. అంతర్జాతీయంగా విస్తరణ..: కొత్త విభాగాల్లో ప్రవేశించడంకన్నా ఇతర దేశాల్లో మరింత విస్తరించడంపై దృష్టి పెడుతున్నట్లు త్యాగరాజన్ చెప్పారు. ప్రస్తుతం మధ్య ప్రాచ్య దేశాలకు ఎగుమతి చేస్తుండగా అమెరికా, యూరప్ తదితర మార్కెట్లలోనూ కార్యకలాపాలకు సిద్ధమవుతున్నట్లు వివరించారు. ఆయా మార్కెట్లకు ఈ ఏడాది ఆఖరు నుంచే ఎగుమతులు మొదలుపెట్టే అవకాశం ఉందన్నారు. (Ugadi 2023 బిగ్ ‘సి’: వినూత్నఫెస్టివ్ ఆఫర్లు ) కొత్త ఫ్రీజర్ల శ్రేణి.. బ్లూస్టార్ ఆవిష్కరించిన కొత్త ఉత్పత్తుల శ్రేణిలో దేశీయంగా తీర్చిదిద్దిన డీప్ ఫ్రీజర్లు, రిఫ్రిజిరేషన్ ఉత్పత్తులు ఉన్నాయి. వీటి కూలింగ్, నిల్వ సామర్థ్యాలు మరింత అధికంగా ఉంటాయని, వీటిని మహారాష్ట్రలోని వాడా ప్లాంటులో తయారు చేశామని త్యాగరాజన్ తెలిపారు. రాబోయే రోజుల్లో తమ సంస్థ వృద్ధికి కమర్షియల్ రిఫ్రిజిరేషన్ మరింతగా ఊతమివ్వగలదని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ విభాగం నుంచి తమకు రూ. 70 కోట్లు, దక్షిణాదిలో రూ. 235 కోట్ల పైచిలుకు ఆదాయం వస్తోందన్నారు. మొత్తం అన్ని విభాగాల రీత్యా చూస్తే తమ సంస్థ 20–25 శాతం వృద్ధి సాధిస్తోందని, పరిశ్రమ వృద్ధి సుమారు 15–20 శాతం మేర ఉంటోందని పేర్కొన్నారు. -
రూ.10 వేల కోట్ల ఆదాయంపై కన్నేసిన బ్లూస్టార్
న్యూఢిల్లీ: ఎయిర్ కండిషనింగ్, వాణిజ్యపర రిఫ్రిజిరేటర్ల తయారీ దిగ్గజం బ్లూ స్టార్.. మధ్య కాలంలో తన ఆదాయాన్ని రూ.10,000 కోట్లకు పెంచు కోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఉత్తర అమెరికా, ఐరోపా మార్కెట్లలోకి ప్రవేశించాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. ‘తదుపరి దశ వృద్ధిలో భాగంగా అంతర్జాతీయంగా ప్రధాన కంపెనీగా బ్లూస్టార్ మారుతుంది. మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, దక్షిణాసియా ప్రాంతాలలో మరింత విస్తరణ, వినూత్న ఉత్పత్తులు, పరిష్కారాల పరిచయంతో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటామని బ్లూస్టార్ వెల్లడించింది. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకుంటాం. వ్యయ నియంత్రణ చేపడతాం. భారతదేశం మాతృ కేంద్రంగా కొనసాగుతుంది. ఏసీలు, రిఫ్రిజిరేషన్‌కు సంబంధించి అన్ని విభాగాల్లో బ్లూ స్టార్ ప్రధాన బ్రాండ్‌గా ఉండడానికి కృషి చేస్తుంది. ఏసీలు, రిఫ్రిజిరేషన్ ఉత్పత్తుల తయారీలో ముఖ్య కేంద్రంగా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది’ అని సంస్థ వైస్ ఛైర్మన్, ఎండీ వీర్ ఎస్ అద్వానీ తెలిపారు. కాగా 2021-22లో బ్లూ స్టార్ రూ.6,081 కోట్ల టర్నోవర్ సాధించింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో 20 ఎకరాల్లో రూమ్ ఏసీల తయారీ కేంద్రం స్థాపిస్తోంది. ఈ కేంద్రం కోసం బ్లూ స్టార్ రూ.550 కోట్లు ఖర్చు చేస్తోంది. పూర్తి వార్షిక తయారీ సామర్థ్యం 12 లక్షల యూనిట్లుగా ఉండనుంది. -
ఏపీలో 'బ్లూస్టార్' వందల కోట్ల పెట్టుబడులు!
చెన్నై: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో ఏర్పాటు చేస్తున్న ప్రపంచస్థాయి ప్లాంటు ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో క్వార్టర్లో ప్రారంభమయ్యే వీలున్నట్లు ఏసీలు, ఎయిర్ ప్యూరిఫయర్ల తయారీ దిగ్గజం బ్లూస్టార్ తాజాగా వెల్లడించింది. కంపెనీ ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన తయారీ ప్లాంటును విస్తరించగా.. శ్రీ సిటీలో భారీ యూనిట్‌ను నెలకొల్పుతున్నట్లు బ్లూస్టార్ లిమిటెడ్ ఎండీ బి.త్యాగరాజన్ తెలియజేశారు. ఆత్మనిర్భర్ భారత్‌ను బలంగా విశ్వసించే తాము పీఎల్ఐ పథకంలో భాగంగా ఈ ప్లాంటును నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. మూడో త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో ప్లాంటు కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు తెలియజేశారు. తొలి దశలో భాగంగా ఈ ప్లాంటుపై రూ.250 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. మొత్తంగా రూ.550 కోట్ల పెట్టుబడి ప్రణాళికలున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది 20% వృద్ధిని అంచనా వేయడంతోపాటు.. 14% మార్కెట్ వాటాపై కన్నేసినట్లు తెలిపారు. రెసిడెన్షియల్ ఏసీల మార్కెట్లో ప్రస్తుతం 13.2% వాటాను కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. చదవండి: ఏపీలో ఫ్లిప్‌కార్ట్ పెట్టుబడులు -
ఈ ఏడాది 13.5 శాతం వాటా లక్ష్యం
హైదరాబాద్: భారత ఎయిర్ కండీషనర్ల మార్కెట్లో బ్లూ స్టార్‌కు ప్రస్తుతం 12.8 శాతం వాటా ఉంది. 2019–20లో 13.5 శాతం వాటాను లక్ష్యంగా చేసుకున్నామని కంపెనీ జేఎండీ బి.త్యాగరాజన్ మంగళవారం వెల్లడించారు. నూతన శ్రేణి ఏసీలను ఇక్కడ ప్రవేశపెట్టిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘రూమ్ ఏసీల విక్రయాలు అన్ని బ్రాండ్లు కలిపి 2018–19లో 55 లక్షల యూనిట్లు నమోదు కానున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ 10 శాతం వృద్ధి నమోదు చేయవచ్చు. ఇదే జరిగితే బ్లూ స్టార్ వృద్ధి రేటు 15 శాతం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో బ్లూ స్టార్ ప్లాంటు 2021–22లో సిద్ధం కానుంది. ఎక్స్‌క్లూజివ్ ఔట్లెట్ల సంఖ్యను ప్రస్తుతమున్న 200 నుంచి 250కి చేర్చనున్నాం’ అని వివరించారు. -
బ్లూ స్టార్.. 100 కొత్త ఏసీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్ కండీషనర్ల తయారీ దిగ్గజం బ్లూ స్టార్ ఈ వేసవి సీజన్ కోసం 100 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టింది. వీటిలో విద్యుత్‌ను గణనీయంగా ఆదా చేసే 40 ఇన్వర్టర్ ఏసీ మోడళ్లున్నాయి. జపాన్ యూనివర్సిటీలు, నిపుణులతో కలసి కొన్ని మోడళ్లకు రూపకల్పన చేసినట్లు కంపెనీ జాయింట్ ఎండీ బి.త్యాగరాజన్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘ఇవి 30 శాతం అదనంగా చల్లదనాన్నివ్వటంతో పాటు కంప్రెషర్ నుంచి శబ్దాన్ని నియంత్రిస్తాయి. 80 శాతం గాలిని శుభ్రపరుస్తాయి. 150 మంది ఆర్ అండ్ డీ సిబ్బంది ఈ మోడళ్ల డిజైన్‌లో నిమగ్నమయ్యారు. ఏటా పరిశోధనకు రూ.40 కోట్లు వెచ్చిస్తున్నాం’ అని తెలిపారు. నాలుగు రకాల స్మార్ట్ ఏసీలను సైతం కంపెనీ ప్రవేశపెట్టింది. సంస్థకు దేశవ్యాప్తంగా 150 ఎక్స్‌క్లూజివ్ స్టోర్లున్నాయి. మరో 50 కేంద్రాలను ఏడాదిలో ఏర్పాటు చేయనుంది. పరిశ్రమను మించి.. భారత ఏసీల విపణిలో ఏటా 55 లక్షల యూనిట్ల రూమ్ ఏసీలు అమ్ముడవుతున్నాయి. 2020 నాటికి ఇది కోటి యూనిట్లకు ఎగబాకనుంది. పరిశ్రమ 2018లో 15–20 శాతం వృద్ధి నమోదు చేయనుంది. బ్లూ స్టార్ మాత్రం 30 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది. 2016–17లో కంపెనీ రూ.4,400 కోట్ల టర్నోవర్ సాధించింది. సంస్థకు 11.5 శాతం మార్కెట్ వాటా ఉంది. ఈ ఏడాది ఇది 12.5 శాతానికి చేరుతుందని త్యాగరాజన్ ధీమా వ్యక్తంచేశారు. ప్రోత్సాహకాలపై జమ్మూకశ్మీర్ స్పష్టత ఇవ్వనందున ఆ రాష్ట్రంలో ప్లాంటు ఏర్పాటు యోచన విరమించుకుంటున్నట్టు ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో నెలకొల్పుతున్న ప్లాంటులో 2019లో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. దశలవారీగా ఈ ప్లాంటుకు రూ.200 కోట్లు వెచ్చిస్తామని, వార్షిక తయారీ సామర్థ్యం 5 లక్షల యూనిట్లు ఉంటుందని ఆయన వెల్లడించారు. -
బ్లూస్టార్ కొత్త శ్రేణి ఏసీలు
⇒ హైదరాబాద్ మార్కెట్లోకి విడుదల ⇒ 12.5% వాటా లక్ష్యం: కంపెనీ జేఎండీ త్యాగరాజన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్ కండీషనర్ల తయారీ సంస్థ బ్లూ స్టార్ హైదరాబాద్ మార్కెట్లో నూతన శ్రేణి మోడళ్లను మంగళవారం ప్రవేశపెట్టింది. ప్రారంభ ధర రూ.35,000 ఉంది. చల్లదనాన్ని డెసిమల్స్‌లో (0.1) సర్దుబాటు చేసుకునే ఫీచర్‌తోనూ ఇన్వర్టర్ స్లి్పట్ ఏసీని కంపెనీ రూపొం దించింది. దేశంలో తొలిసారిగా ఈ ఫీచర్‌తో ఏసీలను తయారు చేశామని బ్లూ స్టార్ జాయింట్ ఎండీ బి.త్యాగరాజన్ చెప్పారు. కావాల్సిన స్థాయిలో చల్లదనం అందించడంతోపాటు విద్యుత్ కూడా ఆదా అవుతుందన్నారు. ఎయిర్ ప్యూరిఫయర్లతో కూడిన ఏసీలను ఈ ఏడాది సెప్టెంబరు నాటికి ప్రవేశపెడతామన్నారు. ప్రస్తుతం కంపెనీ 135 మోడళ్లను విక్రయిస్తోంది. 2020 నాటికి రెండు రెట్లు.. దేశవ్యాప్తంగా రూమ్ ఏసీ విభాగంలో అన్ని కంపెనీలు కలిపి 50 లక్షల ఏసీలు అమ్ముతున్నాయి. 2020 ఏడాది నాటికి మార్కెట్ రెండింతలు అవుతుందని బ్లూ స్టార్ అంచనా వేస్తోంది. రూమ్ ఏసీల రంగంలో కంపెనీకి 11.5 శాతం మార్కెట్ వాటా ఉంది. 2017–18లో 12.5 శాతం వాటా లక్ష్యంగా చేసుకున్నట్టు త్యాగరాజన్ వెల్లడించారు. కాగా, పన్ను ప్రయోజనాల కోసమే జమ్ములో ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ‘జూలైకల్లా స్పష్టత వస్తుంది. పన్ను ప్రయోజనాలు రాకపోతే జమ్మూలో ప్లాంటు ఏర్పాటు చేయబోం. ఇదే సమయంలో ముందుగా ప్రతిపాదిత శ్రీసిటీ ప్లాంటు నిర్మాణం పూర్తి చేస్తాం. అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో పన్ను ప్రయోజనాలు పొందుతున్న కంపెనీ ప్లాంట్లలో దేనినైనా విస్తరిస్తాం’ అని వివరించారు. -
బ్లూస్టార్ శ్రీసిటీ ప్లాంటు ఏడాదిలో సిద్ధం
⇒ జమ్ము ప్లాంటు మరింత ఆలస్యం ⇒ రెండు చోట్లా స్థల సేకరణ పూర్తి ⇒ ప్లాంట్లకు రూ.370 కోట్ల పెట్టుబడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏసీలు, కమర్షియల్ రిఫ్రిజిరేషన్ రంగ సంస్థ బ్లూ స్టార్ ప్రతిపాదిత జమ్ము ప్లాంటు ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జూలై నుంచి జీఎస్టీ అమలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్సైజ్ పన్ను మినహాయింపు విషయమై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. జమ్మూ, కశ్మీర్లో ఏర్పాటయ్యే తయారీ ప్లాంట్లకు జీఎస్టీ ప్రయోజనాలు ఉన్నాయి. అయితే పరిహారాన్ని భరించేది కేంద్రమా, రాష్ట్ర ప్రభుత్వమా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఆలస్యం అవుతుండటం, మరోవైపు తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉండటంతో కంపెనీ పునరాలోచనలో పడింది. ఈ నేపథ్యంలో మొదట ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీసిటీ సెజ్‌లో ప్లాంటు నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ఆలోచన బోర్డు ముందుకు వచ్చింది. స్థల సేకరణ పూర్తి... జమ్ముతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో ప్లాంటు ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ మేరకు శ్రీసిటీలో స్థలాన్ని సైతం బ్లూ స్టార్ సమీకరించింది. తొలుత జమ్మూ ప్లాంటు రెడీ అవుతుందని కంపెనీ ప్రకటించింది. తాజా పరిస్థితుల్లో శ్రీసిటీ ప్లాంటు నిర్మాణం తొలుత చేపట్టాలని భావిస్తున్నా... మార్చిలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతోంది. కంపెనీకి ఉన్న అయిదు ప్లాంట్లు పశ్చిమ, ఉత్తర భారత్‌కే పరిమితమయ్యాయి. సెన్ వ్యాట్, ఎక్సైజ్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆయా రాష్ట్రాల్లో వీటిని ఏర్పాటు చేసింది. దక్షిణాదికి ఉత్పత్తుల రవాణాకు ఏటా రూ.150 కోట్లపైనే వ్యయం అవుతోంది. శ్రీసిటీ ప్లాంటుతో 65 శాతం దాకా రవాణా వ్యయాలు ఆదా అవుతాయి. 2018 జనవరి నాటికి.. కంపెనీ శ్రీసిటీవైపు మొగ్గు చూపితే 2018 జనవరికల్లా ప్లాంటు సిద్ధం అవుతుందని బ్లూ స్టార్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సీపీ ముకుందన్ మీనన్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. ఎయిర్ కండీషనర్లతోపాటు, వాటర్ కూలర్స్, డీప్ ఫ్రీజర్లను సైతం ఈ ప్లాంట్లలో తయారు చేస్తామన్నారు. ఒక్కో ప్లాంటుకు రూ.185 కోట్ల దాకా పెట్టుబడి పెడతామని పేర్కొన్నారు. ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 10–12 లక్షల యూనిట్లు ఉంటుందన్నారు. ప్రస్తుతం రూమ్ ఏసీల విభాగంలో కంపెనీ వార్షిక తయారీ సామర్థ్యం 5 లక్షల యూనిట్లు. 2016లో సంస్థ 4.5 లక్షల యూనిట్లను విక్రయించింది. 2017లో మార్కెట్ కంటే అధిక వృద్ధి ఆశిస్తోంది. -
ఏసీలోనే ఎయిర్ ప్యూరిఫయర్..
♦ అభివృద్ధి చేస్తున్న బ్లూ స్టార్ ♦ సిటీ ప్లాంటు 2018కల్లా రెడీ ♦ కంపెనీ ఈడీ త్యాగరాజన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్ ప్యూరిఫయర్ల విభాగంలోకి ఇటీవల ప్రవేశించిన బ్లూ స్టార్ వినూత్న ఉత్పాదనను అభివృద్ధి చేస్తోంది. ఎయిర్ ప్యూరిఫయర్‌తో కూడిన ఏసీలను రూపొందిస్తోంది. ఈ ఉత్పాదనను మూడేళ్లలో తీసుకురావాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. అలాగే సౌర విద్యుత్‌తో నడిచే ఏసీని 2017లో ప్రవేశపెడతామని బ్లూ స్టార్ ఈడీ బి.త్యాగరాజన్ తెలిపారు. నూతన శ్రేణి ఏసీలను హైదరాబాద్ మార్కెట్లో గురువారం ప్రవేశపెట్టిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. డీఫ్రీజర్లు, కూలర్లను అత్యాధునిక ఫీచర్లతో తయారు చేస్తామన్నారు. 2018 నాటికి మార్కెట్లో వైఫైతో కూడిన ఏసీలే ఉంటాయని అన్నారు. ఈ మోడళ్ల ధర రానురాను తగ్గుతుందని చెప్పారు. ప్లాటినం స్టోర్లు..: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో 3.5 లక్షల యూనిట్ల సామర్థ్యంతో రానున్న ప్లాంటులో 2018 మార్చికల్లా ఉత్పత్తి ప్రారంభం కానుంది. 2017 మార్చినాటికి ఉత్పత్తి మొదలు కానున్న జమ్ము ప్లాంటు కూడా ఇంతే సామర్థ్యంతో రానుంది. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు కానున్న ఈ రెండు ప్లాంట్లకు బ్లూ స్టార్ రూ.215 కోట్లు వెచ్చిస్తోంది. ప్రస్తుతం కంపెనీ నిర్వహిస్తున్న 5 ప్లాంట్లు ఉత్తర, పశ్చిమ భారత్‌కు పరిమితమయ్యాయి. ఉత్పత్తుల ప్రదర్శనకు ప్లాటినం స్టోర్లను ఏర్పాటు చేయనుంది. ఈ ఏడాది 15 శాతం వృద్ధి: ప్రస్తుతం రూమ్ ఏసీల విపణి భారత్‌లో 40 లక్షల యూనిట్లుంది. 2016-17లో ఇది 46-50 లక్షల యూనిట్లకు చేరుకుంటుందని త్యాగరాజన్ పేర్కొన్నారు. ‘భారత్‌లో 100 గదులకుగాను నాల్గింటిలో ఏసీలున్నాయి. ఇది అయిదేళ్లలో 10 గదులకు విస్తరిస్తుంది. 50 శాతం వాటా ఉన్న మూడు, నాలుగు, అయిదవ తరగతి పట్టణాలే పరిశ్రమ వృద్ధికి దోహదం చేస్తున్నాయి. రూమ్ ఏసీల రంగంలో బ్లూ స్టార్‌కు 10 శాతం వాటా ఉంది. 2016-17లో 12 శాతం వాటా లక్ష్యంగా చేసుకున్నాం. పరిశ్రమ విక్రయాల్లో ఆన్లైన్ వాటా 15 శాతం నుంచి మూడేళ్లలో రెండింతలవుతుంది’ అని తెలిపారు. -
ఏపీలో బ్లూ స్టార్ ఏసీల ప్లాంటు!
కొద్ది రోజుల్లో బోర్డు ఆమోదం ఉత్తరాదిన మరో యూనిట్ రెండు ప్లాంట్లకు రూ.150 కోట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏసీల తయారీలో ఉన్న బ్లూస్టార్ దక్షిణాది ప్లాంటును ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పాలని నిర్ణయించింది. నెల్లూరు జిల్లా తడ వద్ద ఇది ఏర్పాటయ్యే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌కు కనెక్టివిటీ ప్రయోజనాలు ఉండడమే ఇందుకు కారణం. తడ యూనిట్ విషయమై కంపెనీ కొద్ది రోజుల్లో బోర్డు ఆమోదం పొందనుందని విశ్వసనీయ వర్గాలు సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించాయి. బ్లూస్టార్‌కు ఉన్న అయిదు ప్లాంట్లు పశ్చిమ, ఉత్తర భారత్‌కే పరిమితమయ్యాయి. ఎక్సైజ్, సెన్‌వ్యాట్ ప్రయోజనాలకై కొన్నింటిని గతంలో ఏర్పాటు చేసింది. జీఎస్టీ అమలైతే ఈ ప్రయోజనాలు ఉండవు. పైగా రవాణాకు ఏటా రూ.150 కోట్లదాకా ఖర్చవుతోంది. దక్షిణాది ప్లాంటుతో 60-65 శాతం వ్యయాలు ఆదా అవుతాయని బ్లూస్టార్ భావిస్తోంది. ముందుగా ఉత్తరాదిన.. కంపెనీ ఉత్తరాదిన మరో ప్లాంటును స్థాపించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను పరిశీలిస్తోంది. 2017 ఏప్రిల్ కల్లా ఈ ప్లాంటును సిద్ధం చేయాలని బ్లూస్టార్ కృతనిశ్చయంతో ఉంది. ఇక దక్షిణాది ప్లాంటు 2018 మార్చికల్లా పూర్తి అవుతుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 30-40 ఎకరాల్లో రానున్న ఒక్కో ప్లాంటు వార్షిక సామర్థ్యం 5 లక్షల యూనిట్లు. ప్రతి ప్లాంటుకు కంపెనీ తొలి దశలో రూ.75 కోట్లు వెచ్చించనుంది. రెండు ప్లాంట్ల ద్వారా 700 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. దక్షిణాది ప్లాంటును ఎగుమతుల హబ్‌గా తీర్చిదిద్దే అవకాశాలున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకునే నౌకాశ్రయానికి దగ్గరగా ప్లాంటు ఉండేలా కంపెనీ పావులు కదుపుతోంది. సంస్థ అమ్మకాల్లో 55 శాతం వాటా దక్షిణాది రాష్ట్రాలదే. 2016లో 20 కొత్త మోడళ్లు.. గత ఏడాది బ్లూస్టార్ సుమారు 3 లక్షల యూనిట్లను దేశీయంగా విక్రయించింది. 2015లో 3.4 లక్షల యూనిట్లు దాటాయి. మార్కెట్లో ఇన్వర్టర్ ఏసీల వాటా ప్రస్తుతం 10 శాతముంది. విద్యుత్‌ను ఆదా చేసే ఈ ఏసీల పట్ల కస్టమర్లు ఎక్కువగా మొగ్గు చూపుతుండడంతో 2016లో ఈ విభాగం 15 శాతానికి చేరుతుందని బ్లూస్టార్ భావిస్తోంది. 2015లో 20 రకాల ఇన్వర్టర్ ఏసీలను కంపెనీ ప్రవేశపెట్టింది. 2016లోనూ ఇదే స్థాయిలో మోడళ్లను విడుదల చేయనున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. మధ్యప్రాచ్య, ఆఫ్రికాతోపాటు పొరుగున ఉన్న నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ తదితర దేశాలకు ఏసీలను ఎగుమతి చేస్తోంది. కొత్త దేశాల్లో అడుగు పెట్టడంతోపాటు ఎగుమతులను 2017-18 నాటికి మూడింతలు చేయాలని బ్లూ స్టార్ లక్ష్యంగా చేసుకుంది. -
ఆంధ్రప్రదేశ్‌లో రూ.150 కోట్లతో బ్లూ స్టార్ ప్లాంటు..
♦ నౌకాశ్రయానికి సమీపంలో ఏర్పాటు ♦ 5 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఎయిర్ కండిషనర్ల (ఏసీ) తయారీ సంస్థ బ్లూ స్టార్ దక్షిణాదిన ప్లాంటును ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 5 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో రానున్న ఈ ప్లాంటుకు సంస్థ రూ.150 కోట్లు ఖర్చు చేయనుంది. అన్నీ అనుకూలిస్తే 2016లో ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. రూమ్ ఏసీ, డీప్ ఫ్రీజర్లను ప్లాంటులో తయారు చేస్తారు. నెల్లూరు జిల్లా తడ లేదా తెలంగాణలోని హైదరాబాద్‌లో ప్లాంటు స్థాపించాలని కొన్నేళ్ల నుంచి కంపెనీ ప్రయత్నిస్తోంది. పన్ను ప్రోత్సాహకాలు అధికంగా ఇచ్చే రాష్ట్రంలో ప్లాంటు పెట్టాలని భావించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో కంపెనీ ఉన్నతాధికారులు చర్చలు జరిపారు కూడా. అయితే పన్ను ప్రయోజనాలు ఉన్నా లేకపోయినా రవాణా వ్యయాలను తగ్గించుకోవాలంటే దక్షిణాదిన ప్లాంటు ఏర్పాటు చేయడం మినహా కంపెనీకి మరో మార్గం లేదు. మరోవైపు ఎగుమతులను 2017-18 నాటికి మూడింతలు చేయాలని బ్లూ స్టార్ లక్ష్యంగా చేసుకుంది. ప్లాంటుకు నౌకాశ్రయం సమీపంలో ఉన్న ప్రాంతం అనువైందని సంస్థ భావిస్తోంది. దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో ప్లాంటు వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కంపెనీ ఉన్నతాధికారి సాక్షి బిజినెస్ బ్యూరోకు ముంబై నుంచి ఫోన్లో తెలిపారు. దక్షిణాదిన ఎందుకంటే.. ప్రస్తుతమున్న 7 ప్లాంట్లలో రెండింటిని కంపెనీ మూసివేసింది. అన్ని ప్లాంట్లు పశ్చిమ, ఉత్తర భారత్‌కే పరిమితమయ్యాయి. ఎక్సైజ్, సెన్‌వ్యాట్ ప్రయోజనాల కోసం కొన్నింటిని గతంలో ఏర్పాటు చేసింది. అయితే జీఎస్టీ అమలైతే ఈ ప్రయోజనాలు ఏవీ ఉండవు. పెపైచ్చు రవాణాకు ఏటా రూ.150 కోట్లు ఖర్చు అవుతోంది. ఉద్యోగుల వేతనాల తర్వాత రవాణా వ్యయాలు రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. దక్షిణాదిన ప్లాంటు ఉంటే మూడింట రెండొంతుల వ్యయాలు ఆదా అవుతాయని సంస్థ భావిస్తోంది. దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా ఎగుమతులను దృష్టిలో పెట్టుకుని నౌకాశ్రయానికి దగ్గరగా ప్లాంటు ఉండేలా కంపెనీ అడుగులేస్తోంది. స్థల ఎంపిక కోసం కేపీఎంజీని నియమించింది. కేపీఎంజీ నివేదిక సెప్టెంబరులో రానుంది. అమ్మకాల్లో 55 శాతం వాటా దక్షిణాది రాష్ట్రాలదేనని బ్లూ స్టార్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.త్యాగరాజన్ తెలిపారు. ఇన్వర్టర్ వీఆర్ఎఫ్ ఏసీ సిస్టమ్స్‌ను ఆవిష్కరించిన సందర్భంగా శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. దక్షిణాది ప్లాంటు వచ్చేలోపు ఉత్తరాదిన మరో ప్లాంటు పెట్టే అవకాశాలూ లేకపోలేదని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ముకుందన్ మీనన్ పేర్కొన్నారు. ఈ-కామర్స్ బుడగ పేలిపోతుంది.. భారత్‌లో ఏసీల అమ్మకాల్లో ఆన్లైన్ వాటా కేవలం 1 శాతం మాత్రమే. వాస్తవ ధర కంటే తక్కువ ధరలో ఇ-కామర్స్ కంపెనీలు ఏసీలను విక్రయిస్తుండడం ఆశ్చర్యంగా ఉందని త్యాగరాజన్ అన్నారు. ‘నష్టాలొచ్చినా ఎలా విక్రయిస్తారు. ధరను తక్కువ చేసి విక్రయించడం వల్ల బ్రాండ్ విలువ తగ్గించినట్టే. మా దగ్గర శక్తి లేక మిన్నకుండిపోతున్నాం. ఇ-కామర్స్ కంపెనీలు వాటి విలువ పెంచుకోవడానికే డిస్కౌంట్లను ఇస్తున్నాయి. ఏదో ఒక రోజు ఇ-కామర్స్ రంగం బుడగ పేలిపోవడం ఖాయం’ అని అన్నారు. ఏసీల బీఈఈ స్టార్ రేటింగ్ ప్రమాణాలు 2016 జనవరి నుంచి మరింత కఠినం కానున్నాయని చెప్పారు. 2018 జనవరికి 5 స్టార్ కాస్తా 3 స్టార్ అవుతుందని వివరించారు. గతేడాది మాదిరిగా 2015-16లో 37 లక్షల యూనిట్ల ఏసీలు అమ్ముడవుతాయని పరిశ్రమ అంచనా వేస్తోంది. -
ఏసీ అమ్మకాలు... కూల్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్ కండీషనర్ల(ఏసీ) తయారీ కంపెనీలకు ఈ వేసవి కలిసిరానుంది. ఎండలు 20 రోజులు ఆలస్యంగా మొదలైనా అమ్మకాలు జోరందుకోవడంతో కంపెనీలు మార్కెట్లోకి సరఫరాలు పెంచుతున్నాయి. గతేడాది కంటే ఈ సీజన్లో 10 శాతం అధికంగా విక్రయాలు నమోదవుతాయన్న అంచనాలు మార్కెట్‌కు జోష్‌నిస్తోంది. అయితే కస్టమర్లకు ఊరటనిచ్చే అంశమేమంటే ఏసీల ధరలు ఈ వేసవిలో పెంచబోమని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. 2014 బెటర్.. దేశవ్యాప్తంగా 2012లో రూ.7,500 కోట్ల విలువైన 32 లక్షల ఏసీలు అమ్ముడయ్యాయి. ముడిసరుకులు ఖరీదవడం, డాలరు గణనీయంగా బలపడడం తదితర కారణాలతో ఏసీల ధరలు 10 శాతం దాకా పెరగడంతో 2013లో మార్కెట్ పరిమాణం 31 లక్షలకే పరిమితమైంది. ప్రస్తుత సీజన్లో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ముంబైతోపాటు పశ్చిమ ప్రాంతాల్లో మార్కెట్ గణనీయంగా పుంజుకుందని బ్లూస్టార్ రూమ్ ఏసీ విభాగం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సి.పి.ముకుందన్ మీనన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కోస్తాలో అమ్మకాలు జోరుగా ఉన్నాయని చెప్పారు. 2013తో పోలిస్తే ఏసీల ధరలు 10% వరకు పెరిగాయి. ప్రస్తుతానికి ధరలు ఇలాగే ఉంటాయని, మరింత పెరిగే అవకాశమే లేదన్నారు. 50 శాతం వాటా 3 స్టార్‌దే.. ఏసీల విపణిలో సగం వాటా 3 స్టార్ ఏసీలదే. 1-1.5 టన్నుల ఏసీలు రూ.20 వేల నుంచి లభిస్తున్నాయి. 5 స్టార్ ఏసీలు 15 శాతం మార్కెట్‌ను కైవసం చేసుకున్నాయి. వీటి ధరలు రూ.28 వేల నుంచి ప్రారంభం. ఈ ఏడాది మొత్తం మార్కెట్లో విండో ఏసీలు 7 లక్షల యూనిట్లు, స్ప్లిట్ ఏసీలు 27 లక్షల యూనిట్లకు చేరుకుంటుందని అంచనా. 5 స్టార్ ఏసీల కంటే తక్కువ విద్యుత్‌ను ఖర్చు చేసే ఇన్వర్టర్ ఏసీలు 3 శాతం మార్కెట్‌ను కైవసం చేసుకున్నాయి. 2015లో ఈ విభాగం రెండింతలవుతుందని బ్లూస్టార్ అంటోంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ(బీఈఈ) ప్రమాణాలకుతోడు సాంకేతికంగా ఇవి ఆధునికమైనవి. సాధారణంగానే వీటి ధరలు 5 స్టార్ కంటే 30% ఎక్కువ. కస్టమర్లకు ప్రభు త్వమే నేరుగా సబ్సిడీ ఇస్తే ఇన్వర్టర్ ఏసీల అమ్మకాలు మరింత పెరుగుతాయని ముకుందన్ అభిప్రాయపడ్డారు. ఉపకరణం వినియోగించే విద్యుత్ ఆధారంగా బీఈఈ స్టార్ రేటింగ్ ఇస్తోంది. 5 స్టార్ కంటే 3 స్టార్ ఏసీతో కరంటు బిల్లు ఎక్కువగా వస్తుంది. కాకపోతే ధర తక్కువగా వుండటం వల్ల 3 స్టార్ ఏసీలకు డిమాండ్ ఎక్కువ. రంగుల ఏసీలు కావాలి.. రంగు రంగుల ఏసీలను యువతరం కోరుకుంటోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఎరుపు, పసిడి, వెండి వర్ణం రంగులకు డిమాండ్ జోరుగా ఉంటోంది. మొత్తం అమ్మకాల్లో వీటి వాటా 25%. కంపెనీలు సైతం తమ ఉత్పాదనల్లో ఈ రంగులను తప్పనిసరిగా ప్రవేశపెడుతున్నాయి. తెలుపు రంగు ఏసీలు 75%గా ఉన్నాయి. మొత ్తంగా ఈ ఏడాది 34 లక్షల ఏసీలు అమ్ముడవుతాయని షార్ప్ ఇండియా మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ కిషాలయ్ రే వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో 2.7 లక్షల యూనిట్లు నమోదు కావొచ్చు. వారం రోజుల్లో 1,500 ఏసీలను విక్రయించామని, మార్కెట్ పుంజుకుంటుందని టీఎంసీ బేగంపేట షోరూం మేనేజర్ కె.శ్రీనివాస్ తెలిపారు. భారత ఏసీల రంగంలో వోల్టాస్, ఎల్జీ, ప్యానాసోనిక్లు తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. బ్లూస్టార్, హిటాచీ 4వ స్థానం, దైకిన్, శాంసంగ్ ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాయి. 20 ప్రముఖ బ్రాండ్ల వాటా 96%గా ఉంది. -
‘బ్లూస్టార్’లో మా పాత్ర పరిమితం
లండన్: అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంపై 1984లో జరిగిన ‘ఆపరేషన్ బ్లూస్టార్’లో తమ ఆర్మీ పాత్ర చాలా పరిమితమని, అది పూర్తిగా సలహాపరమైందేనని బ్రిటన్ విదేశాంగ మంత్రి విలియం హేగ్ స్పష్టం చేశారు. వాస్తవ ఆపరేషన్‌లో బ్రిటన్ ఎలాంటి పాత్రా పోషించలేదని మంగళవారం పార్లమెంటు దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రకటించారు. ‘బ్లూస్టార్’ ప్రణాళిక తొలి దశలో తాము చేసిన సాయం ఆపరేషన్‌పై అతికొద్ది ప్రభావం మాత్రమే చూపిందని అన్నారు. సిక్కు మిలిటెంట్లను తరిమికొట్టేందుకు జరిపిన బ్లూస్టార్‌కు అప్పటి బ్రిటన్ ప్రధాని మార్గరెట్, నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీకి సాయం అందించారన్న ఆరోపణలపై కేబినెట్ కార్యదర్శి జెరేమీ హేవుడ్ ఇచ్చిన దర్యాప్తు నివేదిక వివరాలను హేగ్ సభకు వెల్లడించారు. ఆ వివరాలు.. మిలిటెంట్లపై చర్య కోసం అత్యవసర ప్రణాళికలు రచిస్తున్న భారత నిఘా అధికారులకు, ప్రత్యేక బృందానికి సలహా ఇచ్చేందుకు ఒకే ఒక్క బ్రిటన్ ఆర్మీ సలహాదారు 1984 ఫిబ్రవరి 8-19 మధ్య భారత్‌కు వెళ్లారు. మిలిటెంట్లతో సంప్రదింపులు విఫలమయ్యాకే చివరి పరిష్కారంగా సైనిక చర్య తీసుకోవాలని ఆయన చెప్పారు. ఆకస్మిక చర్యలు తీసుకోవాలని, మరణాలను తగ్గించేందుకు హెలికాప్టర్లో బలగాలను పంపాలని సూచించారు. అయితే బ్లూస్టార్‌ను ఆకస్మికంగా కాకుండా పదాతి దళాలే చేశాయి. 200 ఫైళ్లు, 23 వేల పత్రాలను విశ్లేషించాక ఈ విషయం తెలిసింది. సలహాదారు 1984 ఫిబ్రవరిలో సిఫార్సులు చేయగా మూడు నెలల తర్వాత జూన్‌లో జరిగిన ఆపరేషన్ వాటికి భిన్నంగా సాగింది. బ్లూస్టార్ పథకం, అమలులో తమకెవరూ సాయం చేయలేదని ఇటీవల ఆ ఆపరేషన్ కమాండర్ లెఫ్ట్‌నెంట్ జెనరల్ బ్రార్ చేసిన ప్రకటన దీనికి తగినట్లే ఉంది. బ్లూస్టార్పై థాచర్‌కు, ఇందిరలకు మధ్య నడిచిన ఉత్తరప్రత్యుత్తరాలూ ఇందుకు అనుగుణంగానే ఉన్నాయి. ఆపరేషన్‌లో బ్రిటన్ ప్రత్యక్ష పాత్ర పోషించలేదు. ఆయుధ సామగ్రి, శిక్షణ కూడా అందించలేదు. బ్లూస్టార్పై పార్లమెంటును ఏమార్చి ఉంటారని, ఇందులో బ్రిటన్ వాణిజ్య ప్రయోజనాలు(రక్షణ సామగ్రి అమ్మకాలు) ఉన్నాయేమోనన్న సిక్కుల ఆరోపణకు ఆధారాలూ లభించలేదు. కాగా, ఈ దర్యాప్తు పరిధిని స్వల్పకాలానికి పరిమితం చేశారని బ్రిటన్‌లోని సిక్కు సంఘాలు విమర్శించాయి. బ్రిటన్ స్పెషల్ ఎయిర్ సర్వీస్ ఉన్నాతాధికారి ఒకరు బ్లూస్టార్‌కు సంబంధించి భారత్ సందర్శించారని ఇటీవల వెలుగు చూసిన రహస్య పత్రాల్లో ఉండడంతో ప్రధాని డేవిడ్ కామెరాన్ ఈ దర్యాప్తునకు ఆదేశించారు. కాగా, దర్యాప్తు నివేదిక వివరాలను బ్రిటన్ తమతో పంచుకుందని భారత విదేశాంగ శాఖ తెలిపింది.